mumbai police
-
32 ఏళ్ల మహిళతో అసభ్య ప్రవర్తన.. నటుడిపై లైంగిక వేధింపుల కేసు!
బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ శరద్‌పై 32 ఏళ్ల మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించాలంటూ తన ఆఫీస్‌కి ఆహ్వానించి.. అసభ్యకరంగా తాకాడని, లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మహిళా ఫిర్యాదుతో ముంబై పోలీసులు శరద్ కపూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. రీల్స్ గురించి చర్చించాలంటూ నవంబర్ 26న సదరు మహిళను శరద్ తన ఆఫీస్‌కి ఆహ్వానించాడు. ఆమె ఆఫీస్‌కి వెళ్లగానే అక్కడి సిబ్బంది శరద్ కపూర్ గదికి వెళ్లమని చెప్పారు. ఆమె అతని దగ్గరకు వెళ్లగానే బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడ నుంచి పారిపోయిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై శరద్ కపూర్ ఇంతవరకు స్పందించలేదు.శరద్ కపూర్ 1995 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. తన కెరీర్లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించాడు. షారుక్ ఖాన్ ‘జోష్’, హృతిక్ రోషన్ ‘లక్ష’ సినిమాలో శరద్ పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. -
ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
ముంబై: ఈ మధ్యకాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, స్కూల్స్, ఎయిర్‌పోర్టులు, మాల్స్ లక్ష్యంగా ప్రతిచోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే బెదిరింపులు వచ్చాయి. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలినింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న అంబోలీ పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో ఏం కేసులు లేవని, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. -
ముంబైలో అలర్ట్.. 53 మంది రౌడీషీటర్ల నగర బహిష్కరణ
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్సీఎఫ్ నగర్, తిలక్‌నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్నార్, మాన్‌ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్‌కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.రూ. 14.5 కోట్ల బంగారం సీజ్ నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాగపూర్‌లో శనివారం పోల్ అధికారులు రూ.14.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్థ ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని రవాణా చేస్తుండగా ఫ్లయింగ్ నిఘా బృందానికి పట్టుబడిందని ఓ అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేందుకు సీక్వెల్ లాజిస్టిక్స్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. స్వాదీనం చేసుకున్న బంగారాన్ని అంబజారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోంద’ని ఆ అధికారి పేర్కొన్నారు. -
షారుఖ్‌కి చంపేస్తామని బెదిరింపు కాల్.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్‌ని చంపేస్తానని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుడు రాయఫూర్కి చెందిన ఫైజల్ ఖాన్‌గా తేలింది. మంగళవారం ఛతీస్గడ్కి వెళ్లిన పోలీసులు..అక్కడ ఫైజల్‌ని అదుపులోకి తీసుకున్నారు.నా పేరు హిందుస్తానీడబ్బుల కోసం నిందుతుడు ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డబ్బు కావాలని ఇలాంటి బ్లాక్ మెయిల్ కాల్స్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘నవంబర్ 7న ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి ‘షారుఖ్ ఖాన్ నాకు రూ.50 ఇవ్వకపోతే చంపేస్తా అని ఓ వ్యక్తి చెప్పారు. మీ పేరు ఏంటని అడిగితే.. ‘అది అనవసరం. మీకు నా పేరే ముఖ్యమని అనిపిస్తే.. ‘హిందుస్తాని’ అని రాసుకోండి’అని చెప్పి కాల్ కట్ చేశాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.బిగ్ ట్విస్ట్షారుఖ్ని చంపేస్తామని కాల్ రావడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ గురించి ఆరా తీయగా అది ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఓ బృందం ఛత్తీస్‌గఢ్‌కి వెళ్లి నిందితుడుని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మాత్రం ఆ కాల్ చేసింది తాను కాదని చెబుతున్నాడు. \తన ఫోన్ ఎవరో దొంగిలించారని.. దీనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాయ్ పూర్ ఎస్పీ అజయ్ కుమార్ కూడా దృవీకరించారు. ‘నవంబర్ 2న ఫైజన్ ఖాన్ పోలీసు స్టేషన్‌కి వచ్చిన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. ముంబై పోలీసులకు కూడా విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్ కూడా ముంబై పోలీసులకు అందించాడు’అని రాయ్‌పూర్ ఎస్పీ మీడియాకు తెలిపారు.