Private medical college
-
కొత్తగా మరో 150 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కొనసాగుతున్న కీలక సమయంలో రాష్ట్రంలో మరో కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటైన నోవా మెడికల్ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లు నింపుకునేందుకు ఆ కాలేజీకి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత ప్రైవేటు కాలేజీకి అనుమతులు రావడం గమనార్హం.తాజాగా అందుబాటులోకి వచ్చిన 150 సీట్లలో సగం అంటే 75 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రస్తుతం రెండో రౌండ్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 20–25 సీట్లు ఆ కోటాలో ఖాళీగా ఉన్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొత్త వాటిని కలిపితే 95 నుంచి 100 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయని వెల్లడించాయి.ఇలావుండగా కొత్త కాలేజీతో కలిపి రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య 29కి చేరింది. వాటిలో మల్లారెడ్డి గ్రూపునకు చెందిన రెండు మెడికల్ కాలేజీలు ఈ ఏడాది డీమ్డ్ యూనివర్సిటీగా మారాయి. అందులోని సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునే అవకాశముంది. రాష్ట్ర కౌన్సెలింగ్‌తో సంబంధం ఉండదు. దీంతో తెలంగాణ విద్యార్థులకు సీట్లు లభించే ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య 27కే పరిమితం అయింది. ఈ కాలేజీలన్నీ కలిపి 4,550 సీట్లున్నాయి. -
తొలి నుంచీ అదే విముఖత
‘‘ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ. 350 కోట్లు ఖర్చవుతుంది. దాని నిర్వహణ కోసం ఏటా రూ. 30 కోట్లు కావాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలలఏర్పాటుకు అనుమతులిస్తాం.’’– వెనుకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019కు ముందు టీడీపీ ప్రభుత్వాన్ని కోరగా అసెంబ్లీలో నాటి వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు‘‘పులివెందుల కళాశాలకు అనుమతులు రావడం విస్మయం కలిగించింది. ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. అయినా అనుమతులు వచ్చాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ పరిధిలో కొనసాగించడానికి నిధుల్లేవు. అందుకే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహించాలని నిర్ణయించాం. – ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలుఅవకాశాలను కాలరాసిన బాబువైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో, 2014–19 మధ్య విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు చొరవ చూపలేదు. 2019కు ముందు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలని రాబట్టలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి అసెంబ్లీ సాక్షిగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేమని ప్రకటించారు.విభజన చట్టం కింద కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించి నవ్వులపాలయ్యారు. గతంలో ప్రైవేట్‌లో వైద్య కళాశాలలను ప్రోత్సహించిన బాబు.. ఈ దఫా ఏకంగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం వైద్య విద్య అవకాశాలను కాలరాశారని నీట్ యూజీ ర్యాంకర్లు ధ్వజమెత్తుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించేలా గత ప్రభుత్వంలో అన్ని ఏర్పాట్లు చేపట్టగా.. ఆ కళాశాలలకు అడ్డుపడి ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్ కుటుంబం చెరగని ముద్రఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ వంటి వ్యవస్థలను ప్రారంభించి వైద్య రంగంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన హయాంలోనే కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు రూపుదిద్దుకున్నాయి. అదే విధంగా తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ కూడా వైఎస్సార్ ఏర్పాటు చేశారు. పేదలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న తండ్రి ఆశయాన్ని వైఎస్ జగన్ పుణికిపుచ్చుకున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ, 104, 108 వ్యవస్థలతో పాటు, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో గత ఏడాది 5 కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారు. మరో ఐదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉండగా కుట్రపూరితంగా బాబు ప్రభుత్వం అడ్డుపడింది. -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ కన్వినర్ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.దివ్యాంగ, మరికొన్ని ప్రత్యేక విభాగాల్లో తుది మెరిట్ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకూ పెండింగ్‌లో ఉంచారు. మొత్తం 3,879 సీట్లకు గాను తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,507 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
Karimnagar: ఒత్తిడి తట్టుకోలేక మెడికో ఆత్మహత్య
కరీంనగర్‌క్రైం: ఎంబీబీఎస్ చదవడం కష్టంగా ఉందని మానసిక ఒత్తిడికి గురైన ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కోమళ్ల ప్రహ్లాదరావు–పద్మజ దంపతులు నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నారు. కూతురు కోమళ్ల శిరీష(20) కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే చదువు కష్టంగా ఉందని పలుమార్లు శీరీష తల్లిదండ్రులకు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శిరీష శనివారం ఉద యం కళాశాల నుంచి వచ్చి ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తల్లి పద్మజ మధ్యా హ్నం ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరేసుకొని ఉండటాన్ని చూసి ఆందోళనకు గురైంది. స్థానికుల సహాయంతో ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రహ్లాదరావు ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
3 లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!
సాక్షి, హైదరాబాద్: నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరో వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశముంది. ఈసారి అర్హత మార్కులు పెరగడంతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్ని ర్యాంకులు వచ్చిన వారికి కన్వీనర్ సీట్లు వచ్చాయన్న విషయమై విద్యార్థులు ఆరా తీస్తున్నారు. లక్షల్లో ర్యాంకు వచ్చినా.. గతేడాది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్ జాతీయ స్థాయిలో 2.66 లక్షల ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీటు లభించింది. మేడ్చల్‌లోని సీఎంఆర్ మెడికల్ కాలేజీలో బీసీ సీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి ఆ ర్యాంక్‌కు సీటు వచ్చింది. అలాగే 2.62 లక్షల ర్యాంకు పొందిన బీసీ సీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్ధికి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో సీటు లభించింది. సంగారెడ్డిలోని టీఆర్ఆర్ కాలేజీలో బీసీ సీ కేటగరీకే చెందిన విద్యార్థికి 2.58 లక్షల ర్యాంక్ వచ్చినా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఈ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇక ఓపెన్ కేటగిరీ లోకల్ కోటాలో వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో 1.60 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు లభించింది. ఓపెన్ కేటగిరీలోని అన్ రిజర్వ్డ్ కోటాలో సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 58,727 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు లభించింది. పెరిగిన సీట్లతో ఈసారి విస్త్రుత అవకాశాలు... రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెరిగాయి. 2023–24 వైద్య విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద కేటాయిస్తారు. మరోవైపు ఈ ఏడాది కూడా మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. 2024–25 విద్యాసంవత్సరంలో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు రానున్నాయి. వాటికి సంబంధించి ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈసారి ఆరు కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని.. ఈ లెక్కన కనీసం 300 సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. అంటే ఆ మేరకు ఎంబీబీఎస్‌లో విద్యార్థుల చేరికలకు అవకాశాలు పెరగనున్నాయి. 15 శాతం ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో.. తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు 15 శాతం కోటా కింద పదేళ్లపాటు సీట్లు పొందేందుకు వీలు కల్పించిన ఏపీ పునర్విభజన చట్టం–2014లోని నిబంధన గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ నిబంధన వల్ల 2014 నుంచి 2022 వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 15 శాతం సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి కోటా కింద వర్తింపజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందుబాటులోకి వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను రద్దు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే ఉమ్మడి కోటాను అమలు చేసింది. ఆయా కాలేజీల్లో 1,950 కన్వీనర్ కోటా సీట్లలో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే అందులో 200కుపైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో ఇకపై ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇలా కూడా అదనంగా సీట్లు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి 3 లక్షల ర్యాంక్ పొందిన విద్యార్ధికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభిస్తుందని కాళోజీ నారాయణరావు వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఉస్మానియా, గాం«దీ, కాకతీయల్లో ఏ ర్యాంక్‌కు సీట్లు వచ్చాయంటే? – ఉస్మానియా మెడికల్ కాలేజీ ఓపెన్ కేటగిరీలోని లోకల్ కింద 19,239 ర్యాంకుకు, అన్ రిజర్వుడ్‌లో 7,943 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 30,522 ర్యాంకు వరకు కూడా సీటు లభించింది. ఎస్సీ విద్యార్థులకు లోకల్ కేటగిరీలో 89,253 ర్యాంకు సాధించినా సీటు వచ్చింది. అన్‌రిజర్వ్‌డ్‌లో 48,358 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీ లోకల్ కేటగిరీలో 90,658 ర్యాంకర్‌కు, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 73,500 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు వచ్చింది. బీసీ ఏలో లోకల్ కేటగిరీ కింద 79,611 ర్యాంకు, అన్‌రిజర్వ్‌డ్‌లో 42,349 ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చాయి. బీసీ బీలో లోకల్‌కు 30,944... అన్ రిజర్వుడుకు 12,788 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ సీలో లోకల్‌కు 69,344... అన్ రిజర్వ్‌డ్‌లో 21,822 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ డీలో లోకల్‌కు 30,465... అన్ రిజర్వ్‌డ్‌లో 20,069 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ–ఈలో లోకల్‌కు 34,482... అన్ రిజర్వ్‌డ్‌లో 20,497 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. – గాంధీ మెడికల్ కాలేజీలో ఓపెన్ కోటాలో లోకల్ కేటగిరీ కింద 8,164 ర్యాంకుకు, అన్ రిజర్వ్‌డ్‌లో 3,225 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 26,245 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కోటాలో లోకల్ కేటగిరీ కింద 80,215 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు వచ్చింది. అన్ రిజర్వ్‌డ్‌లో 39,519 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీలో లోకల్‌కు 78,656... అన్ రిజర్వ్‌డ్‌కు 47,860 ర్యాంకుకు సీటు వచ్చింది. బీసీ–ఏ లోకల్ కేటగిరీలో 36,691 ర్యాంకుకు సీటురాగా బీసీ–బీలో లోకల్ కింద 15,625 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. అలాగే బీసీ–సీలో లోకల్‌కు 55,674 ర్యాంకుకు సీటు లభించింది. బీసీ–డీలో లోకల్‌కు 14,598 ర్యాంకుకు... అన్ రిజర్వ్‌డ్‌లో 8,257 ర్యాంకుకు సీట్లు వచ్చాయి. బీసీ–ఈలో లోకల్‌కు 30,495... అన్ రిజర్వ్‌డ్‌లో 5,737 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. – వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓపెన్‌లోని లోకల్ కేటగిరీలో 36,905 ర్యాంకుకు, అన్ రిజర్వ్‌డ్‌లో 25,305 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 47,684 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీల్లో లోకల్ కేటగిరీలో 1.14 లక్షల ర్యాంకుకు సీటు వచ్చింది. అన్ రిజర్వ్‌డ్‌లో 98,658 ర్యాంకుకు సీటు వచ్చింది. ఎస్టీ కోటాలో లోకల్ కింద 1.07 లక్షల ర్యాంకు వచ్చిన వారికి... అన్ రిజర్వ్‌డ్‌లో 95,831 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ–ఏ లోకల్ కేటగిరీలో 1.09 లక్షల ర్యాంకుకు... అన్ రిజర్వ్‌డ్‌లో 66,831 ర్యాంకులకు సీట్లు వచ్చాయి. బీసీ–బీలో లోకల్‌కు 43,616... అన్ రిజర్వ్‌డ్‌కు 37,381 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ–సీలో లోకల్‌కు 94,902 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ–డీలో లోకల్‌కు 42,838, బీసీ–ఈలో లోకల్ కోటా కింద 50,030 ర్యాంక్ పొందిన వారికి సీట్లు లభించాయి. -
గంజాయి సాగులో మెడికోలు
కర్ణాటక: సమాజంలో ఆదర్శంగా ఉండవలసిన మెడికోలు పెడతోవ పట్టారు. ముగ్గురు వైద్య విద్యార్థులు గంజాయికి బానిసై తమ అద్దె ఇంట్లో ఆ మొక్కల పెంపకం చేపట్టారు. పైగా గంజాయిని విక్రయిస్తూ చివరికి కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి పట్టణానికి చెందిన విఘ్నరాజ్ (28), ధర్మపురి కడగత్తూరుకు చెందిన పాండిదొరై (27), కేరళలోని ఇడుక్కివాసి వినోద్ కుమార్ (27) నిందితులు. వీరు ముగ్గురూ శివమొగ్గ నగరంలోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. విఘ్నరాజ్ గంజాయి మొక్కలను తీసుకుని వచ్చినట్లు తెలిసింది. గంజాయి విక్రయాలు శివగంగా లేఔట్లో అద్దె ఇంటిలో కుండీలో మొక్కలను పెంచసాగాడు. మొక్కలను ఎండబెట్టి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వినోద్, పాండి దొరైతో కలిసి విక్రయించడం ప్రారంభించారు. ఈ వ్యవహారం తెలియడంతో శివమొగ్గ గ్రామీణ పోలీసులు దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి 227 గ్రాముల ఎండు గంజాయిని, అలాగే ఇంట్లో 1.5 కేజీల బరువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 10గ్రాముల చరస్, గంజాయి గింజలను, గంజాయి నూనె కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురినీ అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది. మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్ చేసినట్లు తెలిపింది. ‘హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్ పీజీ మెడికల్ సీట్స్ స్కామ్‌పై కేసు నమోదు చేశాం. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం’ అని ఈడీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
నాన్ క్లినికల్ పీజీ... నాట్ ఇంట్రెస్టెడ్!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ పీజీ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. తద్వారా స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. అందువల్ల క్లినికల్ విభాగంలోని సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కోట్లు ఖర్చు చేసి వాటిల్లో చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. కానీ నాన్ క్లినికల్ పీజీ సీట్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ సీట్లను పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరడంలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాధారణ ఫీజు చెల్లిస్తే చాలనీ, డొనేషన్ కూడా వద్దని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. క్లినికల్ సీట్లపైనే అందరి దృష్టి... క్లినికల్ విభాగంలోని సబ్జెక్టులన్నింటికీ భారీగా డిమాండ్ ఉండగా, నాన్క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండటం లేదు. నాన్క్లినికల్లో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రో బయోలజీ, ఎస్పీఎం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టులున్నాయి. ఇవి చేసిన వారికి ప్రధానంగా మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా చేయడానికి వీలుంటుంది. ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి వాటికి ఇతరత్రా అవకాశాలుంటాయి. కానీ క్లినికల్ కోర్సుల మాదిరి నాన్ క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండదు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాన్క్లినికల్ అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడంలేదు. దీంతో ఈ కోర్సులు చేసినవాళ్లు చాలామంది ఖాళీగా ఉంటున్నారు. నాన్ క్లినికల్ కోర్సులు చేసినవారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు కాలేజీల్లోనూ అవకాశాలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో రూ. లక్షకు పైగా జీతాలు తీసుకున్నవారు, ఇప్పుడు రూ. 40–50 వేలకే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ఆ మేరకైనా అవకాశాలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నాన్ క్లినికల్ విభాగాల్లో చేరడానికి ఆసక్తి చూపడంలేదు. క్లినికల్ విభాగాలైన జనరల్ మెడిసిన్, రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, ఆర్థో, గైనిక్ తదితర కీలకమైన వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. బయట ప్రాక్టీస్ చేయడానికి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ జీతాలు పొందడానికి క్లినికల్ మెడికల్ కోర్సులే ఉపయోగపడతాయి. క్లినికల్ సీట్లనైనా పెంచితే... మెడికల్ కాలేజీల్లో నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతుండటంపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సీట్లుండీ మిగిలిపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని అంటున్నాయి. ఇన్ సర్వీస్ కోటా కింద భర్తీ చేసుకోవడానికి వీలు కల్పించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు గతంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు లేఖ రాశాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ‘నీట్’పరీక్ష తప్పనిసరి కాబట్టి తామేమీ చేయలేమని ఎన్ఎంసీకి చెందిన కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాన్ క్లినికల్ సీట్లను తగ్గించి క్లినికల్ సీట్లనైనా పెంచితే బాగుంటుందని ఎంబీబీఎస్ విద్యార్థులు కోరుతున్నారు. -
MBBS: ‘బీ’ కేటగిరీ సీట్లకు తగ్గిన కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లలో 85 శాతం కోటా రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వడంతో నీట్లో పొందిన మార్కుల కటాఫ్ తగ్గినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కంటే కటాఫ్ తగ్గడం వల్ల, ఈసారి కొత్తగా వెయ్యి మంది రాష్ట్ర విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. గతేడాది ఒక ప్రైవేట్ కాలేజీలో చివరి బీ కేటగిరీ సీటు 399 మార్కుల వరకు కటాఫ్ వచ్చిన విద్యార్థికి వచ్చింది. ఇప్పుడు ఇంకా రెండు దశలున్నప్పటికీ మొదటి విడత బీ కేటగిరీ సీట్లలో ఒక ప్రైవేట్ కాలేజీలో 309 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చిందని వర్సిటీ వర్గాలు చెప్పాయి. గతేడాది చివరి కౌన్సెలింగ్ నాటి పరిస్థితితో పోలిస్తే, ఇప్పుడు మొదటి విడత సీట్ల భర్తీలోనే కటాఫ్ తగ్గిందన్నాయి. ఈసారి 290 మార్కులొచ్చిన వారికీ బీ కేటగిరీలో సీటు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 287 మార్కులొచ్చిన ముస్లిం విద్యార్థినికి మైనారిటీ కాలేజీలో బీ కేటగిరీలో సీటు వచ్చింది. ముస్లిం విద్యార్థులకు కూడా తాజా రిజర్వేషన్ల వల్ల న్యాయం జరిగిందని చెబుతున్నారు. గతేడాది 6,500 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోగా, ఈసారి రెండు వేల వరకు మాత్రమే వచ్చినట్లు అంచనా. ఇతర రాష్ట్రాలకు తగ్గిన వలసలు ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో బీ కేటగిరీలోని 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల అడ్మిషన్ల నిబంధనలు సవరించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభిస్తున్నాయి. రాష్ట్రంలో 20 నాన్ మైనార్టీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 1,120 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణతో బీ కేటగిరీలోని 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్ల(168)కు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. అలాగే 4 మైనార్టీ కాలేజీల్లో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు ఇక్కడి వారికే దక్కుతున్నాయి. ఇప్పటివరకు లోకల్ కోటా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో చేరేవారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగేది. మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడి విద్యార్థులకు సీటు రావడంతోపాటు తక్కువ మార్కులొచ్చిన వారూ సీట్లు పొందే వెసులుబాటు వచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో మన విద్యార్థులు అక్కడ కూడా సీటు పొందే అర్హత ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్థానిక కోటా తేవడంతో పరిస్థితి మారిందని తెలంగాణ ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్ల స్థానిక సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవిప్రసాద్ పేర్కొన్నారు. కటాఫ్ కూడా మారిందన్నారు. కటాఫ్ తగ్గుతుంది బీ కేటగిరీ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల కటాఫ్ మార్కులు గతంతో పోలిస్తే తగ్గుతున్న మాట వాస్తవమే. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా చాలా తక్కువగా దరఖాస్తు చేయడంవల్ల ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు బీ కేటగిరీ సీట్లకు ఇంకా రెండు విడతల కౌన్సెలింగ్ ఉన్నందున ఎంతమేరకు కటాఫ్ తగ్గే అవకాశాలున్నాయో ఇంకా స్పష్టత రాలేదు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ -
సీ–కేటగిరీలో 120 ఎంబీబీఎస్ సీట్ల మిగులు
హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు జరిగిన మొదటి విడత ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో బీ–కేటగిరీలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీ–కేటగిరీలో 319 ఎంబీబీఎస్ సీట్లకు 199 భర్తీ కాగా 120 సీట్లు మిగిలినట్లు అధికారులు తెలిపారు. సీ–కేటగిరీలో 150 బీడీఎస్ సీట్లకు 48 భర్తీ కాగా 102 సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 26 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, లేదంటే సీటు రద్దవుతుందన్నారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. పూర్తి వివరాలు హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ బీ–కేటగిరీ సీట్లు భర్తీ
హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ బీ–కేటగిరీలో 676 సీట్లు భర్తీ అయినట్లు కౌన్సెలింగ్ అధికారి ప్రొఫెసర్ అప్పారావు గురువారం వెల్లడించారు. ఉస్మానియా వర్సిటీలో గత 3 రోజులుగా నిర్వహించిన ప్రైవేటు కళాశాలల తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ ముగిసిందన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌కు 4,133 ర్యాంక్ వరకు పిలువగా.. నాన్ మైనార్టీలో 1,188 ర్యాంక్ వరకు 605 మంది విద్యార్థులు, మైనార్టీలో 2,805 ర్యాంక్ వరకు 71 మంది ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందినట్లు తెలిపారు. గురువారం నాటికి బీ–కేటగిరీ బీడీఎస్ కోర్సులో మొత్తం 384 సీట్లకు 20 సీట్లు మిగిలినట్లు చెప్పారు. సీ–కేటగిరీలో 3,594 ర్యాంక్ వరకు జరిగిన కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌లో 319 సీట్లకు 178 సీట్లు, బీడీఎస్‌లో 150 సీట్లకు 124 సీట్లు మిగిలినట్లు తెలిపారు. పూర్తి వివరాలను హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. -
చివరి విడత కౌన్సెలింగ్ రద్దు
- యాజమాన్య పీజీ వైద్య సీట్ల చివరి విడత కౌన్సెలింగ్ రద్దు - నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయం - కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారమే చేశామంటున్న అధికారులు - ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యానికి సీట్లు వదిలేసిన వైనం సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మిగిలిన యాజమాన్య పీజీ వైద్య సీట్లకు చివరి విడత (మాప్ అప్ రౌండ్) కౌన్సెలింగ్ రద్దు చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నిర్ణయం తీసుకుంది. అందుకోసం సోమవారం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల సంఘం అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ స్పష్టం చేసింది. మిగిలిన సీట్లను యాజమాన్యాలే సొంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో బుధవారం జరగాల్సిన కౌన్సెలింగ్ కూడా రద్దు చేసినట్లయింది. ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఎంసీఐ ఆదేశాలున్నా వర్సిటీ ఇలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాప్ అప్ రౌండ్ తర్వాత మిగిలే సీట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలే భర్తీ చేసుకోవచ్చని ఈ నెల 26న కేంద్రం స్పష్టం చేసిందని, ఆ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అయితే మాప్ అప్ రౌండ్ ముగియకపోయినా కౌన్సెలింగ్ రద్దు చేయడంపై విమర్శలొస్తున్నాయి. 241 సీట్లను సొంతంగా కేటాయించుకునే వీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో 241 సీట్లు మిగిలిపోయాయి. ఇటీవల 415 మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా 268 సీట్లే భర్తీ అయ్యాయి. 147 సీట్లు మిగిలిపోయాయి. పీజీ డెంటల్ కోర్సుల్లోని 153 సీట్లలో 59 భర్తీ కాగా 94 సీట్లు మిగిలాయి. ఆ సీట్లను ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలు అమ్ముకోవ డానికి వీలు చిక్కింది. మెడికల్ కోర్సు ల్లోని నాన్ క్లినికల్ కోర్సులకు డిమాండ్ లేదని, డెంటల్ కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపింట్లేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మెడికల్ సీట్లల్లో 10 వరకే క్లినికల్ సీట్లుంటా యంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో 80 వరకు నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోయా యని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
పీజీ వైద్య యాజమాన్య సీట్లకు నోటిఫికేషన్
జారీ చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం - ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం వరకు గడువు - కన్వీనర్ కోటాలో రెండో దశలో మిగిలిన సీట్లకూ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకునే ప్రక్రియ శనివారం ఉదయం 11 గంటలకే ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. పీజీ నీట్–2017లో అర్హు లైన విద్యార్థులు ఎవరైనా ఈ ప్రవేశాలకు దర ఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలకు అర్హులు. దరఖాస్తు అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి రాష్ట్రంలోని 11 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ, డిప్లొమా వైద్య సీట్లను, 8 డెంటల్ కాలేజీల్లోని ఎండీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను 24వ తేదీ సాయంత్రమే వెల్లడిస్తారు. 25న 25 శాతం యాజమాన్య కోటా సీట్లకు అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉస్మానియా యూనివర్సిటీలోని దూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తారు. అనంతరం అప్పటికప్పుడే కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటా యిస్తారు. ఇక 15 శాతం ఎన్ఆర్ఐ కోటా, 10 శాతం ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లకు 26వ తేదీ ఉదయం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి సీట్లను కేటాయిస్తారు. ఇక అదేరోజు మధ్యాహ్నం నుంచి ఎండీఎస్ సీట్ల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి సీట్లను కేటాయిస్తారు. 27వ తేదీ నాటికి తమకు కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరాలి. సీట్లు మిగిలితే 28వ తేదీన మరో సారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అందులో సీటొచ్చిన విద్యార్థులు 29వ తేదీన చేరాలి. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే 30, 31వ తేదీల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు వెంటవెంటనే కాలేజీల్లో చేరాలి. ఈ నెల 31వ తేదీ నాటికి ఎలాగైనా పీజీ వైద్య అడ్మిషన్ల ప్రక్రియను ముగిస్తారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటులోని కన్వీ నర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ సీట్లలో చేరేం దుకు శనివారం మధ్యాహ్నంతో గడువు ముగి సింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలి పోయిన సీట్లను భర్తీ చేసేందుకు విశ్వవిద్యా లయం మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇన్స్టిట్యూషన్ కోటా అంటే..? తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈసారి పీజీ మెడికల్ సీట్లలో ఇన్స్టిట్యూషన్ కోటా అంటూ ప్రత్యేక కేటగిరీని తీసుకొచ్చింది. ఇన్స్టిట్యూషన్ కోటాకు 10 శాతం సీట్లు కేటాయించారు. దీంతో పీజీ వైద్య సీట్లలో నాలుగు కేటగిరీలు అయ్యాయి. ప్రస్తుతం కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ కోటా ఇప్పటివరకు కర్ణాటకలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. సంబంధిత ప్రైవేటు మెడికల్ కాలేజీ సొంతంగా ఆ సీట్లను కేటాయించుకోవ డానికి వీలు కల్పించడమే ఈ కేటగిరీ ప్రత్యేకత. ప్రైవేటు మెడికల్ కాలేజీ లేదా అనుబంధ బోధనాసుపత్రిలో పనిచేసే వైద్యులు లేదా వారి పిల్లలు లేదా కాలేజీ యజమానుల పిల్లలకు ఈ కేటగిరీలో సీట్లు ఇచ్చుకోవచ్చు. సీట్లు తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ కాలేజీ యాజమాన్యం నచ్చినవారికి ఇచ్చుకోవచ్చు. కాగా, వచ్చే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలోనూ ఇన్స్టిట్యూషన్ కోటాను తీసుకొచ్చే ఆలోచన ఉందని అంటున్నారు. -
నేడు యాజమాన్య పీజీ వైద్య సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య యాజమాన్య, ఎన్నారై, ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లకు శనివారం నోటిఫికేషన్ జారీకానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ప్రకటన విడుదల చేయనుంది. ప్రైవేట్ మెడికల్ పీజీ సీట్ల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే విధించడం, స్టే ఎత్తివేతకు కాలేజీలు పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ప్రైవేట్ కాలేజీలకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. రెండో విడత కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో కొందరిని శుక్రవారం చేర్చుకున్నాయి. బ్యాంకు గ్యారంటీపై గందరగోళం నెలకొనడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మొదలైందని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సమయం సరిపోకపోవడంతో శనివారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిం చారు. కన్వీనర్ కోటా సీట్లకు ఒకవైపు కౌన్సిలింగ్ నిర్వహిస్తూనే యాజమాన్య, ఎన్నారై కోటా సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా విద్యార్థులను నేరుగా పిలిపించి సీట్లు కేటాయిస్తారు. ఈ నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. -
విద్యార్థులను మేం చేర్చుకోం
- తిప్పి పంపిన కాలేజీలు - ప్రహసనంగా మారిన ‘ప్రైవేటు’ వైద్య అడ్మిషన్లు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య అడ్మిషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులను చేర్చుకునేందుకు మంగళవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తిరస్కరించాయి. ప్రవేశాలకు బుధవారమే చివరి తేదీ కావడం, కళ్ల ముందే సీటు పోయే పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు కన్నీరుమున్నీ రవుతున్నారు. యాజమాన్యాలేమో ఫీజులను పెంచకపోతే పీజీ కోర్సులను నడ పలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఫీజుల పెంపుపై స్టేను ఉపసంహరించాలంటూ హైకోర్టులో అవి వేసిన పిటిషన్‌పై గురువారం తీర్పు వచ్చే అవకాశముంది. సుప్రీంకోర్టులో ఓ కాలేజీ యాజమాన్యం వేసిన పిటిషన్‌పై బుధవారమే తీర్పు రావచ్చంటున్నారు. ఫీజులు పెంచకుంటే పీజీ కోర్సులను కొనసాగించలేమని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు అన్నారు. ‘‘హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. అక్కడా అదే జరిగితే ఈ ఏడాది పీజీ వైద్య కోర్సులను నిలిపేస్తాం. మరో గత్యంతరం లేదు మాకు’’ అని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కాలేజీలు విద్యార్థులను చేర్చుకోక పోతే ఏం చేయాలో ఆలోచిస్తున్నామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. గడువు పెంచబోమన్న ఎంసీఐ తొలి విడత కౌన్సిలింగ్ తర్వాత మిగిలి పోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటులో కన్వీనర్ కోటా సీట్లకు ఇటీవల రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం తెలిసిందే. సీట్లు దక్కిన విద్యార్థులకు చేరేందుకు మంగళ, బుధ వారాలు సమయమిచ్చారు. ప్రైవేటులో కన్వీనర్ కోటా కింద ఉన్న 368 పీజీ సీట్లల్లో చేరేందుకు మంగళవారం కాలేజీల కు వచ్చిన విద్యార్థులను యాజమాన్యాలు చేర్చుకోలేదు. వివరాలు నమోదు చేసుకుని పంపించారు. పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా ముగించాల్సి ఉంది. ఆ గడువును పొడిగించబోమని ఎంసీఐ తాజాగా స్పష్టం చేసింది. కానీ ఇప్పటికి రెండో విడత కౌన్సిలింగే అయియింది. సీట్లు మిగిలితే మూడు, నాలుగు విడతల కౌన్సిలింగ్ కూడా జరగాల్సి ఉంటుంది. పైగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి సర్టిఫికేట్లు తనిఖీ చేసి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఇదంతా ఎప్పటికి జరుగుతుందన్నది అంతుబట్టడం లేదు. -
ఎన్ఆర్ఐ మెడికల్ పీజీ ఫీజు 2.27 కోట్లు
-
ఎన్ఆర్ఐ మెడికల్ పీజీ ఫీజు 2.27 కోట్లు
- కన్వీనర్ కోటా సీటుకు రూ.6.90 లక్షలు - ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల ఫీజులకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అచ్చంగా అదేవిధంగా ఫీజులు పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫీజులనే ఖరారు చేస్తామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. ఏపీ ప్రభుత్వం యాజమాన్య కోటాతో పాటు ఇటు కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను కూడా భారీగా పెంచింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో క్లినికల్ కన్వీనర్ కోటా సీటుకు రూ. 3.2 లక్షల ఫీజుండగా, దాన్ని రూ. 6.90 లక్షలకు పెంచుతారు. ప్రస్తుతం యాజమాన్య కోటా సీట్లకు రూ. 5.80 లక్షలున్న సంగతి తెలిసిందే. దాన్ని రూ. 24.20 లక్షలు చేయనున్నారు. 25 శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్ల కేటగిరీని కొత్తగా సృష్టించనున్నారు. ఆ ఎన్ఆర్ఐ సీట్ల ఫీజు యాజమాన్య కోటా సీటుకు వసూలు చేసే సొమ్ముపై మూడు రెట్లు మించకుండా వసూలు చేసుకోవచ్చు. అంటే ఏడాదికి రూ. 72.60 లక్షల వరకు, మూడేళ్లకు కలిపి రూ. 2.27 కోట్లు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. -
పీజీ వైద్య ఫీజుల పెంపునకు సర్కారు ఓకే!
- ప్రైవేటు కాలేజీల విన్నపాన్ని ఏఎఫ్ఆర్సీకి పంపిన వైద్యారోగ్యశాఖ - ఎంతెంత పెంచాలన్న దానిపై లేఖ తీసుకురమ్మని కాలేజీలకు సూచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య సీట్ల ఫీజు పెంపునకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇచ్చిన వినతిపత్రాన్ని ‘అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)’కి పంపించింది. మరోవైపు ఫీజులు ఎంతెంత పెంచాలన్న దానిపై స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని ప్రైవేటు కాలేజీలకు సూచించింది. వాటిని కూడా ఏఎఫ్ఆర్సీకి పంపించి తుది నిర్ణయం తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. సీట్లను మార్చండి పీజీ వైద్య ఫీజులను పెంచకుంటే ఆయా సీట్లన్నింటినీ తాము ఉపసంహరించుకుంటామని రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కన్వీనర్ కోటాలోని 50 శాతం సీట్లుపోగా.. మిగతా సీట్లలో 25 శాతం బీ కేటగిరీగా, మరో 25 శాతం ఎన్నారై కోటా సీట్లుగా మార్చాలని డిమాండ్ చేశాయి. కన్వీనర్ కోటా, బీ కేటగిరీ సీట్లను ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని, ఎన్నారై కోటా సీట్లను సొంతంగా భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరాయి. అన్ని రకాల ఫీజులను పెంచాలని కోరాయి. ప్రస్తుతం క్లినికల్ కన్వీనర్ కోటా సీటుకు రూ.3.2 లక్షల ఫీజు ఉండగా.. రూ.12 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాయి. యాజమాన్య కోటా సీట్లకు ఫీజు రూ.5.8 లక్షలుగా ఉండగా.. వాటిని విభజించి బీ కేటగిరీ సీట్లకు రూ.25 లక్షలకు, ఎన్నారై కోటా సీట్లకు రూ.50 నుంచి 60 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ ఫీజుల విషయంలో ప్రైవేటు కాలేజీల మధ్య ఏకాభిప్రాయం లేనందున పూర్తి స్పష్టతతో రావాలని సర్కారు సూచించినట్లు తెలిసింది. ఉమ్మడి కౌన్సెలింగ్‌పై సుప్రీంకు.. రాష్ట్రంలోని 8 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 460 క్లినికల్ పీజీ సీట్లు, 138 నాన్ క్లినికల్ సీట్లు ఉన్నాయి. క్లినికల్ సీట్లకు విద్యార్థుల నుంచి డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం 460 క్లినికల్ సీట్లలో 50 శాతం (230 సీట్లు) కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుండగా.. మిగతా 230 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. ఇందుకోసం భారీగా ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. అయితే నీట్ ర్యాంకుల నేపథ్యంలో ఈసారి నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు సర్కారు ఏర్పాట్లు చేస్తుండటంతో మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కంగుతిన్నాయి. పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ వద్దని, యాజమాన్య సీట్లను సొంతంగా భర్తీ చేసుకుంటామని పట్టుబట్టాయి. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నందున తామేమీ చేయలేమని, ఉమ్మడి కౌన్సెలింగ్‌కు అంగీకరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ఫీజులు పెంచకుంటే పీజీ సీట్ల ఉపసంహరణ
- ప్రభుత్వానికి ప్రైవేటు మెడికల్ కాలేజీల అల్టిమేటం - ఎన్ఆర్ఐ కోటా సృష్టించి రూ.60 లక్షల ఫీజు పెంపునకు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. పీజీ వైద్య ఫీజులను పెంచకుంటే ఆయా సీట్లన్నింటినీ తాము ఉపసంహరించుకుంటామని హెచ్చరించాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్య సంఘం లేఖ ఇచ్చింది. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని పీజీ వైద్య సీట్లలో 50% కన్వీనర్ కోటా కింద, మిగిలిన 50% యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ పద్ధతిని మార్చాలని డిమాండ్ చేశాయి. ఇక నుంచి కన్వీనర్ కోటా 50% సీట్లలో ఎలాంటి మార్పు అవసరం లేదని, మిగిలిన వాటిల్లో 25% బీ కేటగిరీగా, మరో 25% ఎన్ఆర్ఐ కోటా సీట్లుగా మార్పు చేయాలని కోరాయి. కన్వీనర్ కోటా, బీ కేటగిరీ సీట్లను ఉమ్మడి కౌన్సె లింగ్ ద్వారా, 25% ఎన్ఆర్ఐ కోటా సీట్లను సొంతంగా భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పిం చాలని కోరాయి. ప్రస్తుతం క్లినికల్ కన్వీనర్ కోటా సీటుకు రూ.3.2లక్షల ఫీజుండగా, దాన్ని రూ.12 లక్ష లకు పెంచాలని డిమాండ్ చేశాయి. అలాగే యాజమాన్య కోటా సీట్లకు రూ.5.8 లక్షలున్న సంగతి తెలిసిందే. వీటిని విభజించి బీ కేటగిరీ సీట్లకు రూ.25 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు పెంచాలని కోరాయి. లేఖ ఇచ్చిన మాట వాస్తవమే... యాజమాన్యాలు కోరుతున్నట్లు 25 శాతం ఎన్ఆర్ఐ కోటా సీట్లను సృష్టిస్తే ఆ ప్రకారం 115 సీట్లు సొంతంగా భర్తీ చేసుకోవడానికి వీలవు తుంది. వాటికి ఏడాదికి రూ.60 లక్షల వరకు అంటే మూడేళ్లలో ఒక్కో సీటుకు రూ.1.8 కోట్లు వసూలు చేసే అవకాశం కలుగుతుంది. తాము కోరినట్లుగా ఎన్ఆర్ఐ కోటా సృష్టించడంతోపాటు ఫీజులు పెంచకుంటే ఈ ఏడాది పీజీ వైద్య సీట్లను కాలేజీల నుంచి ఉపసంహరించుకుంటామని ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇరుకున పడిన ప్రభుత్వం... రాష్ట్రంలో 8 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 460 క్లినికల్ పీజీ. 138 నాన్ క్లినికల్ సీట్లున్నాయి. క్లినికల్ సీట్లకే విద్యార్థుల నుంచి డిమాండ్ ఉంటుంది. నాన్ క్లినికల్ సీట్లు చాలాసార్లు భర్తీ కావు. క్లినికల్‌లో 50% అంటే 230 సీట్లు కన్వీనర్ కోటా కింద, మిగిలిన 230 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. నీట్ ర్యాంకుల నేపథ్యంలో ఈసారి నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు సర్కారు ఏర్పాట్లు చేస్తుండటంతో మెడికల్ కాలేజీల యాజమా న్యాలు కంగుతిన్నాయి. ఇప్పటివరకు ఒక్కో యాజమాన్య పీజీ వైద్య సీటును డిమాండ్‌ను బట్టి రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకు డొనేషన్ వసూలు చేసేవి. ఉమ్మడి కౌన్సెలింగ్‌తో డొనేషన్‌కు చెక్ పడుతుండటంతో యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. -
ప్రైవేటు పీజీ వైద్య ఫీజుల పెంపు!
వైద్యారోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం - ప్రైవేటు మెడికల్ కాలేజీలతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు - ఫీజులు రెండింతలు చేయాలంటున్న ప్రైవేటు కాలేజీలు - ఉమ్మడి కౌన్సెలింగ్‌పై న్యాయ సలహాకు సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య విద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల ఫీజును పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతోపాటు పీజీ, యూజీ వైద్య సీట్లను ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతారని, అనంతరం ఫీజుల పెంపు, ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ప్రకటన వెలువడనుందని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. చర్చల సందర్భంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఉమ్మడి కౌన్సెలింగ్ వద్దని కోరాయి. కానీ భారత వైద్య మండలి (ఎంసీఐ) ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించి తీరాలని, అయినా ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తున్నామని మంత్రి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక పీజీ వైద్య సీట్ల ఫీజును రెండింతలకుపైగా పెంచాలని యాజమాన్యాలు మంత్రిని కోరగా.. దీనిపై మంత్రి ఎటువంటి హామీ ఇవ్వలేదని, సీఎంతో మాట్లాడాక నిర్ణయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల భర్తీ ఉండనున్నందున ఫీజుల పెంపు విషయంలో సర్కారు తమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని యాజమాన్యాలు కోరినట్లు తెలిసింది. డొనేషన్లకు చెక్..! ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా క్లినికల్ సీట్లకు రూ.3.2 లక్షలు, యాజమాన్య కోటాలోని క్లినికల్ సీట్లకు రూ.5.8 లక్షలుగా ఫీజు ఉంది. కానీ యాజమాన్యాలు పీజీ సీట్లకు డొనేషన్ల పేరుతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేస్తున్నాయి. అయితే నీట్ ర్యాంకులతో ఈసారి నుంచి డొనేషన్లకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్య కోటా సీట్లకు ఫీజులు భారీగా పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇది సున్నితమైన వ్యవహారం కనుక ఆచితూచి అడుగు వేయాలని, విద్యార్థులపై అధిక భారం పడకుండా నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి కౌన్సెలింగ్‌కే వెళ్లాలన్న కేంద్రం ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే పీజీ, యూజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు తాజాగా మరోసారి రాష్ట్రానికి లేఖ రాసింది. కన్వీనర్, యాజమాన్య కోటా, ఎన్నారై సీట్లన్నింటికీ ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు న్యాయ సలహాకు వెళ్లినా ప్రయోజనం ఉండదన్న చర్చ జరుగుతోంది. -
వైద్య విద్య ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్
ప్రైవేటు మెడికల్ యాజమాన్య సీట్ల ప్రత్యేక కౌన్సెలింగ్ రద్దు ⇒ నీట్ ఆధారంగా ఒకే ర్యాంకుృఒకే కౌన్సెలింగ్ విధానం ⇒ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశం ⇒ 2017-18 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలకు సూచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2017-18 నుంచి నిర్వహించే అన్ని వైద్య విద్య ప్రవేశాలకూ ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సహా అన్ని పీజీ వైద్య సీట్లను ఏకీకృత ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని పేర్కొంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు సహా ఏ వైద్య విద్యా సంస్థకూ ఉమ్మడి కౌన్సెలింగ్ నుంచి మినహాయింపు ఉండదని తెలిపింది. ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2000, గ్రాడ్యు యేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-1997 చట్టా లకు సవరణలు తెస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సవరణల ఆధారంగానే ఉమ్మడి కౌన్సెలింగ్ కు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. 2016-17లో బిహార్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, యూపీలు వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి కౌన్సెలింగ్ విధానాన్ని తెలుసుకొని మిగతా రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది. అఖిల భారత కోటా పీజీ, యూజీ మెడికల్ సీట్లకు మాత్రం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌ను ఏప్రిల్ 4 నుంచి ప్రారంభించి మే చివరికల్లా అడ్మిషన్ల ప్రక్రియను ముగిస్తారు. ఉమ్మడి కౌన్సెలింగ్‌తో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజులెలా ఉన్నా ప్రతిభగల వారికే సీట్లు లభిస్తాయి. ఒకే ర్యాంకు... ఒకే కౌన్సెలింగ్ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడిక ల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కేంద్రం నీట్‌ను తప్పనిసరి చేయడంతో గతేడాది నీట్ ర్యాం కుల ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లకు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ప్రత్యేకంగా ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు యాజమాన్యాలే మరో కౌన్సెలింగ్ నిర్వహించుకున్నాయి. ఎన్ఆర్ఐ కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్మేసుకున్నాయి. దీంతో నీట్ ర్యాంకులను ఆధారం చేసుకున్నా అనేకమంది డొనేషన్లు చెల్లించే బీ కేటగిరీ సీట్లల్లో చేరాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పడనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50%, మైనారిటీ కాలేజీల్లోని 60% సీట్లను కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. ప్రైవేటులోని 35%, మైనారిటీలోని 25% సీట్లు బీ కేటగిరీ సీట్లుకాగా మిగిలినవి ఎన్ఆర్ఐ కోటా సీట్లున్నాయి. దాదాపు 915 బీ కేటగిరీ సీట్లకూ ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఈ సీట్లన్నీ ప్రతిభ ఉన్నవారికే లభిస్తాయని అంటున్నారు. ఇక ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఎలా భర్తీ చేస్తారనేది తేలాల్సి ఉంది. నీట్ ప్రకారం యాజమాన్య సీట్లన్న నిర్వచనమే ఉంది తప్ప బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా లేదన్న వాదనలూ ఉన్నాయి. ఈ సీట్లనూ నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తే అప్పుడు వాటినీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. -
MBBS సీట్లపై MCI సంచలన నిర్ణయం
-
నేటి నుంచి ‘మెడికల్’ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను గురువారం విద్యార్థులకు కేటాయించారు. రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను ఎంచుకున్న విద్యార్థులకు సీటు పొందిన కాలేజీ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలిపారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్సైట్లో కాలేజీలు, సీట్ల జాబితా వివరాలు అందుబాటులో ఉంచారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లను, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్సీసీ, మిలటరీ కోటా మినహా) భర్తీ చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం నుంచి ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు కాలేజీల్లో చేరవచ్చని, మరుసటి రోజు నుంచే (26వ తేదీ) తరగతులు ప్రారంభమవుతాయని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్, మిలటరీకి ఒక శాతం, ఎన్సీసీకి 0.5 శాతం సీట్ల కేటాయింపు చేయాల్సి ఉందని.. ఆ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఎంసెట్-3లో మొదటి ర్యాంకర్ రేగళ్ల ప్రపుళ్ల మానస ఉస్మానియా మెడికల్ కాలేజీలో, రెండో ర్యాంకర్ పి.శ్రీహారిక గాంధీ మెడికల్ కాలేజీలో, మూడో ర్యాంకర్ తప్పెట తేజస్విని, నాలుగో ర్యాంకర్ జీషాన్ అహ్మద్ జలీలి, ఐదో ర్యాంకర్ ఇక్రమ్ ఖాన్లు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందారన్నారు. ఆరో ర్యాంకర్ అడ్ల శ్రీకంఠేశ్వర్రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీ, ఏడో ర్యాంకర్ మిట్టపల్లి అలేఖ్య, ఎనిమిదో ర్యాంకర్ నుజాత్ ఫాతిమా ఉస్మానియా మెడికల్ కాలేజీ, తొమ్మిదో ర్యాంకర్ కావ్య బలుసు, పదో ర్యాంకర్ వెంపటి రూపీష్ గాంధీలో సీటు పొందారు. ఓపెన్‌లో కటాఫ్ 1,205, ఎస్సీలో 7,125 రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌లో 11,866 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆప్షన్లు ఇచ్చిన వారి వివరాలను పరిశీలించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు గురువారం కట్ ఆఫ్ ర్యాంకు వివరాలు ప్రకటించారు. ఓపెన్ కేటగిరీలో 1,205 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 7,125 ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఎస్టీ కేటగిరీలో 5,582, బీసీ ‘ఎ’లో 5,765, బీసీ ‘బి’లో 2,359, బీసీ ‘సి’లో 3,582, బీసీ ‘డి’లో 2,477, బీసీ ‘ఇ’లో 2,582 ర్యాంకుల వరకు కట్ ఆఫ్ వచ్చింది. ‘ఉస్మానియా’లో బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ రాష్ట్రంలోని 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,050 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో 713 బీ కేటగిరీ సీట్లు ఉన్నాయి. వాటికి ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. శుక్ర, శనివారాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి రోజు 9 గంటలకు 1 నుంచి 500 సీరియల్ నంబరు గల విద్యార్థులు, మధ్యాహ్నం 2 గం. నుంచి 500-1,000 నంబర్ విద్యార్థులు హాజరు కావాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి 1,001-2,000 నంబర్ విద్యార్థులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 2,001-4,101 నంబర్ విద్యార్థులు హాజరుకావాలని పేర్కొన్నాయి. -
17 నుంచి ఎంసెట్-3 కౌన్సెలింగ్
- 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. 20, 21 తేదీల్లో ఆన్లైన్లో ఆప్షన్లు - 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపు.. 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 17న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంసెట్-3 ఫలితాలు, ర్యాంకులు విడుదల చేశాక.. 17 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా వారి మొబై ల్ నంబర్‌కు పాస్వర్డ్ పంపిస్తా రు. విద్యార్థులు 20, 21 తేదీల్లో ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. నిర్ధారించిన రోజున విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 23, 24 తేదీల్లో బీ కేటగిరీకి ఆప్షన్లు.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35 శాతం బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లకు నేటి నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గురువారం నుంచి 19 వరకు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను పరిశీలించి, మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఆ జాబితా ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఉస్మానియా వర్సిటీలోని దూర విద్యా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ప్రైవేటు కాలేజీల సంఘం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. సీటు పొందిన వారు వెంటనే మొదటి ఏడాది ఫీజును చెల్లించాలని, మరో ఏడాదికి గ్యారంటీ చూపించాల్సి ఉంటుందని ప్రైవేటు మెడికల్ కాలేజీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27 నాటికి కాలేజీల్లో చేరాలన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 15 శాతం ఎన్నారై కోటా సీట్లకు ప్రత్యేకంగా కాలేజీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారని వెల్లడించారు. గడువులోగా పూర్తి చేసేందుకే.. నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో అడ్మిషన్లను ఈ నెలాఖరుకే పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహిం చడంతో ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. దీంతో గడువులోగా ప్రవేశాలు పూర్తి చేయడం సాధ్యం కాదని భావించిన సర్కారు.. అదనంగా నెల సమయం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ సుప్రీం నుంచి అనుమతి వస్తుందో, రాదోననే సందేహంతో.. ఈ నెలాఖరులోగానే ప్రవేశాలు పూర్తి చేసేలా ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది.