Kannada movie
-
ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఈ శుక్రవారం 12కి పైగా మూవీస్-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటే మరో తెలుగు డబ్బింగ్ చిత్రం కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్న ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?'కేజీఎఫ్' తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాల్ని అప్పుడప్పుడు తీస్తున్నారు. గతేడాది ఇలానే 'కబ్జ' మూవీ తీయగా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ తరహా యాక్షన్ స్టోరీతో తీసిన మరో సినిమా 'మార్టిన్'. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన కన్నడ డబ్బింగ్ చిత్రం.. దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత మాయమైపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)ఇప్పుడు ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో తెలుగులో హీరోగా చేసి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా.. ఈ సినిమాకు స్టోరీ అందించగా, ఇతడి మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా నటించాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ సరైన కంటెంట్ లేకపోవడం, రవి బస్రూర్.. గతంలో తాను పనిచేసిన 'కేజీఎఫ్' లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి ఇవ్వడం లాంటి చాలా మైనస్‌లు ఈ మూవీలో ఉన్నాయి.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ) -
OTT: కన్నడ సూపర్ హిట్ మూవీ తెలుగులో.. అప్పుడే ట్రెండింగ్‌లో
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగులో వచ్చింది. ఈ మూవీ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. ప్రస్తుతం యూత్ ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చక్కగా చూపించారు. అంతర్జాతీయ అవార్డులుఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించేందుకు సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఆహాలో ట్రెండింగ్పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఆహాలో టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.చదవండి: అమితాబ్ బచ్చన్ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు -
ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే ఇష్టపడేవాళ్లకు ఇది మరింత నచ్చేయొచ్చు. ఇప్పటికే కన్నడ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)'దసరా' సినిమాలో నాని పక్కన నటించిన దీక్షిత్ శెట్టి.. 'బ్లింక్' మూవీలో హీరోగా చేశాడు. మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేస్తే తొలుత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తర్వాత మౌత్ టాక్‌తో హిట్ అయింది. ఇప్పుడు దీన్ని తెలుగులో నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చేశారు.'బ్లింక్' విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనేది డ్రీమ్. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ!(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!) -
ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!
సినిమా కోసం నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడూ ఉండేదే. కానీ తొలిసారి ఓ కుక్కతో డబ్బింగ్ చెప్పించారు! నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. 'నను మత్తు గుండా 2' అనే కన్నడ మూవీ కోసం ఇదంతా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడే బయటపెట్టాడు. కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంతకీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!)రీసెంట్ టైంలో కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చకుంటోంది. కేజీఎఫ్, చార్లీ తదితర చిత్రాలు నేషనల్ వైడ్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఓ సినిమా కోసం కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పించడం. 2020లో థియేటర్లలో రిలీజైన 'నాను మత్తు గుండా' మూవీ హిట్‌గా నిలిచింది. ఆటో డ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారి కుక్క పాత్ర దానితోనే డబ్బింగ్ చెప్పించారట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకం కీలక పాత్ర పోషించిందని, నేచురాలిటీ కోసం సదరు కుక్కతోనే డబ్బింగ్ చెప్పించామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఈ సీక్వెల్ మూవీకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతమందించడం విశేషం.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ) -
ఓటీటీలో కన్నడ హిట్ మూవీ.. ఎక్కడంటే?
కేజీఎఫ్ ఫేం వశిష్ట సింహ హీరోగా నటించిన కన్నడ చిత్రం లవ్లీ. స్టెఫీ పటేల్ హీరోయిన్ నటించింది. చేతన్ కేశవ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్, సాధుకోకిలక కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే కన్నడ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా వశిష్ట సింహా.. నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, కేజీఎఫ్, డెవిల్తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ 2లో విలన్‌గా కనిపించేనున్నాడు. స్టెఫీ పటేల్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ తెలుగులో నిన్ను తలచి, చెప్పాలని ఉంది వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. Kannada film #LoveLi (2024) by @ChethanKeshav6, ft. @ImSimhaa @StefyPatel #AchyuthKumar @MalavikaBJP #SadhuKokila #Sameeksha #KavyaShetty & #HGDattatreya, now streaming on @PrimeVideoIN.@abhuvanasa @AnoopSeelin pic.twitter.com/DD804MyqaE— CinemaRare (@CinemaRareIN) August 8, 2024 -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా
మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించిన ఈ కన్నడ మూవీని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో తీశారు. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోగా చేసిన దీక్షిత్ తెలుగులోనూ పలు సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా)'దసరా'లో నాని ఫ్రెండ్‌గా చేసిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి.. 'దియా' మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తెలుగు ఇటు కన్నడ సినిమాల్లో చేస్తున్నాడు. ఇతడు హీరోగా చేసిన 'బ్లింక్' అనే మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. తొలుత 50 కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ బాగుండటంతో ఆ నంబర్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.ఇక 'బ్లింక్' కథ విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనుకుంటాడు. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్) -
బ్లాక్ బస్టర్ మూవీ నుంచి క్రేజీ మెలోడీ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అలా భ్రమయుగం, ప్రేమలు, మంజమ్ముల్ బాయ్స్ లాంటి మలయాళ చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇలా ఇప్పుడు ఓ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోతుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) కన్నడలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ కృష్ణ.. ఈ మధ్య 'లవ్ మాక్ టైల్ 2' మూవీతో వచ్చాడు. అక్కడ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా 'నీదేలే నీదేలే జన్మ' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. నకుల్ అభయాన్కర్ సంగీతమందించిన ఈ మెలోడీ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. ఇందులో హీరోయిన్ మిలానా నాగరాజ్.. నిజ జీవితంలోనూ హీరో డార్లింగ్ కృష్ణ భార్యనే కావడం విశేషం. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) -
లవ్ మాక్‌టైల్ 2 నుంచి బ్యూటిఫుల్ సాంగ్..
కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత, రచయిత, దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన చిత్రం లవ్ మాక్‌టైల్ 2. ఈ మూవీ నుంచి బుధవారం నాడు.. ఎవరితో పయనం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్‌టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్‌టైల్, లవ్ మాక్‌టైల్ 2 చిత్రాలు కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ.. 'కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. -
ప్రకాశ్ రాజ్ నుంచి అవార్డ్ విన్నింగ్ మూవీ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!
ప్రకాశ్ రాజ్ పేరు చెప్పగానే విలక్షణమైన పాత్రలే గుర్తొస్తాయి. హీరో, విలన్, తండ్రి, బాబాయ్.. ఇలా అన్ని రకాలు పాత్రలు చేశాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించాడు. అయితే గతంతో పోలిస్తే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అలరించాడు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కన్నడలో తీసిన 'ఫొటో' అనే సినిమాని కొత్త దర్శకుడు ఉత్సవ్ గోన్వర్ తీశాడు. గతేడాది దిల్లీలో జరిగిన హ్యాబిటట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ రెండు చోట్ల కూడా 'ఫొటో' చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం విశేషం. అయితే ఈ సినిమా చూసిన ప్రకాశ్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 15న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'ఫొటో' సినిమా కథ విషయానికొస్తే.. బెంగళూరులో ఓ వ్యక్తి, వలస కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో లాక్డౌన్ విధిస్తుంది. దీంతో తమ సొంతూరు అయిన రాయచూర్‌కి నడక మార్గంలోనే వెళ్తారు. అసలు ఇంటికి వెళ్లారా అనేది పాయింట్. అలానే ఇదే కథలో ఆ పిల్లాడికి బెంగళూరులోని విధానసౌధ(కర్ణాటక శాసనసభ) ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనే కోరిక ఉంటుంది. మరి లాక్డౌన్ కష్టాల మధ్య దాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే 'ఫొటో' సినిమా స్టోరీ. కథ పరంగా బాగానే ఉంది. వలస కూలీల కష్టాలు ప్రతిబింబించేలా ఉంది. పలు అవార్డ్ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే సినిమా నచ్చి.. సొంతంగా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ని జనాలు చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) -
కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?
మరో హిట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇది తెలుగు కాదు కన్నడ సినిమా. ప్రభాస్ 'సలార్'తో పోటీ పడి కర్ణాటకలో ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద మెరుపులేం లేనప్పటికీ కన్నడ ప్రేక్షకులకు నచ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అలానే పలువురు రీజనల్ హీరోలు కూడా యాక్షన్ సినిమాలు తీస్తూ వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నారు. అలా కన్నడలోనూ హీరో దర్శన్ ఉన్నాడు. యాక్షన్ సినిమాలు తీసే ఇతడు గతేడాది డిసెంబరులో 'సలార్' చిత్రం థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత అంటే డిసెంబరు 29న 'కాటేరా' అనే మూవీతో వచ్చాడు. సూపర్‌హిట్ కొట్టేశాడు. (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్‌కి ఎక్కేసింది. కర్ణాటకలో 'సలార్' కంటే ఈ చిత్రాన్నే ఎక్కువగా చూశారు. అలా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎప్పుడనేది డేట్ ఇంకా తెలీదు గానీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 9న జీ5లో రిలీజ్ చేయొచ్చని టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ ఓటీటీ రిలీజ్ చేస్తే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అలానే 'కాటేరా' తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉందా లేదా? అనేది కూడా స్పష్టత రావాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
ఆస్పత్రిలో చేరిన నటి హేమా చౌదరి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి
సౌత్ ఇండియ ప్రముఖ నటి హేమా చౌదరి బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో ఆమె కుమారుడు కూడా నేడు విదేశాల నుంచి వస్తున్నాడు. నటి హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించి ఆపై తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో 100కు పైగా చిత్రాల్లో మెప్పించింది. కన్నడలో డా. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్‌నాగ్, అనంతనాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో నటించారు. కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, ప్రేమ్ నజీర్ తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో కూడా హేమా చౌదరి నటించారు. పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు. ఆపై కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్సకు స్పందించడం లేదు. విదేశాల నుంచి కుమారుడి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'కరావళి' ప్రోమో అదిరిపోయిందంతే!
డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. ‘అంబి నింగే వయసైతో’ అనే కన్నడ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గాణిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిలింస్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గాణిగ ఫిలిం బ్యానర్ మీద గురుదత్త గాణిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబళ పోటీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమా ఫస్ట్ లుక్, ప్రోమోలను సోమవారం విడుదల చేశారు. ప్రజ్వల్ దేవరాజ్ ఇందులో ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో కనిపించారు. మహిషా అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే. ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్‌లో కనిపించే షాట్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్లుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా అదే రేంజులో ఉన్నాయి. మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గాణిగ తెలిపారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: ప్రియాంకకు సపోర్ట్ చేయను.. గీతూ ప్రశ్నలకు సమాధానాలు దాటేసిన శోభ -
దుమ్మురేపుతున్న 'ఘోస్ట్' సాంగ్.. ఆ రోజే సినిమా రిలీజ్!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ 'ఘోస్ట్'. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఆన్ యాక్షన్ ఫీస్ట్‌గా తీస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఒరిజినల్ గ్యాంగస్టర్ మ్యూజిక్ వీడియో విడుదల చేశారు. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటని విడుదల చేశారు. శివరాజ్ కుమార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీపై అంచనాలు పెంచుతోంది. అనుపమ్ ఖేర్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అర్జున్ జన్య సంగీతమందించారు. ఇకపోతే ఈ మధ్య 'జైలర్'లో గెస్ట్ అప్పీయరెన్స్‌తో దుమ్ములేపిన శివన్న.. పూర్తిస్థాయిలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటారో చూడాలి. (ఇదీ చదవండి: అనసూయ సోయగాలు.. విష్ణుప్రియ గ్లామర్ షో!) -
కన్నడ హిట్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
ప్రజ్వల్ బీపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 21న రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్‌ను ‘బేబీ’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘కన్నడంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్ ఫన్ అండ్ ఎనర్జిటిక్‌గా అనిపించి, తెలుగులో విడుదల చేయాలని భావించాం’’ అన్నారు సుప్రియ. ‘‘బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫిల్మ్’’ అన్నారు నిర్మాతలు శరత్, అనురాగ్. -
ఈ హీరోయిన్ గుర్తుందా? 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీ!
ఈ బ్యూటీది అసలు మన దేశమే కాదు. అయినాసరే మన సౌత్ సినిమాల్లో నటించింది. హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. అప్పుడెప్పుడో 1989లో ఫస్ట్ సినిమా చేసింది. తిప్పి తిప్పి కొడితే అరడజను చిత్రాలు కూడా చేయలేదు. అయినాసరే ఈమె చాలా ఫేమ్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఈమె.. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు గిరిజా శెట్టర్. ఈ పేరు చెబితే గుర్తురాకపోవచ్చు. కానీ 'గీతాంజలి' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే మణిరత్నం తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇది. ఓ హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బలంగా రాయొచ్చనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా ఫస్ట్ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన గీత అలియాస్ గిరిజా శెట్టర్.. ఓవరాల్‌గా ఐదే సినిమాలు చేసింది. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. హైదరాబాద్ వచ్చేది అప్పుడే) ఇంగ్లాండ్‌లో సెటిలైన ఈమె తండ్రి ఓ డాక్టర్. ఆయనది కర్ణాటక. అమ్మది మాత్రం ఇంగ్లాండ్. అలా కన్నడ-బ్రిటీష్ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. 18 ఏళ్ల తర్వాత భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. అలా నటిగా మారింది. సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్ట్స్‌లో థీసిస్ చేసింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ఇంగ్లాండ్ వెళ్లిపోయిన తర్వాత రైటర్, జర్నలిస్టుగా డిఫరెంట్ ఉద్యోగాలు చేసింది. అయితే ఇన్నేళ్లుగా యాక్టింగ్‌కి దూరంగా ఉన్న ఈమెని.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు ఒప్పించారు. 'ఇబ్బని తబ్బిదా ఇలెయాలి' అనే సినిమాలో నటించేలా చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఈ మధ్యే గిరిజా శెట్టర్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఆమె గురించి చెబుతూ పెద్ద క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటో చూసిన తెలుగు ఆడియెన్స్ ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. తర్వాత మాత్రం 'గీతాంజలి' భామ అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Paramvah Studios (@paramvah_studios) (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) -
సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వెర్సటైల్ యాక్టర్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తా, లేదంటే లేదు అని మడికట్టుకుని కూర్చోలేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్.. ఇలా తనకు నచ్చిన ప్రతిదీ చేసుకుని పోయాడు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఈ నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేశాడట. సీఎం బయోపిక్ అనగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'యాత్ర 2'లో ముఖ్యమంత్రి పాత్ర కోసం తమిళ నటుడు జీవా పేరు పరిశీలనలో ఉంది. బయటకు చెప్పట్లేదు కానీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అని టాక్. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు. అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడట. లాయర్, రాజకీయ జీవితంతోపాటు సిద్ధరామయ్య బ్రేకప్ స్టోరీ కూడా ఇందులో చూపించబోతున్నారట. ఈ బయోపిక్‌ని ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే విధంగా తీయబోతున్నారట. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' పేరు ఖరారు చేశారు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన 'జవాన్' వచ్చే నెలలో రిలీజ్ కానుంది. హిందీలో ఒకటి, తమిళంలో ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
‘తారకాసుర’సిరీస్ విజయం సాధించాలి: ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి
కన్నడలో ఘన విజయం సాధించిన తారకాసుర చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే... ఆ చిత్రానికి సీక్వెల్ గా స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం. శ్రీజ మూవీస్ పతాకంపై తనే దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న "తారకాసుర -2" చిత్రం పటాన్ చెరులోని జైపాల్ ముదిరాజ్ ఫామ్ హౌస్ లో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలనంతరం ముఖ్య పాత్రధారి విజయ్ భాస్కర్ రెడ్డిపై పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... జైపాల్ ముదిరాజ్ క్లాప్ కొట్టారు. పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మల్లిక్, సీనియర్ నటులు హేమ సుందర్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు!! "తారకాసుర సిరీస్"తో విజయ్ భాస్కర్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు. టెన్నిస్ ప్లేయర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్యాంక్ వ్యవస్థాపకునిగా విజయ్ భాస్కర్ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని వారు అభిలషించారు. ఇకపై తమ "శ్రీజ మూవీస్" బ్యానర్ పై వరుసగా చిత్రాలు నిర్మిస్తానని దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం పేర్కొన్నారు. "తారకాసుర-2" చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!
Hostel Hudugaru Bekagiddare Movie: ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న మూవీ 'బేబీ'. మూడు నాలుగు చిత్రాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరోహీరోయిన్స్.. అయితేనేం హిట్ కొట్టారు. ఇలా టాలీవుడ్లో 'బేబీ' హవా నడుస్తుంటే.. కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. హాస్టల్ కుర్రాళ్లు కేక కాలేజీ, హాస్టల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన కన్నడ చిత్రం 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'. కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే 'కేజీఎఫ్ 2', 'చార్లీ', 'కాంతార' తర్వాత శాండల్‌వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఆ ఇండస్ట్రీకి పడేలేదు. ఇప్పుడు దాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'.. కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) స్టార్ హీరోలు సైలెంట్ ఈ ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ 'క్రాంతి', మార్చిలో ఉపేంద్ర 'కబ్జ' భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండల్‌వుడ్ బాక్సాఫీస్ డల్ అయిపోయింది. స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' కరెక్ట్‌గా క్యాచ్ చేసి, హిట్ అయింది. కథేంటి? గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే.. యూత్‌ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ్బాయిల పేర్లు ఓ నోట్లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అంటే ఏంటో చెప్పలేదు కదూ.. దానర్థం 'హాస్టల్ పిల్లలు కోరుకుంటే'. ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్న త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. 'కాంతార'కు సంగీతమందించిన అజనీష్ లోక్‌నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) -
Tarakasura: తెలుగులో మరో కన్నడ సంచలనం
కన్నడలో సంచలన విజయం సాధించిన ‘తారకాసుర’ చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీజా మూవీస్ పతాకంపై ‘విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం’ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. రవికిరణ్ - మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేని సపని ముఖ్యపాత్ర పోషించడం విశేషం. "పద్మశ్రీ" ఫేమ్ చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరోహీరోయిన్లుగా... శాంసన్ యోహాన్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్సకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలో తెలుగులో రానున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి, విలన్ పాత్రధారి శాంసన్ యోహాన్, సెకండ్ హీరోయిన్ తృప్తి శుక్లా, సెకండ్ హీరో పద్మశ్రీ ఫేమ్ చక్రవర్తి పాల్గొనగా... ప్రముఖ దర్శకులు నగేష్ నారదాసి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, పద్మిని నాగులపల్లి ముఖ్య అతిధులుగా హాజరై... కన్నడలో ఘన విజయం సాధించిన "తారకాసుర" చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించాలని అభిలషించారు. శ్రీజా మూవీస్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... ‘తెలుగులో ’తారకాసుర’ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. అందుకోసం షూటింగ్ కూడా చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి త్వరలో ఒక స్ట్రయిట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. -
తెలుగు ప్రేక్షకులకు ఆ మాట ఇస్తున్నా: శివ రాజ్‌కుమార్
‘‘నాన్నగారు (కన్నడ స్టార్ రాజ్‌కుమార్), ఎన్టీఆర్, నాగేశ్వర రావు, శివాజీ గణేశన్, ఎంజీఆర్సార్లు బ్రదర్స్‌లా ఉండేవాళ్లు. ఆ వారసత్వాన్ని తర్వాతి తరంలో మేం ముందుకు తీసుకెళుతున్నాం. తారకరత్నగారిని వెళ్లి చూశాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్. ఆయన నటించిన 125వ కన్నడ చిత్రం ‘వేద’. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్ భార్య గీత నిర్మించిన ఈ సినిమాని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, మంచి సందేశం ఉన్నాయి. నా తర్వాతి చిత్రాలను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ‘కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ప్రభాస్‌కు వేద టీమ్ కృతజ్ఞతలు
కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్‌గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్స్ ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది చిత్రయూనిట్. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీకి మన తెలుగులో ఎంతో ఆదరణ ఉంది. మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు' అంటూ తెలిపారు. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై విజయం సాధించింది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు. చదవండి: నా భర్తకు మరొకరితో ఎఫైర్.. నన్ను వాడుకున్నాడంటూ ఏడుపందుకున్న నటి ఆ రికార్డులు తిరగరాసిన పఠాన్.. దంగల్‌కు ఒక్క అడుగు దూరంలో -
హీరోయిన్గా మారుతున్న సెన్సేషనల్ సింగర్ మంగ్లీ!
జానపదంతో ఆమె దోస్తీ చేసింది. తన గొంతులో పదాలు పాటలయ్యాయి. ఆ పాటల ప్రవాహం జలపాతంలా జనాలను తాకింది. ఆమె కంఠానికి, రక్తి కట్టించే పాటలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. తెలియకుండానే ఆమె అభిమానులయ్యారు. తన గాత్రంతో జనాలను కట్టిపడేసిన ఆమె మరెవరో కాదు సింగర్ మంగ్లీ. జానపదం నుంచి సినిమాల దాకా నిరంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం కొనసాగిస్తోంది. తాజాగా ఆమె సినిమాల్లో నటించనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. చక్రవర్తి చంద్రచూడ్ డైరెక్ట్ చేస్తున్న పాదరాయ అనే కన్నడ సినిమాలో మంగ్లీ హీరోయిన్గా నటించనుందట. ఇప్పటికే కన్నడలోనూ పలు పాటలు పాడిన ఆమె ఈసారి ఏకంగా పాదరాయ అనే పాన్ ఇండియా మూవీలో కథానాయికగా నటించనున్నట్లు శాండల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 2013-14లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. నాగశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి మంగ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. చదవండి: తేజస్వినితో ప్రేమలో పడ్డ అఖిల్ సార్థక్ -
కేజీఎఫ్-3 మూవీపై క్రేజీ అప్ డేట్.. ఆ సినిమా పూర్తయ్యాకే..!
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్ అభిమానులు కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్ అధినేత విజయ్ కిరంగదూర్. ప్రశాంత్ నీల్ తెరక్కిస్తున్న ప్రభాస్ మూవీ 'సలార్' తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీయఫ్-3పై అప్డేట్ ఇచ్చారు. 2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే కేజీయఫ్ చాప్టర్-2 వచ్చి సందడి చేసింది. ఈ మువీ కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేజీఎఫ్-3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్ రెడీగా ఉందని.. వచ్చే ఏడాది లేదా సలార్ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'విస్మయ'
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నుంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. ప్రియమణి నటించిన కన్నడ చిత్రం "నన్న ప్రకార" అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాను 'విస్మయ' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ప్రస్తుతం ఈ విస్మయ చిత్రం ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంటోంది. విస్మయ చిత్రంలో డాక్టర్‌గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్ కిషోర్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో మూడు కథలు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. నగరంలో జరిగే హత్యలను ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. దర్శకుడు వినయ్ బాలాజీకి ఇది మొదటి చిత్రమైనా కూడా ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజువల్స్, ఆర్ఆర్, కెమెరాపనితనం అన్ని హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అర్జున్ రాము సంగీతమందించారు. మనోహర్ జోషి కెమెరామెన్‌గా పని చేశారు. -
Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు
కన్నడ సెన్సేషన్ 'కాంతర' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేజీఎఫ్‌ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంతార సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే కాంతార ఓటీటో రిలీజ్లో అభిమానులకు మేకర్స్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ అయినటువంటి వరహారూపం సాంగ్‌ని మార్చేయడం ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ‘వరాహరూపం’ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అలాంటిది ఓటీటీకి వచ్చేసిరికి ట్యూన్ మార్చి కొత్త మ్యూజిక్‌తో విడుదల చేశారు. ఒరిజినల్ సాంగ్‌తో పోలిస్తే ఇది బాలేదని, వరహారూపం ఒరిజినల్ వెర్షన్‌ని అప్డేట్ చేయండి అంటూ రిషబ్ శెట్టి సహా మూవీ టీంకు నెటిజన్లు రిక్వెస్టులు పెడుతున్నారు. కాగా తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్'ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అందువల్లో యూట్యూబ్‌లోనూ ఆ పాటను హోంబాలే ఫిల్మ్స్ తొలగించింది. మరి ఈ విషయంలో కాంతార మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.