షారుఖ్‌కి భద్రత పెంపుషారుక్కి గతేడాదిలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుక్‌కి Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ షారుఖ్‌కి వై ప్లస్(Y+) సెక్యూరిటీనే కొనసాగుతుంది. కాగా, బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి కూడా వరుసగా ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. సల్మాన్‌ని చంపేస్తామని గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేస్తునే ఉంది. దీంతో సల్మాన్‌కి కూడా భద్రతను పెంచారు. ఇలా స్టార్ హీరోలందరికి బెదింపు కాల్స్ రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్‌తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
టార్గెట్ సల్మాన్ ఖాన్.. విస్తుపోయే విషయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. వారిని ముంబై పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నిందితుల్లో ఒకరైన అనూజ్ థాపన్ కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా సల్మాన్‌పై నిఘా పెట్టింది. ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సల్మాన్ ఎక్కడెక్కడ ఉంటాడో నిత్యం ఆయన కదలికలపై నిఘా పెట్టింది.కారుపై కాల్పులు జరిపేందుకు స్కెచ్సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సమయం నుంచి ముంబై పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. కేసులో దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమయ్యే ఏకే-47 తుపాకులను పాకిస్థాన్‌కు చెందిన ఒక గ్యాంగ్ నుంచి వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారట. వాటితో పాటు ఏకే-92, అధునాతనమైన ఆయుధాలను తెప్పించుకున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరపాలని స్కెచ్ వేశారట. ఒకవేళ ఆ అవకాశం కుదరకపోతే ఆయన ఉంటున్న ఫామ్హోస్లోకి చొచ్చుకుపోయి కాల్పులు జరపాలని బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ రచించిందట.కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాజాగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు ఆయన సోదరుడు అన్మోల్, గోల్డీబ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్‌కు చెందిన సుమారు 20 మంది పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఫామ్హోస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఆయనపై దాడి చేసే ప్లాన్స్ వారు వేశారు కూడా.. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. కృష్ణజింకలను వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. -
కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి సమాచారం అందినట్లు వెళ్లడించారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోపు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్ రీచ్ అవుతాం.' అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలుమార్లు వచ్చాయి. గతంలో ఈమెయిల్స్ ద్వారా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో గొడవేంటి..? ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్ ఢిల్లీ జైలులో ఉన్నాడు. दाउद इब्राहीम और छोटा शकील के नाम के हमने दो कुत्ते पाल रखे हैं - अनमोल विश्नोई (लॉरेंस के भाई का पोस्ट)#LawrenceBishnoi #DawoodIbrahim #SalmanKhan #AnmolBishnoi #ChotaShakeel #BJPManifesto pic.twitter.com/oj2sTHRlK8 — Nisha A (Modi's family) (@matribhumi1st) April 14, 2024 -
ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. #WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning. Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J — ANI (@ANI) April 14, 2024 -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
Bollywood Celebrities In Umang 2023: ఉమాంగ్ ముంబై పోలీస్ షోలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నా మనశ్శాంతి పోయింది పోలీసులే వెతకాలి
‘నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికి తేవాలి. స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేస్తా’ అని ఒక ముంబై మహిళ సరదాగా పెట్టిన ‘ఎక్స్’ పోస్టుకు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పారు. అది కాస్తా వైరల్ అయ్యి పోలీసులను మెచ్చుకున్నవారూ... మీ పంచ్‌లు తర్వాత... ముందు మా కేసులు చూడండి అని మొత్తుకున్నవారూ ఉన్నారు. ఈ సరదా ఉదంతం ఎట్టిదనిన... ‘పోలీస్ స్టేషన్ జా రహీ హూ... సుకున్ ఖోగయాహై మేరా’ (నా మనశ్శాంతి పోయింది... వెతికి పెట్టమని కోరేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నా) అంటూ అక్టోబర్ 31న వేదిక ఆర్య అనే మహిళ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టింది. మనశ్శాంతిగా లేను అని చెప్పడానికి ఆమె చేసిన సరదా ప్రయోగం అది. ముంబై పోలీసులు ఆమెకు సరదాగా సినిమా భాషలో సమాధానం చెప్పారు. వారు హిందీ సినిమాల పేర్లతో చెప్పినా... తెలుగు సినిమాలకు అన్వయిస్తే ఆ సమాధానం ఇలా ఉండొచ్చు... ‘మన మనసు ‘శాంతి నివాసం’లా ఉండాలని ప్రతి ఒక్కరూ ‘ఆశ ఆశ ఆశ’ పడతారు. ‘అన్వేషణ’ సాగిస్తారు. ‘ఇది (మీ ఒక్కరి) కథ కాదు’. మీ ‘గుప్పెడు మనసే’ ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా ‘కర్తవ్యం’. మీరు ఎప్పుడొచ్చినా ‘ఆవిడే శ్యామలా’ అని గుర్తించగలం’... ఇలాంటి జవాబు చూసి పోలీసు వారిలో ఇంత పంచ్ ఉందా అని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే రకరకాల జవాబులూ వచ్చాయి. ‘మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి’ అని ఒకరు, ‘షాపింగ్ చెయ్ దొరుకుతుంది’ అని ఒకరు, ‘మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది’ అని ఒకరు ‘రాధాకృష్ణ మందిరానికి పో’ అని ఒకరు వేదిక ఆర్యకు సలహాలు ఇస్తే మరి కొందరు పోలీసులకు చివాట్లేశారు. ‘మా కేసు సంగతి చూడండి ముందు’ అని ఒకరు, ‘ఫేస్బుక్లో వీడు వేధిస్తున్నాడు.. వీడి సంగతి చూడండి ముందు’ అని మరొకరు రిప్లైలు పెట్టారు. ‘ఉన్న మనశ్శాంతి లాక్కోకపోతే అదే పదివేలు’ అని ముక్తాయించారొకరు. -
ఫేక్ అరెస్ట్ వీడియో.. నటిపై క్రిమినల్ కేసు నమోదు
ఉర్ఫీ జావెద్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. విచిత్రమైన డ్రెస్సులు ధరించి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు అభిమానులను అలరిస్తుంది. ఆమెకు ఉన్న వింత ఫ్యాషన్ పిచ్చి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటుంది. కొన్నిసార్లు అయితే ఆమె షేర్ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి దారి తీస్తాయి. ఈ మధ్యే ఆమె భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ పాత్ర గెటప్‌లో ఫోటో షూట్ చేసి.. వాటిని నెట్టింట్లో పెట్టగా..ఓ వర్గం బెదిరింపులకు దిగింది. ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ.. ఉర్ఫీ మాత్రం వాటిని తొలగించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన ఓ వీడియా కారణంగా..ఆమెపై కేసు నమోదైంది. ఏం జరిగింది? తనను ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉర్ఫీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఓ కేఫ్ వద్ద ఉర్ఫీని ఇద్దరు మహిళా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉంది. నన్నుందుకు అరెస్ట్ చేస్తున్నారని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘చిన్న చిన్న దుస్తులు ధరించి ఎవరైనా తిరుగుతారా? అంటూ పోలీసులు ఫైర్ అవుతున్నారు. కాసేపు వాదనలు జరిగాక.. ఉర్ఫీ వెళ్లి పోలీసు వాహనంలో ఎక్కింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ‘చిన్న దుస్తులు ధరిస్తే అరెస్ట్ చేస్తారా’ అని నెటిజన్స్ ముంబై పోలీసులను ట్రోల్ చేశారు. ఫేక్ వీడియో.. కేసు నమోదు అయితే ఉర్ఫీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వీడియో ఫేక్‌ది. ప్రచారం కోసం ఉర్ఫీనే ఆ వీడియో రెడీ చేయించుకుంది. ముంబై పోలీసులు స్పందించేవరకు ఆ విషయం బయటకు రాలేదు. వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఉర్ఫీని అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులని విచారణలో తేలింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఐపీసీ 171, 419, 500, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు -
ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!
ముంబై మహానగరంలో ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్‌లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్) చివరి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్‌గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్(ట్విటర్) ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. (మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు) We’ve received a 'nostalgic heist' report from @anandmahindra Sir! We can clearly see the theft, but we cannot take possession of it. Those B.E.S.T cherished memories are safely kept in your heart, and among all Mumbaikars.#DoubleDecker #MumbaiMemories #BestMemories https://t.co/32L2nmzXiQ — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) September 15, 2023 “హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు కూడా స్పందించారు. డిపార్ట్మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మీతోపాటు ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) కాగా 1997లో86 ఏళ్ల క్రితం నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్‌లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మా గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో ఫేమస్ అయినా ఈ షో తెలుగువారికి సుపరిచితమే. అయితే ఇటీవల ఈ షో నిర్మాతలపై పలువురు నటీమణులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఈ షో నిర్మాతలు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జెన్నిఫర్ మిస్త్రీ ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాత అసిత్ మోదీతో పాటు ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (ఇది చదవండి: Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?) మద్యం తాగమని బలవంతం తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జెన్నిఫర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్మాత అసిత్ మోడీ తన చెంపలు గిల్లాడని ఆరోపించింది. తన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడని వెల్లడించింది. తనను మద్యం తాగాలని బలవంతం చేసేవాడని తెలిపింది. అతని చెప్పినట్లు చేయకపోతే.. తన వర్క్‌లో తప్పులను ఎత్తి చూపేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. ఒకరోజు మా టీమ్ సింగపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్ లేని సమయంలో అతనితో కలిసి మద్యం తాగమని బలవంతం చేశాడని తెలిపింది. ఒకసారి ఫోన్లో మాట్లాడుతూనే నిన్ను కౌగిలించుకోవాలనుందని అన్నాడని ఆమె ఆరోపించారు. 'కుటుంబాన్ని వదిలి షూట్‌కు రావాలన్నారు' తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బందులు పెట్టేవారని మిస్త్రీ స్టేట్మెంట్లో వివరించింది. రమణి, బజాజ్ ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడల్లా తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతారని జెన్నిఫర్ పోలీసులకు చెప్పింది. వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని పేర్కొంది. తన కుటుంబంతో ఉన్నప్పుడు మేకర్స్ తనను షూట్‌కు రమ్మని బలవంతం చేస్తారని.. తన తండ్రి చనిపోయినప్పుడు, తన సోదరుడు వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా సెట్లోకి రావాలని వేధించారని వెల్లడించింది. తనకు రెమ్యునరేషన్ సకాలంలో చెల్లించరని.. వేధింపులు తట్టుకోలేక ఈ ఏడాది మార్చి 6న జెన్నిఫర్ మిస్త్రీ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు) -
నటిపై లైంగిక వేధింపులు.. నిర్మాతపై కేసు నమోదు!
హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలిగారు. గత కొద్దికాలంగా ఈ షో నిర్మాతలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో నటించిన మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా, దిశా వకాని ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు. అయితే గతంలో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!) ఈ విషయంపై తాజాగా జెన్నిఫర్ మిస్త్రీ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటికే జెన్నిఫర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ ఉల్టా చష్మా షో నిర్మాత అలిత్ మోడీ, ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జతిన్ బజాజ్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అసిత్ మోడీతో పాటు కొంతమంది నటీనటులపై జెన్నిఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆరోపణలు నిరాధారం: అసిత్ మోడీ తనపై జెన్నిఫర్ మిస్త్రీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అసిత్ మోడీ కొట్టిపారేశారు. తన పరువు తీసేందుకు అలా చేస్తోందని .. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. పోలీసులు విచారణ తర్వాతే నిజాలు బయటకు వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) -
అనిల్‌ను పట్టుకునేందుకు అమృత సాయం!
క్రైమ్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన కేసులో.. ముంబై పోలీసులు ఎట్టకేలకు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో చాలా ఆసక్తికర విషయాల్నే పోలీసులు పొందుపరిచారు. ప్రధాన నిందితుడైన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీని పోలీసులు.. అమృత సాయంతోనే ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ .. అనిల్ కూతురు అనిక్షను నేరుగా కలవడంతో పాటుగా.. అమృత-అనిల్ మధ్య ఛాటింగ్‌ను సైతం పోలీసులు ఆ ఛార్జ్‌షీట్‌తో జత చేశారు. అమృతా ఫడ్నవిస్‌ను బెదిరించి.. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, అతని కుమార్తె అనిక్షపై పోలీసులు ఈ ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈలోపు అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. దాదాపుగా 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్.. ఎనిమిదేళ్ల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడట. దీంతో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అతన్ని పట్టుకోవాలని ముంబై పోలీసులు డిసైడ్ అయ్యారు. అందుకు ఫడ్నవిస్ సతీమణి సాయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఛాటింగ్ అమృత: ‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి.. నేను నా భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడతా. ఆయన మీకు న్యాయం చేస్తారు. కానీ, అక్రమంగా డబ్బు సంపాదించొచ్చన్న అనిక్ష డిమాండ్లను నేను అంగీకరించలేను. మీరు ముందు నుంచీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడు మీరు నా వీడియోలను బయటపెట్టి నన్ను ఇరికించొచ్చు. కానీ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీరు నిజంగా న్యాయం కోరుకుంటే దేవ్జీతో నేను మాట్లాడుతాను అవతలి నుంచి: కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్‌లు రిప్లైగా వచ్చాయి. ఆ తర్వాత అనిల్‌తో ఫోన్లో అమృత: ‘‘దేవేజీతో(భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉద్దేశించి) నా బంధం సరిగా లేదు. 2019 నుంచి మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఆయన నాకు విడాకులిస్తారేమో!. కానీ, ఆయన గురించి నాకు తెలుసు. మీరు బాధితులని తెలిస్తే.. ఆయన 100శాతం న్యాయం జరిగేలా చూస్తారు. మరోసారి కాల్‌లోనే: ‘‘ఫోన్లో కాదు.. నేరుగా మీ అమ్మాయి అనిక్షను కలిసి మాట్లాడతా’’ అలా అనిక్ష, ఆమె తండ్రి లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత మార్చి 16న అనిక్షను అరెస్టు చేయగా.. ఆ తర్వాత మార్చి 19న అనిల్ జైసింఘానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా ఆమె తనంతట తానుగా చేయలేదు. ఇది కూడా పోలీసులే చెప్పమన్నారట. వాళ్ల డైరెక్షన్లోనే ఆమె ఇదంతా నడిపించారట. ఆ విషయాన్ని కూడా పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై ఓ దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ‘‘మా సూచనలతోనే అమృతాజీ నిందితులతో టచ్‌లో ఉన్నారు. నిందితులను పట్టుకునేవరకు వారితో సంభాషణలు పొడగించాలని మేమే ఆమెకు చెప్పాం’’ అని తెలిపారు. కేసు వివరాలివే.. అనిక్ష తనను తాను ఫ్యాషన్డిజైనర్గా అమృతా ఫడ్నవిస్‌తో పరిచయం పెంచుకుంది. ఆ వంకతో తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె తండ్రి ఓ బుకీ అని తెలియడంతో.. అమృతా ఆ యువతిని దూరం పెట్టింది. అదిగో అప్పటి నుంచి అమృతను డబ్బు కోసం బెదిరించడం మొదలుపెట్టింది అనిక్ష. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లుగా ఓ నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్ నంబర్ల ద్వారా బ్లాక్మెయిల్ చేసింది. దీంతో అమృత పోలీసులను ఆశ్రయించారు. ఆపై పోలీసులు అమృత సాయంతోనే వాళ్లను పట్టుకున్నారు. -
అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు
ముంబై నగరం ఎప్పుడూ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ఉంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి. ముంబై నగరాన్ని బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు ఓ వ్యక్తి పోలీస్ శాఖకు ట్వీట్ చేశారు. ‘ముంబైను అతి త్వరలోనే బాంబు పెట్టి పేల్చబోతున్నాను’ అని ట్వీట్ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో ముంబై పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి 26\11 తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు. తను రాజస్తాన్ నుంచి మాట్లాడుతున్నానని 26\11 తరహాలో దాడులు చేస్తామని చెప్పిఫోన్ కట్ చేశాడు. ఈ ఫోన్ కాల్‌ను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫోన్ ఎవరు. ఎక్కడి నుంచి చేశారనేది ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి బెదిరింపు ఫోన్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆ దిశగా పోలీసుల బృందం దర్యాప్తు చేస్తుంది. కాగా గత ఏడాది కాలంగా ముంబై పోలీస్ శాఖకు బెదిరింపు ఫోన్స్ కాల్స్, మెసెజ్‌లు ఎక్కువగా వన్నాయని పోలీసులు తెలిపారు. తీ క్రమంలో ఇప్పటికే విమానాశ్రయం, మంత్రాలయ, బీఎస్ఈ తదితర కీలక కార్యాయాల వద్ద ప్రార్థనా స్థలాల వద్ద భారీ పోలీసులు బందో బస్తు ఉంటుంది. బెదిరింపు ఫోన్లు వస్తే భద్రత మరింత కట్టుదిట్టం చేస్తారు. చదవండి: భారత్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్‌లో సినీ ఫక్కీలో అరెస్ట్ -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
బాలీవుడ్ స్టార్స్ ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్ ఇదే!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ బైక్ రైడ్‌పై ముంబయి పోలీసులు స్పందించారు. అమితాబ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి వెళ్లారు. అయితే బైక్‌పై ఇద్దరు ఎలాంటి హెల్మెట్ లేకుండా కనిపించారు. బైక్‌పై కూర్చొని ఉన్న చిత్రాన్ని బిగ్ బీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై ముంబయి పోలీసులు సైతం స్పందించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (ఇది చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి) మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సైతం ఎలాంటి హెల్మెట్ లేకుండా బైక్‌పై కనిపించారు. తన బాడీగార్డ్‌తో బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. వాళ్లద్దరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో నెటిజన్స్ వెంటనే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలపై ముంబయి పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2024లో విడుదల కానుంది. ఇదే కాకుండా బిగ్ బి రిభు దాస్‌గుప్తా మూవీ కోర్ట్ రూమ్ డ్రామా సెక్షన్ 84లో కనిపించనున్నారు. ఆ తర్వాత అతను టైగర్ ష్రాఫ్, కృతి సనన్ చిత్రం గణపత్‌లో కూడా నటించనున్నారు. (ఇది చదవండి: లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) మరోవైపు.. అనుష్క చివరిసారిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి జీరోలో కనిపించింది. ఈ ఏడాది ఆమె చక్దా 'ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి సినిమాల్లోకి రానుంది. తన కూతురు వామిక పుట్టిన తర్వాత ఆమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. #AnushkaSharma ditches the car and takes a bike ride to travel in the city! pic.twitter.com/jUwiCsyhbJ — Pinkvilla (@pinkvilla) May 15, 2023 We have shared this with traffic branch. @MTPHereToHelp — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) May 15, 2023 -
మోడల్స్‌తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్‌లోని ఓ హోటల్లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్‌ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్‌పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భోజ్‌పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్‌లోని రాయల్ పామ్ హోటల్లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్‌స్టిక్ బాక్స్, భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేసింది. Maharashtra | A Bhojpuri actress Suman Kumari (24) has been arrested by Mumbai Police for allegedly forcing girls (models) into prostitution. Police also rescued 3 models. Further investigation is being done: Crime Branch, Mumbai police — ANI (@ANI) April 21, 2023 -
మోడల్స్‌తో వ్యభిచారం.. నటి అరెస్ట్
ముంబైలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సినిమాలో అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు, మోడల్స్‌ను వేశ్య వృత్తిలోకి దింపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. పక్కా సమాచారంతో దాడులు జరిపగా ఈ తతంగమంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే ఆర్తీ మిట్టల్‌ను అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో ఇద్దరు మోడల్స్‌ను రక్షించి పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. నిందితురాలు ఆర్తి మిట్టల్ సినిమా అవకాశాలు, డబ్బు ఆశ చూపి వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ మనోజ్ సుతార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. Maharshtra | Mumbai Crime Branch Unit 11, Dindoshi police busted a sex racket running in Goregaon area. Two models were rescued from the spot and a 30-year-old casting director, Aarti Mittal was arrested in this case: Mumbai Crime Branch — ANI (@ANI) April 17, 2023 -
వైరల్ వీడియో: డ్యాన్స్‌తో అదరగొడుతున్న ముంబై పోలీస్
-
'ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం'.. బెదిరింపు ఫోన్‌కాల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్‌గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలోనూ రెండుసార్లు సల్మాన్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ ఎదుర్కొన్న సల్మాన్‌ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్లే సల్మాన్‌ను కూడా చంపేస్తామని బిష్ణోయ్ సన్నిహితుడు బెదిరించాడు. తాజాగా మరోసారి సల్మాన్ హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా కట్టుదిట్టమైన భద్రత మధ్యే బయటకు వెళ్తున్నారు. ఈ పరిణామాల మధ్య రీసెంట్గా సల్మాన్ హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.