Nilgiri
-
గంటకు 9 కిలోమీటర్లు.. మనదేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే!
Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి. ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు. చదవండి: బాలపిట్టలూ బయటికెగరండిమేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నటి సాయి పల్లవి కమ్యూనిటీకి చెందిన ‘హేతై హబ్బా’ వేడుక గురించి తెలుసా?
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. తనదైన నటన, అందం, అభినయంతో చాలా తక్కువ కాలంలోనే ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న చక్కటి నటి సాయి పల్లవి. కేవలం నటనకు మాత్రమే కాకుండా, సినిమాల కథలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆమె ప్రత్యేకత. ఒక విధంగా చెప్పాలంటేనే ఈ వైఖరే సాయి పల్లవికి నటిగా గౌరవనీయమైన స్థాయిని అందించింది. పాత్ర ఏదైనా సహజంగా ఆ పాత్రలో ఒదిగి పోవడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. అంతేకాదు నాట్యంలో కూడా నాట్య మయూరి అనిపించుకుంది. బడగ తెగకు చెందిన సాయి పల్లవి ఫిదాలో అల్లరి అమ్మాయిగా ఫిదా చేసింది. ప్రేమమం మొదలు తెలుగులో నటించిన లవ్ స్టోరీలో సారగ దరియా అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా విరాటపర్వంలో డీగ్లామరైజ్డ్ పాత్రలో పేదల కష్టాలపై పోరాడే అన్నల ఆకర్షితురాలైన యువతిగా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటన నభూతో నభవిష్యతి. ఏ పాత్రనైనా అవలీలగా నటించడం ఆమెకు తెలుసు. అయితే సాయి పల్లవి తమిళనాడులో నీలగిరి పర్వత ప్రాంతానికి చెందిన బడగ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి సాయి పల్లవి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది పల్లవి. అసలు ఏంటీ బడగ జాతి ఈ వివరాలు చూద్దాం. #WATCH | Tamil Nadu: A large number of devotees participate in the Hethiyamman temple festival, in Nilgiris. pic.twitter.com/jLBINIdul9 — ANI (@ANI) January 1, 2024 బడగా, అంటే అర్థం 'ఉత్తరం. పాత కన్నడ బడగానా నుంచి వచ్చింది. బడగాలపై పరిశోధన దాదాపు ఆరు దశాబ్దాలపాటు పరిశోధించిన అమెరికన్ మానవ శాస్త్రవేత్త పాల్ హాకింగ్స్ ప్రకారం సుల్తానుల హింసనుంచి పారిపోయి మైసూర్ మైదానాల నుండి వలస వచ్చిన వొక్కలిగాలుగా భావిస్తారు. నీలగిరి జిల్లాలో దాదాపు 400 గ్రామాలలో బడగలు నివసిస్తున్నారట. బడగలు బడగా అనే భాషను మాట్లాడతారు. దాదాపు ఇది కన్నడ భాషకు దగ్గరగా ఉంటుంది. కానీ లిపి లేదు. ఇంగ్లీష్, తమిళం, మలయాళం, తెలుగు భాషలతోపాటు బడగ భాషను కూడా సాయి పల్లవి బాగా మాట్లాడుతుంది. బడగలు దాదాపు 400 గ్రామాలలో నివసిస్తున్నారు. నీలగిరి జిల్లాలో బడగలు అతిపెద్ద ఆదిమ తెగలు. నీలగిరి మొదట గిరిజనుల భూమి.కుకల్, కడనాడ్, ఈతలార్, నుండాల, మేలూరు, హులికల్, అతికరాట్టి, మేల్కుంద, కిల్కుంద, కెట్టి, తంతనాడు, మిలిదేను, నందట్టి, జక్కనారి, అరవేను, తిన్నియూర్, అయ్యూరు, కన్నెరిముక్కు, బెరగని, త్వున్నేర్, జక్క, తదితర గ్రామాల్లో వీరు నివసిస్తారు.వీరిని నీలగిరి గౌడలు అని కూడా అంటారు.బడగాలు ప్రాచీన శిలాయుగానికి చెందినవారిగా చరిత్రకారులు భావిస్తారు. బడగాలు పండుగలను "హబ్బా" అని పిలుస్తారు. బడగాస్ ప్రధాన దేవతలు హెతాయ్ , అయ్య. అలాగే శివుడు, కృష్ణుడు, ఖాలి, మారి, మునియప్పను కూడా పూజిస్తారు. ముఖ్యమైన పండుగలు డెవ్వా హబ్బా, హేతే హబ్బా, సకలతి హబ్బా, ఉప్పట్టువ హబ్బా. గిరిజన తెగ అయిన బడగాలు మా ఖలీ హబ్బా, దేడిసిమి హబ్బా, కృష్ణ జయంతి, వినాయగర్ చతుర్థి, మర్రి హబ్బా, మురుగర్ హబ్బా, రామర్ హబ్బా, హనుమాన్ జయంతి తోపాటు ప్రకృతిని, నీటిని, సూర్యుడు, సర్పాలను ప్రకృతిని పూర్వీకులను కూడా పూజిస్తారు. ఆదివాసి బడగా పురాతన అగ్ని తయారీ ప్రక్రియ (చెకుముకి రాళ్ల రాపిడి ద్వారా నిప్పు తయారీని) ఇప్పటికీ వారి దేవా పండుగ సమయంలో అవసరమైన ఆచారంగా ప్రదర్శిస్తారు వారు రెండు రాళ్లు లేదా రెండు కర్రలు రుద్దడం ద్వారా రాపిడి ద్వారా అగ్నిని ఉత్పత్తి చేశారు. దీన్ని "నీలిగోలు" లేదా నిటారుగా ఉండే కర్ర అంటారు. శివుని అవతారంగా భావించే సూర్యుడిని,విష్ణువు అవతారంగా నాగప్పను ఆరాధిస్తారు హేతై హబ్బా ప్రతి సంవత్సరం డిసెంబరు-జనవరిలో ఒక నెల పాటు హేతై హబ్బాను ఘనంగా జరుపుకుంటారు. తమిళ మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి సోమవారం హేతై హబ్బా వేడుకను నిర్వహిస్తారు. రక్షకురాలిగా , ప్రయోజకురాలిగా విశ్వసించే హేతై అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ పండుగ పచ్చని నీలగిరి ప్రకృతి దృశ్యం నేపథ్యంలో భక్తులు సాంప్రదాయ తెల్లని దుస్తులలో హేతే దేవతను ఆరాధిస్తారు. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది రోజుల పాటు భారీ ఊరేగింపులతో లక్షలాది మంది బడగలు తమ దేవతను కీర్తించేందుకు ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీ. సాయి పల్లవి కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు గతంలో షేర్ చేసింది. బడగ కమ్యూనిటీనుంచి వచ్చిన ఇతర ప్రముఖులు బడగ తెగ సంస్కృతి, ఆచారాలతోపాటు విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే 80 శాతం అక్షరాస్యతను కలిగి ఉన్నారు. అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలలో , మరికొందరు విదేశాలలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మాజీ లోక్‌సభ ఎంపీ, దివంగత అక్కమ్మ దేవి. ఆమె డిగ్రీ చదివిన తొలి బడగ మహిళ . 1962 నుండి 1967 వరకు నీలగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక తొలి మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ బెల్లి లక్ష్మీ రామకృష్ణన్ MA ప్రసిద్ధి. ఈమె తొలి మహిళా గెజిటెడ్ అధికారిణి కూడా. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేశారు. -
నీలగిరిలో మంచుదుప్పటి.. అలరిస్తున్న వీడియో!
ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో విపరీతమైన చలి నెలకొంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈరోజు(ఆదివారం) మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు దక్షిణ భారతంలోనూ ఇటువంటి వాతావరణం నెలకొంది. తమిళనాడులోని నీలగిరిలో ఈరోజు ఉదయం(ఆదివారం) ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు చేరుకుంది. ఈ విధమైన వాతావరణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోలో నీలగిరిలో భూమిపై మంచు వ్యాపించడాన్ని చూడవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించవచ్చు. అయితే ఇక్కడి వాతావరణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇదిలావుండగా గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి. గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం! #WATCH | Nilgiris, Tamil Nadu: A layer of frost covered the Thalaikundha area of Nilgiris after 0 degrees Celcius temperature was recorded this morning. pic.twitter.com/Z43LzgaGvb — ANI (@ANI) December 24, 2023 -
ఇంట్లోకి చొరబడిన చిరుత.. దాడిలో ఆరుగురికి గాయాలు
తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో విధుల్లో ఉన్న జర్నలిస్ట్ ఒకరు ఉన్నారు. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన చిరుత కూనూరు సమీపంలోని గ్రామంలో ఓ వీధి కుక్కను వెంబడిస్తూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. చిరుత చొరబడిన ఇంట్లో ఓ వ్యక్తి ఉండటంతో అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన ఆరుగురిపై చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వీరిలో విధుల్లో ఉన్న ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. వీరందరినీ కూనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత ఇంకా ఇంట్లోనే ఉందని, దాన్ని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుంది
మైసూరు: రైలు పట్టాల పక్కన ఉండే ఇనుప కంచె కింద ఇరుక్కున్న ఓ అడవి ఏనుగు ప్రాణాల కోసం పెనుగులాడింది. ఈ ఘటన మైసూరు జిల్లా సరగోరు తాలూకా ఎన్.బేగూరు అటవీ ప్రాంతంలో జరిగింది. అటవీ ప్రాంతంలో నుంచి ఒక మగ ఏనుగు బేగూరులో సంచరించి బుధవారం ఉదయం తిరిగి అడవికి బయలుదేరింది. ఈ సందర్భంలో రైలు పట్టాల కంచెను దాటేందుకు యత్నించి దాని కింద చిక్కుకుని పెనుగులాడసాగింది. అనేక ప్రయత్నాలు చేస్తూ నరకయాతన అనుభవించింది. ఏనుగు ఘీంకారాలు విని ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి కడ్డీలను తొలగించి గజరాజును రక్షించారు. ముదుమలై శరణాలయంలో ఏనుగు మృతి సాక్షి, చెన్నై: తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయంలో ఓ ఏనుగును గుర్తుతెలియని వ్యక్తులు చిత్ర హింసలు పెట్టి, అది మరణించే రీతిలో వ్యవహరించి ఉండడం బుధవారం వెలుగులోకి వచ్చింది. ముదుమలై పులుల శరణాలయం తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ సింగార అటవీ ప్రాంతంలో గాయాలతో 40 ఏళ్ల ఓ ఏనుగు కొద్ది రోజులుగా తిరుగుతూ వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, వైద్య బృందాలు ఆ ఏనుగుకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆ ఏనుగు మృతిచెందింది. ఆ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో ఏనుగుకు చిత్రహింసలు పెట్టి ఉండడం వెలుగు చూసింది. ఏనుగు చెవిలో నిప్పు కణికలు, యాసిడ్ తరహాలో పదార్థం ఉండడంతో ఎవరో చిత్రహింసలకు గురి చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటి వల్ల ఏర్పడిన గాయాలతోనే ఏనుగు మృతిచెంది ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైరల్: పిచ్చెక్కినట్లుగా కొట్టుకున్న పులులు అమెజాన్‌లో ఆవు పిడకలు.. ఛీ రుచిగా లేవంటూ.. -
‘నీలగిరి’లో భారీ వర్షం
నల్లగొండ టూటౌన్ : పట్టణంలో బుధవారం సాయంత్రం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శాంతినగర్, ఆర్పీరోడ్డు, బొట్టుగూడ, సాయినగర్ కాలనీ, చైతన్యపురి, లైన్‌వాడ, లెప్రసీకాలనీ, పద్మావతీకాలనీ, ఆర్టీసీకాలనీ, అంధుల పాఠశాల ఏరియా, శ్రీరాంనగర్ తదితర కాలనీల్లో రోడ్ల వెంట వరదనీరు భారీగా పారింది. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. -
నీలగిరిపై.. ‘కమలాస్త్రం’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తొలి అస్త్రాన్ని జిల్లాపైనే ప్రయోగించనుంది. తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే తొలి బహిరంగసభకు సూర్యాపేట వేదిక కానుంది. అమిత్‌షా జూన్ పదో తేదీన సూర్యాపేటలో జరగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో ఈసభను విజయవంతం చేసేందుకు స్థానిక కమలనాథులు అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను క్రియాశీలకం చేయడంతోపాటు రెండేళ్ల మోడీ పాలన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ బహిరంగసభ ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం సూర్యాపేటలో పార్టీ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే బహిరంగసభను జయప్రదం చేయడం ద్వారా జిల్లాలో తమకున్న బలాన్ని నిరూపిస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు కనీసం 60వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ఇందులో మన జిల్లా నుంచే 40వేల మంది ప్రజలను కదిలిస్తామని వారు అంటున్నారు. పొరుగున ఉన్న జిల్లాల నుంచి పార్టీ కేడర్ వస్తుంది కనుక మొత్తం మీద 60వేల మందికి తగ్గకుండా బహిరంగసభను నిర్వహించి తమ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సభ మరుసటి రోజే... సూర్యాపేటలో అమిత్‌షా బహిరంగ సభకు సంబంధించిన పరిణామాలు వడివడిగా జరిగిపోయాయి. ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మండల ప్రతినిధుల సభ ముగిసిన 24 గంటల్లోపే జిల్లాలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. అసోం రాష్ట్రంలో లభించిన ఘన విజయాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేయాలని, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మొదటి టార్గెట్‌గా పెట్టుకుంటామని హైదరాబాద్ సభలో చెప్పిన కమలనాథులు.. వెంటనే జిల్లాలో బహిరంగసభను ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అమిత్‌షా పాల్గొన్న ఈ మండల ప్రతినిధుల సభకు జిల్లా నుంచి రెండు వేల మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సభలో బీజేపీ సారధి ఇచ్చిన ప్రసంగంతోకమలానాథులు నూతనోత్తేజం పొందారు. మళ్లీ జిల్లాలో అమిత్‌షా బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి రావడంతో దాన్ని విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీకి జిల్లాను ఆయువుపట్టు చేస్తాం అమిత్‌షా హైదరాబాద్ సభ ముగిసిన వెంటనే జిల్లాలో బహిరంగ సభను ప్రకటించడం, అందుకు రాష్ట్ర పార్టీ అనుమతి ఇవ్వడం మంచి పరిణామమే. జిల్లాలో బీజేపీకి ఉన్న బలం ఈ బహిరంగ సభతో రెట్టింపవుతుంది. అమిత్‌షా ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళతాం. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి తెలంగాణలో బీజేపీకి నల్లగొండ ఆయువుపట్టు అని నిరూపిస్తాం. - వీరెల్లి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు -
వడ‘కోతే’..!
