Kanhaya Kumar
-
కాంగ్రెస్ మరో జాబితా.. కన్హయ్య కుమార్ అక్కడి నుంచే..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు పలు రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనటంలో బీజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రటించింది. పదిమంది అభ్యర్థులతో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ, పంజాబ్, అలహాబాద్ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈశాన్య ఢిల్లీ సీటు నుంచి కన్హయ్య కుమార్ బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా 75 మందితో ఒడిస్సా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की लिस्ट। pic.twitter.com/jHaWDAlXKB — Congress (@INCIndia) April 14, 2024 The candidates selected by the Central Election Committee of Congress for the ensuing elections to the Legislative Assembly of Odisha 👇🏼 pic.twitter.com/V6RkjWAKdF — Congress (@INCIndia) April 14, 2024 -
రోహిత్ చట్టం తేవాలి: కన్హయ్య కుమార్
- మోదీ క్రసీ నడుస్తోంది - విద్యావిధానంలో సమూల మార్పులు రావాలి - లౌకిక విద్య కోసం రోహిత్ చట్టం తేవాలి - బీఫ్ తినొద్దని పశువుల కోసం మనుషులను చంపుతున్నారు - మీడియా సమావేశంలో జెఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సాక్షి, హైదరాబాద్ ప్రజాస్వామ్యం పతనమై(డెమోక్రాష్) మోడీక్రసీ నడుస్తోందని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ, ఢిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ధ్వజమెత్తారు. దేశంలో మహిళ, దళిత, ముస్లిం అణిచివేత విధానాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఒక సెమినార్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ, రాష్ట్ర అధ్యక్షుడు వేణు, ఇతర విద్యార్థి నాయకులు శంకర్, రాజారాంలతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని, విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రోహిత్ చట్టం తీసుకురావడం ద్వారా అందరికీ విద్య, సమసమాజ స్థాపనకు కషి చే యాలన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలోకి మీడియాను కూడా అడ్డుకుంటున్నారని, రోహిత్ మరణం తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రధానమంత్రి, విద్యా మంత్రుల డిగ్రీల విషయంలో ప్రశ్నలు తలెత్తే పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. విద్యావ్యవస్థ పునాదుల నుంచే బలంగా ఉంటే ఎంసెట్ లీకేజీ వంటి దుష్పరిణామాలు పునరావతం కావన్నారు. -
కన్హయ్య వీడియో అసలైందే
నిర్ధారించిన సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదంలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో ర్యాలీ సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కేసులో వీరు రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నిజమైనదేనని, అందులో ఎలాంటి మార్పులూ జరగలేదని సీబీఐ ఫోరెన్సెక్ ల్యాబ్ పరిశీలనలో తేలిందని పోలీసులు చెప్పారు. నాటి సంఘటనకు సంబంధించి ఒక హిందీ న్యూస్ చానల్ నుంచి వీడియోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కెమెరా, వీడియో ఉన్న సీడీ, ఇతర పరికరాలను ఢిల్లీలోని సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వీటిని పరీక్షించిన ల్యాబ్.. అందులోని దృశ్యాలన్నీ నిజమైనవేనని నిర్ధారిస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు జూన్ 8న నివేదిక ఇచ్చిది. మే నెలలో 4 వీడియోలను ఢిల్లీ పోలీసులు కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపగా.. అక్కడా నిజమైనవేనని తేల్చారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మొత్తం ఏడు వీడియోలను హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్ పంపగా.. రెండు వీడియోల్లో మార్పులు చేశారని, మిగతావన్నీ నిజమైనవేనని అక్కడ నిర్ధారించారు. -
పట్నాలో కన్హయ్యకు ఘనస్వాగతం
పట్నా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు ఆయన స్వరాష్ట్రమైన బిహార్‌లో శనివారం రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. రాజద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు నితీశ్ కుమార్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఢిల్లీ నుంచి పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆయన పోలీసుల రక్షణలో నగరంలోకి చేరుకున్నారు. సీఎం నితీశ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లతో వారి నివాసాల్లో భేటీ అయ్యారు. తర్వాత బేగుసరాయ్ జిల్లాలోని తనింటికి వెళ్లారు. కాగా, రాజద్రోహం అభియోగాలున్న కన్హయ్యకు ప్రభుత్వం ఘన స్వాగతం పలకడం రాష్ట్రానికి సిగ్గుచేటని విపక్ష బీజేపీ ఆరోపించింది. అయితే రాష్ట్రవాసి అయిన కన్హయ్యపై ఢిల్లీలో దాడి జరిగిందని, ఆయనకు లోపరహిత భద్రత కల్పించం తప్పుకాదని రాష్ట్ర మంత్రి, అశోక్ చౌధురి అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అసహనం పెరిగిందని కన్హయ్య ఆరోపించారు.అఫ్జల్ ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ తనకు వేసిన రూ. 10వేల జరిమానాను చెల్లిస్తామని ముంబై మునిసిపల్ కార్మికులు చెప్పారని తెలిపారు. వారు రూ. 10వేలు సేకరించారని, అయితే జరిమానా కట్టబోమన్నారు. -
విమానంలో కన్హయ్యపై దాడి!
ముంబై: విమానంలో తోటి ప్రయాణికుడు తన పీకనులిమి చంపబోయాడంటూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఆదివారం తెలిపారు. ‘ఈ సారి విమానంలో దాడి. ఒక వ్యక్తి నా పీకనులిమాడు. నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు’అని ట్విటర్లో పేర్కొన్నారు. ముంబై నుంచి పుణెకు వెళ్లడానికి కన్హయ్య జెట్ ఎయిర్వేస్ విమానం ఎక్కిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. దీంతో భద్రతా కారణాల రీత్యా కన్హయ్యను విమానం నుంచి దింపి రోడ్డుమార్గంలో విమాన సిబ్బంది పుణెకు పంపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాడి చేసిన వ్యక్తిని పుణె టీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33)గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగిందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఈ సంఘటనపై ఇరు పక్షాలు ఫిర్యాదు చేశాయన్నారు. పబ్లిసిటీ కోసం కన్హయ్య చేసిన చీప్ ట్రిక్ అని మనస్ ఆరోపించాడు. కాలు నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుందన్నాడు. అసలు కన్హయ్య అనే అతను ఎవరో తనకు తెలియదన్నాడు. కాగా, కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సహచర విద్యార్థి తరఫున కన్హయ్య ప్రచారం చేయనున్నారు. మోదీ ప్రభుత్వం వెనుక ఆరెస్సెస్ దాగి ఉందని, వారి హయాంలో దేశం మతతత్వ, దళిత వ్యతిరేక ప్రయోగశాలగా మారిందని కన్హయ్య ఆరోపించారు. -
కన్హయ్యకు ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత
సీపీఐ నేత నారాయణ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హెచ్చరించారు. కన్హయ్య ఎక్కడికి వెళితే అక్కడ బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు, సంఘ్‌పరివార్ దాడులు చేయడం పరిపాటైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్‌లు పెట్టుకునే హక్కుందని, దాడులు, అల్లర్లతో కన్హయ్య నోరు నొక్కాలని చూస్తే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కన్హయ్య సభ వద్ద తీవ్ర ఉద్రిక్తత
బీజేపీ, వామపక్ష నేతల మధ్య వాగ్వాదం, తోపులాట సభలో భజరంగ్‌దళ్ కార్యకర్తను కొట్టిన వామపక్ష కార్యకర్తలు బీజేవైఎంకు చెందిన 51మందిపై కేసు విజయవాడ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో నిర్వహించిన విద్యార్థి యువజన శంఖారావం సభ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. కన్హయ్య పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచే నగరంలో బీజేవైఎం నేతలు, అనుబంధ విభాగాల నాయకులు నిరసనలు నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. కన్హయ్య వస్తే అడ్డుకుంటామని బీజేపీ అనుబంధ విభాగాల నేతలు ప్రకటించారు. అడ్డుకుంటే తీవ్రపరిణమాలు ఉంటాయని ఏఐఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు. తొలుత సిదార్థ కళాశాల ఆడిటోరియంలో కన్హయ్య సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో ఐవీ ప్యాలెస్‌లో ప్రైవేట్ కార్యక్రమంగా సభ నిర్వహించారు.సభ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే హడావుడి మొదలై చివరకు తోపులాట, భజరంగ్‌దళ్ కార్యకర్తపై దాడికి దారితీసింది. పోలీసు బందోబస్తు నడుమ కన్హయ్య సభకు చేరుకున్నారు. కన్హయ్య పూర్తి ప్రసంగం, సభ జరిగిన తీరును పోలీసులు వీడియో తీశారు. పరస్పర నినాదాల హోరు.. కన్హయ్య గోబ్యాక్ అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు చూపుతూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఐవీ ప్యాలెస్ సెంటర్‌కు చేరుకున్నారు. దీనికి ప్రతిగా ఏఐఎస్ఎఫ్, వామపక్ష నాయకులు బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు వారించినా ఆగకుండా, తోపులాటకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడిపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడిచేశారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా మహిళా మెర్చా నాయకురాలు కర్రి నాగలక్ష్మి సమావేశ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు. వామపక్ష కార్యకర్తలు ఆమెను గుర్తించి దాడికి యత్నించేలోగా పోలీసులు అమెను బయటకు తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సమావేశ మందిరం బయట బీజేపీ రాష్ట్ర నాయకులు లక్ష్మీపతితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో 300 మంది పోలీసులతో సమావేశం మందిరం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసులతో పాటు ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు కూడా కర్రలు చేతబూని బందోబస్తు నిర్వహించారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం మొదలుకొని ఐవీ ప్యాలెస్ వరకు భారీగా పోలీసు పికెట్లు ఏర్పాటుచేశారు. సభలో భజరంగ్‌దళ్ కార్యకర్త నినాదాలు.. అనంతరం సభ ప్రారంభిస్తున్న సమయంలో జాతీయ జెండాతో భజరంగ్ దళ్ నాయకుడు సమావేశ మందిరంలో భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేయడంతో ఏఐఎస్ఎఫ్, వామపక్ష కార్యకర్తలు తీవ్రస్థాయిలో దాడి చేశారు. గుంటూరు భజరంగ్‌దళ్ కార్యకర్త దేవర వెంకట అనిల్‌ను తీవ్రంగా కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లారు. పోలీసులు అడ్డుకుని అనిల్‌ను ఆస్పత్రికి తరలించారు. ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు కర్రలతో సమావేశ మందిరంలో రక్షణగా నిలవడంతో సమావేశం మొదలైంది. 51 మంది బీజేవైఎం కార్యకర్తలపై కేసు సమావేశాన్ని అడ్డుకోవడానికి యత్నించారని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు 51మందిపై విజయవాడ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వీడియో రికార్డులు పరిశీలించిన అనంతరం దాడిచేసిన వారి అందరిపైనా కేసులు నమోదు చేయనున్నారు. -
అడుగడుగునా ఆంక్షలు
► కన్హయ్య రాకతో పటిష్ట బందోబస్తు ► భారీగా మోహరించిన పోలీసు బలగాలు ► అయినా ఆగని ఆందోళనలు సాక్షి, విజయవాడ : బెజవాడలో జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్యకుమార్ పాల్గొన్న సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఘర్షణలు చోటుచేసుకోకుండా ఉండాలని వందలాదిమంది పోలీసులను రంగంలోకి దింపారు. భారీగా బలగాలు మోహరించి ఉండగానే బీజేపీ, అనుబంధ విభాగాల నాయకులు, ఏఐఎస్ఎఫ్, వామపక్ష నేతల మధ్య తోపులాటతో మొదలై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏబీవీపీ కార్యకర్తలు బుధవారమే నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి కన్హయ్య సభను అడ్డుకుని నిరసన తెలియజేస్తామని అనుమతి కోరడం, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను ఆపబోమని వామపక్ష నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొదట్నుంచి కొనసాగిన హైడ్రామా... కన్హయ్యకుమార్ సమావేశం ఆదినుంచి తీవ్ర హైడ్రామా నడుమ కొనసాగింది. తొలుత నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో కన్హయ్య రాకను నిరసిస్తూ బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఉదయం సిద్ధార్థ వద్ద ఆందోళన నిర్వహించారు. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఐవీ ప్యాలెస్‌లో ఏర్పాటుచేశారు. పూర్తి ప్రైవేట్ కార్యక్రమం కావడంతో పోలీసులు సమావేశంపై నిఘా ఉంచి సమావేశాన్ని విడియో చిత్రీకరించారు. బీజేపీ, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న క్రమంలో సభాప్రాంగణం వద్ద సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకులు కర్రలతో, వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మోహరించారు. బీజేపీ, ఏబీవీపీ భజరంగ్‌దళ్ కార్యకర్తలు సభ వెలుపల నిరసన తెలియజేయడానికి రావడంతో ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు, వరుస దూషణలు చేసుకోగా తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడ్నుంచి పంపివేశారు. అంతకుముందే సభలోకి బీజేపీ నాయకురాలు కర్రి నాగలక్ష్మి వెళ్లగా వామపక్ష కార్యకర్తలు ఆమెతో వాదనకు దిగారు. పోలీసులు వెంటనే ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. బయట ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు లక్ష్మీపతితోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 51 మంది బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500 మంది పోలీసులతో బందోబస్తు కన్హయ్యకుమార్కు గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపల 30 మంది పోలీసులను ఉంచారు. ఆయనకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బయట, నిడమానూరు సెంటర్, రామవరప్పాడు రింగ్ తదితర ప్రాంతాల్లో 70 మంది పోలీసులతో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నగరంలోకి వచ్చాక ఐవీ ప్యాలెస్ రోడ్డులో టాఫ్రిక్ దారి మళ్లించి రోడ్డుకు రెండువైపులా బ్యారికేడ్లు పెట్టారు. సుమారు 300 మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లాఅండ్ ఆర్డర్ డీసీపీ కాళిదాసుతో పాటు నలుగురు ఏసీపీలు బందోబస్తును పర్యవేక్షించారు. ఐవీ ప్యాలెస్ రోడ్డులో హోటళ్లు, షాపులను మూసివేయించారు. దీంతో అక్కడ కర్ఫ్యూ వాతవరణం నెలకొంది. -
ఉద్రిక్తం
► కన్హయ్య రాకతో పటిష్ట బందోబస్తు ► భారీగా మోహరించిన పోలీసు బలగాలు ► అడుగడుగునా ఆంక్షలు ► అయినా ఆగని ఆందోళనలు సాక్షి, విజయవాడ : బెజవాడలో జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్యకుమార్ పాల్గొన్న సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఘర్షణలు చోటుచేసుకోకుండా ఉండాలని వందలాదిమంది పోలీసులను రంగంలోకి దింపారు. భారీగా బలగాలు మోహరించి ఉండగానే బీజేపీ, అనుబంధ విభాగాల నాయకులు , ఏఐఎస్ఎఫ్, వామపక్ష నేతల మధ్య తోపులాటతో మొదలై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏబీవీపీ కార్యకర్తలు బుధవారమే నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి కన్హయ్య సభను అడ్డుకుని నిరసన తెలియజేస్తామని అనుమతి కోరడం, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను ఆపబోమని వామపక్ష నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొదట్నుంచి కొనసాగిన హైడ్రామా... కన్హయ్యకుమార్ సమావేశం ఆదినుంచి తీవ్ర హైడ్రామా నడుమ కొనసాగింది. తొలుత నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో కన్హయ్య రాకను నిరసిస్తూ బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఉదయం సిద్ధార్థ వద్ద ఆందోళన నిర్వహించారు. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఐవీ ప్యాలెస్‌లో ఏర్పాటుచేశారు. పూర్తి ప్రైవేట్ కార్యక్రమం కావడంతో పోలీసులు సమావేశంపై నిఘా ఉంచి విడియో చిత్రీకరించారు. బీజేపీ, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న క్రమంలో సభాప్రాంగణం వద్ద సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకులు కర్రలతో, వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మోహరించారు. బీజేపీ, ఏబీవీపీ భజరంగ్‌దళ్ కార్యకర్తలు సభ వెలుపల నిరసన తెలియజేయడానికి రావడంతో ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు, వరుస దూషణలు చేసుకోగా తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడ్నుంచి పంపివేశారు. అంతకుముందే సభలోకి బీజేపీ నాయకురాలు కర్రి నాగలక్ష్మి వెళ్లగా వామపక్ష కార్యకర్తలు ఆమెతో వాదనకు దిగారు. పోలీసులు వెంటనే ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. బయట ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు లక్ష్మీపతితోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 51 మంది బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500 మంది పోలీసులతో బందోబస్తు కన్హయ్యకుమార్కు గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బయట, నిడమానూరు సెంటర్, రామవరప్పాడు రింగ్ తదితర ప్రాంతాల్లో 70 మంది పోలీసులతో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నగరంలోకి వచ్చాక ఐవీ ప్యాలెస్ రోడ్డులో టాఫ్రిక్ దారి మళ్లించి రోడ్డుకు రెండువైపులా బ్యారికేడ్లు పెట్టారు. సుమారు 300 మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశా రు. లాఅండ్ ఆర్డర్ డీసీపీ కాళిదాసుతో పాటు నలుగురు ఏసీపీలు బందోబస్తును పర్యవేక్షించారు. ఐవీ ప్యాలెస్ రోడ్డులో హోటళ్లు, షాపులను మూసివేయించారు. అక్కడ కర్ఫ్యూ వాతవరణం నెలకొంది. -
వామపక్ష ఉద్దండులు ప్రేక్షకులైన వేళ..
హైదరాబాద్: వారు వామపక్ష ఉద్దండులు, ప్రముఖులు... ప్రేక్షకుల్లా కూర్చుని కన్హయ్యకుమార్ ప్రసంగం విన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్గవర్గ సభ్యులు అజీజ్‌పాషా, కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు చెరుపల్లి సీతారామయ్య, నంద్యాల నర్సింహారెడ్డిలతో పాటు విద్యావేత్త చుక్కా రామయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తదితరుల సాధారణ కార్యకర్తల్లాగా ప్రేక్షకుల్లో కూర్చుని కన్హయ్య ప్రసంగాన్ని విన్నారు. వేదికపై మల్లేపల్లి లక్ష్మయ్య మినహా వామపక్ష విద్యార్థి సంఘాల జాతీయ, రాష్ట్ర నేతలకే అవకాశం కల్పించారు. -
యూనివర్సిటీలపై వ్యూహాత్మక దాడి
విద్యార్థులపై బీజేపీ దమనకాండకు దిగుతోంది జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ హైదరాబాద్: అభివృద్ధి నినాదంతో గెలిచి ఇప్పుడు దాని స్థానంలో హిందుత్వవాదాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని.. దానిని ప్రశ్నిస్తున్న విద్యార్థి లోకంపై వ్యూహాత్మకంగా దాడి చేస్తోం దని జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ ఆరోపించారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో దమనకాండ చోటుచేసుకుంటోందన్నారు. ఇది కేవలం జేఎన్‌యూ, హెచ్సీయూలకే పరిమితం కాలేదని... అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, పుణె, జాదవ్‌పూర్, అలహాబాద్ వర్సిటీలకూ విస్తరించిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో వివక్షను దూరం చేసేందుకు తాము డిమాండ్ చేస్తున్న రోహిత్ చట్టం కోసం పోరాడుతూనే ఉంటామని, తమకు పౌర సమాజం అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో కన్హయ్యకుమార్ విలేకరులతో మాట్లాడారు. తమకు రోహిత్ వేముల ఆదర్శమని, అఫ్జల్‌గురు కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం ఉన్న తాము ఆందోళనను పూర్తి శాంతియుత వాతావరణంలోనే నిర్వహిస్తున్నామన్నారు. కానీ ప్రభుత్వమే దానిని ఉద్రిక్తంగా మారుస్తోందని ఆరోపించారు. బుధవారం తాను హెచ్‌సీయూకి వచ్చే కార్యక్రమం ఎప్పుడో ఖరారైనా.. సరిగ్గా ఒకరోజు ముందే వీసీ అప్పారావు విశ్వవిద్యాలయానికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ఆయన వచ్చేసరికే ఆయన అభిమానులు, అనుకూల విద్యార్థులు ఆయన గదిలో ఉండి మరీ స్వాగతం పలికారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసేవారు వీసీ చాంబర్‌పై దాడి ఎందుకు చేశారని ప్రశ్నించిన విలేకరులపై కన్హయ్య అసహనం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో దేశ వ్యతిరేక నినాదాలు, అఫ్జల్‌గురుకు అనుకూలంగా మాట్లాడడం పట్ల ప్రశ్నలు సంధించడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. ‘‘మీరు కూడా అసలు విషయం వదిలి పక్కదారిలో వెళ్తున్నారు. జేఎన్‌యూ నినాదాలకు మాకు సంబంధం లేదు. వీసీ చాంబర్‌పై దాడి ఎవరు చేశారో తేల్చేందుకు నేను పోలీసును కాదు, విద్యార్థిని. వాస్తవమేమిటో పోలీసులు తేలుస్తారు’’ అని చెప్పారు. ప్రభుత్వ దమనకాండకు విలేకరులు కూడా బలవుతున్నారని, సమాజం కోసం పరితపించేవారికి రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. దేశభక్తి అంటే మోదీ భక్తి కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని, విద్యార్థి నేతగా రోహిత్ చట్టం కోసం పోరాడడమే ప్రస్తుతం తన లక్ష్యమని చెప్పారు. -
సప్తవర్ణాల విప్లవానికి సిద్ధం
హైదరాబాద్ సదస్సులో కన్హయ్యకుమార్ భారతమాత, భారత్‌కీ అమ్మీ, మదర్ ఇండియా ఒక్కరే భారతమాతను విభజించే కుట్ర జరుగుతోంది జాతీయ జెండాను కాషాయమయం చేస్తున్నారు అభివృద్ధిలో విఫలమైన బీజేపీ నకిలీ జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చింది హైదరాబాద్: ఆకుపచ్చ, తెలుపు, కాషాయ రంగులు తమవేనని.. తమ దృష్టిలో భారతమాత, భారత్‌కీ అమ్మీ, మదర్ ఇండి యా అందరూ భారతమాతలేనని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ చెప్పారు. భారతమాతను విభజించడం వెనక కుట్ర దాగి ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ప్రసంగించారు. ‘‘భారతమాత ఉంది. ఆమె తెల్లగానేకాదు నల్లగా, చామనఛాయగానూ ఉంటుంది. ధగధగా మెరిసే పట్టుచీరలోనేకాదు చిరిగిన మువ్వన్నెల చీరలోనూ ఉంటుంది. ఆదివాసులకు ప్రతీకైన సల్వార్ కమీజ్లోనూ ఉండొచ్చు. కానీ ఒక్క మీ దృక్కోణం నుంచే, మీకు నచ్చిన రంగులోనే భారతమాతను చూపలేరు. భారతదేశపు రంగే భారతమాత రంగు. అదే దేశ ప్రజల రంగు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆ రంగును వినియోగంచలేరు. ఎరుపు (వామపక్షవాదుల) రంగుకు వ్యతిరేకంగా నీలం (అంబేడ్కరిస్టుల) రంగును ఉపయోగించలేరు. ఎరుపు, నీలం వర్ణాల ఐక్యతతో కులతత్వం, మతతత్వంపై పోరాడుతాం. ఈ రంగులే కాదు సప్తవర్ణాలూ ఉంటాయి. అంటరానితనం, అగ్ర, నిమ్న విభేదాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో విప్లవం సాధ్యం కానుంది. మేం సప్తవర్ణాల విప్లవానికి సిద్ధంగా ఉన్నాం..’’ అని కన్హయ్య చెప్పారు. విద్యార్థులకు వ్యతిరేకంగా భద్రతా దళాలను నిలబెట్టే కుట్రలో విజయం సాధించలేరని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేస్తున్న వారూ అమరులేనని, పొలాల్లో చనిపోతున్న రైతులూ అమరులేనని, వర్సిటీల్లో ప్రాణత్యాగం చేస్తున్న రోహిత్ లాంటి వారూ అమరులేనని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు వీరంతా త్యాగాలు చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధిలో విఫలమైన బీజే పీ మతోన్మాద విధానాలతో నకిలీ జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఈ దేశం ఏ ఒక్క భాష, మతం, కులం, లింగానికి చెందినది కాదని... అన్ని రకాల జాతీయవాదాలను గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్రోనీ క్యాపిటలిజమే పెద్ద సమస్య దేశానికి, యావత్ ప్రపంచాన్ని క్రోనీ క్యాపిటలిజం పట్టిపీడిస్తోందని కన్హయ్య పేర్కొన్నారు. ముస్లింలు అమెరికా వదిలి వెళ్లాలన్న డోనాల్డ్ ట్రంప్‌కు అమెరికాలో మద్దతు పెరుగుతుండడం దానికి నిదర్శనమన్నారు. అల్లర్లు చేయించి ఎలా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారో ఆలోచించాలని చెప్పారు. తమ పోరాటం ఒక వర్సిటీకి పరిమితమైనదికాదని, వేల ఏళ్ల అంటరానితనం అంతానికి పోరాటమని వ్యాఖ్యానించారు. మార్క్సిస్టు, అంబేడ్కరైట్, సోషలిస్టు, లోహియాయిస్టు, తటస్తులు.. ఇలా ఏ భావజాలపు ప్రజలైనా సరే ఈ రోజు ముప్పేట దాడిలో చిక్కుకున్నారని... ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని పేర్కొన్నారు. తాను దేశంలోని విద్యార్థులను ఏకం చేస్తున్నానని ఓ వ్యక్తి విమర్శించాడని... ఎవరు విభజిస్తే తాము ఏకం చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే సమాధానం రాలేదని చెప్పారు. ఒక చిహ్నం ఆధారంగా ప్రజలను విభజించేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ జెండా నుంచి తెలుపు, ఆకుపచ్చ రంగులు, అశోక చక్రాన్ని మాయం చేసి పూర్తిగా కాషాయమయం చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. విద్యార్థులు ముందుకు రావాలి యూనివర్సిటీల్లో, వివిధ రంగాల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టేందుకు విద్యార్థులు ముందుకు రావాలని కన్హయ్య పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సుకు ముందు మఖ్దూం భవన్లో ఆయన మాట్లాడారు. తాము చేసే ఉద్యమాలకు మద్దతుగా వచ్చే వామపక్షాలను సైతం కలుపుకోవాలని... మత అసహనానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడాలని పేర్కొన్నారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును వెనక్కి పంపేందుకు పోరాడాలన్నారు. భావాలు వేరైనా పోరు ఒకటే... ‘‘శ్రామికవర్గం విముక్తి కోసం పోరాడే మార్క్సిస్టు కావచ్చు, దళితుల విముక్తి కోసం పోరాడే అంబేడ్కరైట్స్ కావచ్చు, ఆదివాసుల హక్కుల కోసం పోరాడేవాళ్లు ఉండవచ్చు, అల్ప సంఖ్యాకుల హక్కుల కోసం పోరాడేవాళ్లు కావచ్చు.. సరళీకృత విధానాల తరంలో అందరి పోరాటం ఒకటే అయింది..’’ అని కన్హయ్య పేర్కొన్నారు. కులం, మతం ఏదైనా అణచివేతకు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. దళితులైనా, ఆది వాసులైనా, మైనారిటీలదైనా, మహిళలలైనా లడాయి ఒక్కటేనన్నారు. కేవలం వంద గృహాలు దేశ సంపదలో 95 శాతాన్ని తమ అధీనంలో ఉంచుకున్నాయని, వాళ్ల పక్షానే బీజేపీ నిలబడిందని ఆరోపించారు. మోదీజీ.. ఆశలెందుకు రేపారు? ఆప్ మేరీ గలీమే ఆయే క్యోం (మీరు మా వీధికి ఎందుకొచ్చారు) నాఉమ్మీదీ మే ఉమ్మీద్ జగాయే క్యోం (నైరాశ్యపు మనసుల్లో ఆశలెందుకు రేపారు) ఖుష్ థే అప్నే ముఫ్లిసీ మే (మా దైన్యంలో మేం ఆనందంగా ఉంటిమి) అచ్ఛే దిన్కా సప్నే దిఖాయే క్యోం (మంచి రోజుల కలలెందుకు చూపారు) మోదీపై సదస్సులో అప్పటికప్పుడు రాసిన ఈ కవితను కన్హయ్య చదివి వినిపించారు -
అరెస్టు చేయకుండా మళ్లీ బాధ్యతలా?
హెచ్‌సీయూ వీసీ వ్యవహారంలో ఉత్తమ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులున్న వ్యక్తికి హెచ్‌సీయూ వైస్‌చాన్సలర్‌గా మళ్లీ బాధ్యతలు అప్పగించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాశవిక రాజకీయాలకు నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు రోజా ఎంజాన్లతో కలసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. హెచ్‌సీయూలో వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని వివరించారు. అలాంటి వీసీని అరెస్టు చేయకుండా మళ్లీ అదే పదవిలో తిరిగి నియమించడం దారుణమన్నారు. యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా చేసుకుని బీజేపీ సర్కార్ అమానుష నిర్ణయాలు తీసుకుంటోందని, దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతునిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. హెచ్‌సీయూలో పోలీసురాజ్యం నడుస్తున్నదని, యూనివర్సిటీలోకి విద్యార్థులను కూడా రానివ్వడం లేదని అన్నారు. పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, ప్రశ్నించేవారిని అణచివేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉద్యమ వాతావరణ నెలకుంటోందని రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే భయంతోనే యూనివర్సిటీల్లో ఉద్యమాలపై, విద్యార్థులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీసీని రీకాల్ చేయాలి: వీహెచ్ హెచ్‌సీయూ వీసీని వెంటనే రీకాల్ చేయాలని ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఢిల్లీ విద్యార్థినేత కన్హయ్య కుమార్ రావడానికి ముందుగానే వీసీని తిరిగి నియమించడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. కన్హయ్య సమావేశాన్ని ఆపడానికే వీసీని మళ్లీ తీసుకొచ్చారని ఆరోపించారు. వీసీని రీకాల్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని, రాష్ట్రపతికి లేఖ రాయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
హెచ్‌సీయూ అష్టదిగ్బంధం
కన్హయ్య కాన్వాయ్ అడ్డగింత.. వర్సిటీ గేట్లన్నీ బంద్.. ఆంక్షలు.. హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని బుధవారం పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. పరిపాలనా భవనం, ప్రధాన గేటు షాపింగ్ కాంప్లెక్స్ తదితర అన్నిచోట్లా భారీగా మోహరించారు. మెస్‌లు, ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. వర్సిటీకి నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను ప్రధాన గేటు వద్దే అడ్డగించారు. దాంతో ఆయన గేటు వద్దే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుకుపడ్డారు. కొద్దిరోజులుగా జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావించిన పాలకవర్గం వర్సిటీని బుధవారం పోలీసుల చేతికి అప్పగించింది. ‘‘ప్రధాన ద్వారం మినహా అన్ని గేట్లు మూసేస్తున్నాం. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులను మినహా మీడియా, రాజకీయ నాయకులు, వేరే వర్సిటీల విద్యార్థి సంఘాల నేతలెవరినీ అనుమతించబోం’’ అని పేర్కొంటూ ఇన్చార్జి రిజిస్ట్రార్ మంగళవారమే సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇందుకవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దాంతో పోలీసులు మంగళవారం రాత్రి నుంచే వర్సిటీలో అడుగడుగునా మోహరించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ అప్పారావు ఆదేశాల మేరకు ఉదయం నుంచి ప్రధాన ద్వారం సహా అన్ని గేట్లనూ మూసివేయించారు. ఐడీ కార్డులు చూపిన విద్యార్థులను, వర్సిటీ సిబ్బందిని మినహా ఎవరినీ లోనికి అనుమతించలేదు. కవరేజీకివెళ్లిన మీడియాను సైతం గేటు బయటే అడ్డుకున్నారు. వర్సిటీల్లో పోలీసులకేం పనంటూ విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల అరెస్టును నిరసిస్తూ వర్సిటీ బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిరసనకు దిగారు. కేంద్రానికి, వీసీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రోహిత్ మృతికి కారణమైన వీసీని అరెస్టు చేయక పోగా ఆయనకే మళ్లీ వర్సిటీ పగ్గాలు అప్పగిస్తారా అని ప్రశ్నించారు. ఆయన్ను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. బోధనేతర సిబ్బంది సహాయ నిరాకరణ మరోవైపు, వీసీ చాంబర్‌ను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బోధనేతర సిబ్బంది సహాయ నిరాకణ చేశారు. మెస్‌లు మూసేసి వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట మూడు గంటలపాటు ధర్నాకు దిగారు. ధర్నాకు ఏబీవీపీ మద్దతు పలికింది. దాడికి పాల్పడ్డ విద్యార్థులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మెస్‌లు బంద్ చేయడంతో వంట చే సుకునేందుకు రోడ్డుపై పొయ్యి పెట్టేందుకు విద్యార్థి జేఏసీ నేతలు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థి నాయకులు తమ మాట వినకపోవడంతో లాఠీలకు పని చెప్పి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి ఎనిమిదింటికి విద్యార్థులు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద వంటావార్పు నిర్వహించి అక్కడే భోంచేశారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్సిటీకి నాలుగు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్టు రిజిస్ట్రార్ సర్క్యూలర్ జారీ చేశారు. సోమవారం నుంచి యథావిధిగా తరగతులుంటాయన్నారు. ఆందోళనలను అడ్డుకునేందుకు వీసీయే ఈ చర్యకు దిగారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ గేటు వద్ద రోహిత్ తల్లి బైఠాయింపు హైకోర్టు సీజేను కలిసేందుకూ యత్నం హైదరాబాద్: హెచ్‌సీయూలోకి వ్రేశించేందుకు బుధవారం రాత్రి ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన రోహిత్ వేముల తల్లి రాధికను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా ఆమె అక్కడే కుమారుడు రాజాతో కలిసి కాసేపు బైఠాయించారు. రాధికకు మద్దతుగా విద్యార్థులు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. వీసీ అప్పారావుకు తన కడుపు కోత తెలియదని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. ‘‘నా కొడుకు చనిపోయినప్పుడు కనిపించని వందలాది మంది పోలీసులు వీసీ ఆఫీసుపై విద్యార్థులు దాడి చేశారన్న నెపంతో మోహరించడం దారుణం. విద్యార్థుల పోరాటానికి నా మద్దతుంటుంది. రోహిత్ చట్టం వచ్చేదాకా విద్యార్థులతో కలిసి పోరాడతా’’ అని స్పష్టం చేశారు. అంతకుముందు, హెచ్‌సీయూలో విద్యార్థుల హక్కులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ, పోలీసు శాఖల తీరును నియంత్రించాలంటూ పౌర హక్కుల సంఘం నేతలతో కలిసి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసేందుకు రాధిక ప్రయత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కాసేపటికి సీజే నివాసంలోని హైకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసేందుకు అనుమతించారు. హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి విద్యార్థుల హక్కులను కాపాడాలని ఆమె కోరగా... సమయం మించిపోయిందని, గురువారం విచారిస్తారని రిజిస్ట్రార్ తెలిపారు. -
లాఠీలు, తూటాలతో గొంతు నొక్కలేరు
♦ మరెందరు రోహిత్‌లను బలి తీసుకుంటారు? ♦ ప్రజాస్వామ్య పరిరక్షణకే మా పోరాటం: కన్హయ్య సాక్షి, హైదరాబాద్: ‘‘లాఠీలు ఝళిపించి, తూటాలు కురిపించి ఉద్యమాలను ఆపలేరు. మా గొంతు నొక్కలేరు’’ అని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ హెచ్చరించారు. కొద్ది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లిని పరామర్శించడానికి బుధవారం సాయంత్రం వర్సిటీకి చేరుకున్న కన్హయ్య బృందాన్ని ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. లోనికి ప్రవేశాన్ని నిరాకరించారు. వర్సిటీతో సంబంధం లేని బయటి వ్యక్తులెవరినీ లోపలికి అనుమతించొద్దని పైనుంచి ఆదేశాలున్నాయని అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు. దాంతో హెచ్‌సీయూ ప్రధాన ద్వారం ముందు భారీగా గుమిగూడిన ప్రాంతీయ, జాతీయ మీడియానుద్దేశించి కారు ఫుట్‌బోర్డుపై నిలబడే కన్హయ్య ప్రసంగించారు. రోహిత్ లాంటివాళ్లను మరెంతమందిని బలి తీసుకుంటారని ఆవేశంగా ప్రశ్నించారు. స్వతంత్ర భారతదేశంలో మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సమైక్యతను కాపాడేందుకు మేం పోరాడుతున్నాం. మిత్రుడు రోహిత్‌కు న్యాయం జరిగేందుకు, రోహిత్ చట్టం అమలు కోసం పోరాడుతున్నాం. రోహిత్‌కు న్యాయం కోసం, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ బలిపీఠమెక్కిన రోజున హెచ్సీయూకు వచ్చాం. కానీ బాధాకరమైన విషయమేమిటంటే కేంద్రం విద్యార్థుల గొంతు వినడం లేదు. మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వని హెచ్‌సీయూ యంత్రాంగం, పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని లోనికి అనుమతించని హెచ్‌సీయూ పాలకులకు ఒక్కటే చెప్పదలిచా. లాఠీలు ఝళిపించినా, ఆస్పత్రులపాలు చేసినా మా గొంతు నొక్కలేరు’’ అన్నారు. అంబేడ్కర్, షహీద్ భగత్‌సింగ్ కలలుగన్న భారతావనిని నిర్మిస్తామన్నారు. రోహిత్ కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు. అందుకోసం దేశంలో సామాజిక న్యాయం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తాము హింసను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఈ దేశంలో కులవాదం, అస్పృశ్యత, అగ్ర, నిమ్నవర్ణ భేదాల నుంచి విముక్తి లభించాలి. ‘ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి నుంచి’ విముక్తి కావాలి. ఇదే మేం కోరుకునే ఆజాదీ’’ అని మీడియా ప్రశ్నకు బదులుగా పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం తథ్యమన్నారు. తాము శాంతి కాముకులమని, హింసను కోరుకోమని స్పష్టం చేశారు. హెచ్‌సీయూలో మంగళవారం పోలీసుల లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు. అనంతరం కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్ రావు (సీఆర్) ఫౌండేషన్‌లో రోహిత్ వేముల తల్లి రాధికను కన్హయ్య పరామర్శించారు. సాయంత్రం 5.30కు ఆమెను కలసి దాదాపు పది నిమిషాలు మాట్లాడారు. పోటాపోటీ నినాదాలు అంతకుముందు ప్రసంగం అనంతరం విద్యార్థులతో కలిసి కన్హయ్య చేసిన నినాదాలతో హెచ్‌సీయూ ప్రధాన గేటు ప్రాంతమంతా మార్మోగింది. ‘జై భీం’, ‘రోహిత్ వేములకు న్యాయం కావాలి’, ‘రోహిత్ చట్టం తేవాలి’, ‘సామాజిక న్యాయం జిందాబాద్’, ‘కులవాదం ముర్దాబాద్’, ‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వర్థిల్లాలి’, ‘ఇంకెందరు రోహిత్‌లను చంపుతారు?’ ‘ఇంటింటి నుంచీ ఓ రోహిత్ వస్తాడు’ అంటూ హోరెత్తించారు. కన్హయ్య హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ‘దేశ్‌ద్రోహి కన్హయ్య గో బ్యాక్’ అంటూ ఓ ఏబీవీపీ విద్యార్థి నినదించాడు. ‘కన్హయ్య జిందాబాద్’ అంటూ మరో వర్గం విద్యార్థులు హోరెత్తించారు. ఏబీవీపీ విద్యార్థిని పోలీసులు పక్కకు లాక్కెళ్లారు. నారాయణ, చాడ స్వాగతం కన్హయ్యకు బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. వర్సిటీల్లో సామాజిక న్యాయం కోసం పోరాడతానని ఈ సందర్భంగా ఆయనన్నారు. కన్హయ్యను చూసి కేంద్రం భయపడుతోందని నారాయణ ఎద్దేవా చేశారు. కన్హయ్యరాక సందర్భంగా విమానాశ్రయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్హయ్యను మేం అడ్డుకోలేదు: పోలీసులు అనుమతి ఉన్నా ఆయనే లోనికి వెళ్లలేదని వివరణ హెచ్‌సీయూలోకి వెళ్లకుండా కన్హయ్యను తాము అడ్డుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన లోనికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించలేదన్నారు. ‘‘రెండు వాహనాలను లోపలికి అనుమతించాలని సిబ్బందికి సైబరాబాద్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రాంచంద్రారెడ్డి సూచించారు. కానీ పోలీసులను సంప్రదించకుండానే కన్హయ్య వెనుదిరిగారు. అనుమతి ఉన్నా లోపలికి వెళ్తానని అడగలేదు’’ అని పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూలోని రోహిత్ స్తూపం వద్దకు వెళ్లేందుకు కన్హయ్యతో పాటు మరో పది మంది బృందాన్ని మాత్రమే అనుమతి ఇస్తామని వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది చెప్పగా, కాన్వాయ్‌తో పాటు అందరినీ అనుమతించాలని వారు కోరారు. వీసీ ఆదేశాల మేరకు సిబ్బంది అందుకు అంగీకరించలేదు. నేడు కన్హయ్య సభ నిర్వహించి తీరతాం: నారాయణ వామపక్ష భావజాలమున్న విద్యార్థులను కేంద్రం అణగదొక్కుతోందని సీపీఐ నేత కె.నారాయణ ధ్వజమెత్తారు. వర్సిటీలను పోలీసు క్యాంప్‌లుగా మార్చుతున్న కేంద్రానికి గుణపాఠం చెబుతామన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం కన్హయ్య కుమార్ సమావేశానికి పోలీసులు అనుమతివ్వకపోతే పార్కులోనైనా నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. హాల్ మీటింగ్ రద్దు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. -
వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి మార్గదర్శకాలు
విడుదల చేసిన మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వృద్ధులు, వికలాంగులు ఎటువంటి అడ్డంకుల్లేకుండా సులభంగా వెళ్లడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారమిక్కడ విడుదల చేశారు. కొత్తగా నిర్మించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వృద్ధులు, వికలాంగులు లిఫ్ట్‌లు, మెట్లు, వీల్‌చెయిర్‌పై వెళ్లడానికి వీలుగా తగిన మార్పులు చేయడం ఆయా పట్టణ ప్రణాళికలో, భవన నిర్మాణంలో ఒక భాగం కావాలనేది ఈ మార్గదర్శకాల ఉద్దేశమని వివరించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ఆమోదించి స్థానిక సంస్థలకు సిఫార్సు చేయాలన్నారు. పట్టణ గణాంకాలతో కూడిన కరదీపికను ఆయన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పట్టణాలకు సంబంధించిన పూర్తి గణాంకాలు, ఆయా పట్టణాల్లో ఉన్న రహదారులు, నీటిసౌకర్యం, పారిశుద్ధ్యం, హౌసింగ్, విద్యాసంస్థలు తదితర వివరాల సమగ్ర దర్శిని ఇదన్నారు. దీన్ని రాష్ట్రప్రభుత్వాలు కిందిస్థాయివరకూ తీసుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం వద్దు ‘వర్సిటీల్లో రాజకీయం జోక్యం ఉండరాదు. దయచేసి రాజకీయ నేతలు వర్సిటీల వాతావరణాన్ని కలుషితం చేయవద్దు. ఆ విశ్వవిద్యాలయంలో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలనా మండలి ఆ విషయాల్ని సరిచూసుకోగలరు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. హెచ్ సీయూలో జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న వార్తలపై మంత్రి స్పందిస్తూ..రోహిత్ ఆత్మహత్య ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిదని, అది పూర్తవాల్సి ఉందని చెప్పారు. ఎవరూ హింసకు పాల్పడకూడదని, చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని సూచించారు. రాజకీయ అవసరాలకోసం విశ్వవిద్యాలయాల వాతావరణాన్ని కలుషితం చేయకూడదని తాను అందర్నీ కోరుతున్నానన్నారు. -
నగరం
రోజంతా ఉద్రిక్త వాతావరణం హెచ్‌సీయూ...ఓయూల్లో విద్యార్థుల ఆందోళన ఓయూలో పరస్పర దాడులు...గాయాలు అట్టుడికిన హెచ్‌సీయూ నగరంలో 40 డి గ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఓ వైపు మండుతున్న ఎండలు... మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఉస్మానియా విశ్వ విద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలతో నగరం వేడెక్కింది. మంగళవారం నాటి పరిణామాల నేపథ్యం... జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్ రాకతో హెచ్‌సీయూ అట్టుడికింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ... పరిస్థితి ఎటు దారి తీస్తుందోననే టెన్షన్... కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలతో విద్యార్థులు.. ఎలాగైనా నిలువరించాలనే ఉద్దేశంతో భారీగా మోహరించిన పోలీసులు.. బుధవారం ఉదయం నుంచీ సాయంత్రం వరకూ క్షణ క్షణం భయం భయంగా గడిచింది. ఇంకోవైపు ఉస్మానియా వర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో బయట పడిన మృతదేహం అక్కడ చిచ్చు రేపింది. అది తమ సహచరుని మృతదేహ మేనని... నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావించిన విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అక్కడికి చేరుకున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ఫలితంగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరువర్గాల దాడుల్లో అటు పోలీసు ఉన్నతాధికారులు... సిబ్బంది.. ఇటు విద్యార్థులు గాయపడ్డారు. ఆ మృతదేహం విద్యార్థిది కాదని పోలీసులు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. మొత్తమ్మీద తీవ్ర ఎండలకు తోడు.. వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలతో న‘గరం’..గరంగా మారింది. -
హైదరాబాద్ రానున్న కన్హయ్య కుమార్
హెచ్‌సీయూలో రోహిత్ స్మారకానికి నివాళి హైదరాబాద్: రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు సభల్లో పాల్గొనేందుకు ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్‌కు రానున్నట్లు సీపీఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తెలిపారు. సభలకు సంబంధించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సు పోస్టర్లను మంగళవారం నగరంలోని మఖ్దూం భవన్లో పలు సంఘాల నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కన్హయ్య బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని హెచ్సీయూకు వెళతారన్నారు. అక్కడ రోహిత్ స్మారక స్తూపానికి నివాళి అర్పించి రోహిత్ తల్లికి సంఘీభావం ప్రకటిస్తారన్నారు. అనంతరం హెచ్‌సీయూలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలను చైతన్యపరుస్తారన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం ఓ మతానికి మొగ్గు చూపుతూ భావ స్వేచ్ఛను అరికడుతోందని సుధాకర్ ఆరోపించారు. వీటన్నింటిపై కన్హయ్య ప్రసంగిస్తారని ఆయన వివరించారు. -
పోరుకు సిద్ధమంటున్న ఉమర్ సోదరి
న్యూఢిల్లీ: గిలానీ, నక్సల్స్లతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని రాజద్రోహంలో కేసులో నిందితుడైన జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ సోదరి 11 ఏళ్ల సారా ఫాతిమా తెలిపింది. బెయిల్‌పై విడుదలైన తన సోదరుడు ఉమర్, అనిర్బన్లకు శనివారం జేఎన్ యూ వర్సిటీలో మిగతా విద్యార్థులతో కలిసి ఆమె స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సారా ఫాతిమా మాట్లాడుతూ తన సోదరుడు విడుదల కావటం శుభపరిణామం అంటూ, అన్యాయంపై పోరాడతాం... ‘లాల్ సలామ్’, ‘ఆజాదీ‘ అంటూ నినాదాలు చేసింది. ఆమె ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన మాజీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ గిలానీ కి కూడా ఢిల్లీ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. -
వచ్చే వారంలో హైదరాబాద్‌కు కన్హయ్య
బీజేపీ కుట్రలను ఎదుర్కొనేందుకు సభలు: చాడ సాక్షి, హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఈ నెల 22న లేదా 24న హైదరాబాద్‌కు రానున్నారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన అనంతరం నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలకు దిగుతోందని విమర్శించారు. ఈ కుట్రలను ఎదుర్కొనేందుకు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు, దీనిలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో కన్హయ్య పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, జి.మల్లేష్లతో కలసి ఆయన విలేకరులకు తెలిపారు. రాష్ర్టంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మరో వెయ్యి గ్రామాలకు పార్టీని విస్తరించనున్నట్లు తెలియజేశారు. -
ఉమర్, అనిర్బన్ విడుదల
జేఎన్‌యూ విద్యార్థులకు 6 నెలల బెయిల్ ♦ ఢిల్లీ విడిచి వెళ్లరాదని షరతు న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఫిబ్రవరి 9న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి ష్యూరిటీ సమర్పించి బెయిల్ పొందాలని 12 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. తమ అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్లరాదని, కేసు దర్యాప్తు అధికారి పిలిచినప్పుడల్లా హాజరుకావాలని షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఉమర్, అనిర్బన్లకు జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అధ్యాపకులు సంగీతాదాస్ గుప్తా, రజత్ దత్తాలు ష్యూరిటీలు సమర్పించారు. ‘నిందితులపై మోపిన అభియోగాలు తీవ్రమైనవే. వారు దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు పోలీసులు సమర్పించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ పరిశీలనలో ఉంది. నిందితులు పారిపోయే అవకాశం ఉందనేందుకు పోలీసులు ఎటువంటి కారణాలు చూపలేదు. ఇదే తరహా అభియోగాలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి విభాగం నేత కన్హయ్య కుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిందితులకు 6 నెలలు బెయిల్ మంజూరు చేయడం సరైనదేనని భావిస్తున్నా’ అని జడ్జి రీతేష్‌సింగ్ పేర్కొన్నారు. అంతకుముందు .. నిందితులకు బెయిల్ మంజూరును పోలీసులు వ్యతిరేకించారు. పోలీసుల వాదనలతో కోర్టు విభేదించింది. అయితే ఒకవేళ ఈ కేసులో వారు దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు సహా 3 రకాల శిక్షలు విధించే అవకాశం ఉందని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు ఇద్దరు విద్యార్థులకు బెయిలు రావడంతో జేఎన్‌యూ విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.‘ఆజాదీ’(స్వాతంత్య్రం) కావాలంటూ నినాదాలు చేశారు. కాగా దేశం గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి బెయిలుపై వచ్చినందుకు ఎలా వేడుకలు చేసుకుంటారని, అతడు ఒలింపిక్ పతకం ఏమైనా తీసుకొచ్చాడా అని కన్హయ్యను ఉద్దేశించి నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన చిత్రం ‘బుద్ధ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్’ ముందస్తుగా శుక్రవారం వర్సిటీలో ప్రదర్శించగా లెఫ్ట్ విద్యార్థులు నిరసన తెలిపారు. నామమాత్రపు జవాబు.. ఫిబ్రవరి 9నాటి ఘటనపై షోకాజ్ నోటీసులు అందుకున్న విద్యార్థులు వరిసటీ క్రమశిక్షణ కమిటీకి నామమాత్రపు జవాబులు పంపించారు. నేరమేమిటో తెలియకుండా సంజాయిషీ ఏమని ఇస్తామని వారు పేర్నొన్నారు. -
‘పాక్ జిందాబాద్’ అని అన్నారు!
