Net Practice
-
విరాట్ కోహ్లినే భయపెట్టాడు..! ఎవరీ గుర్నూర్ బ్రార్?
సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. సుదీర్ఘ సమయం పాటు జరిగిన చివరి సెషన్లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగితా ఆటగాళ్లంతా ఈ రోజు ప్రాక్టీస్‌లో భాగమయ్యారు. అయితే సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంపులో ఆరడుగుల ఆజానుబాహుడు, యువ పేసర్ నెట్ బౌలర్‌గా సేవలు అందించాడు.తన పేస్ బౌలింగ్‌తో విరాట్ కోహ్లి లాంటి స్టార్ బ్యాటర్‌నే ఇబ్బంది పెట్టాడు. బుమ్రాతో పోటీపడుతూ భారత బ్యాటర్లకు నెట్స్‌లో చుక్కలు చూపించాడు. అతడే పంజాబ్ ఫాస్ట్ బౌలర్, యువ సంచలనం గుర్నూర్ బ్రార్. ఈ క్రమంలో ఎవరీ గుర్నూర్ బ్రార్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ గుర్నూర్ బ్రార్..?కాగా తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్ రాణా నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి నుంచి టీమిండియాకు ముప్పు పొంచి ఉంది. దీంతో అతడిని దీటుగా ఎదుర్కొనేందుకు భారత జట్టు మేనెజ్మెంట్ మాస్టర్ ప్లాన్ వేసింది.నహిద్ రాణా బౌలింగ్ శైలిని పోలి ఉండే గుర్నూర్ బ్రార్‌ను నెట్‌బౌలర్‌గా భారత్ ఎంపిక చేసింది. గుర్నూర్ కూడా దాదాపుగా నహిద్ రాణా అంత ఎత్తు ఉంటాడు. నహిద్ 6.4 అడుగులు ఎత్తు ఉండగా.. గుర్నూర్ 6.5 అడుగుల హైట్ ఉన్నాడు. కాగా భీకరమైన బౌన్సర్ల వేయడంలో గుర్నూర్ స్పెషలిస్టు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటకి తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టే సత్తా అతడికి ఉంది. ఈ క్రమంలోనే నెట్‌బౌలర్‌గా భారత జట్టు మెనెజ్‌మెంట్ అతడిని తీసుకుంది. 24 ఏళ్ల గుర్నూర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 5 ఫస్ట్‌క్లాస్ మాత్రమే ఆడిన అతడు 7 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఎ, టీ20 క్రికెట్లో చెరో మ్యాచ్ ఆడాడు. కాగా ఐపీఎల్లో కూడా అతడు అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో అతడు అడుగు పెట్టాడు. ఆ సీజన్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో బ్రార్ చేరాడు. కానీ అతడికి సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాలేదు.చదవండి: 'మేము ఓడిపోయినందుకు చాలా హ్యాపీ'.. పాక్ క్రికెటర్‌పై ట్రోల్స్ వర్షం -
బంగ్లాతో తొలి టెస్టు.. ప్రాక్టీస్‌లో టీమిండియా ఆటగాళ్లు
ఈ సీజన్లో శుభారంభం చేసేందుకు భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల ముఖాముఖి సిరీస్‌లో పాల్గొనేందుకు రోహిత్ శర్మ బృందం సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌లోని కీలక బౌలర్లను సమర్థంగా ఎదుర్కోనేందుకు టీమిండియా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బంగ్లా స్పీడ్‌స్టర్ నహిద్ రాణా శైలీని పోలిన పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్‌ను నెట్‌బౌలర్‌గా వినియోగించుకుంటుంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నహిద్ పాక్ గడ్డపై చెలరేగాడు. బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌లో కీలకభూమిక పోషించాడు.ఈ నేపథ్యంలో 6 అడుగుల 4.5 అంగుళాల పొడగరి పేసర్ గుర్నూర్ బంతుల్ని రోహిత్, కోహ్లి తదితర బ్యాటర్లు అదేపనిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వెటరన్ బౌలర్ అశ్విన్ స్పిన్ వేయగల తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అజిత్ రామ్ కూడా నెట్స్‌లో బ్యాటర్లకు అందుబాటులో ఉన్నాడు.చెన్నై పిచ్ ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లకు సమాన అవకాశాలు కల్పించనుండటంతో జట్టు మేనేజ్మెంట్ తుదిజట్టు కూర్పుపై త్వరలోనే కసరత్తు పూర్తిచేయనుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆదివారం ఢాకా నుంచి నేరుగా చెన్నైకి చేరుకోనుంది. చదవండి: Diamond League: నీరజ్ చోప్రాకు షాక్.. సెంటీమీటర్ తేడాతో టైటిల్ మిస్ -
టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్‌కు గాయం
టీ20 వరల్డ్‌కప్-2024 గ్రూపు స్టేజిలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.లీగ్ స్టేజిలో కనబరిచిన జోరునే సూపర్-8 రౌండ్లో కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 20న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది.టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ గాయపడ్డాడు. త్రోడౌన్స్ స్పెషలిస్ట్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా సూర్య చేతికి వేలికి గాయమైంది. బంతి సూర్య కుడి చేతి వేలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. అయితే మ్యాజిక్ స్ప్రే చేసిన తర్వాత సూర్య తిరిగి మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు స్పోర్ట్స్టాక్ తమ నివేదికలో పేర్కొంది. సూర్య గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సూర్యకుమార్ గాయంపై జట్టు మెనెజ్‌మెంట్ గానీ బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. -
విరాట్ కోహ్లికి ఏమైంది..? మరోసారి ప్రాక్టీస్ డుమ్మా!
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయర్క్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే న్యూయర్క్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. టీమిండియా సోమవారం(జూన్ 3) తమ చివరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు(జూన్ 4)న ఆటగాళ్లకు టీమ్ మెన్జ్మెంట్ విశ్రాంతి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం వీలైనంత ఎక్కువ సమయం పాటు నెట్స్‌లో గడపాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం.కోహ్లి ప్రాక్టీస్ డుమ్మా!ఇక జట్టుతో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనలేదు. జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌కు దూరమైన కోహ్లి.. ఆదివారం(జూన్ 2)న ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంటుడని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా కోహ్లి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. జట్టుతో కలిసినప్పటికి అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విరాట్ సోమవారం జట్టు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024లో ఎలిమినేటర్‌లో ఓటమి తర్వాత కోహ్లి రెస్టులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా విరాట్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో కోహ్లి దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా విరాట్ నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 వరల్డ్‌కప్‌లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన హార్దిక్ పాండ్యా.. గంటకు పైగా బౌలింగ్
టీ20 వరల్డ్ కప్-2024లో పాల్గోనేందుకు భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఆదివారం న్యూయర్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో వార్మాప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ వార్మాప్ మ్యాచ్‌కు ముందు టీమిండియా న్యూయర్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం తమ మొదటి ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. ఈ కొత్త స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ పిచ్‌లపై రోహిత్ అండ్ కో తీవ్రంగా శ్రమించారు. అయితే బుధవారం న్యూయార్క్‌లో వర్షం భారీగా కురిసినప్పటికి.. నేడు(గురువారం) మాత్రం భారత ప్రాక్టీస్‌కు వరుణుడు ఎటువంటి ఆటంకం కలిగించలేదు.చెమటోడ్చిన హార్దిక్ పాండ్యా..ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్ల కంటే టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్రంగా చెమటోడ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని హార్దిక్ ప్రాక్టీస్ చేశాడు. జట్టుతో ఇటీవలే కలిసిన పాండ్యా.. తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దాదాపు నెట్స్‌లో గంటకు పైగా హార్దిక్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ కూడా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. కాగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ పాండ్యా విఫలయ్యాడు. అయినప్పటికి తనకు ఉన్న అనుభవం దృష్ట్యా సెలక్టర్లు వరల్డ్‌కప్ జట్టులో చోటిచ్చారు. కానీ సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది మాజీలు విమర్శల వర్షం కురిపించారు. ఫామ్‌లో లేని ఆటగాడిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెలక్టర్ల నమ్మకాన్ని హార్దిక్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో మరో 5 రోజు ఎదురు చూడాల్సిందే.టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. -
భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సీజన్‌కు మరో ఐదో రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22న తొలి మ్యాచ్‌లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు ఆరంభానికి ముందే ప్రత్యర్ధి జట్లను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని హడలెత్తిస్తున్నాడు. చెపాక్‌లో ప్రాక్టీస్ క్యాంప్‌లో బీజీబీజీగా ఉన్న ధోని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. తనదైన స్టైల్లో భారీ షాట్లతో ఎంఎస్ విరుచుకుపడుతున్నాడు. స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లనే తేడా లేకుండా ధోని భారీ సిక్స్‌లు కొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు తలైవా ఈజ్ బ్యాక్.. ఈ సీజన్లో బౌలర్లకు చుక్కలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధోనికి ఇదే ఆఖరి సీజన్ అయ్యే అవకాశముంది. 