Jewellery
-
మేలిమి బంగారం మళ్లీ రూ.78వేలు! ఎంత ఎగిసిందంటే..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల క్రితం రోజున స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 30) అంతే స్థాయిలో పుంజుకున్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.160 ఎగిసి రూ.78,150 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.160 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.78,000 లుగా ఉన్నాయి.మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.99,900 వద్ద, ఢిల్లీలో రూ.92,400 వద్ద ఉన్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మరింత పెరిగిన బంగారం.. 10 గ్రాముల ధర ఇప్పుడు..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 26) వరుసగా రెండో రోజు మరింత ఎగిశాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,730 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.280 చొప్పున పెరిగాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగి రూ.71,400 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.280 ఎగిసి రూ.77,880 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.250, 24 క్యారెట్ల బంగారం రూ.280 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,250, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,730 లుగా ఉన్నాయి.మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు మరోసారి పెరిగాయి. కేజీకి రూ.1000 చొప్పున పెరగడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్దకు, ఢిల్లీలో రూ.92,500 వద్దకు చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఆటలోనే కాదు..ఫ్యాషన్‌లోనూ ట్రెండ్ సెట్ చేసిన పీవీ సింధు
పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ,రెండుసార్లు ఒలింపియన్ పీవీ సింధు వివాహ వేడుక అంగరంగ వైభంగా ముగిసింది. పెళ్లి కూతురులుక్లో ముగ్ధమనోహరంగా అందర్నీ మెస్మరైజ్ చేసింది.హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో ఆదివారం, (డిసెంబర్ 22,2024న) ఉదయపూర్‌లో వివాహం చేసుకుంది పీవీ సిందు. ఈ సందర్భంగా సింధు డిజైనర్ సారీ, పెళ్లి కూతురి ముసుగు, వరుడు బ్రోకేడ్ షేర్వాని ఇలా ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఒక్కో వేడుకకు, ఒక్కో డిజైనర్ రూపొందించిన ఫ్యాషన్ ఔట్‌ఫిట్స్‌తో తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్త పడింది పీవీ సింధు. ముఖ్యంగా వధూవరుల మ్యాచింగ్ ఆభరణాలు కొత్త ట్రెండ్‌కు అద్దం పట్టాయి. ఫ్యాషన్ అభిమానులు, ముఖ్యంగా కాబోయే వధువుల మనసు దోచేశాయి. ఆటలోనూ కాదు, ఫ్యాషన్‌లోనూ ట్రెండ్ చేసిందంటూ మురిసిపోతున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Manish Malhotra High Jewellery (@manishmalhotrajewellery)పీవీ సింధు, సాయి మ్యాచింగ్ ఆభరణాలుప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా జ్యువెలరీ కలెక్షన్లోని పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ధరించగా, వరుడు దత్త సాయి ఆభరణాలు అందరి దృష్టినీ కట్టిపడేశాయి. సింధు జాంబియన్ పచ్చలు పొదిగిన మల్టీ-లేయర్డ్ నెక్లెస్,పట్టీ, మ్యాచింగ్ చెవిపోగులు ధరిస్తే, వరుడు డబుల్ లేయర్ నెక్లోస్ ధరించాడు. ఇంకా వజ్రాలు పొదిగిన కడియాలు, బంగారు గొలుసు సింధు బ్రైడల్ లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. కాబోయే వధూవరులకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశారు అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు, -
బందరు బంగారు తీగ
అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్‌గోల్డ్ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్‌తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్‌లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్‌కి తగ్గ డిజైన్స్‌తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. జీవం పోసిన వైఎస్సాఆర్వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ్ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్ఈలో దీన్నో క్లస్టర్‌గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్‌గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సబ్సిడీపై విద్యుత్‌ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.దేశవిదేశాలకు బందరు బంగారు తీగమామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్ జ్యూల్రీ పార్క్ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్‌గోల్డ్ నగలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్ కంట్రీస్కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్ హబ్ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.నాణ్యతకూ మారుపేరుమచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్‌కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సంఘంవారసత్వాన్ని కాపాడ్డానికి..ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం. -
ల్యాబ్‌లో తయారైన డైమండ్ అచ్చమైన వజ్రమేనా?!
