Lionel Messi
-
తిరుగులేని అర్జెంటీనా
జ్యూరిక్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు వరుసగా రెండో ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు 1867.25 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ టైటిల్ సాధించింది.ఇక ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ రెండో స్థానంలో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి. గత నవంబర్‌లో విడుదల చేసిన ర్యాంకింగ్స్ నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లు జరగడంతో ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవు.ఇందులో ఇంగ్లండ్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, జర్మనీ వరుసగా నాలుగు నుంచి 10వ ర్యాంక్ వరకు కొనసాగుతున్నాయి.ఈ ఏడాది అన్ని జట్లకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అంగోలా జట్టు 32 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంక్‌లో నిలిచింది. భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 126వ ర్యాంక్‌లో ఉంది. తదుపరి ర్యాంకింగ్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారు. -
కేరళకు రానున్న మెస్సీ బృందం
తిరువనంతపురం: అంతా అనుకున్నట్లు జరిగితే... భారత క్రీడాభిమానులు, కేరళ ఫుట్‌బాల్ ప్రేమికులు ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆటగాళ్ల విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తారు. రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు... స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళకు రానుందని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ బుధవారం ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని... వేదికతో పాటు, ప్రత్యర్థి జట్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే ఖతర్, జపాన్ జట్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉందని ఆయన వివరించారు. ‘ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో కూడిన ప్రపంచ నంబర్‌వన్ ఫుట్‌బాల్ జట్టు అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుంది. ఆ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీనిపై అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంతో కలిసి త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం’ అని రహమాన్ పేర్కొన్నారు. ఇటీవల స్పెయిన్ పర్యటన సందర్భంగా అర్జెంటీనా జాతీయ జట్టును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. దీనికి ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వచ్చిందని... త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. అయితే తమ షెడ్యూల్ ప్రకారం అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘమే భారత పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందని పేర్కొన్నారు. అర్జెంటీనా ఆడనున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 50 వేల మంది అభిమానులు చూసేలా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు కేరళ ప్రభుత్వానికి ఉన్నాయని రహమాన్ పేర్కొన్నారు. రెండు మ్యాచ్‌ల నిర్వహణకు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని స్పాన్సర్ల ద్వారా సమకూరుస్తామని ఆయన తెలిపారు. -
WC Qualifiers: కొలంబియా సంచలనం.. అర్జెంటీనాకు షాక్
బొగోటా (కొలంబియా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టుకు 2026 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో షాక్ తగిలింది. 2022లో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా... దక్షిణ అమెరికా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో కొలంబియా చేతిలో ఓడింది. బుధవారం జరిగిన పోరులో కొలంబియా 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై గెలిచింది. కొలంబియా తరఫున యెర్సన్ మస్క్యూరా (25వ నిమిషంలో), జేమ్స్ రోడ్రిగ్జ్ (60వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున నికోలస్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ మెస్సీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ అర్హత టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి అర్జెంటీనా 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోరీ్నలో తొలి 6 స్థానాల్లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ నకు అర్హత సాధించనున్నాయి. -
మెస్సీ, రొనాల్డో లేకుండానే.. ‘బాలన్ డోర్’ అవార్డు నామినేషన్లు
పారిస్: దిగ్గజాలు లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) లేకుండానే ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక పురస్కారంగా భావించే ‘బాలన్ డోర్’ 2024 అవార్డీల నామినీల జాబితా తయారైంది. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్లేయర్లకు ప్రతి ఏటా అందించే ఈ అవార్డును ఇప్పటి వరకు 37 ఏళ్ల మెస్సీ 8 సార్లు అందుకోగా... రొనాల్డో ఐదుసార్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 28న ‘బాలన్ డోర్’ అవార్డులను ప్రదానం చేయనుండగా... దీని కోసం కుదించిన 30 మంది ప్లేయర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో మెస్సీ, రొనాల్డోకు చోటు దక్కలేదు. ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబాపె, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్, స్పెయిన్ యువ స్ట్రయికర్ లామినె తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మెస్సీ, రొనాల్డో రేసులో లేకపోవడం 2003 తర్వాత ఇదే తొలిసారి. 2006లో మొదటిసారి ‘బాలన్ డోర్’ పురస్కారానికి నామినేట్ అయిన మెస్సీ... 2009లో తొలి అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు 2004లో మొదటిసారి నామినేట్ అయిన రొనాల్డో... ఐదుసార్లు అవార్డు అందుకున్నాడు. కాగా యూరోపియన్ లీగ్‌ల్లో ప్రదర్శన ఆధారంగానే ఈ పురస్కారాన్ని అందించడం ఆనవాయితీ. ప్రస్తుతం మెస్సీ అమెరికా లీగ్‌లలో... రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్–నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే వీరిద్దరిని బాలన్ డోర్ అవార్డుకు నామినేట్ చేయలేదు. -
మెస్సీ లేకుండానే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ బరిలో ఆర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది. అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి. -
కోపా కప్ విజేతగా అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ వరల్డ్ రికార్డు
కోపా అమెరికా కప్-2024 ఛాంపియన్స్‌గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో 1-0 తేడాతో కొలంబియాను ఓడించిన అర్జెంటీనా వరుసగా రెండో సారి కోపా అమెరికా కప్ విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో సంచలన గోల్‌తో అర్జెంటీనాను ఛాంపియన్స్‌గా నిలిపాడు. కాగా ఇది అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి వరుసగా మూడో అంతర్జాతీయ ట్రోఫీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా మెస్సీకి తన కెరీర్లో ఇది 45వ ట్రోఫీ. ఈ క్రమంలో మెస్సీ ఓ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం డాని అల్వెస్(44) పేరిట ఉండేది. తాజా విజయంతో అల్వెస్ ఆల్‌టైమ్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. మెస్సీ కెరీర్లో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్, రెండు కోపా అమెరికా టైటిల్స్, ఫైనలిసిమా ట్రోఫీ, 39 క్లబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం బార్సిలోనా క్లబ్ నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కాగా మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గాయపడ్డాడు.దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి మెస్సీ వైదొలిగాడు. ఈ క్రమంలో డగౌట్లో మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీ మైదానంలో లేనప్పటకి తన సహచరులు మాత్రం అద్భుత విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 🇦🇷 Lionel Messi, most decorated player with 45 titles including one more Copa América from tonight! ✨ pic.twitter.com/SXwpgGBesh— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 -
కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్
కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్ ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు ఆదనపు సమయం కేటాయించారు. ఎక్స్ట్రా సమయం కూడా ముగుస్తుండడంతో ఈ మ్యాచ్ పెనాల్టీ షుట్ అవుట్‌కు దారి తీస్తుందని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో అర్జెంటీనా సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ అద్భుతం చేశాడు. 112వ నిమిషంలో గోల్ కొట్టిన మార్టినెజ్.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిగిలిన 8 నిమిషాల్లో కొలంబియా గోల్ సాధించకపోవడంతో అర్జెంటీనా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.🏆🇦🇷 ARGENTINA ARE COPA AMÉRICA CHAMPIONS!Argentina have beaten Colombia 1-0 thanks to Lautaro Martínez’s goal.🏆 Copa America 2021🏆 Finalissima 2022🏆 World Cup 2022🏆 Copa America 2024Insane job by this group of players and Lionel Scaloni. 👏🏻✨ pic.twitter.com/v0GOvHv9PS— Fabrizio Romano (@FabrizioRomano) July 15, 2024 కాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా కప్ కావడం గమనార్హం. దీంతో అతడికి తన సహచరులు అద్భుతమైన విజయంతో విడ్కోలు పలికారు. ఈ మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇప్ప్పుడు తన జట్టు విజయం సాధించడంతో మెస్సీఆనందంలో మునిగి తేలుతున్నాడు. Angel di Maria unsung hero of the match Played his last game in Argentina hersey what a player #ARGvsCOL pic.twitter.com/hnu42h3ekZ— Harshit 🇮🇳 (@krharshit771) July 15, 2024 -
#Lionel Messi: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ.. వీడియో వైరల్
Update: కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్ 36వ నిమిషంలో మెస్సీ చీలమండ(పాదం)కు గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానంలో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. కొంచెం కూడా ఉపశమనం లభించలేదు. అయినప్పటకి మెస్సీ మైదానాన్ని వీడకుండా తన ఆటను కొనసాగించాడు. మ్యాచ్ హాఫ్-టైమ్ తర్వాత కూడా స్కోర్లేకుండా పోవడంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన కంటిన్యూ చేశాడు. అయితే నొప్పి మరింత తీవ్రం కావడంతో మ్యాచ్ 66వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో డగౌట్లో కూర్చోన్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న ఈ అర్జెంటీనా స్టార్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. మెస్సీ, మెస్సీ అంటూ జేజేలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి.ప్రస్తుతం 25 నిమిషాలు ఎక్స్ట్రా సమయం కేటాయించారు. అదనపు సమయంలో 15 నిమిషాలు ముగిసినప్పటకి ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యా. ఆఖరి 10 నిమిషాల్లో గోల్స్ రాకపోతే ఈ మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూట్ అవుట్లో తేల్చే అవకాశముంది. Messi is in tears as he is subbed off due to injury 💔 pic.twitter.com/t0l3OLLuWf— FOX Soccer (@FOXSoccer) July 15, 2024 -
COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్‌లో కెనడాపై విజయం
కోపా అమెరికా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు.. కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ద భాగం 23వ నిమిషంలో అల్వరెజ్.. రెండో అర్ద భాగం 51వ నిమిషంలో మెస్సీ గోల్స్ సాధించారు. రేపు జరుగబోయే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 15న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
క్రేజ్ కా బాప్.. లియోనెల్ మెస్సీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కీలక ప్రకటన
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్‌తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను. దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్‌తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.రొనాల్డో, మెస్సీ తర్వాత..1984, ఆగష్టు 3న సికింద్రాబాద్‌లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు.ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు.మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఫుట్‌బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం. అందుకున్న పురస్కారాలు👉అర్జున అవార్డు👉పద్మశ్రీ👉ఖేల్‌రత్న👉ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు👉శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీచదవండి: Sunil Chhetri Life Story In Telugu: సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రీ.. కుటుంబ నేపథ్యం ఇదే! కెప్టెన్ ఫెంటాస్టిక్‌గా ఘనతలు -
Ronaldo Jr: మెస్సీ అంటే ఇష్టం! బాగానే ఉన్నావా.. ముద్దిచ్చి మరీ!
క్రిస్టియానో రొనాల్డో.. పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్న మేటి ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి గోల్స్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డులు. ఎన్నో చాంపియన్ లీగ్ మెడల్స్! మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఫుట్‌బాలర్..అయితే, ఒక్కసారైనా ప్రపంచకప్ గెలవాలన్న రొనాల్డో కల మాత్రం నెరవేరలేదు. సమకాలీకుడు, తనకు పోటీగా ఉన్న ఏకైక ఆటగాడు, అర్జెంటీనా లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడుతుంటే చూస్తూ భావోద్వేగానికి గురికావడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడీ పోర్చుగల్ స్టార్. ఒకరకంగా మెస్సీతో జరిగిన పోటాపోటీలో తాను ఓడిపోయాననే బాధతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆట పరంగా రొనాల్డో, మెస్సీల మధ్య స్నేహపూర్వక శత్రుత్వం ఉన్నా.. బయట మాత్రం వారిద్దరు గుడ్ ఫ్రెండ్స్! బాలన్ డి ఓర్ అవార్డు-2017 ఫంక్షన్ సందర్భంగా రొనాల్డో తల్లి డొలోర్స్ అవెరో ఈ విషయాన్ని వెల్లడించారు. మెస్సీ ఉన్నత వ్యక్తిత్వం కలవాడని పేర్కొంటూ.. తన మనవడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌కు తండ్రి ఆట కంటే మెస్సీ ఆట అంటేనే ఎక్కువ ఇష్టం అని తెలిపారు. అందుకు తగ్గట్లుగానే జూనియర్ రొనాల్డో ఆ వేదికపై మెస్సీని చూడగానే ఆనందంతో పొంగిపోయాడు. అయితే, అక్కడున్నది నిజంగా మెస్సీ కాదనే భావనలో ఉన్న జూనియర్ తన తండ్రి చెప్పినా ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. రొనాల్డో తన కుమారుడికి మెస్సీని చూపిస్తూ.. ‘‘అక్కడున్నది ఎవరు? అక్కడ సూట్ వేసుకుని నిల్చుని ఉన్న వ్యక్తి ఎవరు?’’ అని ప్రశ్నించాడు. అంతలోనే మెస్సీ వచ్చి జూనియర్ రొనాల్డోను హగ్ చేసుకుని.. ముద్దు కూడా పెట్టి.. ‘‘నువ్వ బాగానే ఉన్నావు కదా?’’ అని ఆప్యాయంగా పలకరించాడు. When Cristiano Jr. meets Lionel Messi. pic.twitter.com/ydixmN2SyK — Historic Vids (@historyinmemes) March 3, 2024 తాను చూస్తున్నది నిజమని అప్పటికీ నమ్మలేకపోయిన జూనియర్ రొనాల్డోను తండ్రి మళ్లీ దగ్గరకు తీసుకోగా.. మెస్సీ సైతం చిరునవ్వులు చిందించాడు. ఈ ఘటన జరిగినపుడు జూనియర్ రొనాల్డోకు సుమారుగా ఆరేళ్ల వయసు ఉంటుంది. ఇక తండ్రిని కాదని.. మెస్సీనే తన రోల్‌మోడల్ అని చెప్పిన ఆ పిల్లాడు ఇప్పుడు ఓ జట్టును చాంపియన్‌గా నిలిపే స్థాయికి చేరాడు. అండర్ 13 లీగ్ ట్రోఫీలో అల్ నసర్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీని ముద్దాడాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో- మెస్సీ అనుబంధం... జూనియర్ రొనాల్డో టైటిల్ విన్నింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన క్షణాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి! View this post on Instagram A post shared by 433 (@433) -
మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకర ప్రవర్తన.. రొనాల్డోపై నిషేధం
స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఇతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. వివరాల్లోకి వెళితే.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ అయిన రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అయిన అల్ నస్ర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్థానికంగా జరిగే ప్రో లీగ్‌లో భాగంగా అల్ నస్ర్.. రియాద్ క్లబ్ అయిన అల్ షబాబ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో.. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨 تصرف كارثي جديد من كريستيانو رونالدو ضد جمهور الشباب بعد نهاية اللقاء! 😳😳😳😳😳 pic.twitter.com/Tzt632I20p — نواف الآسيوي 🇸🇦 (@football_ll55) February 25, 2024 మెస్సీ అభిమానులను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన సంజ్ఞలు చేశాడు. రొనాల్డో ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న లీగ్ నిర్వహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే జరిమానా కింద 20000 సౌదీ రియాల్స్ కట్టాల్సిందిగా ఆదేశించారు. రొనాల్డో వికృత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఉదంతంపై రొనాల్డో తాజాగా స్పందించాడు. యూరప్ దేశాల్లో ఇది కామనేనని సమర్ధించుకున్నాడు. కాగా, అల్ నస్ర్ క్లబ్ రెండున్నర సంవత్సరాల కాలానికి గాను రొనాల్డోతో రూ. 4400 కోట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. -
మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్
ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్‌ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్ జరిగింది. రియాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్ మయామీ (అమెరికా), అల్ నస్ర్ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రొనాల్డో జట్టు అల్ నస్ర్.. మెస్సీ జట్టు ఇంటర్ మయామీపై 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. Messi at full time pic.twitter.com/zvsmiuJqir — Messi Media (@LeoMessiMedia) February 1, 2024 The reaction of Ronaldo and Messi after Al Nassr third goal. https://t.co/DAhcNfTd7Z — CristianoXtra (@CristianoXtra_) February 1, 2024 గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు. Puskas award 🏅 Goal of the year already🎖️ "Aymeric Laporte " 👑#InterMiami #AlNassr#Ronaldo #Messi #Goal pic.twitter.com/XFW1DJwd5p — Mehran Sofi (@sadistic3232) February 1, 2024 రొనాల్డో స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్ ఆడకపోయినా ఈ మ్యాచ్‌ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ ఆటగాడు, బ్రెజిల్‌కు చెందిన టలిస్క హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. టెల్లెస్, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్ కొట్టారు. Turki Sheikh reminding Lionel Messi his team is losing 6-0 to Cristiano Ronaldo's Al-Nassr. Unbelievable reaction 🤯🤯🤯 #AlNassrvsInterMiamiCF pic.twitter.com/Zy3lw33piq — Farid Khan (@_FaridKhan) February 2, 2024 -
‘ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్‌గా మెస్సీ.. రికార్డు స్థాయిలో మూడోసారి
అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్’గా నిలిచాడు. మెస్సీకి నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు 48 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినప్పటికీ కెప్టెన్ల ప్యానెల్ నుంచి ఎర్లింగ్ కంటే మెస్సీకే ఎక్కువ ఓట్లు రావడంతో ‘ఫిఫా’ మెస్సీనే ఎంపిక చేసింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో మూడోసారి (2019, 2022, 2023) గెలుచుకున్నాడు. మెస్సీ గతేడాది బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మెస్సీ ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అనంతరం మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. రొనాల్డో 2023 ఫిఫా అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో లేకపోవడం విశేషం. కాగా, లీగ్‌లతో బిజీగా ఉండటంతో మెస్సీ అవార్డు ప్రధానోత్సవ వేడుకకు హాజరుకాలేదు. -
మెస్సీని ఓడించి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కోహ్లి
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కైవసం చేసుకున్నాడు. ప్యూబిటీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఇన్స్టాగ్రామ్ పేజీలలో (35 మిలియన్ల ఫాలోవర్స్) ఒకటి. ఈ అవార్డు కోసం హోరాహోరీగా సాగిన పోరులో కోహ్లి.. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని 78-22 శాతం ఓట్లతో ఓడించాడు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కోహ్లి క్రేజ్ ముందు అతను నిలబడలేకపోయాడు. It's Kohli vs Messi in the final voting for the "Athlete of the year" award in one of the biggest sports pages on Instagram - Pubity Sport. pic.twitter.com/gcyLSPbywA — Johns. (@CricCrazyJohns) December 30, 2023 ప్రపంచం మొత్తం మెస్సీ మేనియా నడుస్తున్నప్పటికీ క్రికెట్ అభిమానులు మాత్రం ఏకపక్షంగా కోహ్లికి ఓట్లు వేసి గెలిపించారు. ఈ అవార్డు కోసం కోహ్లి, మెస్సీతో పాటు నోవాక్ జకోవిచ్, పాట్ కమిన్స్, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్రిస్టియానో రొనాల్డో, మాక్స్ వెర్స్టాపెన్, మైఖేల్ జోర్డాన్ తదితరులు పోటీపడ్డారు. కాగా, 2023లో వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల మధ్య ఈ పోటీని నిర్వహించగా.. ఫైనల్ రౌండ్ పోరు కోహ్లి, మెస్సీ మధ్య సాగింది. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించి పలు ప్రపంచ రికార్డులు కొల్లగొట్టగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించడంతో పాటు తన జట్టుకు పలు అపురూపమైన విజయాలు అందించాడు. -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, కోహ్లి
క్రీడారంగానికి సంబంధించిన ఓ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఇద్దరు దిగ్గజాలు పోటీపడుతున్నారు. ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం క్రికెట్ GOAT విరాట్ కోహ్లి.. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీతో అమీతుమీకి సిద్దమయ్యాడు. ఈ అవార్డు కోసం కోహ్లి-మెస్సీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఇద్దరూ ఈ ఏడాది తమతమ క్రీడా విభాగాల్లో అత్యుత్తమంగా రాణించి అవార్డు రేసులో నిలిచారు. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించాడు. Virat Kohli Vs Lionel Messi Final for 'Pubity Athlete of the Year' award. pic.twitter.com/w4zm4MJmt3— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2023 ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం కోహ్లీ, మెస్సీతో పాటు వివిధ క్రీడలకు చెందిన వందల మంది స్టార్ క్రీడాకారులు పోటీ పడగా.. చివరిగా రేసులో ఈ ఇద్దరే మిగిలారు. మెస్సీ, కోహ్లితో పాటు ఈ అవార్డు కోసం మరో దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో, బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ, బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ పోటీపడ్డారు. త్వరలో మెస్సీ, కోహ్లిలలో ఒకరిని ఓటింగ్ ద్వారా విజేతగా ప్రకటిస్తారు. -
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్‌బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్‌తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
Lionel Mess: ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ నెగ్గిన మెస్సీ.. (ఫొటోలు)
-
రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ
దిగ్గజ ఫుట్‌బాలర్, ఇంటర్ మయామీ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ (36) మరోసారి ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. 2023 సంవత్సరానికి గాను మెస్సీని ఈ అవార్డు వరించింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయి ఎనిమిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (5) దక్కించుకున్నాడు. The moment when 🐐 was announced as the #BallonDor winner. - Lionel Messi, the icon!pic.twitter.com/QNZOmBgeMe — Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023 2009లో తొలిసారి బాలన్ డి'ఓర్ సొంతం చేసుకున్న లియో.. 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 సంవత్సరాల్లో ఈ అవార్డును చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ కోసం నార్వే ఆటగాడు, మాంచెస్టర్ సిటీ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ మెస్సీతో పోటీపడ్డాడు. అయినా అవార్డు దిగ్గజ ఫుట్బాలర్నే వరించింది. పారిస్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మరో దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ మెస్సీకి అవార్డు అందించాడు. కాగా, లియో గతేడాది అర్జెంటీనాకు వరల్డ్‌కప్ అందించిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఎయిటనా బొన్మాటి.. మహిళల విభాగంలో బాలన్ డి'ఓర్ అవార్డును స్పెయిన్ ఫుట్‌బాలర్, బార్సిలోనా సెంట్రల్ మిడ్ ఫీల్డర్ ఎయిటనా బొన్మాటి దక్కించుకుంది. ఎయిటనా ఈ అవార్డుకు తొలిసారి ఎంపికైంది. ఎయిటనా 2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యురాలు. -
కొనసాగుతున్న మెస్సీ మేనియా.. కళ్లు చెదిరే గోల్ చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం
పీఎస్జీని వీడి డేవిడ్ బెక్‌హమ్ ఇంటర్ మయామీ క్లబ్లో చేరిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. ఈ అమెరికన్ క్లబ్ తరఫున తన గోల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు. లీగ్స్ కప్‌లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఓ కళ్లు చెదిరే గోల్‌తో మెరిశాడు. What can't he do?! 🐐 Make it NINE goals in six games for Leo Messi. pic.twitter.com/HLf3zBFTmV — Major League Soccer (@MLS) August 15, 2023 మ్యాచ్ 20వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట 36 గజాల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్‌లో మయామీ ఆటగాళ్లు మార్టినెజ్, జోర్డీ అల్బా, డేవిడ్ రూయిజ్ కూడా గోల్స్ చేసినప్పటికీ.. మెస్సీ చేసిన గోలే మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కెరీర్లో ఇది సెకండ్ లాంగెస్ట్ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో మెస్సీ ఇంటర్ మియామీ తరఫున తన గోల్స్ సంఖ్యను 9కి పెంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మెస్సీ, మార్టినెజ్, జోర్డీ, రూయిజ్ గోల్స్ చేయడంతో మయామీ.. ఫిలడెల్ఫియాపై 4-1 గోల్స్ తేడాతో గెలుపొంది, లీగ్స్ కప్ ఫైనల్స్‌కు చేరింది. ఫిలడెల్ఫియా తరఫున అలెజాండ్రో బెడోయా ఏకైక గోల్ చేశాడు. కాగా, మెస్సీ ఇంటర్ మయామీ తరఫున బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ చేశాడు. మాయమీ తరఫున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ మొత్తం 9 గోల్స్ చేశాడు. తద్వారా మయామీ తరఫున ఆరు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. మెస్సీకి ముందు గొంజాలో హిగ్వేన్ (29), లియోనార్డో కంపానా (16) ఉన్నారు. -
కోహ్లి రేంజ్ వేరు.. ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు! ఇక రొనాల్డో, మెస్సీ..
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.. ఆటలోనే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ రేంజ్ ఆదాయం అందరు సెలబ్రిటీల మాదిరే.. ఫ్యాన్స్‌తో అనుసంధానమయ్యేందుకు వీలుగా కింగ్.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నాడు. మరి మిగతా వాళ్లకంటే వందల రెట్లలో ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లికి ఈ మీడియాల ద్వారా కూడా వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్లో ఉంది. వ్యక్తిగత పోస్టులతో పాటు వ్యక్తిగత అప్డేట్లతో అభిమానులను అలరించే ఈ స్టార్ బ్యాటర్‌కు యాడ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు సమకూరుతున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే! రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో అతడు షేర్ చేసే ఒక్కో పోస్టుకు పదకొండున్నర కోట్ల మేర ఆదాయం లభిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజంగా షాకింగ్‌గా ఉంది ఈ విషయం గురించి హోపర్ హెచ్‌క్యూ కో- ఫౌండర్ మైక్ బండార్ మాట్లాడుతూ.. ‘‘ఏడాదికేడాది ఈ రేంజ్లో ఒక్కో పోస్టుకు ఆదాయం పెరుగుతూ ఉండటం షాకింగ్‌గా ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్స్ మిగతా వాళ్లకు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. రొనాల్డో, మెస్సీలు మాత్రమే కాదు.. సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసేందుకు సోషల్ మీడియా ఉపయోపడటం విశేషం’’అని పేర్కొన్నారు. ఇక రొనాల్డో, మెస్సీ కాగా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా ద్వారా ఒక పోస్టుకు అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో కోహ్లి 20వ స్థానం(ఇండియాలో నంబర్ 1)లో ఉన్నాడు. ఇక ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ వరుసగా ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు, 21.49 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ టాప్-2లో కొనసాగుతున్నారు. చదవండి: అయ్యో.. అంబటి రాయుడులాగే అతడి కెరీర్ కూడా అర్ధంతరంగానే! తిరిగి వస్తే అంతే! -
ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇంటర్ మియామి క్లబ్లో మంచి ముహూర్తంలో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పటివరకు ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్‌తో మెరిశాడు. అందులో రెండు మ్యాచ్‌ల్లో డబుల్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఓర్లాండో సిటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి 3-1తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ 95 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆలస్యమైనప్పటికి మెస్సీ మాత్రం గోల్ కొట్టడంలో పెద్దగా టైం తీసుకోలేదు. ఆట 7వ నిమిషంలోనే మెస్సీ తన జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే ఓర్లాండో సిటీ ఆట 11వ నిమిషంలో గోల్ కొట్టి సోర్కును సమం చేసింది. అక్కడి నుంచి తొలి హాఫ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో హాఫ్ మొదలైన కాసేపటికి ఆట 51వ నిమిషంలో జోసెఫ్ మార్టినేజ్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఇక ఆట 72వ నిమిషంలో మెస్సీ మరో గోల్ కొట్టి జట్టును 3-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఓర్లాండో మరో గోల్ కొట్టలేకపోవడంతో ఇంటర్ మియామి విజయాన్ని నమోదు చేసింది. కాగా మెస్సీ రెండు గోల్స్ కొట్టిన సందర్భంలో మ్యాచ్‌కు హాజరైన అతని భార్య ఆంటోనెలా రోకుజో స్టాండ్స్‌లో సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది. జెర్సీ అమ్మకాల్లో దిగ్గజాలను అధిగమించిన మెస్సీ.. కాగా మెస్సీ మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గోల్స్‌తో రికార్డులు కొట్టడమే కాదు తాజాగా మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు. 24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్‌లను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్ఏ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. MESSI X ROBERT TAYLOR BANGERS ONLY 🤯🤯 Taylor puts Messi in with the chip to give us the early lead over Orlando City.#MIAvORL | 📺#MLSSeasonPass on @AppleTV pic.twitter.com/kvb8Lmcccj — Inter Miami CF (@InterMiamiCF) August 3, 2023 చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ -
'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో ఆర్సీబీకి పదేళ్ల పాటు కలిసి ఆడారు. ఆర్సీబీ టైటిల్ కొట్టడంలో విఫలమైనప్పటికి ఈ జోడి మాత్రం తమ ఆటతో అభిమానులను అలరించారు. డివిలియర్స్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆర్సీబీని మాత్రం వదల్లేదు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతీసారి ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక సందేశాన్ని విడుదల చేయడం మిస్టర్ 360కి అలవాటు. పదేళ్ల పాటు ఒకే జట్టుకు కలిసి ఆడిన కోహ్లి, డివిలియర్స్‌లు మంచి మిత్రులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో(కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్) సెంచరీతో మెరిసిన కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకడని అతను అన్నాడు. గెలవాలనే కసి.. ప్రతిసారి స్కోర్ చేయాలనే ఆకలి గొప్ప ఆటగాళ్లలో కనిపించే లక్షణాలని.. అవన్నీ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయని డివిలియర్స్ తెలిపాడు. ''గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, ఫుట్‌బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్.. వీళ్లంతా గెలవాలనే కసితో ఆడతారు. వీళ్లలో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్రతిసారి చాంపియన్ అవ్వాలనుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా అచ్చం వీళ్లలానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు అతడి హృదయం చాలా అందమైనది'' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. పదేళ్లు ఒకే జట్టుకు మిస్టర్ 360 క్రికెటర్‌గా డివిలియర్స్ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. చదవండి: ICC T20 WC 2024: టి20 ప్రపంచకప్ 2024కు పపువా న్యూ గినియా అర్హత Kuldeep Yadav: సంచలన స్పెల్! కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్ యాదవ్ కామెంట్స్ వైరల్