42 ఏళ్ల ధోని ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది. ఇక ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 సార్లు టైటిల్స్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021,203 లో మిస్టర్ కూల్ చెన్నైకు టైటిల్స్ అందించాడు. చదవండి: శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజం.. Imagine the atmosphere of the stadiums when he replicate these in front of full-packed crowd 😍❤️🔥 pic.twitter.com/5xtrBMHacg — TELUGU MSDIANS🦁™ (@TeluguMSDians) March 16, 2024 -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్.. షాక్ తిన్న హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ మైలురాయిని అందుకున్న కోహ్లి సెంచరీతో మెరిసి మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకున్నాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 76వ శతకం సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, టీమిండియా టెస్టు సిరీస్‌ను 1-0తో చేజక్కించుకుంది. అలా టెస్టు సిరీస్ ముగియగానే వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. గురువారం తొలి వన్డే ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి చేసిన పని నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాధన చేసిన కోహ్లి ఒక బంతికి చక్కటి షాట్ ఆడి తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. 'మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి..?'' అన్నట్లు పాండ్యా చూస్తూంటే.. కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండ్రీ దాటడం పక్కా అన్నట్లు డ్యాన్స్ చేశాడు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు.. తనదైన డ్యాన్సింగ్ స్టెల్లో చేతులు ఊపుతూ విచిత్ర హావభావాలు పలికించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK — Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2023 చదవండి: కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్.. వెస్టిండీస్ 114 ఆలౌట్ -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా! ఫోటోలు వైరల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇక ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్న రోహిత్ సేన నెట్ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా గడుపుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా త్రోడౌన్ స్పెషలిస్టులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే విధంగా భారత వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా చాలా సమయం నెట్స్‌లోనే గడిపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. మరోవైపు ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. బెంగళూరు సమీపంలోని ఆలూర్ లో ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్‌కు గుడ్ న్యూస్! యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు #TeamIndia have begun their preparations for the Border Gavaskar Trophy ahead of the 1st Test in Nagpur.#INDvAUS pic.twitter.com/21NlHzLwGA — BCCI (@BCCI) February 3, 2023 -
భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్-2023 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ప్రాక్టీస్‌ను మరింత వేగవంతం చేశాడు. ఈ ఏడాది సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ధోని మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సీఎస్కేను.. ఈ సారి మాత్రం ఛాంపియన్‌గా నిలపాలని తలైవా భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే మిస్టర్ కూల్ జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పిన్ బౌలింగ్‌కు ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. భారీ సిక్స్‌లు కొట్టడం ఆ వీడియోలో కన్పించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా రాంఛీ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా టీమిండియా ఆటగాళ్లను ధోని కలిసిన సంగతి తెలిసిందే. ఇక గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కానుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాగా ధోని సారథ్యంలో సీఎస్కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. చదవండి: SA20 2023: ముంబై జట్టుకు స్టార్ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఎంట్రీ! MS Dhoni smashing 6s during today’s practice session! #Dhoni #IPL2023 #CSK @msdhoni pic.twitter.com/ZiVROmMVs4 — MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2023 -
బంతిని చూడకుండానే భారీ సిక్సర్.. శాంసన్‌తో అట్లుంటుంది మరి!
న్యూజిలాండ్‌తో తొలి టీ20కు టీమిండియా అన్నివిధాలా సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే కివీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో సంజూ శాంసన్ 'నో లూక్' షాట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కోచింగ్ సిబ్బందిలో ఒకరు బౌలింగ్ చేయగా.. శాంసన్ బంతిని చూడకూండానే భారీ సిక్సర్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో శాంసన్‌తో పాటు రిషబ్ పంత్, హుడా, అయ్యర్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కన్పించింది. ఇక సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాంసన్ బ్యాటింగ్ స్కిల్స్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నవంబర్ 18న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. TICK..TICK..BOOM 💥💥 All charged up for the #NZvIND T20I series opener#TeamIndia 🇮🇳 pic.twitter.com/AsNSTeMqq8 — BCCI (@BCCI) November 17, 2022 చదవండి: IND vs NZ: 'అతడు అద్భుతమైన బౌలర్.. న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు' -
ప్రాక్టీస్ చేస్తుండగా ఫ్యాన్స్ కేరింతలు! సీరియస్ అయిన కోహ్లి!
