Indrani
-
కంగనా రనౌత్ ఇంట విషాదం.. తనే మా ఇన్స్పిరేషన్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అమ్మమ్మ ఇంద్రానీ ఠాకూర్ కన్నుమూసింది. ఈ విషాద వార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమెతో కలిసున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మా అమ్మమ్మ ఎంతో శక్తివంతమైనది. తనకు ఐదుగురు సంతానం. అందరికీ మంచి విద్య అందించాలని తాపత్రయపడింది. అంతేకాదు ఉన్నత విద్యతో పాటు పెళ్లయిన తర్వాత కూడా తన కూతుర్లు సొంతకాళ్లపై నిలబడాలని కోరుకుంది. సొంత కాళ్లపై నిలబడాలని..వంటింటికే పరిమితం కాకుండా వారికంటూ సొంత కెరీర్ ఉండాలని భావించింది. అప్పట్లోనే తన కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకుని పేరు తెచ్చుకున్నారు. అలా తన సంతానంలోని ఐదుగురు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అది చూసి ఆమె ఎంతో గర్వపడేది. తను ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల పొడవుండేది. చాలా ఆరోగ్యంగానూ ఉండేది. బ్రెయిన్ స్ట్రోక్100 ఏళ్ల వయసుపైబడి ఉన్నప్పటికీ తన పనులన్నీ తనే చేసుకునేది. ఆమె ఎత్తూపొడుగు నాకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం గది శుభ్రం చేస్తున్న సమయంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల మంచానికే పరిమితమైంది. తననలా చూసి మా మనసు తట్టుకోలేకపోయింది. మా అందరికీ తనే స్ఫూర్తి. తను మా డీఎన్ఏలోనే ఉంది. ఆమెను ఎన్నటికీ మర్చిపోలేం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.సినిమాకాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. కంగనా స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీ సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.చదవండి: సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్ కాల్స్ -
Indrani Trailer: విజువల్ వండర్లా ‘ఇంద్రాణి’
యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.'ఇండియన్ సూపర్ ఫోర్స్' గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైన ఈ ట్రైలర్.. అద్భుతమైన విజువల్స్ తో ఆద్యంతం అద్భుతంగా సాగింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇంద్రాణి' ఓ విజువల్ వండర్. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మెస్మరైజింగా వుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ .. ఇవన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..'ఇంద్రాణి' ఒక ఎపిక్ లాంటి సినిమా. చాలా అద్భుతమైన కంటెంట్ వుంది ఇందులో. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ వుండబోతుందో ఇందులో చూపించడం జరిగింది. వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇందులో సరికొత్తగా చూపించడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
ఇంద్రాణి ట్రైలర్ బాగుంది
‘‘ఇంద్రాణి’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో రూపొందిన ‘ఇంద్రాణి’ చిత్రం విజయం సాధించాలి’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం దర్శకత్వంలో వెరోనికా ఎంటర్టైన్ మెంట్స్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మించారు. సుధీర్ వేల్పుల, ఓఓ రెడ్డి, జైసన్, కేకే రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఉంటూ ఇక్కడ సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమా మీద ఫ్యాషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ‘ఇంద్రాణి’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలున్న సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. రాబోయే 50 సంవత్సరాల్లో ఇండియా సాంకేతిక పరంగా ఎంత ముందుంటుంది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు స్టీఫెన్ పల్లం. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: స్టాన్లీ పల్లం, కెమెరా: చరణ్ మాధవనేని. -
తెలుగు సూపర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి.. ట్రైలర్ రిలీజ్
యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఇంద్రాణి'. మోడ్రన్ టెక్నాలజీ, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీసిన పాన్ ఇండియా మూవీ ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఈవెంట్ పెట్టి ట్రైలర్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?) స్టెఫన్ పల్లం దర్శకత్వం వహించగా.. వెరోనికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మించారు. సాయి కార్తిక్ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ చేశారు. ఇది సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) -
మంచు విష్ణు చేతుల మీదుగా ఇంద్రాణి టీజర్
ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి కాన్సెప్ట్‌తో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న సూపర్ హీరో మూవీ `ఇంద్రాణి`. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ హీరో మంచు విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఇంద్రాణి లాంటి ఒక కొత్త తరం మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విఎఫ్ఎక్స్ వర్క్ అత్యుత్తమ నాణ్యతతో ఉండి చక్కగా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ ఎపిసోడ్లను అవి నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి' అన్నారు. నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ.. 'ఇంద్రాణి భుజంపై ఉన్న రోబో చాలా బాగుంది, దానితో పాటు ఇంద్రాణి, ఇ- మ్యాన్లు వాడే సూపర్ పవర్స్ పిల్లలను, పెద్దలను తప్పక ఆకట్టుకుంటాయి`` అన్నారు. దర్శకుడు స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..``ఇంద్రాణి మూడు ఎలిగేటర్లతో చేసే ఫైట్స్, షతాఫ్ ఫిగర్‌తో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తాయి. తక్కువ సమయంలోనే సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించడానికి ఎంతగానో శ్రమిస్తున్న వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీకాంత్ కందాలకు, ఆయన బృందానికి నా కృతజ్ఞతలు`` అన్నారు. చదవండి: ఏం పీకలేనన్నారు, ఇప్పుడు పీకి చూపిస్తా -
ఇండియా తొలి సూపర్ గర్ల్‌గా 'ఇంద్రాణి'.. మేకింగ్ వీడియో రిలీజ్
Indrani First Telugu Super Girl Movie Making Video Released: యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల డెడికేషన్, రిస్క్ చూసి ఆశ్చర్యపోయానని డైరెక్టర్ స్టీఫెన్ తెలిపారు. ఇండియాలోనే మొట్టమొదటి సూపర్ గర్ల్ మూవీ 'ఇంద్రాణి' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భారీ వీఎఫ్ఎక్స్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో స్టీఫెన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు స్టాన్లీ సుమన్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రెండేళ్లకుపైగా జరిపిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్, యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్‌తో వీఎఫ్ఎక్స్ ప్లానింగ్ ఈ సినిమాను మరింత వేగంగా చిత్రీకరించేలా ఉపయోగపడుతున్నాయని డైరెక్టర్ తెలిపారు. భారతీయ చరిత్రలోనే మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్ షాట్స్, కత్తులు ఉపయోగించి విన్యాసాలు చేసిన తొలి చిత్రం 'ఇంద్రాణి' అని పేర్కొన్నారు. ఈ మూవీ మొదటి మహిళా యాంటీ గ్రావిటీ, జీరో గ్రావిటీ సినిమా అని మేకర్స్ వెల్లడించారు. చదవండి: ఆగని 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ? -
నేరసామ్రాజ్య మహారాణులు
‘క్వీన్స్ ఆఫ్ క్రైమ్’ అనే 288 పేజీల పుస్తకాన్ని ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్’ ఈనెల 20న విడుదల చేస్తోంది. టీవీలో ఏడేళ్లుగా ప్రసారం అవుతున్న హిందీ క్రైమ్ షో ‘సావ్ధాన్ ఇండియా’ వ్యాఖ్యాత సుశాంత్ సింగ్, థ్రిల్లర్ ఫిక్షన్లో చెయ్యి తిరిగిన రచయిత కుల్‌ప్రీత్ యాదవ్ కలిసి రాసిన ఈ ఇంగ్లిషు పుస్తకంలో కరడుగట్టిన పది మంది మహిళల నిజ జీవిత నేర చరిత్ర ఎంతో ఉత్కంఠభరితంగా పొందుపరచబడి ఉందని పెంగ్విన్ ప్రకటించింది. అయితే ఆ పేరుమోసిన మహిళా నేరస్థులు ఎవరన్నది రచయితలు గానీ, పెంగ్విన్ గానీ వెల్లడించలేదు! నో ప్రాబ్లం. ఆ పదిమంది జాబితాలో ఉండేందుకు అవకాశం ఉన్న కొందరు ‘ఉమెన్ క్రిమినల్స్’ గురించి మనమే అంచనావేద్దాం. ఇంద్రాణి ముఖర్జియా భారతదేశ చరిత్రలోనే మోస్ట్ తికమక మర్డర్ కేస్‌లోకి ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్నారు. మలుపుల్లో మెలకువగా ఉండకపోతే దారి తప్పడం ఖాయం. గౌహతిలో ఒక జంట. ఇంద్రాణి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఇంద్రాణి టీనేజ్‌లోకి వచ్చింది. టీనేజ్లోనే గర్భవతి అయింది! కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఆమె గర్భానికి కారణమని అనుమానం. ఇంద్రాణి ఇల్లొదిలి వెళ్లిపోయింది. షీనాకు జన్మనిచ్చింది. సిద్ధార్థ దాస్‌ను పెళ్లి చేసుకుంది. ఇంద్రాణి, సిద్ధార్థ కలిసి మైఖేల్ బోరా అనే బిడ్డకు జన్మనిచ్చారు. ఇంద్రాణి సిద్ధార్థకు విడాకులిచ్చి సంజీవ్ ఖన్నాను పెళ్లి చేసుకుంది. ఇంద్రాణికి, సంజీవ్‌కి విధి ఖన్నా జన్మించింది. ఇంద్రాణి, సంజీవ్ విడాకులు తీసుకున్నారు. ఇంద్రాణి ముంబైకి చేరుకుంది. అక్కడ పీటర్ ముఖర్జియాను చేసుకుంది. షీనా బోరా, విధి ఖన్నా కూడా ముంబై వచ్చి ఇంద్రాణి, పీటర్ దగ్గర ఉండిపోయారు. పీటర్ మాజీ భార్య షబ్నమ్. పీటర్‌కి, షబ్మమ్కి రాహుల్ అనే ఒక కొడుకు ఉన్నాడు. షీనా, రాహుల్ మనసులు కలిశాయి. రిలేషన్లోకి వెళ్లిపోయారు. ఆ రిలేషన్‌కి ఇంద్రాణి, పీటర్ ‘నో’ చెప్పారు. అప్పుడే ఇంద్రాణి తండ్రి ఎవరో బయట పడింది. అతడు బయటి వ్యక్తి కాదు. కుటుంబ సభ్యుడే! షీనా ఫారిన్ అకౌంట్లో భారీ మొత్తంలో డబ్బు ఉంది. ఆ డబ్బు వేసిన ఇంద్రాణి. ఆ డబ్బు కావాలని ఇంద్రాణి అడిగితే షీనా ‘నో’ అంది. షీనాను చంపేయాలని సిద్ధార్థ, (మళ్లెందుకొచ్చాడో!) ఇంద్రాణి డిసైడ్ అయ్యారు. పకడ్బందీగా ప్లాన్ చేసి షీనాను చంపేశారు. ఇదీ కేసు. ఒక్క ముక్క అర్థం కాలేదా! సీబీఐకీ అర్థమైనట్లు లేదు. ఏడేళ్లుగా ఈ కేసు నడుస్తోంది. ఎవరు ఎవరికి జన్మనిచ్చారో, ఎవరికి ఎవరు జన్మించారో బయటపడుతున్న కొద్దీ కేసు కొత్త మలుపుల్లో చిక్కుకుపోతోంది. అంజనాబాయ్ అంజనాబాయ్ ఒకరు కాదు ఇద్దరు. ఇద్దరు కాదు. ముగ్గురు. ముగ్గురు కాదు నలుగురు. అంజన పుణెలో ఉండేది. జేబులు కొట్టేసేది. రైల్వే స్టేషన్లలో చెయిన్ స్నాచింగ్‌లు చేసేది. 125 కేసుల్లో నిందితురాలు. అన్నీ పెట్టీ్ట కేసులే. 1990లో భర్త ఆమెను వదిలేసి ఇంకో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమె నేరస్వభావం అమానుష స్థాయిని చేరుకుంది. అప్పటికి ఆమె వయసు 58 ఏళ్లు. పిల్లల్ని అపహరించడం, వారి చేత చోరీలు చేయించడం, గుట్టు బయట పెట్టేస్తారనుకున్నప్పుడు వాళ్లను చంపేయడం! ఇందుకు ఆమె తన ఇద్దరు కూతుళ్ల సహాయం తీసుకుంది. ఒక కూతురు భర్తను కూడా రొంపిలోకి లాగింది. ఈ తల్లీకూతుళ్లు ఆరేళ్లవ్యవధిలో పన్నెండు మంది పిల్లల్ని అపహరించారు. ఆ పిల్లల్లో కొందరిని కొట్టి చంపారు. మొత్తానికి నలుగురూ చట్టానికి చిక్కారు. అరెస్టయిన ఏడాదికి అంజనాబాయ్ చనిపోయింది. 