-
చెల్లి పేరుతో పేస్ బుక్ ఖాతా.. యువకుడి నుంచి కోట్లు వసూలు
పత్తికొండ (తుగ్గలి): ఫేస్ బుక్ చాటింగ్ పరిచయంతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసింది ఓ మహిళ. ఈ ఘటన పత్తికొండ మండలంలో చోటు చేసుకుంది. చక్రాళ్లకు చెందిన లావణ్య ఎమ్మిగనూరులో ఉన్న తన చెల్లెలు ఫొటో పెట్టి ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన సాయిలుతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నమ్మిస్తూ వచ్చింది. తర్వాత తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో సాయిలు విడతల వారీగా రూ.1.20 కోట్లు సమర్పించుకున్నాడు. చివరకు తన భార్యను కూడా నమ్మించి డబ్బు కాజేసిందని బాధితుడు చెబుతున్నాడు. అనుమానం వచ్చిన సాయిలు పత్తికొండకు వచ్చి ఆరా తీసి మోసపోయానని తెలుసుకున్నాడు. డబ్బుల విషయమై పలుమార్లు పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరులో ఉన్న ఆస్తులు అమ్మి ఇస్తానని చెబుతూ కాలం వెళ్లదీసింది. ఎంతకీ డబ్బులు ఇవ్వక పోవడంతో నాలుగు రోజుల క్రితం పత్తికొండకు వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మహిళ తండ్రి, మధ్యవర్తులు పంచాయితీ చేసి సమస్య పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పారు. అయితే వ్యవహారం అంతటా దావణంలా వ్యాపించడంతో మనస్తాపానికి గురైన లావణ్య మంగళవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ విషయమై పట్టణ సీఐ జయన్నను సంప్రదించగా ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్‌లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్‌ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్‌ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
వైద్యురాలికి ఎస్ఐ వేధింపులు
దొడ్డబళ్లాపురం: యువ వైద్యురాలిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించిన పోలీస్ సబ్ఇన్స్పెక్టర్పై బెంగళూరు బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు ఇదే ఠాణాలో ఎస్సై రాజ్‌కుమార్. వివరాలు.. ఫేస్బుక్ ద్వారా 2020లో ఎస్సైకి ఒక వైద్యురాలు పరిచయమయింది. అప్పుడు ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా రాజ్‌కుమార్ పోలీస్ అకాడెమిలో ఎస్సై శిక్షణలో ఉన్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు తరువాత ప్రేమికులు అయ్యారు.ఈ క్రమంలో వైద్యురాలి నుంచి రాజ్‌కుమార్ రూ.1.71 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నగ్నవీడియోలు, ఫోటోలు పంపించాలని బెదిరించేవాడు. కాల్ రికార్డ్స్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో విసిగిపోయిన వైద్యురాలు అతని దురాగతాలపై బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు ఘరానా ఎస్సైపై కేసు నమోదు చేశారు. -
మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్‌ను వినియోగించుకుంటుంది. ఫేస్బుక్లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్‌పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్బుక్ వినియోగదారులకు మార్కెట్‌స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలుకంపెనీ స్పందనయురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్‌ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. -
రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో సుమారు రూ.ఒక కోటి వాచ్ ధరించి కనిపించారు. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తికి ఉన్నారు. తాను ధరించిన వాచ్‌కు సంబంధించి వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు.మార్క్ జుకర్‌బర్గ్ పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించి తన భార్య ప్రిస్సిల్లా చాన్‌తో కలిసి ఉన్న ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను షేర్ చేసిన ఇమేజ్‌లోని వాచ్‌కు సంబంధించి నెట్టింట చర్చ జరిగింది. దాంతో పలు సమాజిక మాధ్యమాల్లో తన రిస్ట్‌వాచ్ వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దాని వివరాలు వెల్లడించింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!జుకర్‌బర్గ్ ధరించిన వాచ్ ప్రతిష్టాత్మక స్విస్ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ తయారు చేసిన టైమ్పీస్గా గుర్తించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. మార్క్ ఈ కంపెనీకు చెందిన దాదాపు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉంటే ‘5236పీ’ మోడల్ వాచ్‌ను ధరించినట్లు వాచ్.న్యూజ్ పేర్కొంది. మార్చిలో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడులకు వచ్చిన జుకర్‌బర్గ్ దంపతులు తను వాడిన పాటక్ ఫిలిప్ వాచ్‌ను చూసి బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by watchnewz (@watch.newz) -
ఫేస్బుక్ ఇండియా లాభం ఎలా ఉందంటే..
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన అడ్వర్టయిజ్మెంట్ యూనిట్ ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వివరాల ప్రకారం నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ.505 కోట్లను తాకింది.టోఫ్లర్ తెలిపిన వివరాల ప్రకారం..ఫేస్బుక్ ఇండియా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.353 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కానీ 2023-24 ఏడాదిలో ఇది 43 శాతం పెరిగి రూ.505 కోట్లను తాకింది. కంపెనీ దేశీయంగా అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీని కస్టమర్లకు విక్రయించే సర్వీసులతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్‌కు ఐటీ ఆధారిత సపోర్ట్, డిజైన్ సపోర్ట్ సేవలు సైతం అందిస్తోంది. కాగా..2023-24లో టర్నోవర్ 9 శాతంపైగా ఎగసి రూ.3,035 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్ల ఆదాయం నమోదైంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఫేస్బుక్ ఇండియా విభాగంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, సపోర్ట్ సర్వీస్..వంటి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు 67,317 మందికి ఉపాధి కల్పిస్తుంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్‌లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్‌లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్‌బుక్‌కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
Cybercrime: ఫేస్బుక్ టు వాట్సాప్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చేసే సైబర్ నేరగాళ్లు నానాటికీ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఫేస్బుక్, ఆపై డీపీ ఫ్రాడ్స్ చేసే ‘ఈ– నేరగాళ్లు’ ఇప్పుడు ఈ రెండిటినీ ‘కలిపేశారు’. ఫేస్బుక్ ద్వారా ఎంటరైన తర్వాత వాట్సాప్ డీపీ వరకు వెళ్తున్నారు. లాక్ చేయని ప్రొఫైల్స్‌లోని వివరాల ఆధారంగా చాటింగ్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కామ్స్‌లో ఆర్థిక నష్టం అంతగా లేకున్నా.. న్యూసెన్స్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఈ తరహా స్కామ్స్ పెరిగాయని చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రొఫైల్ లాక్ చేసినప్పటికీ ‘రిక్వెస్ట్’తో.. ఫేస్బుక్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై కొంత వరకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనే క మంది తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ని కచ్చితంగా లాక్ చేసి ఉంచుతున్నారు. అలా ఉన్న వాటిని కేవలం ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లు మాత్రమే చూడగలరు. దీనికి విరుగుడుగా సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎత్తు వేస్తు న్నారు. ఎక్కువగా యువతులు, కొన్ని సందర్భాల్లో సదరు ఫేస్బుక్ యూజర్‌కు పరియచం ఉన్న వారి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఆధారంగా తాము టార్గెట్ చేసిన వారికి రిక్వెస్ట్ పంపుతున్నా రు. దీన్ని యాక్సెప్ట్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లకు ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసే అవకాశం దక్కుతోంది. నకిలీ ప్రొఫైల్‌తో డబ్బు డిమాండ్.. ఇలా ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలోకి ఎంటర్ అవుతున్న సైబర్ నేరగాడు అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. దీని ఆధారంగా మెసెంజర్లో చాటింగ్ చేస్తూ డబ్బు అడగటంతో పాటు ఫ్రెండ్స్ లిస్టులోని వారికే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. వీటిని అందుకున్న వాళ్లల్లో అనేక మంది తమ స్నేహితుడే మరో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆపై వారితోనే ఇదే పంథా అవలంబిస్తున్నారు. మరోపక్క సదరు వ్యక్తి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారిలో ఎవరైతే తమ ప్రొఫైల్‌లో ఫోన్ నంబర్ ఉంచుతున్నారో వారిని మరో విధంగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న మొత్తాలే కావడంతో నో కంప్లైంట్.. సైబర్ నేరాల్లో ఎవరి పేరుతో అయితే నకిలీ ప్రొఫైల్, డీపీ క్రియేట్ అయ్యాయో... వారితో పాటు నగదు బదిలీ చేసిన వాళ్లు సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే.. సైబర్ క్రిమినల్స్ కొల్లగొడుతున్నది చిన్న మొత్తాలే కావడంతో అత్యధికులు పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది నేరగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. మరోపక్క ఫిర్యాదు, కేసు నమోదు జరిగినా.. ఉత్తరాదిలో ఉండే ఈ నేరగాళ్ల కోసం ఇక్కడ నుంచి పోలీసు బృందాలు పంపడం కష్టసాధ్యంగా మారింది. దీంతో చిన్న మొత్తాలతో ముడిపడి ఉన్న కేసుల్లో దాదాపు అన్నీ మూతపడటం కూడా నేరగాళ్లకు అనుకూలంగా మారుతోంది.ఆ ఫొటోలే వినియోగించి వాట్సాప్ డీపీ..సైబర్ నేరగాళ్లు తాము రూపొందించిన నకిలీ ప్రొఫైల్‌లోని ఫొటోలు, వర్చువల్ నంబర్లు వాడి వాట్సాప్ ఖాతాలు తెరుస్తున్నారు. వీటికి డీపీలుగా అసలు యజమానులవి పెడుతున్నారు. ఈ వాట్సాప్ ఖాతాల ఆధారంగా ఫ్రెండ్స్ లిస్టులోని వ్యక్తుల ఫోన్ నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో అడిగినట్లే వీటి ద్వారానూ అత్యవసరమని, గూగుల్ పే లిమిట్ అయిపోయిందని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందేశాలు అందుకునే ఎదుటి వ్యక్తుల్లో కేవలం డీపీలు మాత్రమే వాళ్లు తన స్నేహితుడు, బంధువు డబ్బు అడుగుతున్నాడని భావించి బదిలీ చేస్తున్నారు. -
ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు
ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించుకున్న ఉద్యోగులకు మెటా సంస్థ షాకిచ్చింది. లాస్ ఏంజిల్స్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను జాజ్ నుంచి తొలగించింది. అసలు ఆ ఉద్యోగులు చేసిన తప్పేంటి..కంపెనీ యాజమాన్యం తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించిందో తెలుసుకుందాం.మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజ కంపెనీ మెటా తన ఉద్యోగులకు నిత్యం ఉచిత ప్రోత్సహకాలు అందిస్తోంది. అందులో భాగంగా ఉచిత భోజనం కోసం వోచర్లు ఇస్తోంది. అయితే వీటిని కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు సంస్థ గుర్తించింది. దాంతో లాస్ ఏంజిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను ఏకంగా జాజ్ నుంచి తొలగించింది. అయితే వారు భోజనానికి బదులుగా ఇతర వస్తువులు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, వైన్ గ్లాసెస్ వంటి వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వోచర్లను ఉపయోగించారు. ఉద్యోగం కోల్పోయిన కొందరిలో తాము వీక్ఆఫ్ ఉన్న రోజుల్లోనూ ఇలా ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!మెటా తన ఉద్యోగులకు ‘గ్రూబ్హబ్’, ‘ఉబర్ఈట్స్’ వంటి డెలివరీ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రోజువారీ భోజన వసతి అందిస్తుంది. అందులో భాగంగా తమకు ఉచితంగా వోచర్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఒక ఉద్యోగికి టిఫిన్ కోసం 20 డాలర్లు(రూ.1,681), మధ్యాహ్నం భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100), రాత్రి భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100) విలువ చేసే వోచర్లు ఇస్తోంది. అయితే కొంతమంది ఉద్యోగులు నాన్-ఫుడ్ వస్తువులను కొనుగోలు చేయడానికి, కార్యాలయానికి రాని సమయంలో భోజన సదుపాయాన్ని వినియోగించినట్లు కంపెనీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఉద్యోగులకు ప్రాథమిక హెచ్చరికలు ఉన్నప్పటికీ వీటిని కొందరు అతిక్రమించారు. దాంతో సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించింది. -
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్‌బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
-
ఫేస్‌బుక్‌తో మోసం.. రూ.3 కోట్లు నష్టం
టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకునేవారు టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడుల్లో కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్న సంఘటనలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటి మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురం నివాసితులైన నబనిత, మృణాల్ మిశ్రా ఫేస్బుక్లో ఏకంగా రూ.3.1 కోట్లు నష్టపోయారు. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి అంటూ ఈ దంపతులను మోసం చేసి.. సైబర్ నేరగాళ్లు జూలై, ఆగస్టు మధ్య కాలంలో వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.నిజానికి నబానితా మిశ్రా ఫేస్బుక్లో ఒక ప్రకటన చూసి దానిపైన క్లిక్ చేసింది. ఆ తరువాత వ్యాపార సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న వాట్సాప్ గ్రూప్‌లో ఆమెను యాడ్ చేశారు. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ రజత్ చోప్రా జీటీసీ అనే పోటీలో పాల్గొనమని సభ్యులను ప్రోత్సహించారు.ఇన్వెస్ట్మెంట్ సలహా కోసం మొదట నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ. 2,000 చెల్లించానని.. ఆపై షేర్లు, ఐపిఓ ఇన్వెస్ట్మెంట్లకు కూడా బదిలీలు చేయాలని చెప్పారు. అప్పటికే వాట్సాప్ గ్రూప్‌లో ఇతరులు తమ పెట్టుబడులపై లాభాలను అందుకున్నట్లు వివరించారు.ఐపీవో లావాదేవీలలో ఒకదాని కోసం కంపెనీ తనకు రూ. 80 లక్షలు అప్పుగా ఇచ్చిందని నబానితా మిశ్రా తెలిపారు. ఆమె తన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ డబ్బును తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అలా చేయడానికి ఆమె తన తండ్రి ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలను తనఖా పెట్టింది. ఆ తరువాత ఒక అకౌంట్ యాక్సెస్ చేయగలిగింది. కంపెనీ యాప్‌లో ఆమె పెట్టుబడులు, లాభాల వివరాలను చెక్ చేసుకోగలిగింది. కానీ డబ్బును మాత్రం విత్ డ్రా చేయలేకపోయింది. ఆ తరువాత ఆమెకు అనుమానం వచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా కాల్ చేసినప్పుడు అవన్నీ స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. -
సోషల్ మీడియా.. మార్కెట్ మేనియా
విస్తృతమవుతున్న ప్రకటనల మార్కెట్ ⇒ 2024 మార్చి నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్: రూ. 10 వేల కోట్లు. ⇒ 2027 నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్ (అంచనా): రూ. 14 వేల కోట్లు. ⇒ ఏదో ఒక బ్రాండు, బ్రాండ్ అంబాసిడర్‌ను అనుసరిస్తున్న సోషల్ మీడియా ఖాతాదారులు: 90 శాతం ⇒ ప్రకటనను చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు: 11 శాతం ⇒ ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులను బయట స్టోర్స్‌లో కొనుగోలు చేస్తున్న వారు: 21 శాతం ⇒ దేశంలో సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనలపై ఆధారపడుతున్న పెద్ద, మధ్య తరహా వ్యాపార సంస్థలు: 77 శాతం ⇒ సోషల్ మీడియాలో చూసిన వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు: 76 శాతం ⇒ ప్రకటన చూశాక ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నవారు: 44 శాతం సాక్షి, అమరావతిప్రస్తుత స్మార్ట్ ఫోన్ల యుగంలో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఇక భారత్‌లో అయితే సోషల్ మీడియా మేనియా అన్ని దేశాలకన్నా ముందుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంలో భారత్ మొదటిస్థానంలో ఉండగా.. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో సెల్ ఫోన్ వినియోగదారులు రోజుకు సగటున రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిన్న స్థాయి సంస్థల వరకూ ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. ఇన్ఫ్లుయన్సర్స్ హవా.. ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్ఫ్లుయన్సర్స్ హవా కొనసాగుతోంది. కనీసం 10లక్షల మంది ఫాలోయర్లు ఉండే ఇన్‌ఫ్లుయన్సర్స్‌కు డిమాండ్ భారీగా ఉంటోంది. వారికి భారీ పారితోషికాన్ని చెల్లించేందుకు పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటున్నాయి. యూ ట్యూబ్‌లో 10 లక్షల వ్యూస్ వచ్చే వీడియోకు రూ. 3 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ.. ⇒ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 500 కోట్ల మంది సోషల్ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2027 నాటికి ఈ సంఖ్య 585 కోట్లకుచేరుతుందని అంచనా. ⇒ సోషల్ మీడియా ఖాతాదారుల్లో అత్యధికంగా భారత్‌లో 42 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 40 శాతం సోషల్ మీడియా ఖాతాదారులు కావడం గమనార్హం. ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నవారిలో 67 శాతం మంది సగటున కనీసం ఒక సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుతున్నారు. ⇒ భారత్‌లో రోజుకు సగటున 150 నిమిషాల పాటు అంటే రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రకారం 73 ఏళ్లు జీవించే పౌరుడు తన జీవిత కాలంలో 5.7 ఏళ్ల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసినట్టు అవుతుందని ఫోర్బ్స్ సంస్థ అంచనా వేసింది. ⇒ దేశంలోని ఖాతాదారుల్లో 78 శాతం మంది తమ మొబైల్ ఫోన్ ద్వారానే సోషల్ మీడియాను వీక్షిస్తున్నారు. ⇒ భారత్‌లో సోషల్ మీడియా వేదికల్లో మొదటి స్థానంలో ఫేస్బుక్, రెండో స్థానంలో ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన సోషల్ మీడియా ఖాతాదారుల్లో 74 శాతం మంది ఫేస్బుక్, 71 శాతం మంది ఇన్స్టాగ్రామ్ మాధ్యమాన్ని అనుసరిస్తున్నారు. కాగా 49 శాతం మంది ఎక్స్‌ను ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్ మరికొన్నేళ్లపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేశారు. -
ఫేస్బుక్, ఇన్‌స్టా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్.. ప్రారంభ ధర ఎంతంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. భారతదేశంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ కోసం వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పరిచయం చేసింది. గత ఏడాది లిమిటెడ్ యూజర్లతో మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్ టెస్ట్ చేసిన తరువాత.. ఇప్పుడు మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రూ. 639 నుంచి రూ. 21000 వరకు ఉన్నాయి. అయితే వివిధ సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్షిప్ ప్యాకేజీని ఎంచుకోవడంలో ఉపయోగకరంగా ఉండటానికి నాలుగు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ఈ వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి వెరిఫైడ్ బ్యాడ్జ్, భద్రత, కనెక్టివిటీకి సపోర్ట్ చేసే అదనపు ఫీచర్స్ కూడా పొందవచ్చు.టెస్టింగ్ సమయంలో ఒకే ప్లాన్ అందించిన మెటా.. ఇప్పుడు మొత్తం నాలుగు ప్లాన్స్ అందించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్స్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ అనేది గతంలో ఎక్స్ (ట్విటర్) ప్రారంభించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా చేరాయి. -
అధ్యక్ష బరిలో ట్రంప్.. మెటా కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 2021లో యూఎస్ క్యాపిటల్‌పై హింసాత్మకంగా దాడి చేశారు. ఆ సమయంలో హింసకు కారకులైనవారిని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశంసించినట్లు మెటా నిర్దారించింది. ఆ తరువాత ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ట్రంప్ మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించే అవకాశం ఉందని మెటా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా తప్పకుండా కొన్ని నియమాలకు లోబడి ఉండాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటివి చేస్తే.. శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మెటా తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాకుండా.. ట్రంప్ ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్ అకౌంట్లపై కూడా గతంలో సంబంధిత సంస్థలు ఆంక్షలు విధించాయి. గత ఏడాది ఈ పరిమితులను ఎత్తివేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా తన సందేశాలను జనాలకు చేరవేస్తూ వస్తున్నారు. -
‘అమెరికా ఇండిపెండెన్స్ డే’..మార్క్ జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో విడుదల చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్ బ్లాక్ యాప్రాన్, వైట్ షర్ట్ ధరించారు. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే అమెరికా’ అని రాశారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)జుకర్‌బర్గ్ ఆరు నెలల కిందట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్ తన 40వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్‌తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.టిక్‌టాక్‌తో పోటీపడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదికయువత యాప్‌ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్‌లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్‌టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్‌ప్లేస్, గ్రూప్‌లు, స్మాల్ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్‌ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్‌గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్‌ఆర్‌పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్‌ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్‌రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్‌స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్‌లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
ఫేస్బుక్, ఇన్‌స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) స్తంభించాయి. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్‌డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్’ (ట్విటర్)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ రెండు సామాజిక వెబ్సైట్లు (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్‌లో పేర్కొంది. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
సోషల్ మీడియాతో ఎన్నికల్లో గెలుపు ఖాయమా?
దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నాయి. మరో వైపు వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు ఓటర్ సైకాలజీని ప్రభావితం చేసే మాధ్యమాలుగా ఉద్భవించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు,రాజకీయ పార్టీలు తమ విజయాలను ప్రచారం చేయడానికి, ఓటర్ల నుండి మద్దతు పొందడానికి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. పార్టీలు ఓటర్లను ఎలా ఆకర్షిస్తున్నాయి? భారత్‌లో ప్రతినెలా 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్ల ఉన్న వాట్సప్‌లో లెటర్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ పేరుతో ప్రధాని మోదీ ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. తద్వారా తాను ప్రధానిగా దేశానికి చేసిన సేవ, సంక్షేమ పథకాలు, పనితీరు వంటి విషయాల గురించి అవగాహన కల్పిస్తూ అభిప్రాయాల్ని సేకరించేందుకు ఉపయోగపడుతుంది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోడీ’ బీజేపీ ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోడీ’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వెబ్‌సైట్‌ను విజిట్ చేసే యూజర్లు మోదీకి ఓటు వేసేలా ప్రతిజ్ఞ చేయడం, అందుకు గల కారణాల్ని తెలుపుతూ వీడియోల్ని క్రియేట్ చేసి అభిప్రాయాల్ని పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తాయి. వాట్సప్‌లో రాహుల్ గాంధీ సైతం మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాట్సప్ గ్రూప్‌ను నడుపుతున్నారు. ఇందులో ప్రజలతో సంభాషించడంతో పాటు వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. తద్వారా పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడడమే కాదు ఓటర్ల బేస్‌ను గుర్తించవచ్చు. పాండమిక్ తర్వాత ట్రెండ్ మారింది కోవిడ్-19 మహమ్మారి తర్వాత, సమాచార సాధనంగా సోషల్ మీడియా పట్ల దృక్పథం గణనీయంగా మారిపోయిందని, పొలిటిక్ అడ్వైజర్ వ్యవస్థాపకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఐటీ సెల్ హెడ్ అంకిత్ లాల్ అన్నారు. ‘సమాచారాన్ని పొందడానికి సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడే ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి అనేక రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ ఎన్నికల ప్రచారానికి డిజిటల్ వ్యూహాన్ని అవలంబించాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరో మాధ్యమంగా మారారు. వీరి ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయోచ్చని తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గత కొన్ని నెలలుగా యువ ఓటర్లను కనెక్ట్ అవ్వడానికి పలువురు రాజకీయ నాయకులు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఛానెల్స్ వరుసు ఇంటర్వ్యూలతో హోరెత్తించారు. ఎస్ జైశంకర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి బీజేపీ నేతలు యూట్యూబ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న పోడ్కాస్టర్ రణవీర్ అలహబాడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పాడ్‌కాస్ట్ కర్లీ టేల్స్ వ్యవస్థాపకుడు కమియా జానీతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి పక్షాలకు అదే ఎదురు దెబ్బ 2014 సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది నాయకులు సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో వెనుకబడి పోయారు. దీంతో ఆ ప్రభావం ప్రతిపక్షంలో ఉండేలా చేసింది. ప్రతిపక్షాల కంటే ముందే సోషల్ మీడియాను వినియోగించుకోవడం ముందున్న బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిందని అంకిత్ లాల్ చెప్పారు. పోల్ ఫలితాలపై సోషల్ మీడియా ప్రభావం పోల్ ఫలితాలపై సోషల్ మీడియా ప్రచారం ప్రాముఖ్యతను లాల్ వివరిస్తూ, ‘40 శాతం ఇంటర్నెట్ వ్యాప్తితో, సగటున రెండు లక్షల మంది జనాభా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో డిజిటల్ మాధ్యమాల ద్వారా 75,000 నుండి 80,000 మందిని ప్రభావితం చేయడం సాధ్యమవుతుంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా 5,000 ఓట్ల తేడా మంచి గెలుపు ఓటమి తేడా ఉంటుంది. అదే సమయంలో ఇతర విశ్లేషకులు ప్రజలను ఓటర్లుగా మార్చడంలో సోషల్ మీడియా శక్తిపై అనేక సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇండియాలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ
ఇండియాలో టిక్‌టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్‌లోనే వీటిని పరిచయం చేసింది. భారత్‌లో రీల్స్‌కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి -
USA: అమెరికాలో ‘టిక్‌టాక్’ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో టిక్‌టాక్ షార్ట్ వీడియో యాప్‌పై చర్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో టిక్‌టాక్‌పై అమెరికా ప్రతినిధుల సభ పాస్ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్‌టాక్ లేకపోతే యువత నొచ్చుకుంటుందని అంతేగాక మెటాకు చెందిన ఫేస్బుక్ బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో నిజాయితీ లేదని, టిక్‌టాక్ నిషేదం వల్ల ఫేస్బుక్ లాభపడటం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్‌ను ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని, వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందన్నారు. టిక్‌టాక్‌లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్టులను ఫేస్‌బుక్‌తో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్లంతా ఫేస్‌బుక్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల తర్వాత ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో నష్టాలు చవిచూశాయి. అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు వి చాట్‌ను నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న వేళ ట్రంప్ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క యువతను ఆకట్టుకోవడంతో పాటు మరోపక్క తనకు ఇష్టంలేని ఫేస్బుక్ చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్‌టాక్‌ను వాడుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం(మార్చ్ 13)న టిక్‌టాక్‌పై దాదాపు నిషేధం విధించినంత పనిచేసే ఓ కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ టిక్‌టాక్‌ను అమ్మేయాల్సి అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్లు టిక్‌టాక్‌కు వెబ్ హోస్టింగ్ సేవలు నిలిపివేస్తాయి. ఈ బిల్లు గనుక ఏకగ్రీవంగా పాసైతే దీనిపై తాను సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క తాము అమెరికన్ల డేటాను చైనాకు గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదని, ఇక ముందు కూడా షేర్ చేయబోమని టిక్‌టాక్ యాప్ యాజమాని బైట్‌డ్యాన్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యాప్‌పై నిషేధం అమెరికా ప్రజల రాజ్యాంగ హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడింది. ఇదీ చదవండి.. భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. కారణమిదే -
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్‌లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్‌లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.