భారత్‌ను నాశనం చేస్తామనే నినాదాలూ చేశారు ♦ బయటి వ్యక్తులు వర్సిటీలో అలజడి సృష్టించారు.. కన్హయ్య, ♦ ఖాలిద్, అనిర్బన్‌ను బహిష్కరించండి: ‘జేఎన్‌యూ’పై నివేదిక న్యూఢిల్లీ: జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో బయటి వ్యక్తులు ‘భారత్‌ను నాశనం చేస్తాం’, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు అత్యున్నతస్థాయి విచారణ కమిటీ తేల్చింది. ఫిబ్రవరి 9న జరిగిన ఈ కార్యక్రమం వీడియో ఫుటేజీలో ‘భారత్ నాశనమయ్యేంత వరకు పోరాటం చేస్తాం’ అనే నినాదాలు కనిపించలేదని, అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం వాటిని ధ్రువీకరించారని స్పష్టంచేసింది. ‘భారత్‌ను ముక్కలు ముక్కలు చేస్తాం’ అని నినదించారన్న దాని గురించి కమిటీ నివేదికలో ప్రస్తావించలేదు. వర్సిటీ ప్రొఫెసర్ రాకేశ్ భట్నాగర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ నివేదికను రూపొందించింది. కార్యక్రమ నిర్వాహకులు బయటి వ్యక్తులను తీసుకురావడం, వారు రెచ్చగొట్టే నినాదాలు చేయడం దురదృష్టకరమంది. వీరి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల వర్సిటీ వాతావరణం ఉద్రిక్తంగా మారిందని, వీరు జేఎన్యూకు అపకీర్తి తెచ్చిపెట్టారని తెలిపింది. ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్యలు విద్యార్థుల్లో సామరస్యతను దెబ్బతీశారంది. అయితే కన్హయ్యపై ఎలాంటి అభియోగాలు పేర్కొనలేదు. ఏబీవీపీ సభ్యుడు సౌరభ్ శర్మ వర్సిటీలో ట్రాఫిక్‌కు అవరోధం కల్పించారని నిందించింది. కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికీ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే దీన్ని నిర్వహించారని ఆక్షేపించింది. బయటి వ్యక్తులను నియంత్రించడంలో వర్సిటీ భద్రతా విభాగం విఫలమైందని ఎత్తిచూపింది. కన్హయ్య కుమార్ ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారని, కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన వ్యతిరేకించారని పేర్కొంది. కార్యక్రమ ముఖ్య నిర్వాహకుల్లో ఉమర్ ఒకరని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని, సెక్యూరిటీ వారికిష్టమొచ్చినట్లు చేసుకోవచ్చని ఆయన అధికారులకు స్పష్టంచేసినట్లు తెలిపింది. ఈనెల 11న సమర్పించిన నివేదికలో కన్హయ్య, ఉమర్, భట్టాచార్యతోపాటు మరో ఇద్దరిని బహిష్కరించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. వర్సిటీ వీసీ ఇప్పటికే 21 మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసు ఇవ్వగా, వివరణకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. దీంతో తాజాగా గడువును ఈనెల 18 వరకు పొడిగించారని అధికారులు చెప్పారు. -
ఆ కరపత్రాలు నిజమైనవే!
♦ దుర్గామాతను దూషిస్తూ జేఎన్‌యూలో లభ్యమైన పత్రాలపై రిజిస్ట్రార్ నిర్ధారణ ♦ నకిలీవంటున్న విద్యార్థి సంఘాలు న్యూఢిల్లీ: జేఎన్‌యూలో సంఘ వ్యతిరేక శక్తులున్నాయనేందుకు రుజువులుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చూపిన కరపత్రాలు నిజమైనవేనని వర్సిటీ రిజిస్ట్రార్ భూపీందర్ మంగళవారం నిర్ధారించారు. వర్సిటీలో మహిషాసుర సంస్మరణ కార్యక్రమం సందర్భంగా దుర్గామాతను దూషిస్తూ కరపత్రాలు ప్రచురించారంటూ వాటిలోని అంశాలను లోక్‌సభలో స్మృతి చదవడం వివాదమవడం తెలిసిందే. కరపత్రాలకు సంబంధించి అప్పుడు స్థానికంగా పోలీసు కేసు నమోదైందని, వర్సిటీ నుంచి నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, తాను అప్పుడు రిజిస్ట్రార్ కాదు.. కనుక ఆ బృందం నివేదిక గురించి తనకు తెలియదని చెప్పారు. అయితే, ఆ కరపత్రాలు, పోస్టర్లు నకిలీవని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఆ వీడియోల్లో మార్పులుచేర్పులు ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమ వీడియోల్లో రెండు పూర్తిగా అసలైనవి కావని, వాటిలో మార్పుచేర్పులు జరిగాయని తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా.. సంబంధిత ఏడు వీడియోలను ఢిల్లీ సర్కారు ఫొరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్‌కు పంపించింది. వీటిలో రెండింటిలో ట్యాంపరింగ్ జరిగిందని పరీక్షల్లో తేలింది. జైలా? బెయిలా? కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. మరోవైపు, జేఎన్‌యూ విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్లకు కోర్టు మంగళవారం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను విధించింది. ‘కన్హయ్య మా వాడైనందుకు గర్విస్తున్నాం’ న్యూఢిల్లీ: జవహర్లాల్ నె హ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ తమ వాడైనందుకు గర్వపడుతున్నామని ఆయన మామ రాజేంద్ర సింగ్, సోదరుడు మణికాంత్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మద్దతు చూస్తుంటే తమకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో సోమవారం రాత్రి విద్యార్థులను ఉద్దేశించి రాజేంద్ర సింగ్ మాట్లాడారు. తమ గ్రామస్తులు స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషర్లను ఎదిరించి పోరాడారని.. కన్హయ్య అలాంటి ఘనచరిత్ర ఉన్న గ్రామం వాడన్నారు. తనను తాను చాయ్ వాలాగా చెప్పుకొనే మోదీ.. ఓ రైతు కొడుకు అయిన కన్హయ్యపై ఆరోపణలు వస్తుంటే ఏం మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. కన్హయ్యకు న్యూయార్క్ వర్సిటీ విద్యార్థుల సంఘీభావం కన్హయ్య కుమార్‌కు అమెరికాలోని రెండు ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థులు తమ సంఘీభావం తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ, కూపర్ యూనియన్ విద్యార్థులు ఫిబ్రవరి 27న కన్హయ్యకు మద్దతుగా వర్సిటీ క్యాంపస్‌లో బైఠాయించారు. అసంతృప్తిని వ్యక్తం చేయడం హక్కు అవుతుంది కానీ నేరం కాదని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ‘స్టాండ్ విత్ జేఎన్‌యూ’ పేరుతో పోస్ట్ చేసింది. -
నినాదాల వీడియో లేదు!
కన్హయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా వీడియో సాక్ష్యం లేదన్న ఢిల్లీ పోలీస్ న్యూఢిల్లీ: ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా ఎలాంటి వీడియో రుజువులూ లేవని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేశారు. రాజద్రోహం కేసుకు సంబంధించి కన్హయ్య దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా, జేఎన్‌యూలో వివాదాస్పద కార్యక్రమం జరుగుతున్న సమయంలో సివిల్ దుస్తుల్లో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ కార్యక్రమాన్ని ఎందుకు వీడియో తీయలేదని, దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారిపై అప్పుడే చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఆ రోజే(ఫిబ్రవరి 9న) కేసు ఎందుకు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభారాణి ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై ప్రశ్నల వర్షం కురిపించారు. జేఎన్‌యూ అధికారి తీసిన ఒక వీడియో ఉందని, అందులో కన్హయ్య ఉన్నాడు కానీ నినాదాలు చేసిన దృశ్యాలేవీ లేవని మెహతా వివరించారు. ఆ వీడియో ఉన్న మొబైల్‌ను స్వాధీనం చేసుకోకపోవడం, ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కార్యక్రమంలో పాల్గొనడం వేరు.. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వేరు’ అని వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమానికి అనుమతి తీసుకుంది కన్హయ్య కాదని, సంబంధిత పోస్టర్లపై కూడా ఆయన పేరు లేదని కన్హయ్య తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వివరించారు. దాంతో, కన్హయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఉందని మెహతా తెలిపారు. ఢిల్లీ పోలీస్, ఐబీ చేసిన సంయుక్త విచారణకు కన్హయ్య సహకరించలేదని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశాడని చెప్పారు. జేఎన్‌యూ తరహా ఘటనలు జాదవపూర్ యూనివర్సిటీలోనూ జరిగాయని, కన్హయ్యకు బెయిల్ ఇస్తే.. అలాంటివారిని ప్రోత్సహించినట్లవుతుందని వాదించారు. చివరకు, బెయిల్ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ ప్రతిభ బుధవారానికి వాయిదా వేశారు. కాగా, కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై కూడా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెరో దారిన వ్యవహరించాయి. కన్హయ్యకు బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించగా, కేంద్రం తరఫున ఢిల్లీ పోలీసులు బెయిల్ ఇవ్వవద్దంటూ కోరారు. మరోవైపు, అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించడాన్ని ‘చట్టబద్ధమైన హత్య’(జ్యుడీషియల్ కిల్లింగ్) అంటూ నినాదాలు చేయటాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను విచారించే ముందు అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయాన్ని తీసుకోవాలని సుప్రీం కోర్టు సోమవారం సలహా ఇచ్చింది. కాగా, దేశవ్యతిరేక నినాదాలు చేశారంటూ దాఖలైన కేసులో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యల పోలీసు కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఒకరోజు పొడిగించింది. జేఎన్‌యూ కొత్త రెక్టార్‌గా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చింతామణి మహాపాత్రను నియమించారు. జర్నలిస్టులకు నోటీసులు.. పటియాలా హౌజ్ కోర్టులో కన్హయ్యను హాజరుపరుస్తున్న సమయంలో హింస చోటు చేసుకున్న సందర్భంగా అక్కడే విధుల్లో ఉన్న 9 మంది జర్నలిస్టులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 15న జరిగిన ఆ ఘటనకు సంబంధించి తమవద్ద ఉన్న అన్ని రుజువులతో వచ్చి దర్యాప్తుకు సహకరించాలన్నారు. టాగూర్నూ జైల్లో వేసేవారు.. జాతీయవాద ఆరాధనను విమర్శిస్తూ విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ కూడా చాలా వ్యాఖ్యలు చేశారని జేఎన్‌యూ ప్రొఫెసర్ రణబీర్ చక్రవర్తి తెలిపారు. మృతులనూ తీసుకువచ్చి జైల్లో వేసే అవకాశముంటే.. ఈ పాలకులు ఆయనను కూడా తీసుకువచ్చేవారన్నారు. జేఎన్‌యూ ఆడిటోరియంలో జాతీయవాదంపై విద్యార్థులకు రణవీర్ పాఠం చెప్పారు. కాగా, కన్హయ్య అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో నిరసనలు జరుపుతున్న విద్యార్థులకు అక్కడి జిరాక్స్ షాప్స్ వారు సహకరించడం లేదు. పోస్టర్లను ఫొటోకాపీ తీసేందుకు వారు తిరస్కరిస్తున్నారని, అధికారుల ప్రోద్బలంతోనే చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్ ను దూషిస్తూ, చంపేస్తామని బెదిరిస్తూ మరో లేఖ వచ్చింది. -
రాజకీయాలదే రాజద్రోహం!
జాతీయతపై చర్చ జరగాలన్న జేఎన్‌యూ ‘రోహిత్ కా జేఎన్‌యూ’ అంటూ వెలిసిన పోస్టర్లు న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి.. తీహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్య కుమార్ కోసం ఎదురుచూస్తున్నామని ‘రోహిత్ కా జేఎన్‌యూ’, ‘జస్టిస్ ఫర్ రోహిత్’ పేరుతో వర్సిటీలో పోస్టర్లు వెలిశాయి. తీహార్ జైలునుంచి కన్హయ్య విడుదలై వర్సిటీకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు విద్యార్థులు, ప్రొఫెసర్లు కోరుతున్నట్లు వాటిలో ఉంది. ‘దేశంలో, వర్సిటీల్లో రాజద్రోహం గురించి కాదు.. రాజకీయాలే రాజద్రోహంగా తయారయ్యాయనే అంశంపై చర్చించాలి. భావప్రకటనను వ్యక్తీకరించినందుకు విద్యార్థులపై కేసులు పెట్టారు. ఇప్పుడు జాతీయతపై చర్చ జరగాలి’ అని జేఎన్‌యూఎస్‌యూ వైస్ ప్రెసిడెంట్ షెహ్లా రషీద్ షోరా తెలిపారు. రాజద్రోహం కేసులో జైలుపాలైన తోటి విద్యార్థులకు మద్దతుగా సందేశాలిచ్చేందుకు.. నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద పెద్ద గోడను నిర్మించే పనిలో ఉన్నారు. కాగా కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. ఫిబ్రవరి 24న జరిగిన విచారణలో కన్హయ్య లాయర్లు ఇచ్చిన వివరణపై జడ్జి విభేదించటంతో.. కేసు 29కి వాయిదా పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని కాంగ్రెస్ విమర్శించింది. జేఎన్‌యూ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ విపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అఫ్జల్‌గురు ఉరితీతపై జరుగుతున్న వివాదంతో జేఎన్యూకు ఎలాంటి నష్టమూ జరగదని.. వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు మేధావుల మద్దతుందని.. చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. అప్రజాస్వామిక నియంత పాలన తప్ప.. మేధావుల ఆలోచనను ఎవరూ ఆపలేరన్నారు. దేశంలో విభజన సృష్టించేందుకు కేంద్రం మద్దతు తెలుపుతోందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శించారు. అయితే.. దేశాన్ని విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కఠినచర్యలు తప్పవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమది బలహీన ప్రభుత్వం కాదని.. జాతివ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కాగా, రాజద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి, జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు అశుతోష్‌ను ఢిల్లీలోని ఆర్కేపురం స్టేషన్ పోలీసులు ఆదివారం రెండుసార్లు ప్రశ్నించారు. ఖాలిద్, అనిర్బన్లతో కలిసి అశుతోష్‌ను కార్యక్రమ నిర్వహణపైనే ప్రశ్నించారు.