Jayashankar District News
-
నియామకం
కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కొరిపల్లి ప్రశాంత్ జాతీయ మానవహక్కుల మండలి ఎన్జీఓ తెలంగాణ నార్త్‌జోన్ అధ్యక్షుడిగా బుధవారం ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మానవహక్కుల మండలి ఎన్జీఓ జాతీయ అధ్యక్షుడు అయిలినేని శ్రీనివాస్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నార్త్‌జోన్‌లోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మా నవహక్కులపై చైతన్యం చేసి, హక్కుల ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తానన్నారు. -
నియామకం
కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కొరిపల్లి ప్రశాంత్ జాతీయ మానవహక్కుల మండలి ఎన్జీఓ తెలంగాణ నార్త్‌జోన్ అధ్యక్షుడిగా బుధవారం ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మానవహక్కుల మండలి ఎన్జీఓ జాతీయ అధ్యక్షుడు అయిలినేని శ్రీనివాస్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నార్త్‌జోన్‌లోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మా నవహక్కులపై చైతన్యం చేసి, హక్కుల ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తానన్నారు. -
తేమ శాతం 17 ఉంటే కొనాలి
భూపాలపల్లి: తేమ శాతం 17 ఉంటే ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ చాంబర్లో పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ, పీఏసీఎస్ సీఈఓలతో కొనుగోలు కేంద్రాల రిజిస్ట్రేషన్, ట్యాబ్‌లో నమోదులు, కొనుగోలు ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల్లో రిజిష్టర్ల నిర్వహణ, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు, పరికరాలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం పూర్తిగా ఆరబెట్టిన తర్వాతనే తేమ శాతం కచ్చితంగా ఉన్న ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయొద్దని సూచించారు. రైతులు కల్లాల వద్దనే అరబెట్టి తేమ శాతం వచ్చిన తరువాత కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ అధి కారులు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం రాములు, మా ర్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ -
నేడు కేంద్ర మంత్రి పర్యటన
రేగొండ: మండలంలో నేడు (గురువారం) కేంద్ర సహాయ మంత్రి నిముబెన్ జయంతిబాయి బంబానియా పర్యటించనున్నారు. మండలంలోని రూపిరెడ్డి గ్రామంలో ఉదయం 8.30 గంటలకు భూసార పరీక్ష సేకరణ పద్ధతి, రైతు సంఘం సభ్యులతో చర్చించనున్నారు. రేగొండలో ఉదయం 10 గంటలకు పీహెచ్సీ సందర్శన, 10.30 గంటలకు జిల్లా పరిషత్ పాఠశాల, 11.30 గంటలకు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహరంపై చర్చించనున్నారు. పగిలిన పైపులైన్.. ఎగిసిన నీరు కాటారం: కాటారం మండల కేంద్రానికి సమీపంలో భూపాలపల్లి వైపుగా జాతీయ రహదారిని ఆనుకొని కేటీపీపీకి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్ గేట్ వాల్వ్ బుధవారం పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. కాళేశ్వరం సమీపంలోని గోదావరి నుంచి చెల్పూర్ సమీపంలోని కేటీపీపీకి నీటి సరఫరా కోసం గతంలో భారీ పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడక్కడ పెద్ద గేట్వాల్స్ అమర్చారు. నీటి ప్రెషర్ కారణంగా మండల కేంద్రానికి సమీపంలో గేట్‌వాల్వ్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు బయటకు వచ్చింది. సుమారు గంటపాటు నీరు వృథాగా పారింది. సమాచారం అందుకున్న సిబ్బంది నీటి సరఫరాను నిలిపివేశారు. ఉన్నట్టా.. లేనట్టా..? పలిమెల : మండలంలోని కామన్పల్లి –ముకునూరు రహదారిలోని కిష్టాపురం పహాడ్ వద్ద పెద్ద పులి సంచరిస్తుందని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తెలిపిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం నుంచి అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం తిరిగి గాలింపు చేపట్టినట్లు ఎఫ్ఆర్ఓ నాగరాజు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద పులి అనవాళ్లు, పాదముద్రలు గుర్తించలేదని తెలిపారు. నేడు (గురువారం) కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే అధికారులు ఎలాంటి నిర్ధారణ చేయకపోవడంతో పులి ఉందా.. లేదా అని స్థానికుల్లో సందిగ్ధం నెలకొంది. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక రేగొండ(కొత్తపల్లిగోరి): హనుమకొండ జేఎన్ఎస్లో నిర్వహించిన అండర్–17 బాలుర విభాగంలో కొత్తపల్లిగోరి జెడ్పీ పాఠశాల విద్యార్థి శశికుమార్ బాక్సింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా డు. ఈ సందర్భంగా విద్యార్థితోపాటు పీడీ రఘును ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత, ఉపాధ్యాయులు సంజీవ్, శ్రీనివాస్, సంపత్, షరీఫ్, దిలీప్, విద్యాసాగర్, రాజమౌళి, కరుణశ్రీ, వాణి, శ్రీలత అభినందించారు. కాళేశ్వరాలయంలో పూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. అనంరతం ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేకంగా దీపారాధనలు చేశారు. సామూహిక దీపాలంకరణ నిర్వహించారు. బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత ములుగు : జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ బాలికల పాఠశాలలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు ప్రపంచ బాలల దినో త్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో నిలిచిన చిన్నారులు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా పురస్కారాలు అందుకోవడం జరుగుతుందన్నారు. బాలలు సమాజానికి అమూల్యమైన సంపద అని వారందరు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల బాలికలు ఎలాంటి వివక్షకు గురికా కుండా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వద్వర్యంలో రూపొందించిన బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనతో భరోసా
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఏటూరునాగారం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన జ్యోతి (పీఎంజేజే) బీమా యోజనను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ పథకం పేదలకు భరోసా ఇస్తుందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లనుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్‌తో అనుసంధానమైన సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలన్నారు. ఏడాదికి రూ.436లు ప్రీమియం చెల్లించాలని, ఆటోమెటిక్ డెబిట్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. మరణం సంభవిస్తే రూ.2 లక్షలు సాయం వర్తిస్తుంది. అలాగే 18 ఏళ్లనుంచి 70 ఏళ్లలోపు వారు సంవత్సరానికి రూ.20లు ప్రీమియం చెల్లిస్తే మరణం సంభవిస్తే రూ. 2లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ.లక్ష బీమా వర్తిస్తుంది. ఈనెల 22వ తేదీన ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ పేర్కొన్నారు. బీమా కావాల్సిన వారు వారి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌పుస్తకం, నామిని వివరాలు, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్‌ను వెంట తీసుకురావాలని కోరారు. -
మరుగుదొడ్డి వినియోగం.. ఆత్మగౌరవం
భూపాలపల్లి: మరుగుదొడ్డి వినియోగం మన ఆత్మ గౌరవమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబం తమ సామాజిక బాధ్యతగా మరుగుదొడ్డి వినియోగించాలని తెలిపారు. మరుగుదొడ్డిని పరిశుభ్రంగా, సుస్థిరంగా ఉపయోగించుకునేలా, ఎలాంటి మరమ్మతులు ఏర్పడకుండా ఉంచుకోవాలన్నారు. డిసెంబర్ 10వ తేదీ వరకు మరుగుదొడ్డి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ బాగుంది
గణపురం: జిల్లాలోని మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడి ఆహార పదార్థాలు బాగున్నాయని కేంద్ర వినియోగదారులు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతి బాయ్ బంబానియా అన్నారు. బుధవారం మండలంలోని చెల్పూరులో ఆమె మిల్లెట్ యూనిట్‌ను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో మిల్లెట్స్‌తో తయారు చేసిన మల్టీగ్రేన్ జావ, రాగి లడ్డు రుచి చూసిన ఆమె చాలా బాగుందని తెలుగులో అభినందించారు. అనంతరం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేసి ఆశీర్వదించారు. వైద్య, డీఆర్డీఏ, మత్స్య, వ్యవసాయ, ఉద్యాన, సంక్షమశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశం అభివృద్ధిలో కొత్త శిఖరం చేరుకుంటుందన్నారు. 10 సంవత్సరాల్లో ప్రతి రంగం మిషన్ మోడల్ అభివృద్ధిలో ఉందని అన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ అతిపెద్ద వ్యవస్థగా ఉందని, త్వరలో మన దేశం 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. దేశంలో అత్యంత వెనుకబడిన, అభివృద్ధి చెందని 112 జిల్లాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నీతి అయోగ్ యాస్పిరేషనల్ జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2018లో ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆకాంక్ష జిల్లా కార్యక్రమం కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను సమాజంలోని చివరి వ్యక్తికి అందించే లక్ష్యంతో ముందుకెళ్తుందన్నారు. జిల్లాలోని ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు మీ ఇంటి వద్దనే ప్రభుత్వం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి మరింత ఊతం ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. యాస్పిరేషన్ లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్నందుకు ప్రత్యేక నిధులు రూ.10 కోట్ల మంజూరు అయినట్లు తెలిపారు. చెల్పూరు మిల్లెట్ యూనిట్ నుంచి తయారు చేసిన మిల్లెట్ ఆహార పదార్థాలు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాస్పిరేషనల్ పారా మీటర్లు క్షేత్రస్థాయిలో పరిశీలనకు జిల్లాకు రావడం హర్షనీయమన్నారు. అదనపు కార్యదర్శి ఖుష్భూ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ మంగీలాల్, సీపీఓ బాబురావు, డీఆర్డీఓ అవినాశ్, తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధే లక్ష్యం భూపాలపల్లి: దేశంలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆకాంక్షిత కార్యక్రమం ప్రారంభించినట్లు కేంద్ర వినియోగదారులు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతి బాయ్ బంబానియా తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో యాస్పిరేషన్ లక్ష్యాల సాధనపై విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యాన, సంక్షేమ, డీఆర్డీఏ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని, వాటి కారణంగానే దేశం నేడు ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిందన్నారు. జిల్లాలో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అమలును పర్యవేక్షించేందుకు జిల్లాకు వచ్చానని అన్నారు. సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలను కలవడం ఆశీర్వాదంగా భావిస్తా.. కేంద్ర మంత్రి నిముబెన్ జయంతి బాయి బంబానియా -
వీడుతున్న మత్తు
కాటారం: గుడుంబా, నాటు సారా తయారీదారులకు కంచుకోటలుగా నిలిచిన అటవీ పల్లెలు మార్పు బాటలో పయనిస్తున్నాయి. కొన్నేళ్లుగా గుడుంబా తయారే ప్రధాన జీవనాధారంగా కొనసాగుతూ వస్తున్న పల్లెలు ప్రస్తుతం గుడుంబా తయారీ అంటేనే జంకుతున్నాయి. ఎన్ని క్లిష్టపరిస్థితులు వచ్చినా గుడుంబా తయారీని వదలని పల్లెల్లోని పలు కుటుంబాలు తమ అసాంఘిక వృత్తిని వదిలి ఉపాధిని కోరుకుంటున్నాయి. గుడుంబా మహమ్మారితో అతలాకుతలమైన పల్లెలు.. ఎకై ్సజ్ అధికారుల దాడులు.. పోలీసుల అవగాహన సదస్సులతో మార్పు దిశగా వెళ్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాల అడ్డాలుగా.. పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండే పల్లెలు గుడుంబా తయారీతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి. మండలంలోని గట్లకుంట, గంగారం, విలాసాగర్, దామెరకుంట, శంకరాంపల్లి, కొత్తపల్లి, అంకుషాపూర్, మేడిపల్లి, మహాముత్తారం మండలం బోర్లగూడెం, సింగారం, యామన్‌పల్లి, కనుకునూరు, మహదేవపూర్ మండలం బొమ్మాపూర్, కుదురుపల్లి, పల్గుల, అంబట్పల్లి, సూరారం, రాపెల్లికోట, మల్హర్ మండలం గాదెంపల్లి, రుద్రారం, పెద్దతూండ్ల, మల్లారం, కొయ్యూర్, ఎడ్లపల్లి, పలిమెల మండలం పలిమెల, పంకెన, సర్వాయిపేట, నీలంపల్లి, మోదేడు, లెంకలగడ్డ, పెద్దంపేట గ్రామాల్లో విచ్చలవిడిగా గుడాంబా తయారీ జరిగేది. ఇదంతా గత కొన్ని నెలల క్రితం జరిగిన తతంగం. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ప్రభుత్వం గుడాంబా తయారీపై ఉక్కు పాదం మోపుతుండడంతో తయారీదారులకు నిర్వాహణ కత్తిమీద సా ములా మారిపోయింది. గుడాంబా నిషేధం పకడ్బ ందీగా అమలు చేయాలని ప్రభుత్వం కేవలం ఎౖక్సై జ్ శాఖకే కాకుండా పోలీస్‌శాఖ, ఇతరాత్ర పలు శా ఖలకు ఆదేశాలు జారీ చేయడంతో పల్లెల్లో గుడుంబా తయారీ తగ్గుముఖం పడుతుంది. ఎక్సైజ్ శా ఖ, పోలీస్ శాఖ దాడులు చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తుండటంతో తయారీకి జంకుతున్నారు. ఉపాధి కల్పించాలని వేడుకోలు.. కొన్నేళ్లుగా గుడుంబాపైనే ఆధారపడి జీవనం సాగించిన పలు గ్రామాల్లోని కుటుంబాలు ప్రస్తు తం ఆ వృత్తిని వీడి ఉపాధి వైపు అడుగులు వేస్తున్నాయి. గత ప్రభుత్వం జిల్లాలోని పలువురు గు డుంబా తయారీదారులకు గొర్రెలు, గేదెల పంపి ణీ, ట్రాన్స్‌పోర్టు వాహనాల కొనుగోలు లాంటి వా టి కోసం ఎకై ్సజ్ శాఖ ద్వారా రుణాలు అందజేసింది. దీంతో గ్రామాల్లోని అధిక శాతం తయారీదారులు గుడుంబా తయారీని వదిలేసి ఉపాధి వృత్తుల వైపు మొగ్గు చూపారు.భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గత పది నెలలుగా నమోదైన కేసుల వివరాలుసారా తయారీకి జంకుతున్న తయారీదారులు ఓ పక్క ఎకై ్సజ్ అధికారుల దాడులు మరో పక్క పోలీసుల అవగాహనలు ఉపాధికి తోడ్పాటునందించాలని తయారీదారుల వేడుకోలు దాడులు.. అవగాహన సదస్సులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు గుడాంబా తయారీని రూపుమాపడం కోసం తీవంగా కృషి చేస్తున్నారు. ఓ పక్క ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి గుడాంబా తయారీని అడ్డుకుంటుండగా సివిల్ పోలీసులు మాత్రం తమదైన రీతిలో తయారీదారులకు అవగాహన కల్పిస్తున్నారు. గుడుంబాతో కుటుంబాలు ఎలా రోడ్డున పడుతున్నాయో.. వారికి వివరిస్తూ పల్లె ప్రజల్లో మార్పునకు కృషి చేస్తున్నారు.గుడుంబా నియంత్రణపై దృష్టి గ్రామాల్లో గుడుంబా తయారీ, రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామాల్లో గుడుంబాను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ముందకెళ్తున్నాం. తయారీదారుల్లో మార్పు రాకుంటే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తాం. యువత, మహిళలు గుడాంబా నియంత్రణకు సహకరించాలి. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
బదిలీలకు సబ్ రిజిస్ట్రార్ల ఎదురుచూపులు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్శాఖలో బదిలీలు ఎప్పుడంటూ సబ్ రిజిస్ట్రార్లు ఎదురుచూస్తున్నారు. జూలై 31వ తేదీన జీరో ట్రాన్స్ఫర్స్ పేరిట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ ఐజీ, ప్రభుత్వం ప్రకటించిన బదిలీల ఉత్తర్వులతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని అటెండర్‌స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జోన్లో భాగంగా జోన్–1 బదిలీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి ఉమ్మడి వరంగల్‌కు గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లతోపాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏకకాలంలో జూలై 31వ తేదీన బదిలీల ప్రకటన, ఆగస్టు 1న జాయినింగ్లతో పూర్తిగా నూతన అధికారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారిపోయాయి. ఓడీ పేరిట అక్టోబర్‌లో మరో జాబితా సాధారణ, లాంగ్ స్టాండింగ్ బదిలీలకు బదులుగా కొత్తగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో అక్టోబర్ 