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సన్నద్దం అవుతోంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నెట్స్‌లో గంటలకొద్దీ చెమటోడ్చుతున్నాడు. కాగా విరాట్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి అభిమానులు స్టేడియం వెలుపల నుంచి కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా అరిచారు. అయితే నెట్స్‌కు దగ్గరనుంచి అభిమానులు గట్టిగా అరుస్తుండటంతో విరాట్ కోహ్లి ఏకాగ్రత దెబ్బతిన్నది. దీంతో వెంటనే నెట్స్ నుంచి బయటకు వచ్చిన కోహ్లి.. "యార్.. ప్రాక్టీస్ చేస్తున్నపుడు మాట్లాడకండి.. నేను డిస్ట్రబ్ అవుతాను కదా" అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక కోహ్లి సమధానం విన్న ఓ అభిమాని "మీరు ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటారో అప్పుడే మాట్లాడతాం భాయ్.. కింగ్ కోసం ఏమైనా చేస్తాం. కింగ్ ఒక్కడే కదా" అని అన్నాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. During the practice Virat Kohli calmly said something like this to the fans .@imVkohli 👑 pic.twitter.com/3X5LnNTQsV — Hemant Singh (@Hemant18327) October 20, 2022 చదవండి: Nicholas Pooran: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇదో గుణపాఠం.. అయితే.. -
ఒకే చోట కోహ్లి, బాబర్ నెట్ ప్రాక్టీస్.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2022 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్.. ఇప్పుడు మరో ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్దమైంది. బుధవారం(ఆక్టోబర్ 19) బ్రేస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. మరోవైపు దాయాది జట్టు పాకిస్తాన్ మాత్రం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే పాకిస్తాన్ కూడా తమ తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుధవారం బ్రేస్బేన్ వేదికగానే ఆఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చుతున్నారు. ఇద్దరూ ఒకే చోట వేర్వేరు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. కోహ్లి నెట్స్‌లో షార్ట్ బాల్స్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా.. బాబర్ త్రోడౌన్ స్పెషలిస్టులతో సాధన చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సూపర్-12లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న తలపడనుంది. The way Babar Azam looks at Virat Kohli 👀 Virat ✖️ Babar net session together! 🇮🇳🇵🇰 #ViratKohli𓃵 #BabarAzam #SportsYaari pic.twitter.com/VjriVF6TTH — Sushant Mehta (@SushantNMehta) October 17, 2022 చదవండి: T20 WC 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే : సునీల్ గవాస్కర్ -
ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోని.. వీడియో వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్-2023 కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాడు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ నెట్స్‌లో ధోని చెమటోడ్చుతున్నాడు. కాగా జార్ఖండ్ ఆటగాళ్లతో కలిసి ధోని నెట్ ప్రాక్టీస్ చేశాడు. దాదాపు రెండు గంటల కంటె ఎక్కువ సమయం ధోని నెట్స్‌లో గడిపాడు. జార్ఖండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే జార్ఖండ్ జట్టు తమ సొంత మైదానంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ధోని కూడా వాళ్లతో జతకలిశాడు. కాగా ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్లో ధోని పర్వాలేదనపించాడు. ఐపీఎల్-15వ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్.. 232 పరుగులు సాధించాడు. కాగా గతేడాది సీజన్లో తొలుత సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకోలేక జడేజా.. తిరిగి జట్టు పగ్గాలు ధోనికే అప్పగించేశాడు. కాగా ఐపీఎల్-2022లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించిన చెన్నై.. పాయింట్ల పట్టికలో 9 స్థానానికి పరిమితమైంది. ఇక ధోని సారథ్యంలో సీఎస్కే ఇప్పటి వరకు 4 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. MS Dhoni practicing at JSCA 💛🤩 pic.twitter.com/Vjq7mQw2zQ — Chakri Dhoni (@ChakriDhoni17) October 14, 2022 చదవండి: ENG vs AUS: వర్షం కారణంగా మూడో టీ20 రద్దు.. సిరీస్ ఇంగ్లండ్ సొంతం -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి
టీ20 ప్రపంచకప్-2022 కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. పెర్త్‌లోని వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూఏసీఏ) గ్రౌండ్ వేదికగా టీమిండియా తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో విరాట్ పుల్ షాట్, లెగ్ గ్లాన్స్, స్ట్రెయిట్ డ్రైవ్ షాట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కన్పించింది. ప్రస్తుతం విరాట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కింగ్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాకప్‌లో అదరగొట్టిన విరాట్.. అనంతరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లలోనూ తన జోరు కొనసాగించాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ముందు అక్టోబరు 10, 13 తేదీల్లో పెర్త్ వేదికగా టీమిండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. అదే విధంగా ఆసీస్, న్యూజిలాండ్‌తో గబ్బా వేదికగా వార్మప్ మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది. కాగా ఈ మార్క్యూ ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యా్చ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తలపడనుంది. Virat Kohli practicing batting in the nets session at Perth - Absolute treat to watch. pic.twitter.com/NVYHHeqkQX — CricketMAN2 (@ImTanujSingh) October 8, 2022 చదవండి: Ishan Kishan: పాపం ఇషాన్ కిషన్! ఇది నా హోం గ్రౌండ్.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! కానీ.. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్!
యూఏఈ వేదికగా జరగనున్న ఆసియాకప్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. గత కొన్ని రోజులగా విశ్రాంతి తీసుకున్న విరాట్ తిరిగి ఆసియాకప్‌తోనే బరిలోకి దిగనున్నాడు. ఈ మెగా ఈవెంట్లోనైనా కోహ్లి తన ఫామ్‌ను తిరిగి పొందుతాడో లేదో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యా్చ్లో పాకిస్తాన్‌తో ఆడనుంది. అదేవిధంగా కింగ్ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను కూడా పాక్‌పై ఆడనుండడం విశేషం. ఇక ఇప్పటికే యూఏఈకు చేరుకున్న కోహ్లి... ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన ప్రాక్టీస్‌లో భాగంగా స్పిన్నర్లను ఎదుర్కొన్న కోహ్లి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కోహ్లితో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఆదివారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనున్నారు. ఇక ఆసియా కప్ ఈ సారీ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నీలోభారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ సహా క్వాలిఫైయర్స్‌లో విజయం సాధించి టోర్నీకి అర్హత సాధించిన హాంకాంగ్ సైతం పాల్గొనబోతోంది. Virat Kohli's batting practice at the nets.#ViratKohli #INDvPAK pic.twitter.com/hFa6mLv62K — Square Leg (@Cricket_Is_Here) August 25, 2022 This Shot after ages 🥶🚀@imVkohli . . . .#AsiaCup2022#ViratKohli𓃵 #ViratKohli pic.twitter.com/IDjxP1ZiCZ — Gaurav Agarwal (@GauravA1802) August 25, 2022 చదవండి: Virat Kohli: గడ్డు పరిస్థితులు.. స్పందించిన కోహ్లి! నాకిది అసలు సమస్యే కాదు! -
నిబంధన తుంగలో తొక్కిన పాక్ కెప్టెన్.. పీసీబీ సీరియస్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిబంధనలను తుంగలో తొక్కాడు. లాహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్ అత్యంత మౌళిక సదుపాయాలు కలిగి ఉంటుంది. ఈ సెంటర్‌కు పీసీబీ అధికారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, ఫస్ట్‌క్లాస్, జూనియర్ క్రికెటర్లు మినహా వేరెవరికి ప్రవేశం లేదు. ఇటీవలే బాబర్ ఆజం తన సోదరుడు సఫీర్ ఆజంను ప్రాక్టీస్‌కు తీసుకొచ్చాడు.కాగా సఫీర్ ఆజం ఇంతవరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడలేదు. తన సోదరుడితో నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేయించి శిక్షణలో మెళుకువలు ఇచ్చాడు. స్వయంగా తానే పరిశీలించిన బాబర్ బౌలింగ్ టెక్నిక్స్ వివరించాడు.ఈ తతంగాన్ని అంతా బాబర్ ఆజం సోదరుడు సఫీర్ ఆజం ట్విటర్లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాబర్ ఆజం చేసిన పనిపై పీసీబీ కాస్త గుర్రుగానే ఉంది. నిబంధనలను అతిక్రమించిన బాబర్‌పై పీసీబీ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. బాబర్ ఆజం మూడు నాలుగు రోజుల క్రితమే తన సోదరుడితో కలిసి క్యాంప్‌ను సందర్శించాడు. అయితే కేవలం చూడడానికి వచ్చాడనుకొని అనుమతి ఇచ్చామని.. కానీ సఫీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడన్న విషయం తొలుత మా దృష్టికి రాలేదు. తాజాగా ఈ విషయం తెలియడం.. ఆపై ఏం చేయాలన్న దానిపై మాకు ఒక క్లారిటీ ఉంది అని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: Sourav Ganguly New House: ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు pic.twitter.com/u4eZFklQLl — safeer azam (@safeerazam10) May 14, 2022 -
ఇదేం షాట్ అయ్యా యష్ ధుల్ .. నేనెక్కడా చూడలే.. బంతిని చూడకుండానే!
