gaming
-
పిల్లల కంటెంట్‌లో అసభ్య యాడ్స్..
న్యూఢిల్లీ: పిల్లలు సహా అన్ని వర్గాలకు అనువైనదిగా మార్క్ చేసిన కంటెంట్‌లో తరచుగా అసభ్య ప్రకటనలు వస్తున్నాయని ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ సర్వే నివేదికలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయం తెలిపారు. గత మూడేళ్లుగా గ్యాంబ్లింగ్/గేమింగ్, లోదుస్తులు, సెక్సువల్ వెల్నెస్కి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వివరించారు. పిల్లలకు అనువైనదిగా పేర్కొన్న కంటెంట్‌లో గ్యాంబ్లింగ్/గేమింగ్ (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) సంబంధ ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని 41 శాతం మంది తెలిపారు. లోదుస్తుల ప్రకటనలు తరచుగా ఉంటున్నాయని 35 శాతం మంది, సెక్సువల్ వెల్నెస్ యాడ్స్ ఉంటున్నాయని 29 శాతం మంది, మద్యం .. పొగాకు సంబంధ ప్రకటనలు ఉంటున్నాయని 24 శాతం మంది పేర్కొన్నారు. వయస్సుకు తగని ప్రకటనలు ప్రసారం చేస్తే నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించాలని 88 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల డివైజ్‌నే ఉపయోగిస్తారు కాబట్టి .. డివైజ్ ఓనర్ ప్రొఫైల్‌ను బట్టి కాకుండా లైవ్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ ప్రకారం ప్రకటనలు ఉండేలా ఆయా ప్లాట్‌ఫాంలు, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. 10,698 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ ప్రశ్నలకు దేశవ్యాప్తంగా 305 జిల్లాల నుంచి 30,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే..
భారతీయ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వీటి కోసం భారీ మొత్తంలో వెచ్చించాలంటే కొందరు తప్పకుండా వెనుకడుగు వేస్తారు. అయితే ఈ కథనంలో రూ. 15,000లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్లను గురించి వివరంగా తెలుసుకుందాం.సీఎంఎఫ్ ఫోన్ 1: సీఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. రూ.14,999 వద్ద లభించే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో 6జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం గేమ్ ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మోటో జీ64: మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో గేమింగ్ ఫోన్ మోటో జీ64. దీని ధర కూడా రూ.14,999 మాత్రమే. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025తో పాటు 8జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 6000 mAh కలిగిన ఈ ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూసేవారికి దీనిని పరిశీలించవచ్చు.పోకో ఎక్స్6 నియో: రూ.12,999 వద్ద లభిస్తున్న.. పోకో ఎక్స్6 నియో ఫోన్ కూడా తక్కువ ధరలో లభించే ఉత్తమ గేమింగ్ ఫోన్. ఇది 8 జీబీ రామ్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ పొందుతుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. సుదీర్ఘ గేమింగ్ సెషన్ల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది.రెడ్మీ 13 5జీ: రెడ్మీ 13 5జీ ధర రూ.14,999. ఇది వినియోగదారులకు లేటెస్ట్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పెద్ద డిస్ప్లే పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో 6 జీబీ రామ్ పొందుతుంది. అత్యుత్తమ పనితీరును అందించే ఈ ఫోన్ 5030 యాంపియర్ బ్యాటరీతో వస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్: రూ. 15వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే గేమింగ్ ఫోన్లలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఒకటి. దీని ధర రూ. 13999. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 8జీబీ రామ్ పొందుతుంది. శక్తివంతమైన ఈ స్మార్ట్‌ఫోన్.. మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. -
సిటీలో.. ఏఐ గేమింగ్ జోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత తరానికి అనుగుణంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగానే నగరంలో మొట్టమొదటి ఏఐ–గేమింగ్ జోన్ అడుగుపెట్టింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫెరల్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వేదికగా ఏఐ–గేమింగ్ జోన్ మంగళవారం ప్రారంభమైంది. డైరెక్టర్ రాహుల్ మల్హోత్రా, ఇంటెల్ ఇండియా సీనియర్ మేనేజర్ ఛానెల్ డి్రస్టిబ్యూషన్ అరుణ్ రాఘవన్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు.ఏ రంగంలోని విద్యార్థులైనా సరే తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడేలా ఈ సెంటర్ రూపొందించడం విశేషం. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కలి్పస్తున్నట్లు, ఏఐ గేమింగ్ జోన్లో సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్, ఏఐ–గేమింగ్ జోన్లో ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్ తదితర విభాగాల్లో సేవలు పొందవచ్చు.ఐడీ కార్డులు తప్పనిసరి..నగరంలో ప్రతి విద్యార్థి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఏఐ–గేమింగ్ జోన్‌ను ఆవిష్కరించాం. ఈ ఉచిత సేవలు పొందడానికి, అధునాతన టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు తమ ఐడీ కార్డులను వెంట తీసుకురావాలి. ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజయాలను సాధించేందుకు ఈ ఏఐ–గేమింగ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుంది. – విశాల్ పెరిఫెరల్స్, విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్ వికాష్ హిసరియాఇవి చదవండి: తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు -
క్లౌడ్ గేమింగ్ సూపర్ ‘క్లిక్’!
