NaMo App
-
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే: మోదీ
లక్నో: దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని చూసి ప్రతిపక్షాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని, పాత రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టేలా కష్టపడి పని చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్త రికార్డులు సృష్టించడమే మన లక్ష్యం కావాలన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లో 10 లోక్‌సభ స్థానాల పరిధిలోని 22,648 పోలింగ్ బూత్‌లకు చెందిన బీజేపీ శ్రేణుల డిజిటల్ ర్యాలీని ఉద్దేశించి ‘నమో’ యాప్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్నికల్లో విజయం పోలింగ్‌బూత్ స్థాయిలో సాధించే విజయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పోలింగ్ బూత్‌లో నెగ్గకపోతే ఎన్నికల్లో నెగ్గలేమని స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రి ఎన్నికల్లో పోలింగ్ బూత్ స్థాయిల్లో రికార్డులను బద్ధలు కొట్టేలా పని చేయడం అని కార్యకర్తలకు సూచించారు. -
కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మోదీ
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం కేరళలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు అహోరాత్రాలు చెమటోడుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నమో యాప్ ద్వారా శనివారం ఆయన వారితో ముచ్చటించారు. అధికార లెఫ్ట్ కూటమి నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా బీజేపీ కార్యకర్తలు చూపుతున్న పట్టుదల, ఉత్సాహం ప్రశంసనీయమన్నారు. వారి త్యాగం, క్రమశిక్షణ, కష్టించే తత్వం తనకు స్ఫూర్తిగా నిలిచి శక్తినిస్తున్నాయని మోదీ అన్నారు. ఇంటింటికీ వెళ్లి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టినట్టు కార్యకర్తలు ఆయనకు వివరించారు. కేరళలో ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. -
Lok sabha elections 2024: పథకాలను ఓటర్లకు చేర్చండి: మోదీ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్తలతో నమో యాప్ ద్వారా భేటీ అయ్యారు. ‘ఎనతు బూత్ వలిమయ్యాన బూత్ (నా బూత్ అత్యంత శక్తిమంతమైనది)’ కార్యక్రమంలో పాల్గొని లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి సన్నద్ధతపై వారితో చర్చించారు. ‘‘రాష్ట్రంలో ఘనవిజయమే మన లక్ష్యం కావాలి. బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల ఘనవిజయానికి వ్యూహాలు రూపొందించండి’’ అంటూ కార్యకర్తలను ప్రోత్సహించారు. ‘‘తమిళనాట ప్రచారానికి 15 రోజులే మిగిలింది. కనుక ఓటర్లతో నిత్యం అనుసంధానమై ఉండండి. మన పథకాలను, ప్రభుత్వం సాధించిన ఘనతలను వారికి వివరించండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. బీజేపీలో తన తొలినాళ్ల అనుభవాలను మోదీ వారితో పంచుకున్నారు. -
బీజేపీ మేనిఫెస్టోకు సలహాలివ్వండి.. యువతకు మోదీ పిలుపు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ మేనిఫెస్టో కోసం దేశ యువత తమ ఆలోచనలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నమో యాప్‌లో యువత తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ ఓటర్స్ కాన్ఫరెన్స్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ విధంగా సలహాలను అందించిన వారిలో కొందరిని మోదీ భవిష్యత్‌లో కలవనున్నట్లు చెప్పారు. నమో యాప్‌లో తమ అభిప్రాయాలను తెలియజేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. యువత తమ వినూత్న ఆలోచనలను narendramodi.in వెబ్సైట్లో కూడా షేర్ చేయవచ్చని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలోని యువత తప్పనిసరిగా ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రభుత్వం, ప్రజల మధ్య సహకారం పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా భాగస్వామ్యంతో బీజేపీ మేనిఫెస్టోని రూపొందిస్తే భారత భవిష్యత్తును సరైన దిశగా నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు: బీజేపీ -
Mann ki Baat 2023: వారి జీవితాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారి జీవితాలు, వారు సాధించిన ఘనత గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2023 పద్మ అవార్డుల్ని పీపుల్స్ పద్మగా అభివర్ణించారు. సామాన్యుల్లో అసామాన్యులుగా ఎదిగిన వారిని గుర్తించి గౌరవిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులు, వారి అభ్యున్నతికి కృషి చేసిన వారినే అత్యధికంగా పద్మ అవార్డులతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘ పద్మ పురస్కారాలు పొందినవారి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. గిరిజన భాషలైన టోటో, హో, కూయి వంటి వాటిపై అవిరళ కృషి చేసిన వారు, ఆదివాసీల సంగీత పరికరాలు వాయించడంలో నిష్ణాతులకి ఈ సారి పద్మ పురస్కారాలు వరించాయి.. నగర జీవితాలకి , ఆదివాసీ జీవితాలకు ఎంతో భేదం ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లుంటాయన్నారు. అయినప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎంతో పోరాటం చేస్తుంటారు’’ అని ప్రధాని కొనియాడారు. పెరుగుతున్న దేశీయ పేటెంట్ ఫైలింగ్స్ ఈ దశాబ్దం సాంకేతిక రంగంలో దేశీయ టెక్నాలజీస్ వాడకం పెరిగి ‘‘టెకేడ్’’గా మారాలన్న భారత్ కలను ఆవిష్కర్తలు, వాటికి వచ్చే పేటెంట్ హక్కులు నెరవేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశాలతో పోల్చి చూస్తే దేశీయంగా పేటెంట్ ఫైలింగ్స్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్‌లో భారత్ ఏడో స్థానంలో ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లలో అయిదో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడిచారు. గత అయిదేళ్లలో భారత్ పేటెంట్ రిజిస్ట్రేషన్లు 50శాతం పెరిగాయని, ప్రపంచ ఆవిష్కరణల సూచిలో మన స్థానం 40కి ఎగబాకిందన్నారు. 2015 నాటికి 80 కంటే తక్కువ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇండియన్ ఇనిస్టి్యూట్ ఆఫ్ సైన్సెస్ 2022లో 145 పేటెంట్లను దాఖలు చేసి రికార్డు సృష్టిస్తుందన్నారు. భారత్ ‘‘టెకేడ్‘‘కలని ఆవిష్కర్తలే నెరవేరుస్తారని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మన్‌కీ బాత్‌లో తెలుగువారి ప్రస్తావన మన్‌కీబాత్‌లో ఇద్దరు తెలుగు వారి గురించి మోదీ ప్రస్తావించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి, తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి మాట్లాడారు. ‘‘నంద్యాల జిల్లాకు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి చిరు ధాన్యాలు పండించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేశారు. తల్లి చేసే చిరు ధాన్యాల వంటకం రుచి చూసి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వాటి ప్రయోజనాలను అందరికీ వివరిస్తున్నారు’’ అని కొనియాడారు. నమో యాప్‌లో ఇ–వేస్ట్ గురించి రాసిన తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి ప్రస్తావించిన ప్రధాని మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్లు నిరుపయోగమైనప్పుడు ఎలా పారేయాలో వివరించారు. -
నమో యాప్‌తో సూక్ష్మ విరాళాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు నమో యాప్ ద్వారా సూక్ష్మ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి రవీంద్రనాయక్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, నాయకులు పాపారావు, డాక్టర్ ఎస్.మల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా, మల్కాజిగిరి నుండి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి సంతోష్‌యాదవ్ నాయకత్వంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పద్మ పురస్కార గ్రహీతలకు అభినందనలు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు దర్శనం మొగులయ్య, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును బండి సంజయ్ స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామితో కలిసి ఆయన ఆదివారం సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీలో ఉంటున్న మొగులయ్యని కలిసి ఘనంగా సన్మా నించారు. అలాగే సైనిక్‌పురిలో గరికపాటి నర సింహారావును కూడా కలసి అభినందించారు. -
10.75 కోట్ల మంది రైతులకు 1.15 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.75 కోట్ల మంది రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రూ. 1.15 లక్షల కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అర్హులైన రైతులందరూ లబ్ధిదారుల జాబితాలో చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఇప్పటికీ కొందరు రైతులు తమకు పీఎం కిసాన్ డబ్బులు అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 14.5 కోట్ల మంది రైతులను ఈ పథకంలో చేర్చాలని మొదట లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో తోమర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను అందజేస్తే పశ్చిమబెంగాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సాగు చట్టాల అమలును నిలిపేసిన ఏడాదిన్నర సమయంలో సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వ్యవసాయ చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చించి, పరిష్కారం సాధిద్దామని రైతు నేతలకు ప్రతిపాదించామన్నారు. సాగు చట్టాలను రద్దు చేయనట్లయితే.. 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామన్న రైతు నేత రాకేశ్ తికాయత్ హెచ్చరికపై స్పందిస్తూ.. రైతులతో చర్చించేందుకు తమ ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉంటుందన్నారు. ఇప్పటికీ వారి నుంచి స్పందన వస్తే చర్చలు పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యం ‘దేశానికి అన్నం పెడుతున్న రైతులు గౌరవప్రదంగా జీవించాలన్న ఉద్దేశంతో సరిగ్గా రెండేళ్ల క్రితం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించాం’ అని ‘పీఎం కిసాన్’ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, పంటల కనీస మద్దతు ధరను చరిత్రాత్మక స్థాయిలో పెంచామని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. మెరుగైన సాగునీటి సదుపాయాలు, సులువైన రుణ సదుపాయం, పంట బీమా, దళారుల తొలగింపు.. తదితర చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను నమో యాప్‌లో చూడవచ్చన్నారు. 2019 ఫిబ్రవరి 24న ‘పీఎం కిసాన్’ పథకాన్ని ప్రధానిమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఆ క్విజ్ కోసం నమో యాప్ ఉండాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నమో యాప్’ ద్వారా తన పుట్టిన రోజు శుభకాంక్షలు తెలపాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. దీంతో నమో యాప్ ద్వారా ప్రధానికి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా ఓ ప్రకటన వెలువరించింది. నమో యాప్ ద్వారానే ‘నో నమో (Know Namo)’ క్విజ్ నిర్వహిస్తున్నట్లు తాజాగా ట్వీట్ చేసింది. ఇందులో గెలిచిన వారికి ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ ఉన్న పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇవాళ ప్రారంభించే ఈ క్వీజ్ పోటీలో ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని వెల్లడించింది. ‘ప్రధాని నరేంద్ర మోదీ గురించి తమకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకోవాలంటే ఈ ‘నమోయాప్’లో ఈ రోజు నిర్వహించే ‘ది నో నమో’ క్వీజ్‌లో పాల్గొనాలని.. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ http://nm4.in/dnldapp లింక్‌ను ట్విటర్లో పంచుకుంది. (చదవండి: కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ విషెస్) ప్రధానికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పాలనుకునే కార్యకర్తలు, ప్రజలు తమ సందేశాలను వీడియో రూపంలో ఈ యాప్‌లో అప్లోడ్ చేయాల్సిందిగా బీజేపీ కోరింది. నమో యాప్ వినియోగదారులంతా ప్రధాని జీవితం ఆధారంగా తొలిసారిగా 360 డిగ్రీల వీడియోను ఎగ్జిబిషన్‌ను చూడొచ్చని కూడా పార్టీ తెలిపింది. గ్లింప్సెస్ ఆప్ నమో ఇన్స్పైరింగ్ లైఫ్ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ప్రధాని మోదీ స్వస్థలం గుజరాత్‌లోని వాడ్నగర్ నుంచి భారత ప్రధానిగా ఎదిగిన ఆయన జీవిత చరిత్రను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ వారం రోజుల పాటు(సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు) ‘సేవా సప్తా’ కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్యాడ్లు, వీల్చైర్ల పంపిణీతో పాటు పలు సామాజిక సేవలను చేపట్టనుంది. -
‘నమో టీవీ’ ఎలా వచ్చింది ?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నమో టీవీ’ అంటే ఏమిటీ? టాటా స్కై లాంటి ‘డీటూహెచ్’ ఫ్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఇంటికి ప్రసారం అవుతున్న ఓ టీవీ ఛానల్. ఇందులో 24 గంటలపాటు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ప్రాంతాల్లో చేస్తున్న ఎన్నికల ప్రసంగాల ప్రత్యక్ష ప్రసారాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేయడంతోపాటు వాటిని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తోంది. మధ్యమధ్యలో బీజేపీకి సంబంధించిన ఇతర ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రసారం చేస్తోంది. ప్రసారం చేసే హక్కులు (బ్రాడ్కాస్ట్ లైసెన్స్) లేకుండానే ఈ ఛానల్ ప్రసారం అవుతోందంటూ ‘ది ఫ్రింట్’ పత్రిక బుధవారం నాడు ఓ వార్తను పేల్చింది. సెక్యూరిటీ క్లియరెన్స్ లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అసలు అనుమతికి ఎలాంటి దరఖాస్తును కూడా సమర్పించకుండానే ఈ టీవీ ఛానల్ ప్రసారం అవుతుండడం ఆశ్చర్యం. కేంద్ర, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే టీవీ ఛానళ్లకు ఎంత కఠిన నియమ నిబంధనలు ఉంటాయో తెల్సిందే. ఓ ఛానల్ పేరు మార్చుకోవాలన్నా, కేవలం లోగో మార్చుకోవాలన్నా కేంద్రానికి దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలి. ఇక కొత్త ఛానళ్లకు అనమతి లభించడం కూడా కష్టమే. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ గత తొమ్మిది నెలల కాలంలో కేవలం ఆరు కొత్త ఛానళ్ళకు మాత్రమే లైసెన్స్‌లు మంజూరు చేసింది. 130 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. మరి ‘నమో టీవీ’ ఎలా వచ్చింది ? అది కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక! ‘ది ప్రింట్’ వార్తపై స్పందించిన కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఈ విషయాన్ని వెంటనే ఎన్నికల కమిషన్‌ను ఫిర్యాదు చేశాయి. స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్, వివరణ కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖకు నోటీసు జారీ చేసింది. ‘ఆ అది హిందీ న్యూస్ సర్వీసు’ అంటూ టాటాస్కై ట్విట్టర్ ద్వారా వివరణ ఇవ్వగా, ‘డైరెక్ట్ టు హోం సర్వీస్’గా వ్యవహరించే ప్రత్యేక ఫ్టాట్ఫారమ్ ద్వారా ‘నమో టీవీ’ ఛానల్ ప్రసారం అవుతోందని, ఆ ప్రసారాలను సాధారణంగా ‘డీటిహెచ్’ ఆపరేటర్లు నిర్వహిస్తారని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. అంటే డీటిహెచ్ ద్వారా ప్రసారమయ్యే టీవీ ఛానళ్లకు తమ అనుమతి లేదా లైసెన్స్ అవసరం లేదని కేంద్రం చెప్పడమే. అప్పుడు 130 ఛానళ్లకు లైసెన్స్ అవసరం లేదు ఈ లెక్కన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న 130 ఛానళ్ల దరఖాస్తుదారులు ఇంకేమాత్రం ప్రభుత్వం అనుమతి కోసం నిరీక్షించకుండా, లైసెన్స్‌ల కోసం కోట్లాది రూపాయలను చెల్లించాల్సిన అవసరం లేకుండానే డీటీహెచ్ ఆపరేటర్ల ద్వారా తమ ఛానళ్లను ప్రసారం చేసుకోవచ్చన్నమాట. పాలకపక్ష బీజేపీ చెప్పింది కనుక ఛానల్ ప్రసారానికి అనుమతించిన డీటీహెచ్ అందరి ఛానళ్లను అనుమతించకపోవచ్చు. అయితే చట్టంలో ఉన్న లోపం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక, దాన్ని అడ్డం పెట్టుకొని న్యాయపోరాటం జరపవచ్చు! ‘యాడ్’గా పరిగణించాల్సిందే! కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఓ టీవీ ఛానల్ నడుస్తున్నందున, ఆ ఛానల్లో నరేంద్ర మోదీ, బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తలే ఉంటున్నందున వాటిని ఎన్నికల కమిషన్ వాణిజ్య ప్రకటనల (యాడ్) కింద పరిగణించాలి. వాటి ఖర్చులను మోదీ ఖర్చులోనో లేదా బీజేపీ ఖర్చులోనో జమ చేయాలి. వాస్తవానికి దేశంలోని మెజారిటీ ఇంగ్లీషు, హిందీ మీడియా మోదీ ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ‘నమో టీవీ’ ప్రసారాలే అవసరం లేవు. -
మోదీ సర్వేలో విపక్ష కూటమిపై ప్రశ్న
న్యూఢిల్లీ: ‘బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న మహా కూటమి ప్రభావం మీ నియోజకవర్గంలో ఉంటుందా?’.. ఈ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీకు సంబంధించిన నమో యాప్‌లో నిర్వహిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ సర్వేలోనిది. దీంతో పాటు పలు ఇతర ప్రశ్నలకు కూడా ఈ సర్వేలో పాల్గొనేవారు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ సర్వేలో పాల్గొనాల్సిందిగా పౌరులను కోరుతూ ఓ చిన్న వీడియోను తన ట్విటర్ హ్యాండిల్లో సోమవారం ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘నమో యాప్‌లో ఓ సర్వే ప్రారంభమైంది. అందులో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నా. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అవి మాకు తోడ్పడుతాయి’ అని అందులో మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం, నియోజకవర్గం, అవినీతి రహిత పాలన, స్వచ్ఛభారత్, మౌలిక వసతులు, చవకగా ఆరోగ్యం, ఆర్థిక రంగం, జాతీయ భద్రత, ఉపాధి, గ్రామీణ విద్యుదీకరణ.. తదితరాలపై పలు ప్రశ్నలున్నాయి. -
చంద్రబాబుని చిత్తుచిత్తుగా ఓడించండి: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి అధికారమే పరమావధిగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అధికారం నిలబెట్టుకోడానికి రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట బీజేపీ బూత్ లెవల్ కార్యకర్తలతో ఆదివారం నమో యాప్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ కేడర్‌కి దిశానిర్దేశం చేశారు. మోదీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. సొంత మామను రెండుసార్లు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం కాంగ్రెస్ కాళ్లపై చంద్రబాబు సాగిలపడ్డారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమైన చంద్రబాబు... దేశానికి ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. కొడుకుని పైకి తీసుకురావడానికి, అవినీతితో రాష్ట్రం అస్తమయ దశకు చేరినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ విలువలను కాలరాసిన చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించినప్పుడే తెలుగుప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందని మోదీ పిలుపునిచ్చారు. -
2019 ఎన్నికలకు ‘టీ20’ ఫార్ములా
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన బీజేపీ.. టీ20 ఫార్ములాతో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రతీ కార్యకర్త వారి ప్రాంతంలోని 20 ఇళ్లను సందర్శించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారం నిర్వహించడమే దీని లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. ఎలాగైనా మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా టీ20 ఫార్ములాతో పాటు ‘హర్ బూత్ దస్ యూత్’(ప్రతి పోలింగ్ బూత్‌కు 10 మంది యువత), నమో యాప్‌కు మరింత మంది అనుసంధానం, బూత్ స్థాయిలో బృందాల ఏర్పాటు వంటి వాటితో ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రచారం చేయాలని కార్యకర్తలకు లక్ష్యాల్ని నిర్దేశిస్తోంది. 2014 కంటే మరింత ఉధృతంగా.. ప్రభుత్వ పథకాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక, బూత్ స్థాయి కార్యకర్తలు వారి వారి ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని బీజేపీ ఇప్పటికే ఆదేశించింది. ప్రజలతో నేరుగా సంభాషించడమే కాక వారితో అనుసంధానం కావడమే దీని లక్ష్యమని సీనియర్ నేత పేర్కొన్నారు. 2014 కంటే ఇప్పుడు ప్రచార ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలనే లక్ష్యంతో బీజేపీ కసరత్తు చేస్తోంది. నేరుగా ప్రధాని సంభాషణ: మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా దేశంలోని మెజార్టీ నియోజవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నేరుగా ప్రధానితో సంభాషించడం కార్యకర్తల్లో ప్రేరణ నింపుతుందన్నాయి. -
సాధికారతతో సమస్యలపై పోరు
న్యూఢిల్లీ: ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు సామాజిక సమస్యలపై పోరాడగలుగుతారని ప్రధాని మోదీ అన్నారు. మహిళల్లో అపార శక్తి దాగి ఉందని, తమ శక్తి సామర్థ్యాలేమిటో వారు గుర్తించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటి మంది స్వయంసహాయక బృందాల మహిళలతో నమో యాప్ ద్వారా ముచ్చటించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని ఉద్ఘాటించారు. ‘మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం. మహిళలు ప్రతిభావంతులు. వారికి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. తామేంటో నిరూపించుకునేందుకు వారికి అవకాశం ఇస్తే చాలు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళా సాధికారతకు దోహదపడుతుంది. ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడిన మహిళలు అన్ని సామాజిక దురాచారాలకు ఎదురొడ్డి నిలుస్తారు’ అని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధిలో స్వయం సహాయక బృందాల పాత్రను ఆయన కొనియాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 20 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేశామని, 2.25 కోట్లకు పైగా కుటుంబాలను వాటిలో భాగం చేశామని తెలిపారు. ప్రస్తుతం 45 లక్షల స్వయం సహాయక బృందాల్లో సుమారు 5 కోట్ల మంది మహిళలు క్రియాశీలకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి ఈ బృందాలు పునాది వేస్తున్నాయని ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పశుపోషణ రంగాలు మహిళలు లేకుండా మనుగడ సాగించలేవని అన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలు తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును, స్ఫూర్తిదాయక గాథలను పలువురు మహిళలు ప్రధానితో పంచుకున్నారు. ‘వారసత్వ’ రక్షణకు ప్రజా భాగస్వామ్యం దేశ వారసత్వ సంపద పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రాచీన కట్టడాలను విస్మరించడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని..వాటి ప్రాముఖ్యతను యువ తరానికి తెలియజేసి వారి వైఖరిలో మార్పు తీసుకురావాలని అభిలషించారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో మోదీ గురువారం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మన ప్రాచీన వారసత్వ కట్టడాలు, సంపదను కాపాడుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని నొక్కి చెప్పారు. కొన్ని కట్టడాల వద్ద ప్రజలు ఫొటోలు, సెల్ఫీలు దిగకుండా నిషేధాజ్ఞలు విధించడాన్ని తప్పు పట్టారు. ‘విదేశాల్లో ఎక్కడికెళ్లినా ప్రాచీన కట్టడాల వద్ద రిటైర్ అయిన వారే గైడుగా పనిచేస్తూ కనిపిస్తారు. వాటిని కాపాడుకునే బాధ్యతను సమాజమే తీసుకుంటుంది. అలాంటి విలువలనే భారత్‌లోనూ పాదుకొల్పాలి. పాఠశాలల సిలబస్‌లో వారసత్వ కట్టడాల సమాచారాన్ని చేరిస్తే, విద్యార్థులు వాటి గురించి తెలుసుకుంటూ పెరుగుతారు. టూరిస్ట్ గైడుగా పనిచేసేలా యువతను ప్రోత్సహించాలి. వారసత్వ స్థలాల పరిరక్షణలో పాలుపంచుకునేలా కార్పొరేట్ కంపెనీలను ఒప్పించాలి’ అని అన్నారు. -
వారి హృదయంలో దళితులకు చోటులేదు
సాక్షి, బెంగళూరు: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలుగన్న శక్తివంతమైన, సుభిక్షమైన భారత నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ.. ఏనాడూ దళిత, బహుజన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్ మోర్చా నాయకులు, కార్యకర్తలనుద్దేశించి నమో యాప్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. 1952లో పార్లమెంటు ఎన్నికల్లో, 1953లో ముంబైలోని బాంద్రా లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ హృదయంలో దళితులు, ఓబీసీలకు చోటే లేదు. అంబేడ్కర్‌ను అవమానించినప్పటి నుంచి దశాబ్దాలుగా ఇదే విధానాన్ని అమలుచేస్తోంది. కాంగ్రెస్ చేతిలో అధికారం ఉన్నంతవరకు అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు. బీజేపీ పగ్గాలు చేపట్టాకే ఆ మహనీయునికి సరైన గౌరవం దక్కింది’ అని మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో అందరినీ కలుపుకుని పోవాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న బాబాసాహెబ్ ఆలోచనలను నిజం చేసే దిశగా.. సమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అంబేడ్కర్ కలల సాకారం కోసం మనమంతా కృషిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు.ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి ఎక్కువ మంది బీజేపీ వారేనని మోదీ గుర్తుచేశారు. స్వతంత్ర భారతంలో ఎస్టీలకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటుచేసింది వాజ్‌పేయి ప్రభుత్వమేనన్నారు. అందుకే ఎస్టీలు ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, నాగాలాండ్, మేఘాలయల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతోందన్నారు. ఎస్టీలు బీజేపీ వెంటే ఉన్నారనటానికి ఇదే నిదర్శనమన్నారు. అటు ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని.. ఇప్పటికీ ఈ విషయం ముందుకు రాగానే కావాలని ఏదో ఒక ఆటంకాన్ని కలగజేస్తోందని మోదీ పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల మద్దతు ఎప్పటికీ బీజేపీకే ఉంటుందన్న ప్రధాని.. తమ పార్టీయే అల్పసంఖ్యాక వర్గాల వారికి సరైన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. 25 లక్షల మందితో మోదీ! నమో యాప్ ద్వారా కర్ణాటకలోని 25లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ అనుసుంధానమయ్యారు. కర్ణాటక ప్రచారం సందర్భంగా పలు వీడియో సంభాషణల ద్వారా ఇంత మంది ప్రజలతో ఆయన కనెక్ట్ అయ్యారని బీజేపీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంతమందితో అనుసంధానమైన తొలినేతగా మోదీ నిలిచారని పేర్కొంది. ఇప్పటికే నమో యాప్ ద్వారా పార్టీ మహిళ, యువజన, మైనార్టీ విభాగాలతో, రైతులతో మాట్లాడిన మోదీ.. తాజాగా పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్ మోర్చాలతోనూ సమావేశమయ్యారు. ఇందులో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, మోదీ మద్దతుదారులు కూడా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు మోదీ నమో యాప్‌ను బలమైన వేదికగా మార్చబోతున్నారని పార్టీ ఐటీ విభాగం నేత అమిత్ మాలవీయ పేర్కొన్నారు. -
మోదీ నమో యాప్ మంత్రం
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గెలుపెవరిది అన్న దానిపై ఉత్కంఠ పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు మొగ్గు చూపిస్తున్నారనే అంచనాలు ఉన్నప్పటికీ ఆఖరి నిముషంలో సమీకరణాలు ఎలాగైనా మారిపోయే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉండడంతో ప్రతీ ఓటు అత్యంత కీలకంగా మారింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి దక్షిణాదిన కూడా పట్టు పెంచుకోవాలన్న వ్యూహంలో ఉన్న బీజేపీ ప్రధానంగా పట్టణ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంది. నమో యాప్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని, అందుకే ఆ పార్టీకీ చెందిన ఏ కార్యక్రమమైనా ఆ యాప్ ద్వారా చేస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పనికైనా నమో యాప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో ఏ పని చేయాలన్నా నమో యాప్‌నే వినియోగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలతో సమావేశాలు ఈ యాప్ ద్వారా జరుగుతున్నాయి. ఇక కర్ణాటక రైతులతో కూడా నమో యాప్ ద్వారా మోదీ ముచ్చటించి వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడానికి ముందు కర్ణాటకలో అన్ని నియోజకవర్గాల ప్రజల నుంచి నమో యాప్ ద్వారానే అభిప్రాయాలను సేకరించి, వాటికి అనుగుణంగానే మేనిఫెస్టోను తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై యువత అభిప్రాయాలు నమో యాప్ ద్వారా చెప్పండంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ నమో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ప్రధాని విజ్ఞప్తి చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఎక్కువ మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటారని, తద్వారా వారి సమాచారాన్ని సేకరించి, వారి అభిప్రాయలు, అభిరుచులకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు మార్చుకోవచ్చుననే ఆలోచనలో బీజేపీ యంత్రాంగం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక ఒక ట్రయల్ రన్ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి ఎనలైటికా సంస్థ లీకేజీ వ్యవహారం తర్వాత మన సమాచారం భద్రతపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు , వివిధ రకాల యాప్‌ల విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. అదే విధంగా నమో యాప్ ద్వారా సమాచారం లీక్ అవుతోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్నాళ్ల క్రితం చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్నే లేపాయి. కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత వాస్తవం ఉందనే అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఎందుకంటే నమో యాప్ ఏకంగా 22 డేటా పాయింట్ల నుంచి వినియోగదారుల నుంచి అనుమతులు కోరుతోంది. అందువల్ల నమో యాప్‌ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే వారి సమాచారాన్ని సేకరించడం అత్యంత సులభమైన విషయం. అంతేకాదు నమో యాప్ పేరుకే ప్రభుత్వానికి చెందినదే అయినప్పటికీ, మోదీ తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికే దానిని వాడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2015 జూన్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం ఉద్దేశించిన నమో యాప్ ఇప్పటికే కోటి డౌన్లౌడ్లతో పాపులారిటీని పెంచుకుంది. 2019 ఎన్నికల నాటికి 5 కోట్ల డౌన్లోడ్లు జరగాలన్న వ్యూహంలో ఉన్న ప్రధాని మోదీ అవకాశం దొరికినప్పుడల్లా నమో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ ప్రచారం చేయడం చూస్తుంటే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే దానిని వాడుకుంటోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేవలం నమో యాప్ మాత్రమే కాదు భీమ్, ఉమంగ్, మై పాస్‌పోర్ట్ సేవ, మై గవ్, ఇండియా ఓటర్స్ లిస్ట్, ఆన్లైన్ ఆర్టీఐ, ఇన్క్రెడిబుల్ ఇండియా.. ఇలా ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లు పరోక్షంగా బీజేపీ సమాచారణ సేకరణకే ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలైతే ఉన్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ యాప్ ఎంత సమర్థంగా పనిచేస్తుందో కర్ణాటక ఎన్నికల ద్వారా తేల్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి 13.3 కోట్ల మంది కొత్త ఓటర్లు చేరుతున్నారు. వీరంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి యువ ఓటర్లను బీజేపీవైపు లాగాలన్న వ్యూహంలో ఉంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక ప్రకారమే నమో యాప్‌ను వినియోగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ యాప్‌లన్నీ కాషాయ పార్టీకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తాయి ? ఓటర్లలో ఉన్న మొగ్గును కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా ? లేదంటే ఆఖరి నిముషంలో టెక్నాలజీ మాయతో బీజేపీ కర్ణాటక పీఠాన్ని ఎగరేసుకుపోతుందా ? మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నమో యాప్‌పై ఫ్రెంచ్ హ్యాకర్ తాజా ట్వీట్లు
సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌పై ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ అల్డర్సన్ తాజా ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. ప్రధాని అధికారిక యాప్ యూజర్ల అనుమతి లేకుండానే వారి ఐపీ చిరునామాను అమెరికాకు చెందిన ఏపీఐ.నరేంద్రమోదీ.ఇన్ వెబ్‌సైట్‌కు చేరవేస్తోందని అల్డర్సన్ ఆరోపించారు. ప్రధాని మోదీ యాప్ యూరప్ నియంత్రణ సంస్థతో పాటు గూగుల్ ప్లే ప్రమాణాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. నమో యాప్‌ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీ అనుమతి లేకుండానే మీ ఫోన్లో సమాచారం సమస్తం యాప్ లాగేస్తుందని వరుస ట్వీట్లలో వెల్లడించారు. నమో యాప్ యూరప్‌లో అందుబాటులో ఉన్నందున యూరప్ రెగ్యులేటర్ జీడీపీఆర్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. యూజర్ అనుమతి లేకుండా వ్యక్తిగత డేటాను సేకరించరాదని స్పష్టం చేశారు. యూజర్ అనుమతి కోరకపోవడం గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్నారు. మరోవైపు అల్డర్సన్ సోమవారం కాంగ్రెస్ యాప్ సెక్యూరిటీ ఉల్లంఘనలపై ట్వీట్ చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ మెంబర్షిప్ పేజ్ ఐపీ అడ్రస్ సింగపూర్‌లోని సర్వర్‌కు అనుసంధానమై ఉందని ఆయన ఆరోపించారు. అల్డర్సన్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాంగ్రెస్ తన యాప్‌ను తొలగించడం గమనార్హం. -
నమో యాప్ కథాకమామిషు
నమో యాప్ ఉద్దేశమేంటి ? ఎందుకు దానిని ప్రారంభించారు ? నమో యాప్ అంత ప్రమాదకరమైనదా ? మూడో కంటికి కూడా తెలీకుండా మూడో పక్షానికి సమాచారాన్ని చేరవేస్తోందా ? ఇప్పుడు ఈ వివాదం ఎందుకు రాజకీయవేడిని పెంచుతోంది ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నమో యాప్ ప్రారంభం ఎలా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజువారీ కార్యకలాపాలు ప్రజలకు తెలియడానికి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వారితో నేరుగా పంచుకోవడానికి 2015 సంవత్సరం జూన్‌లో నమో యాప్‌ని ప్రారంభించారు. ప్రధాని నుంచి నేరుగా మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ప్రజలకు వచ్చే అవకాశం ఈ యాప్ ద్వారా లభించింది. అంతేకాదు ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగాలన్నీ కూడా వినొచ్చు. ఈ యాప్ ప్రారంభించిన తర్వాత అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ప్రధాని నమో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపు ఇస్తూ వచ్చారు. దీంతో ఈ యాప్‌ని యువతీయువకులు పెద్ద సంఖ్యలో డౌన్లోడ్లు చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకంగా 50 లక్షల మంది ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. దేశంలో యూత్ నాడిని కనిపెట్టడం కోసమే బీజేపీ ఈ యాప్‌ని వాడుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీ విద్యార్థులు పరీక్షలకు ఎలా సమాయత్తం కావాలన్న దానిపై ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంలో నమో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆ సమయంలోనే మొత్తం 15 లక్షల మందికి పైగా ఎన్సీసీ విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని యాప్ డౌన్ లోడ్ చేయడం ద్వారానే సేకరించారని వార్తలు వచ్చాయి. ఏకంగా 22 అంశాల్లో అనుమతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వినియోగదారులు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన స్మార్ట్ ఫోన్లో సమాచారానికి సంబంధించి ఎన్నో కొన్ని అనుమతులు ఇవ్వాల్సిందే. లేదంటే ఎలాంటి యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు. అలాంటిది నమో యాప్ ఏకంగా 22 అంశాల్లో పర్మిషన్లు అడుగుతోంది. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన మరే మొబైల్ అప్లికేషన్ ఇన్ని అంశాల్లో అనుమతులు అడగకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు ఉద్దేశించిన ఒక యాప్‌కు అన్ని అంశాల్లో అనుమతులు ఎందుకు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లొకేషన్, ఫోటోగ్రాఫ్స్, కాంటాక్ట్స్, మైక్రోఫోన్, కెమెరా వంటివి కాకుండా చివరికి వినియోగదారుల మెమొరీ కార్డ్‌లో సమాచారానికి కూడా అనుమతి అడుగుతోంది. దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు చేరువ కావడానికి యాప్‌లు రూపొందించాయి. కానీ అవన్నీ పరిమితమైన డేటా పాయింట్ల నుంచి అనుమతులు అడుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్‌సీ యాప్ కేవలం 10 అంశాల్లో అనుమతి అడుగుతూ ఉంటే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎస్పీ యాప్ మూడు అంశాల్లో మాత్రమే అనుమతులు కోరుతోంది. చివరికి ప్రధాని కార్యాలయం యాప్ కూడా 14 డేటా పాయింట్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అడుగుతోంది. నమో యాప్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో అనుమతులు ఇవ్వడం తప్పనిసరి కాదని పేర్కొంటున్నారు కానీ, మనం అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా దానంతట అదే వినియోగదారుల ఫోన్లో ఉన్న మొత్తం అన్ని డేటా పాయింట్ల అనుమతి తీసుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. క్లెవర్‌టాప్ పనేంటి ? నమో యాప్ వినియోగదారుల సమాచారాన్ని థర్డ్ పార్టీ డొమైన్‌కు చేరవేస్తోందని ఫ్రాన్స్‌కు చెందిన సైబర్ భద్రతా పరిశోధకుడు ఇలియట్ ఆల్డర్సన్ చేసిన వరస ట్వీట్లతో దుమారమే రేగింది. మోదీ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేయగానే ఈ సమాచారం అంతా in.wzrkt.com వెబ్‌సైట్‌కి చేరుతోందని ఆయన ట్వీట్ చేయడంతో ఈ యాప్ ఎంత ప్రమాదకరమైనదా అన్న చర్చ మొదలైంది. ఈ వెబ్సైట్ క్లెవర్‌టాప్ అనే అమెరికా కంపెనీకి చెందినదని తేలింది. క్లెవర్‌టాప్ ఒక మొబైల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్.. ఏదైనా ఒక కంపెనీ తమ యాప్‌ని కొత్తగా రూపొందిస్తే, అది డౌన్లోడ్ చేసే సమయంలో ఆటోమేటిక్‌గా క్లెవర్‌టాప్ యూజర్ ప్రొఫైల్ కూడా సమాచారాన్ని అడుగుతుంది. వినియోగదారుడి అనుమతితోనే క్లెవర్‌టాప్ సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ సమాచారం అంతటినీ క్రోడీకరించి విశ్లేషించే పని చేస్తుంది. వినియోయోగదారుల మనస్తత్వాన్ని తెలుసుకోవడం, వారు ఏ కంపెనీ ఉత్పత్తులు వాడతారు ? ఎలాంటివి ఇష్టపడతారో తెలుసుకోవడానికి చాలా కంపెనీలు క్లెవర్‌టాప్ ఇచ్చే సమాచారం మీదే ఆధారపడతాయి. దానికి అనుగుణంగానే తమ మార్కెటింగ్ వ్యూహాలను రచిస్తాయి. విజ్‌రాకెట్ అనే కంపెనీకి ఇది అనుబంధ సంస్థ... లాస్ ఏంజెల్స్, శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, బెంగుళూరు, ముంబై, న్యూఢిల్లీలో దీనికి కార్యాలయాలున్నాయి. భారత్‌లో విజ్‌రాకెట్ కంపెనీకి చెందిన కో ఫౌండర్లు సునీల్ థామస్, ఆనంద్‌జైన్, సురేష్ కొండమూడి.. వీరు ముగ్గురు రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా కంపెనీ నెట్వర్క్18లో గతంలో పనిచేశారు. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బిగ్‌బాస్..ఛోటా భీమ్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం దుర్వినియోగంపై కాంగ్రెస్–బీజేపీల మధ్య మాటల యుద్ధం సద్దుమణగక ముందే మొబైల్ యాప్స్ ద్వారా డేటా లీకేజీ వివాదం వేడిపుట్టిస్తోంది. ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్సన్ (మారుపేరు) ఈ సమాచార చౌర్యాన్ని వెలుగులోకి తీసుకురాగా.. రెండు జాతీయ పార్టీలు సోమవారం ట్విటర్ వేదికగా ఆరోపణలు గుప్పించుకున్నాయి. ప్రధాని మోదీ అధికారిక ‘నమో’ యాప్ నుంచి వ్యక్తిగత సమాచారం యూజర్ల అనుమతి లేకుండా మూడో పార్టీకి చేరుతోందని ఎలియట్ ఆరోపణలతో ఈ వివాదానికి బీజం పడగా...నమో యాప్‌పై ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ యాప్ ‘విత్ ఐఎన్‌సీ’ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోతోందని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోని సభ్యత్వ నమోదు లింక్‌ను తొలగించారని, కాంగ్రెస్ ఏదో దాస్తోందని బీజేపీ ఆరోపించింది. సరిగా పనిచేయనందునే లింక్ తొలగించామని కాంగ్రెస్ కౌంటరిచ్చింది. గతంలో ఆధార్ సాఫ్ట్‌వేర్‌లోని లొసుగుల్ని బయటపెట్టిన ఎలియట్ అల్డర్సన్ ‘నమో’ యాప్ యూజర్ల సమాచారం నుంచి అమెరికాలోని కంపెనీకి తరలిపోతోందని శనివారం వరుసగా ట్వీట్లు చేశారు. ఆదివారం మరో ట్వీట్ చేస్తూ.. తన ట్వీట్లతో అప్రమత్తమై నమో యాప్‌లోని ప్రైవసీ పాలసీలో ఎవరికీ అనుమానం రాకుండా మార్పులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యాప్ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోయిందని అల్డర్సన్ తప్పుపట్టారు. ‘డిలీట్‌నమోయాప్’ : రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘నమో’ యాప్‌పై సోమవారం ఆరోపణల్ని కొనసాగిస్తూ .. ‘ఆడియో, వీడియోలు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కాంటాక్ట్‌లను మోదీ ‘నమో’ యాప్ రికార్డు చేయడంతో పాటు మీరు ఎక్కడ ఉన్నారన్నదీ జీపీఎస్ ద్వారా తెల్సుకుంటున్నారు. భారతీయులపై గూఢచర్యం చేసేందుకు ఇష్టపడే బిగ్‌బాస్ మోదీ’ అని ట్వీట్ చేశారు. మన పిల్లల సమాచారాన్ని మోదీ కోరుకుంటున్నారని, 13 లక్షల ఎన్సీసీ క్యాడెట్స్‌తో బలవంతంగా నమో యాప్‌ను డౌన్లోడ్ చేయించారని పేర్కొంటూ ‘డిలీట్‌నమోయాప్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. ‘నమో యాప్‌లోని కోట్లాది భారతీయుల డేటాతో తన వ్యక్తిగత డేటాబేస్‌ను రూపొందించేందుకు మోదీ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో దేశంతో సంభాషించాలని ఆయన కోరుకుంటే ఎలాంటి సమస్యా లేదు. అయితే అందుకు అధికారిక పీఎంఓ యాప్‌ను వాడుతున్నారు. ఈ డేటా దేశానిది. మోదీది కాదు’ అని విమర్శించారు. ఫేస్బుక్ సమాచారం దుర్వినియోగంలో కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ సంబంధాలపై వాస్తవాల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ ట్వీట్లను బీజేపీ కూడా తిప్పికొట్టింది. యాప్‌ని ఎందుకు తొలగించారు: బీజేపీ రాహుల్ ఆరోపణలల్నిమంత్రి స్మృతీ ఇరానీ ట్విటర్లో ఎద్దేవా చేశారు. ‘రాహుల్ జీ.. యాప్స్ ఇన్స్టాల్ సమయంలో అడిగే సాధారణ అనుమతులు గూఢచర్యంతో సమానం కాదని ‘చోటా భీమ్’కి కూడా తెలుసు. ‘డిలీట్‌నమోయాప్’కి బదులు చివరకు మీ కాంగ్రెస్ యాప్‌నే తొలగించారు. సింగపూర్ సర్వర్లకు మీ యాప్ ద్వారా కాంగ్రెస్ ఎందుకు సమాచారం పంపుతుందో జవాబిస్తారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ అమిత్ మాల్వీయ ట్వీట్ చేస్తూ.. ‘కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వెబ్సైట్ లింక్ తొలగించారు. membership.inc.in లింక్‌లోకి వెళ్లి సభ్యత్వ నమోదుకు ప్రయత్నిస్తే ‘స్వల్ప మార్పులు చేస్తున్నాం. తర్వాత ప్రయత్నించండి’ అని సందేశమొస్తుంది. ఏం దాచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అని తప్పుపట్టారు. ‘హాయ్.. నా పేరు రాహుల్. దేశంలోని పురాతన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని.. మీరు మా అధికారిక యాప్‌లోకి సైనప్ అయితే మీ సమాచారాన్ని సింగపూర్‌లోని నా స్నేహితులకు చేరవేస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ వంటి సాంకేతిక నిరక్షరాస్యుడిని భారత రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తామని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. నమో యాప్ ద్వారా మోదీ, బీజేపీలు ఈవీఎంలకు అనుంధానమై హ్యాక్ చేయడం వల్లే వరుసగా ఎన్నికల్లో గెలుస్తున్నారని కూడా రాహుల్ ఆరోపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ‘విత్ఐఎన్సీ’ యాప్‌ని ఐదు నెలలుగా వాడడం లేదు: కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ దివ్య స్పందన స్పందిస్తూ.. ‘ కాంగ్రెస్ సభ్యత్వ లింకు పేజీ సరిగా పనిచేయడం లేదు. అందువల్ల కాంగ్రెస్ వెబ్సైట్ ద్వారానే కొద్దికాలం సభ్యత్వ నమోదు అందుబాటులో ఉంటుంది’ తెలిపారు. కాంగ్రెస్ కూడా ట్వీట్ చేస్తూ ‘విత్ఐఎన్సీ’ యాప్ గత ఐదునెలలుగా వాడడం లేదని.. నవంబర్ 16, 2017 నుంచి సభ్యత్వ నమోదును http://www.inc.in వెబ్‌సైట్‌కు మార్చామని తెలిపింది. ఒక ప్రభుత్వ యాప్ 15 అంశాల్లో అనుమతి కోరుతోందని, నమో యాప్ మాత్రం 22 అంశాల్లో అనుమతి అడుగుతోందని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. 10 వేల ఏటీఎంల డేటా లీక్ అయిందని, 32 లక్షల ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారుల సమాచారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్ని ఆయన ఉదహరించారు. -
