Kumuram Bheem District News
-
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్– 3
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గ్రూపు– 3 పరీక్షలు ప్ర శాంతంగా ముగిశాయి. మూడో పేపర్ సోమవారం ఉదయం 10 గంటలకు ఉండగా అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా ఎనిమిది మందిని నిమిషం నిబంధనతో వెనక్కి పంపించడంతో చాలా మంది అభ్యర్థులు ముందుగానే కేంద్రాల కు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 4,471 మంది అభ్యర్థులకు 2,757 మంది హాజరయ్యారు. కాగజ్‌నగర్ పట్టణంలోని 9 కేంద్రాల్లో 2,167 మందికి 1,176 హాజరు కాగా 991 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఆసిఫాబాద్ పట్టణంలోని 9 కేంద్రాల్లో 2,304 మందికి 1581 మంది హాజరు కాగా 723 మంది గైర్హాజ రయ్యారని పరీక్ష నిర్వహణ అధికారి లక్ష్మీనరసింహ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ, మోడ ల్ స్కూల్లోని కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. పర్యవేక్షకులు, అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్ర శాంతంగా నిర్వహించామని తెలిపారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఓఎంఆర్ షీట్లను బందోబస్తు మధ్య కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించామ ని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి స్ట్రాంగ్‌రూం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. రెండోరోజు 2,757 మంది హాజరు -
పెద్దపులి
జోడేఘాట్ అడవుల్లో కెరమెరి(ఆసిఫాబాద్): జోడేఘాట్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. ఈ నెల 15న జోడేఘా ట్ అడవుల్లోకి ప్రవేశించిన బెబ్బులి సుంగాపూ ర్ గ్రామానికి చెందిన కన్నీరాం ఆవును హతమార్చిందని ఎఫ్ఆర్వో జ్ఞానేశ్వర్ తెలిపారు. అప్పటి నుంచి అధికారులు అడవులను జల్లెడ పడుతున్నారు. నాలుగు రోజులుగా బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పెద్దపులి ఆచూకీని గుర్తించేందుకు వివిధ ప్రాంతాల్లో ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న జైనూర్ మండలం సుంగాపూర్, బూసిమెట్ట క్యాంపు, బూసిమెట్ట గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. డప్పు చాటింపు వేయించారు. రైతులు ఉదయం 11 గంటల తర్వాతే పొలాలకు వెళ్లాలని, గుంపులుగా తిరగాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా.. ఆగస్టు 10 నుంచి 20 వరకు కెరమెరి మండలం కరంజివాడ, బోరిలాల్‌గూడ, పరంధోళి, దేవాపూర్, కెలి(కె) అడవుల్లో పులి సంచరించింది. రెండు మేకలు, రెండు కుక్కలు, ఒక ఎద్దును హతమార్చింది. ప్రజలకు అవగాహన కల్పించండి..పెద్దపులి రక్షణ, పులి కనిపిస్తే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫారెస్టు సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్ రేంజ్ పరిధిలో రాసిమెట్ట బీట్ 502 కంపార్ట్మెంట్ను సోమవారం పరిశీలించారు. కొద్దిదూరంలోనే పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. సిబ్బంది అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని అంచనా వేస్తూ, సమీపంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్ఆర్వో జ్ఞానేశ్వర్, బీట్ అధికారి రవీందర్ తదితరులు ఉన్నారు. పాదముద్రలు గుర్తించిన అధికారులు ఆచూకీ కోసం ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు -
వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి
ఆసిఫాబాద్: ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతీ కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి గా నిర్మించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరల్డ్ టాయిలెట్ డే పోస్టర్ ను సోమవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజలందరూ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీఎం జిల్లా సమన్వయ కర్త నజర్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్
● పరీక్షల బహిష్కరణ కూడా.. ● కేయూ వీసీకి నోటీసు అందజేత మంచిర్యాలఅర్బన్/కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. ఈ మేరకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు సోమవారం యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. 90శాతం కళాశాలలు నాలుగు, ఐదు నెలల నుంచి అధ్యాపకులు, ఇతర సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. గత నెలలో 14నుంచి కూడా కళాశాలలు బంద్ చేయగా అదే నెల 17న విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వారం రోజుల్లోపే విడుదలకు హామీనివ్వడంతో బంద్ విరమించామని, కానీ నేటికీ చెల్లించలేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే వరకూ కళాశాలలు తెరవబోమని స్పష్టం చేశారు. కేయూ పరిధిలో ఈ నెల 26 నుంచి జరిగే డిగ్రీ కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా బహిష్కరించనున్నామని స్పష్టం చేశారు. వీసీకి నోటీసు అందజేసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రవీంద్రనాథ్, బాధ్యులు జి.వేణుమాధవ్, గోలి వెంకట్, ఎం.శ్రీనివాస్, కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. -
కోతకు వచ్చాకే వరిపంట కోయించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆసిఫాబాద్: కోత దశకు వచ్చిన తర్వాతే హర్వెస్టర్ యంత్రాలతో వరిపంట కోయించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాల శాఖల అధికారులు, హర్వెస్టర్ వాహనాల యజమానులతో వానాకాలం వరికోతలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరిపొలం పూర్తి కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు వినియోగించాలన్నారు. దీని ద్వారా తేమ శాతం, తాలు, గడ్డి లేకుండా నాణ్యమైన పంట వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతునేస్తం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి వెళ్లి సూచనలివ్వాలన్నారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, సంబంధిత అధికారులు సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించామని తెలపారు. సమావేశంలో సహకార శాఖ అధికారులు బిక్కు, రబ్బానీ, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ద్వారా ఫిర్యాదుల పరిష్కారం
ఆసిఫాబాద్‌అర్బన్: సివిల్ ఫిర్యాదులకు కోర్టు ద్వా రానే పరిష్కారం లభిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఆరు ఫిర్యాదులు రాగా.. చట్టప్రకారం వా టిని పరిష్కరించాలని సీఐ, ఎస్సైలను ఆదేశించా రు. ఎస్పీ మాట్లాడుతూ భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు పెరుగుతు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100 లేదా 1930 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
పింఛన్లు పెంచాలని నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: దివ్యాంగుల పింఛన్ రూ. 4,016 నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువులు, ఇతర చేయూత పెన్షన్లు రూ.2,016 నుంచి రూ.4వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇస్లాం బిన్ హసన్, జిల్లా అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం– 2016 రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఉంచుతూ జీవో నం.34 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 5శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేయూత పెన్షన్‌దారుల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వికలాంగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రాజయ్య, గోపాల్, అన్నాజీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యూస్‌రీల్
పలువురు ఎస్సైల బదిలీ ఆసిఫాబాద్: జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ హైదరాబాద్ మల్టీజోన్– 1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. లింగాపూర్ ఎస్సై కె.ప్రవీణ్‌ను బెజ్జూ ర్కు బదిలీ చేయగా.. బెజ్జూర్ ఎస్సై బి.విక్రమ్‌ను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వీఆర్ కు, జిల్లా కేంద్రంలోని డీసీఆర్బీలో విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్ గంగన్నను లింగాపూర్ కు, కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై డి.మహేందర్ ను ఈజ్గాంకు, ఈజ్గాం ఎస్సై బి.రామన్కుమార్ను కుమురంభీం జిల్లా వీఆర్‌కు, జిల్లా కేంద్రంలోని సీసీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న కె.సందీప్‌కుమార్‌ను ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్సై– 2గా బదిలీ చేశారు. వివరాలు స్పష్టంగా నమోదు చేయాలికౌటాల(సిర్పూర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ అన్నారు. కౌటాల మండల కేంద్రంలో సర్వేను సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. గడువులోగా సర్వే పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ తదితరులు ఉన్నారు. -
కొందరికే పరిహారం!
● జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో పంటనష్టం ● ప్రభుత్వ నిబంధనతో చాలామందికి అందని పరిహారం ● పలు మండలాల్లో ఆందోళనలు చేపట్టిన రైతులు దహెగాం(సిర్పూర్): గడిచిన మూడేళ్లుగా జిల్లా రైతులను వరదలు వెంటాడుతున్నాయి. నది పరీ వాహక ప్రాంతాల్లోని పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలతో పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగ, వార్దా నదులు ఉప్పొంగి పంటలు నీట మునిగాయి. ఐదు రోజులపాటు పంట లు వరద నీటిలోనే ఉండడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలతో నష్టపోయిన రైతులకు రాష్ట్రప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం మంజూరు చేసింది. 33 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా చాలామంది రైతులకు పరిహారం అందలేదు. నెలరోజులుగా వివిధ మండలాల్లోని బాధితులు ఆందోళనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించారు. రూ.2.69 కోట్లు విడుదలజిల్లావ్యాప్తంగా 4.23 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, మిరప తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి 3.29 లక్షల ఎకరాలు ఉండగా.. వరి సుమారు 55 వేల ఎకరాల్లో ఉంది. ఆగస్టు చివరి వారం, సెప్టెంబరు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు నది పరీవాహక ప్రాంతాలతోపాటు చెరువులు, వాగుల సమీపంలోని పంట లు బ్యాక్ వాటర్‌తో రోజుల తరబడి నీటిలో ముని గిపోయాయి. జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం 2,692.11 ఎకరాలకు(1,374 మంది రైతులు) మా త్రమే రూ.2,69,22,750 పరిహారం మంజూరు చేసింది. పంటలు నష్టపోయిన వారి వివరాలను వ్యవసాయ శాఖ సర్వే చేసి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం గత నెలలో నిధులు విడుదల చేయగా.. రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా 33 శాతం నష్టపోయిన పంటలను పరిగణనలోకి తీసుకోవడంతో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మునిగింది మొట్లగూడ శివారులో మూడెకరాల్లో పత్తి పంట వేశా. సెప్టెంబరు మొదటి వారం భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి మూడెకరాల పంట మొత్తం పూర్తిగా మునిగిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు పరిహారం కోసం సర్వే చేసినా ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. వేల రూపాయల పెట్టుబడి వరద పాలైంది. పరిహారం అందించి ఆదుకోవాలి. – ఒడిల వెంకటి, రైతు, మొట్లగూడ పదెకరాల్లో నష్టం వానాకాలంలో రావులపల్లి శివారులో 11 ఎకరాల్లో పత్తి పంట వేసిన. ప్రాణహిత నది వరదలకు పది ఎకరాల పత్తి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. సార్లు వచ్చి సర్వే చేసినా నయాపైసా కూడా పరిహారం రాలేదు. కొందరికి వచ్చినయి.. కొందరికి రాలేదు. ఇప్పటికీ పరిహారం కోసం సార్లను అడుగుతున్నా సమాధానం చెప్తలేరు. – మామిడిపల్లి రాజన్న, రైతు అన్నదాతల ఆందోళనలు..ప్రాణహిత, పెద్దవాగు ఉప్పొంగడంతో సిర్పూర్(టి) నియోజకవర్గంలో సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో అధికంగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రాణహిత వరద తగ్గకపోవడంతో ఐదు రోజులపాటు నీట మునిగి ఉన్నాయి. పత్తి నీట మునగగా మరోసారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. చేలలో నిల్వచేసిన ఎరువుల బస్తాలు సైతం వరదకు కొట్టుకుపోయాయి. బెజ్జూర్ మండలంలో చాలా మందికి పరిహారం రాలేదని గత నెలలో రైతులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. దహెగాం మండలం మొట్లగూడ, రావులపల్లి, రాంపూర్ గ్రామాల్లో ప్రాణహిత నది వరదలో నష్టపోయిన రైతులు కూడా కాగజ్‌నగర్ ఏడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతులు ఆందోళనలు చేసిన సమయంలో ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెబుతూ వ్యవసాయాధికారులు చేతులు దులుపుకొన్నారు. సర్వేను పకడ్బందీగా చేపట్టకపోవడంతో పూర్తిస్థాయిలో పరిహారం మంజూరు కాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. -
మారని తీరు!
● పలు ప్రభుత్వ శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు ● ధనార్జనే ధ్యేయంగా లంచాలు డిమాండ్..! ● ఇటీవల జైనూర్‌లో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి ● ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 9 కేసులు నమోదువాంకిడి/తిర్యాణి: నిబంధనలకు తూట్లు పొడుస్తూ ధనార్జనే లక్ష్యంగా కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్న తీరు ప్రభుత్వ శాఖలకు చెరగని మచ్చగా మారుతోంది. ప్రతీ పనికి పైసాతో ముడి పెడుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా సేవలందించాల్సిన వారు అడ్డదారులు తొక్కుతున్నారు. పైకం లేనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తోంది. ఓ వైపు ఏసీబీ అవినీతి అధికారులౖపై కొరడా ఝులిపిస్తున్నా మార్పు రావడం లేదు. నేరుగా కాకుండా ఏజెంట్లు, కిందిస్థాయి ఉద్యోగుల ద్వారా చాటుమాటున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రెడ్ హ్యాండెడ్ కేసులు నమోదయ్యాయి. ధనార్జనకు అలవాటు పడిన కొందరు అధికారులు ఏసీబీ వలలో చిక్కకుండా ఆస్తులు పోగేసుకుంటున్నారు. ఆరోపణలు అనేకం..ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏసీబీ అధికారులు చేపడుతున్న దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అద్దం పడుతున్నాయి. కొందరు అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ.. వారి అండతోనే రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుకు తరలిస్తున్నా.. దాడుల కు భయపడని అవినీతి అధికారులు జిల్లాలో రాజ్యమేలుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగం, వ్యవసాయ రంగం, అటవీ శాఖ, పోలీసు శాఖ, అక్రమ పట్టాలు, ఇసుక దందా, రుణాల మంజురు.. ఇలా పలు శాఖలపై ఆరో పణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ శాఖలో పర్సంటేజీ ల తీరుతో దందా సాగుతోంది. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రహదారులు, భవనాల నిర్మాణాలు, తదితర పనుల్లో 10 నుంచి 20 శాతం వరకు కమిష న్లు మాట్లాడుకుంటున్నారు. ఆపై సదరు కాంట్రాక్ట ర్ తనకు నచ్చిన రీతిలో నిర్మాణాలు చేపట్టినా అధి కారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. అధి కార పార్టీ నాయకులకు సైతం కొంత పర్సంటేజీ ముట్టజెప్పుతున్నారు. పోలీసు శాఖలో భూపంచాయతీలు, అక్రమ రవాణా, ఫిర్యాదులు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఒకరిద్దరు కానిస్టేబుల్లే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. రవాణా శాఖలో అవినీతి ఏజెంట్ల చేతుల్లోనే అధికంగా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనం ఫిట్నెస్, తదితరల పనులు.. ఇలా ఏది కావాలన్నా ఏజెంట్ల ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి. ఇవే కాకుండా రెవెన్యూ, రిజిస్ట్రార్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు, సహకార సంఘాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది.జిల్లాలో జరిగిన ఘటనలు ఫర్టిలైజర్ దుకాణం రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసిన దహెగాం ఏవో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఐనంకు చెందిన మారుతి లైసెన్స్ రెన్యువల్ కోసం ఏవో వంశీకృష్ణ వద్దకు వెళ్లాడు. ఎరువుల లైసెన్స్ కోసం రూ.20 వేలు, విత్తనాల లైసెన్స్ కోసం రూ.18 వేలు డిమాండ్ చేయడంతో మారుతి ఏసీబీని ఆశ్రయించాడు. మే 27న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దహెగాం సహకార సంఘంలో జరిగిన అవినీతికి సీఈవో బక్కయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. 2021– 22లో సొసైటీ పరిధిలో రుణాల తారుమారు, ఎరువుల విక్రయాల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో రూ.61.50 లక్షల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. సీఈవో బక్కయ్యను సస్పెండ్ చేస్తూ డీసీవో రాథోడ్ బిక్కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 2న జైనూర్ మండల కేంద్రంలో తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సీసీరోడ్డు పనులు చేసిన ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.12 వేలు డిమాండ్ చేయగా.. అతడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏప్రిల్‌లో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25000 తీసుకుంటూ పట్టుబడ్డారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారి పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాల్లో ఏడుగురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆర్డీవో సిడాం దత్తుతో సహ డీటీ నాగోరావు, ఎంసీ భరత్, రియల్ఎస్టేట్ వ్యాపారులు శంభుదాస్, లక్ష్మీనారాయణ గౌడ్, డ్రైవర్ తిరుపతి, కవల్కర్ తారాబాయిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్‌లో చింతలమానెపల్లి ఎస్సై వెంకటేశ్ రూ.20000 నగదు తీసుకుంటూ పట్టుబడ్డారు. -
సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలి
కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలో చేపట్టిన సామాజి క, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అదనపు క లెక్టర్ దీపక్ తివారి అన్నారు. పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ఆదివారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు తమకు కేటా యించిన బ్లాక్ల్లోని ప్రతీ ఇంటిని సందర్శించా లన్నారు. కుటుంబ సభ్యుల వివరాలను నిర్ణీత నమూనాలో పొందుపర్చాలని ఆదేశించారు.నేటి ప్రజావాణి రద్దుఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్ర మం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్– 3 పరీక్షలు, స మగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం రద్దు చేశామని పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయం గమనించాలని సూచించారు.విద్యుత్ ఇంజినీర్ల కార్యవర్గంమంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్పీడీసీఎల్ విద్యుత్ ఇంజినీర్ల మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కా ర్యవర్గాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆది వారం ఎన్నుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి బానోత్ రాజన్న ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బ్రాంచ్ కార్యదర్శిగా జె.విలాస్, సహాయ కార్యదర్శిగా టి.తిరుపతి, కోశాధికారిగా రాంచదర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా శరత్‌కుమార్, ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శిగా ఎండీ.ఇమ్రాన్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గసభ్యులు ఇంజినీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సభ్యులకు బి.రాజన్న, అసిస్టెంట్ ఇంజినీర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి కృష్ణ, సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.నేడు విద్యాసంస్థలకు సెలవుఆసిఫాబాద్అర్బన్: గ్రూపు– 3 పరీక్షలు నిర్వహించే విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్ర కటించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 3 కొనసాగనున్న నేపథ్యంలో సెలవు ప్రకటించామన్నారు. -
సమస్యలతో సహవాసం
రెండు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్న ఈ గ్రామాల్లోని ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను ఇరురాష్ట్రాల నుంచి ఎన్నుకుంటారు. ప్రభుత్వాలు కూడా ఇక్కడి ప్రజలకు ఇరు రాష్ట్రాల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రేషన్కాార్డులు మంజూరు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంలో భాగంగా తాగునీటి సదుపాయం కల్పించగా.. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లకు వరకు వెచ్చించి బీటీ రోడ్లు వేయించింది. 40 ఏళ్లుగా పోరాడుతున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే సాగు భూములకు పట్టాలు లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. దాదాపు 80శాతం మందికి పట్టాలు లేవు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అటవీ, రెవెన్యూ శాఖలతో ఉమ్మడి సర్వే నిర్వహించింది. నెలలు గడుస్తున్నా పురోగతి లేదు. గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయనే దానిపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కొనసాగుతున్న వివాదంపై 1989 వామన్‌రావు చటప్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన సేత్కారి సంఘటన్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. నెట్వర్క్ సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు టవర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఉమ్రి నుంచి జంగుబాయి అమ్మవారి క్షేత్రం వరకు రోడ్డు వేయాలని, పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని కేజీబీవీలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. నైట్ వాచ్ఉమెన్, డే వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని, 18 – 45 ఏళ్ల వయస్సు ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్వీపర్, అసిస్టెంట్ కుక్ పోస్టుకు ఏడో తరగతి, డే/నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 23 సాయంత్రం 4 గంటలలోగా డీఆర్సీ భవనంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. -
ప్రశాంతంగా గ్రూప్– 3 పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలో గ్రూపు– 3 మొదటిరెండు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. మొదటి పేపర్ ఉదయం 10 గంటలకు ఉండగా.. 8.30 నుంచి బయోమెట్రిక్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ఆసిఫాబాద్ పట్టణంలో 9, కాగజ్‌నగర్ పట్టణంలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్– 1కు 4,471 మంది అభ్యర్థులకు 2,794 మంది హాజరు కాగా.. 1677 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగిన పేపర్ –2కు 2,779 మంది హాజరు కాగా 1,692 మంది గైర్హాజరయ్యారు. 62 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం పేపర్– 3 నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలు పరిశీలన జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ, పీటీజీ గురుకుల పాఠశాల, కాగజ్‌నగర్‌లోని సెయింట్ మేరీ పాఠశాల, వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓఎంఆర్ షీట్లను బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూంకు తరలిస్తామని తెలిపారు. సోమవారం నిర్వహించే మూడో పేపర్ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అధికారులు ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్‌తోపాటు పలు కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూంకు ఓఎంఆర్ షీట్ల తరలింపుపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో గ్రూపు– 3 పరీక్షలు రాసేందుకు వచ్చే అభ్యర్థులకు కాగజ్‌నగర్ బస్టాండ్ నుంచి కేంద్రాల వరకు ఉచిత వాహన సౌకర్యం కల్పించారు. నిమిషం నిబంధనతో వెనక్కి.. గ్రూపు– 3 పరీక్షకు ప్రభుత్వం నిమిషం నిబంధన ను అమలు చేయడంతో జిల్లాలో ఎనిమిది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆ సిఫాబాద్ పట్టణంలోని పీటీజీ గురుకుల పాఠశాలలోని కేంద్రానికి ఇద్దరు, సెయింట్ మేరీ పాఠశాలకు ఇద్దరు, కాగజ్‌నగర్‌లోని వసుంధర కళాశాలకు ఒక రు, జవహర్ నవోదయ విద్యాలయంలోని కేంద్రానికి ముగ్గురు ఆలస్యంగా వచ్చారు. అభ్యర్థులు అధి కారులను బతిమాలినా లోపలికి పంపించలేదు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో కేంద్రాల ఏర్పాటు పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరం -
● మహారాష్ట్రలో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికలు ● నేటితో ప్రచారానికి తెర ● ‘రాజూరా’లో ఓటు వేయనున్న సరిహద్దు గ్రామాల ప్రజలు ● నాలుగు పోలింగ్ కేంద్రాల్లో 3,597 మంది ఓటర్లు ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
కెరమెరి(ఆసిఫాబాద్): మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నా యి. సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గ ఎన్నికల్లో కెరమెరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు వినియోగించుకోగా.. ఆదిలా బాద్ పార్లమెంట్ స్థానంతోపాటు మహారాష్ట్రలో ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ ఓటు వేశారు. ఇప్పుడు నాలుగోసారి ఓటు వేయనున్నారు. 15 గ్రామాల్లో ఓటర్లు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం 15 గ్రామాల్లోని ప్రజలకు రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు ఉంది. చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ స్థానా నికి ఈ నెల 20న పోలింగ్ నిర్వహిస్తుండగా.. 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వారి లో సుభాష్ బావు ధోటే(కాంగ్రెస్), దేవ్‌రావు భోంగ్డె(బీజేపీ), వామన్‌రావు చటప్(సేత్కారి సంఘటన్), గజానంద్ గోద్రు జుగ్నాకే(గోండ్వానా గణ తంత్ర పార్టీ) మధ్య బలమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. పరంధోళి, నోకేవాడ, బోలాపటార్, అంతాపూర్ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో సుమారు 3,597 మంది ఓటర్లు ఉన్నా రు. పరంధోళి పోలింగ్ కేంద్రం పరిధిలో పరంధోళి, తాండ, కోటా, శంకర్‌లొద్ది, లేండిజాల, ముకదంగూడ గ్రామాలు, నోకేవాడ పరిధిలో మహరాజ్గూ డ, భోలాపటార్ పరిధిలో భోలాపటార్, గౌరి, లేండిగూడ, అంతాపూర్ పోలింగ్ కేంద్రం పరిధిలో నా రాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్, అంతాపూర్ గ్రామాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రం జనాభా ఓటర్లు పరంధోళి 2,470 1,367నోకేవాడ 700 370భోలాపటార్ 1,102 882అంతాపూర్ 1,902 978మొత్తం 6,174 3,597 -
ఏజెన్సీపై చలి పంజా
తిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లాలోని ఏజెన్సీ మండలాలపై చలి పంజా విసురుతోంది. రెండు రోజు లుగా మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. చుట్టూ దట్టమైన అడవులు ఉండటంతో గిరిజన గూడేల్లో ప్రజలు వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం మంచు ప్రభా వంతో బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినా చలితీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మళ్లీ సాయంత్రం నాలుగు, ఐదు గంటల నుంచే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచే ఇళ్లకు తలుపులు వేసుకుంటున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. స్వెటర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఏజెన్సీ మండలాలు చలికి వణుకుతున్నాయి. రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా ఏజెన్సీ మండలమైన తిర్యాణిలో 12.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీటితో పాటు సిర్పూర్(యూ)లో 12.3, వాంకిడిలో 13.1, కెరమెరిలో 13.3, ఆసిఫాబాద్‌లో 13.4, కాగజ్‌నగర్‌లో 13.9, రెబ్బెన, జైనూర్‌లో 14.3 కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ నెల 16న సిర్పూర్(యూ)లో 12.7, తిర్యాణిలో 14.4, వాంకిడిలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు తిర్యాణిలో 12.1 డిగ్రీలుగా నమోదు ఇబ్బందులు పడుతున్న గిరిజనులు -
బాక్సింగ్‌లో గిరిజన విద్యార్థి ప్రతిభ
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని అనార్పల్లి గ్రామానికి చెందిన బాదావత్ శ్రీకర్‌నాయక్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటాడు. బాదావత్ ప్రకాశ్, క్రిష్ణవేణి దంపతుల కుమారుడు శ్రీకర్‌నాయక్ ప్రస్తుతం కాగజ్‌నగర్‌లోని ఏకలవ్య మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పీఈటీ వనిత బాక్సింగ్‌లో శిక్షణ అందిస్తోంది. ఈ నెల 2 నుంచి 10 వరకు నిజామాబాద్ జిల్లాలోని గాంధారి ఏకలవ్య పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు కాగజ్‌నగర్ ఏకలవ్య పాఠశాల నుంచి 15 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన శ్రీకర్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఛతీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ నెలలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనునన్నాడు. -
పులి సంచారంతో గ్రామస్తుల ఆందోళన
ఉట్నూర్, నార్నూర్ ప్రాంతంలో పులి సంచారంతో మండలంలోని జామ్డా, తాడిహత్నూర్, గుంజాల, నాగల్కొండ, పట్నాపూర్, మహగావ్, చోర్గావ్ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎఫ్ఎస్వో సుదర్శన్ జాదవ్ తెలిపిన వివరాలు.. ఆదివారం ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ వద్ద వాకింగ్ చేస్తున్న కొందరు యువకులకు పులి కనిపించడంతో వారు భయంతో పురుగులు తీశారు. హస్నాపూర్, శంకర్‌నాయక్ తండా మీదుగా మధ్యాహ్నం నార్నూర్ మండలం జామ్డా శివారులో పశువులు మేత మేస్తుండగా పులి ఆవుపై దాడి చేసింది. కాపరి కేకలతో అక్కడి నుంచి వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. నార్నూర్ మండలం జామ్డా, తాడిహత్నూర్, నాగల్కొండ, చోర్గావ్, బాబేఝరి, సుంగాపూర్, మహగావ్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండురోజులపాటు ప్రజలు పత్తి ఏరేందుకు గాని ఇతర వ్యవసాయ పనులకు వెళ్లొద్దని సూచించారు. సోలార్ జట్కా మిషన్, కరెంట్ తీగలను ఎవరూ పెట్టవద్దన్నారు. జామ్డా నుంచి కుమురం భీం జిల్లా జైనూర్ మండలం మీదుగా కెరమెరి మండలం జోడేఘాట్ అటవీ ప్రాంతానికి పులి వెళ్లిపోతుందన్నారు. -
గ్రంథాలయంలో కవి సమ్మేళనం
ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నాలుగోరోజు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పరీక్షల విభాగం సహా య కమిషనర్ ఉదయ్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవులు తమ కవితలు చదివి వినిపించారు. గ్రంథాలయ సిబ్బంది కవులను ఘనంగా సత్కరించారు. కవులు మాడుగుల నారాయణమూర్తి, ధర్మపురి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణచారి, సత్యనారాయణ, శ్రీనివాస్, ఇసాక్, శ్రీదేవి, రేవతి, సవిత, పెంటయ్య, శ్రీలత, సాకేత్, వివేక్, రాజయ్య, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు చేతులు లేకపోయినా...
● గ్రూపు–3 పరీక్షలకు హాజరైన జాకీర్పాషాకాగజ్నగర్రూరల్: అంగవైకల్యం చదువుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని చారిగాం ఏరియాకు చెందిన జాకీర్‌పాషా. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినప్పటికీ పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాలనే తపనతో నిరంతరం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఆదివారం నిర్వహించిన గ్రూపు–3 పరీక్షకు ఉత్సాహంగా హాజరై పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని పరీక్షా కేంద్రంలో కాలితో పరీక్ష రాశాడు. గతంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కూడా తన బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నాడు. అంతేకాకుండా హరితహారం కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని కాలితో మొక్కలు నాటడం, రాయడం, పెయింటింగ్ వేయడంలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. -
వీడని భయం.. చదువుకు దూరం
● వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పెరగని హాజరు ● ప్రస్తుతం ఉన్నది 136 మంది మాత్రమే.. ● ప్రత్యేక తరగతులకూ హాజరుకాని ‘పది’ విద్యార్థినులు ● రెగ్యులర్ హెచ్ఎం, వార్డెన్ లేక ఇబ్బందులువాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలో ని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురై 18 రో జులు గడిచినా పాఠశాల గాడిన పడటం లేదు. కలెక్టర్ ప్రత్యేక కమిటీని నియమించి విచారణ అనంతరం హెచ్ఎం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. మరో నలుగురు నాన్ టీచించ్ సిబ్బందిపైనా బదిలీ వేటు వేశారు. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే విద్యార్థులు అనారోగ్యం బారిన పడటం, కొందరు తీవ్ర అస్వస్థతతో నిమ్స్‌లో చికిత్స పొందడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అప్పటి నుంచి ఒక్కొక్కరుగా వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ఘటన తర్వాత 571 మందికి 95 మంది బా లికలు మాత్రమే మిగిలారు. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిన పిల్లలను తిరిగి పాఠశాలకు పంపేందుకు తల్లి దండ్రులు భయపడుతున్నారు. ప్రస్తుతం 136 మంది విద్యార్థినులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. నో హెచ్ఎం, నో వార్డెన్.. వసతిగృహం నిర్వహణలో హెచ్ఎం, వార్డెన్ పాత్ర కీలకం. హెచ్‌ఎంతోపాటు వార్డెన్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన అనంతరం.. ఆ పోస్టుల్లో ఎవ్వరినీ నియమించలేదు. విద్యార్థినుల అస్వస్థతకు గురైన పదిరోజుల తర్వాత అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. రెండు రోజులపాటు జరిగిన విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత హెచ్ఎంను కానీ వార్డెన్‌ను కానీ నియమించలేదు. సీనియర్ ఉపాధ్యాయుడికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించగా.. సదరు ఉపాధ్యాయుడు నిరాకరించినట్లు తెలుస్తోంది. అలాగే వార్డె న్ ఇన్చార్జి బాధ్యతలు కూడా మరో టీచర్‌కు అప్పగించగా ఆ టీచర్ కూడా నిరాకరించినట్లు సమాచా రం. ప్రస్తుతం ఎప్పటికప్పుడు కూరగాయలు తీసుకొచ్చి విద్యార్థినులకు వంట చేస్తున్నారు. జీసీసీ నుంచి సరుకులు రవాణా నిలిచిపోయింది. ఉన్న సరుకులను స్టోర్ రూంలోనే తాళం వేసి ఉంచారు. తిరిగిరాని విద్యార్థినులు వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 571 అడ్మిషన్లు పొందిన విద్యార్థినుల్లో నిత్యం సుమారుగా 540 మంది వరకు వసతిగృహంలో ఉండేవారు. ప్రస్తుతం పాఠశాలలో 136 మంది మాత్రమే ఉన్నా రు. 60 మందికి పైగా ఆస్పత్రుల పాలు కాగా.. ఆ రోగ్యం విషమించిన జ్యోతి, మహాలక్ష్మి, శైలజను హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స అందించారు. ఇద్దరు కోలుకుని ఇంటికి రాగా మరో విద్యార్థిని శైలజ పరిస్థితి ఇప్పటికీ కుదుటపడలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు. అధికారులు సైతం వెంటనే చర్యలు తీసుకోకపోవడం, రెగ్యులర్ హెచ్ఎం, వార్డెన్‌ను నియమించకపోవడం తదితర కారణాలతో కూడా బాలికలు తిరిగి రావడం లేదని తెలుస్తోంది. ‘పది’ తరగతులపై సందిగ్ధం.. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మూడు వారాలు గడిచినా తిరిగి పాఠశాలకు రాకపోవడంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థినులు సైతం చాలా మంది ఇంటి వద్దే ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలో పదో తరగతిలో 56 మంది చదువుకుంటున్నారు. వారిలో ప్రస్తుతం 38 మంది మాత్రమే పాఠశాలలో ఉన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించాల నే లక్ష్యంతో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. 18 మంది ఇళ్లలోనే ఉండటంతో ప్రత్యేక తరగతులు, రోజువారీగా నిర్వహించే పరీక్షలకు హాజరుకావడం లేదు. సీనియర్ టీచర్లకు బాధ్యతలువాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన అనంతరం హెచ్ఎం, వార్డెన్ బాధ్యతను అక్కడే పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు అప్పగించాం. అస్వస్థతకు గురైన విద్యార్థినులు అందరూ కోలుకున్నారు. నిమ్స్‌లో చికి త్స పొందుతున్న శైలజ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాలి కలు తిరిగి పాఠశాలకు వచ్చేలా ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుతున్నాం. ఎస్సీఆర్పీలు ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. – రమాదేవి, డీటీడీవో -
జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జీవితంపై విరక్తితో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వినిత తెలిపారు. ఆమె కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్కు చెందిన అనుదీప్(30) ప్రైవేటు డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారంలో గొడవలు జరుగగా, రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో స్వల్పగాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎవరూ పెళ్లి చేసుకోరని మద్యానికి బానిసై ఏమి పనిచేయకుండా తిరుగుతుండేవాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో ఉరేసుకున్నాడు. తల్లి ఉమ తెల్లారి చూసేసరికి చీరతో దూలానికి అనుదీప్ ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. తల్లి ఉమ ఫిర్యాదుతో ఆదివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పురుగుల మందు తాగి వ్యక్తి.. తాంసి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై ముంతాజ్ తెలిపారు. ఏఎస్సై కథనం ప్రకారం.. భీంపూర్ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన కుడ్మేత రాంచందర్ (35) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం వరుసకు సోదరుడైన వ్యక్తి ఇంటికి అతని లేని సమయంలో వెళ్లాడు. దీంతో వరుసకు సోదరుడు మందలించడంతో రాంచందర్ అవమానంగా భావించాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాత్రి వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం మధ్యాహ్నం గుబిడిపల్లి శివారులో పురుగులమందు తాగి విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై ముంతాజ్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
గిరిజనుడిని చితకబాదిన అధికారులు
వేమనపల్లి: గిరిజనుడిని అటవీ అధికారులు చితకబాదిన ఘటన మండలంలోని సుంపుటం అటవీ ప్రాంతంలోని రామలక్ష్మణుల గుట్ట వద్ద చోటుచేసుకుంది. బాధితుడు, కళ్లెంపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు కుస్రం రవీందర్ తెలిపిన వివరాలు.. ఈనెల 15న తన బావ ఆత్రం బక్కయ్యతో కలిసి రామలక్ష్మణుల గుట్ట వద్దకు చీపురు సేకరణ కోసం వెళ్లాను. అక్కడే ఉన్న తిరుమాను చెట్లకు లక్క ఉండటంతో చెట్టును నరికి సేకరించారు. సమాచారం అందుకున్న ఎఫ్ఎస్ఓ బేగ్, వేమనపల్లి ఎఫ్‌బీవో సోఫియాబేగం భర్త పాషా అక్కడికి వెళ్లారు. అధి కారులను చూసి బక్కయ్య పరుగెత్తగా రవీందర్‌ను అదుపులోకి తీసుకుని కొట్టారు. బైక్‌పై కుశ్నపల్లి అటవీ కార్యాలయానికి తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు తెలిపాడు. ఆదివారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశంలతో కలిసి నీల్వాయి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామలక్ష్మణుల గుట్ట వద్ద ఘటన పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదుఎలాంటి దాడి చేయలేదు కళ్లంపల్లి గ్రామస్తులు గతేడాదిగా లక్క సేకరణ కోసం చెట్లను నరుకుతున్నారు. 15న అటవీ ప్రాంతానికి వెళ్లిన తమను చూసి అందరూ పరారయ్యారు. రవీందర్ పరుగెత్తగా కిందపడగా గాయాలయ్యాయి. అతడిపై దాడికి చేయలేదు. కేసు పెడతారనే నెపంతో దాడి చేసినట్లు వారు ఆరోపణ చేస్తున్నారు. కాగా, వేమనపల్లిలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి కళ్లంపల్లి గ్రామస్తులు దాడికి యత్నించారని ఎఫ్బీఓ సోఫియాబేగం డీఆర్వో రూపేష్, భర్త పాషాతో కలిసి నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. – బేగ్, ఎఫ్ఎస్ఓ -
పోడుకోసం చెట్లు నరికివేత
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్ పరిధిలో 380 కంపార్ట్మెంట్లో పోడు వ్యవసాయం కోసం కొందరు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున సుమారు ఎకరం స్థలంలో సుమారు 70 చెట్లకు పైగా నరికివేశారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకునే లోపు వారంతా పారిపోయారు. ఈ విషయమై తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మరావును వివరణ కోరగా అటవీ భూమిలో చెట్లు తొలగించిన విషయం వాస్తవమే, చెట్లను తొలగించినవారు దమ్మన్నపేటకు చెందిన వారిగా గుర్తించామన్నారు. వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి అటవీ భూమిలో చెట్లను తొలగించొద్దని అవగాహన కల్పిస్తామని చెప్పారు. -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్: సింగరేణిలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వర్రావు అన్నారు. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో ఈనెల 12న లైజర్ సెల్ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. లైజర్ సెల్ ద్వారా ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మహిళా కార్మికుల సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. దీని ఏర్పాటుకు సహకరించిన ఎస్సీ ఎస్టీ మిషన్‌కు, సింగరేణి సీఎండీ బలరాం తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ కార్మిక సంఘం ఒకటే ఉందన్నారు. ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా కార్మికులు అయోమయానికి గురికావొద్దన్నారు. త్వరలో అన్ని ఏరియాల్లో పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమావేశంలో ఇరావుల శ్రీనివాస్ సెంట్రల్ కమిటీ మెంబర్, డేగల ప్రవీణ్‌కుమార్ వైస్ ప్రెసిడెంట్, నాయకులు అంద వెంకట్, లక్ష్మణ్, వేల్పుల ప్రవీణ్, వాసు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.