kc canal
-
కేసీ కెనాల్ పై ఈనాడు తప్పుడు కథనాలు
-
కేసీ కాల్వకు ‘కృష్ణా’లో వాటా లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీ కాల్వకు కృష్ణా నదీజలాల్లో వాటా లేదని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం కేసీ కాల్వకు తుంగభద్ర జలాశయం, తుంగభద్ర నది నుంచి మాత్రమే నిర్దేశిత పరిమాణంలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కేసీ కాల్వకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌తోపాటు మల్యాల వద్ద ఉన్న హంద్రి–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి వద్ద ఉన్న కేసీ కాల్వ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేస్తోందని ఆరోపించింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కాల్వకు మళ్లించకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ఈ నెల 15న కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. లేఖలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి. ►కేసీ కాల్వ ప్రాజెక్టు ఆధునీకరణను కారణంగా చూపి ఆ ప్రాజెక్టుకు కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయించిన 39.9 టీఎంసీల్లో 8 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇతర ప్రాజెక్టులకు కేటాయించింది. కేసీ కాల్వకు 31.9 టీఎంసీల కోటా మాత్రమే మిగిలి ఉంది. ఇదే దామాషాలో తుంగభద్ర డ్యాం నుంచి కేసీ కాల్వలకు విడుదల చేయాల్సిన 10 టీఎంసీలను సైతం 8 టీఎంసీలకు తగ్గించి మిగిలిన 2 టీఎంసీలను కృష్ణాలో విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దిగువ పేర్కొన్న అంశాలపై అధ్యయనం జరిపి కేసీ కాల్వకు 31.9 టీఎంసీలు మాత్రమే డ్రా చేసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని సూచించింది. ►కేసీ కాల్వకు తుంగభద్ర నదీ ప్రవాహంలో ఉన్న కోటా నుంచి కొంతభాగాన్ని తుంగభద్ర దిగువ కాల్వ(ఎల్ఎల్సీ)కు ఏపీ కేటాయించింది. ఆ మేరకు కేసీ కాల్వ కోటాను తగ్గించాలి. ఈ ఏడాది కేసీ కాల్వ కోటా నుంచి 4 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం ఎల్ఎల్సీకి మళ్లించింది. ►గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆనకట్ట నుంచి సుంకేశుల జలాశయం వరకు తుంగభద్ర నదిపై 12 పంప్‌హౌస్‌లను నిర్మించి 5.373 టీఎంసీలను అనధికారంగా మళ్లించుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులను తక్షణమే నిలుపుదల చేయించాలి. ►శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించుకునే అన్ని పాయింట్ల వద్ద రియల్ టైం సెన్సర్లను ఏర్పాటు చేయాలి. -
కేసీ కెనాల్ కోటా నీటి దోపిడీ!
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో కేసీ కెనాల్ కోటా కింద దక్కాల్సిన జలాలు మన రాష్ట్ర సరిహద్దు చేరకుండా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోంది. నదిలో వరద తగ్గాక దామాషా పద్ధతిలో టీబీ డ్యామ్ నుంచి కేటాయింపుల ప్రకారం కేసీ కెనాల్‌కు విడుదల కావాల్సిన నీటిని చౌర్యం చేస్తోంది. ఈ నీటిని తుంగభద్రపై బళ్లారి జిల్లా సిరిగుప్ప తాలుకా సుగూరు వద్ద బొరుకా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) 4.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం వద్ద నిల్వ చేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి ఎగువన అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ద్వారా కర్ణాటక సర్కార్ చౌర్యం చేస్తుండటం తాజాగా తుంగభద్ర బోర్డు, కేసీ కెనాల్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో బీపీసీఎల్‌కు నోటీసులు ఇచ్చారు. నిబంధనల మేరకు నదిలో వరద ప్రవాహం ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని, వరద లేనప్పుడు ఎలా విద్యుదుత్పత్తి చేస్తారంటూ నిలదీశారు. కర్ణాటక అక్రమంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల్లో నీటి తరలింపును ఆపివేశారు. బీపీసీఎల్ వద్ద నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేయించారు. వరద లేనప్పుడు విద్యుదుత్పత్తి చేస్తే విద్యుత్కేంద్రం అనుమతులను రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది. కర్ణాటక ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయడంతో ఎట్టకేలకు కేసీ కెనాల్‌కు వాటా జలాలు చేరాయి. 2.65 లక్షల ఎకరాలకు జీవనాడి.. కేసీ కెనాల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ కెనాల్‌పై ఆధారపడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్రలో సుంకేసుల వద్ద 29.9 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కకట్టిన బచావత్ ట్రిబ్యునల్ మిగిలిన పది టీఎంసీలను వరద తగ్గాక టీబీ డ్యామ్ నుంచి విడుదల చేయాలని పేర్కొంది. టీబీ డ్యామ్‌లో నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో ఈ ఏడాది కేసీ కెనాల్‌కు 8 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇందులో హెచ్చెల్సీ ద్వారా రెండు టీఎంసీలను విడుదల చేసింది. తుంగభద్ర పుష్కరాల సమయంలో నది ద్వారా 2.3 టీఎంసీలను విడుదల చేసింది. మిగతా 3.7 టీఎంసీల కోటాను మార్చి 25 నుంచి రోజుకు 2,500 క్యూసెక్కుల చొప్పున టీబీ డ్యామ్ నుంచి బోర్డు విడుదల చేసింది. అయితే ఈ నీటిని బీపీసీఎల్ వద్ద నిల్వ చేయించిన కర్ణాటక సర్కార్ ఎగువన ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. దీంతో టీబీ డ్యామ్ నుంచి విడుదల చేసిన జలాలు కేసీ కెనాల్‌కు చేరడం లేదు. ఈ నేపథ్యంలో టీబీ బోర్డు అధికారులు, కేసీ కెనాల్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయడంతో కర్ణాటక జలచౌర్యం బహిర్గతమైంది. -
‘జోలదరాశి’కి జ్యుడిషియల్ ప్రివ్యూ ఓకే
సాక్షి, అమరావతి: కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద కుందూ నదిపై 0.80 టీఎంసీల సామర్థ్యంతో రూ.207.95 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణ టెండర్ ప్రతిపాదనను జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదించింది. ఈ పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. కుందూ నదిపై రెండు జలాశయాలను నిర్మించి, వరదను ఒడిసి పట్టి కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు డిసెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రిజర్వాయర్లు.. ► జోలదరాశి వద్ద 0.80 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.312.3 కోట్లతో, చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.1,357.10 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. రాజోలి రిజర్వాయర్ టెండర్ ప్రతిపాదనలను జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదించిన తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తారు. కేసీ కెనాల్‌కు 140 ఏళ్ల చరిత్ర.. జల రవాణా కోసం తుంగభద్ర–పెన్నాను అనుసంధానం చేస్తూ కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్ సంస్థ ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా నది వరకు కాలువ తవ్వకం పనులను 1873లో ప్రారంభించి 1880 నాటికి పూర్తి చేసింది. డచ్ సంస్థ తవ్విన కేసీ కెనాల్‌ను 1880లో బ్రిటీష్ ప్రభుత్వం 3.02 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కాలువ 1933 నుంచి సాగునీటి ప్రాజెక్టుగా మారింది. ఆయకట్టు రైతులకు భరోసా.. ► బచావత్ ట్రిబ్యునల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను కేటాయించింది. ఇందులో సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. అయితే సుంకేశుల బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలే కావడం, వర్షాభావంతో నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరడం వల్ల కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. ► కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్ 23న పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ► రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి, మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. అయితే ఆయన హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాలను నిర్మించాలని నిర్ణయించారు. రూ.54.36 కోట్లతో వెంగళరాయసాగరం ఆధునీకరణ విజయనగరం జిల్లాలోని వెంగళరాయసాగరం ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ(జైకా) నిధులతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆయకట్టు చివరి భూములకు సైతం నీళ్లందించి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని భావిస్తోంది. ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.54.36 కోట్ల వ్యయంతో ఈనెల 20న జలవనరులశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 7న టెండర్ ఖరారు చేయనుంది. ► విజయనగరం జిల్లా సాలూరు మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నదిపై 1.68 టీఎంసీల సామర్థ్యంతో 1976లో వెంగళరాయసాగరం నిర్మించారు. ఎడమ కాలువ కింద 8,550 ఎకరాలు, కుడి కాలువ కింద 16,150 ఎకరాలు, కుడి గట్టు కాలువ కింద 5 వేల ఎకరాలు వెరసి 29,700 ఎకరాల ఆయకట్టు ఉంది. ► ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడం, స్పిల్ వేలో లోపాలు, గేట్లకు మరమ్మతు చేయకపోవడం, కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. ► ఏపీఐఎల్‌ఐపీ రెండో దశలో వెంగళరాయసాగరం ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.54.36 కోట్లు కేటాయించారు. ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది. ► ప్రాజెక్టులో పూడిక తొలగించడం, స్పిల్ వే మరమ్మతులు, గేట్లు బిగించడం.. కాలువలకు లైనింగ్ చేయడం ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించనున్నారు. -
మిస్టరీ వీడని రేణుక అదృశ్యం
సాక్షి,మోర్తాడ్: ఏర్గట్ల శివారులోని కాకతీయ కాలువలో పడి గల్లంతైన వివాహిత యువతి రేణుక ఆచూకీ రెండు నెలలైనా ఇంకా దొరకలేదు. దీంతో రేణుక అదృశ్యం కేసు మిస్టరీ వీడకుండా ఉంది. అక్టోబర్ మొదటి వారంలో ఇబ్రహీంపట్నంలోని తన తల్లిగారి ఇంటి నుంచి బాల్కొండలోని తన అత్తగారింటికి భర్త మారుతితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో రేణుక కాకతీయ కాలువలోకి దూకిందని మారుతి పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. అయితే కాకతీయ కాలువలో గజ ఈతగాళ్లతో పలు చోట్ల వెతికించినా అప్పట్లో రేణుక ఆచూకీ లభించలేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి దుస్తులు, నగలు దొరకకపోవడంతో ఆమె ఏమి అయి ఉంటుందో పోలీసులకు అంతు చిక్కడం లేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆమె సజీవంగా ఉందా లేదా అని ఒక నిర్దారణకు రాలేక పోతున్నామని పోలీసులు చెబుతున్నారు. రేణుక అదృశ్యం మిస్టరీగానే పోలీసులు పరిగణిస్తున్నారు. అయితే తమ కూతురు కాలువలోకి దూకి ఉండదని ఆమె భర్త మారుతి తోసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ రేణుక తల్లి పోలీసుల ఎదుట ఆరోపించింది. అయితే రేణుక అదృశ్యం అయిన నుంచి కాకతీయ కాలువ నిండుగా ప్రవహిస్తుండటంతో ఎలాంటి ఆధారం దొరకడానికి అవకాశం లభించలేదు. రేణుక భర్త మాత్రం ఆమె తనతో గొడవ పడి కాలువలోకి దూకిందని చెబుతున్నాడు. రేణుకకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికితే తప్ప ఎలాంటి వివరాలు తాము వెల్లడించలేమని ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్ ‘సాక్షి’కి వివరించారు. ఏది ఏమైనా వివాహిత యువతి కాకతీయ కాలువలో గల్లంతై రెండు నెలలు గడచినా ఇంత వరకు ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యం కేసు మిస్టరీగానే ఉండిపోయిందని చెప్పవచ్చు. -
కక్ష.. వివక్ష..
కడప సిటీ : కేసీ రైతుకు కన్నీరే మిగులుతోంది. మూడేళ్లుగా కరువుతో సతమతవుతున్నారు..శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది మందస్తుగానే భారీ వరదనీరు చేరడంతో వరి సాగు చేయొచ్చని ఆశపడ్డారు. వరినారు కూడా పోసుకున్నారు. తర్వాత అధికారులు నీటి విడుదలను నిలిపేశారు. కృష్ణా డెల్టాకు వదిలి..కేసీకి ఆపేసి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. కృష్ణాడెల్టా రైతులపై ఎందుకంత ప్రేమ.. తమపై ఎందుకంత వివక్ష అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కడుపుమండిన రైతన్నలు ఈ నెల 8న రోడ్డెక్కారు. వైఎస్సార్సీపీ నేతలు వీరికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ప్రసుతం శ్రీశైలానికి వరదనీరు చేరుతోంది. ఇప్పటికైనా కేసీ ఆయకట్టు రైతులకు వరిసాగుకు సరిపడే నీళ్లిస్తామని స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కేసీ ఆయకట్టు రైతులు గత మూడేళ్లుగా వరిసాగుకు దూరమయ్యారు.కేవలం బోర్లకింద ఆరుతడి పంటలు వేసుకుని కాలం వెళ్లదీశారు.అయితే కర్ణాటకలో వర్షాలు అధికంగా పడడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు చేరింది.దీంతో గత నెల 29 రాజోలికి నీటిని విడుదల చేశారు.అక్కడి నుంచి మైదుకూరు, చాపాడు కేసీకెనాల్‌కు, కుందూకు వదిలారు. ఈ సమయంలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించలేదు.దీంతో కేసీ కాలువ కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. నారుమడులు పోసుకున్నారు. సత్తువ కోసం జీలుగ కూడా వేశారు. ఈ తరుణంలో అధికారులు నీటిని నిలిపివేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఆగిపోయిందని, వరిసాగు చేసేందుకు నీళ్లు ఇవ్వడం కష్టమని, ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని చెప్పారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం కేసీ కెనాల్‌కు నీటిసామర్థ్యం తగ్గిన సందర్భంలో శ్రీశైలంలో 872 అడుగుల నీటిమట్టం ఉంది. 854 అడుగులు ఉంచి మిగతా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.అయితే ఈ నీటిని కేసీకాలువకు ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు 10టీఎంసీలు మళ్లించారు. దీంతో కేసీ కాలువకు నీరు ఆగిపోయింది. 92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మైదుకూరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలు, కడపకు సంబంధించి 30 వేల ఎకరాలు, మిగతా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉంది. మూడేళ్లుగా వరిపంటకు దూరమైన కేసీ ఆయకట్టు రైతులు ఈ ఏడాది నీళ్లు వచ్చాయని ఆనందపడి సాగుకు సిద్ధమయ్యారు. వారి ఆనందం రెండు రోజులకే ఆవిరైంది. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా రైతులపై వివక్ష చూపుతోంది.వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మొదటి నుంచి సవతిప్రేమ చూపిస్తున్నారు. కెసీ కాలువకు నీటి విడుదల విషయంలో ముఖ్యమంత్రి వక్రబుద్ధి మరోసారి బయటపడిందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి.అంజాద్‌బాషా,రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, జిల్లా రైతువిభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కేసీకి నీళ్లు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కేసీ కెనాల్‌కు రావాల్సిన నీటిని కృష్ణాడెల్టాకు తరలిస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయనరెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. మన వాటా కోసం కలిసి కట్టుగా పోరాడుదామని, అందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు కేసీకాలువకు నీళ్లు రావడంతో ఈ ఏడాది 10 ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించా. నారుమడి పోశా. ఇందుకోసం రూ.2000 ఖర్చు అయింది.అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతున్నారు.ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. – ఆంజనేయులు, రైతు, పల్లవోలు, చాపాడు మండలం నిలువునా ముంచారు మూడేళ్ల నుంచి వరిపంటకు దూరమయ్యాం.ఈ సారి కేసీకెనాల్‌కు నీళ్లు రావడంతో వరినారు వేశాం.ఇప్పుడేమే ఆరుతడి పంటలకు మాత్రమే నీళ్లు ఇస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.నారుమడి కోసం ఎకరానికి రూ.2000 ఖర్చు అయింది. పాలకులు, అధికారులు రైతులను నిలువునా ముంచారు. – సీసీ వెంకటసుబ్బారెడ్డి, తొండలదిన్నె, రాజుపాళెం మండలం చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు. కడప రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది.కెసీ కెనాల్‌కు అర్ధాంతరంగా నిలిపివేయడం దారుణం. కేసీకెనాల్‌కు నీళ్లు ఇచ్చే వరకు రైతుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. – సంబటూరు ప్రసాద్‌రెడ్డి,వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే... శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గింది.అందువల్ల వరిసాగుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. ఉన్నతాధికాల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం.ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనుమతులు ఉన్నాయి. మళ్లీ వానలు అధికమై శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటాం. - జిలానీబాషా, డీఈఈ, కేసీ కెనాల్ -
రోడ్డెక్కిన రైతన్న
మైదుకూరు(చాపాడు): కేసీ ఆయకట్టులో ఏటా మాదిరి కాకుండా ఈసారి సంపూర్ణంగా కాలువల ద్వారా ఖరీఫ్ పంటలకు సాగునీరు వస్తుందని గత నెల 29న టీడీపీ నేతలు రాజోలి వద్ద సాగునీటిని వదిలారు. వదిలిన వారం రోజులకే ఆగిపోయాయి. దీంతో ఇప్పటికే 92వేల ఎకరాల ఆయకట్టులో 70శాతం మంది రైతులు వేసుకున్న నారుమళ్లు నీరు లేక ఎండిపోతున్నాయి. ఎండిన నారుమళ్లను ట్యాంకర్లతో రైతులు తడుపుకొంటుండగా, మరోవైపు శ్రీశైలంలో నీరు ఉన్నా.. మన వాటా ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు 10టీఎంసీలు నీరు తీసుకుపోతుండటంతో కడుపుమండిన రైతన్నలు బుధవారం రోడ్డెక్కారు. సీనియర్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కడప–కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు అండగా నిలిచారు. రాయలసీమ ద్రోహి సీఎం చంద్రబాబు మన నీటిని కిందికి తీసుకుపోతున్నారని, సీమ టీడీపీ నేతలకు పౌరుషం, దమ్ము, ధైర్యం ఉంటే శ్రీశైలం వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుందామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. రాస్తారోకోలో వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఏపీ రైతుసంఘం ప్రెసిడెంట్ ఏవీ రమణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు. రెండు రోజులకే నీరు ఆగిపోయింది: కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి టీడీపీ నాయకులు రాజోలి నుంచి నీరు వదిలి ఈసారి రైతులు రెండు కార్లలో పంటలు పండిం చుకోవచ్చని గొప్పలు చెప్పారని, రెండు రోజు ల్లోనే సాగునీరు ఆగి పోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదనన్నారు. విద్యుత్ ఉత్పత్తి అంటూ 150 టీఎంసీల నీరు ఉన్నా, కేసీ రైతులకు సాగునీరు ఇవ్వకుండా సాగర్, కృష్ణాడెల్టాలకు తీసుకెళ్లటం అన్యాయం, అక్రమమని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, ప్రభుత్వానికి ప్రజ లు బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు లంచాలు, కమీషన్లు వచ్చే పనులకే మద్దతుగా ఉంటాడని, రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ఏనాడు ముందుకు రాడన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చాడంటేనే కరువు కూడా వచ్చినట్లేనని, దీంతోనే రైతులు సాగునీరు లేక, మద్దతు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయం కుదేలు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు గతంలో, ఈ నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వ్యవసాయం కుదేలవుతుందని, పంటల సాగులో కలుపు మొక్కలను ఏరి పారేసినట్లు రైతులు టీడీపీని ఏరి పారేయాలన్నారు. రాయలసీమకు సాగునీరు ఇస్తున్నామని గొప్పలు చెప్పే సీఎం, టీడీపీ నేతలు 92వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. సిగ్గుంటే తాగునీరు, సాగునీరు ఇవ్వాలని లేకుంటే ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతే లేదన్నారు. తక్షణమే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు పోవాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, రైతుల కోసం అనునిత్యం పరితపించే రఘురామిరెడ్డిని ఎమ్మెల్యేను చేసుకోవాలని, జిల్లాలోని 10 ఎమ్మెల్యేలు, 2ఎంపీల స్థానాలను వైఎస్సార్సీపీకి ఇస్తే రైతుల సమస్యలన్నీ తీరుతాయని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు: కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ఈయన అధికారంలో రాగానే కరువు కూడా వస్తుందన్నారు. ఈ పాలనలో రైతులు కష్టాలు తప్పవని, కరువు కూడా సిగ్గుపడుతుందన్నారు. నాలుగేళ్లుగా కేసీ రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఉద్యమాలు, ధర్నాలు చేయకతప్పటం లేదన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన రైతాంగానికి దుర్భర పరిస్థితులు రావటం బాధాకరమన్నారు. గతంలో పట్టిసీమను వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ నేతలపై అభాండాలు వేశారని, ఇప్పుడేమో ఆ వాటాను సీమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, చంద్రబాబుకు రైతులు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్ పాలనలో దేవుడు కూడా కరుణించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేశాడని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే దేవుడికి కూడా ఇష్టం లేదన్నారు. జగన్‌ను సీఎం చేసుకుంటేనే రాయలసీమ రైతులకు తాగు, సాగునీరు అందుతుందని రైతులకు సూచించారు. వైఎస్ 40వేల క్యూసెక్కులకు పెంచారు: కడప మేయర్ సురేష్‌బాబు రాయలసీమ రైతాంగం తాగు, సాగునీరు అందక ఏళ్ల తరబడి నష్టపోతుండటంతో వైఎస్సార్ ముఖ్య మంత్రి కాగానే ప్రతిపక్షం, టీఆర్ఎస్ ఇంకా ఇతర పార్టీలన్నీ తప్పుపట్టినా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచారని, రాయలసీమకు సాగునీరు అందించారన్నారు. మన వాటా కూడా ఇవ్వకుండా ఏటా కేసీ రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రైతులు, ప్రజల కోసం నిత్యం అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారని, ఉద్యమాలు, ధర్నాలకు తమను కూడా రమ్మని కోరుతుంటాడని, ఆయన రైతుల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటున్నాన్నారు. నాలుగేళ్లుగా రైతులకు అవస్థలే: మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి కేసీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. ఏటా మైదుకూరులో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. జిల్లా› టీడీపీ నేతలు సాగునీరు వదిలి వరి సాగు చేసుకోవచ్చని చెప్పి, నారుమళ్లు సిద్ధం చేసుకున్నాక నీరు రాకపోగా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. సత్వరమే కేసీ రైతాం గానికి సాగునీరు ఇవ్వకుంటే రైతులు తీవ్రం గా నష్టపోతారన్నారు. శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వకపోవటం దారుణమన్నారు. కేసీ రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా దివంగత సీఎం వైఎస్సార్ రాజోలి జలాశయం తలపెట్టారన్నారు. ఆయన మరణంతో ప్రాజెక్టు ఆటకెక్కిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు. శ్రీశైలం వద్దకెళ్లి నీటిని తెచ్చుకుందాం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చి, దీని వాటా రాయలసీమకు తెస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం ఇప్పుడేమో సీమకు సాగునీరు ఇవ్వకుండా 10టీఎంసీలు కృష్టా డెల్టాకు తీసుకుపోతున్నారన్నారు. కర్నూలు ఐఏïబీ మీటింగ్‌లో మంత్రులు, అధికారులు చేసిన తీర్మానాలతో రైతుల్లో ఆశలు రేపారని, ఇప్పుడు నీరు రాకపోవటంతో వేసుకున్న నారుమళ్లు ఎండిపోతుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడు కార్లు పంటలు పండే కృష్ణా డెల్టాకు నీరు తీసుకెళ్లకుండా ఆడ్డుకోవాలన్నారు. సీఎం వద్ద వంగి వంగి పోవటం కాదని, రైతులకు సాగునీరు ఇప్పించేందుకు పోరాడాలని టీడీపీ నేతలకు హితవు పలి కారు. రాజోలి వద్ద నుంచి నెల్లూరుకు చెందిన మంత్రి సోమిరెడ్డి 6వేల క్యూసెక్కుల చొప్పున ఐదు రోజుల పాటు సోమశిలకు నీరు తీసుకెళ్లారని, మన నీటికి కిందికి తీసుకుపోతుంటే టీడీపీ నేతలు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రశ్నించారు. -
వరి వేయాలా.. వద్దా..!
రాజుపాళెం (వైఎస్సార్ కడప): రాజోలి నుంచి మెదలయ్యే కేసీ కాలువ ఆయకుట్టు పరిధిలో రైతులకు సాగునీటిపై అధికారులు ఏ విషయం చెప్పలేకపోతున్నారు. అన్నదాతలేమో వరినారు కయ్యలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటినుంచి డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో 876 అడుగుల నీటిమట్టం ఉందని, ఆయకట్టు పరిధిలో వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు. నాలుగైదు రోజులుగా నారుదొడ్డి చేసుకుంటూ, వట్టి వడ్లు, పులక చల్లుకుంటున్నారు. గత నెల 29న ప్రధాన కాలువకు, ఈనెల 1న కేసీ చాపాడు కాలువలకు ఆశాఖ అధికారులు, డీసీ చైర్మన్లు నీటిని విడుదల చేశారు. కేసీ చాపాడు కాలువ కింద రాజుపాళెం, ప్రొద్దుటూరు, చాపాడు మండలాలు, కేసీ ప్రధాన కాలువ కింద కర్నూలు జిల్లా చాగలమర్రి, వైఎస్ఆర్ జిల్లా రాజుపాళెం, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప, వల్లూరు మండలాలు కలిపి దాదాపు 92 వేల ఎకరాల ఆయకుట్టు ఉంది. ఇప్పటికే రాజపాళెం మండలంలోని వెలవలి, తొండలదిన్నె, టంగుటూరు, వెంగళాయపల్లె, రాజుపాళెం, పగిడాల, గాదెగూడూరు గ్రామాల్లోని రైతులు వరి నారుకయ్యలు తయారు చేసుకొని పులక చల్లుతున్నారు. ఎకరా వరి పంట సాగు చేయాలంటే విత్తనవడ్లు రూ.900, ఎరువు, కూలీల ఖర్చు రూ.500, ఎద్దులకు రూ.400 కలిపి రూ.1800 నుంచి రూ.2200 ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. గత మూడేళ్లేగా సాగునీరు లేకపోవడంతో కేసీ ఆయకట్టు వరి సాగుకు నోచుకోవడం లేదు. వరి సాగు చేయొద్దు ఈక్రమంలో కర్నూలు జిల్లాల్లోని ఉన్నతాధికారులు కేసీ ఆయకట్టు కింద వరిపంట వేయొద్దని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో నారుదొడ్లలో పులక చల్లిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడేళ్లుగా ఆరుతడి పంటే సాగు కేవలం ఆరుతడి పంటలైన మినుము, పెసర, శనగ, జొన్న పంటలనే రైతులు సాగు చేసుకోవాల్సి వస్తోంది.అక్కడక్కడా పత్తి సాగవుతోంది. మాగాణి భూముల్లో వరి సాగు చేసుకోవాల్సిన రైతులకు ప్రతిఏటా సాగునీటి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్నప్పటికి మంత్రి, అధికారులు కేసీ ఆయకట్టు పరిధిలో సాగునీటిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం రాజోలి ఆనకట్ట నుంచి కేసీ చాపాడు కాలువకు 200, కేసీ ప్రధాన కాలువకు 600, కుందునదిలోకి 2900 క్యూసెక్కులు నీరు పోతోంది. 10 ఎకరాలకు పులక చల్లాను నేను పది ఎకరాల్లో నారుదొడ్డిలో పులక చల్లాను. అధికారులు మాత్రం డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రైతులంతా కాలువలకు నీరు రావని అనుకుంటున్నారు. ఎకరాకు రూ.2000 వరకు ఖర్చవుతోంది. ఏంచేయాలో తెలియడం లేదు. అధికారులు కేసీ కాలువ కింద వరి పంట సాగుపై ప్రకటన ఇవ్వాలి. – పద్మనాభరెడ్డి, రైతు, వెలవలి, రాజుపాళెం మండలం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి నేను ఇరవై ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారుకయ్యలను సిద్ధం చేసి పులక, వడ్లు చల్లాను. కాలువకు నీటిని విడుదల చేసేటప్పుడు అధికారులు డిసెంబరు నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలోని అధికారులు మాత్రం వరిపంట సాగు చేయవద్దంటున్నారు. గత మూడేళ్లుగా వరిపంట వేయలేదు. – చెన్నంగి ఎర్రన్న, రైతు, తొండలదిన్నె, రాజుపాళెం మండలం -
వైఎస్సార్సీపీ నేతల రాస్తారోకో
సాక్షి, వైఎస్సార్ : కేసీ కెనాల్ నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ మైదుకూరు నేషనల్ హైవేపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రఘరామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. -
కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ . రఘురామిరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జురెడ్డిలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125ఏళ్ల చరిత్ర కలిగి బ్రిటిషు హయాంలో నిర్మించిన కేసీ కెనాల్‌కు నీరివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాలు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా మారాయని, రైతులు నష్టాలపాలయ్యే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధిస్తోందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలో 870 అడుగుల నీటిమట్టం ఉందని, అంటే సుమారు 150 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్‌కు నీరిస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు పది రోజుల క్రితం రాజోలి స్లూయిస్ వద్దకు వెళ్లి ఆర్భాటంగా నీటిని వదిలారన్నారు. టీడీపీ నాయకుల మాటలు విని రైతులు నారుమళ్లు వేసుకున్నారని, కుందూ పరివాహక ప్రాంతంలో నాట్లు నాటేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈలోపే ఉన్నట్టుండి నీరు ఆపేశారన్నారు. లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కుల చొప్పున ఖరీఫ్ వరకు వదలాలని డిమాండ్ చేశారు. దీనిపై కర్నూలు సీఈకి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారన్నారు. పైర్లు ఎండిపోయాక నిర్ణయం తీసుకొని ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నప్పటికీ వదలకపోవడం సరికాదన్నారు. విద్యుదుత్పత్తి పేరుతో 40వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారని, నికర జలాలు కలిగిన కేసీకి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ పరిస్థితి వస్తుందనే 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2.95 టీఎంసీ సామర్థ్యంతో రాజోలి, 0.95టీఎంసీల సామర్థ్యంతో జొలదరాసి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలుగోడు నుంచి 0–18 కీ.మీ వరకు కాలువలు సరిగా లేవని, ఆ పనులు పూర్తి చేస్తే తెలుగుగంగకు నీరు ఇవ్వచ్చన్నారు. దీనిపై తాము కర్నూలు ఐఓబీ సమావేశంలో చెప్పినా, అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కడుపు కాలిన రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి సీఎంతో మాట్లాడి కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కులు, వెలుగోడు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాలేరు నగరి, సర్వరాయసాగర్, వామికొండ, పైడిపాళెం రిజర్వాయర్లకు కూడా నీటిని విడుదల చేయాలన్నారు. వర్షాకాలం ఇంకా చాలా ఉందని, సాగునీటికి నీటిని వదలకుండా విద్యుత్ ఉత్పత్తికి తరలించడం ఎంతమాత్రం సరికాదన్నారు. పదివేల క్యూసెక్కులు విడుదల చేస్తే జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు నీరు వస్తాయన్నారు. నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎస్ .రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, నగర మేయర్ కె. సురేష్‌బాబు కోరారు. సోమవారం సాయంత్రం వారు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అలాగే జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంపగుత్తగా తొలగించిన ఓట్లను మళ్లీ చేర్చాలని వారు కోరారు. ఈ విషయాలపై కలెక్టర్ స్పందిస్తూ ఇరిగేషన అ««ధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేస్తానని, ఓట్ల తొలగింపుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
నీరు–చెట్టు.. నిధులు కొల్లగొట్టు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇన్నాళ్లూ నాణ్యత లేని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిన నేతలు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. పనులు చేయకపోయినప్పటికీ బిల్లులు ఇవ్వాల్సిందేనని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రధానంగా కర్నూలు–కడప (కేసీ) కెనాల్ పరిధిలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రూ.10 కోట్ల పనులకు బిల్లులు ఇవ్వాలంటూ సాగునీటి శాఖ ఇంజినీర్లను బెదిరిస్తున్నారు. కేసీ కెనాల్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ నీరు–చెట్టు పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి.. బిల్లులు ఇవ్వాలని హుకుం జారీ చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి ఇక్కడ సుమారు రూ.3 కోట్ల మేర పనులు చేసిన నేతలు.. ఏకంగా రూ.10 కోట్లకు బిల్లులు ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ విధంగా చేయడం కుదరదని ఇంజినీర్లు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతో కొంత పనిచేస్తే బిల్లులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, పూర్తిగా పనిచేయకుండానే ఇస్తే తాము ఇరుక్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. అయితే, తాము చెప్పినట్లు చేయకపోతే బదిలీ చేయిస్తామని కూడా అధికార పార్టీ ముఖ్యనేత హెచ్చరించినట్టు తెలుస్తోంది. సామూహిక సెలవులో... ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలంలో ఇప్పటికే రూ.3 కోట్ల నీరు–చెట్టు పనులను అధికార పార్టీ నేతలు చేపడుతున్నారు. ఇవి ఏమాత్రమూ నాణ్యత లేకుండా చేస్తున్నారు. లెక్కలన్నీ తప్పులతడకే. రూ.3 కోట్ల పనులు చేస్తున్నా..వారికి ఆశ తీరలేదు. పైగా పనులేవీ నిర్ణీత పద్ధతిలో చేయడం లేదు. అయినప్పటికీ లెక్కలు సరిగానే ఉన్నాయంటూ ఇంజినీర్లపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా మరో రూ.7 కోట్లు కలిపి మొత్తం రూ.10 కోట్ల పనులు చేసినట్టు లెక్కలు రాయమంటున్నారు. ఈ విధంగా చేయకపోతే బదిలీ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన ఒత్తిళ్లు ఏకంగా చీఫ్ ఇంజినీర్ వరకూ వస్తున్నట్టు సమాచారం. ఏకంగా అధికార పార్టీ ముఖ్యనేత నుంచి కూడా ఒత్తిళ్లు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాము సామూహిక సెలవులో వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదని సాగునీటిశాఖ ఇంజినీర్లు వాపోతున్నట్లు సమాచారం. వారంటేనే మక్కువ! గత ఏడాది చేపట్టిన నీరు–చెట్టు పనులు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతలకు దక్కలేదు. పక్కనున్న బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్లకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ప్రస్తుతం సాగుతున్న రూ.3 కోట్ల పనులు కూడా ఈ కాంట్రాక్టర్‌కే ఇచ్చారు. ప్రస్తుతం మరో రూ.7 కోట్ల పనుల లెక్కలు కూడా ఈ కాంట్రాక్టర్ ఖాతాలోనే వేయాలనేది అధికార పార్టీ ముఖ్యనేత చేస్తున్న ఒత్తిడి. తమకు ఇవ్వకుండా ఇతరులకు అప్పగించడం ఏమిటని స్థానిక అధికార పార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు. మరోవైపు సదరు కాంట్రాక్టర్ కాస్తా ఏకంగా 50 శాతం నుంచి 60 శాతం వరకూ అధికార పార్టీ ముఖ్యనేతకు ఇవ్వాల్సి వస్తోందని, అందువల్ల మొత్తం రూ.10 కోట్లకు బిల్లులు వేయాలని ఇంజినీర్ల వద్ద పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో సాగునీటి శాఖ ఇంజినీర్లు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. -
ముఖ్యమంత్రి మాట తప్పారు: గౌరు
కర్నూలు జిల్లా : కేసీ కెనాల్ రైతులకు 365 రోజులు నీళ్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారని పాణ్యం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గౌరు చరిత విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల వైఖరి వల్ల కర్నూల్ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. శ్రీశైలంలో 858 అడుగుల నీటి నిల్వ ఉన్నప్పటికీ జిల్లా రైతులకు చుక్క నీరు అందడం లేదని మండిపడ్డారు. ముచ్చుమర్రి నుంచి కేసి కేనాల్‌కు నీటిని నిలిపేయడం దారుణమని వ్యాఖ్యానించారు. తుంగభద్ర నుంచి నీటి వాటా సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. శ్రీశైలం నిల్వ జలాల పంపిణీలో కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేసీ కెనాల్ కింద వేల ఎకరాల్లో పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. -
కర్నూలు కేసి కెనాల్లో విద్యార్ధి గల్లంతు
-
దిగివచ్చిన ప్రభుత్వం
వైఎస్ఆర్ జిల్లా , ఖాజీపేట: దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లుగా కేసీ కెనాల్ రైతుల పరిస్థితి మారింది.ఒకవైపు కుందూనుంచి అధికంగా వరద నీరు వచ్చి పెన్నానదిలో కలుస్తోంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలో 870 అడుగుల వరకు నీరు చేరింది. అయినా ప్రభుత్వంలోగానీ, అధికారుల్లోగానీ కేసీ రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ప్రకటన కూడా చేయడం లేదు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ధర్నాతోపాటు నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు దిగివచ్చి సాగునీరు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రతి ఏటా జూన్‌లో పంటలు సాగు చేసుకోవాల్సిన కేసీ కెనాల్ రైతులు సరైన సమయంలో నీరు రాకపోకపోవడం వల్ల దుక్కిదున్ని ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీరు చేరిన తర్వాత సాగునీరు వస్తుందని రైతులంతా భావించారు. కానీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కడపజిల్లాలోనే 92 వేల ఎకరాల సాగునీటి కోసం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మైదుకూరు పట్టణంలోని కూడలిలో రైతులతో కలిసి సెప్టెంబర్ 23న మహా ధర్నాను చేశారు. 2వ తేదీలోగా అధికారులు స్పందించకపోతే 2,3తేదీల్లో రెండురోజులపాటు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లకు అధికారులు ఒప్పుకున్నారు. 6వ తేదీన ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డ( ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించేందుకు అంగీకరించారు. అలాగే కేసీ కాలువ కింద ఉన్న 92 వేల ఎకరాలతోపాటు తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఒప్పుకున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్ని ఎకరాలు సాగులో ఉన్నాయి? ఇంకా ఎంత భూమి సాగుకు సిద్ధంగా ఉంది? ఏ మేరకు సాగునీరు కావాల్సి ఉంటుంది? అన్న విషయాలను అధికారులు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా నీటి విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలులో ఈనెల 6వ తేదీన ఐఏబీ సమావేశం నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశానికి కడప, కర్నూలు జిల్లాల కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని ప్రజాప్రతినిధులు హాజరు కావాలని అధికారులు తెలిపారు. దీంతో 2వ తేదీన మైదుకూరులోని నాలుగురోడ్ల కూడలిలో చేపట్టనున్న నిరాహార దీక్షను ఎంపీ, ఎమ్మెల్యేలు వాయిదా వేశారు.6వ తేదీన జరగబోయే సమావేశంలో పాల్గొని అక్కడ అధికారులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి ఉద్యమ కార్యచరణ ప్రకటన చేసేందుకు వారు సిద్ధ మవుతున్నారు. -
కేసీ..ప్రాణాలు తోడేసి..!
♦ కర్నూలులో 6 కి.మీ మేర కేసీ కాలువ ♦ కంచె ఏర్పాటులో శాఖల మధ్య సమన్వయ లోపం ♦ ఏటా ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు ♦ వారంలో ముగ్గురు చిన్నారుల గల్లంతు ♦ కన్నపేగు కన్నీరు తుడిచే వారేరి? కర్నూలు సిటీ: నగరం నడి మధ్యలో వెళుతూ నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే కేసీ కాలువ అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చిన్నారుల ప్రాణాలు తోడేస్తోంది. ఏటా కాలువలో చిన్నారుల గల్లంతవుతున్నా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిండుకుండలా.. ఇటీవల తుంగభద్ర నది జిల్లా సరిహద్దులో కురిసిన వర్షాల వల్ల భారీగా వరద నీరు రావడంతో రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కేసీ కాలువ నిండు కుండలా ప్రవహిస్తోంది. నీటి ఉధతి ఎక్కువగా ఉండడంతో కాలువ గట్టుకు సమీపంలోని నివాసాలకు చెందిన వారు తమ పిల్లలను అటు వైపు పోకుండా కాపలాగా ఉంటున్నారు. కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివిధ పార్టీల నాయకులు ప్రతి సందర్భంలోనూ చెబుతూ వస్తున్నా ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. దీంతో చిన్నారుల ప్రాణాలు కాలువలో కలిసిపోతున్నాయి. అంచనాల్లోనే జాప్యం.. నగరంలో సుమారు 6 కి.మీ కేసీ కాలువ ప్రయాణిస్తుంది. స్టాంటన్‌పురం దగ్గర మొదలై, ఇందిరమ్మ కాలనీ వరకు ఉన్న కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు గత ప్రభుత్వం హయాంలో 1.75 కోట్లతో కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి బంగారుపేట వరకు నేటికీ కంచె ఏర్పాటు చేయలేదు. కాలువకు కుడి వైపున కంచె లేకపోవడంతోనే గురువారం కాలేబు అనే విద్యార్థి కాలువలోకి దిగి కొట్టుకుపోయాడు. కాలువకు ఇరువైపులా 3 కి.మీ కంచె ఏర్పాటుకు రూ.71 లక్షలతో కేసీ ఇంజనీర్లు అంచనాలు వేశారు. అయితే అంచనాల్లో తప్పులు దొర్లడం, వాటిని సరిదిద్దడంలోనే కాలం కరిగిపోతోంది. జూలైలోనే ఈ పనులు కొలిక్కి వచ్చుంటే గత నెల నాటికే పూర్తయ్యేవి. వీరి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు హేతువుగా నిలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫెన్సింగ్ ఏర్పాటు చేయండిజిల్లాకలెక్టర్తో చర్చించినఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీకెనాల్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. శుక్రవారం సాయంత్రం ఎంపీ జిల్లాకలెక్టర్ సత్యనారాయణను ఆయన ఛాంబరులో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేసీకాలువ నగరంలోని జనావాస ప్రాంతాల గుండా వెళుతుందని, చిన్నపిల్లలు తెలిసీ తెలియక వెళితే ప్రమాదకరమని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీ వెంట వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.కె.రాజశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. కంచె ఏర్పాటు చేయండి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ డిమాండ్ కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీ కాలువకు కంచె ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. పిల్లలు కేసీ కాలువలో గల్లంతైన సంఘటనకు నిరసనగా శుక్రవారం జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 200 కోట్లతో నగరాన్ని అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్న నాయకులకు కేసీ కెనాల్‌కు కంచె వేయాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాలువకు కంచె లేకపోవడంతో పొరుగున ఉండే కాలనీలకు చెందిన ఎంతోమంది పిల్లలు గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వెంటనే కంచె ఏర్పాటు చేయకపోతే ఆందోళనలు చేపడతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య హెచ్చరించారు. పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సలోమి, ట్రేడ్ యూనియన్ నగరాధ్యక్షుడు కటారి సురేశ్, నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సాంబశివారెడ్డి, ధనుంజయాచారి, చంద్రశేఖర్‌గౌడ్, జీవరత్నం, అశోక్, అశోక్‌కుమార్, సంజు, ఫైజాన్, మంగమ్మ, ఉమాబాయి పాల్గొన్నారు. -
కేసీ కాలువ కరకట్టనూ తవ్వేస్తున్నారు!
► నీరు– చెట్టు పేరుతో తెలుగు తమ్ముళ్ల దోపిడీ ► మట్టిని అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లు ► కరకట్టను ఆక్రమించి తవ్వుతున్నా పట్టించుకోని అధికారులు పూడిపోయిన కాలువలో పూడిక తీసి కాలువను సక్రమంగా ఉంచాలి.. అలా తవ్విన మట్టిని కాలువకు ఇరువైపులా వేయాలి.. దానివల్ల కరకట్టలు భద్రంగా ఉంటాయన్నది అధికారుల ఆలోచన. కానీ అధికార పార్టీ నాయకులు నిబంధనలకు నీళ్లొదిలి మట్టి కోసం ఏకంగా కేసీ కెనాల్ ప్రధాన కాలువ కరకట్టనే తవ్వేస్తున్నారు. ఎంతగా అంటే 50 అడుగులు ఉండాల్సిన కట్టను కేవలం 30 అడుగుల వరకు తగ్గించి కరకట్ట మట్టిని తొలగిస్తున్నారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఖాజీపేట: ఖాజీపేట మండలంలో తుడుమలదిన్నె లాకల దగ్గర కేసీ ప్రధాన కాలువ నుంచి లేఅవుట్ కాలువ ఉంది. బ్రిటీష్ కాలం నుంచి ఈ కాలువ ద్వారా తవ్వారిపల్లె, గుత్తికొట్టాలు గ్రామంలోని సాగు భూములకు నీరు అందుతుంది. కేసీ కాలువలో అధికంగా వచ్చే నీటిని లేఅవుట్ కాలువ ద్వారానే మళ్లించేవారు. అయితే కాలువ పూర్తిగా పూడికతో నిండి ఉంది. ఈ కాలువ మరమ్మతులు చేయాలని అధికారులు భావించారు. అందుకు తగ్గట్టుగా నీరు–చెట్టు పేరుతో పూడిక తీత పనులు చేపట్టారు. అయితే కాంట్రాక్టర్ కాలువ సుమారు 6 మీటర్లు తీయాల్సి ఉంది. కానీ ఏకంగా 16 మీటర్లు తీసున్నారు. కాలువ పక్కనే ప్రధాన కేసీ కాలువ ఉంది. కాలువ కరకట్ట అధికారికంగా సుమారు 50 అడుగులు పైగానే ఉంటుంది. కాలువ కరకట్టను వదిలి సుమారు 10 మీటర్ల దూరంలో లేఅవుట్ కాలువ పూడిక తీత పనులు జరగాల్సి ఉంది. అయితే కరకట్ట మట్టి పూర్తి నాణ్యమైనది కావడంతో ఆ మట్టి కోసం కరకట్టను కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. దీంతో 50 అడుగులు ఉండాల్సిన కాలువ ఇప్పుడు కేవలం 20 అడుగుల కంటే తక్కువ మందంతో కరకట్ట ఉంది. కాంట్రాక్టర్‌కు కాసుల పంట.. లేఅవుట్ కాలువ పూడిక తీస్తున్న కాంట్రాక్టర్ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కుతున్నాడు. కాలువ లోని పూడిక మట్టిని కాలువ కరకట్టగా ఉపయోగించాలి. కానీ ఆ మట్టిని రైతులకు అమ్ముతున్నాడు. ట్రాక్టర్‌కు రూ.250 నుంచి రూ.300 వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 20 ట్రాక్టర్లకు పైగా 3 జేసీబీలను పెట్టి మట్టిని తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని విక్రయించడం వల్ల కాంట్రాక్టర్‌కు అధిక లాభం వస్తుందని స్థానికుల అభిప్రాయం. ప్రమాదంలో కేసీ ప్రధాన కాలువ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా కాలువ మట్టిని తరలిస్తుండడంతో కేసీ కెనాల్ ప్రధాన కాలువ పూర్తిగా బలహీన పడుతుందని కేసీ కాలువ అధికారులే అంటున్నారు. కాలువకు నిండుగా నీరు వచ్చినప్పుడు ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే లేఅవుట్ కాలువలో నీరు పారేటప్పుడు ఆక్రమణకు గురై చిన్నగా ఉన్న కరకట్ట కోతకు గురవుతుంది. దీని వల్ల కేసీ కాలువ తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులే అంటున్నారు. ఇప్పటికే తవ్వారిపల్లె నుంచి కొమ్మలూరుకు వెళ్లే రహదారిలోని కరకట్ట ఆక్రమించడం వల్ల కరకట్ట బలహీనంగా మారి కోతకు గురైంది. తిరిగి మరమ్మతు చేసేందుకు అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని అధికారులు అంటున్నారు. బలహీనంగా ఉన్న కరకట్టను బలంగా చేయాలంటే అధిక నిధులు అవసరమవుతాయని రైతులు అంటున్నారు. అదే అధికారులు చర్యలు తీసుకుని మట్టిని తొలగించిన కాంట్రాక్టర్ చేతనే తిరిగి పనులు చేయించాలని రైతులు కోరుతున్నారు. కాలువ ఆక్రమించినా.. తవ్వినా చర్యలు తీసుకుంటాం ‘కేసీ కాలువకు ఇరువైపులా పెద్ద కరకట్టలు ఉన్నాయి. కాలువను ఆక్రమించినా, కరకట్టను తవ్వినట్లు తెలిసినా వారిపై చర్యలు తీసుకుంటాం. కాలువ కరకట్టను తవ్వుతున్నట్లు మాకు తెలియదు’ అని కేసీ కాలువ డీఈ జిలానీ బాషా తెలిపారు. కేసీ కాలువ కరకట్ట పైనే సాగు... కాలువకూ పట్టాలు తవ్వారిపల్లె నుంచి తుడుమలదిన్నె మీదుగా కేసీ కాలువ నెంబర్ 26 నుంచి మైదుకూరు వరకు కేసీ కాలువ ప్రధాన కరకట్ట ఉంది. అయితే కొంత మంది రైతులు ఏకంగా కాలువ కరకట్ట పైనే వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కాలువ పైన రాకపోకలకు ఉండే రహదారి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం 10 మీటర్లు మాత్రమే ఉంది. మరికొన్ని చోట్ల అయితే కాలువ కట్టను ధ్వంసం చేసి మరీ సాగు చేసుకుంటున్నారు. ఇంకొందరు కాలువ స్థలం పైనే గుడి కడుతున్నారు. మరికొందరు తమ పొలంలో కలుపుకుని కాలువ స్థలానికి పట్టా కూడా చేసుకున్నారని రైతులు చర్చించుకుంటున్నారు. ఇలా సుమారు 200 ఎకరాలకు పైగానే కరకట్ట స్థలాన్ని ఆక్రమించి కరకట్టను బలహీన పరిచినట్లు తెలుస్తోంది. అధికారులు ఎక్కడ.. కేసీ కాలువ స్థితిగతులపై సాగు సమయం కంటే ముందు అధికారులు కాలువ వెంబడి వచ్చి పరిశీలించాలి.. అయితే అధికారులు కాలువపై తిరగడమే మానేశారు. ఆక్రమణల పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు దర్జాగా కాలువను ఇష్టానుసారంగా ధ్వంసం చేసున్నారు. ఇలాగే వదిలేస్తే కాలువను పూర్తిగా ఆక్రమించి నామ మాత్రంగా కాలువను ఉంచుతారని పలువురు రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ అక్రమాల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
గల్లంతైన బాలుడి కోసం గాలింపు
కుమ్మరపల్లె(రాజుపాళెం): కేసీ కాలువలో సోమవారం గల్లంతైన బాలుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుమ్మరపల్లెకు చెందిన భజంత్రి నాగేంద్ర కుమారులు హరినాథ్(4), యశ్వంత్ (3) గట్టుపై సాయంత్రం ఆడుకుం టుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. యశ్వంత్ మృతదేహం పగిడాల సమీపంలో దొరికింది. హరినాథ్ అచూకీ ఇంత వరకు తెలియరాలేదు. చాపాడు కేసీ కాలువకు నీటిని నిలుపుదల చేసి గాలింపు చర్యలు చేపట్టినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. హరినా«థ్ ఆచూకీ తెలిస్తే రాజుపాళెం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యశ్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరినాథ్, యశ్వంత్ అన్నదమ్ములు కావడంతో.. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక కుమారుడు మరణించడం, మరో కుమారుడి అచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం బంధువులకు కష్టతరంగా మారింది. గ్రామానికి సమీపంలోనే కేసీ కాలువ ఉండటంతో ఇరువైపులా రక్షణగా కంచెను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కేసీ కాలువలో మహిళ మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం: కేసీ కాలువలో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రూరల్ పోలీసులు గుర్తించారు. బొజ్జవారిపల్లె సమీపంలోని పైలాన్ వద్ద మహిళ మృతదేహం ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ జిఎండి.బాషా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెకు 40 ఏళ్లు దాకా ఉంటాయని తెలిపారు. ఈమెకు సంబంధించిన బంధువులు రూరల్ పోలీసులకు సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. -
కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి
చాపాడు: మహరాష్ట్ర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలో భారీ వరద నీరు చేరిందని, ఇప్పటికే 856 అడుగులకు పైగా చేరిందని.. ఈ క్రమంలో తక్షణమే కేసీ కెనాల్‌కు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఏపీ రైతుసంఘం నాయకులు పేర్కొన్నారు. కేసీ కెనాల్ సాగునీటి విడుదల ఉద్యమంలో భాగంగా సోమవారం చాపాడు తహసీల్దారు వి.పుల్లారెడ్డికి ఏపీ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా శ్రీ శైలం జలాశయంలో భారీగా వరద నీరు 856 అడుగలకు చేరిందని, ఇంకా చేరుతుందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికై ఖరీఫ్‌లో వరిసాగుకు దూరమైన కేసీ రైతాంగానికి తక్షణమే కేసీ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేయాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే నీటి విడుదలపై ప్రకటన చేయాలన్నారు. శ్రీశైలంలో 875 అడుగుల మేరకు సాగునీటిని నిల్వ చేయాలని, ఆపై వచ్చే నీటిని క్రిందికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం త్వరగా కేసీ సాగునీటి విడుదలపై ప్రకటన చేస్తే రైతులు వరిసాగు కోసం సంసిద్దమవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవీ రమణ, మండల నాయకులు రామాంజనేయుడు, జిల్లా ఉపాధ్యక్షులు అంకిరెడ్డి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పి.శ్రీరాములు, రైతు సంఘం నాయకులు కేవీ రమణ, పుల్లయ్య, ప్రతాప్‌రెడ్డి, పట్నం వెంకటేశ్వర్లు, షర్పరుద్దీన్, ఇల్లూరు సుధాకర్‌రెడ్డి, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటికి ఉద్యమం
చాపాడు: శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేసి, కేసీ కాలువకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏవీ రమణ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను గురువారం మండల కేంద్రమైన చాపాడులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికే శ్రీశైలానికి నీరందించే ఆల్మట్టి, ఇతర ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నిండాయని, వీటి నుంచి శ్రీశైలానికి భారీ వరదనీటి ప్రవాహం చేరుకుంటోందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టాన్ని నిలువ చేయాలన్నారు. ఇలా చేయటం వలన జిల్లాలోని 92వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. నిరసన కార్యక్రమాలు ఇలా కేసీ కెనాల్‌కు సాగునీటì ని అందించాలని కోరుతూ ఈ నెల 8వ తేది నుంచి 17వ తేది వరకూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పలు రకాలైన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 8న తహసీల్దారు కార్యాలయాల వద్ద ఆందోళనలు, 15న మైదుకూరులోని కేసీ కెనాల్ డీఈ కార్యాలయం ముట్టడి, 17న మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టి 36 గంటల పాటు దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పి.శ్రీరాములు, సీనియర్ నాయకులు జి.బాలచెండ్రాయుడు, పల్లవోలు రమణ, ఏపీ రైతు సంఘం నాయకులు కె.రామాంజనేయులు, టి.పి నరసింహులు, రమేష్‌రెడ్డి, వెంకటేశు, శివశంకర్‌రెడ్డి, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కేసీపై ‘కరువు’ మేఘాలు
మైదుకూరు టౌన్: జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగునీరు అందిస్తున్న ఏకైక కాలువ కేసీ కెనాల్. బ్రిటీష్ కాలంలో నిర్మితమైన ఈ కాలువ కరువుబారిన పడిన రైతుల బతుకుల్లో వెలుగు నింపుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002, 2003, 2004 వ్యవసాయ సీజన్లో వరుసగా మొట్టమొదటి సారిగా కేసీ ఆయకట్టులో కరువు తాండవించింది. ప్రకృతి కంటే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వరుసగా మూడేళ్లు రైతులు తిండి గింజలకు దూరమయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015 వ్యవసాయ సీజన్లో మళ్లీ కరువు ఛాయలు కేసీ ఆయకట్టుపై అలుముకున్నాయి. ఈ ఏడాది నీరు రాకపోతే తమ బతుకులు ఎట్లా అని రైతులు మథనపడుతున్నారు. సొంత పొలమున్న రైతులే ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే.. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఓ పక్క తిండిగింజలు లేక.. ఈ ఏడాది వరిపంట పండించుకునే అవకాశం కన్పించక రైతులు గుండెలు బాదుకునే దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. కేసీ కెనాల్ ప్రాజెక్టుకు సాగునీరు అందని పరిస్థిత్లులో ఆదుకుంటామని రైతుకు అభయమిచ్చిన అధికారపార్టీ నేతల జాడ కన్పించలేదు. ప్రస్తుత పరిస్థితి కేసీ ఆయకట్టులో 2002 నుంచి 2004 వరకు నెలకొన్న నాటి పరిస్థితులు గత ఏడాది నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లోనూ వెంటాడుతున్నాయి. కేసీ కెనాల్ ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాలు 5వందల మీటర్లకు పైగా పడిపోయాయి. గత ఏడాది సాగుచేసిన అరకొర పంటలను భూగర్భ జలాలు కాపాడలేకపోయాయి.. చేతికందిన పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లను తవ్వుకున్నా ఫలితం లేకపోయింది.. ఒక్కో రైతు పంటను కాపాడుకునే క్రమంలో ఏడెనిమిది బోర్లను తవ్వించుకున్నా.. చివరకు భూగర్భజలాలు పైకి రావడానికి ససేమిరా అన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ బోర్ల ద్వారా పంట సాగుచేద్దామంటే జలాలు అందడం లేదు. కేసీ పరివాహక ప్రాంతాల్లోని పల్లె సీమల్లోనే కాదు, పట్టణాల్లో సైతం తాగునీటి ఎద్దడి నెలకొంది. బిందెడు నీరు దొరక్క పడిగాపులు కాస్తున్నారు. జూన్ మాసం వెళ్లింది.. జులై మాసం ముగుస్తోంది.. అరకొర వర్షాలు పొలాల్లో పచ్చదనం పెంపొందించాయి తప్ప.. సాగునీటికి భరోసా ఇవ్వలేకపోయాయి.. కేసీ కెనాల్‌కు సాగునీరు అందించే ప్రధాన వనరు శ్రీశైలం రిజర్వాయర్.. ఆ రిజర్వాయరే నీటి కోసం తపిస్తోంది. కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదలు వస్తేనే.. కేసీ కెనాల్‌కు సాగునీరు శ్రీశైలం రిజర్వాయర్ నీటి లభ్యతపై ఆధారపడి ఉంది. ఆయకట్టు ప్రాంతంలో వర్షాలు కురిసినా వరిపంట సాగు చేసుకునే అవకాశం లేదు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 47.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఏస్కెప్ ఛానల్ ద్వారా కేసీ కెనాల్‌కు సాగునీటి సరఫరా జరగాలంటే 143 టీఎంసీల నీరు అవసరం. ఆ మేర నీటి మట్టం రిజర్వాయర్‌లో పెరగాలంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవాల్సి ఉంటుంది. ఇక భారీ వర్షాలు పడి.. రోజుకు 10 లక్షల క్యూసెక్కులపైగా నీరు రిజర్వాయర్‌కు నిరాటంకంగా కొద్ది రోజులు కొనసాగితేనే కేసీకి నీరు అందే పరిస్థితి. ఆ స్థాయిలో వర్షాలు కురవని పక్షంలో కేసీ ఆయకట్టులో మళ్లీ రెండవ ఏడాది కరువు దుర్భర పరిస్థితులను రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ---------------------------------- ప్రాజెక్టు: కేసీ కెనాల్ (కర్నూలు– కడప కాలువ) ఆయకట్టు: 92,001 ఎకరాలు ఖరీఫ్ పంటలు: మాగాణి, ఆరుతడి పంటలు ప్రధాన పంట: వరి (71,848 ఎకరాలు) సాగునీరు అందే మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు, కడప, ప్రొద్దుటూరు, రాజుపాలెం, చింతకొమ్మదిన్నె ----------------------------------------- ఈ ఏడాది కూడా కరువు తప్పదు.. గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా కేసీ ఆయకట్టు రైతులకు కరువు పరిస్థితి తప్పేట్టు లేదు. ప్రస్తుత పాలకులు కృష్టా డెల్టాపై చూపించే ప్రేమలో ఒకింత భాగం రాయలసీమ ప్రాంతంలోని రైతులపై చూపిస్తే కరువు ఉండదు. కాని మన పాలకుల దౌర్భాగ్యంతో కరవు కోరలు చాస్తోంది. దీంతో ఎంతో మంది రైతుల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. – లెక్కల వెంకటరెడ్డి, రైతు నాయకుడు, కుందూ సాహితీ కన్వీనర్ -
కేసీకి నీరివ్వడంలో అధికారుల నిర్లక్ష్యం
మైదుకూరు టౌన్: కడప –కర్నూలు కాలువకు నీరు అందించడంల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుష్పాల శ్రీనాధరెడ్డి విమర్శించారు. కాలువలు సరిగ్గా లేవని నీరు రావడం లేదనే సాకుతో జిల్లా రైతాంగం పట్ల చిన్న చూపు చూడడం తగదన్నారు. జిల్లాలో వేల ఎకరాలు నీరులేక బీళ్లు బారిపోయిందన్నారు. అధికారులు మాత్రం ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. కేసీ కాలువకు నీరందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బీ.పీ వెంకట ప్రతాప్‌రెడ్డి, బీసీ గుర్రప్ప, శ్రీధర్‌బాబు, డి. రఘునాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీ కెనాల్‌కు నీళ్లివ్వండి-వైఎస్సార్సీపీ
కడప: కేసీ కాలువకు వెంటనే నీళ్లు విడుదలచేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కడపలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు మాట్లాడారు. గత ఏడాది కూడా కడప-కర్నూలు కాలువకు నీళ్లు ఇవ్వలేదని, దాంతో ఆయకట్టు మొత్తం ఎండిపోయిందని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 874 అడుగుల వరకూ నీటి మట్టం ఉంచి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేసీ కాలువకు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్‌కు నీళ్లు ఇవ్వకుండా తెలంగాణాకు నీళ్లు ఇస్తే సహించేది లేదని, ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. -
పాలకుల్లారా.. ఇటు ‘కేసీ’ చూడండి
♦ ఉత్తుత్తి కాల్వలు కాదు..ఉన్న కాల్వలు కాపాడండి ♦ జిల్లాలో కేసీ కెనాల్‌కు 84 చోట్ల ప్రమాదకర పరిస్థితి ♦ అరకొరగా నిధులు - స్పందించని ప్రభుత్వం ♦ తలలు పట్టుకుంటున్న అధికారులు ♦ 39 చోట్ల పనులకు ప్రతిపాదనలు ♦ రూ.2 కోట్ల నిధులు మంజూరు ♦ మరో రూ.4.8 కోట్లు కావాలంటున్న అధికారులు కేసీకెనాల్.. జిల్లాకు వరప్రదాయిని.. రైతులకు ప్రాణప్రదమైన కాలువ. అలాంటి కాలువను ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్వహణకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిధులు కేటాయించక పోవడంతో కాల్వల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడే దెబ్బతింది. లైనింగ్ లేచిపోవడంతో పాటు చాలాచోట్ల కట్ట కూడా దెబ్బతింది. కాలువ పరిస్థితి చూసి రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం వస్తోంది.. వరుణుడు కరుణించి ప్రాజెక్టుల్లో నీరు చేరి కాలువకు నీళ్లు వదిలితే ఎక్కడ గండ్లు పడతాయోనని అన్నదాతల్లో కలవరం నెలకొంది. - చెన్నూరు చెన్నూరు : ఇరిగేషన్‌కు అధికప్రాధాన్యం ఇస్తున్నామంటూ ఆర్భాటం చేసే ప్రభుత్వ పెద్దలకు కేసీ (కర్నూలు-కడప కాలువ) కెనాల్ దుస్థితి కనిపిం చడం లేదు. నీరు-చెట్టు పథకం పేరుతో కోట్లు ఖర్చుపెట్టి ఉపయోగం లేని ఉత్తుత్తి కాల్వల పనులను చేపడుతున్న పాలకులు వేలాది ఎకరాలకు నీరిస్తున్న కేసీ కాల్వను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 10 మండలాల్లో 92వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గతంలో కేసీ కాల్వను ఆధునీకరించారు. చాగలమర్రి సమీపంలోని రాజోలి ఆనకట్ట వద్ద నుంచి పాత కడప చెరువు నానేపల్లె వరకు చేసిన కేసీ కాల్వ లైనింగ్ చేశారు. వాటితో పాటూ ఉపకాల్వలు చేశారు. 82 కిలోమీటర్ల మేర జరిగిన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో కాల్వ లైనింగ్ దెబ్బతిని, కట్టలు కోతలకు గురైంది. ఎదురుచూస్తున్న రైతులు కేసీ కాల్వ ద్వారా వైఎస్సార్ జిల్లాలో 10 మండలాల్లో 92 వేల సాగునీరు అందించాల్సి ఉంది. రాజోలి ఆనకట్ట వద్ద నుంచి దువ్వూరు, రాజపాలెం, ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, వల్లూరు, చెన్నూరు, సీకెదిన్నె, కడప మండలాల్లో కేసీ కెనాల్ కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీరు అందకపోవడం, ఈ ఏడాదైనా కాల్వకు నీరొస్తే పంటలు సాగు చేసుకొనేందుకు రైతులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చెన్నూరు మండల పరిధిలోని శివాలపల్లి, చిన్నమాసుపల్లి, గోపవరం, వల్లూరు మండలం పరిధిలోని ఆదినిమ్మాయపల్లిలో, ఖాజీపేట మండలంలో రెండుచోట్ల, మైదుకూరు మండలంలో ఆరుచోట్ల, మిగతా మండలాల్లోనూ భారీగా లైనిం గ్ దెబ్బతిన్నట్లు అధికారులే చెబుతున్నారు. వీటి లో ఐదారు చోట్ల పరిస్థితి దారుణంగా ఉందని, కాలువకు నీళ్లు వదిలితే గండ్లుపడే ప్రమాదం పొం చి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 97 చోట్ల దెబ్బతిన్న కాల్వ: 82కిలోమీటర్ల మేర జిల్లాలో కేసీకాల్వ ఉంది. దీంతో పాటూ మరో 264 కిలోమీటర్లపైగా లైనింగ్ ఉపకాల్వలు ఉన్నా యి. ఇటీవల 39చోట్ల అత్యవసరంగా పనులు చేయాలంటూ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపడంతో రూ.2కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ మొత్తం సరిపోదంటూ మరో రూ.4.8కోట్లు కావాలంటూ నీరు-చెట్టు కింద మంజూరుకు కేసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మైదుకూరు, పొద్దుటూరు నియోజకవర్గాల్లోని నీటిసంఘం ప్రతి నిధులు చురుగ్గా పనులు చేస్తు న్నా, కమలాపురం, కడపల్లోని కమిటీలు పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కాల్వలు, షెట్టర్లు, పలుచోట్ల లైనింగ్ దెబ్బతిన్నా యి. దీంతో కేసీకి నీరొచ్చినా చివరి ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4.8 కోట్లతో ప్రతిపాదనలు పంపాం నీటి పారుదల శాఖ నుంచి అత్యవసర పనుల కింద 39 పనులకు రూ.2 కోట్లు మంజూరైంది. మైదుకూరు డివిజన్లో నీటిసంఘం ప్రతి నిధులు పనులు చేస్తున్నారు. నీరు-చెట్టు కింద మరో రూ.4.8కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే వెంటనే పనులు చేయిస్తాం. -జిలానీబాష, డివిజనల్ ఇంజనీరు, కేసీ కెనాల్ అధ్వానంగా మారాయి కేసీ కాల్వల లైనింగ్ దెబ్బతిన్నాయి. కట్టలపై కంపచెట్లు పెరిగి పొలాల వద్దకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు, పాలకులకు ఎన్నిమార్లు చెప్పినా స్పందించడం లేదు. ఇలాగే ఉంటే కాల్వల మనుగడ కష్టంగా మారుతుంది. -ముండ్ల విశ్వనాథరెడ్డి, రామనపల్లె,చెన్నూరు మండలం నీరు రావడం చాలా కష్టంగా ఉంది కేసీ కాల్వ ద్వారా కొండపేట చెరువుకు నీరివ్వాలి. కాలువలు పూడిపోవడం, లైనింగ్ దెబ్బతినడం, పూడిక చేరడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు రావడం చాలాకష్టంగా మారింది. ప్రభుత్వం నీరు-చెట్టు ద్వారా అనవసరమైన వాటికి ఖర్చు చేస్తుంది. వేలాది ఎకరాలకు నీరిచ్చే కేసీ కాల్వను కాపాడాలి. -జి పుల్లారెడ్డి రైతు, కొండపేట, చెన్నూరు మండలం జిల్లాలో కేసీ కెనాల్ పరిధిలోని మండలాలు : 10 మొత్తం ఆయకట్టు : 92వేల ఎకరాలు మొత్తం దూరం : 82కిలోమీటర్లు ఉపకాల్వలు : 264కిలోమీటర్లు ఆయకట్టు రైతులు : 60వేల మంది కాల్వ దెబ్బతిన్న ప్రాంతాలు : 97 -
‘నీళ్లివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం’
కర్నూలు : నందికొట్కూరు నియోజకవర్గంలోని కేసీ కెనాల్ ఆయకట్టు భూములకు సాగు నీరు ఇవ్వకుంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం దాదాపు 200 మంది రైతులు జల వనరుల శాఖ ఎస్ఈ ఛాంబర్‌ను చుట్టుముట్టారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు మార్చి దాకా నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి, అధికారులే కారణమంటూ లేఖలు రాసి, అక్కడే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఈ చంద్రశేఖర్‌రావు వారితో మాట్లాడారు. సుంకేశుల రిజర్వాయర్ నీటి నిల్వలు కర్నూలు నగర వాసుల తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని చెప్పారు. అవసరమైన 1.20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.88 టీఎంసీల నిల్వలే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో తాము సాగు నీటిని ఇవ్వలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్ఈ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగుతోంది.