iPhone 6
-
దేవుడి హుండీలో ఐఫోన్ 6..
సాక్షి, కృష్ణా : సాధారణంగా ఆలయాల హుండీల్లో భక్తులు డబ్బులు, బంగారు ఇతర విలువైన కానుకలు వేస్తారు. కానీ, కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రసిద్ధ శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయ హుండీలో ఎవరో భక్తుడు ఖరీదైన యాపిల్ ఐ ఫోన్ 6ను కానుకగా వేశారు. శనివారం ఆలయ అధికారులు హుండీని తెరిచి అందులో ఐఫోన్ చూసి ఆశ్చర్యపోయారు.. గతంలో భక్తుల ఫోన్లు అనుకోకుండా హుండీలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయని ఆలయ సూపరింటెండెంట్ అధికారి తెలిపారు. అయితే, ఈ ఫోన్ కొత్తదని సీలు కూడా తీయలేదని గ్యారంటీ కార్డ్ కూడా అందులో ఉందని చెప్పారు. కొత్త మెబైల్ దుకాణాన్ని ప్రారంభించిన భక్తుడు ఎవరో దేవుడికి ఈ కానుక వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఖరీదైన ఫోన్‌ను ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి తాము లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫోన్‌ను వేలం వేసి వచ్చిన ఆ డబ్బును ఆలయ ఖాతాలో జమ చేయాలా? లేదా ఫోన్‌ను భక్తులకు సమాచారం అందించేందుకు రిసెప్షన్లో ఉంచాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 6 ధర రూ.5,999?
ఆపిల్ తన ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్ X అనే స్పెషల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ సందర్భంగా పాత ఐఫోన్లన్నింటి ధరలను తగ్గించేసింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్ఫోన్లపై భారీగా ధర కోత పెట్టింది. ఈ ధరల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్లు 5,999 రూపాయలకు, 17,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చాయి. అయితే నిజంగా ఐఫోన్ 5,999 రూపాయలేనా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును. నిజంగా ఈ ఫోన్ రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ ఎడిషన్ అసలు ధర 25,999 రూపాయలు. అదనంగా ఈ ఫోన్‌పై 3,501 రూపాయల వరకు స్పెషల్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్లో కొనుగోలుచేస్తే, 20వేల రూపాయల వరకు తగ్గింపు లభించి, రూ.5999కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లభించనుందట. అది కూడా ఐఫోన్ 7 ప్లస్ లాంటి ఏదైనా హై-ఎండ్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి దీన్ని కొనుగోలుచేస్తేనే, ఈ స్మార్ట్‌ఫోన్ రూ.5,999కు లభ్యంకానుంది. కానీ ఐఫోన్ 7 ప్లస్ లాంటి స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 6ను ఎవరు కొనుగోలుచేస్తారు? ఇదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ చాలా హాస్యాస్పదంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పలువురంటున్నారు. ఐఫోన్ 6ఎస్ విషయంలో తీసుకున్న కూడా ఇదే విధమైన ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ అసలు రూ.37,999కు లిస్టు అయింది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.17,999కు విక్రయిస్తోంది. ప్రీమియం, ఖరీదైన ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి, దీన్ని కొనుక్కుంటే, ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలుస్తోంది. -
అమెజాన్‌లోకి ఐఫోన్ 6 స్పెషల్ వేరియంట్
ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లో స్పెషల్ వేరియంట్‌ను ఆపిల్ భారత మార్కెట్లోకి లాంచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన ఐఫోన్6, 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. లాంచింగ్ సమయంలో కేవలం స్పేస్ గ్రే రంగు ఫోన్‌ను మాత్రమే ఆపిల్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రస్తుతం స్పేస్ గ్రే రంగుతో పాటు గోల్డ్ రంగు వేరియంట్ కూడా అందుబాటులో ఉండనుంది. గోల్డ్ రంగు భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నందున్న ఈ వేరియంట్‌ను తీసుకొచ్చినట్టు ఆపిల్ తెలిపింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియాలో దీన్ని ఆపిల్ విక్రయిస్తోంది. దీని ధర 26,999 రూపాయలు. అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.2000 వరకు తగ్గింపు ఇవ్వనుంది. అంతేకాక క్రెడిట్ కార్డులపై 3/6 నెలలు నో కాస్ట్ ఈఎంఐను ఎంపికచేసుకోవచ్చు. వొడాఫోన్ కస్టమర్లైతే, ఈ ఫోన్ కొనుగోలుతో అదనంగా ఐదు నెలల పాటు 45జీబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు 1జీబీ లేదా అంతకంటే ఎక్కువ 4జీ డేటా ప్యాక్‌ను వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతినెలా అదనంగా 9జీబీ డేటా 5 రీఛార్జ్‌లపై అందుబాటులోకి వస్తోంది. 2014లోనే ఆపిల్ ఐఫోన్ 6ను ఐఫోన్ 6 ప్లస్‌తో పాటు మార్కెట్లకు పరిచయం చేసింది. ఆ సమయంలో 16జీబీ, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే 32జీబీ వేరియంట్‌ను స్పేస్ గ్రే రంగులో భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వేరియంట్ గోల్డ్ రంగులో కూడా వినియోగదారుల ముందుకు వచ్చేసింది. దీని ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి... 4.7 అంగుళాల రెటీనా డిస్ప్లే, కంపెనీ ఏ8 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 ఎంపీ వెనుక కెమెరా,1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఐఓఎస్ 10. -
అమెజాన్‌లో ఐఫోన్ 6 ధరెంతో తెలుసా?