15న ఓడీ (ఆన్ డ్యూటీ) పేరిట బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో జోన్లను దాటి హైదరాబాద్ వరకు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు 19 మందికి స్ధాన చలనం కలిగింది. రెండు నెలల గడువులోనే మరో కార్యాలయానికి బదిలీకావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 20 మందితో మరో జాబితా.. ‘మా జిల్లాకు మేము పోతాం. మాకు చాలా దూరమవుతుంది’ అంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇటీవల రెవెన్యూశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఓడీ పేరిట 19 మంది గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా, ఇదే కోవలో మరో 20 మందితో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో బదిలీ జాబితా వెలువడే అవకాశం ఉంది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్లు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్టోబర్‌లో ఓడీ పేరిట 19 మంది ట్రాన్స్ఫర్ 20 మందితో మరో జాబితా రెడీ సొంత జిల్లాకు పోతామంటూ అభ్యర్థనలులాంగ్ లీవ్‌లో పలువురు.. ఉమ్మడి వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి వరంగల్‌కు బదిలీపై వచ్చిన గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు తాము ఇంత దూరం ప్రయాణం చేయలేమని, ఈ కార్యాలయాల్లో పని చేయలేమంటూ కొందరు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామని మరికొందరు లాంగ్ లీవ్ పెట్టారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చిట్స్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ
రేగొండ: మండలంలోని భాగిర్థిపేట గ్రామంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాషీర్, తిరుపతి, భిక్షపతి, శ్రీనివాస్, సంతోష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సభకు తరలిరావాలి.. ఈ నెల 19న హనుమకొండ పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని, ఈ సభను ఉమ్మడి రేగొండ మండలం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, నాయకులు పాల్గొన్నారు.మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే గండ్ర -
గ్రూప్–3 మొదటిరోజు ప్రశాంతం
● కేంద్రాలను తనిఖీచేసిన కలెక్టర్ భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా గ్రూప్–3 పరీక్ష మొదటిరోజు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పరీక్ష సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పేపర్–1 ఉదయం 9.30 గంటలకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా అభ్యర్థులు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పేపర్–1 పరీక్షకు 2,020మంది హాజరుకాగా.. 1,687మంది గైర్హాజరయ్యారు. పేపర్–2 పరీక్షకు 2,023 మంది హాజరుకాగా.. 1,684 మంది గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సంఘమిత్ర డిగ్రీ, పీజీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్‌శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని.. నేడు(సోమవారం) జరిగే పరీక్ష కూడా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు, పరీక్ష కేంద్రాల సీఎస్‌లు పాల్గొన్నారు. -
కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ
కాళేశ్వరం: కార్తీకమాసం ఆదివారం సెలవు కావడంతో కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించారు. లక్షముగ్గులు వేసి లక్షవత్తులు వెలిగించి దీపారాదన చేశారు. బ్రాహ్మణోత్తములకు దీపదానాలు చేశారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. సామూహిక దీపాలంకరణ నిర్వహించారు. దీపాలంకరణలో పాల్గొన్న భక్తులకు పసుపు, కుంకుమ, అక్షింతలు అందజేశారు. దీంతో ఆలయంతో పాటు గోదావరి తీరం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ పూజలు, లడ్డూప్రసాదాల ద్వారా రూ.4.25లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ తదితరులు పాల్గొన్నారు. -
బుగులోనికి భారీగా భక్తజనం
రేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారులో జరుగుతున్న శ్రీ బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరకు నాలుగో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం వేలాదిమంది వచ్చి మొక్కులు సమర్పించారు. భక్తులు భారీగా తరలిరావడంతో జాతర ఆవరణమంతా భక్తిభావంతో ఉప్పొంగింది. భక్తుల గోవింద నామస్మరణతో గుట్ట మార్మోగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి జాతరకు హాజరై మొక్కులు చెల్లించారు. పోలీసుల సేవలు.. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ సందీప్‌కుమార్ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో అడుగడుగునా పోలీసుల సేవలు కనిపించాయి. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. జాతర కమిటీ ఏర్పాట్లలో నిమగ్నం జాతరలో మెదటి రోజు భక్తులు ఇబ్బందిపడడంతో జాతర కమిటీ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. భక్తుల సౌకర్యార్థం తాగునీటిని ఏర్పాటు చేశారు. జాతర ఈఓ బిల్లా శ్రీనివాస్, చైర్మన్ రొంటాల వెంకటస్వామి, కమిటీ సభ్యులు రమణారెడ్డి, విజేందర్, రాజేందర్, శ్రీధర్, శివ, తిరుపతి ఏర్పాట్లను పరిశీలించారు. కిటకిటలాడిన స్వామి సన్నిధి జాతర ప్రాంగణంలో విడిది -
పరిపాలనా సౌలభ్యమేది?
పేరుకే కొత్త మండలాలు ● పూర్తిస్థాయిలో ఏర్పాటు కాని ప్రభుత్వ కార్యాలయాలు ● ఉమ్మడి మండలాల నుంచే కార్యకలాపాలు ● ఇబ్బంది పడుతున్న ప్రజలుసేవలు అందడం లేదు పలిమెల మండలం ఏర్పాటు జరిగి ఎనిమిదేళ్లు గడుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖల సేవలు అందడం లేదు. కేవలం పోలీస్‌స్టేషన్ మినహా ఏ కార్యాలయం స్థానికంగా లేదు. ఏదైనా అవసరం పడితే పాత మండలమైన మహదేవపూర్‌లోని కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతుంది. మండల కేంద్రంలో అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. – జనగామ శ్రీనివాస్, పలిమెల పాత మండలానికే వెళ్లాల్సి వస్తోంది.. రెండేళ్ల క్రితం కొత్తపల్లిగోరి మండలంగా ఏర్పాటైనందుకు చాలా సంతోష పడ్డాం. రేగొండ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే శ్రమ తప్పుతుందని అనుకున్నాం. కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా మండలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఏదైనా పని కోసం రేగొండకు వెళ్లాల్సి వస్తోంది. – దండెబోయిన సంతోష్, గాంధీనగర్కాటారం: పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలిమెల, టేకుమట్ల, కొత్తపల్లిగోరి కొత్త మండలాలు పేరుకే పరిమితమయ్యాయి. మండలాలు ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రాలేదు. ఒకటి, రెండు కార్యాలయాలు మినహా మిగితా ఏ కార్యాలయాల ఏర్పాటు నూతన మండలాల్లో జరగకపోవడంతో ప్రజలకు పరిపాలనా సౌలభ్యం జరగడం లేదు. అంతకుముందు ఉన్న మండలాల నుంచే పాలన సాగుతోంది. పలిమెల మండల పరిస్థితి.. ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన పలిమెల మండలంలో రెండేళ్ల కిందట పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. మండలం ఏర్పాటు జరిగిన వెంటనే ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి హుటాహుటిన అధికారులను కేటాయించారు. కొంత కాలానికి పలిమెల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రెవెన్యూ, పంచాయితీరాజ్, వ్యవసాయశాఖలను కలుపుకొని మండల సమీకృత భవనం ఏర్పాటు చేశారు. భవనం ప్రారంభించినప్పటికీ ఏ ఒక్క రోజు ఆ భవనంలో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగలేదు. కొత్తపల్లిగోరి మండల పరిస్థితి.. కొత్తపల్లిగోరి రెవెన్యూ కార్యాలయాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రా రంభించారు. ఆ తర్వాత పాఠశాల భవనంలో తా త్కాలిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇటీవల మండలానికి వ్యవసాయశాఖ అధికారిని కేటాయించారు. మండలం ఏర్పా టు జరిగిన రెండేళ్లు గడుస్తున్పప్పటికీ పలు ప్రభు త్వ శాఖల మండల స్థాయి అధికారుల కేటాయింపు కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు గానీ ఏర్పాటు కాలేదు. సమీకృత భవనానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మండలాల నుంచే పరిపాలన.. 2016లో అప్పటి ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసింది. మహదేవపూర్ మండలంలో భాగమైన పలిమెలను, చిట్యాల మండలంలో భాగమైన టేకుమట్లను నూతన మండలాలుగా ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో 2022లో రేగొండ మండలం నుంచి కొత్తపల్లిగోరిని మండలంగా ఏర్పాటు చేశారు. నూతన మండలాలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిపాలన మొత్తం ఉమ్మడి మండలాల నుంచే కొనసాగుతుంది. పలిమెల మండలానికి మహదేవపూర్‌లో, కొత్తపల్లిగోరి మండలానికి రేగొండలో, టేకుమట్లకు చిట్యాలలో నుంచి పాలన సాగుతోంది.జిల్లా వివరాలు..రెవెన్యూ డివిజన్లు 2(భూపాలపల్లి, కాటారం) మండలాలు 12 నూతన మండలాలు 3 (పలిమెల, టేకుమట్ల, కొత్తపల్లిగోరి) పలిమెల మండలం వివరాలు గ్రామపంచాయతీలు 08 రెవెన్యూ గ్రామాలు 17టేకుమట్ల మండలం వివరాలుగ్రామపంచాయతీలు 24 రెవెన్యూ గ్రామాలు 18కొత్తపల్లిగోరి మండలం వివరాలుగ్రామపంచాయతీలు 14 రెవెన్యూ గ్రామాలు 7టేకుమట్ల మండల పరిస్థితి.. 2016న టేకుమట్ల మండలం ఏర్పాటు జరిగింది. చిట్యాల మండలం నుంచి విడిపోయి టేకుమట్లగా ఏర్పాటు జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మండల తహసీల్దార్ కార్యాలయం, గ్రామపంచాయతీలో ఎంపీడీఓ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఏఓ కార్యాలయం రైతువేదికలో ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు మినహా ఏ ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం లేదు. మండల కేంద్రంలో ఏడాది క్రితం ప్రారంభించిన తహసీల్దార్ కార్యాయం, ఎంపీడీఓ కార్యాలయం పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. -
నిబంధనల ప్రకారం కొనుగోళ్లు
గణపురం: ఎఫ్ఏ క్యూ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. గణపురం మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని మాయిశ్చర్ మీటర్ ద్వారా తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని విక్రయించే ముందు తాలు, చెత్త, రాళ్లు లేకుండా పరిశుభ్రం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ రైతులకు ముందస్తు సమాచారం అందించాలని చెప్పారు. ట్యాగింగ్ చేసిన మిల్లులకు ధాన్యాన్ని సకాలంలో తరలించేందుకు లారీలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ శ్రీనాధ్, మార్కెటింగ్ అధికారి కనక శేఖర్, డీఎస్పీ సంపత్ రావు, సీఐ మల్లేష్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల పరిశీలన గణపురం మండలంలోని ఒద్దులపల్లి, గణపురం, మైలారం గ్రామాలలో పీపీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన అన్ని సదుపాయలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రకియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ధాన్యం అధికంగా రానుందని ఇబ్బందులు లేకుండా కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాధ్, మార్కెటింగ్ అధికారి కనుక శేఖర్, డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ సమగ్ర సమాచారాన్ని సేకరించాలి భూపాలపల్లి: సర్వేలో ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌కాలనీలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ఆదివారం కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. సర్వేలో ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి పొరపాటుకు ఆస్కారం లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే ప్రక్రియలో ఎన్యుమరేటర్లు సేకరిస్తున్న సమాచారం, నమోదు విధానాన్ని స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్ అభినందించారు. సర్వే వేగాన్ని పెంచడంతో పాటు, తప్పులు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని తెలిపారు. సర్వేలో సేకరించిన డేటా నమోదులో అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాచార సేకరణ ఫారాలను పకడ్బందీగా భద్రపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సర్వే నోడల్ అధికారి సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. -
రేపు విద్యుత్ వినియోగదారుల సదస్సు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 19న గణపురం మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు(లోకల్ కోర్టు) నిర్వహించనున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. భూపాలపల్లి, రేగొండ, గణపురం మండలాల వినియోగదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ భూపాలపల్లి అర్బన్: ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పసునూటి రాజేందర్‌ను నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ప్రకటించారు. ఏరియాకు చెందిన పసునూటి రాజేందర్ 32సంవత్సరాలుగా యూనియన్‌లో పని చేస్తున్నారు. కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నందున యూనియన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని యూనియన్‌లో కల్పించినందుకు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, జనక్ప్రసాద్లకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలంభూపాలపల్లి అర్బన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోత్కు ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యారంగానికి ఏడు శాతమే బడ్జెట్ కేటాయించి ఎన్నికల హమీని విస్మరించారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంలో యూనివర్సిటీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోనే అన్ని రకాల విద్యాసంస్థలను నెలకోల్పాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు జోసెఫ్, పవన్, లక్ష్మణ్, రక్షిత, శివ, రాజు, నవీన్ పాల్గొన్నారు. రెండు నెలలవుతున్నా.. చిట్యాల: మండలకేంద్రంలోని బియ్యం గోదాం వద్ద ఆర్అండ్బీ అధికారులు పెట్టిన చిట్యాల నేమ్ బోర్డు కూలిపోయి రెండు నెలలు అవుతుంది. ఇంతవరకు ఆ బోర్డును నిలబెట్టిన వారే కరువయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు నేలకూలిన బోర్డును నిలబెట్టేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక ఏటూరునాగారం: జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు జిల్లానుంచి రామన్నగూడెం విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు. ఆదివారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హర్యానాలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు జెడ్పీహెచ్ఎస్ రామన్నగూడెం పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులు రక్షిత, మైథిలి తయారుచేసిన ఇంటలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టం ఫర్ డ్రైవర్స్ అనే ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపికై ందని చెప్పారు. విద్యార్థుల గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్యను డీఈఓ అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ జాతీయస్థాయికి ఎంపికవడం అభినందనీయమన్నారు. ప్రతిభకు గుర్తింపు లభించిందని గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. -
కొలువుదీరిన వెంకన్న
రేగొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా రేగొండ మండలంలోని తిరుమలగిరి శివారులో ప్రతి ఏటా జరిగే బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న బుగులోని వెంకటేశ్వరస్వామి ప్రత్యేక పల్లకీ సేవలో గుట్టపైకి చేరారు. గుట్ట కింద ఉన్న ఇప్పచెట్టు చుట్టూ తిరిగి గుట్టకు చేరడంతో జాతర ప్రారంభమైంది. అర్చకులు కూర్మచలం వెంకటేశ్వర్లు ఇంట్లో కొలువైన స్వామి వారి ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణానికి ప్రత్యేక రఽథం స్వామి వారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామి వారి ఉత్సవ విగ్రహలను డప్పుచప్పుళ్లు, మేళాతాళాలు, కోలాటాల నడుమ జాతర ప్రాంగణానికి తరలించారు. ఊరేగింపుగా వెళ్తున్న స్వామి వారికి అడుగడుగునా మంగళహారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి నీరాజనాలు పలికారు. సాయంత్రం గుట్ట కింద ఉన్న శివాలయం ప్రాంగణంలో అలివేలుమంగ, పద్మావతిలతో స్వామి వారి వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని చూడటానికి రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలతో పాటు పక్క మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం సతీసమేతంగా స్వామి వారిని కొండ గుహలో వెలిసిన ప్రాంతానికి చేర్చారు. స్వామి వారి రాకతో గుట్టపైన ఉన్న గండ దీపాన్ని వెలగించారు. దీంతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గుట్టలకు కార్తీక పౌర్ణమి కాంతులు వెలుగుతున్నాయి. పచ్చని ప్రకృతి, పౌర్ణమి కాంతులు, విద్యుత్ వెలుగుల నడుమ బుగులోని కొండలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను అలరిస్తున్నాయి. జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి బుగులోని జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని సీఐ మల్లేష్ అన్నారు. జాతర ఏర్పాట్లపై జాతర ప్రాంగణంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతరకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. జాతరలో వాహనాలను పార్కింగ్ స్థలాలలోనే నిలిపేలా చూడాలన్నారు. సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సందీప్‌కుమార్, ప్రసాద్, శ్రావణ్, అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా బుగులోని జాతర ప్రారంభం ఘనంగా స్వామి వారి కల్యాణం -
పకడ్బందీగా గ్రూప్–3 పరీక్ష
భూపాలపల్లి: గ్రూప్ 3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష నిర్వహణలో రూటు అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ల విధులు అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పరీక్ష నిర్వహణకు విధులు కేటాయించిన డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్, ఐడెంటిఫికేషన్ అధికారులతో గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం ఏడు గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3,707 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరువుతున్నట్లు తెలిపారు. 17మంది పరిశీలకులు, 34మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఒక బయోమెట్రిక్ సూపర్వైజర్ను నియమించామన్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ పోలీస్ ఎస్కార్ట్ భద్రతతో తరలించడానికి క్లోజ్డ్ వాహనాల ఏర్పాటుతో పాటు ఐదుగురు రూటు అధికారులను నియమించామని తెలిపారు. 14 మంది దివ్యాంగ అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని వారికి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారిని స్క్రైబ్స్‌గా నియమించనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక గదిని కేటాయించాలని, వారికి అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులను బయటకు పంపొద్దని ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని సూచించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రశాంత వాతావరణం కోసం అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రం పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరీక్ష జిల్లా నోడల్ అధికారి విజయలక్ష్మి, పోలీస్ నోడల్ అధికారి బోనాల కిషన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ధాన్యం రవాణాలో జాప్యం వద్దు కలెక్టర్ రాహుల్ శర్మ ధాన్యం రవాణాపై సమీక్ష.. కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో జాప్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ శర్మ ట్రాన్స్పోర్టర్లును ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, సహకార, పౌర సరఫరాలు, డీఆర్డీఏ, మార్కెటింగ్, రవాణాశాఖ అధికారులు, ట్రాన్స్పోర్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, రవాణా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు ట్యాగ్ చేసిన మిల్లుకు రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు ధాన్యాన్ని విక్రయించిన 48గంటల్లో బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కావాలని, అందుకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఏఓ విజయభాస్కర్, పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి, కాటారం కేజీబీవీల్లో అకౌంటెంట్, కాటారం మోడల్ స్కూల్లో మెసెంజర్, అకౌంటెంట్, మహాముత్తారం కేజీబీవీలో అటెండర్, మల్హర్, మహాముత్తారం కేజీవీబీలో వాచ్ ఉమెచ్, కాటారం, రేగొండలో స్వీపర్, స్కావెంజర్, గణపురం, పలిమెల, రేగొండ కేజీబీవీల్లో అసిస్టెంట్ కుక్ హెల్పెర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18నుంచి 23వ తేదీ వరకు సంబంధిత కేజీబీవీల్లో దరఖాస్తు అందజేయాలని సూచించారు. స్థానికులు మాత్రమే అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 94419 24901, 90009 96933 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. గడువు పొడిగింపు భూపాలపల్లి అర్బన్: పారా మెడికల్ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడుపును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎంఎల్టీ, డీఈసీజీ పారా మెడికల్ కోర్సులపై ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బొగ్గు నాణ్యతా వారోత్సవాలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: బొగ్గు నాణ్యతా వారోత్సవాలను గురువారం ఏరియాలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీఎం కార్యాలయంలో ఇన్చార్జ్ జీఎం వెంకటరామరెడ్డి హాజరై క్యాలిటీ పతకావిష్కరణ చేపట్టారు. నాణ్యతే ప్రగతికి ప్రామాణికమని దాని పరిరక్షణ అందరి బాధ్యతని వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జోతి, రవికుమార్, సురేఖ, కార్మిక సంఘాల నాయకులు రమేష్, వేణుగోపాల్ పాల్గొన్నారు. మహాలక్ష్మికి చేయూత టేకుమట్ల: మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఆటోడ్రైవర్ దండ్రె రమేష్ కూతురు మహాలక్ష్మి లివర్ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రమేష్ బాల్య మిత్రులకు ఎన్ఆర్ఐ దంపతులు కాసర్ల ప్రసన్న–వినయ్‌రెడ్డి రూ.2లక్షలు అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మహాలక్ష్మి వైద్య ఖర్చుల కోసం అవసరమైతే మరింత ఆర్థిక సాయాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. దాంతో ఎన్ఆర్ఐ దంపతులు అందించిన నగదును మిత్రబృందం గురువారం మహాలక్ష్మి తండ్రి రమేష్‌కు అందించారు. వ్యాధులను నివారించాలి భూపాలపల్లి అర్బన్: పశువుల్లో గర్భకోశ, సీజనల్ వ్యాధులను గుర్తించి నివారించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎ.కుమారప్వామి తెలిపారు. మండలంలోని పెద్దపూర్, పెరుకపల్లి గ్రామాల్లో గురువారం ఉచిత పశు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ తిరుపతి, గోపాలమిత్రలు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల జోలికొస్తే ఊరుకోంభూపాలపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని టీఈ జేఏసీ జిల్లా చైర్మన్ బూరుగు రవి అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, ఉద్యోగులపై దాడిని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ భవనం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్, డీటీఎఫ్, యూటీఎఫ్, రెవెన్యూ సంఘం జిల్లా నాయకులు మార్క రామ్మోహన్, గోవర్ధన్, షఫీ అహ్మద్, దశరధ రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఇనుగాల క్రిష్ణమూర్తి, శ్రీనివాస్, చంద్రమోహన్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
కాటారం మండలం చింతకాని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు ● ప్రతీ రోజు సాయంత్రం వేళలో నిర్వహణ ● 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు పది రోజుల నుంచి సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని 157 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో సుమారు 3,513 మంది విద్యార్థులు పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. ప్రత్యేక తరగతుల కార్యాచరణ ప్రణాళికలను జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తయారు చేసి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి జిల్లాలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడిపోయారు. సబ్జెక్టులపై పట్టుకోల్పోయారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చదువులో వె వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ప్రతీ విద్యార్థి పాసై వందశాతం ఉత్తీర్ణత సాధించాలని గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు సూచనలు ఇస్తూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ చదువులో ముందుండేలా ప్రోత్సహిస్తున్నారు. రోజు వారీగా ఒక్కో సబ్జెక్ట్‌పై స్లిప్‌టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ అదనంగా గంట..ప్రత్యేక కార్యాచరణ ఇదే.. డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యార్థులకు సెలబస్ పూర్తి చేయాలి ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో సంబంధిత ఉపాధ్యాయుడికి సెలవు మంజూరు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రతి అధ్యాయం పున:శ్చరణ చేయాలి. పరీక్షా మార్గదర్శకాలకు అనుగణంగా పాఠశాల స్థాయిలో పరీక్షా పత్రాలను తయారు చేయాలి షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహించాలి చదువులో వెనుకబడిన పిల్లలకు సవరణాత్మక బోధన చేయాలి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు దత్తత చేసుకోవాలి తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సామర్థ్యాలను తెలియజేయాలి. ప్రతి రోజూ సాయంత్రం 4.15గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహణను మండల విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షణ చేసి ప్రగతిని డీఈఓకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా విద్యార్థుల సామర్థ్యాలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజూ పాఠాల బోధనతోపాటు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. -
మావోయిస్టుల కదలికపై పటిష్ట నిఘా
కాళేశ్వరం: మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా ఉండాలని, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఎస్పీ కిరణ్‌ఖరే అన్నారు. మహదేవపూర్ పోలీసు స్టేషన్‌ను గురువారం ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహదేవపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున మావోయిస్టుల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల భద్రతకోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదు వస్తే విచారణ జరిపి, తక్షణమే న్యాయం చేయాలన్నారు. పోలీసులు క్రమశిక్షణగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని అన్నారు. ఆ తర్వాత అధికారులతో కలిసి పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ రామచంద్రరావు, ఎస్సై పవన్‌కుమార్ పాల్గొన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా.. కాటారం:వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్‌ఖరే అన్నారు. కాటారం మండలం శంకరాంపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్‌తో కలిసి ఎస్పీ పరిశీలించారు. కాంటాలను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే అన్నదాతలకు తగిన వసతులు కల్పించాలని సూ చించారు. ఎస్పీ వెంట కాటారం డీఎస్పీ గడ్డం రా మ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్, పీఏసీఎస్ సీఈఓ ఎడ్ల సతీశ్, డైరెక్టర్లు ఉన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలన.. కాటారం మండలం శంకరాంపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ పరిశీలించారు. రైతులు ఎదుర్కొనే సమస్యలను తెలసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నిర్వాహాకులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ శ్రీనాథ్, సెంటర్ ఇన్చార్జ్ ఉన్నారు. ఎస్పీ కిరణ్‌ఖరే -
షేక్‌హ్యాండ్ ఇచ్చి... కేక్ తినిపించి..
● పిల్లల పోషణకు సహకారం : ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని దైవకృప చైల్డ్‌హోంలో గురువారం బాలల దినోత్సవ కార్యక్రమం జరిగింది. మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్.. పిల్లలతో కలిసిపోయి సరదాగా కబుర్లు చెప్పారు. షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. పిల్లల పోషణ, వారి అవసరాలను తీర్చేందుకు తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. – మహబూబాబాద్ -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు మంచి అలవాట్లను కలిగి ఉండాలని, చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి తెలి పారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యమంలో జడ్జి పా ల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూచించారు. కష్టపడి జీవించడం అలవాటు చేసుకున్న వారు జీవితంలో ఎన్నటికీ ఓడిపోరని తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మంగీలాల్, జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య, డీపీఆర్ఓ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాయులు రాజారత్నం, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సిర్రగోనె ఆడిన.. ఈతకు వెళ్లిన
జనగామ: చిన్ననాటి జ్ఞాపకాల అనుభూతి మరువలేనిది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఇంట్లో ఉంటే అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులు. బయటకు వెళ్తే స్నేహితులు. వారితో కలిసి ఆటలు ఆడుకునే వాళ్లం. స్కూల్‌కు సెలవొస్తే సిర్రగోనె, లింగోచ్ ఆడిన తర్వాత ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లేవాడిని. స్కూల్లో పోటీలు పెడితే ఆ రోజంతా పండగలా అనిపించేది. సాయంత్రం 6 గంటల వరకు టీవీ చూడనిచ్చేవారు కాదు. నవోదయ గురుకులానికి వెళ్లిన తర్వాత వారానికి రెండు సార్లు తెలుగు సినిమాలు చూపించేవారు. ఇప్పటి పిల్లలు క్రమశిక్షణతో కూడిన ఎంజాయ్ చేస్తూనే.. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. – రాజమహేంద్ర నాయక్, డీసీపీ, జనగామ●ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశా..ఆంధ్రలోని ఒంగోలులోనే పాఠశాల చదువులు పూర్తి చేసుకున్నా. ఉమ్మడి కుటుంబం కావడంతో ఎక్కువగా ఇంట్లో గడిపేటోళ్లం. ఇంటి పక్కనే స్కూల్ కావడంతో ఒకరోజు కూడా సమయం తప్పలేదు. సాయంత్రం ఇంటికి రాగానే గంటసేపు ట్యూషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత, బుక్స్ పక్కన పడేసి, రాత్రి వరకు ఫ్రెండ్స్‌తో క్రికెట్, అనేక రకాల ఆటలతో ఎంజాయ్ చేశా. రోజులో టీవీ గంట సేపు కూడా చూసేటోళ్లం కాదు. బాలల దినోత్సవం రోజు బడిలో పోటీలు నిర్వహించి, బహుమతులు వస్తే ఆ రోజంతా సంతోషమే. నేటితరం యువత, పిల్లలు కష్టపడి చదువుకుని, తల్లిందండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. – షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్, జనగామ● -
సాహసమే శ్వాసగా..
కేసముద్రం: వ్యవసాయ బావిలో కారు పడిన ప్రమాదంలో ఇద్దరు బాలురు సాహసం చేశారు. ముగ్గురి ప్రాణాలను కాపాడారు. 2022లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించి ఆ సాహస బాలురను అభినందనలతో ముంచెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోతు భద్రునాయక్, హచ్చాలి దంపతులు, కుమార్తె సుమలత, మనవడు దీక్షిత్‌తో కలిసి 2022 అక్టోబర్ 28న తన బావమరిది బిక్కుతో కలిసి కారులో అన్నారం షరీఫ్‌కు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కేసముద్రం మీదుగా మహబూబాబాద్ వైపునకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు కేసముద్రంస్టేషన్ బైపాస్ రోడ్డులో ఉన్న వ్యవసాయబావిలో పడింది. అదే సమయంలో మూత్రవిసర్జన కోసం పాఠశాల నుంచి బయటకు వచ్చిన సిద్ధు, రంజిత్ తమ ప్రాణాలకు తెగించి బావిలో దూకారు. కారు అద్దాలు పగులగొట్టి సుమలత, ఆమె కుమారుడు దీక్షిత్, డ్రైవర్ బిక్కును కాపాడారు. అప్పటికే కారు మునిగిపోవడంతో మిగిలిన నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎంతో సాహసం చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన సిద్ధు, రంజిత్‌లను అప్పటి కలెక్టర్‌తోపాటు గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు.