incharge
-
‘నీ అక్రమ అరెస్టులు, ఉడత బెదిరింపులకు భయపడం’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు.అయితే,కొణతం దిలీప్ కుమార్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కేటీఆర్ ఏమన్నారంటే ప్రశ్నిస్తే సంకెళ్లు...నిలదీస్తే అరెస్టులు..నియంత రాజ్యమది...నిజాం రాజ్యాంగమిది..కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్ విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా?ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్!ప్రజాస్వామ్య…— KTR (@KTRBRS) November 18, 2024 -
బీఆర్ఎస్ సోషల్‌మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్‌మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం(నవంబర్ 18) అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంగా దిలీప్‌ను అరెస్టు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్‌ను అరెస్టు చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆస్పత్రితో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కొణతం దిలిప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్‌కు తొలి డైరెక్టర్‌గా పనిచేశారు.ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు సరికాదు: హరీశ్‌రావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎక్స్(ట్విటర్)లో పెట్టిన పోస్టుకు సంబంధించిన కేసులో దిలీప్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. -
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్‌మాధవ్‌ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిల్
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఇంతకు మందు.. లోక్‌సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఈయన పూర్తి పేరు అభయ్‌కుమార్ పాటిల్ దక్షిణ బెల్గాం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించిన అభయ్కు సోషల్ మీడియా ద్వారా యూత్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు మరోవైపు.. నియోజకవర్గానికి ఐటీ పార్క్ ఏర్పాటు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. బెలగావి అభివృద్ధి కోసం విజన్ 2040 పేరిట ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. -
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( జీహెచ్ఎంసీ) ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల పాటు లీవ్‌లో వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. -
BRS: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
సాక్షి,గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం(ఏప్రిల్14) భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాజయ్యకు స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్‌కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కాగా, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కేసీఆర్ రాజయ్యకే ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సుధీర్‌కుమార్‌కు కేటాయించారు. అయినా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఇంఛార్జ్ బాధ్యతల కోసం రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్ -
కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజబాబు మండిపడ్డారు. అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. జనసైనికులు, వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను. టీడీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేము. పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను’’ అని రాజబాబు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
ఇన్చార్జులపై ‘రూకలు’పోటు
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ మసిబూసి మారేడు కాయ చేసి ప్రస్తుత ఇన్చార్జులను వంచించేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు వారిచేత డబ్బులు ఖర్చుచేయించి ఇప్పుడు రోకలిపోటుకు సిద్ధమైంది. మంత్రా ల యం, ఎమ్మిగనూరు, ఆదోనిలో అభ్యర్థులను మార్చేందుకు యోచిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై టీడీపీ జోన్–4 ఇన్చార్జ్ బీద రవిచంద్రయాదవ్ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జ్‌లు డైలమాలో పడ్డారు. ఎమ్మిగనూరు ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనను కాదని మాచాని సోమనాథ్‌ను బరిలోకి దించే యోచనలో టీడీపీ ఉంది. శనివారం కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సోమనాథ్‌ను కలిశారు. టికెట్ విషయం ప్రస్తావించారు. అయితే సమయం ఇవ్వాలని ఆలోచించి చెబుతా మని సోమనాథ్ చెప్పినట్లు తెలుస్తోంది. సోమనాథ్‌కు టికెట్ ఇస్తే జయనాగేశ్వరరెడ్డి రాజకీయ ప్రయాణం ముగిసినట్లే! ఆదోని ఇన్చార్జ్గా మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన తరఫున సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టికెట్ దక్కించుకోవాలని భావిస్తున్నారు. కుదరకపోతే తానే టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచన కూడా చేస్తున్నట్లు తెలు స్తోంది. టీజీ వెంకటేశ్‌కు బంధువు కావడంతో విశ్వప్రసాద్‌కు టికెట్ ఇప్పించేందుకు వెంకటేశ్, భరత్ కూడా యత్నిస్తున్నట్లు తెలు స్తోంది. దీంతో మీనాక్షినాయుడు శుక్రవారం ఆదోని లో సదస్సు నిర్వహించారు. ‘ఎవరంటే వారు టికెట్ అడుగుతున్నారని, ఇదేమైనా సినిమా టికెట్టా? అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నట్లు తె లుస్తోంది. తనకేనా లేదా తన కుమారుడు భూపాల్ నాయుడుకైనా టికెట్ వస్తుందని,లేనిపక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం. మంత్రాలయంలో రాఘవేంద్ర జపం మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్గా తిక్కారెడ్డి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తిక్కా రెడ్డి ఓడారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కాకుండా బీసీ వర్గానికి చెందిన రాఘవేంద్రని బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది. ఇటీవల టీడీపీలో చేరిన రాఘవేంద్ర.. చంద్రబాబును కలిశారు. కచ్చితంగా బీసీలకే టిక్కెట్ ఇస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని రాఘవేంద్రకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 2 ఎన్నికల్లో టీడీపీ కోసం భారీగా ఖర్చు చేశానని, తనకు టి కెట్ ఇవ్వకపోతే పార్టీలో కొనసాగనని తిక్కారెడ్డి తన వర్గీయులతో చెప్పినట్లు సమాచారం. -
భూమన అభినయ్ ఫస్ట్ ఇంటర్వ్యూ..తిరుపతి ఇంచార్జ్ గా ప్రకటించిన తరువాత
-
ఠాక్రేకు టీపీసీసీ వీడ్కోలు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మున్షీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్ చార్జిగా నియమితులైన ఆయన కు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేత లు కలిసి అభినందనలు తెలి పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు హర్కర వేణు గోపాల్, అంజన్‌కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు ఎం.ఎ.ఫహీం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భూపతిరెడ్డి నర్సారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆయనను కలిసి వీడ్కోలు పలికారు. ఠాక్రేకు టీపీసీసీ పక్షాన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలోనే మహారాష్ట్ర కు వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ఇన్చార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ త్వర లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు చేశారు. ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై సమీక్షలు, సమావేశాల నిర్వహణ, ప్రజాపాలనపై పర్యవేక్షణ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ సమన్వయం చేస్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇన్చార్జి మంత్రిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఎస్టీ రిజర్వు కావడంతో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ములుగు ఎమ్మెల్యేను సీతక్కను జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహరించారు. ఇవి చదవండి: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం -
జగనన్న సైనికురాలిని.. సీటు ఇవ్వకున్నా ఆయన వెంటే: మంత్రి రోజా
-
మహిళాకూలీతో అంగన్వాడీ నిర్వహణ
మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని కంచన్‌పల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఓ మహిళా కూలీ టీచర్ అవతారమెత్తారు. కేంద్రంలో టీచర్, ఆయా లేకపోవడంతో ఓ కూలీని పెట్టి కేంద్రం నిర్వహణ కొనసాగించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా, మహిళా కూలీ బెత్తం చేతబట్టుకుని పిల్లలను వారించడాన్ని చూశారు. కూలీతో అంగన్వాడీ కేంద్రం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా.. అంగన్వాడీ కేంద్రంలో కూలీని పెట్టలేదని, పక్క అంగన్వాడీ కేంద్రానికి ఇన్చార్జ్ ఇచ్చినట్లు సూపర్వైజర్ మల్లమ్మ తెలిపారు. -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
-
జనసేనకు ‘మేడా’ గుడ్‌బై
మధురపూడి: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. కోరుకొండలో ఆదివారం ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్.. ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని, ఈ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజారాజ్యం, తరువాత జనసేన పార్టీలో కలిపి 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని చెప్పారు. పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, ఈ కారణంతోనే మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, రాజురవితేజ, జయలలిత వద్ద చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు జనసేనకు గుడ్‌బై చెప్పారని గుర్తుచేశారు. వారితో పోలిస్తే తాను చాలా చిన్నవాడినన్నారు. తనను నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు తనకు తెలియజేయలేదని, అధిష్టానం అపాయింట్మెంట్ కోసం 87 రోజులుగా వేచి చూశానని.. చివరకు ఈ అవమానం భరించలేక రాజీనామా చేస్తానని గత నెల 30న లేఖ రాసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు జనసేన కోరుకొండ మండలాధ్యక్షుడు మండపాక శ్రీను, రాజానగరం మండలాధ్యక్షుడు బత్తిన వెంకన్నదొర, ఉపాధ్యక్షుడు నాగారపు భానుశంకర్, నాయకులు అడబాల సత్యనారాయణ, కొచ్చెర్ల బాబీతోపాటు 100 మంది జనసేనకు గుడ్‌బై చెప్పారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు. స్థానిక నాయకత్వం వన్‌మ్యాన్ షోలా వ్యవహరించడం, ఇతర సమస్యల కారణంగా రాజీనామాలు తప్పవన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. -
దయచేసి రావాలి..!!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినా పార్టీ నాయకులు, క్యాడర్ బయటకు రాకపోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా నిరసనలు చేయకపోవడం సరికాదన్నారు. ఎందుకు ఆందోళనలు చేయడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని, తనకు చాలా బాధగా ఉందని, ఇప్పటికైనా జనసమీకరణ చేయాలని పార్టీ నాయకులను ప్రాధేయపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎలాగైనా జనాన్ని తరలించాలని అచ్చెన్నాయుడు వేడుకుంటున్న ఆడియో లీక్ అయింది. ‘పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేశారు. ఇంతకంటే మనకు, పార్టీకి ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు.. రాదు కూడా! నేను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించటానికి కారణం... ఆ చుట్కుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. పోలీసులు ఆపుతున్నారని మీరు అనవచ్చు. వాళ్లు చేస్తారు. దయ ఉంచి.. ఎక్కడి కక్కడ అర్బన్ నియోజకవర్గాల్లో బొండా ఉమ, గద్దె రామ్మోహన్, వన్‌టౌన్ నాయకులు, బోడె ప్రసాద్ బయటకు రావాలి. పెద్ద నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు గానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్‌కు ఎక్కడా ఇబ్బంది లేదు. వెంటనే అందరూ రంగంలోకి దిగి జనసమీకరణ చేయాలి. అందులో మహిళలు ఎక్కువ మంది ఉండాలి’ అని అందులో అచ్చెన్న పేర్కొన్నారు. రాత్రి నుంచి చెబుతూనే ఉన్నా.. తాను రాత్రి 3 గంటల నుంచి జనసమీకరణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నానని విజ యవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు. తమ నియోజకవర్గం వాళ్లను పో లీస్ స్టేషన్లో పెట్టారని, వాళ్లంతా చాలా చికాకుగా ఉందని ఫోన్లు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాపోయారు. మహిళల్ని ఇబ్బంది పెట్టకపోయినా... వెళ్లిపోతారా? లేదా వ్యాన్ ఎక్కించమంటారా? అని అడుగుతున్నారని చెప్పారు. సెకండరీ లీడర్లు చాలా భయపడుతున్నారని, ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పోలీసులు బయటకు రానివ్వడం లేదని విజయవాడ సెంట్రల్ ఇన్‌ఛార్జి బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చాలా ఇబ్బందులున్నాయని, 20 మంది కార్యకర్తలను పంపిస్తే రాత్రి 11 గంటలకు వదిలారని మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి తిప్పుతున్నా చిన్న చిన్న కారణాలు చెప్పి బయటకు రాకపోవడం బాగోలేదని టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్‌సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్‌రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్‌నగర్–వి.చంద్రశేఖర్, నాగర్‌కర్నూల్– ఎడ్ల ఆశోక్‌రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్‌బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్‌రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్‌రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్‌రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్‌రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్‌కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్‌నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్‌కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్‌రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్‌యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్‌కుమార్‌గౌడ్. -
రెగ్యులర్ అధికారులు లేక.. గాడితప్పుతున్న పాలన..!
బెజ్జూర్: మండలంలో ఇన్చార్జీల పాలన కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల్లో ప్రభుత్వం నియమించిన ఇన్చార్జీలు పూర్తిస్థాయిలో ఇక్కడ పని చేయలేకపోతున్నారని దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలో తహసీల్దార్, పశువైద్యాధికారి, టీజీబీ మేనేజర్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. మండలానికి వచ్చేందుకు విముఖత.. మండలంలో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో మండల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి గత ఆగస్టు 8న బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమించిన అధికారి ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా తహసీల్దార్లను బెజ్జూర్‌కు వెళ్లాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో నెలరోజుల నుంచి డెప్యూటీ తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు ఇన్చార్జి తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. పశు వైద్యాధికారి లేక ఇబ్బందులు.. మండల కేంద్రంలో పశు వైద్యాధికారి లేకపోవడంతో రైతులు, పాడి పోషకులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లుగా ఇక్కడ రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడంతో పెంచికల్‌పేట పశువైద్యాధికారి రాకేశ్‌ను ఇన్‌చార్జీగా నియమించారు. ఆయ న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో గాలికుంటు వ్యాధి, సీజనల్ వ్యాధులతో పశువులు అల్లాడిపోతున్నాయని పేర్కొంటున్నారు. రైతులకు అందని బ్యాంక్ సేవలు బెజ్జూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మూడు నెలల క్రితం అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ తీసుకున్నారు. మేనేజర్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేయగా.. పెంచికల్పేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్‌ను ఇక్కడ ఇన్చార్జి మేనేజర్‌గా నియమించారు. రెగ్యులర్ మేనేజర్ కావడంతో రైతులకు రుణాల రెన్యూవల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్చార్జి మేనేజర్ కావడంతో సకాలంలో సేవలు అందడం లేదని బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు. విద్యార్థులకు తప్పని తిప్పలు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కుంటలమానేపల్లి ప్రధానోపాధ్యాయుడు ఇక్కడ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. సదరు ఉపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ విద్యా బోధన చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
బీజేపీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీని గద్దెనెక్కించాలనే దృఢసంకల్పంతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి పదునుపెడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చి ఆయన స్థానంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన అధిష్టానం మరో కీలక మార్పు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్షూటర్గా పేరున్న కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను రంగంలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న తరుణ్ ఛుగ్‌ను తొలగించి ఆయన స్థానంలో భూపేంద్ర యాదవ్‌ను పంపిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పట్టున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను క్రియాశీలం చేయను న్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత భూపేంద్ర నాలుగో స్థానంలో ఉన్నారు. యూపీ, బిహార్, హరియాణాల్లో భూపేంద్ర యా దవ్ రచించిన వ్యూహాలు పార్టీ విజయానికి బాటలు వేశాయి. 2019 ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి నడ్డాతో భేటీ.. రాష్ట్ర అధ్యక్ష మార్పు ప్రకటన వెలువడిన సమయంలో భూపేంద్రయాదవ్ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. ప్రకటన వెలువ డటానికి కొద్దిగంటల ముందు జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ అయిన సమయంలో కూడా భూపేంద్రయాదవ్ ఉన్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సుమారు గంటపాటు నడ్డా, యాదవ్ తెలంగాణ రాజకీ యాలపై గంటపాటు చర్చించుకున్నట్లుగా సమాచారం. -
TS: ఇంఛార్జ్‌లకు కొత్త టెన్షన్.. బీజేపీకి బిగ్ మైనస్ అదేనా?
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు జాతీయ పార్టీలు ఇంఛార్జ్‌లను పెట్టుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర ఇంఛార్జ్‌లు ఏం చేస్తున్నారు? వారి వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్ అవుతాయా?.. జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్ లను నియమించుకుని తమ ప్రణాళికలను అమలు చేస్తుంటాయి. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఇంఛార్జ్ లను పెట్టుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంఛార్జ్ గా మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు ఠాక్రే వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి తెలంగాణ వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నలుగురు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శులు శివప్రకాశ్, సునీల్ బన్సాల్ తో పాటు పొలిటికల్ ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్, సహ ఇంఛార్జ్ గా అరవింద్ మీనన్ పనిచేస్తున్నారు. పార్టీలో అన్నీ తామై ముందుకు నడపాల్సిన బాధ్యత ఇంఛార్జ్ లపై ఉంటుంది. రాజకీయ క్షేత్రంలో నేతలను సమన్వయం చేయడం కష్టసాధ్యమైన పని. కాంట్రావర్సీల జోలికి వెళ్లకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ.. కార్యక్రమాలను రూపొందించడం.. పార్టీ నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల్లో అందరిని ఇన్వాల్వ్ చేయడం పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ల కర్తవ్యం. తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌ల తీరు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటా అన్నట్లుగా ఉందని సొంత పార్టీలోనే నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసమ్మతి నేతలు తరుచూ భేటీ అవుతున్నారు. అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం సాధించే పనిని వదిలేసి.. ఇంఛార్జ్ లుగా పెత్తనం చేస్తున్నారని మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పలువురు నేతలకు పొసగడం లేదు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా.. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ లు ఇప్పటి వరకు సర్ధుబాటు చేయలేదని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూపీ లాంటి పెద్దరాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా పనిచేసి వచ్చిన సంస్థాగత ఇంఛార్జ్ సునీల్ బన్సల్ చేస్తున్న ప్రయోగాలు తెలంగాణ నేతలు ఒంటపట్టించుకోవడం లేదట. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బూత్ స్వశక్తికరణ్ లాంటి కార్యక్రమాలతో తొలుత హడావిడి చేసినా.. తర్వాత స్థానిక నేతల తీరుతో బన్సల్ విసిగిపోయారట. పొలిటికల్ ఇంఛార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్ తెలంగాణకు రావడమే తగ్గించారు. నేతల మధ్య సమన్వయం కోసం ఎలాంటి వర్క్ అవుట్స్ చేయకపోవడం బీజేపీకి పెద్దమైనస్ గా మారిందని చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికల విజయంతో దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతోంది. టీపీసీసీ ఇంఛార్జ్ గా మాణిక్‌రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు అంతర్గత గొడవలు తగ్గాయి. పీసీసీ ఛీఫ్ రేవంత్‌పై పార్టీలో అసమ్మతి జ్వాలలు తగ్గించడంలో ఠాక్రే కీలకంగా వ్యవహరించారని టాక్. గాంధీభవన్ లో అందుబాటులో ఉంటూ..సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతున్నారు. నేతల చేరికలపై ఎప్పటికప్పుడు ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎటువంటి హంగామా లేకుండా తెరవెనక పావులు కదుపుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు జాతీయ పార్టీల నేతలు. నలుగురు ఇంఛార్జ్ లతో బీజేపీ.. ఒకే ఇంఛార్జ్ తో కాంగ్రెస్ ఎన్నికల రేసులో దిగుతున్నాయి. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: TS: సైలెంట్ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే? -