భారీ ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన మొట్టమొదటి ప్రైమ్ డే సేల్‌ను నిన్న సాయంత్రం ఆరుగంటల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సేల్ నేటి అర్థరాత్రి(జూలై 11, అర్థరాత్రి) వరకు కొనసాగనుంది. ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 6ను 25వేల రూపాయలకే అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం డిస్కౌంట్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో పాటు ఐఫోన్ 6ఎస్(స్పేస్ గ్రే, 32జీబీ), ఐఫోన్6ఎస్(గోల్డ్, 32జీబీ) ఫోన్లను 25 శాతం తగ్గింపుతో రూ.34,999కి విక్రయిస్తోంది. వీటితోపాటు ఐఫోన్ 7 రోజ్ గోల్డ్, బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.42,999కే అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్ల అసలు ధర రూ.56,200. ప్రస్తుతం అమెజాన్ ఆఫర్ చేస్తున్న తగ్గింపు ధరతో 23 శాతం పొదుపు చేసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లు ఎల్జీ జీ6 స్మార్ట్‌ఫోన్‌ను 30 శాతం ఆదాతో 37,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా తగ్గించి రూ.38,999కే విక్రయిస్తోంది. అయితే ఈ సేల్ ప్రత్యేకంగా రూ.499తో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తన ప్రైమ్ యూజర్లకు మాత్రమే. రెండు రకాల డీల్స్‌ను ఈ సేల్‌లో అమెజాన్ ఆఫర్చేస్తోంది. రెగ్యులర్ డిస్కౌంట్లను, ప్రత్యేక సందర్భాల్లో పరిమిత ఉత్పత్తులపై ఆఫర్ చేసే డీల్స్. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉన్నాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. 30 కొత్త బ్రాండ్లను కూడా ఈ సేల్‌లో లాంచ్చేసింది. భారత్‌తో పాటు ప్రైమ్ డే సేల్ జరుగబోయే దేశాల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం, జపాన్‌లు ఉన్నాయి. గతేడాదే అమెజాన్ ఈ సేల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ సారి భారత్‌లో కూడా ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నారు. -
అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లు
ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మరోసారి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటినుంచి జూన్ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్‌ప్లస్, ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 3టీపై డిస్కౌంట్ తోపాటు వొడాఫోన్ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ , శాంసంగ్ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూల్ ప్యాడ్ పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్ ట్యాప్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. -
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్ 6ఎస్’
లండన్: యాపిల్ ‘ఐఫోన్ 6ఎస్’ తాజాగా 2016 ఏడాదికిగానూ అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నమోదు చేసింది. ఐఫోన్ 6ఎస్ విక్రయాలు గతేడాది 6 కోట్ల యూనిట్లుగా నమోదైనట్లు సమాచారం. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ ఈ విషయం తెలిపింది. దీని ప్రకారం... ఐఫోన్ 6ఎస్ తర్వాతి స్థానాన్ని ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లు ఆక్రమించాయి. ఇక శామ్సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7 స్మార్ట్‌ఫోన్స్ ఐదు, తొమ్మిదవ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే శామ్సంగ్ కంపెనీ టాప్–10లో ఐదు ర్యాంకులను సొంతం చేసుకుంది. దీనికి గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్ఫోన్లు బాగా దోహదపడ్డాయి. టాప్–10 జాబితాలో చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పొ కూడా స్థానం దక్కించుకుంది. దీని ‘ఏ53’ స్మార్ట్‌ఫోన్ 7వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. -
ఐఫోన్‌పై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. ఐఫోన్ 6 32 జీబీ వేరియంట్ ను రూ 28.999లకే అమెజాన్ విక్రయిస్తోంది. అమెజాన్ హోం పేజ్ ప్రకటన ప్రకారం 32 జీబీ గ్రే వేరియంట్ ఐ ఫోన్ 6 స్పెషల్ అమ్మకం మార్చి 7 తో ముగియనుంది. కొనుగోలు చేసిన తేదీ నుండి బ్యాటరీలు సహా, ఇన్ బాక్స్ యాక్ససరీస్ పై ఒక సంవత్సరం తయారీదారు వారంటీ కూడా అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే రూ. 8,550 దాకా ఎక్సేంజ్ (ఎక్సేంజ్ చేస్తున్న ఫోన్ఆధారంగా) ఆఫర్కూడా అందిస్తోంది. మరో వైపు 32 జీబీ వేరియంట్ ఐ ఫోన్ 6ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేయలేదు. థర్డ్ పార్టీ రీటైలర్ ద్వారా ఇది అందుబాటులోకి వచ్చిన విషయం గమనార్హం. ఐఫోన్ 6 ఫీచర్లు 4.7 ఇంచెస్ డిస్ ప్లే సింగిల్‌సిమ్ 1334 x 750 రిజల్యూషన్ 1జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 8ఎంపీ రియర్ కెమెరా,విత్ ఆటో ఫోకస్, 1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా 1810 ఎంఏహెచ్ బ్యాటరీ, కాగా ఐఫోన్ 6 రూ అసలు ధర .30,700 గా ఉంది. దీంతో ఈఎంఐ ఆప్షన్‌కూడా అందిస్తోంది. మరిన్ని వివరాలకోసం అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ను చెక్ చేయగలరు. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్6 ధర రూ.4వేలే!
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఐఫోన్6ను కేవలం 4వేల రూపాయలకే విక్రయిస్తుందట. నేటితో ఈ సేల్ ముగియనుంది. రూ.36,990గా ఉన్న ఈ ఫోన్ కేవలం నాలుగువేల రూపాయలకి రావడమేమిటా అనుకుంటున్నారా? ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరే చూడండి.. రిపబ్లిక్ డే సేల్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్6 16జీబీ ధర రూ.27,990. ఒరిజినల్ ధరకు ఇది 24 శాతం డిస్కౌంట్. అంతేకాక వొడాఫోన్తో 1జీబీ రీఛార్జ్ చేసుకుంటే అందనంగా 9జీబీ డేటాను ఇది ఆఫర్ చేస్తోంది. ఒకవేళ పాత ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావించారో, వారికి ఏకంగా 24వేల రూపాయల డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫైనాల్గా కొత్త ఐఫోన్ 6 రూ.4040కే వినియోగదారుడి చేతికి వచ్చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం పాత ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను కొత్త ఐఫోన్6తో మార్చుకోవాలనుకుంటున్న వారు ఫ్లిప్‌కార్ట్‌లో కొనేసేయండి. -
ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు!
ఆపిల్ ఐఫోన్‌ను డిస్కౌంట్ ధరల్లో కొనుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్ఫామ్లో ఆపిల్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. జనవరి 10 నుంచి 13 వరకు జరిగే ఈ ఫెస్ట్‌లో ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్లతో పాటు ఆపిల్ యాక్ససరీస్‌పై కూడా డిస్కౌంట్లను ఈ సైట్ ప్రకటించింది. అదనంగా ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ 6 కొనుకునే వారికి అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఆపిల్ ఫెస్ట్‌లో డిస్కౌంట్లేమిటో మీరే ఓ సారి చూడండి... ఆపిల్ ఐఫోన్ 7 : ఆపిల్ ఐఫోన్ 7(128జీబీ) జెట్ బ్లాక్ 7 శాతం డిస్కౌంట్‌తో రూ.65వేలకే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి చార్జీలు లేని ఈఎంఐ ప్లాన్ నెలకు రూ.5,147 చొప్పున చెల్లించే విధంగా అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ.3,152 చెల్లించాలని. ఎక్స్చేంజ్పై రూ.5000 డిస్కౌంట్ తో పాటు అదనంగా ధరపై రూ.3000 తగ్గింపు ఉంది. అలా ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 7(32జీబీ) రోజ్ గోల్డ్ ఫోన్ అయితే 7 శాతం డిస్కౌంట్‌కి రూ.55,000కు విక్రయించనున్నారు. ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేవు. ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ.3,000 డిస్కౌంట్. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్‌ను రూ.65,000కే విక్రయించనున్నారు. 6 శాతం డిస్కౌంట్‌తో ఐఫోన్7(256 జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్‌ను రూ.75,000కు ఆపిల్ విక్రయించనుంది.. ఐఫోన్ 7 ప్లస్ : ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్‌ను రూ.82వేలకే కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా దీనిపై రూ.23వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మరో రూ.3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకి 5 శాతం అదనపు ప్రయోజనం చేకూరనుంది. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) రోజ్ గోల్డ్ ఆప్షన్‌ను కూడా రూ.82వేలకే లభ్యం కానుంది. జెట్ బ్లాక్ రంగులో ఇతర వేరియంట్లు 258 జీబీ వేరియంట్ ధర రూ.92వేలు. ఐఫోన్ 7 ప్లస్128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్‌కు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్లనే ఈ ఫోన్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నారు. ఐఫోన్ 6 ఎస్ : ఆపిల్ ఐఫోన్6(16జీబీ) స్పేస్ గ్రే వేరియంట్ రూ.31,990కు కొనుకోవచ్చు. ఎక్స్చేంజ్పై రూ.24వేల వరకు డిస్కౌంట్ ఉంది. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.4,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈఎంఐ రూ.1,552కే ప్రారంభమవుతుంది. ఆపిల్ 6ఎస్(32జీబీ) స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు రూ.46,999కు లభ్యం కానున్నాయి.. ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3000 తగ్గింపు పొందవచ్చు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్: (32జీబీ) సిల్వర్, రోజ్ గోల్డ్ ఫోన్లు రూ.56,999కు అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లందరికీ అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 5ఎస్ : దేశంలో ఎక్కువగా పాపులర్ అయిన ఈ మోడల్ 16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ రూ.19,999కు ఆపిల్ అందించనుంది. ఎక్స్చేంజ్పై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై ఫ్లాట్ డిస్కౌంట్ 50, 25 శాతం ఆఫర్ చేస్తున్నారు. -
9 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్
ఆపిల్ ఐఫోన్ 6పై దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్6 స్పేస్ గ్రే 16జీబీ వెర్షన్ ఫోన్‌పై రూ.22వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తూ అతి తక్కువగా రూ.9,900కే అందించనున్నట్టు తెలిపింది. ఈఎంఐలో చెల్లించాలనుకునే వారికి అదనంగా బ్యాంకుల నుంచి 5 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఆశ్చర్యకరంగా ఈ భారీ డిస్కౌంట్ కొత్త ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకునే కొనుగోలుదారులకే వర్తించనుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.31,990గా ఉంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను 16 జీబీ ఐఫోన్6తో ఎక్స్చేంజ్ చేసుకునే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కచ్చితంగా అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ భరోసా ఇస్తోంది. గతేడాదే ఆపిల్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ అనే రెండు కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. కానీ ఐఫోన్ 6ఎస్‌కు అదనంగా యూజర్ల అనుభూతి కోసం ఆశించదగ్గ ఆఫర్లను ఆపిల్ ఈ ఫోన్లో అందించలేదు. రియల్ బ్లాక్, జెట్ బ్లాక్ రంగుల్లో ఐఫోన్7 ప్లస్‌ను ఆపిల్ ప్రవేశపెట్టింది. కొత్త ఐఫోన్లను కొనదలుచుకున్నవారికి కేవలం ఈ రెండు కలర్ ఫోన్లే అందుబాటులో ఉంచింది. అతిపెద్ద ఐఫోన్ 7 ప్లస్ 188 గ్రాములుండగా.. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 192 గ్రాముల బరువుంటుంది. -
యాపిల్ కు మరో షాకిచ్చిన చైనా
బీజింగ్ : చైనాలో ఐఫోన్ తయారీదారి యాపిల్ ఇంక్ కు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతంలో ఐఫోన్ ట్రేడ్ మార్క్ కేసుపై యాపిల్ కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో పాటు.. తాజాగా ఐఫోన్-6 సిరీస్ అమ్మకాలను తమ దేశ రాజధాని బీజింగ్ లో చేపట్టదంటూ చైనీస్ రెగ్యులేటరీ సీరియస్ గా ఆదేశించింది. తమ దేశ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఐఫోన్-6 సిరీస్ ఉండటం గుర్తించిన రెగ్యులేటర్ ఈ ఆదేశాలు జారీచేసింది. తక్షణమే అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. యాపిల్ కు రెండో అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ గా చైనాలో ఇటీవలే ఐట్యూన్స్ మూవీ సర్వీసులు నిలిపివేశారు. అదేవిధంగా చైనాలోని లోకల్ బ్రాండ్లు షియోమి, హ్యువాయ్ ల నుంచి యాపిల్ కంపెనీ గట్టి పోటీని ఎదుర్కొంటూ మార్కెట్ షేరును కాపాడుకోవడంలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలను జారీచేసింది. చిన్న చైనీస్ బ్రాండ్ షెన్జెన్ బైలీ 100సీ మోడల్ ను ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్లు పోలీ ఉన్నాయని ట్రిబ్యూనల్ పేర్కొంది. ఈ నిషేధ ఆర్డర్ ను యాపిల్ కు మేలోనే ట్రిబ్యునల్ జారీచేసింది. కానీ ఈ వార్త చైనీస్ ప్రెస్ కు ఈ వారంలోనే అందింది. తాజా ఆదేశాలతో యాపిల్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ పై బీజింగ్ కోర్టు స్టే విధించిందని యాపిల్ చెబుతోంది. చైనాలో ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు చేపడుతున్నామని పేర్కొంది. తన ఐబుక్స్, ఐట్యూన్స్ మూవీ సర్వీసులను యాపిల్ ఏప్రిల్ లో నిలిపివేసింది. చైనీస్ రెగ్యులేటర్స్ ఆదేశాల మేరకు ఈ సేవలను బంద్ చేసింది. త్వరలోనే ఈ సేవలు చైనాలో పునరుద్ధరించాలని కంపెనీ ఆశిస్తోంది. -
ఐఫోన్ 6 కావాలా? 360 గంటలు పనిచెయ్!
జ్యూరిక్‌లో 20 గంటల పనికే... * కొనుగోలు శక్తిపై యూబీఎస్ నివేదిక న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఐఫోన్ 6 కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఆర్జించాలంటే సగటున 360 గంటల సేపు పనిచేయాల్సి ఉంటోంది. అదే జ్యూరిక్‌లో మాత్రం 20 గంటలే సరిపోతోంది. కొనుగోలు శక్తిపై యూబీఎస్ రూపొందించిన (ప్రైసెస్ అండ్ ఎర్నింగ్స్ 2015) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఢిల్లీ వాసులు 360.3 గంటలు, ముంబై వాసులు 349.4 గంటలు పనిచేస్తే యాపిల్ ఐఫోన్ కొనుక్కోగలిగేంత డబ్బును ఆర్జించగలుగుతారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా 71 నగరాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో కీవ్ (627.2 గంటలు), జకార్తా/నైరోబీ(468 గంటలు) ఉన్నాయి. 353.4 గంటల పనితో కైరో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, జ్యూరిక్, న్యూయార్క్ వాసులు ఐఫోన్ 6 కొనుగోలు చేసేంత డబ్బు ఆర్జించాలంటే మూడు రోజుల కన్నా తక్కువ వ్యవధి పనిచేస్తే సరిపోతోంది. ఆయా నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తిని లెక్కించేందుకు యాపిల్ ఐఫోన్ 6 (16జీబీ మోడల్)ను స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ ప్రామాణికంగా తీసుకుంది. ఇండియాలో ఐఫోన్-6 ధర రూ. 65,000 వరకూ ఉంది. కొనుగోలు శక్తిలో అట్టడుగున ముంబై, ఢిల్లీ.. నివేదిక ప్రకారం నికరంగా గంట వేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, కనిష్టమైన కొనుగోలు శక్తిని సూచిస్తూ అట్టడుగు పది నగరాల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై ఉన్నాయి. అయితే ఈ నగరాల్లో పనిగంటలు ఎక్కువగా వున్నాయి. న్యూఢిల్లీలో ఉద్యోగులు ఏటా 2,214 గంటలు, ముంబైలో 2,277 గంటలు సగటున పనిచేస్తున్నారు. ఢిల్లీ వాసులకు సెలవులు ఏటా 26 మాత్రమే ఉండగా, ముంబైలో 21 రోజులు ఉంటున్నాయి. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్కర్లు సగటున వారానికి 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఏటా 4.5 వారాల మేర పెయిడ్ వెకేషన్ ప్రయోజనాలు పొందుతున్నారు. వారానికి అత్యధికంగా 50 పని గంటలు, ఏడాదికి 17 సెలవులతో హాంకాంగ్ పని గంటల విషయంలో టాప్‌లో ఉంది. ఇక పారిస్‌లో ఉద్యోగులు వారానికి కేవలం 35 గంటలు (కొత్త ప్రభుత్వ నిబంధనల ప్రకారం) పనిచేస్తుండగా, 29 రోజుల పెయిడ్ వెకేషన్ ప్రయోజనాలు పొందుతున్నారు. -
భారత్‌లో ఐఫోన్6 అమ్మకాలు షురూ
న్యూఢిల్లీ: యాపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాలు భారత్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. 4.7 అంగుళాల స్క్రీన్ ఉండే ఐఫోన్ 6లో 16 జీబీ వెర్షన్ రేటు రూ. 53,500, 64 జీబీ వెర్షన్ ధర రూ. 62,500, 128 జీబీ ధర రూ. 71,500గా ఉంది. ఇక, 5.5 అంగుళాల స్క్రీన్ ఉండే ఐఫోన్ 6 ప్లస్‌లో 16 జీబీ వెర్షన్ రేటు రూ. 62,500, 64 జీబీ రేటు రూ. 71,500, 128 జీబీ వెర్షన్ ధర రూ. 80,500గా ఉంది. ఇవి సిల్వర్, గోల్డ్ తదితర రంగుల్లో లభిస్తాయి. పంపిణీదారులు, రిటైలర్ల కథనాల ప్రకారం దేశీయంగా సుమారు 25,000 పైచిలుకు ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు వ చ్చాయి. -
ఐఫోన్ 6 కోసం బారులు
యువతను విశేషంగా ఆకర్షిస్తున్న ఐఫోన్ 6, 6+ అమ్మకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ఊఫోన్ ఆథరైజ్డ్ షోరూంలు ఐఫోన్ ప్రియులతో కిటకిటలాడాయి. ఐఫోన్6, 6+ సిరీస్‌లు లిమిడెట్ వర్షన్లో అందుబాటులో ఉండటంతో వాటిని తమ సొంతం చేసుకునేందుకు అవుట్లెట్ల వద్ద యువత బారులు తీరారు. సరికొత్త సిరీస్‌లను సొంతం చేసుకునేందుకుగాను యువతీ యువకులతోపాటు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపడం గమనార్హం. వినియోగదారుల సౌకర్యార్థం నిర్వాహకులు గురువారం రాత్రంతా తమతమ షో రూంలను తెరిచే ఉంచారు. - సాక్షి,బెంగళూరు -
ఐఫోన్ 6 విక్రయాలకు రెడీ...
గుర్గావ్: రెడింగ్టన్ ఇండియా కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లను ఈ నెల 17 నుంచి అం దించనున్నది. దేశవ్యాప్తంగా 5,000 రిటైల్ అవుట్లెట్లలో ఈ ఫోన్లను విక్రయిస్తామని రెడింగ్టన్ ఇండియా తెలిపింది. ఐఫోన్ 6 ఫోన్ల ధరలు రూ.53,500 నుంచి ఐఫోన్ 6 ప్లస్ ఫోన్ల ధరలు రూ.62,500 నుంచి ఆరంభమవుతాయని వివరించింది. అత్యంత ఆధునికమైన ఫీచర్లతో యాపిల్ కంపెనీ ఈ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను రూపొందించిందని పేర్కొంది. వినూత్నమైన ఫీచర్లతో చేతిలో సులభంగా ఇమిడిపోయేలా, సుల భంగా వినియోగించేలా ఈ ఫోన్లను యాపిల్ కంపెనీ తయారు చేసిందని తెలిపింది. ఐఓఎస్ 8 పై పనిచేసే ఈ ఫోన్లలో రెటినా హెచ్డీ డిస్ప్లే, ఏ8 చిప్, ఆడ్వాన్స్డ్ ఐసైట్, ఫేస్‌టైమ్ హెచ్డీ కెమెరా, ఆల్ట్రాఫాస్ట్ వెర్లైస్ టెక్నాలజీస్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. యాపిల్ క్విక్టైప్ కీబోర్డ్, ఐక్లౌడ్ డ్రైవ్, కొత్త హెల్త్ యాప్ వంటి ఆకర్షణీయ ఫీచర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. -
బిగ్ సిలో ఐఫోన్ 6పై ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ, బిగ్ సి లో యాపిల్ ఐఫోన్, ఐఫోన్6లకు ముందస్తు బుకింగ్ జరుగుతోంది. తమ షోరూమ్‌ల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ.6,000 విలువ గల ప్రయోజనాలను అందించనున్నామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. బుకింగ్ చేసుకున్న వారికి ఈ నెల 17 నుంచి ఫోన్లను డెలివరీ చేస్తామని బిగ్ సి చైర్మన్ ఎం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఫోన్ కొనుగోళ్లపై రెండు సంవత్సరాల పాటు ఉండే వారంటీ, బీమా ఉచితంగా అందిస్తామని, వీటి విలువ రూ.6,000 వరకూ ఉంటుందని వివరించారు.. వినూత్నమైన ఆఫర్లను అందిస్తూ, వినియోగదారులను ఆకట్టుకోవడంలో తమది ప్రత్యేక స్థానమని, గతంలో తామందించిన అన్ని ఆఫర్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. తమ షోరూమ్‌ల్లో యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను కొనుగోలు చేసి రూ.6,000 విలువ చేసే ఉచిత ప్రయోజనాలను అందుకోవాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. -
ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి..
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లు, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను ఈ నెల 17 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. ఈ కొత్త ఐఫోన్ ల ధరలు రూ.53,500 నుంచి రూ.80,500 రేంజ్లో ఉన్నాయి. ఈ ధరలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ చేసిన ధరల కంటే తక్కువగా ఉండడం విశేషం. అయితే అమెరికాలో ఐఫోన్ రిటైల్ ధరలతో పోల్చితే ఈ ధరలు 10-17% అధికం. అమెజాన్ వెబ్సైట్ ఐఫోన్ 6ను డెలివరీ చార్జీలతో కలిపి 750 డాలర్లు (సుమారురూ.46,000)కు విక్రయిస్తోంది. తొలిసారిగా ముందస్తు బుకింగ్స్ గత నెలలో యాపిల్ కంపెనీ పెద్ద స్క్రీన్ ఉన్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, కొత్తగా యాపిల్ వాచ్, యాపిల్ పే(మొబైల్ వాలెట్)లను ఆవిష్కరించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌ల విక్రయలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌కు భారత్‌లో అధీకృత డిస్ట్రిబ్యూటర్లుగా రెడింగ్టన్, ఇన్‌గ్రామ్ మైక్రో, రాశి పెరిఫెరల్స్, రిలయన్స్‌లు వ్యవహరిస్తున్నాయి. ఈ కొత్త ఫోన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. భారత్‌లో ఐఫోన్‌కు ముందస్తు బుకింగ్స్ ఇదే తొలిసారి. వినియోగదారులు ఈ రెండు మోడళ్ల కోసం ఈ నెల 7 నుంచే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ మైక్రో పేర్కొంది. యాపిల్ కంపెనీకి ఈ సంస్థ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్. 24 నగరాల్లోని 1,200 అవుట్లెట్లతో పాటు, తమ వెబ్సైట్ ద్వారా కూడా ముందస్తుగా ఈ ఐఫోన్లను బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ తెలిపింది. ఈ రెండు ఫోన్లు 2జీ, 3జీ, 4 జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి. 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. 6.9 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6లో 4.7 అంగుళాల స్క్రీన్ ఉండగా, 7.1 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంది. గత ఏడాది యాపిల్ ఐఫోన్ 5ఎస్‌ను రూ.53,500 ధరకు భారత్‌లో అందించింది. ఈ మోడల్ ప్రస్తుత ధర రూ.30,000 రేంజ్లో ఉంది. -
ఈనెల 17 నుంచి భారత్ లో ఐఫోన్ 6
న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6.. భారత్ మార్కెట్లలో అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 6 ధర రూ.53,500 నుంచి రూ.80,500 వరకు ఉండే అవకాశముందని యాపిల్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. భారత్ లో మొదటిసారిగా ముందుగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని యాపిల్ కల్పిస్తోంది. ఐఫోన్ 6 సొంతం చేసుకోవాలనేవారు యాపిల్ స్టోర్ కు వెళ్లి ముందుగా తమ కావాల్సిన ఫోన్ బుక్ చేసుకోవచ్చు. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను యాపిల్ కంపెనీ గత నెల 9న మార్కెట్లోకి విడుదల చేసింది. ఐ ఫోన్, ఐఫోన్ 6ల్లో 8 మెగా పిక్సెల్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తదితర వంటి ఫీచర్లున్నాయి. 2జీ, 3జీ, 4 జీనెట్వర్క్లను ఇవి సపోర్ట్ చేస్తాయి. 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వెర్షన్లలలో ఇవి లభ్యమవుతాయి. -
ఐఫోన్ 6 ధర రూ.56,000 రేంజ్లో!
