leg
-
హైదరాబాద్: మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, రంగారెడ్డి: నార్సింగ్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ నెలలోనే ఇది రెండో ఘటనకాగా, ఈ నెల 13న నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది. ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
ఈ డివైజ్‌తో కాళ్లు నొప్పులు మాయం!
తరుచు పెద్దవాళ్లు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేధిస్తుంటుంది. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తుంటారు. ముప్పై దాటిన మహిళలు, కొంతమంది పిల్లలు తరుచుగా కాళ్లు పీకేస్తున్నాయని అంటుంటారు. అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన డివైజ్వచ్చింది. దీంతో దెబ్బకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 8 పిక్స్ లెగ్ మసాజ్ మిషాన్ అలసిన కాళ్లకు చక్కటి రిలీఫ్‌ని ఇస్తుంది. చిటికెలో మీ కాళ్ల నొప్పులు మాయం అవుతాయి. అరికాళ్లు, మోకాళ్లు పీకేస్తున్నట్లు ఉన్నవాళ్లకి ఈ డివైజ్ అద్భుతమైన వరం. కాళ్లకు చాలా సున్నితంగా మసాజ్ చేస్తూ మొత్తం కాళ్లకు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇది ఒకరకంగా అసౌకర్యాన్ని తెలియని ఒత్తడిని కూడా దూరం చేస్తుంది. కాళ్లు నొప్పులుగా ఇబ్బందిగా ఉంటే ఒక విధమైన అసౌకర్యంగా, ఏమయ్యిందనే టెన్షన్ ఉంటుంది. ఈ మసాజ్ మెషిన్‌తో ఆ సమస్యలు దూరమవ్వడమే గాక మీ కాళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి. ఈ డివైజ్ ఖరీదు రూ. 13 వేలు పైనే ఉంటుందట. (చదవండి: 'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?) -
'మాంసం తినే బ్యాక్టీరియా'!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!
యూఎస్‌లోని తూర్పు తీర వెంబడి సముద్ర జలాల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విబ్రియో వల్నిఫికస్ అనే ప్రాణాంతక గాయాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారితీస్తుంది. దీంతో ఓపెన్ గాయం చుట్టూ మాంసం కుళ్లపోవడం ప్రారంభమవుతుంది. దీన్నే మాంసం తినే బ్యాక్టీరియాగా చెబుతారు. ఈ నైక్రోటైజింగ్ ఫాసిటస్ అనేది ఒకటికంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తుంది. దీని బారిన పడిన కేసుల్లో చాలావరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం గానీ అవయవాన్ని కోల్పోయే ప్రమాదం గానీ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ బారినే జెన్నిఫర్ బార్లో అనే అట్లాంట మహిళ పడి మరణం అంచులాదాకి వెళ్లొచ్చింది. అసలేం జరిగిందంటే.. జెన్నిఫర్ బార్లో(33) అనే అట్టాంట మహిళ యూఎస్‌లోని బహామాస్ పర్యటనలో ఉన్నప్పుడు..సముద్రపు నీరు కారణంగా చిన్నపాటి గాయం అయ్యింది. చాలా చిన్ననీళ్ల ఒరిపిడి గాయం. అదికాస్త పెద్దదిగా అయ్యి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కి గురవ్వుతుందని ఊహించను కూడా ఊహించం. అయితే బార్లో కూడా పెద్ద గాయం కాదనే అనుకుంది. చిన్న పాటి క్రీమ్‌లు వంటివి రాసి గాయం పెద్దది కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిని తీసుకుంది. తగ్గిపోతుందనుకుంటే రోజు రోజుకి పెరుగుతుందేంటి అని ఆశ్చర్యపోయింది కూడా. రెండు వారాలకు పైగా కోమాలోనే.. చిన్న గాయం ఏదో పెద్ద రాడ్‌తో కొట్టినట్ల, లేదా పడిపోతే తగిలిన గాయం మాదిరిగా ఇంత నొప్పి వస్తోందేంటి అని కూడా అనుకుంది. అంతే ఓ రోజు తన నివాసంలోనే హఠాత్తుగా స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. ఇది గమనించిన ఆమె సోదరుడు వెంటనే ఆస్పత్రికి హుటాహుటినా తరలించాడు. అక్కడ వైద్యుల ఆమె సెప్టిక్ షాక్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కాలు బాగా వాచిపోయి నొప్పిగా ఉండటమేగాక అక్కడ చర్మం అంతా వేడిగా ఉంది. బ్యాక్టీరియా ఆమె రక్త ప్రవాహంలో ప్రవేశించడంతో బార్లో సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉండిపోయింది. ఆమె కిడ్నీ, లివర్ ఫెయిల్ అయిన లక్షణాలు కనిపించాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కూడా ఎదురైంది. వైద్యులు కూడా ఆమె దీని నుంచి ఆరోగ్యంతో బయటపడదనే భావించారు. ఆశలన్ని వదులేసి మరీ తమ వంతు ప్రయత్నంగానే వైద్యులు ఆమెకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఆమె తొడలో చనిపోయిన కణజాలాన్ని తొలగించడానికి ఏకంగా 12 సర్జరీలు చేశారు. ఆమె కాలును తొలగించకుండానే నయం అయ్యేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. 30కి పైగా సర్జరీలు.. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వైద్యులు చివరికి ఆమె కాలును తొలగించారు. ప్రస్తుతం ఆమె కాలు లేకుండా ఎలా దైనందిన జీవితాన్ని లీడ్ చేయాలో నేర్చుకునే పనిలో పడింది. అంతేగాదు ఈ గాయం కారణంగా కాలుని తొలగించకుండా ఉండేలా తొడలోని కణజాలన్ని తొలగించేందుకు గానూ సుమారు 30కి పైగా సర్జరీలు చేయించుకున్నప్పటికీ కాలు కోల్పోక తప్పలేదు బార్లోకి. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..1996 నివేదికలో యూఎస్‌లో ఏడాదికి 500 నుంచి 1500 దాక నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కి సంబంధించని కేససులు ఉన్నాయని పేర్కొంది. వాటిలో దాదాపు 20 శాతం ప్రాణాంతకంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి ఐదుమందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది. దయచేసి బీచ్‌ల వద్ద సముద్రపు నీటిలో ఎంజాయ్ చేసేటప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఏదైన గాయమైన జాగుకతతో వ్యవహరించండి. (చదవండి: సరోగసీకి ప్రత్యామ్నాయం!.భవిష్యత్తులో వేలాది మహిళలకు..) -
కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చొన్నారో..ప్రమాదంలో పడినట్లే!
