Naseem Shah
-
Aus vs Pak: ఆసీస్‌తో వన్డే.. దంచికొట్టిన షాహిన్ ఆఫ్రిది, నసీం షా.. కానీ..
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారూ పేసర్ల విజృంభణ ముందు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో టెయిలెండర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా దంచికొట్టడంతో పర్యాటక జట్టు రెండు వందల మార్కును దాటగలిగింది.ఆస్ట్రేలియా పర్యటనలోకాగా వరుస ఓటముల అనంతరం పాక్ జట్టు ఇటీవలే ఫామ్‌లోకి వచ్చింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచి పునరుత్తేజం పొందింది. అనంతరం.. మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇక ఈ టూర్‌తో మహ్మద్ రిజ్వాన్ పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య సోమవారం నాటి తొలి వన్డేకు మెల్బోర్న్ వేదికైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ పాక్ ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(1), అబ్దుల్ షఫీక్(12)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపాడు.బాబర్, రిజ్వాన్ నామమాత్రంగానే..అయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(37).. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(44)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, బాబర్‌ను అవుట్ చేసి ఆడం జంపా ఈ జోడీని విడదీయగా.. రిజ్వాన్ వికెట్‌ను మార్నస్ లబుషేన్ దక్కించుకున్నాడు.మిగతా వాళ్లలో కమ్రాన్ గులామ్(5), ఆఘా సల్మాన్(12) పూర్తిగా విఫలం కాగా.. ఇర్ఫాన్ ఖాన్ 22 పరుగులు చేయగలిగాడు. ఇలా స్పెషలిస్టు బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా బ్యాట్ ఝులిపించారు.షాహిన్ ధనాధన్.. నసీం సూపర్గాషాహిన్ 19 బంతుల్లోనే 24 రన్స్(3 ఫోర్లు, ఒక సిక్సర్) చేయగా.. నసీం షా ఆడిన కాసేపు సిక్సర్లతో అలరించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 40 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లు ఉండటం విశేషం. ఈ క్రమంలో పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 203 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్లు స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ కమిన్స్ రెండు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్లు ఆడం జంపా రెండు, లబుషేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Starc gets the ball rolling! #AUSvPAK pic.twitter.com/CYXcVECkj1— cricket.com.au (@cricketcomau) November 4, 2024 ఇదిలా ఉంటే.. నసీం షా ఇన్నింగ్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై ఇలాంటి షాట్లు బాదడం మామూలు విషయం కాదంటూ కొనియాడుతున్నారు. ఇక పాక్ జట్టు ఫ్యాన్స్ అయితే.. నసీం కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి వాళ్లు నసీంను చూసి నేర్చుకోవాలంటూ వీరిద్దరి వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. Babar and Rizwan should learn something from Naseem Shah. #PAKvsAUS pic.twitter.com/Hd7BhgtAMa— Humza Sheikh (@Sheikhhumza49) November 4, 2024 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే- మెల్బోర్న్తుదిజట్లుఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
'జస్ప్రీత్ బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్'
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో బుమ్రాను మించినవారు లేరనడంలో అతిశయోక్తే లేదు. యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించే సత్తా అతడిది. అటువంటి వరల్డ్‌క్లాస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్‌పై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా తన అక్కసును వెళ్లగక్కాడు.జస్ప్రీత్ బుమ్రా కంటే పాక్ పేసర్ నసీమ్ షా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని ఇహ్సానుల్లా అభిప్రాయపడ్డాడు. కాగా నసీం షా మంచి ఫాస్ట్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఇప్పటికే తన పేస్, స్వింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ బుమ్రాతో పోల్చడమే అందరిని ఆశ్చర్యపరుస్తోంది."బుమ్రా కంటే నసీం షా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. బుమ్రా ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. ఇటువంటి ప్రదర్శనే నసీం 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లలో చేశాడు. ఒక్కో ఏడాది ఒకొక్కరు బాగా రాణిస్తున్నారు. ఈ ఏడాది నసీం పెద్దగా తన మార్క్ చూపించలేకపోయాడు.అయినప్పటకీ బుమ్రా కంటే నసీం ఎంతో బెటర్ అని" ఓ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. కాగా మూడు ఫార్మాట్లలో బుమ్రా భారత్ తరపున ఇప్పటివరకు 408 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు నసీం షా 112 వికెట్లు సాధించాడు.చదవండి: Ravindra Jadeja: భారత్ విజయంపై ఆశలు పెట్టుకోవద్దు -
ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిపై వేటు
ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండు, మూడు టెస్ట్‌ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 13) ప్రకటించారు. ఈ జట్టు నుంచి సీనియర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. విశ్రాంతి పేరుతో వీరందరిని పక్కకు పెట్టారు. డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ పాక్ జట్టుకు ఎంపికయ్యారు. తొలి టెస్ట్ కోసం తొలుత ఎంపికై, ఆతర్వాత రిలీజ్ చేయబడిన నౌమన్ అలీ, జహిద్ మెహమూద్ మరోసారి ఎంపికయ్యారు. 16 మంది సభ్యుల ఈ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సౌద్ షకీల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. పాక్ సెలెక్షన్ ప్యానెల్లోకి కొత్తగా అలీమ్ దార్, ఆకిబ్ జావిద్, అజహార్ అలీ చేరిన విషయం తెలిసిందే. వీరి బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్లపై వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా , జాహిద్ మెహమూద్.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ -
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒత్తిడికిలోనైన పాక్ 20 ఓవర్లలో 113 పరుగులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.తొలుత పాక్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్‌కు కకావికలం చేయగా.. ఆతర్వాత భారత పేసర్లు చాకచక్యంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని చేరకుండా కట్టడి చేశారు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లు బుమ్రా (4-0-13-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేయగా.. పాక్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ గెలుపుకు చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్ ఓటమి అప్పటికే ఖరారైపోయింది.గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో పాక్ ఆటగాళ్లు, అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉండింది. యువ పేసర్ నసీం షా పాక్ ఓటమిని జీర్ణించుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. మ్యాచ్ పూర్తయిన అనంతరం పెవిలియన్‌కు వెళ్లే దారిలో షా కన్నీటి పర్యంతమయ్యాడు. అతన్ని షాహిన్ అఫ్రిది ఓదార్చే ప్రయత్నం చేశాడు. నసీం కంటితడి పెట్టిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి. Even Naseem Shah, our young bowler, played better than our highly paid batsmen. The time has come, if you’re not performing well, please resign gracefully and let others join. It’s time to take strict decisions, or they’ll never understand. #PakvsIndpic.twitter.com/kkV9LZntFX— Saad Kaiser 🇵🇰 (@TheSaadKaiser) June 9, 2024నసీం గతంలోనూ పలు సందర్భాల్లో పాక్ ఓడినప్పుడు ఇలానే కంటతడి పెట్టాడు. ఈ మ్యాచ్‌లో నసీం బంతితో (4-0-21-3), బ్యాట్‌తో (4 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) అద్భుతంగా రాణించాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన నసీం పాక్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. -
T20 World Cup 2024: పాక్ పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జూన్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుణుడి అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ పేసర్ల ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 12; ఫోర్, సిక్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) రెండంకెల స్కోర్ చేయగలిగారు. విరాట్ కోహ్లి (3 బంతుల్లో 4; ఫోర్), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 7; ఫోర్), శివమ్ దూబే (9 బంతుల్లో 3), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 12; ఫోర్), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్ సింగ్ (13 బంతుల్లో 9; ఫోర్), బుమ్రా (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్ -
Ind vs Pak: అతడితో జాగ్రత్త: టీమిండియాకు కైఫ్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.ఈ మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్ జూన్ 9న నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు.పాకిస్తాన్‌పై గెలవడం టీమిండియాకు తేలికేనన్న కైఫ్.. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లున్న దాయాదితో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘‘పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనంగా ఉందని మనకు తెలుసు.కానీ ఫఖర్ జమాన్ క్రీజులో కుదురుకున్నాడంటే ఫాస్ట్‌గా ఆడతాడు. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేయగలడు. ఇఫ్తికార్ అహ్మద్ కూడా బాగానే ఆడతాడు. మిగతావాళ్ల స్ట్రైక్‌రేటు 120- 125 మధ్య ఉంటుంది.కాబట్టి వాళ్ల బ్యాటింగ్ గురించి మనం అస్సలు భయపడాల్సిన పనేలేదు. అయితే, వాళ్ల బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా నసీం షా.అతడు ఇండియాలో వరల్డ్‌కప్ ఆడలేదు. గాయం కారణంగా అప్పుడు జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మ్యాచ్ జరిగే న్యూయార్క్ పిచ్ బౌన్సీగా కనిపిస్తోంది.నిజానికి నసీం షా మంచి బౌలర్. గత మ్యాచ్‌లో మెల్బోర్న్లో నసీం షా ఫస్ట్ స్పెల్ అద్భుతంగా వేసిన తీరు చూశాం కదా!’’ అంటూ మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యలు చేశాడు. -
'బుమ్రా కాదు.. అతడే ఆఖరి ఓవర్లో 10 రన్స్ డిఫెండ్ చేయగలడు'
టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ క్రికెట్ జట్టు అన్ని విధాల సన్నద్దమవుతోంది. అంతేకంటే ముందు వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ తలపడనుంది. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధానంగా దృష్టిసారించింది. ఈ క్రమంలో తమ జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో పీసీబీ కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. కాకుల్ ఆర్మీ క్యాంపులో పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే విధంగా టీ20ల్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా బాబర్ ఆజం మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో బాబర్ మళ్లీ పాక్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక తిరిగి పాక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం ఓ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో పోడ్కాస్ట్ హోస్ట్ నుంచి బాబర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. "టీ20 మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. ప్రత్యర్ధి జట్టు విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు కావాలి. మీ వద్ద రెండు బౌలింగ్ ఆప్షన్ ఉన్నాయి. ఒకరు నసీమ్ షా, మరొకరు జస్ప్రీత్ బుమ్రా. అటువంటి అప్పుడు 10 పరుగులను కాపాడుకోవడానికి మీరు ఎవరికి బౌలింగ్ ఇస్తారన్న" ప్రశ్న హోస్ట్ అడిగాడు. బాబర్ ఏమీ ఆలోచించకుండా నసీం షా పేరును చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన భారత అభిమానులు బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలరని, నసీం షాకు అంత సీను లేదని కామెంట్లు చేస్తున్నారు. -
