khaleel ahmed
-
BGT 2024: యశ్ దయాళ్‌కు లక్కీ ఛాన్స్! అతడి స్థానంలో..
భారత బౌలర్ యశ్ దయాళ్‌కు బంపరాఫర్ వచ్చింది. ఆస్ట్రేలియాతో టెస్టుల నేపథ్యంలో అతడు రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో చేరినట్లు సమాచారం. ఖలీల్ అహ్మద్ స్థానంలో యశ్ దయాళ్ టీమిండియాతో కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు సౌతాఫ్రికా నుంచి నేరుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించనున్నాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టులకు ప్రకటించిన ప్రధాన జట్టులో ఆంధ్ర క్రికెటర్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు పేసర్ హర్షిత్ రాణా కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాగా.. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పేస్ ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగామరోవైపు.. పేస్ ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌లను కూడా బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది.అయితే, ప్రాక్టీస్ సమయంలో.. ఖలీల్ అహ్మద్ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ ఈ లెఫ్టార్మ్ పేసర్ గాయపడగా.. పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం అతడిని స్వదేశానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం.ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా యశ్ దయాళ్ను టీమిండియా మేనేజ్మెంట్ ఆస్ట్రేలియాకు పిలిపించినట్లు వార్తా సంస్థ పీటీఐకి బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘‘నిజానికి యశ్ దయాళ్ మొదటి నుంచే జట్టుతో ఉండాల్సింది. భారత్-‘ఎ’తో మ్యాచ్ ఆడాల్సింది. కానీ అతడిని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు పంపించాం.అందుకే యశ్ దయాళ్ను పిలిపించాంఒకవేళ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేయలేకపోతే అతడు జట్టుతో ఉండీ ప్రయోజనం లేదు. అందుకే యశ్ దయాళ్ను పిలిపించాం’’అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ప్రధాన బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు స్టార్ ఓపెనర్ యశ్ దయాళ్ భుజానికి గాయమైనా.. బుధవారం అతడు తిరిగి బ్యాట్ పట్టడం సానుకూలాంశం.ఇక యశ్ దయాళ్‌కు.. గతంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా సెలక్టర్లు పిలుపునిచ్చారు. కానీ తుదిజట్టులో అతడికి స్థానం దక్కలేదు. సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికైనా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ సీమర్‌ను ఆర్సీబీ.. ఈసారి రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడిలా మరోసారి టీమిండియాతో కలిసే లక్కీ ఛాన్స్ యశ్ దయాళ్‌కు వచ్చింది.చదవండి: సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే! -
నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్
దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా అనంతరపురం, బెంగళూరు వేదికలుగా దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ గురువారం ఆరంభమైంది.ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్విఇందులో భాగంగా ఇండియా-‘ఏ’ - ఇండియా- ‘బి’ జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఇండియా- ‘ఏ’ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తమ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఇండియా- ‘బి’ ఇన్నింగ్స్ ఆరంభించాడు.అనుభవజ్ఞుడైన అభిమన్యు ఈశ్వరన్‌కు ఇండియా- ‘ఏ’ పేసర్ ఆవేశ్ ఖాన్ అద్భుత బంతిని సంధించగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిమన్యు నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. హాట్ ఫేవరెట్‌గా దిగి.. విఫలంఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శశ్వత్ రావత్(సబ్‌స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా తరఫున ఇప్పటికే మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు బాదిన యశస్వి జైస్వాల్ హాట్ ఫేవరెట్‌గా దులిప్ ట్రోఫీ బరిలో దిగాడు. అయితే, ఆరంభంలోనే ఇలా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు. కాగా బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో.. ఈ టోర్నీకి ప్రాధాన్యం ఏర్పడింది. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుంది. ఇదిలా ఉంటే.. తొలిరోజు 30 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇండియా-‘బి’ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అన్నదమ్ములు ముషీర్ ఖాన్ ఆరు, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇండియా-‘ఏ’ వర్సెస్ ఇండియా- ‘బి’ తుదిజట్లుఇండియా-‘ఏ’శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.ఇండియా- ‘బి’అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్.చదవండి: ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్.. వీడియో వైరల్ -
Ind vs Zim: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.రాణించినా రజా ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.అరంగేట్ర బౌలర్‌కు ఒక వికెట్ టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.ఆకాశమే హద్దుగా జైస్వాల్ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జైస్వాల్ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) తో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లు) సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తొలి సిరీస్‌లోనే ట్రోఫీ గెలవడం విశేషం.చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్ రజా వరల్డ్ రికార్డు -
T20 WC: గిల్‌తో పాటు అతడు ఇంటికి! వాళ్లిద్దరు అక్కడే..
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. తదుపరి కెనడాతో తలపడనుంది.ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్లో ఇరు జట్ల మధ్య జూన్ 15న మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తెరమీదకు వచ్చింది.వరల్డ్‌కప్-2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే, వీరితో పాటు ఇదే కేటగిరిలో ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరు నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్‌కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏమిటి?ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుబ్‌మన్ గిల్‌తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్‌లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా.. మిగతా మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు వెళ్లనుంది.అవసరం లేదుఇక విండీస్ పిచ్‌లు స్లోగా.. స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్‌తో అవసరం లేదు.ఇప్పటికే పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్ట్రాగా ఆవేశ్ ఖాన్‌ను ఇంటికి పంపించాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే, హిట్టర్ రింకూ సింగ్‌తో పాటు బ్యాకప్ పేసర్‌గా ఖలీల్ అహ్మద్‌ను మాత్రం కొనసాగించనుందని సమాచారం. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లపై విజయాలు సాధించింది. గ్రూప్- ఏ టాపర్‌గా సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. -
ఆస్పత్రి బెడ్‌పై భారత ఆటగాడు.. ఆ టోర్నీ మొత్తానికి దూరం!
టీమిండియా పేసర్, రాజస్తాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఖలీల్ అహ్మద్ ప్రస్తుతం మెకాలి గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా తన గాయానికి సంబంధించిన అప్డేట్ను ఖలీల్ అహ్మద్ అభిమానులతో పంచుకున్పాడు. హాస్పిట్ల్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రంజీ ట్రోఫీలో చాలా మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు అతడు తెలిపాడు. ఒక వేళ తను పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తే తిరిగి మళ్లీ జట్టులోకి చేరుతాని అని ఖలీల్ అన్నాడు. "క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కష్టం. నా మెడికల్ కండీషన్ కారణంగా, నేను రాబోయే రంజీ సీజన్లో చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాను. నేను ప్రస్తుతం కోలుకుంటున్నాను. నేను ఫిట్నెస్ సాధిస్తే తిరిగి మళ్లీ మైదానంలోఅడుగుపెడతాను. నేను కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికీ ధన్యవాదాలు" అని ట్విటర్లో ఖలీల్ పేర్కొన్నాడు. కాగా ఖలీల్ దాదాపు రెండేళ్ల నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో కూడా గాయం కారణంగా అతడు కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం అతడు పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగాడు. ఢిల్లీ క్యాపిటిల్స్కు ప్రాతినిథ్యం వహించిన ఖలీల్ అదరగొట్టాడు. ఐపీఎల్-2023లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు 11 వన్డేలు, 14 టీ20ల్లో భారత జట్టుకు ఖలీల్ ప్రాతినిథ్యం వహించాడు. అతడు చివరసారిగా టీమిండియా తరపున చివరగా 2019లో బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌లో ఆడాడు. Dear all, it’s very hard to stay away from cricket, It's unfortunate, but due to my medical condition, I would be missing most of the matches of the upcoming Ranji season. I am on the road to recovery and will be back in the side once deemed fit. I am grateful for all the wishes pic.twitter.com/TA68ARmoPx — Khaleel Ahmed 🇮🇳 (@imK_Ahmed13) December 12, 2022 చదవండి: Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్ ఎప్పుడంటే! -
ఐపీఎల్ 2022లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్లు వీరే..
