newyork times
-
దూసుకొస్తున్న ట్రంప్.. తాజా సర్వేలో సంచలనం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు మరో పది రోజులే సమయముందనగా న్యూయార్క్ టైమ్స్, సియెనా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే శుక్రవారం(అక్టోబర్ 25) ఆసక్తికర విషయం వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి హారిస్ పట్ల ప్రజలు సమానంగా మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఇద్దరికీ సరిగ్గా చెరో 48 శాతం పాపులర్ ఓట్ రానుందని తేలినట్లు ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలో హారిస్‌కు 49 పాపులర్ ఓట్ అనుకూలంగా ఉండగా ట్రంప్‌కు 46 శాతం మంది మదతిచ్చారు. అయితే క్రమంగా ట్రంప్ పుంజుకొని హారిస్ రేసులో సమాన స్థాయికి రావడం గమనార్హం. ఏది ఏమైనా నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది తేలనుంది.ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం.. అందరికీ అర్థమయ్యే రీతిలో -
న్యూయార్క్ బెస్ట్ రెస్టారెంట్లుగా ఆ నాలుగు భారత రెస్టారెంట్లు!
న్యూయార్క టైమ్స్ 2024 ఏడాదికి న్యూయార్క్ నగరంలో చక్కగా తినేందుకు అత్యుత్తమమైన రెస్టారెంట్ల జాబితాలను విడుదల చేసింది. న్యూయార్క్‌లో రెస్లారెంట్లపై అభిరుచిగల పీట్వెల్స్ అనే ప్రముఖ వ్యక్తి ఈ వంద అత్యుత్తమ బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఎంపిక చేశారు. వాటిలో భారతీయ వంటకాలను అందించే నాలుగు రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఆ అత్యుత్తమ రెస్టారెంట్లలలో గ్రీన్విచ్ విలేజ్‌లో ఉండే సెమ్మా అనే రెస్టారెంట్ టాప్ 10లో ఏడో స్థానంలో ఉంది. గతేడాది ఇదే రెస్టారెంట్ 12వ స్థానంలో ఉంది. ఈ సెమ్మా రెస్టారెంట్‌ని చెఫ్ విజయకుమార్ నిర్వహిస్తున్నారు. ఆయన మంచి సౌత్ ఇండియన్ వంటకాలను అందిస్తున్నారు. అలాగే మాన్‌హట్టన్ దిగువ తూర్పు వైపునున్న ధమాకా 54వ స్థానంలో ఉంది. దీనికి చెఫ్ భాగస్వామి చింతన్ పాండ్యా , రెస్టారెంట్ రోనీ మజుందార్ కలిసి నిర్వహిస్తున్నారు. క్వీన్స్‌లోని టెంపుల్ క్యాంటీన్ 80వ స్థానంలో నిలిచింది. ఇది హిందూ దేవాలయం నేలమాళిగలో ఉంది. ఇది సంప్రదాయ దక్షిణాది వంటకాలను అందిస్తుంది. మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని హైదరాబాదీ జైకా న్యూయార్క్ నగరంలోని టాప్ 100 ఉత్తమ రెస్టారెంట్లలో చివరి భారతీయ రెస్టారెంట్. ఇది 95వ స్థానంలో ఉంది. ఇది బిర్యానీలకు ప్రత్యేకత గాంచిన రెస్టారెంట్. ఈ మేరకు పీట్ వెల్స్ అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా తోపాటుగా చివర నోట్లో ఇలా రాశాడు. అందులో.."న్యూయార్క్ ఒక పెద్ద నగరం. ఇక్కడ ప్రజలు తమ పరిసరాలకు సమీపంలో మంచి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేలా ఈ టాప్ 100 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను లిస్ట్ చేశాను. ఈ జాబితాతో కావాల్సిన వంటకాలు దొరికే రెస్టారెంట్లు ఏంటో కూడా ఈజీగా తెలుసుకోగలరు. చక్కగా రుచులను ఆస్వాదించగలరు అని రాశారు పీట్ వేల్స్. View this post on Instagram A post shared by Semma (@semmanyc) (చదవండి: యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!) -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ‘యాత్ర 2’ టీజర్
యాత్ర’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్‌ను న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్‌ను చూపించారు. ఇప్పటివరకు అతి కొద్ది సినిమాలకే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతోంది. ఇక ఈ టీజర్లో 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్‌తో పాటు 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
వైఎస్సార్ వర్ధంతి: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక ప్రదర్శన
వైఎస్సార్.. ఆ పేరు ఓ ప్రభంజనం. నవ్వులో స్వచ్ఛత.. పిలుపులో ఆత్మీయత.. మాట తప్పని, మడమ తిప్పని గుణంతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. మహానేతను కోల్పోయి 14 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు..ఆ రూపం చెదిరిపోలేదు. ఇక, మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా న్యూయర్ టైమ్స్ స్వ్కేర్‌లో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. చెదరని జ్ఞాపకం మహానేత వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అని ప్రదర్శించారు. అవధుల్లేని అభిమానం 🙏🏻 In Texas 🔥#YSRVardanthi #JoharYSR pic.twitter.com/1ilcV1iMi4 — Jagananna Connects (@JaganannaCNCTS) September 2, 2023 ఇది కూడా చదవండి: వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు: సజ్జల -
ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ఎస్సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను హైలైట్ చేస్తూ అమెరికా ప్రముఖ వార్తా సంస్థలు, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. 'సమకాలీన ప్రపంచంలో యుద్ధానికి తావులేదు.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించండి' అని మోదీ పుతిన్‌తో అన్నారు అంటూ వాషింగ్టన్ పోస్టు హెడ్లైన్లో చెప్పింది. దీంతో రష్యా అధ్యక్షుడు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అయిందని పేర్కొంది. మోదీకి బదులిస్తూ.. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని పుతిన్ మాటిచ్చారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ బహిష్కరించడం వల్లే సైన్యం ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పుతిన్ చెప్పినట్లు వెల్లడించింది. ఎస్సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా పుతిన్‌లో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం గరించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మోదీ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తి యుద్ధాన్ని ఆపాలని కోరడాన్ని అమెరికా మీడియా కొనియాడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పలుమార్లు ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్ -
అక్కడ వారికి పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌లు మాత్రమే దొరుకుతాయి!
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయని, ఏమి కనగొనలేకపోయారని అన్నారు. అమెరికా ప్రసిద్ధ వార్త పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆయన పనితీరుని ప్రశంసించి ఫ్రంట్ పేజీలో ప్రచురిస్తే... కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులు నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అయినా మనీష్ సిసోడియా ఇంట్లో కేవలం పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు మాత్రేమ కనిపిస్తాయని ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు వంద మందికి పైగా ఆప్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, ప్రతికేసులో ఒక్కొక్కరిగా తాము కేసు నుంచి బయటపడ్డామని రాఘవా అన్నారు. ఐతే సీబీఐ విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా తొమ్మిది నెలలుగా అమలు చేసిన కొత్త మద్యం పాలసీపై విచారణ జరుపుతోంది. ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మద్యం విక్రయించడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలనే దానిపై సిసోడియా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని సీబీఐ పేర్కొంది. అంతేకాదు లైసెన్సులతో మధ్యం విక్రయించుకునేలా ప్రైవేట్ వ్యక్తులకే అధిక సంఖ్యలో కట్టబెట్టేందుకు చూసిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఐతే అవినీతిని అరికట్టేందుకు, శక్తివంతమైన మద్యం మాఫియాపై పోరాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశించినట్లు సిసోడియా చెబుతుండటం గమనార్హం. (చదవండి: సీబీఐ దాడుల మధ్య కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్) -
35 ఏళ్ల పెంపుడు కుమార్తెతో బిడ్డను కన్న ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్!
ఎలన్ మస్క్ తన తొమ్మిది మంది సంతానంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఎలన్ మస్క్‌కు ఏ మాత్రం తీసిపోనంటూ ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ సైతం ఈ తరహా వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు మూడేళ్ల క్రితం తన పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో మరోసారి తండ్రినయ్యానంటూ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించాడు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం..యూకేకి చెందిన టాబ్లాయిడ్ ఎర్రోల్ మస్క్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో..ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ యూనివర్సిటీ ఓ డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎర్రోల్ మస్క్ మాట్లాడుతూ..తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే జానాతో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్కు, 2019లో పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ఎర్రోల్ మహానుభావుడు ఎలన్ మస్క్ కు తన తండ్రి ఎర్రోల్ మస్క్ అంటే అస్సలు నచ్చదు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీరక సుఖ కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఎర్రోల్ తొలిసారి ఎలన్ మస్క్ తల్లి మేయల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత మేయల్‌కు విడాకులిచ్చి అప్పటికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్, జానా దంపతులు అబ్బాయి, అమ్మాయికి జన్మనిచ్చారు. కాగా, రెండో భార్య కుమార్తె జానాకు ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ వయస్సు వ్యత్యాసం 40ఏళ్లు. -
దేశంలో కరోనా మరణాలపై ట్విస్ట్.. కేంద్రంపై రాహుల్ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య మరోసారి చర్చనీయాంశమైంది. కాగా, తాజాగా కోవిడ్ మరణాల విషయంలో భారత ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో తేడా వుందంటూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీంతో, కోవిడ్ మరణాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ‘ప్రధాని మోదీ సత్యాలు మాట్లాడరు. మాట్లాడేవారిని మాట్లాడనివ్వరు. ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ మరణించలేదని ఇప్పటికీ మోదీ చెబుతుంటారు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 5 లక్షలు కాదు.. 40 లక్షల మంది కోవిడ్‌తో మృతిచెందారు. ఇది ముందు నుంచీ నేను చెబుతూనే వున్నాను. కోవిడ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. मोदी जी ना सच बोलते हैं, ना बोलने देते हैं। वो तो अब भी झूठ बोलते हैं कि oxygen shortage से कोई नहीं मरा! मैंने पहले भी कहा था - कोविड में सरकार की लापरवाहियों से 5 लाख नहीं, 40 लाख भारतीयों की मौत हुई। फ़र्ज़ निभाईये, मोदी जी - हर पीड़ित परिवार को ₹4 लाख का मुआवज़ा दीजिए। pic.twitter.com/ZYKiSK2XMJ— Rahul Gandhi (@RahulGandhi) April 17, 2022 -
పాపం ఉక్రెయిన్.. చైనా పాడుబుద్ధి బయటపడిందిగా!
కుక్క తోక వంకర.. అట్లాగే ఏ మాత్రం విశ్వాసంలేని డ్రాగన్ కంట్రీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదనే అనుకోవడం సహజం. ఒకవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు మోహరించిన వేళ.. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటే, చైనా మాత్రం తనకు బాగా అలవాటైన వక్రబుద్ధిని ప్రదర్శించింది. నాటో కూటమిలో చేరొద్దంటూ రష్యా, ఉక్రెయిన్ ఆక్రమణకు తెగపడిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఈ పరిణామాలు ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తరుణంలో చైనా ఇరు దేశాల మధ్య దౌత్యానికి ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమది శాంతికాముక దేశమని, యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సయోధ్య కుదిర్చేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రకటించుకుంది చైనా. కట్ చేస్తే.. రష్యాపై ఆంక్షలు ఏమాత్రం కరెక్ట్ కాదని తాజాగా ప్రకటన ఇచ్చింది. ఇంతలోనే ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు బయటకు పొక్కడం సంచలనంగా మారింది. చైనా రాజధాని బీజింగ్ వేదికగా 2022 వింటర్ ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఈవెంట్స్ జరిగాయి. ఉయిగర్లపై హింసాకాండ, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటగట్టిందనే అపవాదు.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యం సహా చాలా దేశాలు ఈ ఈవెంట్లను బహిష్కరించాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజానికి దూరంగా వింటర్ ఒలింపిక్స్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించుకుంది చైనా. ఈ తరుణంలో.. రష్యా గనుక ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడితే తమకు ఇబ్బంది కలుగుతుందని, కాబట్టి శీతాకాల ఒలింపిక్స్ ముగిసేవరకు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ఉక్రెయిన్‌పై ఎలాంటి చర్యలకు దిగినా పర్వాలేదనే ప్రతిపాదనను మాస్కో(రష్యా రాజధాని) ముందు ఉంచిందట. ఈ మేరకు చైనా సీనియర్ అధికారులు, మాస్కోతో పలుదఫాలుగా మంతనాలు చేపట్టగా.. వాళ్ల మధ్య సంభాషణలన్నీ రికార్డయ్యాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ నివేదికలు, పలు స్టింగ్ ఆపరేషన్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు. అయితే చైనా విజ్ఞప్తికి రష్యా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ నివేదికలు బయటపెట్టలేదు. ఈ ఆరోపణలపై వెంటనే స్పందించేందుకు సీఐఏ, వైట్‌హౌజ్ జాతీయ భద్రతా మండలి నిరాకరించింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తమ స్వార్థం కోసం ఆక్రమణను వాయిదా వేయాలని కోరడం బయటకు పొక్కడంతో చైనాను ఛీ కొడుతున్నాయి పలు దేశాలు. న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ ప్రచురించిన ఈ సంచలనాత్మక కథనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చూద్దాం.. ఈ కథనాలపై చైనాగానీ, రష్యాగానీ ఎలా స్పందిస్తాయో!. చదవండి: రష్యాకు సపోర్ట్!! పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.. జాగ్రత్త! -
ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!
A Gold Cube Worth $11.7 Million Appeared In New York's Central Park: ఇంతవరకు మనం బంగారానికి సంబంధించిన వస్తువులను, గోల్డ్ బిస్క్ట్లు గురించి విన్నాం. గోల్డ్‌తో తయారు చేసే మాస్క్‌ల దగ్గర నుంచి రకరకాల బంగారపు కళాకృతులు గురించి విని ఉన్నా. కానీ ఒక భారి సైజులో ఉండే గోల్డ్ క్యూబ్ గురించి విని ఉండటమే కాదు చూసి కూడా ఉండం. పైగా అంత పెద్ద క్యూబ్‌ని ఒక ఓపెన్ పార్క్‌లో స్వయం భద్రతా నడుమ ఆరు బయట ఉండటం గురించి అసలు విని ఉండరు. అసలు విషయంలోకెళ్తే...న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో బంగారంతో చేసిన భారీ క్యూబ్ ఉంది. దీనిని దాదాపు 186 కిలోగ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో జర్మన్ కళాకారుడు నిక్లాస్ కాస్టెల్లో రూపొందించారు. ఆ కళాకారుడు కొత్త క్రిప్టోకాయిన్ ప్రచార నిమిత్తం అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ సెంట్రల్ పార్క్‌లో ఉంచాడు. అంతేకాదు మానవజాతి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇంత భారీ మొత్తంలో బంగారు క్యూబ్‌ని రూపొందించ లేదు. కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అన్ని కోణాల్లోని సంభావిత కళాఖండంగా పేర్కొన్నాడు. అయితే కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అమ్మకానికి పెట్టడం లేదని తెలిపాడు. ఈ మేరకు ఈ గోల్డ్ క్యూబ్ ధర దాదాపు రూ.87 లక్షలు. అంతేకాదు ఈ క్యూబ్‌ని చేతితో తయారు చేసిన కొలిమి సాయంతోనే రూపొందించగలం అని వివరించాడు. ఈ భౌతిక కళాకృతి క్రిప్టోకరెన్సీలో భాగంగా క్యాస్టెల్లో కాయిన్ని ప్రారభించటమే కాక సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీల్లో వేలం వేయనున్నట్లు న్యూయర్క్ టైమ్స్ పేర్కొంది. View this post on Instagram A post shared by Niclas Castello (@niclas.castello) (చదవండి: మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి) -
అంబానీ అదరహో..ఈసారి ఏకంగా!!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార కార్యకలాపాల్నీ దేశ విదేశాలకు విస్తరిస్తున్నారు. ఇటీవల లండన్ స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను కొనుగోలు చేసిన ఆయన తాజాగా అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రముఖ ఐకానిక్ లగ్జరీ హోటల్ 'మాండరీయన్ ఓరియంటల్'ను కొనుగోలు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాసియా దేశాల్లోనే అపరకుబేరుల జాబితాల్లో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ నగరంలోని 80 కొలంబస్ సర్కిల్ ప్రాంతంలో కేపిటల్ ఆఫ్ కొలంబస్ సెంటర్ కార్పొరేషన్‌కు చెందిన ఐకానిక్ లగ్జరీ హోటల్ మాండరీయన్ ఓరియంటల్ 73.37శాతం స్టేక్‌తో 98.15మిలియన్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ భారీ మొత్తాన్ని విలాసవంతమైన హోటల్లో పరోక్షంగా వాటాను కలిగి ఉన్న కేమాన్ ఐలాండ్స్ షేర్ ను కొనుగోలు చేయడంతో.. హోటల్ ముఖేష్ అంబానీ సొంతమైంది. హోటల్ ప్రత్యేకతలు 2003లో స్థాపించిన మాండరిన్ ఓరియంటల్ 80 కొలంబస్ సర్కిల్లో ఉన్న ఐకానిక్ లగ్జరీ హోటల్. ఇది నేచురల్ సెంట్రల్ పార్క్, కొలంబస్ సర్కిల్‌కు నేరుగా ఆనుకుని ఉంది. అంతేకాదు ఇది ప్రపంచంలో ప్రసిద్దికెక్కిన హోటల్స్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అందుకుగాను ఆ హోటల్‌కు ఏఏఏ ఫైవ్ డైమ్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్ స్టార్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్‌స్టార్ స్పా అవార్డ్‌లను గెలుచుంది. కాగా ఈ హోటల్ 2018లో ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8,54,19,12,500.00, 2019లో రూ.8,39,33,57,500.00, 2020లో రూ.1,11,41,62,500.00 ఆదాయాల్ని గడించింది. ఇప్పుడు ఇదే హోటల్ ఎక్కువ వాటాను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయడంతో రిలయన్స్ ఆస్తులు రెట్టింపు అయినట్లు రిపోర్ట్లు పేర్కొన్నాయి. మొన్నిటిక మొన్న స్టోక్ పార్క్ ఎస్టేట్ రిలయన్స్ సంస్థ ఇప్పటికే ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్), ముంబైలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్, హోటల్, ఇళ్లను భారీ ఎత్తున కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం లండన్ బకింగ్ హామ్ స్టోక్ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లను వెచ్చించింది. కాగా, ఈ స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను హెరిటేజ్ ప్రాపర్టీకింద వినియోగిస్తున్నట్లు రిలయన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం..! -
తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!
Jewellery Made From Breast Milk: ఇంతవరకు తల్లిపాల ప్రాధాన్యత గురించి మాత్రమే తెలుసు. అంతేకాదు పుట్టిన నవజాత శిశువులకు తొలి ఆరునెలల తల్లిపాలు తాగితే వారికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అంతేందుకు తల్లిపాల వారోత్సవాలు లేదా మథర్ బ్రెస్ట్ మిల్క్ డే అని ఒక రోజు కూడా ఏర్పాటు చేశారు. పైగా తల్లిపాలకు నోచుకోని చిన్నారులకు తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో మిల్క్ బ్యాంక్స్ ఏర్పాటు చేద్దాం అంటూ విన్నూతన పద్ధతులు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు నిపుణులు. కొన్ని దేశాల ఇప్పటికే ఆ పద్ధతులను అవలంభించాయి కూడా. అయితే ఇప్పుడు ఈ తల్లిపాలతో విలువైన ఆభరణాలను కూడా తయారుచేస్తున్నారట. అంతేకాదు ఇది తల్లులు తమ పిల్లతో గల విశిష్ట అనుబంధానికి గుర్తుగా రూపొందిస్తున్నారట!. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన అల్మా పార్టిడా తన కుమార్తె అలెస్సాకు సుమారు 18 నెలల పాటు పాలిచ్చింది. అయితే అప్పుడే ఆమెకు తాను తన పిల్లలకు ఇస్తున్న పాలను మాృతృత్వపు మాధుర్యానికి గుర్తుగా ఉంచుకునే మార్గం కోసం అన్వేషించింది. అంతేకాదు ఇందుకోసం ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు తల్లిపాలతో తయారు చేసే నగల కంపెనీ కీప్‌సేక్స్ బై గ్రేస్ గురించి తెలుసుకుంది. ఇక ఆమె వెంటనే తల్లిపాలలో దాదాపు 10 మిల్లీలీటర్లను కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపింది. ఈ మేరకు ఒక నెల తర్వాత ఆ కంపెనీ ఆమె చేతికి మిల్కీ-వైట్ గుండె ఆకారంలో లాకెట్టును పంపించింది. దీంతో అల్మా పార్టిడా తన కోరిక ఫలించినందకు సంతోషించడమే కాక తాను తల్లిగా మారిన తర్వాత చివరి మిల్క్ డ్రాప్‌గా తన బిడ్డకు పాలు ఇస్తు సాగిన జీవితపు తీపి గుర్తుగా పదిలంగా ఉంటుందని పేర్కొంది . ఈ మేరకు కీప్‌సేక్స్ బై గ్రేస్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో మాట్లాడుతూ...తల్లిపాలతో ఆభరణాలా అంటూ ఆశ్యర్యంతోపాటు నన్ను ఒక వెర్రిదాని వలే చూశారు. నేను తయారు చేసిన ఆభరణాలను చూసిన తర్వాతే నాకు చాలా ఆర్డర్లు రావడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడూ విపరీతమైన నరకయాతనను అనుభవించిన తల్లుల నుంచే తనకు ఎక్కు ఆర్డర్లు వచ్చాయి" అని న్యూయార్క్ టైమ్స్‌కి తెలిపింది. అంతేకాదు సారా తల్లిపాలతో తయారు చేసే స్టోన్లు దాదాపు రూ.4 వేల నుంచి 11 వేలు వరకు ధర పలుకుతాయి. అంతేకాదు సదరు మహిళ అల్మా చేతికి జ్యువెలరీని ధరించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆవీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) View this post on Instagram A post shared by Sarah | Breastmilk Jewelry (@keepsakesbygrace) -
మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్‌బెర్గ్
ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలతో ఫేస్‌బుక్‌తో పాటు అనుసంధానంగా ఉన్న ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు తగ్గిపోతున్నారు.వారికోసం వందల కోట్లు ఖర్చు చేసేందుకు మార్క్‌జుకర్ బెర్గ్ సిద్ధమయ్యారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్..ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటూ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరుతో నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక వెలుగులోకి రావడంతో ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు ఇతర సోషల్ మీడియా సైట్స్‌ను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. అందుకే చేజారిపోతున్న యజర్లను అట్రాక్ట్ చేసేందుకు, కొత్త యూజర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇన్‌స్ట్రాగ్రామ్ ఈ ఏడాది వార్షిక యాడ్ బడ్జెట్లో టీనేజ్ యూజర్స్ కోసం సుమారు 390 మిలియన్ డాలర్లను (ఇండియన్ కరెన్సీలో రూ. 29,26,36,50,000.00) యాడ్స్ రూపంలో మార్క్‌జుకర్ బెర్గ్ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ఇన్ స్ట్రాగ్రామ్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్‌లకు వరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇన్ స్ట్రాగ్రామ్ నుంచి 35శాతం మంది యూజర్లు స్నాప్ చాట్‌కు ,30శాతం మంది యూజర్లు టిక్ టాక్ వైపు మొగ్గుచూపారని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి.అయితే వారిని నియంత్రించేందుకు యాడ్స్‌పై భారీ ఖర్చు పెట్టనుంది. ముఖ్యంగా టీనేజ్ యూజర్లు తగ్గిపోవడంపై ఇన్ స్ట్రాగ్రామ్ ముప్పుగా భావిస్తోంది. అందుకే యాడ్స్ లేదా, ఇతర మార్కెటింగ్ స్ట్రాటజీల్లో 13 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న కిడ్స్ యూజర్ బేస్ పెంచుకునేందుకు 'Instagram kids' పేరుతో యాప్‌ను బిల్డ్ చేస్తోంది. ప్రస్తుతం ఆ యాప్‌ను బిల్డ్ చేయడం నిలిపివేసినట్లు ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోసేరి తెలిపారు. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం -
సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో
న్యూయార్క్: అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి(26)కి తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం. అయితే, పూర్తి స్థాయిలో మతపరమైన వెసులుబాట్లు కల్పించకుంటే కోర్టుకెళతానని అతడు పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సుఖ్బీర్ సింగ్ 2017లో మెరైన్స్లో చేరారు. ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్‌గా ప్రమోషన్ అందుతుందని సుఖ్బీర్ సింగ్ తూర్ సుఖ్బీర్సింగ్ తూర్ న్యూయార్క్‌టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. చదవండి: (మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ) భారత్ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్బీర్కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ‘సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు తలపాగా ధరిస్తే ఇతరులు అతడిని గుర్తుపడతారు’అని మెరైన్‌వర్గాలు అంటున్నాయి. యుద్ధ విధుల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్‌కు ఏకరూపకత అవసరమని పేర్కొంటున్నాయి. దీనిపై సుఖ్బీర్ చేసిన వినతిని మెరైన ఉన్నత వర్గాలు తిరస్కరించాయని న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సిక్కులు సుమారు 100 మంది ఉండగా, వారంతా తలపాగా ధరించేందుకు, జట్టు పెంచుకునేందుకు అనుమతి ఉంది. చదవండి: (సరిహద్దులో చైనా దూకుడు!) -
వివాదాల నుంచి రిలాక్స్ అవ్వడానికే సర్ఫింగ్ చేస్తున్నారా!: న్యూయార్క్ టైమ్స్
న్యూయార్క్: క్వాలిటీ కంట్రోల్ మెకానిజంలో ఫేస్బుక్ దారుణంగా విఫలం అవుతోందని, ఫేస్‌బుక్‌ను డర్టీగా మార్చేసిందంటూ... ది స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించి సంగతి తెలిసిందే. అయితే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు స్వతహాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దిగ్గజంగా అభివర్ణించే ఫేస్బుక్ తన సొంత రూల్స్‌ను పక్కనపెట్టేస్తోందంటూ విమర్శిస్తున్నారు. అంతే కాదు యూజర్లను ‘హైప్రొఫైల్’ కోణంలో విభజించి.. వివక్ష ప్రదర్శిస్తోందంటూ సర్వత్రా విమర్మలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ డేటా లీకేజ్ కాకుండా పలు చర్యలు తీసుకున్నారు. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు జూకర్ బర్గ్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కూడా దృష్టి సారిస్తున్నట్లు మార్క్‌జూకర్ బర్గ్ తెలిపిన ఈ వివాదలు మాత్రం ఆగడం లేదు. పైగా సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ చేసిన వివాదాస్పదం చేస్తున్నారు. (చదవండి: డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించకూడదట!) ఈ మేరకు న్యూయర్క్ టైమ్స్ పత్రిక మార్క్ జూకర్ బర్గ్‌ని వివాదాలకు దూరంగా సర్ఫింగ్ చేస్తూ రిలాక్స్ అవుతన్నారా! అంటూ ఒక కథనం ప్రచురించింది. ఇటీవల ఆయన అమెరికా జెండా పట్టుకుని హైడ్రోఫోలింగ్ చేస్తున్న ఒక వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. దీంతో న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలతో ఆయనపై విమర్శలు కురిపించింది. ఈ మేరకు మార్క్ జూకర్ బర్గ్ మాట్లాడుతూ.. "హైడ్రోఫోలింగ్ అనేది ఒక జల క్రీడ. పైగా ఇది నా హాబీ. ఇలా చేయడం నా కెంతో సంతోషాన్ని ఆనందాన్నికలిగించింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి" అన్నారు. నా వ్యక్తిగత అభిరుచిలపై కూడా విమర్శలు కురిపించకండి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తానెప్పుడు విరామం దొరికినపుడల్లా కుటుంబం, స్నేహితులు రైడింగ్లతోనూ గడుపుతుంటానని పేర్కొన్నాడు. దయచేసి నా వ్యక్తిగత సంతోషాల్ని కూడా వివాదాస్పదం చేయంకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి) -
అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులు ధనవంతులుగా అవతరించారని అక్కడి తాజా జనాభా గణాంకాల్లో వెల్లడైంది. అక్కడి భారతీయులు సగటున ఏడాదికి దాదాపు రూ.91.76 లక్షలు (1,23,700 డాలర్లు) సంపాదిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తన విశ్లేషణలో పేర్కొంది. ఈ మొత్తం అక్కడి అమెరికా జాతీయ సగటు వార్షిక ఆదాయం దాదాపు రూ.47.42లక్షల(63,922 డాలర్ల) కంటే రెట్టింపు ఉండటం విశేషం. మధ్యతరగతి కుటుంబాల ఆర్జనలో అక్కడి ఇతర ఆసియా దేశాల వారితో పోల్చినా భారతీయుల వార్షిక ఆర్జన అధికంగానే ఉంది. తైవాన్ దేశస్తులు దాదాపు రూ.72 లక్షలు(97,129 డాలర్లు), ఫిలిప్పీన్ దేశస్తులు రూ.70.40 లక్షలు(95,000 డాలర్లు) సంపాదిస్తున్నారు. అమెరికన్ కుటుంబాల్లో దాదాపు రూ.29.67లక్షల(40వేల డాలర్ల)లోపు వార్షిక సంపాదన ఉన్న కుటుంబాలు 33 శాతం ఉండగా, కేవలం 14 శాతం భారతీయ కుటుంబాలే అంత తక్కువగా సంపాదిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల కాలంలో అమెరికాలో ఆసియన్ల జనాభా ఏకంగా మూడు రెట్లు పెరిగింది. అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న జనాభా ఆసియన్లదే. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 16 లక్షల మంది వీసాదారులున్నారు. 14 లక్షల మంది గ్రీన్‌కార్డు సంపాదించి శాశ్వత స్థిరనివాస హోదా పొందారు. 40 లక్షల మందిలో దాదాపు 10 లక్షల మంది అక్కడ జన్మించిన వారే ఉండటం గమనార్హం. అమెరికా జనాభాలో సగటున 34 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, అక్కడి భారతీయుల్లో ఏకంగా 79 శాతం మంది పట్టభద్రులు ఉండటం విశేషం. అమెరికాలోనే జన్మించిన ఆసియన్ అమెరికన్ల జనాభాలో యువత సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా సగం మంది చిన్నారులే. -
‘నా భర్తతో పాటే నేను చనిపోయాననుకున్నారు.. ఎన్నికల్లో పోటీ చేస్తా’
వాషింగ్టన్: ఈ నెల ప్రారంభంలో(జూలై 7) హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్‌ను తన అధికారిక నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దాడిలో గాయపడ్డ అధ్యక్షుడు మోయిజ్ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె న్యూయార్క్‌టైమ్స్‌తో మాట్లాడారు. హంతకులు అధ్యక్షుడి నివాసంలో దేని కోసం వెతికారు.. తాను ఇంకా సజీవంగా ఉన్నానో, లేదో తెలుసుకోవడానికి వారు చేసిన ప్రయత్నాల గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా మార్టిన్ మోయిజ్ మాట్లాడుతూ.. ‘‘నేను చనిపోయానని భావించి.. వారు నన్ను వదిలేశారు. నా భర్త చుట్టూ ఎప్పుడు 30-50 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అంత మంది ఉండగానే నా భర్తను చంపేశారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. నా భర్త సెక్యూరిటీ గార్డుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు.. కనీసం తీవ్రంగా గాయపడలేదు కూడా. వ్యవస్థే నా భర్తను పొట్టన పెట్టుకుంది’’ అని ఆరోపించారు. మార్టిన్ మాట్లాడుతూ.. ‘‘ఘటన జరిగే సమయానికి మేం గాఢ నిద్రలో ఉన్నాం. తుపాకుల మోత విని లేచాం. వెంటనే సహాయం కోసం నా భర్త తన భద్రతా బృందాన్ని పిలిచాడు. ఆలోపే వారు మా బెడ్రూంలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నా భర్త చనిపోయాడు.. నా చేతికి, మోచేయికి దెబ్బ తగిలింది. ఓ పక్క తీవ్ర రక్తస్రావం.. మరోవైపు ఊపిరాడనట్లు అనిపించింది. ఇక హంతకులు స్పానిష్‌లో మాత్రమే మాట్లాడారు (హైతీ అధికారిక భాషలు క్రియోల్, ఫ్రెంచ్). హంతకులు దాడి చేసినప్పుడు ఎవరితోనో ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అయ్యారు. హంతకులు మా గది నుంచి ఏమి తీసుకున్నారో నాకు తెలియదు.. కానీ నా భర్త ఫైల్స్ ఉంచే షెల్ఫ్ని గాలించారు’’ అని తెలిపారు. మార్టిన్ మాట్లాడుతూ.. ‘‘నా భర్తను హత్య చేసిన వారు నేను భయపడాలని.. రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వారి ఆశలు నెరవేరవు. నేను కోలుకున్న తర్వాత అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను. నా భర్తను చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. లేదంటే వారు అధికారం చేపట్టిన ప్రతి ఒక్క అధ్యక్షుడిని చంపుతారు. నా భర్తను హత్య చేసిన దుండగులను శిక్షించకపోతే.. ఇప్పుడు జరిగిన దారుణం మళ్లీ మళ్లీ జరుగుతుంది’’ అన్నారు. 53 ఏళ్ల వయసున్న మోయిజ్ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్ష నేతలు ఆయన గద్దె దిగాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం..!
టెహ్రాన్/వాషింగ్టన్: ఉగ్ర సంస్థ ఆల్‌ఖైదా ముఖ్య నాయకుడు అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబూ మహ్మద్ అల్-మస్రీ హతమయ్యాడన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై ఇరాన్ స్పందించింది. ఇవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేసింది. అసలు తమ భూభాగంలో ఆల్-ఖైదా ఉగ్రవాదులే లేరని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా వ్యవహరించడం డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి పరిపాటిగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా 1998లో ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాల పేలుళ్లకు సూత్రధారిగా భావిస్తున్న ఆల్‌ఖైదా సెకండ్-ఇన్-కమాండ్ మస్రీను ఇజ్రాయెల్ బలగాలు మట్టుబెట్టినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్యం తరఫున రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ సేనలు ఆగష్టు నెలలో అతడిని హతమార్చినట్లు ఇంటలెజిన్స్ వర్గాలు వెల్లడించాయని న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం పేర్కొంది. టెహ్రాన్ వీధుల గుండా వెళ్తున్న మస్రీని ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిలు మీద వెంబడించి తుపాకీతో అతడిని కాల్చినట్లు వెల్లడించింది. మస్రీ వారసుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఐమన్ అల్-జవాహిరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడని తన కథనంలో పేర్కొంది. అయితే మస్రీ కోసం గత కొన్నేళ్లుగా జల్లెడ పడుతున్న అమెరికా, అతడి హతం వెనుక ఎలాంటి పాత్ర పోషించిందన్న అంశంపై స్పష్టత లేదని తెలిపింది. అదే విధంగా ఆల్‌ఖైదా మస్రీ మృతిని ధ్రువీకరించకుండా ఇరాన్ ప్రభుత్వం కట్టడి చేసిందని పేర్కొంది. ఈ కథనాన్ని ఖండిస్తూ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖతీబ్జదేశ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. (చదవండి: ట్రంప్ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా?!) ‘‘అలాంటి(ఉగ్రవాద) గ్రూపులతో ఇరాన్ పేరును ముడిపెడుతూ అసత్య కథనాలు ప్రసారం చేసేలా మీడియాకు లీకులివ్వడం ట్రంప్ యంత్రాంగానికి సర్వసాధారణమైపోయింది. నేరగాళ్ల కార్యకలాపాలను కట్టడిచేయలేక, ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల చెలరేగుతున్న కల్లోలాన్ని రూపుమాపలేక తమ చేతకానితనాన్ని ఇతరులపై రుద్దుతున్నారు. ఇరాన్‌ను భయపెట్టేందుకు వేసే ఎత్తుగడలు పనిచేయవు’’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ఆగష్టు 7నాటి ఆపరేషన్‌లో మస్రీతో పాటు అతడి కూతురు, ఒసామా బిన్ లాడెన్ కోడలు(హంజా బిన్‌లాడెన్ భార్య) కూతురు కూడా మృతి చెందినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక మస్రీ 2003 నుంచి ఇరాన్ కస్టడీలోనే ఉన్నాడని, 2015 నుంచి టెహ్రాన్‌లో స్వేచ్చగా జీవించేందుకు అతడికి అవకాశం లభించిందని ఇంటలెజిన్స్ అధికారులు చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. కాగా ఇరాన్ అధికార మీడియా మాత్రం ఆగష్టు 7న దుండగుల దాడిలో మరణించింది లెబనీస్ హిస్టరీ ప్రొఫెసర్ హబీబ్ దావూద్, అతడి కుమార్తె మరియం అని పేర్కొనడం గమనార్హం. -
పన్నులు ఎగవేస్తున్న డొనాల్డ్ ట్రంప్!
సాక్షి, న్యూఢిల్లీ : సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత పదేళ్ల కాలంలో కేవలం రెండే రెండు ఏళ్లకు ఆదాయం పన్ను చెల్లించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తనకు ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ వచ్చినందున ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన ఆ శాఖకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ విషయాలను న్యూయార్క్ టైమ్స్ ఆదివారం నాటి సంచికలో వెల్లడించింది. (టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్‌నకు ఎదురుదెబ్బ) డొనాల్డ్ ట్రంప్ గత 15 ఏళ్ల కాలంలో పదేళ్లపాటు ఆదాయం పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన 2016 సంవత్సరంలో కేవలం 750 డాలర్లు, ఆ మరుసటి సంవత్సరం, అంటే 2017 సంవత్సరానికి మరో 750 డాలర్లు ఆదాయం పన్ను చెల్లించారు. తనకు ఆదాయానికి మించిన నష్టాలు వచ్చినందున తాను ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ అమెరికా ప్రభుత్వ రెవెన్యూ శాఖకు ట్రంప్ వివరణ ఇచ్చారు. అయితే ఆయన తన ఆస్తుల వివరాలనుగానీ, నష్టాల వివరాలనుగానీ వెల్లడించలేదు. ఆయన ఆస్తులపై అమెరికా రెవెన్యూ శాఖ ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించలేదు. (ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు) అమెరికా చట్టాల ప్రకారం అమెరికా అధ్యక్షులు తమ వ్యక్తిగత ఆదాయం వివరాలను ప్రజాముఖంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే 1970 రిచర్డ్ నిక్సన్, ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. మిగతా అధ్యక్షులందరు వెల్లిడిస్తూ వచ్చారు. తాను కిమిషనర్ ఆధ్వర్యంలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఆడిట్ పరిధిలో ఉన్నందున తాను ఆదాయం పన్ను రిటర్న్స్‌ను ప్రజలకు వెల్లడించలేనని కూడా ట్రంప్ చెప్పుకున్నారు. కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన డొనాల్డ్ ట్రంప్ నష్టాల పేరిట ఆదాయ పన్నును తప్పించుకోవడమే కాకుండా గతంలో కట్టిన పన్ను నుంచి కొంత మొత్తాలను వెనక్కి తీసుకుంటున్నారంటూ న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తను ట్రంప్ ఖండించారు. తాను కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పన్నులు చెల్లిస్తున్నానని, పన్ను భారం తగ్గించుకునేందుకు సిబ్బందిని ఎక్కువగా నియమించుకుంటున్నానని ఆయన వివరించారు. (ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్లు) -
సోషల్ మీడియాపై ట్రంప్ ఆంక్షలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాలపై కొరడా ఝళిపించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వచ్చే సమాచారం నుంచి కంపెనీలకు ఉన్న చట్టపరమైన రక్షణను తొలగించే ఉత్తర్వులపై ట్రంప్ గురువారం సంతకం చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించిన ఒక రోజులోనే ట్రంప్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అంతకుముందు మెయిల్–ఇన్ బ్యాలెట్ పేపర్ల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయన్న ట్రంప్ ట్వీట్ విషయంలో నిజానిజాలు సరిచూసుకోవాలని సూచిస్తూ ట్విట్టర్ నీలి రంగు ఆశ్చర్యార్థకాన్ని తగిలించడం.. దానిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ‘‘అమెరికన్ల వాక్స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు, రక్షించేందుకు వీలుగా ఈ రోజు కొన్ని ఉత్తర్వులపై సంతకం చేశాను. ప్రస్తుతం ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమ దిగ్గజాలకు అసాధారణమైన రీతిలో చట్టపరమైన రక్షణ లభిస్తోంది. కంపెనీ తటస్తంగా ఉంటుందన్న సిద్ధాంతం ఆధారంగా ఈ రక్షణ కల్పించారు’’అని ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా వాణిజ్యాన్ని ఏ రకంగానైనా దెబ్బతీసే చర్యలకు దిగితే సామాజిక మాధ్యమాలను నిషేధించేలా ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు అధికారాలు కల్పించారు. -
అన్నం తింటున్నపుడు కూడా అదే మురికి వాసన..
ఇస్లామాబాద్: ‘‘మురికి కాలువలో ఉన్నపుడు నా చుట్టూ బొద్దింకలు చేరతాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఘటనలు వెంటాడుతూనే ఉంటాయి. అన్నం తినడానికి ఎప్పుడైతే చేతిని నోటికి దగ్గరకు తీసుకువస్తానో అప్పుడు మురికి వాసనే వస్తుంది. ఇది అన్నిటికంటే చాలా కష్టమైన పని. ఒక్కోసారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా దగ్గరికి తీసుకోలేని దుస్థితి. పనిచేస్తూనే ఎప్పుడు ఎలా చనిపోతానో తెలియదు’’.. పాకిస్తాన్‌లోని కరాచీలో డ్రైనేజీ శుభ్రం చేసే జంషద్ ఎరిక్ అనే వ్యక్తి ఆవేదన ఇది. కుల, మత, జాతి వివక్షను ఎదుర్కొనే ఎరిక్ లాంటి ఇంకెంతో మంది పారిశుధ్య కార్మికులు అతడిలాగే కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలకు నోచుకోవడం లేదు. దేవుడి మీద భారం వేసి మురికి గుంటలోకి దిగడం.. అదృష్టం బాగుండి విష వాయువులు వెలువడక పోతే బతికి బయటపడటం. ఇదే వారి రోజువారీ దినచర్య. ప్రభుత్వం వారికి మాస్కులు గానీ, చేతులకు గ్లోవ్స్ గానీ అందించదు. ఇలాంటి కనీస సదుపాయాలు లేక ఇటీవలి కాలంలో అనేక మంది క్రిస్టియన్ కార్మికులు మృత్యువాత పడటం పాకిస్తాన్లో ఉన్న కుల, మత వివక్షకు అద్దం పడుతోందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ‘‘అనేక దశాబ్దాల క్రితం భారత్‌లో కుల వివక్ష, అంటరానితనం భరించలేక చాలా మంది మతం మారారు. 1947లో దేశ విభజన అనంతరం వీరిలో కొంతమంది పాకిస్తాన్‌కు వెళ్లారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన ఆ దేశంలో మైనార్టీలుగా పరిగణింపబడుతున్న హిందూ, క్రిస్టియన్ వర్గాలు మాత్రమే మురికి కాలువలు శుభ్రం చేసే పనిచేయాల్సి ఉంటుంది. గతేడాది జూలైలో పాకిస్తాన్ సైన్యం ఓ పత్రికలో.. ‘‘కేవలం క్రైస్తవులు మాత్రమే స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు వారు మాత్రమే అర్హులు’’ అంటూ ఓ వివాదాస్పద ప్రకటన విడుదల చేసిందంటే అక్కడ వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి అనుచిత ప్రకటనపై హక్కుల సంఘాలు భగ్గుమనడంతో వెనక్కి తగ్గిన అధికారులు మతం అనే ఆప్షన్‌ను తీసివేశారే తప్ప నియామకాల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు. పాకిస్తాన్‌లోని చాలా వరకు మున్సిపాలిటీల్లో ఎరిక్ లాంటివారే స్వీపర్లు, సీవర్ క్లీనర్లుగా ఉంటారు. ఒట్టి చేతులతోనే వారు మురికి కాలువలు, పైపులు, అందులోకి వచ్చే ఆస్పత్రి, పరిశ్రమల వ్యర్థాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారికి చెల్లించే మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఎరిక్‌కు మూడు కాల్వలు శుభ్రం చేసినందుకు అందిన మొత్తం కేవలం 6 డాలర్లు. చదువుకోలేదు... అందుకే వాళ్లను ఇలా ఈ విషయం గురించి మాజీ ఎంపీ, స్వీపర్ ఆర్ సూపర్‌హీరోస్ అడ్వకసీ గ్రూపును నడుపుతున్న మేరీ జేమ్స్ గిల్ మాట్లాడుతూ.. సీవేజ్ క్లీనింగ్ కోసం యంత్రాలు అందుబాటులోకి తీసుకు రావాలని తాను ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే పారిశుధ్య కార్మికుల్లో చాలా మంది నిరక్షరాస్యులని, కాబట్టి ప్రభుత్వ అధికారులు వారిని సులభంగా ఒప్పించి మురికికూపంలోకి దింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల వారంతా చర్మ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు సిద్ధమవుతున్నారని.. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు. ఇక దాదాపు 20 కోట్ల మంది జనాభా ఉన్న పాకిస్తాన్లో సుమారు 80 శాతం పారిశుద్ధ్య కార్మిక పోస్టుల్లో మైనార్టీలనే నియమిస్తున్నారని.. వారి పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది. ఏదేమైనా తమ లాంటి కార్మికులకు ఆరోగ్య భద్రత లేదని, రోగం బారిన పడి ఆస్పత్రికి వెళ్తే తమను చూసి కొంతమంది డాక్టర్లు లోపలికి కూడా అనుమతించరని.. తమ జీవితాలు ఇలాగే ముగిసిపోతాయంటూ మరో కార్మికుడు తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు’’ అని ఈ మేరకు కథనం వెలువరించింది. -
అవన్నీ నకిలీ వార్తలు: ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) గురించి నిఘా వర్గాలు ముందే హెచ్చరించినా తాను నిర్లక్ష్యంగా వ్యహరించానంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ‘‘న్యూయార్క్‌టైమ్స్ కథనం నకిలీది. అదొక కాగితం మాత్రమే. చైనా ప్రయాణాలపై అందరికంటే ముందే నిషేధం విధించి నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలెక్స్ అజర్(అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కార్యదర్శి) అంతవరకు నాకేమీ చెప్పలేదు. పీటర్ నెవారో కూడా అలాగే మాట్లాడారు. నకిలీ వార్తలు!’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.