కర్ణాటక ఎన్నికలకు బీజేపీ సారథిగా ఉజ్వల్ మ్యాన్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపులతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. ఇక ఈ ఏడాది వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. తాజాగా ఆ రాష్ట్రానికి ఎన్నికల సారథిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(54)ను నియమించింది ఆ పార్టీ. అలాగే.. కో ఇన్ఛార్జిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పేరుతో ఒక ప్రకటనను శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖలను ధర్మేంద్ర ప్రధాన్ చూసుకుంటున్నారు. ఒడిషాలో పుట్టిపెరిగిన ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ తనయుడు. దేవేంద్ర ప్రధాన్.. వాజ్‌పేయి హయంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ధర్మేంద్ర ప్రధాన్.. ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టారు. పలు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగానూ పని చేశారు. 2004లో దియోగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆపై బీహార్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘ కాలం పెట్రోలియం, సహజ ఇంధనాల శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ధర్మేంద్ర ప్రధాన్ ఖాతాలో ఉంది.ఈయన హయాంలోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం అయ్యి.. విజయవంతమైంది. అందుకే ఈయన్ని ఉజ్వల మ్యాన్‌గా పిలుస్తుంటారు. ఆంత్రోపాలజీలో పీజీ చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. మంచి వక్త కూడా. ఈ ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా.. ప్రభుత్వ ఏర్పాటులో అద్భుతం సృష్టిస్తామంటూ జేడీఎస్ ప్రకటించుకుంటోంది. -
రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్చార్జ్ సర్పంచ్ భిక్షాటన
కౌడిపల్లి (నర్సాపూర్): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్చార్జి సర్పంచ్ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై -
కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఇన్ఛార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజయ్ మాకెన్ రాజీనామాతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడినట్లయింది. అయితే మాకెన్ రాజీనామాకు బలమైన కారణమే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. సెప్టెంబర్‌లో సీఎం అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన నేతలు కొందరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గహ్లోత్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తే అంగీకరించే ప్రసక్తే లేదని వారు తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని స్పీకర్ దగ్గరకు వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. వీరి కారణంగానే అశోక్ గహ్లోత్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు వ్యవహారంలో ముఖ్యంగా ముగ్గురు నేతలు శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాఠోడ్ కీలకంగా వ్యవహరించారు. వీరే సెప్టెంబర్ 25న కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి డుమ్మాకొట్టి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపైనే కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి నోటీసులు కూడా పంపింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజయ్ మాకెన్ కూడా పార్టీ అధిష్ఠానికి ఇప్పటికే స్పష్టం చేశారు. చర్యలు లేకపోవడంతో.. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఆ ముగ్గురు నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అజయ్‌మాకెన్ కలత చెందారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండి ఏం ప్రయోజనం అని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. నవంబర్ 8నే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారని వెల్లడించారు. అయితే ఖర్గే ఆయన రాజీనామాను అమోదించలేదని, పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం అజయ్ మాకెన్ వారం రోజులు వేచిచూసినప్పటికీ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్ కూడా రెండు వారాల క్రితమే రాజస్థాన్ కాంగ్రెస్‌లో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అధిష్ఠానం నుంచి ఆ దిశగా ఎలాంటి అడుగు పడకపోవడంతోనే అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ కారణంగానే ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత.. -
Munugode Bypoll Results: సీఎం కేసీఆర్ సారు గ్రామంలో కారు జోరు
మర్రిగూడ/చండూరు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇన్చార్జిగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూత్‌లలో 4,009 మంది ఓటర్లు ఉండగా 2,793 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,610, బీజేపీకీ 899, కాంగ్రెస్‌కు 95, బీఎస్పీకి 34, మిగతావి ఇతరులకు పోలయ్యాయి. కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో 47 ఓట్ల ఆధిక్యం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ ఎంపీటీసీ–1కు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 1359 ఓట్లు, బీజేపీకి 1312 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరపున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు. మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఇక్కడ మూడు బూత్‌లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2,522 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,389, బీజేపీకి 792, కాంగ్రెస్‌కు 174, బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్ఎస్కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..