వికెట్లను కాలితో తన్నాడు.. ఫలితం అనుభవించాడు?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 ప్లే ఆఫ్స్‌కు ఇస్లామాబాద్ యునైటెడ్ ఆర్హత సాధించింది. ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్.. తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇస్లామామాబాద్ విజయంలో మున్రో(84), ఇమాద్ వసీం(30) కీలక పాత్ర పోషించారు. నసీం షాకు బిగ్ షాక్.. ఇస్లామామాబాద్ స్టార్ పేసర్ నసీం షాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నసీంకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. షా లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని పీఎస్ఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏం చేశాండంటే? ముల్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాదాబ్ ఖాన్‌ను నసీం షా అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని షా వమ్ము చేయలేదు. అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నప్పటికి ఓవర్ పూర్తి అయిన వెంటనే నసీం తన కాలితో స్టంప్స్‌ను తన్నాడు. ఈ విషయాపై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా అతడిపై ఈ చర్యలు తీసుకున్నాడు. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్‌లోనే! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ నుంచి మరో పేస్ సంచలనం పుట్టుకొచ్చాడు. ఇటీవలే అండర్-19 అండర్ వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన యువ పేసర్ హునైన్ షా.. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. పీఎస్ఎల్-2024లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున హునైన్ షా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో గురువారం లాహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హునైన్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన హునైన్.. 13 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ ఓపెనర్ జాసెన్ రాయ్‌ను 20 ఏళ్ల హునైన్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. పీఎస్ఎల్లో హునైన్కు ఇదే తొలి వికెట్. కాగా హునైన్ షా ఎవరో కాదు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీం షాకు స్వయాన సోదరుడే. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే తన తమ్ముడు తొలి పీఎస్ఎల్ వికెట్ సాధించగానే నసీం సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటైడ్ పై 3 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. hunain shah, remember the name pic.twitter.com/kkONIs1qXg — :) (@babardrive) February 22, 2024 -
ప్రపంచకప్‌కు నసీమ్ షా దూరం!
వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు యువ పేస్ బౌలర్ నసీమ్ షా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నసీమ్ షా భుజానికి గాయమైంది. ఈ గాయానికి స్కాన్లు నిర్వహించారు. గాయం తీవ్రతదృష్ట్యా నసీమ్ షా మూడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశముందని తెలిసింది. 20 ఏళ్ల నసీమ్ పాక్ తరఫున 14 వన్డేలు ఆడి 32 వికెట్లు తీశాడు. -
వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌ను భారీ ఎదురుదెబ్బ
వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా వరల్డ్‌కప్‌లో పలు మ్యాచ్‌లను దూరమవుతాడని తెలుస్తుంది. ఆసియా కప్-2023లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన నసీం ఆతర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. గాయం తీవ్రమైంది కావడంతో అతను తదుపరి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ బరిలోనూ దిగలేదు. పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నసీం.. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నెల రోజుల సమయం పట్టవచ్చని సమాచారం. ఇదే జరిగితే అతను వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడు. మరోవైపు నసీం షాతో పాటు మరో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ కూడా భారత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే అతని గాయం అంత తీవ్రమైంది కాకపోవడంతో ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లను అందుబాటులో ఉంటాడు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు పాక్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. భారత్‌తో మ్యాచ్ సందర్భంగానే అఘా సల్మాన్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో గాయపడగా, శ్రీలంకతో మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ గాయపడ్డాడు. కీలక ఆటగాళ్లంతా వరుసపెట్టి గాయాల బారిన పడటంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమిపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను (అక్టోబర్ 6) ఢీకొంటుంది. అనంతరం అక్టోబర్ 10న శ్రీలంకతో (హైదరాబాద్), అక్టోబర్ 14న భారత్‌తో తలపడుతుంది. -
Asia Cup 2023: పాకిస్తాన్‌కు బ్యాడ్ న్యూస్
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో రేపు (సెప్టెంబర్ 14) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. టీమిండియాతో సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఆ దేశ స్టార్ పేసర్ నసీం షా ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇవాళ (సెప్టెంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. నసీం షా గాయం (భుజం) తీవ్రత అధికంగా ఉండటంతో, త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతనికి పూర్తి విశ్రాంతినిచ్చినట్లు పీసీబీ పేర్కొంది. నసీం షా స్థానాన్ని జమాన్ ఖాన్‌తో రీప్లేస్ చేస్తున్నట్లు వెల్లడించింది. జమాన్ ఇప్పటికే జట్టులో చేరిపోయాడని, ట్రైనింగ్‌లో కూడా పాల్గొంటున్నాడని తెలిపింది. నసీం షా జట్టును వీడినప్పటికీ, అతను నిరంతరం పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని, ప్రపంచకప్ సమయానికంతా అతను పూర్తి ఫిట్‌నెస్ట్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్‌తో సూపర్-4 మ్యాచ్ సందర్భంగానే గాయపడిన మరో పేసర్ హరీస్ రౌఫ్‌పై పీసీబీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పీసీబీ డాక్టర్లు నసీం, రౌఫ్‌లు ఇద్దరు తమ పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు కాని, రౌఫ్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో రౌఫ్ గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తుంది. నసీంతో పోలిస్తే రౌఫ్ గాయం తేలికపాటిదని, అతను పూర్తిగా రికవర్ అయ్యాడని సమాచారం. తొలుత పీసీబీ రౌఫ్‌కు కూడా రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించాలని భావించినప్పటికీ, అతను వేగంగా కోలుకోవడంతో ఆ అవసరం లేదని భావించినట్లు తెలుస్తుంది. రౌఫ్ రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నసీం షా ఒక్కడే గాయం కారణంగా పాక్ జట్టును వీడాడు. కాగా, భారత్‌తో మ్యాచ్ తర్వాత గాయపడిన రౌఫ్‌కు రీప్లేస్‌మెంట్‌గా షానవాజ్ దహానిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో పాక్ భవితవ్యం రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే మాత్రం సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. -
IND Vs. PAK: ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు: షాహిన్ ఆఫ్రిది వార్నింగ్!