ఐపీఎల్-2022కు సమయం దగ్గర పడడంతో అన్ని జట్లు నెట్స్‌లో చెమట్చోడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు, భారత అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్ సెషన్లో అద్భుతమైన షాట్లు ఆడుతూ యష్ ధుల్ అలరించాడు. అయితే ప్రాక్టీస్‌లో భాగంగా బంతిని చూడకుండానే 'అప్పర్ కట్' షాట్ ఆడి అందరనీ యష్ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన యష్ ధుల్‌ను ఐపీఎల్ మెగా వేలంలో రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో భారత జట్టును ఛాంపియన్ యశ్ ధుల్ నిలిపిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు విదేశీ స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. పాకిస్తాన్ పర్యటన కారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచ్ల్ మార్ష్ ఢిల్లీ జట్టు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మరో వైపు ఆ జట్టు పేస్ బౌలర్ అన్రీచ్ నోర్జే జట్టులో చేరినప్పటికీ అతడు అందుబాటుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' That No-look was S.M.O.O.T.H 🤌 🔝 Upper Cut 🔥 @YashDhull2002 🤩#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/vrnyoso5MS — Delhi Capitals (@DelhiCapitals) March 21, 2022 -
నెట్స్‌లో చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్.. ఫోటోలు వైరల్
మొహాలీ వేదికగా శుక్రవారం భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలిసారిగా రోహిత్ శర్మ బాధ్యతలు చెపట్టనున్నాడు. దీంతో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలు కానుంది. ఇక రోహిత్ కెప్టెన్సీలో భారత్ వరుసగా మూడు పరిమిత ఓవర్ల సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇక టెస్ట్‌ల్లో కూడా తన కెప్టెన్సీ మార్క్ చూపించాలని రోహిత్ తహ తహలాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ చెమటోడ్చుతున్నాడు. అయితే తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను రోహిత్ ట్విటర్లో షేర్ చేశాడు. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓటమి అనంతరం భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్‌ను పూర్తి స్ధాయి భారత టెస్ట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్ సిరాజ్ చదవండి: Kohli 100th Test: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు About time…🔴 🏏 pic.twitter.com/4cmFkwbpAg — Rohit Sharma (@ImRo45) March 2, 2022 -
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Sharma is back in nets, playing lovely strokes: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు డిసెంబర్ 16న పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఇప్పటికే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సౌత్ఆఫ్రికా పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను రోహిత్ శర్మ ఇనస్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. అదే విధంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన హోమ్ సిరీస్ నుంచి షమీకి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న శిఖర్ ధావన్.. జట్టులో చోటు దక్కేనా
Shikhar Dhawan sweats it out in training session: భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడానికి ఓపెనర్ శిఖర్ ధావన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచకున్నాడు. ఇక ఈ ఏడాదిలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్.. టీ20 ప్రపంచకప్‌తో పాటు, స్వదేశంలో న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఎంపిక కాలేదు. రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు ఎన్నో అధ్బుత విజయాలు అందించిన ధావన్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీలు, క్రికెట్ నిపుణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చివరగా ఐపీఎల్ 14వ సీజన్లో ఆడిన ధావన్.. 587 పరుగుల తో అధ్బుతంగా రాణించాడు. కాగా 2021 ఏడాదికుగాను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్‌తో ధావన్‌ను సత్కారించింది. కాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ధావన్.. "అర్జున అవార్డును అందుకోవడం నాకు గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కోచ్‌లు, వైద్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ, సహచరులు, అభిమానులు, నా స్నేహితులు నా కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ధావన్ రాసుకొచ్చాడు. చదవండి: Mahela Jayawardene: శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే! -
తీవ్రంగా శ్రమిస్తున్న భారత ఆటగాళ్లు.. ఫొటోలు వైరల్
Indian players participate in a training session: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్-31)న భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌కు దాదాపు వారం రోజులు సమయం దొరకడంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను టీమిండియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి కొందరు క్రికెటర్లు “ఫన్ డ్రిల్”లో పాల్గొన్నట్లు ఫొటోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే టీ20 ప్రపంచకప్‌ను భారత్, న్యూజిలాండ్ జట్లు పాక్ చేతిలో ఓటమితో ఆరంభించాయి. కాగా బాబర్ అజం సారథ్యంలోని పాక్ జట్టు 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: SL VS AUS: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
మ్యాక్సీ రివర్స్ స్వీప్ అదుర్స్..
చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మంగళవారం తన తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 సీజన్ నేపథ్యంలో సాధన మొదలుపెట్టాడు. తొలి ప్రాక్టీస్ సెషన్లో సూపర్ టచ్‌లో ఉన్నట్టు కనిపించిన మాక్సీ.. రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. పేసర్లు, స్పిన్నర్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించేశాడు. Glenn Maxwell’s Day Out @Gmaxi_32 came. Maxwell reverse swept. And Maxwell had fun. Watch The Big Show and Kyle Jamieson at their first practice session for #RCB ahead of #IPL2021.#PlayBold #WeAreChallengers pic.twitter.com/naMXQcAROQ — Royal Challengers Bangalore (@RCBTweets) April 6, 2021 కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నట్టు కనిపించిన అతను.. అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్ చహల్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ షాట్ ఆడుతూ భారీ సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. అలాగే ఆసీస్ ఆల్‌రౌండర్, సహచర క్రికెటర్ డేనియల్ క్రిస్టియన్ వేసిన బంతిని కూడా మ్యాక్సీ..అద్భుతమైన రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. అతని బ్యాటింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విటర్లో పోస్ట్ చేయగా నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, మిడిలార్డర్ బలోపేతం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మాక్సీని బెంగళూరు రూ.14.25కోట్లకు కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తరఫున గత సీజన్లో ఘోరంగా విఫలమైనా మ్యాక్సీ.. బెంగళూరు తలరాతను మార్చగలడేమో చూడాలి. ఇదిలా ఉండగా ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. చదవండి: వారి నుంచి వచ్చిన సందేశాలు ఎన్నటికీ మరువలేనివి.. -
టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో బిజిబిజీగా
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇందుకోసం నెట్స్‌లో కఠోర సాధన చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా సోమవారం మొటేరా మైదానంలో భారత ఆటగాళ్లు కసిగా బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు సాధన చేస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు. కొందరు ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ కనిపించారు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ ఇదే వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U — BCCI (@BCCI) March 1, 2021 -
మనోళ్లు మైదానంలోకి...
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభ విఘ్నాన్ని అధిగమించారు. నిబంధనల ప్రకారం నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల్లో క్రికెటర్లంతా నెగెటివ్‌గా తేలారు. ఆరు రోజులుగా ఆటగాళ్లంతా క్వారంటైన్లో ఉన్నారు. సోమవారంతో ఇది ముగిసింది. ఈ ఆరు రోజుల కాలంలో ఒక్కో ఆటగాడికి మూడుసార్లు చొప్పున కరోనా టెస్టులు జరిపారు. అన్నింటిలోనూ నెగెటివ్ ఫలితం రావడంతో ఎలాంటి సమస్య లేకుండా టెస్టు సిరీస్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు మూడు రోజుల పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు సాధన చేసేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రమే కొందరు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగి అవుట్డోర్ సాధనకు ఉపక్రమించారని బీసీసీఐ వెల్లడించగా... నేడు ఆటగాళ్లంతా నెట్స్‌లోకి వస్తారని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లకుండా నేరుగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన బెన్ స్టోక్స్, ఆర్చర్, బర్న్స్ క్వారంటైన్ పూర్తి చేసుకొని గత రెండు రోజులుగా సాధన చేస్తూనే ఉన్నారు. ఈ నెల 5 నుంచి తొలి టెస్టు, 13 నుంచి రెండో టెస్టు చెన్నైలో జరగనుండగా... తర్వాతి రెండు టెస్టులకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది. ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన అద్భుత విజయంతో టీమిండియా అమితోత్సాహంతో బరిలోకి దిగుతుండగా... శ్రీలంకపై 2–0తో గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది.