palle raghunath reddy
-
‘పల్లె’కు టికెట్ ఇస్తే పనిచేసేది లేదు
సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే పని చేసేది లేదని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పుట్టపర్తిలోని శిల్పారామంలో అసమ్మతి నేతలందరూ సమావేశమయ్యారు. కొండకమర్ల అల్లాబకష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆదర్శ పాఠశాలల అధినేత పెదరాసు సుబ్రహ్మణ్యం, దళవాయి వెంకట నారాయణ, మల్లెల జయరాం, వడ్డే సిమెంట్ పోలన్న, పీసీ గంగన్న తదితరులు పాల్గొని.. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేశారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలసి పని చేస్తామని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అంతేకానీ ఎవరికి పడితే వారికి టికెట్ ఇస్తే పని చేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. త్వరలోనే ఆశావహులందరూ కలసి ఒక సమూహంగా ఏర్పడి గ్రామగ్రామానికీ వెళ్తామన్నారు. సమావేశంలో చింతమానిపల్లి లక్ష్మీపతి నాయుడు, శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జరిపిటి కృష్ణమూర్తి, దిగుపల్లి రఘురాం రెడ్డి, ఓడీసీ మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వడ్డెర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పల్లపు జయచంద్ర మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు దండగల మారెప్ప తదితరులు పాల్గొన్నారు. -
పల్లెకు టికెట్ వద్దంటూ వాట్సాప్ సందేశాలు..
పుట్టపర్తి: టీడీపీ నేతలు అప్పుడే టికెట్ల కోసం పోరుబాట పట్టారు. రానున్న ఎన్నికల్లో తమకంటే తమకే టికెట్ ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అధిష్టానానికి తమ వాణి బలంగా వినిపిస్తున్నారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై నిరసన గళం వినిపిస్తూ వారి అరాచకాలు, అక్రమాలను బయటపెడుతున్నారు. తాజాగా పుట్టపర్తిలో తమ్ముళ్ల గ్రూపు రాజకీయం రచ్చకెక్కింది. పల్లెకు టికెట్ వద్దంటూ వాట్సాప్ సందేశాలు.. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లెకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగులుతోంది. గడచిన నాలుగేళ్లుగా పల్లెకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలు పెదరాసు సుబ్రహ్మణ్యం, మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న, ఓడీచెరువుకు చెందిన ఇస్మాయిల్ అసమ్మతి వర్గంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ టికెట్ ఈసారి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇవ్వకూడదంటూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండురోజులుగా పల్లెకు వ్యతిరేకంగా ఏకంగా వాట్సప్ సందేశాలను వైరల్ చేస్తున్నారు. టీడీపీ గ్రూపులతో పాటు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పల్లెకు వ్యతిరేకంగా సందేశాలు వైరల్ చేస్తున్నారు. అసమ్మతి నేతలతో భేటీ.. పల్లెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెదరాసు సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు, పార్టీ సీనియర్ నేతలను ఏకతాటిపైకి తెచ్చి పల్లైపె పోరుబాటకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు సమావేశాలు, విందు మంతానాలు చేశారు. అలాగే పుట్టపర్తిలో పల్లెకు టికెట్ ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతోందని టీడీపీ అధిష్టానానికి కూడా గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. తాను పల్లె రఘునాథరెడ్డి కంటే పార్టీలో సీనియర్‌నని, పైగా స్థానికుడినని అందువల్లే ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని బలిజ సామాజికవర్గానికి చెందిన నేత పెదరాసు సుబ్రహ్మణ్యం ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సీనియర్లు, బీసీలను అణగదొక్కిన పల్లె.. తాము టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేస్తూ వస్తున్నామని ‘పల్లె’ వ్యతిరేక వర్గం వాదిస్తోంది. చివరకు గతంలో ‘పల్లె’ గెలుపులోనూ తమదే కీలక పాత్ర అని చెబుతోంది. తాము ఇంత చేస్తే బీసీలు, సీనియర్లను ‘పల్లె’ ఏమాత్రం పట్టించుకోకపోగా, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర అసమ్మతి నేతలు వాపోతున్నారు. ప్రతి ఎన్నికల్లోన తామే సొంతంగా డబ్బులు ఖర్చు చేసి పార్టీ అభ్యర్థుల విజయానికి పాటు పడ్డామని, అలాంటి తమను పల్లె ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందువల్ల తామూ ఆయనకు మద్దతు పలికేది లేదని స్పష్టం చేస్తున్నారు. కార్యకర్తల బాగోగులు విస్మరించి... పార్టీ కోసం అహరహం శ్రమించిన కార్యకర్తలను, సీనియర్ నేతల బాగోగులను విస్మరించిన పల్లె రఘునాథరెడ్డి...కేవలం తన స్వార్థం తాను చూసుకున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ‘కియా’ కంపెనీ వద్ద 250 ఎకరాలు కొనుగోలు చేసి రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో పల్లె.. అసమ్మతి నేతల చర్యలతో దిక్కుతోచని స్థితిలో పడిన పల్లె రఘునాథరెడ్డి కొందరిని ఇంటికి పిలిపి బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రోజురోజుకూ తన ప్రాభవం తగ్గుతుండటంతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు అనుచరులే చెబుతున్నారు. అసమ్మతి నేతల చర్యలతో ఈసారి టికెట్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. -
ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోంది. అర్హతే ప్రామాణికంగా ఫలాలు ఇంటి ముందు వచ్చివాలుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో గ్రామాల స్వరూపమే మారిపోతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సర్కారుతో కనెక్ట్ అయిపోయారు. ప్రతిపక్షాల ఊసే మర్చిపోతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే జిల్లాలో టీడీపీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైన టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఈ విషయం బోధపడినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకులతో సమావేశమై బుజ్జగింపు పర్వాలు మొదలుపెట్టినా.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సాక్షి, పుట్టపర్తి: ఏ ముహూర్తాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ లేదు.. బొక్కా లేదు అని అన్నాడో తెలియదు కానీ నిజంగానే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. జిల్లా టీడీపీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కేవలం ఉనికి కాపాడుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ రాని పక్షంలో అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకుంటామని కొందరు నేతలు ఇప్పటికే సిద్ధమయ్యారు. పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కదిరి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ‘పోటీ చేసేది నేనే’ అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం నుంచి బాలకృష్ణ, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నట్లు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా టికెట్ గ్యారెంటీ లేదు. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. పెనుకొండలో సవితమ్మ, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి టికెట్ రేసులో ఉన్నారు. పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి, కదిరి నుంచి అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకట ప్రసాద్, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్‌తో పాటు బీజేపీ నేత వరదాపురం సూరి, పొత్తు కుదిరితే జనసేన నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా పోటీలో ఉండనున్నట్లు తెలిసింది. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తారా? లేక తనయుడిని బరిలో దింపుతారా? అనేది తెలీదు. ధర్మవరం టికెట్ రాకుంటే రాజీనామా చేస్తానని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ చందంగా టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ఒకరితో ఒకరి పోరుతో జిల్లాలో చాలా మంది కీలక టీడీపీ నేతల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొందరు కనుమరుగు కాగా.. మరికొందరు అదేబాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా.. నేతల వేరుకుంపట్లతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా తలోబాట పట్టినట్లు తెలుస్తోంది. -
పల్లె రఘునాథరెడ్డి నుంచి నుంచి ప్రాణహాని
ఓడీ చెరువు: మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నుంచి తనకు, తన కుమారుడు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్‌కు ప్రాణహాని ఉందని జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు అల్లాబకాష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలిపారు. అనంతరం పుట్టపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ గంగన్నతో కలసి విలేకరులతో మాట్లాడారు. తనను, తన కుమారుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు మండల నాయకులు పత్రికా ప్రకటన చేయడంపై ధ్వజమెత్తారు. సస్పెండ్ చేయాలంటే వీరికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. ఏ పార్టీలోనైనా సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి ఉంటుందని, కనీస ఈ జ్ఞానం కూడా లేని ‘పల్లె’ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు పల్లె రఘునాథరెడ్డిని తానే పరిచయం చేశానన్నారు. 1982 నుంచి తాను టీడీపీలో ఉన్నానని, పార్టీ అభివృద్ధికి తాను, తన కుటుంబం ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. తమ గృహ ప్రవేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి ‘పల్లె’పై విమర్శలు చేశారని, దీంతో తానేదో వారితో ఆయనపై విమర్శలు చేయించినట్లు ‘పల్లె’ భావించి తనపై కక్ష కట్టారన్నారు. చదవండి: (‘కుర్డుంగ్లా’పై నవరత్నాల రెపరెప) ఎంపీపీగా తన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని, హిందూపురం బాలాజీ కళాశాలలో గుర్రప్పతో కలసి రికార్డులు చోరీ చేశారని పల్లె ఆరోపించారని, నిజంగా తన కుమారుడు ఈ పనులు చేసి ఉంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే తెలిసిపోతుందన్నారు. తాను గానీ, తన కుమారుడు గానీ అక్కడికి వచ్చినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. పల్లె తన కార్యకర్తలకు పనులు ఇచ్చి వారి నుంచి రూ.కోట్ల కమీషన్‌న్ దండుకున్నారు. ఈ విషయాలు బయటకు వస్తాయనే తనను, తన కుమారున్ని చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో కొత్తచెరువు నిషార్, పవన్, భాస్కర్, అబ్దుల్ కలాం, రాజ, షామీర్‌బాషా, కోటబజార్ భాస్కర్, ఆంజనేయులు ఉన్నారు. -
చీప్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి అర్బన్(శ్రీ సత్యసాయి జిల్లా): మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చీప్ ట్రిక్స్‌కు తెరలేపారు. శుక్రవారం కొత్తచెరువు మండలం బండ్లపల్లికి చెందిన సర్పంచ్ గీతాబాయి మామ తిరుపాల్‌నాయక్ వీధిలైట్ల కోసం బండ్లపల్లికి వెళ్తుండగా...అదే సమయంలో సోమందేపల్లికి వెళ్లున్న మాజీ మంత్రి అతన్ని దారిలో ఆపాడు. బలవంతంగా టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని టీడీపీ వాట్సాప్ గ్రూపులకు పంపారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపాల్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి వివరించారు. చదవండి: వైరల్ వీడియో: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి, సీఎం జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అంతేగాని పల్లె చీప్ ట్రిక్స్‌కు లోనయ్యే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్యేగాను, వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో బండ్లపల్లి సర్పంచ్ గీతాబాయి, రూప్లానాయక్, తిరుపాల్ నాయక్, తలమర్ల మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. -
Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?
అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ‘పల్లె’ మెడకు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. అనంతపురంలో అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టడం, విద్యా సంస్థల్లో భారీఎత్తున స్కాలర్షిప్లు స్వాహా చేయడం, సొసైటీ పేర్లతో అందిన కాడికి డబ్బు వసూలు చేయడం వంటివి పల్లె ప్రతిష్టను దిగజార్చాయి. దీనికితోడు ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటాపోటీ విమర్శలతో ఇద్దరూ బజారుకెక్కారు. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ అధిష్టానం పొమ్మన లేక ‘పల్లె’కు పొగ బెడుతోందని టీడీపీ కేడర్లోనే చర్చ సాగుతోంది. సాక్షి, పుట్టపర్తి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ఆయన తీరుపై ఒకవైపు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం నెత్తుటి పుండుపై కారం చల్లిన చందంగా తయారైంది. పల్లెకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి టీడీపీ టికెట్ వచ్చే ప్రసక్తే లేదని జేసీ మీడియా సాక్షిగా కుండబద్దలు కొడుతున్నారు. విజయవాడ నుంచి అనంతపురం దాకా పల్లె చేసిన అక్రమాలు, అన్యాయాలన్నింటినీ బయటపెడతానని పేర్కొంటుండడంతో మాజీ మంత్రి అయోమయంలో పడ్డారు. పుట్టపర్తి టీడీపీ టికెట్ తన మద్దతుదారుడైన సైకం శ్రీనివాస రెడ్డికి ఇప్పిస్తానని జేసీ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో పల్లెకు టికెట్ రాకపోతే మన పరిస్థితి ఏంటని అనుచరులు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. 2009లో అనుకూలం... నేడు ప్రతికూలం జేసీ ప్రభాకర్ రెడ్డి ధోరణి విపరీతం. 2009లో పుట్టపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండసాని సురేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అప్పటి అధిష్టానం కడపల మోహన్ రెడ్డిని బరిలో దింపింది. కొండసానికి టికెట్ ఇవ్వలేదనే నెపంతో కడపల మోహన్ రెడ్డిని ఓడించడానికి జేసీ బ్రదర్స్ పావులు కదిపారు. అదే సమయంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పల్లె రఘునాథ రెడ్డి బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారు. అప్పుడు పల్లె ఎమ్మెల్యే కావడానికి జేసీ బ్రదర్స్ పరోక్షంగా దోహదపడ్డారు. కానీ తాజాగా పల్లెకు టికెట్ రాకుండా వారు చక్రం తిప్పుతున్నారు. దీంతో పుట్టపర్తిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ‘ఉజ్వల’ అంశంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన జేసీని అడ్డుకోవడానికి పల్లెతో పాటు ఆయన అనుచరులు తాపత్రయపడ్డారు. దీంతో జేసీ మరింత పట్టుదలగా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..) పొమ్మనలేక పొగ పుట్టపర్తి టీడీపీ అభ్యర్థిగా పల్లె పనికిరాడని ఆ పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఆయనపై కొన్నేళ్లుగా జేసీ గుర్రుగా ఉండడం టీడీపీ అధిష్టానానికి కలిసివచ్చింది. 99.99 శాతం పల్లెకు టికెట్ రాదని జేసీ పదేపదే చెబుతుండడం ఇందుకు నిదర్శనం. పార్టీ అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లె రఘునాథరెడ్డి అక్రమార్జనతో రూ.వందల కోట్లకు పడగలెత్తడం, విద్యా సంస్థల్లో కోట్లాది రూపాయల స్కాలర్షిప్లు స్వాహా చేయడం, అనంతపురంలో భారీగా ఆస్తులు కూడబెట్టడం, సొసైటీ పేర్లతో కళాశాలలు ఏర్పాటు చేసి అందిన కాడికి ఫీజులు వసూలు చేయడం తదితర అంశాలపై జేసీ సమగ్రంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది. పార్టీ మార్పునకు అనుచరుల ఒత్తిడి పుట్టపర్తి టీడీపీ వ్యవహారంలో జేసీ జోక్యం చేసుకున్నా పార్టీ అధిష్టానం వారించలేదు. పైగా జేసీ రోజూ ప్రెస్మీట్లు పెట్టి పల్లెపై చులకన భావన ప్రదర్శిస్తున్నారు. ఎవరి నియోజకవర్గ పరిధిలో వారు పరిస్థితులు చక్కదిద్దుకోవాలని పార్టీ అధిష్టానం అక్షింతలు వేయకుండా జేసీకి మద్దతివ్వడం పల్లెను బయటికి పంపడంలో భాగమేనన్న అనుమానం టీడీపీ కేడర్లోనే వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పార్టీ మారితే గౌరవం అయినా దక్కుతుందని అనుచరులు పల్లెపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యే, ఒక దఫా మంత్రి, ఒక దఫా ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్ హోదాలో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే కారణంతో టికెట్ రాకపోతే అవమానమని అనుచరులు వాపోతున్నారు. ఏది ఏమైనా జేసీ తన అనుచరుడు సైకం శ్రీనివాస రెడ్డికి టికెట్ ఇప్పించే అంశంలో పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..
పుట్టపర్తి...జిల్లా కేంద్రం కావడం.. విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో టీడీపీ నాయకులు కొందరు కనిపించిన స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో 1992లో ఏర్పాటైన ఉజ్వల ఫౌండేషన్‌పై కన్నేసిన కొందరు పవర్ ఆఫ్ అటార్నీ పేరుతో పార్కులు, పార్కింగ్ స్థలాలనూ విక్రయిస్తున్నారు. దీంతో ఉజ్వల ఫౌండేషన్‌లో కాటేజీలు కొనుగోలు చేసిన వారు ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. మరోవైపు వీటన్నింటికీ ‘పల్లె’ అనుచరులే కారణమని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించడంతో పాటు సొంతపార్టీ నేతలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) ఏర్పాటు కాకముందు సుడా (సత్యసాయి అర్భన్ డెవలప్మెంట్ ) ఉండేది. 1992లో సుడా పరిధిలోని 6.25 ఎకరాల్లో ఉజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేఅవుట్ వేశారు. ఇందులో 150 కాటేజీల నిర్మాణం చేపట్టారు. దీంతో దేశ విదేశాల్లోని సత్యసాయి భక్తులు వీటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ‘ఈ–2’ కాటేజీని ఢిల్లీకి చెందిన డింపుల్ అరోరా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆమె అందులోనే నివాసం ఉంటున్నారు. ఇలా 1992 నుంచి లేఅవుట్లో కాటేజీలు అమ్ముతూ వచ్చిన ఉజ్వల ఫౌండేషన్ మిగిలిన కాటేజీలను చెన్నైకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి విక్రయించింది. అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సినప్పుడల్లా చెన్నై నుంచి అతను పుట్టపర్తి రావడం ఇబ్బందిగా మారడంతో నాలుగైదేళ్ల కిందట రవి అనే వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం రవి కోవిడ్‌తో మరణించారు. దీంతో కొన్నిరోజులుగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈక్రమంలో రవి స్నేహితుడైన గోవర్దన్‌రెడ్డి చెన్నైకి వెళ్లి సుబ్రహ్మణ్యంను కలిసి కొత్తగా పవర్ ఆఫ్ అటార్నీ తెచ్చుకున్నారు. అక్రమాలకు ఊతం.. పవర్ఆఫ్ అటార్నీ పొందిన గోవర్ధన్‌రెడ్డి తన మామ, పుట్టపర్తి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లెరఘునాథరెడ్డికి నమ్మినబంటు శ్రీరామిరెడ్డితో కలిసి ఉజ్వల ఫౌండేషన్‌లో ఖాళీగా ఉన్న స్థలాల కబ్జాకు ప్లాన్ వేశారు. లేఅవుట్లోని చిల్ట్రన్పార్కు, పార్కింగ్ ఏరియా, సెక్యూరిటీ, లైబ్రరీకి కేటాయించిన స్థలాలను ఇష్టానుసారంగా విక్రయించాడు. దీంతో లేఅవుట్‌కు చెందిన ఉమ్మడి స్థలాలను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ఈ–2’ కాటేజీలో ఉంటున్న డింపుల్ అరోరా 15 రోజుల కిందట ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న గోవర్దన్‌రెడ్డి తన మామ శ్రీరామరెడ్డి సాయంతో డింపుల్ అరోరాపై బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఈ–2 కాటేజీ పక్కన ఉన్న నాలుగు సెంట్ల స్థలంలో ఏకంగా పునాది వేశారు. దీంతో డింపుల్ ఆరోరా ఈ విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించారు. పుట్టపర్తి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పుడా వైస్ చైర్మన్లతో కమిటీ నియమించి...వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. రచ్చకెక్కిన వర్గవిభేదాలు.. ఉజ్వల ఫౌండేషన్ వ్యవహారంతో టీడీపీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తి వస్తున్నట్లు తెలుసుకున్న ఆపార్టీ నేతలు కొత్త చెరువులో పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ‘గో బ్యాక్ జేసీ’ అంటూ పల్లె అనుచరులు, ‘స్వాగతం జేసీ’ అంటూ జేసీ అనుచరులు నినాదాలు చేశారు. టికెట్ వచ్చేది పల్లెకే అంటూ పల్లె వర్గీయులు, మీకు టికెట్ వచ్చేంత సీన్ లేదని జేసీ వర్గీయులు వాదులాడుకున్నారు. మాటా మాటా పెరిగి ఒక దశలో తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. జేసీకి కలిసివచ్చిన ‘ఉజ్వల’ టీడీపీకి చెందిన ‘పల్లె’, జేసీ విభేదాలతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడంతో అధికార పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తన ప్రాభవం కోల్పోతున్నానని పల్లె రఘునాథ రెడ్డి ఆందోళనలో ఉన్నారు.‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ’ జేసీ ప్రభాకర్ రెడ్డి పల్లెపై ప్రతీకారేచ్ఛతో రగలిపోతున్నారు. పల్లెకు టికెట్ రానీయనంటూ బాహాటంగానే శపథం పూనారు. పుట్టపర్తి నియోజకవర్గానికి టీడీపీ తరఫున సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ తెప్పించుకుంటామని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అనుచర వర్గాన్ని తయారుచేసి పల్లెకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉజ్వల’ అక్రమాలను జేసీ అందిపుచ్చుకున్నారు. పల్లె అక్రమాలపై జేసీ లొల్లి.. కొన్నాళ్లుగా పల్లె రఘునాథరెడ్డిపై గుర్రుగా ఉన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉజ్వల ఫౌండేషన్‌లో అక్రమాలపై స్పందించారు. ఉజ్వల ఫౌండేషన్ అక్రమాలన్నీ ‘పల్లె’ కనుసన్నల్లోనే జరిగాయని, పల్లె అనుచరుడైన శ్రీరామిరెడ్డి, అతని అల్లుడు గోవర్ధన్‌రెడ్డి కాటేజీలను అక్రమంగా విక్రయించి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ‘ఉజ్వల’ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం అనంతపురం నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని భావించి జేసీని మరూరు టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. జేసీకి నచ్చజెప్పి అనంతపురంలోని తన నివాసానికి పంపించారు. -
జేసీ ప్రభాకర్‌పై పల్లె రఘునాథ్ ఘాటు కామెంట్స్
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. జేసీపై పల్లె సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీలో వర్గపోరు ముదరడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓ రౌడీ అని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని పల్లె రఘునాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు గత 35 ఏళ్లుగా టీడీపీ నేతలపై జేసీ కుటుంబం దాడులు చేసింది.. అక్రమ కేసులతో వేధించిందని ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ అజ్ఞాని అంటూ పల్లె మండిపడ్డారు. టీడీపీ కండువా కప్పుకోవటానికి జేసీ నామోషీగా ఫీలయ్యాడంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో టీడీపీలో చేరిన జేసీ కుటుంబం తమపై పెత్తనమా? అంటూ ప్రశ్నించారు. పరిటాలకు భయపడి జేసీ తాడిపత్రి నుంచి పారిపోయాడరన్నారు. నాజోలికి వస్తే ఊరుకోనని పల్లె రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డిపై మహిళలు ఆగ్రహం
-
ప్రాధేయపడినా కనికరించలేదు..
ఆయన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు. గతంలో అధ్యాపకుడిగా ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన పెద్దసారు.. కానీ తన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు రీయింబర్స్ చేసినా వాటిని విద్యార్థులకు ఇవ్వకుండా స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు పదేపదే కళాశాలకు వస్తుండగా.. ముఖం చాటేసి తిరుగుతున్నారు. అనంతపురం: ‘పల్లె’ రఘునాథరెడ్డి విద్యా సంస్థల గురించి జిల్లాలో తెలియనివారు ఉండరు. అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించిన ఆయన విద్యాసంస్థల అధిపతిగా మారారు. ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేస్తూ తన పలుకుబడితో ఇబ్బడిముబ్బడిగా కళాశాలలు స్థాపించారు. కనీస సౌకర్యాలు లేకపోయినా నెట్టుకొస్తున్నారు. బోధనా ప్రమాణాలు తుంగలోతొక్కి ఫీజుల వసూలే లక్ష్యంగా విద్యాసంస్థలు నడుపుతున్నారు. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల స్వాహాకు సిద్ధమయ్యారు. పల్లె రఘునాథరెడ్డి టీడీపీ హయాంలోనే అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలను స్థాపించారు. ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల ఫీజు నిర్ణయించారు. ఇది చాలా ఎక్కువే అయినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్న ఆశతో చాలా మంది నిరుపేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కళాశాలలో చేర్పించారు. 2016–20 బ్యాచ్ విద్యార్థులు ఇటీవలే బీఎస్సీ (హార్టికల్చర్)కోర్సును పూర్తి చేశారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం రెండు విద్యా సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు. దీంతో ‘పల్లె’ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయించబోమని హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బయట వడ్డీలకు తెచ్చి మరీ ఫీజులు చెల్లించారు. ఇలా కళాశాలలోని 92 మంది విద్యార్థులు రూ.1.80 కోట్లు కళాశాలకు చెల్లించారు. తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఏకకాలంలో మంజూరు చేసింది. 2020 మార్చి 30న ఈ మొత్తాన్ని ఆయా ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. ఒక్క అనంతపురం జిల్లాకే రూ. 350 కోట్లు్ల ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే విద్యార్థుల నుంచి కట్టించుకున్న ఫీజులను తిరిగి వెనక్కి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ‘పల్లె’కు చెందిన శ్రీకృష్ణదేవరాయ హారి్టకల్చర్ కళాశాల మాత్రం రీయింబర్స్మెంట్ నిధులు విద్యార్థులకు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తోంది. ఒక వైపు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకుని.. మరో వైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తోంది. కళాశాల ఆధునికీకరణ సాకుగా చూపి.. తాము నూతనంగా కళాశాల ఏర్పాటు చేశామని, ఆధునీకరణకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశామని, అందువల్ల తమకు వీలైనపుడు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు చెల్లిస్తామని శ్రీకృష్ణదేవరాయ హారి్టకల్చర్ కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఇలా 7 నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులను తిప్పించుకుంటోంది. ఇప్పటికే తాము ఫీజు మొత్తం చెల్లించామనీ...ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలని కోరినా నిర్వాహకులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పల్లె విద్యా సంస్థ అయిన శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రాధేయపడినా.. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందంటే కళాశాలలో చేరాను. గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో మాపై ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక మా అమ్మానాన్న వడ్డీలకు డబ్బులు తెచ్చి ఫీజులు చెల్లించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా ఫీజులను రీయింబర్స్మెంట్ చేసి ప్రిన్సిపల్ ఖాతాలో డబ్బులు వేసినా మాకు ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు కళాశాల యాజమాన్యాన్ని ప్రాధేయపడినా కనికరించడం లేదు. – బీఎస్సీ(హార్టికల్చర్ )విద్యార్థి -
ఏపీ విప్ పల్లె రఘునాథరెడ్డికు అసమ్మతి సెగ
-
‘పల్లె’కు అసమ్మతి సెగ
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తగిలింది. పుట్టపర్తి అసెంబ్లీ టికెట్ పల్లెకు ఇవ్వొదంటూ అసమ్మతి నేతలు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ రెస్కో చైర్మన్ రాజశేఖర్, మాజీ పుట్టపర్తి సగర పంచాయతి చైర్మన్ పీసీ గంగన్న, విద్యావేత్త పెదరసు సబ్రమణ్యల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పల్లె ఆదేశాలతోనే తమ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని అసమ్మతి నేతలు మండిపడ్డారు. ఎట్టిపరిస్థితిల్లోనూ పుట్టపర్తి అసెంబ్లీ టికెట్‌ను రఘునాథరెడ్డికి ప్రకటించొద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పల్లె అసమ్మతి వర్గాలు, అనుకూల వర్గాలు బాహా బాహీకి దిగారు. ‘పల్లె వద్దు పార్టీ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ అసమ్మతి నేతలు తమ నిరసనను తెలియజేశారు. (‘పల్లె’ మాయాజాలం) -
పల్లె మాట..నీటి మూట!
మహిళా సంఘాలు ఏర్పడినప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రతినెలా సక్రమంగా పొదుపును జమ చేసుకుంటూ, బ్యాంకు నుంచి రుణాలను తీసుకుని అవసరాలకు వాడుకుంటూ కంతు మొత్తాన్ని చెల్లించుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు. అలాంటి వారి జీవితాల్లో ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి రుణమాఫీ పేరుతో ఆశలు రేపారు. ఆ తర్వాత రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీ మీద వడ్డీ కట్టి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తాజాగా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో కసముద్రం మహిళలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం, అమడగూరు: గత ఎన్నికల్లో పల్లె రఘునాథరెడ్డి రుణాల మాఫీ పేరుతో తమను వంచించాడని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలను గుప్పించి తర్వాత అమలు చేయడంతో పూర్తిగా విఫలమయ్యాడని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా డ్వాక్రా సంఘాల కింద రుణాలను తీసుకున్న అక్క, చెల్లెమ్మలంతా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదంటూ కసముద్రం సభల్లో చెప్పడమే కాకుండా గోడమీద రాతలు వాయించాడు. ఆ సమయంలో గ్రామంలో 28 మహిళా సంఘాలు జరుగుతుండగా, ప్రతి సభ్యురాలు రూ.10 వేలు రుణాన్ని తీసుకుని మూడు నెలలు కంతులు కూడా బ్యాంకుకు చెల్లించారు. పల్లె హామీతో రుణాలు కట్టని మహిళలు.. అప్పట్లో ఎమ్మెల్యే పల్లె డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో మహిళలంతా ముక్కుమ్మడిగా కంతులు కట్టకుండా ఆపేశారు. తర్వాత ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని మర్చిపోయాడు. మహిళా సంఘాలన్నీ రుణాలను చెల్లించక, బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కాగా మహిళలంతా ఆందోళలో ఉన్నారు. పైసా రుణం కూడా మాఫీ కాకపోవడంతో పాటుగా ఆనాటి నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే పసుపు–కుంకుమ డబ్బు, గ్యాస్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, బీమా, ఇంటి బిల్లులన్నీ బ్యాంకు అధికారులు జమ చేసుకుంటూ వచ్చారు. మరికొంత మంది ఇంట్లో తమ భర్తలను ఒప్పించుకుని రుణాలను చేతి నుంచి కట్టేశారు. నోటీసులతో ఆందోళన తాజాగా డిసెంబర్, జనవరి నెలల్లో మళ్లీ ప్రతి గ్రూపునకు డబ్బు చెల్లించాలంటూ గ్రూపులకు సంబంధించిన జామీనుదారులకు లక్షల రూపాయలు అప్పుందంటూ నోటీసులు పంపించారు. దీంతో ఖంగుతిన్న మహిళలంతా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఎంత పనిచేశాడమ్మా? మా జీవితాల్లో చిచ్చు పెట్టి మమ్మల్ని బ్యాంకుల వైపు కన్నెత్తి చూడకుండా చేసి, బజారున పడేశాడని గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యే మాటలు విని కసముద్రం, కంచరోళ్లపల్లి, చెర్లోపల్లి గ్రామాల్లో 28 మహిళా సంఘాల నిలిచిపోయి ఆయా కుటుంబాలకు ఎలాంటి ఆసరా లేకుండా వీధిన పడిపోయాయి. అంతేకాక భవిష్యత్తులో బ్యాంకు అధికారులు ఇంకెన్ని ఇబ్బందులు కల్గజేస్తారోనని, ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి మా రుణాలకు క్లీన్చిట్ ఇప్పిస్తే తిరిగి కొత్తగా గ్రూపులు నిర్వహించుకుంటామని పేర్కొంటున్నారు. రూ.10 వేలకు రూ.67 వేలు కట్టా నేను గ్రూపులో రూ.10 వే లు తీసుకుని అధికారుల ఒత్తిడి తట్టుకోలేక వడ్డీతో కలిపి రూ.67 వేలు మొత్తా న్ని ఒకేసారి కట్టేశాను. అయితే ఇప్పుడు మళ్లీ గ్యాస్ సబ్సిడీ డబ్బు పడుతుంటే అది కూడా పట్టేస్తున్నారు. మళ్లీ ఎందుకు పట్టేస్తున్నారో, ఇంకెంత అప్పు ఉంది అంటారోనని భయపడిపోతున్నాను. పసుపు–కుంకుమ డబ్బు, పావలా వడ్డీ ఇస్తామన్నా.. ఏదీ ఇవ్వలేదు. – తిప్పమ్మ,లక్ష్మీనరసింహస్వామి గ్రూపు, కసముద్రం -
పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదు: పల్లె
-
పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదు
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదని ఆయన విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు తమతో ఉంటూ అకస్మాత్తుగా టీడీపీపై విమర్శలు చేయడం అనుమానాలనకు దారితీస్తోందని అన్నారు. పవన్ వెనుక బీజేపీ హస్తం ఉండచ్చొని, పవన్‌ను బీజేపీ ఒక పావులా వాడుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చాడు కాబట్టే ఆయన సలహాలను పరిగణలోకి తీసుకున్నామని పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శేఖర్ రెడ్డి కేసులో లోకేశ్ హస్తం ఉందని పవన్ ఆరోపించడం అర్థం లేనిదనీ, ఇంతవరకు శేఖర్‌రెడ్డిని లోకేశ్ చూడలేదనీ తెలిపారు. శేఖర్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారని తెలిపారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అర్థరహితమని పేర్కొన్నారు. పవన్ పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరించడం లేదని పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. లోకేశ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ చేస్తున్న అవినీతి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసే పనులకు ఎన్టీఆర్ ఆత్మ పడే క్షోభ అంతా ఇంతా కాదంటూ పవన్ కల్యాణ్... జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. -
ప్రభుత్వ చీఫ్ విప్‌గా పల్లె
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున చీఫ్ విప్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని నియమించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గతంలో కాలవ శ్రీనివాసులు చేపట్టిన ఈ పదవిని ఇప్పటివరకూ భర్తీ చేయలేదు. కాలవను మంత్రివర్గంలోకి తీసుకున్న సమయంలో ఉద్వాసనకు గురైన పల్లెకు ఆ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వెంటనే దాన్ని అమలు చేయకపోవడంతో ఇప్పటి వరకు కాలవ ఆ పదవిని నిర్వహించారు. తాజాగా ఈ పదవిని భర్తీ చేయాలని నిర్ణయించి పల్లె, బొండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు పేర్లను పరిశీలించారు. చివరకు పల్లె పేరునే ఖరారు చేశారు. మరోవైపు శాసన మండలిలో చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్‌ను నియమించాలని నిర్ణయించారు. ఈ పదవి కోసం టీడీ జనార్దన్, వైవీబీ రాజేంద్రప్రసాద్, రామసుబ్బారెడ్డి పేర్లు వినిపించినా చంద్రబాబు పయ్యావుల వైపే మొగ్గు చూపారు. శనివారం పయ్యావుల, పల్లెను తన నివాసానికి పిలిపించుకున్న ముఖ్యమంత్రి వారి పేర్లు ఖరారు చేసిన విషయాన్ని తెలిపినట్లు సమాచారం. మండలిలో మూడు విప్ పదవులను కూడా వెంటనే భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే !
అనంతపురం ఎడ్యుకేషన్ : విభజన అనంతరం పూర్తిగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివద్ధి సాధించాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక మునిసిపల్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి పల్లె రఘునాథరెడ్డిని అడ్డుకున్నారు. అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొనగా బయట బైఠాయించి ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్యాకేజీ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు పోటీలు పడి రాష్ట్రానికి 5, 10, 15 ఏళ్లు హోదా ఇస్తేనే అభివద్ధి అని ప్రకటించారన్నారు. ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి ఎలా స్వాగతిస్తారన్నారు. ప్రత్యేక హోదాకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతిచ్చేదాకా టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శులు లోకేష్‌శెట్టి, సుధీర్‌రెడ్డి, బాబాసలాం, నాయకులు కిరణ్, అనిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలకు పూర్వ వైభవం తెస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలను ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షిమాలిక్, శ్రీకాంత్‌లను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. టేబుల్‌టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ ద్వారా జిల్లాకు ఎంతో మంది క్రీడాకారులను పరిచయం చేసిన టోర్నీ నిర్వాహకుల కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ షకీల్‌షఫీ, టేబుల్‌టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు డా అక్బర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మురళీధర్ రావు, ట్రెజరర్ పాండు, కార్యదర్శి కేశవరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి, అరుణ్, సూర్యారావు, రాజేష్ పాల్గొన్నారు. విజేతలు వీరే మినీ క్యాడెట్ బాలికలు విన్నర్్స రన్నర్స్‡ దోహ మోహితా గాయిత్రి మినీక్యాడెట్ బాలురు ప్రణవ్ అశ్విన్సాయి క్యాడెట్ బాలికలు హాసిని శ్రేష్ట క్యాడెట్ బాలురు ఎం.వీ. కార్తికేయ ఖుష్ జైన్ సబ్ జూనియర్ బాలికలు ఆర్.కాజోల్ మహిత చౌదరి సబ్ జూనియర్ బాలురు సాయి దీపక్ అక్షిత్ జూనియర్స్ బాలికలు కాజోల్ అనూషరెడ్డి జూనియర్స్ బాలురు సాయి స్వరూప్ జయసూర్య యూత్ బాలికల విభాగం కాజోల్ నాగశ్రావణి యూత్ బాలుర విభాగం జగదీష్ కృష్ణ మోహిత్ శర్మ బాలికల విభాగం కాజోల్ నాగ శ్రావణి బాలుర విభాగం జగదీష్ కృష్ణ ఉమేష్ కుమార్ వెటరన్స్ (50 + విభాగం) అక్బర్ సాహెబ్ కేశవరెడ్డి వెటరన్స్ (40 + విభాగం) రవికుమార ప్రకాష్ -
కృష్ణమ్మకు ప్రత్యేక హారతి : మంత్రి పల్లె
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు ప్రారంభ ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం సాయంత్రం 4 గంటలకు కృష్ణా, గోదావరి సంగమం వద్ద పుష్కరాలు ప్రారంభమవుతాయని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో కృష్ణమ్మ ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పల్లె చెప్పారు. కృష్ణా పుష్కరాలకు ఘనంగా స్వాగతం పలుకుతామని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకు సినీ రంగ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం చేస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానంతో కృష్ణా పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. -
సమాచార శాఖ మంత్రిపై ఎమ్మెల్యే ఫైర్
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) హాలులో హంద్రీ-నీవా సుజల స్రవంతి, హెచ్చెల్సీపై కలెక్టర్ శశిధర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ విషయం తెలుసుకుని సూరి గంట ఆలస్యంగా ఎమ్మెల్సీ కేశవ్‌తో కలిసి అక్కడకు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోతే ఎలాగని మంత్రిని ప్రశ్నించారు. సమావేశం ఉందని అధికారులు కూడా తెలపకపోవడమేంటని ఆగ్రహించారు. మీకు మీరే మీటింగులు పెట్టుకుంటే ఇక మేమెందుకంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంతలో కేశవ్ కల్పించుకుని కనీసం అజెండా ఏంటో తెలిస్తే సమావేశంలో మాట్లాడటానికి వీలుంటుందన్నారు. ఎవరికీ తెలీకుండా సమావేశం పెడితే ప్రయోజనం ఏంటన్నారు. దీంతో మంత్రి పల్లె.. సూరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయన వినలేదు. చివరకు సమీక్ష సమావేశం సమాచారం అందరికీ తెలియజేయాలని అధికారులను ఆదేశిస్తూ.. ఇకమీదట ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. -
మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు..
-
మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు..
అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోసారి మంత్రుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసే బ్యాగ్‌పై తన ఫోటో లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహచర మంత్రి పరిటాల సునీతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి అయినా తన ఫోటో వేయించకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రొటోకాల్ పాటించలేదని..దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే విధంగా ఇరువురి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ తోఫా పోస్టర్, బ్యాగ్‌లపై కూడా పల్లె ఫోటో వేయించకపోవడంతో అప్పట్లో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. దీనిపై మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. పల్లె రఘునాథరెడ్డి అభ్యంతరాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని కొట్టి పారేశారు. క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసే బ్యాగ్‌లు, సంక్రాంతి చందన్న బ్యాగ్‌లు ఒక్కటే కావడంతో ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తుంది. -
సీఎం సాక్షిగా టీడీపీ నేతల గ్రూపు రాజకీయాలు
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జేసీ సోదరులు, మంత్రి పల్లె రఘునాధరెడ్డి వర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. సీఎం చంద్రబాబు సోమవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబుకు వర్గాలవారీగా స్వాగతాలు లభించాయి. తెలుగు తమ్ముళ్లు ఆయనకు వేర్వేరుగా స్వాగతం పలికారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన వర్గీయులు తాడిపత్రిలో తమ అధినేతకు ఆహ్వానం పలికారు. మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, యామిని బాల, వరదాపురం సూరి తదితరుల శింగనమలలో చంద్రబాబును స్వాగతించారు. తెలుగు తమ్ముళ్ల గ్రూపు రాజకీయాలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
పెట్టుబడుల కోసం ఆహ్వానించాం: పల్లె
అమెరికా పర్యటనలో పలు కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించినట్లు ఏపీ ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 48 మంది ఎన్నారైలు ఐటీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారని పల్లె చెప్పారు. జపాన్ నుంచి మూడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయని, అమరావతిలో భాగస్వాములు అయ్యేందుకు ఎన్నారైలు ముందుకొస్తున్నట్లు తెలిపారు. 17.91 లక్షల ఈ-బ్రిక్స్ కొనుగోలు చేసేందుకు వాళ్లు అంగీకారం తెలిపారన్నారు.