Narsingh yadav
-
నా మనసు చెబుతోంది అది కుట్రేనని...
న్యూఢిల్లీ: ఆ మచ్చే లేకుంటే మహారాష్ట్ర కుస్తీ వీరుడు నర్సింగ్ యాదవ్ ‘డబుల్ ఒలింపియన్’ రెజ్లర్ అయ్యేవాడు. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో అతన్ని తప్పించడంతోపాటు నాలుగేళ్ల నిషేధం కూడా విధించారు. ఈ శిక్షాకాలం పూర్తవడంతో మళ్లీ కసరత్తు ప్రారంభించిన నర్సింగ్ తనకు జరిగింది ముమ్మాటికీ అన్యాయమనే వాపోతున్నాడు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఏ ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, తిన్న ఆహారం, తాగునీరు ద్వారానే తనను కావాలని ఇరికించి ఒలింపిక్స్ ఆశల్ని చిదిమేశారని విచారం వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లయినా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దోషులెవరనేది తేల్చలేదని అసహనం వ్యక్తం చేశాడు. (విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్) గతేడాది సీబీఐ ఈ కేసు విషయమై కోర్టుకు నివేదిక సమర్పించింది. ఉద్దేశ పూర్వకంగా రెజ్లర్‌ను ఇరికించినట్లు, కుట్ర జరిగినట్లుగా ఆధారాలేవీ లేవని అందులో పేర్కొంది. దీనిపై నర్సింగ్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ అధికారుల్ని నర్సింగ్ సంప్రదిస్తే విచారణ ఇంకా కొనసాగుతోందని సమాధానం వచ్చింది. ఎన్నో క్లిష్టమైన కేసుల్ని దర్యాప్తు చేసే సీబీఐ ఈ చిన్న కేసులో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదన్నాడు. తనపై తనకు నమ్మకముందని... నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. 31 ఏళ్ల రెజ్లర్ సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరానికి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉండగా... ఈ నెల 15 నుంచి శిబిరం మొదలవుతుంది. గతం గతః... పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో తనకు పోటీదారుడైన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘గతం గతః. దాన్ని ఇప్పుడు తొవ్వాలని అనుకోవడం లేదు. అయితే నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దనేదే నా అభిమతం’ అని అన్నాడు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ తన సత్తా నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. (బాక్సర్ సరితాదేవి ‘నెగెటివ్’) -
నర్సింగ్, సుశీల్ మళ్లీ ‘ఢీ’
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులు భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు కొత్త ఊపిరినిచ్చాయి. నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి... చివరి నిమిషంలో డోపింగ్ కారణంగా ఈ విశ్వ క్రీడల నుంచి నర్సింగ్ తప్పుకోవాల్సి వచ్చింది. డోపింగ్‌లో పట్టుబడినందుకు ఈ మహారాష్ట్ర రెజ్లర్‌పై నాలుగేళ్ల నిషేధం విధించారు. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికి 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసేవి. నిషేధం కారణంగా నర్సింగ్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యేవి. కానీ కరోనా మహమ్మారితో టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. నర్సింగ్పై గత నెలాఖర్లో నాలుగేళ్ల నిషేధం కూడా ముగిసింది. దాంతో అతని ఒలింపిక్ ఆశలు సజీవమయ్యాయి. నిషేధం గడువు పూర్తి కావడంతో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు హరియాణాలోని సోనెపట్‌లో మొదలయ్యే జాతీయ రెజ్లింగ్ శిబిరంలో తనకూ చోటు కల్పించాలని 31 ఏళ్ల నర్సింగ్ యాదవ్ చేసిన విన్నపాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మన్నించింది. జాతీయ శిబిరానికి నర్సింగ్ హాజరు కావొచ్చంటూ అనుమతించింది. టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఇప్పటిదాకా పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో ఎవరూ అర్హత సాధించలేదు. ఈ బెర్త్ కోసం ప్రస్తుతం స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్‌కుమార్, జితేందర్, ప్రవీణ్ రాణా రేసులో ఉన్నారు. తాజాగా వీరి సరసన నర్సింగ్ యాదవ్ కూడా చేరాడు. ఫలితంగా 74 కేజీల విభాగంలో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలో తేల్చేందుకు తప్పనిసరిగా ట్రయల్స్ నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దాంతో 2016లో వివాదానికి కేంద్ర బిందువైన సుశీల్ కుమార్‌తో నర్సింగ్ యాదవ్ మళ్లీ ‘ఢీ’కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘డోపింగ్ విషయంలో భవిష్యత్‌లో చాలా జాగ్రత్తగా ఉంటానంటూ నర్సింగ్ హామీ ఇచ్చాడు. అతనిపై నిషేధం కూడా ముగిసింది. టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందేందుకు నర్సింగ్కు కూడా అర్హత ఉంది. 74 కేజీల విభాగంలో భారత్‌కు ఇంకా బెర్త్ లభించలేదు. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం ట్రయల్స్ నిర్వహిస్తాం. ఇందులో సుశీల్‌తోపాటు నర్సింగ్ ఇతర రెజ్లర్లు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుశీల్, నర్సింగ్ మధ్య బౌట్ జరిగే అవకాశం కూడా ఉంది’ అని డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. నాడు ఏం జరిగిందంటే.... భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం... ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారు ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఒలింపిక్స్‌లో పాల్గొనే వీలుంది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి నర్సింగ్ యాదవ్ 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే గాయం కారణంగా తాను 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయానని... రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహించాలో తనకు, నర్సింగ్కు మధ్య సెలెక్షన్ ట్రయల్స్ బౌట్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఆనాడు సుశీల్ కుమార్ డబ్ల్యూఎఫ్ఐను డిమాండ్ చేశాడు. అయితే సుశీల్ డిమాండ్‌ను రెజ్లింగ్ సమాఖ్య తోసిపుచ్చి నర్సింగ్‌నే రియో ఒలింపిక్స్‌కు పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సుశీల్ కోర్టుకెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే రియో ఒలింపిక్స్‌కు వారం రోజులముందు నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో పట్టుబడటం... నర్సింగ్పై కావాలనే సుశీల్ వర్గం కుట్ర చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టినా సుశీల్‌కుమార్ కుట్ర చేశాడని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును కొట్టివేశారు. -
నర్సింగ్ వస్తున్నాడు...
ముంబై: నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా... చివరి నిమిషంలో అనుమానాస్పదరీతిలో డోపింగ్‌లో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై విధించిన నాలుగేళ్ల నిషేధం గడువు ముగిసింది. ఈ మేరకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి 30 ఏళ్ల నర్సింగ్కు అధికారికంగా ఈ–మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. దాంతో మహారాష్ట్రకు చెందిన నర్సింగ్ యాదవ్ రెజ్లింగ్ కెరీర్‌కు కొత్త ఊపిరి వచ్చింది. ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో నర్సింగ్కు మళ్లీ ఒలింపిక్స్‌లో పాల్గొనే ద్వారాలు తెరుచుకున్నాయి. ‘గత శనివారం నాకు ‘వాడా’ నుంచి నా నిషేధం గడువు ముగిసినట్లు మెయిల్ వచ్చింది. ఇక నుంచి భవిష్యత్‌లో జరిగే అన్ని రెజ్లింగ్ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు నాకు అర్హత ఉంది. (ఆర్సీబీతోనే నా ప్రయాణం) 74 కేజీల విభాగంలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరానికి తన పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని భారత రెజ్లింగ్ సమాఖ్యకు నేను లేఖ రాశాను’ అని నర్సింగ్ తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్లో సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ మొదలుపెడతానని నర్సింగ్ పేర్కొన్నాడు. ‘నా జీవితలక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే. ఒలింపిక్ పతకం సాధిస్తేనే నా కథకు సరైన ముగింపు లభించినట్టు. ఒలింపిక్ పతకం నెగ్గేందుకు మరో అవకాశం లభించడం నా తలరాతలో రాసి పెట్టుందనే నమ్ముతున్నాను’ అని నర్సింగ్ అన్నాడు. నర్సింగ్ రాకతో 74 కేజీల విభాగం మళ్లీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి 74 కేజీల విభాగంలో ఎవరూ బెర్త్ సాధించలేదు. ఈ బెర్త్ రేసులో మరో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, జితేందర్, ప్రవీణ్ రాణాలతో కలిసి నర్సింగ్ కూడా చేరాడు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించడంతో 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. వాస్తవానికి ఈ విభాగంలోనే బరిలో ఉన్న రెండు ఒలింపిక్స్ పతకాల విజేత సుశీల్ కుమార్ గాయం కారణంగా 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉన్నాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల ప్రకారం తొలుత ఒలింపిక్స్‌కు అర్హత పొందిన వారే ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు. కానీ తాను గాయం కారణం గా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అందుబాటులో లేనని... రియో ఒలింపిక్స్‌కు ఎవరిని పంపించాలనే నిర్ణయం తనకు, నర్సింగ్కు మధ్య ట్రయల్ బౌట్ నిర్వహించి తీసుకోవాలని సుశీల్ కోరాడు. కానీ సుశీల్ విన్నపాన్ని డబ్ల్యూఎఫ్ఐ తోసిపుచ్చి నర్సింగ్‌కే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత ఉందని స్పష్టం చేసింది. అయితే రియో ఒలింపిక్స్‌కు రెండు వారాలు ఉన్నాయనగా నర్సింగ్ డోపింగ్‌లో పట్టుబడటం, అతనిపై నిషేధం విధించడం జరిగింది. -
ఎందాకొచ్చింది మీ దర్యాప్తు?
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సోమవారం సీబీఐని తలంటింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా డోపీగా మార్చిన ఉదంతంపై విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. ‘రియో’కు అర్హత పొందిన నర్సింగ్‌ను మెగా ఈవెంట్ నుంచి తప్పించాలనే దురుద్దేశంతో కొందరు అతను తినే ఆహారంలో డ్రగ్స్ కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. ఏదేమైనా డోపీ మరకతో నర్సింగ్ చివరి నిమిషంలో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. అనంతరం న్యాయపోరాటం చేస్తున్నాడు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేకుండా ఉంది. దీంతో సీబీఐ తీరుపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ ఎప్పటికీ పూర్తి చేస్తారని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తదుపరి కోర్టు విచారణ జరిగే ఫిబ్రవరి 1వ తేదీకల్లా తెలపాలని జస్టిస్ నజ్మీ వాజిరి ఆదేశించారు. ‘ఇప్పటి వరకు ఏం చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఇది సీబీఐ అనుకుంటున్నారా లేక మరేదైనా ఏజెన్సీనా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాకారుల కెరీర్ నాశనమవడం భారత క్రీడల ప్రగతికి చేటని జస్టిస్ నజ్మీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
నర్సింగ్ వివాదంలో సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదానికి సంబంధించి సెం ట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసును నమోదు చేసింది. ఐపీసీ కోడ్ 506, 328 (విషాహారం), 120-బి (కుట్ర) ప్రకారం కేసును నమోదు చేశారు. రియో ఒలింపిక్స్‌కు ముందు నిర్వహించిన డోప్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్పేర్రకాలు వాడినట్లు తేలింది. అరుుతే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నర్సింగ్పై కుట్ర జరిగిందని విశ్వసించి అతనికి క్లీన్చిట్ ఇచ్చింది. కానీ రియోకు చేరుకున్నాక కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) ‘నాడా’ నిర్ణయాన్ని తప్పుబడుతూ నర్సింగ్పై నాలుగేళ్ల నిషేధాన్ని విధించడంతోపాటు ఒలింపిక్స్ నుంచి తప్పించింది. హరియాణాలో జరిగిన శిక్షణ శిబిరం సందర్భంగా తన ఆహారంలో గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిషేధిత ఉత్పేర్రకాలు కలిపారని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. -
డోపింగ్ కేసుపై సీబీఐ విచారణ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కు ముందు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు స్వీకరించనుంది. ఈ మేరకు తమ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ శుక్రవారం స్సష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రధాని కార్యాలయంలోని అధికారుల్ని కలిసి ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. 'నర్సింగ్ యాదవ్ డోపింగ్ ఉదంతంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ కేసుకు సంబంధించి ప్రధాని కార్యాలయంలో అధికారుల్ని కలిశా. ఇందుకు పీఎంవో కార్యాలయం సానుకూలంగా స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ దర్యాప్తు చేస్తుంది' అని బ్రిజ్ భూషణ్ తెలిపారు. గత జూన్‌లో నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో ఇరుక్కున సంగతి తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న నర్సింగ్ ఆశలు ఆవిరయ్యాయి. దాంతో పాటు నాలుగేళ్ల నిషేధం విధిస్తూ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పునిచ్చింది. అయితే తాను డోపింగ్ పాల్పడలేదని, ఎవరో చేసిన కుట్రకు బలయ్యానని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. ఈ వాదనకు భారత రెజ్లింగ్ సమాఖ్య కూడా మద్దతుగా నిలిచింది. -
నర్సింగ్ నిషేధంపై సుశీల్ ఏమన్నాడంటే..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముందు రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో చిక్కుకోవడానికి మరో రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే వాదన బలంగా వినిపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదు. కాగా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా).. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో చేసిన సవాల్‌తో నర్సింగ్పై నాలుగేళ్ల నిషేధం పడింది. దాంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండానే నర్సింగ్ నిష్క్రమించాడు. అయితే నర్సింగ్ యాదవ్ నిషేధంపై సుశీల్ కుమార్ మరోసారి పెదవి విప్పాడు. ఆ నిషేధాన్ని వాడా పునఃసమీక్షిస్తే నర్సింగ్ యాదవ్ కు ఊరట లభిస్తుందన్నాడు. అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నా, లేక తగ్గించాలన్ని అది కేవలం వాడా చేతుల్లోనే ఉందన్నాడు. ఏ ఒక్క రెజ్లర్ నిషేధానికి గురైనా అతని కెరీర్ దాదాపు ముగిసిపోయేట్ల్లేనని, అదే క్రమంలో రూల్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా లేకపోలేదన్నాడు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ నుంచి తాను అన్యూహ్యంగా వైదొలగడం మాత్రం ఇప్పటికీ క్షమించరానిదేనని సుశీల్ పేర్కొన్నాడు. తాను ఒలింపిక్స్ లో పాల్గొనకుండా వైదొలిగిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనన్నాడు. -
నర్సింగ్ నిషేధానికి గురికాకపోయి ఉంటే..
ముంబై: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధానికి గురికాకపోయిఉంటే భారతదేశానికి వెండి పథకం సాధించి ఉండేవాడని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) సెక్రెటరీ వీఎన్ ప్రసూద్ తెలిపారు. ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో నర్సింగ్ శిక్షణ పొందిన సోనేపేట్ క్యాంప్ లో తనపై కుట్ర జరిగిందని నాడా సైతంకు క్లీన్ చీట్ ఇచ్చిన విషయాన్ని ప్రసూద్ గుర్తు చేశారు. నర్సింగ్ పై ఆరోపణలను నిరూపించకుండానే నాలుగేళ్లు నిషేధం విధించారని చెప్పారు. ఈ వివాదంపై సీబీఐ తో విచారణ జరిపించి నిజాలను నిగ్గుతేల్చాలని డబ్ల్యూఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
నా కెరీర్ ముగిసిపోయినట్లే!
న్యూఢిల్లీ: తనపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని మరొకసారి సమీక్షించకపోతే ఇక కెరీర్ ముగిసిపోయినట్లేనని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో భారత దేశం జోక్యం చేసుకోవాలని నర్సింగ్ పేర్కొన్నాడు. 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పును పునఃసమీక్షించకపోతే నా కెరీర్ ముగిసినట్లే. ఈ నిషేధం అనేది కేవలం నా ఒక్కడికే పరిమితం కాదు.. యావత్ దేశానికే సంబంధించింది. నా కేసును సమీక్షించడానికి దేశంలోని పెద్దలు చొరవచూపకపోతే ఒక అమాయకుడు బలవుతాడు' అని నర్సింగ్ తెలిపాడు. ఈ డోపింగ్ ఉదంతంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని నర్సింగ్ మరోసారి పునరుద్ఘాటించాడు. జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు. కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా సవాల్ చేయడం, ఆపై నర్సింగ్ పై నిషేధం పడటంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
'సీబీఐ విచారణ జరగాల్సిందే'
రియో డీ జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై డోపింగ్ కుట్ర జరిగిందని బలంగా వాదిస్తున్న డబ్యూఎఫ్ఐ(రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా).. ఈ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ జరగాల్సేందనని డిమాండ్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు వెలికి రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లిన నర్సింగ్ యాదవ్ ఆశలకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో బ్రేక్ పడింది. దాంతో పాటు అతనిపై నాలుగేళ్ల నిషేధం కూడా విధించింది. నర్సింగ్ పై డోపింగ్ కుట్ర జరిగిందనడానికి బలమైన ఆధారాలు లేనందును అతనిపై సస్పెన్షన్ వేటూ వేస్తూ తీర్పు వెలువరించింది. జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు. కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) తన అధికారం మేరకు సీఏఎస్ లో సవాల్ చేసింది. దీనిపై విచారణకు స్వీకరించిన సీఏఎస్.. నర్సింగ్ కుట్ర కారణంగానే డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఉదంతం డోపింగ్ కుట్రలో భాగమేనని డబ్యూఎఫ్ఐ భావిస్తోంది. -
'ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ తీసుకున్నాడు'
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువసార్లు నిషేధిత డ్రగ్స్ టాబ్లెట్ రూపంలో నోటి ద్వారా తీసుకున్నాడని వెల్లడించింది. తనపై కుట్ర జరిగిందని ఆరోపించిన నర్సింగ్ ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యాడని తెలిపింది. అతడి నుంచి సేకరించిన అన్ని నమూనాలను క్షుణ్ణంగా పరిక్షించినట్టు వెల్లడించింది. అతడు నిషేధిత డ్రగ్స్ వాడినట్టు జూన్ 25 నిర్వహించిన డోపింగ్ టెస్టులో వెల్లడైందని గుర్తు చేసింది. ఒకటి లేదా రెండు మెథాన్డీనోన్ టాబ్లెట్లు నోటి తీసుకున్నట్టు తేలిందని, దీన్ని నీటిలో కలిపి తీసుకున్నట్టు నిర్థారణ కాలేదన్నారు. అయితే తన మంచినీళ్ల సీసాలో ఎవరో నిషేధిత పదార్థాలు కలిపారని, తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని నర్సింగ్ యాదవ్ అంతకుముందుకు అన్నాడు. దీనికి ఆధారాలు సమర్పించడంలో విఫలమవడంతో అతడిపై సీఏఎస్ నాలుగేళ్ల నిషేధం విధించింది. దీంతో అతడు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. -
'నా కలను క్రూరంగా చిదిమేశారు'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలను క్రూరంగా చిదిమేశారని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తనపై నాలుగేళ్ల నిషేధం విధించడం పట్ల అతడు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు. 'ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు రెండు నెలలుగా ఎంతో శ్రమించాను. ప్రతిష్టాత్మక క్రీడల్లో దేశ గౌరవాన్ని నిలబెట్టాలని నిరంతరం తపించాను. రియో ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించి పెట్టాలన్నది నా కల. బౌట్ లో దిగడానికి 12 గంటల ముందు నాపై నిషేధం విధించి నా కలను దారుణంగా చిదిమేశార'ని నర్సింగ్ వాపోయాడు. తన నిర్దోషత్వం నిరూపించుకోవడానికి చేయాల్సిదంతా చేస్తానని, పోరాటం కొనసాగిస్తానని ఒక ప్రకటనలో తెలిపాడు. నర్సింగ్ అమాయకుడని, అతడి న్యాయ పోరాటానికి అండగా ఉంటామని స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్ తెలిపింది. -
నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం
-
నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం
రియో డి జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ ఆశలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధించింది. దీంతో చివరి నిమిషంలో ఒలింపిక్స్ నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ రోజు జరగనున్న పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్లో అతడు బరిలో దిగాల్సివుంది. డోపింగ్‌లో 'నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో 'వాడా' సవాల్ చేసింది. కుట్ర కారణంగానే అతడు డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను సీఏఎస్ అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు సీఏఎస్ పేర్కొంది. రియో ఒలింపిక్స తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ రెజ్లర్ జలీమ్ ఖాన్‌తో నర్సింగ్ పోటీపడాల్సివుంది. సీఏఎస్ తీర్పు దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆటగాడిపై చివరి నిమిషంలో నిషేధం విధించడం పట్ల డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు బీబీ శరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
నర్సింగ్కు మరో గండం!
‘నాడా’ క్లీన్‌చిట్‌పై ‘వాడా’ అప్పీల్ కొనసాగుతున్న విచారణ 18న తీర్పు వచ్చే అవకాశం రియో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం మళ్లీ సందేహంలో పడింది. ఈ నెల 19న అతను బరిలోకి దిగాల్సి ఉండగా, మూడు రోజుల ముందు అతనికి మరో షాక్ తగిలింది. డోపింగ్ వివాదంలో నర్సింగ్‌ను నిర్దోషిగా తేలుస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చిన తీర్పుపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సందేహం వ్యక్తం చేసింది. క్లీన్‌చిట్‌ను సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్)లో అప్పీల్ చేసింది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ ప్రారంభం కాగా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా సహా ‘వాడా’ అధికారులు దీనికి హాజరయ్యారు. నిషేధిత ఉత్ప్రేరకం మెథడనోన్ తీసుకోవడంతో రెండు సార్లు పాజిటివ్‌గా తేలిన నర్సింగ్... తనపై కుట్ర జరిగిందని ఆరోపించాడు. విచారణ తర్వాత ‘నాడా’ అతని తప్పేమీ లేదని తేల్చింది. దీనికి తోడు భారత రెజ్లింగ్ సమాఖ్య అండగా నిలవడంతో నర్సింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రియో చేరుకున్నాడు. ఇలాంటి సమయంలో ‘వాడా’ అప్పీల్‌కు వెళ్లడం అతనికి కొత్త సమస్య తెచ్చి పెట్టింది. పోటీలకు ముందు రోజు గురువారం విచారణ కొనసాగుతుంది. అదే రోజు అతనికి అనుకూలంగా తీర్పు వస్తే నర్సింగ్ బరిలోకి దిగుతాడు. ‘వాడా’ అప్పీల్ సరైనదిగా ‘కాస్’ భావిస్తే నర్సింగ్పై కనీసం నాలుగేళ్ల నిషేధం పడుతుంది. తాము చివరి వరకు పోరాడతామని, నర్సింగ్కు న్యాయం జరిగి అతను ఒలింపిక్స్‌లో పాల్గొనేలా చేస్తామని మెహతా విశ్వాసం వ్యక్తం చేశారు. -
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు షాక్!
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా.. లేదా అన్న దానిపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. నాడా రిపోర్టులను పరిగణనలోకి తీసుకోకుండా నర్సింగ్ ను ఈ నెల 18న ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి ఆ రెజ్లర్ ను ప్రశ్నించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) నిర్ణయించింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) జరిపిన డోపింగ్ టెస్టులో పాజిటీవ్ గా తేలినా అతడి తప్పులేదని భావించి అతడికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థలకు నాడా అందజేసింది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, వాడా మాత్రం నర్సింగ్‌ను బరిలో దింపేందుకు అనుమతించడం లేదు. తాజాగా నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించాలనుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించింది. నాడా క్లీన్ చిట్ ను వాడా పట్టించుకోలేదు. దీంతో క్లీన్ చిట్ కోసం నర్సింగ్ మళ్లీ అప్పీలు చేయనున్నాడు. క్లీన్ చిట్ రాకపోవడంతో నర్సింగ్ రియోలో ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది. వాడా అప్పీల్ విషయం మాకు సోమవారం తెలిసిందని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు. దీనిపై అదేరోజు మా లాయర్ ద్వారా బదులిచ్చినట్లు తెలిపారు. 18న దీనిపై విచారణ కొనసాగుతుంది. కచ్చితంగా దీని నుంచి నర్సింగ్ బయటపడతాడని ఆయన ధీమాగా ఉన్నారు. -
ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నుంచి లైన్ క్లియర్
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో వెళ్లేందుకు మరో కీలక అడ్డంకి తొలగింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) అనుమతి ఇచ్చింది. ‘నాడా’ విచారణలో నిర్దోషిగా తేలిన వెంటనే భారత రెజ్లింగ్ సమాఖ్య యూడబ్ల్యూడబ్ల్యూకు లేఖ రాసింది. ‘ఒలింపిక్స్ సహా ఏ ఇతర అంతర్జాతీయ పోటీల్లోనైనా నర్సింగ్ పాల్గొనవచ్చు. అతను చాలా ముందుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు’ అని యూడబ్ల్యూడబ్ల్యూ ప్రకటించింది. మరో వైపు ‘వాడా’నుంచి స్పందన రావాల్సి ఉన్నా... ప్రస్తుతానికి రియో బయల్దేరేందుకు నర్సింగ్ సిద్ధమయ్యాడు. -
‘క్లీన్చిట్’ను సమీక్షిస్తాం
నర్సింగ్ వివాదంపై ‘వాడా’ ప్రకటన న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంనుంచి బయట పడ్డానని ఆనందంలో ఉన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు మరో పరీక్ష ఎదురైంది. నర్సింగ్ నిర్దోషి అంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్‌చిట్‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) స్పందించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తాము మరోసారి సమీక్షిస్తామని ‘వాడా’ ప్రకటించింది. ‘ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌కు మాకు పంపమని ‘నాడా’ను కోరాం. మేం దీనిని మరోసారి సమీక్షిస్తాం. ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేం’ అని వాడా ఉన్నతాధికారి మ్యాగీ డ్యురాంగ్ వెల్లడించారు. మరోవైపు నర్సింగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఎలాంటి ఆందోళనా లేకుండా దేశానికి పతకం తెచ్చేలా దృష్టిపెట్టాలని మోదీ సూచించారని చెప్పాడు. -
కనీసం టీ కూడా తాగడం లేదు..
వారణాసి:గత కొన్ని రోజులుగా డోపింగ్ వివాదంలో చిక్కుకున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు ఉపశమనం లభించడంతో వారణాసిలో అతని ఇంటి వద్ద పండుగ వాతావారణం నెలకొంది. గత నెల్లో నర్సింగ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇవ్వడంతో అతని నివాసం సందడిగామారింది. పలువురు అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకోగా, నర్సింగ్ యాదవ్ తల్లి భూల్నా దేవి ఆనందం వ్యక్తం చేశారు. నర్సింగ్ పై వచ్చిన డోపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేసిన తల్లి.. ఈ వివాదం అనంతరం తన కుమారుడు కనీసం టీ కూడా తాగడం లేదన్నారు. నర్సింగ్ జీవితంలో అతి పెద్ద దుమారం రేపిన డోపింగ్ ఘటన తరువాత అతను దాదాపు అన్ని అలవాట్లను వదిలేసుకున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నర్సింగ్ కు డోపింగ్ వివాదంలో క్లీన్ చిట్ ఇస్తూ నాడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతను రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు ఉపశమనం లభించింది. దీంతో భారత్ నుంచి 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ ప్రాతినిథ్యం షురూ అయ్యింది. -
రెజ్లర్ నర్సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో ఇరుక్కున భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది . గత కొన్ని రోజులుగా నర్సింగ్ చుట్టూ అలుముకున్న డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టింది. డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్ కు క్లీన్ చిట్ ఇస్తూ నాడా తుది నిర్ణయం తీసుకుంది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు అవకాశం కల్పించింది. దీంతో రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ పాల్గొనేందుకు దాదాపు లైన్ క్లియరయ్యింది. ఈ మేరకు తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్ర ప్రకటించిన నాడా.. డోపింగ్ వివాదంలో నర్సింగ్ తప్పిదం లేదని పేర్కొంది. ఎవరో చేసిన కుట్రకు నర్సింగ్ బలయ్యాడని స్పష్టం చేసింది. ఈ విషయంలో అసలు నర్సింగ్ ప్రమేయం లేదని నమ్మిన కారణంగానే అతనికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు నాడా డైరెక్టర్ నవీన్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కి నాడా నివేదించనుంది. గత నెల్లో నర్సింగ్ పై డోపింగ్ వివాదం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. గత నెల 5న హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్కు డోపింగ్ పరీక్ష నిర్వహించగా అతను నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలింది. అయితే దీనిపై నర్సింగ్ పలు ఆరోపణలు చేశాడు. తనను కావాలనే కుట్రలో ఇరికించారని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా నాడాను ఆశ్రయించాడు. ఇప్పటికే నర్సింగ్ యాదవ్ వాదనలను పలుమార్లు విన్న నాడా చివరకు అతనికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డోపింగ్ వివాదాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ)కూడా సీరియస్ గా తీసుకుని నర్సింగ్ కు మద్దతుగా నిలిచింది. -
నేను బలంగా నమ్ముతున్నా: నర్సింగ్
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడ్డ భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అంశంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంలో నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కు తగిన ఆధారాలు సమర్పించడంలో విఫలమైన నర్సింగ్.. తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నాడు. 'డోపింగ్ వివాదంలో నా ప్రమేయం లేదు. కుట్ర పూరితంగానే జరిగిందని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నాడాకు తెలియజేశాం. డోపింగ్ వ్యవహారంలో జరిగిన వాస్తవాన్ని నాడాకు వివరించా. ఇక వారి నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నా. నాకు నమ్మకం ఉంది. ప్యానల్ నుంచి నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని బలంగా నమ్ముతున్నా'అని నర్సింగ్ పేర్కొన్నాడు. గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీనిపై సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే నర్సింగ్ యాదవ్ ఏదైతే వాదిస్తున్నాడో దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేదని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ తెలిపారు. దీంతో రియో ఒలింపిక్స్ లో నర్సింగ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవైపు నర్సింగ్ తన రియో ఆశలపై నమ్మకం వ్యక్తం చేస్తుండగా.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధనల ప్రకారం ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. -
తేలని భవితవ్యం!
నర్సింగ్పై నాడా విచారణ పూర్తి శని లేదా సోమ వారాల్లో తీర్పు ఒలింపిక్స్ అవకాశం లేనట్లే న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడ్డ రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఒలింపిక్స్‌లో పాల్గొనే అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల పాటు రెజ్లర్‌ను సుదీర్ఘంగా విచారించిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పును వాయిదా వేసింది. దీంతో నర్సింగ్ ఒలింపిక్స్ ఆశలు సన్నగిల్లడంతో పాటు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మాత్రం పెరిగింది. అయితే శని లేదా సోమ వారాల్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీన్ని నోట్ చేసుకున్న నాడా న్యాయ బృందం పూర్తిస్థాయి నివేదికను క్రమశిక్షణ కమిటీకి అందజేయనుంది. ‘విచారణ పూర్తయింది. శని లేదా సోమవారాల్లో తీర్పు రావొచ్చు. అయితే నర్సింగ్ ఒలింపిక్స్ వెళ్లేందుకు అర్హుడు కాడని నాడా బలంగా వాదిస్తోంది. ఎందుకంటే అతనిపై కుట్రపూరితంగా నేరం మోపారని రెజ్లర్ చెబుతున్నాడు. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలు, రుజువులు మాత్రం చూపలేకపోతున్నాడు. తను తాగే నీటిలో ఏదో కలిపారని అఫిడవిట్ దాఖలు చేశాడు. కానీ నాడా, వాడాను సంతృప్తిపరిచే స్థాయిలో దాన్ని రుజువు చేయలేకపోతున్నాడు. ఉద్దేశపూర్వకంగా తను తప్పు చేయకపోతే అందుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని లేకపోతే శిక్ష పడుతుందని ఘాటుగా హెచ్చరించాం. ఓ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తను తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకోకుంటే ఎలా అని ప్రశ్నించాం. అయినా సరే ప్యానెల్‌కు నర్సింగ్ సమర్పించిన ఆధారాలు ఏమాత్రం సరితూగడం లేదు’ అని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ పేర్కొన్నారు. ‘వాడా’ నిబంధన ప్రకారం సరైన ఆధారాలు ఇవ్వని పక్షంలో ఒలింపిక్స్‌కు అనర్హత వేటు వేస్తూ శిక్ష పడుతుంది. మరోవైపు నర్సింగ్కు న్యాయం జరగాలని అతని మద్దతుదారులు నాడా ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేశారు. సాయ్ సెంటర్‌కు పోలీసులు సోనేపట్: డోపింగ్‌పై నర్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల బృందం ‘సాయ్’లో విచారణ జరిపింది. సాక్షులు, కోచ్‌లు, వార్డెన్లతో పాటు మరికొంత మందిని కూడా ప్రశ్నించామని నేర విచారణ విభాగం (సీఐఏ) అధికారి ఇందర్వీర్ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఈయనను ప్రత్యేకంగా నియమించారు. కేసుతో సంబంధం ఉన్న అందరి నుంచి స్టేట్మెంట్లను సేకరించామని, నర్సింగ్ అనుమానాలు వ్యక్తం చేసిన రెజ్లర్ జితేశ్‌ను తర్వాత విచారిస్తామని ఇందర్వీర్ చెప్పారు. పోలీసులు విచారణ జరుపుతున్నప్పుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ అక్కడే ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే ఏదైనా జరగొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. సాయ్ సెంటర్ తమ పరిధిలోకి రాదని అందుకే జోక్యం చేసుకోలేకపోతున్నామన్నారు. నర్సింగ్పై వాడా కన్ను! మొత్తానికి నర్సింగ్ డోపింగ్ అంశం వాడా దృష్టికి కూడా వెళ్లింది. వాడా సలహా మేరకే ఈ నెల 5న రెజ్లర్‌కు సంబంధించి రెండో శాంపిల్‌ను సేకరించి పరీక్షించినా అందులోనూ పాజిటివ్ ఫలితమే వచ్చింది. వాస్తవంగా జూన్ 25న సేకరించిన రెండు శాంపిల్స్‌లో మొదట ఒకదాన్ని పరీక్షించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఈనెల 21న నర్సింగ్ సమక్షంలో బి-శాంపిల్‌నూ టెస్టు చేయగా అక్కడ కూడా ప్రతికూల ఫలితమే వచ్చింది. దీంతో వాడా ఆదేశాల మేరకు ఈనెల 5న నర్సింగ్ నుంచి ప్రత్యేకంగా రక్త, మూత్ర నమూనాలను తీసి పరీక్షించామని నాడా డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు నాడా విచారణలో నర్సింగ్ నిర్దోషిగా తేలితే ప్రవీణ్ రాణా స్థానంలో మళ్లీ అతన్ని ఎంపిక చేస్తామని ఐఓఏ వెల్లడించింది. -
నర్సింగ్కు క్లియరెన్స్ వస్తే..!
న్యూఢిల్లీ: డోపింగ్ టెస్టులో పడిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై ఇంకా విచారణ కొనసాగుతోందని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) స్పష్టం చేసింది. దీనిలో భాగంగా నర్సింగ్ కు మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒకవేళ నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి నర్సింగ్ యాదవ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తే అతన్ని రియోకు పంపించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే నర్సింగ్ యాదవ్‌కు క్లియరెన్స్ వచ్చిన పక్షంలో అతన్ని పంపించాలా? లేదా? అనేది భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుందన్నారు. 'ప్రస్తుతానికి 74 కేజీల విభాగంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాను పంపించేందుకు సిద్ధమయ్యాం. మరోవైపు నర్సింగ్ కేసును కూడా నాడా విచారిస్తోంది. అతనికి మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నారు. నర్సింగ్ కు క్లియరెన్స్ వచ్చి అతన్నే పంపాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ భావిస్తే ఆ రకంగానే చర్యలు తీసుకుంటాం. ఇందుకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐఓసీ అనేది కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లాంటింది. మేము సదుపాయాల్ని సమకూర్చే వాళ్ల మాత్రమే. డబ్యూఎఫ్ఐ రానాను పంపాలని నిర్ణయించింది కాబట్టి ఆ సమాచారాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు తెలియజేశాం'అని రాజీవ్ మెహతా తెలియజేశారు. క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాకు రియోకు పంపేందుకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. -
రెండో పరీక్షా తప్పాడు!
డోపింగ్ టెస్టులో మళ్లీ నర్సింగ్ విఫలం పోలీసు విచారణ ప్రారంభం ‘నాడా’ విచారణకు హాజరు న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణలతో రియో ఒలింపిక్స్‌కు దూరమైన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రెండో అవకాశం కూడా ఆదుకోలేకపోయింది. జూలై 5న హాజరైన డ్రగ్ పరీక్షలో కూడా నర్సింగ్ విఫలమైనట్లు సమాచారం. ‘పది రోజుల తర్వాత హాజరైన డోపింగ్ టెస్టులో కూడా మార్పు ఏమీ లేదు. అతను ఇచ్చిన రెండు శాంపిల్స్‌లో కూడా అవే నిషేధిత ఉత్ప్రేరకం మెథడినోన్ లక్షణాలు కనిపించాయి’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. జూన్ 25న తొలి పరీక్షలో విఫలం కావడంతో నర్సింగ్పై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించడంతో పాటు అతని స్థానంలో ఒలింపిక్స్‌కు ప్రవీణ్ రాణాను ఎంపిక చేశారు. వారు చేసి ఉండవచ్చు: తనపై కుట్ర జరిగిందంటూ నర్సింగ్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై బుధవారం పోలీస్ విచారణ మొదలైంది. మాజీ రెజ్లింగ్ సహచరులు ఇద్దరు కుట్రకు కారణమంటూ నర్సింగ్ సోనేపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ‘నన్ను కావాలనే ఇరికించారంటూ మొదటినుంచీ చెబుతున్నాను. నాపై ఆరోపణలు రుజువు కాకపోతే నేనే రియో వెళతాను. నా ఆహారంలో ఏదో కలిపేందుకు ప్రయత్నించిన వారిని నేను గుర్తు పట్టాను. ఇవే వివరాలు పోలీసులకు అందించాను’ అని నర్సింగ్ చెప్పాడు. తాము అనుమానిస్తున్న ఆ ఇద్దరు రెజ్లర్లు ఛత్రశాల్ (సుశీల్ శిక్షణా కేంద్రం)కు చెందిన జితేశ్, సుమీత్ అని వెల్లడించిన సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్... మరిన్ని విషయాలు బయటపడాలంటే సీబీఐ విచారణ చేయాలన్న నర్సింగ్ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు డోపింగ్‌తో ప్రపంచం దృష్టిలో పడ్డామని క్రీడా మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ చర్చకు త్వరలోనే ముగింపు ఇస్తామన్న ఆయన... అప్పటి వరకు ఒకరిని మరొకరు నిందించుకుంటూ పుకార్లు ఆపాలని సూచించారు. ‘నాడా’ ముందు హాజరు: డోపింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చుకునేందుకు నర్సింగ్ యాదవ్ బుధవారం జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ముందు హాజరయ్యాడు. సాయంత్రం 4 గంటలనుంచి దాదాపు మూడు గంటలకు పైగా అతని విచారణ కొనసాగింది. దీనిపై తుది నివేదిక గురువారం వచ్చే అవకాశం ఉంది. మరో వైపు నర్సింగ్ తల్లిదండ్రులు, మిత్రులు తమవాడికి న్యాయం చేయాలంటూ వారణాసి సమీపంలోని అచ్గరా గ్రామంలో ధర్నా నిర్వహించారు. వారణాసిలో స్థానికుల మద్దతు తీసుకుంటూ శనివారం ప్రధాని మోది కార్యాలయాన్ని ఘెరావ్ చేయాలని కూడా వారు నిర్ణయించారు. -
ఆ విషయంలో వేరే ఆప్షనే లేదు : కేంద్ర మంత్రి
ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆటగాళ్ల స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేది లేదని క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టంచేశారు. యాంటీ డోపింగ్ ప్యానెల్ నిషేధించిన ఆటగాళ్ల స్థానంలో వేరొకరికి చాన్స్ ఇవ్వడం లాంటివి ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రియోకు అర్హత సాధించిన ఓ ప్లేయర్ ఎవరైనా డోపింగ్ టెస్టులో విఫలమైతే ఈ విషయంలో వేరే ఆప్షన్ ఉండదని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఒకవేళ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్లేయర్ తీవ్ర అస్వస్థతకు లోనైన ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఇతర ఆటగాడిని రియోకు పంపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపారు. మరోవైపు నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడని ప్రచారంలో ఉంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఈ విషయంపై సమాచారం అందించింది.