2001లో ఆమె ఇద్దరు కూతుళ్లను ఉరితీశారు. విచారణలో అల్లుడు నిర్దోషి అని తేలడంతో అతడిని వదిలిపెట్టారు. నేహా వర్మ నేహా వర్మ బ్యూటీషియన్. ముంబైలోని ఆర్బిట్ మాల్లో నిండా నగలు వేసుకుని ఉన్న మేఘా దేశ్‌పాండే ఆమె కంటపడింది. నేహాకు రిచ్ లైఫ్ అంటే వ్యామోహం. మేఘ ఒంటిని, ఇంటిని దోచుకోవాలని ప్లాన్ చేసింది. ఏదైనా ఉద్యోగం చూపించమని పరిచయం చేసుకుంది. మేఘ దగ్గర మంచి మార్కులు కొట్టేసి, ఆమె ఇంటికి రాకపోకలు మొదలు పెట్టింది. దోపిడికి ప్లాన్ చేశాక రాహుల్, మనోజ్‌ల సహాయం తీసుకుంది. రాహుల్ పూర్వ పరిచయస్తుడు. బాగా డబ్బు సంపాదించి అతడితో కలిసి హాయిగా జీవించాలని నేహ ఆశ. ప్లాన్ ప్రకారం ఓ రోజు ముగ్గురూ మేఘ నివాసంలోకి వెళ్లారు. రాహుల్, మనోజ్.. మేఘతో (42) పాటు ఆమె కూతురు ఆశ్లేష (21), ఆమె తల్లి రోహిణిని మొదట తుపాకులతో కాల్చి, కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. లక్షన్నర క్యాష్, ఐదు లక్షల విలువైన ఆభరణాలు, రెండు ఏటీఎం కార్డులు దోచుకెళ్లారు. కాల్పులు జరిపేటప్పుడు రాహుల్ ఆ కంగారులో తన కాలిపై తనే కాల్చుకుని ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరడంతో పోలీసులకు దొరికిపోయాడు. ఆ వెంటే మిగతా ఇద్దరూ పట్టుపడ్డారు. కోర్టు విచారణ జరిపి ‘రేరెస్ట్ ఆఫ్ రేర్’ కేసు అంది. వీళ్లు క్షమార్హులు కాదంది. ముగ్గురికీ మరణశిక్ష విధించింది. సిమ్రాన్ సూద్ బులెట్ దిగబడితేనన్నా బతికి బట్టకడతారేమో. సిమ్రాన్ సూద్ చిన్న లుక్ ఇచ్చిందంటే ఆ మరణాన్ని అనుభవించి తీరవలసిందే. ఆ అమ్మాయిని వలలో వేసుకుని రెండు హత్యలకు స్కెచ్ వేశాడు విజయ్ పలాండే. అప్పటికే గ్యాంగ్‌స్టర్ అతడు. 1998లో ఒక మర్డర్, 2002లో ఇంకో మర్డర్ అతడి క్రిమినల్ అకౌంట్లో ఉన్నాయి. సిమ్రాన్‌ని ‘హనీ ట్రాప్’గా ఎరవేసి, మనీ సంపాదించడం మొదలు పెట్టాడు. మనీ అంటే నోట్ల కట్టలు కాదు. పెద్దపెద్ద ప్రాపర్టీలు! సంతకం పెడతావా, స్పాట్ పెట్టమంటావా అని అడిగేవాడు. సంతకం పెట్టేవాళ్లు. అయినా స్పాట్ పెట్టేవాడు. పలాండే కన్ను వర్థమాన నటుడు అనూజ్ టిక్కు ఉంటున్న లొఖాండవాలా (ముంబై) కాంప్లెక్‌లోని అతడి అపార్ట్మెంట్ మీద పడింది. అతడిపైకి సిమ్రాన్‌ని ప్రయోగించాడు. సిమ్రాన్.. పలక్కాడ్ని తన బ్రదర్‌గా అనూజ్‌కి, కరణ్‌కుమార్ అనే సినీ నిర్మాతకు పరిచయం చేసింది. కరణ్ కుమార్ నిర్మాత. అతడిని చంపేశారు. అనూజ్ తండ్రి అరుణ్‌ని చంపేశారు. తర్వాత పోలీసులు సిమ్రాన్‌ని, పలాండేని అరెస్ట్ చేశారు. మారియా సుసాయ్‌రాజ్ మారియా సుసాయ్‌రాజ్, ముంబైలోని ఒక టీవీ చానల్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ క్లోజ్ ఫ్రెండ్స్. సడన్‌గా నీరజ్ మాయం అయ్యాడు. మారియా పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. విచారణలో వెల్లడైన నిజాలకు పోలీసులే వణికిపోయారు. 2008 మే 6. నీరజ్ చెన్నైలోని మారియా ఫ్లాట్‌లో ఉన్నాడు. ఆ సంగతి మారియా మరో ఫ్రెండ్ ఎమిలీ జెరోమ్‌కి తెలిసింది. ముంబైలో నేవీ ఆఫీసర్ అతడు. నీరజ్, మారియా రిలేషన్లో ఉన్నారని అతడికి అనుమానం వచ్చింది. వెంటనే విమానంలో చెన్నై వచ్చి వాళ్లిద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. నీరజ్‌ని అక్కడికక్కడే చంపేశాడు. శవాన్ని ఫ్లాట్‌లోనే ఉంచి, బయటికి వెళ్లి దగ్గర్లోని మాల్లో కత్తిని కొనుక్కొచ్చి నీరజ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాడు. ఆ ముక్కల్ని గోనె సంచిలో కుక్కి, దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతా చెయ్యడానికి మారియా సహకరించింది. జెరోమ్ తేలికపాటి శిక్షతో బయట పడ్డాడు. సాక్ష్యాల్ని చెరిపే ప్రయత్నం చేసినందుకు మారియాకు పెద్ద శిక్ష పడింది. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘నాట్ ఎ లవ్ స్టోరీ’కి ఈ ఘటన కూడా ఒక ప్రేరణ. బేబీ పటాన్‌కర్ 2015 ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యేనాటికి బేబీ పటాన్‌కర్ వయసు 52 ఏళ్లు. అసలు పేరు శశికళా పటాన్‌కర్. అప్పటికి ఇరవై ఏళ్లుగా ఆమె డ్రగ్స్ బిజినెస్‌లో ఉంది. గంజాయి అమ్ముతూ పట్టుబడి 2001లో ఒకసారి అరెస్ట్ అయి, బయటికి వచ్చింది. బాంబేలో డ్రగ్ బ్యారెన్గా ఎదిగింది. మ్యూ–మ్యూ (పార్టీ డ్రగ్), ఎం–క్యాట్, బబుల్స్.. ఇలా గిరాకీ ఉన్న డ్రగ్గులన్నిటికీ బేబీ అండర్ వరల్డ్ డీలర్. ఆమె పేరు యు.కె. వరకు వెళ్లింది. ఆ టైమ్‌లోనే ఆమె బాయ్‌ఫ్రెండ్ ధర్మరాజ్ కలోఖే దగ్గర 120 కేజీల ‘బబుల్స్’ (మెఫెడ్రోన్) పట్టబడింది. ధర్మరాజ్ పోలీస్ కానిస్టేబుల్. మెరైన్ డ్రైవ్ పోలీస్‌స్టేషన్‌లోనే, అతడి డెస్క్‌లోనే ఇంత డ్రగ్గు బయటపడింది. డొంక కదలింది. బేబీ సామ్రాజ్యం బీటలు వారింది. పోలీసులు అరెస్ట్ చేశారు. సైనేడ్ మల్లిక ‘సైనేడ్ మల్లిక’ పేరు వింటే ఇప్పటికీ బెంగుళూరులో ఆడవాళ్లు మెడలోని ఆభరణాలను తడుముకుంటారు! ఆమె అసలు పేరు కేడీ కెంపన్న. కంట్రీస్ ఫస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్. కర్ణాటకలోని కగ్గరిపుర ఆమె బర్త్ ప్లేస్. చిట్ ఫండ్ బిజినెస్ చేసేది. అందులో భారీగా లాస్ రావడంతో భర్త ఆమెను అప్పులవాళ్లకు వదిలేసి పారిపోయాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి, అప్పులు తీర్చి రిచ్‌గా బతకాలని మల్లిక ఆశ. ఆడవాళ్లను నమ్మించి, వాళ్లను చంపి ఒంటిపై బంగారు నగల్ని దోచుకోవడం మొదలుపెట్టింది. ఒక్క బెంగుళూరులోనే ఆమె ఈ ఇరవై ఏళ్లలో ఐదు హత్యలు చేసింది. గుడులకు తిరగడం, డిప్రెషన్లో ఉన్నవాళ్లను కనిపెట్టడం, పూజ చేస్తే ఫలం ఉంటుందని నమ్మించి పాడుబడిన దేవాలయాలకు తీసుకెళ్లి సైనేడు కలిపిన నీళ్లు తాగించడం, వాళ్లు చనిపోయాక ఒంటి మీద నగలు ఒలుచుకెళ్లడం.. ఇదీ మల్లిక స్టెయిల్ ఆఫ్ క్రైమ్. ఆరో హత్య చేయబోతుండగా కలాసిపాళ్యం పోలీసులకు దొరికిపోయింది. ఫూలన్‌దేవి మన దేశంలోని ఆడపిల్ల పుట్టడమే తాళిబొట్టుతోనైనా పుడుతుందేమో కానీ, తుపాకీ చేతబట్టి మాత్రం పుట్టదు. ఫూలన్ జీవితంలో ఇవి రెండూ జరిగాయి. పదకొండేళ్ల వయసులో ఇష్టంలేని పెళ్లితాడును పుటుక్కున తెంపేసిన ఫూన్దేవి, అగ్రకులాలవారు దురహంకారంతో తనపై జరిపించిన అత్యాచారాలను భరించలేక ఆయుధాన్ని చేతపట్టింది. 21 మందిని గన్‌డౌన్ చేసింది. పోలీస్ హంట్ మొదలైంది. పిట్టకు దొరకలేదు ఫూలన్. చివరికి తనే లొంగిపోతానని చీటీ పంపింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. మధ్యప్రదేశ్ పోలీసులకు మాత్రమే సరెండర్ అవుతానంది. యు.పీ.పోలీసుల మీద నమ్మకం లేదంది. తన ఆయుధాల్ని దుర్గామాత ఎదుటగానీ, మహాత్మాగాంధీ ఫొటో ముందు కానీ పెడతానంది. తనకు మరణశిక్ష విధించబోమన్న హామీ కావాలంది. తన అనుచరులకు వేసే శిక్ష ఎనిమిదేళ్లకు మించకూడదంది. కొంత భూమిని ఇవ్వాలంది. లొంగిపోయే రోజు తన కుటుంబం మొత్తానికీ పోలీస్ ఎస్కార్ట్ ఉండాలంది. అన్నిటికే ‘ఎస్’ అంది గవర్నమెంట్. బందిపోటు రాణిగారు సాక్షాత్కరిస్తే చాలు అనుకుంది! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్, 300 మంది పోలీసులు, పదివేల మంది పౌరులు.. ఇంతమంది హాజరయ్యారు ఫూలన్ లొంగుబాటు కార్యక్రమానికి! ఆమెపై 48 కేసులు పెట్టారు. విచారణ పేరుతో 11 ఏళ్లు జైల్లో ఉంచారు. చివరికి.. సత్ప్రవర్త కలిగి ఉంటాననే హామీ తీసుకుని విడుదల చేశారు. ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఫూలన్ పై కేసులన్నీ తీయించేశారు. రాజకీయాల్లోకి తీసుకున్నారు. ఫూలన్ ఎంపీ అయ్యాక.. పార్లమెంట్లో లంచ్ బ్రేక్‌కి బయటికి వచ్చినప్పుడు దుండగులు ఆమెను కాల్చిచంపారు. భారతదేశంలో ఇప్పుటికీ నటోరియస్ ఉమన్ క్రిమినల్ ఎవరూ అంటే ఫూలన్‌దేవే! చట్టం దృష్టిలోనే ఆమె నటోరియస్ కావచ్చు. అంతకన్నా నటోరియస్.. ఆమెను అలా మార్చిన పరిస్థితులు. -
ఇంద్రాణిని కొట్టారు, దూషించారు!
సీబీఐ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది ఫిర్యాదు ముంబై: షీనాబోరా హత్యకేసులో నిందితు రాలు ఇంద్రాణి ముఖర్జీని బైకల్లా జైలు సిబ్బంది కొట్టారని, దూషించారని ఆమె తరఫు న్యాయవాది గుంజన్ మంగ్లా సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆందోళన చేస్తే లైంగికదాడి చేస్తానంటూ జైలు సిబ్బంది, సూపరింటెండెంట్ బెదిరించారన్నారు. ఇంద్రాణి కాళ్లు, చేతులు, ముఖంపై గాయాలను తనకు చూపించారని, జైలు సిబ్బందిపై ఫిర్యాదు చేయాలని ఆమె కోరిందన్నారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం ఇంద్రాణిని హాజరుపరచాలని ఆదేశించింది. బైకల్లా జైలు ఖైదీ మంజురా (45) ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. జైలు సిబ్బంది తీవ్రంగా కొట్టడంతోనే మంజురా మృతిచెందిందని ఆరోపిస్తూ ఇంద్రాణి సహా ఖైదీలు ఆందోళన చేపట్టారు. జైలు డాబాపైకెక్కి వార్తా పత్రికలకు నిప్పు అంటిస్తూ జైలు సిబ్బందికి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు మంజురాను జైలు సిబ్బంది తీవ్రంగా హింసించారని, జననాంగంలోకి లాఠీ జొప్పించారని పోలీసులు చెప్పారు. ఆందోళన విషయమై జైలు అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆహారం తీసుకోవద్దని, ఆందోళనను ఆపడానికి ప్రయత్నిస్తే పిల్లలను అడ్డుగా ఉంచుకోవాలని ఖైదీలను ఇంద్రాణి ఉసిగొల్పారని ఆరోపించారు. -
ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు
ముంబై: సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో విచారణకు వీలుగా ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జియా, సంజీవ్ ఖన్నాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120 (బి) (నేరపూరిత కుట్ర), 302 (హత్య), 364 (కిడ్నాప్), 203 (తప్పుడు సమాచారం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) ప్రకారం కేసు నమోదైంది. ఇవికాకుండా షీనా సోదరుడు మిఖాయిల్ బోరా హత్యకు కుట్ర పన్నినందుకు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలపై ఐసీపీ 307 (హత్యాప్రయత్నం), 120 (బి) సెక్షన్ల ప్రకారం అదనంగా కేసు నమోదు చేశారు. ఈ కేసును ఫిబ్రవరి 1న విచారిస్తామని జడ్జి హెచ్ మహాజన్ తెలిపారు. కాగా, తనకు పీటర్ నుంచి విడాకులు కావాలని ఇంద్రాణి కోరగా.. ఈ విషయంలో కోర్టు చేయగలిగేది ఏమీ లేదని జడ్జి తెలిపారు. ఇంద్రాణి ముఖర్జియా తన కుమార్తె షీనాను 2012లో హత్య చేసి మృతదేహాన్ని రాయ్‌గడ్ జిల్లాలోని అడవుల్లో కాల్చివేసిన విషయం తెలిసిందే. -
షీనా హత్య కేసులో కీలక విషయాలు
దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీతో కలిసి పీటర్ ముఖర్జీ తన తనయుడు రాహుల్‌ను తప్పుదోవ పట్టించిన టేపులు బహిర్గతమయ్యాయి. షీనా అదృశ్యమైనప్పుడు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు తండ్రి, పిన్నతల్లితో సంభాషించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ ఆధారాలే కేసు విచారణకు కీలకంగా మారాయి. మొదట ఈ టేపులను ఖార్ పోలీసులకు అనంతరం సీబీఐకు రాహుల్ సమర్పించాడు. రాహుల్ సమర్పించిన టేపుల సంభాషణలతో పీటర్‌కు ఈ హత్య, నేరపూరిత కుట్రలో భాగమున్నట్టు తేలింది. మొత్తం 20 రికార్డింగ్‌లో 7 టేపులు అవసరమైనవిగా, మిగతా 13 టేపులు కేసుకు సంబంధం లేనివిగా సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్‌కు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సీబీఐ విచారణలో ఈ టేపులను ఇప్పటికే కీలక ఆధారాలుగా పరిగణించినట్టు పేర్కొన్నారు. సంభాషణలో కొన్ని భాగాలు... పీటర్, రాహుల్ సంభాషణలో... షీనా గురించి తన తండ్రిని రాహుల్ అడిగాడు. కానీ తనకేమీ తెలియదని జవాబు ఇచ్చాడు. కానీ షీనా చివరి మెసేజ్ ఇంద్రాణికే పంపించిందని తెలియగానే, ఈ విషయంపై చర్చించడానికి గోవాకు రావాలని రాహుల్‌ను పీటర్ ఆదేశించాడు. షీనా ఎవరికీ చెప్పకుండా ఎటు వెళ్లదు. తను అలాంటి వ్యక్తి కాదు. షీనా కనిపించకుండా పోవడంపై కొంత బాధను రాహుల్ వ్యక్తపరిచాడు. ఎవరికీ టచ్ లేదు. కనీసం సోషల్ మీడియా అకౌంట్లలో కూడా యాక్టివ్‌గా లేదు. మరో టేపు సంభాషణ.. షీనా తన కంపెనీ హెచ్ఆర్ మేనేజర్‌కు కాంటాక్ట్‌లోనే ఉందని రాహుల్‌కు ఇంద్రాణి చెప్పింది. షీనా లీవ్ తీసుకుంటున్నట్టు హెచ్ఆర్ తెలిపినట్టు ఇంద్రాణి రాహుల్‌కు తెలిపింది. కానీ అధికారికంగా రాజీనామా చేయలేదని వెల్లడించింది. షీనా తన సెల్‌ఫోన్‌ను వాడితే తాము కనుక్కుంటామని పోలీసులు వెల్లడించినట్టు కూడా ఇంద్రాణి పేర్కొంది. నీ నుంచి విడిపోవాలని షీనా భావించిదేమో.. డబ్బున్న మరో వ్యక్తి తనకు దొరికాడేమో అని రాహుల్‌ను ఇంద్రాణి ఓదార్చింది.. తన దగ్గర్నుంచి కూడా డబ్బులు రాబట్టుకున్నాక అసలు కాంటాక్టులోనే లేకుండా పోయిందని ఇంద్రాణి నాటకాలు ఆడింది. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్లింది. షీనాను మరచిపోవాలని రాహుల్‌కు పీటర్, ఇంద్రాణి సూచించారు. షీనా బోరా హత్య జరిగిన వెంటనే ఇంద్రాణి తన భర్త పీటర్‌కు ఫోన్ చేసినట్టు సీబీఐ దర్యాప్తులో కూడా వెల్లడైంది. షీనా, రాహుల్ ప్రేమను అటు ఇంద్రాణి, ఇటు పీటర్ వ్యతిరేకించారు. విడిపోయేందుకు ఇద్దరు అంగీకరించకపోవడంతో హత్య చేసినట్టు సీబీఐ గుర్తించింది. కన్న కూతురు హత్య కేసులో తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్ను తొలుత అరెస్టు చేశారు. పీటర్ అమాయకుడని తొలుత భావించినప్పటికీ, హత్యలో పీటర్‌కు ప్రమేయం ఉన్నట్టు తాజా రికార్డులో కూడా వెల్లడైంది. 2012 ఏప్రిల్ 24న షీనా కనిపించకుండా అయింది. మూడేళ్ల తర్వాత ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వార్ రాయ్ తన వాంగ్ములంలో తెలిపాడు. -
పీటర్ బెయిల్ పై విచారణ వాయిదా
ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితుడు పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను బాంబే హైకోర్టు జులై 7కు వాయిదా వేసింది. ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందన తెలియజేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. సెషన్ కోర్టు రెండుసార్లు బెయిల్ తిరస్కరించడంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది నవంబర్ లో అతడిని అరెస్ట్ చేశారు. పీటర్ తో పాటు ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. తనకు క్షమాభిక్ష పెడితే అప్రూవర్‌గా మారతానని శ్యామ్వర్ అభ్యర్థించగా కోర్టు అనుమతి ఇచ్చింది. 2012, ఏప్రిల్ 24న షీనా బొరా హత్యకు గురైంది. 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. -
షీనా హత్య కేసు: అప్రూవర్ గా మారనున్న డ్రైవర్
ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారనున్నాడు. ఈ విషయాన్ని కోర్టుకు సీబీఐ తెలిపింది. తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ కోర్టుకు రాసిన రెండు పేజీల లేఖను అధికారులు కోర్టుకు అందజేశారు. అప్రూవర్ గా మారే నిర్ణయం తనదేనని, ఎవరూ తనపై ఒత్తిళ్లు తేవడం లేదని, జరిగిన విషయం మొత్తాన్ని కోర్టుకు తెలుపుతానని తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ లేఖలో కోరారు. గత నెల మే11న తాను అప్రూవర్ గా మారతానని రాయ్ కోర్టులో చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగష్టులో రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. -
హోం ఫుడ్ తినేందుకు కోర్టు అనుమతి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాకు ఇంటి నుండి తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి శుక్రవారం కోర్టు అనుమతించింది. షీనా బోరా హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ముఖర్జియాను నవంబర్ 19 న అరెస్టు చేసి సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉన్నారు. తనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని, వృద్దాప్యంలో ఉన్నందున హోం ఫుడ్ తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ముఖర్జియా కోర్టును అభ్యర్థించారు. అయితే ముఖర్జియా అభ్యర్థనను సీబీఐతో పాటు జైలు అధికారులు వ్యతిరేకించారు. ఆయనకు అవసరమైనటువంటి తక్కువ ఆయిల్‌తో వండిన అహారాన్ని తాము అందించగలమని కోర్టుకు తెలిపారు. కాగా, ముఖర్జియా అభ్యర్థనను మానవతా దృక్పథంతో ఆలోచించిన మేజిస్ట్రేట్ కోర్టు.. ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని.. జైలు అధికారి పర్యవేక్షణలో తీసుకోవడానికి ఆయనకు అనుమతిచ్చింది. -
'భార్య కుటిలత్వానికి బాధితుడిని'
ముంబై: షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జియాకు విధించిన సీబీఐ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ముంబై కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. షీనాబోరాను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా భర్త అయిన పీటర్ ను రెండురోజుల కస్టడీ నిమిత్తం ఢిల్లీకి తరలించి.. తమ కార్యాలయంలో ప్రశ్నించిన సీబీఐ.. అతన్ని గురువారం ముంబైకి తీసుకొచ్చింది. కస్టడీ గడువు ముగియడంతో ముంబై కోర్టులో ప్రవేశపెట్టింది. ఈసందర్భంగా పీటర్ తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలా వాదనలు వినిపిస్తూ తన భార్య ఇంద్రాణి కుటిల పద్ధతులకు తాను బాధితుడినయ్యానని పీటర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారని కోర్టుకు తెలిపారు. షీనాబోరా హత్యకు కారణం రాహుల్-షీనా అనుబంధం పట్ల ఇంద్రాణికి ఉన్న భయాలే కారణమని సీబీఐ చార్జ్ షీట్ లో పేర్కొందని, అలాంటప్పుడు పీటర్ ఖాతా వివరాలు తెలుసుకునేందుకు ఆయనను సీబీఐ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే, సీబీఐ మాత్రం పీటర్ కస్టడీ పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. పీటర్ కంపెనీ నుంచి షీనాకు పెద్ద మొత్తం డబ్బు తరలిందని, ఈ డబ్బును ఎందుకు మళ్లించారు? దీని వెనుక కారణాలేమిటి తదితర వివరాలు పత్రాలతో సహా రాబట్టేందుకు పీటర్ కస్టడీ అవసరమని సీబీఐ పేర్కొంది. -
'నా తండ్రి అమాయకుడు'
ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన పీటర్ ముఖర్జియా కొడుకు, షీనా బోరా ప్రియుడు రాహుల్ స్పందించాడు. తన తండ్రి అమాయకుడనీ, ఈ కేసుతో ఆయనకేమీ సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. తన తండ్రిపై చేసిన ఆరోపణలు దారుణమన్నాడు. నిన్న సీబీఐ అదుపులోకి తీసుకున్న తండ్రి పీటర్ ను సీబీఐ ఆఫీసులో కలవడానికి వచ్చిన రాహుల్ శనివారం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయి, షీనాబోరా తల్లి ఇంద్రాణి శుక్రవారం మీడియాముందు నోరు విప్పింది. ఎప్పటిలాగానే తాను అమాయకురాలినని వాదించింది. ఈ కేసుతో పీటర్ ముఖర్జియాకు ఉన్న సంబంధంపై మాట్లాడానికి నిరాకరించింది. అటు పీటర్ కూడా సీబీఐ ఆరోపణలను ఖండించాడు. కాగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మీడియా టైకూన్, ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జియా ను నిందితుడుగా పేర్కొంటూ చార్జ్ షీట్ దాఖలు చేసింది. హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర కేసు అభియోగాలను నమోదు చేసింది. షీనా హత్య గురించి తెలిసినా కొడుకు రాహుల్ ను తెలియకుండా దాచిపెట్టారన్నది సీబీఐ వాదన. మరోవైపు ముగ్గురు ప్రధాన నిందితుల జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్ 3 వ తేదీవరకు పొడిగించింది సీబీఐ కోర్టు. -
షీనాబోరా హత్యకు కారణాలివే..!
ముంబై: సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ లా సాగిపోతున్న షీనాబోరా హత్య కేసులో సీబీఐ విచారణ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్థిక కారణాలు, రాహుల్ ముఖర్జియాతో సంబంధం, ఇంద్రాణిని బ్లాక్మెయిల్ చేయడం లాంటివే షీనాబోరా హత్యకు ప్రధాన కారణాలని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొన్నది. కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలే షీనాబోరా హత్యకు కారణాలని పేర్కొంది. ముఖ్యంగా 1300 కోట్ల రూపాయల లావాదేవీలు ఇందులో ప్రధానమని తెలిపింది. తల్లీ కూతుళ్ల మధ్య నెలకొన్ని వివాదాలే ఇంద్రాణిని షీనా హత్యకు పురికొల్పాయని సీబీఐ తేల్చింది. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న సీబీఐ, ఇప్పటికే మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుత భర్త, మీడియా టై్కూన్ పీటర్ ముఖర్జియాను నాలుగో ముద్దాయిగా చేర్చింది. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా కేవలం ఆస్తి, డబ్బు కోసమే ఓ పథక ప్రకారం షీనాను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించాలని చూశారు. షీనాను అంతం చేస్తే ఆస్తి అంతా తన రెండో కూతురు నిధికే దక్కుతుందనేది సంజీవ్ పథకం. రాహుల్ ముఖర్జీ, షీనాల పెళ్లి జరిగితే ఆస్తి అంతా అతను ఎగరేసుకుపోతాడనే భయంతో పీటర్ ముఖర్జీయా ఈ కుట్రలో భాగం పంచుకున్నాడు. ఇక మొదటినుంచి తల్లీ కూతుళ్ల మధ్య తగాదాలు ఉన్నాయి. ప్రధానంగా రాహుల్ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం ఇంద్రాణికి నచ్చలేదు. పైగా షీనాపై ఉన్న ఆస్తులు తిరిగి తనకు దక్కవేమోనన్న భయం ఆమెను పట్టుకుంది. ఈ నేపథ్యంలో 2004 లో షీనాకు బహుమతిగా ఇచ్చిన ఏడు బెడ్రూంల ఫ్లాట్‌ను 2010లో ఆమెకు తెలియకుండానే ఇంద్రాణి విక్రయించింది. దీంతో వివాదం మరింత రగిలింది. తామిద్దరం ప్రపంచానికి తెలిసినట్టుగా అక్కాచెల్లెళ్లం కాదు, తల్లీకూతుళ్లమనే విషయాన్ని బయటపెడతానని షీనా బ్లాక్‌మెయిల్‌కు దిగింది. ఈ క్రమంలో షీనా హత్యకు పథకం వేశారని సీబీఐ పేర్కొంది. 'షీనా జాగ్రత్తగా ఉండు' అంటూ ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాల రెండవ కూతురు విధి.. సోదరి షీనాకు ఒక ఎస్సెమ్మెస్ చేసినట్టు కోర్టుకు సీబీఐ వెల్లడించింది. తల్లి ఇంద్రాణి పథకాన్ని పసిగట్టిన విధి షీనాను ముందుగానే హెచ్చరించిందని సీబీఐ పేర్కొంది. 2012, ఏప్రిల్ 24న ఇంద్రాణి ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి షీనా బోరాను హత్య చేసి మారుమూల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన ఈ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐకి సవాల్‌గా మారింది. -
సీబీఐ కస్టడీలో పీటర్ ముఖర్జీయా
ముంబై: క్రైమ్ థ్రిల్లర్ మూవీలా మలుపులు తిరుగుతున్న షీరాబోరా హత్య కేసులో అరెస్ట్ అయిన ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు పీటర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఇంద్రాణి ముఖర్జియా సహా ముగ్గురిపై కేసులు నమోదు చేసిన సీబీఐ, తాజాగా ఆమె ప్రస్తుత భర్త, స్టార్ గ్రూప్ అధినేత పీటర్ ముఖర్జియాను ఏ-4 గా చేర్చింది. నిన్న పీటర్ ముఖర్జియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ అతడిని కోర్టులో హాజరు పరిచారు. కాగా షీనాబోరా హత్య విషయం తెలిసినా నిజం బయటపడకుండా పీటర్ ముఖర్జియా దాచి పెట్టారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయటం వల్ల పీటర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న షీరా బోరా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లకు సీబీఐ కోర్టు... డిసెంబర్ 3వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. గత ఆగస్టులో సీబీఐ వీరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
షీనా కేసులో పీటర్ ముఖర్జీ అరెస్టు
చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ ముంబై: షీనా బోరా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జీని సీబీఐ అరెస్టు చేసి ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు మొదలైన మూడు నెలల తర్వాత చార్జిషీటు దాఖలు చేసింది. విచారణ సందర్భంగా హత్యలో పీటర్‌కు సంబంధం ఉన్నట్లు తెలియటంతోనే అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. సీబీఐ అధికారులు వివరాలు వెల్లడించనప్పటికీ.. నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయటం వల్ల పీటర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టుకు ముందు రెండు గంటలపాటు పీటర్‌ను ముంబై కమిషనర్ ప్రశ్నించారు. ఆయన్ను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు. వెయ్యి పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీటులో 150 మంది సాక్షుల వాంగ్మూలం, 200 డాక్యుమెంట్లు, మెజిస్ట్రేటు ముందు ఏడుగురు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజయ్, డ్రైవర్ శ్యాంలను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. డ్రైవర్ గతవారం కోర్టు ముందు నేరాన్ని ఒప్పుకోవటంతోపాటు ఘటన జరిగిన తీరును తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని కీలక సాక్షంగా తీసుకునే సీబీఐ డ్రైవర్ సాక్షమే కేసుకు కీలక ఆధారమని సీబీఐ తెలిపింది. -
ఇంద్రాణిని విచారించనున్న సీబీఐ
ముంబై: సంచలం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా సహా ఇతర నిందితులను సీబీఐ విచారించనుంది. బుధవారం ముంబై కోర్టు ఈ మేరకు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ నిందితులుగా ఉన్నారు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. వీరి ముగ్గురికి ఈ నెల 19వరకు ముంబై కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది. -
ఆ అస్థికలు షీనావే.. చిక్కుల్లో ఇంద్రాణి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. షీనా బోరా హత్యకు గురైనట్టు నిర్ధారణైంది. రాయగఢ్ అడవుల్లో పోలీసులు సేకరించిన అస్థికలు షీనా బోరావేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నమూనాలు ఇంద్రాణి డీఎన్ఏతో సరిపోలినట్టు పరీక్షల్లో రుజువైందని సమాచారం. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆమె శవాన్ని రాయగఢ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇటీవల నిందితులను సంఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి అస్థికలు, పుర్రెను సేకరించారు. పరీక్షల్లో ఈ అస్థికలు షీనా బోరావేనని తేలింది. ఈ రోజు ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ రాయ్‌లను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు. -
ఇంద్రాణి, డ్రైవర్‌కు జ్యుడిషియల్ కస్టడీ
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్‌లకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు. సోమవారం నాటితో నిందితులకు పోలీస్ కస్టడీ ముగియడంతో ముంబై పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇంద్రాణి, కారు డ్రైవర్లను జైలుకు తరలించారు. సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఖన్నాను కోల్‌కతా తీసుకువెళ్లనున్నారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కూతురు షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అనైతిక విషయాలు వెలుగుచూశాయి. -
సొంత ఇంటికి ఇంద్రాణి!
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు వర్లీలోని ఆమె సొంత నివాసానికి తీసుకెళ్లారు. మరో రోజులో ఆమె కస్టడీ ముగుస్తుండగా అనూహ్యంగా సొంత నివాసం తీసుకెళ్లడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఖర్ పోలీస్టేషన్లో గత కొద్ది రోజులుగా విచారిస్తున్న ఆమెను మరో ఇద్దరిని వర్లీ నివాసంలోని నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడ గంటపాటు విచారించారు. ఆ ప్రాంతమంతా నివాసాల సముదాయం కావడంతో ఒక్కసారిగా పోలీసుల అలికిడి వినిపించడంవల్ల కొంత నిశ్శబద్దం చోటుచేసుకుంది. ముఖ్యంగా హత్య చేసిన రోజు షీనా మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అంశంపై ఆరా తీసినట్లు పోలీసుల సమాచారం. ఈ విచారణ అనంతరం తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. -
ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!
షీనా బోరా తండ్రి సిద్ధార్థ్ దాస్ ముంబై/కోల్‌కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు సహజీవనం చేశానని దాస్ చెప్పారు. తన కూతురు షీనా హత్య వార్త విని ఎంతో వేదన చెందానన్నారు. షీనాను ఇంద్రాణే హత్య చేసుంటే, ఆమెకు ఉరి శిక్ష విధించాల్సిందేనన్నారు. ఇంద్రాణికి మొదట్నుంచి డబ్బు పట్ల వ్యామోహం ఎక్కువేనని, తన మధ్య తరగతి ఆర్థిక స్థాయి భరించలేకే తనను వదిలి వెళ్లిపోయి ఉండొచ్చన్నారు. కోల్‌కతాలో సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడుతూ.. 1989 తరువాత ఇంద్రాణితో సంబంధాలు తెగిపోయాయని, తన కూతురు షీనాతో మాత్రం ఆమె పదోతరగతిలో ఉండగా ఒకసారి మాట్లాడానన్నారు. మీడియా ద్వారానే షీనా హత్య విషయం తెలిసిందని, ముంబై పోలీసులు తనను సంప్రదించలేదని, దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పారు. పిల్లలను ఇంద్రాణి తల్లిదండ్రులు చూసుకునేవారని, పిల్లల సంరక్షణ బాధ్యతను తనకివ్వడానికి వారు ఒప్పుకోలేదన్నారు. ఇంద్రాణి ఈ హత్య చేశారని నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు నేటి సమాజంలో ఎవరు ఎవర్నైనా హత్య చేయొచ్చన్నారు. కాగా, ఇంద్రాణి, ఆమె కుమారుడు మిఖైల్ బోరాల డీఎన్ఏతో పోల్చి చూసే ఉద్దేశంతో మహారాష్ర్టలోని అడవిలో షీనా బోరా మృతదేహాన్ని తగలబెట్టిన చోట పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థిపంజర అవశేషాలను ముంబైలోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు. -
ఆ అవశేషాలు షీనా బోరావేనా ?
ముంబై: దాదాపు మూడేళ్ల క్రితం రాయ్‌గఢ్ జిల్లాలో దొరికిన గుర్తు తెలియని శవం అవశేషాలు షీనా బోరావేనా ? అయితే వాటిని ఎలా గుర్తించడం ? సాధారణంగా తల్లిదండ్రులు, వారి ఇతర సంతానం డీఎన్ఏలతో అవశేషాల నుంచి తీసిన డీఎన్ఏను పోల్చి గుర్తిస్తారు. సర్వ సాధారణంగా ముక్కలు ముక్కలుగా నరికిన శవం నుంచి డీఎన్ఏను గుర్తించడం దాదాపు అసాధ్యమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు మరెలా ఆ అవశేషాలు షీనా బోరావేనా, కాదా ? అన్న అంశాన్ని ఎలా తేల్చాలి ? షీనా బోరా ఇప్పటికీ బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలైన ఇంద్రాణి పోలీసు ఇంటరాగేషన్‌లో మాటమార్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది. ప్రతి మనిషికి ప్రత్యేకమైన పలు వరుస ఉంటుంది. ఆ పలు వరుస ద్వారాగానీ, 2డీ లేదా 3డీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించి కచ్చితంగా గుర్తించవచ్చని ఫోరెన్సిక్ నిపుణలు చెబుతున్నారు. అనుమానిత స్కల్పై ముఖం ఫైల్ ఫొటోను సూపర్ ఇంపోజ్ చేసి కూడా గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిఠారి హత్య కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 19 మంది పిల్లల కపాలాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి అక్కడ ముఖ పునర్నిర్మాణం ద్వారా 16 మంది పిల్లలను కచ్చితంగా గుర్తించారు. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా ఉపయోగించవచ్చని నిపుణులు తెలియజేశారు. నోయిడా పోలీసులు 2006లో చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అక్కడి డాక్టర్లు డాక్టర్ సంజీవ్, డాక్టర్ రాజీవ్ గిరోటి (డీఎన్ఏ) నిపుణులు కంప్యూటర్ సూపరింపోజ్, 3డీ ద్వారా ముఖాలను పునర్నిర్మించి ఆ కపాలాలు ఎవరివో గుర్తించారు. ప్రస్తుతం షీనా బోరాగా భావిస్తున్న అవశేషాలను 2012, మే 23వ తేదీన రాయ్‌గఢ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో స్కల్, ఎముకలు, పంటి శాంపిల్స్‌ను ముంబైలోని జేజే ఆస్పత్రికి పంపించారు. ఎలాంటి మిస్సింగ్ కేసు దాఖలు కాకపోవడం, దర్యాప్తు ముందుకు సాగకపోవడం ఆ అవశేషాలు చాలాకాలం జేజే ఆస్పత్రిలోనే ఉండిపోయాయి. అనంతరం వాటిని ఆస్పత్రి వర్గాలు తిరిగి ముంబై పోలీసులకు అప్పగించారు. అవి, ముఖ్యంగా స్కల్, పను వరుస ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని షీరా బోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. పంటి వరుస ద్వారా ఆ అవశేషాలు షీనా బోరావేనా ? అన్న విషయాన్ని గుర్తించాలంటే ఆమె ఎప్పుడైన డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారా? అన్న విషయం తేలాలి. వెళ్లినట్టయితే అక్కడ అందుకు సంబంధించిన రికార్డులు ఉండాలి. అలా లేనప్పుడు 2 డీ లేదా 3డీ లేదా కంప్యూటర్ సూపర్ ఇంపోజ్ ద్వారా స్కల్‌ను ముఖంగా మార్చి గుర్తించడమే ప్రత్యామ్నాయ మార్గాలు. ఆ సాంకేతిక పరిజ్ఞానం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ముంబైలోని కెమ్ ఆస్పత్రి, చండీగఢ్‌లోని ఎఫ్ఎస్ఎల్ ఆస్పత్రిలో మాత్రమే ఉంది. -2డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: అనుమానిత వ్యక్తి ఫొటోలు కావాలి. స్కల్ కావాలి. ఒక చిత్రకారుడు, ఓ ఫోరిన్సెక్ ఆంత్రోపాలజిస్ట్ కలసి ముఖాన్ని పనర్నిర్మిస్తారు. కొన్ని సందర్భాల్లో స్కల్ రేడియో గ్రాఫ్‌లను కూడా వినియోగిస్తారు. -3డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: బంకబట్టి, ఇతర పదార్థాలను ఉపయోగించి స్కల్‌ను ముఖ విగ్రహంగా మలుస్తారు. దీనికోసం హై రెసల్యూషన్గల త్రీ డెమైన్షనల్ కంప్యూటర్ చిత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇందులోనూ చిత్రకారుడు, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ పరస్పర సహకారం అవసరం. ఇదివరకు 2డీ, కంప్యూటర్ చిత్రాల ద్వారా విడివిడిగా ముఖాలను పునర్నిర్మించేవారు. ఇప్పుడు 3డీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కంప్యూటర్ చిత్రాలను, 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకకాలంలో ఉపయోగించి ముఖాలను పునర్నిర్మిస్తున్నారు.