Shaheen Afridi Ahead of Indo-Pak Asia Cup 2023 Clash: ‘‘టీమిండియాతో ప్రతి మ్యాచ్ దేనికదే ప్రత్యేకం. అభిమానులకు ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే పండుగే! నేను కూడా అండర్-16 క్రికెట్ మొదలుపెట్టక ముందు మిగతా ఫ్యాన్స్‌లాగే మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని. ఇప్పటి వరకు టీమిండియాతో నా బెస్ట్ స్పెల్ ఇదీ అని స్పెషల్‌గా చెప్పలేను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు సాధించాల్సింది.. అత్యుత్తమంగా చేసి చూపాల్సింది చాలా ఉంది’’ అని పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది అన్నాడు. టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చి కాగా 2018లో పాకిస్తాన్ తరఫున 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షాహిన్ ఆఫ్రిది.. అద్భుత బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలో జట్టులో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతం ప్రధాన పేసర్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 252 వికెట్లు పడగొట్టిన షాహిన్ ఆఫ్రిది.. ఆసియా కప్-2023తో బిజీగా ఉన్నాడు. టీమిండియాతో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన ఆఫ్రిది తదుపరి ఆదివారం మరోసారి భారత్‌తో మ్యాచ్‌లో మెరవాలనే పట్టుదలతో ఉన్నాడు. అదే మా విజయాలకు కారణం ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు ఏడు వికెట్లు పడగొట్టిన షాహిన్.. సహచర పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్‌లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో మేము పోషించాల్సిన పాత్రలేంటో మాకు తెలుసు. కొత్త, పాత బంతితో ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా అవగాహన ఉంది. హ్యారిస్ తన వైవిధ్యమైన పేస్‌తో ప్రభావితం చేయగలడు. ఇక నసీం, నేను ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం. మా మధ్య ఉన్న సమన్వయమే మా విజయాలకు కారణం’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా కొలంబోలో ఆదివారం.. సూపర్-4 దశలో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డే కేటాయించారు. చదవండి: ఆ సిరీస్ నాటికి అందుబాటులోకి పంత్?; అలాంటి బ్యాటర్ కావాలి: రోహిత్ రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్ ఆఫ్రిది.. ఆరోజే బరాత్! -
మొన్న మ్యాచ్‌లో సెంచరీ.. ఇప్పుడు తొలి బంతికే ఔట్! పాక్ బౌలర్లతో
ఆసియాకప్-2023లో భాగంగా సూపర్-4 దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో లాహోర్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ తలపడతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, హారీస్ రౌఫ్ చుక్కలు చూపుతున్నారు. బంగ్లాదేశ్ 44 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అఫ్రిది, నసీం షా, రౌఫ్ తలా వికెట్ సాధించారు. మొన్న సెంచరీ.. ఇప్పుడు తొలి బంతికే ఇక ఆఫ్గానిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బంగ్లా ఓపెనర్ మెహిదీ హసన్ మిరాజ్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. తన ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డన్‌డక్‌గా వెనుదిరిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ నసీం వేసిన రెండో ఓవర్లో.. మొదటి బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ కనక్ట్ కాకపోవడంతో నేరుగా ఫఖర్ జమాన్ చేతికి వెళ్లింది. భారత మ్యాచ్ ఎప్పుడంటే? ఇక సూపర్-4లో భారత తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహల్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తొలుత ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో రాహుల్ ఉన్నప్పటికీ.. పూర్తిఫిట్‌నెస్ సాధించకపోవడంతో భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే ఇప్ప్పుడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో శ్రీలంకలో ఉన్న జట్టుతో కలిశాడు. ఇక పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో విఫలమైన టాపర్డర్.. కనీసం సూపర్-4లో నైనా దాయాది దేశంపై రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: రోహిత్, కోహ్లిలను తీసేయరు కదా! కాబట్టి.. తుది జట్టులో అతడే బెటర్: గంభీర్ -
Asia Cup 2023 IND VS PAK: చరిత్ర సృష్టించిన పాక్ పేసర్లు
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పేస్ త్రయం (షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్) చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) చరిత్రలో 10కి 10 వికెట్లు (ఓ మ్యాచ్‌లో) తీసిన తొలి పేస్ బౌలింగ్ అటాక్‌గా రికార్డుల్లోకెక్కింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పేసర్లే తీయడం ఇదే మొదటిసారి. 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ పేసర్లే మొత్తం 10 వికెట్లు తీసింది లేదు. కాగా, నేటి మ్యాచ్‌లో పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (10-2-35-4), నసీం షా (8.5-0-36-3), హరీస్ రౌఫ్ (9-0-58-3) టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ త్రయం భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. టీమిండియాపై ఈ ముగ్గురు స్పష్టమైన ఆధిపత్యం కనబర్చారు. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకోకపోయుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది. ఇషాన్, హార్దిక్‌లతో పాటు ఆఖర్లో బుమ్రా కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 266 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్ ముగిసాక వర్షం మొదలుకావడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభంకాలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించాల్సి వస్తే 40 ఓవర్లలో 239 పరుగులు, 30 ఓవర్లలో 203, 20 ఓవర్లకు 155 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించాల్సి ఉంటుంది. -
కొనసాగుతున్న గిల్ వైఫల్యాల పరంపర.. ఏకి పారేస్తున్న అభిమానులు
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. గతకొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అభిమానులకు విసుగు తెప్పిస్తున్న గిల్.. తాజాగా పాక్‌తో జరుగుతున్న కీలక సమరంలో మరోసారి ఘోరంగా విఫలమై, భారత అభిమానులకు టార్గెట్‌గా మారాడు. నెటిజన్లు గిల్‌ను ఏకి పారేస్తున్నారు. గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. Shubman Gill is very scared of Naseem Today😂🤦♂️.#PAKvIND #INDvPAK #pakvsind #INDvsPAK pic.twitter.com/YGF81raK3a — F A ح A D.. 🖤 (@Ziddi_bOy_) September 2, 2023 గిల్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పనికొస్తాడని, ఇంటర్నేషనల్ క్రికెట్లో అతనికి అంత సీన్ లేదని విమర్శిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో గత 17 ఇన్నింగ్స్‌ల్లో (20, 0, 37, 13, 18, 6, 10, 29, 7, 34, 85, 3, 7, 6, 77, 9, 10 (పాక్‌తో మ్యాచ్‌లో)) అతను కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే చేశాడని, ఈ మాత్రం దానికి అతనికి వరుస అవకాశాలు ఇవ్వడం ఎందుకుని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. గిల్‌ను తప్పిస్తే తుది జట్టు కూర్పు కూడా సెట్ అవుతుందని.. రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపవచ్చని అంటున్నారు. 147kph thunderbolt from Haris Rauf cleans up Shubman Gill 🚀 pic.twitter.com/Y7Oovl6uYD — CricTracker (@Cricketracker) September 2, 2023 పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయని, అతను పాక్ పేసర్లను ఎదుర్కోలేక నానా ఇబ్బందులు పడ్డాడని అంటున్నారు. ముఖ్యంగా నేటి మ్యాచ్‌లో నసీం షాను ఎదుర్కొనేందుకు గిల్ చాలా బయపడ్డాడని, ఇది అతని ముఖంలో స్పష్టంగా కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గిల్ పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు చేసి హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ పాక్ పేసర్లు సంధించిన బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశాడు. 🎯 Rohit Sharma - Clean-bowled by Shaheen Afridi 🎯 Virat Kohli - Bowled by Shaheen Afridi 🎯 Shubman Gill - Castled by Haris Rauf India's top-order was dismissed in a similar fashion.#INDvPAK pic.twitter.com/9YL2dD6H3K — CricTracker (@Cricketracker) September 2, 2023 ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఎదురీదుతుంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఇషాన్ కిషన్ (54), హార్ధిక్ పాండ్యా (37) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 29 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 147/4గా ఉంది. రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (4)లను అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (14), శుభ్‌మన్ గిల్లను (10) హరీస్ రౌఫ్ పెవిలియన్‌కు పంపాడు. -
మా దగ్గర షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ లేరు.. అదే ప్లస్: రోహిత్ శర్మ
మీడియా సమావేశంలో చిరాకు తెప్పించే ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ఉంటాడు. గతంలో విరాట్ కోహ్లితో విభేదాలు, మేజర్ ఈవెంట్లలో భారత జట్టు చేతులెత్తేయడం గురించి ప్రశ్నించిన వారితో పాటు.. బయటివాళ్ల మాటలు తమకు పట్టవంటూ విమర్శకులకూ గట్టిగానే బదులిచ్చాడు. తాజాగా మరోసారి హిట్‌మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురుకాగా.. మాటల ‘బౌన్సర్’ సంధించాడు. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌కు అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాలతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం దాయాదుల పోరు కోసం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే.. పాకిస్తాన్‌కు తమ పేస్ దళమే ప్రధాన బలం. కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా భారత బ్యాటింగ్- పాక్ బౌలింగ్ మధ్య హోరాహోరీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా శనివారం ఈ హైపర్ టెన్షన్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సారథి రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాక్ పేస్ త్రయాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నెట్స్‌లో షాహిన్ ఆఫ్రిది, నసీం షా లేదంటే హ్యారిస్ రవూఫ్.. వీరిలో ఎవరూ కూడా మాకు బౌలింగ్ చేయలేదు కదా! మా బౌలర్లతోనే మేము ప్రాక్టీస్ చేస్తాం. మా దగ్గర నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. రేపటి మ్యాచ్‌లో కేవలం మా అనుభవమే అక్కరకు వస్తుంది’’ అని రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాక తమకు సానుకూలాంశంగా మారిందన్న హిట్‌మ్యాన్.. ‘‘ప్రస్తుతం మా జట్టులో ఆరుగురు గొప్ప బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఐర్లాండ్ పర్యటనతో పునరాగమనం చేసిన బుమ్రా పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడు. బెంగళూరు ట్రెయినింగ్ క్యాంపులోనూ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ముగ్గురు పేసర్లూ ఫిట్‌గా ఉండటం కలిసి వస్తుంది. మాకు ఇది గొప్ప సానుకూల అంశం’’ అని చెప్పుకొచ్చాడు. బుమ్రాతో పాటు షమీ, సిరాజ్‌లు కూడా రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. -
ఏదో ఒకరోజు నాకు గుండెపోటు మాత్రం రావొద్దు: పాక్ యువ పేసర్
Pakistan Star Big Statement: నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్.. ఆఖరి వరకు విజయం ఎవరిదో తేలని సందర్భాల్లో తరచూ వాడే పదం.. చూసే ప్రేక్షకులకే ఇలా ఉంటే.. మరి మైదానంలో స్వతహాగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు ఎలా ఉంటుంది! ఎవరి సంగతి ఎలా ఉన్నా తనకైతే గుండెపోటు వచ్చినంత పని అవుతుందంటున్నాడు పాకిస్తాన్ యువ సంచలనం నసీం షా. శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో 142 పరుగులతో జయభేరి మోగించిన బాబర్ ఆజం బృందం.. రెండో మ్యాచ్‌లో మాత్రం విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్లు అదరగొట్టడంతో హొంబన్టోట వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 151 పరుగులు, ఇబ్రహీం జర్దాన్ 80 పరుగులతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ ఇమామ్-ఉల్- హక్(91) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన షాదాబ్ ఖాన్ 48 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను గాడినపడేశాడు. మరో బంతి మిగిలి ఉండగానే.. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, టెయిలెండర్ నసీం షా ఆఖరి ఓవర్ ఐదో బాల్‌కు ఫోర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాక్ కథ సుఖాంతమైంది. అఫ్గనిస్తాన్‌ను దురదృష్టం వెక్కిరించడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది. గుండెపోటు మాత్రం రావొద్దు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం నసీం షా మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది నాకు ఇన్నింగ్స్ ముగించే ఛాన్స్‌లు వస్తున్నాయి. ఏదో ఒకరోజు నాకు గుండెపోటు మాత్రం రావొద్దు. ఆ అల్లా ఆశీసులు ఇలాగే ఎల్లప్పుడూ నాపై ఉండాలి. ఆ దేవుడి దయ ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నేను తేలికగానే అధిగమిస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. కాగా పెషావర్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ నసీం షా 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆసియా కప్-2023కి ముందు ఇప్పటి వరకు మొత్తంగా 17 టెస్టుల్లో 51, 10 వన్డేల్లో 25, 19 టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత పాక్ ఆసియా కప్-2023కి సన్నద్ధమవుతుంది. ఈ మెగా టోర్నీకి ప్రకటించిన జట్టులో 20 ఏళ్ల నసీం షా కూడా సభ్యుడు. కీలక ఈవెంట్‌కు ముందు నసీం చేసిన తాజా కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పుడే భయపడితే ఎలా.. ముందుంది ముసళ్ల పండుగ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కోహ్లి కాదు! వరల్డ్‌కప్ అంటే అతడికి ఊపొస్తుంది.. టాప్ స్కోరర్ తనే: సెహ్వాగ్ -
నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్.. 59 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పేసర్ హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగాడు. 6.2 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రౌఫ్‌కు ఇది తొలి ఫైఫర్ కావడం విశేషం. రౌఫ్ భీకర స్పెల్‌కు షాహీన్ అఫ్రిది (4-2-9-2), నసీం షా (5-0-12-1), షాదాబ్ ఖాన్ (1-1-0-1) తోడవ్వడంతో పాక్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 59 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా ఆ జట్టు ఆఫ్ఘన్‌పై 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ పేసర్ల ధాటికి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. ఏకంగా నలుగురు ఆటగాళ్లు డకౌట్లయ్యారు. ఓపెనర్ రహానుల్లా గుర్భాజ్ చేసిన 18 పరుగులే ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది. ఒమర్జాయ్ 16 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇమామ్ ఉల్ హాక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (30), మహ్మద్ రిజ్వాన్ (21), నసీం షా (18 నాటౌట్) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. -
PAK VS AFG 1st ODI: కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న షాదాబ్ ఖాన్
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యంకాని రీతిలో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ కెప్టెన్ హస్మతుల్లా షాహీది (0) క్యాచ్‌ను పట్టుకున్నాడు. షాహీది పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. షాదాబ్ పక్షిలా గాల్లోకి ఎగురూతూ ఎడమ చేత్తో అందుకున్న అద్భుతమైన డైవింగ్ క్యాచ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. WHAT A CATCH BY SHADAB...!!! The best fielder from Pakistan in this generation.pic.twitter.com/QJAcIlZnLk — Johns. (@CricCrazyJohns) August 22, 2023 అంతకుముందు ఓవర్లోనే షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్, తమ కెప్టెన్ వికెట్ కోల్పోవడంతో మరింత ఇరకాటంలో పడింది. ఆ జట్టు 3.3 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి మూడు కీలకమై వికెట్లు కోల్పోయింది. 3వ ఓవర్ 4, 5 బంతులకు షాహీన్ అఫ్రిది.. ఇబ్రహీం జద్రాన్ (0), రెహ్మత్ షా (0)లను ఔట్ చేయగా.. 4వ ఓవర్ మూడో బంతికి నసీం షా.. ఆఫ్ఘన్ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం 8వ ఓవర్ మొదటి బంతికి, 14వ ఓవర్ మూడో బంతికి హరీస్ రౌఫ్.. ఇక్రమ్ అలీఖిల్ (4), గుర్భాజ్ (18)లను ఔట్ చేయడంతో ఆఫ్ఘన్ జట్టు 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 15 ఓవర్లు ముగిసాక ఆ జట్టు స్కోర్ 47/5గా ఉంది. ఒమర్జాయ్ (10), నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. ఇమామ్ ఉల్ హాక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. -
టీమిండియాలో స్టార్లు ఉన్నా గానీ.. మాదే పైచేయి: పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్
India have big names but their fitness and form is not up to the mark: ‘‘ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు సమతూకంగా ఉంది. యువ రక్తంతో నిండి ఉంది. టీమిండియాలో స్టార్లు ఉన్నారు.. కానీ వాళ్ల ఫిట్నెస్, ఫామ్ ఆశించిన తీరుగా లేదు. అందుకే భారత జట్టు తడబడుతోంది. జట్టు కూర్పు కోసం ఫామ్‌లో ఉన్న కొత్త ఆటగాళ్లను వెదికిపట్టుకోవాలి. అయితే, పాక్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ( ఫైల్ ఫోటో ) ఈసారి పాక్ ఓడించగలదు ఈసారి భారత గడ్డపై టీమిండియాను పాకిస్తాన్ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్ ప్రగల్బాలు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా.. పటిష్ట టీమిండియాను బాబర్ ఆజం జట్టు ఓడించగలదంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 14న మ్యాచ్ జరుగనుంది. టోర్నీకే హైలైట్ మ్యాచ్ ఆరోజే మెగా టోర్నమెంట్ మొత్తానికి హైలైట్‌గా నిలవనున్న ఈ మ్యాచ్ గురించి విలేకరులు ప్రస్తావించగా.. అకీబ్ జావేద్ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా పాక్ పేస్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. నసీం షా కంటే జమాన్ ఖాన్ బెటర్ అని పేర్కొన్నాడు. ( ఫైల్ ఫోటో ) నసీం కంటే అతడే బెటర్ ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో జమాన్ ఖాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ డెత్ బౌలర్లలో తనూ ఒకడని చెప్పవచ్చు. నసీం షా కంటే అతడే బెటర్ అనిపిస్తోంది. షాహిన్, హారిస్, జమాన్.. పరిమిత ఓవర్లలో ఈ త్రయం ఉంటే పాకిస్తాన్ జట్టుకు మేలు చేకూరుతుంది’’ అని జావేద్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఆసియా వన్డే కప్-2023 నేపథ్యంలో ప్రకటించిన పాక్ జట్టులో జమాన్ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో నసీం షాకు బదులు లాహోర్ ఖలందర్స్ బౌలర్‌ను తీసుకోవాల్సిందని ఆ జట్టు కోచ్ అకీబ్ జావేద్ పేర్కొనడం గమనార్హం. చదవండి: తిరిగింది చాలు.. ఇక ఆటపై దృష్టి పెట్టు! అసలే వరల్డ్‌కప్.. -
నిప్పులు చెరిగిన నసీం షా.. తిప్పేసిన అబ్రార్.. కుప్పకూలిన శ్రీలంక
కొలొంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జులై 24) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పైచేయి సాధించింది. పేసర్లు నసీం షా (3/41), షాహీన్ అఫ్రిది (1/44) నిప్పులు చెరగగా.. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4/69) మాయాజాలం చేయడంలో పాక్ శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూల్చింది. పాక్ ఆటగాడు మసూద్ అద్భుతంగా ఫీల్డింగ్ చేయడంతో ఇద్దరు లంక బ్యాటర్లు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఓపెనర్ నిషాన్ మధుష్క (4), ప్రభాత్ జయసూర్యలను (1) మసూద్ రనౌట్ చేశాడు. పాక్ బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ధనంజయ డిసిల్వ (57) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఇతనితో పాటు కెప్టెన్ దిముత్ కరుణరత్నే (17), దినేశ్ చండీమల్ (34), రమేశ్ మెండిస్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సౌద్ షకీల్ (208 నాటౌట్, 30) చెలరేగిపోవడంతో పాక్ 4 వికెట్ల తేడాతో గెలపొందింది. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగా.. సౌద్ షకీల్ రెచ్చిపోవడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైతే.. పాక్ 6 వికెట్లు కోల్పోయి లంక నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇమామ్ ఉల్ హాక్ (50 నాటౌట్).. సౌద్ షకీల్ సాయంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
బ్యాటర్ కొంపముంచిన బంతి.. వీడియో వైరల్
టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌పై తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన తొలి టి20లో అఫ్గానిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మహ్మద్ నబీ తొలుత బౌలింగ్(2/12).. తర్వాత బ్యాటింగ్‌లో (38 పరుగులు నాటౌట్) రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మార్చి 26న(ఆదివారం) జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే.. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా ఔటైన విధానం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నసీమ్ షా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే హిట్‌వికెట్ అవ్వడంలో తన తప్పు లేదు. మహ్మద్ నబీ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి అతని పొట్ట బాగానికి తగలడంతో బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బ్యాట్ వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇది ఊహించని నసీమ్ షా ఇచ్చిన రియాక్షన్ బాధ కలిగించినా అతని చర్య నవ్వు తెప్పించింది. చేసేదేం లేక తెగ బాధపడుతూ నసీమ్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. .@MohammadNabi007 Strikes again - Naseem Shah departs 🤩 Naseem swung hard but lost his balance in the process as he's gone back to hit his stumps 🇵🇰- 71/8 (15.4 Overs)#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/F2x0EmbDAR — Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023 చదవండి: IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే సాధ్యం! క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్.. టీమిండియా సేఫ్! -
పాక్ క్రికెటర్ ఓవరాక్షన్.. లావుగా ఉన్న సహచర సభ్యుడిని ఎగతాళి చేస్తూ..!
Naseem Shah-Azam Khan: పాకస్తాన్ క్రికెటర్, ఆ జట్టు యువ పేసర్ నసీం షా తమ దేశ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. నసీం.. లాపుగా ఉన్న సహచర సభ్యుడు, పాక్ దిగ్గజ వికెట్‌కీపర్ మొయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా, అతన్ని ఢీకొట్టాడు. తమ దేశ క్రికెటర్‌తో పరాయి గడ్డపై అభ్యంతరకరంగా ప్రవర్తించి, తనతో పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు. Naseem Shah teasing Azam Khan at the Bangladesh Premier League #BPL2023 #Cricket pic.twitter.com/IsJgBLcE0i — Saj Sadiq (@SajSadiqCricket) January 31, 2023 ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలో ఎదురెదురు పడిన సందర్భంలో ఆజం శరీరాన్ని నసీం అవహేళన చేశాడు. ఆజం బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా నసీం ఎదురెళ్లి అతని శరీర తత్వాన్ని వెక్కిరిస్తూ, అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆజంను ఢీకొట్టి, అతని శరీరంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవేవి పట్టించుకోని ఆజం ఖాన్, నసీంను నెట్టేసి క్రీజ్వైపు వెళ్లాడు. వెళ్తున్నప్పుడు కూడా నసీం ఓవరాక్షన్ అలాగే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవగా, నెటిజన్లు ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా నసీం షాను వాయించేస్తున్నారు. తమ వాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది, పరాయి దేశస్తుడితో ఇలా ప్రవర్తించి ఉంటే నీకు కచ్చితంగా దేహశుద్ధి అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశస్తుడైనా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నసీంకు చురకలంటిస్తున్నారు. ఇంకొందరైతే.. షేమ్, షేమ్ నసీం షా.. షేమ్, షేమ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆజం ఖాన్, కొమిల్లా విక్టోరియన్స్ తరఫున నసీం షా బరిలోకి దిగారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఘన విజయం సాధించింది. విండీస్ వీరుడు జాన్సన్ చార్లెస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి కొమిల్లా విక్టోరియన్స్ చారిత్రక విజయాన్ని అందించాడు. -
Pak Vs NZ: న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం.. సిరీస్‌లో ముందంజ
Pakistan vs New Zealand, 1st ODI- Naseem Shah: న్యూజిలాండ్ జట్టుతో కరాచీలో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 256 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (77 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (66; 5 ఫోర్లు, 1 సిక్స్), ఫఖర్ జమాన్ (56; 7 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దెబ్బకొట్టిన నసీం షా అంతకుముందు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది. నసీమ్ షా (5/57) కివీస్‌ను దెబ్బ తీశాడు. ఇక కివీస్ ఇన్నింగ్స్లోబ్రాస్వెల్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టామ్ లాథమ్ 42 పరుగులు చేశాడు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నసీం షాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముందంజలో పాక్ కాగా టెస్టు, వన్డే సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ పాక్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే స్కోర్లు టాస్: పాకిస్తాన్- బౌలింగ్ న్యూజిలాండ్: 255/9 (50) పాకిస్తాన్: 258/4 (48.1) ఆరు వికెట్ల తేడాతో పాక్ విజయం చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం? Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్ తర్వాత! A maximum to finish things off! 💥 9️⃣th ODI win in a row 🇵🇰👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/z15eS9qvxD — Pakistan Cricket (@TheRealPCB) January 9, 2023