Kakatiya Medical College
-
వరంగల్ కేఎంసీలో డ్యాన్స్.. జోష్ (ఫొటోలు)
-
ప్రీతి కేసు.. సైఫ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత!
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి(26) సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ పై సస్పెన్సన్‌ను ఎత్తేశారు. హైకోర్టు ఆదేశంతో సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ ప్రకటించారు. దీంతో.. తరగతులకు హాజరు అయ్యేందుకు సైఫ్‌కు అనుమతి లభించినట్లయ్యింది. డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే.. ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 22 న ఎంజీఎంలో ఆమె ఆత్మహత్యా యత్నం చేయగా.. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ 26వ తేదీన కన్నుమూసింది. మరోవైపు ప్రీతి మృతికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ఆమె పేరెంట్స్.. పోలీసులకు, కళాశాల ప్రిన్సిపల్ కు పిర్యాదు చేశారు. ర్యాగింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద కేసు నమోదు చేసి సైఫ్ ను రిమాండ్ తరలించిన పోలీసులు. మరోవైపు కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ కేసు తీవ్రంగా పరిగణించింది. ఏడాదిపాటు సైఫ్ తరగతులకు హాజరు కాకుండా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో.. బెయిల్‌పై సైఫ్ ఈ విడుదల అయ్యాడు కూడా. అయితే.. తన నుంచి వివరణ తీసుకోకుండానే కాలేజీ తనపై సస్పెన్షన్ వేటు వేసిందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు సైఫ్. ఈ క్రమంలోనే.. సైఫ్ వివరణ తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. అయితే.. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని గత శుక్రవారం సైఫ్ కు నోటీస్ ఇచ్చారు కేఎంసీ ప్రిన్సిపాల్. కానీ, ఆ సమావేశానికి సైఫ్ హాజరు కాలేదు. దీంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపాల్. అయితే.. ప్రస్తుతానికి సస్పెన్షన్ ను తాత్కాలికంగా నిలిపివేసి సైఫ్‌ను తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత అతని వివరణ తీసుకోవాలని.. ఆపై యాంటీ ర్యాగింగ్ కమిటీదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఆదేశాల మేరకు సైఫ్ సస్పెన్సన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కేఎంసీ ప్రిన్సిపాల్. -
కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు
సాక్షి, వరంగల్: సీనియర్ ర్యాగింగ్, భరించలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మరువక ముందే.. కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ప్రకటించారు. ఏడాదిపాటు హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాటు మూడు నెలలపాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. మరో 20 మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీన కేఎంసీ హాస్టల్లో ఓ జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడి దాడి చేసి గాయపర్చారు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ర్యాగింగ్ యాక్ట్ తోపాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు అయింది. ర్యాగింగ్ పై కేఎంసీ లో ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై.. ఆరుగంటల పాటు చర్చించింది. ర్యాగింగ్ నిర్ధారణ కావడంతో.. పాల్పడిన వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కమిటీ. అయితే.. కేఎంసీలో ర్యాగింగ్ జరగడం ఇదే తొలిసారని ప్రిన్సిపల్ అంటున్నారు. ప్రీతి ఘటన డిపార్ట్మెంట్ లో జరిగిందని, ప్రస్తుతం హాస్టల్ లో జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన తీసుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. మొదటి తప్పుగా భావిస్తు మూడు నెలలు సస్పెండ్ చేయడంతో పాటు ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే.. హాస్టల్ లో బర్త్ డే పార్టీలు నిషేధించామన్నారు. దాడికి పాల్పడ్డ 7గురి పై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారి విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. -
వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్!
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్‌కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్‌పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్‌కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్‌ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
మరోసారి తెరపైకి ప్రీతి కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ అలీ వాదన వినాలని కాకతీయ మె డికల్ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ధరావత్ ప్రీతి ఎండీ అనస్థీషియా విద్యార్ధినిగా 2022లో చేరింది. రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ఆమెను ర్యాగింగ్ చేస్తూ వేధింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21న సైఫ్ తన స్నేహితులతో కలసి ప్రీతికి విషపూరిత ఇంజక్షన్ ఇచ్చారు. చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది. దీనికి కారకులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలి’అని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా సైఫ్‌ను అధికారులు అరెస్టు చే యడమే కాకుండా సస్పెండ్ చేశారు. అయితే తన వాదనలు కూడా వినకుండా సస్పెండ్ చేశారని సైఫ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సస్పెన్షన్ కొట్టివేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. సైఫ్ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. -
వరంగల్ కేఎంసీలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం?
సాక్షి, వరంగల్: వరంగల్ కేఎంసీలో అస్వస్థతకు గురైన మెడికో స్టూడెంట్ లాస్య ఘటన తీవ్ర కలకలం రేపింది. మాత్రలు వేసుకొని అనారోగ్యానికి గురి కావడంతో సూసైడ్‌కు యత్నించిందని వదంతులు వ్యాపించాయి. మెడికో ప్రీతి సూసైడ్ ఘటన మరువకముందే మరో మెడికో అస్వస్థతకు గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెడియాట్రిక్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న లాస్య మైగ్రేన్ కారణంతో మెటాప్రోనాల్ మాత్రలు వేసుకుంది. మైగ్రేన్ కంట్రోల్ కాకపోవడంతో మరో టాబ్లెట్ వేసుకోగా ఓవర్‌డోస్ తో అనారోగ్యానికి గురైంది. మరో మెడికో అస్వస్థతకు గురై ఎంజీఎం లో చికిత్స పొందుతోందని తెలియగానే వైద్యవర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రస్తుతం మెడికో లాస్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం సూపరిందెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఆత్మహత్యాయత్నం ఘటన జరగలేదని, అనారోగ్యం కారణంతోనే ఎంజిఎంలో ప్రథమ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా లాస్య హెల్త్ కండిషన్ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న లాస్య పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చామని అన్నారు. మరోవైపు అనారోగ్యానికి గురైన లాస్య స్పందిస్తూ మైగ్రేన్ కారణంగానే మాత్రలు వేసుకోవడంతో ఓవర్‌డోస్ అయిందని, ఇతర కారణాలు ఏవీ లేవన్నారు. తన అనారోగ్య సమస్యను అనవసరంగా ఇష్యూ చేయొద్దని కోరారు. ఏదేమైనా మెడికో స్టూడెంట్ అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స తీసుకోవడం కేఎంసీ వర్గాల్లో కలకలం రేపింది. ప్రీతి ఘటన మరువకముందే మరో విద్యార్థి అనారోగ్యానికి గురికావడంతో కేఎంసీలో ఏదో జరిగిందని ప్రచారం మొదలైంది. మొత్తానికి లాస్య ఈ ఘటనపై స్పందిస్తూ తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదని, స్వల్ప అస్వస్థతకు గురయ్యానని చెప్పడంతో కేఎంసీ యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
ప్రీతి కేసు నిందితుడు సైఫ్ ఏడాదిపాటు సస్పెండ్
సాక్షి, వరంగల్: వరంగల్‌లో కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ను కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సైఫ్ ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. సైఫ్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీలో పీజీ సెకండియర్ స్టూడెంట్. కులం తక్కువ అంటూ హేళన చేస్తూ మానసికంగా వేధించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఎంజీఎంలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్‌లో చికిత్స పొందుతూ 26న మృతి చెందింది. సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫారసుల మేరకు సైఫ్‌ను గత మార్చి 4 నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సంవత్సర కాలంలో సైఫ్‌కు అకడమిక్స్, థియరీ ప్రాక్టికల్ క్లాసులు, లైబ్రరీ, హాస్టల్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ -
కాకతీయ మెడికల్ కాలేజీలో రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు
ఎంజీఎం: వరంగల్ నగరంలోని కాకతీయ ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ) మరో మైలురాయిని అధిగమించింది. 15 రోజుల క్రితం రీజినల్ శిక్షణ కేంద్రం ప్రారంభానికి అనుమతులు రాగా, వారంరోజుల క్రితం సూపర్ స్పెషాలిటీ సీట్లు సాధించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా రీసెర్చ్ యూనిట్ ప్రారంభానికి కేంద్రంనుంచి అనుమతులు వచ్చా యి. పదిహేను రోజుల వ్యవధిలో మూడు ప్రత్యేకతలను సాధించుకోవడంతో కేఎంసీ అధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి 2007లో రీసెర్చ్ యూ నిట్ మంజూరు చేయాలని అప్పటి ప్రిన్సిపల్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆ తరువాత విషయం మరుగునపడింది. ఏడాదిన్నర కాలం నుంచి కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ రీసెర్చ్ యూనిట్ మంజూరు కోసం చేసిన విన్నపం ఎట్టకేలకు ఫలించింది. కేంద్రప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధులు మంజూరు చేసి రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడానికి అనుమతినిస్తూ గురువారం కాలేజీకి ఉత్తర్వులు అందజేసింది. ఢిల్లీలోని ఐసీఎంఆర్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఈ రీసెర్చ్ యూనిట్లను దేశవ్యాప్తంగా ఐదు మంజూరు చేయగా అందులో ఒకటి సిద్దిపేట మెడికల్ కళాశాలకు, మరోటి వరంగల్ కేఎంసీకి దక్కింది. 15 రోజుల వ్యవధిలో రెండు ప్రత్యేక అనుమతులు కాకతీయ మెడికల్ కళాశాలలో నెల్స్ (నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్టు) పథకంలో భాగంగా నెలరోజుల్లో రీజినల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి పూర్తిస్థాయి అనుమతులు లభించి 15 రోజులు గడవకముందే రీసెర్చ్ సెంటర్ మంజూరుపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్స్ శిక్షణ కేంద్రం ప్రస్తుతం ఒక్క ఉస్మానియా మెడికల్ కళాశాలలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి శిక్షణ కేంద్రాన్ని వరంగల్‌లోనే ప్రారంభించాలని సంకల్పించి రూ.1.50 కోట్ల పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి కేఎంసీకి చేర్చింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై వైద్యసిబ్బంది, వైద్యులకు అందించే ఈ శిక్షణ కార్యక్రమాలపై 16మంది ప్రొఫెసర్ స్థాయి వైద్యులకు తర్ఫీదు ఇచ్చారు. ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే అకస్మికంగా కుప్పకూలే వారిని కాపాడేందుకు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వైద్యులు జరిపే పరిశోధలకు పూర్తిస్థాయిలో సహకరించే విధంగా రీసెర్చ్ కేంద్రాన్ని సైతం కేఎంసీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి వైద్యవిద్యార్థుల విద్యబోధనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కాగా, వారం రోజులక్రితం ఐదు సూపర్‌స్పెషాలిటీ సీట్లు, ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు సాధించకోవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఏడాదిన్నర కృషి ఫలితం ఎట్టకేలకు కేఎంసీకి రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. ఇక్కడ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుకు 2007లో ఐసీఎంఆర్‌కు అప్పటి ప్రిన్సిపాల్ దరఖాస్తు చేశారు. కొన్ని కారణాల వల్ల దానిని తిరస్కరించారు. 2021 జూన్ నెలలో కేఎంసీ బోధన సిబ్బందితో సైంటిఫిక్ కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అడిగిన అన్ని రకాల నివేదికలను సమర్పించాం. వాటిని పరిశీలించిన కేంద్రం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.కోటితో రీసెర్చ్ యూనిట్ సంబంధించిన పరికరాలు, రూ.25 లక్షలతో సివి ల్ పనులు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుతో కేఎంసీ, ఎంజీఎంలోని వైద్యులు, వైద్యసిబ్బందికి వివిధ కోర్సుల్లో పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌దాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ -
కేటీఆర్‌ను కలిసిన ప్రీతి కుటుంబసభ్యులు
సాక్షి, మహబూబాబాద్/ వరంగల్ లీగల్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి ని ప్రీతి కుటుంబసభ్యులు మహబూబాబా ద్ జిల్లా తొర్రూరులో బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ప్రీతి స్వగ్రామం పాలకుర్తి నియోజకవ ర్గంలోని గిరిజన తండా. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు.. ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, శారద తదితరులను ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అంతకు ముందు ప్రీతి చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సైఫ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర బుధవారం తిరస్కరించారు. నిందితుడు సైఫ్‌ను పోలీస్ కస్టడీ కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. రెండు గంటలకుపైగా సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం ఉభయుల పిటిషన్లను తిరస్కరిస్తూ జడ్జి సత్యేంద్ర ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నేరుగా కోర్టుకు విన్నవించే అవకాశంతో ప్రీతి తండ్రి నరేందర్.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం.సత్యనాయణగౌడ్‌ను కలిశారు. కేసు పురోగతి, తన సందేహాలపై ఆయనతో చర్చించారు. -
ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య అంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే మిస్టరీని ఛేదించాల్సి ఉంది. ఆ సమయంలోనే ప్రీతి కుప్పకూలి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పుడు అక్కడ ఎవరెవరున్నారనేది పోలీసుల విచారణలో తేలినా సాంకేతిక దర్యాప్తులోనూ అనుమానమున్న వ్యక్తులు అక్కడేమైనా ఉన్నారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 24న నిందితుడైన సెకండియర్ విద్యార్థి సైఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సమయంలో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాలు ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... ♦ గత డిసెంబర్లో ఓ ప్రమాద కేసులో రోగి గైడ్ వైర్ విషయంలో సైఫ్ ప్రీతిని వేధించాడు. ఫిబ్రవరిలో హనుమకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్నప్పుడూ ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్స్ (పీఏసీ) రాయమన్నాడు. దాన్ని ప్రీతి రాశాక, వాట్సాప్ గ్రూప్‌లో ఆ నివేదికను పోస్టు చేసి ఇది ఎవరు రాశారంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి ప్రీతి స్పందిస్తూ ‘నాతో ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీ లేదంటే జీఎంహెచ్ ఇన్చార్జికి ఫిర్యాదు చేయ్’ అని సైఫ్‌కు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. లేదంటే ఇదే విషయాన్ని హెచ్ఓడీకి చెబుతాననడంతో కోపోద్రిక్తుడైన సైఫ్ ఆమెను మరింత వేధించాలనుకున్నాడు. ♦ హెచ్ఓడీకి సైఫ్‌పై ఫిర్యాదు చేసేందుకు మద్దతివ్వాలని స్నేహితులు, సహచరులను ప్రీతి కోరింది. తన ప్రవర్తన మారకపోతే అందరినీ వేధిస్తాడని చెప్పింది. ♦ ఈ నెల 21న అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకు వేధింపులపై వచ్చిన సమాచారంతో అదేరోజు 11 గంటలకు సైఫ్‌ను పిలిపించి మాట్లాడారు. ప్రీతిని ఎందుకు వేధిస్తున్నావు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రీతిని పిలిచి ఇద్దరూ ఒకేచోట డ్యూటీ చేయొద్దన్నారు. ఎంజీఎం కాకుండా అంతకుముందు డ్యూటీ వేసిన ఆస్పత్రిలోనూ చేసుకోవచ్చన్నారు. ♦ ప్రీతి అదేరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీఎంలో వి ధులకు హాజరైంది. స్టాఫ్ నర్సు మండె విజయలక్ష్మి, సె కండియర్ స్టూడెంట్ డాక్టర్ భీమని మనీశ్, థర్డ్ ఇయర్ హౌస్ సర్జన్ డాక్టర్ రూహితో కలిసి విధులు నిర్వర్తించింది. 22న ఉదయం 5 నుంచి 7 గంటల వరకు జరిగిన అపరేషన్‌లో పాల్గొంది. ఆ తర్వాత అనస్తీషి యా పీజీ రూమ్ లోకి వెళ్లింది. 7.15 నిమిషాలకు స్టాఫ్ నర్సు విజయలక్ష్మి అక్కడికెళ్లగా కిందపడి ఉన్న ప్రీతిని చూసింది. ప్రీతికి డాక్టర్ రూహి, డాక్టర్ భీమని మనీశ్ చికిత్స అందించారు. తేలాల్సినవెన్నో... ♦ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి క్లాస్‌మెట్స్, సీనియర్ విద్యార్థులకు తెలిసినా ఆమె సహాయం కోరినప్పుడు వారు ఎందుకు మద్దతివ్వలేదు. ప్రీతి క్లాస్మేట్ అనూషకు వాట్సాప్ ద్వారా ప్రీతికి సపోర్ట్ చేయొద్దంటూ సైఫ్ వ్యక్తిగతంగా పెట్టిన మెసేజ్ పోలీసులకు లభ్యమైంది. ప్రీతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ ఈ వైద్య విద్యారి్థనులంతా సైఫ్‌కు అనుకూలంగా ఆందోళన చేయడం వివాదాస్పదమైంది. విద్యార్థులు సీనియర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని వెనకడుగు వేశారా అన్నది తేలాలి. ♦ ప్రీతి కార్డియాక్ అరెస్ట్ వల్ల కుప్పకూలిందని, పీఏసీ రిపోర్టు విషయంలోనే సైఫ్ గట్టిగా మాట్లాడాడని, వేధింపులు, ర్యాగింగ్ లేవని బుధవారం నాడే ఎంజీఎం, కేఎంసీ ఉన్నతాధికారులు ఎందుకు ప్రకటించారు? సైఫ్ ర్యాగింగ్, వేధింపులు చేశాడని కౌన్సెలింగ్‌లో ఒప్పుకున్నా ఈ మాటల్ని వీరెందుకు చెప్పలేదు? ♦ ట్యాక్సికాలాజి రిపోర్టు వెల్లడించినా ఆమె ఇంజక్షన్ తీసుకుందా అన్నది పోలీసులు తేల్చాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
గిర్నితండాలో గిరిజనుల ధర్నా.. కేఎంసీలో విద్యార్థుల ఆందోళన
కొడకండ్ల/ఎంజీఎం/వరంగల్/కాశిబుగ్గ: ప్రీతి ఘటనలో కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ఓడీల నిర్లక్ష్యం ఉన్నందున వారిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదివారం రాత్రి గిర్నితండాలో స్థానికులు, మైదంచెరువుతండా గిరిజనులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జనగామ–సూర్యాపేట రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. అలాగే, ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా.. పోలీసులు విద్యార్థులను అడ్డుకుని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ప్రీతి మృతికి కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ డెమొక్రటిక్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ పోరిక ఉదయ్‌సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. -
ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి.. అత్యంత విషమంగా పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. సైఫ్ వేధింపుల వల్లే.. కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వల్లే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. నవంబర్‌లో ప్రీతి కేఎంసీలో చేరిందని, డిసెంబర్ నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘జనవరి 20వ తేదీనకాలేజీ దగ్గరికి వెళ్లానని, ఉన్నతాధికారులకు వేధింపుల గురించి తెలియజేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాం. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్‌తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పా. వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. మార్కులు తక్కువ వేస్తారు అని భయపడింది. ఎంతో ధైర్యంగా ఉండేది. కరోనాలో కూడా విధులు నిర్వర్తించింది. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధించాడో. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్‌కు తీసుకువచ్చారు. వరంగల్‌లో గొడవ అవుతుందని కావాలని హైదరాబాద్ తరలించారు. మాకు న్యాయం చేయాలి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల నా బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి. మా బిడ్డ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాడికి శిక్ష పడాలి. చాలా దారుణంగా వేధించాడు. మా బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ప్రీతికి ఎటువంటి ఆనారోగ్యం లేదు. చదువుల్లో నంబర్ వన్. పోలీసు ఫిర్యాదు తర్వాత సైఫ్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు సరికావు: జూనియర్ డాక్టర్లు ఆధారాలు లేకుండా సీనియర్ విద్యార్థిపై ఆరోపణలు చేయడం సరికాదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై ప్రస్తుతం అధికారుల విచారణ జరుగుతోందని, విచారణపూర్తయ్యే వరకు తప్పుడు ఆరోపణలు చేయవద్దని పేర్కొన్నారు. అయితే ర్యాంగింగ్ లాంటిదేమి జరగలేదని కేఎంసీ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. -
వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కు తరలింపు
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తుంది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కేఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనకు దారితీసేది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదనతో కోరుతున్నారు. నిమ్స్‌కు తరలింపు మరోవైపు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే.. విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. శ్వాస తీసకోవడంతో బాధితురాలు ఇబ్బంది పడుతోందని, విద్యార్థినిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ర్యాగింగ్ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. సీనియర్ తప్పు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ -
ఈఎన్టీ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్
ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన ఈఎన్టీ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. చెన్నైలో జరిగిన లైవ్ సర్జరీలను ఈ సదస్సులో ప్రదర్శించి.. పలు కొత్త అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈఎన్టీ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్, ఎలక్ట్ ప్రెసిడెంట్‌గా రమణ, ఉపాధ్యక్షులుగా రవిశంకర్, కార్యదర్శిగా రమేశ్, జాయింట్ సెక్రటరీగా రవికాంత్, కోశాధికారిగా సాహెల్ హమీద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గిఫ్ట్సన్, గౌడ రమేశ్, వెంకటరత్నం ఎన్నికయ్యారు. -
ఆనందమానందమాయే!
-
కేఎంసీలో హైటెక్ కాపీయింగ్.. లెక్క తేలాలి!
సాక్షి, వరంగల్ : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)లో మెడికల్ పీజీ పరీక్షల సందర్భంగా హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల విద్యార్థులకు కేఎంసీలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ పీజీ పరీక్షలు రెండ్రోజుల క్రితం ముగిశాయి. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థి ఒకరు హైటెక్ విధానంలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. కాపీ ఇలా.. కేఎంసీలో 15 రోజులు పరీక్షలు జరగ్గా చివరి రోజే వైద్య విద్యార్థి పట్టుబడటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విద్యార్థి ఓ కారు తీసుకొచ్చి పరీక్ష గది వెనుక ఉంచారు. కారు డ్రైవర్‌గా సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తిని ఉంచి దానికి యాంటీనా బిగించారు. విద్యార్థి మోకాళ్లలో రిసీవర్ ఉంచుకుని వైర్లెస్ ఫోన్ ద్వారా జవాబులు రాసినట్లు సమాచారం. చివరి రోజు అనుమానాస్పదంగా ఉన్న కారును గుర్తించిన పరిపాలనాధికారులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎందరున్నారో తేలాలి.. కేఎంసీలో జరిగిన మాస్ కాపీయింగ్ వెనుక కొందరు ఉద్యోగుల హస్తమున్నట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహణకు ప్రశ్నపత్రాన్ని ఓ ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగి డౌన్లోడ్ చేసి తనను ఆశ్రయించిన కొందరు వైద్య విద్యార్థులకు చేరవేసినట్లు సమాచారం. తద్వారా ఆ ప్రశ్నల జవాబు ను విద్యార్థి మైక్ రిసీవర్, వైర్‌లైస్ ఫోన్ ద్వారా తెలుసుకుని కాపీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సహకరించి నందుకు విద్యార్థులు కొందరు ఉద్యోగు లకు రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. రెగ్యులర్ ఉద్యోగులను కాకుండా ఔట్‌సోరి్సంగ్ వారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కేఎంసీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తే కాపీయింగ్‌లో ఇంకా ఎందరున్నారనేది తెలుస్తుందని చెబుతున్నారు. యూనివర్సిటీకి వివరాలిచ్చాం.. ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గుర్తించాం. చాలా తెలివిగా కరోనా నిబంధనలను సాకుగా చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. మోకాళ్ల వద్ద వైర్లెస్ రిసీవర్ ఉంచుకుని జవాబులు తెలుసుకున్నాడు. ప్రతిమ కళాశాలకు చెందిన ఆ విద్యార్థి వివరాలను కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి అప్పగించాం. తదుపరి చర్యలు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటారు. – డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ 9 నుంచి వ్యవసాయ డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్ రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బైపీసీ స్ట్రీమ్ (హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ)లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఈనెల 9వ తేదీ నుంచి సంయుక్తం గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ 432 సీట్లు, బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ 130 సీట్లకు, బీవీఎస్సీ, ఏహెచ్ 158 సీట్లకు, బీఎఫ్ఎస్సీ 36 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిం చి నిర్ణీత ఫీజును వెంటనే చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.pjtrau. edu.in లో లాగిన్ కావాలని తెలిపారు. బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్)హార్టికల్చర్ పేమెంట్ కోటా సీట్ల కోసం విడిగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు వర్సిటీ పరీక్షలు యథాతథం నాంపల్లి (హైదరాబాద్): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించే వార్షిక పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు పరీక్షలకు ఎలాంటి సంబంధం ఉండదని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు తెలుగు వర్సిటీ అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో పాటుగా బ్యాక్లాగ్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భారత్ బంద్ జరిగే మంగళవారం కూడా పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా.. సాక్షి, హైదరాబాద్: భారత్ బంద్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పలు పరీక్షలను వర్సిటీలు వాయిదా వేశాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నాటి పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొ. మంజూర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 నాటి పాలిటెక్నిక్ డిప్లమా సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎస్బీటీఈటీ కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 23న నిర్వహిస్తామన్నారు. సీపీజీఈటీ పరీక్షను వాయిదా వేసినట్లు ఉస్మానియా వర్సిటీ వెల్లడించింది. తమ పరిధిలో ఈ నెల 8న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామని, 9 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా ఉంటాయంది. అలాగే, భారత్ బంద్ నేపథ్యంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ సెకండియర్ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నెల 9న జరిగే పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. 18న పీజీ..19న డిగ్రీ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 18 నుంచి వివిధ పీజీ కోర్సుల (రెగ్యులర్) రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల ఇయర్ వైజ్ పరీక్షలు జరగనున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఓయూ ప్రీ–పీహెచ్డీ పరీక్షలు ఈ నెల 28, 30 తేదీలలో నిర్వహిస్తామన్నారు. పీహెచ్డీ విద్యార్థులు జంటనగరాలతో పాటు ఆయా జిల్లాల్లో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
డాక్టర్ అవ్వాలనుకున్నా.. నాయకుడినయ్యా
సాక్షి, ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించిన విద్యార్థులకు ఐదు ఏళు మాత్రమే అనుబంధం ఉంటుంది.. నాకు మాత్రం కళాశాలతో 45 ఏళ్ల అనుబంధం ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం కేఎంసీ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కళాశాల అంటే నాకు ప్రాణం.. మా తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని అనుకుడినే వాడిని.. కాని రాజకీయ నాయకుడిని.. మంత్రిని అయ్యాను.. వైద్యవృత్తి అంటే తనకు ఎంతో ఇష్టం.. రాజకీయ ఎదుగుదలకు వైద్యులు ఎంతో కృషి చేశారు’ అని అన్నారు. ఎల్బీ కళాశాలలో చదువుతున్నప్పుడు కాకతీయ మెడికల్ కళాశాలలో బుల్లెట్ మీద తిరిగేవాడిని.. నాటి మధుర స్మతులు నేటికీ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో వైద్యులకు అరుదైన గౌరవం ఉందని, అంకిత భావంతో పనిచేసి రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వజ్రోత్సవాలకు రూ.కోటి కేఎంసీ వజ్రోత్సవ వేడుకల కోసం సీఎం కేసీఆర్ రూ.కోటి కేటాయించారని, ఆ బడ్జెట్ అమలు ఎక్కడ నిలిచిపోయిందో తనకు తెలియందని మంత్రి అన్నారు. 1994 నుంచి 2004 వరకు ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కోసం జోలె పట్టుకుని చందాలు వసూలు చేశానని, వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి కోసం పాటుపడ్డాడని గుర్తు చేశారు. ఎంజీఎం అభివృద్ధి నా వల్లే జరిగిందని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేర్కొన్నారని, నా స్ఫూర్తితోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేశారని అన్నారు. స్వయంగా ఈ అంశాన్ని రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో వెల్లండిచారని పేర్కొన్నారు. సెంట్రల్ జైలు తరలింపునకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పలువురు వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, అలుమినీ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్ కాళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పలువురు వైద్యులకు ఘన సన్మానం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అలుమినీ కమిటీ సభ్యులతో పాటు కళాశాల కమిటీ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘనంగా సత్కరించారు. ఆరోగ్యంగా జీవించడమే గొప్ప వరం ఆరోగ్యంగా జీవించడమే గొప్పవరం.. ఆస్తులను కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు.. ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించుకోలేమని నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం సైకియాట్రిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె వాక్ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాక్ కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఎంజీఎం మీదుగా కొనసాగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్రమణ్యేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలు పాటించి జీవితాన్ని సంతోషాన్ని గడపాలని సూచించారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తూనే.. దాడుపై మనం ఆలోచించాల్సి అవసరం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య, వైద్యులు డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు, ఐఎంఏ అధ్యక్షుడు నల్లా సురేందర్‌రెడ్డి, రాంకుమార్‌రెడ్డి, బందెల మోహన్‌రావు, జార్జిరెడ్డి, మన్మోహన్రాజు, డాక్టర్ సంధ్యరాణి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. – నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు -
ఆరోగ్య తెలంగాణే ధ్యేయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరోగ్య తెలంగాణే తమ ధ్యేయమని చెప్పారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) వజ్రోత్సవాలను శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ.. వైద్య రంగం పురోభివృద్ధిలోనూ తెలంగాణ తనదైన ముద్ర వేస్తోందని చెప్పారు. కంటి వెలుగు, డయాలసిస్ కేంద్రాలు, కేసీఆర్ కిట్, అధునాతన ఐసీయూలు, ఆస్పత్రుల ఆధునీకరణ, మౌలిక సదుపాయాలు ఇలా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ‘తెలంగాణకు ఆర్థిక పరిపుష్టి లేదని, మరింత వెనకబడుతోందని ఆనాడు కొందరు దుష్ప్రచారం చేశారు. నాటికీ నేటికీ వ్యత్యాసం గమనించండి. ఈ ఐదేళ్లలో తెలంగాణకు ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది’అని మంత్రి పేర్కొన్నారు. అన్ని రోగాలకు తాగునీరు కారణమని భావించి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టినట్లు తెలిపారు. సహ విద్యార్థులు ఒకే చోట కలుసుకోవడం గొప్ప అనుభూతి అని, ఏ స్థాయి, హోదాలో ఉన్నా అరేయ్ అని పిలిచే అధికారం ఒక్క క్లాస్‌మేట్‌కు మాత్రమే ఉంటుందని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ డాక్టర్ వృత్తి దేవుడు ఇచ్చిన వరం లాంటిదన్నారు. సంపాదన కంటే పేదలకు వైద్యం చేసి వారిని బతికించడంలోనే ఎక్కువ తృప్తి ఉంటుందన్నారు. 22 ఏళ్ల క్రితం కోరగానే రూ.కోటి విరాళం అందజేసిన లక్కిరెడ్డి అనుమరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముం దుకు రావాలని ఆయన కోరారు. ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం తోపాటు ఎన్నారైలు తోడ్పా టు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాష్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కేఎంసీ తెలంగాణకే తలమానికం’
సాక్షి, వరంగల్ : తెలంగాణ ఉద్యమంలో వైద్యుల సహకారం మరువ లేనిదని వైద్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్న ప్రభుత్వం వైద్య రంగంపైన కూడా తనదైన ముద్ర వేస్తుందని పేర్కొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతానికి ఇప్పటికీ తేడాను అందరూ గమనించే ఉంటారన్నారు. ‘నేడు తెలంగాణా దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎక్కడ ఉన్నా తెలంగాణ మా రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం, మిషన్ భగీరథ లాంటి అద్భుతమైన పథకాలు అమలు అవుతున్నాయి. మానవ సంబంధాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది’ అని ఈటెల వ్యాఖ్యానించారు. తెలంగాణకే తలమానికం వైద్య వృత్తి దేవుడిచ్చిన వరం..సంపాదనకంటే... పేదలకు వైద్యం చేసి వారిని బతికించడంలో ఎక్కువ తృప్తి లభిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రి ఈటెలను అడిగిన వెంటనే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ఎంజీఎంలో మౌలిక వసతుల కోసం రూ. 10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అదే విధంగా ఎంజీఎంలో మరిన్ని మెరుగైన వసతుల కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ఎన్నారైలు కూడా ఎంజిఎమ్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఇక 60 వసంతాల పయనంలో వందలాది మందిని వైద్యులుగా తీర్చిదిద్దిన కేఎంసీ తెలంగాణకే తలమానికమని కొనియాడారు. -
పట్టుబట్టారు.. పట్టుకొచ్చారు!
నాడు మహబూబాబాద్ ఎంపీగా కొనసాగిన ఇటిక్యాల మధుసూదన్‌రావు, అప్పటి వరంగల్ కలెక్టర్ మొహసిన్ బీన్ షబ్బీర్ సంకల్పం బలమే నేటి కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ) స్థాపనకు కారణమైందని చెప్పాలి. 1959లో కలెక్టర్ షబ్బీర్ రూపొందించిన ప్రతిపాదనలను ఎంపీ మధుసూదన్ వెంట తీసుకెళ్లి అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూను కలిసి తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అంతేకాకుండా ఒకటికి, రెండుసార్లు కలిసి పట్టుబట్టడంతో కళాశాల స్థాపనకు అడుగులు పడ్డాయి. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందాలని.. తద్వారా ఇక్కడ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎంపీ, కలెక్టర్లు భావించడంతో రీజినల్ మెడికల్ సొసైటీ ఆధ్వర్యాన కళాశాల స్థాపనకు అప్పటి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేఎంసీ స్థాపించి అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో కళాశాల స్థాపనకు జరిగిన కృషి, ఆ తర్వాత పరిణామాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మెడికల్ సొసైటీ ఆధ్వర్యాన.. 1959 జూలై 23న రీజినల్ మెడికల్ సొసైటీ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రారంభమైంది. అప్పట్లో కళాశాలను వడ్డేపల్లిలోని పింగిళి కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ కళాశాల నిర్వహణ కోసం కొనసాగుతున్న సొసైటీకి టీ.ఎస్.మూర్తి ఉపా«ధ్యక్షుడిగా, యతి రాజారావు మొదటి కార్యదర్శిగా కొనసాగారు. ఈ ఇక సొసైటీ నిర్వహణ మాత్రం ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ అధికారులు, పౌరుల చేతిలో కొనసాగింది. ఈ కళాశాల నిర్వహణకు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి హయాంలో అనుమతులు లభించగా కేంద్ర ఆరోగ్య మంత్రి పి.కరుమకర్ విచ్చేసి కళాశాలను ప్రారంభించారు. అప్పట్లో కేఎంసీ 50 సీట్లతో ప్రారం భమై ప్రస్తుతం 200 సీట్లతో కొనసాగుతోంది. 1961లో ప్రస్తుత ప్రాంగణానికి... 1959లో పింగిళి కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన కేఎంసీని 1961 ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంగణానికి మార్చారు. అయితే కళాశాల ప్రారంభోత్సవం మాత్రం 1962 అక్టోబర్ 10వ తేదీన అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి సుశీల్ నాయర్ చేతుల మీదుగా జరిగింది. ప్రస్తుతం 153 ఎకరాల్లో కొనసాగుతున్న కేఎంసీ మేజర్ కే.ఎన్.రావు నిర్మాణ ప్రణాళిక రూపొందించగా కళాశాల భవనాన్ని రూ.10.7 లక్షలతో 27 బ్లాక్‌లుగా 15 నెలల్లోనే నిర్మించి మెడికల్ విద్యార్థులకు అందించిన ఘనత అప్పటి అధికారులకే దక్కుతుంది. కేఎంసీ ప్రారంభించినప్పుడు తరగతులు నిర్వహించిన ‘పింగిళి’ భవనం, తొలినాళ్లలో కేఎంసీ భవనాలు 1977లో ప్రభుత్వ ఆధీనంలోకి... 1959వ సంవత్సరం నుంచి రీజినల్ మెడికల్ ఎడ్యూకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగిన కేఎంసీ 1977 సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు సాధించింది. నాటి నుంచి కేఎంసీ అత్యంత ప్రతిష్టాత్మక కళాశాలగా కొనసాగుతూ వస్తుంది. ఎంబీబీఎస్ విద్యనుభ్యసించే విద్యార్థులకు మొట్టమొదటి ప్రవేశ పరీక్షను అమలుచేసింది కూడా కేఎంసీ కళాశాల అనే విషయాన్ని గొప్పగా చెబుతారు. మొదటి ప్రిన్సిపాల్‌గా రిటైర్డ్ డీఎంఈ ఖత్రి కాకతీయ మెడికల్ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎల్.డీ.ఖత్రి నియమితులయ్యారు. అనంతరం రెండో ప్రిన్సిపాల్‌గా నియామకమైన టి.లక్ష్మీనారాయణ కళాశాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారని చెబుతారు. ఆయన హయంలోనే కళాశాలలో అశించిన స్థాయిలో అభివృద్ధి జరిగిందని అప్పటి వైద్యులు తెలుపుతున్నారు. కళాశాల అభివృద్ధి కోసం లక్ష్మీనారాయణ అకడమిక్ కరిక్యులమ్‌ను రూపొందించడంతో పాటు ఎడ్యూకేటర్ కేంద్రంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. ఆయన చేసిన అభివృద్ధికి గుర్తింపుగా లక్ష్మీనారాయణను పయనీర్‌గా ప్రిన్సిపాల్ పిలుచుకుంటారు. ప్రధాన భవనాన్ని ప్రారంభించిన ప్రధాని ఇందిర దినదినాభివృద్ధి పథంలో నడుస్తున్న కేఎంసీలో నిర్మించిన నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవం 1966 జూలై 24వ జరగగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే కళాశాల వెనుక భాగంలో నిర్మించిన ఆడిటోరియంను అదే సంవత్సరంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శివరామప్రసాద్ ప్రారంభించారు. కళాశాలలో ప్రాంగణంలో విద్యార్థుల కోసం నిర్మించిన క్వార్టర్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ హౌజింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో కొనసాగేవి. 1977లో ప్రభుత్వ ఆధీనంలోకి... 1959వ సంవత్సరం నుంచి రీజినల్ మెడికల్ ఎడ్యూకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగిన కేఎంసీ 1977 సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు సాధించింది. నాటి నుంచి కేఎంసీ అత్యంత ప్రతిష్టాత్మక కళాశాలగా కొనసాగుతూ వస్తుంది. ఎంబీబీఎస్ విద్యనుభ్యసించే విద్యార్థులకు మొట్టమొదటి ప్రవేశ పరీక్షను అమలుచేసింది కూడా కేఎంసీ కళాశాల అనే విషయాన్ని గొప్పగా చెబుతారు. -
22 మందిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, వరంగల్ అర్బన్ : కాకతీయ మెడికల్ కళాశాలలో గంజాయి కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం జూనియర్ విద్యార్థి బర్త్ డే పార్టీ సందర్భంగా 22 మంది విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు తెలిసింది. గంజాయి తీసుకున్న వారందరిని రెండు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. మొత్తం 30 మంది సదరు విద్యార్థి బర్త్ డే పార్టీకి వెళ్లగా 22 మంది గంజాయి దమ్ము కొట్టినట్లు తెలిసింది. గంజాయి తీసుకున్న మెడికోలు అందరూ తెల్లవారే వరకూ నిద్ర మత్తులోనే ఉండటంతో సహచర విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. మత్తులో జోగుతున్న విద్యార్థుల విజువల్స్‌ను రికార్డ్ చేసిన వార్డెన్ ప్రిన్సిపాల్‌కు అందించడంతో వారిని రెండు నెలలపాటు సస్పెండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విచారణ కమిటీని కళాశాల నియమించింది. సమాజానికి మంచి చెప్పాల్సిన మెడికోలే ఇలా గంజాయి మత్తులో జోగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో వరంగల్ నిట్ విద్యార్థులు కూడా గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మెడికోలకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టారు. -
అదిరేటి డ్రెస్సు మేమేస్తే...
-
మెడికల్ కాలేజీకి బాంబు బెదిరింపు కాల్
వరంగల్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆదివారం బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాలేజీలో బాంబు పెట్టామని గుర్తుతెలియని ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు కాలేజీకి డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టి...చివరికి బాంబు లేదని తేల్చారు. దీంతో పోలీసులు, కాలేజీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో అంగతకుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు
♦ బస్సు ప్రమాదంలో మరణించిన మెడికోల కుటుంబాలకు పరిహారం ♦ సీడీఎస్ నిధుల నుంచి చెల్లించనున్నట్టు డీఎంఈ వెల్లడి హైదరాబాద్: ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ(సీడీఎస్) నిధుల నుంచి రూ.7 లక్షల చొప్పున పరిహారంగా అందజేయాలని నిర్ణయిం చినట్టు తెలంగాణ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), సీడీఎస్ చైర్మన్ డాక్టర్ రమణి వెల్లడించారు. విద్యార్థుల వరుస ఆందోళనలతో స్పందించిన డీఎంఈ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన సీడీఎస్ సమావేశంలో డీఎంఈతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, ప్రొఫెసర్లు డాక్టర్ బాబూరావు, డాక్టర్ నాగేందర్, సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. సమావేశం ఆనంతరం డీఎంఈ రమణి మాట్లాడుతూ ఈ నెల 14న జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థులు జి.లక్ష్మణ్, మోకా విజయ్‌తేజ, మచ్చ ప్రణయ్రాజారాం, వదనాల ఉదయ్ కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. సీడీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్, వైద్య మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్యకార్యదర్శి తివారీ దృష్టికి తీసుకువెళ్లి మంగళవారం సాయంత్రంలోగా విద్యార్థుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఒకరోజు వేతనాలను విరాళంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. గాంధీ వైద్య కళాశాల, కాకతీయ వైద్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సైతం విరాళాలు అందజేసేందుకు ముందుకొచ్చారన్నారు. వచ్చే ఏడాది నుంచి కళాశాల టాపర్స్‌కు మృతిచెందిన విద్యార్థుల పేరు మీద గోల్డ్ మెడల్స్ అంజేస్తామని ప్రకటించారు. కాగా, ఉస్మానియా వైద్య కళాశాల ఎస్పీఎం హెచ్‌వోడీ డాక్టర్ బాబూరావు విద్యార్థుల కుటుంబాలకు తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కును కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌కు అందజేశారు. డీఎంఈ రమణి కూడా రూ.10 వేల విరాళాన్ని ప్రకటించారు. కొనసాగిన విద్యార్థుల ఆందోళన.. బస్సు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠి ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన కొనసాగింది. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. తరగతి గదులకు తాళాలు వేసి కళాశాల ప్రధాన ద్వారం వద్ద మృతిచెందిన విద్యార్థుల చిత్రపటాలను పెట్టి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. సీడీఎస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డీఎంఈ రమణి విద్యార్థులకు స్వయంగా వివరించడంతో వారు తమ నిరసన విరమించారు. -
కేఎంసీలో మెడికో ఆత్మహత్య
♦ ఉరి వేసుకున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థిని మౌనిక ♦ ఈ నెల 22 నుంచి పరీక్షలు.. ♦ చదవడం పూర్తి కాలేదని విద్యార్థుల ముందు ఆవేదన ♦ మానసిక ఒత్తిడితో చనిపోయి ఉండొచ్చు: కుటుంబ సభ్యులు సాక్షి, వరంగల్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని ఎంఎస్ మౌనిక(23) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. మానసిక ఒత్తిడి భరించలేకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఆమె ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట దర్గాలో నివాసముంటున్న సుభాష్ యాదవ్, నిర్మల దంపతుల కుమార్తె మౌనిక. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి ఆమె కళాశాలలోని హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 22 నుంచి జరగనున్న ఫైనలియర్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కాలేజీలోని లక్కిరెడ్డి భవనంలో 19వ నంబర్ గదిలో రెండు వారాల నుంచి ఒంటరిగా ఉంటోంది. అన్ని విభాగాలను చదవడం పూర్తి కాలేదని తరచూ ఆమె టెన్షన్ పడేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు తోటి విద్యార్థులతోనే గడిపింది. అంతకుముందు సాయంత్రం పాల ప్యాకెట్‌తో పాటు కొన్ని వస్తువులు కావాలంటూ దోబీకి రూ.100 ఇచ్చింది. ఆ డబ్బును దోబీ సూపర్వైజర్కు ఇవ్వగా.. ఆయన మౌనిక చెప్పిన వస్తువులు తెప్పించారు. మంగళవారం ఉద యం 11 గంటలకు స్నేహితులు మౌనిక గదికి వెళ్లి గది తలుపు కొట్టగా ఎంతకీ తెరవలేదు. దీంతో కిటికీలు తెరిచిన చూడగా మౌనిక ఊరి వేసుకుని కనిపించింది. వాచ్‌మన్ వచ్చి కిటికీ ధ్వంసం చేసి లోపలకు వెళ్లి గది తలుపు తెరిచారు. వెంటనే కేఎంసీ ప్రిన్సిపల్ విద్యాసాగర్‌కు సమాచారమిచ్చారు. ఆయన హాస్టల్‌కు చేరుకుని ఘటన విషయాన్ని పోలీసులకు తెలిపారు. నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు కాలేజీకి వచ్చి మౌనిక ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. ప్రిన్సిపల్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎంజీఎం మార్చురీలో మృతదేహం కూతురు ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం అందడంతో మౌనిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు కేఎంసీకి వచ్చారు. మానసిక ఒత్తిడి వల్లే మౌనిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న తండ్రి సుభాష్ ఫిర్యాదుతో పోలీ సులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.