'పుష్ప'.. సినిమాలో అల్లు అర్జున్ డైలాగు మాదిరిగా ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటూ కాలుపై కాలు వేసుకని దర్జాగా కూర్చోన్నారు అంతే సంగతి. ఇలా కూర్చొంటే చాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు నిపుణులు. అధ్యయనాల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే రానురాను పరిస్థితి కష్టమైపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు కాలు మీద కాలు వేసి కూర్చొవడం వల్ల నష్టాలు, లాభాలు రెండు ఉన్నాయని వెల్లడించారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనం మూడు రకాలుగా కూర్చొంటారని చెబుతున్నారు. 62 శాతం మంది తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తుండగా, 26 శాతం మంది ఎడమవైపుకి, ఇక 12 శాతం మంది ఎటువీలైతే అటు క్రాస్ చేస్తుంటారని అధ్యయనాల్లో పేర్కొన్నారు. అలాగే క్రాస్ చేసి కూర్చొవడంలో కూడా రెండు రకాలుగా కూర్చొంటారని అంటున్నారు వైద్యులు ఒకటి, రెండు మోకాళ్లను ఒకదానిపై ఒకటి క్రాస్ చేయడం, రెండు, చీలమండలం క్రాస్ చేసి కూర్చొవడం. కాలుమీద కాలు వేసి కూర్చొవడం వల్ల..? 👉హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి రెండింటిని పోలిస్తే ఒకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు మోకాలు, హిప్ , పాదాలు వంటి కింద భాగాలకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో తేడా వస్తుంది. 👉నిజానికి చీల మండలం దగ్గర క్రాస్ చేసుకుని కూర్చోవడం కంటే మోకాలిపై మోకాలు క్రాస చేసి కూర్చొవడమే అత్యంత ప్రమాదకరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. 👉ఇలా కాళ్లు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల సిరల్లో రక్తప్రవాహం తగ్గి రక్తపోటు అధికమవుతుంది. శరీరంపై ఏర్పడే దుష్ప్రభావమెంత అంటే..? 👉కాలు మీద కాలు వేసుకుని సుదీర్ఘకాలం పాటు కూర్చొంటే ..కండరాల పొడవు, పెలివిక్ బోన్స్ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి. 👉శరీరం ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. 👉అలాగే మెడ ఎముకల్లో మార్పు రావడం వల్ల తలభాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి. దీని వల్ల మెడ కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే?.. ఇలా కూర్చొన్నప్పుడూ శరీరంలో ఒకవైపు.. మరోవైపుతో పోలిస్తే బలహీనంగా మారుతుంది. 👉ఇక పొత్త కడుపు కండరాల్లో మెన్నుముక కింద భాగంలో కూడా ఇదేరకమైన మార్పులు రావచ్చు. ఒకవేళ పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భార పడటం వల్ల పొత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారి గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మన శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలోకి మారే ప్రమాదం కూడా ఉంది. క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నరాలుగా పిలిచే పెరోనియల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు. ఐతే ఇది చాలా కేసుల్లో చాలా స్వల్పకాలికమే. కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణస్థితికి వచ్చేస్తాయి. 👉వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో రుజువైంది సాధారణంగా శరీర ఉష్ణోగ్రతల కన్నా టెస్టికల్స్ ఉష్ణోగ్రత 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి. ఇలా కూర్చొవడం వల్ల వీటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియల్ పెరుగుతాయి. పైగా క్రాస్ లెగ్ స్థితిలో కూర్చొన్నప్పుడూ.. ఉస్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. టెస్టికల్స్‌లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక మహిళలు, పురుషుల్లో శరీర నిర్మాణానికి సంబంధించి చాలా మార్పులు ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలే తేలికగా కాలుపై కాలు వేసుకుని కూర్చొగలుగుతారు. అందువల్లే వారికే ఈ ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు పేర్కొన్నాయి. క్రాస్ లెగ్స్ వల్ల ప్రయోజనాలు.. ఒక కాలు పొడువు ఉన్నవారు ఇలా కూర్చొవడం వల్ల పొత్తికడుపులో ఇరువైపు లో పొడవు సర్దుబాటు అయ్యి అమరికలు మెరుగయ్యాని 2016లో ఒక అధ్యయనంలో గుర్తించింది క్రాస్ లెగ్ వల్ల కండరాల పనిభారం తగ్గుతుంది. ముఖ్యమైన కండరాలు ఉపశమంనం పొంది అతిశ్రమ భారం నుంచి విముక్తి పొందవచ్చు. చివరిగా మనం కూర్చొనే విధానం సౌకర్యంవంతంగా ఉండటం తోపాటు ఆరోగ్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు కాలు మీద కాలు వేసుకుని కూర్చొకపోవడమే మంచిది. కాలుమీద కాలు వేసుకుని కూర్చొవడం వల్ల పైన చెప్పినవే గాక ఇంకా ఇతరత్ర సమస్యలకు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల ఊబకాయం, కదలకుండా ఒకేచోట కూర్చొనే జీవన విధానాన్ని అలవడుతుందని పరిశోధనలు పేర్కొన్నాయి. అందువల్ల చాలాసేపు ఒకేవిధానం కూర్చొకూడదు. కనీసం మధ్యమధ్యలో లేవడం తోపాటు కొద్ది దూరం నడవాలి. (చదవండి: అత్యంత వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) -
నిరంతరం కాళ్లు కదిలిస్తూ ఉండే... రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్!
కొందరిని గమనిస్తే... కుర్చీలో కూర్చుని కాళ్లు రెండూ కదుపుతూ ఉంటారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా... అలా కదిలించడం వారికి ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ వారు బలవంతంగా దాన్ని నియంత్రించుకుంటే... అది వారికి అనీజీగా అనిపించి... కాసేపటి తర్వాత తమ ప్రమేయం లేకుండానే మళ్లీ కదిలించడం మొదలుపెడతారు. జనాభాలో దాదాపు 3 శాతం మందిలో ఇది ఉంటుంది. ఇలా కాళ్లు కదుపుతూ ఉండే సమస్యను ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’ (ఆర్ఎల్ఎస్) అంటారు. చాలామందిలో ఉండే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. కాళ్లు రెండూ అదేపనిగా కదుపుతూ ఉండే ఈ సమస్య కూర్చుని ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... ఇలాంటివారిని జాగ్రత్తగా గమనిస్తే... ఈ ధోరణి సాయంత్రాలూ, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా ఉంటుంది. వైద్య పరిభాష లో దీన్ని ‘విల్లిస్ ఎక్బామ్ డిసీజ్’ అని కూడా అంటారు. ఇది ఏ వయసువారిలోనైనా కనిపించినప్పటికీ... వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కనిపించే అవకాశాలు పెరుగుతాయి. కొందరిలో ఇది ఎంత ఎక్కువ అంటే... వారి నిద్రకు సైతం ఇది అవరోధంగా మారుతుంది. కుటుంబ చరిత్రలో ఈ సమస్య ఉన్నవారి పిల్లల్లోని చాలామందిలో అనువంశికంగా ఈ సమస్య కనిపిస్తుంది. కారణాలు: ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు... త్వరగా ఉద్వేగాలకు లోనయ్యేవారు, అతిగా ఆందోళన పడేవారు, యాంగై్జటీకి గురయ్యేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇది ఎక్కువ. . లక్షణాలు: ∙కొందరిలో కాళ్లలో ఇబ్బంది పైకి పాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ∙కాళ్లు కదుపుతూ ఉంటారు. కాళ్లు కదపడం ఆపితే చాలా ఇబ్బందిగానూ, అలా కదుపుతుంటే హాయిగాను ఫీలవుతారు. ∙ఇలా కదిపే వాళ్లలో రాత్రి నిద్రలో అకస్మాత్తుగా కాలి కండరాలు పట్టేస్తాయి. దాంతో అకస్మాత్తుగా నిద్రలేస్తారు. ఒక్కోసారి రాత్రంతా బాధపడతారు. తరచూ నిద్రాభంగాలు, దాంతో వచ్చిన నిద్రలేమితో జీవన నాణ్యత దెబ్బతింటుంది. ∙ఈ లక్షణాలున్న కొందరిలో కాళ్లలాగే భుజాలూ కదపడం కనిపిస్తుంది. కానీ ఇది చాలా అరుదు. అపోహ... వాస్తవం: రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌ను కొందరు మానసిక సమస్యనూ, మెదడు లేదా నాడీమండల సమస్యగానూ భావిస్తారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. కాకపోతే యాంగై్జటీతో పాటు కొన్ని మానసిక సమస్యలు ఉన్నవారిలో ఇది కనిపిస్తుండటం అనే అంశమే ఈ అపోహకు తావిస్తోంది. అంతే తప్ప ఇది మెదడు, నాడీ సంబంధమైన సమస్య లేదా మానసిక సమస్య కాదు. కొంతమంది ఇది నరాల్లోని సమస్యగా భావిస్తారు. ఇది సరి కాదు. నివారణ / నియంత్రణ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నవారిలో హీమోగ్లోబిన్‌లో ఐరన్ లోపం ఉందేమో చెక్ చేసుకుని, ఒకవేళ ఉంటే దాన్ని భర్తీ చేయాలి. ∙కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి లేదా పరిమితంగా తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ∙కాళ్లు రెండూ గోరువెచ్చగా ఉన్న వేణ్ణీళ్ల టబ్‌లో ఉంచి, మెల్లగా మసాజ్ చేయడం. ∙సమస్య తీవ్రత ఉన్నవారు ‘ఫుట్ ర్యాప్ లేదా వైబ్రేటింగ్ ప్యాడ్స్’ వంటి ఉపకరణాలను డాక్టర్ల సూచన మేరకు వాడటం. -డాక్టర్ కె. శివరాజు,సీనియర్ ఫిజిషియన్ (చదవండి: మీలో ఏకాగ్రత ఎంత ఉంది? అందుకోసం ఏం చేయాలంటే) -
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
లెగ్గుపీసే కానీ కోడిది కాదు..
ఏ విషయంలో ముందున్నా లేకున్నా... అన్ని జంతువులను సమభావంతో చూడటంలో చైనీయులు, తైవాన్వాసులు ఎప్పుడూ ముందుంటారు.. అందుకే తినే విషయంలో అదీ ఇదీ అని చూడరు. కనువిందుగా కనిపిస్తే చాలు.. ఏదైనా సరే.. నాలుగు రకాల మసాలాలు కుమ్మేసి.. ఆ నూడుల్స్‌తో కలిపేసి.. ఎంచక్కా మింగేస్తుంటారు. తైవాన్‌కు చెందిన విచ్ క్యాట్ అనే రెస్టారెంటోడికి కూడా ఓ మొసలి ఇలాగే కనిపించినట్లుంది. పైగా అక్కడి చెఫ్‌లకు క్రియేటివిటీ కూడా కాసింత ఎక్కువేనట. అందుకే ఎప్పుడూ చికెన్ లెగ్గుపీసులేనా.. మనిసన్నాక కూసింత కళాపోసన ఉండాలని చెప్పి.. మొసలి లెగ్గు పీసుతో ఇదిగో ఈ వంటకాన్ని సిద్ధం చేసేశారు. దీన్ని రుచి చూస్తే. రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయట. అయితే.. రెస్టారెంట్‌కు వచ్చినోళ్లంతా.. ఫొటోలు తీసుకుంటున్నారు తప్పిస్తే.. దీన్ని ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. మరి.. ఆ ధైర్యం మీకుందా? -
Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఆదిపురుష్ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించాడు. సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉన్న ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో సినిమాకు బజ్ జనరేట్ అయ్యింది. ప్రభాస్ కాకుండా ఇంకొకరు ఆదిపురుష్ చేసి ఉంటే.. ఈరోజు మూవీ గురించి ఇంత డిస్కషన్ జరిగేది కాదేమో. అందుకే ప్రతి చిన్న విషయాన్ని నెటిజన్స్ ఫాలో అవుతున్నారు. (ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) ప్రభాస్ ఎక్కడ టాలీవుడ్లో తన సినిమాను మొదటిరోజే హైదరాబాద్ థియేటర్లలో చూసేవాడు. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి పెరిగిపోవడంతో ముంబయి వెళ్లి తన సినిమాను చూసేవాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత అక్కడా ఇదే పరిస్థితి ఎదురుకావడం వల్ల ఇప్పుడు ఫారెన్‌లో తన సినిమాను చూసేందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికాలో ఆదిపురుష్ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రభాస్ చూశాడట. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కాలికి ఏర్పడిన గాయం మళ్లీ ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఈవెంట్లో కూడా కాలి నొప్పితో ప్రభాస్ ఇబ్బంది పడ్డాడు. అందుకే మరోసారి అమెరికాలోనే సర్జరీ చేయించుకోనున్నారట. అనంతరం కొన్నిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని.. సలార్ మూవీ సెట్లో అడుగుపెట్టనున్నారని సమాచారం. కాలి నొప్పి బాధ నుంచి ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) -
ఎత్తు పెరగాలని ఏకంగా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!
ఇటీవల వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనికి సాంకేతికత కూడా తోడవ్వడంతో పలు వ్యాధులను సులభంగా నయం చేయగల చికిత్స విధానాలు చాలామటుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనషుల్లో కొంత వికృతమైన ఆలోచనల తో వెర్రీ పనులు చేస్తున్నారునే చెప్పాలి. రూపు రేఖలు దగ్గర నుంచి ప్రతీది మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా కాస్మోటిక్ శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో యువత ఆ సర్జరీలు ఎంత ఖరీదైనవైనా..లెక్క చేయకుండా చేయించుకోవడానికి రెడీ అయ్యిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎత్తు పెరిగేందుకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించుకున్నాడు. దీని వల్ల పల దుష్పరిణామాలు ఉన్నా కూడా చేయించుకునేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఎందుకోసం అంత రిస్క్‌తో కూడిన శస్త్ర చికిత్స చేయించుకుంటున్నోడో వింటే ఆశ్చర్య పోవడం ఖాయం. వివరాల్లోకెళ్తే...అమెరికాకు చెందిన 41 ఏళ్ల గిబ్సన్ తన ఎత్తు విషయమై చాలా బాధపడుతుండేవాడు. అతను ఐదు అడుగుల ఐదు అంగుళాలు. ఆ ఎత్తు కారణంగానే తనకు గర్లఫ్రెండ్స్ లేరని తెగ బాధపడుతుండేవాడు. అందుకోసం అని తన ఘూస్లో కొని రకాల వస్తువలు పెట్టుకుని హైట్‌గా కనిపించేందుకు తెగ ప్రయత్నించేవాడు. ఎత్తు పెరిగేలా మందులు వాడటం దగ్గర నుంచి యోగ వరకు అని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఐతే అవన్నీ ఫెయిల్ అవ్వడంతో ఇక ఎత్తు పెరిగేలా కాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాస్తవానికి గిబ్సన్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శస్త్ర చికిత్స కోసం అని తనసంపాదనలో కొంత డబ్బును ఆదా చేయడమే గాక ఉబర్ డ్రైవర్ కూడా పార్ట్ టైం జాబ్ చేసి మరికొంత డబ్బును కూడబెట్టాడు. గిబ్సన్ తాను అనుకున్నట్లుగానే 2016లో మొదటి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడు అంగుళాలు పెరిగాడు. దీంతో అతని ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పెరిగాడు. అయినప్పటికి ఇంకా ఎక్కువ పెరగాలని రెండోసారి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. మొదటి శస్త్ర చికిత్స మాదిరిగా రెండో ఆపరేషన్ ప్రక్రియ అంత సజావుగా జరగలేదు. మరింత ఎత్తు పెరగడం కోసం వైద్యులు అతని ఎముకలు విరిచి దానిపై అయస్కాంత స్క్రూలు వంటి కొన్ని పరికరాలు అమర్చాల్సి రావడమే గాక విపరీతమైన బాధను కూడా అనుభవించాల్సి వచ్చింది. పైగా మొదటి ఆపరేషన్‌కి రూ. 60 లక్షలు ఖర్చు పెట్టగా రెండోదానికి ఏకంగా రూ. 80 లక్షల దాక ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక పక్క విపరీతమైన బాధలు మరోవైపు అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ బాధపడక పోగా తాను జూన్ నాటికి 5 అడుగులు పది అంగుళాలు పెరుగుతానని ఆనందంగా చెబుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కూడా గిబ్సన్ చాలా ఆనందంగా ఉన్నాడని, ప్రస్తుతం అతనికో గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉందని చెబుతుండటం విశేషం. ఏదీఏమైనా ఈ ఎత్తు పెంచే శస్త్ర చికిత్స వల్ల భవిష్యత్తులో పలు దుష్పరిణామాలే గాక కొన్ని రకాల రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. Moses Gibson spent 170k on 2 height lengthening surgery after being subjected heightism for being 5’5! He said he long struggled to get a girlfriend due to his 5-foot-5-inch frame, initially turning to medication and a “spiritual healer” to try to increase his height… He… pic.twitter.com/HqoTcUyCZR — The Cosmetic Lane (@TheCosmeticLane) April 12, 2023 (చదవండి: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై బాంబు దాడి.. భయంతో పరుగులు.. క్షణాల ముందు వీడియో..) -
వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్ కాలుని తొక్కించి...
సాక్షి, బంజారాహిల్స్: ఫ్రీ లెఫ్ట్‌లో కారును అడ్డు తొలగించాలని కోరిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై వాహనదారుడు కారుతో కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్లో ఓ కారు డ్రైవర్ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎల్.నగేష్ అడ్డు తొలగాలని సైగలు చేశాడు. అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్ ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆగ్రహంతో ఊగిపోతున్న డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
Viral Video: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..
-
ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..
న్యూయార్క్: కొన్ని అనుకోని ప్రమాదాల్లో కాళ్లు, చేతులు లేదా ఏదైనా అవయవాన్ని కోల్పోయిన తర్వాత మళ్లీ మన జీవితాన్ని యథావిధిగా కొనసాగించడానికి చాలా కష్టపడతాం. అంతేకాదు ఆ ప్రమాదం వల్ల మానసికంగా కుంగిపోయి.. దాన్నుంచి బయటపడటానికే చాలా సమయం పడుతుంది. అదీ కాక ఆ అవయవం లేదన్న సంగతినే మొదట జీర్ణించుకోలేం. (చదవండి: అత్యంత ఎతైన భవనం పై ఇలా కనిపించడం మూడోసారి) ఏదిఏమైన మన జీవితాన్ని అద్భుతంగా సాగించాలన్న సంకల్పంతో ఏ అవయవ లోపాన్ని అయినా అత్యంత సులభంగా అధిగమించగలమని నిరూపించినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక కుక్క తనకు కాలు లేకపోయిన మానవుల మాదిరిగా నడవగలనంటూ నిరూపించచింది. ఈ అసాధారణ సంఘటన వివరాలు.. వివరాల్లోకెళ్లితే... అమెరికా కొలరాడోలోని ఔరేకి చెందిన కెంటీ పసెక్ అనే వ్యక్తి పెంపుడు కుక్క డెక్స్టర్ కారు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆ కుక్కకి ప్రమాదం జరిగిన సంవత్సరంలోనే ఆ కాలు నిమిత్తం సుమారు ఐదు సర్జరీలు కూడా జరిగాయి. అంతేకాదు కాలు పోయిన తర్వాత కుక్క తన మూడు కాళ్లతో నడవడం ప్రారంభించింది. అచ్చం మనిషిలాగే నడుస్తుంది. అయితే ఆ కుక్క యజమాని దీనికి సంబంధించిన వీడియోతోపాటు "కుక్క వాస్తవాన్ని అంగీకరిస్తూ జీవించడానికీ ప్రయతిస్తోంది" అనే క్యాప్షన్ జోడించి మరీ ట్వీట్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు డెక్స్టర్‌ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఈ ఏనుగు కథే వేరు) -
కారు డ్రైవర్ మత్తు.. కియారా జీవితంలో విషాదం
ఇక జీవితంలో నడవలేనేమో అనే సంశయం కన్నా పడిపోయినా పర్వాలేదు ఒక్క అడుగు వేసి నిలబడాలి అని కోరుకునే వారికి కియారా మార్షల్ అసలు సిసలు నిర్వచనంలా కనిపిస్తోంది. నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా పదేళ్ల వయసులో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. కుడి కాలి మీదుగా కారు వెళ్లిపోయింది. తాగిన మత్తులో కారు నడిపిన డ్రైవర్ కియారా జీవితంలో విషాదం నింపాడు. తీవ్రంగా గాయపడిన కియారాను ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను బతికించగలిగారు కానీ, ఆమె కాలిని వైద్యులు రక్షించలేకపోయారు. కాలు లేదన్న బాధ నుంచీ త్వరగానే కోలుకుంది కియారా. కృత్రిమ కాలు అమర్చడంతో దాని ద్వారా కొత్త జీవితాన్ని ఆరంభించింది. కియారా కృషి కారణంగా నేడు ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని మోడల్‌గా రాణిస్తోంది. ఇప్పుడు కియారా వయసు 27. టామీ హిల్ఫిగర్, టీన్ వోగ్ వంటి ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేస్తుంది కియారా. తను కల గన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి శారీరక వైకల్యం కారణం కాలేదని చెప్పే కియారా నేటి అమ్మాయిలకు జీవితంలో ఏదైనా సాధించాలనే స్ఫూర్తిని నింపుతోంది. దాచని కాలు కృత్రిమ కాలును పెట్టుకున్నందుకు దుస్తులతో కప్పి పెట్టాలని, నలుగురి కళ్లలో పడకూడదని అనుకోవడం లేదు కియారా. వివిధ ఫొటో షూట్ల సమయంలో మోడలింగ్ చేసేటప్పుడు కియారా తన కృత్రిమ కాళ్లను దాచుకోదు. తనలాంటి ఇతర వికలాంగ అమ్మాయిలను ప్రోత్సహించడానికి ప్రతి ప్రదర్శనలోనూ తన కాలును కూడా చూపిస్తుంది. ‘కాలు పోగొట్టుకున్న తర్వాత చాలా నిరాశకు గురయ్యాను. కానీ, కృత్రిమ కాలు గురించి విన్నప్పుడు ఒక కొత్త ఆశ నాలో తలెత్తింది. మోడలింగ్ ప్రారంభించిన వెంటనే ఒక కాలు లేకపోవడం ఏమైనా తేడాను చూపుతుందా అని సరిచూసుకున్నాను. నా ప్రోస్తెటిక్ కాలితో కూడా నేను జీవితాన్ని ఆస్వాదించగలను అనిపించింది. కృత్రిమపాద ఇంప్లాంట్ పొందిన కొద్దికాలానికే మోడల్‌గా మారాలని నిర్ణయంచుకున్నాను. మోడలింగ్ చేసేటప్పుడు నా కృత్రిమ కాలిని దాచవలసిన అవసరం లేదనిపించింది’ అని చెప్పే కియారా తన 18వ ఏట నుంచి మోడలింగ్ చేస్తోంది. తనలాగే శారీరక వైకల్యాలున్న అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపడానికి పనిచేయాలనుకుంటంది. ఈ రోజు కూడా నాలాంటి అమ్మాయిలకు సమాజంలో తగిన హోదా లభిస్తుందని అంటోంది. వికలాంగుల కోసం చాలా పనులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా వికలాంగ అమ్మాయిలకు సమాజంలో నిలదొక్కుకునే హక్కు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఈ నా ప్రయత్నం అంటూ మోడలింగ్ ద్వారా తన సత్తా చాటుతోంది కియారా. -
బోధకాలు నివారణే లక్ష్యం
నల్లగొండ టౌన్ : ప్రజల్లో బోధకాలు వ్యాధి, నులిపురుగుల (నట్టల) నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19నుంచి 21వరకు మూడు రోజుల పాటు సామూహిక డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను మింగించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసేపనిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తలమునకలై ఉంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సీడీపీఓలకు ఈ నెల 14న, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఇతర వలంటీర్లకు 15, 16 తేదీల్లో శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,829 మంది బోధకాలు వ్యాధితో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాకు చేరిన మాత్రలు : ల జిల్లాలోని 31 మండలాల్లో గల అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మాత్రల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 15,27,845 మందికి మాత్రలను మింగించాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 42,01,573 డీఈసీ (100గ్రాములు) మాత్రలను, 15,27,845 ఆల్బెండజోల్ (400 గ్రాముల) మాత్రలను జిల్లాకు తెప్పించి అన్ని మండలాలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. మాత్రలను మింగించడానికి 6,111 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. 2 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్ల లకు డీఈసీ మాత్ర 1, ఆల్బెండజోల్ మాత్ర 1, 6 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు వారికి డీఈసీ 2, ఆల్బెండజోల్ 1, 15 సంవత్సరాల పైబడిన వారికి డీఈసీ 3, ఆల్బెండజోల్ మాత్ర 1 చొప్పున మింగించనున్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు 601 మంది సూపర్వైజర్లను నియమించారు. 40 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గంగవరప్రసాద్, జిల్లా మలేరియా అధికారి రుద్రాక్షి దుర్గయ్యతో పాటు ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. బోధకాలు వ్యాధి ఎలా వస్తుంది.. ఫైలేరియా అనే సూక్మ క్రిమి ద్వారా బోధకాలు వ్యాధి వస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దోమలను నివారించడానికి మురుగు నిల్వ లేకుండా పరిసరాలను ఉంచుకోవాలి. ప్రతిఒక్కరూ మాత్రలు మింగాలి ఈనెల 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు నిర్వహించే సామూహిక డీఈసీ, అల్బెండజోల్ మాత్రల మింగించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ విధిగా మాత్రలను మింగాలి. మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మాత్రలను వేసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తినా.. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. తగ్గనిపక్షంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందాలి. కార్యక్రమం విజయవంతానికి ప్రతిఒక్కరూ సహకరించాలి.– ఆర్.దుర్గయ్య, జిల్లా మలేరియా అధికారి -
కాలు మీద కాలు
ఒక చెట్టు మీద ఒక కాకి రోజంతా అలాగే కూర్చొని ఉంది. కాలి నొప్పో, కంటి నొప్పో అయి కూర్చోవడం కాదు. ఉల్లాసంగా, విలాసంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది! కిందికి, పైకి, పక్కలకు ముక్కు కదపడం ఒక్కటే అది చేస్తున్న పని. ఓ కుందేలు ఉదయాన్నే ఆహారం వెతుక్కుంటూ చెట్టు కిందికి గెంతుకుంటూ వచ్చి, చెట్టు పైన కూర్చొని ఉన్న ఆ కాకిని చూసింది. మళ్లొకసారి అటు గెంతుతూ, ఇటు గెంతుతూ చెట్టు పైకి చూసింది. కాకి ఆ కొమ్మ మీద అలాగే కూర్చొని ఉంది. మధ్యాహ్నం అయినా అలాగే కూర్చొని ఉంది. సాయంత్రం కావస్తున్నా అలాగే కూర్చొని ఉంది. ‘ఆహా.. తిండి తిప్పల్లేకుండా, చీకూచింతా లేకుండా ఎంత హాయిగా బతుకుతోంది ఈ కాకి’ అనుకుంది. ఇక ఉండబట్టలేక, ‘‘కాకిగారూ.. నేను కూడా మీలాగే రోజంతా పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని విశ్రాంతిగా కూర్చొవచ్చా?’’ అని అడిగింది. ‘ఓ.. ఎందుక్కూర్చోకూడదూ? తప్పకుండా కూర్చోవచ్చు కుందేలు పిల్లా’’ అంది కాకి. కుందేలుకు సంతోషం వేసింది. ఆ చెట్టు కిందే తీరిగ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కొద్దిసేపటికే అటుగా వచ్చిన నక్క.. కుందేలును నోట కరుచుకుని వెళ్లింది. ఇందులో నీతి ఏమిటంటే.. పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని! -
నిర్లక్ష్యం ఆమె కాలును.. తినేసింది !
లండన్ : నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా మారింది. మాంసం తినే ఓ క్రిమి ఆమె కాలును తీవ్రంగా తొలిచి తినేసింది. కుడికాలును షేవ్ చేసుకుంటుండగా అయిన చిన్నగాటు ప్రమాదకరంగా మారి కాలే తీసేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని బ్రీష్టన్‌కు చెందిన తాన్యా జెర్నోజుకో అనే మహిళ కొన్ని నెలల ముందు తన కుడికాలును రేజర్‌తో షేవ్ చేసుకుంటుండగా చిన్నగాయం అయ్యింది. అయితే చిన్న గాయమే కదా అని ఆమె ఊరకుండిపోయింది. కొద్దిరోజుల తర్వాత అది చిన్నపాటి నాణెం సైజులోకి మారింది. అయినా ఆమె పట్టించుకోకపోవటంతో అది ఏకంగా పెద్దసెల్‌ఫోన్ సైజులోకి పెరిగి చర్మానికి రంధ్రం చేసింది. ఇన్ఫెక్షన్ అలా పెరిగిపోవటంతో ఇక చేసేదేమీలేక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు రాసిన మందులు,క్రీములు ఇలా అన్నీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డాక్టర్లు చేసిన పరీక్షల్లో ఆమెకున్న క్రోనిక్ లెగ్ అల్సర్ కాస్తా గ్యాంగ్రెనే(దెబ్బతిన్న శరీర భాగం కుళ్లిపోయే స్థితి)గా మారిందని తేలింది. ఆమెకు డయాబెటిస్ ఉండటంతో గాయం మానటం కష్టమని, కాలును తీసేయటం మంచిదని డాక్టర్లు సలహాయిచ్చారు. డాక్టర్ల సలహా మేరకు ఆమె తన కుడి కాలును తీసేయించుకుంది. నిర్లక్ష్యమే తన ఈ పరిస్థికి కారణమని ఏ పరిస్థితిలోనూ నిర్లక్ష్యం కూడదని తాన్యా సలహా ఇస్తోంది. -
కాలును వెనక్కితిప్పి అతికించారు!
వాషింగ్టన్ : ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఓ బాలుడి విషయంలో కూడా వైద్యులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏమిలియా ఎల్డర్ అనే బాలుడికి ఏడేళ్ల వయసులోనే ఆస్టియో సర్కోమా అనే అరుదైన క్యాన్సర్ సోకింది. దీంతో .. అప్పటిదాకా అందరి పిల్లల్లా ఆడిపాడే ఎల్డర్ జీవితం ఒక్కసారిగా ‘తిరగబడింది’. మోకాలికి, తుంటికి మధ్య ఓ కణితి ఏర్పడింది. దీనివల్ల విపరీతమైన నొప్పి, వాపు రావడంతో ఎల్డర్ తల్లిదండ్రులు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో కణితి కారణంగా అక్కడి ఎముక విరిగిపోయిందని వైద్యులు గుర్తించారు. కణితిని తొలగించేందుకు కీమోథెరపీ వంటి చికిత్స విధానాలతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కణితి ఉన్నంత మేర ఎముకను, కాలిభాగాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. లేదంటే క్యాన్సర్ మిగతా అవయవాలకు వ్యాపించే అవకాశముందని హెచ్చరిచారు. దీంతో ఆ భాగాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో.. తొలగించిన వైద్యులు, దానిని అతికించడానికి మాత్రం ‘రొటేషన్ప్లాస్టీ’ పద్ధతిని ఉపయోగించాల్సి వచ్చింది. మరే ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఈ పద్ధతిలో కాలును తిప్పి అతికించామని, ప్రయత్నిస్తే భవిష్యత్తులో సాధారణంగానే నడవడం, డ్యాన్స్ వంటివి కూడా చేయొచ్చని చెబుతున్నారు. మొత్తానికి కాలు సంగతి ఎలా ఉన్నా తమ బిడ్డ ప్రాణాలు దక్కినందుకు ఎల్డర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. -
ప్రమాదమా..? హత్యా..?!
పాల్వంచరూరల్: అది. పాల్వంచలోని కేటీపీఎస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. అక్కడొక కన్వేయర్ బెల్ట్. కేటీపీఎస్ ఓఅండ్ఎం బి–స్టేషన్‌కు చెందినది. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ) నుంచి 34ఏ మీదుగా 5–ఏకు బొగ్గును సరఫరా చేస్తోంది. అక్కడ మంగళవారం ఉదయం సిబ్బంది విధుల్లో ఉన్నారు. బంకర్లో నిలిచిపోయిన బొగ్గు చూరను తొలగిస్తున్నారు. ఆ చూరలో వారికి ఒకటి కనిపించింది. దానిని చూడగానే భయమేసింది. కొన్ని క్షణాల పాటు వణికిపోయారు. అదేమిటో తెలుసా..? కాలు..! మనిషి కాలు..!! నుజ్జు నుజ్జయింది. కాలు ఒక్కటే ఉంది. ఎవరిదిది..? ఎలా వచ్చింది..? ఏం జరిగింది..? అక్కడి సిబ్బందిలో అనేక సందేహాలు. సైదులు అనే కార్మికుడొకరు వెంటనే సంబంధిత షిఫ్ట్ ఇంజనీర్లకు సమాచారమిచ్చారు. అధికారులు వచ్చారు.. చూశారు. ఎస్సై రవికుమార్ చేరుకున్నారు, ఆ కాలును ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతోనే అక్కడకు కేటీపీఎస్ ఇన్చార్జ్ సీఈ నర్సింహం, సీఈ సమ్మయ్య, ఎస్ఈలు, ఏడీలు, డీఈలు, కార్మికులు పెద్ద సంఖ్య లో చేరుకున్నారు. వారందరి సమక్షంలో సిబ్బంది ఇంకా సూక్ష్మంగా వెతికారు. కాలు కనిపించిన చోటనే సెల్ ఫోన్ చిప్ దొరికింది. దానిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వారం రోజులుగా కన్పించడం లేదట. ఈ కాలు అతనిదేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ నివేదిక వస్తేనేగానీ ఆ కాలు ఎవరిదనేది గుర్తించలేమని పోలీసులు అంటున్నారు. ఎలా వచ్చింది..? ఇది ఎలా వచ్చింది..? ఆ వ్యక్తిది హత్యా..? ప్రమాదమా..? అందరూ అడుగుతున్న ప్రశ్నలివి. సమాధానాల్లేవు. కేటీపీఎస్కు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గును కొత్తగూడెంలోని బొగ్గు గనుల నుంచి వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తారు. బొగ్గు చోరీ చేసేందుకు వ్యాగన్ ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడా..? ఎవరైనా హత్య చేసి శరీర భాగాలను వ్యాగన్లలో పడేశారా? ఇలా, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాగే వ్యాగన్లలో మృతదేహాలు కనిపించినట్టుగా ఇక్కడి కార్మికులు చెబుతన్నారు. ‘‘ప్రమాదాల్లోనే వారు మృతిచెందినట్టుగా ఆ తరువాత తెలిసింది’’ అని అక్కడి కార్మికులు చెప్పారు. కాలు మాత్రమే కనిపించడంతో, ఇది ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సై రవి, కేసు నమోదు చేశారు. -
మొబైల్ చూస్తూ కాలు పోగొట్టుకుంది!
-
మొబైల్ చూస్తూ కాలు పోగొట్టుకుంది!
షాంఘై : స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. చేతిలో ఫోన్ ఉటే చాలు.. పక్కన ఏం జరుగుతోందన్న విషయాన్ని కూడా జనాలు గమనించడం లేదు. స్మార్ట్ మాయలో కొట్టుకుతున్న కుర్రకారు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే చైనాలోని షాంఘైలో జరిగింది. స్మార్ట్ ఫోన్ మాయలో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోక.. చివరకు అత్యంత దారుణ స్థితిలో కాలును కోల్పోయింది. షాంఘైలోని ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువతి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది. అంతలోనే స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్ చూసుకుంటూనే... లిఫ్ట్‌లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్ డోర్లు మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్ వేగంగా కదిలింది. లిఫ్ట్ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే పచ్చడి అయిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవడంతో.. వెలుగులోకి వచ్చింది. -
మన్యంలో మృత్యు ఘంటికలు
కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడి మృతి చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు లేనట్టేనా? రంపచోడవరం/వీఆర్ పురం : ఏజెన్సీలో మళ్లీ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. మృత్యువాత పడుతున్న గిరిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పెరుగుతునే ఉంది. విలీన మండలం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వీఆర్ పురం మండలం కుంజంవారిగూడెం గ్రామానికి చెందిన పర్షిక ధర్మయ్య ( 30) పది రోజులుగా కాళ్లవాపు వ్యాధితో బాధపడుతూ శనివారం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. ఒకే వ్యాధి లక్షణాలతో అనేక మంది చనిపోతున్నా అధికార యంత్రంగంలో కదలిక రావడం లేదు. వ్యాధి కారణాలు, నివారణ, చికిత్స గురించి ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. రేఖపల్లిలో ప్రారంభమై... వీఆర్‌పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో తొలి మరణం సంభవించింది. తరువాత క్రమంలో ఇతర మండలాల్లో కాళ్లవాపు లక్షణాలతో గిరిజనులు మృత్యువాత పడడం ప్రారంభమైంది.కాళ్లవాపుతో ఇప్పటి వరకు విలీన మండలాల్లో మొత్తం 13 మంది గిరిజనులు మరణించారు. వీఆర్‌పురం మండలంలో 8 మంది, చింతూరు మండలంలో నలుగురు, కూనవరంలో ఒకరు మృత్యువాతపడ్డారు. కాళ్లవాపుతో బాధపడుతున్న వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించినా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. నేటికీ అందని పౌష్టికాహారం కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో విలీన మండలాలు అతలాకుతలమయ్యాయి. ప్రభావిత గ్రామాల పర్యటనకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కేవలం మాటలు చెప్పి వెళ్లారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహారం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ అరుణ్‌కుమార్ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గిరిజనుల ఆరోగ్యంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతోంది. విలీన మండలాల్లో రక్షిత నీరు లేకపోవడం వల్ల వ్యాధులకు కారణమవుతుందని భావించారు. రక్షిత నీరు అందించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా మరో గిరిజనుడు కాళ్లవాపు వ్యాధితో మృతి చెందడంతో అధికారుల హడావుడి మళ్లీ మొదలైంది. ఇప్పటికీ గుర్తించని మూలాలు కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు మరణించి నాలుగు నెలలు కావస్తున్నా ఆ వ్యాధి రావడానికి గల కారణాలను గుర్తించలేకపోయారు. విలీన మండలాల నుంచి ఈ వ్యాధి బారిన పడిన సుమారు 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందారు. వ్యాధి బారిన పడిన వారికి కిడ్నీలు పనిచేయకపోవడంతో చింతూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. డయాలసిస్ అవసరమైన రోగులను కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. మన్యంలో మృత్యుఘంటికలు ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మన్యానికి మాయరోగం
గిరిజనంపై విరుచుకుపడుతున్న కాళ్లవాపు వ్యాధి నాలుగు నెలల వ్యవధిలో 14 మంది మృత్యువాత వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం విఫలం ఇచ్చిన హామీల అమలు గాలికి.. బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ నేడు బాధితులకు పరామర్శ ఆ రోగం.. ఇంటి పెద్దదిక్కులను పొట్టనపెట్టుకుంది.. ఆ ఇంటి మహలక్ష్ములను బలితీసుకుంది. ఎందరినో అనాథలను చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నాలుగు మాసాల్లో ఏకంగా 14 మంది ప్రాణాలను హరించింది. వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. కాళ్లవాపు వ్యాధి అన్నారే తప్ప.. అదేం రోగమో పూర్తిగా నిర్ధారించని అధికారగణం, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించని పాలకుల తీరు మన్యంవాసులను మరింత బాధించాయి. అయితే వారికి కొండంత భరోసానిస్తూ.. వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు అండగా నిలిచారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. తాజాగా వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మన్యంలో పర్యటించి కాళ్లవాపు బాధితులను పరామర్శించనున్నారు. కాళ్లవాపు వ్యాధి. వీఆర్ పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధి అన్నవరం గ్రామంలో తొలుత ప్రారంభమై పరిసర గ్రామాలకు, చింతూరు, కూనవరం మండలాలకు వ్యాపించింది. ఈ వ్యాధి బారినపడి వీఆర్‌పురం మండలంలో ఎనిమిది మంది, చింతూరు మండలంలో ఐదుగురు, కూనవరం మండలంలో ఒకరు, మొత్తం 14 మృతిచెందారు. కన్నెత్తి చూడని పాలకులు ఏజన్సీలో కాళ్లవాపు మరణాలతో గిరిజనులు ప్రాణాలు విడుస్తున్నా జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దలు కనీసం కన్నెత్తి చూడ లేదు. ఓ మంత్రి చుట్టపుచూపుగా వచ్చి బాధితులను హడావిడిగా పరామర్శించి వెళ్లారే తప్ప ఇప్పటి వరకు ఆయనిచ్చిన హామీలు నెరవేరలేదు. ఏదో అరకొర సాయంగా వీఆర్‌పురం మండలానికి చెందిన ఆరు కుటుంబాలకు మాత్రమే రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. జిల్లాకు చెందిన హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రులతో పాటు ఇన్చార్జి మంత్రి, స్థానిక ఎంపీలెవరూ బాధితులను పరామర్శించక పోవడం విమర్శలకు తావిస్తోంది. కార్యరూపం దాల్చని కలెక్టర్ హామీ కాళ్లవాపునకు నాటుసారా కూడా కారణమని జిల్లా కలెక్టర్ పేర్కొనడంతో ఈ ప్రాంత గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మృతుల్లో ఇంటర్ విద్యార్థులూ ఉన్నారు. ఏజన్సీ ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పత్తాలేని నివేదిక కాళ్ల వాపు ప్రభావంతో 14 మంది గిరిజనులు మరణించినా.. ఆ వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ వ్యాధితో విలీన మండలాల నుంచి 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నారు. వైద్య నిపుణులు గ్రామాల్లో పర్యటించి రోగులు, స్థానికుల రక్త నమూనాలు, ఆహారం, నీరు తదితర నమూనాలు సేకరించారు. వ్యాధి నిర్ధారణ కోసం దిల్లీ నుంచి కేంద్ర వైద్య బృందం పర్యటిస్తుందని చెప్పినా.. ఆ దిశగా అడుగుపడలేదు. కాళ్లవాపు అనేది వైద్య పరిభాషలో లేదని కిడ్నీ సంబంధిత వ్యాధితోనే కాళ్లవాపులు వస్తున్నాయని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు రంపచోడవరంలో బ్లడ్‌బ్యాంక్, చింతూరులో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జిల్లా అధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికీ ఏర్పాటు చేయలేదు. అలాగే చింతూరు ఏరియా ఆసుపత్రిని ప్రధాన వైద్యకేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన అధికారులు అరకొర సిబ్బందిని నియమించి చేతులు దులుపుకొన్నారు. -
మన్యంపై మొద్దు నిద్ర
వరుసగా చనిపోతున్నా చలనం లేదాయె కాళ్లవాపు, పొట్టవాపు రోజుకొకటి వెలుగులోకి రోజుల పసిగుడ్డులనుంచి వృద్ధుల వరకు మృత్యువాత ఇంతవరకూ నిర్ధారణ కాని వ్యాధి నాటు సారా తాగడం వల్లనేనని ప్రకటనలు చిన్నపిల్లలు, విద్యార్థులు మృతికీ తాగుడే కారణమా? తరువాత అదీ ఓ కారణమంటూ మాట మార్పు ‘సాక్షి’ వరుస కథనాలతో కొంత కదలిక జగన్ మోహన్ రెడ్డి ఆరాతో మరింత హడావుడి సాక్షి ప్రతినిధి, కాకినాడ/వి.ఆర్.పురం/చింతూరు : మన్యంలో గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. మరణశయ్యపై ఉన్న ‘తూర్పు’ మన్యానికి భరోసా కల్పించలేక సర్కార్ చేతులెత్తేస్తోంది. గడచిన నెలన్నర రోజులుగా మన్యం వాసులను వణికిస్తున్న కాళ్లవాపు వ్యాధి అసలు ఎందుకు వస్తుందో ఇంతవరకు నిర్థారణ కాలేదు. కాకినాడ రంగరాయ, విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలకు చెందిన వైద్య బృందాలు రోగుల రక్త నమూనాలు సేకరించినా నివేదికలు మాత్రం ఇంకా రాలేదు. ఆ నివేదికలు ఎప్పుడు వస్తాయో అధికారులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. నాటుసారా తాగడంతోనే మరణాలు సంభవించాయని మొదట్లో జిల్లా కలెక్టర్ వెల్లడించినట్టు పలు పత్రికల్లో (సాక్షి కాదు) వార్తలు వచ్చాయి. మృతుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులుండటం, అందులో ఒక విద్యార్థిని కావడంతో విమర్శలు వెల్లువెత్తడంతో నాటుసారా మాత్రమే కారణం కాదని అది కూడా ఒకటై ఉంటుందని సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. వ్యాధి నియంత్రణ, వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వడంలో పాలకుల చొరవ, ప్రభుత్వ ప్రయత్నాలు విమర్శపాలవుతున్నాయి. కాళ్లవాపు వ్యాధి అదుపులోకి రాకపోగా, మలేరియా, టైపాయిడ్, విషజ్వరాలతో మృతి చెందుతున్న గిరిజనుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీలో ఇంత ఆందోళనకరమైన పరిస్థితులున్నా నామమాత్రపు చర్యలతో కాలక్షేపం చేస్తూ వ్యాధి అదుపులోకొచ్చిందని జిల్లా యంత్రాంగం చెబుతూ వస్తోంది. కాళ్లవాపు వ్యాధి వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాల్లో గ్రామాలను వణికిస్తోంది. అంతుచిక్కని ఈ వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంకా ఈ వ్యాధితో అటు విలీన మండలాల్లో, ఇటు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి పై మాటే. మన్యంలో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించి ముళ్లుకర్రతో వెంటపడడంతో తాబేలు నడకలా పరిశీలిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరా తీస్తున్న విషయం పత్రికల్లో రావడంతో గిరిజన శాఖా మంత్రి హడావుడిగా పర్యటించారు. బాబు, కామినేనిలు జిల్లాకు వచ్చినా... వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఈ నెలన్నరలో జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన వారే. కానీ కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన కుటుంబాల వైపు కన్నెత్తిచూసే తీరిక, ఓపిక వారికి లేకుండా పోయిందని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశాఖా మంత్రి కామినేని జగ్గంపేటలో పలు ప్రారంభోత్సవాలకు హాజరవడానికి తీరిక దొరికింది కానీ తమను పలకరించడానికి దొరకలేదా అని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమ కనీసం కన్నెత్తి చూడలేకపోవడాన్ని బట్టే గిరిజనులపై ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో అర్థమవుతోందంటున్నారు. ఆగని మరణాలు... కాళ్లవాపు వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృతి చెందగా, తాజాగా రాజవొమ్మంగి మండలం పూదూడి, పాకవెల్లిలో నెల వయసు పసికందులు ఇద్దరు, మారేడుమిల్లి మండలం వేటుకూరుకు చెందిన ఆరో తరగతి విద్యార్థి రాజారెడ్డి తాజాగా బుధవారం అనారోగ్యంతో మృతిచెందడం గమనార్హం.సరిగ్గా ఏడాది క్రితం వీఆర్‌పురం రాజుపేట కాలనీలో దుర్గాభవానీ అనే యువతి కాళ్లవాపు వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోగా విజయవాడలో రెండు కాళ్లు తొలగించేశారు. ఇప్పుడు ఆ యువతి కిడ్నీల వాధితో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతోంది. ఇచ్చిన లక్ష ఏ మూలకు...? కాళ్లవాపు వ్యాది మృతులకు ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చింది. అంతుచిక్కని వ్యాధి వచ్చాక స్థానికంగా వైద్యానికే లక్ష ఖర్చు అయ్యిపోయింది, ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఏమూలకూ రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త కోల్పోయి బతుకు భారమైన కుటుంబం, చేతికందొచ్చిన కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు...ఇలా ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాధలే. ఏజన్సీలో వైద్యసేవలు మెరుగు పరుస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. కొత్తగా వైద్యుల పోస్టులు భర్తీ కాకపోగా ఉన్న వైద్యులే మన్యం వీడిపోతున్నారు. మన్యంలో మరణ మృదంగంపై పాలకులు మానవతాదృక్పధంతో స్పందించి వారికి మనో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వనసీమ వణుకుతోంది..
విలీన మండలాల్లో కాళ్లవాపు కలవరం ఇప్పటికే కొందరు మృత్యువాత కాకినాడ జీజీహెచ్‌లో 43 మందికి చికిత్స నెలన్నరైనా అంతుపట్టని వ్యాధిమూలం కాకినాడ సిటీ : లేళ మందలపై విరుచుకుపడ్డ బెబ్బులిలా.. మన్యంలోని విలీన మండలాల్లో గిరిజనులను భయకంపితుల్ని చేస్తున్న కాళ్లవాపు వ్యాధిని గుర్తించి నెలన్నర దాటి నా దానికి కారణాలేమిటో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి కొందరిని పొట్టన పెట్టుకుంది. కాగా వీఆర్ పురం, చింతూరు, కూనవరం మండలాల నుంచి 43 మంది ఈ వ్యాధితో ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని జీజీహెచ్ వైద్యులు నిర్ధారించారు. వారిలో జోగయ్య, బొజ్జి, మల్లమ్మలకు వ్యాధి తీవ్రంగా ఉన్నట్టు గుర్తించి డయాలసిస్ చేస్తున్నారు. జయమ్మ అనే మహిళకు హెపో థైరాయిడ్ సమస్య ఉండటంతో ప్రత్యేకమైన వైద్యం అందిస్తున్నారు. మిగిలిన వారి రక్త నమూనాల నివేదికలు రావల్సి ఉందంటున్నారు. కాళ్ళవాపుతో జీజీహెచ్‌లో ఉన్న రోగులు ఆయాసం, బీపీ, రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ముగ్గురు నెఫ్రాలజిస్టులతో పాటు జీజీహెచ్ మెడిసిన్ విభాగం హెచ్‌వోడీలతో కూడిన వైద్యుల బృందం సేవలు అందిస్తోంది. చిల్లిగవ్వ ఇవ్వలేదు.. కాళ్లవాపు పీడితులకు అసలు వచ్చిన రోగమేమిటో ఇంతవరకూ నిర్థారణ కాకపోవడం గిరి జనులను కలవరపరుస్తోం ది. జీజీహెచ్‌లోని ఈఎన్టీ బ్లాక్‌లో 43 మందికి వైద్య సేవలందిస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఉండాలి, తమను ఇళ్లకు ఎప్పుడు పంపిస్తారని వ్యాధిగ్రస్తులు అడుగుతున్నారు. ఇంటి వద్ద తమ వారి పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. వ్యాధిగ్రస్తుల సహాయకులకూ ఆర్థిక సాయం అందిస్తామన్నా ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. కాళ్ళవాపు ప్రబలిన గ్రామాల్లో ప్రజలు తీసుకుంటున్న ఆహారం, తాగునీరు, నూనె తదితరాల నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా ఏమీ లేదని నివేదికలు వచ్చినట్టు జీజీహెచ్ వర్గాల ద్వారా తెలిసింది. అధికారులు మాత్రం పసరు మందుల వినియోగం, నాటుసారా, జీలుగు, తాటికల్లుల్లో కలిపే రసాయనాలే కారణాలు కావచ్చంటున్నారు. -
పౌష్టికాహార దినుసులు అందించాలి
కాళ్లవాపు బాధితులను పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే కాకినాడ సిటీ : కాళ్లవాపు వ్యాధి ఉన్న గిరిజనులలో ఎక్కువ మం ది రక్తహీనతతో బాధపడుతుండడం వల్ల ఆయా కుటుంబాలకు ఆరు నెలలకు సరిపడా పౌష్టికాహార దినుసులు అందించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను ఎమ్మెల్యే రాజయ్య, వీఆర్‌పురం ఎంపీపీ శరమయ్యలు పరామర్శించారు. అక్కడే రోగులను పరీక్షిస్తున్న ప్రొఫెసర్ హరి విజయకుమార్‌తో రోగుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గిరిజన సంఘం నాయకులు బొప్పన కిరణ్, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు ఉన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలి ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో సమస్య వచ్చినప్పుడు స్పందిం చడం కన్నా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను సోమవారం పరామర్శించారు. ఆయ న మాట్లాడుతూ ముంపు మండలాల్లో కనీసం 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుచేసి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి మందులు, పరీక్షల సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. రవికుమార్‌తో పాటు జేవీవీ సీనియర్ నాయకులు మోకా సుబ్బారావు పాల్గొన్నారు.