global economy
-
Vibrant Gujarat Global Summit 2024: విశ్వమిత్ర భారత్
గాందీనగర్: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో భారత్ నూతన ఆశారేఖగా ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ దేశాలు భారత్‌ను స్థిరత్వానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా, నమ్మకమైన మిత్రదేశంగా, భాగస్వామిగా, గ్లోబల్ ఎకానమీలో గ్రోత్ ఇంజన్‌గా, గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా, టెక్నాలజీ హబ్‌గా, ప్రజాస్వామ్యసౌధంగా పరిగణిస్తున్నాయన్నారు. మారుతున్న ప్రపంచ క్రమంలో విశ్వమిత్రగా భారత్ అవతరిస్తోందన్నారు. గాం«దీనగర్‌లో బుధవారం పదో ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు’ ప్రారం¿ోత్సవంలో మోదీ ప్రసంగించారు. త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని రేటింగ్ ఏజెన్సీలన్నీ చెబుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు వాటిని సాధించగలమన్న విశ్వాసాన్ని ప్రపంచానికి భారత్ ఇస్తోందన్నారు. పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ అభివృద్ధికి, శ్రేయస్సుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రాధాన్యతలు, ఆకాంక్షలు ఒక ఆధారంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. ఇండియా ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి, ఆధునిక మౌలిక వసతులు, నూతన తయారీ రంగం, కొత్తతరం నైపుణ్యాలు, భవిష్యత్తు టెక్నాలజీ, కృత్రిమ మేధ, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. గత పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టామని, మన ఆర్థిక వ్యవస్థకు ఈ సంస్కరణలే చోదకశక్తిగా మారుతున్నాయని వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని, 25 ఏళ్ల తర్వాత 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నాయని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అమృత కాలమని ఉద్ఘాటించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్యాన్ని ఈ అమృత కాలంలో సాధించుకోవాలని ప్రజలను పిలుపునిచ్చారు. విదేశీ పెట్టుబడులకు వెల్కం మనందరి ఉమ్మడి కృషి వల్ల 21వ శతాబ్దంలో ఇండియాకు ఉజ్వలమైన భవిష్యత్తు లభించబోతోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది జీ20 కూటమికి భారత్ సారథ్యం వహించిందని, ప్రపంచ భవిష్యత్తు కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అందించిందని తెలియజేశారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్ఏ) గ్రూప్‌తోపాటు ఇతర బహుముఖీన సంస్థలతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటూ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని, 40 వేలకుపైగా కాలం చెల్లిన నిబంధనలను సులభతర వాణిజ్య విధానం, జీఎస్టీ కింద రద్దు చేశామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్శించడానికి, గ్లోబల్ బిజినెస్‌కు ఇండియాను గమ్యస్థానంగా మార్చడానికి మూడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై(ఎఫ్‌టీఏ) సంతకాలు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పలు కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహా్వనిస్తున్నామని అన్నా రు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టామని వివరించారు. గత పదేళ్లలో పెట్టుబడి వ్యయాన్ని 10 రెట్లు పెంచామన్నారు. టెక్నాలజీతో జీవితాల్లో మార్పు గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీలో మూడు రెట్లు, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 20 రెట్లు ప్రగతి నమోదైందని తెలిపారు. గత పదేళ్లలో చౌక ధరకే ఫోన్లు, డేటా వంటివి దేశంలో సరికొత్త డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాయని అన్నారు. ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్, 5జీ టెక్నాలజీ రాకతో సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వచి్చందని చెప్పారు. 2028కల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి సంపన్న దేశంగా మారుతుందన్నారు. -
పశ్చిమాసియా ప్రభావం పడనుందా?
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య మొదలైన యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఉండనుంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉండగా, ఈ పరిస్థితులను ఈ సంక్షోభం మరింత దిగజార్చనుంది. రానున్న రోజుల్లో ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ముడిచమురు ధరలు పైకి ఎగబాకడం మొదలైంది. సంక్షోభం తొందరగా ముగియకపోతే సప్లై చెయిన్ మేనేజ్మెంట్ అంశాలపై ప్రభావం తప్పదు. భారత్ విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లు బాహ్య ఘటనల ఒత్తిడిని తట్టుకుని నిలిచాయని ప్రపంచబ్యాంకు లాంటివి ప్రశంసించాయి. కానీ, ఈ ధోరణి ఎంత కాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సిన అంశం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితి కొంచెం సర్దుకున్న నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ఈ మధ్యే వరుస వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేసింది. ఈ పరిణామాల ప్రభావానికి భారత్ అతీతంగా ఉండే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గత వారమే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడాన్ని ప్రస్తావిస్తూ భౌగోళిక, రాజకీయ పరమైన ఉద్రిక్తతలు దేశీయ అంచనాలను తల్లకిందులు చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దహనకాండ ఈ ఏడాదిఅంచనాలను, వృద్ధిపై ఉన్న సానుకూల దృక్పథాన్ని కచ్చితంగా దెబ్బ తీయనుంది. అంతేకాదు... రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పెద్దగా సోకని దేశంగా భారత్‌కు ఉన్న మంచిపేరు కూడా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. రెండవ అంతర్జాతీయ స్థాయి ఘర్షణ... 2023–24 సంవత్సరానికిగాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్... భారత్‌పై ఎక్కువ అంచనాలే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ప్రపంచానికి గ్రోత్ ఇంజిన్ గా భారత్‌ను అభివర్ణించారు ఆయన. అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్నా, ఈ ఏడాది జీడీపీ వృద్ధి 6.5 శాతం ఉంటుందని పునరుద్ఘాటించారు. కానీ, అతితక్కువ కాలంలో ప్రపంచం రెండో యుద్ధాన్ని చూస్తోంది. ఈ ఘటన పర్యవసానాలు కచ్చితంగా ఎదుర్కోక తప్పదు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే ఉన్న పలు లోపాలు పరిస్థితిని అధ్వాన్నం చేయనున్నాయి. ఈ క్రమంలో మొదటగా మర్చండైజ్ (వస్తువులు) ఎగుమతులు తగ్గిపోనున్నాయి. తొమ్మిది నెలలుగా ఇవి దిగజారిపోతున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) మర్చండైజ్ ఎగుమతుల విలువ 172.95 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలానికి ఎగుమతుల విలువ 196.33 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. యూరప్, యూఎస్‌లలో మాంద్యపు ధోరణలు కనిపిస్తున్నాయనేందుకు మర్చండైజ్ ఎగుమతులు తగ్గిపోవడం ఒక నిదర్శనం. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, వడ్డీ రేట్లు వేగంగా పెరగడం కూడా ఎగుమతుల మందగమనానికి కారణాలుగా చెబుతున్నారు. మర్చండైజ్ ఎగుమతుల్లో జరిగిన నష్టాన్ని సేవల రంగం ఎగుమతులు కొంత వరకూ భర్తీ చేసిప్పటికీ ఇప్పుడు ఇవి కూడా తగ్గి పోతున్నాయి. గత ఏడాది 26.5 బిలియన్ డాలర్లుగా ఉన్న సర్వీసెస్ ఎగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 26.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అమెరికా తదితర దేశాల్లోని అధిక వడ్డీల కారణంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం దీనికి కారణమని ఒక అంచనా. కానీ, తాజాగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య మొదలైన ఘర్షణ పరి స్థితిని మరింత దిగజార్చడం ఖాయం. భారత ఆర్థిక వ్యవస్థ మరో బలహీనత... భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మరో బలహీనత ముడిచమురు. దేశీయ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే పూరించుకుంటున్నాం. గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్లు అతలా కుతలమయ్యాయి. ముందుగా బాగా పైకి ఎగబాకిన ధరలు కొన్ని నెలల తరువాత స్థిమితపడ్డాయి. ఈ ఏడాది మొదట్లో తగ్గుముఖం పట్టే ధోరణి మొదలై జూన్ నెలలో బ్యారెల్‌కు 75 – 80 డాలర్ల స్థాయికి చేరింది. మన ఖజానా తట్టుకోగల స్థాయి ఇది. అయితే సౌదీ అరే బియా, రష్యా దేశాలు జూలైలో ముడిచమురు కార్టెల్ ‘ఓపెక్+’ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ)ను ఉత్పత్తిని మరింత తగ్గించాలని ఒత్తిడి చేశాయి. సెప్టెంబరు వరకూ ఈ కోత కొనసాగడంతో చమురు ధరలు పెరగడం మొదలైంది. గత వారం కొంచెం తగ్గినా పశ్చిమాసియా సంక్షోభం పుణ్యమా అని మళ్లీ ఇప్పుడు ఎక్కువ కావడం మొదలైంది. జాగరూకత అవసరం... ఒకవైపు ముడి చమురు ఎగుమతుల బిల్లులు పెరిగి పోతూండటం, ఇంకోవైపు ఎగుమతులు మందగిస్తున్న నేపథ్యంలో కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కరెంట్ అకౌంట్ లోటు 2022–23లో జీడీపీలో 2.1 శాతం వరకూ ఎగబాకినా... ఈ ఆర్థికసంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ –జూన్) 1.1 శాతానికి పరి మితం కావడం కొంత ఊరటనిచ్చే అంశం. కానీ ముడిచమురు ధరలు నియంత్రణలో లేకపోయినా, ఎగుమతులు పుంజుకోకపోయినా లోటు మళ్లీ పెరగడం ఖాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎక్కువయ్యేందుకు ఉన్న మరో అవరోధం ద్రవ్యోల్బణం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తొందరగా ముగియకపోతే సప్లై చెయిన్ మేనేజ్మెంట్ అంశాలపై ప్రభావం తప్పదు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది ఈ అంశాలు పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ గ్యాస్ ధరలు తగ్గడం, కాయగూరల ధరలు కూడా సర్దుకుంటున్న నేపథ్యంలో సమీప కాలంలో ద్రవ్యోల్బణం కొంచెం నియంత్రణలోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ధీమాగా ఉంది. కానీ భవిష్యత్తు అంచనాల విషయానికి వస్తే మాత్రం పప్పుదినుసులు, కాయగూరలు, మసాలాలపై ఆర్బీఐ తన దృష్టిని కేంద్రీకరించింది. ఇదే సమయంలో ఎల్‌నినో పరిస్థితులపై ఆర్బీఐ కొంత ఆతురతను వ్యక్తం చేస్తోంది. అయితే, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు ద్రవ్యోల్బణం విషయంలో ఊహించినదాని కన్నా ఎక్కువ ఒత్తిడి చూపే అవకాశం ఉంది. ఎల్లప్పుడూ అంతర్జాతీయ సంక్షోభాలకు సున్నితంగా ఉండే దేశీయ స్టాక్ మార్కెట్ల మీద పశ్చిమాసియా ఘర్షణ తక్షణ ప్రభావం చూపింది. కాకపోతే వర్షాకాలం నిలకడగా లేకపోయినా, అంతర్గత డిమాండ్లు పెరిగితే ఈ మార్కెట్లు కోలుకోగలవు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమ పండగ సీజన్ పైనే ఆశలన్నీ పెట్టుకుంది. కార్లు, ఎఫ్ఎంసీజీ(వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువులు) రంగాల్లో అమ్మకాలు ఇప్పటికే వారికి శుభ సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచ మార్కెట్లు డీలా పడిపోతూంటే... దేశీ మార్కెట్లు మాత్రం హడావుడిగా ఉండటం ఒక ధోరణిగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా ఏళ్లుగా ఒడిదుడుకులకు లోనవుతూండగా కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధాలు వాటిని తీవ్రతరం చేశాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్) ఇప్పటికే ప్రపంచ వృద్ధి రేటును తగ్గించేసింది. 2022లో ఇది 3.5 శాతంగా ఉంటే, ఈ ఏడాది 3 శాతా నికి పరిమితం కావచ్చునని అంటోంది. 2024లో ఇది మరి కొంచెం తగ్గి 2.9 శాతానికి చేరుతుందని చెబుతోంది. భారత్ విషయానికి వస్తే ప్రపంచబ్యాంకు లాంటివి భారతీయ మార్కెట్లు బాహ్య ఘటనల ఒత్తిడిని తట్టుకుని నిలిచాయని ప్రశంసించాయి. కానీ, ఈ ధోరణి ఎంత కాలం కొనసాగుతుందనేదివేచి చూడాల్సిన అంశం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తొంద రగా ముగుస్తుందా? లేక మరింత వ్యాపిస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానాల్లో భారతీయ మార్కెట్ల నిలకడతనం పరీక్ష కూడా ఉందని చెప్పాలి. సుష్మా రామచంద్రన్ - వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్‌లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్‌లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఐదో స్థానానికి భారత్
దొండపర్తి (విశాఖ దక్షిణ):ప్రపంచ ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. విశాఖ పోర్టులో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూ.96 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి సోమవారం ప్రారంభించారు పోర్టులో రూ.237 కోట్లతో పూర్తి చేసిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోరేజ్ షెడ్లతోపాటు ఓఆర్ బెర్తుల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ 2015లో ప్రారంభించిన సాగరమాల కార్యక్రమం ద్వారా రూ.5.60 లక్షల పెట్టుబడులతో పోర్టుల ఆధునికీకరణను చేపట్టినట్టు వెల్లడించారు. ఫలితంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో భారతీయ ఓడరేవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌లో ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించే అవకాశం ఉందన్నారు. కేంద్ర షిప్పింగ్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ మాట్లాడుతూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను దేశంలోనే ప్రముఖ క్రూయిజ్ టూరిజం డెస్టినేషన్‌గా తీరిదిద్దాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పరిశ్రమ వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్ విశాఖకు మైలురాయి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖలో పర్యాటకాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుబే, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గణబాబు పాల్గొన్నారు. -
RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..
ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ మందగించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్ స్పష్టం చేసింది. భారత్‌లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్ పేర్కొనడం గమనార్హం. ► గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం. తొలి అంచనాలకన్నా ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట పడింది. ► ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది. ► కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్టీఏఆర్టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. -
ప్రపంచ ఎకానమీలో భారత్ వెలుగులు
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ‘‘ప్రకాశవంతమైన ప్రాంతం‘గా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జివా అన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని భారత్‌లో పర్యటించనున్న ఆమె అంచనా వేశారు. కరోనా మహమ్మారి సమస్య నుంచి ప్రపంచంలోని ఐదవ–అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ‘‘డిజిటలైజేషన్’’ బయటపడవేయగలిగిందన్నారు. దీనికితోడు దేశం అనుసరిస్తున్న వివేకవంతమైన ఆర్థిక విధానం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో మూలధన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ (33 శాతం పెంపుతో రూ.10 లక్షల కోట్లకు) బడ్జెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం దేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని జార్జివా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు తెలిపిన అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► 2022–23లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.1%గా ఉంటుందన్నది మా అభిప్రాయం. ఆయా గణాంకాలు దేశాన్ని ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుపుతాయి. ► ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధి అభినందనీయం. ► భారత్ ఎకానమీ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలాగా కాస్త నెమ్మదించినప్పటికీ, ప్రపంచ సగటు కంటే, భారత్ వృద్ధి వేగం ఎక్కువగా ఉంది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా దాదాపు 15 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► దేశాన్ని ‘గ్రీన్ ఎకానమీ’ వైపు మళ్లించడానికి, తద్వారా వృద్ధిని కొనసాగించడానికి పునరుత్పాదక ఇంధనాలతో సహా వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడంపై భారతదేశం ఎంత శ్రద్ధ కనబరుస్తోందో నేను ప్రత్యేకంగా గమనించాను. -
భారత్ నాయకత్వ పాత్ర పోషించాలి
దావోస్: భారత్ ఇటీవలి కాలంలో మార్పు దిశగా చక్కని వైఖరి ప్రదర్శించిందని, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలంగా పైకి తీసుకొచ్చేందుకు భారత్ నాయతక్వం పోషించాల్సిన స్థానంలో ఉన్నట్టు టాటా గ్రూపు చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా.. ‘10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మార్గం’ అనే అంశంపై చర్చా కార్యక్రమంలో చంద్రశేఖరన్ పాల్గొన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో భారత్ ప్రావీణ్యం సంపాదించినట్టు చెప్పారు. భారత్ అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని, భారత్‌ను అనుకూల స్థితిలో ఉంచేందుకు కారణమైన అంశాల్లో ఇది కూడా ఒకటన్నారు. ‘‘భారత్ కరోనా సమయంలో గొప్ప పనితీరు చూపించింది. కావాల్సిన టీకాలను భారత్‌లోనే తయారు చేసుకోవడాన్ని చూశాం. డిజిటల్ దిశగా అనూహ్యమైన మార్పును చూస్తున్నాం. నా వరకు వృద్ధి, వృద్ధి, వృద్ధి అన్నవి ఎంతో ముఖ్యమైనవి. ప్రపంచం పుంజుకోవాలని చూస్తోంది. సరఫరా వ్యవస్థ సహా నాయకత్వం వహించాల్సిన స్థానంలో భారత్ ఉంది’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. భారత్‌కు అపార అవకాశాలున్నాయంటూ.. హెల్త్‌కేర్, పర్యాటకం తదితర రంగాల్లో ముఖ్య పాత్ర పోషించగలదన్నారు. భారత్‌కు ఏటా కోటి మంది పర్యాటకులు ప్రస్తుతం వస్తుండగా, 10 కోట్ల మందిని ఆకర్షించే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను నిర్మించాలని, ఎయిర్ పోర్ట్‌లు, ఉపరితల రవాణా, షిప్పింగ్ విభాగాల్లో ఎన్నో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అన్ని లక్ష్యాలను 25 ఏళ్ల అమృత కాలంలో సాధించొచ్చన్నారు. కరోనా సమయంలో భారత్ ఎన్నో అంశాల్లో తన సామర్థ్యాలను నిరూపించుకున్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను భారత్ సునాయాసంగా సాధించగలదన్నారు. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందనడం తొందరపాటే..
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
దేశం... ధనవంతుల భోజ్యం?
బలవంతుడిదే రాజ్యం అని లోకోక్తి. కానీ, ఇప్పుడు ధనవంతుడిదే రాజ్యం. ఈ సమకాలీన సామాజిక పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నదే అయినా, తాజాగా లెక్కలతో సహా వెల్లడైంది. ప్రభుత్వేతర సంస్థ ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ తన తాజా ప్రపంచ సంపద నివేదికలో ససాక్ష్యంగా కుండబద్దలు కొట్టింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన ఈ నివేదికలోని అంశాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కరోనా కాలం నుంచి ప్రపంచమంతటా ఆర్థిక అంతరాలు బాగా పెరిగాయన్న వాదన అక్షరాలా నిజ మని రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, నిరుద్యోగం పెరిగిన వేళ ప్రపంచంలోనూ, భారత్‌లోనూ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే పోగుపడుతుండడం ఆందోళనకరం. 2020 నుంచి కొత్తగా సమకూరిన 42 లక్షల డాలర్లలో మూడింట రెండు వంతుల సంపద ప్రపంచంలోని ఒకే ఒక్క శాతం అపర కుబేరుల గుప్పెట్లో ఉంది. మిగతా ప్రపంచ జనాభా సంపాదించిన సొమ్ముకు ఇది దాదాపు రెట్టింపు అనే నిజం విస్మయపరుస్తుంది. మన దేశానికొస్తే అగ్రశ్రేణి ఒక్క శాతం మహా సంపన్నుల చేతిలోనే 2012 నుంచి 2021 మధ్య జరిగిన సంపద సృష్టిలో 40 శాతానికి పైగా చేరింది. ఇక, దేశ జనాభాలో అడుగున ఉన్నవారిలో సగం మంది వాటా మొత్తం 3 శాతమే. కరోనా వేళ ధనికులు మరింత ధనవంతులయ్యారు. కరోనాకు ముందు భారత్‌లో 102 మంది బిలి యనీర్లుంటే, ఇప్పుడు వారి సంఖ్య 166కు పెరిగింది. కరోనా నుంచి గత నవంబర్‌కు దేశంలో శత కోటీశ్వరుల సంపద 121 శాతం పెరిగింది. మరోమాటలో నిమిషానికి 2.5 కోట్ల వంతున, రోజుకు రూ. 3,068 కోట్లు వారి జేబులో చేరింది. కనివిని ఎరుగని ఈ తేడాలు కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. అలాగే, సంపన్నుల కన్నా, పేద, మధ్యతరగతి వారిపైనే అధిక పన్ను భారం పడుతోందన్న మాట ఆగి, ఆలోచించాల్సిన విషయం. భారత్‌లో జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయంలో 64 శాతం జనాభాలోని దిగువ సగం మంది నించి ప్రభుత్వం పిండుతున్నదే. అగ్రస్థానంలోని 10 శాతం ధనికుల ద్వారా వస్తున్నది 4 శాతమే అన్న మాట గమనార్హం. ఇవన్నీ సముద్రంలో నీటిబొట్లు. భారతదేశం శరవేగంతో కేవలం సంపన్నుల రాజ్యంగా రూపాంతరం చెందుతోందన్న అంచనా మరింత గుబులు రేపుతోంది. ధనికుల దేవిడీగా మారిన వ్యవస్థలో దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్‌లు, మహిళలు, అసంఘటిత కార్మికుల లాంటి అణగారిన వర్గాల బాధలకు అంతమెక్కడ? అర్ధాకలితో అలమటిస్తున్నవారికీ, మధ్యతరగతికీ మెతుకు విదల్చడానికి సందేహిస్తున్న పాలకులు జేబు నిండిన జనానికి మాత్రం గత బడ్జెట్లోనూ కార్పొరేట్ పన్నుల్లో తగ్గింపు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం విడ్డూరం. ధనికులకు పన్ను రాయితీలిస్తే, వారి సంపద క్రమంగా దిగువవారికి అందుతుందనేది ఓ భావన. అది వట్టి భ్రమ అని ఆక్స్‌ఫామ్ తేల్చేసింది. కొద్దిరోజుల్లో కొత్త బడ్జెట్ రానున్న వేళ పెరుగుతున్న ఆర్థిక అంతరాన్ని చక్కదిద్దడానికి సంపద పన్ను విధించాలంటోంది. పేద, గొప్ప తేడాలు ఇప్పుడు ఎంతగా పెరిగాయంటే, భారత్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి 10 మంది కుబేరులపై 5 శాతం పన్ను వేసినా చాలు. దాంతో దేశంలో పిల్లలందరినీ మళ్ళీ బడి బాట పట్టించవచ్చు. దేశంలోకెల్లా మహా సంపన్నుడైన గౌతమ్ అదానీ సంపద నిరుడు 2022లో 46 శాతం మేర పెరిగింది. దేశంలోని అగ్రశ్రేణి 100 మంది అపర కుబేరుల సమష్టి సంపద ఏకంగా 66 వేల కోట్ల డాలర్లకు చేరింది. అదానీ ఒక్కరికే 2017 – 2021 మధ్య చేకూరిన లబ్ధిపై 20 శాతం పన్ను వేస్తే, రూ. 1.79 లక్షల కోట్లు వస్తుంది. దాంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50 లక్షల పైమందికి ఏడాదంతా ఉపాధినివ్వవచ్చని ఆక్స్‌ఫామ్ ఉవాచ. ఈ అంచనాలు తార్కికంగా బాగున్నా, ఆచరణాత్మకత, గత అనుభవాలను కూడా గమనించాలి. సంపద పన్ను సంగతే తీసుకుంటే, మనదేశంలో 1957లోనే దాన్ని ప్రవేశపెట్టారు. కానీ, భారీ ఎగవేతలతో లాభం లేకపోయింది. అసమానతలూ తగ్గలేదు. చివరకు, సంపద పన్ను వసూళ్ళతో పోలిస్తే, వాటి వసూలుకు అవుతున్న ఖర్చు ఎక్కువుందంటూ 2016–17 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాన్ని ఎత్తేశారు. అందుకే, మళ్ళీ సంపద పన్ను విధింపు ఆలోచనపై సమగ్రంగా కసరత్తు అవసరం. పన్నుల వ్యవస్థలో మార్పులు తేవాలి. కాకుంటే, భారత్ లాంటి దేశంలో మధ్యతరగతిని పక్కనపెడితే, మహా సంపన్నులపై ఏ పన్ను వేసినా, అడ్డదోవలో దాన్ని తప్పించుకొనే పనిలో ఉంటారనేది కాదనలేని వాస్తవం. కాబట్టి, భారీ పన్నుల ప్రతిపాదన కన్నా దేశ సామాజిక – ఆర్థిక విధానంలో వారిని భాగం చేయడం లాంటి ఆలోచనలు చేయాలి. విద్య, వైద్యం, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనల్లో ఈ కుబేరుల సంపదను పెట్టేలా చూడాలి. దారిద్య్ర నిర్మూలనకు కార్పొరేట్ అనుకూలత కన్నా సామాన్య ప్రజానుకూల విధానాలే శరణ్యం. స్త్రీ, పురుష వేతన వ్యత్యాసాన్నీ నివారించాలి. కార్పొరేట్ భారతావనిలో సీఈఓలు ఓ సగటు మధ్యశ్రేణి ఉద్యోగితో పోలిస్తే 241 రెట్ల (కరోనాకు ముందు ఇది 191 రెట్లు) ఎక్కువ జీతం సంపాదిస్తున్న వేళ... సత్వరం ఇలాంటి పలు దిద్దుబాటు చర్యలు అవసరం. గత 15 ఏళ్ళలో 41 కోట్లమందిని దారిద్య్ర రేఖకు ఎగువకు తెచ్చామని లెక్కలు చెప్పి, సంబరపడితే చాలదు. ఇప్పటికీ అధికశాతం పేదసాదలైన ఈ దేశంలో ఆర్థిక అంతరాలు సామాజిక సంక్షోభానికి దారి తీయక ముందే పాలకులు విధానపరమైన మార్పులు చేయడమే మార్గం. -
2023లో ప్రపంచ ఎకానమీ ఒడిదుడుకులు!
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకానమీలో ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సన్యాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి సంఖ్యలను పదేపదే డౌన్గ్రేడ్లు చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే 2023 సంవత్సరం కూడా కష్టతరమైనదని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించారు. ఎకానమీకి సంబంధించి ఆయన ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరిగిపోకుండా చర్యలు అవసరమే. ఒకే దేశంలో వాణిజ్యలోటు తీవ్రంగా పెరిగిపోకుండా పలు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మనకు కావాల్సిన ఉత్తులను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య చైనాతో వాణిజ్యలోటు 51.1 బిలియన్ డాలర్లకు తాకిన నేపథ్యంలో సన్యాల్ ఈ వ్యాఖ్యలు చేశారు) ► భారతదేశ మొత్తం సరుకు వాణిజ్య లోటు పెరిగిన మాట వాస్తవమే. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం, మిగిలిన ప్రపంచం మందగించడం దీనికి కారణం. ► ఇక భారత్ నుంచి ఎగుమతుల పెంపునకూ వ్యూహ రచన జరుగుతోంది. ఇక్కడ మనం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌నూ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పీఎల్ఐ పథకం లక్ష్యం– దేశీయ తయారీని ప్రపంచవ్యాప్త పోటీ వేదికపై నిలబెట్టడం, తయారీ రంగంలో ప్రపంచ ఛాంపియన్లను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం. ► తూర్పు యూరప్‌లో ఇబ్బందులు, చైనాలో కోవిడ్ కేసుల విజృంభన వంటి అంశాలు భారత్‌సహా ప్రపంచంలోని పలు ఎకానమీలపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అయితే సవాళ్లను తట్టుకుని నిలబడగలిగే స్థితిలో భారత్ ఉంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ వ్యవస్థగా కొనసాగుతోంది. 2023–24లో కూడా ఇదే హోదా కొనసాగిస్తుందన్న విశ్వాసం ఉంది. ► కాగా, కోవిడ్ తిరిగి తీవ్రమయ్యే అవకాశాలపై భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ► ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక స్థిరత్వ అంశాలపై జాగరూకత అవసరం. ► తక్షణం కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక భారత్ ఎకానమీ అవుట్‌లుక్ స్థిరంగా ఉంది. పాత పెన్షన్ పథకాల పునరుద్ధరణ సరికాదు..! ఉద్యోగుల వంతు జమతో (కాంట్రిబ్యూషన్) సంబంధంలేని పాత పెన్షన్ పథకాలు (ఓపీఎస్).. భవిష్యత్ తరాలపై దాడి వంటిదేనని సన్యాల్ పేర్కొన్నారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వచ్చిన ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ సరైంది కాదని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా చాలా కష్టాలతో అమల్లోకి తెచ్చిన పెన్షన్ సంస్కరణలను తిరిగి వెనక్కు మళ్లించే విషయంలో జాగరూకత అవసరమన్నారు. పెన్షన్ మొ త్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. -
మందగమనంలోనూ మెరుగ్గానే భారత్
చెన్నై: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం మధ్యలోనూ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉండగలదని బహుళజాతి ఆటోమొబైల్ దిగ్గజం స్టెలాంటిస్ సీఈవో కార్లోస్ టవారెస్ చెప్పారు. గణనీయ వృద్ధి సాధించేందుకు, ’సూపర్‌పవర్’గా ఎదిగేందుకు భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాశ్చాత్య దేశాలు (అమెరికా, యూరప్) – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోగలదని చెప్పారు. ‘2023లో అంతర్జాతీయ ఎకానమీ మందగించబోతోందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటప్పుడు కూడా భారత్ 6–7 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నారు. ఇది కచ్చితంగా చాలా అధిక వృద్ధిగానే భావించవచ్చు‘ అని కార్లోస్ వివరించారు. ఒకవేళ దేశీయంగా ఆటోమోటివ్ మార్కెట్ కొంత మందగించినా తాము సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యలు పాటిస్తుండటం వల్ల తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. తమ కాంపాక్ట్ కార్ సీ3 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను భారత మార్కెట్లో వచ్చే ఏడాది తొలి నాళ్లలో ప్రవేశపెట్టనున్నట్లు కార్లోస్ చెప్పారు. నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా అందించేందుకు వ్యయాల తగ్గింపుపై మరింతగా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. -
అంతర్జాతీయ సవాళ్లతో భారత్‌కు భయం అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరిస్థితుల వంటి అంశాలు భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు విఘాతం కలిగించకపోవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో పేర్కొంది. దేశ రేటింగ్ విషయంలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం ఎకానమీ పురోగమిస్తే, 2022–23లో ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. రానున్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.3 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. భారత్‌కు మూడీస్ ప్రస్తుతం దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీఏఏ3’ హోదాను ఇస్తోంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ‘చెత్త’ రేటింగ్కన్నా ఇది ఒక మెట్టు ఎక్కువ. గత ఏడాది అక్టోబర్‌లో రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’క మార్చింది. తాజాగా మూడీస్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశం క్రెడిట్ ప్రొఫైల్... పలు స్థాయిల్లో పటిష్టతలను ప్రతిబింబిస్తోంది. పెద్ద, వైవిధ్యభరిత, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, అధిక వృద్ధి సామర్థ్యం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగలిగిన పరిస్థితులు, ప్రభుత్వ రుణానికి స్థిర మైన దేశీయ ఫైనాన్సింగ్ బేస్ వంటి కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణలుసహా అంతర్జాతీయంగా ఎకానమీకి ఎదురవుతున్న సవాళ్లు– ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో భారత్ రికవరీకి (కోవిడ్–19 సవాళ్ల నుంచి) విఘాతం కలిగించే అవకాశం లేదని భావిస్తున్నాం. ► ఎకానమీ, ఫైనాన్షియల్ వ్యవస్థల గురించి ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అవి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఈ కారణంగానే ఎకానమీకి ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నాం. ► అధిక క్యాపిటల్ (మూలధన ) నిల్వలు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) పటిష్టత వంటి విభాగాలకు సంబంధించి సవాళ్లు ఉన్నా... ఆ సమస్యలు ఎకానమీకి కలిగించే నష్టాలు అతి స్వల్పం. ఆయా అంశాలు మహమ్మారి నుండి ఎకానమీ రికవరీని సులభతరం చేస్తున్నాయి. ► ద్రవ్యలోటు తక్షణ సమస్య ఉన్నప్పటికీ, రానున్న సంవత్సరాలోఈ సవాళ్లు తగ్గుతాయని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలంలో సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ క్షీణించకుండా ఆయా అంశాలు ఎకానమీకి దోహదపడతాయని భావిస్తున్నాం. రేటింగ్ పెంపుదలే కాదు, తగ్గింపు అవకాశాలూ ఉన్నాయి... భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ రంగాల్లో సంస్కరణల అమలు పటిష్టంగా జరిగాలి. ఇది ప్రైవేట్ రంగ పెట్టుబడులలో గణనీయమైన, స్థిరమైన పురోగతికి దారితీయాలి. తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యం అంచనాలకు మించి పెరిగాలి. అలాగే ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వ రుణ భారాలను తగ్గించాలి. రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుదల క్రెడిట్ ప్రొఫైల్‌కు మద్దతు నివ్వాలి. ఈ పరిస్థితుల్లోనే సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇక బలహీన ఆర్థిక పరిస్థితులు తలెత్తినా లేక ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు తీవ్రమయినా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం జరుగుతుంది. మేము అంచనావేసినదానికన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయితే, అది ప్రభుత్వ రుణ భారాలను పెంచుతుంది. ఆ పరిస్థితి దేశ సార్వభౌమ ద్రవ్య పటిష్టతను మరింత దిగజార్చే వీలుంది. ఆయా అంశాలు నెగటివ్ రేటింగ్ చర్యకూ దారితీయవచ్చు. – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ -
సెన్సార్ చిక్కులు.. రూ.40 వేల కోట్ల నష్టం!!
సెన్సార్ చిక్కులు సాధారణంగా ఈ మాటను తరచూ సినీ పరిశ్రమలో వింటుంటాం. అయితే వెబ్ కంటెంట్ విషయంలో ఆ చిక్కులు తక్కువే!. అందుకే ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ కంటెంట్‌కూ కోతలు తప్పడం లేదు. దీనివల్ల గ్లోబల్ ఎకానమీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ సెన్సార్షిప్ వల్ల పోయినేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డిజిటల్ సెక్యూరిటీ & రైట్స్ గ్రూప్ ‘టాప్10వీపీఎన్’ నివేదిక ప్రకారం.. ఈ నష్టం మొత్తంగా 5.5 బిలియన్ డాలర్లకు(సుమారు 40 వేల కోట్ల రూపాయలకు పైనే) ఉందని తెలుస్తోంది. 2021లో ఇంటర్నెట్-సోషల్ మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్ అంతరాయం(షట్‌డౌన్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వాల ఆధిపత్యం-కఠిన చట్టాల అమలు, వెబ్ కంటెంట్‌పై ఉక్కుపాదం.. తదితర కారణాల వల్ల ఈ మేర నష్టం వాటిల్లినట్లు నివేదిక పేర్కొంది. ►ఎక్కువ నష్టపోయింది మయన్మార్ దేశం. సుమారు 2.8 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో 18 వేల కోట్ల రూపాయలపైనే) నష్టపోయింది. మిలిటరీ చర్యల వల్లే ఈ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇక నైజీరియా ఈ లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉంది. జూన్‌లో ట్విటర్‌ను బ్లాక్ చేయడం తదితర పరిణామాల వల్ల నైజీరియా 1.5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. ►భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ వల్ల ఈ నష్టం ప్రధానంగా వాటిల్లింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం-ఆంక్షలు, ఓటీటీ కంటెంట్‌పై ఉక్కుపాదం(పూర్తిస్థాయి సెన్సార్షిప్ రాలేదింకా), కరోనాపై ఫేక్- అశ్లీల కంటెంట్, ఇతర కథనాల నియంత్రణ తదితర కారణాలు ఉన్నాయి. (లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది). ►2021 ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆంక్షలతో 486 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడగా.. 2020లో 268 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడ్డారు. అంటే 81 శాతం పెరిగిందన్నమాట. కేవలం ప్రభుత్వాల ఆంక్షలు-నిషేధాజ్ఞల కారణంగా వాటిల్లిన నష్టం 36 శాతానికి(2020తో పోలిస్తే) పెరిగింది. ఎలాగంటే.. ఇంటర్నెట్ షట్‌డౌన్, కఠిన ఆంక్షల వల్ల ఈమేర నష్టం వాటిల్లితే.. ఒకవేళ మొత్తంగా ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కదా!. అసలు నష్టం ఎందుకు వాటిల్లుతుందంటే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇతరత్ర సేవలు, అడ్వర్టైజింగ్, కస్టమర్ సపోర్ట్ సేవలకు విఘాతం, ప్రత్యేకించి సోషల్ మీడియా ఆగిపోవడం వల్ల ఆదాయానికి భారీ గండిపడుతుంది. 2022లో మొదలైంది.. ఇక ఈ ఏడాదిలోనూ ఇంటర్నెట్ స్వేచ్ఛకు అడ్డుకట్ట పడడం ఇప్పటికే మొదలైంది. కజకస్తాన్(మధ్య ఆసియా దేశం), సూడాన్‌లలో నెలకొన్న సంక్షోభాల దృష్ట్యా ఇంటర్నెట్ షట్‌డౌన్ కొనసాగుతోంది. వీటి నష్టం వివరాలు ఇప్పట్లో చెప్పడం కష్టం. చదవండి: భారత్‌లో ఇక ఏరకంగానూ పోర్న్ వీడియోల వీక్షణ కుదరదు! -
500 కోట్ల టీకా డోసులు
రోమ్: వచ్చే ఏడాది చివరి నాటికల్లా 500 కోట్లకుపైగా కోవిడ్–19 టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తమ దేశంతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచానికి భారత్ తనవంతు సాయం కచ్చితంగా అందిస్తుందని తెలిపారు. తమ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఆయన శనివారం రోమ్‌లో ప్రారంభమైన జి–20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సులో ‘గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ హెల్త్’ అంశంపై మాట్లాడారు. కరోనాపై పోరులో భారత్ పోషిస్తున్న పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఒక యంత్రాంగం ఉండాలని సూచించారు. భారత్‌లో దేశీయంగానే అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జి న్’కు అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వద్ద పెండింగ్‌లో ఉందని మోదీ గుర్తుచేశారు. త్వరగా అనుమతి లభిస్తే ఇతర దేశాలకు టీకాల విషయంలో సాయం చేసేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి 150 దేశాలకు అవసరమైన అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు పంపించామని వివరించారు. సాహసోపేత ఆర్థిక సంస్కరణలు కనిష్ట కార్పొరేట్ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను శ్రీకారం చుట్టామన్నారు. కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే అన్ని దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంతోపాటు ఆరోగ్య రంగంలో భవిష్యత్తుల్లో తలెత్తబోయే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారు. ఈ దిశగా ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే సంకల్పాన్ని తీసుకోవాలని కోరారు. రోమ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా మీడియాకు తెలియజేశారు. పేద దేశాలకు మరిన్ని టీకాలు: ఇటలీ ప్రధాని ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జి–20 శిఖరాగ్ర సదస్సు శనివారం ఇటలీ రాజధాని రోమ్‌లోని నువొలా కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమయ్యింది. అతిథ్య దేశం ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ప్రారంభోపన్యాసం చేశారు. జి–20 దేశాల అధినేతలకు స్వాగతం పలికారు. పేద దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లు మరిన్ని అందించాలని జి–20 సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా టీకాల పంపిణీ విషయంలో ధనిక దేశాలు, పేద దేశాల మధ్య అంతరం నైతికంగా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ఇప్పటివరకు కేవలం 3 శాతం మందికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని గుర్తుచేశారు. ఇక ధనిక దేశాల్లో 70 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారని తెలిపారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. శిఖరాగ్ర సదస్సులో తొలిరోజు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక రంగాలపై చర్చించారు. ఈ సదస్సు ఆదివారం కూడా కొనసాగనుంది. సోమవారం నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. -
ప్రపంచ రికవరీకి చమురు మంట
న్యూఢిల్లీ: ముడి చమురు ధరల తీవ్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ ఎకానమీ రికవరీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగ దేశమేకాకుండా, దిగుమతుల విషయంలోనూ ఇదే స్థానాన్ని ఆక్రమిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ బేరల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిలో 80 డాలర్లపైన స్థిరంగా కదలాడుతుండడం, దేశీయంగా పెట్రో ధరలు మండిపోతుండడం, దీనితో ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో సీఈఆర్ఏవీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరమ్‌లో భారత్ చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► కోవిడ్–19 వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రూడ్ ధరల తీవ్రతతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రికవరీకి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ► క్రూడ్ ధరల ఒడిదుడుకుల పరిస్థితిని అధిగమించాల్సి ఉంది. ఇందుకు దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులు అవసరం. స్థిర ధరల వ్యవస్థకు ఇది దోహదపడుతుంది. ► చమురు డిమాండ్, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) వంటి ఉత్పత్తిదారుల సరఫరాలకు మధ్య పొంతన లేదు. ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ► క్రూడ్ ధరల పెరుగుదల వల్ల వర్థమాన దేశాలకే కాకుండా, పారిశ్రామిక దిగ్గజ దేశాలకూ కష్టాలు తప్పవు. ప్రపంచ ఆరి్థక వ్యవస్థ స్థిరంగా వృద్ధి బాటన పయనించేలా చూడ్డం అందరి బాధ్యత. ఇతర దేశాల మంత్రులతో సమావేశాల సందర్భంగా నేను ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ► 2020 జూన్‌లో 8.8 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ చమురు దిగమతుల బిల్లు, 2021లో సగటున 24 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాంట్రాక్ట్ విధానం మారాలి: తరుణ్ కపూర్ ఇదే సమావేశంలో పెట్రోలియం వ్యవహారాల కార్యదర్శి తరుణ్ కపూర్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి ఒపెక్ దేశాల నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలు ప్రస్తుతం ‘వన్–టర్మ్ కాంట్రాక్ట్’ను కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ తరహా ఒప్పందాలు సరఫరాలకు సంబంధించి పరిమాణం స్థిరత్వాన్ని మాత్రమే అందిస్తాయని తెలిపారు. డెలివరీ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ధరల విధానం ఉంటోందన్నారు. ఈ సమస్య తొలగాలంటే ఒక బెంచ్‌మార్క్‌గా ధరలకు అనుసంధానమయ్యే దీర్ఘకాలిక కాంట్రాక్ట్ అవసరమని సూచించారు. భారత్ తన మొత్తం క్రూడ్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్యాస్ విషయంలో ఇది 55 శాతంగా ఉంది. భారత్‌లో చమురు డిమాండ్ కూడా అధికంగా ఉంది. భారత్ ఎకానమీ రికవరీకి దెబ్బతగిలితే, అది చమురు ఉత్పత్తిదారులకూ నష్ట మేనని భారత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఆర్థిక రికవరీకి చమురు రేట్ల ముప్పు
న్యూఢిల్లీ: భారీగా పెరిగిపోతున్న ముడి చమురు రేట్లు .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని దెబ్బతీసే ప్రమాదముందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు సహేతుక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియాతో పాటు చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ను కోరింది. ‘ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం పాటించే విధంగా చమురు రేట్లు ఉండాలి. ప్రస్తుతం సరఫరా కన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో రేట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మరింత వేగంగా మళ్లే అవకాశం ఉంది. కాబట్టి అధిక ధరలనేవి ఉత్పత్తి దేశాలకు కూడా ప్రతికూలంగానే పరిణమించగలవని ఒపెక్ కూటమికి భారత్ తెలియజేసింది‘ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, రష్యా తదితర దేశాలతో సమావేశాల సందర్భంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలపై చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. చమురు ధరలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు సాధించిన రికవరీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయా దేశాలకు మంత్రి స్పష్టం చేసినట్లు అధికారి తెలిపారు. బ్యారెల్ ధర 65–70 డాలర్ల స్థాయి పైగా ఉండటం వల్ల దిగుమతి దేశాలకు సమస్యాత్మకంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. చమురుకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న ఏకైక దేశమైన భారత్ పక్కకు తప్పుకుంటే .. ఉత్పత్తి దేశాలకు కూడా సమస్యేనని అధికారి పేర్కొన్నారు. ధర మాత్రమే కాకుండా సరఫరా కాంట్రాక్టులు, చెల్లింపుల్లోనూ వెసులుబాట్లు కావాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అలాగే 55 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. -
Facebook Outage: ప్రపంచానికి కోలుకోలేని దెబ్బ !
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోవడం.. కొందరికి చికాకు తెప్పించి ఉండొచ్చు. మరికొందరికి ఇదంతా సరదా వ్యవహారంగా అనిపించి ఉండొచ్చు. కానీ, నాణేనికి మరోవైపులా.. ఇందులోనూ సీరియస్ కోణం కనిపించింది. అమెరికా, ఫేస్బుక్ ఓనర్ సంగతేమోగానీ.. మిగతా ప్రపంచానికి మాత్రం ఈ విఘాతం ఊహించని స్థాయిలో డ్యామేజ్‌నే చేసింది. ముఖ్యంగా వ్యాపార, వైద్య రంగాలతో పాటు ప్రభుత్వ విభాగాలపైనా యాప్స్ సేవల విఘాతం తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఇన్స్టంట్ కాల్స్ అండ్ మెసేజింగ్ సర్వీసుల యాప్ ‘వాట్సాప్’ను.. 180 దేశాల్లో 200 కోట్ల మంది దాకా ఉపయోగిస్తున్నారు. ఇక ఫేస్బుక్-ఫేస్బుక్ మెసేంజర్ సర్వీస్‌ల్ని 300 కోట్లమందికిపైగా ఉపయోగించుకుంటున్నారు. కెన్యా, అర్జెంటీనా, మలేషియా, కొలంబియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో 16 నుంచి 54 ఏళ్లలోపు 90 శాతం మంది వాట్సాప్ సేవల్ని ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక భారత్‌లో సుమారు 50 కోట్ల మంది వాట్సాప్ సేవల్ని ఉపయోగించుకుంటుండగా.. సోమవారం రాత్రి వాటిల్లిన బ్రేక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఎన్నో రంగాలు.. సోషల్ మీడియా అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు.. వివిధ రంగాల్లోనూ జోరుగా వీటిని వినియోగిస్తున్నారు. డెలివరీ దగ్గరి నుంచి విద్యా, వైద్య, ఇతరత్ర సేవలను అందించడంలో ఇప్పుడు ఇవే కీలక భూమిక పోషిస్తున్నాయి. ముఖ్యంగా చిరువ్యాపారుల బిజినెస్‌కు ఈ ఆరేడు గంటల విఘాతం కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక కరోనా టైం నుంచి భారత్‌లో వాట్సాప్ ద్వారా పేషెంట్ల కన్సల్టింగ్ ప్రక్రియ, మందుల డోర్ డెలివరీ వ్యవస్థ ఎక్కువగా నడుస్తోంది. సోమవారం నాటి అంతరాయంతో వైద్య రంగానికి నష్టంతో పాటు పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మలేషియాలో బిజినెస్ కమ్యూనికేషన్ దాదాపుగా ఫేస్బుక్, వాట్సాప్‌లతోనే నడుస్తోంది. అలాంటిది అక్కడ భారీగానే నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఫేస్బుక్ అండ్ కో వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది మాత్రం ఫుడ్(ఇండోనేషియా,జర్మనీ లాంటి దేశాల్లో), రిటైల్(34కి పైగా దేశాల్లో) రంగాలకే కావడం చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వ సేవలకూ.. మనీలాకు చెందిన ఫొటోగ్రాఫర్ రిచర్డ్ జేమ్స్ మెండోజా ఫేస్బుక్ సర్వీసుల విఘాతం వల్ల ఉపాధి దెబ్బతిందని వాపోతున్నాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్ కోసం, కరోనా సమాచారం అప్డేట్స్ కోసం మెండోజా పని చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఏర్పడ్డ విఘాతంతో మెండోజా తన పని సక్రమంగా నిర్వహించలేకపోయాడు. దీంతో ఇతగాడి ఫీజులో భారీ కోత పడింది. ఇలా క్యాంపెయిన్స్ కోసమే కాదు.. ప్రభుత్వాలు సోషల్ మీడియాను ‘ఇన్ఫర్మేషన్ షేరింగ్’ ప్లాట్‌ఫామ్‌గా వాడుకుంటున్నాయి కూడా. నిఘా, పౌర సేవల్ని అందించడం, అవసరమైన డాక్యుమెంట్ల చేరివేత, వెరిఫికేషన్.. ఇలా ఎన్నో ప్రక్రియలు వాట్సాప్ ద్వారా నడుస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్వీసింగ్ సెంటర్లకు క్యూ ప్రజలకు సోషల్ మీడియా కేవలం టైం పాస్ యవ్వారం అని మాత్రమే కాదు.. సాధారణ ఫోన్‌కాల్స్ కంటే యాప్కాల్స్ యమచీప్ అనే ముద్రపడిపోయింది. అందుకే ఆ ఆరేడు గంటలు కమ్యూనికేషన్ పరమైన ఇబ్బందితో తలలు పట్టుకున్నారు. అయినవాళ్లతో బంధం కాసేపు ఆగిపోవడం.. అపార్థాలతో అలజడులు రేగాయి. కొందరు ఫోన్లు రీస్టార్ట్లుచేయగా.. మరికొందరు డేటా ప్యాక్ వాలిడిటీ పూర్తైందేమోనని కంగారు పడ్డారు. ఇంకొందరు ఆందోళనతో సర్వీస్ సెంటర్లకు, రిపేర్ షాపులకు క్యూ కట్టిన దృశ్యాలు సైతం కనిపించాయి. మార్క్ జకర్బర్గ్కు కలిగిన నష్టంతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫేస్బుక్ అండ్ కో విఘాతం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. అఫ్కోర్స్.. ఈ విషయాన్ని లెక్కలతో తేల్చకున్నాఫేస్బుక్కే స్వయంగా ప్రకటించిందనుకోండి. ఇప్పుడు తెర మీదకు వచ్చిన మరో చర్చ ఏంటంటే.. ముందు ముందు ఇలాంటి అంతరాయాలు ఎదురైతే ఎలా? అని.. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
గ్లోబల్ ఎకానమీ రికవరీకి తిరుగులేదు
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2021లో వృద్ధి బాటకు మళ్లుతుందన్న విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ) వ్యక్తం చేశారు. సంస్థల ఆదాయాలు పెరుగుతాయన్న ధీమానూ వెలిబుచ్చారు. ఇందుకు సంబంధించి వారి ఆశావాద దృక్పథం ‘‘రికార్డు స్థాయిల్లో’’ ఉంది. ప్రముఖ కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ 24వ వార్షిక గ్లోబల్ సీఈఓ సర్వే ఈ విషయాన్ని తెలిపింది. సర్వేకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... భారత్‌సహా 100దేశాలకు చెందిన 5,050 మంది సీఈఓలు జనవరి, ఫిబ్రవరిల్లో జరిగిన ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరిలో 36 శాతం మంది తమ కంపెనీల ఆదాయాలు వచ్చే 12 నెలల్లో పెరుగుతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. 2020లో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన సీఈఓలు 27 శాతమే . 2021లో గ్లోబల్ ఎకానమీ రికవరీ ఖాయమని 76% మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. 2012 తర్వాత ఈ స్థాయిలో రికవరీపై విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. 2019లో ఈ పరిమాణం 42 శాతం. 2020లో 22 శాతం. గ్లోబల్ ఎకానమీ వృద్ధిపై అత్యధిక సంఖ్యలో విశ్వాసం వ్యక్తం చేసిన వారిలో నార్త్ అమెరికా, పశ్చిమ యూరోప్‌లకు చెందినవారు ఉన్నారు. అయితే కరోనా తరహా మరో మహమ్మారి విజృంభిస్తే మాత్రం పరిస్థితిగా కఠినంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్ సొల్యూషన్స్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయంగా భాగస్వామ్యాలను విస్తరించుకోడానికి వ్యూహ రచన చేస్తున్నాయి. ఇదే సమయంలో సైబర్ పరమైన ఇబ్బందులను ఎదుర్కొనడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. సీఈఓల్లో 30 శాతం మంది వాతావరణ మార్పు పట్ల ఆందోళన వ్యక్త చేశారు. 2020లో ఇది 24 శాతంగా ఉంది. అయితే వాతావరణ మార్పిడి వల్ల తక్షణం వృద్ధికి వచ్చిన విఘాతం ఏదీ లేదని 27 శాతం మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. సీఈఓల ముందు రెండు సవాళ్లు... చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ) ప్రధానంగా ప్రస్తుతం రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకునే వర్గాల్లో విస్తృత ప్రాతిపదిక విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలన్న అంశం ఇందులో ఒకటి. మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాలను తమ వ్యాపార కార్యకలాపాలకు అనుసంధానించుకుని తద్వారా పటిష్ట స్థాయిలో ఆటుపోట్లను తట్టుకోవడం ఎలా అన్న అంశం రెండవది. - సంజీవ్ కృష్ణన్, పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ 2022 వరకూ ‘‘కరోనా ముందస్తు’’కు రాలేం: మూడీస్ 2021లో వృద్ధి రికవరీ బాటన పడినప్పటికీ, ‘‘కరోనా ముందస్తు క్రియాశీలత’’ స్థాయికి 2022 వరకూ చేరుకోవడం కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ-మూడీస్ తన తాజా నివేదికలో గురువారం పేర్కొంది. 2022 వరకూ పలు దేశాల ఎకానమీలు కరోనా ముందస్తు కాలానికి చేరుకోలేవని విశ్లేషించింది. ‘‘2020 మార్చి 11వ తేదీన కోవిడ్-19ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అటు తర్వాత గ్లోబల్ ఎకానమీ తీవ్ర ప్రతికూలతలో పడిపోయింది. బాండ్ డిఫాల్ట్స్ పెరిగాయి. రుణ వ్యవస్థ నేల చూపుచూసింది. అయితే రుణ వ్యవస్థ తిరిగి ఇప్పుడు కోలుకుంటోంది. అయితే ఇది ప్రస్తుతానికి స్వల్పకాలిక ధోరణి మాత్రమే. పలు రంగాలకు ఇంకా ఇబ్బందులు తొలగిపోలేదు. కరోనా ముందటి కార్యకలాపాలకు అవి ఇంకా చేరుకోలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆర్థిక క్రియాశీలతకు ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల విధానపరమైన చర్యలు తమ మద్దతును కొనసాగిస్తాయన్న విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్ కార్యకలాపాలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో మహమ్మరి ప్రభావం కూడా ఈ ఏడాది క్రమంగా తగ్గుతుందన్న విశ్వాసాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ పరిస్థితులను ఆయా ప్రభుత్వాలు క్రమంగా పూర్తి స్థాయిలో తొలగిస్తాన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే వృద్ధి తీరుపై కరోనా సవాళ్ల ప్రభావం మరికొంతకాలం కొనసాగుతుందని విశ్లేషించింది. ‘‘దీనికితోడు కొత్త మ్యుటేషన్ల సవాళ్లు పెరుగుతూనే ఉంటాయి. సాధారణ పరిస్థితులు నెలకొనే సమయంలో ఇదొక సవాలుగానే ఉంటుంది. వైరస్‌ను పూర్తిగా నిర్మూలిద్దామనే యోచనకు బదులు, దానితో కలిసి జీవించడం ఎలా అన్న అంశంపైనే దృష్టి పెట్టాలి. తక్కువ స్థాయిలో కేసులు ఉన్నప్పటికీ, ఈ ధోరణి తప్పదు’’ అని మూడీస్ స్పష్టం చేసింది. ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలకు వైరస్ వల్ల ఊహించిన పరిణామాలు, ప్రతికూలతలు ఎదురయితే తప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో విస్తృత ప్రాతిపదికన క్రెడిట్ రేటింగ్స్ సమీక్షలు జరుగుతాయని భావించనక్కర్లేదని కూడా మూడీస్ పేర్కొనడం గమనార్హం. చదవండి: ‘వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం -
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించిన తాజా పరిణామాలతో పాటు దేశీయ, అంతర్జాతీయంగా వెల్లడికానున్న ఆర్థిక గణాంకాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశకు అత్యంత కీలకంగా ఉండనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలకు తోడు భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించడంలో కీలకంకానున్నాయని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ – హెడ్– ఈక్విటీ రీసెర్చ్ í కురియన్ అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే మార్కెట్ ప్రతికూలంగా స్పందించనుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా, సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషించారు. స్థూల ఆర్థికాంశాల ప్రభావం.. మే నెల ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి గణాంకాలు, మార్చి త్రైమాసిక కరెంట్ అకౌంట్ మంగళవారం వెలువడనున్నాయి. జూన్ నెల మార్కిట్ తయారీ పీఎంఐ బుధవారం విడుదలకానుండగా.. సేవారంగ పీఎంఐ శుక్రవారం వెల్లడికానుంది. దేశీ ఆటో పరిశ్రమ జూన్ నెల అమ్మకాల డేటా బుధవారం నుంచి వెల్లడికానుంది. మరోవైపు జూన్ 9–10 తేదీల్లో జరిగిన అమెరికా ఫెడ్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ బుధవారం వెల్లడికానున్నాయి.1,420 కంపెనీల ఫలితాలు: ఎంఆర్ఎఫ్, ఓఎన్జీసీ, వొడాఫోన్ ఐడియాసహా దాదాపు 1,420 కంపెనీల ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి. -
ఊహించని రికవరీ
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ శుక్రవారం రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించింది. భారీ నష్టాలతో ఆరంభమై, మరింతగా నష్టపోయి, మధ్యాహ్నానికల్లా ఆ నష్టాలను పూడ్చుకొని, చివరకు ఓ మోస్తరు లాభాలతో ముగిసింది. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పుంజుకోవడం దీనికి ప్రధాన కారణాలు. ఆరంభంలోనే 1,190 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 243 పాయింట్ల లాభంతో 33,781 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 358 పాయింట్లు క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 9,973 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 506 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 1,508 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..... ఆరంభంలోనే భారీగా నష్టపోయిన స్టాక్ సూచీలు మెల్లమెల్లగా రికవరీ అవుతూ వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఒక దశలో 1,190 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 318 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 1,508 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇంట్రాడేలో 358 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఒక దశలో 94 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 452 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,433 పాయింట్లు, నిఫ్టీ 429 పాయింట్ల మేర రికవరీ అయ్యాయి. ఆరంభంలో 3.5 శాతం మేర నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు 0.7 శాతం లాభాలతో ముగిశాయి. ఐటీ, మీడియా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి. ∙మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 7% లాభంతో రూ.509 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. గత క్యూ4లో రూ.3,255 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులను రైటాఫ్ చేయడం, కంపెనీ గైడెన్స్ ఆశావహంగా ఉండటంతో ఈ షేర్ పెరిగింది. ∙హెచ్–1బీతో సహా కొన్ని ఎంప్లాయ్మెంట్ వీసాలను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్ యోచిస్తున్నారన్న వార్తలతో ఐటీ షేర్లు 1–3 శాతం మేర పతనమయ్యాయి. ∙60కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. గ్రాన్యూల్స్ ఇండియా, రుచి సోయా, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ∙రైట్స్ షేర్లు సోమవారం(ఈ నెల 15)నుంచి స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో ట్రేడ్ కానుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.1,589 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 243 పాయింట్ల లాభంలో ఈ షేర్ వాటాయే 152 పాయింట్లుగా ఉంది. ∙300కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకా యి. అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్, పీఎన్బీ హౌసింగ్ ఈ జాబితాలో ఉన్నాయి. -
1870 తరువాత ఇదే అత్యంత దారుణమైన మాంద్యం
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్య పరిస్థితి ఏర్పడనుందని చెప్పింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2 శాతం తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ సోమవారం తెలిపింది. అంతేకాదు కరోనా అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగాఉంటాయని తెలిపింది. తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6 శాతం మేర తగ్గవచ్చునని, ఇది లక్షలాదిమంది పేదలను కడు పేదరికంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకుమించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలుంటాయని తెలిపింది. తద్వారా ఇది దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. (కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ) ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ సోమవారం విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా నెలకొన్న సంక్షోభం, ఆర్థికమాంద్యం ఏర్పడిందని 1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ తెలిపారు. మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలలో, ప్రపంచ వాణిజ్యం, పర్యాటక రంగం, వస్తువుల ఎగుమతులు , విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడే దేశాలలో ఈ దెబ్బ తీవ్రంగా ఉంటుందని దీంతో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చునన్నారు. 60 ఏళ్లలో ఇంతటి ప్రభావం ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్పాస్ పిలుపునిచ్చారు. అప్పుడే ఆర్థిక పునరుత్తేజం సాధ్యమన్నారు. ఈ మాంద్యంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వాటా 90 శాతానికి పైగా ఉంటుందని, ఇది 1930-32 మహా మాంద్యం సమయం నాటి 85 శాతం కంటే ఎక్కువన్నారు. (కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని పేర్కొంది. 1870 నుండి14 ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 -1921, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020 లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చిందని తెలిపింది (భారత ఆర్థిక వృద్ధి రేటు ప్రతికూలం) -
8.8లక్షల కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్ డాలర్ల దాకా ప్రతికూల ప్రభావం పడనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో వెలువరించిన అంచనాలకు కొనసాగింపుగా ఏడీబీ తాజా నివేదికను రూపొందించింది. ఏప్రిల్ 3న నాటి ఆసియా అభివృద్ధి అంచనాల (ఏడీవో) నివేదికలో ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌పరమైన నష్టాలు సుమారు 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని పేర్కొంది. తాజాగా.. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఎకానమీ సుమారు 5.8 – 8.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో నష్టపోనుంది. ఇది గ్లోబల్ జీడీపీలో 6.4–9.7 శాతానికి సమానం. అటు దక్షిణాసియా జీడీపీ కూడా 3.9–6.0 శాతం మేర క్షీణించవచ్చు. భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం ఇందుకు కారణం‘ అని వివరించింది. ఈ అధ్యయనంలో విధానపరమైన చర్యల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీబీ తెలిపింది. గ్లోబల్ జీడీపీ 2–4 శాతం తగ్గొచ్చంటూ ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాల కన్నా ఏడీబీ అంచనాలు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్షీణత 6.3 శాతం స్థాయిలో ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. చైనాకు 1.6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు .. ఆంక్షలను స్వల్పకాలికంగా మూడు నెలల పాటు కొనసాగించిన పక్షంలో ఆసియా, పసిఫిక్ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ నష్టాలు 1.7 లక్షల కోట్ల డాలర్ల మేర, ఆరు నెలల పాటు అమలు చేస్తే 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనూ ఉంటాయని ఏడీబీ పేర్కొంది. మొత్తం గ్లోబల్ ఉత్పత్తి క్షీణతలో ఈ ప్రాంత వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. చైనా నష్టాలు సుమారు 1.1–1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఏడీబీ అంచనా. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ కట్టడిపై వేగంగా స్పందించాయని, ద్రవ్యపరమైన చర్యలతో ఆదాయ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేశాయని ఏడీబీ తెలిపింది. ఈ చర్యలను ఇలాగే కొనసాగించిన పక్షంలో కరోనాపరమైన ప్రతికూల ప్రభావాలు 30–40 శాతం దాకా తగ్గొచ్చని వివరించింది. జీతాల్లో కోతలు.. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లలో వేతన ఆదాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదాయాలు 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల దాకా తగ్గొచ్చని పేర్కొంది. ఆసియాలో వేతన ఆదాయాలు 359–550 బిలియన్ డాలర్ల స్థాయిలో క్షీణించవచ్చని వివరించింది. ఏడీబీ నివేదిక -
కరోనా పరిణామాలే కీలకం..!
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా) వైరస్ ధాటికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. దేశాలకు దేశాలు షట్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయింది. వైరస్ వ్యాప్తి వేగం తగ్గకపోతే ఎకానమీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కరోనా వైరస్ పరిణామాలు మాత్రమే ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ విస్తృతి ఆధారంగానే ఈ వారంలో సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ విశ్లేషకులు చందన్ తపారియా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని విశ్లేషించారు. వైరస్ ఇబ్బందుల దృష్ట్యా వీలైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇవ్వడం వంటి ఆశాజనక వార్తలు రిలీఫ్ ర్యాలీకి ఆస్కారం ఇచ్చినప్పటికీ.. వైరస్ వ్యాప్తి అంశమే అత్యంత కీలకంకానుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. మార్చి సిరీస్ ముగింపు ఈవారంలోనే.. గురువారం (26న) మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. ఈ సిరీస్‌లో సూచీలు 35 శాతం నష్టపోయాయి. వోలటాలిటీ 72 శాతానికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో షార్ట్ రోలోవర్స్ కొనసాగుతున్నాయని, నిఫ్టీ 7,800–8,000 పాయింట్ల స్థాయికి పడిపోతే ట్రేడర్లు పొజిషన్లను క్లోజ్ చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ అనలిస్ట్ అమిత్ గుప్తా విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరిగితే సూచీలు కుప్పకూలి పోతాయని చెప్పడంలో సందేహం లేదని ట్రేడింగ్‌బెల్స్ సీనియర్ అనలిస్ట్ సంతోష్ మీనా వ్యాఖ్యానించారు. మరణాలు ఆగితేనే మార్కెట్ నిలబడుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. షార్ట్ సెల్లింగ్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిమితులను విధించిన నేపథ్యంలో ఎఫ్ అండ్ ఓలోని 10–12 శాతం షేర్లపై ఈ ప్రభావం ఉందనుందని సామ్కో సెక్యూరిటీస్ అనలిస్ట్ జిమీత్ మోడీ అన్నారు. ఎక్సే్ఛంజీలు పనిచేస్తాయ్.. దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని సెబీ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై షట్డౌన్లో ఉన్నప్పటికీ.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మాత్రం పనిచేస్తాయని స్పష్టంచేసింది. బోంబే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లోని అన్ని విభాగాలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని బీఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్‌కుమార్ చౌహాన్ ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ కూడా ఇదే ప్రకటన చేసింది. స్టాక్ బ్రోకర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా భారత్‌లో మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటికే ఏడుకు చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో స్టాక్ బ్రోకర్లకు ఇంటి వద్ద నుంచి పని చేసే సౌలభ్యం కల్పించినట్లు దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. ఈనెల 30 వరకు ఈ ఫెసిలిటీని ఇస్తున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా బ్రోకర్ల వద్ద నుంచి వారి టెర్మినల్ లొకేషన్ల అడ్రస్‌లను సేకరిస్తున్నట్లు వివరించాయి. ఈ నెలలో రూ. లక్ష కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో రూ. 1,08,697 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–20 మధ్యలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 56,248 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ. 52,449 కోట్లను వెనక్కు తీసుకున్నారు. కరోనా వైరస్ కారణం గా దేశీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సీనియర్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. -
మాంద్యం కోరల్లో!
ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్‌ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్ 29,000 మార్క్ దిగువకు చేరింది. మాంద్యం భయాలు... భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్అండ్పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్అండ్పీ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్‌లో అయితే ఒక నెల పాటు షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్‌ను కూడా నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్ భారీ ప్యాకేజీలు అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ముంచిన్ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. మాంద్యం, టెలికం ఏజీఆర్ ప్రభావం ‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు 24 శాతం, పవర్‌గ్రిడ్ 12 శాతం, కోటక్ బ్యాంకు , బజాజ్ ఫైనాన్స్ 11 శాతం చొప్పున, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10 శాతం, ఎన్టీపీసీ 8 శాతం వరకు పనతమయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.15,72,913 కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329 కోట్లకు పడిపోయింది. భారత్ ‘వృద్ధి’కి ఎస్ అండ్ పీ కోత న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది. క్యాలెండర్ ఇయర్లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్ అండ్ పీ, అమెరికా, యూరోప్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది భారత్‌లో ఆర్బీఐ రెపో రేటు 1.75 శాతం తగ్గొచ్చని ఫిచ్ అంచనావేసింది. 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1%కి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో తెలిపింది. వైరస్ వ్యాప్తికి ముందు వృద్ధి 2.3%గా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ఎకానమీలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50% మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20% కేసులు తీవ్రంగా ఉంటాయని, 1–3% మరణాలు సంభవించవచ్చని తెలిపింది. క్రూడ్, బంగారం మరింత పతనం కోవిడ్–19 భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్విటీలతో పాటు బంగారం, క్రూడ్ సహా ప్రతి ఒక్క సాధనం నుంచీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. డాలర్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. ► రాత్రి ఈ వార్తరాసే 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 37 డాలర్ల నష్టంతో (2.5 శాతం) 1,489 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,484 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ► ఇక క్రూడ్ విషయానికి వస్తే, స్వీట్ బ్యారల్ ధర 18 శాతం (5 డాలర్లు) నష్టంతో 22.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ ఆయిల్ 12 శాతంపైగా (3 డాలర్లు) నష్టంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి 18 సంవత్సరాల కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ► ఇక ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 2 శాతం (2 డాలర్లు)పైగా లాభంతో 101.868 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
ఒడిదుడుకుల వారం!
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ చరిత్రలోనే అత్యధికంగా 3091 పాయింట్లు (10 శాతం) నష్టపోయి.. 45 నిమిషాల హాల్ట్ తరువాత, ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన కొద్ది సేపట్లోనే రికవరీతోపాటు 550 పాయింట్లవరకూ పెరిగింది. ఈ వారం ట్రేడింగ్‌లో కూడా ఇదే తరహాలో భారీ స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అన్నారు. ఇటువంటి ఆటుపోట్లను చూసి ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని సిద్ధార్థ సూచించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 108కి చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్ తీవ్రత అధికంగా ఉందని వెల్లడైంది. ఇటువంటి పరిణామాలతో ఒడిదుడుకులు భారీ స్థాయిలోనే ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్ జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో బౌన్స్ బ్యాక్ ఉండొచ్చని ఇండియానివేష్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ వినయ్ పండిట్ తెలిపారు. ఈ నెల్లో రూ. 37,976 కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో ఇప్పటివరకు రూ. 37,976 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చి 2–13 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 24,776 కోట్లను, డెట్ మార్కెట్ నుం చి రూ. 13,200 కోట్లను వెనక్కు తీసుకున్నారు.