Inflation data
-
సూచీల స్థిరీకరణ కొనసాగొచ్చు
ముంబై: ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తీరుతెన్నులపైనా దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి దృష్ట్యా దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రస్తుత ట్రెండ్ స్వల్పకాలికానికి పరిమితమైంది. కావున సూచీలు స్థిరీకరణ కొంతకాలం కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా 22,300 స్థాయిని చేధించి, కొంతకాలం ఈ స్థాయిని నిలుపుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి 21,900 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా కన్జూమర్ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ ఫలితాల సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. జొమాటో, ఐనాక్స్ ఇండెక్స్, వరుణ్ బేవరేజెస్, భారతీ ఎయిర్టెల్, పీవీఆర్ ఐనాక్స్, రాడికో ఖైతాన్, ఎడెలీ్వజ్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఆంధ్రా సిమెంట్, పీఎఫ్సీ, ఆర్వీఎన్ఎల్, టిటాఘర్ వికాస్ నిగమ్ కంపెనీలు ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పది రోజుల్లో రూ.17వేల కోట్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల తొలి 10 రోజుల్లో రూ.17వేల కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏప్రిల్‌లో మొత్తం ఉపసంహరణ రూ.8,700 కోట్ల పోలిస్తే ఇది ఎక్కువ. ‘‘ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారు’’ అని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్ డీ పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో 0.2 శాతం టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ధరల సూచీ మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్‌లో ప్లస్‌లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి. జనవరిలో 6.85 శాతంగా ఉన్న ఆహార టోకు ధరల స్పీడ్, ఫిబ్రవరిలో 6.95 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో కూరగాయల ధరలు 19.71 శాతం (జనవరి) నుంచి 19.78 శాతానికి ఎగశాయి. పప్పు దినుసుల ధరలు 16.06 శాతం నుంచి 18.48 శాతానికి చేరాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగానికి వస్తే, రేటు 0.51 శాతం నుంచి 1.59 శాతానికి ఎగసింది. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలు జనవరిలో 1.13 శాతం తగ్గితే, ఈ తగ్గుదల ఫిబ్రవరిలో 1.27 శాతంగా ఉంది. -
రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం దాదాపు ఒకశాతం నష్టపోయాయి. అమెరికా, భారత్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి(మంగళవారం) ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 74,187 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు బలపడి 22,527 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు అందుకున్నాయి. రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు దిగడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ 617 పా యింట్లు పతనమైన 73,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద స్థిరపడింది. కాగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% క్షీణించింది. ► ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు మరో పదిశాతం నష్టపోయి రూ.79 వద్ద ముగిసింది. ► రిటైల్ ఇన్వెస్టర్ల ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రక్రియ ప్రారంభంతో ఎన్ఎల్సీ ఇండియా షేరు 7% నష్టంతో రూ.233 వద్ద స్థిరపడింది. ► రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆర్వీఎన్ఎల్ షేరు 3% లాభంతో రూ.245 వద్ద నిలిచింది. ► ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ ఉతి్పత్తిని, సదుపాయాలను మెరుగుపరచుకోడానికి ఆర్థిక సహాయం అందించే– ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ► ఎస్బీఐ షేరు 2% నష్టపోయి రూ.773 వద్ద ముగిసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది. -
నిత్యావసరాల ధరల మంట
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెలలోనూ ఎగువబాటనే కొనసాగింది. ఏడు నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర స్థాయిలో 0.73 శాతంగా (2022 డిసెంబర్‌తో పోల్చి) నమోదయ్యింది. 2023 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 1.41 శాతం ఎగసింది. అటు తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరలు సహా పలు విభాగాల్లో ధరల తీవ్రత తాజా టోకు ద్రవ్యోల్బణం తీవ్రతకు ప్రధాన కారణం. 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ద్రవ్యోల్బణం మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో కొనసాగింది. నవంబర్‌లో ‘యూటర్న్’ తీసుకుని 0.26 శాతంగా నమోదయ్యింది. తాజా సమీక్షా నెల డిసెంబర్లో మరింత పెరిగి 0.73 శాతానికి ఎగసింది. ఒక్క ఆహార ద్రవ్యోల్బణాన్ని చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 8.18 శాతం ఉంటే, డిసెంబర్లో 9.38 శాతానికి ఎగసింది. కూరగాయల విషయంలో ద్రవ్యోల్బణం భారీగా 26.30 శాతం పెరగ్గా, పప్పు ధాన్యాల ధరలు 19.60 శాతం పెరిగాయి. 2023 ఆగస్టు నుంచి ఈ నిత్యావసర వస్తువల ధర రెండంకెలపైన కొనసాగుతోంది. -
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే కీలక వడ్డీరేట్లు
రాజకీయాలతోపాటు రాష్ట్ర బాగోగులు, సమస్యలపై నిత్యం పార్లమెంట్లో పోరాడే ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రపంచ ఆర్థికవ్యవస్థపై విస్తృత పట్టు ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను తగ్గించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది.. అసలు ద్రవ్యోల్బణం ఎలా ఏర్పడుతుంది.. కార్మికుల జీతాలకు ఇన్ఫ్లేషన్కు సంబంధం ఏమిటనే అంశాలను విజయసాయిరెడ్డి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాల్లో, చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిన వర్ధమాన దేశాల్లో మధ్యతరగతి ప్రజల నుంచి ఆర్థికవేత్తల వరకూ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు. జనం వినియోగించే వస్తువులు, సరకుల ధరలు పెరుగడం అందరినీ వేధిస్తున్న సమస్య. అమెరికా నుంచి ఇండియా వరకూ ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులే మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఇటీవల ‘దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేకొద్దీ 2024లో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించగలం’ అని సూచనప్రాయంగా తెలిపింది. దీంతో ఇండియాలో స్టాక్ మార్కెట్లలో సూచీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్ని నిర్ణయించే ద్రవ్యోల్బణంపై తరచూ ‘ఫెడ్’ ప్రకటనలు చేస్తూ అమెరికన్లను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. ఫెడ్ సూచనలు కీలకం ప్రస్తుత ద్రవ్యోల్బోణం ఈ ఏడాది లేదా తర్వాత ఏడాది ఏ స్థాయిలో అదుపులోకి వస్తుందనే విషయంపై ఫెడ్ లేదా దాని సభ్యులు అంచనా వేసి చెబుతుంటారు. ఈ అంచనాల ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తోంది ఫెడ్. రాబోయే సుమారు మూడు నెలల కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపు ఎలా ఉండవచ్చనే అంశంపై ప్రజలకు ఫెడ్ ముందే సూచిస్తోంది. ఇలా ద్రవ్యోల్బణంపై ఫెడ్ వేసే అంచనాలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫెడ్ అభిప్రాయాలపై విస్తృతంగా చర్చలు సాగుతాయి. చివరికి ఫలానా వస్తువుల ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే విషయంపై సగటు వినియోగదారుడు ఒక నిర్ధారణకు వస్తాడు. ఫెడ్ కీలక నిర్ణయాల వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణంపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయంపై క్లారిటీ వస్తుంది. అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టే అంతా జరుగుతుందా అంటే, వాటిలో వివరించిననట్టు ప్రపంచం నడవదు. వాస్తవ ప్రపంచం వేరు.. వ్యాపారులు తమ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించాలనుకున్నప్పుడు అందుకు సరిపడా కార్మికులు లేకపోతే ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులకు డిమాండ్ ఉండడంతో వారు అధిక వేతనాల కోసం పట్టుబడతారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. దాంతో వేరే దారిలేక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు నిర్ణయిస్తారు. జీతాలు పెరగడం వల్ల కార్మికుల జేబుల్లోకి ఎక్కువ డబ్బు వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ కనీస అవసరాల కోసం షాపుల్లో కొనుగోలు చేసే వస్తు ధరలు ఊహించినదాని కన్నా ఎక్కువ ఉంటాయి. వేతనాలు పెరగడంతో వచ్చిన ప్రయోజనం వస్తు ధరల పెంపుతో మాయమౌతుంది. ఇక ధరలు ఇలాగే పెరుగుతాయనే ఆందోళనతో కార్మికులు మరింత ఎక్కువ వేతనాలు కావాలంటూ ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా వర్కర్ల జీతాలతోపాటే వస్తువుల ధరలూ పెరుగుతుంటాయి. దీన్నే ‘ధరల వలయం’ అని పిలుస్తారు. ఈ రకమైన సూత్రీకరణలు అర్థసత్యాలేగాని సంపూర్ణ వాస్తవాలు కావు. సరకుల కొరత ఉన్నప్పుడు తమ లాభాలు పెంచుకోవడానికి వ్యాపారులు చేసే ప్రయత్నాల వల్ల (ధరలు పెంచడం ద్వారా) కొన్ని కాలాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిల్లో ఉంటుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే? అసలు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే ఏమిటి? అనే విషయంపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ఫెడ్ తన ప్రకటనలో వాడిన ఈ మాటలకు (ఇన్ఫ్లేషన్ ఈజింగ్) అర్థం–ద్రవ్యోల్బణం తగ్గిపోవడం. అంటే ధరలు తగ్గవు. గతంతో పోల్చితే ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అమెరికాలో ఇళ్లలో వాడే సరకుల ధరలు 2022లో 12% పెరగగా, గడచిన 12 మాసాల్లో కేవలం 2 శాతమే పెరిగాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ముందుకు నడిపించే ఈ దేశంలో గతేడాది ద్రవ్యోల్బణం 9.1% ఉండగా, నవంబర్‌లో 3.1% గా నమోదైంది. ఈ లెక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం 2024లో కూడా ఇప్పటిలా ఆశావహంగా ఉండొచ్చని అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంచనా. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP -
ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..!
అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తేడా లేదు. ఏ దేశంలో చూసినా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే. ప్రపంచ దేశాలు ఈ ద్రవ్యోల్బణానికి బలవుతున్నాయి. ప్రపంచంలోనే అధికంగా వెనుజులాలో 318 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. లెబనాన్‌లో 215 శాతం, అర్జెంటీనాలో 143 శాతం, సిరియాలో 79.1 శాతం, పాకిస్థాన్‌లో 29.2 శాతం, ఇండియాలో 4.87 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలుస్తోంది. Inflation rate: 🇻🇪 Venezuela: 318% 🇱🇧 Lebanon: 215% 🇦🇷 Argentina: 143% 🇸🇾 Syria: 79.1% 🇹🇷 Türkiye: 61.98% 🇮🇷 Iran: 39.2% 🇪🇬 Egypt: 35.8% 🇵🇰 Pakistan: 29.2% 🇳🇬 Nigeria: 27.33% 🇰🇿 Kazakhstan: 10.3% 🇧🇩 Bangladesh: 9.93% 🇨🇿 Czechia: 8.5% 🇷🇴 Romania: 8.07% 🇭🇺 Hungary: 7.9% 🇳🇪 Niger:… — World of Statistics (@stats_feed) December 8, 2023 -
దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్
దీపావళికి కాస్త దిగి వచ్చి వినియోగదారులను ఊరించిన పసిడి ధర అనూహ్యంగా మళ్లీ పరుగందుకుంది. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల తరువాత డాలర్ ఇండెక్స్ 10-వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. నవంబర్ 11, 2022 నుండి అతిపెద్ద సింగిల్-డే క్షీణతకు దారితీసింది. ముఖ్యమైన ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలర్1.55 శాతం పడి 103.98కి చేరుకుంది. దీంతో బంగారంలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దేశీయంగా దేశీయంగా నవంబర్ 15న న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,190గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 400 రూపాయలు ఎగిసి ధర రూ.55,950 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.61,040 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే మంగళవారంతో పోలిస్తే బుధవారం హైదరాబాదులో కిలో వెండి ఏకంగా రూ.1700 పెరిగి రూ.77,700 పలుకుతోంది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,700గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్‌తో గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర స్వల్పంగా పుంజుకుని రూ. 60,224 ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది. స్పాట్ బంగారం ధర ప్రస్తుతం ఔన్స్‌కు1,965 డాలర్లకు పెరిగింది. MCXలో వెండి ధర కిలో రూ. 71,794 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో, వెండి ధర ఔన్సు దాదాపు 23 డాలర్లుగా ఉంది. రూపాయికి బలం అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 600పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 188 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా లాభాల్లోఉంది. డాలర్ బలహీనతతో రూపాయి 0.3 శాతం పెరిగి 83.08 వద్ద ట్రేడవుతోంది, సెప్టెంబర్ 8 నుండి దాదాపు రెండు నెలల తరువాత ఇదే అత్యధిక లాభం. -
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్ ట్రేడింగ్ లాభాలన్నీ మాయమ య్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది. ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్‌లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్‌కు దన్నుగా నిలిచే వీలుంది’. – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ -
మూడు నెలల కనిష్ఠానికి చేరనున్న సీపీఐ ద్రవ్యోల్బణం!
భారత గణాంకాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌కు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటాను, ఆగస్టులోని పారిశ్రామిక ఉత్పత్తి డేటాను అక్టోబరు 12న విడుదల చేయనుంది. అందుకు నిపుణులు కారణాలను విశ్లేసిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. కానీ సెప్టెంబరు నెలకు అది 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా. పారిశ్రామికోత్పత్తి సూచీ జులైలో 5.7తో పోలిస్తే ఆగస్టులో 9.1కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది గడిచిన 14 నెలల్లో అత్యధికం. సెప్టెంబర్‌లో టమాటా ధరలు సాధారణ స్థితికి రావడంతో నెలవారీగా ఖర్చుల శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్ మార్కెట్లు జీవితకాలపు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. అయితే అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు 12 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 8.8శాతం పెరిగినప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొంత ఊరట కలిగించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం దాదాపు ఒకటిన్నర శాతం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ద్రవ్యోల్బణం, ఫెడ్ మినిట్స్‌పై ఫోకస్
ముంబై: దేశీయ ద్రవ్యోల్బణం డేటా, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) ఈ వారం మార్కెట్‌కు దారిచూపొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తుది దశకు చేరిన కార్పొరేట్ క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (రేపు) ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే కావడంతో మార్కెట్ వర్గాల పారి్టసిపేషన్ (భాగస్వామ్యం) స్వల్పంగా ఉంటుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ క్రూడాయిల్ ధరలపై దృష్టి సారించే వీలుందంటున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా సూచీలు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. అయితే ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువు స్థాయిలో 19,300–19,100 శ్రేణిలో కీలక మద్దతు స్థాయిని ఉంది. కొనుగోళ్ల మద్దతు లభిస్తే ఎగువ స్థాయిలో 19,650–19,700 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యల్బోణ అంచనాలను 30 బేసిస్ పాయింట్లు పెంచడం, అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి)ను పదిశాతం పెంపు చర్యలతో గతవారంలో మార్కెట్ నష్టాలను చవిచూసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్ల పతనంతో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి ద్రవ్యోల్బణ ఆందోళనలు అధికమతున్న వేళ నేడు(సోమవారం) రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఈ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనునున్నారు. టమోటాతో పాటు ఇతర కాయగూరల ధరలు పెరగడంతో ఈ జూలై సీపీఐ ద్రవ్యోల్బణం అర్బీఐ లక్షిత పరిధి ఆరు శాతాన్ని మించి 6.3%గా నమోదుకావచ్చని ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ తన సమీక్ష సమావేశంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి గానూ ద్రవ్యోల్బణ అంచనాను 5.1% నుంచి 5.4 శాతానికి పెంచింది. ఇదే రోజున టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలూ వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ సమావేశ వివరాలపై కన్ను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో మరోసారి వడ్డీరేట్ల పెంపు సంకేతాలిచి్చన ఫెడ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. చివరి దశకు కార్పొరేట్ ఆరి్థక ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ1 ఫలితాల అంకం తుది దశకు చేరింది. ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, వోడాఫోన్ ఐడియాలు నేడు (సోమవారం) తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే వారంలో కేరియర్ పాయింట్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఫ్యూచర్ కన్జూమర్, గ్లోబల్ స్పిరిట్స్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, హిందుస్థాన్ కాపర్, జాగరణ్ ప్రాకాశన్, మేఘ్మణి ఆర్గానిక్స్, పీసీ జ్యూవెలరీ, వోకార్డ్ కంపెనీలు ఫలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. మారుతున్న ఎఫ్ఐఐల వైఖరి ఈ ఆగస్టు తొలివారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన వారంలో రూ.3,200 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మొత్తంగా దేశీయ మార్కెట్లో ఈ ఆగస్టు 11 తేదీ నాటికి రూ.3,272 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశి్చతి, చైనా ఆరి్థక వ్యవస్థ మందగమన పరిస్థితులు మన మార్కెట్లో పెట్టుబడులకు ఉతమిస్తున్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం కలిసొస్తుంది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. అంచనాలకు మించి నమోదైన జూన్ క్వార్టర్ ఫలితాలూ విదేశీ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయనన్నారు. -
ఇన్వెస్టర్లలో అప్రమత్తత
ముంబై: అమెరికా ద్రవ్యోల్బణం డేటా ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. దీంతో బుధవారం ఈక్విటీ మార్కెట్ అస్థిరంగా చలించి, చివరికి కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాల్లో మగిసింది. అమ్మకాల ఒత్తిడికి ఉదయం సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీ పావు శాతం వరకు నష్టాన్ని చూశాయి. కానీ, అక్కడి నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం సూచీలను తిరిగి లాభాల బాట పట్టించింది. సెన్సెక్స్ మొత్తం మీద 400 పాయింట్ల శ్రేణిలో 61,573 నుంచి 61,974 మధ్య చలించింది. చివరికి పావు శాతం లాభంతో (179 పాయింట్లు) 61,940 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 22 లాభపడ్డాయి. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,315 పాయింట్ల వద్ద క్లోజయింది. మార్కెట్లు లాభాల్లో ముగియడం వరుసగా ఇది మూడో రోజు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువ శాతం ప్రతికూలంగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ 3 శాతం లాభపడింది. నష్టపోయిన వాటిల్లో ఎస్బీఐ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్ ఉన్నాయి. ‘‘దేశీ మార్కెట్ ఫ్లాట్‌గా ట్రేడ్ అయింది. యూఎస్ మార్కెట్ చుట్టూ నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్కెట్ల పట్ల సానుకూలంగా వ్యవహరించలేదు‘‘అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లు మరో రోజు స్థిరీకరణ చెందాయని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రియల్టీ, ఇంధనం, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించినట్టు చెప్పారు. యూఎస్ వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల కానుండడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు స్తుబ్దుగా ట్రేడయ్యాయి. సియోల్, టోక్యో, షాంఘై, హాంగ్‌కాంగ్ నష్టాల్లో ముగిశాయి. -
లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో సూచీలు ఐదుశాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం డేటా, ఆర్బీఐ మినిట్స్, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పనితీరు, అంతర్జాతీయ పరిణామాలు ట్రెండ్‌ను నిర్దేశించడంలో కీలకం కానున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 17,550 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఎగువున 18వేల స్థాయి వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాల దృష్ట్యా పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ రంగం ఒత్తిడికి లోనుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల క్యూ4 ఆర్థిక ఫలితాలను స్పందించాల్సి ఉంటుంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్‌తో సహా 50కి పైగా కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఎగుమతి ఆధారిత కంపెనీలపై అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం ఏ స్థాయిలో ఉందో మార్చి త్రైమాసిక ఫలితాల ద్వారా తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అలాగే ఆయా కంపెనీల యాజమాన్య అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్ష్ణు్ణంగా పరిశీలించే వీలుంది. ► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం మార్చి డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా సోమవారం(నేడు) విడుదల అవుతుంది. మరుసటి రోజు మంగళవారం చైనా తొలి క్వార్టర్ జీడీపీ వృద్ధి, పారిశ్రామి కోత్పత్తి డేటాతో పాటు యూరోజోన్ ఫిబ్రవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గణాంకాలు వెల్లడి కానున్నా యి. ఇక బుధవారం జపాన్ ఫిబ్రవరి పారిశ్రామి కోత్పత్తి, యూరోజోన్ మార్చి ద్రవ్యోల్బణ విడుదల అవుతుంది. జపాన్ మార్చి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అమెరికా ఇళ్ల అమ్మకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపా న్ మార్చి ద్రవ్యోల్బణం, యూరోజోన్ తయారీ రంగ సర్వీసు, అమెరికా తయారీ రంగ సర్వీసు డేటా వెల్లడి కానుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ► విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ ఇన్వెస్టర్లు 2023–24ని సానుకూలంగా ప్రారంభించారు. ఈ నెలతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ల నుంచి రూ. 1,085 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల వాల్యూయేషన్ ప్రీమియం దశ నుంచి దిగిరావడంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇటీవలి అమెరికా ఫెడ్ మినిట్స్ నివేదిక రాబోయే పాలసీ సమావేశంలో యూఎస్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంకేతమిచ్చింది. దానివల్ల ఎఫ్‌పీఐ ధోరణి అస్థిరంగా ఉండొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. -
మార్కెట్లో అప్రమత్తతకు అవకాశం
ముంబై: అదానీ గ్రూప్ సంక్షోభం, ద్రవ్యోల్బణ డేటా, కీలక కార్పొరేట్ క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుందని మార్కట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై దృష్టి సారింవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, బాండ్లపై దిగుమతి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. గతవారం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనై మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోగా.., నిఫ్టీ మూడు పాయింట్లు లాభపడింది. ఆటో, ఇంధన, ఎఫ్ఎంసీజీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెక్నాలజీ, మౌలిక, ఫార్మా, కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. ‘‘ఇటీవల ప్రతికూలతలు ఎదుర్కొన్న మార్కెట్ ప్రస్తుతం కీలక స్థాయి వద్ద ట్రేడవుతుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఒక బలమైన సానుకూలాంశం కోసం ఎదురు చూస్తోంది. ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్ల కొనుగోలు వ్యూహాన్ని అనుసరించాలి. ధీర్ఘకాలిక పెట్టుబడులకు స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లను ఎంచుకోవడం ఉత్తమం. అప్‌సైడ్‌లో నిఫ్టీ 18,000 వద్ద కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17600 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. అదానీ గ్రూప్ సంక్షోభం హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటున్న వివరణలు ఇన్వెస్టర్లకు భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్ల ట్రేడింగ్ మీద పెట్టిన అదనపు నిఘా ఎత్తివేస్తున్నట్లు ఎన్ఎస్ఈ శుక్రవారం ప్రకటించింది. అలాగే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నాలుగు అదానీ కంపెనీ షేర్లపై దాని రేటింగ్ ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుండి ‘నెగటివ్’కి తగ్గించింది. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ మంగళవారం క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మరింత స్పష్టత వచ్చే వీలుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, గ్రాసీం, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, ఎన్ఎండీసీ, బయోకాన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అయిదువేల కోట్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో భారీ ఉపసంహరణ తర్వాత ఫిబ్రవరిలో ఎఫ్ఐఐల విక్రయాలు కాస్త మందగించాయి. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం ఈ నెల పదో తేదీకి రూ.5,000 కోట్ల షేర్లను అమ్మేశారు. జనవరిలో రూ.53,887 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి మార్కెట్లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించాలని విదేశీ పెట్టుబడులు యోచిస్తున్నట్లు సమాచారం. స్థూల ఆర్థికాంశాల ప్రభావం మార్కెట్ నేడు గతేడాది డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి డేటాకు స్పందించాల్సి ఉంటుంది. దేశీయ జనవరి సీపీఐ ద్రవ్యోల్బణం నేడు, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం (మంగళవారం) రేపు విడుదల కానున్నాయి. అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం డేటాను మంగళవారం వెల్లడించనుంది. సీపీఐ ద్రవ్యోల్బణం గత నాలుగు నెలలుగా ఆర్బీఐ నిర్ధేశించుకున్న స్థాయిలోనే నమోదువుతోంది. జనవరిలోనూ స్థిరంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం(ఫిబ్రవరి 15న) విడుదల అవుతాయి. వారాంతాపు రోజు శుక్రవారం ఆర్బీఐ ఫిబ్రవరి నాలుగో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. -
ముంచుకొస్తోంది..ఆర్ధిక మాంద్యం
మాంద్యం... ప్రపంచాన్ని ఇప్పుడు వెంటాడుతున్న పదం ఇది. కరోనా దెబ్బతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి... ఇప్పుడు ధరాభారంతో పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయ్యాక యూరప్, అమెరికా దేశాల్లోనే కాదు ఆసియాలోని చాలా దేశాల్లోనూ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం సెగను తగ్గించేందుకు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచుతుండటం... చైనాలో మళ్లీ కరోనా భయాలతో అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం.. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు, గ్యాస్ రేట్లు భగ్గుమనడం.. ఇలా అనేక పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కోరల్లో చిక్కుకునేలా చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2023లో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనే డేంజర్ బెల్స్ మోగించింది. యూరప్, అమెరికాలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని కూడా చెబుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, హెచ్‌పీ వంటి అనేక అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు ప్రకటించడం కూడా మాంద్యం ఆందోళనలను మరింత పెంచుతోంది. అసలు ఆర్థిక మాంద్యం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎందుకింత ఘోరంగా తయారైంది? కొలువుల కోతలకు కారణమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి! శివరామకృష్ణ మిర్తిపాటి 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు తాజా వార్నింగ్... అంచనాలను మించిన ద్రవ్యోల్బణం.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అకస్మాత్తుగా పెరిగిన వడ్డీరేట్లు, మళ్లీ కోవిడ్ మహమ్మారి భయాలు, బలహీన డిమాండ్ ప్రభావంతో ప్రపంచ ఎకానమీ వృద్ధి రేటు 2023లో 1.7 శాతానికి పడిపోవచ్చని ప్రపంచ బ్యాంకు తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత అంచనా 3 శాతం కాగా, దాదాపు సగానికి కోతపెట్డడం గమనార్హం. ఒకవేళ అమెరికా మాంద్యాన్ని తప్పించుకున్నప్పటికీ, వృద్ధి రేటు మాత్రం 0.5 శాతానికి పడిపోవచ్చని లెక్కగట్టింది. అధిక ధరలు, తీవ్ర వడ్డీరేట్లు, ప్రపంచ ఆర్థిక బలహీనతలు అమెరికా వ్యాపార సంస్థలు, వినియోగదారుల నడ్డివిరుస్తాయని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. కోవిడ్ మరింత విస్తరించి, ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముదిరిపోతే... సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతాయని.. అంతిమంగా మాంద్యానికి దారితీయొచ్చని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు... బలహీన చైనా ఎకానమీ కారణంగా, యూరప్ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. అమెరికా, యూరప్, చైనా ఏకకాలంలో మందగమనంలో ఉండటం అనేది ప్రపంచ ఎకానమీకి పెను ముప్పుగా మారుతుందని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టీనా జార్జియేవా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ ఎకానమీ వృద్ధి 0 స్థాయిలో... చైనా వృద్ధి 4.3 శాతానికి, బ్రెజిల్ వృద్ధి రేటు 0.8 శాతానికి దిగజారవచ్చనేది ప్రపంచ బ్యాంక్ అంచనా. భారత్ బెటర్... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు 2022తో పోలిస్తే ఈ ఏడాది సగానికి పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. మెరుగైన స్థాయిలో 3.4 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ముఖ్యంగా, భారత్ జీడీపీ తగ్గినా కూడా మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును నమోదు చేయొచ్చని చెబుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. 2022–23 ఏడాది అంచనా 6.9 శాతంగా ఉంది. దీని ప్రకారం చూస్తే ఏడు అతిపెద్ద వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన దేశంగా ఈ ఏడాది భారత్ నిలుస్తుంది. 2020–21లో కోవిడ్ కారణంగా భారత్ జీడీపీ 7.3 శాతం క్షీణించినా, 2021–22లో తిరిగి కోలుకోవడమే కాకుండా 8.7 శాతం వృద్ధి చెందింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చనేది ప్రభుత్వ అంచనా. మొత్తంమీద చూస్తే ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారినప్పటికీ, భారత్ మాత్రం దీన్ని తప్పించుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతా అమెరికానే చేసింది!! 2007–2009 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడంతో పాటు వడ్డీరేట్లను దాదాపు సున్నా స్థాయిలోనే అనేక సంవత్సరాలు కొనసాగించింది అమెరికా. పరిస్థితులు కాస్త సద్దుమణగడం.. అమెరికా స్టాక్ మార్కెట్ల జోరు నేపథ్యంలో 2018లో వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచడం మొదలుపెట్టింది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్. అయితే, పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో అన్ని దేశాల ఎకానమీలు ఒక్కసారిగా స్తంభించిపోయి, కుప్పకూలాయి. దీంతో మళ్లీ అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను అమాంతం సున్నా స్థాయికి తీసుకొచ్చి, లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది. కోవిడ్ నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చింది. అమెరికా, యూరప్ ఇతరత్రా వాటి మిత్ర దేశాలు రష్యాపై పరోక్ష యుద్ధానికి కాలుదువ్వడం.. ఆంక్షల కొరడా ఝుళిపించడంతో క్రూడ్, ఆహారోత్పత్తుల ధరల మంట మొదలైంది. ద్రవ్యోల్బణం దూసుకెళ్లడంతో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీరేట్లను ఎకాయెకిన పెంచేయడం మొదలెట్టాయి. అమెరికా తన ఆర్థిక ప్యాకేజీలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. కాగా, చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించకపోవడంతో ధరాఘాతం మరికొన్నాళ్లు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదీ వడ్డీరేట్లు మరింత పెరిగిపోవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇదే జరిగితే.. ఎకానమీలు మరింత మందగిస్తాయని.. వెరసి ప్రపంచ మాంద్యానికి ఇంకాస్త చేరువకావడం ఖాయమని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ‘ప్రపంచ వృద్ధి తీవ్రంగా మందగిస్తోంది. ఇది మరింత దిగజారితే, చాలా దేశాలు మాంద్యంలోకి జారిపోతాయి. ఈ ధోరణులు చాలాకాలం కొనసాగనుండటం అందోళనకరమైన విషయం. ఇదే జరిగితే వర్థమాన దేశాల ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారు’ అని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ అభిప్రాయపడ్డారు. వణికిస్తున్న వడ్డీరేట్లు... 2007లో దాదాపు 5 శాతం స్థాయిలో ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేటు.. అప్పటి ఆర్థిక సంక్షోభం తర్వాత సున్నా స్థాయికి దిగొచ్చింది. దాదాపు 2016 వరకూ ఇదే స్థాయిలో కొనసాగింది. అయితే, తర్వాత మళ్లీ పెరుగుతూ 2.25 శాతానికి చేరింది. ఆ సమయంలో కోవిడ్ దెబ్బకు మళ్లీ 2020లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును సున్నాకు తగ్గించేసింది. రెండేళ్లపాటు అక్కడే ఉంచింది. ఎకానమీ కాస్త మెరుగైన సంకేతాలకు తోడు.. ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతానికి చేరి (40 ఏళ్ల గరిష్ఠం) ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఈ ఏడాది మళ్లీ పెంపు మొదలుపెట్టి డిసెంబర్ నాటికి 4.5 శాతానికి చేర్చింది. ఈ ఏడాదిలో ఇది 5.25 శాతానికి చేరే అవకాశం ఉంది. దీంతో డాలరు విలువ ఎగబాకి.. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలను కుదేలు చేసింది. మన రూపాయి కూడా దాదాపు 83 స్థాయికి బక్కచిక్కి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోవడం తెలిసిందే. అయితే, మిగతా కరెన్సీలతో పోలిస్తే మనదే కాస్త తక్కువ క్షీణించడం విశేషం. అమెరికా వడ్డీరేట్ల పెంపు జోరు, ద్రవ్యోల్బణంపై పోరు కారణంగా అటు యూరప్‌తో పాటు ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులూ వడ్డీరేట్లను తప్పక పెంచాల్సి వస్తోంది. మన ఆర్బీఐ కూడా కీలక రెపో రేటును 4 శాతం నుంచి ఇప్పుడు 6.25 శాతానికి పెంచడంతో కార్పొరేట్లు, ఇటు రిటైల్ రుణ గ్రహీతలపై వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. వెరసి ఆర్థిక వ్యవస్థలు మరింత మందగిస్తున్నాయి. యూరప్ సెల్ఫ్ గోల్... అసలే అంతంతమాత్రంగా ఉన్న యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మరింత దిగజారింది. ముఖ్యంగా అమెరికా ప్రోద్బలంతో రష్యాపై విధించిన ఆంక్షలు చివరికి యూరప్ దేశాల మెడకే చుట్టుకున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాలను నిలిపివేయడం, ఇతరత్రా కమోడిటీ దిగుమతులపై ఆంక్షలకు తోడు జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడం (అమెరికా ఏజెంట్లే చేశారన్నది రష్యా ఆరోపణ)తో యూరోపియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని స్థాయికి (చాలా దేశాల్లో ఆల్‌టైమ్ గరిష్ఠం) ఎగబాకింది. రష్యా చౌక గ్యాస్, క్రూడ్‌ను కాదని భారీ మొత్తానికి అమెరికా ఇతర దేశాల నుంచి యూరప్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో అక్కడి పరిశ్రమలు అధిక వ్యయాలతో మూతబడే పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగాల కోతకు దారితీస్తోంది. బ్రిటన్ ఎకానమీ ఇప్పటికే క్షీణతలోకి (2022 మూడో త్రైమాసికంలో జీడీపీ మైనస్ 0.3% క్షీణించింది) జారుకొని మాంద్యాన్ని చవిచూస్తోంది. మిగతా దేశాలూ అదే బాటలోకి వెళ్లే ప్రమాదం ఉంది. యూరప్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తే అది ప్రపంచ ఎకానమీపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంమీద రష్యా విషయంలో అమెరికా వలలో చిక్కుకుని యూరప్ సెల్ఫ్ గోల్ వేసుకుందనేది ఆర్థికవేత్తల విశ్లేషణ. ధరదడ... స్టాగ్ఫ్లేషన్! పశ్చిమ దేశాల విచ్చలవిడి కరెన్సీ ప్రింటింగ్‌కు తోడు కరోనా దెబ్బతో సరఫరా వ్యవస్థలు ఛిన్నాభిన్నం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ధరల దెబ్బకు సామాన్యుడే కాదు, ఆర్థిక వ్యవస్థలు సైతం అల్లాడిపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంకలో ద్రవ్యోల్బణం దెబ్బకు ప్రజలు ఎలా రోడ్డెక్కి అధ్యక్షుడిని సైతం పారిపోయేలా చేశారో మనం కళ్లారా చూశాం. అలాగే పాకిస్తాన్లో గోధుమ పిండి, ఇతరత్రా నిత్యావసరాల కోసం జరుగుతున్న కొట్లాటలకూ ధరల తీవ్రతే కారణం. మరోపక్క, ఆర్థిక మందగమనం కూడా కొనసాగుతుండటంతో ప్రస్తుతం ప్రపంచం ‘స్టాగ్ఫ్లేషన్’ను ఎదుర్కొంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అధిక ద్రవ్యోల్బణానికి తోడు జీడీపీ వృద్ధి అంతకంతకూ పడిపోతూ ఉండటం, ఫలితంగా నిరుద్యోగం తీవ్రతరం కావడాన్ని స్టాగ్‌ఫ్లేషన్‌గా పేర్కొంటారు. కంపెనీల లాభదాయకత పడిపోవడంతో ఉద్యోగాల కోతకు దారితీస్తుంది. మాంద్యం–ద్రవ్యోల్బణంగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇది పాలసీ నిర్ణయాల విషయంలో డైలమాకు కారణమవుతుంది. ఎందుకంటే, అధిక ధరలకు కళ్లెం వేయాలంటే కొన్ని నెలల పాటు వడ్డీరేట్లను పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్ సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోతుంది. ధరలు కట్టడి అయ్యేంతవరకూ సెంట్రల్ బ్యాంకులు అదేపనిగా వడ్డీరేట్లను పెంచడం వల్ల నిరుద్యోగం మరింత పెరగడంతో పాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి వెళ్లిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీ దెబ్బ... కరోనాతో 2020లో పాతాళానికి పడిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు.. 2021లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. అయితే, చైనా మాత్రం జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలకు తోడు, 2022లో కొత్త వేరియంట్ బీఎఫ్7 కారణంగా లాక్డౌన్లకు తెరతీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రపంచ తయారీ భాండాగారంగా పేరొందిన చైనా నుంచి వాణిజ్యం కుంటుపడటం.. ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసింది. ఈ పరిణామాలతో చైనాలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2022లో 3 శాతానికి పరిమితమైంది. 2020లో కోవిడ్ వల్ల 2.2 శాతానికి పడిపోయిన ఉదంతాన్ని మినహాయిస్తే, 1976 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. 2021లో జీడీపీ వృద్ధి 8.1 శాతం కావడం గమనార్హం. అయితే, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో జీరో కోవిడ్ పాలసీకి 2022 డిసెంబర్లో చైనా చెల్లు చెప్పినప్పటికీ.. తిరిగి మళ్లీ ఎకానమీ పుంజుకోవడానికి చాలా నెలలు పట్టొచ్చనేది ఆర్థిక వేత్తల మాట. పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్షీణత, బలహీన ప్రపంచ డిమాండ్ వంటివి 2023లో చైనాకు పెను సవాళ్లుగా నిలుస్తాయని మూడీస్ ఎకనమిస్ట్ హ్యారీ మర్ఫీ క్రూయిజ్ విశ్లేషిస్తున్నారు. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం అంటే ప్రపంచ మాంద్యానికి మరింత దగ్గరైనట్లేనని కూడా పేర్కొంటున్నారు. ఒకపక్క మాంద్యం భయాలకు తోడు... వ్యయాలు తడిసిమోపెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. అంతేకాదు, చాలా కంపెనీలు కొత్త ఉద్యోగాలను కూడా (హైరింగ్) తాత్కాలికంగా ఆపేస్తుండటం ఆర్థిక వ్యవస్థల్లో బలహీనతకు నిదర్శనం. ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది. గూగుల్ దాదాపు 12,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుండగా, హెచ్‌పీ దాదాపు 6,000 మందిని సాగనంపింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా సైతం ఆదాయాలు పడిపోతుండటంతో 11,000 కొలువులకు కోత పెట్టింది. ఇక ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సిబ్బందిని సగానికి సగం తగ్గించి, దాదాపు 3,500 మందిని ఇంటికి పంపారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ అయితే, ఏకంగా 18,000 మందిపై వేటు వేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద కోత. ఇందులో భారత్‌లోనూ 1,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 10,000 కొలువులు (మొత్తం ఉద్యోగుల్లో 5%) కట్ చేస్తామని ప్రకటించింది. ఇంకా చిన్నాచితకా టెక్ కంపెనీలతో పాటు పెప్సికో, ఫోర్డ్ వంటి తయారీ రంగ కంపెనీలు సైతం ఇదే బాటలో వెళ్తున్నాయి. ‘లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది టెక్నాలజీ కంపెనీలు దాదాపు 1,50,000 ఉద్యోగులను తొలగించినట్లు అంచనా. ఇక 2023 విషయానికొస్తే, ఇప్పటికే 104 పైగా కంపెనీలు సుమారు 26,000 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. అంటే రోజుకు 1,600 మంది కొలువులు కోల్పోయారన్నమాట! ఆర్థిక వృద్ధి మరింత పడిపోయి, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే రానున్నకాలంలో ఒక్క టెక్నాలజీ కంపెనీలే కాకుండా అన్ని రంగాల్లోనూ మరిన్ని కోతలు తప్పవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. -
కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే.., ఈ వారం దేశీయ స్టాక్ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ‘‘గతేడాది(2021) అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. ► ద్రవ్యోల్బణ డేటా దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్ ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. . ► కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ► ప్రపంచ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్ అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్ ద్రవ్యోల్బణం, జపాన్ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఎఫ్ఐఐలు వైఖరి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
ఫెడ్ భారీ ‘వడ్డిం‘పు
న్యూయార్క్: ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి ఎగశాయి. వెరసి వరుసగా మూడోసారి రేట్లను పెంచింది. గత నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణ కట్టడికే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ప్రాధాన్యత ఇచ్చినట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కాగా.. కరోనా మహమ్మారి కాలంలో 9 ట్రిలియన్ డాలర్లకు చేరిన బ్యాలెన్స్‌షీట్‌ను తగ్గించేందుకు ఫెడ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు జూన్ నుంచి నెలకు 95 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రోలాఫ్ చేయడం ద్వారా లిక్విడిటీలో కోత పెడుతోంది. ఈ నేపథ్యంలో డాలరు ఇండెక్స్ 110ను అధిగమించగా.. ట్రెజరీ ఈల్డ్స్ 3.56 శాతాన్ని తాకాయి. అయితే 2022 జనవరి–మార్చిలో 1.6 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ ఏప్రిల్–జూన్‌లోనూ 0.6 శాతం నీరసించింది. దీంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?
సాక్షి,ముంబై: అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి బిలియనీర్లు బిలియన్ డాలర్ల సంపదను కోల్పోతున్నారు. టాప్ 10లో ఉన్న అక్కడి బిలియనీర్ల సంపదకు ఈ ఏడాది గడ్డుకాలంగా నిలుస్తోంది.ఒక్క జులై మినహా ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ఫలితంగా ఈ ఏడాది తొలి అర్దభాగంలో ప్రపంచ కుబేరులు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. ఫెడ్ వడ్డీరేటు తప్పదనే భయాలు ఇన్వెస్టర్లనువెంటాడుతున్నాయి. ఫలితంగా S&P 500 జూన్ 2020 నుండి అత్యధికంగా 4.4 శాతం, టెక్-హెవీ నాస్డాక్ 100 ఇండెక్స్ 5.5శాతం కుప్పకూలింది. ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ఎనిమిది నిమిషాల ప్రసంగం తర్వాత బిలియనీర్ల సంపద ఒక రోజులో 78 బిలియన్ డాలర్ల కోల్పోయింది. అదే భయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే దేశీయ వ్యాపార దిగ్గజాలు, ఆసియా కుబేరులు సంపద మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. (బెజోస్ నుంచి మస్క్ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్) గ్లోబల్ బిలియనీర్ల జాబితా టాప్-10 లో ఒక్క రోజులొ సంపదను కోల్పోని బిలియనీర్లు ఇద్దరు మాత్రమే. వారే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ,గౌతమ్ అదానీ.బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం దేశవ్యాప్తంగా దీపావళి నాటికి తన స్వతంత్ర 5జీ సేవలను ప్రారంభించబోతున్న అంబానీ 9,775 కోట్లు సంపాదించారు. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 12,556 కోట్లు (1.58 బిలియన్ డాలర్లు ) సంపాదించడం విశేషం. ముఖ్యంగా టాప్‌లో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇద్దరూ గత 24 గంటల్లో లక్షా 50 వేల కోట్ల మేర సంపదను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు కుప్పకూలి 53887 వద్ద నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో 16058 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 54 వేల స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 16100 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, పలు చైనా నగరాల్లో కోవిడ్-19 షట్డౌన్ల కారణంగా ఆసియాలో మార్కెట్ల బలహీనత నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. ఎన్టీపీసీ, శ్రీ సిమెంట్స్, భారతి ఎయిర్టెల్, అదానీపోర్ట్స్, కోల్ ఇండియా టాప్ విన్నర్స్‌గాను, ఐషర్ మోటార్స్, హిందాల్కో, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, నెస్లే టాప్ లూజర్స్‌గాను నిలిచాయి. మరోవైపు డాలరు మారంలో రూపీ మంగళవారం మరింత దిగజారింది. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు : సెన్సెక్స్ 509,నిఫ్టీ 158 పాయింట్లు పతనం -
ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ
వంట నూనె మొదలు పెట్రోలు, గోలీ మందులు మొదటు ఏసీల వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలతో పేదలు, సామాన్యులు విలవిలలాడుతున్నారు. బడ్జెట్ లెక్కలు తారుమారై అవస్థలు పడుతున్నారు. కానీ ఆర్థిక శాఖ సూత్రీకరణ మరో రకంగా ఉంది.. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు, పేదల కంటే ధనవంతులే ఎక్కువగా నష్టపోతున్నారంటూ చిత్రమైన లెక్కలను ప్రజల ముందుకు తెచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, రిటైల్ కన్సుమర్ ఇండెక్స్ తదితర అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ 2022 మే 12న రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పనితీరు పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర అంశాలను వివరిస్తూ.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, పెరిగిన ధరల ప్రభావం పేదలు, సామాన్యుల కంటే ధనవంతులపైనే అధికంగా ఉందంటూ విశ్లేషణ చేసింది. ఇందు కోసం 2011-12 నేషనల్ శాంపిల్ సర్వే ఆధారంగా వివిధ కేటగిరీల వారీగా కుటుంబాలు చేస్తున ఖర్చుల వివరాలను ప్రమాణికంగా తీసుకుని వివరణ ఇచ్చింది. దీనిపై మనీ కంట్రోల్ ప్రచురించిన కథనం ఆధారంగా.. మూడు కేటగిరీలు మూడు రకాల ఖర్చులు కేంద్ర ఆర్థిక శాఖ విశ్లేషణ ప్రకారం... దేశంలో వినియోగదారులను మూడు కేటగిరీలుగా పేర్కొంది. అందులో పై స్థాయిలో ఉండే ధనవంతులు 20 శాతం, మధ్య తరగతి 60 శాతం, పేదలు 20 శాతంగా తీసుకున్నట్టు తెలిపింది. ఈ కేటగిరీల వారు చేస్తున్న ఖర్చులను కూడా మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంది. అవి ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యూయల్ అండ్ లైట్ (రవాణా ఖర్చులతో కలిపి), ఫుడ్, ఫ్యూయల్ మినహాయించి ఇతర వస్తువులుగా పేర్కొంది. వారిపైనే అధికం పైన పేర్కొన్న మూడు కేటగిరీలకు చెందిన కుటుంబాలు జీవించేందుకు మూడు కేటగిరీలకు పెడుతున్న ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ వీరిపై గడిచిన రెండేళ్లుగా ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అంచనా వేస్తూ ఆర్థిక శాఖ విశ్లేషణాత్మ వివరణ తయారు చేసింది. ఇందులో ఎవ్వరూ ఊహించని విధంగా పేదలు, మధ్య తరగతి కంటే ధనవంతులపైనే ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది! పేదలపై భారం పడలేదు! ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 20 శాతం ఉన్న పేదవారిపై ద్రవ్యోల్బణ ప్రభావం పరిశీలించగా 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో అది 5.2 శాతానికి పడిపోయింది. ఇదే కేటగిరిలో పట్టణ ప్రాంత పేదలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గి వారికి ఉపశనం కలిగించింది. మధ్య తరగతి సేఫ్! ఇక సమాజంలో 60 శాతంగా ఉన్న మధ్య తరగతి విషయానికి వస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 6.8 శాతం నుంచి 5.7 శాతానికి దిగి వచ్చింది. పట్టణ ధనికులపైనే! ద్రవ్యోల్బణం కారణంగా 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాలకు జరుగుతున్న నష్టాన్ని ఆర్థిక శాఖ ఇలా వివరించింది... 2021 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2022 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతానికి చేరుకుంది. అంటే గ్రామీణ ప్రాంత సంపన్నులపై 0.1 శాతం అధికంగా ద్రవ్యోల్బణం ప్రభావం చూపించింది. ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే 5.7 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. మొత్తంగా సమాజంలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పట్టణ ప్రాంతాలకు చెందిన సంపన్నులపై అత్యధికంగా 1.1 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం చూపింది. సమాజంలోని వివిధ ఆదాయ వర్గాల వారిపై ధరల పెరుగుదల ప్రభావాలను సునిశితంగా గమనిస్తే పేదలు, మధ్య తరగతి కంటే సంపన్నులపైనే ఎక్కువ ప్రభావం చూపిందంటూ ఆర్థిక శాఖ సూత్రీకరించింది. ఆర్బీఐ ఇలా అంతకు ముందు ఆర్థిక శాఖ విశ్లేషణలకు విరుద్ధంగా 2022 మే 4న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ ఫలితాలను విశ్లేషించింది. రెపోరేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ద్రవ్యోల్బణం పేదలపై అధిక ప్రభావం చూపిందని, వారి కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బతీస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ కొనుగోలు శక్తిని ప్రధానంగా పరిశీలనలోకి తీసుకోగా ఆర్థిక శాఖ కొనుగోలు వల్ల జరుగుతున్న వ్యయాలను ప్రధానంగా చేసుకుని విశ్లేషణ చేపట్టడం విశేషం. ఆర్థిక శాఖ అంచనాలు సూత్రీకరణలు ఎలా ఉన్నా పెరుగుతున్న ధరలు మాత్రం సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.... చదవండి: ధరదడ.. పరిశ్రమకు కరోనా సెగ -
‘కరోనా’, గణాంకాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ కదలికలకు కీలకమని వారంటున్నారు. కరోనా కలకలం... కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి చైనాలో 811కు పెరిగింది. ఇది 2002–03లో ప్రబలిన సార్స్ వైరస్ మరణాల కంటే అధికం. కరోనా వైరస్ 25 దేశాలకు విస్తరించిందని, 37,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అంచనా. కరోనా వైరస్‌కు సంబంధించిన ఏమైనా ప్రతికూల వార్తలు వస్తే, మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంచనాలను మించే కరోనా కల్లోలం ఉండే అవకాశాలున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. గణాంకాల ప్రభావం... ఈ నెల 12న డిసెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, జనవరి నెల రిటైల్ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడతాయి. ఇక శుక్రవారం(ఈనెల14న) జవనరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈనెల 11 (మంగళవారం)న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. చివరి దశ క్యూ3 ఫలితాలు... డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో 2,000కు పైగా కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంట్లో నిఫ్టీ సూచీలోని 9 కంపెనీలున్నాయి. గెయిల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, వొడాఫోన్ ఐడియా, నాల్కో, భెల్, ఆయిల్ ఇండియా, హిందాల్కో, నెస్లే ఇండియా, పీఎఫ్సీ, సెయిల్, అశోక్ లేలాండ్, తదితర కంపెనీలు ఈ వారంలోనే ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. కరోనాపై మార్కెట్ కన్ను...: వృద్ధి పుంజుకుంటుందని స్పష్టంగా తేలేదాకా, మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తోందని పేర్కొన్నారు. వృద్ధి బాగా ఉండగలదన్న అంచనాలున్న రంగాల షేర్లు పుంజుకుంటాయని వివరించారు. బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ముఖ్యమైన అంశాలు ముగిశాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ పేర్కొన్నారు. ఇక మార్కెట్ వాస్తవిక అంశాలకు సర్దుబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే మార్కెట్‌కు కీలకమని వివరించారు. కరోనాకు సంబంధించి ప్రపంచ మార్కెట్ల ప్రతిస్పందన మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని శామ్కో ఎనలిస్ట్ ఉమేశ్ గుప్తా పేర్కొన్నారు. వరుసగా ఆరో నెలా ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ప్రవాహం వరుసగా ఆరో నెలా కొనసాగుతోంది. డిపాజిటరీల డేటా ప్రకారం.. ఫిబ్రవరి 3–7 మధ్య ఎఫ్‌పీఐలు డెట్ సెగ్మెంట్లో రూ. 6,350 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇదే వ్యవధిలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 1,173 కోట్లు ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ. 5,177 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చైనా ఎకానమీ, ప్రపంచ వృద్ధిపై కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ సీనియర్ ఎనలిస్టు మేనేజరు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. -
ఎన్నికల ముందస్తు ర్యాలీకి చాన్స్!
ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. మార్కెట్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముందుస్తు ర్యాలీకి అవకాశం మెండుగా ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, కాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ‘షెడ్యూల్ ఖరారు కావడం వల్ల మార్కెట్లో అనిశ్చితి ముగింపు దశకు చేరకుందని భావిస్తున్నాం. అయితే, ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాం’ అని అన్నారయన. నేటి నుంచే మార్కెట్లో సాధారణ ఎన్నికల వేడి మొదలుకానుండగా.. ప్రీ–పోల్ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ప్రధాన అంశాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఒపీనియన్స్ పోల్స్ సర్వే ఆధారంగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ వార్తలు సంస్కరణల కొనసాగింపునకు ఊతం ఇచ్చేవి అయినందున మార్కెట్ ప్రీ ఎలక్షన్ ర్యాలీకి సహకరిస్తాయని అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలైన యూబీఎస్, సీఎల్ఎస్ఏ భావిస్తున్నాయి. ఇక ఎవరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. సంస్కరణల కొనసాగింపు ఉంటుందనే అంచనాలతో ర్యాలీకి అవకాశం ఉందని ప్రభుదాస్ లీలాధర్ సీఈఓ అజయ్ బోడ్కే అన్నారు. గణాంకాలపై దృష్టి.. మంగళవారం(12న) జనవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. గతేడాది డిసెంబర్ ఐఐపీ 2.4%గా నమోదైంది. ఇక ఈఏడాది జనవరిలో ఈ రేటు ఏవిధంగా ఉండనుందనే అంశంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘సీపీఐ, ఐఐపీ డేటాపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక అంశాల్లో.. సోమవారం వెల్లడికానున్న అమెరికా రిటైల్ అమ్మకాలు, చైనా పారిశ్రామిక ఉత్పత్తి మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి’ అని కాపిటల్ ఎయిమ్ పరిశోధనా విభాగం హెడ్ దేబబ్రత భట్టాచార్జీ విశ్లేషించారు. ఇక బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈ అంశంతో పాటు అమెరికా–చైనా వాణిజ్య చర్చల అంశంపై కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. 10,900–11,300 శ్రేణిలో నిఫ్టీ.. సాధారణ ఎన్నికలు, డాలరుతో రూపాయి మార కం విలువ కదలికలు, పలు ఎంపికచేసిన షేర్లలో ర్యాలీ మార్కెట్ దిశను నిర్ధేశించనున్నాయని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ చైర్మన్ డీకే అగర్వాల్ అన్నారు. నిఫ్టీ శ్రేణి 10,900–11,300 పాయింట్ల మధ్యలో ఉండవచ్చని అంచనావేసిన ఆయన.. బ్యాంక్ నిఫ్టీ 27,500–28,000 పాయింట్ల స్థాయి లో కదలాడవచ్చని అంచనావేశారు. ఒకసారి నిఫ్టీ బ్రాడ్ రేంజ్‌ని అధిగమిస్తే.. అక్కడ నుంచి మేజర్ ట్రెండ్‌ను నమోదుచేస్తుందని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. ఇక 11,009–10,998 పాయింట్ల శ్రేణి కీలక మద్దతుగానూ.. 11,094–11,118 శ్రేణి కీలక నిరోధంగానూ పనిచేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటై ల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని అభిప్రాయపడ్డారు. ముడిచమురు ధరలు సానుకూలం.. వారాంతాన క్రూడ్ ధర దిగొచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక శాతం నష్టాన్ని నమోదుచేశాయి. ఉత్పత్తి కోత నిర్ణయాలకు ఒపెక్ తలవంచే అవకాశాలు ఉన్నందున ముడిచమురు ధరలు శాంతించే సూచనలు కనిపిస్తున్నాయని కమోడిటీ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశం మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నారు. -
భారీగా దిగివచ్చిన ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ వేళ ప్రజలకు ఉపశమనంలా ద్రవ్యోల్బణం దిగివచ్చిందనే గణాంకాలు వెల్లడయ్యాయి. గత నెల డిసెంబర్లో వినియోగదారుల సూచీ ద్రవ్యోల్బణం కనిష్టస్ధాయిలో 2.19 శాతానికి తగ్గిందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. 2017 జూన్‌లో ద్రవ్యోల్బణం అత్యంత కనిష్టస్ధాయిలో 1.49 శాతంగా నమోదైన క్రమంలో ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఆర్థిక నిపుణుల అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్లో వినిమయ ద్రవ్యోల్బణం దిగివచ్చిందని చెబుతున్నారు. ఇక డిసెంబర్లో టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్టస్ధాయిలో 3.80 శాతంగా నమోదైంది. ఇంధన ధరలు, కొన్ని ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గత ఏడాది నవంబర్‌లో టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం 4.64 శాతంగా నమోదైంది. కాగా డిసెంబర్లో ఆహారోత్పత్తుల సూచీ ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్)లో 0.07 శాతంగా నమోదవడం గమనార్హం. కూరగాయల ధరలు సైతం 17.55 శాతం డిఫ్లేషన్ నమోదు చేశాయని ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. -
ఫలితాలు, గణాంకాలు నడిపిస్తాయ్ !
కీలక కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కూడా తగిన ప్రభావాన్ని చూపిస్తాయని వారంటున్నారు. గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలకు సోమవారం మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. పారిశ్రామికోత్పత్తి 17 నెలల గరిష్ట స్థాయి, 8.4 శాతానికి ఎగియగా, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 17 నెలల గరిష్ట స్థాయి, 5.2 శాతానికి ఎగిశాయి. మార్కెట్ జోరు కొనసాగుతుంది... ఇక మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ వారంలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, విప్రో, హిందుస్తాన్ యూనిలివర్, యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, తదితర దిగ్గజ సంస్థల క్యూ3 ఫలితాలు వెలువడుతాయి. ప్రపంచ మార్కెట్ల జోరు, నిధుల ప్రవాహం బాగా ఉండటంతో స్టాక్ మార్కెట్లో ప్రస్తుత సానుకూలతలు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, బడ్జెట్ సంబంధించిన సంకేతాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫలితాలు అంచనాలకనుగుణంగానే వచ్చాయని, మార్కెట్ జోరు కొనసాగుతుందని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ హోల్‌టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ చెప్పారు. విదేశీ పెట్టుబడులు ః రూ.5,200 కోట్లు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 1–12 మధ్యన విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.2,172 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.3,080 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఈల్డ్స్ ఆకర్షణీయంగా ఉండడం, కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉంటాయనే అంచనాలు దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఇవే కారణాల వల్ల విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వారంటున్నారు. గత ఏడాది డెట్, ఈక్విటీల్లో కలిపి విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. -
జీడీపీ డేటాపై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: జీడీపీ, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. నవంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనున్నందున ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడీస్ సంస్థలా స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ మన రేటింగ్‌ను పెంచకపోవడం వారం ప్రారంభంలో ఒకింత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్ అండ్ పీ రేటింగ్ ప్రకటన వెలువడింది. 30న జీడీపీ డేటా... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెల 30న (గురువారం) వెలువడతాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వస్తాయి. జీఎస్టీ అమలు కారణంగా పలు సంస్థలు నిల్వలు తగ్గించుకున్న నేపథ్యంలో ఈ క్యూ1లో జీడీపీ 5.7 శాతంగా నమోదైంది. జీఎస్టీ అమలు కారణంగా వినియోగం వృద్ధి క్షీణించే అవకాశాలున్నాయని, అలాగే ప్రైవేట్ రంగ పెట్టుబడులు బలహీనంగా ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ టీనా వీర్మాణి పేర్కొన్నారు. అదే రోజు అక్టోబర్ నెల మౌలిక రంగ గణాంకాలు వస్తాయి. ఈ గణాంకాలు కూడా మార్కెట్ ముగిసిన తర్వాతనే వెలువడతాయి. ఇక ఈ నెల భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు ఈ నెల 30(శుక్రవారం) ఉదయం 10.30కి వస్తాయి. ఎస్ అండ్ పీ రేటింగ్... ప్రతికూలమే.... దేశీయంగా ఫండమెంటల్స్ బావున్నాయని, ఎస్ అండ్ పీ రేటింగ్‌ను పెంచితే విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింతగా మెరుగుపడి ఉండేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎస్ అండ్ పీ రేటింగ్ పెంచకపోవడంతో డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడవచ్చని దీంతో ఈక్విటీ మార్కెట్ నీరసించవచ్చన్నారు. ఎస్అండ్ పీ రేటింగ్ పెంచకపోవడం నిరాశ కలిగించేదేనని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్, మార్కెట్ స్ట్రాటజీ) వి.కె. శర్మ అంగీకరించారు. అయితే ఇది మార్కెట్ జోరుపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని పేర్కొన్నారు. స్తబ్దుగా మార్కెట్... ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, అయితే ఎన్నికల వేడి పెరుగుతోందని, మార్కెట్ ఒకింత స్తబ్దుగా ఉండే అవకాశాలున్నాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఆర్బీఐ పాలసీ, గుజరాత్, తదితర రాష్ట్రాల ఎన్నికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర ముఖ్యమైన అంశాలకు మార్కెట్ ప్రతిస్పందిస్తుందని, ఈ అంశాల ఆధారంగా మార్కెట్ గమనం ఉంటుందని, అప్పటిదాకా మార్కెట్ స్తబ్ధుగానే ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా, ద్రవ్యోల్బణం దిగొచ్చినా, మార్కెట్ జోరు కొనసాగుతుందని పేర్కొన్నారు. గుజరాత్ ఫలితాలు కీలకం.. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఎన్నికల ఫలితాలు మార్కెట్‌కు కీలకమని కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు సంజీవ్ జర్బాడే వ్యాఖ్యానించారు. గుజరాత్ ఫలితాలు అధికారపార్టీకి ప్రతికూలంగా ఉంటే,, మోదీ ప్రభ క్షీణిస్తోందని, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ విజయావకాశాలు సన్నగిల్లుతాయనడానికి సంకేతం అవుతుందని వివరించారు. డయాబెటిస్ ఔషధం, రియోమెట్ను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్న నేపథ్యంలో సోమవారం సన్ ఫార్మాపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, నవంబర్ నెల యూరోజోన్ ఎకనామిక్ సెంటిమెంట్ ఇండికేటర్ గణాంకాలు ఈ నెల 29న బుధవారం వెలువడతాయి. ఇక శుక్రవారం (వచ్చే నెల 1న) చైనా తయారీ రంగ పీఎంఐ గణాంకాలు వస్తాయి. ఈ నెల విక్రయ గణాంకాలను ఈ శుక్రవారం వాహన కంపెనీలు వెల్లడిస్తాయి. విదేశీ పెట్టుబడులు రూ.17,200 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ 260 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఈక్విటీ మార్కెట్లో రూ.16,455 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.754కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.17,209 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూలధన బాండ్ల కేటాయింపులు, ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో మన దేశం స్థానం మెరుగుపడటం, మూడీస్ సంస్థ సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరిగిందని నిపుణులంటున్నారు. కాగా గత నెలలో మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.19,000 కోట్లుగా ఉన్నాయి. -
గణాంకాలు, ఫలితాల ప్రభావం
ద్రవ్యోల్బణ గణాంకాలు ♦ చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు ♦ యూపీ ఎన్నికల సరళి ♦ ఈ వారం మార్కెట్ ప్రభావిత అంశాలు ఇవే.. న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఈ వారం వెలువడే కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ. తదితర అంశాలు స్టాక్ సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. నేడు(సోమవారం) మార్కెట్ ముగిసిన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. ఇక ఈ వారంలో హిందాల్కో, ఎన్ఎండీసీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదానీ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, వేదాంత, నాల్కో, పవర్ ఫైనాన్స్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వెలువడతాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి మార్కెట్ చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వారంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం ఉంటుంది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 28,334 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,794 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. విదేశీ కొనుగోళ్ల జోరు.. నాలుగు నెలలుగా సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు ఫిబ్రవరిలో అడ్డుకట్ట పడింది. విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుల విషయమై స్పష్టత రావడంతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.5,827 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.2,088 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.3,739 కోట్లు చొప్పున పెట్టుబడలు పెట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.80,310 కోట్లు విలువైన పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.