Patnam Mahender Reddy
-
చీఫ్‌విప్‌గా ‘పట్నం’ నియామకం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహేందర్‌రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆయనను చీఫ్ విప్‌గా మండలి చైర్మన్ ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందనడానికి ఈ నియామకం ఓ ఉదాహరణ అని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమించారని ధ్వజమెత్తారు. సభలో బిల్లులు పాస్ చేయించడం, ప్రభు త్వ బిజినెస్ జరిగేలా చూడడం చీఫ్‌విప్ బాధ్యత అని అన్నారు.‘బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేందర్‌రెడ్డి ఎవరికి విప్ జారీ చేస్తారు? అధికార పార్టీ సభ్యులకా.. ప్రతి పక్ష పార్టీ సభ్యులకా?’అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ చెప్పారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారని గుర్తు చేశారు.అయితే మార్చి 15వ తేదీన మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమిస్తూ గెజిట్ విడుదల చేశారని, మార్చిలో చీఫ్‌విప్ అయితే పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17న ఎమ్మెల్సీగా ఆయన జెండా ఎగురవేస్తారని జీఏడీ జీవో ఎలా ఇస్తుందని హరీశ్ ప్రశ్నించారు. అనర్హత వేటు వే యాల్సిన కౌన్సిల్ చైర్మన్.. స్వయంగా మహేందర్‌రెడ్డి చీఫ్‌విప్‌గా నియమి తులైనట్లు బులెటిన్ ఇవ్వటం సరికాదన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. -
నేను బీఆర్ఎస్ చైర్మన్‌ను కాదు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం(అక్టోబర్9) శాసన మండలిలో చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.మహేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ విప్‌గా చూడాలా? కాంగ్రెస్ విప్‌గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్పై గుత్తా ఫైర్..ఉద్యోగ నియామకాల మీద బీఆర్ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారుఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదిమూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలిఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు.నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు.బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలిఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దుమూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంహైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు.ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది.అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ భాధ్యులే.. ఇదీ చదవండి: ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్ -
ఏం మాట్లాడుతున్నావ్!.. ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం రచ్చరచ్చగా మారింది. వికారాబాద్ జెడ్పీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మధ్య మాటల యుద్ధం సాగింది.అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డి దే కదా ! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ యాదయ్య వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ యాదయ్యను పట్నం మహేందర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఏం మేం మాట్లాడవద్దా అంటూ ఎమ్మెల్యే యాదయ్య కౌంటర్ ఇచ్చారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరి మధ్య కలుగజేసుకొని వివాదం సద్దుమణిగించారు. -
పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
కారు దిగుతున్న కీలక నేతలు
-
11 లేదా 12న కాంగ్రెస్‌లోకి పట్నం దంపతులు!
తాండూరు (వికారాబాద్): కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం దంపతులు సిద్ధమవుతున్నారు. సతీసమేతంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్కు ప్రయతి్నస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అధికారికంగా హస్తం పారీ్టలో చేరనున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాబల్యం చూపుతున్న మహేందర్‌రెడ్డి తొలిసారి జాతీయ పారీ్టకి జై కొట్టారు. తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతకు కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ను వీడారు. మహేందర్‌రెడ్డి చేరికపై ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా..కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి స్పందిస్తూ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాను చెప్పేదేమీ లేదన్నారు. మరోవైపు ఏఐసీసీ సభ్యుడు రమేశ్ మహరాజ్...పట్నం చేరికపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు!
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. దీనిలో భాగంగా వీరిద్దరూ రేపు(శనివారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు.మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు. -
రసవత్తరంగా తాండూరు మున్సిపల్ రాజకీయం
తాండూరు: మున్సిపల్ రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఒప్పందం ప్రకారం ఇద్దరు చైర్పర్సన్లు కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నేతలు నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో రెండున్నరేళ్ల పాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగారు. గడువు ముగిసిన తర్వాత కూడా చైర్పర్సన్ స్వప్న పదవికి రాజీనామా చేయలేదు. వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపనర్సింహులు చైర్పర్సన్ పదవి కట్టబెట్టాలని ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వల్ల మున్సిపాలిటీలపై పార్టీ జోక్యం తీసుకొలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఒప్పందం ప్రకారం చైర్పర్సన్ పదవి ఇవ్వాలని దీపనర్సింహులు డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన సంతకాలు గతంలో పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పట్నం శిబిరంలో ఉన్న పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చైర్పర్సన్ తాటికొండస్వప్నకు మెజార్టీ కౌన్సిలర్లు కరువయ్యారు. అధికారప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మద్దతులో ఎలాగైనా చైర్పర్సన్ తాటికొండస్వప్నపై అవిశ్వాసం ప్రవేశపెట్టి పదవి నుంచి దింపాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు సిద్ధమయ్యారు. మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటిసు అందించాలంటే మొత్తంలో మూడో వంతు సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే 15 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ల మద్దతు లభిస్తోందా.. లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అన్నదమ్ముల పంచాయితీ సాయిపూర్ ప్రాంతంలో మూడు వార్డులలో ఒకే కు టుబానికి చెందిన వారే కౌన్సిలర్లుగా కొనసాగుతున్నా రు. దాయాదులుగా ఉన్న వారు ఒకరంటే ఒకరికీ పొసగడం లేదు. సాయిపూర్లోని 9వ వార్డు కౌన్సిలర్ అయిన వైస్ చైర్పర్సన్ దీపనర్సింహులు చైర్పర్సన్ పదవికోసం ఆశపడుతున్నారు. అయితే సోదరులు అయిన కౌన్సిలర్లు నీరజాబాల్‌రెడ్డి, పట్లోళ్ల రత్నమాలనర్సింహులు వైస్ చైరపర్సన్కు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేకు విషమ పరీక్ష మున్సిపల్ అవిశ్వాస తీర్మానం విషయంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి విషమ పరీక్ష ఎదురుకానుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పాల్గొనకుండా ఉంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో జత కట్టారనే ప్రచారం సాగుతోంది. అవిశ్వాసంలో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులతో విభేదాలు ఎదురవుతాయి. దీంతో అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో విభేదాలు
-
పట్నం వర్సెస్ పైలట్.. స్వల్ప ఉద్రిక్తత!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది. ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది! చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. -
'ఇసుక' అనుమతులు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో ఇసుకను అందించాలని అధికారులను గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక వెలికితీతకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు తదితర అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో గనుల శాఖ సాధించిన పురోగతిని పరిశీలించారు. ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వీలుగా పర్యావరణ అనుమతులను వేగవంతం చేయాలని.. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజులపై మరింత మంచి విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. లీజులో ఉండి పని నడవని గనులను క్రియాశీలం చేయాలని, జిల్లాల వారీగా మినరల్ రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన 127 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడేళ్లలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,444 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. -
తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చోటుదక్కింది. రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. మహేందర్‌రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన మహేందర్‌రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా తాండూరు బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా, పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. చదవండి: గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు: హైకోర్టు కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం.. మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
మినిస్టర్ ‘పట్నం’
తాండూరు: తాండూరు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి లభించింది. గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. పైలెట్‌కు టికెట్ ఇవ్వడంతో.. కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకోనుండడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగాఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతల నడుమ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని పలుమార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకున్నారు. చదవండి: పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 2023లో తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మండలి నుంచి కేబినెట్లోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన నాటి నుంచి కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర కేబినెట్లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు. -
మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు
వికారాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అధికార పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే విషయం కొద్ది రోజులుగా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. పట్నం తీరు సైతం ఈ అంశాలను బలపర్చేలా కనిపించడంతో పార్టీ మారుతారని చాలామంది డిసైడయ్యారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ గురువారం శంకర్‌పల్లిలో నిర్వహించిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ పక్కనే కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని బీఆర్ఎస్ అగ్రనేతలు ఆయనకు హామీఇచ్చినట్లు తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చేది మనమే.. అనవసర నిర్ణయాలు తీసుకుని ఆగం కావద్దని సూచించినట్లు తెలుస్తోంది. గైర్హాజరుతో అనుమానాలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మహేందర్‌రెడ్డి ఇటీవల సైలెంట్ కావడం చర్చనీయాంశమైంది. ఇటీవల మహేశ్వరంలో నిర్వహించిన సీఎం మీటింగ్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎప్పుడూ ముఖ్యమంత్రి పక్కనే ఉండే ఆయన కనిపించకపోవడం ఊహాగాలకు మరింత ఆజ్యం పోసింది. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే విషయం మీడియాలో ఫోకస్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. అతనితో సన్నిహితంగా ఉండే సెకండ్ క్యాడర్ నేతలతో పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులు ఇద్దరు రంగంలోకి దిగి పట్నంను బుజ్జగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ చర్చలు పట్నం దారెటు.. అనే విషయంలో తలెత్తిన చర్చ అధికార పార్టీని ఆలోచింపజేసింది. సీనియర్ నేత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా మంచి పట్టున్న నాయకుడు కావడంతో ఆయనను వదులుకోవద్దని గులాబీ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ బుధవారం రాత్రి ఆయనను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇవి సఫలం కావడంతో మరుసటి రోజు శకంర్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో మహేందర్‌రెడ్డి.. సీఎం వెంట ప్రత్యక్షమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డి సమక్షంలో నేరుగా చర్చలు జరిపిన గులాబీ బాస్ కేసీఆర్.. పట్నం అలక తీర్చినట్లు సమాచారం. ఆ వెంటనే రెట్టించిన ఉత్సాహంతో మహేందర్‌రెడ్డి తాండూరులోని తన మద్దతుదారులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఈసారి కూడా బీఆర్ఎస్ తాండూరు టికెట్ మనకే వస్తుందని ధీమా వ్యక్తంచేసినట్లు వినికిడి. సయోధ్య కుదిరిందా..? బీఆర్ఎస్ అధిష్టానం చొరవతో.. మహేందర్‌రెడ్డి మనసు మార్చుకున్నారా..? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లటంతో పాటు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టం కావడంతోనే.. పార్టీ నష్టపోతుందనే కారణంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి పట్నం మనసు మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలికమా.. ఫైనలా..? అనే విషయాపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా అలక పాన్పు వేసి అనుకున్నది సాధించుకున్న పట్నం తనను నమ్ముకుని.. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆయన మద్దతుదారులను ఏం చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
ముగ్గురు ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్సీ.. బీఆర్ఎస్లో కోల్డ్‌వార్!
వికారాబాద్ జిల్లా గులాబీ పార్టీలో రాజకీయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలనే టెన్షన్ పెడుతున్నాయి. ఓ మాజీ మంత్రి అసంతృప్తితో రగిలిపోతూ ఎమ్మెల్యేలను ముప్పతిప్పలు పెడుతున్నారని టాక్. తెరవెనుక పావులు కదుపుతూ తమను దెబ్బతీస్తున్నారని ఆ సీనియర్ నేత గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఆ సీనియర్ ఎవరు?.. పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణలో మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్సీ. మూడు దశాబ్ధాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తెర వెనక చక్రం తిప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు సార్లు తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ తొలి క్యాబినెట్లో బెర్త్ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో ప్రవేశించారు. వరుసగా మూడు సార్లు తన సతీమణి పట్నం సునీతారెడ్డిని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గెలిపించుకున్నారు. తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ట్రాక్ రికార్డ్ ఘనంగానే ఉన్నా.. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేలదే ఫైనల్ డెసిషన్ కావడంతో ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మహేందర్ రెడ్డి తనదైన శైలిలో తెరవెనక పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మహేందర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గంగా బీఆర్ఎస్ చీలిపోయింది. ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ చాలాసార్లు రచ్చకెక్కింది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కూడా మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి పొసగడం లేదు. గతంలో మర్పల్లిలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతారెడ్డిపై ఎమ్మెల్యే ఆనంద్ తన వర్గీయులతో దాడి చేయించారనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మహేందర్ రెడ్డి.. ఆనంద్ మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల వికారాబాద్ లో ఎమ్మెల్యే ఆనంద్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆనంద్ వర్గీయులు సమావేశం దగ్గరకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఈ పంచాయితీ కాస్తా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు చేరింది. ఇరువర్గాలకు మంత్రి ఎలాంటి భరోసా ఇస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి.. తనకు వ్యతిరేకంగా రోహిత్ రెడ్డి, ఆనంద్‌తో కలిసి జట్టు కట్టారని గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. పరిగిలో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మనోహర్ రెడ్డిని తనవైపు తిప్పుకుని మహేంద్రుడు చక్రం తిప్పుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కునుకు లేకుండా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన వ్యతిరేకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్: చిక్కుల్లో పైలట్.. ఉత్సాహంలో పట్నం
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలకంగా వ్యవహరించిన రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా సాగుతున్న తాండూరు గులాబీ రాజకీయాలు.. ఏ మలుపు తీసుకుంటాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. చిక్కుల్లో పైలట్ .. ఉత్సాహంలో పట్నం రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంచలనంగా మారారు. అప్పటి నుంచి వార్తల్లో హైలెట్ గా నిలిచారు. ఈ కేసు తరవాత చాలా రోజులు ప్రగతి భవన్ లోనే ఉన్నారు. కేసు కారణంగా సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. పక్షం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రోహిత్‌రెడ్డి...ఎమ్మెల్సీ వర్గాన్ని బలహీన పరిచే పనిలో పడ్డారు. పైలెట్ రోహిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ సపోర్ట్ ఉందనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి క్రమంగా కేడర్ దూరం అవుతోంది. ఎమ్మెల్యే కారణంగా తన క్యాడర్ దూరం అవుతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి... తన వర్గబలం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. పెద్ద బాస్ భరోసా ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బలంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం దూకుడుగా వెళ్తున్నారు. ఎమ్మెల్యేల ఎర అంశంతో తాండూరు పేరు జాతీయ స్థాయికి తీసుకువెళ్ళానని ప్రచారం చేసుకుంటున్నారు. తాండూరు అభివృద్ధికి సీఎం కేసీఆర్ ను ఒప్పించి నిధులు తెస్తున్నానని పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మళ్లీ తానే పోటీ చేస్తానని కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. తాండూరు గులాబీ తోటలో ఇప్పడు సీటు విషయమై రచ్చ రచ్చ అవుతోంది. భారతీయ రాష్ట్ర సమితి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కేడర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Telangana: బీజేపీ మెయిన్ టార్గెట్ ఆ ఆరుగురే..!
తెలంగాణలో జెండా పాతేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాషాయ దళం భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మునుగోడు పోయింది సరే, 2023 ఎన్నిక కోసం ఎలా సమాయత్తం కావాలి? ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు వచ్చిన ఆదేశాలేంటి? తెలంగాణలో దూకుడు మీదున్న కమలదళానికి మునుగోడ్ బ్రేక్ వేసింది. కారు, కమలం పార్టీల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగినా.. చివరికి విజయం టీఆర్ఎస్కే దక్కింది. దీంతో కాషాయ పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా కీలక నేతలకు బ్రీఫింగ్ ఇచ్చారు. పటిష్టమైన క్యాడర్ లేని నల్లగొండ జిల్లాలో కొంత పట్టుసాధించినట్లు భావిస్తున్న బీజేపీ నేతలు...ఉప ఎన్నిక తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో.. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు కాషాయ కండువాలు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ లిస్టులో ఉన్న ప్రధానంగా మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ గెలవని పార్లమెంట్ స్థానాల్లో ఖమ్మం ఒకటి. ఇక్కడ పాగా వేయడానికి అవసరమైన అస్త్రాలను కమలనాథులు సిద్దం చేసుకుంటున్నారు. వారితో పాటు ఇతర జిల్లాల్లోనూ బడా నేతలపై కన్నేశారు. 1. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం నుంచి గతంలో వైఎస్సార్సిపి ఎంపీగా గెలిచిన పొంగులేటి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పేరుకే పార్టీలో ఉన్నా.. పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతారు. జిల్లాలో మంచి పేరు ఉండడంతో పాటు ఆర్థికంగా పుష్కలమైన వనరులున్నాయని ఈయనకు పేరుంది. ఇటీవల ఆయన కూతురి వివాహం సందర్భంగా జిల్లా అంతటా చేసిన ఆర్భాటం ఇప్పట్లో ఎవరూ మరిచిపోరు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కమలం పాగా వేయాలంటే పొంగులేటి సరైన వ్యక్తిగా పార్టీ భావిస్తోంది. 2. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల పేరు కమలం పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. గతంలో కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత జిల్లాలో మారిన సమీకరణాలు ఇబ్బందికరంగా మారడం తుమ్మలను నిరుత్సాహపరిచాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మంత్రి పదవి వస్తుందనుకున్న తుమ్మలకు.. నిరాశే మిగిలింది. సత్తుపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు కూడా తుమ్మల రాలేదు. తుమ్మలను చేర్చుకోగలిగితే.. జిల్లాలో పార్టీ సూపర్‌హిట్ అన్న ఆలోచనలో ఉన్నారు. 3. జలగం వెంకటరావు ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జలగం వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. అమెరికాలో చదువుకుని వచ్చి సత్తుపల్లి, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో కొత్తగూడెం నుంచి రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. మారిన సమీకరణాలతో టీఆర్ఎస్ తనను పక్కన పెట్టిందన్న భావనలో జలగం వర్గం ఉంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తుమ్మలకు సన్నిహితుడిగా ఉంటోన్న జలగం.. తాజాగా సత్తుపల్లి మీటింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి సీనియర్ నాయకులను తమవైపు తిప్పుకుంటే పార్టీకి లాభం చేకూరుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. 4. జూపల్లి కృష్ణారావు తుమ్మల లాగే టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి 5 సార్లు గెలిచిన జూపల్లి.. గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారులో మంత్రిగా ఉన్నారు. 2014-18 మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో స్ట్రాంగ్ లీడర్లలో ఒకరైన జూపల్లి.. 2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓడారు. కొంత కాలంగా టీఆర్ఎస్ పట్ల జూపల్లి అసంతృప్తిగా ఉన్నారు. 5. పట్నం మహేందర్ రెడ్డి నాలుగు సార్లు తాండూరు నుంచి గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం.. 2018లో అనూహ్యంగా పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిపోవడం పట్నంకు రుచించని వ్యవహారంలా మారింది. అందుకే పట్నం మహేందర్‌రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన. 6. బాల్కొండ సునీల్ రెడ్డి బాల్కొండ టీఆర్ఎస్లో చాలా కాలం పని చేసి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ముత్యాల సునీల్‌కుమార్ రెడ్డి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాడు. నియోజకవర్గంపై కొంత పట్టున్న సునీల్‌రెడ్డి.. అవకాశం దక్కట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్‌లో సునీల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. మరింత బలోపేతం అవుతామని భావిస్తున్నారు. మొదటి ఫేజులో కొందరిని చేర్చుకోగలిగితే.. ఆటోమెటిక్‌గా మరింత మంది చేరుతారన్న భావనలో ఉన్నారు కమలనాథులు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు!
సాక్షి, వికారాబాద్: తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్ ఎవరికనే చర్చ అధికార పార్టీలో జోరుగా జరుగుతోంది. గతంలో తాండూరు స్థానం నాదంటే.. నాది అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ‘ఎర’ అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్‌పై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రం తాండూరులో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యతతో రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తన అనుచరులను సైతం వెంట తెచ్చుకొన్నారు. పదవుల విషయంలోనూ.. తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పైలెట్ రోహిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినా మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు పార్టీ, నామినేట్ పదవుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్ సీఎం కేసీఆర్ తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పైచేయిగా నిలిచారు. కలిసొచ్చేది ఎవరికో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపునకు బీజేపీ నాలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగడం.. కథ అడ్డం తిరిగి మధ్య వర్తులు జైలు పాలవడం నాలుగు రోజుల వ్యవధిలో చకచక జరిగిపోయాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా ఈ వ్యవహారం తాండూరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరి రాజకీయ భవిషత్ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు -
పంతం నీదా.. నాదా!.. ‘మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా’
నేతల మధ్య నెలకొన్న వైరం.. అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తాండూరులో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకులు వ్యక్తిగత ఎజెండాల అమలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు. రెండేళ్లకుగా పైగా ఈ తతంగాలను గమనిస్తున్న నియోజకవర్గ ప్రజలు వీరి తీరును ఈసడించుకుంటున్నారు. సాక్షి, వికారాబాద్: అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వ్యవహార శైలిపై ప్రజలు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం వినూత్న నిరసనలతో వీరి తీరును ఎండగడుతున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గల్లోనూ అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కనిపిస్తున్నా తాండూరులో ఇవి తార స్థాయికి చేరాయి. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగడం పరిస్థితికి అద్దం పట్టింది. తాండూరులో రోడ్ల దుస్థితిపై చెప్పుల దండ వేసుకుని నిరసన మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా.. ‘జనం బాధలు పట్టించుకోని ఈ నేతలకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నా’ అంటూ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చెప్పుల దండ మెడలో వేసుకుని ఇటీవల నిరసన తెలిపాడు. ‘తాండూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని రోడ్ల ను చూసి.. ఈ నాయకుల్లో చలనం రాకపోవడం తమ దౌర్భాగ్యం’ అని పట్టణ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు, అభివృద్ధిలో నూతన ఒరవడి సృష్టిస్తానని చెప్పిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సైతం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్యటనల్లో ఆందోళన చేస్తున్న ప్రజలను అరెస్టులు, గదమాయింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైలెట్ చేరికతో సీన్ రివర్స్ టీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్లో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మొదటినుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా తమవంతు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో హరీశ్వర్‌రెడ్డి వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి పార్టీకి పెద్దదిక్కుగా మారారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్న ఐదేళ్లలో మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. అనూహ్యరీతిలో 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలవగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆతర్వాత కొద్ది రోజులకే రోహిత్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీలో గ్రూపు తగాదాలకు తెరలేచింది. మంత్రి సబితారెడ్డి సమక్షంలో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు, మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, రోహిత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరుతో జనం అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి పనుల నిర్వహణ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సమయంలో నూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వీరి మధ్య అధికారులు సైతం నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల పెద్దేముల్ మండలంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేయడం నేతల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సొంత కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారనే చర్చ సాగుతోంది. -
Ranga Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..మళ్లీ ఆ ఇద్దరే
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఇప్పటికే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజుకు మరోసారి అవకాశం కల్పించింది. మహబూబ్‌నగర్ నుంచి ఇదే జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డికే మళ్లీ చాన్స్ ఇచ్చింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించ లేదు. ఆయా పార్టీలకు ఓట్లు తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలిసింది. ఆయా పార్టీలు స్థానిక సంస్థల ఫోరం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదీ లెక్క.. ► ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,179 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 627 మంది మహిళలు, 552 మంది పురుషులు ఉన్నారు. ► 310 మంది కార్పొరేటర్లు, 432 మంది కౌన్సిలర్లు, 384 మంది ఎంపీపీలు, 33 మంది జెడ్పీటీసీలు, 20 మంది ఎక్స్‌అఫీషియోలు ఉన్నారు. ► ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, వాటికి 21, 22 తేదీల్లో స్క్రూట్నీ నిర్వహించి 23న తుది జాబితా ప్రకటించనున్నారు. ► ఈ నెల 16 ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అదే రోజు నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరించి, 24న పరిశీలించి, 26న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ► ఎన్నికల కోసం రాజేంద్రనగర్, వికారాబాద్, తాండూరు, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, 14న ఫలితాలు ప్రకటించనున్నారు. -
కేసీఆర్‌ను జైలులో పెట్టే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏం చేశారని జైల్లో పెడతారు? బీజేపీకి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ముందా’ అని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాల కంటే సీఎం కేసీఆర్ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని, ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నందున అపుడు ఎవరు గెలుస్తారో చూద్దామని మహేందర్‌రెడ్డి సవాలు చేశారు. చదవండి: చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’ రామ మందిరానికి రూ.లక్ష విరాళం: పొన్నాల ‘నా పేరు లక్ష్మణుడు.. అందుకే రామభక్తితో నా వంతుగా రామ మందిర నిర్మాణానికి రూ.1,00,116 విరాళంగా ఇస్తున్నా..’అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రాముణ్ని రాజకీయాల్లోకి లాగకుంటే మంచిదని, గతంలో తాను దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టానని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయ భూముల అన్యాక్రాంతంపై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని కోరారు. -
రైతు సమితి రేసులో మహేంద్రుడు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పదవి రేసులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారా? ఆయన స్వయంగా ఈ కుర్చీని ఆశిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఆయన పేరు టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ పదవిలో కొనసాగిన నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి.. తాజాగా శాసనమండలి చైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది. సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సైతం చెబుతుండడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. సీఎం కేసీఆర్ పట్నం వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. మొన్నటి వరకు ఆ స్థానంలో రెడ్డి సామాజిక వర్గ నేత ఉండటంతో.. త్వరలో జరిగే నియామకంలోనూ అదే వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టే ఆలోచన ఉందనే చర్చ జరుగుతోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ఒక దఫా మంత్రిగా సేవలందించిన ఆయనకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మహేందర్‌రెడ్డి ఎంతో బలమైన నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. -
చిచ్చురేపిన సభ్యత్వ నమోదు
సాక్షి, తాండూరు: పట్టణంతో పాటు పలు మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గడువు ముగిసిన తర్వాత, స్థానిక ఇన్‌చార్జ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా మెంబర్‌షిప్‌లు ఇవ్వడంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఈ సారి టీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. పార్టీ సభ్యత్వం ముగిసిందని అధికారికంగా స్పష్టంచేశారు. అయితే రెండు రోజులుగా తాండూరులో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తి చేసి.. వివరాలను పార్టీ ఇన్‌చార్జ్‌లకు అందించారు. ఇదిలా ఉండగా ఆయా మండలాలు, మున్సిపల్ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షుడు గత నెలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వం పూర్తి చేసి సభ్యత్వ రశీదు బుక్కులతో పాటు సమకూరిన నగదును పార్టీకి చెల్లించారు. తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశామని నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ కమిటీల నియామకం.. మండలాల్లో, పట్టణంలో గ్రామ కమిటీలతో పాటు, వార్డు కమిటీల ఏర్పాటు సైతం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే గ్రామ కమిటీల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. అయితే రెండు రోజులుగా కొంత మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసిన స్థానిక నాయకులు విషయాన్ని తాండూరు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్‌తో పాటు మండలాల అధ్యక్షులకు చెప్పారు. సభ్యత్వ నమోదు చేస్తున్నది తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులుగా గుర్తించారు. మరోసారి వర్గపోరు.. తాండూరు నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. స్థానికంగా పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేందర్‌రెడ్డి వర్గీయులను రెచ్చగొట్టే విధంగా.. ఎమ్మెల్యే వర్గీయులు.. గడువు ముసిగిన తర్వాత సభ్యత్వం చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేశాం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి బుక్కులు, నగదును ఇన్‌చార్జ్‌లకు అందించాం. సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే వర్గీయులు మెంబర్షిప్ చేస్తున్నారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జ్‌లకు సైతం ఈ విషయాన్ని చెప్పడం లేదు. దీనిపై పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టు రామచందర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాం. – అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు -
‘పట్నం’కే పట్టం
స్సాక్షి, రంగారెడ్డి జిల్లా :థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 797 ఓట్లలో మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు దక్కగా.. ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో సోమవారం జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలోనే దాదాపుగా మహేందర్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. అభ్యర్థి వారీగా బ్యాలెట్ పేపర్లు బిండల్‌గా కడుతున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి సంకేతాలు కనిపించాయి. ఉదయం 11 గంటలకు మహేందర్‌రెడ్డి విజయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. తొలిప్రాధాన్యత ఓటుతోనే ఆయనకు విజయం దక్కింది. దాదాపు సగం ఓట్ల తేడాతో గెలుపొందడంతో గులాబీ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ తిరిగి కైవసం చేసుకోవడం విశేషం. క్రాస్ ఓటింగ్ ఆరు వందలకుపైగా ఓట్లు లభిస్తాయని టీఆర్ఎస్ మొదటి నుంచి ధీమాతో ఉంది. ఈ పార్టీ నిర్వహించిన శిబిరాల్లో 630 మంది సభ్యులకు ఆతిథ్యం కల్పించినట్లు సమాచారం. ఈ ఓట్లన్నీ తమకు దక్కుతాయని ఆశించారు. కానీ, పరిస్థితి కొంత మారింది. టీఆర్ఎస్ శిబిరంలోని కొందరు సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినట్లు తెలుస్తోంది. ఇలా వందకుపైగా ఓట్లు చేజారినట్లు టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇవి కూడా తమ ఖాతాల్లోకి వస్తే భారీ విజయం దక్కేదని భావిస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలోని సభ్యులు ప్రత్యర్థి శిబిరానికి ఆకర్షితులైనట్లు చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు మినహా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు అంతా టీఆర్ఎస్కే ఓటేసినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లలో ఎక్కువ మంది అధికార పార్టీకే ఓటేశారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. అప్పుడు ఓటమి..ఇప్పుడు గెలుపు గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాండూరు సెగ్మెంట్ నుంచి పోటీచేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఇదే సమయంలో మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ నేపథ్యంలో అప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నరేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి పోటీచేసిన మహేందర్‌రెడ్డిని విజయం వరించడం విశేషం. ‘స్థానికత’ను సానుకూలంగామలుచుకున్న టీఆర్ఎస్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు ఉన్నా స్థానికేతరుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ సానుకూంగా మలుచుకోవడంలో విజయవంతమైంది. జిల్లా నేతను కాదని స్థానికేతరునికి ఓటు ఎలా వేస్తారని సభ్యులు ఆలోచించేలా టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. ‘సీనియర్ నేతగా ఎప్పుడి నుంచో మీకు అందుబాటులో ఉన్నాను.. నన్ను కాదని ఎలా పోతారు’ అని శిబిరాల్లో ఉన్న సభ్యులను మహేందర్‌రెడ్డి అడిగినట్లు తెలిసింది. స్థానిక అభ్యర్థిని బరిలోకి దించితే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రశాంతం ముగిసింది. రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాల పాత భవన సముదాయంలో ఓట్ల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. కౌంటింగ్ కేంద్రానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, కాలె యాదయ్య, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, కార్పొరేటర్లు కోరని శ్రీలత, రావుల విజయ తదితరులతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించారు. సమష్టి కృషితో విజయం ప్రజాప్రతినిధులందరి సమష్టి కృషితో తాను భారీ మెజార్టీతో గెలుపొందినట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఓట్ల లెక్కింపు అనంతరం మహేందర్‌రెడ్డికి రిటర్నింగ్ హరీష్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండి అభివృద్ధిలో పాలుపంచుకుంటానన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏ ఎన్నికల్లోనైనా టీఆర్ఎస్దే గెలుపు ఏ ఎన్నికలు జరిగినా గెలుపు టీఆర్ఎస్ పక్షాన నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్ధానాలను టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగడంతో స్వల్ప తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయారన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో కూడా టీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. భారీ బందోబస్తు.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాల పాత భవన సముదాయం వద్ద ఏసీపీ ఆశోకచక్రవర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలను వంద మీటర్ల దూరంలోనే నిలిపి వేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. చెల్లుబాటు కాని ఓట్లు 21ఇరు పార్టీలు నిర్వహించిన శిబిరాల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలనే దానిపై సభ్యులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. దాదాపు వారం రోజులపాటు రోజుకు రెండుసార్లు అవగాహన కల్పించినట్లు సమాచారం. అయినా, సభ్యులు సరిగా ఓటు వేయలేకపోవడం గమనార్హం. మొత్తం 797 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 21 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు కాని ఓట్లలో టీఆర్ఎస్వి 3 కాగా.. కాంగ్రెస్‌వి 18 ఓట్లు ఉన్నాయి.