ఐపీఎల్-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫైర్-2లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఈ ఏడాది సీజన్లో యువ లెఫ్టార్మ్ పేసర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. మొహ్సిన్ ఖాన్, టి నటరాజన్, యష్ దయాల్, ఖలీల్ అహ్మద్ వంటి లెఫ్టార్మ్ బౌలర్లు తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొహ్సిన్ ఖాన్ ఐపీఎల్-2022లో మొహ్సిన్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతడికి టోర్నీ ఆరంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన మొహ్సిన్ అదరగొట్టాడు. పేస్ బౌలింగ్‌తో జట్టులో తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ ఖాన్ 14 వికెట్లు పడగొట్టాడు. టి నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన టి.నటరాజన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు నటరాజన్ దూరమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 18 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ ఈ ఏడాది సీజన్లో ఖలీల్ అహ్మద్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతనిధ్యం వహించాడు. ఢిల్లీ విజయాల్లో ఖలీల్ తన వంతు పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ 16 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాళ్ గుజరాత్ టైటాన్స్ తరపున యశ్ దయాళ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. డెబ్యూ సీజన్లోనే యశ్ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన దయాళ్ 10 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: 'బట్లర్ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు ! -
'అతడొక అద్భుతమైన కెప్టెన్.. ఈ సారి ఐపీఎల్ కప్ మాదే'
ఐపీఎల్-2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి టైటిల్‌ను ముద్దాడుతుంది అని ఆ జట్టు పేసర్ ఖలీల్ అహ్మద్ థీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి టైటిల్‌ను అందించే సత్తా కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఉందని ఆహ్మద్ తెలిపాడు. గత నాలుగు సీజన్లలో సన్‌రైజెర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ఖలీల్ అహ్మద్ ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా రూ. 5.25 కోట్లకు అతడిని ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది. ఇక 2016 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఖలీల్ అహ్మద్, పంత్ ప్రాతినిధ్యం వహించారు. కాగా అఖరి మూడు సీజన్లలో ప్లేఆప్స్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఇక తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఐపీఎల్-2022ను ఢిల్లీ ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ 27 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. "రిషబ్ పంత్ వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు. అతడు నేను ఒకే సమయంలో మా కెరీర్‌ను ప్రారంభించాము. మేమిద్దరం భారత్ అండర్-19 జట్టు తరుపున ఆడాము. మన కెప్టెన్ గురుంచి మనకు తెలిసినప్పడు, అతనితో మన ప్లాన్స్‌ను చర్చించవచ్చు. మళ్లీ పంత్‌తో కలిసి ఆడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి తమ తొలి టైటిల్‌ను గెలిచుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. రిషబ్ అద్భుతమైన కెప్టెన్. కాబట్టి ఢిల్లీకు కచ్చితంగా పంత్ తొలి టైటిల్‌ను అందిస్తాడు అని నేను భావిస్తున్నాను "అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. సిక్సర్ల వీరుడు వచ్చేశాడు! -
'బ్రావోతో నేనేందుకు అలా ప్రవర్తిస్తాను'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో మంగళవారం సన్‌రైజర్స్, సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 20 పరుగులతో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించింది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే మ్యాచ్ మధ్యలో ఖలీల్ అహ్మద్, బ్రావో మధ్య చోటుచేసుకున్న సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అసలు విషయంలోకి వస్తే.. చెన్నై ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను ఖలీల్ అహ్మద్ డకౌట్ చేశాడు. లెగ్‌స్టంప్ మీదుగా వెళ్లిన బంతిని బ్రావో అంచనా వేయడంలో పొరబడడంతో నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే ఖలీల్ ఎలాంటి సెలబ్రేషన్స్ చేయకుండా సైలంట్‌గానే ఉన్నాడు కానీ బ్రావోను చూస్తూ చిన్న వెకిలి నవ్వు నవ్వాడు. ఇప్పుడు ఆ వెకిలి నవ్వే ఖలీల్‌ను సోషల్ మీడియాలో విలన్‌ను చేసింది. ఇదే ఖలీల్ అహ్మద్ రాజస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా రాహుల్ తెవాటియాతోనూ గొడవ పడిన సంగతి తెలిసిందే. (చదవండి :ఏం చేసినా జట్టు కోసమే : తాహిర్) 'ఒక సీనియర్ అంతర్జాతీయ క్రికెటర్ అయిన బ్రావోకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ' అంటూ మండిపడ్డారు. దీనితో పాటు ఖలీల్‌పై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.' ఖలీల్ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. ప్రతీ క్రికెటర్ ఎంతో కొంత స్పోర్టివ్ ప్రదర్శిస్తాడు. కానీ ఖలీల్‌కు కనీసం అది కూడా లేదు.. తెవాటియాతోనూ ఇలాంటిదే చేశావు.. షేమ్ ఆన్ యూ.. ఖలీల్‌కు అసలు క్రీడా స్పూర్తి అనేదే లేదు.. అంటూ మండిపడ్డారు. అయితే దీనిపై ఖలీల్ అహ్మద్ స్పందించాడు. నేను బ్రావోను చూసి నవ్వలేదు. 'నా నవ్వు వెనుక అసలు కారణం అది కాదు. అయినా బ్రావో లాంటి ఆటగాడిపై నేను అలా ప్రవర్తిస్తానా చెప్పండి. అయినా నేను బ్రావోను అన్నలాగా భావిస్తాను. దయచేసి దీనిని పెద్ద ఇష్యూ చేయకండి.' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. -
ఖలీల్‌పై రాహుల్ తెవాటియా ఫైర్ !
ఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. రాహుల్ తెవాటియా అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ షేక్ హాండ్ ఇచ్చేందుకు వచ్చినప్పుడు రాహుల్ వాగ్వాదానికి దిగాడు. వార్నర్‌తో కోపంగా ఏదో మాట్లాడాడు. pic.twitter.com/uSKOIZbgeb — faceplatter49 (@faceplatter49) October 11, 2020 ఇంతకి ఎందుకా కోపం... లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆఖరి ఓవర్లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉంది. ఖలీల్ అహ్మద్ చివరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. మొదట్లో రాహుల్, ఖలీల్ మధ్య ఏదో సంభాషణ జరిగింది. ఐదో బంతికి రియాన్ పరాగ్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పుడే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ వచ్చి రాహుల్‌కు సర్దిచెప్పాడు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చిన ఖలీల్‌పై మళ్లీ ఫైర్ అయ్యాడు. చివరకు మిగతా జట్టు సభ్యులు వచ్చి సర్దిచెప్పడంతో రాహుల్ శాంతించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 75 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి తప్పదని అనుకున్న సమయంలో రాహుల్ తెవాటియా 45 (28), రియాన్ పరాగ్ 42 (26) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. (ఇదీ చదవండి: సిక్సర్ల తెవాటియాకు కోహ్లి కానుక) -
చహల్‌కు తింగరేశాలెక్కువే..!
టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. ఈ విషయం చహల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్క క్రీడాభిమానికి తెలుసు. ఎప్పుడు ఏదో ఆసక్తికర వీడియోలతోనో.. ఫోటోలతోనో ఆకట్టుకునే చహల్.. తాజాగా మరో టిక్‌టాక్ వీడియోతో దర్శనమిచ్చాడు. ఈ వీడియో చూశాక మాత్రం చహల్ టిక్‌టాక్ పిచ్చి ఏ రేంజ్లో ఉందో అర్థమైపోతుంది. న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా చహల్ తన సహచర ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, పేసర్ ఖలీల్ అహ్మద్ కలిసి చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. చదవండి: అసూయ పడకు రోహిత్ భయ్యా: చహల్ కాగా ఆ వీడియోలో ఓ బాలీవుడ్ సినిమా సీన్‌ని రీ క్రేయేట్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో చహల్ తన జాకెట్‌ను తికమక వేసుకొని కింద పడుకోగా రోహిత్, ఖలీల్ అతని స్నేహితుల్లా నటించారు. కానీ ఆ సీన్ క్రియేట్ చేయడంలో విఫలమైన స్టార్ క్రికెటర్లు కావాల్సినంత ఫన్ మాత్రం క్రియేట్ చేశారు. చహల్ అయితే తన తింగరి వేశాలతో కళ్లు తెరిచి సీన్‌ను చెడగొట్టడంతో ఖలీల్ ఈ లెగ్ స్పిన్నర్‌ను ఒక తన్ను తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియోను చహల్ 'వీ ఆర్ బ్యాక్' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: ఆ మిస్టరీ క్రికెటర్ ఎవరు? We are back 😂😂 @ImRo45 @imK_Ahmed13 pic.twitter.com/THo3qiD7Qt — Yuzvendra Chahal (@yuzi_chahal) February 25, 2020 -
వరుసగా ఏడు ఫోర్లు..ఇది అసలు బౌలింగేనా?
రాజ్‌కోట్: టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు గైర్హాజరీ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న ఖలీల్ అహ్మద్ దారుణంగా విఫలమవుతున్నాడు. తన కోటా ఓవర్లలో కొన్ని బంతులు తప్పితే పెద్దగా ఆకట్టుకున్న సందర్భం ఇప్పటివరకూ కనబడలేదు. ప్రధానంగా టీ20ల్లో వికెట్లను సాధించడంతో పాటు కట్టడితో బౌలింగ్ చేస్తేనే జట్టులో స్థానం సుస్థిరం అవుతుంది. మరి అటువంటిది ఖలీల్ వికెట్లను తీయడం మాట అటుంచితే, పరుగుల్ని కూడా భారీగా ఇస్తున్నాడు. అతని బౌలింగ్‌లో ఈజీగా ఫోర్లను కొడుతున్నారు ప్రత్యర్థి బంగ్లా ఆటగాళ్లు. బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ రెండు టీ20ల్లో రెండు వికెట్లు మాత్రమే తీసి 81 పరుగులిచ్చాడు. తొలి టీ20లో 37 పరుగులిచ్చిన అహ్మద్.. రెండో టీ20లో 44 పరుగులిచ్చాడు. కాగా, ఈ రెండు టీ20ల్లో వరుసగా ఏడు ఫోర్లు ఇవ్వడం ఇక్కడ గమనార్హం. ఢిల్లీ టీ20లో నాలుగు బౌండరీలు ఇచ్చిన అహ్మద్.. రాజ్‌కోట్ టీ20లో బౌలింగ్ అందుకున్న ఓవర్లోనే వరుసగా మూడు ఫోర్లు ఇచ్చాడు. ఇలా ఫోర్లు ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(ఇక్కడ చదవండి: రెండో టి20లో భారత్ జయభేరి) ‘తొలి టీ20లో పేలవ ప్రదర్శన చేసిన ఖలీల్‌ను రెండో టీ20లో కూడా కొనసాగించే ధైర్యం రోహిత్ శర్మ తప్పితే ఏ ఒక్కరూ చేయరేమో’ అని ఒకరు విమర్శించగా, ‘ ఖలీల్ నువ్వు ఒక్కసారి బౌలింగ్ చేసేముందు బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడో గుర్తు తెచ్చుకో’ అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘ ఖలీల్ అహ్మద్ డాట్ బాల్ వేస్తే చూడాలని ఉంది. అదే వికెట్ తీసినంతగా సంబర పడతాం. దీన్ని పేస్ బౌలింగ్ అందామా’ అని మరొకరు సెటైర్ వేశారు. -
కృనాల్, ఖలీల్‌పై ఆగ్రహం!
ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన తర్వాత కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్‌లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరి వల్లే మ్యాచ్‌ను కోల్పోయామంటూ సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు. బంగ్లాదేశ్ కీలక ఆటగాడు ముష్పికర్ రహీమ్ క్యాచ్‌ను కృనాల్ పాండ్యా వదిలేయగా, ఖలీల్ అహ్మద్ నియంత్రణ లేని బౌలింగ్ వేశాడు. దాంతో వీరిద్దరిపై విమర్శల వర్షం కురుస్తోంది.‘అసలు కృనాల్ పాండ్యాను భారత జట్టులో ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు’ అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ ఏ ఉపాధి పథకం కింద ఖలీల్‌కు చోటు కల్పించారు’ అని మరొకరు ఎద్దేవా చేశారు. (ఇక్కడ చదవండి:భారత్‌పై బంగ్లా విజయం) ‘ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత ఇక అండర్ గ్రౌండ్లో దాక్కోవాలేమో’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘ కృనాల్ నువ్వు అక్కడే ఉండు.. మేము వస్తున్నాం’ అని మరొక అభిమాని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై దాడి చేయడానికి వెళుతున్న ఫొటోనే షేర్ చేశాడు. ‘కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఖలీల్, కృణాల్ పాండ్యా లాంటి వారిలో పరిపక్వత లేదు. ఇలాంటి జట్టుతో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవలేదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, నవదీప్ శైనీని పక్కనపెట్టి జట్టులో చోటు కల్పించడానికి ఖలీల్ అహ్మద్ ఏం అద్భుతాలు చేశాడు. తను చేసిందల్లా ధారాళంగా పరుగులివ్వడమే’ అని మరో అభిమాని కామెంట్ చేశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు రహీమ్ క్యాచ్ వదిలేయడంతో అతను గెలుపుతో ఆ జట్టుకు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఖలిల్ అహ్మద్ వేసిన 19 ఓవర్లో వరుసగా నాలుగు బౌండరీలు కొట్టడం మ్యాచ్‌కే హైలెట్. ఫలితంగా మ్యాచ్‌ను బంగ్లాదేశ్ సులువుగా ఎగరుసుకుపోయింది. -
అక్షర్ అదరగొట్టినా.. తప్పని ఓటమి
అంటిగ్వా: ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(81నాటౌట్; 63 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్) ఒంటరి పోరాటంతో అదరగొట్టిన టీమిండియా-ఏకు ఓటమి తప్పలేదు. వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్లు తొలి ఓటమి నమోదు చేసింది. ఇప్పటికే మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నాలుగో వన్డేలో ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విండీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. కృనాల్ పాండ్యా(45) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో కీమో పాల్, పావెల్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(84; 100 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు), థామస్(70; 95 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు), కార్టర్(50; 43 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో టీమిండియా ముందు విండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లతో రాణించగా.. అవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఆదివారం జరగనుంది. -
మెరిసిన శ్రేయస్ అయ్యర్, ఖలీల్
అంటిగ్వా: బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (107 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ (3/16) మెరిపించడంతో... వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’ 48.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ ‘ఎ’ 22 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అయ్యర్, ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (63 బంతుల్లో 34; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. విండీస్ ‘ఎ’ బౌలర్లలో అకీమ్ జోర్డాన్ (4/43), రోస్టన్ ఛేజ్ (4/19) రాణించారు. అనంతరం విండీస్ ‘ఎ’ భారత బౌలర్ల ధాటికి 35.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో జొనాథన్ కార్టర్ (41 నాటౌట్), రావ్మన్ పావెల్ (40 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పియరీ (12) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, రాహుల్ చహర్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీశారు. -
ఖలీల్ వికెట్ తీసి 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్
-
ఖలీల్ ‘ఫోన్ కాల్’ సెలబ్రేషన్స్
హైదరాబాద్: క్రికెట్లో బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసిన తర్వాత బౌలర్లు వివిధ రకాల హావభావాలతో సంబరాలు చేసుకుంటారు. అలా సంబరాలు భిన్నంగా చేసుకునే వారిలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ మొదటి స్థానంలో ఉంటాడు. తాజాగా మరో ఆటగాడు చేసుకున్న సంబరాలు ఆశ్చర్యంతో పాటు ఆలోచనలో పడేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్ ‘ఫోన్ కాల్ సెలెబ్రేషన్స్’ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం రాత్రి విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు ధావన్, పృద్విషాలు మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. 8వ ఓవర్లో ధావన్‌ను దీపక్ హుడా పెవిలియన్‌కు పంపాడు. 11వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను.. చివరి బంతికి పృథ్వీ షాను ఖలీల్ ఔట్ చేశాడు. అప్పటికే అర్ధ సెంచరీ చేసి ఊపుమీదున్న షా పెవిలియన్ చేరడంతో ఖలీల్ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. చేతిలో నంబర్స్ నొక్కి.. హలో అంటూ మైదానంలో పరుగెత్తుతూ 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి సంబందించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ‘నా ఆట చూడమంటూ చీఫ్ సెలక్టర్‌కు ఫోన్ చేస్తున్నాడు’,,‘మ్యాచ్ గెలుస్తున్నాం అని ఎవరికో కాల్ చేశాడు’అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్బంగా కోహ్లిని ఔట్ చేసిన తర్వాత కూడా ఖలీల్ చిత్రమైన రీతిలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం ఖలీల్‌ను కోహ్లి ఆటపట్టిచ్చిన విషయం తెలిసిందే. -
కోహ్లిని మిస్సవుతున్నారా.. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్!
-
కోహ్లిని మిస్సవుతున్నారా.. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్!
ఆక్లాండ్: గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఖలీల్ అహ్మద్ ఇప్పటివరకూ భారత్ తరఫున 16 మ్యాచ్‌లు ఆడాడు. భారత్ పేస్ బౌలింగ్‌ను పరీక్షించే క్రమంలో అతనికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఒకవైపు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ ఖలీల్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతూ వరుస అవకాశాలు ఇస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్న ఈ యువ పేసర్.. మైక్ ముందు మాట్లాడేటప్పుడు మాత్రం తడబాటుకు గురువుతున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ విజయం సాధించిన తర్వాత జట్టు తరుఫున పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఖలీల్.. పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చే సమయంలో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లి గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఖలీల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అది చాలా సింపుల్ ప్రశ్న అయినప్పటికీ ఖలీల్ మాత్రం ఏమి చెబితే ఏమి అవుతుందో అనే సందిగ్ధంలో తటపటాయించాడు. ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ‘ మీరు(జట్టు సభ్యులు) విరాట్ కోహ్లిని మిస్సవుతున్నారా’ అని అడగ్గా ఖలీల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అందుకు సమాధానం పూర్తిగా ఇవ్వకుండానే ‘నెక్స్ క్వశ్చన్ ప్లీజ్’ అంటూ అడగడం ఖలీల్ తడబాటుకు అద్దం పడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
ధోనికి కోపమొచ్చింది
అడిలైడ్: టీమిండియా మిస్టర్ కూల్‌కు కోపమొచ్చింది. అవును టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని.. యువ ఆటగాడు ఖలీల్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి శతకంతో పాటు ధోని చిరస్మరణీయ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతున్న సమయంలో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో టీమిండియా 12వ ఆటగాడు ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడు యజువేంద్ర చహల్‌లు ధోని, దినేశ్ కార్తీక్‌లకు డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. అయితే ఖలీల్ పిచ్‌పై పరుగెత్తుకుంటూ రావడంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఎక్కడ నడుస్తున్నావ్? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా అంటూ ఖలీల్‌పై ధోని గుస్సా అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక దీనిపై ‘ఖలీల్ జాగ్రత్త.. మిస్టర్ కూల్‌కు కోపం తెప్పించకు’.. ‘ఏమైంది ఈ యువ ఆటగాళ్లకు.. మొన్న కుల్దీప్, నిన్న ఖలీల్.. ధోనికి కోపం తెప్పించినందుకు తప్పదు భారీ మూల్యం’అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
వారే నా అండా దండా!
జహీర్ ఖాన్ తర్వాత సరైన లెఫ్టార్మ్ పేసర్ లేక టీమిండియా ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. సెలక్టర్లు సైతం యువ లెఫ్టార్మ్ పేసర్లకు అవకాశమిచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేదు. ఈ క్రమంలో ఆసియా కప్ వంటి మెగా టోర్నీ కోసం దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్ యువ బౌలర్ ఖలీల్ అహ్మద్‌కు సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ బౌలర్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో భవిష్యత్‌పై ఆశలు రేపిన ఖలీల్‌కు అసలు సవాల్ ఆస్ట్రేలియాలో ఎదురుకానుంది. ఉపఖండపు పిచ్‌లపై రాణించిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. పేస్‌కు స్వర్గధామమైన ఆసీస్ పిచ్‌లపై రాణిస్తాడా లేక చేతులెత్తేస్తాడా వేచి చూడాలి. అయితే ఆసీస్ సిరీస్‌కు ఎంపిక కావడం, గత సిరీస్‌లలో తన ప్రదర్శణ , సీనియర్ల సూచనలు తదితర అంశాల గురించి ఖలీల్ ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ముగ్గురు ప్రోద్బలంతోనే.. తొలి సారి టీమిండియాకు ఎంపిక కావడంతో ఉద్వేగం, ఆనందం, భయం కలిగిందని, కానీ సీనియర్ల సలహాలు, వారి ప్రోత్సాహం మరువలేనిదని, ముఖ్యంగా ఎంఎస్ ధోని, సారథి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల సూచనలు తనకు ఎంతో మేలు చేశాయని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు. మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని వికెట్ వెనకాల ఉంటే ఏ బౌలర్‌కైనా సగం పని సులువవుతుందని ఖలీల్ తెలిపాడు. బ్యాట్స్‌మన్ కదలికలు వివరించడం, బౌలింగ్ విధానం బట్టి ఫీల్డర్లను అమర్చడంలో ధోనికి సాటిలేరని స్పష్టం చేశాడు. ఇక కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడని తెలిపాడు. అతనిచ్చిన స్వేచ్చతోనే.. ఇక తన తొలి మ్యాచ్ సారథి రోహిత్ శర్మను ఈ యువ పేసర్ ప్రశంసలతో ముంచెత్తాడు. బౌలింగ్ చేసేటప్పుడు స్వేచ్చనిచ్చేవాడని, ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఆసియాకప్‌ను రోహిత్‌ను అందుకున్న తర్వాత ఆ ట్రోఫిని తనకివ్వడంతో ఒక్క సారిగా ఉద్వేగానికి గురయ్యానని తెలిపాడు. ఇక ఆసియాకప్‌తో సహా, వెస్టిండీస్‌పై నెగ్గిన వన్డే, టీ20 సిరీస్ ట్రోఫీలను సారథులు ఖలీల్‌కు అందించిన విషయం తెలిసిందే. కోహ్లి ఫిట్నెస్ మంత్రం రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంలో ఫన్నీగా ఉంటాడని తెలియజేశాడు. కోహ్లి అనగానే తనకు గుర్తొచ్చేది కష్టపడటం, బాడీ ఫిట్‌గా ఉంచుకోవడమని తెలిపాడు. టీమిండియా పరుగుల యంత్రం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, అతడిలా ఫిట్నెస్ కాపాడుకుంటే భవిష్యత్‌లో గొప్ప బౌలర్ అవుతాననే నమ్మకం ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు. ఇక బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇచ్చిన అమూల్యమైన సూచనలు గత సిరీస్‌లలో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపాడు. ఆసీస్ సిరీస్ గురించి.. ఆస్ట్రేలియా సిరీస్ గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదని ఖలీల్ స్పష్టం చేశాడు. కానీ తన అసలైన సవాల్ ఆసీస్‌లోనే మొదలవుతుందన్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడమే తన ప్రధాన సూత్రమని, ఆసీస్‌లో అది కచ్చితంగా అమలు చేస్తానని వివరించాడు. అయితే ఉపఖండపు పిచ్‌లతో పోలిస్తే ఆస్ట్రేలియాలో కాస్త కఠినంగా ఉంటాయని, పక్కా ప్రణాళికలతో బౌలింగ్ చేస్తే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. -
‘ఖలీల్ అహ్మద్ ఒక భరోసా’
తిరువనంతపురం: టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌పై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో భారత్‌కు ఒక భరోసా నింపుతాడనే నమ్మకం తమకుందని కొనియాడాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో మూడు వికెట్లు సాధించడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసిన ఖలీల్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం కూడా అతనికి కలిసొస్తుందన్నాడు. 'ఖలీల్ భవిష్యత్‌లో మంచి ప్లేయర్‌గా మారతాడు. అతను చాలా చురుకు, నైపుణ్యం బాగున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. భారత్ పేస్ బౌలింగ్ విభాగానికి ఖలీల్ ఒక భరోసా అవుతాడనే నమ్మకం ఉంది’ అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు. -
ఖలీల్‌కు హెచ్చరిక
ముంబై: నాలుగో వన్డేలో బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసిన అనంతరం అతిగా సంబరాలు చేసుకున్న భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఐసీసీ హెచ్చరికకు గురయ్యాడు. నిబంధనల ప్రకారం లెవల్–1 తప్పిదానికి పాల్పడినట్లు గుర్తించిన ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్... ఖలీల్‌కు ఒక డీమెరిట్ పాయింట్ శిక్షగా విధించారు. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మార్లోన్ శామ్యూల్స్ స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో బౌలర్ చర్యలు తీవ్రంగా, బ్యాట్స్‌మన్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఐసీసీ అభిప్రాయపడింది. ఈ మ్యాచ్‌లో ఖలీల్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. -
భారత యువ పేసర్ ఖలీల్‌కు మందలింపు
ముంబై: వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో అతిగా ప్రవర్తించిన టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మందలించారు. మార్లోన్ శామ్యూల్స్ వికెట్ తీసిన తర్వాత ఖలీల్ దూకుడుగా ప్రవర్తించాడు. వికెట్ తీసిన ఆనందంలో శామ్యూల్స్పైకి దూసుకెళ్లాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు వ్యతిరేకం కావడంతో ఖలీల్‌ను మ్యాచ్ రిఫరీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అతనికి ఒక డిమెరిట్ పాయింట్‌ను విధించారు. ఐసీసీ లెవల్-1 నిబంధనల్లో భాగంగా ఆర్టికల్ 2.5 కోడ్‌ను ఖలీల్ ఉల్లఘించాడు. ఈ ఆర్టికల్ ప్రకారం ఒక ఆటగాడిని మరొక ఆటగాడు అసభ్యంగా దూషించడం కానీ చర్యల ద్వారా కవ్వించడం కానీ చేయకూడదు. దీన్ని ఖలీల్ అతిక్రమించడంతో అతను హెచ్చరికకు గురయ్యాడు. భారత్ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 14 ఓవర్ నాల్గోబంతికి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు స్లిప్ క్యాచ్ ఇచ్చి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఖలీల్ అతిగా ప్రవర్తించినట్లు ఫీల్డ్ అంపైర్లు ఇయాన్ గౌడ్, అనిల్ చౌదరిలు రిఫరీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఖలీల్‌కు ఒక డెమెరిట్ పాయింట్ విధించిన రిఫరీ.. హెచ్చరికతో సరిపెట్టాడు. తన తప్పిదాన్ని ఖలీల్ ఒప్పుకోవడంతో దీనిపై ఎటువంటి తదుపరి విచారణ అవసరం లేదని రిఫరీ బ్రాడ్ తెలిపారు. విండీస్‌తో నాల్గో వన్డేలో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన ఖలీల్ అహ్మద్ 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 224 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
నాలుగో వన్డే : విండీస్‌పై భారత్ భారీ విజయం