మోదీ మంత్రం... రాహుల్ తంత్రం
సాక్షి, న్యూఢిల్లీ : సరికొత్త భారతాన్ని ఆవిష్కరిస్తాన న్న ప్రతిజ్ఞతతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నమో యాప్’ ద్వారా యూజర్ల సమాచారం అమెరికాలోని ఓ కంపెనీకి వెళుతోందన్న గుట్టురట్టవడంతో ఈ యాప్‌కు ‘ముందున్న హెచ్చరిక’ మాటనే మార్చి వేశారు. ‘మీ వ్యక్తిగత సమాచారం. మీ కాంటాక్టు వివరాలు, నెంబర్లు గోప్యంగా ఉంటాయి. మీరు, మేము సమాచారం ఇచ్చి, పుచ్చుకోవడానికి మినహా మరో అవసరానికి వీటిని ఉపయోగించం. ముఖ్యంగా మీ సమాచారాన్ని మీ అనుమతి లేకుండా ఏ రూపంలో కూడా మూడవ పార్టీకి తెలియజేయం’ అంటూ నమో యాప్‌లో ఆదివారం వరకు కనిపించిన ఈ హెచ్చరిక సోమవారానికి మారిపోయింది. పాత వ్యాఖ్యల చోటా‘మీకు మరింత మంచి అనుభవాన్ని ఇవ్వడం కోసం పేరు, ఈ మెయిల్, మొబైల్ నెంబర్, మొబైల్ సమాచారం, లొకేషన్, నెట్వర్క్ క్యారియర్‌కు సంబంధించిన సమాచారాన్ని మూడో పార్టీ ప్రాసెస్ చేయవచ్చు’ అంటూ కొత్త వ్యాఖ్య వచ్చి చేరింది. నమో యాప్ యూజర్ల సమాచారం ఎప్పటికప్పుడు ‘క్లెవర్ ట్యాప్ కంపెనీ ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ఏర్పాటైన ‘విజ్‌రాకెట్ ఐఎన్‌సీ’ అనే వెబ్ అనాలసిస్ ఫ్లాట్‌ఫారమ్‌కు చేరుతోందంటూ ప్రముఖ ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియెట్ ఆల్డర్సన్ (నకిలీ పేరు) శనివారం బయటపెట్టి భారత రాజకీయాల్లో బాంబు పేల్చారు. ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించి కేంబ్రిడ్జి అనలిటికా కంపెనీ కొన్ని పార్టీల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో దేశంలో కూడా రాజకీయ దుమారం రేగిన విషయం తెల్సిందే. సరిగ్గా ఇదే సమయంలో నమో యాప్ సమాచారం మూడో పార్టీకి వెళుతోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దీనిపై రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘బిగ్‌బాస్’గా సంబోధిస్తూ వ్యంగోక్తులు విసరడం, అందుకు ప్రతిగా మోదీ తరఫున కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఛోటా భీమ్’ అంటూ రాహుల్ గాంధీపై వ్యంగోక్తులు విసిరిన విషయం తెల్సిందే. శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీపై బాంబు పేల్చిన హ్యాకర్ ఆల్డర్సన్ సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధికార యాప్ ‘ఐఎన్‌సీ యాప్’పై కూడా బాంబు పేల్చారు. ఈ యాప్ యూజర్ల సమాచారం కూడా సింగపూర్‌లోని మూడోపార్టీకి వెళుతోందని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ‘నాపేరు రాహుల్ గాంధీ. భారత్‌లోని అతి పురాతన రాజకీయ పార్టీకి నేను అధ్యక్షుడిని. మా పార్టీ యాప్‌కు మీరు సైనప్ కాగానే మీ సమాచారాన్ని సింగపూర్‌లోని మా స్నేహితులకు అందజేస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఐఎన్‌సీ యాప్ పనిచేయడం లేదు. ‘మీ యాప్ కూడా మూడోపార్టీకి సమాచారం చేరవేస్తోంది’ అంటూ వస్తున్న ప్రతి విమర్శలకు ‘మా యాప్ పనిచేయడం లేదు’ అంటూ రాహుల్ గాంధీ సమాధానం ఇస్తున్నారు. ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, అటు రాహుల్ గాంధీకి తెలియకుండానే యూజర్ల సమాచారం మూడో పార్టీకి వెళుతుండవచ్చు. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు చిత్తశుద్ధితో వాస్తవాన్ని అంగీకరించి పొరపాటును సరిదిద్దడం సాధారణ రాజకీయ నాయకుడి నైతిక బాధ్యత అయినప్పుడు అంతకన్నా పైస్థాయిలో ఉన్నవారికి ఎంత నైతిక బాధ్యత ఉండాలో విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. -
మోదీ బిగ్‌బాస్.. రాహుల్ ఛోటా భీమ్!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకకి చెందిన ‘నమో’ యాప్.. అటు కాంగ్రెస్ పార్టీ అధికారిక యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశీ కంపెనీలకు చేరవేస్తూ.. డాటా ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రరూపం దాల్చాయి. ‘నమో’ యాప్ ద్వారా భారతీయులపై గూఢచర్యం చేస్తున్న బిగ్‌బాస్‌గా ప్రధాని నరేంద్రమోదీ మారిపోయారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. నమో యాప్ రహస్యంగా ఆడియో, వీడియోలను రికార్డు చేయగలదని, కాంటాక్ట్ డాటాతోపాటు జీపీఎస్ వివరాలను ట్రాక్ చేయగలదని రాహుల్ ఆరోపించారు. నమో యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమెరికాలోని థర్డ్ పార్టీ కంపెనీ క్లెవర్ ట్యాప్‌కు చేరవేస్తోందని ఫ్రెంచ్ సెక్యూరిటీ పరిశోధకుడు ఎలియట్ అల్డర్సన్ వెల్లడించడంతో రాహుల్ ఈ మేరకు ట్విట్టర్లో మండిపడ్డారు. 13 లక్షల ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా ఒత్తిడి చేశారని, మన పిల్లల సమాచారాన్ని కూడా మోదీ వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. నమో యాప్ ద్వారా దేశ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ.. ప్రధాని మోదీ తన పదవిని దుర్వినియోగపరుస్తున్నారని, ప్రధానిగా ఆయన ఈ సమాచారం సేకరించాలంటే పీఎంవో యాప్ వాడాలి కానీ, నమో యాప్ కాదని రాహుల్ విరుచుకుపడ్డారు. ‘నమో’ యాప్‌పై రాహుల్ ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. మొబైల్ యాప్‌లు మామూలు పర్మిషన్స్ అడుగుతాయని, ఈ విషయం ‘ఛోటా భీమ్’కు కూడా తెలుసునని పరోక్షంగా రాహుల్‌ను ఎద్దేవా చేశారు. ఇది గూఢచర్యమంటూ గందరగోళ పడవద్దని రాహుల్‌కు హితవు పలికారు. -
బిగ్‌బాస్ మీపై కన్నేశారు..
సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్, కాంగ్రెస్ యాప్‌లు సమాచార భద్రత విషయంలో లోపభూయిష్టంగా ఉన్నాయని ఫ్రెంచ్ హ్యాకర్ చేసిన ఆరోపణలు ఇరు పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని బిగ్‌బాస్‌గా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అభివర్ణించారు. భారతీయులపై మోదీ నిఘా పెట్టారని ఆరోపించారు. మరోవైపు పాలక పార్టీ కాంగ్రెస్‌ను సమాచారం చోరీకి పాల్పడుతోందని దుయ్యబట్టింది. ‘మోదీ నమో యాప్ మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆడియో, వీడియో, కాంటాక్టులను రహస్యంగా రికార్డు చేస్తుంది, చివరకు మీ ప్రదేశాన్ని సైతం జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంది...భారతీయులపై నిఘా పెట్టడం ఆయనకు ఇష్ట’మని రాహుల్ ట్వీట్ చేశారు. నమో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని 13 లక్షల ఎన్సీసీ కేడెట్లను ఒత్తిడి చేస్తున్నారని డిలీట్‌నమోయాప్ హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్ ట్వీట్ చేశారు. కాగా, రాహుల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. సింగపూర్‌లోని రాహుల్ స్నేహితులకు కాంగ్రెస్ యాప్ యూజర్ల డేటాను షేర్ చేస్తున్నారని బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. -
నమో బాటలోనే కాంగ్రెస్ యాప్..
సాక్షి, పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నమో యాప్ యూజర్ల అనుమతి లేకుండానే వారి డేటాను అమెరికన్ కంపెనీకి పంపుతోందని ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్సన్ ఆరోపించిన క్రమంలో తాజాగా కాంగ్రెస్ యాప్ సైతం సింగపూర్‌లోని ఓ కంపెనీకి సమాచారాన్ని చేరవేస్తోందని సంకేతాలు పంపారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాంగ్రెస్ అధికారిక యాప్ ద్వారా సభ్యత్వానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారి వ్యక్తిగత వివరాలు పార్టీ సభ్యత్వ ఆన్లైన్ పేజ్‌కు హెచ్‌టీటీపీ ద్వారా వెళతాయని అల్డర్సన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మెంబర్షిప్ పేజ్ ఐపీ అడ్రస్ సింగపూర్‌లోని ఓ సర్వర్‌కు అనుసంధానమైందని చెప్పుకొచ్చారు. అల్డర్సన్ ట్వీట్ నేపథ్యంలో కాంగ్రెస్ తీరును పలువురు ట్విటర్ యూజర్లు తప్పుపట్టారు. మరోవైపు వేరొక దేశంలో సర్వర్లు ఉన్నంతమాత్రాన డేటా లీకవుతుందనేందుకు వీలులేదని మరికొందరు చెబుతున్నారు. రాజకీయ కోణంలోనే అల్డర్సన్ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలను ప్రజల ముందుంచేందుకే తన ప్రయత్నమని ఇందులో తనకెలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఫ్రెంచ్ హ్యాకర్ అల్డర్సన్ చెప్పుకొచ్చారు. కాగా, ఐఎన్‌సీ అధికారిక యాప్‌లో భద్రతా లోపాలపై ఫ్రెంచ్ హ్యాకర్ ట్వీట్ చేసిన గంటకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తన యాప్‌ను కాంగ్రెస్ తొలగించింది. మరోవైపు కాంగ్రెస్ యాప్‌ను తొలగించడంపై బీజేపీ స్పందించింది. నమోయాప్ను డిలీట్ చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ చివరకు కాంగ్రెస్ యాప్‌నే తొలగించారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది. -
‘అవిశ్వాస’మంటే కేంద్రానికి భయం
సాక్షి, బెంగళూరు: పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానికి కేంద్రం భయపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. మైసూరులో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 10 రోజులుగా అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉందని, దాన్ని చర్చకు చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం ధైర్యం చేయడంలేదని విమర్శించారు. ఆంధ్రా పార్టీలు వైఎస్సార్సీపీ, టీడీపీ తరువాత కాంగ్రెస్ ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేలా కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించడమే బీజేపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ఘనకార్యమని రాహుల్ ఆరోపించారు. బీజేపీ వల్లే కశ్మీర్లో అస్థిరత.. ఒకప్పుడు మనకు మిత్ర దేశాలుగా ఉన్న నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు లాంటి దేశాలు ఇప్పుడు చైనాకు దగ్గరయ్యాయని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదం వెన్నెముకను యూపీఏ ప్రభుత్వం విరిచేసిందని, కానీ ఆ రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో పీడీపీ అధికారంలోకి వచ్చాక ఉగ్ర దాడులతో హింస యథావిధిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. నమో యాప్‌తో డేటా దుర్వినియోగం న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధికార ‘నమో యాప్’ ద్వారా ప్రజల అనుమతి లేకుండానే వారి సమాచారం విదేశీ కంపెనీలకు చేరుతోందని రాహుల్ ఆరోపించారు. ‘హాయ్..నేను భారత ప్రధానిని. నా అధికార యాప్‌ని వాడుకుంటే మీ సమాచారాన్నంతా అమెరికా కంపెనీల్లోని నా స్నేహితులకు ఇస్తా’ అని రాహుల్ ట్వీట్‌చేశారు. యాప్‌తో సమాచారం దుర్వినియోగమవుతోందన్న ఓ ఫ్రెంచ్ హ్యాకర్ ఆరోపణల ఆధారంగా ప్రచురితమైన కథనంపై రాహుల్ ఈ స్పందించారు. కాగా, రాహుల్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి ఇంతకన్నా గొప్ప మాటలు ఆశించలేమని బీజేపీ తిప్పికొట్టింది. -
‘మీ డేటా అమెరికన్ కంపెనీలకు చేరవేస్తా’
సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌లో డేటా ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ వ్యవహరంలో ప్రధాన స్రవంతి మీడియా మౌనం దాల్చడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ‘ హాయ్..నా పేరు నరేంద్ర మోదీ..నేను భారత ప్రధానిని..మీరు నా అధికారిక యాప్‌కు సైనప్ అవగానే మీ డేటా అంతటిని నా సహచర అమెరికన్ కంపెనీలకు ఇచ్చేస్తా’నంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ’ఎప్పటిలానే ఇంతటి కీలక అంశాన్నీ మరుగునపరిచిన మీడియాకు థ్యాంక్స్’ అని రాహుల్ చురకలు వేశారు. ప్రధాని అధికారిక యాప్ డేటా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్సన్ వెల్లడించిన క్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ అండ్రాయిడ్ నమో యాప్ వ్యక్తిగత యూజర్ల సమాచారంపై రాజీపడుతోందని, యూజర్ల సమాచారాన్ని అమెరికన్ కంపెనీగా భావిస్తున్న ఇన్.డబ్ల్యూజడ్ఆర్కేటీ.కామ్‌కు చేరవేస్తోందని అల్డరన్స్ వరుస ట్వీట్లలో ఆరోపించారు. నమో యాప్‌లో మీ ప్రొఫైల్ క్రియేట్ అయిన వెంటనే మీ డివైజ్ సమాచారంతో పాటు వ్యక్తిగత డేటా మొత్తం మీ ఆమోదం లేకకుండానే అమెరికన్ సంస్థకు చేరుతోందని అల్డర్సన్ వెల్లడించారు. -
‘నమో’ యాప్‌కు వైద్యుల ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ వైద్యులంతా ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో’ యాప్‌కు ఫిర్యాదులు పంపాలని నిర్ణయించారు. ఇందుకోసం వారు ‘నమో యాప్’ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ యాప్ ద్వారా దేశంలోని సుమారు 10 లక్షల మంది వైద్యులు తమ అభ్యంతరాలను ప్రధానికి పంపనున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఏర్పాటును దేశవ్యాప్తంగా వైద్యులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ల వైఖరిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్‌కు పంపింది. మరోవైపు ఎన్‌ఎంసీపై వైద్యులు ఆందోళనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం వైద్య సంఘాల నేతలు, సీనియర్ వైద్యుల నేతృత్వంలో సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఎన్ఎంసీ బిల్లు ఆమోదం పొంది అమలులోకి వస్తే వైద్య రంగంలో అవినీతి మరింత పెరుగుతుందని వీరు చెబుతున్నారు. ఎన్ఎంసీలో ఉండే 25 మంది సభ్యుల్లో 20 మందిని వైద్యేతర రంగంలో ఉన్న వారిని ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుందని, ఐదుగురే వైద్యులుంటారని చెబుతున్నారు. మెజార్టీ సభ్యులు ప్రభుత్వం నామినేట్ చేసిన వారే కావడంతో ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని, దీంతో వైద్యరంగంతో సంబంధం లేని వారి నిర్ణయాలే అమలవుతాయని పేర్కొంటున్నారు. మెడికల్ కాలేజీల తనిఖీకి అప్పటికప్పుడే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారని, ఇది కూడా అవినీతికి దారితీస్తుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంసీఐ విధానంలో లోపాలను సవరించాలని, లేదంటే ప్రక్షాళన చేయాలి తప్ప ఎన్ఎంసీకి ఆమోద్ర ముద్ర వేయడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నారు.