ఆభరణాల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ హవా మొదలైంది. ఆభరణాల్లో పొదగడం మొదలైన తర్వాత వీటి గురించి తెలుస్తోంది. కానీ నిజానికి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారీ 1950లలోనే మొదలైంది. అప్పట్లో పారిశ్రామిక అవసరాలకు, డెంటల్ ట్రీట్మెంట్, ఎయిర్΄ోర్ట్ రన్వేలలో ఉపయోగించేవారు. వజ్రానికి ఉన్న గట్టిదనం దృష్ట్యా వీటిని ఉపయోగించేవారు. అప్పటి వరకు డైమండ్ అంటే మనకు తెలిసింది ఆభరణాల్లో వాడే మైన్డ్ డైమండ్స్ గురించి మాత్రమే. ఇవి భూమిలోపలి పొరల్లో కార్బన్, వాయువుల ఒత్తిడితో వేల సంవత్సరాలకు వజ్రం రూపం సంతరించుకున్నాయి. అదే కంపోజిషన్‌లో అదే వాతావరణ పరిస్థితులను లాబొరేటరీలో కల్పించినప్పుడు డైమండ్ ఓర్ పూర్తిస్థాయి వజ్రంగా రూపొందుతుంది. అంటే భూమి పొరల్లో వందల ఏళ్లకు జరిగే ప్రక్రియ లాబొరేటరీలో కొద్ది వారాల్లో పూర్తవుతుంది. వజ్రాల రాశిలో నుంచి ల్యాబ్ డైమండ్‌ని, మైన్డ్ డైమండ్‌ని వేరు చేయడం సాధ్యం కాని పని. థర్మల్ కండక్టివిటీ పెన్ టెస్ట్ ద్వారా కూడా వర్గీకరించలేం. అడ్వాన్స్డ్ యూవీ కార్బన్ డాటింగ్ టెస్ట్ ద్వారా వజ్రం వయసును కనుక్కోవడం మాత్రం సాధ్యమవుతుంది. క్లారిటీ వర్గీకరణ, కలర్ గ్రేడింగ్, సర్టిఫికేషన్‌లో రెండింటికీ ఒకే ప్రమాణాలు పాటిస్తారు. ఇప్పుడు ల్యాబ్ డైమండ్స్‌లో పోల్కీలు కూడా వస్తున్నాయి. సాధారణంగా అయోమయానికి గురి చేసేవి అమెరికన్ డైమండ్స్ మాత్రమే. ఆ పేరుతో దొరికేవి సీజెడ్స్. అంటే క్యూబిక్ జెరకాన్స్. సాంకేతిక నామం సీజెడ్స్ అయితే వాటిని మార్కెట్లోకి తెచ్చిన బ్రాండ్ పేరు అమెరికన్ డైమండ్స్. ఇప్పుడు లభిస్తున్న మోజనైట్స్ కూడా దాదాపు అలాంటివే. వాటిని సిమిలెంట్స్, సింథటిక్స్ పేర్లతో వ్యవహరిస్తారు. ధరించడం, భద్రపరచడం విషయంలో ల్యాబ్ డైమండ్స్ పొదిగిన ఆభరణాలకు కూడా మైన్డ్ డైమండ్స్ ఆభరణాలకు పాటించిన నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చే ప్రధానమైన సందేహం రీసేల్ వాల్యూ గురించి. ల్యాబ్ డైమండ్స్‌కి కూడా నూటికి నూరుశాతం ఎక్సేంజ్ వాల్యూ, 80 శాతం రీసేల్ వాల్యూ ఉంటుంది.– విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్ -
గుడ్ న్యూస్.. పసిడి ధరల్లో తగ్గుదల
Gold Price Today: దేశంలో పసిడి ప్రియులకు శుభవార్త. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు (డిసెంబర్ 18) మళ్లీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.78 వేల దిగువకు వచ్చేసింది.తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,840 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున తగ్గాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.71,500 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.160 క్షీణించి రూ.77,990 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,350, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,840 లుగా ఉన్నాయి.మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు మరోసారి నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం.. అంతలోనే ఆశాభంగం!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖంలో పయనిస్తున్నాయి. రెండు రోజులు వరుస భారీ తగ్గుదల తర్వాత రెండురోజులు ఎలాంటి పెరుగుదల లేకుండా నిలకడగా కొనసాగాయి. అంతలోనే ఆశాభంగం.. దేశవ్యాప్తంగా మంగళవారం (డిసెంబర్ 17) పసిడి రేట్లు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి.రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున పెరిగాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 ఎగిసి రూ.78,150 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.100, 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.78,000 లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) మూడో రోజు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
100 ఆలయాల్లో.. 300 కిలోల ఆభరణాల చోరీ
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల గుట్టు రట్టయింది. 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడిన ఈ దొంగల ముఠా 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి వచి్చన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దొంగల ముఠా ఒంగోలు జైల్లో ఉండగా.. వారి నుంచి వెండి ఆభరణాలు కొనుగోలు చేసి చెన్నైలో విక్రయించేందుకు వెళుతున్న వ్యక్తిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పూర్తి సమాచారం బయటపడింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవర సిపన్య, సవర బోగే‹Ù, మెదక్ జిల్లాకు చెందిన బత్తిని శ్రీకాంత్‌లు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ, బి.నిడమానురు గ్రామాల్లోని రఘునాయక స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయాల్లో జరిగిన దొంగతనాల్లో నిందితులు. ఈ ముగ్గురు.. సవర సూర్య, కాకుమాని శ్రీనివాసరావులతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవారు. చోరీ చేశాక దేవాలయాల్లోని సీసీ కెమెరాల డీవీఆర్‌లను కూడా తీసుకెళ్లేవారు. దొంగలించిన ఆభరణాలను శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు చెందిన కాకినాడ కృష్ణారావుకు విక్రయించి అతడు ఇచి్చన డబ్బులతో జల్సాలు చేసుకునేవారు.ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో నాగులుప్పలపాడు మండలం చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయంలో వెండి ఆభరణాలను, సీసీ కెమెరా డీవీఆర్‌ను దొంగిలించారు. తిరిగి ఆగస్టులో నాగులప్పలపాడు మండలం బి.నిడమానూరులోని సాయిబాబా ఆలయంలో వెండి వస్తువులను దొంగిలించారు. పోలీసులు గాలిస్తుండగా అమలాపురం పోలీసులకు చిక్కారు. అక్కడ నుంచి ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకుని స్పెషల్ జేఎఫ్‌సీఎం ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం జిల్లా కారాగారంలో ఉన్నారు. చోరీ చేసిన సొత్తును కాకినాడ కృష్ణారావుకు విక్రయించినట్టు తెలపడంతో ఒంగోలు పోలీసులు అతడిపై నిఘా పెట్టారు.చెన్నైలో వెండి ఆభరణాలను విక్రయించేందుకు శ్రీకాకుళం నుంచి చెన్నై సెంట్రల్ రైల్లో వెళుతున్న కృష్ణారావును సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు ఆలయాల్లో దొంగిలించిన రూ.15.50 లక్షల విలువైన వెండి, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు రాష్ట్ర వ్యాప్తంగా 100 దేవాలయాల్లో చోరీ చేసిన 300 కేజీల వెండి ఆభరణాలను కూడా తనకు విక్రయించినట్టు కృష్ణారావు వెల్లడించారు. -
బంగారం మళ్లీ తగ్గిందా.. తులం ఎంత?
Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖంలో పయనిస్తున్నాయి. రెండు రోజులు వరుస భారీ తగ్గుదల తర్వాత రెండురోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం (డిసెంబర్ 16) పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఐదు రోజులుగా పుత్తడి ధరలు పెరగకపోవడంతో పసిడి ప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 వద్ద ఉన్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద కొనఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,400, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,890 లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారమే.. ఆనందమే..!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా దిగివచ్చాయి. వరుసగా రెండో రోజూ గణనీయంగా క్షీణించాయి. దేశవ్యాప్తంగా శనివారం (డిసెంబర్ 14) పసిడి భారీగా తగ్గాయి. రెండు రోజుల్లో బంగారం 10 గ్రాములకు రూ.1500 పైగా పతనం కావడంతో కొనుగోలుకు ఇదే మంచి తరుణమని పసిడి ప్రియులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలలో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.900, రూ.980 చొప్పున పడిపోయాయి.ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.900, రూ.980 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.900 తగ్గి రూ.71,400 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.77,890 వద్దకు వచ్చాయి.ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లువెండి కూడా..దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.92,500 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పగడాలను ఎలా భద్రపర్చాలి? అసలు, నకిలీ ఎలా గుర్తించాలి?
జాతిరత్నాల్లో రాణిగా ముత్యాన్ని చెబుతారు. పగడాన్ని అందమైన రత్నంగా వ్యవహరిస్తారు. ఇది కూడా ముత్యంలాగానే సముద్రంలోనే ఆవిర్భవిస్తుంది. అయితే ముత్యాన్ని సముద్రంలో తయారయ్యే పద్ధతిలోనే బయట కూడా కల్చర్ చేయవచ్చు. పగడానికి అలాంటి అవకాశం లేదు. అందుబాటులో ఉన్న పగడాల్లో కొన్ని అసలైనవి, కొన్ని నకిలీవి. ఇందులో కల్చర్డ్ కోరల్ అనేది ఇంత వరకు లేదు. సముద్రపు మొక్క నుంచి పగడం తయారవుతుంది. పగడంలో ఎరుపు, గులాబీరంగు, ఆరెంజ్, బ్రౌన్‌తో పాటు వైట్, ఎల్లో, గ్రీన్, పర్పుల్, బ్లాక్ కోరల్స్ కూడా ఉంటాయి. పగడం అసలుదా నకిలీదా అని తెలుసుకోవడానికి టర్మరిక్ టెస్ట్ సులువైన పద్ధతి. పగడం మీద పసుపు కొమ్ముతో రుద్దాలి. అప్పుడు పగడం మీదున్న ఎరుపు రంగు పగడాన్ని వదిలి పసుపు కొమ్ముకి రంగు అంటితే అది నకిలీ పగడం. అసలు పగడం మీద పసుపు కొమ్ముతో ఎంత రుద్దినా పగడం రంగు వదలదు, పసుపు కొమ్ముకి రంగు అంటదు. స్వచ్ఛమైన పగడాన్ని ధరిస్తే అది మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతతనిస్తుంది. ఆధ్యాత్మిక చింతనకు దోహదం చేస్తుంది. డిప్రెషన్, స్ట్రెస్, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.పగడం చెట్టు నుంచి ఆవిర్భవించినది కాబట్టి ప్రాణం ఉన్న వస్తువులాగానే దీనికి గాలి అందుతుండాలి. ముత్యాలు, పగడాలను సుదీర్ఘకాలం గాలి అందని అలమారల్లో పెట్టరాదు. ముత్యాలు, పగడాల ఆభరణాలను ధరించడం వాటి మన్నిక కోసమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యం కోసం కూడా. సాధారణ పగడాల వరుస అయితే భద్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. బంగారంలో పొదిగిన ఆభరణాల విషయంలో ఆభరణం నుంచి రాలిపోకుండా ఉండడానికి మెత్తటి కుషన్ ఉన్న బాక్సుల్లో పెట్టాలి. నగధగలుపగడాలేం చెబుతున్నాయి – జియా నస్రీన్, జెమాలజిస్ట్ -
శోభిత మంగళస్నాన వేడుక.. ఆభరణాలకు ప్రత్యేక సెంటిమెంట్!
మరో మూడు రోజుల్లో అక్కినేనివారి కోడలు కానుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇప్పటికే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. అయితే శోభిత ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాత వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులను పాటించారు.శనివారం జరిగిన మంగళస్నానం వేడుకల్లో శోభితా ధూళిపాళ్ల తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలను ధరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రాత వేడుకలో తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించింది. ఈ వేడుకలో పసుపుతో స్నానం చేయించడం మన తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యమైన వేడుక. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలో ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం పెళ్లికి ముందు వధువును శుద్ధి చేసి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.అన్నపూర్ణ స్టూడియోస్ పెళ్లి వేడుకనాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు మండపంలో వీరిద్దరు ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న చైతన్య, శోభితల వివాహం జరగనుంది. -
అసలైన ముత్యాలను గుర్తించండి : ఇలా భద్రపర్చుకోండి!
ముత్యాల పేరుతో మనకు మార్కెట్లో దొరికేవి మూడు రకాలు. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్, ఇమిటేషన్ పెరల్స్. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్ రెండూ ఆయెస్టర్లోనే తయారవుతాయి. ఇమిటేషన్ పెర్ల్ అంటే గాజు పూస లేదా ప్లాస్టిక్ పూస మీద ముత్యంలా కనిపించడానికి కోటింగ్ వేసినవి. ఇవి మన్నిక ఉండవు. ఫ్యాన్సీగా ధరించాలనే సరదాతో వాటిని కొనుక్కోవచ్చు. కానీ ముత్యాలని భ్రమ పడవద్దు. ప్రాచీన కాలంలో నాచురల్‌గా వాటంతట అవి ఉత్పత్తి అయ్యే ముత్యాలే మనకు తెలుసు. సముద్రంలో ఉండే ఆయెస్టర్ (ముత్యపు చిప్ప) లోపల ఇసుక రేణువు కానీ మరేదైనా ఫారిన్‌బాడీ చేరినప్పుడు, దాని చుట్టూ క్యాల్షియం పొరలను కోటింగ్‌గా ఏర్పరుచుకుంటుంది ముత్యపుచిప్ప. అలాంటి ముత్యాల లభ్యత చాలా తక్కువ. ఒక నెక్లెస్‌కు అవసరమైన ముత్యాలను సేకరించడం కూడా ప్రాచీన కాలంలో చాలా పెద్ద పని అయ్యేది. గడచిన కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ముత్యపు చిప్పలను సేకరించి నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ముత్యపు చిప్ప అంటే ఒక ప్రాణి. ముత్యపుచిప్పలోపల చిన్న బీడ్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇక ఆ బీడ్ చుట్టూ క్యాల్షియం పొరలను ఏర్పరుచుకుంటుంది ఆ ప్రాణి. బీడ్ షేప్‌ను బట్టి ముత్యం ఆకారం ఉంటుంది. ఇలా తయారు చేయడం మొదలైన తర్వాత ముత్యాలు విరివిగా లభిస్తున్నాయి. కల్చర్డ్ పెరల్స్ కూడా నిజమైన ముత్యాలేనని గమనించాలి. ఎక్స్ రే ద్వారా పరీక్షించి నిజమైన ముత్యాన్ని గుర్తించాలి. ఇక ముత్యం రంగు ఆయెస్టర్ జీవించిన నీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. చల్లటి నీరు, ఒక మోస్తరు వెచ్చటి నీరుని బట్టి రంగు మారుతుంది. అలాగే ఆస్ట్రేలియాలో దొరికే ముత్యాలను సౌత్ సీ పెరల్స్ అంటారు. జూన్ నుంచి వచ్చిన వాటిని ఫ్రెష్ వాటర్ పెరల్స్ అంటారు. ముత్యాలకు గాలి తగలాలి. కాబట్టి ముత్యాల దండలను జిప్‌లాక్ కవర్లలో భద్రపరచరాదు. కుషన్ బాక్సులు లేదా వెల్వెట్ బాక్సుల్లో పెట్టాలి. గాలి ధారాళంగా అందడం కోసం కనీసం నెలకోసారయినా బీరువా లో నుంచి బయటకు తీస్తుండాలి. ముత్యాల ఆభరణాలను ధరించకపోతే పాడవుతాయనే మాట అందుకే చెబుతారు. --విశేషిణి రెడ్డి, జిఐఏ జెమాలజిస్ట్ -
హైదరాబాద్ : జ్యూయల్స్ ఎక్స్పో నగరంలో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
ఆభరణాల ఎగుమతులకు కొత్త ప్రమాణాలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్పుట్–అవుట్‌పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది. కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్ ఆభరణాలకు 4 శాతం, మెషిన్‌పై చేసిన స్టడెడ్ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి. -
MH: కారులో 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, నగలు సీజ్
ముంబై: మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్రం అంతా తనిఖీలు చేపట్టారు. అహల్యానగర్ జిల్లాలోని టోల్ ప్లాజా సమీపంలో ఎన్నికల సంఘానికి చెందిన స్టాటిక్ సర్వియలెన్స్ బృందం గురువారం ఓ కారులో సోదాలు చేపట్టింది. కారులో ఉన్న విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. కారులోని సుమారు 24 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కారులో ముగ్గురు ప్రయాణికులు ఉండగా.. వారు చూపించిన రసీదులకు బంగారు అభరణాలకు విలువ సరిపోకపోవడంతో వాటిని సీజ్ చేశారు. తదుపరి విచారణ కోస ఆదాయపు పన్నుశాఖకు బదిలీ చేశారు. కారులో వజ్రాలు, బంగారం, సిల్వర్ జ్యూవెలరీకి చెందిన కన్సైన్మెంట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. దక్షిణ ముంబైలోని జావేరి బజార్ నుంచి ఆ వాహనం స్టార్ట్ అయినట్లు సుపా పోలీసు అధికారి అరుణ్ అవద్ తెలిపారు. ఆభరణాలకు చెందిన రశీదు చూపించాలని కోరగా, కొన్ని రశీదులను చూపించారని, కానీ ఆ రశీదుల్లో ఉన్న అమౌంట్లో తేడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల గురించి ఆదాయపన్ను శాఖకు ఎస్ఎస్టీ పోలీసులు సమాచారం చేరవేశారు. ఛత్రపతి సాంబాజినగర్, అహల్యనగర్, జల్గావ్ జిల్లాల్లో ఆ ఆభరణాలను డెలివరీ చేయాల్సి ఉందన్నారు.అయితే, విలువైన వస్తువుల రవాణాకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా తెలిపారు. పోలీసులు ఆభరణాలు డిపాజిట్ చేసే ముందు నగల వ్యాపారులను పిలిచి ఉండాలని పేర్కొన్నారు. -
బంగారు ఆభరణాలే ఎక్కువ..
భారతీయులు బంగారు ప్రియులు. బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో కూడా అత్యధికంగా వాడేది మనమే. అలాగని మనదగ్గరే ప్రపంచంలోకెల్లా ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయనుకుంటే పొరపాటే.ఈ విషయంలో పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం అక్కడ 8133 టన్నుల నిల్వలు ఉన్నాయి. ఆ తరవాతి స్థానాల్లో ఉన్న మూడు దేశాలు.. జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్. ఈదేశాల్లోని మొత్తం నిల్వలతో సమానంగా అమెరికా దగ్గర ఉండటం విశేషం. ఈ విషయంలో మనది 8వ స్థానం. 2023 చివరినాటికి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం ఏయే రూపాల్లో ఎక్కడ ఉందంటే.. -
రిలయన్స్ జ్యువెల్స్ 'వివాహం కలెక్షన్': భారీ తగ్గింపులు కూడా..
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్‌లో ఒకటైన 'రిలయన్స్ జ్యువెల్స్' రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం రెండూ కలబోసిన వినూత్న వివాహ ఆభరణాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కు పుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.ఈ వివాహం కలెక్షన్లో.. బంగారం, వజ్రాలతో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ వధువును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి.వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో వివాహాలు సంస్కృతికి నిదర్శనం. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్లోని ప్రతి సెట్ నిలుస్తూ.. నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్‌ను అందిపుచ్చుకుంటాయి. ఇవన్నీ కేవలం పెళ్లి రోజున ధరించేవి మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.రిలయన్స్ జువెల్స్ 2024 నవంబర్ 11 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ వ్యాల్యూ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆభరాలు దేశంలోని 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
జ్యువెలరీ షోరూంలో రూ.6 కోట్లు నగలు చోరీ
-
నగలు ధరించాక పెర్ఫ్యూమ్లు వేసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
అందమైన ఆభరణాలను ఎక్కవ డబ్బు పెట్టి కొనుక్కుంటాం. వాటిని ధరించి ఆనందిస్తాం. కానీ ఆభరణాలను కలకాలం అందంగా ఉంచుకోవడం కూడా తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఆభరణాలు కాంతిహీనమవుతాయి. ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆభరణాలు ధరించిన తర్వాత ఒంటికి లోషన్లు– సన్స్క్రీన్లు రాయడం, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కాస్మటిక్స్లోని రసాయనాలు ఆభరణాల లోహాల మధ్య రసాయన చర్యకు కారణమవుతుంది. ఆభరణాలు మెరుపు తగ్గడం, రంగుమారడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి ఒంటికి క్రీములు, పెర్ఫ్యూమ్లు వేసుకోవడం పూర్తయిన తర్వాత మాత్రమే ఆభరణాలను ధరించాలి. ఆభరణాలను ధరించిన తర్వాత తీసి బీరువాలో దాచేటప్పుడు నేరుగా డబ్బాలో పెట్టడం మంచిది కాదు. ఒంటి మీద నుంచి తీసిన తరవాత కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత నూలువస్త్రంతో తుడవాలి. శుభ్రమైన మెత్తని నూలు వస్త్రంలో చుట్టి డబ్బాలో పెట్టాలి.ఆభరణాలను శుభ్రం చేయడానికి రసాయనాలను వాడరాదు. ఇలా చేస్తే బంగారు ఆభరణాల మెరుపు పోవడంతోపాటు ఆభరణం రంగుమారుతుంది. ఆభరణం రంగు మారిన వెంటనే ఇది కచ్చితమైన బంగారేనా అనే అనుమానం వస్తుంది. ఆభరణం తయారీలో బంగారంలో కొన్ని ఇతర లోహాలను కలుపుతారు. అవి రసాయనాల కారణంగా రంగుమారుతాయి. ఆభరణాలను మెత్తని వస్త్రంతో మృదువుగా తుడవాలి.నిద్రపోయేటప్పుడు ఆభరణాలను ధరించరాదు. బంగారు మెత్తని లోహం. సున్నితమైన పనితనంతో లోహంలో రాళ్లు, వజ్రాలను పొదుగుతారు. నిద్రలో ఒత్తిడికి గురై రాళ్లు ఊడి΄ోయే ప్రమాదం ఉంది. రాలి పడిన రాళ్లను తిరిగిపొందగడం కష్టం. తిరిగి అమర్చినప్పటికీ అతుకు తెలిసి΄ోతుంది. ఆభరణానికి స్వతహాగా ఉండే అందం పోతుంది.రెండు వేర్వేరు లోహాలను ఒకచోట ఉంచరాదు. అంటే బంగారు, వెండి ఆభరణాలను ఒకే డబ్బాలో పెట్టకూడదు. విడిగా భద్రపరచాలి. అలాగే రెండు ఆభరణాలను కూడా ఒకే పెట్టెలో పెట్టరాదు. ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి, మెరుపు కూడా తగ్గుతుంది. – రీటా షాకన్సల్టెంట్ అండ్ జ్యూయలరీ డిజైనర్, హైదరాబాద్ -
కొంపముంచిన వడాపావ్.. వీడియో వైరల్
పుణె: పూణెలో జరిగిన పట్టపగలు దోపిడీలో వృద్ధ దంపతులు రూ. 5 లక్షల విలువైన నగలను పోగొట్టుకున్నారు. భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణంలో వడాపావ్ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్‌ను రోడ్డు పక్కన నిలిపారు. ఆ వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా, ఆ మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత, బైక్‌పై ముఖానికి మాస్క్‌తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు, రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడుదానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన ఆ మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది.ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.In Pune, a couple’s gold jewellery valued at ₹4.95 lakh was stolen while they paused to buy vada pav after retrieving it from a bank. The theft occurred on Thursday outside Rohit Vadewale's shop in ShewalewadiReported by: Laxman MoreVideo Editor: Dhiraj Powar#PuneTheft… pic.twitter.com/JfXj1uuiU7— Pune Mirror (@ThePuneMirror) August 30, 2024 -
తారల తలుక్కు..మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్‌ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్‌మార్క్ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్‌సీజన్‌లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్‌మార్క్ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్ మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్ మిషన్లతో ‘పంచ్’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్ మిషన్‌లో పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్ మిషన్లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్–రే ఫ్లోరోసెన్స్ మిషన్ (కంప్యూటర్ అనుసంధాన యంత్రాల టంచ్ మిష¯Œన్)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్‌పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్ గ్రామ్వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్ గ్రామ్ గోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్ స్వచ్ఛత24 క్యారెట్ 99.923 క్యారెట్ 95.822 క్యారెట్ 91.621 క్యారెట్ 87.518 క్యారెట్ 75.014 క్యారెట్ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్ మిషన్ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.– భాస్కర్ కూచన, రిటైర్డ్ అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, హైదరాబాద్ -
మనీష్ మల్హోత్రా : కళ్లు చెదిరే అల్టిమేట్ జ్యుయల్లరీ! (ఫొటోలు)