Nupur Sharma
-
నూపుర్ శర్మ వ్యతిరేక నినాదాల కేసులో నిందితులకు ఊరట
జైపూర్: బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులకు ఊరట లభించింది. మొయినుద్దీన్ చిష్తీ దర్గా(రాజస్థాన్) పెద్దతో పాటు మరో ఆరుగురిని మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది అజ్మీర్ కోర్టు. రెండేళ్ల కిందట.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే.. మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ ఇస్లాం గ్రూపులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో.. మొయినుద్దీన్ చిష్తీ దర్గా నిర్వాహకుడు ఖాదీమ్ గౌహర్ చిస్తీ, మరో ఆరుగురు కలిసి నూపుర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. దీంతో.. అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ గౌహర్ చిస్తీతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని పోలీసులు జూలై 14, 2022న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అందరినీ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ విడుదలకు ఆదేశాలిచ్చింది. -
రాయ్‌బరేలీ బీజేపీ అభ్యర్ధిగా నుపుర్ శర్మ?
సాక్షి, లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మరోసారి చర్చాంశనీయమయ్యారు. గత కొన్ని దశబ్ధాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా నుపుర్ శర్మ బరిలోకి దిగనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో ఓ వర్గాన్ని కించ పరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆమెపై సస్పెన్షన్ ఎత్తేసి బరిలోకి దింపాలని బీజేపీ యోచినట్లు సమాచారం. రాయ్‌బరేలీ బరిలో నుపుర్ శర్మ? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్ధులను బరిలోకి దించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్ధి దశ నుంచి బీజేపీ అనుబంధ సంఘాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన నుపుర్ శర్మను రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దించేతే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న సోనియా ఇక అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వరుసగా 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఈసారి రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దించాలా’ అని హస్తం నేతలు సైతం మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే సోనియా తనయ ప్రియాంక గాంధీ వాద్రా పేరు ఇక్కడ పరిశీలనలో ఉంది. నిశితంగా గమనిస్తున్న బీజేపీ రాయ్‌బరేలీ.. ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ ఏ పార్టీ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. బీజేపీ సైతం తన అభ్యర్ధి ఎవరనేది తేల్చలేదు. ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీ కూటమి అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తుందా? అని కమలం నిశితంగా పరిశీలిస్తుంది. మూడోసారి అధికారంలోకి రావాలని లోక్ సభ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కషాయ పార్టీ ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ సీటును నుపుర్ శర్మకు కేటాయిస్తుందా? లేదా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. నుపుర్ శర్మ ఎవరు? న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించారు. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితేనేం నుపురు దూకుడును మెచ్చి.. అంతపెద్ద వివాదం ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో.. అదీ రాయబరేలీ అభ్యర్ధిగా ఆమెను బీజేపీ పోటీ చేయించబోతుందన్న ఊహాగానం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. -
నో ఛేంజ్.. దసరాకి టైగర్ వేట కన్ఫర్మ్
రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లు దసరాకి అక్టోబర్ 20నే విడుదల చేస్తామనీ చిత్రబృందం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబర్ 20న విడుదల కావడం లేదంటూ కొన్ని శక్తులు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి. ఆ వదంతులను నమ్మవద్దు. మీకు (ప్రేక్షకులు) అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాం. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మయాంక్ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్ మది. -
Nupur Sharma: నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ
ఢిల్లీ: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. కిందటి ఏడాది ఓ టీవీ డిబేట్లో ఆమె ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు.. యావత్ ప్రపంచంలోనూ మంట పుట్టించాయి. ఆపై ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూడా. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని, తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె ఎప్పటి నుంచో పోలీసులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కోరారామె. ఈ నేపథ్యంలోనే ఆమెకు గన్ లైసెన్స్ జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ లైసెన్స్ ఆధారంగా ఆమె ఆత్మ రక్షణ కోసం తుపాకీని వెంట పెట్టుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు.. సుప్రీం కోర్టు సైతం ఆమె భద్రత కారణాల దృష్ట్యా.. దేశంలో ఆమెపై దాఖలైన(దాఖలు అవుతున్న కూడా) ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని ఆదేశించి ఆమెకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు కొన్నినెలల ముందు.. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె తక్షణ క్షమాపణలు చెప్పాల్సిందని అభిప్రాయపడింది. బాధ్యత గల న్యాయవాది వృత్తిలో అనుభవం ఉండి.. సోయి లేకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో విద్వేషాలకు దారి తీసిందని, పరిణామాలకు ఆమె ఒక్కతే బాధ్యత వహించాలంటూ కూడా అభిప్రాయపడింది. ఇక నూపుర్‌కు మద్దతు వ్యాఖ్యలు చేసినందుకే.. రెండు హత్యలు జరగడం దేశాన్ని కుదిపేసింది కూడా. రాజస్థాన్ ఉదయ్‌పూర్ ఓ టైలర్‌ను, ఆపై మహారాష్ట్ర అమరావతిలో ఓ ఫార్మసిస్ట్‌ను దారుణంగా హతమార్చారు. మరోవైపు ఆమెను హతమారుస్తామంటూ కొందరు వీడియోల ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డంతో ఆమె కొన్నాళ్లూ అజ్ఞాతంలోనూ గడిపారు. -
నూపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట
న్యూఢిల్లీ: బీజేపీ సస్పెండెడ్ నేత, న్యాయవాది నూపుర్ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం కమ్యూనిటీ మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ‘‘ఆదేశాలు జారీ చేసేప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది’’ అని పిటిషనర్‌కు సూచించారు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్. దీంతో పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్ శర్మ కామెంట్లపై అరబ్ దేశాల నుంచి, భారత్‌లోని ఇస్లాం కమ్యూనిటీ నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగింది. అయితే తదుపరి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తూ.. అరెస్ట్ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. ఇదీ చదవండి: పక్కా ప్లాన్.. అయినా దుస్థితికి కారణాలేంటి? -
Nupur Sharma: నూపుర్ శర్మకు భారీ ఊరట
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ప్రాణ హాని ఉందన్న ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఆమె వినతి పిటిషన్‌కు సానుకూలంగా స్పందించింది. ఆమెపై దాఖలైన అన్ని కేసులన్నింటిని కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఐఎఫ్ఎస్వో యూనిట్‌కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను బుధవారం ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను సైతం నూపుర్ శర్మకు ఇస్తున్నట్లు తెలిపింది. తనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయని, అయితే విచారణ నిమిత్తం తాను అక్కడికి వెళ్తే దాడులు జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నూపుర్ శర్మ.. సుప్రీంలో వినతి పిటిషన్ వేసింది. కాబట్టి, తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఈ మేరకు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కొత్తగా ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం పేర్కొంది. గతంలో ఇదే బెంచ్.. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి. ఆమెవి అహంకారపూరిత వ్యాఖ్యలు’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది కూడా. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్(ఐఎఫ్ఎస్వో) అనేది ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం. ద్వారకాలో దీని ఆఫీస్ ఉంది. ప్రధానమైన కేసులతో పాటు సున్నితమైన అంశాలను ఇది పరిశీలిస్తుంటుంది. ఇదీ చదవండి: మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి-నూపుర్ -
రాథోడ్ సాబ్.. నీ కొడుక్కి ధైర్యం ఎక్కువే!
భోపాల్: రైలు పట్టాలపై బీటెక్ కుర్రాడి మృతదేహం పడి ఉండడం, ఈ ఘటనకు ఉదయ్‌పూర్ టైలర్ హత్యోదంతంతో ముడిపడి ఉందన్న కుర్రాడి తండ్రి అనుమానాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ సియోని-మాల్వాకు చెందిన నిషాంక్ రాథోడ్(20).. రాయ్‌సెన్ ఒబయ్‌దుల్లాగంజ్ పట్టణంలో హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. సోదరిని కలుస్తానని చెప్పి హాస్టల్ నుంచి శనివారం బయలుదేరాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమెను కలిసి.. ఆపై తిరిగి హాస్టల్‌కు చేరుకోలేదు. అయితే కాసేపటికే అతని తండ్రికి, ఇతర స్నేహితులు, బంధువులకు అతని ఫోన్ నుంచి ఓ బెదిరింపు మెసేజ్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన నిషాంక్ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే సమీపంలోని ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించాడు నిషాంక్. రైలు మీది నుంచి వెళ్లడంతో అతని శరీరం ఛిద్రమైపోయింది. నిషాంక్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ తరుణంలో తొలుత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. Dead body of Nishank Rathore, an engineering student, found on railway track in Bhopal, Madhya Pradesh. A WhatsApp message of "Sar Tan Se Juda" was sent from his mobile to his father & his friends. A story of "Sar Tan Se Juda" was uploaded from his Instagram account. pic.twitter.com/CZOowSw6dr — Anshul Saxena (@AskAnshul) July 25, 2022 అయితే నిషాంక్ తండ్రి ఉమా శంకర్ రాథోడ్.. తన కొడుకు ఫోన్ నుంచి తన ఫోన్‌కు వచ్చిన సందేశాల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు వ్యవహారం మొదలైంది. ‘.. తల వేరు చేయబడింది’ అంటూ ఉంది ఆ సందేశంలో. అంతేకాదు.. ‘రాథోడ్ సార్.. మీ అబ్బాయి చాలా ధైర్యశాలి’ అంటూ ఆ సంభాషణ నడిచింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నాడు. Guztakh-e-Nabi ki Ek hi Saja, Sar Tan se Juda అనే మాటల్ని.. ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య టైంలో హంతకులు ఉపయోగించారు. దీంతో తన కొడుకును చంపేసి ఉంటారని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఒంటరిగా కనిపించాడని, అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. చదవండి: హారన్ కొడితే తప్పుకోలేదని.. చెవిటి వ్యక్తిని చంపేసింది -
Nupur Sharma: బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి
భోపాల్: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతు చెప్తున్న వాళ్లపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఉదయ్‌పూర్, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్‌లో ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక. బుధవారం అగర్-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ అయిన ఆయూష్ జడమ్(25).. స్థానిక మీడియాలో బహిరంగంగా నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఉదయం స్థానిక టోల్ బూత్ నుంచి బైక్‌పై వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేసింది ఓ గ్రూప్. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉజ్జయిని ఆస్పత్రిని తరలించారు. దాడికి పాల్పడిందంతా స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. मप्र के आगर मालवा में एक बजरंग दल कार्यकर्ता पर हमला हो गया,आरोप है कि #नुपुर_शर्मा का समर्थन करने की वजह से ये हमला हुआ है,मामले में 13 लोगों के खिलाफ मामला दर्ज किया गया है जिनमें से दो को गिरफ्तार कर लिया गया है, घटना के बाद शहर में तनाव की स्थिति बन गई है @ndtv @ndtvindia pic.twitter.com/wRD1vT39PH — Anurag Dwary (@Anurag_Dwary) July 20, 2022 ఇదీ చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే- సుప్రీంకోర్టు -
నూపుర్ శర్మను చంపేందుకు దేశ సరిహద్దు దాటిన పాకిస్థానీ
జైపూర్: నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడ్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో జులై 16న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐబీ సహా ఇతర నిఘా సంస్థల బృందం అతడ్ని విచారిస్తోంది. జులై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందుమల్‌కోట్ సరిహద్దు అవుట్‌పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కన్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అతని పేరు రిజ్వాన్ అశ్రఫ్ అని, పాకిస్థాన్‌లోని ఉత్తర పంజాబ్ మండీ బౌహద్దీన్ నగర వాసినని చెప్పాడని వెల్లడించారు. అతని వద్ద 11 అంగుళాల కత్తితో పాటు బ్యాగులో మతానికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, ఆహారం, మట్టి ఉన్నట్లు గుర్తించామన్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేందుకే తాను దేశం దాటి వచ్చినట్లు రిజ్వాన్ ప్రాథమిక విచారణలో చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా.. 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు -
నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘ఆమెకు ప్రాణహాని ఉంది నిజమే’
న్యూఢిల్లీ: నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎక్కడా కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మకు ప్రాణహాని ఉన్నది నిజమేనని వ్యాఖ్యానించింది. ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నూపుర్ శర్మపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసే విషయంపై ఆగస్టు 10లోగా స్పందన తెలపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, జుమ్ముకశ్మీర్, అస్సాం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది. జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది. ఆ తర్వాతి నుంచే నూపుర్ శర్మను చంపేస్తామనే బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ ఛిస్తీ, యూపీ చెందిన వ్యక్తి.. నూపుర్ శర్మను హతమారుమాస్తామని బెదిరించిన విషయాలను ప్రస్తావించారు. చదవండి: వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
వాట్సాప్‌లో నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో పొడిచారు!
పాట్నా: నూపుర్ శర్మకు సంబంధించిన వివాదాస్పద వీడియోను చూశాడని, ఆమెకు మద్దతుగా ఆ వీడియోను తన వాట్సాప్‌లో స్టేటస్‌లో పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై కత్తులతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు కొందరు!. బీహార్ సీతామర్హిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత పోలీసులు ఈ ఘటనను గ్రూప్ తగాదాగా భావించారు. లోకల్ పొగాకు మత్తులో దాడి జరిగిందని ప్రకటించారు. అయితే.. బాధితుడు మాత్రం ఉద్దేశపూర్వకంగా తనపై దాడి జరిగిందని పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం బాధితుడు అంకిత్ ఝా.. దర్భంగా నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతున్నాడు. నూపుర్ శర్మ వీడియోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్న తర్వాతే దాడి జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. నన్పూర్ పీఎస్ పరిధిలో జులై 15వ తేదీ సాయంత్రం ఘటన జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజే నలుగురు దుండగుల్లో ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. తొలుత పాన్ షాప్ దగ్గర సిగరెట్ తాగే విషయంలో గొడవ జరిగిందని భావించాం. అయితే.. నూపుర్ శర్మవీడియో వల్లే దాడి జరిగిందని బాధితుడు చెప్తున్నాడు. అందుకే దర్యాప్తు చేపట్టాం అని సీతామర్హి ఎస్పీ హర్ కిషోర్రాయ్ తెలిపారు. దాడికి సంబంధించినదిగా చెబుతూ.. ఓ వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. A youth was stabbed by a Special Community in #Sitamarhi, Bihar and slogans of 'Allah Hu Akbar' were raised as the youth was watching a video of BJP's former leader #NupurSharma. pic.twitter.com/Do3oBsjsfY — Nikhil Choudhary (@NikhilCh_) July 19, 2022 -
మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊహించని స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాక.. బెదిరింపులు, వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె తాజా అభ్యర్థన పిటిషన్‌ను అదే బెంచ్ ముందు దాఖలు చేశారు. తన అరెస్టును నిలువరించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె మరోసారి కోర్టులో అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఆమె పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టే అవకాశం ఉంది. గతంలో విచారణ సందర్భంగా ఆమె అభ్యర్థనపై స్పందించిన బెంచ్.. సంబంధిత హైకోర్టు(ఢిల్లీ)ను సంప్రదించాలని ఆమె తరపు న్యాయవాదికి సూచించారు. అయినప్పటికీ ఆమె మరోసారి సుప్రీంను ఆశ్రయించడం విశేషం. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జులై 1వ తేదీన నూపుర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు నిరసన సెగ తగిలింది. అంతేకాదు పలువురు మేధావులు, రిటైర్డ్ జడ్జిలు, బ్యూరోక్రట్లు, రాజకీయ నేతలు సైతం తీవ్రంగా తప్పుబడుతూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఒక బహిరంగ లేఖ రాశారు కూడా. అయితే ఆ నాటి నుంచి తనకు అత్యాచార, చావు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయని ఆమె తాజా అభ్యర్థనలో పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని ఢిల్లీకి బదలాయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఆమె సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ గ్యాప్‌లో ఆమెపై మరో మూడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు కావడం గమనార్హం. చదవండి: బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి! -
మోదీ ఇలాకాలో నూపుర్ శర్మ పోస్టు కలకలం.. బెదిరింపు కాల్స్
మహ్మాద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. కాగా, తాజాగా నూపుర్ శర్మ విషయంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూపుర్ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. ఇక, అదుపులోకి తీసుకున్న వారిలో మహ్మద్ అయాన్ అటాష్బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. ఇక, వీరంతా సూరత్ నివాసితులుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అనంతరం.. సదరు వ్యాపారవేత్త వెంటనే సోషల్ మీడియా ఖాతా నుంచి నూపుర్ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు. #Gujarat: नूपुर शर्मा के समर्थन में इंस्टाग्राम पर पोस्ट डालने वाले सूरत के व्यापारी को मिली थी जान से मारने की धमकी, धमकी देने वाले 6 में से 3 आरोपी गिरफ्तार।#Surat #NupurSharma #NupurSharmaControversy #BJP #InstagramPost pic.twitter.com/7Ty4VDm7m8 — India Voice (@indiavoicenews) July 16, 2022 ఇది కూడా చదవండి: తమిళనాట రాజకీయ చదరంగం: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి -
బీజేపీపై సీఎం గహ్లోత్ సంచలన ఆరోపణలు
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీతో సంబంధాలున్నాయన్నారు. ఈ విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు. నిందితుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విషయం ఇటీవలే తెలిసింది. అతను అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలుపెట్టకముందే బీజేపీ కార్యకర్తలు నిందితుడు తమ వాడని పోలీసులకు చెప్పారు. పార్టీ కార్యకర్త అయినందున అతనికి ఎలాంటి ఇబ్బంది కల్గించవద్దన్నారు' అని గహ్లోత్ అన్నారు. హత్య కేసు నిందితుడిపై పోలీసు కేసు నమోదు కాకుండా ఆపేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందని గహ్లోత్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తే అని పోలీసులకు చెప్పి అతనికి సాయం చేయాలని చూసిందని పేర్కొన్నారు. వీటిపై కమలం పార్టీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తారీ.. బీజేపీ నేతలతో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ఇందులో రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కమలం పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాగా, జూన్ 28న జరిగిన ఉదయ్‌పూర్ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరునాడే కేసు దర్యాప్తును ఎన్ఐఏ తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. చదవండి: Goa: గోవాలో కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీతో టచ్‌లో 11 మంది ఎమ్మెల్యేలు! -
పిస్తోళ్లు, గునపాలు సిద్ధం చేసుకోండి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో తుపాకులు, గునపాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చే లోపే దుకాణాలు తగలబడిపోతున్నాయని పేర్కొన్నారు. వారు మాత్రం ఎంతసేపు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. విక్రమ్ సైనీ ముజఫర్‌పుర్ జిల్లా ఖాతౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాన్సఠ్లోని వాజిద్పుర్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజీవ్ బాలియన్తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 'ఒకట్రెండు రాళ్ల డబ్బాలు, 4-5 గునపాలు, రెండు పిస్తోళ్లు మీ దుకాణాల్లో ఉంచుకోండి ' అని అన్నారు. ఆపేందుకు ప్రయత్నించినా విక్రమ్ సైనీ మాట్లాడే సమయంలో స్టేజీపై ఉన్న మరో నేత ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 'ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది, పేపర్లు, టీవీల్లో రావాలి. నన్ను ఐదేళ్ల పాటు ఎవ్వరూ పదవి నుంచి తప్పించలేరు. ఆ తర్వాత నాకు ఏ ఆశా లేదు' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారి దుమారం రేపింది. నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని ఉదయ్‌పూర్‌లో హత్య చేసిన విషయాన్ని కూడా విక్రమ్ ప్రస్తావించారు. ఆమెకు అనుకున్నది మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు. చదవండి: Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. -
నూపుర్ శర్మ, బ్యాంకు దోపిడీలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్.. విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈడీలు, సీబీఐలు బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకోవు అని ప్రశ్నించారు. ఒక్క బ్యాంకు దోపిడీదారుడినైనా ఎందుకు తీసుకురాలేదు. దేశంలో అమాయకులపైనే మీ ప్రతాపమా.?. దోపిడీదారులకు మాత్రం లక్షలకోట్లు దోచిపెడుతున్నారు. 12 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో మోదీ వాటా ఎంతో చెప్పాలి. తెలంగాణలో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తామని మాట్లాడాతారా. ఏకానాథ్ షిండేలను సృష్టాస్తామని బాహాటంగా చెబుతున్నారు ఇలాదే మీ సంస్కారం. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హంతకులు కారా అని ప్రశ్నించారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని బీజేపీ గుర్తుంచుకోవాలి. పార్టీలను భయపెడతారు.. నాయకులను భయపెడతారు.. ఇదేం ప్రభుత్వం..?. ఏ వ్యవస్థపైనా బీజేపీకి గౌరవం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ న్యాయమూర్తులకు సెల్యూట్ చేస్తున్నాను. నూపురు శర్మ వ్యాఖ్యలను తప్పుపడితే సుప్రీంకోర్టుపైనా లేఖలు రాయిస్తారా అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరిస్తున్నారు.. ఇది కరెక్టేనా..?. సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయని కండకావరమా బీజేపీ..?. జడ్డీలను కూడా ట్రోలింగ్ చేస్తారా..?. దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కోర్టులు, జర్నలిస్టులు అంటే కేంద్రానికి గౌరవం లేదు. మేకిన్ ఇండియా పథకం అట్టర్ ప్లాప్ అయింది. పెట్టుబడిదారుల కోసం పీఎం సెల్స్‌మెన్‌గా మారారు.మన జాతీయ జెండాలు చైనా తయారు చేయడం మేకిన్ ఇండియానా..?. పతంగులు, దారాలు కూడా మనం తయారు చేయాలేమా..?. దేశంలో రైతులకు సబ్సిడీ ఇవ్వరు. బీజేపీ నేతలు ప్రజా హంతకులు కారా..?. బీజేపీ కండువా కప్పుకోగానే కొందరు అవినీతికి పాల్పడిన నేతలకు నోటీసులు ఆగిపోయాయి. వారంతా బీజేపీలోకి వెళ్లగానే వారంతా పవిత్రం అయిపోతారా..?. చివరకు దేశ సైన్యం విషయంలో కూడా ఉన్మాదంతో ప్రవర్తిస్తారా..?. మీ వికృత రాజకీయాల కోసం కశ్మీర్ పండిట్లను బలి తీసుకుంటారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది కూడా చదవండి: మీకు అది కూడా చేతకాదా మోదీ జీ.. కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు -
నూపుర్ శర్మ అరెస్టు పిటిషన్.. అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: నూపుర్ శర్మను అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఇందార బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన విశ్రాంత ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను మొదట రిజిస్ట్రార్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. అయితే ఇప్పటికే ఈ పిటిషన్ రిజిస్ట్రార్ ముందు ఉందని, జులై 11న దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది అత్యున్నత ధర్మాసనానికి తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ వల్ల దేశ, విదేశాల్లో అనిశ్చితి, అశాంతి నెలకొందని పిటిషన్ పేర్కొంది. ఆమె వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆమెపై ఫిర్యాదులు నమోదైనా.. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లాడు. నూపుర్ శర్మను తక్షణమే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించాలని అభ్యర్థించాడు. చదవండి: సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపు లేఖ.. వదిలిపెట్టేది లేదంటూ.. -
నూపుర్ శర్మను చంపిన వారికి ఆస్తినంతా రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్
జైపూర్: నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నూపుర్ శర్మ తల తెచ్చిన వారికి తన ఇల్లుతో పాటు ఆస్తినంతా రాసిస్తానని సల్మాన్ ఓ వీడియో విడుదల చేశాడు. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన ఆమెను హతమార్చాలని పిలుపునిచ్చాడు. తాను అజ్మేర్ దర్గా నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. వీలుంటే తానే ఆమెను తుపాకీతో కాల్చి చంపేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు దేశంలోని ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, అనేక చోట్ల తమపై దాడులు జరుగుతున్నాయని చెప్పాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సల్మాన్‌ను అరెస్టు చేశారు. సల్మాన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అజ్మీర్ దర్గా ప్రతినిధులు స్పష్టం చేశారు. దర్గా పవిత్ర స్థలం అని, అలాంటి చోట ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సల్మాన్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని, అతనిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా, నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ ఉదయ్పుర్లో కన్నయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు ఇటీవలే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతడిని హత్య చేసిన అనంతరం వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు ఇద్దరు నిందితులను మూడు గంటల్లోనే అరెస్టు చేశారు. -
నూపుర్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం
ఢిల్లీ: అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే ఆమెకు మద్దతుగా.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌పైనా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పదిహేను మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. నూపుర్ శర్మ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. నూపుర్ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని(ఉదయ్‌పూర్ ఘటనను ఉద్దేశించి) బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది. అయితే సుప్రీం కోర్టు బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్.. నూపుర్‌ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, జమ్ము అండ్ లడఖ్ అనే సంస్థ లెటర్‌ను రిలీజ్ చేసింది. నూపుర్‌పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది. An open letter has been sent to CJI NV Ramana, signed by 15 retired judges, 77 retd bureaucrats & 25 retd armed forces officers, against the observation made by Justices Surya Kant & JB Pardiwala while hearing Nupur Sharma's case in the Supreme Court. pic.twitter.com/ul5c5PedWU — ANI (@ANI) July 5, 2022 చదవండి: న్యాయవాది అని నూపుర్ చెప్పుకోవడం సిగ్గుచేటు- నూపుర్ -
కామెంట్లపై కలకలం.. ‘అలాంటి అగత్యం దాపురించే ప్రమాదముంది’
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి అనాలోచిత, అవాంఛిత వ్యాఖ్యలతో దేశంలో చిచ్చు రేపిన నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన మౌఖిక వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేశాయి. వాటిపై హేతుబద్ధమైన విమర్శలతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సైతం ట్రెండ్ అయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని నుపుర్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డివాలాలతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించిన సందర్భంలో న్యాయమూర్తులు ఆమెపై కొన్ని మౌఖిక వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, మరో 60 మంది రాజకీయ నాయకులు, అధికారులకు సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని వేనోళ్ల పొగిడిన బీజేపీ శ్రేణులు, తాజాగా నుపుర్ కేసులో న్యాయమూర్తులు చేసిన మౌఖిక వ్యాఖ్యలను మాత్రం తూర్పారబట్టాయి. సోషల్ మీడియా వేదికగా వాటిపై విమర్శల వర్షం కురిపించాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఈ విమర్శలు సహజంగానే సుప్రీం న్యాయమూర్తులకు ఇబ్బంది కలిగించాయి. ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జస్టిస్ జేబీ పార్డివాలా మాట్లాడుతూ, ‘‘న్యాయమూర్తులపై సోషల్ మీడియా వ్యక్తిగత దాడులు ఓ ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దీనివల్ల చట్టం ఏం చెబుతుందో పట్టించుకోకుండా మీడియా ఏం వ్యాఖ్యానించనుందోనని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీర్పులు చెప్పాల్సిన అగత్యం దాపురించే ప్రమాదముంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘కోర్టు తీర్పులపై, మౌఖిక వ్యాఖ్యలపై నేను వ్యాఖ్యానించడం సరికాదు. ఒకవేళ నాకు తీవ్ర అభ్యంతరాలున్నప్పటికీ సరైన వేదికపై సరైన సమయంలోనే చర్చిస్తాను’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నిజానికి విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు చాలావరకు తుది తీర్పులో చోటుచేసుకోవు. వ్యాఖ్యలు, పరిశీలనలు వేరు... తీర్పులు వేరు. నుపుర్ పిటిషన్ విషయంలోనూ నిజానికి జరిగిందదే. ఆమె తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు, పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. పిటిషన్ విచారణార్హమైనది కాదని చెబుతూ, ఢిల్లీ హైకోర్టు గడప తొక్కాల్సిందిగా సూచించారు. తీర్పు కాని తీర్పు...! నుపుర్ పిటిషన్ విషయాన్ని పక్కన పెడితే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, పరిశీలనలే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చక్కర్లు కొట్టాయి. పత్రికల్లోనూ పతాక శీర్షికలయ్యాయి. పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా, న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలనే పెద్ద ఎత్తున చర్చించారు. వాటిపై సోషల్ మీడియాలో ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. నుపుర్ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన ఉదాసీనత, ఆమెను కాపాడేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు కూడా విమర్శలకు దారి తీశాయి. బీజేపీ మద్దతుదార్లు మరో అడుగు ముందుకేసి నుపుర్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వకుండానే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల ద్వారా ఆమెను దోషిగా బోనెక్కించిందనే వాదనను బలంగా విన్పించాయి. వ్యాఖ్యలొద్దన్న సుప్రీం తీర్పే శిరోధార్యం ఒకవేళ నుపుర్ శర్మ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ కోర్టయినా రికార్డుల్లో ఉన్న విషయాలనే చూస్తుంది. అంతే తప్ప మౌఖిక వ్యాఖ్యలను, పరిశీలనలను పరిగణనలోకి తీసుకోదు. ఇలాంటి మౌఖిక పరిశీలనలు లీగల్ పరిధిలోకి రావు కూడా. మరైతే న్యాయమూర్తులు ఇలాంటి మౌఖిక వ్యాఖ్యలు ఎందుకు చేస్తారనే అనుమానం రావచ్చు. ‘‘పిటిషన్ విచారణ సమయంలో తమ ముందుకొచ్చే అంశాల తీవ్రతను బట్టి న్యాయమూర్తులు అలాంటి అసంకల్పిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీర్పు వెలువరించే సమయానికి కేసుపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని తుది నిర్ణయానికి వస్తారు’’ అన్ని ఓ న్యాయ నిపుణుడి విశ్లేషణ. అయితే కోర్టుల మౌఖిక పరిశీలనలు, వ్యాఖ్యలు జనంలోకి వెళ్లి విపరీతమైన ప్రచారం పొందుతాయి. రాజకీయ నాయకులు సహజంగానే వాటినుంచి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అవి ఒకోసారి బెడిసికొడతాయి కూడా. ఉదాహరణకు 2007 గుజరాత్ ఎన్నికల్లో మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ‘మౌత్ కా సౌదాగర్’ వ్యాఖ్య ఆమెకే తిప్పికొట్టింది. ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. అయితే, మోదీపై సుప్రీంకోర్టు ‘నయా నీరో’ వ్యాఖ్యలు చేసిన తర్వాతే సోనియా ఆ వ్యాఖ్య చేయగలిగారన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం! అందుకే కోర్టు తన దృక్పథాన్ని తీర్పుల ద్వారా, లేదా లిఖితపూర్వక ఆదేశాల ద్వారా చెప్పాలే తప్ప మౌఖికంగా కాదన్నది నిపుణుల అభిప్రాయం. దీనిపై సుప్రీంకోర్టు కూడా గతేడాది స్పష్టతనిచ్చింది. ‘‘న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని తీర్పులు, ఆదేశాల ద్వారానే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. అంతే తప్ప రికార్డుల్లోకెక్కని మౌఖిక వ్యాఖ్యలతో కాదు’’ అని సూటిగా చెప్పింది. నిజానికి ఇదే ఉత్తమం కూడా. కదా! ఇది కొత్తేమీ కాదు... లిఖితపూర్వక తీర్పులో లేని అంశాలను మౌఖికంగా వ్యాఖ్యానించి న్యాయమూర్తులు విమర్శలకు గురికావడం ఇదదేమీ కొత్త కాదు. రాజకీయ పార్టీలు ఆ వ్యాఖ్యలను తమకు తోచిన విధంగా మలచుకుని లబ్ధి పొందాలని చూడటమూ కొత్త కాదు. 2002 గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు 2004లో చేసిన వ్యాఖ్యలను బీజేపీయేతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటికీ వాడుకుంటూ ఉంటుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని నయా నీరోగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఈ వ్యాఖ్యను మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా ప్రతిపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా తెరపైకి తెస్తున్నాయి. అయితే అల్లర్ల వెనక ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టేలా ఆ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, అదే కేసులో మోదీకి సిట్ ఇచ్చిన క్లీన్చిట్ మాత్రం సరైందేనంటూ ఇటీవలే తీర్పు ఇవ్వడం తెలిసిందే! విచారణ సందర్భంలో చేసే వ్యాఖ్యలకు చివర్లో ఇచ్చే తీర్పుకు పొంతన ఉండదనే విషయం దీంతో మరోసారి స్పష్టమైంది. విచారణలో భాగంగా సందర్భానుసారం వ్యక్తపరిచే వ్యాఖ్యలను కేవలం వ్యాఖ్యలుగానే చూడాలి. అంతే తప్ప వాటినే తీర్పుగా భావించకూడదు. అవి తుది తీర్పును ప్రభావితం చేయవు కూడా. తీర్పు ఎప్పుడూ సాక్ష్యాలు, చట్టాలకు లోబడే ఉంటుంది. -
రెచ్చిపోయి చితకబాదిన పోలీసులు.. కోర్టు సీరియస్
బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాద్‌లు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారి వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనల్లో భాగంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, ఉత్తర ప్రదేశ్‌లో కూడా నిరసనల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. షహరాన్‌పూర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ పోలీసులు లాఠీలు ఝళిపించారు. అల్లర్లలో పాల్గొన్నారని ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేసి.. లాకప్‌లో లాఠీలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో, వారి పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన స్థానిక కోర్టు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసిన 8 మంది అలర్లల్లో పాల్గొన్నారనేందుకు సాక్ష్యాలను పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వారిని నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించింది. ఇక, పోలీసులు దారుణంగా కొట్టడంతో మహ్మద్ అలీ అనే వ్యక్తి చేయి విరిగిపోయింది. ఇదిలా ఉండగా.. షహరాన్‌పూర్‌లో పెద్దఎత్తున అల్లర్ల కారణంగా 300 మందికి పైగా వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు లాఠీలతో కొట్టిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే షలభ్ మణి త్రిపాఠి స్పందించారు. ఈ వీడియోకు ''అల్లరిమూకకు రిటర్న్ గిఫ్ట్'' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. news24official UP : उपद्रवियों की पुलिस ने की पिटाई, BJP नेता Shalabh Mani Tripathi ने शेयर किया वीडियो pic.twitter.com/yxbE18txaU — Zeyad Alam (@ZeyadAlam18) June 12, 2022 ఇది కూడా చదవండి: కర్కశకంగా కోటింగ్.. దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయిన చిన్నారి -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్‌పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్‌ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
నూపుర్ వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్.. కాంగ్రెస్ స్పందన.. ‘సిగ్గుతో ఉరేసుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇంతటి అవమానకర పరిస్థితుల్లో కాషాయ పార్టీ సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగడానికి నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని సుప్రీం చెప్పడం సరైంది. జరిగిన ఘటనలకు ఆమెదే పూర్తి బాధ్యత అని, జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాలని చెప్పడం ఆహ్వానించదగ్గది. అధికారం ఉందని విర్రవీగేవారికి సుప్రీం వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివి’ అని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి👉సోమవారమే ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి బల పరీక్ష ‘ఇందులో రహస్యమేమీ లేదు.. మత విద్వేషాలను రెచ్చగొట్టి కమళం పార్టీ లబ్ది పొందాలనుకుంటోంది. విధ్వంసపు విభజన భావజాలాలపై పోరాడే ప్రతి ఒక్కరికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ఎత్తుగడలు వేసే జాతీ విద్రోహ శక్తులపై పోరాటాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ ఆపదని తేల్చి చెప్పారు. అలాంటివారి వికృత చర్యలను భరత జాతి ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాగా, మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటా బయటా బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్తూ నూపుర్ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, తదనంతరం కూడా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈక్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక వాఖ్యలు చేసింది. చదవండి👉కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన Our statement on the Supreme Court's observations on the BJP Spokesperson's case pic.twitter.com/kCkxITGHVU — Jairam Ramesh (@Jairam_Ramesh) July 1, 2022 -
దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే
దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు నోటిపై ఆదుపు లేకపోవడం వల్ల దేశం మొత్తం అగ్ని గోళంగా మారే పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలో జరిగిన పరిణామాలకు ఆమె ఒక్కరే బాధ్యురాలని తేల్చిచెప్పింది. నిరసనలు, హింసాత్మక ఘటనలు, అల్లర్లకు దారితీసేలా మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. చీఫ్ పబ్లిసిటీ, రాజకీయ అజెండా లేదా నీచమైన ఎత్తుగడల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై, హైదరాబాద్, శ్రీనగర్ తదితర నగరాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఒక్కటిగా కలిపేసి, ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి అయినంత మాత్రాన దేశంలో అశాంతికి కారణమయ్యేలా మాట్లాడే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు మతాలను గౌరవించరని, రెచ్చగొట్టేలా ప్రకటనలు మాత్రమే చేస్తారని ఆక్షేపించింది. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్య త వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల చర్చను హోస్ట్ చేసిన టీవీ ఛానల్‌పైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘టీవీ చర్చ దేనికి? కేవలం ఒక అజెండాను ప్రమోట్ చేయడం కోసమేనా? కోర్టు పరిధిలోని అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు?’’అని నిలదీసింది. అధికారం ఉంది కదా! అని ఏదైనా మాట్లాడొచ్చని ఆమె అనుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నలకే నూపుర్ సమాధానం ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది మణీందర్ సింగ్ చెప్పారు. అలాగైతే యాంకర్‌పై నూపుర్ శర్మ ఫిర్యాదు చేసి ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. టీవీల్లో వివాదాస్పద ప్రకటనలు చేస్తూ దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించే రాజకీయ ప్రతినిధి స్వేచ్ఛతో జర్నలిస్టు స్వేచ్ఛను పోల్చలేమని వ్యాఖ్యానించింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన టైలర్ హత్యను ధర్మాసనం ప్రస్తావించింది. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా నూపుర్ శర్మ నోటి దురుసుతో బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టింది. ఆమెలోని అహంకారం పిటిషన్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. క్షమాపణలు చెబుతూ నూపుర్ రాసిన లేఖను న్యాయవాది మణీందర్ సింగ్ ప్రస్తావించారు. ధర్మాసనం స్పందిస్తూ.. టీవీ ఛానల్‌కు వెళ్లి ఆమె క్షమాపణలు చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో చాలా జాప్యం జరిగిందని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో షరతులతో వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని సూచించింది. ‘‘నూపుర్ కేసులు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేశారు. కానీ, నూపుర్‌పై నమోదైన కేసుల్లో ఆమెను అరెస్టు చేయలేదు. అదే ఆమె పలుకుబడిని సూచిస్తోంది’’అని ధర్మాసనం తెలిపింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆరెస్టు చేయకపోవడంతో బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని వెల్లడించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు తన పిటిషన్‌ను నూపుర్ ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి .. ప్రతిపక్షాల ఆగ్రహం నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు నూపుర్‌శర్మ ఒక్కరే కాదు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కారణమని దుయ్యబట్టారు. సర్కారు తీరు దేశ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలు విరుద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక సిగ్గుతో ఉరేసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించిందని చెప్పారు. నూపర్ శర్మపై చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌నుంచి అలాంటి వారు మరికొందరు పుట్టకొచ్చే ప్రమాదం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. నూపర్పై వ్యాఖ్యలను ధర్మాసనం ఉపసంహరించుకోవాలి : సీజేఐకి అజయ్ గౌతమ్ లెటర్ పిటిషన్ బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఒక లెటర్ పిటిషన్ సమర్పించారు. నూపర్ విషయంలో చేసిన వ్యాఖ్యలను వెకేషన్ బెంచ్ ఉపసహరించుకొనేలా తగిన ఆదేశాలుల లేదా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆమెపై పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం ఉంటుందని అభ్యర్థించారు. తన లెటర్ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని విన్నవించారు. నూపర్పై వెకేషన్ బెంచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అవాంఛనీయమని అజయ్ గౌతమ్ పేర్కొన్నారు. చదవండి: ఉదయ్‌పూర్ ఘటనను ఖండించిన దీదీ.. నూపుర్‌కు పరోక్ష హెచ్చరికలు -
టైలర్ కన్హయ్య హత్య కేసు.. సర్కార్ సంచలన నిర్ణయం
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య తర్వాత ఉదయపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా.. టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య నేపథ్యంలో ఉదయపూర్ ఇన్స్పెక్టర్ జనరల్, పోలీస్ సూపరింటెండెంట్‌తో సహా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి చెందిన 32 మంది అధికారులను బదిలీ చేశారు. కాగా, సున్నితమైన ఈ కేసు దర్యాప్తును దేశంలోని అత్యున్నత ఉగ్రవాద నిరోధక సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి కేంద్ర హోంశాఖ అప్పగించింది. ఈ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. కన్హయ్య లాల్ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్య కేసుపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని అన్నారు. హంతకులిద్దరికీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ హత్య కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి నేరస్థులను పట్టుకోగలిగామని అన్నారు. ఇదే సమయంలో హంతకులకు ఉగ్రవాద సంస్థలతో ఉన్న లింకులను సైతం కనుగొన్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఉదయ్‌పూర్ కంటే వారం ముందే మరో ఘటన!.. అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం