Ginger
-
ఇటువంటి వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా?
మంచూరియా రోల్స్..కావలసినవి..చపాతీలు – 5 లేదా 6,మంచూరియా – అర కప్పు (నచ్చిన ఫ్లేవర్‌లో తయారుచేసుకోవచ్చు),ఉల్లికాడ ముక్కలు,కొత్తిమీర తురుము – అర టేబుల్ స్పూన్ చొప్పునటొమాటో సాస్,పుదీనా చట్నీ – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి)నూనె – సరిపడాతయారీ..ముందుగా నచ్చిన విధంగా మంచూరియా చేసి పెట్టుకోవాలి.అదే సమయంలో చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి.అనంతరం చపాతీలు చేసుకుని.. వాటిని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.ఒక్కో చపాతీపైన టొమాటో సాస్, పుదీనా చట్నీ రాసుకుని.. కొన్ని మంచూరియాలను అందులో పెట్టుకుని.. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు జల్లుకుని.. రోల్స్‌లా చుట్టుకోవాలి.వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కమ్మగా ఉంటాయి.అల్లం స్వీట్..కావలసినవి..అల్లం – 2 కప్పులు (శుభ్రం చేసుకుని.. తొక్క తీసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి)పంచదార – 4 కప్పులు,ఏలకుల పొడి – కొద్దిగా,ఉప్పు – తగినంతనీరు – 2 కప్పులు,నెయ్యి – 4 టేబుల్ స్పూన్లుతయారీ..ముందుగా కళాయి వేడి చేసుకుని అందులో బెల్లం, పంచదార వేసి.. నీళ్లు పోయాలి. పంచదార, బెల్లం కరిగి.. సిరప్‌లా తయారవుతున్న సమయంలో అల్లం పేస్ట్, ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని.. చిక్కబడే వరకు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.కాస్త దగ్గరపడే సమయంలో నెయ్యి వేసుకుని కాసేపు స్టవ్ మీద ఉంచి.. మరోసారి కలుపుకోవాలి.ఆ మిశ్రమం మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఏదైనా బౌల్‌కి లేదా ప్లేట్‌కి ఆయిల్ రాసి ఆ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి.సమాంతరంగా పరచి.. సుమారు 30 నిమిషాల పాటు చల్లారబెట్టి.. నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్.. జలుబు, దగ్గును దూరం చేస్తుంది.బ్రెడ్ – పిస్తా లడ్డూ..కావలసినవి..పిస్తా పేస్ట్ – 1 కప్పు (గ్రైండ్ చేసుకోవాలి)పిస్తా – పావు కప్పు (దోరగా వేయించి, పొడిలా మిక్సీ పట్టుకోవాలి)బ్రెడ్ పౌడర్ – పావు కప్పు (పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఓట్స్ పౌడర్ – పావు కప్పు (ఓట్స్‌ని వేయించి పౌడర్ చేసుకోవాలి)పల్లీలు – పావు కప్పు (దోరగా వేయించి.. తొక్క తీసి.. కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)కొబ్బరి పాలు – సరిపడాబాదం పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకుబెల్లం లేదా పంచదార పాకం – కొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్లో బ్రెడ్ పౌడర్, బాదం పౌడర్, ఓట్స్ పౌడర్, కచ్చాబిచ్చాగా చేసిన పల్లీలు, పిస్తా పేస్ట్ వేసుకుని.. కొద్దికొద్దిగా కొబ్బరి పాలు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని.. ఆ ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. పక్కన పెట్టుకోవాలి.ప్రతి లడ్డూకి.. బెల్లం లేదా పంచదార పాకంలో ముంచి.. పిస్తా పొడి పట్టించాలి. కాసేపు గాలికి ఆరనిచ్చి.. సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
వీకెండ్ స్పెషల్: ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా..?
వీకెండ్ వచ్చిందంటే లేట్‌గా నిద్ర లేవడం, లేజీగా ఉండటం, ఎక్కువ ఫుడ్ లాగించేయడంకాకుండా, రోజంతా సరదాగా సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. స్నేహితులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడపాలి. దీంతో రాబోయే వారమంతా చురుగ్గా ఉండే శక్తి వస్తుంది. పచ్చని ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి. కాలుష్యానికి తావులేని పార్క్‌లకు వెళితే, మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మన చుట్టుపక్కల చిన్నపిల్లలతో గడిపినా, కలిసి పెయింటింగ్ వేసినా, ఆటలాడినా భలే ఉత్సాహం వస్తుంది. అలాగే రాబోయే వారమంతా యాక్టివ్‌గా ఉండేలా కొన్ని ఆరోగ్య చిట్కాలు ఇవిగో.. ♦ వేసవి కాలం వచ్చేసింది.. ఫ్రిజ్ నీరు కంటే కుండ వాటర్ బెటర్. మరీ ఎక్కువ చల్లని పదార్థాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ♦ పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీ పెడితేమంచిది. ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ♦ నడక, యోగా లాంటి వ్యాయామాలు, అలాగే బ్మాడ్మింటన్ లాంటి ఔటర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ♦ రోజూ నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఇతర పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ , డైటరీ ఫైబర్ కూడా అధికం. ♦ కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం, సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి. ♦ రొటీన్‌కి టీ కి బదులుగా అల్లం టీ తాగితే మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసి దానితో పళ్లు తోముకుంటే చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ♦ సీజనల్ వ్యాధులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ అల్లం , కీరా, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తాగాలి. నొప్పులు, వాపులు తగ్గి పోతాయి. -
అల్లంతో ఇలా చేస్తే పొడవైన జుట్టు మీ సొంతం!
ఆయుర్వేద పరంగా అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు ఈ అల్లం సులభంగా చెక్‌పెడుతుంది. అలాంటి అల్లం జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందా? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!. అందులోనూ అల్లం ఘాటు ఓ రేంజ్లో ఉంటుంది. దాన్ని జుట్టుకి అప్లై చేస్తే వేడి చేస్తుంది కదా!. మరీ అలాంటి అల్లం ఎలా జట్టు పోషణకు ఉపపయోగపడుతుంది అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నిపుణులు మాత్రం అల్లం కురులను స్ట్రాంగ్‌గా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇదేలా శిరోజాలకు పనిచేస్తుంది ఎలా జుట్టుకి అప్లై చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం! అల్లంలో జింక్, మెగ్నీషియం ఉంటాయి. అందువల్ల ఈ అల్లం రసాన్ని జుట్టు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఎలా తలకు అప్లై చేయాలంటే.. ఇందుకోసం ముందుగా ఆలివ్ నూనె తీసుకుని అందులో అల్లం రసం కలపండి. దీనిని జుట్టుకి అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే జుట్టుని క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే జుట్టు మెరుస్తుంది. పొడి జుట్టుకి అల్లం రసాన్ని అప్లై చేసి గంటపాటు అలానే ఉంచి, ఆ తర్వాత షాంపూ, కండీషనర్‌తో క్లీన్ చేసుకోవాలి. అల్లం రసాన్ని జుట్టుకి వాడడం వల్ల హెల్దీగా ఉండే పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. అంతేగాదు దీని వల్ల జుట్టుకి మరిన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పైగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గస్తుంది. కాబట్టి, జుట్టుకి అల్లాన్ని రెగ్యులర్‌గా అప్లై చేయండి. అలాగే తలపై దురద , చిన్న చిన్న పొక్కులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొక్కులని దూరం చేస్తాయి. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. (చదవండి: మసాలా దినుసుల ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
ఫుడ్ పాయిజన్ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే..
వేసవిలో చాలామందికి ఎదురయే సమస్యలలో ఫుడ్ పాయిజన్ ఒకటి. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు ఆహార పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయట తాగే నీరు శుభ్రంగా లేకపోయినా.. సమస్యలు తప్పవు. అసలు ఫుడ్ పాయిజన్ అయిందీ లేనిదీ ఎలా గుర్తించాలో, దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఆహారం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి, విపరీతమైన అలసట. ఎలా నివారించాలి? అవి తినొద్దు ►పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే తినండి, ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినకూడదు. ►బాగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ►ఎండలో ఆరుబయట కూర్చుని ఆహారం తినకూడదు. ►ఆహారాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీటిని వాడాలి. ►పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తినాలి. ►కుళ్ళిన కూరగాయలు, పండ్లు ఉపయోగించవద్దు. ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏం చేయాలి? ►ఫుడ్ పాయిజన్ అయినట్లయితే, నీరు ఎక్కువగా తాగాలి. ►మీకు వికారంగా అనిపిస్తున్నందున నీరు తీసుకోవడం తగ్గించవద్దు. ►గంజి, నీరు, పుదీనా టీ, బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి. ►ఓఆర్ఎస్ వినియోగించండి. హోం రెమెడీ ►కప్పు వేడి నీటిలో 2–3 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది. ►గ్లాసు వేడినీటిలో అర చెంచా తాజా అల్లం తురుము లేదా శొంఠి పొడి, తేనె కలిపి తాగాలి. ►కప్పు పెరుగులో చెంచా మెంతులు వేసి తినండి. మెంతులు నమలక్కర్లేదు, మింగేయవచ్చు. ►గ్లాసు వేడినీళ్లలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. ►చల్లని పాలకు అసిడిటీని తగ్గించే గుణం ఉంది. ఎసిడిటీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నప్పుడు, గ్లాసుడు చల్లని ΄ాలు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. ►నీళ్లలో జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి 2–3 సార్లు తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. ►ఇలాంటివి చేసిన తర్వాత కూడా తగ్గకపోతే.. వైద్యుణ్ణి సంప్రదించి మందులు తీసుకోవాలి. ►చేతులు తరచు సబ్బుతో కడుక్కోవాలి. వంటగదిలో శుభ్రత పాటించాలి. ►ఫుడ్ పాయిజన్ బారిన పడి కోలుకుంటున్న వారికి తగినంత విశ్రాంతి, నిద్ర అవసరం. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: అవాంఛిత సంబంధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు.. కుటుంబాన్ని కాపాడుకోలేమా? -
ప్రమాదకర రసాయనాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ నుంచి కూల్ డ్రింక్స్ దాకా..
రాజేంద్రనగర్: ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నిర్వహించడమేగాక రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్, శీతల పానీయాలు(కూల్‌డ్రింక్స్) తయారు చేస్తున్న కర్మాగారంపై ఆదివారం రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో డ్రింక్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కిలోల మసాలా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటేదాన్ శాంతినగర్‌లో ఫిరోజ్, అజిత్ గత రెండేళ్లగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మాని ఫుడ్ కంపెనీ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. సదరు పరిశ్రమలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మ్యాంగో, ఆరెంజ్ జ్యూస్‌తో పాటు పుడ్ మసాలాలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో కేవలం వెల్లుల్లి పొట్టును మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో రెండు సంవత్సరాలుగా అల్లమే వాడకుండా తయారు చేస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పదార్థాలే కనిపించాయి. శీతల పానీయాలను తయారు చేసేందుకు మురుగునీటిని వాడుతున్నారని, ప్లేవర్ల కోసం రసాయనాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్లుగా నిందితులు ఎలాంటి అనుమానం రాకుండా పరిశ్రమను నిర్వహించడం గమనార్హం. భారీ యంత్రాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తున్న వీరు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని సరఫరా చేసినట్లు వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకుని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. అధునాతన యంత్రాల వినియోగం... అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు గరంమసాలాలు, శీతల పానీయాల మిక్సింగ్, ప్యాక్ చేసేందుకు నిందితులు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో ఉన్న ఈ యంత్రాల ద్వారా ప్రతి రోజు రూ. లక్షల విలువైన మసాలాలు, అల్లం పేస్ట్, శీతల పానీయాలను తయారు చేస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశామని, స్వాధీనం చేసుకున్న పదార్థాలను ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
‘అల్లం’ రైతుల్లో ఆనందం.. ఐదు రెట్లు పెరిగిన ధర..
సాక్షి, సంగారెడ్డి: గత ఏడాదితో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఏటా అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగుచేస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా క్వింటాలు అల్లం ధర రూ.2 వేల నుంచి రూ.2,500 మాత్రమే పలుకుతూ వచి్చంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో రూ.8 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో పంటను సాగు చేస్తున్న రైతులు ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లుగా మార్కెట్లో అల్లం పంటకు సరైన ధర లేక పోవడంతో దేశవ్యాప్తంగా సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది. అంతే కాకుండా గత ఏడాది అధికంగా వర్షాలు పడటంతో సాగులో ఉన్న పంట సగానికి పైగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. అనేక మంది రైతులు గత ఏడాది క్రితమే ధర లేని కారణంగా అల్లం సాగుకు స్వస్తి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,500 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్టు అంచనా. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 90 శాతం సాగవుతోందని రైతులు చెపుతున్నారు. ఈ ఏడాది మళ్లీ పంట సాగుపై ఆసక్తి ప్రస్తుతం అల్లం పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఈ ఏడాది అల్లం పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మే నెల నుంచి జూన్ చివరి వరకు రైతులు అల్లం పంటను సాగు చేస్తారు. ఎకరం పంట సాగుకు సుమారు 1.50 లక్షల మేర పెట్టుబడి వ్యయం అవుతుంది. మార్కెట్లో ధర ఉంటేనే గిట్టుబాటవుతుంది. లేకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, అల్లం పంట సాగుకు కేరళ రాష్ట్రం ప్రతీతి. ఈ ఏడాది అక్కడ కూడా భారీగానే పంట సాగుకు రైతులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ ఏడాది 3 వేల ఎకరాలకు పైగా పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు చెపుతున్నారు. పంట ఉన్న రైతులకు లబ్ధి అల్లం పంట ఉన్న రైతులకు మంచి ధర వస్తోంది. దీంతో లబ్ధి పొందుతున్నారు. గతంలో ధర లేక రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయి. పంట సాగు తక్కువగా ఉన్నందున రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాల్ ధర రూ.8 వేలు పలుకుతోంది. ఈ ఏడాది పంట సాగు పెరిగే అవకాశం ఉంది. –అనూష, ఉద్యానవన అధికారి, జహీరాబాద్ బాగా గిట్టుబాటు అయింది ఎకరం పొలంలో గత ఏడాది అల్లం పంట సాగు చేసుకున్నా. ఇటీవల పంటను తీసి విక్రయించా. 60 క్వింటాళ్ల మేర పంట దిగుబడి వచి్చంది. పంట సాగు కోసం సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాను. క్వింటాలు అల్లం రూ.9 వేల ధరకు అమ్మాను. మంచి ధర రావడంతో బాగా గిట్టుబాటు అయింది. – నర్సింహారెడ్డి, రైతు–చిరాగ్పల్లి ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో ఉన్న అల్లం పంట తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. దీంతో మరింత ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేప థ్యంలో పంటను ఇంకా భూమిలోనే నిల్వ పెట్టాను. ప్రస్తుతం 4ఎక రాల్లో పంట ఉంది. ఈ ఏడాది మరో 6 ఎకరాల్లో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. క్వింటాలు ధర రూ.10 వేలకు పైగా పలికే అవకాశం ఉంది. –వెంకట్‌రెడ్డి, రైతు, హోతి (కె) చదవండి: ‘బాక్స్ సాగు’ భలేభలే..! -
జుట్టుకు జింజర్ ఆయిల్.. షాంపూతో అల్లం రసం కలపొచ్చా?
అల్లంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జుట్టుకు అల్లం రసాన్ని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా తలలో దురద, తీవ్రమైన చుండ్రు సమస్యలకు చికిత్స చేయడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అల్లం జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది. తద్వారా వెంట్రుకల కుదుళ్లు ఉత్తేజితమై జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అల్లంలో జింజరోల్, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల జుట్టు రాలడాన్ని నివారించడంతోబాటు జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే జింజర్ ఆయిల్‌ను వాడవచ్చు. మీ షాంపూతో అల్లం రసం కలపవచ్చు. లేదా అల్లం ఆధారిత షాంపూని ఉపయోగించవచ్చు. నూనెతో పాటు అల్లం రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీ హెయిర్ మాస్క్‌లకు అల్లం కూడా జోడించవచ్చు. (క్లిక్ చేయండి: డిజిటల్ అడిక్షన్‌ను గుర్తించడమెలా?) -
Hair Care: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా!
జడ ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఆధునిక జీవనశైలి, విపరీతమైన కాలుష్యం, సరైన పోషణ లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు రాలే సమస్య వేధిస్తోంది చాలా మందిని. అలా కాకుండా కేశాలు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. అల్లం, ఆవాలు, లవంగాలతో.. ►అల్లం తురుము టేబుల్ స్పును, టీస్పూను ఆవాలు, ఐదు లవంగాలను తీసుకుని ఒక కాటన్ వస్త్రంలో మూటకట్టాలి. ►మీరు వాడుతోన్న హెయిర్ ఆయిల్‌ను గాజు సీసాలో పోసి, దానిలో ఈ మూటను మునిగేటట్లు పెట్టాలి. ►ఒకరోజంతా సీసాను ఎండలో ఉంచాలి. ►మరుసటిరోజు ఈ నూనెను తలకు పట్టించి మర్దన చేయాలి. ►ఒకరోజంతా ఉంచుకుని తరువాతిరోజు తలస్నానం చేయాలి. ►ఇలా వారానికి ఒకసారి ఈ అయిల్ను తలకు పట్టించడం ద్వారా జుట్టురాలడం తగ్గి, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ►నూనె అయిపోయిన తరువాత మొదట చెప్పుకున్నట్లుగానే తాజాగా తయారు చేసుకుని వాడితే పదిహేను రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. చదవండి: Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే! ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! -
Recipe: కాలా మటన్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి!
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. ఈ సందర్భంగా కాలా మటన్ తయారీ విధానం మీకోసం.. కాలా మటన్ కావలసినవి: ►మటన్ – ముప్పావు కేజీ ►గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు ►పసుపు – అరటీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►పెరుగు – కప్పు ►ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు ►నూనె – ఐదు టేబుల్ స్పూన్లు ►ధనియాలు – టేబుల్ స్పూను ►గసగసాలు – టేబుల్ స్పూను ►యాలుక్కాయలు – నాలుగు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►లవంగాలు – ఐదు ►మిరియాలు – ఐదు ►సోంపు – టేబుల్ స్పూను ►ఎండు మిర్చి – నాలుగు ►ఎండుకొబ్బరి తురుము – అరకప్పు ►బిర్యానీ ఆకు – ఒకటి ►షాజీరా – టీస్పూను ►వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►అల్లం తరుగు – టేబుల్ స్పూను ►బంగాళ దుంపలు – రెండు ►చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ►దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►ఇరవై నిమిషాల తరువాత మటన్‌ను కుకర్‌లో వేయాలి. ►దీనిలో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. ►తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ►వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. ►నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషంపాటు వేయించాలి. ►తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లుపోసి మగ్గనివ్వాలి. ►దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ►ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలపాటు మగ్గనిచ్చి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Sugarcane Shrimp With Prawns: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా! Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా! -
దిల్ ‘మ్యాంగో’మోర్... సమ్మర్ ఎండ్ పికిల్స్ ట్రెండ్
వేసవి ముగింపుకొచ్చింది. దాంతో పాటే సీజన్లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే సమయం కూడా. ఆవకాయ అంటే ఒక పచ్చడి కాదు కొన్ని పచ్చళ్ల సమ్మేళనం. ఆ కొన్ని పచ్చళ్ల విశేషాలు... ► మామిడి ఆవకాయ తెలియనిదెవరికి?కనీస పదార్థాలతోనే చేసుకునేందుకు, ఎక్కువకాలం నిల్వఉంచుకునే వీలు వల్ల ఇది జాబితాలో అగ్రభాగంలో ఉంటుంది. ► బెల్లం తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... కలిపిందే బెల్లం ఆవకాయ. అయితే బెల్లం నాణ్యత బాగుండాలనేది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మర్చిపోకూడని విషయం. ► నువ్వులతో మామిడి పచ్చడి తయారు చేస్తారు. దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. ► అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్ మేళవింపు మరో రకం పచ్చడి. అయితే అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్ . ► పల్లి ఆవకాయ నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్‌లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు నాణ్యతతో ఉంటే పచ్చడి మరింతగా నిల్వ ఉంటుంది. ► ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడిని ఎంచుకోవాలి. ఎండబెట్టిన మామిడికాయలతో ఇది తయారు చేస్తారు. ► ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా ఈ సీజన్ లో ట్రై చేయొచ్చు. ‘‘చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు తయారు చేసుకోవడం అంటే కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కూడా. భోజనం సమయంలో ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి వాసన చూస్తేనే ఎక్కడా లేని ఆనందం కలిగేది’’ అని గోల్డ్‌డ్రాప్ డైరెక్టర్ మితేష్ లోహియా గుర్తు చేసుకున్నారు. -
Health Tips: నోటి దుర్వాసనా? దీనిని బుగ్గన పెట్టుకున్నారంటే వాంతులు, వికారం దూరం!
Allam Health Benefits In Telugu: కాస్త తలనొప్పిగా అనిపిస్తే చాలు అల్లం ఛాయ్ వైపు చూస్తారు చాలా మంది! అంతేనా వాంతులు అయ్యేవాళ్లు బుగ్గన ఓ అల్లం ముక్కను పెట్టుకుంటారు.. ఇలా అల్లం మన నిత్యజీవితంలో భాగమైపోయింది. నిజానికి ప్రాచీన కాలం నుంచే ఇది ఉపయోగంలో ఉంది. వంటకాల్లోనూ, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ దీనిని వినియోగిస్తారు. మన దేశంతో పాటు దక్షిణాసికాయ దేశాల్లో కూడా అల్లం పంటను సాగు చేస్తున్నారు. పచ్చి అల్లం, ఎండిన అల్లం, అల్లం పొడి, అల్లం నూనె, అల్లం జ్యూస్ .. అవసరాన్ని బట్టి ఏ రూపంలోనైనా దీనిని వాడుకోవచ్చు. అల్లంలో ఉండే పోషకాలు: ►అల్లంలో కార్బోహైడ్రేట్లు(పిండిపదార్థాలు) ఉంటాయి. ►పీచు పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. ►ఇక విటమిన్లలో విటమిన్ బీ3, బీ6, విటమిన్ సీ ఉంటాయి. ►వీటితో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్సరస్, జింక్, ఫొలేట్, నియాసిన్ అల్లంలో ఉంటాయి. ►ఖనిజలవణాలు కూడా పుష్కలం. ►యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ తాజా అల్లంలో లభించే పోషకాలు 4.8 కేలరీలు 1.07 గ్రాముల పిండిపదార్థాలు .12 ఫైబర్ .11 ప్రొటిన్ .05 కొవ్వులు .1 షుగర్ వీటితో పాటు పైన చెప్పుకొన్న పోషకాలు తగు మోతాదుల్లో లభిస్తాయి. అల్లం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►ఇందులోని జింజరాల్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ►ఒత్తిడిని దూరం చేసి మెదడును ప్రశాంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ►నోటి దుర్వాసన పోగొట్టేందుకు అల్లం చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. ►ఆకలిని పెంచే గుణాలు అల్లంలో ఉంటాయి. ►అల్లం అరుచిని పోగొడుతుంది. ►అల్లం బుగ్గన పెట్టుకుంటే.. దీని రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావన, వికారాన్ని తగ్గిస్తుంది. ►గొంతులో నస ఉన్నా అల్లంతో చెక్ పెట్టేయవచ్చు. ►జలుబు, దగ్గును దూరం చేస్తుంది ►అదే విధంగా కఫ సమస్యను కూడా తగ్గిస్తుంది. ►బరువు తగ్గడం(కేలరీలను బర్న్ చేసి)లోనూ ఉపయోగపడుతుంది. ►అల్సర్, కీళ్ల నొప్పులు, అజీర్తి, మధుమేహం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ►రుతుస్రావ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ►శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ►కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది. ►ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: కొబ్బరి నూనె.. కాఫీ పొడి.. ముఖం మెరిసిపోవడం ఖాయం -
జింజర్..పవర్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్
‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం! ఏమిటి జింజర్? ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్‌కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్సిఎల్ సీయివో పునీత్ చత్వాల్. ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది. కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు. అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది. స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. 371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. -
టీ గారూ.. తమరు సూపరు!
చలి వేయి కత్తులతో వస్తుంది. ఒక్క కప్పు టీ అడ్డు నిలుస్తుంది. చలి మంచు వల విసురుతుంది. తేయాకు గుడగుడ ఉడికి దానిని తెంపుతుంది. చలి పళ్లు టకటకలాడించాలని చూస్తుంది. టీ గ్లాసులు టింగుటంగుమని మోగి న్యూట్రల్ గేర్ వేస్తాయి. జనులు చలికాలంలో అవస్థ పడతారని ప్రకృతి టీ కాచింది. టీ అంటే ఉత్త తేయాకు, పాలు, చక్కెర కాదు. దానితో కలగలిసిన మనుషులు కూడా. ‘టీ పోసిన మనుషులను’ తలుచుకునే కాలం ఇది. కిరోసిన్ స్టవ్ నీలిమంట చాలా అందంగా ఉంటుందా మలి చీకటిలో. ‘బజ్జ్’మని దాని సౌండ్. మీద పాల దబర. పూర్తిగా మూసి ఉన్న మూతను కొంచెం నెడితే మెలి తిరుగుతూ పైకి లేస్తున్న పొగలు కనిపిస్తాయి ఆ చలి చీకటిలో. జంటగా ఉన్న స్టౌ మీద సత్తు జగ్గులో తేయాకు నీళ్లు కుతకుతలాడుతుంటాయి చలి మీద కాలు దువ్వుతూ. తెల్లవారుజాము ఐదు గంటలంటే చలి తన ఆఖరు దళాన్ని ఆయుధాలతో మొహరించి ఉంటుంది. ఆరున్నర ఏడు దాకా ఆ దళాల కవాతు సాగుతుంది. మఫ్లర్లు? వాటికి లోకువ. ఉన్ని టోపీలను? లెక్క చేయవు. స్వెటర్లను అగోచరంగా చీల్చి పారేస్తాయి. అర చేతులను నిస్సహాయంగా రుద్దుకోక తప్పదు. అప్పుడొక హీరో కావాలి. ‘రక్షించండి’ అని పొలికేక వేయకముందే నిలువు గీతల గాజు గ్లాసులో పొగలు గక్కుతూ ప్రత్యక్షం కావాలి. ఎస్. స్ట్రాంగ్ టీ. చలి విలన్ భరతం పట్టే హీరో. ముఖానికి దగ్గరగా పెట్టుకుంటే వెచ్చదనం. గొంతులోకి దిగితే ఇంధనం. చలికాలంలో సంజీవని. జేగురు రంగు దివ్య రక్షణ. టీ. చలిపులి పై చర్నాకోల. ఈ టీ గారు లేకుంటే ఈ కాలం ఎలా గడవను? ఐకమత్యం టీ టీలు రెండు రకాలు. ‘విడి టీలు’. ‘ఐకమత్యం టీలు’. విడి టీ అంటే టీపొడి విడిగా, పాలు విడిగా, చక్కెర విడిగా... ఇలా విడివిడిగా ఉంటూ ఆఖరు నిమిషంలో కలుస్తాయి. ఐకమత్యం టీ అంటే హంస ముక్కు ఉన్న సత్తు కెటిల్లో టీ పొడి, పాలు, చక్కెర కలగలిసి ఒకేసారి ఉడుకుతాయి. విడి టీలో చాయిస్ ఉంటుంది. లైట్, స్ట్రాంగ్, మీడియం... కాని హంసముక్కు ఐకమత్యం టీలో లోపల ఏది తయారైతే అది. ఎలా తయారైతే అది. కెటిల్ హ్యాండిల్‌కు దళసరిగా కట్టిన గుడ్డ టీ మాస్టర్ పట్టగా పట్టగా నలుపెక్కి చేయి కాలనంతగా రాటు దేలి ఉంటుంది. లోపల టీ బాగా ఉడికిన మరు నిమిషం మాస్టర్ వరుసగా గ్లాసులు పేర్చి హ్యాండిల్ పట్టుకుని హంస ముక్కును వొంచుతాడు. దుముకుతూ టీ. ధారగా టీ. రుచి రంగులో టీ. అందరికీ ఒకేలాంటి టీ. అందరికీ ఒకే లాంటి శుభోదయమూ. టీ కోసమే నిదుర లేవాలి చలికాలంలో నిదుర లేవాలంటే తాయిలం ఏమిటి? టీయే. చలికాలంలో పనులు మొదలవ్వాలంటే ఒంటికి ఏం పడాలి? టీయే. ఇంట్లో పిల్లలు నిదుర పోతుంటారు. పెద్దవారు ముసుగుతన్ని ఉంటారు. ఇంటామె, ఇంటాయన మార్నింగ్ వాక్కు బయలుదేరే ముందు ఆ వెలుతురు రాని చీకటిలో కిచెన్‌లో లైటు వేసి చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ టీ కాచుకుంటూ ఫిల్టర్‌తో కప్పుల్లో ఒంచుకుంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఉంటే... తక్కిన కాలాల్లో ఏమో కాని చలికాలంలో ఆ దృశ్యం సుందరంగా ఉంటుంది. స్త్రీకి పురుషుడు... పురుషుడికి స్త్రీ తోడుగా ఉండాల్సింది ఇందుకే అనిపిస్తుంది. మీ చేతుల్లో టీ కప్పులు పట్టుకోండి... మీరు సంపూర్ణం అవుతారు అంటుంది టీ. అల్లం బంధువు... యాలకులు స్నేహితులు పాలకూ టీ పొడికి జోడి కుదిరింది. బంధువులు లేకపోతే ఎట్లా? నన్ను రెండు చిన్ని తుంటలు చేసి మీతో కలుపుకోండి.. బాగుంటాను అని అల్లం వచ్చిందట. నా నెత్తిన నాలుగు మొత్తి మీ తోడు చేసుకోండి ఆహ్లాదం పెంచుతాను అని యాలకులు అన్నాయట. అదిగో ఆనాటి నుంచి అల్లం బంధువు.. యాలకులు స్నేహితులు అయ్యాయి. చలికాలంలో మామూలు టీ. గొప్ప. అల్లం టీ. ఓకే. యాలకుల టీ. సరే. కాని ఈ కాలంలో తెల్లవారు జామున లెమన్ టీ తాగాలనుకునేవారికి టీ శాస్త్రంలో మన్నన లేదు. లెమన్ టీ మరే కాలంలో అయినా సరే. చలికాలంలో మాత్రం కాదు. అరె.. పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసే సన్నివేశం ఆ ఒణికే చలిలో ఎంత బాగుంటుంది. టీ మనుషులు టీతో పాటు మనుషులు గుర్తుంటాయి. సందర్భాలు కూడా. చలిలో కారు ప్రయాణం. తెల్లవారుజామున రోడ్డెక్కితే ఎక్కడో ఒకచోట వేడి వేడి టీ దుకాణం. ‘సార్ టీ’ అంటూ అద్భుతంగా టీ చేసి ఇచ్చిన ఆ మనిషి గుర్తుంటాడు. వీధి చివర రోజూ టీ అమ్మే మాస్టర్. మనం ఇంత దూరం ఉండగానే చక్కెర తక్కువ అడగకనే అలవాటును గుర్తు పెట్టుకుని రెడీ చేస్తాడు. గుర్తుంటాడు. బంధువులు ఎందరో ఉంటారు. కాని ఒక్కరే టీ భలే పెడతారు. గుర్తుంటారు. కేరళ టూరుకు వెళ్లి తేయాకు కానుకగా తెస్తారు ఒకరు. గుర్తుంటారు. అస్సాం టీ పౌడర్ వాడుతున్నాం అంటారు. గుర్తుంటారు. లంసా టీ రుచే వేరే. అది ఇచ్చిన ఇల్లు గుర్తుంటుంంది. పాలు విరిగాయి. అయినా మేనేజ్ చేశా అని ఒక అక్క అంటుంది. గుర్తుంటుంది. చక్కెర లేదు బెల్లం ముక్క వేశా అని పిన్ని అంటుంది. గుర్తుంటుంది. కొంచెం టీ పౌడర్ అంటూ తప్పక అప్పు చేసే ఇరుగామె ఉంటుంది. గుర్తుంటుంది. భుజాల మీద చేతులు వేసుకుని పంచెలు పైకి కట్టి నవ్వుకుంటూ వెళ్లి టీ తాగిన సందర్భాలు?... ఆ స్నేహితులందరికీ గుర్తుంటాయి. వేసవిలో మల్లెల్ని శ్లాఘించాలి. నిజమే. చలికాలంలో టీ కాకుండా ఎవరికి కిరీటం పెడతాం? చెప్పండి. -
అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
Benefits of drinking ginger milk: ఒక కప్పు పాలలో టీ స్పూను అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తరువాత చిటికెడు మిరియాలపొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా బెల్లం తురుము కలపాలి. గోరువెచ్చగా ఉండగానే ఈ పాలను తాగాలి. అల్లం పాలను రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చలి కాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది చదవండి: ఎయిర్ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..! -
కడుపు నొప్పి: అల్లం, పుదీనా, గ్రీన్ బనానా.. వీటితో..
ఇంట్లో ఫేవరేట్ వంటలు చేస్తే ఆరోజు మన చేతికి ఎముక ఉండదు. లాగించెయ్యడమే... ఇక రోడ్డు పక్క స్టాల్స్, హోటళ్ల ఇష్టమైన, ఘుమఘుమలాడే చిరుతిండ్లు కనిపిస్తే ఇంకేముంది.. క్షణాల్లో అక్కడ వాలిపోతాం! ఆనక.. తిన్నది అరగక.. పడేతిప్పలు అన్నీఇన్నీకాదు. కడుపునొప్పితో ప్రారంభమై వాంతులు, మలబద్ధకం/విరేచనాలు... ఒక్కోసారి.. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బిల్ చూసి మూర్చపోయేంత పనౌతుంది. పిల్లలు, పెద్దల్లో సర్వసాధారణంగా కనిపించే కడుపునొప్పికి వంటింట్లో దొరికే ఈ 5 రకాల పదార్థాలతో ఏ విధంగా ఉపశమనం పొందవచ్చో నిపుణుల మాటల్లో.. అల్లం కడుపునొప్పి సాధారణ లక్షణాలు వికారం, వాంతులు. వీటి నివారణకు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటామో అప్పుడు మన శరీరం కొంత తేరుకుంటుంది. వికారం, వాంతులకు సహజమైన నివారణ మంత్రం అల్లం అని చెప్పవచ్చు. అల్లం నేరుగా తిన్నా లేదా వంటల్లో వాడినా ఎంతో మేలు చేస్తుంది. ద్రావణ రూపంలో తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు, తాపనివారణకు అల్లం అద్భుతమైన ఔషధమని ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన డా. అహుజా తెలిపారు. సీమ చామంతి కడుపునొప్పితో సహా వివిధ వ్యాధుల నివారణకు పూర్వకాలం నుంచే సీమ చామంతి వాడుకలో ఉంది. పేగు సంబంధిత వ్యాధులు అంటే గ్యాస్, అజీర్ణం, డయేరియా, వాంతులకు ఈ ఔషధమొక్క బాగా పనిచేస్తుంది. దీనిని కషాయం రూపంలో పిల్లలకు పట్టిస్తే కడుపునొప్పి ఇట్టే మాయం అవుతుంది. ఈ వ్యాధుల నివారణలో సీమ చామంతి ఔషదమొక్క కీలకపాత్రపోషిస్తున్నప్పటికీ, దీని పనితీరుపై మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది. పెప్పర్మింట్(పుదీనా) ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనేది పెద్ద పేగు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. కడుపునొప్పి, ఉబ్బసం, మలబద్ధకం, డయేరియా వంటివి దీని ప్రధాన లక్షణాలు. అసౌకర్యాన్ని కలిగించే ఈ లక్షణాలను పెప్పర్మింట్ హెర్బల్‌తో నివారించవచ్చు. పేగుల్లో ఆకస్మికంగా సంభవించే కండరాల నొప్పి తగ్గించడానికి, వాంతులు, డయేరియాల నివారణకు పెప్పర్మింట్లోని మెంథాల్ ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అధ్యయనాలు వెల్లడించాయి. చదవండి: Red Lady Finger: ఎర్ర బెండీ.. భలే భలే.. వాళ్లకి మేలు! గ్రీన్ బనానా డయేరియా తీవ్రతను పచ్చ అరటితో తగ్గించవచ్చు. పచ్చ అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. అది యాంటి డయేరియా కారకాలు కలిగి ఉంటుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లో నెమ్మదిగా పులిసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పేగులు ఎక్కువ నీటిని పీల్చుకొనేలా ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా అరటిలో విటమిన్ ‘బి6’, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు తిమ్మిరి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డయేరియా నివారణలో పచ్చ అరటి ప్రయోజనాలపై వెనుజులాకు చెందిన పీడియాట్రీషియన్ డా. థైజ్ అల్వరెజ్ అకోస్టా నిర్వహించిన పరిశోధనాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెరుగు జీర్ణక్రియ కార్యకలాపాల్లో మార్పుల కారణంగా కడుపునొప్పి సంభవిస్తుంది. అంటే కడుపులోని బ్యాక్టీరియా అసమతుల్యతం అవుతుందన్నమాట. ప్రోబయోటిక్స్ (మంచి సూక్ష్మజీవులు) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గ్యాస్, ఉబ్బసం వంటి రుగ్మతలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. పెరుగులో జీవించి ఉండే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, డయేరియా (అతిసారా) నివారణకు తోడ్పడుతుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారు పెరుగు సేవిస్తే సులభంగా జీర్ణం అవుతుంది. ప్రోబయోటిక్ ఉత్పత్తులు ఐబీఎస్ రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలోని జువాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎనా రే బెనర్జి వెల్లడించారు. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
ప్రయాణాల్లో వాంతులకు అల్లంతో కళ్లెం
ప్రయాణాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు? అయితే కొందరు బస్సు ఎక్కాలంటే.. వాంతులు అవుతాయేమోనని భయపడతారు. మలుపులు, లోయలు ఉన్న రహదారుల్లో అయితే మరీ భయం. బస్సు ఎక్కుతూనే నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని, కిటికీ పక్కన కూర్చుంటారు. ప్రయాణాల్లో ఇలాంటి వాంతులు రాకుండా మందులే లేవా ? ఈ సమస్య కు చక్కటి ఆయుర్వేద చిట్కా ఉంది. ఇలా దూర ప్రయాణాలు చేసే వాళ్లు ఒక అల్లం ముక్కను పట్టుకెళ్లాలి. బస్సు ఎక్కుతూనే అల్లం ముక్కను బుగ్గన పెట్టుకోవాలి. అల్లం రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావనను తగ్గిస్తుంది. అల్లంలోని ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియం, జింక్, కాపర్ వంటివన్నీ శరీరానికి అందుతాయి. ఒకరకంగా ఇది మందులాగా పనిచేస్తుంది. మరోవైపు అల్లం వల్ల చక్కటి ఆకలి కలుగుతుంది. గొంతులో నస తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉన్నా తగ్గుతాయి. కఫ సమస్య కూడా తగ్గుతుంది. ఇలా ఒకసారి అలవాటు చేసుకుని చూడండి. వాంతులకు కళ్ళెం వేయొచ్చు. -
ఈ చిట్కాలేవి కోవిడ్ నుంచి రక్షించలేవు!
జెనివా : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్–19’ బారిన పడకుండా తప్పించుకోవాలంటే ఒళ్లంతా ఆల్కహాల్ పోసుకుంటే సరి అని, అల్లం తింటే అల్లంతా దూరాన ఉంటుందని, ఎలక్ట్రిక్ డయ్యర్ కింద చేతులు ఆరబెట్టుకున్నా వైరస్ హరీమంటుందని, రేడియేషన్‌ను విడుదల చేసే యూవీ లైట్లతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న చిట్కాలు, పద్ధతులేవీ కోవిడ్–19 ముందు పనిచేయవని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం నాడు ఓ ప్రకటనలో తేల్చి చెప్పింది. తప్పుడు సమాచారాన్ని, కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసినట్లయితే కోవిడ్ కేసులు మరింత పెరగుతాయంటూ నార్విచ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పాల్ హంటర్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువవడం గమనార్హం. (కోవిడ్ : ఫ్రాన్స్‌లో చైనా పర్యాటకుని మృతి) ఉడకబెట్టిన అల్లం నీళ్లతో వైరస్‌ను అరికట్టవచ్చంటూ ఫేస్బుక్ షేరింగ్‌ను అడ్డుకున్నారు. అల్లంలో బ్యాక్టీరియాను అరికట్టే కొన్ని గుణాలు ఉన్నప్పటికీ ఈ వైరస్‌ను నిరోధించగలిగే లక్షణాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.నువ్వుల నూనెను ఒళ్లంతా పూసుకోవడం వలన లాభం లేదని, నోటి ద్వారానో, ముక్కు ద్వారానో వైరస్ సోకకుండా అది కాపాడలేదని తెలిపింది. కోవిడ్‌ను చంపేసే లక్షణాలు కూడా నువ్వుల నూనెలో లేవని స్పష్టం చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ ప్రధానంగా వైరస్ సోకిన రోగి పక్కనున్నప్పుడు, ఆ రోగి తుమ్మడం వల్ల, దగ్గడం వల్ల వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
ఇవి తినండి సరి అవుతుంది
ఆధునిక జీవన శైలిలో దేహ కదలికలు తగ్గిపోయాయి. దాంతో జీవక్రియల వ్యవస్థ గాడి తప్పడమూ ఎక్కువైంది. దానికి తోడు చలికాలంలో దేహక్రియల్లో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. వీటన్నింటి కారణంగా ప్రతి పదిమందిలో ఏడుగురు మహిళలు పీరియడ్స్ క్రమం తప్పడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని నివారించడానికి మందుల మీద ఆధారపడాల్సిన పని లేదు. ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. ►చలికాలంలో రోజూ కొద్దిగా బెల్లం తింటూ ఉంటే రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా బెల్లం అరికడుతుంది. ►ముప్పై రోజులు దాటినా కూడా పీరియడ్స్ రాకుండా ఉన్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరలను తీసుకోవాలి. బొప్పాయిలోని ఆస్కార్బిక్ యాసిడ్ ఈస్ట్రోజెన్ హార్మోన్ల మీద ప్రభావం చూపించి సమస్యను సరిదిద్దుతుంది. ఈ సమస్యను పరిష్కరించే మరికొన్ని పండ్లు పైనాపిల్, మామిడి, కమలాలు, నిమ్మ, కివి. ►పచ్చి అల్లం తరుగులో స్వచ్ఛమైన తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇవి హార్మోన్లలో అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. ►స్వచ్ఛమైన పసుపును రోజూ ఆహారంలో తీసుకోవాలి. పీరియడ్స్ ఆలస్యమైతే గ్లాజు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగుతుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ సమస్య తలెత్తదు. పసుపును తేనెతో కలిపి చప్పరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ►పీరియడ్స్ సక్రమంగా రావడం, కండరాల నొప్పిని తగ్గించడంలో కాఫీ కూడా మంచి మందే. కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. ►బీట్రూట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహక్రియలను సక్రమంగా ఉంచుతాయి. ►ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ వాము లేదా వాము పొడి వేసి మరిగించి తాగాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ టీ (కాన్కాక్షన్) తాగితే పీరియడ్ సక్రమం కావడంతోపాటు మెన్స్ట్రువల్ పెయిన్ కూడా ఉండదు. -
చలికి మిరియాల సెగ పెడదాం
శ్రీ ముఖపుస్తకం గారి వంటలు రుచి చూద్దామా! కావలసినవి: నల్ల మిరియాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 1 టేబుల్ స్పూను; అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, పసుపు – పావు టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీస్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►ముందుగా మిక్సీలో నల్ల మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ముప్పావు లీటరు నీళ్లుపోసి మరిగించాక, తయారు చేసి ఉంచుకున్న పొడిని మరుగుతున్న నీళ్లలో వేయాలి ►పసుపు జత చేయాలి ►చింతపండు రసం పోసి కలియబెట్టాలి ►తగినంత ఉప్పు, బెల్లం తరుగు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి మరిగించాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలిపి, మరుగుతున్న మిరియాల చారులో వేసి కలపాలి ►చివరగా కొత్తిమీరతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. shettyskitchen -
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కోసం...
ఇటీవల కాలంలో చాలా మందిని గ్యాస్ సమస్య వేధిస్తోంది. దీనికి రక రకాల మాత్రలు వాడేకంటే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ►కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు. ►రోజూ భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం చాలా మంచిది. దానిని నేరుగా తినలేకపోతే కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని కూడా తినవచ్చు. ►నాలుగైదు వెల్లుల్లి రెబ్బలకు రెండేసి స్పూన్ల ధనియాలు, జీలకర్ర తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించాలి. చల్లారాక వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ►దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తొలగి పోతుంది. ►గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు రోజూ కొబ్బరి నీళ్ళని తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. -
అల్లంతో హైబీపీకి కళ్లెం!
ముంబై: మీకు హైబీపీ ఉందా. దీనిని నియంత్రించుకునేందుకు వందల రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొంటున్నారా? ఇవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని తెలిసినా.. తప్పదని సర్దుకు పోతున్నారా? అయితే, ఇకపై చింతించకండి. నేరుగా వంటగదిలోకి వెళ్లి.. అల్లం ముక్కను తీసుకుని, 4 గ్రాముల ముక్కను తుంచుకుని నమిలి తినండి. రోజూ ఇలా చేయడం ద్వారా హైబీపీతో పాటు రక్తంలోని చక్కెర, శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోవడం ఖాయమని నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలోరిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. అల్లం.. హైబీపీని నియంత్రించే అమృతమని పేర్కొన్నారు. అల్లంపై పలు ప్రయోగాలు చేసిన వీరు.. దీనిలోని రసాయనిక గుణాలు, త్వరగా జీర్ణమయ్యే నూనెలు, ఫెనాల్ కాంపౌండ్స్ వంటివి హైబీపీ నుంచి రక్షణ కల్పిస్తాయని వివరించారు. షుగర్‌తో గుండెకు అధిక ముప్పు! న్యూఢిల్లీ: షుగర్‌తో బాధపడే వారికి గుండెజబ్బుల ముప్పు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. షుగర్ రోగులు ఎక్కువగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. 6కోట్ల మంది వరకూ ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. వీరిలో 3 కోట్లమందికిపైగా ప్రాథమిక లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారేనని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ చెబుతోంది. -
పళ్లెంలో ముత్యాలు
సగ్గుబియ్యం తెల్లగా ఉంటుంది. అందరినీ ఆకర్షిస్తుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది. ప్రొటీన్లను ఇస్తుంది. ముత్యాలను పోలిన రూపం.. రుచికి ప్రతిరూపం. వడియాలు.. పాయసం రొటీన్. లడ్డు, దోసె, కిచిడీ, వడ ట్రై చేయండి. మీ మొగ్గు దీనికే అని చాటి చెప్పండి. సాబుదానా లడ్డు కావలసినవి: సగ్గుబియ్యం – ఒక కప్పు (సన్న సగ్గు బియ్యం); ఎండుకొబ్బరి తురుము – ముప్పావు కప్పు; పంచదార పొడి – అర కప్పు; నెయ్యి – 7 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు 10 (చిన్న ముక్కలు చేయాలి); ఏలకుల పొడి – అర టీ స్పూను; జాజికాయ పొడి – చిటికెడు. తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, సగ్గుబియ్యం వేసి దోరగా వేయించి (సన్న మంట మీద కాస్తంత సమయం పడుతుంది) ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి ►అదే బాణలిలో ఎండు కొబ్బరి తురుము వేసి వేయించాలి ►చల్లారిన సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి, వేగుతున్న ఎండు కొబ్బరికి జత చేసి మరోమారు వేయించాలి ►పంచదార పొడి కూడా జత చేసి రెండు నిమిషాలు బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, సగ్గుబియ్యం పొడి మిశ్రమానికి జత చేయాలి ►ఏలకుల పొడి, జాజికాయ పొడి కూడా జత చేయాలి ►కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు లడ్డూ మాదిరిగా ఉండ కట్టి, ప్లేట్లోకి తీసుకోవాలి ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సాబుదానా దోసె కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; మినప్పప్పు – పావు కప్పు; మెంతులు – అర టీ స్పూను; అటుకులు – పావు కప్పు; బియ్యం – ముప్పావు కప్పు; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో సగ్గు బియ్యం, మినప్పప్పు, మెంతులు, అటుకులు వేసి సుమారు ఆరు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►ఒక పెద్ద పాత్రలో బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►నానబెట్టిన సగ్గు బియ్యం మిశ్రమాన్ని, నానబెట్టిన బియ్యానికి జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి, పన్నెండు గంటల పాటు వదిలేయాలి ►మరుసటి రోజు ఉప్పు జత చేయాలి ►స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు దోసె పిండి వేసి, సమానంగా పరిచి, రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేటులోకి తీయాలి ►కొబ్బరి చట్నీతో వేడివేడిగా అందించాలి. సాబు దానా థాల్పీ కావలసినవి: సగ్గుబియ్యం – ముప్పావు కప్పు; బంగాళదుంపలు – 2; జీలకర్ర పొడి – అర టీ స్పూను; వేయించిన పల్లీలు – 4 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత. తయారీ: ►సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లలో శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటల సేపు నానబెట్టాలి ►నీటిని ఒంపేసి, తడి పోయేవరకు ఆరబెట్టాలి ∙బంగాళ దుంపలను ఉడికించి తొక్క వేరు చేసి, దుంపలను చేతితో మెత్తగా మెదపాలి ►ఒక పాత్రలో సగ్గు బియ్యం, మెదిపిన బంగాళ దుంప వేసి బాగా కలిపి, మిగిలిన పదార్థాలను (నెయ్యి తప్పించి) జత చేసి బాగా కలపాలి ►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక నెయ్యి వేయాలి ►చేతికి కొద్దిగా నూనె పూసుకుని, సగ్గు బియ్యం మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని, పల్చగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా కాల్చాలి ►బంగారు రంగులోకి వచ్చి, బాగా కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకోవాలి ►పెరుగు చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. సాబుదానా కిచిడీ కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; బంగాళ దుంపలు – 2; వేయించిన పల్లీలు – అర కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – ఒక టీ స్పూను; నిమ్మరసం – ఒక టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►సగ్గుబియ్యాన్ని నీళ్లలో శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి సుమారు ఆరు గంటల పాటు నానబెట్టాలి ►నీరు తీసేసి సగ్గు బియ్యాన్ని పక్కన ఉంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్కి తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో పల్లీలు వేయించి, చల్లారాక మిక్సీలో వేసి రవ్వలా పొడి చేయాలి ►పల్లీల పొడి, ఉప్పు, పంచదార జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర వేసి వేయించాలి ►కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ►అల్లం తురుము వేసి మరోమారు వేయించాలి ►తరిగిన బంగాళ దుంప జత చేసి మరోమారు వేయించాక, సగ్గు బియ్యం మిశ్రమం జత చే సి కొద్దిసేపు ఉడికించి (ఎక్కువ ఉడికించకూడదు) దింపేయాలి ►నిమ్మ రసం, కొత్తిమీర తరుగు జత చేయాలి ►కిచిడీ అందించే ముందు కొద్దిగా కొత్తిమీర, నిమ్మ రసం, కొబ్బరి తురుములతో అలంకరించితే బాగుంటుంది వేడివేడిగా అందించాలి. సాబుదానా వడ కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; నీళ్లు – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – రెండు; అల్లం తురుము – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పంచదార పొడి – అర టీ స్పూను; వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను; రాజ్ గిర్ పిండి – 3 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); సైంధవ లవణం – చిటికెడు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర కప్పు నీళ్లు జత చేసి ఒక రోజు రాత్రంతా నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం నీటిని ఒంపేయాలి ►ఒక పాత్రలో సగ్గు బియ్యాన్ని వేసి చేతితో బాగా మెత్తగా అయ్యేలా మెదపాలి ►పల్లీ ముక్కలు, జీడి పప్పు ముక్కలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, జీలకర్ర జత చేసి మెత్తగా అయ్యేలా కలపాలి ►కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ►రాజ్ గిర్ పిండి, కొద్దిగా నీళ్లు జత చేసి వడల పిండి మాదిరిగా కలపాలి ►అర టీ స్పూను పంచదార, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►కొద్దికొద్దిగా పిండి తీసుకుని వడ మాదిరిగా చేతితో ఒత్తాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న వడలను ఒక్కొక్కటిగా వేస్తూ, దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►చింత పండు పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. సాబుదానా చివ్డా కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; పల్లీలు – పావు కప్పు; కిస్మిస్ – పావు కప్పు; జీడి పప్పులు – పావు కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; పంచదార పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి బాగా కాగాక, కొద్దికొద్దిగా (అన్నీ ఒకేసారి వేయకూడదు) సగ్గు బియ్యం వేసి డీప్ ఫ్రై చేసి, బాగా పొంగిన తరవాత కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ►పల్లీలు, కిస్మిస్, జీడి పప్పులను కూడా ఇదే విధంగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►వేయించిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసుకుని, ఉప్పు, పంచదార పొడి, మిరప కారం, పచ్చి మిర్చి తరుగు జత చేసి స్పూను సహాయంతో బాగా కలపాలి ►కొద్దిగా చల్లారాక సర్వ్ చేయాలి. సాబుదానా భేల్ కావలసినవి: సగ్గుబియ్యం – అర కప్పు; బంగాళ దుంప – 1; మిరప కారం – చిటికెడు; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; వేయించిన జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ’ తగినన్ని నీళ్లు జత చేసి ఒక రాత్రంతా నానబెట్టాలి ►బంగాళ దుంప తొక్క తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, బంగాళ దుంప ముక్కలు వేసి, దోరగా వేయించి తీసేయాలి ►ముక్కలు చల్లారాక సన్నగా తురమాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కాగాక సగ్గు బియ్యం వేసి బాగా వేయించాలి ►సగ్గు బియ్యం బాగా ఉడికి, మెత్తబడ్డాక, బంగాళ దుంప తురుము, వేయించిన పల్లీలు, వేయించిన జీడి పప్పులు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, మిరప కారం, చాట్ మసాలా వేసి బాగా కలిపి దింపేయాలి ►కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. సగ్గు బియ్యంతో ఆరోగ్యం ►సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం నుంచి తీసిన పొడితో తయారుచేస్తారు ►సగ్గు బియ్యంతో రకరకాల వంటకాలు తయారుచేస్తారు ►కొన్ని ప్రాంతాలలో ఉపవాసం ఉన్న సమయంలో సగ్గుబియ్యం వంటకాలను మాత్రమే స్వీకరిస్తారు ►పేరులో బియ్యం అని ఉన్నప్పటికీ, ఇది బియ్యం జాతికి సంబంధించినది కాదు ►పాయసం, ఉప్మా, వడియాలు, వడలు, ఇడ్లీలు... ఇలా ఎన్నో రకాల వంటకాలు సగ్గు బియ్యం వల్ల రుచిగా ఉంటాయి ►ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగాను, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి ►బరువు తగ్గాలనుకునేవారికి సగ్గు బియ్యం మంచి ఔషధం ►ఇందులో గంజి ఎక్కువగా ఉంటుంది ►జ్వరం, వాంతులు, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి తక్షణ శక్తి కోసం సగ్గుజావను ఇస్తారు ►సగ్గుబియ్యం తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ►సగ్గు బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి ►కండరాల పటుత్వానికి సగ్గుబియ్యం ఎంతగానో ఉపయోగపడతాయి ►ఇందులో క్యాల్షియం శాతం ఎక్కువే ►రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు సగ్గు బియ్యం మంచి ఉపయోగకారి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఇందులో ఉంది ►గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది ►ప్రతిరోజూ సగ్గు బియ్యాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రోజంతా శక్తిగా ఉండొచ్చు ►అజీర్ణ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది ►వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి కాబట్టి, గర్భిణీలు నిత్యం సగ్గు బియ్యం తీసుకోవచ్చు ►ఇందులో ఉండే విటమిన్ కె కారణంగా మెదడు చురుకు అవుతుంది. -
పనసారా తినండి
విస్తట్లో ఎన్ని కూరలు వడ్డించినా, పనస కూర పడనిదే పొట్ట నిండినట్టు అనిపించదు కొందరికి. రుచులందు పనస రుచి వేరయా అన్నాట్ట వెనకటికి ఓ పనస ప్రియుడు. ఇంకేం మరి.. ఈ శుభకార్యాల సీజన్లో మీ విస్తరిలో పనస రుచిని కూడా పడనివ్వండి. పనసారా తినండి... మనసారా ఆస్వాదించండి. పనస బిర్యానీ కావలసినవి: పనస ముక్కలు – అర కేజీ; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 2; లవంగాలు – 2; ఏలకులు – 1; మరాఠీ మొగ్గ – చిన్నది; జాజి పువ్వు – తగినంత; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; చిక్కటి కొబ్బరి పాలు – 2 కప్పులు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; పుదీనా తరుగు – అర కప్పు తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మసాలా దినుసులు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ►పనస ముక్కలు వేసి బాగా వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరోమారు వేయించాలి ►తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►చిక్కటి కొబ్బరి పాలు జత చేయాలి ►పచ్చి కొబ్బరి తురుము వేయాలి ►తగినన్ని నీళ్లు పోయాలి ∙పుదీనా తరుగు వేయాలి ►బాగా కడిగిన బియ్యం జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత దింపేయాలి. పనస కోఫ్తా కర్రీ కావలసినవి: పనస కాయ ముక్కలు – ఒక కప్పు; బంగాళ దుంప తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 3 (మెత్తగా ముద్ద చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 2; ఎండు మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను తయారీ: ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►పసన ముక్కలను శుభ్రంగా కడిగి, ఆ నీళ్లలో వేసి బాగా ఉడికించాలి ►బాగా చల్లారాక మిక్సీలో వేసి (తడి ఉండకూడదు) ఉప్పు జత చేసి మెత్తగా చేయాలి ►సగం ఉల్లి తరుగును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►మిక్సీలో ఎండు మిర్చి, జీలకర్ర వేసి మెత్తగా చేయాలి ►ఉడికిన పసన ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ►సగం కిస్మిస్లను సన్నగా తరగాలి ►ఒక పాత్రలో మెత్తగా చేసిన పనస ముక్కలు, అల్లం పేస్ట్, ఉల్లి పేస్ట్, పచ్చి మిర్చి తరుగు, సెనగ పిండి, ఉప్పు, పసుపు, మిరప కారం వేసి పునుగుల పిండిలా కొద్దిగా గట్టిగా కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కలిపి ఉంచుకన్న పిండిని చిన్న చిన్న కోఫ్తాలుగా చేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలోనూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►బంగాళదుంప ముక్కలు జత చేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేయాలి ►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఉల్లి పేస్ట్, అల్లం పేస్ట్లను ఒకదాని తరవాత ఒకటి వేసి కలియబెట్టాలి ►తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత ఉంచి ఉడికించి, చల్లారాక మూత తీయాలి ►తయారుచేసి ఉంచుకున్న కోఫ్తాలను జత చేయాలి ►బాగా ఉడికించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలోకి బంగాళదుంప, కోఫ్తాలను కలిపి తింటే రుచిగా ఉంటుంది. పనస తొనల హల్వా కావలసినవి: పనస తొనలు – 6; పనస గింజలు – 6; జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూను; కిస్ మిస్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒక కప్పు; నెయ్యి – ఒక కప్పు తయారీ: ►పనస గింజలను ఉడికించి, తొక్కలు తీసి ముక్కలు చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి ►పనస తొనలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి కరిగించాలి ►జీడి పప్పులు, కిస్ మిస్ వేసి దోరగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►అదే బాణలిలో పనస ముక్కలు వేసి వేయించి, కొద్దిసేపు మూత ఉంచాలి (మంట బాగా తగ్గించాలి) ►మూత తీసి మరోమారు బాగా కలియబెట్టి దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ►పంచదార జత చేసి కరిగే వరకు కలుపుతుండాలి ►పనస గింజల ముద్ద వేసి కలియబెట్టి, బాగా ఉడికించాలి ►పనస ముక్కలు జత చేసి కలియబెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ►జీడిపప్పు, కిస్మిస్లతో అలంకరించి అందించాలి. పనస పొట్టు ఆవపెట్టిన కూర కావలసినవి: పనన పొట్టు – పావు కేజీ; తరిగిన పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – 2 టీ స్పూన్లు; చింతపండు రసం – అర టేబుల్ స్పూను (చిక్కగా ఉండాలి); ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ►పనసపొట్టును శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి మరోమారు వేయించాలి ►పనస పొట్టు వేసి బాగా కలిపి, కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి ►ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి కలియబెట్టాలి ►ఆవాలకు కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా చేసి, కూరలో వేసి మరోమారు కలపాలి ►బాగా ఉడికిన తరవాత కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. పనస కాయ గుజ్జు కూర కావలసినవి: పసన కాయ ముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 10; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; కొత్తిమీర – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పు + గరం మసాలా పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు; కారం – తగినంత; టొమాటో ముక్కలు – ఒక కప్పు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పు పలుకులు – తగినన్ని తయారీ: ►ఒక పాత్రలో పనస ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, మసాలా పేస్ట్ వేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి బాగా కలిపి కుకర్‌లో ఉంచి స్టౌ మీద ఉంచాలి ►మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పసుపు, మిరప కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు కలపాలి ►టొమాటో గుజ్జు వేసి బాగా కలియబెట్టి, ఐదునిమిషాల పాటు ఉడికించాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి ►ఉడికించుకున్న పనస ముక్కల మిశ్రమం జత చేసి కలియబెట్టాలి ►తరిగిన పచ్చి మిర్చి జత చేయాలి ►కొత్తిమీర తరుగు, గరం మసాలా, జత చేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి ►కొద్దిగా కొత్తిమీర, జీడిపప్పులతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. పనస ముక్కల కూర కావలసినవి: పనస ముక్కలు – అర కిలో; ఉల్లి తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; బిర్యానీ ఆకులు – 2; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి + జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; నూనె – 3 టేబుల్ స్పూన్లు; మిరియాల పొడి – పావు టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర – తగినంత. తయారీ: ►మిక్సీలో టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పనస ముక్కలు వేసి బాగా కలిపి, పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►స్టౌ మీ కుకర్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జతచేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి కలపాలి ►టొమాటో, ఉల్లి ముద్ద వేసి బాగా కలిపి, మంట బాగా తగ్గించాలి ►పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టాలి ►వేయించిన పసన ముక్కలు జత చేసి కలియబెట్టాలి ►గ్లాసుడు నీళ్లు పోసి కుకర్ మూత ఉంచి, మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక విజిల్ తీయాలి ►గరం మసాలా జత చేసి కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికించాలి ►కొత్తిమీర వేసి బాగా కలియ బెట్టి రెండు నిమిషాల తరవాత దింపేయాలి . పనస ముక్కల కేరళ కర్రీ కావలసినవి: పనస ముక్కలు – అర కేజీ; ఉప్పు – తగినంత; ధనియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; లవంగాలు – 3; ఎండు మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను; కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4 ; టొమాటో ప్యూరీ – ఒక కప్పు; ఉప్పు – తగినంత తయారీ: ►ఒక పాత్రలో పనస ముక్కలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►మరో స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు వేసి వేయించాలి ►జీలకర్ర, లవంగాలు జత చేసి మరోమారు వేయించి దింపేయాలి ►మిక్సీలో ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాల మిశ్రమం, కొబ్బరి తురుము, చింత పండు గుజ్జు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో ప్యూరీ జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పసన ముక్కలను ఇందులో వేసి కలియబెట్టాలి ►మిక్సీ పట్టిన పదార్థాల మిశ్రమం జత చేసి, బాగా కలియబెట్టాలి ►తగినంత ఉప్పు జత చేసి కలియబెట్టి, మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత దింపేయాలి. పనస గింజలు – పెసర పప్పు కూర కావలసినవి: పనస గింజలు – పావు కేజీ; పెసర పప్పు – 100 గ్రా.; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను తయారీ: ►ఒక గిన్నెలో పెసర పప్పుకు కొద్దిగా నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►పనస గింజలకు తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక మూత తీసి, గింజలను బయటకు తీసి, తొక్క వేరు చేయాలి ►గింజలను మధ్యకు కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి ►ఉడికించిన పెసర పప్పు, పనస గింజలు జత చేసి బాగా కలియబెట్టాలి ►పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. పసందైన పనస మార్కెట్లో రెడీమేడ్‌గా పనస పొట్టు దొరుకుతుంది. మనకు ముక్కలుగా కావాలంటే అలాగే ముక్కలుగా కూడా అమ్ముతారు. ఇంటి దగ్గర పనస పొట్టు ఎలా చేసుకోవాలి... ►దోరగా ఉన్న పనస కాయను ముందుగా శుభ్రంగా కడగాలి ►పనసకాయ కత్తికి నువ్వుల నూనె పూసి, కాయ పైన ముళ్లుగా ఉండే భాగాన్ని అంగుళం మందంలో చెక్కేయాలి ►పనస కాయకు నిండుగా నూనె పూయాలి ►పెద్ద ముక్కలు కావాలనుకుంటే ఆ పరిమాణంలోకి కట్ చేయాలి ►పనస పొట్టు కావాలనుకుంటే, అదే కత్తితో సన్నగా పొట్టులా వచ్చేవరకు కొట్టాలి ►పొట్టులో కూడా కొద్దికొద్దిగా నువ్వుల నూనె, పసుపు కలుపుతుండాలి. పనస తొనలు కావాలనుకుంటే... ►బాగా పండి, ఘుమఘుమలాడే పనస కాయను తెచ్చుకోవాలి ►పనస కాయ కత్తికి నూనె పూసి, పనస కాయను మధ్యకు చీల్చాలి ►చేతికి నూనె పూసుకుని, ఒక్కో తొనను చేతితో జాగ్రత్తగా బయటకు తీయాలి ►కొందరు పనస పెచ్చులతో కూడా పులుసు తయారుచేసుకుంటారు (సొర కాయ పులుసు మాదిరిగా) ►పనస తొనలలో ఉండే గింజలను వేరు చేసి, తగినంత ఉప్పు జత చేసి ఉడికించి తింటే రుచిగా ఉంటాయి ►వంకాయలకు ఈ గింజలు జత చేసి కూర చేస్తే రుచిగా ఉంటుంది ►పనస తొనలతో పాయసం కూడా చేసుకుంటారు ►పనస బిర్యానీ ఇప్పుడు పెళ్లిళ్లలో లేటెస్ట్ వంటకం. తండ్రి గర గర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్యమాణిక్యాలు... ఏంటో చెప్పుకోండి చూద్దాం. పనసకాయ... అంతేగా. చిన్నప్పటి నుంచి ఈ పండుకి సంబంధించిన పొడుపు కథ వింటూనే పెరిగాం. ►ప్రపంచంలోనే అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. ఒక్కో పండు దాదాపు 35 కిలోల బరువు, 90 సెం.మీ. పొడవు, 50 సెం.మీ. వ్యాసంలో ఉంటుంది. పనస కాయను కోసేటప్పుడు చేతికి, చాకుకి కూడా తప్పనిసరిగా నూనె పూయాలి ►పనస తొనలలో అన్నిరకాల పోషకాలు ఉంటాయి ►దీనిని సంస్కృతంలో స్కంద ఫలం అంటారు ►విందు భోజనాల సమయంలో ఈ కూరను తప్పనిసరిగా తయారుచేస్తారు ►జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది ►వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది ►రక్తపోటును తగ్గిస్తుంది ►వేడి చేసిన పనస ఆకులను గాయాల మీద ఉంచితే త్వరగా ఉపశమనం లభిస్తుంది ►అధిక బరువును మలబద్దకాన్ని తగ్గిస్తుంది ►కొద్దిగా తయారయిన కాయను కోసి, పండ బెట్టుకుంటేనే పనస పండుకి రుచి ►ఇందులో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి ►విటమిన్ ఏ, బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి ►ఇందులో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది ►పనస చెక్కతో తయారైన వీణలు శ్రేష్ఠమైనవి ►చిన్న చిన్న పడవల తయారీకి పసన చెక్కను ఉపయోగిస్తారు ►పనసాకులను విస్తరాకులుగా ఉపయోగిస్తారు ►పనస ఆకులలో ఇడ్లీ పిండి వేసి, ఇడ్లీలు కూడా తయారుచేస్తారు. వీటిని పొట్టిక్కలు అంటారు ►పనస వేర్లతో ఫొటో ఫ్రేములు తయారుచేస్తారు. -
అండుకొర్రల వంటలు
అండు కొర్రల కిచిడీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు అండు కొర్రల రవ్వ – ఒక కప్పు ఉప్పు – తగినంత ఆవాలు – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – అర కప్పు తరిగిన పచ్చి మిర్చి – 4 అల్లం తురుము – అర టీ స్పూను వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను తరిగిన టొమాటో – 1 కరివేపాకు – రెండు రెమ్మలు పసుపు – కొద్దిగా నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు, పసుపు వేసి మరోమారు కలియబెట్టాలి. మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. పెసర పప్పు, అండు కొర్రల రవ్వ వేసి కలియబెట్టాలి. మంట బాగా తగ్గించాలి. గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? అండుకొర్రలు (Browntop Millet) నియాసిన్ (Niacin)mg (B3) 18.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.027 థయామిన్ (Thiamine) mg (B1) 3.2 కెరోటిన్(Carotene)ug 0 ఐరన్ (Iron)mg 0.65 కాల్షియం (Calcium)g 0.01 ఫాస్పరస్ (Phosphorous)g 0.47 ప్రొటీన్ (Protein)g 11.5 ఖనిజాలు(Carbo Hydrate) g 69.37 పిండిపదార్థం (Fiber) g 12.5 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 5.54 అండు కొర్రల పొంగలి కావలసినవి: అండు కొర్రలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పుకొబ్బరి పాలు – 2 కప్పులు, ఉప్పు – తగినంతమిరియాల పొడి – పావు టీ స్పూను జీలకర్ర – ఒక టీ స్పూను, జీడి పప్పులు – 10కరివేపాకు – 2 రెమ్మలు, నెయ్యి/నూనె – తగినంత తయారీ: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఒక పాత్రలో అండు కొర్రలు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జత చేసి కలియబెట్టాలి. ఉడికించిన పెసర పప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి. స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర, జీడి పప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో అందిస్తే రుచిగా ఉంటుంది. అండు కొర్రల ఊతప్పం కావలసినవి: అండు కొర్రలు – పావు కప్పు మినప్పప్పు – ఒక టేబుల్ స్పూనుఅల్లం పచ్చిమిర్చి ముద్ద – ఒక టీ స్పూను ఉప్పు – తగినంత, నూనె – తగినంతటొమాటో తరుగు – 2 టేబుల్ స్పూన్లుకొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరవాత (రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. అండు కొర్రల ఉప్మా కావలసినవి: అండు కొర్రల రవ్వ – 3 కప్పులు, నూనె – రెండు టేబుల్ స్పూన్లుపచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను, మినప్పప్పు – ఒక టేబుల్ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – 4, క్యారట్ తరుగు – పావు కప్పు, టొమాటో తరుగు – పావు కప్పుకరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం తురుము – ఒక టీ స్పూనుఉప్పు – తగినంత తయారీ: స్టౌ మీద బాణలి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి (నూనె వేయకూడదు) దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, క్యారట్ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.