Indian Badminton League
-
జనవరిలో ఐబీఎల్-2
బరిలో ఆరు జట్లు 15 రోజుల పాటు పోటీలు న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా గురువారం ప్రకటించారు. స్టార్ షట్లర్లు సైనా, సింధు, శ్రీకాంత్, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ సమక్షంలో టోర్నీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆరింటిలో రెండు ఫ్రాంచైజీలను నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీ జట్టును ఇన్ఫినిటి సొల్యుషన్స్ తీసుకోగా, లక్నో టీమ్‌ను సహారా పరివార్ చేజిక్కించుకుంది. అయితే ఐబీఎల్ తొలి సీజన్‌ను నిర్వహించిన స్పోర్టీ సొల్యూషన్స్ ఐబీఎల్‌పై హక్కులు తమవేనంటూ ఢిల్లీలో కోర్టుకెక్కింది. -
‘మై హోం’కు హైదరాబాద్ ఫ్రాంచైజీ!
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ బ్యాడ్మిం టన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 2013లో తొలి సీజన్ జరిగిన అనంతరం వివిధ కారణాలతో ఐబీఎల్‌ను నిర్వహించలేదు. దీంతో 2016 జనవరిలో రెండో సీజన్‌ను జరిపేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్ణయించింది. ఆరింట్లో ఐదు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. తొలి సీజన్ విజేత హైదరాబాద్ హాట్‌షాట్స్‌ను రియల్టీ సంస్థ మై హోమ్ గ్రూప్ దక్కించుకున్నట్టు సమాచారం. గతంలో ఈ జట్టు పీవీపీ యాజమాన్యంలో ఉండేది. లక్నో (అవధే వారియర్స్) జట్టును సహారా ఇండియా పరివార్ నిలబెట్టుకోగా ఢిల్లీ స్మాషర్స్‌ను ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ (ఐసీఎస్) జట్టు దక్కించుకుంది. అలాగే బెంగళూరును జిందాల్ గ్రూప్, చెన్నైని సైకిల్ అగర్బత్తి, ముంబైని ఓ రియాల్టీ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. -
సచిన్ X గవాస్కర్
ఏదో ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ కోసం కాదు... ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)ను నిర్వహించేందుకు ఈ క్రికె ట్ దిగ్గజాలు పోటీ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఐబీఎల్ తొలి సీజన్ విజయవంతమైనా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), నిర్వాహకుల మధ్య విభేదాల కారణంగా ఆగిపోయింది. దీంతో రెండో సీజన్ జరగలేదు. మళ్లీ ఈ లీగ్‌ను పునఃప్రారంభించేందుకు ‘బాయ్’ ప్రణాళికలు సిద్ధం చేసింది. జనవరి 1 నుంచి 18 వరకు టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. దీంతో లీగ్ నిర్వహణ కోసం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 15 బిడ్లు వచ్చాయి. ఇందులో గవాస్కర్, సచిన్‌లకు చెందిన స్పోర్టింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న జట్లను, ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసి కొత్త జట్లతో ఐపీఎల్ పునఃప్రారంభమవుతుంది. మరి దీని హక్కులు ఎవరు గెలుచుకుంటారనేది మూడు, నాలుగు రోజుల్లో తేలనుంది. -
ఆఫ్ ద ఫీల్డ్
సచిన్ x గవాస్కర్ ఏదో ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ కోసం కాదు... ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)ను నిర్వహించేందుకు ఈ క్రికె ట్ దిగ్గజాలు పోటీ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఐబీఎల్ తొలి సీజన్ విజయవంతమైనా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), నిర్వాహకుల మధ్య విభేదాల కారణంగా ఆగిపోయింది. దీంతో రెండో సీజన్ జరగలేదు. మళ్లీ ఈ లీగ్‌ను పునఃప్రారంభించేందుకు ‘బాయ్’ ప్రణాళికలు సిద్ధం చేసింది. జనవరి 1 నుంచి 18 వరకు టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. దీంతో లీగ్ నిర్వహణ కోసం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 15 బిడ్లు వచ్చాయి. ఇందులో గవాస్కర్, సచిన్‌లకు చెందిన స్పోర్టింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న జట్లను, ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసి కొత్త జట్లతో ఐపీఎల్ పునఃప్రారంభమవుతుంది. మరి దీని హక్కులు ఎవరు గెలుచుకుంటారనేది మూడు, నాలుగు రోజుల్లో తేలనుంది. -
ఏప్రిల్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్
న్యూఢిల్లీ: గత ఏడాది బ్యాడ్మింటన్ అభిమానులను ఆకట్టుకున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ (2014) మాత్రం నిర్వహించనే లేదు. దాంతో ఈ టోర్నీ ఇకపై సాగుతుందా, లేదా అనే సందేహాలు వినిపించాయి. అయితే వచ్చే సంవత్సరం ఐబీఎల్ జరపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఏప్రిల్ 12నుంచి మే 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో, ఫైనల్ మ్యాచ్ ముంబైలో నిర్వహిస్తారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా, టోర్నీ హక్కులు ఉన్న స్పోర్టీ సొల్యూషన్స్ మధ్య విభేదాలతోనే ఈ సంవత్సరం టోర్నీ జరగలేదు. స్పోర్టీనుంచి గ్యారంటీ మనీగా రూ. 50 కోట్లు గుప్తా డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు గత వారం కేంద్ర క్రీడా మంత్రి సోనోవాల్ జోక్యంతో సమస్య పరిష్కారమైంది. మరో వైపు ఢిల్లీ, ముంబై జట్ల ఫ్రాంచైజీలు కూడా మారిపోయారు. గవాస్కర్, నాగార్జున, చాముండిలకు చెందిన ముంబై జట్టును వారు మరో సంస్థకు అమ్మేశారు. ఢిల్లీ జట్టు తమ ఆటగాళ్లకు చెల్లింపులు జరపడంలో విఫలం కావడంతో ఆ ఫ్రాంచైజీని రద్దు చేసి మరొకరికి ఇచ్చినట్లు సమాచారం. -
గాయాలు దాటి గాడిలోకి..
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌పై కశ్యప్ దృష్టి న్యూఢిల్లీ: గతంలో పదే పదే గాయాలు కావడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందానని, అయితే ప్రస్తుతం వాటిని అధిగమించి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీకి సిద్ధమయ్యానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి ఇండియా ఓపెన్ టోర్నీ జరగనున్న నేపథ్యంలో హైదరాబాదీ కశ్యప్ మాట్లాడుతూ... స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. గత ఏడాది ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో కాలి మడమ గాయంతో మొదలుకొని కశ్యప్ వరుసగా గాయాలపాలయ్యాడు. ఫలితంగా పలు టోర్నీలకు దూరం కావాల్సి వచ్చింది. గత డిసెంబర్లో అయిన భుజం గాయం తిరిగి జర్మన్ ఓపెన్‌లో తిరగబెట్టింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు లోనయ్యానని కశ్యప్ తెలిపాడు. అయితే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో భుజానికి పట్టీ వేసుకొని ఆడడం సౌకర్యవంతంగా అనిపించిందని, స్విస్ ఓపెన్‌లోనూ అలాగే ఆడి సెమీస్‌కు చేరుకోగలిగానన్నాడు. ‘భుజానికి పట్టీతోనే స్విస్ ఓపెన్‌లో రాణించగలిగాను. దీంతో నొప్పి కూడా లేదు. మరో 4, 5 నెలలపాటు ఇలాగే ఆడాల్సి ఉంటుంద’ని కశ్యప్ అన్నాడు. ఇండియా ఓపెన్‌లో తొలిరౌండ్లోనే జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) వంటి గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొనాల్సి రావడం పరీక్షేనని, అయితే ప్రస్తుతం తన ఫామ్‌తో అతణ్ని ఓడించగలనని కశ్యప్ ధీమా వ్యక్తం చేశాడు. ఇండియా ఓపెన్ తర్వాత కశ్యప్ ఏప్రిల్ 8 నుంచి 13 వరకు జరిగే సింగపూర్ ఓపెన్‌లో పాల్గొంటాడు. -
సింధు x సైనా
-
సింధు x సైనా
ఫైనల్స్ మ.గం.2.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం లక్నో: గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సైనా, సింధుల మధ్య మ్యాచ్ జరిగింది. అందులో సైనా గెలిచింది. కాకతాళీయమే అయినా... గణతంత్ర దినోత్సవం రోజున మళ్లీ ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ సారి ఇండియా గ్రాండ్ ప్రి ఫైనల్లో ఈ ఇద్దరూ తలపడుతున్నారు. శనివారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సైనా 21-14, 17-21, 21-19తో ఆరోసీడ్ జువాన్ డెంగ్ (చైనా)పై నెగ్గగా; రెండోసీడ్ సింధు 21-6, 12-21, 21-17తో నాలుగోసీడ్ లిండ్వెని పెనెట్రీ (ఇండోనేసియా)ను ఓడించింది. పురుషుల సెమీస్‌లో ఆరోసీడ్ కె.శ్రీకాంత్ 21-18, 22-20తో ఏడోసీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ (భారత్)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో సెమీస్‌లో ఆదిత్య ప్రకాశ్ 10-21, 7-21తో జు సంగ్ (చైనా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 18-21, 15-21తో లి జున్హ్-లి యుచెన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. -
జ్వాలపై జీవితకాల నిషేధం!
న్యూఢిల్లీ: వివాదాస్పద బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జీవిత కాల నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఇటీవలి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తమ ఫ్రాంచైజీ క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను బంగా బీట్స్‌తో మ్యాచ్ ఆడనీయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాయ్ ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈనేపథ్యంలో జ్వాలపై జీవిత కాల నిషేధం లేక ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించాలని కమిటీ సూచించినట్టు బాయ్ సీనియర్ అధికారి చెప్పారు. అసోసియేషన్ సభ్యులందరికీ ఇప్పటికే ఈ సూచనలను పంపించారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడను. ఒకవేళ జ్వాల బేషరతుగా క్షమాపణ చెబితే ఎలాంటి శిక్ష పడకుండా బయటపడవచ్చు. అది బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే జరిగినదానిపై ఆమె విచారం వ్యక్తం చేయాల్సి ఉంది.’ అని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మురళీధరన్ చెప్పారు. గతంలో జ్వాలకు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు ఈ హైదరాబాద్ క్రీడాకారిణి సమాధానం ఇచ్చింది. ఢిల్లీ యాజమాన్యం చెప్పినట్లే చేశానని, తన వ్యక్తిగత నిర్ణయం కాదని ఆమె పేర్కొంది. అయితే ఈ వివరణ పట్ల బాయ్ సంతృప్తి చెందలేదు. లేఖ రాయనున్న బాయ్ అధ్యక్షుడు కమిటీ ఇచ్చిన సూచనలపై స్పందన కోసం జ్వాలకు భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా త్వరలోనే లేఖ రాయనున్నట్టు సమాచారం. ప్రతిస్పందన కోసం ఆమెకు వారం రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాతే శిక్ష ఖరారు ఉంటుందని బాయ్ వర్గాలు తెలిపాయి. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: క్రాంతి జ్వాల ఎలాంటి తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆమె తండ్రి క్రాంతి ‘సాక్షి’తో చెప్పారు. ‘బాయ్ మాకు నేరుగా ఏమీ చెప్పలేదు. మీడియా ద్వారానే తెలిసింది. కనీసం మాపై చర్య తీసుకుంటున్న విషయం మాకు చెప్పకపోతే ఎలా? ఇది చాలా బాధాకరం. అయినా నిర్ణయం తీసుకున్న తర్వాత క్షమాపణ చెప్పమనడంలో అర్థం లేదు. జ్వాల ఎలాంటి తప్పు చేయలేదు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని క్రాంతి అన్నారు. -
సింధు, శ్రీకాంత్‌లపైనే దృష్టి
టోక్యో: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారులు తొలి పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విశ్రాంతి కోరుకున్న సైనా నెహ్వాల్... చీలమండ గాయంతో పారుపల్లి కశ్యప్ ఈ టోర్నమెంట్ బరిలోకి దిగడంలేదు. ఈ నేపథ్యంలో భారత ఆశలన్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌లపై ఆధారపడి ఉన్నాయి. టోర్నీ తొలిరోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత తొలి అంతర్జాతీయ టోర్నీలో ఆడుతోన్న సింధు తొలి రౌండ్లోనూ, రెండో రౌండ్లోనూ క్వాలిఫయర్స్‌తో ఆడనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)తో సింధు ఆడాల్సి ఉంటుంది. మరో పార్శ్వంలో ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్), నాలుగో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) ఉన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఆరుగురు మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. శ్రీకాంత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్, ఆనంద్ పవార్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, హెచ్.ఎస్.ప్రణయ్‌లకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది. తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ యున్ హూ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షో ససాకి (జపాన్)తో శ్రీకాంత్; సోనీ ద్వి కున్కురో (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్; తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో అజయ్ జయరామ్; వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)తో ప్రణయ్; క్వాలిఫయర్‌తో సౌరభ్ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హిరోయుకి సయెకి-తహోతా (జపాన్) జోడితో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం ఆడుతుంది. మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగడంలేదు. -
జయరామ్, పవార్ ఓటమి
చాంగ్జూ (చైనా): ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో విశేషంగా రాణించాక పాల్గొన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు అజయ్ జయరామ్ నిరాశపరిచాడు. చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జయరామ్ 14-21, 21-23తో యుకున్ చెన్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఐబీఎల్‌లో చాంపియన్ హైదరాబాద్ హాట్‌షాట్స్ తరఫున పాల్గొన్న జయరామ్ ప్రపంచ 13వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్పై, ప్రపంచ ఐదో ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్పై, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ జాన్ జార్గెన్షన్పై సంచలన విజయాలు సాధించాడు. అయితే అలాంటి ప్రదర్శనను చైనా ఓపెన్‌లో పునరావృతం చేయలేక తొలి రౌండ్లోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) నుంచి ‘వాకోవర్’ పొందిన మరో భారత ప్లేయర్ ఆనంద్ పవార్ రెండో రౌండ్లో 21-12, 14-21, 16-21తో షో ససాకి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో నెగ్గిన ఈ ముంబై ప్లేయర్ ఆ తర్వాత తడబడ్డాడు. -
జ్వాల ప్రవర్తనపై ‘బాయ్’ విచారణ
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) సందర్భంగా జ్వాల వ్యవహరించిన తీరుపై విచారణ జరపాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్ణయించింది. బంగా బీట్స్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా... తన సహచర ఆటగాళ్లు బరిలోకి దిగకుండా ఢిల్లీ ఐకాన్ ప్లేయర్ జ్వాల అడ్డుకుందని ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై ఇప్పటికే ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బాయ్ భావిస్తున్నట్లు సమాచారం. -
భళా బ్యాడ్మింటన్!
సాక్షి క్రీడా విభాగం భారత్‌లో క్రికెట్‌ను మినహాయించి మరో ఆట ఏదైనా పక్షం రోజుల పాటు వార్తల్లో నిలవడం మీలో ఎవరికైనా గుర్తుందా! దీనికి లేదు అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు బ్యాడ్మింటన్ అది చేసి చూపించింది. అటు స్టేడియంలో అభిమానులు కావచ్చు ఇటు టీవీ ప్రేక్షకులు కావచ్చు కొత్తగా వచ్చిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌కు బ్రహ్మరథం పట్టారు. తొలి టోర్నీ కావడంతో అక్కడక్కడా లోపాలు కనిపించినా... మొత్తానికి ఐబీఎల్ అంచనాలను అందుకొని విజయవంతంగా క్రీడా వేదికపై నిలిచింది. వేర్వేరు కారణాలు, సాకులతో ఈ సారి టోర్నీకి దూరమైన అంతర్జాతీయ షట్లర్లు కూడా వచ్చే ఏడాది లీగ్ వైపు చూసేలా చేయడంలో నిర్వాహకులు సఫలమయ్యారు. ఆరంభ విఘ్నాలను దాటి... క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్ తర్వాత దేశంలో ఇతర క్రీడాంశాల్లోనూ లీగ్‌ల పర్వం వేగమందుకుంది. హాకీ, వాలీబాల్, కబడ్డీ... ఇలా వివిధ ఆటల్లో లీగ్ నిర్వహించినా అవి పెద్దగా క్రీడాభిమానులకు చేరువ కాలేదు. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ లీగ్ సఫలం అవుతుందా అనే సందేహాలు తలెత్తాయి. బ్యాడ్మింటన్‌కు పర్యాయపదమైన చైనా షట్లర్లు టోర్నీకి దూరం కావడంతో ఐబీఎల్ కళ తప్పుతుందని చాలా మంది భావించారు. ఇలాంటి స్థితిలో ఓ రకంగా సాహసానికి పూనుకున్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), స్పోర్టీ సొల్యూషన్స్ ధైర్యంగా అడుగు ముందుకు వేశాయి. సైనామయం... నిజాయితీగా చెప్పాలంటే లీగ్ ప్రతిపాదన, సక్సెస్ మొత్తం ఒక ప్లేయర్ చుట్టే పరిభ్రమించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ అద్భుత విజయాలే లీగ్ మార్కెటింగ్‌కు తోడ్పడ్డాయి. ఆమెతో పాటు యువ ఆటగాళ్ల ఇటీవలి ప్రదర్శన కూడా కలిసొచ్చింది. దాంతో ఆరు జట్లకు తగిన సంఖ్యలో చెప్పుకోదగిన ఆటగాళ్లు లభించారు. అందులోనూ భారత ఆటగాళ్లకు తగిన ప్రాతినిధ్యం కూడా లభించింది. లీగ్‌కు ప్రధాన ఆకర్షణ అయిన సైనా నెహ్వాల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ... ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఐబీఎల్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది కాబట్టి ఇకపై సైనా క్రికెట్ డ్రెస్‌లో ఫొటో దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం రాకపోవచ్చు. సరిదిద్దుకుంటారా? తొలిసారి జరిగిన ఐబీఎల్లోనూ లోపాలూ లేకపోలేదు. అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరం కావడం, మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు సాగడం, ఆరంభానికి ముందే వేలం మొత్తంపై నిరసనలు... స్పాన్సర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో రాకపోవడం వీటిలో కొన్ని. అయితే ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో పోలిస్తే ఇవి చెప్పుకోదగ్గవి కావు. పైగా తొలిసారి లీగ్ నిర్వహణలో ఈ ఇబ్బందులు సహజమే. వీటిని వచ్చే ఏడాది పరిష్కరించుకుంటామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. అందరూ ఖుష్... సూపర్ సిరీస్ టోర్నీల విజయాలతో పోల్చినా దక్కని మొత్తం ఐబీఎల్ ఆటగాళ్లకు లభించడం, లీ చోంగ్ వీ, తౌఫీక్ హిదాయత్లాంటి దిగ్గజాల నుంచి నేర్చుకునే అవకాశం రావడం కుర్రాళ్లకు మంచి చేసింది. ఇకపై వివిధ నగరాలకు చెందిన క్రీడాభిమానులు శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్లను కూడా సునాయాసంగా గుర్తు పడతారేమో! చైనాతో పాటు ఇతర స్టార్ ఆటగాళ్లు తాము ఐబీఎల్ ఆడకుండా తప్పు చేశామేమో అనే భావనకు లోనైతే లీగ్‌కు ఇంతకంటే మంచి ప్రశంస ఉండదు. మొత్తానికి నిర్వాహకుల మొదలు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అంతా ఒక సక్సెస్ఫుల్ టోర్నీలో భాగమయ్యారని నిస్సందేహంగా భావించవచ్చు. మా లీగ్ ఐపీఎల్ స్థాయికి చేరుతుంది! ఐబీఎల్ తొలి ఏడాదే ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే భవిష్యత్తులో తాము కూడా ఐపీఎల్ స్థాయికి చేరుకుంటామనే విశ్వాసం ఉంది. ఇప్పటికిప్పుడు ఐబీఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చడం సరైంది కాదు. అయితే లీగ్ ఇంకా ఎదగాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఐపీఎల్‌కు చేరువవుతుందనే నమ్మకముంది. పురుషుల రెండో సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అద్భుత విజయం సాధించకపోయుంటే మిక్స్డ్ డబుల్స్‌లో మా జట్టుకు కష్టమయ్యేది. నిజం చెప్పాలంటే నేను సింగిల్స్ ప్లేయర్‌ను. కిడో-పియా జోడి అద్భుతంగా ఆడుతోంది కాబట్టి మా మ్యాచ్‌పై ఆందోళనతోనే ఉన్నాను. అయితే అజయ్ తొలి గేమ్‌లో ఓడి కూడా మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది సింగిల్స్‌లో మరింత మెరుగైన షట్లర్లు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అప్పుడు లీగ్‌లో మరింత పోటీ ఉంటుంది. -సైనా నెహ్వాల్ గర్వంగా ఉంది ‘విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. హాట్‌షాట్స్ టీమ్ అంతా కుటుంబసభ్యుల్లా కలిసిపోయారు. సైనా ముందుండి నడిపించింది. ఈ పక్షం రోజులు చిరస్మరణీయం. ఐబీఎల్ ప్రకటించగానే జట్టు కోసం తొలిసారి నిర్వాహకులను కలిసింది నేనే. విజయం గురించి కాకుండా బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేయాలని నేను భావించాను. ఇప్పుడు లీగ్ సక్సెస్ కావడం కూడా గర్వంగా అనిపిస్తోంది.’ -ప్రసాద్ వి. పొట్లూరి, హాట్‌షాట్స్ యజమాని -
హైదరాబాద్... ‘హాట్’ గురూ!
భారత్‌లో బ్యాడ్మింటన్ అడ్డా హైదరాబాద్... తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన లీగ్‌లోనూ సత్తా చాటింది. అంచనాలను నిలబెట్టుకుంటూ మొదటి ఐబీఎల్‌లో విజేతగా అవతరించింది. టీమ్ ఐకన్ ప్లేయర్‌గా సైనా నెహ్వాల్ అజేయ రికార్డుతో ముందుండి నడిపించగా... సహచరులు సరైన విధంగా స్పందించడంతో హాట్‌షాట్స్‌కు గెలుపు దక్కింది. ‘స్ట్రైక్ హార్’్డ అనే తమ టీమ్ ట్యాగ్‌లైన్‌ను మరిపిస్తూ లీగ్‌పై ఈ జట్టు తమదైన ముద్ర వేసింది. మొత్తానికి తొలి ఐబీఎల్ అభిమానుల నుంచి అనూహ్య ఆదరణ దక్కించుకోవడంతో పాటు భారత్‌లో లీగ్ భవిష్యత్తుకు కూడా భరోసా కల్పించింది. ముంబై: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తొలి విజేతగా పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్ నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్ పోరులో హాట్‌షాట్స్ 3-1తేడాతో అవధ్ వారియర్స్‌ను చిత్తు చేసింది. పురుషుల తొలి సింగిల్స్‌లో శ్రీకాంత్ నెగ్గి వారియర్స్‌కు శుభారంభం ఇచ్చాడు. అయితే ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో సింధుపై సైనా సునాయాసంగా గెలవగా... పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ జోడిదే పైచేయి అయింది. కీలకమైన రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అనూహ్యంగా చెలరేగి గురుసాయిదత్‌ను ఓడించడంతో టైటిల్ హాట్‌షాట్స్ వశమైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యువ క్రీడాకారిణి పీవీ సింధు ఐకన్‌గా ఉన్న అవధ్ వారియర్స్ రన్నరప్ స్థానంతో సంతృప్తి పడింది. చెలరేగిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో తొలి మ్యాచ్ నెగ్గి శ్రీకాంత్ వారియర్స్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. అతను 21-12, 21-20తో హైదరాబాద్ ప్లేయర్ టనోంగ్సక్ను ఓడించాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ప్రపంచ 19వ ర్యాంకర్ టనోంగ్‌సక్ ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. మొదట్లో శ్రీకాంత్ 1-4తో వెనుకబడినా తేరుకొని ఒక్కసారిగా విజృంభించాడు. ఒక దశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18-10తో ముందంజ వేసిన శ్రీకాంత్ దానిని నిలబెట్టుకుంటూ గేమ్ నెగ్గాడు. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 5-12తో వెనుకబడిన టనోంగ్‌సక్ 18-18కి తీసుకు వచ్చాడు. అయితే 19-20తో గేమ్ కోల్పోయే దశలో శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తిరుగులేని సైనా ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఐబీఎల్‌లో తన ఐకన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఆమె గెలవడం విశేషం. లీగ్ దశలో అవధ్ క్రీడాకారిణి సింధును ఓడించిన సైనా... ఈసారి కూడా పైచేయి ప్రదర్శిస్తూ 21-15, 21-7తో పీవీ సింధును చిత్తు చేసింది. తొలి పాయింట్ నుంచే జోరు ప్రదర్శించిన సైనా 7-3తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. తొలి బ్రేక్ అనంతరం సింధు కాస్త పోరాట పటిమ ప్రదర్శించింది. వరుస స్మాష్‌లతో పాయింట్లు నెగ్గి కోలుకునే ప్రయత్నం చేసింది. అయితే సైనా చక్కటి డ్రాప్ షాట్లతో ఆధిక్యాన్ని 14-9కి పెంచుకుంది. అనవసర తప్పిదాలతో హాట్‌షాట్ ప్లేయర్ కొన్ని పాయింట్లు కోల్పోయినా... చివరకు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ అయితే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. సైనా ఆట ముందు సింధు చేతులెత్తేసింది. ఆరంభంలో 7-1తో భారీ ఆధిక్యం కనబరిచిన నెహ్వాల్ ఆ తర్వాత దానిని 13-4కు పెంచుకుంది. చివర్లో అద్భుతమైన స్మాష్, డ్రాప్ షాట్‌తో వరుసగా రెండు పాయింట్లు సాధించి సైనా 35 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది. జయరామ్ సంచలనం పురుషుల డబుల్స్‌లో హాట్‌షాట్స్ జోడి వి షెమ్ గో-లిమ్ కిమ్ వా 21-14, 13-21, 11-4 స్కోరుతో అవధ్ జంట మార్కిస్ కిడో-మథియాస్ బోపై విజయం సాధించింది. దీంతో హాట్‌షాట్స్ 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అద్భుత విజయంతో హాట్‌షాట్స్‌కు టైటిల్ అందించాడు. తొలి గేమ్‌లో ఓడిపోయినా అజయ్ ఆ తర్వాత పట్టుదలతో పోరాడి 10-21, 21-17, 11-7 తేడాతో గురుసాయిదత్‌పై విజయం సాధించాడు. ఓ దశలో గురుసాయి జోరుతో మ్యాచ్ కీలక ఐదో మిక్స్డ్ డబుల్స్‌కు వెళ్లేలా కనిపించినా... అజయ్ జయరామ్ అనూహ్యంగా పుంజుకుని హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
అవధ్ ఆనందం
పుట్టినరోజునాడు ‘కింగ్’ నాగార్జునకు షాక్... ఐబీఎల్‌లో ముంబై మాస్టర్స్ జట్టు ఆయనకు విజయాన్ని కానుకగా ఇవ్వడంలో విఫలమైంది. హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో అవధ్ వారియర్స్‌దే పైచేయి అయింది. ఆటగాళ్ల సమష్టి రాణింపుతో సింధు సేన లీగ్ తుది పోరుకు అర్హత సాధించింది. శనివారం సైనా నేతృత్వంలోని హాట్‌షాట్స్‌తో పోటీకి సిద్ధమైంది. బెంగళూరు: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అవధ్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అవధ్ జట్టు 3-2 తేడాతో ముంబై మాస్టర్స్‌పై విజయం సాధించింది. రెండు పురుషుల సింగిల్స్ ముంబై గెలుచుకోగా, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ వారియర్స్ నెగ్గడంతో స్కోరు 2-2తో సమమైంది. కీలకమైన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో అవధ్దే పైచేయి అయింది. శనివారం ముంబైలో జరిగే లీగ్ ఫైనల్లో హైదరాబాద్ హాట్‌షాట్స్‌తో అవధ్ వారియర్స్ తలపడుతుంది. లీ చోంగ్ వీ శుభారంభం పురుషుల తొలి సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ లీ చోంగ్ వీ 21-15, 21-7 స్కోరుతో గురుసాయిదత్‌ను చిత్తు చేశాడు. చోంగ్ వీని ఈ లీగ్‌లో ఇబ్బంది పెట్టిన భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, శ్రీకాంత్‌ల తరహాలో గురుసాయిదత్ పోరాటపటిమ కనబర్చలేకపోయాడు. తొలి గేమ్‌లో స్కోరు 4-4తో ఉన్న దశలో చక్కటి డ్రాప్ షాట్‌తో ఆధిక్యంలోకి దూసుకుపోయి లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఒక దశలో వరుస స్మాష్‌లతో పాయింట్లు సాధించిన గురు 12-13తో చేరువగా వచ్చాడు. ఈ సారి చోంగ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లి తొలి గేమ్ గెల్చుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం సాయిదత్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఒత్తిడిని తట్టుకోలేక అనవసర తప్పిదాలతో వరుసగా పాయింట్లు సమర్పించుకున్నాడు. 3-2 నుంచి లీ వరుసగా 11 పాయింట్లు సాధించి 14-2కు చేరాడు. ఆ తర్వాత లీ గెలుపు లాంఛనమే అయింది. సింధు మరోసారి... లీగ్ దశలో టిన్ బాన్ను ఓడించి పీవీ సింధు ఈ సారి కూడా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస గేమ్‌లలో 21-16, 21-13తో మ్యాచ్ నెగ్గింది. ఆరంభంలో వెనుకబడినా...వరుస పాయింట్లతో సింధు 7-4కు చేరింది. చక్కటి ప్లేసింగ్స్‌తో సింధు ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండానే 15-11తో ఆధిక్యంలో నిలిచింది. 18-16తో ఉన్న దశలో మళ్లీ మూడు పాయింట్లు సాధించి సింధు గేమ్ నెగ్గింది. రెండో గేమ్‌లో బాన్ ఆట పూర్తిగా అదుపు తప్పింది. ఆమె ఆడిన షాట్లలో ఎక్కువ భాగం నెట్‌కు తగలడమో బయట పడటమో జరిగింది. దాంతో సింధు ఖాతాలో సునాయాసంగా పాయింట్లు చేరాయి. వరుస పాయింట్లతో 14-8తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు, అదే ఉత్సాహంతో దూసుకుపోయి మ్యాచ్ సొంతం చేసుకుంది. వారియర్స్ జోరు... పురుషుల డబుల్స్‌లో అవధ్ జోడి మార్కిస్ కిడో-మథియాస్ బో చెలరేగింది. ఈ జంట 21-15, 21-10తో ముంబై జంట ప్రణవ్‌చోప్రా-సుమీత్ రెడ్డిలపై సునాయాస విజయ సాధించింది. పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌ను నెగ్గిన ఇవనోవ్ మాస్టర్స్ ఆశలను సజీవంగా నిలిపాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఇవనోవ్ 21-20, 21-19తో అవధ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. దాంతో ఫలితం 2-2తో సమంగా నిలిచింది. ఈ దశలో మిక్స్డ్ డబుల్స్‌లో విశేషంగా రాణిస్తున్న వారియర్స్ ద్వయం మార్కిస్ కిడో-పియా బెర్నాడెట్ చక్కటి విజయంతో తమ జట్టును ఫైనల్ చేర్చింది. ఈ జోడి 21-19, 21-15 తేడాతో ముంబై జోడి ఇవనోవ్-టిన్ బాన్లను చిత్తు చేసింది. -
ఫైనల్లో హాట్‌షాట్స్
సీజన్ ఆరంభం నుంచి సైనా చెలరేగుతున్నా.. సహచరులు అడపాదడపా తడబడ్డారు. కానీ తీవ్ర ఒత్తిడిలో ఆడే సెమీఫైనల్లో మాత్రం సైనాతో పాటు మిగిలిన వాళ్లూ చెలరేగారు. దీంతో హైదరాబాద్ హాట్‌షాట్స్ 3-0తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. నేటి సెమీఫైనల్ బెంగళూరులో ముంబై మాస్టర్స్ x అవధ్ వారియర్స్ రా. గం. 8.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం సాక్షి, హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి సీజన్లో హైదరాబాద్ హాట్‌షాట్స్ ఫైనల్‌కు చేరింది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్‌షాట్స్ 3-0తో పుణేను ఓడించింది. దీంతో చివరి రెండు మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం కూడా రాలేదు. పురుషుల, మహిళల సింగిల్స్‌తో పాటు పురుషుల డబుల్స్‌లో కూడా హాట్షాట్స్కే గెలుపు దక్కింది. అజయ్ జయరామ్‌కు ప్లేయర్ ఆఫ్ ది టై అవార్డు లభించింది. మరోసారి జయరామ్ సంచలనం... లీగ్ దశలో ప్రపంచ ఐదో ర్యాంకర్ యుగెన్ టిన్ మిన్ను ఓడించిన అజయ్ జయరామ్ ఈ సారి కూడా అదే సంచలనాన్ని పునరావృతం చేశాడు. ఆరంభంలో వెనుకబడినా పోరాటపటిమ కనబర్చి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం అజయ్‌కు తిరుగు లేకుండా పోయింది. 21-17, 21-11తో మ్యాచ్ నెగ్గి హాట్‌షాట్స్‌కు ఈ యువ ఆటగాడు శుభారంభం అందించాడు. షెంక్ చేతులారా... మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-10, 19-21, 11-8 తేడాతో జులియన్ షెంక్‌పై విజయం సాధించింది. గత మ్యాచ్‌లో షెంక్‌ను ఓడించిన సైనా ఈ సారి కూడా పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌లో బోణీ చేసిన ఆమె ఏ దశలోనూ వెనుకబడలేదు. అయితే సైనా ప్రదర్శనకంటే షెంక్ చేసిన తప్పులే ఎక్కువగా ఉన్నాయి. సగం పాయింట్లు షెంక్ అనవసర తప్పిదాల ద్వారానే కోల్పోయింది. సైనా 6-3తో ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10-3కు చేరింది. ఆ తర్వాత 16-4 వరకు ఆమె ఆధిక్యం కొనసాగింది. షెంక్ కోలుకునే ప్రయత్నం చేసినా చివరకు 21-10తో గేమ్ సైనా సొంతమైంది. ఏడు పాయింట్లతో... రెండో గేమ్‌లో మాత్రం షెంక్ తన స్థాయికి తగ్గ ఆట కనబర్చింది. ప్రతీ పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీ పోరాడారు. అయితే చక్కటి స్మాష్‌లతో దూకుడు కనబర్చిన సైనా వేగంగా ఆధిక్యంలోకి దూసుకు వెళ్లి 18-11తో గెలుపుకు చేరువగా వచ్చింది. అయితే ఈ దశలో షెంక్ ఒక్కసారిగా విజృంభించింది. వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 18-18తో స్కోరు సమం చేసింది. సైనా మరో పాయింట్ సాధించినా... షెంక్ వరుసగా మూడు పాయింట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్‌లో మాత్రం షెంక్ ఒత్తిడికి లోనైంది. ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా నింపాదిగా ఆడిన సైనా గేమ్ గెలిచి మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో హాట్‌షాట్స్ జోడి గో వి షెమ్-వా లిమ్ కిమ్, పిస్టన్స్ జంట నీల్సన్ ఫిషర్-సనవే థామస్‌పై సంచలన విజయం సాధించింది. తొలి గేమ్ ఓడినా కోలుకున్న హైదరాబాద్ జోడి 16-21, 21-14, 11-7 తేడాతో గెలుపొంది తమ జట్టుకు ఫైనల్లో చోటు ఖాయం చేసింది. ఆ ర్యాలీ అద్భుతం... సైనా, షెంక్ల మధ్య జరిగిన రెండో గేమ్‌లో స్కోరు 5-5తో ఉన్నప్పుడు ఒకటే పాయింట్ కోసం సుదీర్ఘ ర్యాలీ ఆడారు. సుమారు 30సార్లు షటిల్ అటూ ఇటూ తిరిగింది. ఉత్సుకతతో స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడిపోయారు. చివరకు షెంక్ షాట్‌ను అవుట్‌గా భావించి సైనా వదిలేసింది. అయితే అది సరైందే అని తేలడంతో షెంక్ 6-5 ఆధిక్యంలోకి వెళ్లింది. లైన్కాల్పై సైనా కాస్త అసంతృప్తి కూడా ప్రదర్శించింది. అది తర్వాతి పాయింట్‌పై కనిపించింది. అద్భుతమైన స్మాష్‌తో స్కోరు చేసిన సైనా తన ఉద్వేగాన్ని ఆపుకోలేక అరిచేసింది. ప్రేక్షకులు మాత్రం ఆ ర్యాలీని పూర్తిగా ఆనందించి చప్పట్లతో ఇద్దరినీ అభినందించారు. మరొకటి గెలవాలి: ప్రసాద్ వి.పొట్లూరి, సైనా -
జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున
తన జన్మదినం రోజున ముంబై మాస్టర్ జట్టును పోత్సాహిస్తూ గడపాలనుకుంటున్నట్టు టాలీవుడ్ హీరో నాగార్జున వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, వ్యాపారవేత్త చాముండేశ్వర నాథ్ ల భాగస్వామ్యంతో నాగార్జున ఐబీఎల్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన జన్మదినం రోజున బెంగుళూరులో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో తన జట్టకు ప్రోత్సాహిస్తూ గడుపుతానని తెలిపారు. ఇటీవల కాలంలో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి మహీ రేసింగ్ జట్టుకు సహచర భాగస్వామిగా ఉన్నాడు. ఈ సంవత్సరం తాను కొనుగోలు చేసిన జట్లు రాణించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోంది అని నాగార్జున అన్నారు. త్వరలో ముగిసే రేసింగ్ లీగ్ లో తమ జట్టు అగ్రస్థానంలో ఉందని, బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇలాగే తన జట్లు విజయపథంలో ప్రయాణించాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు. ఆగస్టు 29 నాగార్జున జన్మదినం జరుపుకోనున్న నాగార్జున చిత్ర రంగంలోనూ, క్రీడారంగంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే నాగార్జున నటించిన భాయ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఆస్థాయిలో ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)కు క్రేజ్ లభిస్తున్న సంగతి తెలిసిందే! -
అదరగొట్టిన అవధ్ వారియర్స్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అవధ్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగిన పోరులో వారియర్స్ 3-2తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసింది. తొలి పురుషుల సింగిల్స్‌లో కె. శ్రీకాంత్, మహిళల సింగిల్స్‌లో సింధు నెగ్గగా...పురుషుల డబుల్స్‌లో కిడో-బో జోడి నెగ్గి అవధ్‌కు 3-0తో గెలుపు ఖాయం చేశారు. పుణే చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించి రెండు పాయింట్లు సాధించింది. చెలరేగిన సింధు..: జులియన్ షెంక్‌తో హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-20, 21-20తో గెలిచింది. ప్రపంచ మూడో ర్యాంకర్ షెంక్ ఆరంభంలో ఆధిక్యం ప్రదర్శించింది. తొలి పాయింట్‌తో మొదలు పెట్టి ఒక దశలో 7-6తో ముందంజలో నిలిచింది. అయితే చక్కటి స్మాష్‌తో స్కోరు సమం చేసిన సింధు.. ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. గేమ్ చివర్లో సింధు 20-19తో ముందంజ వేసినా షెంక్ డ్రాప్ షాట్‌తో స్కోరు సమం చేసింది. అయితే క్రాస్ కోర్ట్ షాట్‌ను షెంక్ కోర్టు బయటికి కొట్టడంతో గేమ్ సింధు వశమైంది. రెండో గేమ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ సుదీర్ఘ ర్యాలీలు ఆడారు. అయితే ఒక్కసారిగా చెలరేగిన షెంక్ వేగంగా దూసుకుపోయింది. 11-6, 14-7, 16-9...ఇలా భారీ అంతరంతో షెంక్ ఆధిక్యం ప్రదర్శించింది. కానీ స్వయంకృతంతో సింధుకు కోలుకునే అవకాశం ఇచ్చింది. డ్రాప్ షాట్లు విఫలం కావడంతో పాటు లైన్ కాల్స్‌ను అంచనా వేయడంలో పొరబడింది. షెంక్ 19-17తో ముందంజలో ఉన్న దశలో సింధు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 20-19తో నిలిచింది. స్మాష్‌తో షెంక్ స్కోరు సమం చేసినా... సింధు చక్కటి ప్లేస్‌మెంట్‌తో పాయింట్ సాధించి మ్యాచ్ గెలిచింది. శ్రీకాంత్ సునాయాస విజయం: తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వారియర్స్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21-18, 21-16 స్కోరుతో పుణే ఆటగాడు సౌరభ్ వర్మను చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో వర్మ కాస్త పోటీ ఇచ్చినా...రెండో గేమ్‌లో మాత్రం నిలవలేకపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో అవధ్ ఆటగాళ్లు మార్కిస్ కిడో-మథియాస్ బో 21-15, 21-16తో అరుణ్ విష్ణు-సనవే థామస్‌లను ఓడించారు. ఈ గెలుపుతోనే అవధ్‌కు 3-0తో విజయం ఖాయమైంది. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పిస్టన్స్ ప్లేయర్ టిన్ మిన్ యుగెన్ 21-12, 21-18తో గురుసాయిదత్ (అవధ్)ను చిత్తు చేసి వారియర్స్ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, నీల్సన్ 21-16, 21-14తో అవధ్ జోడీ కిడో-పియాబెర్నాడెట్పై గెలిచి ఆధిక్యాన్ని 3-2కి తగ్గించారు. ఢిల్లీ, బంగా అవుట్! ఆఖరి లీగ్ మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. 16 పాయింట్లతో పుణే, అవధ్... 15 పాయింట్లతో హైదరాబాద్, ముంబై సెమీస్‌కు చేరాయి. హైదరాబాద్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉన్నందున అగ్రస్థానం సాధించే అవకాశం ఉంది. 13 పాయింట్లతో ఢిల్లీ రేసు నుంచి వైదొలిగింది. బంగా బీట్స్ ప్రస్తుతం 9 పాయింట్లతో ఉంది. నేడు హైదరాబాద్‌పై క్లీన్‌స్వీప్ చేస్తే ఆరు పాయింట్లు వస్తాయి. అప్పుడు ముంబై, హైదరాబాద్‌లతో కలిపి పోటీలో ఉంటుంది. కానీ ప్రస్తుత ఫామ్‌లో అది అసాధ్యం. కాబట్టి బంగా కూడా సెమీస్ రేసులో లేనట్లే. -
నగరంలో షటిల్ సందడి
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో కొత్తదనానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఇప్పుడు నగర అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. గత కొన్నేళ్లుగా అనేక మంది అంతర్జాతీయస్థాయి ఆటగాళ్లను అందించి షటిల్ క్రీడకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో తొలి సారి లీగ్ మ్యాచ్‌లు జరగనుండటం ఆసక్తి రేపుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు ‘టై’లు జరుగుతాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో పుణే పిస్టన్స్, మంగళవారం బంగా బీట్స్‌తో హైదరాబాద్ హాట్‌షాట్స్ తలపడతాయి. బుధవారం తొలి సెమీ ఫైనల్ నిర్వహిస్తారు. సొంతగడ్డపై... టోర్నీలో సెమీఫైనల్ స్థానం కోసం పోటీ పడుతున్న అవధ్ వారియర్స్, పుణే పిస్టన్స్‌ను ఎదుర్కోనుంది. నగరానికి చెందిన తాజా సంచలనం పీవీ సింధు వారియర్స్‌ను నడిపిస్తోంది. లీగ్‌లో తొలిసారి సొంతగడ్డపై ఆమె మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టులోనే ఏపీకి చెందిన శ్రీకాంత్, గురుసాయిదత్ కూడా సొంత ప్రేక్షకుల మధ్య సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆడిన నాలుగు మ్యాచుల్లో 2 గెలిచి 2 ఓడిన అవధ్, ఇందులో నెగ్గితే సెమీస్ చేరుకుంటుంది. మరో వైపు 3 మ్యాచ్‌లు నెగ్గిన పుణే ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అశ్విని పొన్నప్ప, యుగెన్ మిన్, షెంక్, అనూప్ శ్రీధర్ లతో పటిష్టంగా కనిపిస్తోన్న పిస్టన్స్ మరో మ్యాచ్ నెగ్గాలని పట్టుదలగా ఉంది. -
కొనసాగుతున్న పుణే జోరు
పుణే: సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన కనబరిచిన పుణే పిస్టన్స్ జట్టు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో మూడో విజయాన్ని నమోదు చేసింది. బంగా బీట్స్‌తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణే పిస్టన్స్ 4-1తో గెలిచి... సెమీస్‌కు చేరువయింది. మరోవైపు బంగా బీట్స్ సెమీస్‌కు చేరాలంటే తమ చివరి రెండు టైలలోనూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ మాజీ చాంపియన్ అనూప్ శ్రీధర్ ఊహించని సంచలనం సృష్టించి పుణేకు శుభారంభం ఇచ్చాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ యున్ హూ (బంగా బీట్స్)తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 129వ ర్యాంకర్ అనూప్ శ్రీధర్ వరుస గేముల్లో గెలిచాడు. కేవలం 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీధర్ 21-12, 21-18తో హున్ యూను ఓడించాడు. ఒకప్పుడు భారత అగ్రశ్రేణి క్రీడాకారుడిగా వెలుగొందిన 30 ఏళ్ల శ్రీధర్... యువ ఆటగాళ్ల జోరు పెరగడంతో ప్రస్తుతం చెప్పుకోదగ్గ విజయాలు సాధించడంలేదు. అయితే శుక్రవారం పుణే పిస్టన్స్ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగి తన అనుభవాన్నంతా రంగరించి ఆడాడు. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ ఏదశలోనూ యున్ హూకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. స్మాష్‌ల ద్వారా 12 పాయింట్లు నెగ్గిన ఈ మాజీ ప్రపంచ 37వ ర్యాంకర్... నెట్‌వద్ద 10 పాయింట్లు సంపాదించాడు. రెండో సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ జూలియన్ షెంక్ 21-20, 21-10తో కరోలినా మారిన్‌ను ఓడించి పుణేకు 2-0 ఆధిక్యాన్ని అందించింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో జోచిమ్ ఫిషర్ నీల్సన్-కియోంగ్ తాన్ వీ జోడి 21-18, 21-18తో అక్షయ్ దివాల్కర్-కార్స్టెన్ మోగెన్సన్ జంటపై నెగ్గడంతో పుణే పిస్టన్స్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రపు పురుషుల రెండో సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 19-21, 21-17, 11-4తో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ (బంగా బీట్స్)ను బోల్తా కొట్టించడంతో పుణే ఆధిక్యం 4-0కు పెరిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో జోచిమ్ ఫిషర్ నీల్సన్-అశ్విని పొన్నప్ప (పుణే పిస్టన్స్) ద్వయం 21-20, 14-21, 8-11తో కార్స్టెన్ మోగెన్సన్-కరోలినా మారిన్ (బంగా బీట్స్) జోడి చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. బెంగళూరుకు ఒక పాయింట్ లభించింది. క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా రికార్డును సాధించే అవకాశం పుణే కోల్పోయింది. ఐబీఎల్‌లో నేడు అవధ్ వారియర్స్ x ముంబై మాస్టర్స్ రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్ -
హైదరాబాద్ ‘హాట్’!
పుణే: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వరుస విజయాలకు తోడుగా... విదేశీ ఆటగాళ్లు అంచనాలకు మించి ఆడుతుండటంతో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో హైదరాబాద్ హాట్‌షాట్స్ దూసుకుపోతోంది. గురువారం శివ్‌ఛత్రపతి బాలేవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 3-2 తో పటిష్టమైన ముంబై మాస్టర్స్‌ను కంగు తినిపించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 15 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక హాట్‌షాట్స్‌కు సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే. తొలి సింగిల్స్ ఆడిన అజయ్ జయరామ్ (హైదరాబాద్) 19-21, 21-11, 5-11తో లీ చోంగ్ వీ (ముంబై) చేతిలో ఓడాడు. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ నెట్ వద్ద ఆకట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సైనా నెహ్వాల్ 21-7, 21-10తో పీసీ తులసీపై అలవోకగా విజయం సాధించింది. స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో అలరించిన ఈ హైదరాబాదీ కేవలం 28 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. పురుషుల డబుల్స్‌లో వి షెమ్ గో-కిమ్ వాహ్ లిమ్ (హైదరాబాద్) జోడి 11-21, 21-16, 11-9తో సుమిత్ రెడ్డి-మను అత్రి (ముంబై)లపై; పురుషుల రెండో సింగిల్స్‌లో సీమ్సోమ్బున్సాక్ టంగ్సోక్ (హైదరాబాద్) 21-19, 17-21, 11-6తో మార్క్ జ్విబ్లెర్ (ముంబై)పై గెలిచి జట్టుకు 3-1తో విజయాన్ని అందించారు. తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో తరుణ్ కోనా-ప్రద్న్యా గాద్రె (హైదరాబాద్) 18-21, 19-21తో వ్లాదిమిర్ ఇవనోవ్-సిక్కి రెడ్డి (ముంబై)ల చేతిలో ఓడటంతో హైదరాబాద్ ఆధిక్యం 3-2కు తగ్గింది. ఆకట్టుకున్న జయరామ్ తొలి గేమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్వీతో మ్యాచ్‌లో ఓడినా హాట్‌షాట్స్ ఆటగాడు జయరామ్ ఆకట్టుకున్నాడు. తొలిగేమ్‌లో ఆఖరి పాయింట్ వరకూ పోరాడి ఓడినా... రెండో గేమ్‌లో చెలరేగాడు. ఆరంభంలో ఏకంగా 11-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి అదే ఊపులో గేమ్ గెలిచాడు. అయితే కీలకమైన మూడో గేమ్‌లో లీ చోంగ్ వీ తన అనుభవాన్నంతా ప్రదర్శించి జయరామ్‌ను కట్టడిచేశాడు. ఈ ఒక్క గేమ్‌లోనే లీ చోంగ్ ఏకంగా 11 స్మాష్‌లు కొట్టడం విశేషం. అయితే జయరామ్ పోరాటపటిమకు లీ చోంగ్ వీ ముగ్దుడయ్యాడు. ఎట్టకేలకు అవధ్ గెలుపు ఢిల్లీకి మరో ఓటమి పుణే: ఐబీఎల్‌లో ఎట్టకేలకు అవధ్ వారియర్స్ బోణీ చేసింది. ఏపీ రైజింగ్ స్టార్స్ పి.వి. సింధు, శ్రీకాంత్, గురుసాయిదత్లు తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో చెలరేగడంతో గురువారం రాత్రి జరిగిన పోరులో వారియర్స్ 4-1తో ఢిల్లీ స్మాషర్స్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ (వారియర్స్) తన రాష్ట్ర సహచరుడు సాయిప్రణీత్ (ఢిల్లీ)పై రెచ్చిపోయాడు. వరుస గేముల్లో 21-14, 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో సింధు (వారియర్స్) 21-16, 21-17తో అరుంధతి పంతవానే (ఢిల్లీ)ను కంగుతినిపించింది. స్మాష్‌లతో 9 పాయింట్లు గెలిచిన సింధు నెట్ వద్ద 14 పాయింట్లు సాధించింది. రెండు సింగిల్స్ విజయాలతో అవధ్ జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో కిన్ కీట్ కూ- బూన్ హోయెంగ్ తాన్ (ఢిల్లీ) జంట 21-16, 21-19తో మార్కిస్ కిడో- మథియాస్ బో (వారియర్స్) ద్వయంపై నెగ్గి అవధ్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో అవధ్ తరఫున బరిలోకి దిగిన గురుసాయిదత్ 21-16, 21-20తో డారెన్ ల్యూ (ఢిల్లీ)ని వరుస గేముల్లో కంగుతినిపించి 3-1తో వారియర్స్‌కు విజయాన్ని అందించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మార్కిస్ కిడో-బెర్నాడెట్ (వారియర్స్) జంట 21-20, 21-19తో వి.దిజు-ప్రజక్తా సావంత్ (ఢిల్లీ) జోడిపై నెగ్గింది. ఐబీఎల్‌లో నేడు పుణే పిస్టన్స్ x బంగా బీట్స్ రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్ -
లైన్ కాల్స్‌పై సైనా అసంతృప్తి
ముంబై: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అంపైర్ల పనితీరుపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. లైన్‌కాల్స్ కారణంగా తాను పాయింట్లు కోల్పోయినట్లు ఆమె చెప్పింది. ‘పుణేతో మ్యాచ్‌లో షెంక్‌తో రెండో గేమ్‌లో చాలా పాయింట్లు నాకు ప్రతికూలంగా వచ్చాయని భావిస్తున్నాను. ముఖ్యంగా లైన్ కాల్స్ విషయంలో తప్పు జరిగింది. ఇలాంటివి ఐదు, ఆరు పాయింట్ల వరకు ఉన్నాయి. అంపైర్లు వారి పరిధిలో ఎలా విధులు నిర్వహించినా నేను మాత్రం అసంతృప్తి చెందాను. అయితే చివరకు మ్యాచ్ గెలవడం మాత్రం మంచి పరిణామం’ అని సైనా వ్యాఖ్యానించింది. అనేక నిర్ణయాలు తనకు వ్యతిరేకంగా వెళ్లడం వల్ల కూడా మ్యాచ్‌లో కొన్ని సార్లు తను సంయమనాన్ని కోల్పోయినట్లు ఈ హాట్‌షాట్ ప్లేయర్ పేర్కొంది. అదే కారణంగా రెండో గేమ్‌లో అదుపు కోల్పోయి దూకుడుగా వ్యవహరించినట్లు సైనా వెల్లడించింది. తౌఫీక్ హిదాయత్ సూచనలు తనకూ, అజయ్ జయరామ్‌కు ఎంతో ఉపకరించాయన్న భారత నంబర్ వన్ షట్లర్... ఐబీఎల్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. -
చైనా లీగ్ కన్నా బాగుంది
ముంబై: గాయం కారణంగా ఇప్పటిదాకా బరిలోకి దిగకపోయినప్పటికీ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)పై ప్రపంచ నంబర్‌వన్ షట్లర్ లీ చోంగ్ వీ ప్రశంసలు కురిపించాడు. ప్రతిష్టాత్మకమైన చైనా లీగ్ కన్నా ఐబీఎల్ చాలా మెరుగ్గా ఉందని అన్నాడు. ‘నేను గతంలో రెండు సార్లు చైనా లీగ్‌లో పాల్గొన్నాను. చైనా లీగ్ ఆరు నెలలకు పైగా సుదీర్ఘంగా జరుగుతుంది. కానీ ఐబీఎల్ కేవలం మూడు వారాల్లో పూర్తవుతుంది. ముంబై మాస్టర్స్ తరఫున నాతోపాటు టిన్ బాన్, మార్క్ జ్వీబ్లర్, ఇవనోవ్ ఆడుతున్నారు. వచ్చే ఏడాది ఈ లీగ్ మరింత బావుంటుందని అనుకుంటున్నాను. నేడు (మంగళవారం) తొలి మ్యాచ్ ఆడబోతున్నాను. దీంట్లో నేను గెలవడం జట్టుకు చాలా ముఖ్యం’ అని లీ చోంగ్ వీ అన్నాడు. -
సైనా ‘హ్యాట్రిక్’ విజయం
ముంబై: ఆడిన తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచి జోరుమీదున్న పుణే పిస్టన్స్‌కు హైదరాబాద్ హాట్‌షాట్స్ కళ్లెం వేసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సైనా నేతృత్వంలోని హైదరాబాద్ హాట్‌షాట్స్ రఫ్ ఆడించి 4-1తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. పురుషుల తొలి సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (హైదరాబాద్) 21-19, 21-8తో ప్రపంచ ఐదో ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (పుణే)ను బోల్తా కొట్టించి హాట్‌షాట్స్‌కు శుభారంభం ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ 17-21, 21-19, 11-6తో ప్రపంచ మూడో ర్యాంకర్ జూలియన్ షెంక్ (పుణే)ను ఓడించి హైదరాబాద్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. ఐబీఎల్‌లో సైనాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో షెమ్ గో-కిమ్ వా లిమ్ జోడి (హైదరాబాద్) 21-19, 21-16తో రూపేశ్ కుమార్-సనావే థామస్ (పుణే) జంటపై గెలిచి హాట్‌షాట్స్‌కు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి హైదరాబాద్ హాట్‌షాట్స్ క్రీడాకారులు విజయాన్ని ఖాయం చేసుకున్నా తదుపరి రెండు మ్యాచ్‌లను తేలిగ్గా తీసుకోలేదు. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో తనోంగ్సక్ సెమ్సొమ్బూన్సుక్ (హైదరాబాద్) 21-17, 21-18తో సౌరభ్ వర్మ (పుణే)ను ఓడించడంతో హాట్‌షాట్స్ ఆధిక్యం 4-0కు పెరిగింది. చివరి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-జోచిమ్ ఫిషర్ నీల్సన్ (పుణే) జంట 21-11, 21-14తో షెమ్ గో-ప్రద్య్నా గాద్రె (హైదరాబాద్) జోడిపై నెగ్గి పరిపూర్ణ పరాజయాన్ని తప్పించింది. తొలి గేమ్ కోల్పోయినా... జూలియన్ షెంక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో తడబడిన సైనా తొలి గేమ్‌ను కోల్పోయింది. అయితే నెమ్మదిగా తేరుకున్న ఈ హైదరాబాద్ రెండో గేమ్‌లో పట్టుబిగించింది. పదునైన స్మాష్‌లు, డ్రాప్ షాట్లు సంధిస్తూ నెట్‌వద్ద చురుకుగా కదులుతూ నిలకడగా స్కోరు చేసి రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఆరంభంలో 5-1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సైనా స్మాష్‌లతో 30 పాయింట్లు, నెట్‌వద్ద 19 పాయింట్లు గెలుపొందడం విశేషం. జూలియన్ షెంక్‌ను ఓడించడం ఇదితొలిసా రేం కాదు. గతంలోనూ ఆమెపై పలుమార్లు గెలిచాను. షెంక్‌తో ఆడిన ప్రతిసారీ గట్టి ప్రతిఘటన ఎదురవుతుంది. ఈసారీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరికు నేనే గెలవడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తానికి హైదరాబాద్ హాట్‌షాట్స్ ప్రదర్శన సంతృప్తినిచ్చింది. -సైనా -
బంగా బీట్స్ బోణి
లక్నో: సింగిల్స్‌లో రాణించడంతో బంగా బీట్స్ (బీబీ) జట్టు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో బోణీ చేసింది. మరోవైపు అవధ్ వారియర్స్ (ఏడబ్ల్యూ) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసింది. భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, పురుషుల సింగిల్స్‌లో వీ ఫెంగ్ చోంగ్ చేతులెత్తేయడంతో వారియర్లు కోలుకోలేకపోయారు. ఆదివారం లక్నోలో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) మ్యాచ్‌లో బంగా బీట్స్ (బీబీ) 4-1తో వారియర్స్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి పోరులో హూ యున్ (బీబీ) 21-11, 21-20తో వీ ఫెంగ్ చోంగ్ (ఏడబ్ల్యూ)పై గెలిచి బంగా బీట్స్‌కు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్ బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, అవధ్ స్టార్ ప్లేయర్ సింధు 16-21, 13-21తో ప్రపంచ 19వ ర్యాంకు క్రీడాకారిణి కరోలినా మారిన్ (బీబీ) చేతిలో పరాజయం చవిచూసింది. రెండు గేముల్లోనూ ఏపీ రైజింగ్ స్టార్ చేతులెత్తేసింది. తనకన్నా తక్కువ ర్యాంకు ప్రత్యర్థి దూకుడుకు ఏ దశలోనూ కళ్లెం వేయలేకపోయింది. ఈ టోర్నీలో పదో ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో పరాజయం. దీంతో బీబీ ఆధిక్యం 2-0కు పెరిగింది. అనంతరం జరిగిన పురుషుల డబుల్స్‌లో వారియర్స్ జోడి మథియస్ బోయె-కైడో మార్కిస్ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. వీరిద్దరు చక్కని సమన్వయంతో రాణించడంతో 21-14, 21-19తో మోగెన్సన్-అక్షయ్ దివాల్కర్ (బీబీ)పై గెలుపొందారు. దీంతో అవధ్ జట్టు 1-2తో బీబీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్ (బీబీ), శ్రీకాంత్ (ఏడబ్ల్యూ)ల మధ్య పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇందులో సీనియర్ ఆటగాడు, 14వ ర్యాంకర్ కశ్యప్ 20-21, 21-11, 11-9తో శ్రీకాంత్‌పై చెమటోడ్చి నెగ్గాడు. తొలిగేమ్‌లో శ్రీకాంత్ స్మాష్‌లతో రెచ్చిపోగా... రెండో గేమ్‌లో పుంజుకున్న కశ్యప్ తన రాష్ట్ర సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 5-1తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే కశ్యప్ తన అనుభవాన్ని రంగరించి పోరాడాడు. వరస పాయింట్లు సాధించి స్కోరును సమం చేయడంతో పాటు చివర్లో మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇక నామమాత్రమైన మిక్స్డ్ డబుల్స్‌లో కైడో మార్కిస్- మనీషా (ఏడబ్ల్యూ) జంట 21-20, 16-21, 8-11తో కార్స్టన్-మారిన్ (బీబీ) ద్వయం చేతిలో ఓడింది.