(కరోనా మృతులు న్యూయార్క్‌లోనే ఎందుకు ఎక్కువ?) కాగా ట్రంప్ ఏకపక్ష నిర్ణయాల వల్లే అమెరికాలో కరోనా విజృంభిస్తోందని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఆరోగ్య శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ, నిఘా వర్గాలు ప్రాణాంతక వైరస్ గురించి హెచ్చరించినా ట్రంప్ పట్టించుకోలేదని ఆరోపించింది. ఆయన నిర్లక్ష్యంగానే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 21 వేల మంది కరోనాకు బలికాగా.. ఐదున్నర లక్షల మంది దీని బారిన పడ్డారు. ఇక చైనాలో తొలిసారిగా కరోనా ఆనవాళ్లు బయటపడినప్పటికీ దాని గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకుండా ఆ దేశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించాయంటూ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే విధంగా మహమ్మారి తీవ్రతను తెలియజేయకుండా ఇంతటి సంక్షోభానికి కారణమైను చైనాకు వత్తాసు పలుకుతున్న డబ్ల్యూహెచ్ఓకు నిధులు ఆపివేస్తామంటూ ఆయన హెచ్చరించారు.(డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తాం: ట్రంప్) మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్! The @nytimes story is a Fake, just like the “paper” itself. I was criticized for moving too fast when I issued the China Ban, long before most others wanted to do so. @SecAzar told me nothing until later, and Peter Navarro memo was same as Ban (see his statements). Fake News! — Donald J. Trump (@realDonaldTrump) April 13, 2020 -
ట్రంప్ అడ్రస్ మారింది!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అడ్రస్‌ను పర్మినెంట్‌గా మార్చనున్నారు. ప్రస్తుతం ఉంటున్న న్యూయర్ నగరం నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌కు తన చిరునామాను మార్చుకోనున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. "నేను నా కుటుంబం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌ను మా శాశ్వత నివాసంగా మార్చుకోబోతున్నాం.నేను న్యూయార్క్ ప్రజలను ఎంతో ఆదరిస్తాను. నేను ప్రతి సంవత్సరం నగరానికి పన్నుల రూపంలో మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ, నన్ను రాజకీయ నాయకులు చాలా ఘోరంగా చూశారు. కొద్దిమంది చాలా దారుణంగా వ్యవహరించారు. నాకు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధగా ఉంది కానీ చివరికి ఇదే సరియైనది అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎప్పటికీ నా హృదయంలో న్యూయర్క్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంటుంది" అని ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా, ట్రంప్ స్థానికంగా న్యూయార్క్ నగరానికి చెందినవాడైనప్పటికి ఆయన భార్య మెలానియాట్రంప్ తమ ప్రాథమిక నివాసాన్ని మాన్హాటన్ నుండి పామ్ బీచ్‌కు మారుస్తూ సెప్టెంబరులో వ్యక్తిగత నివాస ప్రకటనలను దాఖలు చేశారు. ట్రంప్‌కు న్యూయర్ నగరంలో ఎప్పుడూ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ట్రంప్ నివాసమైన ట్రంప్ టవర్స్ వద్ద ప్రజలు నిరసనలు తెలుపుతూ ఉండే వారు.. దీంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తన చిరునామా మార్చడానికి గల కారణాలను తెలియజేయడానికి వైట్‌హౌస్ వర్గాలు నిరాకరించాయి. అయితే ట్రంప్‌కు సన్నిహతంగా ఉండే వారి సమాచారం ప్రకారం పన్నులకు సంబంధించిన విషయంలో ట్రంప్ తన నివాసాన్ని మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. -
నగరవాసికి అందాల కిరీటం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మిసెస్ భారత్ పోటీలలో ఈ సంవత్సరానికి గాను తెలుగు మహిళ చైతన్య పోలోజు ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని విజేత సంబంధీకులు ఓ ప్రకటనలో తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 21న ఈ పోటీ జరిగింది. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ మహిళ, పెళ్లికి మాత్రమే పరిమితమనే ఆలోచనను అందరిలో దూరం చేయడమే తన ధ్యేయమని, తన ఆశయాల సాధనలో తండ్రి ఆంజనేయులు భర్త సాయిరాం తోడవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలో మొదటి రన్నర్ అప్ గా కిస్మత్ బైన్స్ చాహల్, రెండవ రన్నర్ అప్ గా సీమ సింగ్ గెలుపొందగా, ప్రముఖ బాలీవుడ్ నటి షమిత శెట్టి ముఖ్య అతిథిగా, మై డ్రీం ఎంటర్ టైన్మెం రష్మి బేడి – జనక్ బేడిలు తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో తప్పులో కాలేస్తున్న ఫేస్బుక్
న్యూయార్క్: వివాదాస్పద అంశాల తొలగింపు విషయంలో ఫేస్బుక్ తమ ఉద్యోగులకు జారీచేసిన మార్గదర్శకాల్లో లోపాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. స్థానికంగా ఆయా దేశాల్లో చట్టాలు ఓరకంగా ఉంటే, ఫేస్బుక్ వాటిని మరోరకంగా అర్థం చేసుకుంటోందని అభిప్రాయపడింది. ఇండియాలో హింసను రెచ్చగొట్టేలా దైవదూషణ చేస్తేనే నేరమనీ, విమర్శలు చేస్తే కాదని పేర్కొంది. అలాగే భారత్‌లో నినాదాల సందర్భంగా తరచుగా వాడే ఫ్రీ కశ్మీర్ అనే పదాన్ని ఆజాద్ కశ్మీర్‌గా పొరబడి తొలగిస్తున్నారంది. ఇండోనేసియాలో అగ్నిపర్వత బాధితులకు సాయం కోసం పెట్టిన పోస్టులను ఫేస్బుక్ తొలగించిందని తెలిపింది.