సరికొత్త వీడియో గేమ్‌లు మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే ఆడేయాలని ఎవరికుండదు చెప్పండి! నేటి జెన్ జడ్, యువతరానికి గేమ్స్ అంటే మరీ క్రేజ్. వీటిని ఆడాలంటే హై ఎండ్ పీసీతో పాటు ఖరీదైన గేమింగ్ కన్సోల్స్ తప్పనిసరి కావడంతో చాలా మందికి అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. అయితే, క్లౌడ్ గేమింగ్ ఎంట్రీతో వీడియో గేమ్స్ ముఖ చిత్రమే మారిపోతోంది. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న సాధారణ పీసీతోనే అదిరిపోయే లేటెస్ట్ వీడియో గేమ్స్ ఆడే అవకాశం లభిస్తుండటంతో గేమర్స్ క్లిక్.. క్లిక్.. హుర్రే అంటున్నారు!గేమింగ్ ఆన్ డిమాండ్... గేమ్ స్ట్రీమింగ్.. క్లౌడ్ గేమింగ్... పేరేదైనా కానీ గేమర్ల పాలిట వరంలా మారింది. కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్, గేమ్ ప్యాడ్/కంట్రోలర్ ఉంటే చాలు.. ఇప్పుడు ఎవరైనా తమ ఫేవరెట్ గేమ్స్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలోనే ఎంచక్కా స్ట్రీమ్ చేసేయొచ్చన్నమాట! హై క్వాలిటీ గేమ్‌ను మన సొంత సిస్టమ్‌లో రన్ చేయాలంటే, ఆడటానికి ముందే ఆ గేమ్‌ను ఫిజికల్‌గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా ఎక్కడో క్లౌడ్ సర్వర్లలో ఉన్న నచ్చిన గేమ్‌ను ఏ డివైజ్ లేదా ప్లాట్‌ఫామ్‌లోనైనా ఆడేందుకు (స్ట్రీమ్ చేసేందుకు) వీలవుతోంది. ఒకేసారి పలు డివైజ్‌లలోనూ గేమ్ ఆడొచ్చు. అంతేకాదు, గేమ్‌ను ఆపిన చోట నుంచే మళ్లీ ఆడుకోవచ్చు కూడా. అందుకే గేమర్స్ దీన్ని ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ గేమ్స్’ అని కూడా పిలుచుకుంటారు! రెండేళ్లలో మూడింతలు... మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్.యూఎస్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ గేమింగ్ యూజర్ల సంఖ్య 2021లో దాదాపు 10.27 కోట్ల మంది కాగా, 2023లో ఈ సంఖ్య ఏకంగా 29.1 కోట్లకు ఎగబాకింది. అంటే రెండేళ్లలోనే మూడింతలైంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కూడా ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తోంది. 2030 నాటికి ప్రపంచ క్లౌడ్ గేమింగ్ మార్కెట్ 46.9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 85 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని ఫార్చూన్ బిజినెస్ లెక్కగట్టింది. 2022లో ఈ మార్కెట్ విలువ కేవలం 3.37 బిలియన్ డాలర్లు మాత్రమే. మరోపక్క, క్లౌడ్ గేమింగ్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. 2033 నాటికి పరిశ్రమ లీడర్‌గా ఎదుగుతుందని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. ‘అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన సీఎస్జీ (క్లౌడ్–స్ట్రీమ్డ్ గేమింగ్) మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మూడో వంతుకు పైగా ఆక్రమిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో దక్షిణ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు భారీగా వృద్ధి చెందనున్నాయి. ముఖ్యంగా యువతరంతో ఉప్పొంగుతున్న భారత్‌లో, 5జీ విప్లవం ఆన్లైన్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది’ అని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్ నాథన్ నాయుడు పేర్కొన్నారు. భారత్.. అవకాశాల ‘క్లౌడ్’ భారీ అవకాశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, ఎన్‌వీడియో, సోనీ మొబైల్ విభాగాలు వర్ధమాన దేశాల మార్కెట్లలో విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. యాపిల్ కూడా తన గేమ్–స్ట్రీమింగ్ యాప్‌లను ఈ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఒక్కో గేమింగ్ యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 10% వార్షిక వృద్ధి సాధిస్తుండగా.. భారత్‌లో 15% చొప్పున పెరుగుతుండటం విశేషం. ‘మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ లభ్యత, చౌక డేటా ప్లాన్లు, 4జీ/5జీ భారీ విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, అవి మరింత చౌక రేట్లతో మరింత పవర్ఫుల్ ఫీచర్లతో లభిస్తుండటం వంటి అనేక అంశాలు భారత్‌లో క్లౌడ్ గేమింగ్ జోరుకు దన్నుగా నిలుస్తున్నాయి’ అని యాంట్క్లౌడ్ సీఈఓ హిమాన్షు జైన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో సేవలు ప్రారంభించిన ఈ క్లౌడ్ గేమింగ్, పీసీ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే 10,000 మంది యూజర్లను సంపాదించింది. ఈ ఏడాది చివరికల్లా 50,000 సబ్‌్రస్కిప్షన్లను లక్ష్యంగా పెట్టుకుంది.టెల్కోలకు భలే చాన్స్..దూసుకెళ్తున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్లో టెల్కోలు తమ సహజ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిలయన్స్ జియో ‘జియో గేమ్స్ క్లౌడ్’ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.199 ప్లాన్‌తో గేమ ర్లు చెలరేగిపోవచ్చన్న మాట! 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియా కూడా క్లౌడ్ ప్లే పేరుతో గేమింగ్ సరీ్వస్ మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ హ్యాండ్సెట్లలో ఎలాంటి డౌన్లోడ్లు లేకుండానే అదిరిపోయే గేమింగ్ అనుభూతిని యూజర్లకు అందిస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆ కొండకు చేరాలంటే.. కొండంత గుండె కావాలి!
డార్కెస్ట్ డంజన్కు సీక్వెల్‌గా వస్తున్న డార్కెస్ట్ డంజన్ 2 ఈ నెల 15న విడుదల అవుతుంది. గత గేమ్స్లాగే తాజా గేమ్ కూడా రోగ్‌లైక్ రోల్–ప్లేయింగ్ వీడియో గేమ్. తమవైన శక్తిసామర్థ్యాలతో ఉండే విభిన్నమైన క్యారెక్టర్లు దీనిలో ఉంటాయి.ఈ గేమ్ అంతిమ లక్ష్యం కొండకు చేరడం. కొన్ని శక్తులు ప్రపంచాన్ని ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిన కొండ ఇది. కొండను అన్వేషించే క్రమంలో ప్లేయర్‌కు రకరకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఈ టర్న్–బేస్డ్ గేమ్‌లో రాంగ్ స్పాట్లో ఉన్నప్పుడు ప్లేయర్ తన స్కిల్స్‌ను ఉపయోగించలేరు.డెవలపర్స్: రెడ్ హుక్ స్టూడియోస్ఇంజిన్: యూనిటీ ప్లాట్‌ఫామ్స్: విండోస్, ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5, నిన్టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: రోల్–ప్లేయింగ్, రోగ్‌లైక్ మోడ్ సింగిల్–ప్లేయర్ఇవి చదవండి: Artificial Intelligence: ఫీచర్ జెమిని ఏఐ టూల్స్.. -
'ది ఫస్ట్ డిసెన్‌డెంట్'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్ గేమ్!
థర్డ్–పర్సన్ షూటర్ గేమ్ ‘ది ఫస్ట్ డిసెన్‌డెంట్’ విడుదల అయింది. హైక్వాలిటీ గ్రాఫిక్స్‌తో కూడిన ఈ స్ట్రాటజిక్ గేమ్‌లో యూనిక్ క్యారెక్టర్లు ఉంటాయి. ‘ఇన్గ్రిస్’ కాంటినెంట్‌ను కాపాడడానికి ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్లేయర్ పోరాడవలసి ఉంటుంది.ఇది మాత్రమే కాదు ప్లేయర్ రకరకాల మిషన్లలో పాల్గొనవలసి ఉంటుంది. డిస్టింక్టివ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ గేమ్‌లో యూనిక్ స్కిల్ సెట్స్, ఫ్రీ మూమెంట్స్, చైన్ యాక్షన్స్, గ్రాప్లింగ్ హుక్స్, కలర్‌ఫుల్ ఫైర్ఆర్మ్... మొదలైనవి గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటాయి.డెవలపర్: నెక్సన్ గేమ్స్,ఇంజిన్: యునైటెడ్ ఇంజిన్ 5,జానర్: థర్డ్–పర్సన్ షూటర్ యాక్షన్ ఆర్పీజీ,మోడ్: కోఆపరేటివ్ మల్టీప్లేయర్.ఇవి చదవండి: ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి! -
ఆటల రాజ్యంలో.. గెలుపు పాట!
గేమ్ ప్లేలోకి వెళితే... యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘ఫైనల్ ఫాంటసీ’లో క్లైవ్ రాస్పెల్ అవుతారు. సాహస దారుల్లో ప్రయాణం చేస్తారు. జియోలొకేషన్–బేస్డ్ రోల్‌ప్లేయింగ్ గేమ్ ‘డ్రాగన్ క్వెస్ట్ వాక్’లోకి వెళ్లి మాన్స్టర్లతో తలపడతారు. హిట్ పాయింట్స్ కొడతారు. గేమింగ్ జోన్లోకి అడుగు పెడితే యూత్‌కు ఉత్సాహమే ఉత్సాహం. నిన్నటి వరకు అయితే ‘గేమింగ్’ అనేది యూత్‌కు ప్యాషన్ మాత్రమే. ఇప్పుడు మాత్రం ఫ్యాన్సీ కెరీర్ కూడా. గేమ్ డెవలపర్ నుంచి నెరేటివ్ డిజైనర్ వరకు ఎన్నో అవకాశాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు చేయడం నుంచి పుస్తకాలు చదవడం వరకు ఎన్నో విధానాల ద్వారా గేమింగ్‌కు సంబంధించిన సాంకేతిక విషయాలపై పట్టు సాధిస్తున్నారు...వీడియో గేమ్స్ అనేవి యూత్‌కు ఇక ‘జస్ట్ ఫర్ ఫన్’ ఎంతమాత్రం కాదు. తమకు నచ్చిన రంగంలోనే యువత ఉపాధి అవకాశాలు చూసుకుంటోంది. వీడియో గేమ్‌లపై అంతకంతకూ పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో డెవలపర్లు, డిజైనర్లు, టెస్టర్స్... మొదలైన నైపుణ్యవంతులకు డిమాండ్ పెరిగింది.‘గేమింగ్ అనేది ఇప్పుడు కేవలం రీక్రియేషన్ కాదు. సీరియస్ కెరీర్ ఆప్షన్’ అంటుంది భోపాల్‌కు చెందిన అనీష. ఆమె గేమింగ్ లోకంలోకి వెళితే మరో లోకం తెలియదు. అలాంటి అనీష ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోనే కెరీర్‌ను వెదుక్కునే ప్రయత్నం చేస్తోంది.‘గేమింగ్’ అనే మహాప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు... ఇన్–డిమాండ్ రోల్స్, స్కిల్స్, కోర్సులు....మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది యువతరం. ‘గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కు వ్యయప్రయాసలు అక్కర్లేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు’ అంటుంది ముంబైకి చెందిన కైరా. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఆన్లైన్ కోర్సు చేయడంతో పాటు బుక్స్ చదువుతోంది. గేమ్ డిజైన్‌కు సంబంధించి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ చేసింది.గేమ్ మెకానిక్స్ క్రియేట్ చేసే గేమ్ డెవలపర్లు, వోవరాల్ కాన్సెప్ట్, స్టోరీలైన్, క్యారెక్టర్లు, గేమ్‌ప్లేపై దృష్టి పెట్టే గేమ్ డిజైనర్లు, బగ్స్ బాధ లేకుండా చూసే అసూరెన్స్ టెస్టర్లు, విజువల్ ఎలిమెంట్స్‌ను క్రియేట్ చేసే గ్రాఫిక్ ఆర్టిస్లు, యానిమేటర్లు, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ వోవర్లాంటి ఆడియో యాస్పెక్ట్స్కు సంబంధించిన సౌండ్ డిజైనర్లు...గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ యువతరం తమను తాము నిరూపించుకోవడానికి గేమింగ్ ఇండస్ట్రీలో బోలెడు అవకాశాలు ఉన్నాయి’ అంటున్నాడు వీఆర్ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆటోవీఆర్’ సీయివో, కో–ఫౌండర్ అశ్విన్ జైశంకర్. ‘ఎలాంటి అవకాశాలు ఉన్నాయి’ ‘ఏ కోర్సు చేస్తే మంచిది’లాంటి వాటి గురించి అశ్విన్ జైశంకర్లాంటి నిపుణులు చెబుతున్న విషయాలను యువతరం జాగ్రత్తగా వింటోంది.‘అన్రియల్ ఇంజిన్ డెవలపర్ కోర్సు, యూనిటీ సర్టిఫైడ్ డెవలప్ కోర్సు, గేమ్ డిజైన్ అండ్ క్రియేషన్ స్పెషలైజేషన్... మొదలైనవి గేమ్ క్రియేషన్‌కు సంబంధించిన సరిౖయెన దారులు’ అంటున్నాడు అశ్విన్ జైశంకర్. గేమింగ్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్, గేమింగ్ కంపెనీల విస్తరణ కారణంగా గేమింగ్ పరిశ్రమలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నో కంపెనీలు తమప్రాజెక్ట్లను దృష్టిలో పెట్టుకొని యూనివర్శిటీల నుంచి ప్రతిభావంతులైన వారిని నియమించుకుంటున్నాయి.మరోవైపు గేమింగ్ సెక్టార్లో ‘ఫ్రీలాన్సింగ్ ట్రెండ్’ పెరుగుతోంది. గేమ్ డెవలప్మెంట్కు సంబంధించి కీలక దశలో ఫ్రీలాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ డెవలపర్ల నుంచి నెరేటివ్ డిజైనర్ల వరకు ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.మార్పు వచ్చింది..గేమింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే విషయంలో పిల్లల ఆసక్తి సరే, తల్లిదండ్రుల స్పందన ఏమిటి? అనే విషయానికి వస్తే... కొన్ని సంవత్సరాల క్రితం వరకు ‘గేమింగ్ అనేది కెరీర్ ఆప్షన్ కాదు’ అనే భావన వారికి బలంగా ఉండేది. ఈ పరిస్థితిలో ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది.‘ఒకప్పుడు గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సందేహాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం తమ పిల్లలను గేమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కోర్సులలో చేర్పించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్నాడు గేమింగ్ కంపెనీ ‘బ్యాక్‌స్టేజ్ పాస్’ ఫౌండర్ సూర్య. -
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్‌ను ఆడడానికి గేమర్స్‌లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్‌కు ఇతర గేమ్స్‌కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్‌తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్‌ను ఆకట్టుకునేలా గేమ్‌ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్‌పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్‌లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్‌ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్‌ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్‌ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్‌ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్‌లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్‌ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్‌కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
హైటెక్స్ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్!
క్రాఫ్టాన్ (KRAFTON) ఇండియా సమర్పించు బ్యాటిల్ రాయల్ ఎస్పోర్ట్స్ ఈవెంట్ 2024 ఫినాలే (BGIS) హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా ఈనెల (జూన్) 28, 29, 30 తేదీల్లో జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్లలో ఒకటైన BGISలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జట్లు రిజిస్టర్ చేసుకున్నాయి. పలు దఫాల పోటీల అనంతరం టాప్ 16 జట్లు తుది పోటీలకు అర్హత సాధించాయి. ఈ ఈవెంట్లో పోటీ పడే జట్లు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీని షేర్ చేసుకుంటాయి.KRAFTON సంస్థ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని కేటాయించడం భారత్‌లో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం. BGIS 2024 Finaleతో హైదరాబాద్ నగరం గేమింగ్ గమ్యస్థానంగా తమ ప్రతిష్ట మరింత పెంచుకోనుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోగా.. ప్రీమియం సీటింగ్, భోజన సదుపాయం కల ఎలైట్ పాస్‌లు (పెయిడ్ టికెట్లు) అందుబాటులో ఉన్నాయి.ఎలైట్ పాస్‌ల ధర రూ. 5000గా నిర్ణయించారు. ఎలైట్ పాస్‌ల విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని సంప్రదాయ క్రీడలకు మద్దతుగా అభినవ్ బింద్రా ఫౌండేషన్‌కు అందిస్తారు. గేమింగ్ ఔత్సాహికులు, అభిమానులు ఈ ఈవెంట్‌ను KRAFTON India Esports YouTube ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగిన KRAFTON, Inc. ఆకర్షణీయమైన ఆటలను కనుగొనే ఆన్లైన్ గేమింగ్ సంస్థ. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెవలపర్లకు నిలయంగా ఉంది. ఇందులో PUBG స్టూడియోస్, స్ట్రైకింగ్ డిస్టెన్స్ స్టూడియోస్, వెక్టర్ నార్త్, నియాన్ జెయింట్, క్రాఫ్టాన్ మాంట్రియల్ స్టూడియో, బ్లూహోల్ స్టూడియో, రైజింగ్ వింగ్స్, 5మిన్ల్యాబ్స్, డ్రీమోషన్, రెలుగేమ్స్, ఫ్లైవేగేమ్స్ వంటి స్టూడియోలు ఉన్నాయి.ప్రతి స్టూడియో నిరంతరం కొత్త సవాళ్లను స్వీకరించడానికి, వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలను విస్తృతం చేయడం ద్వారా మరింత మంది అభిమానులను గెలుచుకోవడం KRAFTON లక్ష్యం. -
యానిమేషన్, గేమింగ్‌లో మనమే టాప్
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 3 వేలకుపైగా హాలివుడ్ సినిమాలకు యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు సబంధించిన అవుట్ సోర్సింగ్ పనులు చేశారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ–హబ్ ప్రాంగణంలో శనివారం వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, యానిమేషన్, ఫిల్మ్, గేమింగ్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అలాగే తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్, ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలపైనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ నుంచి యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాల ప్రచారంతోపాటు ప్రపంచ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాలలో భారతదేశంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఆయన వివరించారు. సోనీ, కామ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి పెద్ద కంపెనీలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడంలో ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడు పంకజ్ బొహ్ర మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్, నిరంతర ఆవిష్కరణలు భారత్‌లో ఈ రంగాన్ని తాము ప్రోత్సహించడానికి ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అమెరికన్ కాన్సులేట్ వాణిజ్య వ్యవహరాల సలహాదారు రాఘవన్ శ్రీనివాసన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రాజెక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. మధుసూదన్ ప్రసంగించారు. -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
Gaming: గురి తప్పకుండా..
యాక్షన్ రోల్–ప్లేయింగ్ సర్వైవల్ గేమ్ వి రైజింగ్. ఒపెన్ వరల్డ్‌లో సెట్ చేసిన ఈ గేమ్‌ను అయిదు బయోమ్లుగా విభజించారు. కొత్తగా ఉనికిలోకి వచ్చిన రక్తపిశాచిని కంట్రోల్ చేయడం ప్లేయర్ పని. దీని కోసం రకరకాల సాధనాలను, ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.అంతేకాదు శత్రువుకు చిక్కని దుర్భేద్యమైన కోటను కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. సూర్యకాంతి, నీడ, రక్తనమూన... ఇలా ఎన్నో అంశాలు ఈ ఆటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ అడుగులో ప్రమాదం, నష్టం పొంచి ఉందో కనిపెట్టే స్పృహ ఆటగాడిలో ఉండాలి. ఆటలో నాన్–ప్లేబుల్ క్యారెక్టర్లు(ఎన్పీసీ) కీలకం.ప్టాట్ ఫామ్స్: విండోస్ప్లేస్టేషన్: 5జానర్స్: సర్వైవల్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: భారత్‌లోకి ఎయిర్ టాక్సీ.. ధరలు ఎలా ఉంటాయంటే? -
సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే!
‘బారెంట్స్ అండ్ ఫిషింగ్.. నార్త్ అట్లాంటిక్ ఫ్రాంఛైజీలకు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ షిప్స్ ఎట్ సీ. ఈ బ్రాండ్–న్యూ గేమ్‌ప్లేలో రకరకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న మల్టీప్లేయర్ మోడ్‌లో వచ్చిన ఈ గేమ్ ద్వారా మహా సముద్రాలకు సంబంధించి రియలిస్టిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.నెక్ట్స్ జనరేషన్ షిప్ స్టిమ్యులేషన్గా వచ్చిన ఈ గేమ్‌లో మొదటిసారిగా సర్వీస్, కార్గో నౌకలను పరిచయం చేశారు. వీటిలో సరికొత్త గేమ్‌ప్లే ఫీచర్లో ఉంటాయి. ‘స్నేహితులతో కలిసి నార్వేజియన్ సముద్రంలోకి వెళ్లండి. సినిమాటిక్–క్వాలిటీ ఓషన్ స్టిమ్యులేషన్ దీని సొంతం. సముద్ర సాహసాలు చేయాలనే ఉత్సాహం మీలో ఉందా? అయితే షిప్స్ ఎట్ సీలోకి వచ్చేయండి’ అంటుంది గేమ్ డెవలపర్ మిస్క్ గేమ్స్.జానర్స్: ఎర్లీ యాక్సెస్, స్ట్రాటజీ వీడియో గేమ్,ల్యాట్ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్,ఇంజిన్: అన్రియల్ ఇంజిన్ 5.ఇవి చదవండి: ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..! -
ప్రభుత్వం నిద్ర పోతుందా? రాజ్‌కోట్ ఘటనపై హైకోర్టు సీరియస్
గాంధీనగర్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో 15 మందిపైగా జనం జాడ తెలీడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సూమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ నిద్ర పోతున్నారు? మాకు గుజరాత్ ప్రభుత్వంపై మీద ఏ కోశానా కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ‘‘ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రెండు గేమింగ్ జోన్లను గత రెండు దశాబ్దాలుగా రాజ్‌కోట్‌లో నిర్వహింస్తున్నారు. వాటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఫైర్ సేఫ్టీ అనుమతి పత్రాలు కూడా లేవు. అందుకే గుజరాత్ ప్రభుత్వం పట్ల కొంచం కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రెండున్నరేళ్ల నుంచి రాజ్‌కోట్ గేమింగ్ జోన్ నడుస్తోంది. ప్రభుత్వం కళ్లు ముసుకుందని మేము అనుకోవాలా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గేమింగ్ జోన్‌కు సంబంధించిన ఫొటోలను చూపించిన రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కూడా హైకోర్టు మండిపడింది. ‘‘ఈ అధికారులంతా ఎవరూ? అక్కడికి వారంతా ఆడుకోవడానికి వెళ్లారా?’’ అని కోర్టు విమర్శించింది. ‘‘అంతపెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీకు కంటి చూపు పోయిందా? లేదా నిద్రపోతున్నారా? ఇంత జరిగాక మాకు స్థానిక వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.రాజ్‌కోట్‌లోని మనా-మవా ప్రాంతంలో ఉన్న టీఆర్పీ గేమింగ్ జోన్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గేమింగ్ జోన్లో వెల్డింగ్ పనులు జరగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
వారం క్రితమే వివాహం.. గేమింగ్ జోన్లో అగ్నికి ఆహుతై..
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. వినోదం కోసం వచ్చిన జనం ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొత్తగా పెళ్లయిన జంట అక్షయ్ ధోలారియా, ఖ్యాతి ఉన్నారు. ఈ జంటకు వారం క్రితమే వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వారు ఆనందంగా గేమింగ్ జోన్‌కు వచ్చారు. అయితే ఊహించని విధంగా సంభవించిన అగ్నిప్రమాదానికి వారిద్దరూ బలయ్యారు. 24 ఏళ్ల అక్షయ్ తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో ఉంటున్నాడు. ఖ్యాతి(20)ని వివాహం చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితమే రాజ్‌కోట్‌కు వచ్చాడు. గత శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన ఏడు రోజులకే ఈ జంట లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. వారి శరీరాలు గుర్తించలేని విధంగా అగ్నికి మాడిపోయాయి. వేలికి ధరించిన ఉంగరం ఆధారంగా అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతుల మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు తరలించారు.ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, విచారణ తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే ఈ వినోద కేంద్రం నడుస్తున్నదని విచారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్పీ గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు తెలిపారు. -
TRP గేమింగ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం..
-
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్‌లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్‌లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్‌ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
స్టెల్లర్ బ్లేడ్..! గ్రహాంతరవాసులతో వార్..!!
యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ‘స్టెల్లర్ బ్లేడ్’ ఈ నెల 26న విడుదల కానుంది. కథ విషయానికి వస్తే భూమి మీద ఉన్న మనుషులకు, గ్రహాంతవాసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మానవాళి తరిమివేయబడుతుంది. కోల్పోయిన తమ స్వస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈవ్‌తో పాటు ఆమె దళం ‘నయతిబా’ అనే గ్రహాంతరవాసులతో పోరాటానికి సిద్ధం అవుతుంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. శత్రువు వ్యూహాల ఆధారంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు సంబంధించిన డెమోను గత నెల విడుదల చేశారు. జానర్స్: యాక్షన్, అడ్వెంచర్.. ఇంజిన్: అన్రియల్ ఇంజిన్4 మోడ్స్: సింగిల్–ప్లేయర్ ప్లాట్‌ఫామ్: ప్లేస్టేషన్ 5 ఇవి చదవండి: ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా? -
Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది..
సర్జెంట్ స్టూడియోస్ వారి ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్‌లో ప్రధాన పాత్ర జావ్. డబుల్ జంప్, వాల్ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్ మాస్క్, మూన్ మాస్క్ అనేవి జావ్ ప్రధాన ఆయుధాలు. శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ అనేది 2.5డీ ప్లాట్‌ఫామ్ అడ్వెంచర్ గేమ్. ప్లేయర్స్ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్‌ను సొంతం చేసుకుంటారు. ప్లాట్‌ఫామ్స్: మైక్రోసాఫ్ట్ విండోస్, నిన్టెండో స్విచ్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ మోడ్: సింగిల్ ప్లేయర్ -
పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్‌గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్‌కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్‌లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్‌లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్‌ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్‌లు ఆడి స్ట్రీమర్‌గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్‌లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్‌లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్‌స్ట్రీమ్‌లో వీడియో గేమ్‌లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్‌ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్‌డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
Gaming: యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్.. 'హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్'
హరైజన్ జీరో డాన్ (2017) గేమ్‌కు సీక్వెల్‌గా వచ్చిన యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్ హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్(పీసీ) విడుదలైంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్లో ఆడే గేమ్ ఇది. ప్రమాదకరమైన ఆయుధాలతో నిండిన ‘అలోయ్’ అనే హంటర్‌ను ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నోరా తెగకు చెందిన యంగ్ హంటర్ అలోయ్ శాస్త్రవేత్త ఎలిజబెత్ సోటెక్ క్లోన్. ‘మిస్టీరియస్ ప్లేగ్’ మూలాన్ని తెలుసుకోవడానికి తన బృందాన్ని ఫర్బిడెన్ వెస్ట్ అని పిలవబడే సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆలోయ్ తన ప్రయాణంలో భారీ తుఫానులను, సంచార తెగలతో యుద్ధాలను ఎదుర్కొంటుంది. పచ్చనిలోయల నుంచి శిథిలమైన నగరాల వరకు ఆలోయ్ ప్రయాణంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. గత గేమ్‌తో ΄ోల్చితే ఈ గేమ్ మ్యాప్ పెద్దగా ఉంటుంది. షీల్డ్వింగ్, ఫోకస్ స్కానర్, డైవింగ్ మాస్క్, పుల్కాస్టర్లాంటి టూల్స్‌ను కంబాట్‌లో ఉపయోగించవచ్చు. ప్లాట్‌ఫామ్స్: ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5 విండోస్ జానర్: యాక్షన్, అడ్వెంచర్ మోడ్: సింగిల్–ప్లేయర్ ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్! -
అసలు వీటి గురించి మీకు తెలుసా..!
పోరాటమే ఊపిరిగా.. ట్యాక్టికల్ రోల్ ప్లేయింగ్ గేమ్ ‘యూనికార్న్ వోవర్లార్డ్’ మార్చి 8న విడుదల కానుంది. తన జెనోయిరాన్ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రాజ్యం నుంచి బహిష్కృతుడైన యువరాజు అలైన్ తన మిత్రులను సమీకరించి చేసే పోరాటమే ఈ గేమ్. అలైన్, అతడి బలగాల పోరాటాన్ని గేమ్‌ప్లే ఫాలో అవుతుంది. అన్ని క్యారెక్టర్లు, లొకేషన్లు, స్ప్రైట్స్ 2డీ ఆర్ట్‌తో డిస్ప్లే అవుతాయి. జానర్: ట్యాక్టికల్ రోల్–ప్లేయింగ్ మోడ్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ ప్లాట్‌ఫామ్స్: నిన్టెండో స్విచ్/ప్లేస్టేషన్ 4/ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ అవును...ఇది నిజమే! ‘ది ఫేస్బుక్’తో కాలేజీ క్యాంపస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్బుక్ ఎంతోమంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు పాపులర్ అయిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘ఫ్రెండ్ స్టర్’ ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకువచ్చింది. వచ్చిన బంపర్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా మరింత సంచలనం సృష్టించాడు జుకర్ బర్గ్. ఫేస్బుక్ అమ్మడంపై కాకుండా ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువ కావాలి’ అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పెనిషియస్ చెడు ప్రభావం, హాని కలిగిస్తుంది అనే చెప్పే సందర్భంలో వాడే మాట...పెనిషియస్ ఉదా: ది పెనిషియస్ ఎఫెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పోల్యూషన్ పెర్ఫిడీ నమ్మకద్రోహం, మోసం జరిగిన సందర్భంలో వాడే మాట పెర్ఫిడీ ఉదా: ఇట్ వాజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ పెర్ఫిడీ పెన్యూరీ కొరత. పేదరికం, వేదన.... మొదలైన సందర్భాలలో ఉపయోగించే మాట పెన్యూరీ. ఉదా: హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ పెన్యూరీ. విత్ఔట్ ఎడ్యుకేషన్ ఇవి చదవండి: ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి! -
Microsoft layoffs: 1,900 మందిని ఇంటికి పంపిస్తున్న మైక్రోసాఫ్ట్!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ గత ఏడాది 69 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ను బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ సమీక్షించింది. మైక్రోసాఫ్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మంది తొలగించనున్నట్లు ఈమెయిల్లో మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్తుకు అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్లు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. -
CES 2024: హెచ్‌పీ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లు
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్‌పీ సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్ల కింద కొత్త గేమింగ్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేసింది. కంపెనీ కొత్త లాంచ్‌లలో గేమర్లకు గేమింగ్, ఇతర క్రియేటివ్ టాస్క్‌ల కోసం ఒమెన్ ట్రాన్సెండ్ 14 (Omen Transcend 14) గేమింగ్ ల్యాప్‌టాప్ ఉంది. దీంతోపాటు 240Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5K OLED డిస్ప్లేతో OMEN ట్రాన్స్‌సెండ్ 16-అంగుళాల ల్యాప్‌టాప్‌ను కూడా హెచ్‌పీ ఆవిష్కరించింది. HP Omen 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్, Victus 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ రెండూ సరికొత్త Intel i7 HX ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ముఖ్యమైన ఫీచర్లు.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, కంటెంట్ క్రియేషన్‌కు అనువైన IMAX కూడిన సర్టిఫైడ్ 2.8K OLED డిస్ప్లే లాటిస్-లెస్ స్కై-ప్రింటెడ్ RGB కీబోర్డ్ ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు వీలుగా 1.6 కేజీల బరువుతో తేలికనది 140W ఛార్జింగ్ అడాప్టర్‌తో 11.5 గంటల బ్యాటరీ లైఫ్ NVIDIA GeForce RTX 4070 GPUతో ఇంటెల్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ -
ఇండియాలో దూసుకుపోతున్న గేమింగ్ ఇండస్ట్రీ, 2028 నాటికి..
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా గేమ్ డెవలప్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ)లో విడుదల చేసిన ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్’ మన దేశంలో డిజిటల్ గేమింగ్ ఇండస్ట్రీ ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్పకనే చెప్పింది. డిజిటల్ గేమ్స్‌కు యూత్ మహారాజ పోషకులే అయినప్పటికీ ‘యూజర్’ స్థానానికి మాత్రమే పరిమితం కావడం లేదు. గేమింగ్ ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. సొంతంగా గేమ్ బిల్డింగ్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా గేమ్ డెవలప్ కాన్ఫరెన్స్(ఐజీడీసీ)లో గేమింగ్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ లుమికై గూగుల్‌తో కలిసి ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్’ విడుదల చేసింది. మన దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ స్పీడ్‌కు ఇది అద్దం పడుతుంది. మన గేమింగ్ ఇండస్ట్రీ 2028 నాటికి అరవై రెండు వేల కోట్లను దాటుతుందని ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. ‘డిజిటల్ గేమ్స్’ అనగానే గుర్తుకు వచ్చేది యువతరమే. వారు డిజిటల్ గేమ్స్ వైపు ఆకర్షితం కావడానికి ప్రధాన కారణాలు... ∙సోషల్ కనెక్షన్: ఫోర్ట్‌నైట్, మైన్క్రాఫ్ట్లాంటి గేమ్స్ ఫిజికల్ లొకేషన్‌తో పనిలేకుండా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ప్లేయర్స్ ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే, స్నేహం చేసే, ఆన్లైన్ కమ్యూనిటీలను నిర్మించుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. జెన్ జెడ్ హైలీ సోషల్ జెనరేషన్‌గా పేరు తెచ్చుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పోటీ పడడానికి తమ గేమ్స్‌లో సోషల్ ఫీచర్స్‌ను తీసుకువస్తున్నాయి కంపెనీలు. ►యూజర్–జనరేటెడ్ కంటెంట్: యూజర్లు తమ సొంత కంటెంట్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో పాపులర్ గేమ్స్ అనుమతిస్తున్నాయి. తమ స్వీయ అనుభవాలను ఉపయోగించి యూజర్–జనరేటెడ్ కంటెంట్‌ను వర్చువల్ వరల్డ్‌లో వైబ్రెంట్ అండ్ డైనమిక్‌గా క్రియేట్ చేయడానికి వీలవుతుంది. ∙ఎన్నో ఎన్నెన్నో: యూత్ ప్లేయర్స్‌కు మోడ్రన్ గేమ్స్ కాంపిటేటివ్, కో–ఆపరేటీవ్ గేమ్‌ప్లే, ఎక్స్΄్లోరేషన్, స్టోరీ టెల్లింగ్‌కు సంబంధించి సరికొత్త అనుభవాలను అందిస్తున్నాయి. ప్లేయర్స్‌కు గ్రాఫిక్స్, సౌండ్, గేమ్ ప్లే మెకానిక్స్‌ను చేరువచేయడంపై దృష్టి పెడుతున్నాయి. ►స్ట్రేస్ ఫ్రీ–క్రియేటివిటీ: యూత్‌లో కొద్దిమంది ఒత్తిడి నుంచి బయట పడడానికి గేమింగ్‌కు దగ్గరవుతున్నారు. ఆర్ట్, డిజైన్, స్టోరీ టెల్లింగ్లాంటి సృజనాత్మక ప్రక్రియలను ఇష్టపడే యువతరం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కోసం వీడియో గేమ్స్ ఆడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు తమ గేమ్స్‌లో ప్లేయర్స్‌కు సొంత గేమ్ మోడ్స్, మ్యాప్స్ క్రియేట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. యువతరమే కారణం... మొబైల్ డివైజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మొబైల్ గేమింగ్ అభివృద్ధికి యూత్ ఉపయోగపడుతుంది. సంప్రదాయ గేమింగ్ కన్సోల్స్ కంటే అఫర్డబుల్ అండ్ యాక్సెసబుల్‌గా ఉండే మొబైల్ డివైజ్‌లకే ప్రాధాన్యత ఇస్తోంది యువతరం. ఇ–స్పోర్ట్స్ లేదా కాంపిటీటివ్ గేమింగ్ మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడానికి ప్రధాన కారణం యువత. యువతరం చూపిస్తున్న ఆసక్తి వల్ల ఎన్నో టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఇ–స్పోర్ట్స్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రొఫెషనల్ ఇ–స్పోర్ట్స్ ప్లేయర్స్ తయారవుతున్నారు. బోలెడు ఉపాధి అవకాశాలు... గేమ్స్ నుంచి అపారమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడమే కాదు గేమింగ్ ఇండస్ట్రీ నుంచి ఉపాధి అవకాశాలను కూడా వెదుక్కుంటోంది యువతరం. ఇ- స్పోర్ట్స్ ఇటీవల కాలంలో మల్టీ–బిలియన్–డాలర్ ఇండస్ట్రీగా ఎదిగింది. ప్రొఫెషనల్ ప్లేయర్స్‌కు జీతాలతో పాటు స్పాన్సర్షిప్ అవకాశాలు కూడా వస్తున్నాయి. గేమింగ్ ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగావకాశాలు ఉన్నాయి అంటుంది టీమ్‌లీజ్ డిజిటల్ ఫర్మ్ రిపోర్ట్ ‘గేమింగ్: టుమారోస్ బ్లాక్‌బస్టర్. ప్రోగ్రామింగ్ (గేమ్ డెవలపర్స్, యూనిటీ డెవలపర్స్), టెస్టింగ్ (గేమ్స్ టెస్ట్ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్ అసూరెన్స్), యానిమేషన్, డిజైన్(మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్, వర్చువల్ రియాలిటీ డిజైనర్స్), ఆర్టిస్ట్స్ (వీఎఫ్ఎక్స్ అండ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్), కంటెంట్ రైటింగ్, గేమింగ్ జర్నలిజం మొదలైన విభాగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్ఫూర్తిదాయక సూపర్‌స్టార్స్ యువతలో ఎంతోమందిలాగే ఈ ముగ్గురికి గేమ్స్ అంటే చాలా ఇష్టం. గేమింగ్‌ను వీరు అభిరుచిగా మాత్రమే చూడలేదు. గేమింగ్ రంగంలో తమ వ్యాపారదక్షతను నిరూపించుకోవాలకున్నారు. సొంతంగా గేమ్ బిల్డింగ్ కంపెనీ ప్రారంభించి తమ సత్తా చాటారు. యువతరంలో ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తున్నారు. సూపర్ గేమింగ్ యూనివర్శిటీ ఆఫ్ ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది క్రిస్టెల్ డీక్రూజ్. ఆ తరువాత కొలరాడో స్టేట్ యూనివర్శిటీ(యూఎస్)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. ‘టాప్టూలెర్న్’లో ఎడ్యుకేషనల్ గేమ్ డెవలపర్‌గా ఉన్నప్పుడు గేమ్స్‌కు ఉండే పవర్ ఏమిటో దగ్గర నుంచి చూసింది. ఆ కంపెనీలో చేరిన తొలి మహిళా ఉద్యోగి క్రిస్టెల్. ఆ తరువాత ఫ్రెండ్స్‌తో కలిసి ‘సూపర్ గేమింగ్’ అనే గేమ్బిల్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. అపార్ గేమ్స్ ముంబై యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన లక్ష్మీ కానోల్కర్ ముంబైలోని వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఇంటరాక్టివ్ ఇ–లెర్నింగ్ చిల్డ్రన్స్ కంటెంట్‌ను డిజైనింగ్ చేయడం ద్వారా గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. గేమింగ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో సొంతంగా గేమ్ డెవలపింగ్ కంపెనీ ‘అపార్ గేమ్స్’ ప్రారంభించింది. వినో జో ది యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్(ఇంగ్లాండ్)లో సైకాలజీలో మాస్టర్స్ చేసిన తరువాత కేపీఎంజీ కన్సల్టింగ్ వింగ్‌లో చేరింది సౌమ్యా సింగ్ రాథోడ్. టైమ్స్ గ్రూప్‌లో పనిచేసిన తరువాత ‘వినో జో’ పేరుతో సొంతంగా ఆన్లైన్ సోషల్ గేమింగ్ కంపెనీని మొదలు పెట్టింది. ‘ఒక విషయంపై మనకు ఇష్టం ఉన్నప్పుడు అదే మన బలంగా మారుతుంది. ఆ బలంతోనే విజయం సాధించవచ్చు’ అంటుంది సౌమ్యా సింగ్.