న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6ను రూ.56,000 ధరల రేంజ్లో అందిస్తామంటూ ఈ కామర్స్ సంస్థలు ఊరిస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌ను ఖచ్చితంగా ఎప్పుడు భారత్ మార్కెట్లోకి విడుదల చేసేదీ, ధర తదితర విషయాలను యాపిల్ కంపెనీ ఇంతవరకూ అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, పలు ఈ కామర్స్ కంపెనీలు ఈ నెల రెండో వారం నుంచి రూ.56,000 ధరల రేంజ్లో ఈ ఫోన్‌ను అందిస్తామని అంటున్నాయి. ఈబే సంస్థ రూ.55,954 ధరకే ఐఫోన్ 6ను అక్టోబర్ 8 నుంచి అందిస్తామని తెలిపింది. ఎలాంటి డెలివరీ చార్జీలు తీసుకోబోమని పేర్కొంది. ఐ ఫోన్ 6 ప్లస్‌ను రూ.77,000కు ఆఫర్ చేస్తామని వివరించింది. ఇక షాప్‌క్లూస్‌డాట్‌కామ్ సంస్థ రూ.59,999 ధరకు అక్టోబర్ 8 నుంచి అందిస్తామని పేర్కొంది. డెలివరీ చార్జీ రూ.149 అని తెలిపింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను యాపిల్ కంపెనీ గత నెల 9న మార్కెట్లోకి విడుదల చేసింది. అక్టోబర్ మధ్య నుంచి గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ భారత్‌లో ఈ ఫోన్లను యాపిల్ విక్రయించనున్నదని ఉహాగానాలున్నాయి. ఐ ఫోన్, ఐఫోన్ 6ల్లో 8 మెగా పిక్సెల్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తదితర వంటి ఫీచర్లున్నాయి. 2జీ, 3జీ, 4 జీనెట్వర్క్లను ఇవి సపోర్ట్ చేస్తాయి. 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వెర్షన్లలలో ఇవి లభ్యమవుతాయి. -
ఐ ఫోన్ 6ను జాగ్రత్తగా వాడమంటున్న యాపిల్!
ఒకవైపు యూట్యూబ్‌లో ఐఫోన్6 కి సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఐ ఫోన్ 6, 6ప్లస్‌లు వంగిపోతున్నాయని వాటి వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోన్ వంపు గురించి వివరిస్తూ వీడియోలను కూర్చి యూట్యూబ్‌కు ఎక్కిస్తున్నారు. దీంతో యాపిల్ కంపెనీ చిరాకుపడుతోంది. ఈ ఫిర్యాదు ఏకంగా యాపిల్ మార్కెట్ విలువనే దెబ్బతీసేస్థాయిలో ఉండటంతో నివారణ చర్యలకు సిద్ధమైంది. ఐ ఫోన్ 6, 6 ప్లస్‌లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకే ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చాయి. అలా అందుబాటులోకి వచ్చిన వాటిని ఇలా కొనేసుకొన్న వినియోగదారులు రెండు మూడు రోజుల్లో ఫోన్లు బెండ్ అవుతుండటాన్ని గుర్తించారు. 5.5ఇంచ్ డిస్ప్లేతో 6.9, 7.1 మిల్లీమీటర్ల థిన్‌తో ఉండే ఈ ఫోన్లను ఎక్కువసేపు జేబులో పెట్టుకొంటే వంపు తిరుగుతున్నాయని వారు అంటున్నారు. ఇంకేముంది, ఐ ఫోన్ 6 మీద ఎంత క్రేజ్ ఉందో... అంతే వైరల్‌గా ఈ వంపు వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏకంగా ట్విటర్లో ‘బెండ్ గేట్’ పేరిట హ్యాష్‌ట్యాగ్‌లు ఏర్పడ్డాయి. ఫలితంగా యాపిల్ మార్కెట్ విలువ మూడు శాతం వరకూ పడిపోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ ఫోన్ల విషయంలో ఈ నెగిటివ్ పబ్లిసిటీ యాపిల్‌ను ఈ విధంగా దెబ్బకొట్టింది. ఈ పరిణామాల మధ్య యాపిల్ కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఎక్కువసేపు ఫోన్‌ను బ్యాక్పాకెట్లో పెట్టుకొంటే అది వంగినట్టు అనిపించడం నిజమేనని ఆ సంస్థ ధ్రువీకరించింది. ఫోన్ నాజూకుగా ఉన్నందువల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని.. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటన చేసింది. కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. ఈ సమస్య గురించి సమీక్షించామని.. ఇకపై రూపొందించే ఐ ఫోన్ 6, 6 ప్లస్ ఫోన్లలో ఈ సమస్య తలెత్తకుండా చూసుకొంటామని ఈ సంస్థ హామీ ఇచ్చింది. -
ఐఫోన్ కాదు.. అది స్పై ఫోన్!
యాపిల్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్6, ఐఫోన్ 6ప్లస్ లాంటివి కొనాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎప్పుడెప్పుడు ఎలా తిరుగుతున్నారో అన్ని విషయాలూ ఎవరికైనా తెలిసినా ఫర్వాలేదనుకుంటే ఆ ఫోన్ కొనేసుకోండి. తెలియద్దనుకుంటే మాత్రం ఒకసారి మళ్లీ ఆలోచించుకోండి. ఎందుకంటే.. యాపిల్ ఫోన్లలో ఉన్న ఓ ఫంక్షన్.. మీ కదలికలన్నింటినీ రికార్డు చేసేస్తుందట. మీరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పనిచేస్తారో, తరచు ఎక్కడికి వెళ్తున్నారో, ఏయే సమయాల్లో ప్రయాణాలు చేస్తారో అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. 'ఫ్రీక్వెంట్ లొకేషన్స్' అనే ఈ ఫీచర్‌ను దాదాపు ఏడాది క్రితమే ఐఫోన్లలోకి గుట్టుగా ఎక్కించేశారు. కానీ చాలామందికి దీని గురించి ఏమాత్రం తెలియకుండా ఐదు లేయర్ల కింద దీన్ని కప్పిపెట్టేశారు. కేవలం మ్యాపింగ్ సర్వీసులను మెరుగుపరచడానికే ఈ అప్లికేషన్ పెట్టినట్లు యాపిల్ కంపెనీ చెబుతున్నా, దీంతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నది మాత్రం ఒప్పుకోక తప్పని వాస్తవం. ఇది చాలా భయంకరమైనదని, షాకింగ్ న్యూస్ అని బ్రిటన్ కంప్యూటర్ నిపుణుడు ప్రొఫెసర్ నోయెల్ షార్కీ చెప్పారు. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ షాపింగ్ చేస్తున్నామో, ఎక్కడ తాగుతున్నామో అన్నీ రికార్డు అయిపోతాయని, విడాకుల లాయర్లకు దీనివల్ల పని సులభం అవుతుందని ఆయన చెప్పారు. ఐఫోన్ వాడేవాళ్లందరికి సంబంధించిన వివరాలు ఇలా రికార్డు అయిపోతాయని, సామాన్యుల విషయంలో పెద్ద సమస్య కాకపోయినా, వీఐపీలు.. ప్రాణాలకు ప్రమాదం ఉంటుందనుకునే వాళ్ల విషయంలో మాత్రం ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ డేటా ఎవరివద్దకైనా వెళ్తే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. -
వంగిపోతున్న యాపిల్ ఐఫోన్ 6
న్యూయార్క్ : మార్కెట్లో విడుదలైన వారంలోనే దుమ్మురేపిన యాపిల్ ఐఫోన్ 6 సమస్యలు ఎదుర్కొంటోంది. ఫోన్ వంగిపోతుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయాయి. ఇప్పటి వరకూ వినియోగదారుల నుంచి తొమ్మిది ఫిర్యాదులను అందుకుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఐ ఫోన్ వివాదంపై యాపిల్ సంస్థ స్పందించింది. ఐఫోన్ 6, 6 ప్లస్ లను స్టెయిన్ లెస్ స్టీల్, టైటానియంతో అత్యంత నాణ్యతతో డిజైన్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్యాంటు పలుచగానూ, టైట్ గానూ ఉండటం వల్ల వెనక్కి పెట్టినప్పుడు ఐఫోన్ 6 ప్లస్ వంగిపోయి ఉండవచ్చనన్న మొబైల్ నిపుణుల వాదనతో కంపెనీ ఏకీభవించింది. ఎక్కువ సేపు ఐఫోన్‌ను ప్యాంటు వెనక జేబులో పెట్టినప్పుడు ఎలర్ట్ చేస్తుందని దాన్ని పట్టించుకోన్నప్పుడు సమస్యలు వస్తాయని కంపెనీ చెబుతోంది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు మన్నించాలని యాపిల్ సంస్థ ప్రతినిధి కోరారు. ప్రస్తుత వెర్షన్‌ను తర్వలోనే సరిచేస్తామని పేర్కొన్నారు. -
ఐఫోన్ 6లో ఏమున్నాయి?
చుక్కల్లో చంద్రుడు ఎలాగో స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ అలా అనడం అతిశయోక్తి కాదేమో. అందుకే కొత్త మోడల్ ఐఫోన్ విడుదలైన ప్రతిసారి సందడి సందడిగా ఉంటుంది. కొత్త కొత్త రికార్డులు పుట్టుకొస్తూంటాయి. తాజాగా ఐఫోన్ 6, 6 ప్లస్, ఐఓఎస్ 8లు కూడా దీనికి భిన్నమేమీ కాదు. విడుదలైన తరువాత తొలి వారాంతంలో ఏకంగా కోటి ఐఫోన్లను విక్రయించి ఆపిల్ మరో రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ తాజా ఐఫోన్లలో ఉన్న విశేషాలేమిటి? అర లక్ష పోసి కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి? ముందుగా ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 8 గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఆపిల్ అభిమానులు ఈ కొత్త ఓఎస్‌ను చూసి పెదవి విరిచేశారు. అయితే కొంచెం తరచి చూస్తేగానీ దీంట్లోని కొత్త ఫీచర్లేమిటన్నది స్పష్టం కాదు. ఉదాహరణకు... పాతతరం ఐఫోన్లలో ఈమెయిల్ మల్టీటాస్కింగ్ సౌకర్యం అస్సలు లేదు. స్క్రీన్‌పై ఉన్న మెయిల్‌ను క్లోజ్ చేస్తేగానీ రెండోదాన్ని ఓపెన్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఐఫోన్ 6లో ఈ ఇబ్బంది లేదు. మెయిల్‌ను ఒకసారి కిందివైపు స్వైప్ చేస్తే చాలు... నేరుగా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లవచ్చు. దీంతోపాటు మెయిళ్లను ట్యాబ్‌ల మాదిరిగా ఓపెన్ చేసి బ్రౌజ్ చేయవచ్చు కూడా. థర్డ్ పార్టీ కీబోర్డు ఆపిల్ ఉత్పత్తులు అన్నింటిలో ప్రొప్రయిటరీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్లనే వాడుతూంటారు. ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునే అవకాశం దాదాపుగా ఉండదు. తాజ ఐఫోన్ దీనికి మినహాయింపు. ప్రత్యేకంగా రూపొందించిన ఐఫోన్ కీబోర్డు స్థానంలో ఇతర కంపెనీల కీబోర్డులు కూడా వాడుకునేందుకు దీంట్లో అవకాశం కల్పించారు.సెట్టింగ్స్‌లోని జనరల్ ట్యాబ్‌లో ఉండే కీబోర్డు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కీబోర్డును ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే కొత్త కీబోర్డుతో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ పనిచేయదు. టచ్ ఐడీ ఫీచర్‌లోనూ ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునేందుకు అవకాశం కల్పించడం మరో విశేషం. నోటిఫికేషన్లతో గమ్మత్తులు.. కొత్త మెసేజీలు, అలర్ట్‌ల వివరాలు తెలుసుకునేందకు పనికొచ్చే నోటిఫికేషన్ ఏరియా ఇప్పుడు గమ్మత్తులకు కేంద్రమైంది. ఆయా నోటిఫికేషన్లు ఎక్కడి నుంచి (మెసేజ్, వాట్స్ యాప్, మెయిల్ వంటివి) వచ్చినప్పటికీ ఆయా అప్లికేషన్లలోకి వెళ్లే అవసరం లేకుండా నేరుగా వాటికి సమాధానమివ్వడం, డిలీట్ చేయడం, అలారం వంటి వాటిని ఆఫ్ చేయడం చేసేయవచ్చు. వీటితోపాటు వాయిస్ అసిస్టెంట్ సిరిలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఐఫోన్ బ్యాటరీ వినియోగంపై ఒక కన్నేసి ఉంచేందుకు ఏర్పాట్లు ఉండటం ఐఫోన్ 6లో కనిపించే ప్రత్యేకమైన ఫీచర్. దీన్ని ఉపయోగించుకునేందుకు సెట్టింగ్స్‌లోని జనరల్ ఆప్షన్‌లోకి వెళ్లండి. యూసేజ్, బ్యాటరీ అని ఉన్న చోట ట్యాప్చేస్తే ఏఏ అప్లికేషన్లు ఎంత మేరకు బ్యాటరీని వాడుతున్నాయో తెలుస్తుంది. అంతేకాదు... ఆయా అప్లికేషన్లు ఎందుకు అంత మేరకు బ్యాటరీని ఉపయోగించాయో కూడా వివరించడం (సిగ్నల్ సామర్థ్యం తక్కువగా ఉందని... చాలాసమయం పాటు ఆన్‌లో ఉన్నట్లు... ) విశేషం. -
షేర్ చేసుకుందామా..
వీడో ప్రబుద్ధుడు.. అందుకే ఐఫోన్-6 కొనడం కోసం ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్‌నే షేర్ చేసుకుందాం అంటూ ఆఫరిచ్చేశాడు. చైనాలోని షాంగాయ్కు చెందిన ఈ విద్యార్థి(పేరు తెలియరాలేదు)కి ఐఫోన్ అంటే ఇష్టం. తాజాగా ఐఫోన్ 6 మార్కెట్లోకి వచ్చేసింది. కొనడానికేమో డబ్బుల్లేవు. దీంతో గర్ల్ ఫ్రెండ్ షేరింగ్ అంటూ సైన్ బోర్డు పట్టుకుని రోడ్డెక్కాడు. వచ్చే డబ్బులతో ఐఫోన్ 6 కొన్నాలన్నది వీడి ప్లాన్. ఇందులో భాగంగా తన స్నేహితురాలిని షేర్ చేసుకునేందుకు కొన్ని నిబంధనలూ పెట్టాడు. షేరింగ్‌కు ఒప్పుకునేవాళ్లు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి భోంచేయొ చ్చు. కలసి చదువుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. డేటింగ్‌కు వెళ్లొచ్చు. అయితే.. ‘ఎక్స్‌ట్రాలు’ చేయడానికి మాత్రం వీల్లేదని స్పష్టంగా చెప్పాడు. ఈ సేవలు పొందేందుకు గానూ.. గంటకు రూ.100.. నెలకైతే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆ విద్యార్థి చెప్పాడు. గతంలోనూ చైనాలో ఐఫోన్ కొనేందుకు పలువురు చిత్రవిచిత్ర పనులు చేశారు. ఐఫోన్, ఐప్యాడ్ కొనేందుకు ఓ యువకుడు తన కిడ్నీ అమ్మేస్తే.. 2011లో ఐఫోన్-4 కోసం ఓ యువతి తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. -
ఐఫోన్6 దుమ్మురేపింది!
న్యూయార్క్: మార్కెట్ లోకి విడుదలైన వారం రోజుల్లోనే భారీ సంఖ్యలో ఐఫోన్6 అమ్ముడైనట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. తొలి వారాంతంలో కోటి పైగా ఐఫోన్లు అమ్ముడయ్యాయని వ్యాపార విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్టాక్ అందుబాటులో ఉంటే భారీ సంఖ్యలోనే ఐఫోన్ లు అమ్ముడయ్యే అవకాశం ఉండేదని ఆపిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 తేది 40 లక్షల మంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని కంపెనీలు తెలిపారు. తాజా అమ్మకాల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ నాస్ డాక్ పై కూడా కనిపించింది. నాస్ డాక్ లో ఆపిల్ 100.58 డాలర్లుగా నమోదు చేసుకుంది. తొలి త్రైమాసికంలో ఆపిల్ కంపెనీ రెవెన్యూ 9 శాతం పెరిగడం కాకుండా వాల్ స్ట్రీట్ అంచనాలను మించిందని బిజినెస్ అనలిస్ట్ జీనె మునస్టర్ తెలిపారు. గత సంవత్సరం విడుదలైన తొలి వారాంతంలోనే ఐఫోన్ 5ఎస్, 5సీ మోడల్స్ చైనాతోపాటు 11 దేశాల్లో 90 లక్షల ఫోన్లు అమ్ముడైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.