enquiry
-
అమోయ్‌కుమార్ ల్యాండ్ కేసు: ఆర్డీవోకు ‘ఈడీ’ పిలుపు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీవోకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం(నవంబర్ 5) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ స్కామ్‌లో శుక్రవారం తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరింది.ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్,ఎమ్మార్వో జ్యోతిలను ఈడీ విచారించింది. ఈ విచారణ ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.మహేశ్వరం నాగారంలోని సర్వేనెంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్,ఎమ్మార్వో జ్యోతి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఇదీ చదవండి: 12 నుంచి ఐఏఎస్‌ల విచారణ -
‘జన్వాడ’ కేసు: రాజ్‌పాకాల విచారణలో కీలక విషయాలు వెల్లడి
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన జన్వాడ ఫామ్‌హౌజ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల విచారణ ముగిసింది. రాజ్‌పాకాలను మోకిల పీఎస్ పోలీసులు ఎనిమిది గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం రాజ్‌పాకాలను పోలీసులు విడిచిపెట్టారు. రాజ్‌పాకాల దగ్గర లిక్కర్, గేమింగ్ మినహా డ్రగ్స్ ఆనవాళ్లు దొరలేదని సమాచారం. రాజ్‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న అతడి స్నేహితుడు విజయ్ మద్దూరికి సంబంధించి పోలీసులు విచారణలో ఆరా తీశారు. విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో తనకు సంబంధం లేదని, అతడి ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని రాజ్‌పాకాల చెప్పినట్లు తెలిసింది. కాగా, విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని న్యాయవాది ద్వారా పోలీసుకు విజయ్ సమాచారమిచ్చాడు. విజయ్ కాల్‌లిస్ట్, సిగ్నల్ ఆధారంగా డ్రగ్స్ కేసు చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.విజయ్ డ్రగ్స్ ఎక్కడ కొన్నాడు. ఎక్కడ వాడాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జన్వాడలోని రాజ్‌పాకాల ఇంట్లో ఇటీవల జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై ఎక్సైజ్ పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు దాడి చేసిన అక్రమ మద్యానికి సంబంధించిన కేసులు పెట్టారు. ఇదీ చదవండి: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్.. పోలీసుల మెరుపు దాడి -
TG: అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ‘ఈడీ’
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్‌కుమార్‌ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్‌కుమార్‌ను ఈడీ కోరినట్లు తెలిసింది.కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్‌కుమార్ రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్‌కుమార్‌కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్‌డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్‌లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్‌పై ఐఏటీఏ వ్యాఖ్యలుప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి. -
ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్’ ఆరా
సాక్షి,తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ మూడోరోజు విచారణను సోమవారం(సెప్టెంబర్30) కొనసాగిస్తోంది. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల మార్కెటింగ్ జీఎం రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై సిట్ ఆరా తీస్తోంది.నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదు చేయడంలో జాప్యంపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. లడ్డూ తయారీకి సంబంధించి భాగమైన ఫ్లోర్‌మిల్, ల్యాబ్, ఇతర ముడిసరుకుల నాణ్యతను సిట్ పరిశీలించింది.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ -
కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
-
మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..?
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్‌షీట్ ఫైల్ చేసేముందు ఈడీ రాహుల్‌ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. -
TG: పవర్ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ లోకూర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్‌ను నియమించింది. గతంలో పవర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం మదన్ లోకూర్‌ను ఎంపిక చేసింది. జస్టిస్ మదన్ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జుడ్యీషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్ ఇక ముందు జస్టిస్ మదన్ లోకూర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది. -
పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’
న్యూయార్క్: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూ హత్య కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. సెనేట్ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్‌గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్ తెలిపారు.పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్ రిపబ్లిక్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్ రిపబ్లిక్ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.ఆమ్ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్‌కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. -
రెండో రోజు విచారణ...కవిత భర్తను విచారించనున్న ఈడీ
-
‘సందేశ్‌ఖాలీ నిరసన: ఒక్క మహిళా ఫిర్యాదు చేయలేదు’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలు తమపై టీఎంసీకి చెందిన నాయకులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు బెంగాల్లో దుమారం రేపుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనపై పోలీసులు బుధవారం కీలక వివరాలు వెల్లడించారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలు పోలీసులు బృందాలతో విచారణలు జరిపించామని పోలీసు ఉన్నతధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో ఎక్కడ కూడా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరినట్లు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న నిరసనలకు కారణం తప్పడు సమాచారమని తెలిపారు. ‘రాష్ట్ర మహిళా కమిషన్, పది మంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలిసు యాంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలపై టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు చెప్పడానికి ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని బెంగాల్ పోలీసులు ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇటీవల సందేశ్‌ఖాలీ పర్యటించారు. వారి విచారణలో స్థానిక మహిళల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు రాలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా పెద్ద ఎత్తున సందేశ్‌ఖాలీలో మహిళలు నిరసన తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, తన అనుచరులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమ భూములు లాక్కోడానికి బెదిరింపులగు దిగుతున్నారని, తమ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలకు ప్రయత్నించగా.. అతని అనుచరులు ఈడీ అధికారుల కారు అద్దాలు పగులగొట్టి దాడికి యత్నించారు. ఈ ఘటన జరినప్పటి నుంచి టీఎంసీ నేత షాజహాన్ షేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు -
కేసీఆర్‌ను కాపాడాలని చూస్తోంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాలని చూస్తున్నట్టు అనుమానం కలుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభ కోణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషి యల్ ఎంక్వైరీతో కాలయాపన చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయా న్ని సుమారు రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు అంచనాలుపెంచి.. వేలకోట్ల అవినీ తికి పాల్పడిందన్నారు. ఆదివారం అరుణ మీడి యాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం కంటే సీబీఐ దర్యాప్తు జరి పిస్తే నిజానిజాలు బయటపడతాయన్నారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
నేటి నుంచి చంద్రబాబు విచారణ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడును విచారించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. చంద్రబాబు అవినీతి బండారాన్ని జాతీయస్థాయిలో బట్టబయలు చేసిన ఈ కేసుపై దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ తదితర విభాగాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ముసుగులో భారీగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారని నిర్ధారించాయి. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల నకిలీ ప్రాజెక్టును చూపిస్తూ రూ.371 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంలో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు సీఐడీ శాస్త్రీయంగా సంసిద్ధమవుతోంది. ఈ కేసులో చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. దాంతో న్యాయస్థానం మార్గదర్శకాలను పాటిస్తూ శని, ఆదివారాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే చంద్రబాబును సీఐడీ విచారించనుంది. అందుకోసం ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో నలుగురు సీఐలు, సహాయక సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం రాత్రే రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ బృందంలో మొత్తం 12 మంది ఉన్నారు. సీఐడీ వాదనకు కొండంత బలం స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోసం న్యాయస్థానం అనుమతి పొందడం ద్వారా సీఐడీ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో నిధులను అక్రమంగా మళ్లించిన అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ ఛేదించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది. దాంతో ఏ–1 చంద్రబాబుతో పాటు 8 మందిని సీఐడీ ఇప్పటివరకు అరెస్టు చేసింది. చంద్రబాబు అరెస్టు సరైనదేనంటూ ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడం, తాజాగా రిమాండ్‌ను పొడిగించడం ద్వారా సరైన రీతిలోనే సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడిందన్న విషయం వెల్లడైంది. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ కేసునే కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. సీఐడీ వాదనకు మరింత బలం చేకూరింది. ఈ కేసుపై టీడీపీ చేస్తున్న రాజకీయ రాద్ధాంతంతో నిమిత్తం లేకుండా సీఐడీ నిబంధనల ప్రకారం దర్యాప్తును కొనసాగిస్తోంది. కీలక దశలో దర్యాప్తు ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ.. చంద్రబాబును రెండు రోజులపాటు కస్టడీలో విచారించడం ద్వారా మరిన్ని కీలక ఆధారాలను రాబట్టాలని భావిస్తోంది. ఈ నెల 9న చంద్రబాబును అరెస్ట్ చేసి సిట్ కార్యాలయంలో విచారించిన సమయంలో ఆయన తనకు ఏమీ తెలియదని, గుర్తు లేదని, మరచిపోయాను అంటూ ముక్తసరిగా సమాధానాలిచ్చి తప్పించుకునేందుకు యతి్నంచారు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలపై సీఐడీ అధికారులు తగిన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు డీఎస్పీలతో శాస్త్రీయమైన రీతిలో రూపొందించిన ప్రశ్నావళి నుంచి ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధించనుంది. ప్రధానంగా సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరిట జీవో ఎలా ఇచ్చారు? ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు? జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి? రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు? ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావును ఏకంగా నాలుగు కీలకస్థానాల్లో ఎందుకు నియమించారు? ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయమని ఎందుకు ఆదేశించారు? ఏకంగా 13 చోట్ల నోట్‌ఫైళ్లపై సంతకాలు చేసి మరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు? డిజైన్‌టెక్ కంపెనీకి చేరిన నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించడం గురించి మీకు తెలుసా? అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారి మనోజ్ పార్థసానితో ఉన్న సంబంధం ఏమిటి? ఆయన మీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు రూ.241 కోట్లు ఎందుకు అందించారు? ఆ నిధులను ఆయన మీకు చేర్చారా? సీఐడీ నోటీసులు అందగానే మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పరారయ్యారు వంటి పలు కోణాల్లో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కేసులో ప్రధాన సాక్షుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ చంద్రబాబును అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తదుపరి ప్రశ్నలను సంధించనున్నారు. జైల్లోనే విచారణకు ఏర్పాట్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించేందుకు జైలు అధికారులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్‌లో సీసీ కెమెరాలు ఉన్నందున అక్కడే విచారించాలా లేక వేరే గదిలో విచారించాలా అన్న విషయమై సమాలోచనలు చేస్తున్నారు. భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే 300 మంది ఆక్టోపస్, ఇతర పోలీసు బలగాలతో జైలు బయట భద్రత కట్టుదిట్టం చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు రిమాండ్ 24 వరకు పొడిగింపు -
కొనసాగిన ధార్మిక పరిషత్ కమిటీ విచారణ
తిరుపతి కల్చరల్: హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న సమయంలో అర్జున్‌దాస్ పలు అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు ఏబీ కృష్ణారెడ్డి, జోలా చైతన్య, శ్రీరామమూర్తి, విజయరాజు, రామకృష్ణారెడ్డి రెండో రోజు కూడా విచారణ నిర్వహించారు. అర్జున్‌దాస్ గురువారం కూడా విచారణకు హాజరవ్వలేదు. అయితే విచారణ కమిటీ సభ్యులు మఠంలోని రికార్డులను నిశితంగా పరిశీలించారు. రికార్డుల్లోని లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ పూజారులు అర్జున్‌దాస్ వల్ల తాము పడిన ఇబ్బందులను విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మఠం భూముల విషయంలో అర్జున్‌దాస్ చేసిన అక్రమాలను పలువురు కమిటీకి విన్నవించారు. అనంతరం విచారణ కమిటీ సభ్యుడు ఏబీ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణకు అర్జున్‌దాస్ సహకరించట్లేదని చెప్పారు. అర్జున్‌దాస్‌పై పలువురు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నివేదిక సమరిస్తామని తెలిపారు. -
‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’
శ్రీరాంపూర్(మంచిర్యాల): విచారణ పేరుతో సింగరేణి యజమాన్యం జాప్యం చేయడం సరికాదని కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌లోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల పరిధిలోని ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఎలాంటి సంబంధం లేని 32 మంది అధికారులకు చార్జిషీట్లు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా నాలుగేళ్లుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో ఎలాంటి తప్పుచేయని అధికారులు తప్పుడు చార్జిషీట్ల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వెంటనే దీనిపై యజమాన్యం స్పందించి చార్జ్షీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా జీఎం సంజీవరెడ్డికి దృష్టికి సమస్యలు తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్(ఆర్జీ 1), మనోహర్(ఆర్జీ 2), అపెక్స్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, నాయకులు చిలక శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీ బదిలీ.. మణిపూర్ అల్లర్ల వెనుక ఎవ్వరున్నా వదలం: అమిత్ షా
ఇంఫాల్: మే 3న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. మణిపూర్‌లో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కారణమైన వారిని వదలబోయేది లేదని అన్నారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు ఒక కమిటీని, ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి ఒక కమిటీని, శాంతిని నెలకొల్పేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ధైర్యం చెప్పి... అమిత్ షా అల్లర్ల నేపథ్యంలో భయబ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పారు. చెప్పుడు మాటలను గానీ, ఎటువంటి వదంతులను గానీ నమ్మవద్దని అన్నారు. ఈ సందర్బంగా మెయితేయి, కుకీ వర్గాలవారు తొందరపడొద్దన్నారు. ప్రజాసంఘాల వారు కూడా సంయమనం పాటించాలని కోరారు. డీజీపీ బదిలీ... ప్రస్తుత డీజీపీ పి.దౌన్గల్‌ను హోంశాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో CRPF ఐజీగా వ్యవహరించిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ సింగ్ ను నూతన డీజీపీగా నియమించారు. ఇక్కడ ఉన్న గిరిజన తెగలకు ఎటువంటి సంబంధం లేని తటస్థ వర్గానికి చెందిన వారిని డీజీపీగా నియమిస్తే శాంతిభద్రతలను తొందరగా అదుపులోకి తేవచ్చనే ఉద్దేశ్యంతోనే డీజీపీని బదిలీ చేశారు. అల్లర్లకు కారణమైనవారిని వదిలే ప్రసక్తే లేదు... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి కలిగిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేసి అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారులను కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందన్నారు హోంమంత్రి. ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉన్నట్లయితే వారు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.లేదంటే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పేందుకు కమిటీ... అలాగే మణిపూర్ ప్రజల్లో భయాందోళనలను తొలగించి శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అనసూయ ఉయికే నేతృత్వంలో మరో కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెయితేయి, కుకీ వర్గాల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
రేపే సుప్రీంకోర్టు ముందుకు అవినాష్ రెడ్డి మ్యాటర్
ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. సంఖ్య విషయం సంబంధిత సమాచారం 1 డైరీ నెంబర్ 20416/2023 2 కేసు నెంబర్ MA 00 1285 3 విచారణ తేదీ 23 మే 2023 4 CL నెంబర్ 36 5 కేటగిరీ క్రిమినల్ మ్యాటర్స్ 6 సబ్జెక్ట్ బెయిల్ 7 బెంచ్ 1. జస్టిస్ J.K.మహేశ్వరీ 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా 8 పిటిషనర్ సునీత నర్రెడ్డి 9 రెస్పాండెంట్స్ 1. Y.S.అవినాష్ రెడ్డి 2. డైరెక్టర్, CBI 10 సునీత తరపు న్యాయవాది జెసల్ వాహి 11 అవినాష్ తరపు న్యాయవాది ముకుంద్ P.ఉన్నీ ఈ పిటిషన్ ను సునీత నర్రెడ్డి గతంలో దాఖలు చేశారు. మరో వైపు ఇదే వ్యవహారంపై అవినాష్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు. తల్లి అనారోగ్యం వల్ల వారంపాటు సిబిఐ విచారణకు రాలేనని, సిబిఐ విచారణకు హాజరుపై మినహాయింపు కావాలని కోరారు. తన తల్లికి చికిత్స జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. ఇదే విషయాన్ని సిబిఐకి కూడా లిఖిత పూర్వకంగా తెలిపారు. (చదవండి : అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి) -
ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ
►అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. ఆదివారం విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మౌఖిక, లిఖిత పూర్వక స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ► ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దాదాపు గంటన్నరగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు. న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ పాత్రపై అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది? బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరయ్యేందుకు ముందు ఓ వీడియో కూడా విడుదల చేశారు కేజ్రీవాల్. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని సీబీఐతో సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చెప్పినట్టు వినకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అయ్యాక అనేక మార్పులు తీసుకొచ్చానని, భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు ఓర్వలేకపోతున్నాయని ద్వజమెత్తారు. దేశం కోసమే పుట్టానని, దేశం కోసం ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. -
'కేజ్రీవాల్ అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్క నిజాయితీపరుడు ఉండడు'
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ కార్యాలయంలో ఆదివారం విచారణకు హాజరయ్యే ముందు వీడియో రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 'మా మాట వినాలి లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం అడుగులు వేశా. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టా. 30 ఏళ్లలో గుజరాత్లో ఏం అభివృద్ధి చేశారు. నా జీవిత లక్ష్యం భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ చేయడం. నేను షుగర్ వ్యాధిగ్రస్తుణ్ణి. ప్రతిరోజు 50 యూనిట్ల కంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటున్నా. అయినా అవినీతికి వ్యతిరేకంగా ఒకసారి పది రోజులు ఇంకోసారి 15 రోజులు నిరాహార దీక్ష చేశా. సీబీఐ 100 సార్లు పిలిచినా వెళ్లి సమాధానం చెప్తా. దేశం కోసం పుట్టాను దేశం కోసం చస్తాను.' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖలో ఒకప్పుడు కమిషనర్‌గా పనిచేసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. బీజేపీ తాను అవినీతిపరుడ్ని అని ప్రచారం చేస్తోందని, అలాంటి వాడినైతే అప్పుడే రూ.కోట్లు సంపాదించేవాడినని పేర్కొన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాలే అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్కరు కూడా నిజాయితీ పరుడు ఉండడని అన్నారు. చదవండి: రూ.1,000 కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్టు చేస్తారా?: కేజ్రీవాల్ -
'రామోజీరావు స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం.. శైలజను 6న విచారిస్తాం'
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో రామోజీరావును 8 గంటలపాటు విచారించారు సీఐడీ అధికారులు. అనంతరం సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధార్ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్గదర్శిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. 'ఒక కేసుకు సంబంధించి రామోజీరావును విచారించాం. ఆయన స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం. తన కోడలు శైలజా కిరణ్ ఇంటికి వచ్చి విచారించాలని రామోజీరావు కోరారు. అందుకే ఇక్కడే విచారణ జరిపాం. ఈ కేసులో కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా రామోజీరావును మళ్లీ విచారిస్తాం. రామోజీ స్టేట్మెంట్ను అనలైజ్ చేయాల్సి ఉంది. ట్రాన్స్ఫరెన్స్ దర్యాప్తులో బాగంగా విచారణ జరిపాం. ఐవోతో సహా టెక్నికల్ స్టాఫ్ విచారణలో పాల్గొన్నారు. రామోజీరావు కోడలు శైలజాకిరణ్‌ను ఈనెల 6న విచారిస్తాం. ఆమెకు కూడా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చాం.' అని సీఐడీ ఎస్పీ తెలిపారు. చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్‌ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం? -
ఎల్లుండి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
-
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: వైఎస్ భాస్కర్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 24 తరువాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని, కానీ ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధమని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి -
విశాఖ సీబీఐ అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వినతిపత్రం
-
గుంటూరు: చంద్రబాబు సభ తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