నీలగిరి : ఆహార భద్రత, పింఛన్ దరఖాస్తులను అధికారులు జల్లెడపడుతున్నారు. షరతులకు లోబడి అర్హులను ఎంపిక చేయాలన్న ప్రభుత్వఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి కట్టుబడి పకడ్బందీగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 21 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభంకాగా, మొదట్లో కొంతమంది అధికారులు తప్పటడుగులు వేశారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్లకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు రావడంతో ఆందోళన చెందారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీంతో ప్రభుత్వం విధించిన పరిమితులకు అధిగమించి దరఖాస్తులు ఆమోదించారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రస్థాయి అధికారులు ఇటీవల వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి అర్హులను ఏవిధంగా ఎంపిక చేయాలనే దానిపై మార్గదర్శకాలు సూచించారు. ఆహారభద్రత, పింఛన్ దరఖాస్తుల్లో రూరల్, అర్బన్ ప్రాంతాలను వేర్వేరుగా చేసి పర్సెంటేజీలు ఖరారు చేశారు. దీంట్లో కూడా జిల్లా జనాభాను ప్రామాణికంగా తీసుకుని, కులాల వారీగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాలకు ఆహార భద్రత కార్డులు ఎన్ని ఉండాలి..? పింఛన్లకు సంబంధించి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంతమందికి ఇవ్వాలి..? అనే దానిపై పర్సెంటేజీలు ఖరారు చేశారు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో ఆహార భద్రత కార్డులు 69 శాతం, పింఛన్లు 61 శాతానికి మించడానికి వీల్లేదని ప్రభుత్వం పరిమితి విధించింది. ఈ లెక్కన గతంతో పోలిస్తే పింఛన్లు, రేషన్‌కార్డులు చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కార్డుల వడపోత.... పాతలెక్కల ప్రకారం జిల్లాలో రేషన్ కార్డులు 9,31,525 ఉన్నాయి. ఈ మొత్తం కార్డులకుగాను 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. దీంట్లో 29 లక్షల కుటుంబాలు ఆధార్ సీడింగ్ నమోదు చేసుకున్నాయి. ఇంకా 5 లక్షల యూనిట్లకు ఆధార్ సీడింగ్ జరగలేదు. కుటుంబానికి నలుగురు సభ్యుల చొప్పున లెక్కించినా, లక్షా 25 వేల కార్డులు ఆధార్ సీడింగ్ జరగలేదు. వాటిని అధికారులు బోగస్ కార్డులుగా తేల్చారు. కాగా ప్రస్తుతం కొత్తగా ఆహారభద్రత కార్డులకు 10,67, 004 దరఖాస్తులు వచ్చాయి. దీంట్లో 69 శాతం ప్రకారం లెక్కించినట్లయితే 7,36,232 ఆహారభద్రత కార్డులు మాత్రమే లబ్ధిదారులకు దక్కే అవకాశం కనిపిస్తోంది. పాతకార్డులు 9,31,525ల నుంచి కొత్త కార్డులు 7,36,232 తీసివేయగా 1,95,293 కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. అర్హులకే పింఛన్లు... వృద్ధాప్య, వికలాంగులు, చేనేత, వితంతువులు, కల్లుగీతకార్మికులు కలిపి మొత్తం జిల్లాలో 3 లక్షల 94 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. కొత్తగా 5,47,287 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 61 శాతానికి లోబడి పింఛన్‌దారులు ఉండాలి. ఈ లెక్కన 3,33,845 మంది అర్హులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. పాత పింఛన్‌దారులు 3 లక్షల 94 వేల నుంచి అర్హులుగా ఎంపికయ్యే 3,33,845 మందిని తీసేవేస్తే 60,154 మంది అనర్హులుగా తేలనున్నారు. కాగా పింఛన్ దరఖాస్తుల పరిశీలన ఈనెలాఖరుతో ముగియనుంది. కావున మరో రెండు, మూడు రోజుల్లో అర్హుల జాబితా అధికారికంగా వెల్లడి కానుంది. కొత్త పింఛన్‌దారులకు నవంబర్ 8 నుంచి ఫించన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీలైనంత త్వరగా పరిశీలన కార్యక్రమాన్ని ముగించేపనిలో యంత్రాంగం పనిచేస్తోంది. నవంబర్ 3 నుంచి మున్సిపాల్టీల్లో... గ్రామీణ ప్రాంతాల్లో విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నవంబర్ 3 నుంచి మున్సిపాల్టీల్లో ఆహారభద్రత, పింఛన్ దరఖాస్తుల పరిశీలన మొదలవుతుంది. సిబ్బంది కొరత కారణంగా మున్సిపాల్టీల్లో ఇంటింటి విచారణ ఆలస్యంగా చేపట్టారు. మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుల పరిశీలనకు ప్రతి వార్డుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. -
వర్షార్పణం
అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారంనుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 43.3మి.మీ నమోదైంది. రికార్డుస్థాయిలో దామరచర్ల మండలంలో 158.2 మి.మీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పొలాలు నేలవాలాయి. పత్తి తడిసిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నీలగిరి : అరేబియా సముద్రంలో సంభంవించిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక చోట్ల చేతికొచ్చిన పంట పొలాలు నేలకొరిగాయి. పలు చోట్ల పత్తి తడిసిపోవడంతో అపార నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైన దామరచర్ల మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వ్యవసాయ మార్కెట్లలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిముద్దయ్యింది. మార్కె ట్లలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారు. మార్కెట్లలో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరపకపోవడంతో వర్షం ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. తడిసిన ధాన్యాన్ని తరుగు పేరుతో కోత పెట్టి కొనుగోలు చేస్తున్నారు. హాలియా వాగు, పేరూరు సోమసముద్రం చెరువు, రాజవరం, తిరుమలగిరి చెరువు వెంట 50 ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి. నిడమనూరు మండలం తుమ్మడం, కుంటిగోర్ల గూడెం, వల్లభాపురం, బాలాపురం, రాజన్నగూడెం, నిడమనూరు గ్రామాల్లో చిలుకలవాగు వెంట 100 ఎకరాలు నీటిముగింది. పెద్దవూర మండలంలో పెద్దవాగు ఉప్పొంగి ప్రవ హిస్తోంది. పేరూరు సోమసముద్రం చెరువునీరు రోడ్డుపై ప్రవహించడంతో హాలియా- పేరూరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుజూర్నగర్ మండలంలో లింగగిరి- సర్వారం మధ్య బండలరేవు వాగు, శ్రీనివాసపురం- అమరవరం మధ్య పిల్లవాగు, బూరుగడ్డ- గోపాలపురం మధ్య నల్లచెరువు అలుగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లింగగిరి చిన్న చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 70 ఎకరాలలో వరి నీట మునిగింది. గరిడేపల్లి , నేరేడుచర్ల మండలాల్లో సుమారు 14 వందల ఎకరాల్లో వరిచేలు నేలకొరిగాయి. మఠంపల్లి మండలంలోని చౌటపల్లి సమీపంలో గల ఈదులవాగు పొంగిప్రవహించడంతో 50 హెక్టార్లలో వరిచేలు నీటి మునిగాయి. మేళ్లచెర్వు మండలంలో పత్తి పంటకు అపార నష్టం వాటిల్లింది. మిర్యాలగూడ మండలంలో ఐలాపురం, కిష్టాపురం గ్రామాలలో వంద ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. దామరచర్ల మండలంలోని వీరభద్రాపురంలో ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో పాటు దామరచర్ల - అడవిదేవుపల్లి గ్రామాల మధ్య అన్నమేరు వాగుపొంగడం, దామరచర్ల - జాన్‌పహాడ్ మధ్య బుగ్గవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధం గా సుమారు 100 ఎకరాల్లో పత్తి, 30 ఎకరాల వరి నీట మునిగింది. మరో 30 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. రామన్నపేట మండలంలో 10వేల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. కట్టంగూరు మండలంలో కురుమర్తిలోని ఐకేిపీ కేంద్రంలో 50 బస్తాల ధాన్యం తడిసిముద్దయింది.నల్లగొండ మార్కెట్‌యార్డులో వర్షపు నీరు నిలిచి 6 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ంది. తడిసిన ధాన్యాన్ని ఆదివారం కొనుగోలు చేశారు.తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. క్వింటాకు బస్తాతో కలిపి 9 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ. 1250 మాత్రమే చెల్లిస్తున్నారు. మునుగోడు, చండూరు మండలాల్లో కూడా పంటలకు నష్టంవాటిల్లింది. చౌటుప్పుల్ మార్కెట్ యార్డులో 45 కుప్పలు, నల్లగొండ మార్కెట్ యార్డులో 35 కుప్పలు, భువనగిరి మార్కె ట్‌యార్డులో 20 కుప్పలు, రామన్నపేటలో 60 కుప్పలు నిల్వ ఉన్నాయి. ఐకేపీ కేంద్రాల్లో కూడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. వర్షం కారణంగా ధాన్యం రంగు మారే అవ కాశం ఉంది. దీంతో ధాన్యం రంగు మారిందన్న సాకుతో కొనుగోలు చేసేందుకు మిల్లర్లు నిరాకరించడమేగాక, కొ నుగోలు కేంద్రాలలో కూడా రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదు. -
పంచాయతీలకు ‘పన్ను’పోటు
నీలగిరి : ప్రత్యేక అధికారుల చేతుల్లోంచి పెత్తనం పాలకవర్గాల చేతుల్లోకి వచ్చి ఏడాది దాటినా నేటికీ పాలన వ్యవహారాల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ప్రజల నుంచి వసూలు చేయాల్సిన వివిధ రకాల పన్నుల విషయంలో కార్యదర్శులు, సర్పంచ్‌లు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 1176 పంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 22వ తేదీ నుంచి గ్రామాల్లో సర్పంచ్లపాలన మొదలైంది. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధుల వైపు తొంగిచూస్తున్నారే తప్ప, స్థానికంగా ప్రజల నుంచి రావాల్సిన పన్నులు మాత్రం వసూలు చేయడం లేదు. పంచాయతీల రాబడి పెంచేందుకు పనిచేయాల్సిన గ్రామ కార్యదర్శులు వాటి గురించి పట్టించుకోవడమే మానేశారు. దీంతో గ్రామాల్లో తలెత్తుతున్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారు. అదీగాక పంచాయతీల మీదనే ఆధారపడి జీవిస్తున్న కారోబార్లు, స్వీపర్లు, దినసరి కూలీల జీతభత్యాల చెల్లింపులు ఆగిపోయాయి. బకాయిలు భారీగానే.. పన్నుల రూపంలో పంచాయతీలకు ప్రతి ఏడాది రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. తైబజార్లు, బందెల దొడ్లు, కిరాణ దుకాణాలు, డబ్బాకొట్లు, నల్లా కనెక్షన్లు, వాహనాల పన్ను, పంచాయతీ ఆస్తుల లీజు, ఇంటి పన్ను వగైరా వంటి మార్గాల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చిచేరుతుంది. అయితే ప్రత్యేక అధికారుల పాలన కాలంలోనే పన్నుల బకాయి రూ.7,60,97,288 ఉండగా, కేవలం రూ.2,58,43,424 మాత్రమే వసూలు చేశారు. ఇక సర్పంచ్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పన్నుల రూపేణ ఆదాయం రూ.9,37,33,384 రావాల్సి ఉండగా.. కేవలం 4,34,74,681 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ప్రత్యేక అధికారుల పాలన, సర్పంచ్ల హయాం కలిపి గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల రూపంలో పంచాయతీలకు రావాల్సిన ఆదాయం రూ.16,98,30,671 కాగా కేవలం రూ. 6,93,18,105 మాత్రమే వచ్చింది. మొత్తం రావాల్సిన ఆదాయంలో కేవలం 40 శాతం పన్నులే వసూలయ్యాయి. ఈ ఏడాది లెక్కల్లేవ్... పంచాయతీ అధికారుల కొరత కారణంగా పన్నులు రాబట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పన్నుల రాబడి ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు లెక్కిస్తారు. ఎంత వసూలు కావాల్సింది..? ఎంత మేరకు వసూలు చేశారు..? అనే లెక్కలు మాత్రం ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలి. ఒక్క మిర్యాలగూడకే డివిజనల్ స్థాయి అధికారి ఉన్నారు. భువనగిరి డీఎల్పీఓ ఏసీబీకి పట్టుబడడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. నల్లగొండ డీఎల్పీఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. ఇవిగాక పంచాయతీ కార్యదర్శులు 568 మందికి గాను 520మంది మాత్రమే ఉన్నారు. మరో 11 పోస్టు లు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికి, వాటిని నింపకుండా అధికారులు నానబెడుతున్నారు. రెండు, మూడు గ్రామాలను ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంతమేర పన్ను వసూలు చేశామనే లెక్కలు కూడా సేకరించలేనంత దయనీయ స్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయమై డీపీఓ విష్ణుమూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ...జిల్లాలో పంచాయతీల పన్నుల రాబడి చాలా తగ్గిపోయింది. సిబ్బంది కొరత కారణంగానే పన్నులు వసూలు చేయలేకపోతున్నాం. ఈ ఏడాది ఆదాయ లెక్కలు సేకరించకపోవడానికి కూడా అదే కారణం. త్వరలో పన్ను వసూళ్లకు తగిన చర్యలు చేపడతాం. -
ఇక్కడ కొలువు అక్కడ నెలవు
నీలగిరి : జిల్లాలో స్త్రీ,శిశు సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన సీడీపీఓలు (చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్) సొంతవ్యాపకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. పనిచేయాల్సిన ప్రాంతంలో కాకుండా పొరుగు జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల జెడ్పీ స్థాయీ సంఘసమావేశంలో అంగన్వాడీల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని సభ్యులు లే వ నెత్తడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో సీడీపీఓ ప్రాజెక్టులు మొత్తం 18 ఉన్నాయి. వీటి పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు 4,400 ఉన్నాయి. ఈ కేంద్రాలను 170 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. సీడీపీఓలు నెలలో కనీసం 20 రోజులపాటు తమ ప్రాజెక్టు పరిధిలో పర్యటిస్తూ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలి. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి..మధ్యాహ్నం తర్వాత గ్రామాల్లో పర్యటించాలి. గర్భిణులు, అత్యాచార బాధితులను పలకరించడంతో పాటు, చిన్నారుల ఆలనాపాలనా గురించి వివరాలు అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా శిశువుల అభివృద్ధికి ప్రభుత్వం ఏ మేరకు ఖర్చు చేయాలనే అంశాలపై ప్రణాళికలు రూపొందించాలి. ఈ విధంగా శిశుసమగ్రాభివృద్ధికి పనిచేయాల్సిన అధికారులు... తమను నియమించిన ప్రాంతంలో కాకుండా సుదూర ప్రాంతాలైన ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరేమీ తక్కువ కాదు... ‘యథా రాజా...తథా ప్రజ’ అన్నట్టు అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు సైతం స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఎక్కువమంది సూపర్వైజర్లు హైదరాబాద్‌లో మకాం పెట్టారు. సీడీపీఓలు, పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు ఇలా ఉంటే....తామేమీ తక్కువ తిన్నామా అంటూ అంగన్వాడీ కార్యకర్తలు కూడా తమ విధుల పట్ల శ్రద్ధ చూపని పరిస్థితి ఏర్పడింది. దేవరకొండ, రామన్నపేట, భువనగిరి, చింతపల్లి, పెద్దవూర మండలాల్లో పనిచేస్తున్న సుమారు 50 మంది సూపర్వైజర్లు హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు బలమైన ఫిర్యాదులు వచ్చాయి. చర్యలు తీసుకుంటాం : మోతీ, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ సీడీపీఓలను స్థానికంగా ఉండాలని గతంలో ఆదేశాలు ఇచ్చాం. ఆ మేరకు పొరుగు జిల్లాలకు చెందిన అధికారులు పనిచేస్తున్న చోట రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నామని చెప్పారు. స్థానికంగా ఉండకుండా రాకపోకలు సాగిస్తున్న సీడీపీఓలు, సూపర్వైజర్లపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సీడీపీఓ పనిచేయాల్సింది నివాసముంటున్నది పెద్దవూర మాచర్ల(గుంటూరు) హుజూర్నగర్ మిర్యాలగూడ మిర్యాలగూడ రూరల్ చీరాల(ప్రకాశం) నల్లగొండ రూరల్ హైదరాబాద్ సూర్యాపేట రూరల్ ఖమ్మం సూర్యాపేట అర్బన్ విజయవాడ తుంగతుర్తి హైదరాబాద్ భువనగిరి హైదరాబాద్ మునుగోడు హైదరాబాద్ ఆలేరు హైదరాబాద్ -
కో టాలేదు..తలే
నీలగిరి : జిల్లా విద్యుత్‌శాఖ పీకల్లోతు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు విద్యుత్ కోతల కారణంగా తలెత్తుతున్న సమస్యలు అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తుంటే...మరోవైపు కొద్ది రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా ఎక్కడి సేవలు అక్కడే స్తంభించిపోయాయి. ఇక ఓవర్‌లోడ్ పుణ్యమాని వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. అప్రకటిత కోతలు.. విద్యుత్‌శాఖ అమలు చేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్ని రంగాలపై కోలుకోలేని దెబ్బపడింది. రాష్ట్రంలో విద్యుత్ లోటు కారణంగా జిల్లా కోటా అనేది లేకుండా చేశారు. కోతలు లేని కాలంలో జిల్లాకు నెలవారీ విద్యుత్ కోటాను కేటాయిస్తూ ఆ మేరకు అన్ని అవసరాలకు విద్యుత్ సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం అప్రకటిత కోతల వల్ల జిల్లా కోటాను పూర్తిగా బంద్ చేశారు. లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచే నేరుగా విద్యుత్ సరఫరా చేస్తూ కోతలు విధిస్తున్నారు. వ్యవసాయ రంగానికి 6 గంటలు కరెంట్ ఇచ్చేందుకుగాను పరిశ్రమలు, గృహావసరాలకు సరఫరా అయ్యే విద్యుత్‌లో కోత విధించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. భువనగిరి డివిజన్ పరిధిలో మాత్రం శని, ఆదివారాలు పవర్ హాలిడే అమలుచేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాల్లో 9 గంటల పాటు కోత విధిస్తున్నారు. వ్యవసాయరంగానికి రా త్రి 3 గంటలు, పగలు 3 గంటలు సరఫరా చేస్తున్నా రు. వాస్తవానికి వ్యవసాయానికి 7 గంటలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక గంట కత్తిరిస్తున్నారు. ఈ విధంగా అ న్ని రంగాలకు కోతలు విధిండచడం వల్ల ఇక జిల్లాకు ప్రత్యేకంగా కోటా అనేది లేకుండా పోయింది. కాలిపోతున్న ట్రాన్స్పార్మర్లు... అప్రకటిత విద్యుత్ కోతలు, ఓవర్ లోడ్ సమస్యతో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ వల్ల ఎక్కువ కాలిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని కేటగిరీల్లో కలుపుకుని మొత్తం 56,762 ఉన్నాయి. దీనికిగాను కనీసం 4 శాతం ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్‌శాఖ స్టోర్‌లో ఉండాలి. కానీ 16 కేవీ నుంచి 100 కేవీ వరకు 780 ట్రాన్స్ఫార్మర్లు కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్ రిపేరు కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాలకు రోజుకు రెండు చొప్పున కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు 40 వరకు వస్తున్నాయి. కరెంట్ వ చ్చిరావడంతోనే రైతులందరూ ఒకేసారి విద్యుత్ మోటర్లు ఆన్చేస్తున్నారు. దీని వల్ల ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ పడుతోంది. తరచు కరెంట్ ట్రిప్ అవుతుండడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ట్రా న్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరో ట్రాన్స్‌ఫార్మరు బిగిం చాలి. కానీ ఎక్కడా దీనిని అమలు చేయడంలేదు. స్తంభించిన సేవలు... విద్యుత్ పంపిణీ సంస్థ, ట్రాన్స్‌కో కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో సేవలు స్తంభించిపోయాయి. వీరి స్థానాల్లో లైన్మన్లు, ఏఈలు, డీఈలు, టెక్నికల్ డీఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పనిభారం పెరిగి సబ్‌స్టేష న్లలో విధులు నిర్వర్తించడం కష్టసాధ్యమవుతోందని అధికారులు అంటున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ, దాని పరిధిలోని సబ్స్టేషన్లలో కలిపి కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 1500మంది ఉన్నారు. వీరంతా సమ్మెలోకి దిగడంతో జిల్లా కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సబ్‌స్టేషన్‌లో కరెంట్ కటర్స్ వరకు అన్ని విధులు లైన్‌మన్, ఏఈలు మొదలుకొని డీఈల వరకు పనిచేయాల్సి వస్తోంది. ఇక ట్రాన్స్‌కో పరిధిలో 132 కేవీ సబ్స్టేషన్లు 27,220 కేవీ సబ్స్టేషన్లు 5 మొత్తం కలిపి 32 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో సబ్‌స్టేషన్‌కు 11మంది చొప్పున కాంట్రాక్టు ఉద్యోగులు 352మంది ఉన్నారు. ఆయా సబ్స్టేషన్లలో ప్రతి 8 గంటల కోసారి కాంట్రాక్టు ఉద్యోగులు డ్యూటీలు మారి పనిచేయా ల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వారంతా ఒకేసారి సమ్మెలోకి దిగడంతో ఆ బాధ్యతలను జూనియర్ లైన్‌మన్ నుంచి డీఈ వరకు చేయాల్సి వస్తోంది. లైన్స్ బ్రేక్‌డౌన్ సరిచూసుకోవడం, సబ్‌స్టేషన్ మెయింటెన్స్ వంటివన్నీ కూడా ప్రస్తుతం లైన్మన్లు, డీఈలు దగ్గర ఉండి చూసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడా లేకపోవడంతో వంతుల వారీ విధులు నిర్వర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో రోజువారీ విధులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి నాంపల్లి మండలంలో కరెం టు కోత తీవ్రంగా ఉంది. రోజుకు ఐదారు గంటలు కూడా రావట్లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నరు. పగలు రెండు గంటలు,రాత్రి మూడు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందులోనూ లోఓల్టేజీతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు తగులబడుతున్నాయి. కాలిన ట్రాన్స్ఫార్మర్లను వారంరోజులైనా బాగుచేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. - దండిగ సత్తయ్య, రైతు, పసునూరు, నాంపల్లి -
నిధులున్నా..
నీలగిరి : ప్రభుత్వశాఖలకు చెందిన లక్షల రూపాయల నిధులు కొన్నేళ్లుగా జెడ్పీలో మూలుగుతున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా పరిషత్‌కు సంక్రమించిన అధికారాలను అమలుచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సమైక్యరాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలనాకాలంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంజూరైన నిధులు నేటి వరకూ నిరుపయోగంగానే ఉన్నాయి. మత్స్య కార్మికుల సంక్షేమానికి మంజూరైన రూ.90 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యశాలలు, ప్రహరీల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన రూ.70 లక్షలు ఖర్చు పెట్టకుండా జెడ్పీ ఖాతాలోనే నిల్వ ఉంచుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కొలువుదీరిన జెడ్పీ పాలకవర్గం ఇటీవల నిర్వహిస్తున్న వరుస సమీక్ష సమావేశాల్లో ఈ నిధులు సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ నిధులు ఏం చేయాలో...వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితి అధికారుల్లో నెలకొంది. నిలిచిన పథకాల అమలు.. నిధులు నిలిచిపోవడంతో మత్స్యశాఖ అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు రెండేళ్లుగా నిలిచిపోయాయి. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరానికి అప్పటి ప్రభుత్వం జెడ్పీకి రూ.90 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బెస్తలకు రాయితీలు ద్వారా వలలు, తట్టలు కొనుగోలు చేసి ఇవ్వడం, ఎస్సీలకు చేప ల వ్యాపారం నిమిత్తం దుకాణాలు ఏర్పాటు చేసుకునేం దుకు కేటాయించారు. దీంట్లో వలలు, తట్టలు టెండర్లు ద్వారా కొనుగోలు చేయాలి. అదేవిధంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చేప పిల్లలను పంపిణీ చేసేం దుకు ఈ నిధులు ఖర్చు పెట్టాలి. కానీ జిల్లాపరిషత్ నిధు లు విడుదల చేయకపోవడంతో ఈ పథకాల అమలు రెండేళ్లుగా నిలిచిపోయాయి. జెడ్పీ నిర్వహిస్తున్న వరుస సమీక్ష సమావేశాల పుణ్యమాని ఇటీవల రూ.40 లక్షలు మత్స్యశాఖకు విడుదల చేశారు. ఇంకా రూ.50 లక్షలు జెడ్పీ వద్దనే ఉన్నాయి. అయితే విడుదల చేసిన రూ.40 లక్షలకు సంబంధించిన కార్యాచరణ కూడా ఇంకా పూర్తికాలేదు. వలలు, తట్టలు కొనేందుకు టెండర్లు పిలిచారని అధికారులు చెబున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన రూ.50 లక్షలు కూడా విడుద ల చేయాలని కోరుతూ మత్య్యశాఖ అధికారులు జెడ్పీకి లేఖ రాశారు. కానీ మంజూరు చేసిన నిధులు ఖర్చు పెట్టిన తర్వాతే రూ.50 లక్షలు విడుదల చేస్తామని జెడ్పీ అధికారులు మెలిక పెట్టారు. దీంతో పథకాల అమలు ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పశుసంవర్థక శాఖ నిధులపై అయోమయం.. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యశాలల నిర్మాణం, ప్రహరీలు, వైద్యశాలల మరమ్మతుల నిమిత్తం 2010 నుంచి 2013-14 సంవత్సరం వరకు జిల్లా పరిషత్‌కు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులు ఇప్పటి వరకు ఖర్చుపెట్టలేదు. మంజూరు చేసిన నిధులు ఖర్చు పెట్టే అధికారం జెడ్పీకి ఉన్నా...పనులకు సంబంధించిన అనుమతులు రా్రష్టస్థాయి అధికారుల నుంచే రావాల్సి ఉంటుంది. దీంతో పైనుంచి పనుల అనుమతులు రాలేదని కారణంతో ఆ నిధులు ఖర్చుపెట్టకుండా జెడ్పీ ఖాతాలోనే ఉంచారు. కనీసం ఆ పనుల అనుమతులకు సంబంధించి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో నిధులు మంజూరైనా వృథాగానే ఉంచాల్సి వచ్చింది. అయితే రాష్ర్టం విడిపోయే ముందు ప్రభుత్వ శాఖల్లోని నిధులను తిప్పి పంపాలని గవర్నర్ ఆదేశాలు జారీచేసినప్పటికీ, వాటిని వెనక్కి పంపకుండా ఇక్కడే ఉంచారు. ప్రభుత్వానికి మాత్రం జీరోబ్యాలెన్స్ చూపుతూ లెక్కలు పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే మళ్లీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్తగా అనుమతులు వస్తే తప్ప.. ఖర్చు పెట్టే అవకాశం లేకుండా పోయింది. నిధుల్లేక ప్రభుత్వ శాఖలు నీరసిస్తుంటే...నిధులున్నా వినియోగించుకోలేని స్థితిలో అధికారులు పనిచేయడం విచారకరం. -
ఇక.. ‘ఆహార భద్రత’
దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్.. దరఖాస్తుల స్వీకరణ : నేటి నుంచి ఈనెల 15 వరకు దరఖాస్తుల పరిశీలన : 16 నుంచి 25వ తేదీ వరకు అర్హుల జాబితా తయారీ : 26 నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వానికి జాబితా సమర్పణ : ఈ నెలాఖరు వరకు నీలగిరి : ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. రేషన్‌కార్డులు, పింఛన్‌దారులు, ఫాస్ట్ పథకం కింద లబ్ధిపొందాలను కుంటున్న విద్యార్థులు సైతం మళ్లీ కొత్తగా ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. పాత వాటిని రద్దు చేసి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. ఆహారభద్రత కార్డులు, పింఛన్ల కోసం శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. సమగ్ర సర్వే వివరాలే ప్రామాణికంగా.. జిల్లాలో ప్రస్తుతం 9,31,525 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో తెలగాణ ప్రభుత్వం ‘ఆహార భద్రత’ పేరిట కొత్త కార్డులు జారీ చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.75 లక్షల జనాభా ఉంది. అయితే ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 11.50 లక్షలకు పెరిగింది. 2.75 లక్షల కుటుంబాలు పెరిగాయి. సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకుని కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 4 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అది కూడా కుటుంబంలో ఐదుగురు సభ్యులకు 20కిలోల వరకు మాత్రమే పరిమితం చేశారు. కానీ కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత ఆహార భద్రత చట్టం కింద ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంతమందికి 5 కేజీల చొప్పున ఇస్తారు. సీలింగ్ అనేది ఉండదు. నవంబర్ 1నుంచి పెరగనున్న పింఛన్లు వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు నవంబర్ 1 నుంచి పెరగనున్నాయి. జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలుపుకుని మొత్తం పింఛన్‌దారులు 3లక్షల 94 వేల మంది వరకు ఉన్నారు. దీంట్లో ప్రస్తుతం వృద్ధులకు రూ.200, వికలాంగులకు రూ.500 పంపిణీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పెరుగుదల నవంబర్ ఒకటి నుంచి అమలు చేస్తారు. వృద్ధుల పింఛన్ వయో పరిమితిలో ఎలాంటి మార్పులేదు. కానీ జిల్లాలో 8 వేల మంది వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్లు లేవు. వీరి కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో యుద్ధప్రాతిపదికన సదరమ్ క్యాంపులు నిర్వహిస్తామని డీఆర్డీఏ పీడీ చిర్రా సుధాకర్ తెలిపారు. పింఛన్ల పెంపును కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులకు కూడా వర్తిస్తుందా? లేదా? అన్నది ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయినా గానీ ఈ లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు తప్పని తిప్పలు... తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయ (ఫాస్ట్) పథకం కింద లబ్ధిపొందాలనుకుంటున్న విద్యార్థులు మళ్లీ ఆదాయ, స్థానిక, కుల ధ్రువీకరణ పత్రాలను పొందాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద జిల్లాలో సుమారు లక్షకు పైగా విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వీరంతా అడ్మిషన్ సమయంలో జతపర్చిన సర్టిఫికెట్లు కాకుండా మళ్లీ కొత్తగా పొందాల్సి ఉంటుంది. త్వరలో ఫాస్ట్ పథకం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులు సర్టిఫికెట్లు పొందాల్సి ఉంది. అదీగాక గతంలో మీ సేవ కేంద్రాల నుంచి సర్టిఫికెట్లు పొందారు. కానీ ప్రస్తుతం తహసీల్దార్ల నుంచే స్వయంగా పొందాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఏదిఏమైనప్పటికీ ఏకకాలంలో ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఇప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలంటే.. విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రాల్లో ఇవ్వరు. రేషన్ కార్డులు, పింఛన్ల కోసం గ్రామ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించే బాధ్యతను వీఆర్వో, వీఆర్ఏ, వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు, విద్య, వైద్య శాఖలకు చెందిన సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం వీఆర్వోలు రైతురుణ మాఫీ పథకానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నందున వారి స్థానంలో ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పథకాలకు అర్హులు.. వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు కలిగిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు. వార్షిక ఆదాయం రూ.2.00 లక్షలు కలిగిన అర్బన్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు. అనర్హులు.. 5 ఎకరాలు మెట్ట లేదా 2.50 ఎకరాల మాగాణి భూములు కలిగిన వారు . ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు . ప్రభుత్వ సహాయం పొందకుండా (ఇందిరమ్మ ఇళ్లు) 3గదుల పక్కా ఇల్లు ఉన్న వారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా... ఈ నెల 15న దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం వాటిన్నింటినీ మండలాలకు పంపిస్తారు. వచ్చిన దరఖాస్తులను 16వ తేదీ నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని కోసం ఒక్కో మండలానికి ప్రత్యేకంగా 5బృందాలను (టీమ్స్) నియమించారు. లబ్ధి దారుల ఎంపిక బాధ్యత మొత్తం కూడా రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఈబృందంలో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, మరో ఇద్దరు సభ్యులు ఉంటారు. వచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలను, సమగ్ర కుటుంబ సర్వే డేటా వివ రాలను పోల్చి చూస్తారు. ప్రస్తుతం సర్వే డేటాను అన్ని మండలాలకు పంపిస్తున్నారు. దీంతో పాటు వచ్చిన దరఖాస్తుల్లో ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే వాటిని క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆరాతీస్తారు. అనర్హత కలిగిన దరఖాస్తులు ఉన్నట్లయితే వాటిని తొలగిస్తారు. తప్పుడు దరఖాస్తులను కూడా అధికారులు ఆమోదించినట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
మహిళా సంఘాలకు టోపీ
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన టార్పాలిన్లు, కాంటాలు, తేమయంత్రాల కొనుగోలు బాధ్యతను స్వయంసహాయక సంఘాలకు కేటాయించడం ఐకేపీ(ఇందిరాక్రాంతి పథం) ఉద్యోగులకు వరంగా మారింది. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. డీఆర్డీఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా నాసిరకం వస్తు సామగ్రిని సీజన్ దాటిన తరువాత కొనుగోలు చేసి సంఘాలకు అంటగట్టి సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నీలగిరి :గత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 250 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ప్రారంభానికి ముందు కొనుగోలు చేయాల్సిన టార్పాలిన్లు, ఇతర వస్తుసామగ్రిని సీజన్ ముగింపు దశకు చేరినప్పుడు కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకమైన వాటిని కొనుగోలు చేసి సంఘాలకు అంటగట్టారు. వాస్తవానికి మహిళా సంఘాలు స్వయంగా బహిరంగ మార్కెట్లో వాటిని కొనుగోలు చేయాలి. కానీ పలు మండలాల్లో ఏపీఎంలు, ఏసీలు జోక్యం చేసుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి కొన్నట్లు తెలిసింది. క మీషన్ దుర్వినియోగం... ధాన్యం కొనుగోలు తర్వాత మహిళా సంఘాలకు ఇచ్చే కమీషన్లోనుంచి కొంతడబ్బు వెచ్చించి టార్పాలిన్లు కొనుగోలు చేయాలి. ఇలా నాన్ ఆయకట్టు పరిధిలో ఏర్పాటు చేసిన 15 కేంద్రాలుఎక్కువ మొత్తంలో టార్పాలిన్లు కొనుగోలు చేశాయి. వీటిలో ఎక్కువ భాగం వలిగొండ, పోచంపల్లి, తిప్పర్తి, రామన్నపేట, ఆలేరు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 1656 టార్పాలిన్లు కొన్నారు. వీటితో పాటు కాంటాలు12, స్కేళ్లు 35 కొన్నారు. ఒక్కో టార్పాలిన్కు డీఆర్డీఏ నిర్ధారించిన ధర రూ.2,450. ఈ లెక్కన టార్పాలిన్ల కొనుగోలుకు సుమారు రూ.40,57,200 కేటాయించారు. కానీ పలు మండలాల్లో నిర్ధారించిన ధరకు అదనంగా రూ.130 వెచ్చించి కొన్నారు. ని ర్ధారించిన ధరల ప్రకారం నిర్ణీత ప్రమాణాలు కలిగిన సామగ్రి మాత్రమే కొనుగోలు చేయాలని డీఆర్డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఏ ఒక్క మార్గదర్శకాన్ని పాటించలేదు. టార్పాలిన్ల విషయానికొస్తే.. ఐదు లేయర్లు మందం కలిగి, నలుపు రంగులో ఉండాలి. పొడవు 8 మీటర్లు, అడ్డం 6 మీటర్లు ఉండాలి. కానీ పోచంపల్లి మండలానికి వచ్చిన టార్పాలిన్లు పరిశీలిస్తే మాత్రం 6 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల పొడవు ఉన్నాయి. ధర కూడా అధికమే. పట్టాలు నాసిరకంగా ఉన్నాయి. పట్టింపులేని యంత్రాంగం.. ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన టార్పాలిన్లు, ఇతర సామగ్రి వైపు అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించారా..?లేదా? అనేది కూడా పరిశీలన చేయలేదు. గతంలో మార్కెటింగ్ శాఖ నుంచే ఐకేపీ కేంద్రాలకు టార్పాలిన్లు, తేమ యంత్రాలు పంపిణీ చేసేవారు. కానీ ఈసారి కొనుగోలు బాధ్యతను సంఘాలకు అప్పగిండచం వల్ల ఐకేపీ ఉద్యోగులకు ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికైన అధికారులు స్పందించిన నాణ్యతా ప్రమాణాలపై పూర్తి విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగు వస్తాయని సంఘాలు కోరుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే మౌలిక వసతులప్పుడైనా కనీసం జాగ్రత్తలు పాటించేందుకు వీలుంటుంది. మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 250 టార్పాలిన్లు కొన్న కేంద్రాలు : 15 మొత్తం టార్పాలిన్లు : 1656 కేటాయించింది : రూ.40,57,200 ఒక్కో టార్పాలిన్కు నిర్ధారించిన ధర : రూ.2450 సిబ్బంది కొనుగోలు చేసింది : రూ.2580 అదనంగా చెల్లించింది : రూ.130 మొత్తంగా ఖర్చు చేసింది : 42,72,480 (మహిళా సంఘాల కమీషన్లోనుంచే టార్పాలిన్లకు డబ్బు కేటాయించారు) -
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు అనుమానం పోలీసుల అదుపులో ఇద్దరు మెదక్ జిల్లా రామక్కపేటలో దారుణం దుబ్బాక: తల్లీకూతుళ్లపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిజన బాలిక (17) దసరా పండగను పురస్కరించుకుని రాత్రి తోటి మిత్రులకు జమ్మీ ఇవ్వడానికి వెళ్లింది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్ బైక్‌పై వచ్చాడు. తాను కూడా అటే వెళుతున్నానని చెప్పి ఆమెను ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమె ముక్కు వద్ద మత్తు మందు పూసిన కర్చీఫ్‌ను ఉంచడంతో ృ్పహ కోల్పోయింది. అక్కడి నుంచి సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న కొంత మందితో కలసి కరుణాకర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతక సాగారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దిలీప్.. బాలిక తల్లి(40) వద్దకు మీ కుమార్తెను చూపుతానని చెప్పి ఆమెను బైక్‌పై సదరు నీలగిరి తోట వద్దకు తీసుకెళ్లగానే అదే గ్యాంగ్ ఈమెపై కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఆమెను దిలీప్ మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా భర్త కనిపించడంతో బైక్‌పై నుంచి దూకి విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరూ నీలగిరి తోటలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కూతురుని చూసి నిశ్చేష్టులయ్యారు. బాధితులు శనివారం ఉదయం దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లీకూతుళ్లను వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సామూహిక అత్యాచారంలో మొత్తం ఎనిమిది మంది పాల్గొన్నారని, వీరి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండవచ్చని సమాచారం. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గ్రామానికి వచ్చి విచారణ చేశారు. కాగా, నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. నిందితులను కఠినంగా శిక్షించాలి: బలరాం నాయక్ మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. గతంలో వరంగల్ జిల్లాలో కాలేజీ అమ్మాయిలపై యాసిడ్దాడి చేసిన వారిని పోలీసులు కాల్చి చంపినట్లుగా శిక్ష ఉండాలని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను సీఎం, హోంమంత్రి సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తెలంగాణలోని గిరిజనులు ఆ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఈ ఘటనను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం: పొంగులేటి రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి విమర్శించారు. హోంశాఖ నిర్వహణ కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నా శాంతి, భద్రతల పరిరక్షణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ఈ వైఫల్యం కారణంగా తాజాగా మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన 108 సర్వీసు వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడిందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావడం లేదని, ఈ విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నారు. -
కొనుగోల తప్పదా!
నీలగిరి :ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు మహిళాసంఘాలు వెనుకడుగు వేస్తున్నాయి. కొనుగోళ్ల భారమంతా కూడా సంఘాలు భరించాల్సి రావడమే దీనికి ప్రధాన కారణం. కేంద్రప్రభుత్వం లెవీ సేకరణలో మిల్లుల వాటాను పూర్తిగా తగ్గించిన నేపథ్యంలో ధాన్యం సేకరణ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలపైనే పడింది. అది కాస్తా ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభంకావడంతో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. లెవీ మార్పు కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఐకేపీ, సహకార కేంద్రాలు రెట్టింప య్యాయి. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని కూడా పెంచారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల గుత్తాధిపత్యాన్ని నివారించి..పండిన పంటకు రైతుకు పూర్తి మద్దతు చెల్లించే క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పర్వాలేదనిపించినా ధాన్యం కొనుగోళ్ల విషయానికొచ్చేసరికి ఆర్థికంగా మహిళాసంఘాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మోయలేని భారం... కొత్త లెవీ మార్గదర్శకాల ప్రకారం మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ప్రభుత్వం లెవీగా సేకరిస్తుంది. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి బియ్యం మార్కెట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకోకుండా నియంత్రించేందుకుగాను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను రెట్టింపు చేసింది. ప్రధానంగా ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా బియ్యం కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. కానీ ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనేందుకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. కొనుగోలుకు అవసరమయ్యే టార్పాలిన్లు, కాంటాలు, చిన్నత్రాసులు, వరిశుద్ధి యంత్రాలను సంఘాలే కొనుగోలు చేయాలని అధికారులు తేల్చిచెప్పారు. వీటి కొనుగోలుకు అవసరమయ్యే వ్యయాన్ని సంఘాలకు సమకూరే ధాన్యం కమీషన్ నుంచే తీసుకోవాలని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వివిధ సాకులతో ధాన్యం కమీషన్లో అధికారులు కోత విధిస్తున్నారు. తాజాగా కొనుగోలుకు అవసరయ్యే ఖర్చులన్నింటినీ సంఘాలే భరించాలని చెప్పడంతో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంఘాలు ముందుకు రావట్లేదు. తిరుమలగిరి మండలం జలాల్పురం, తాటిపాముల, ఈటూరు సంఘాలు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయబోమని అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలకు నిర్వహించిన శిక్షణ కు కూడా 40 సంఘాలకు మించి హాజరుకాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లపైఅధికార యంత్రాంగంలో సందిగ్ధత నెలకొంది. రెట్టింపైన కేంద్రాలు... కిందటేడు ఖరీఫ్ సీజన్లో ఐకేపీ, పీఏసీఎస్‌లు కలిపి మొత్తం 55 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ సీజన్లో కేవలం 56 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో ఐకేపీ ఆధ్వర్యంలో 80, పీఏసీఎస్‌లు 42 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్లో వరి 1.55 లక్షల హెక్టార్లలో సాగైంది. దీనికిగాను 7.55 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంట్లో ఐకేపీ 75 వేలు, పీఏసీఎస్‌లు 30 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ సీజన్లో బీపీటీ బియ్యం (సన్న బియ్యం) దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొనుగోళ్లు నామమాత్రంగానే ఉంటాయి. కానీ రబీ సీజన్‌కు వచ్చే సరికి మాత్రం నాన్ బిపీటీ బియ్యం కొనేందుకు ప్రభుత్వ సంస్థలు, మిల్లర్లకు మధ్య పోటీ తీవ్రంగానే ఉంటుంది. ఈ విషయమై డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చిర్రా సుధాకర్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ కొనుగోళ్లకు అవసరమయ్యే మౌలిక వసతులను సంఘాలే సమకూర్చుకోవాలన్నారు. ఈ నెల రెండోవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. -
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
నీలగిరి :జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు, స్థాయీ సంఘ సమావేశాలకు గైర్హాజరవుతున్న సంబంధిత శాఖల అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి హెచ్చరించారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో 3వ వ్యవసాయ స్థాయీ సంఘ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి 14 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ సమావేశంలో ప్రధాన ఎజెండా అంశాలైన డ్వామా, మార్కెటింగ్, అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు గైర్హాజరయ్యారు. డ్వామా పీడీ సెలవులో ఉన్నందున ఆమె స్థానంలో ఏపీడీ హాజరుకావాల్సి ఉండగా సూపరింటెండెంట్ వచ్చారు. అదేవిధంగా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారికి బదులు కిందిస్థాయి ఉద్యోగి హాజరయ్యారు. ఇక మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరూ కూడా సమావేశానికి రాలేదు. దీంతో ఉద్యోగులతో సమీక్షలు చేయడం సాధ్యం కాదని.. జెడ్పీ సమావేశాలకు తప్పని సరిగా అధికారులు హాజరుకావాల్సిందేనని చైర్మన్, వైస్ చైర్మన్లు స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అధికారులు సమీక్షలకు గైర్హాజరవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో సారి ఆ శాఖల అధికారులను రప్పించి కలెక్టర్ సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఈఓను ఆదేశించారు. వన్యప్రాణి విభాగం పై ఫైర్... నాగార్జునసాగర్ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చైర్మన్, వైస్‌చైర్మన్ మండిపడ్డారు. మారుమూల తండాల్లో కంకర రోడ్లు పూర్తయినా వాటిపై బీటీ వేయకుండా సం బంధింత అధికారి లేనిపోని కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. సాగర్‌లో మెయిన్‌రోడ్డుకు సమీపంలో నిర్మించిన దేవస్థానం గోపుర శిఖరం అటవీ శాఖ నిబంధనలకు అడ్డుగా ఉం దన్న కారణంతో దానిని సంబంధిత అధికారి తీసుకెళ్లారని వైస్ చైర్మన్ తెలి పారు. హాలియా - పెద్దవూర కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క-సారక్క దేవస్థానం లైట్లు పులులకు ఇబ్బందికరంగా మారాయని వాటిని తొలగించారన్నారు. ఈ విషయాలన్నీ చర్చించాల్సిన సమావేశానికి అధికారి గైర్హాజరుకావడం పట్ల వారు మండిపడ్డారు. అడ్డగోలు అక్రమాలు.. కిరోసిన్ డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని స్థాయీ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రెండు నెలల పేరు మీద ఒక్కసారి మాత్రమే కిరోసిన్ పంపిణీ చేసి మిగతా కోటాను బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారని వైస్ చైర్మన్ అధికారులకు వివరించారు. నెలవారీ కోటాలో కోత పెడుతూ చివరకు వచ్చే సరికి ట్యాం కుల కొద్దీ కిరోసిన్ అక్రమంగా హోల్‌సేల్ డీలర్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇక ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సకాలంలో కాంట్రాక్టర్లు లారీలను పం పడం లేదని దీంతో రైతులే స్వయంగా డబ్బులు చెల్లించి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ధాన్యం తరలిస్తున్నారని సభ్యులు వివరించారు. అలాకాకుండా వచ్చే సీజన్ నుంచి ధాన్యం రవాణా బాధ్యతలను సంఘాలకు అప్పగించాలని సభ్యులు సూచించారు. ఇక సూక్ష్మనీటి పారుదల శాఖ ఉద్యోగులు డ్రిప్ మంజూరు చేయకుండా లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారని.. వాటి పై ఎంపీపీ, జెడ్పీటీసీలను సంతకం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని వైస్ చైర్మన్ సంబంధిత అధికారులకు తెలిపారు. లబ్ధిదారుల పేరు మీద ఇతర జిల్లాలకు డ్రిప్ పరికరాలు తరలిస్తున్నారని, డ్రిప్ ఏజెన్సీలు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత డ్రిప్ బిల్లులు చెల్లించాలని, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంజూరు చేయాలని వైస్ చైర్మన్, సభ్యులు సూచించారు. యూరియా కోటా సహకార సంఘాలకు 60 శాతం, అధీకృత డీలర్లకు 40 శాతం ఇవ్వాలని సభ్యులు సమావేశంలో ప్రతిపాదించారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రవి, సీహెచ్ కోటేశ్వరారవు, యాదగిరి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఓటరు జాబితా సవరణ
నీలగిరి : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ, బోగస్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వతేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతను ఓటరుగా నమోదు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతారు.ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 26 నుంచి అక్టోబర్ 10వరకు జిల్లాలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేసే ప్రక్రియ చేపడతారు. బూత్ స్థాయి అధికారులు ‘ఇంటింటికీ వెళ్లి ఓటర్లు తనిఖీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ తనిఖీలో అధికారులు ఓటర్ల జాబితా సవరణ, వలసలు వెళ్లిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఓటరు కార్డుల తొలగింపు, మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలు నమోదు చేస్తారు. ఇంటింటి సర్వేతో పాటు యజమాని సంతకం కూడా తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లకు అవకాశం కల్పించారు. వారు బూత్ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను తనిఖీ చేస్తారు. ప్రతి బూత్ స్థాయి అధికారి కోసం ఆ పరిధిలోగల ఓటర్ల వివరాలతో రిజిష్టర్లు తయారు చేశారు. ఈ రిజిష్టర్లతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తారు. వాటిలో ఏమైనా తప్పులుంటే ఆ అధికారికి తెలియజేసి, వాటిని సరిచేయడానికి అవసరమైన పత్రాలను (గుర్తింపు కార్డు) సమర్పించాలి. జిల్లాలో మొత్తం ఓటర్లు 25,41,520 పురుషులు 12,75,267 మహిళలు 12,66,253 ఓటరుగా నమోదుకు వచ్చిన దరఖాస్తులు 11,352 బోగస్ ఓటర్లు 21,948 15రోజుల్లో తనిఖీలు పూర్తి ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేసే కార్యక్రమాన్ని శుక్రవా రం నుంచి అక్టోబర్ 10 వ తేదీ వరకు అంటే 15 రోజు ల్లో పూర్తి చేస్తారు. అనంతరం ఆ వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తారు. మార్పులు చేసిన ముసాయిదా జాబితాను నవంబర్ నెలాఖరున ప్రకటిస్తారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం కోసం డిసెంబర్ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఓటరు నమోదు చేసుకునేందుకు కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. 2015 జనవరి 25న ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తారు. తదనంతరం ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ప్రవేశపెడతారు. బోగస్ ఓటర్ల తొలగింపు అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 21,948 మంది బోగస్ ఓటర్లు ఉన్నారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించి ఈ ఓటర్లను తొలగిస్తారు. వీరిలో వలస వెళ్లిన వారు, డబుల్ ఓటరు గుర్తింపు కార్డు కలిగిన వారు ఉన్నారు. అదే విధంగా నిరంతర ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 10 తేదీ నుంచి ఈ నెల 20 వరకు కొత్తగా 11,352 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. బోగస్ ఓటర్లను తొలగించడంతో పాటు, కొత్త ఓటర్ల దరఖాస్తులను కూడా ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్ నెలాఖరు నాటికి ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. -
ఎట్టకేలకు...
నీలగిరి :వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొంతకాలంగా వివిధ కారణాల దృష్ట్యా వాయిదాపడుతూ వస్తున్న జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం(డీపీసీ) బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10గంట లకు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్జీఎఫ్లకు సంబంధించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో గుర్తించి పంపిన ప్రతి పాదనలపై సభ్యులు చర్చించి ఆమోదిస్తారు. జెడ్పీచెర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరుకానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను బీఆర్జీఎఫ్ కింద జిల్లాకు 33 కోట్ల రూపాయలు కేటాయించారు. అభివృద్ధికి పెద్దపీట బీఆర్జీఎఫ్ పథకం ఏడేళ్లుగా అమలవుతోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాకు రూ. 190 కోట్లు కేటాయించారు. అయినా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం పూర్తికాకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.33 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామ, మండల పరిషత్, జెడ్పీల నుంచి అంగన్వాడీ భవనాలు, మురికికాల్వలు, అంతర్గత రోడ్లు, తాగునీటి సౌకర్యం, పశువైద్యశాలల మిగులు పనులు, పాఠశాలల అదనపు తరగతి గదులు, మండల పరిషత్ భవనాల మిగులు పనులు, గ్రామ పంచాయతీ భవనాల మిగులు పనులుతో కలిపి ప్రణాళిక రూపొందించారు. అంతేగాక మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు చెందిన సొంత నిధులు రూ.3.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ విషయమై జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘బీఆర్జీఎఫ్ పనులకు డీపీసీ ఆమోదం పొందిన తర్వాత రాష్ర్టస్థాయిలో జరిగే సమావేశానికి కూడా పంపిస్తాం. అక్కడా ఆమోదం లాంఛనమే. అదే రోజున 14 స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా ఉంది. ఈ సమావేశానికి జెడ్పీచైర్మన్ హాజరవుతారు. జిల్లాకు సంబంధించి సీపీడబ్ల్యూఎస్ పథకాలపై చైర్మన్ సలహాలు, సూచనలు ఇస్తారు.’’ నిధుల పంపకం.. బీఆర్‌జీఎఫ్‌లో భాగంగా జిల్లాపరిషత్ కోటా రూ.6 కోట్ల నుంచి ప్రజాప్రతినిధులకు వాటాలు కేటాయించారు. ఎంపీలకు 10 లక్షల రూపాయలు, ఎమ్మెల్యేలకు 5 లక్షల రూపాయలు, జెడ్పీటీసీలకు 7 లక్షల రూపాయలు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ 20 లక్షల రూపాయల నిధులు పంపిణీ చేస్తారు. ఈ నిధులను ఆయా ప్రజాప్రజానిధులు తమ ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
అక్కడే బాగుందట..!
‘‘పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందనే’’ సామెతను జిల్లాపరిషత్ ఉద్యోగుల్లో కొందరు బాగానే వంట పట్టించుకున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఇతర శాఖల్లోకి... తమకు అనువైన ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో జెడ్పీలో డిప్యుటేషన్ల లొల్లితో పాలన వ్యవస్థ గాడితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీలగిరి : సొంత శాఖలో పనిచేయడమంటే వారికి అయిష్టం.. పొరుగు శాఖల్లో పనిచేస్తూ సొంత వ్యాపకాల్లో మునిగితేలడం వారికి ఎంతో ఇష్టం. రాజకీయ అండదండలున్న ఉద్యోగులు అయితే వారి మాటకు ఎదురుండదు.. జిల్లా అధికారులు సైతం వారి ఆదేశాలకు తలొగ్గాల్సిందే. మండలాల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎంపీడీఓలు డిప్యుటేషన్‌ను అడ్డంపెట్టుకుని పొరుగుశాఖలవైపు తొంగిచూస్తున్నారు. ఇదే బాటలో సూపరింటెండెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు పయనిస్తున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగులకు డిప్యుటేషన్‌పై ఇతర శాఖలో పనిచేసేందుకు పదేళ్ల పాటు అవకాశం ఉంది. అయితే దీనినే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు వివిధ శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో సొంత శాఖలో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. పదుల సంఖ్యలో ఉద్యోగులు సొంత శాఖను వదిలి పొరుగు శాఖల్లో పనిచేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు ఇదే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోనే ఉంటూ జెడ్పీలో పనిచేయడం ఇష్టంలేని ఉద్యోగులకు డీఆర్డీఏ, డ్వామా వంటి శాఖలు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఈ విధంగా సొంత శాఖను కాదని వెళ్లిన ఉద్యోగులు ప్రభుత్వ సేవలను పక్కన పెట్టి వ్యక్తిగత అవసరాల పట్ల అమితాసక్తి చూపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ అధికారులపై మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. హైదరాబాద్‌లో సెటిలైన ఎంపీడీఓలు... జిల్లాలో ప్రస్తుతం 8ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా మండలాల్లో పనిచేయాల్సిన వారు డిప్యుటేషన్లపై వేర్వేరు శాఖల్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్ శివారు మండలాలైన చింతపల్లి, డిండి, చందంపేటలలో పనిచేయాల్సిన ఎంపీడీఓలు నగరంలో సెటిలయ్యారు. వీరితో పాటు నూతనకల్, మునుగోడు ఎంపీడీఓలు కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సేవలందిస్తున్నారు. నాంపల్లి ఎంపీడీఓ డ్వామా ఏపీడీగా పనిచేస్తున్నారు. అనుమల ఎంపీడీఓ డ్వామా ఏఓగా వెళ్లినట్లు జెడ్పీ అధికారులు వద్ద సమాచారం ఉంది. కానీ ఆమె సూర్యాపేట క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్నారు. నిడమనూరు ఎంపీడీఓ పశ్చిమ గోదావరి జిల్లా డ్వామా కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఆయా మండలాల్లో ఎంపీడీఓల పోస్టులు ఖాళీగా ఉండటంతో కింది స్థాయి ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాల్సి వస్తోంది. ఇన్చార్జ్ పోస్టుల్లో స్థానం సంపాదించేందుకు ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడుతున్నా రు. నాంపల్లి ఎంపీడీఓ స్థానం కోసం అక్కడ పనిచేసే సూపరింటెండెంట్ రాజకీయ పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. -
గణనాథ... ఇక సెలవు
నీలగిరి : భక్తిశ్రద్ధలతో నవరాత్రి పూజలందుకున్న గణనాథులను ఆదివారం నిమజ్జనం చేశారు. నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మాధవనగర్ మొదటి విగ్రహం వద్ద నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, బండా నరేందర్ రెడ్డి, కలీం, కాంగ్రెస్‌నేత హఫీజ్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. సూర్యాపేటలో పూల సెంటర్ విగ్రహం వద్ద జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలో ముస్లిం మత పెద్దలు భక్తుల సౌకార్యార్థం తాగునీటి వసతి కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఊరేగింపులు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 13 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు. అత్యధికంగా నల్లగొండ పట్టణంలో సుమారు ఐదు వందల విగ్రహాలను నాగార్జునసాగర్ ఎడమకాల్వ 14వ మైలురాయి వద్ద ఏఎమ్మార్పీ కాల్వలో నిమజ్జనం చేశారు. సాగర్‌లో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి ప్రాంతాల్లో చెరువులు, మూసీ నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. సూర్యాపేటలో సద్దల చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. మిర్యాలగూడ, నకిరేకల్ ప్రాంతాల్లో మూసీ నది, సాగర్ ఎడమ కాల్వలో నిమజ్జనం చేశారు. అనుముల మండలం అలీనగర్ (14వ మైలురాయి ) వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని మిర్యాలగూడ డీఎస్పీ మోహన్, ఆర్డీఓ కిషన్‌రావు పర్యవేక్షించారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు నాగార్జునసాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద ఎత్తున ఊరేగింపు ఉత్సవాలు గణేశ్ శోభాయాత్రలో విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండలో ఉదయం చిరుజల్లుల కురుస్తున్నా శోభాయాత్రను ముందుకు నడిపించారు. పట్టణాల్లో అపార్ట్మెంట్ వాసులు సామూహికంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ, భజనలు, మహిళ నృత్యాలు, కోలాటాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి పట్టణాల్లో అశేషజనవాహని మధ్య శోభాయాత్ర ప్రజలను కనువిందు చేసింది. ఇదిలావుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. 2600 మందితో బందోబస్తు నిర్వహించారు. పోలీస్ శాఖతోపాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రోడ్పార్టీ, స్పెషల్ పోలీసుల సహకారంతో గణనాథుడి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా తగు జాగ్రత్తలు పాటించారు. తగ్గిన లడ్డూ వేలం పాటలు.. ప్రతి ఏడాది గణేశ్ నిమజ్జనం రోజున లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా జరిగేవి. కానీ ఈ ఏడాది మిర్యాలగూడలో వేలం పాటలకు స్వస్తి చెప్పారు. గణేశ్ విగ్రహం వద్ద ఉన్న లడ్డూలను భక్తులు ప్రసాదంగా పంచిపెట్టారు. పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటలో గణేశ్ విగ్రహం వద్ద ఉంచిన అతిపెద్ద 66 కిలోల లడ్డూను కూడా భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. నల్లగొండ, సూర్యాపేటలలో కూడా లడ్డూ వేలం పాటలు తగ్గాయి. నల్లగొండలో మాధవనగర్ గణేశ్ విగ్రహం వద్ద నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.26 వేలు పలికింది. దేవరకొండలో ఎంకేఆర్నగర్లో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద లడ్డూను రూ.87 వేలకు వేలంపాటలో కిషన్‌నాయక్ దక్కించుకున్నారు. హుజూర్‌నగర్‌లో రెండవ వార్డులో ఏర్పాటు చేసిన వి గ్రహం వద్ద లడ్డూను వేలంలో రూ.66,116లకు దొంతిరెడ్డి గౌతమ్‌రెడ్డి దక్కించుకున్నారు. మఠంపల్లిలో లడ్డూ ను రూ. 65,000లకు గాయం శ్రీనివాసరెడ్డి సొంతం చేసుకున్నారు. కట్టంగూర్‌లోని రాంనగర్ విగ్రహం వద్ద లడ్డూను రూ.66 వేలకు అంతటి చంద్రశేఖర్ దక్కించుకున్నారు. కోదాడలో క్వాన్సింగ్ ఏజెంట్స్ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద 150 కేజీల లడ్డూను వేలం పాటలో రూ.50,116లకు గుడుగుండ్ల రఘు దక్కించుకున్నారు. -
బినామీ డీలర్లు..!
నీలగిరి : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్లు కాకుండా రేషన్‌దుకాణాలపై బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేవారు లేకపోవడంతో వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బినామీలుగా చెలామణి కావడమేగాక డీలర్ల సంఘానికి నాయకత్వం వహిస్తున్నా, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో గ్రామస్థాయిలో ప్రజాపంపిణీ వ్యవస్థపై అజమాయిషీ లేకుండా పోయింది. ఏడాది కాలం తర్వాత శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆహార సలహాసంఘం సమావేశంలో పలువురు సభ్యులు గగ్గోలు పెట్టారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్‌కార్డులు, ఆధార్ సీడింగ్, ఐకేపీ, ఆహార పదార్థాల్లో కల్తీ వ్యవహారం, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహణపై చర్చించారు. ప్రధానంగా రేషన్ డీలర్ల పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. దుకాణాలు తెరవడంతో డీలర్లు సమయపాలన పాటించడం లేదన్నారు. ఆలేరులో ఓ డీలరు ఒకే ఇంట్లో రెండు దుకాణాలు నడుపుతున్నాడని ఎమ్మెల్యే గొంగడి సునీత ఫిర్యాదు చేశారు. భువనగిరి డివిజన్ పరిధిలో 35 దుకాణాలు బినామీ చేతుల్లో నడుస్తున్నాయని మరో సభ్యుడు అహ్మద్ అలీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భార్య డీలర్‌గా ఉన్న ప్రతిచోట భర్త పెత్తనం ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. భువనగిరి పట్టణంలో ఐదుగురు రేషన్‌డీలర్లు బినామీలుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు రేషన్‌డీలర్ అయితే విదేశాల్లో ఉంటూ ఇక్కడి వ్యవహారాలు చక్కపెడుతున్నారు. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. భువనగిరి డివిజన్ ఏఎస్ఓ డిప్యుటేషన్ మీద హైదరాబాద్ కే పరిమితమయ్యారని...స్థానికంగా జరుగుతున్న అక్రమాల వైపు కనీసం కన్నెత్తికూడా చూడడం లేదని తెలిపారు. వీరిపై చర్య తీసుకోవాల్సిన తహసీల్దార్లు డీలర్లకు కొమ్ముకాస్తున్నారని, ఆర్డీఓకు ఏ మాత్రం సహకరించడం లేదని కలెక్టర్‌కు వివరించారు. బియ్యం పంపిణీలో అక్రమాలు... సంస్థాన్‌నారాయణపురం మండలంలో అంత్యోదయ కింద మృతిచెందిన కుటుంబాల పేరు మీద డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రసూల్ తెలిపారు. దీనిపై కొద్ది మాసాల క్రితం అధికారులు విచారణ కూడా నిర్వహించి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కన పడేశారని చెప్పారు. పాలలో యూరియా, సోయాబీన్ పిండి కలిపి కల్తీ చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ పాలల్లో ఎలాంటి కల్తీ జరగడం లేదని చెప్పారు. రేషన్‌కార్డులు రద్దుకావు ఆధార్ సీడింగ్ నమోదు చేసుకోని రేషన్‌కార్డుదారులను తొలగిస్తారని వార్తలు వస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిజమైన లబ్ధిదారులను తొలగించబోమని చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా లబ్ధిదారులు ఆధార్ సీడింగ్ నమోదు చే యించుకోవాలని తెలిపారు. లేకపోతే అలాంటి వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం వాటిని తొలగిస్తామని చెప్పారు. మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలు నిర్వహించకుండా నిలిచిపోయిన ఆహార సలహా సంఘం కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ కమిటీలకు డివిజన్‌స్థాయిలో ఆర్డీఓ చైర్మన్‌గా, గ్రామ కమిటీలకు సర్పంచ్, మండల కమిటీలకు కోచైర్మన్లుగా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు వ్యవహరిస్తారు. గ్రామ సలహాసంఘం కమిటీ సమావేశం నెలకోసారి, మండలస్థాయి కమిటీ సమావేశాలు రెండు మాసాలకోసారి నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, ఫిర్యాదులపై వచ్చే సమావేశం నాటికి చర్యలు చేపట్టాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, సలహా సంఘం కమిటీ సభ్యులు, డీఎస్ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పుర ప్రణాళిక.. రూ.1646 కోట్లు
పల్లె ప్రణాళిక తరహాలోనే పట్టణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో నిర్దేశించిన పనులకు రూ.1646 కోట్ల 33 లక్షలు కావాలని లెక్క తేల్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఒక్కో వార్డులో కనీసం మూడు పనులకు తగ్గకుండా గుర్తించారు. అదే విధంగా మున్సిపాలిటీ మొత్తానికి పనికొచ్చే విధంగా 10 నుంచి 15 పనులను అధికారులు గుర్తించారు. నీలగిరి : రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రణాళిక, మండల, జిల్లా ప్రణాళిక మాదిరిగానే మున్సిపాలిటీల్లో ‘మన వార్డు-మన ప్రణాళిక’ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు వార్డుల వారీగా సభలు నిర్వహించి ప్రజా సమస్యలు గుర్తించారు. దీంట్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వార్డు సభల్లో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఈ ప్రణాళిక రూపొందించారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు రూ.1499.51 కోట్లు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీలకు రూ.146.82 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. వ్యక్తిగత అర్జీలను పక్కన పెట్టి..సామాజిక అవసరాల మేర గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో పరిగణనలోకి తీసుకున్నారు. అత్యధికంగా వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీరు, పైప్లైన్లు, డ్రెయినేజీలకు సంబంధించిన అర్జీలు వెల్లువెత్తాయి. వీటితోపాటు పట్టణ ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. తాగునీటి సరఫరా, రోడ్లు, వీధిదీపాలు, డ్రెయినేజీలకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. పార్కులు, ఆటస్థలాల అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్లకు తదుపరి వరుసలో చోటు కల్పించారు. జిల్లా కేంద్రం కావడంతో అత్యధికంగా నల్లగొండ మున్సిపాలిటీ ప్రణాళిక వ్యయం రూ.1200 కోట్లకు లె క్కతేలింది. ఆ తర్వాతి వరుసలో నూతనంగా ఏర్పాటైన కోదాడ ము న్సిపాలిటీ అభివృద్ధికిగాను రూ.110 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో పొందుపర్చిన పలు రకాల అభివృద్ధి పనులకు 13వ ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్, ఎంపీ, ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు, సాధారణ నిధుల (జనరల్ ఫండ్) నుంచి నిధులు సమకూర్చుకోవాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. నల్లగొండ మున్సిపాలిటీలో మన వార్డు మన ప్రణాళిక రూ. 1200 కోట్లతో రూపొందించారు. పట్టణంలో భూగర్భ మురుగు కాల్వల నిర్మాణానికి రూ.100కోట్లు, ఆటోల కొనుగోలుకు రూ.80 లక్షలు, చెత్త డంపింగ్ యార్డులకు రూ. 20 కోట్లు, కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాల ఆధునికీకరణకు రూ. 40 కోట్లు, గ్రంథాలయాలకు రూ. 60లక్ష లు, వరద కాల్వ నిర్మాణానికి రూ.100 కోట్లు, వీది దీపాల లైన్లు ఆధునికీకరణకు రూ.50 కోట్లు, సోలార్ ప్లాంట్లు కు రూ.100 కోట్లు, పాదచారుల బాటలకు రూ. 5 కోట్లు, పార్కులు రూ. 5 కోట్లు, అతిథి గృ హ నిర్మాణానికిరూ. 10 కోట్లు, అధికారుల క్వార్టర్ల నిర్మాణాలకు రూ. 5 కోట్లు, పశువధశాలకు రూ.15 కోట్లు, క్రీడా మైదానం రూ.20 కోట్లు కేటాయించారు. వివిధ రకాల ప్రాధాన్యత గల అభివృద్ధి పనులకు రూ.758.40 కోట్లు కేటాయించారు. భువనగిరి మున్సిపాలిటీ.. భువనగిరి మున్సిపాలిటీకి మన ప్రణాళికలో భాగంగా.. సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.11.24 కోట్లు, మురికికాల్వలకు రూ10.55 కోట్లు, నీటిసరఫరాకు రూ 5.57 కోట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు రూ 4 .57కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.4.10 కోట్లు,పార్కుల అభివృద్ధికి రూ 3.60 కో ట్లు,వీధిదీపాల ఏర్పాటుకు రూ 1.97 కోట్లు, బస్‌షెల్టర్లకు రూ 96 లక్షలు,మూత్రశాలల నిర్మాణానికి రూ.51 లక్షలు, మార్కెట్ అభివృద్ధికి రూ.43 లక్షల అంచనా వ్యయంతో ప్రణాళికలను తయారు చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ.. సూర్యాపేట మున్సిపాలిటీలో అధికారులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.5.62 కోట్లు, మురుగు కాల్వలకు రూ.5.41 కోట్లు, తాగునీటిసరఫరాకు రూ.6.80కోట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు రూ.8.65 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.1.65 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.4.60 కోట్లు, వీధిదీపాల ఏర్పాటుకు రూ.6.5కోట్లు, బస్‌షెల్టర్లకు రూ.15 లక్షలు, పట్టణంలోకి ప్రవేశించే నాలుగు ముఖద్వారాల్లో ఆర్చీల నిర్మాణానికి రూ.80 లక్షలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు రూ.3 కోట్లు, శ్మశానవాటిక స్థలం కొనుగోలుకు రూ.కోటి, మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి రూ.5 కోట్లు, భిక్షాటన చేసే వారి కోసం ప్రత్యేక షెల్టర్ నిర్మాణానికి రూ.30 లక్షలు, మూత్రశాలల నిర్మాణాలకు రూ.2.90 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.2.70 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. హుజూర్నగర్ నగర పంచాయతీ.. హుజూర్నగర్ నగర పంచాయతీ ప్రణాళిక రూ. 62.82 కోట్ల ప్రతిపాదనలు రూపొందించారు. తాగునీటి సరఫరాకు రూ.12.80 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.3.65 కోట్లు, డ్రెయినేజీలకు 19.45కోట్లు, సీసీరోడ్ల నిర్మాణాలకు రూ.20.55 కోట్లు, వీధిలైట్లకు రూ.5.35 కోట్లు, చెత్త డంపింగ్ యార్డు నిర్మాణానికి కోటి రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దేవరకొండ నగర పంచాయతీ.. దేవరకొండ నగర పంచాయతీ ప్రణాళిక రూ.84 కోట్లతో సిద్ధం చేశారు. దీంట్లో తాగునీటి సరఫరాకు రూ.12 కోట్లు, మురికి కాల్వల నిర్మాణాలకు రూ.36 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.30 కోట్లు, వీధి దీపాలకు రూ.2 కోట్లు, చెత్త డంపింగ్ యార్డుల నిర్మాణాలకు రూ.2 కోట్లు, శ్మశానవాటికలు నిర్మించేందుకు రూ.2 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. కోదాడ మున్సిపాలిటీ.. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం రూ.110 కోట్లతో ప్రణాళిక రూపొం దించారు. దీంట్లో తాగునీటి సరఫరాకు రూ.7.60 కోట్లు, డ్రెయినేజీలకు రూ.28.61 కోట్లు, సీసీ రోడ్లకు రూ. 3 7.36 కోట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు రూ.7.85 కోట్లు, శ్మశాన వాటికలకు రూ.7.65 కోట్లు, కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణాలకు రూ.2.08 కోట్లు, పార్కుల నిర్మాణాలకు రూ.6.30 కోట్లు కేటాయించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ.. మిర్యాలగూడ మున్సిపాలిటీకి మొత్తం రూ. 91.03 కోట్లతో ప్రణాళిక రూపొం దించారు. దీనిలో డ్రెయినేజీలకు రూ.36.93 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.41.70 కోట్లు, వీధిలైట్లకు రూ.5.22 కోట్లు, తాగునీరుకు రూ.3.10 కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.28 లక్షలు, బోర్లుకు రూ.3 కోట్లు, ఆట స్థలాల అభివృద్ధికి రూ.80 లక్షలు కేటాయించారు. -
ఎంట్రీ.. ఎంత కష్టమో!
నీలగిరి : సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమం చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 19వ తేదీన (ఒక్క రోజు) ఇంటింటికీ తిరిగి సేకరించిన కుటుంబ వివరాలను కంప్యూటరీకరించడంలో సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ నాటికి మొత్తం కుటుంబ వివరాలు కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాల్సి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం గడువు కంటే ముందుగానే ఈ డాటా మొత్తాన్ని ఈ నెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ అనేకచోట్ల కావాల్సిన కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరతతో ఆలస్యమవుతోంది. దీంతోపాటు తీవ్రమైన విద్యుత్ కోతల కారణంగా సిబ్బంది అనుకున్నంత స్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. పలుచోట్ల కాలేజీల్లో పాతపడిన కంప్యూటర్లను వాడుతుండడం వల్ల డాటా ఎంట్రీ ముందుకు సాగడం లేదు. ప్రధానంగా సర్వే అప్పుడు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. దీంతో ఎంట్రీ సిబ్బంది మళ్లీ ఆయా కుటుంబాలకు ఫోన్లు చేసి వివరాలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అధికారులు నిర్ణయించిన ప్రకారం ఒక్కో ఆపరేటర్ రోజుకు 60 ఫారాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయాల్సి ఉండగా..20 నుంచి 30 ఫారాలకు మించి దాటట్లేదు. గడువులోగా పూర్తయ్యేనా..? జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 11,69,690 కుటుంబాల వివరాలు సేకరించారు. దీంట్లో శనివారం సాయంత్రం వరకు అధికారుల ఇచ్చిన సమచారం మేరకు 4,06,394 కుటుంబాల వివరాలను మాత్రమే కంప్యూటర్లలో నమోదు చేశారు. ఇంకా 7,63,296 కుటుంబాల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం విధించిన గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. గడువు సమీపిస్తుండడంతో అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. ఎంట్రీ కార్యక్రమం వేగవంతం చేయాలని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా డివిజన్ అధికారులను ఆదేశించినప్పటికీ పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. నల్లగొండ డివిజన్లో 2,39,459 కుటుంబాలు సర్వే చేశారు. వీటిల్లో కేవలం 1,07,966 కుటుంబాలకు చెందిన వివరాలను మాత్రమే కంప్యూటర్లలో ఎంట్రీ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో 53 వేల కుటుంబాలు కాగా ఇప్పటివరకు కేవలం 4 వేల కుటుంబాల వివరాలు మాత్రమే కంప్యూటర్లో నమోదు చేశారు. కంప్యూటర్లలో సాంకేతికలోపాలు తలెత్తడం వల్ల ఎంట్రీ ఆలస్యంగా జరుగుతోంది. చర్లపల్లి సమీపంలోని నిట్స్ కాలేజీలో మరో సెంటర్‌ను పెట్టారు. ఇక్కడ 20 కంప్యూటర్ల ద్వారా 40మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ చేస్తున్నారు. భువనగిరి డివిజన్లోని సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ప్రధానంగా సర్వర్ డౌన్ సమస్య అన్నిచోట్లా ఉంది. సర్వర్లు డౌన్ అయితే రెండు గంటల వరకు ఓపెన్ కావడంలేదు. భువనగిరిలోని ఆరోర, వాత్సల్య, శారద, కేబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్లు, బీబీనగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల, బొమ్మలరామారం మండలం చీకటి మామిడి ప్రొగ్రేస్, భూదాన్‌పోచంపల్లి దేశ్ముఖిలోని సెయింట్ మేరి ఇంజినీరింగ్ కళాశాలలో పాత కంప్యూటర్ల వాడకం వ ల్ల సమస్య ఎక్కువగా ఉంది. దీంతో డాటా ఎంట్రీ చేస్తున్నప్పటికీ ఆప్‌లోడ్ కావడంలేదు. భువనగిరిలో వాత్సల్య, శారదా కళాశాలల్లో పాత కంప్యూటర్లతో డాటా ఎంట్రీ అపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజుకు 20 ఫారాలకు మించి ఎంట్రీ చేయడం కష్టంగా ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో కరెంట్ కోతలు ఇబ్బందిపెడుతున్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో ఆపరేటర్లు నిరసన తెలిపారు. మునుగోడు మండలానికి సంబంధించి డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఎన్యుమరేటర్లు పూర్తిస్థాయిలో సర్వే ఫారాలు నింపకపోవడంతో వీఆర్వోలు వివరాలు సేకరించి, ఇచ్చాక డాటా ఎంట్రీ చేస్తున్నారు. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా 180 కంప్యూటర్లు, దేవరకొండ నగర పంచాయతీలో 20 వార్డులకు 20 కంప్యూటర్లు ఉపయోగించి డాటా ఎంట్రీ చేస్తున్నారు. కంప్యూటర్ల కొరత, రాత్రి వేళ డాటా ఎంట్రీ చేయడం కోసం ఆపరేటర్లు హాజరవడం లేదు. ఒక్కో ఎంట్రీకి 5 రూపాయలు మాత్రమే ఇస్తుండడంతో ఒక్కో ఆపరేటర్ రోజుకు 50 నుంచి 70 ఫారాలు ఎంట్రీ చేస్తుండగా అతనికి కేవలం రూ.300 కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఆపరేటర్లు ఒక రోజు వచ్చిన వారు మరుసటి రోజు రావడానికి సుముఖత చూపడం లేదు. దీంతో ఆపరేటర్ల కొరత ఎక్కువగా ఉంది. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర సర్వే ద్వారా మున్సిపల్ అధికారులు మొత్తం 21వేల కుటుంబాలను గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ఐదు రోజులుగా పట్టణ పరిధిలోని క్రాంతి కళాశాల, మండల పరిధిలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటరీకరిస్తున్నారు. అయితే నెట్ నెమ్మదిగా ఉండడంతో పనివేగంగా జరగడం లేదు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో 14, ఆర్డీఓ కార్యాలయంలో 6 కంప్యూటర్లు ద్వారా డాటా ఎంట్రీ చేస్తున్నారు. 40 మంది ఆపరేటర్లు రెండు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అనుభవం లేని కంప్యూటర్ ఆపరేటర్ల వల్ల ఇప్పటివరకు కేవలం 2,300 కుటుం బాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. శనివారం మ రో 20 కంప్యూటర్లను తెప్పించారు. కానీ డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉంది. సూర్యాపేట మండలం బాలెంల గ్రామ సమీపంలోని అరవిందాక్ష ఇంజినీరింగ్ కళాశాలలో తుంగతుర్తి, తిరుమలగిరి, సూర్యాపేట అర్బన్ కుటుంబాలకు సంబంధించిన వివరాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఇందుకు 90 కంప్యూటర్లు అవసరం ఉండగా 52 కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. ఎంట్రీ ఆపరేటర్లను 52 మందిని, 52 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. వీరు గంటకు ఆరు నుంచి పది కుటుంబాల సర్వే వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. విద్యుత్ సమస్య కొంత ఉన్నప్పటికీ ఇన్వర్టర్లు ఉండడంతో కంప్యూటరీకరణ చేయడం పట్ల ఇబ్బంది కలగడం లేదు. కానీ కంప్యూటర్లు సరిపడా లేకపోవడం, సర్వర్ల సమస్య, ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం వల్ల ఎంట్రీ ఆలస్యమవుతోంది.