rail
-
రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
రైల్వే టికెటింగ్ విధానంలో జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ గురించి వినే ఉంటాం కదా. అయితే అందులో ఒక్కో కేటగిరీకి ఒక్కో కోడ్‌తో బోగీలుంటాయి. అందులో డీ క్లాస్ బోగీ, బీ1, బీ2.. ఎస్1, ఎస్2.. సీ1.. ఇలా విభిన్న కోడ్లతో బోగీలు కేటాయిస్తారు. మరి ‘ఎం1’ కోడ్‌తో ఉన్న బోగీల గురించి తెలుసా? అసలు ఈ కోడ్ బోగీల్లో ఉండే ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.భారతీయ రైల్వే ‘ఎం1’ కోచ్‌ను ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి, వారికి మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఇందులో సౌకర్యాల విషయానికి వస్తే ఇంచుమిందు టైర్ 3 ఏసీ కాంపార్ట్మెంట్ వసతులే ఉంటాయి. అయితే ఎం1 బోగీలో 83 సీట్లు ఉంటాయి. కానీ టైర్ 3 ఏసీలో 72 సీట్లు ఉంటాయి. వీటితోపాటు కొన్ని కొన్ని ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?సౌకర్యవంతమైన లెగ్స్పేస్ ఉంటుంది.దూర ప్రయాణాలకు అనువైన సీట్లు డిజైన్ చేసి ఉంటాయి.మెరుగైన ఎయిర్ కండిషనింగ్, రీడింగ్ లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి.ఆధునిక ఫైర్ అలారంలు, అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా సిబ్బంది అందుబాటులో ఉంటారు.వ్యక్తిగత గోప్యత, సౌకర్యం కోసం 2x2 లేదా 2x1 కాన్ఫిగరేషన్‌లో సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.పైబెర్త్ ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి. -
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్‌ల సంఖ్య పెంచేలా!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ స్లీపర్ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ.. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ కాంట్రాక్టులో మార్పులు చేసింది. స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే రూట్లను కూడా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న చైర్ కార్ వందేభారత్ రైళ్లతోపాటు స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూరప్రాంతాలకు స్లీపర్ కోచ్‌లతో కూడిన 200 వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో ప్రవేశపెట్టాలనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది.స్లీపర్ కోచ్‌ల నిర్వహణ వ్యయం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమతుల్యత లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్ వందేభారత్ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూట్లలో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పరంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్‌లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్ రైళ్లను అంతగా డిమాండ్‌లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతుందని అంచనాకు వచ్చింది.దాంతో స్లీపర్ కోచ్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రాక్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), భారతహెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు సవరించిన కాంట్రాక్టును ఖరారు చేసింది. -
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్‌పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. -
రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు
రిషికేశ్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిషికేశ్- కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో శివపురి, గూలర్ మధ్య ఆరు కిలోమీటర్ల రైలు సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి సమాంతరంగా వెళ్లే సొరంగ నిర్మాణం 2023 సెప్టెంబరు నాటికే పూర్తయ్యింది.రిషికేశ్‌లోని కర్ణప్రయాగ్ వరకూ 125 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనులోని 104 కిలోమీటర్ల ప్రాంతం 17 విభిన్న సొరంగాల మధ్య నుంచి వెళుతుంది. అన్ని సొరంగాల మొత్తం పొడవు 213.4 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులోని మొత్తం 213.4 కిలోమీటర్లలో ఇప్పటికే 169.496(79.42 శాతం) సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) బృందానికి అభినందనలు తెలిపారు.రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎల్ అండ్ టీ కంపెనీ చేపడుతున్న నేపధ్యంలో తాజాగా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ చోప్రా మాట్లాడుతూ ప్యాకేజీ-2లో ఎల్ అండ్ టీ చేతిలో ఎడిట్-2(56 మీటర్లు), మెయిన్ టన్నెల్-2లో డబుల్ లైన్ 7-స్టేజ్(80 మీటర్లు) ముఖ్య సొరంగం(6002) మీటర్లు, నికాస్ సొరంగం(6066 మీటర్లు)నకు సంబంధించిన టన్నలింగ్ పనులు ఉన్నాయన్నారు. వీటిలోని చాలా పనులు 2023 సెప్టెంబరు 12 నాటికే పూర్తయ్యాయని తెలిపారు. -
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
చార్ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.రైల్వేశాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు మొదలవుతాయి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ఆధారిత సాధనాలతో ఈ భయం ఎక్కువవుతోంది. ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, వ్యాపావేత్తలు ఏఐ భవిష్యత్తు తరానికి ముప్పు తెస్తుందని కొందరు భావిస్తే, ఆ సాంకేతికతతో మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. వారి భావనలు ఎలాఉన్నా మర్పు సత్యం. కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. విచిత్రమైన భయాలు ‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు. రైల్ సిక్నెస్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్‌లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్బాంక్రాన్కీట్’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్ సిక్నెస్’ అని అర్థం. ఇదీ చదవండి: పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా.. బుల్లెట్ రైలు ఇంగ్లండ్ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లకు చేరుకున్నాం. -
అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్
విదేశాల్లో ఉండే అందమైన రైల్వేస్టేషన్టు, మంచి సాంకేతికతో కూడిన రైళ్లను గురించి విన్నాం. వావ్..! అంటూ అబ్బురపడ్డాం. మన దేశంలో కూడా అంతలా అద్భుతంగా ఉండే రైళ్లు ఉన్నాయనిగానీ, సుందరమైన ప్రదేశాల్లో తిరిగే రైళ్ల గురించి గానీ తెలియదు. అయితే అలాంటి రైళ్లు మనదేశంలో కూడా ఉన్నాయని గుర్తు చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. మన దేశంలో కూడా అబ్బురపరిచేలా సుందర ప్రదేశాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో..భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సుగా పేరుగాంచిన రాజస్తాన్‌లోని సంభార్ సరస్సు గుండా ప్రయాణించే ఓ రైలు దృశ్యం కనిపించింది. ఈ వీడియోని ఏరియల్ ఫోటోగ్రఫీకీ పేరుగాంచిన ట్రావెట్ ఫోటోగ్రాఫర్ రాజ్‌మోహన్ క్లిక్ మనిపించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ అందుకు సంబంధించిన వీడియోని.."భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు మీదుగా సుందరమైన రైలు ప్రయాణం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇంతవరకు మనం యూరప్ వంటి దేశాల్లోనే ఇలాంటి విజువల్స్చూశాం. మన సొంతగడ్డలోనే ఇలాంటి అద్భతాలు ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇక ఆ సంభార్ సాల్ట్ లేక్ తూర్పు మధ్య రాజస్థాన్‌లో ఉన్న అతిపెద్ద సెలైన్ సరస్సు. ఇది నేచర్ ప్రేమికులకు ప్రకృతిలో దాగున్న గొప్ప రత్నం. దీన్ని దూరం నుంచి చూస్తే..మంచును పోలి ఉండే ఉప్పు షీట్లు సరస్సుని కప్పి ఉంచినట్లు పరుచుకుని ఉంటుంది. సాధారంణంగా వేడి నెలల్లో ఇది పొడిగా ఉంటుంది. ఇక ఈ సరస్సు ఆరవ శతాబ్దంలో పరమశివుని భార్య దుర్గాదేవి అంశమైన శాకంబరి దేవతచే సృష్టించబడిందని పురాణ వచనం. ఈ సరస్సులో ఉప్పు సరఫరా మొఘల్ రాజవంశం నిర్వహించేది. ఆ తర్వాత జైపూర్, జోధపూర్ వంటి రాచరిక రాష్టాలు సంయుక్తంగా దీన్ని సొంతం చేసుకున్నాయి. కాగా మంత్రి అశ్విని వైష్ణవ్ తరుచుగా రైళ్లకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ అధ్భుతమైన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. Scenic rail journey over India's largest inland salt lake. 📍Rajasthan pic.twitter.com/ibiq9rwFWW — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 14, 2024 (చదవండి: లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!) -
40వేల నార్మల్ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు పెంచుతాం
-
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్‌లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్‌ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్‌లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో వినాయక చవితి. దీన్నె గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) అని కూడా అంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకొంటారు. పండుగలో భాగంగా వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చి ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన పిండి వంటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మహారాష్ట్రలో అయితే ప్రధానంగా లడ్డూ, మోదక్, చక్లిలు, పురాన్ పోలీ వంటి వాటితో సహా ఇంకా మరెన్నో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!) చాలా మంది ఇంటిపట్టున ఉండి పండుగ జరుపుకొని సంప్రదాయక పిండి వంటకాలను ఇంట్లోనే ఆస్వాదిస్తారు. కానీ కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఈ ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించలేరు. అటువంటి వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ఆమోదిత ఫుడ్ అగ్రిగేటర్ ‘జూప్’ (Zoop) వినాయక చవితి ప్రత్యేక సంప్రదాయ వంటకాలను అందిస్తుంది. 160కి పైగా రైల్వే స్టేషన్లలో.. దీంతో పండుగ వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నోరూరించే పండుగ పిండి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలు కావాల్సిన ప్రయాణికులు జూప్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ చాట్‌బాట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మహారాష్ట్రలోని 160కి పైగా రైల్వే స్టేషన్లలో వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు. -
జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ
G20 Summit: న్యూడిల్లీ భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించనున్నారు. ప్రపంచ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ప్రకటించే అవకాశం ఉందని వైట్ హౌస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జోన్ ఫైనర్ తెలిపారు.గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ భాగస్వామ్యంలో భాగంగా బిడెన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. G20 సమ్మిట్‌లో ప్రకటించబడే ప్రపంచ వాణిజ్యానికి సాధ్యమయ్యే గేమ్ ఛేంజర్‌గా దీన్ని అంచనావేస్తున్నారు. ఈ కారిడార్ మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, యూరప్ దేశాలను కలుపుతుంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యం, చివరికి యూరప్‌తో అనుసంధానించే షిప్పింగ్ కారిడార్ కోసం శనివారం ప్రణాళికలను రూపొందించాలని యోచిస్తున్నారు. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో కొత్త సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ భారీ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ డీల్ తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ కారిడార్ రైల్వేల నెట్వర్క్ ద్వారా మధ్యప్రాచ్యంలోని దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఓడరేవుల నుండి షిప్పింగ్ లేన్ల ద్వారా కూడా ఈ నెట్వర్క్ భారతదేశానికి అనుసంధానించబడుతుందని అంచనా. కాగా ఈ ఒప్పందంపై చర్చించేందుకు నాలుగు దేశాల ఉన్నత జాతీయ భద్రతా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL — Narendra Modi (@narendramodi) September 9, 2023 -
స్టేషన్ల అభివృద్ధి పేరిట.. రైల్వే ఛార్జీలు పెంచనున్నారా..?
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పనుల కోసం రైల్వే ఛార్జీల ధరలు పెంచుతారనే ఊహాగానాలు పట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల నీవకరణకు కావాల్సిన నిధుల కోసం టికెట్టు ధరలు పెంచుతారనే అనుమానాలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కావాల్సిన రూ.25 వేల కోట్లను బడ్జెట్ నుంచే కాటాయించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రాజెక్టు పేరుతో ఛార్జీలను పెంచడం జరగదని వెల్లడించారు. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచస్థాయి స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ల అభివృద్ధిలో ఏ రాష్ట్రంలో వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫలితాలను ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్‌తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్‌ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్‌సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు?
మనదేశంలోని అన్ని రైళ్ల చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు కనిపిస్తుంది. దీనిని భద్రతా నియమాలను అనుసరిస్తూ రూపొందిస్తారు. ఈ ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. అయితే వందేభారత్ రైలు చివరి బోగీకి మాత్రం ఈ ‘X’ గుర్తు కనిపించదు. వందేబారత్ ట్రైన్.. హై స్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ అంతా అటాచ్డ్గా ఉంటుంది. ఈ రైలు రెండు వైపుల నుంచి పరుగులు పెడుతుంది. అందుకే ఈ రైలుకు ‘X’ గుర్తు ఉండదు. రైల్వే విభాగం పలు భద్రతా చర్యలు చేపడున్న దృష్ట్యా పలు సిగ్నళ్లు, సైన్లను రూపొందించి, ఉపయోగిస్తుంది. ఈ కోవలోనే రైలు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు రూపొందిస్తారు. ఇది రైల్వే అధికారులను, సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు. ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. రైలు ఏదైనా స్టేషన్ మీదుగా వెళ్లినప్పుడు రైల్వే సిబ్బంది ఆ రైలు చివరి బోగీపై ఉన్న ‘X’ గుర్తును చూస్తారు. దానిని గమనించాక ఆ రైలుకు అది చివరి బోగీ అని స్పష్టం చేసుకుంటారు. ఒకవేళ ‘X’ గుర్తు అనేది లేకపోతే.. ఆ రైలుకు వెనుకవైపు గల బోగీలు రైలు నుంచి విడిపోయాయని అర్థం. ఇలా జరిగితే వెంటనే రైల్వే సిబ్బంది కంట్రోల్ రూమ్‌కు పోన్ చేసి, ఆ రైలుకు గల వెనుక బోగీలు ఎక్కడో విడిపోయాయనే సమాచారాన్ని అందిస్తారు. అందుకే ఏ రైలుకైనా చివరి బోగీ వెనక ‘X’ గుర్తు ఉండటం ఎంతో ముఖ్య విషయమని రైల్వే సిబ్బంది భావిస్తారు. వందేభారత్ విషయానికొస్తే దీనికి ‘రైల్వే సురక్షా కవచ్’ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ అనుకోని విపత్తుల నుంచి ప్రయాణికులను రక్షిస్తుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్పీడు అధికారికంగా గంటకు 160 కిలోమీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటెలిజంట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్.. విచిత్రమో, విడ్డూరమో కాదు!
రైలు నడుస్తున్నప్పుడు ఆ రైలులోని లైట్లన్నింటినీ ఆర్పివేయడమనేది ఎక్కడైనా చూశారా? టెక్నికల్ ప్రోబ్లం కాకుండా అలా ఎప్పుడైనా జరుగుతుందా? సాధారణంగా ఇలా జరగదు. అయితే వీటికి భిన్నంగా ఆ ప్రాంతంలోకి రైలు రాగానే దానిలోని లైట్లన్నీ బంద్ అయిపోతాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో? అటువంటి ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకిలా చేస్తారంటే.. చైన్నైలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఇలా జరుగుతుంది. చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కొంత దూరంలోకి లోకల్ రైలు రాగానే దానిలోని లైట్లు ఆరిపోతాయి. అయితే ఇలా లోకల్ రైళ్ల విషయంలోనే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక లోకోపైలెట్ సమాధానమిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొద్దిదూరం వరకూ మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కాస్త దూరంలో ఓహెచ్‌ఈలో కరెంట్ ఉండదు. ఓహెచ్ఈ అనేది లోకోమోటివ్‌కు విద్యుత్‌ను అందిస్తుంది. అక్కడి ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌లో విద్యుత్ ఉండదు. ఇటువంటి ప్రాంతాన్ని నేచురల్ సెక్షన్ అని అంటారు. కట్ కరెంట్ ప్రాంతంగా.. ఇటువంటి స్థలాలను రైల్వేనే రూపొందిస్తుంది. దీనిని ఓవర్ హెడ్ వోల్టేజ్, విద్యుత్ నిర్వహణ కోసం తయారు చేస్తారు. దీనిని కట్ కరెంట్ అని పిలుస్తారు. ఇది నూతన విద్యుత్ జోన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీని వల్ల కొంత దూరం వరకు కరెంటు ఉండదు. లోకల్ రైళ్ల లైట్లు డ్రైవర్ క్యాబిన్ నుండి పనిచేస్తాయి. వాటి పవర్ సిస్టమ్ భిన్నంగా ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో ప్రభావితమవుతుంది. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లలో కోచ్‌లకు వేర్వేరుగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. దీని కారణంగా ఆ రైళ్లలో ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తదు. నూతన జోన్ కారణంగా ఇక్కడ నుండి వెళ్ళే లోకల్ రైళ్లలోని లైట్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇది కూడా చదవండి: పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్ మ్యాన్’ స్టోరీ! -
అలర్ట్: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని ఖరగ్‌పూర్–భాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్–హైదరాబాద్ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (22855), గౌహతి–సికింద్రాబాద్ (02605), హౌరా–పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్– సత్రగచ్చి (22808), మైసూర్–హౌరా (22818) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రీషెడ్యూల్ విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. చదవండి: అగ్నివీరులొచ్చేశారు.. -
మరో ప్రమాదం తప్పిందా? ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. రైల్వే శాఖ క్లారిటీ!
ఒడిశా రైలు దుర్ఘటన మరవకముందే మరో రైలు ప్రమాదం తప్పిందంటూ నెట్టింట ఓ వీడియో దర్శనమిస్తోంది. దీంతో రైలు ప్రయాణంపై ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు అనుకోకుండా ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన రైళ్లలోని లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొన్ని అడుగుల దూరంలో ఆ రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్‌మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టం చేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది. ఇలా ఒకే ట్రాక్‌లో వచ్చిన ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైళ్లు కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాలను నమ్మవద్దని కోరింది. కాగా గత వారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో, 275 మంది మరణించడంతో పాటు వేలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్థ కాలంలో ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటిగా చెప్పచ్చు. Train accident averted once again in Raipur Chhattisgarh @RailMinIndia@AshwiniVaishnaw #RailwaySafety #Chhattisgarh pic.twitter.com/UKRe4Ox26w — Amit Tiwari (@AmitTiwari_95) June 11, 2023 -
గుడ్‌న్యూస్! గద్వాల మీదుగా జైపూర్‌కు మరో రైలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: త్వరలోనే కర్నూలు నుంచి గద్వాల మీదుగా జైపూర్ వరకు మరో రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన మహబూబ్‌నగర్– విశాఖ రైలును కిషన్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జిల్లాకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేలా, నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. రైలు ప్రారంబోత్సవం సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో రైల్వేస్టేషన్ ప్రాంగణం, పరిసరాలు మార్మోగాయి. తెలంగాణలో పంటల బీమా పథకం ఎక్కడ?: కిషన్‌రెడ్డి తెలంగాణలో కనీసం పంటల బీమా పథకం అమలు చేయడం లేదని.. ఇక్కడ వర్షాలకు పంటలు నష్టపోతే సాయం చేయకుండా బీఆర్ఎస్ నాయకులు నాందేడ్ వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్నారని అని కిషన్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా శనివారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేదోడికి ఇల్లు కట్టే సోయిలేదు గానీ.. ప్రగతి భవన్, సచివాలయాన్ని రికార్డు సమయంలో కడతారని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల్లో 42 శాతం వాటా రాష్ట్రాలకు వస్తోందని, రైతులకు పెరిగిన ఎరువుల ధరల భారం పడకుండా రూ.లక్ష కోట్ల సబ్సిడీని ఇస్తోందని ఆయన వివరించారు. ఒక్కో రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.18,254 సబ్సిడీ.. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల సాయం అందజేస్తోందని వివరించారు. దేశ భవిష్యత్ కోసమే రూ.2వేల నోట్ల ఉపసంహరణ ‘రూ.2 వేల నోట్ల ముద్రణ 2018 మార్చి 31 నుంచే బంద్ అయింది.. ఈ నోటు ఉపసంహరణపై ఎవరూ ఆందోళన చెందొద్దు.. సెపె్టంబర్ 30 వరకు బ్యాంకుల్లో బదలాయింపు చేసుకోవచ్చు.. దేశ భవిష్యత్ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రేమించిన అమ్మాయి దూరమవుతోందని...
సికింద్రాబాద్: ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని భావించిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మహబుబాబాద్ వెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన దారావత్ సంతోష్(17) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. 18 ఏళ్లు వయస్సు నిండిన తరువాత పెళ్లి చేస్తామని సంతోష్‌కు వారి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీంతో సంతోష్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 13న రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ హైదరాబాద్ ఎండ్ పిట్‌లైన్ వద్ద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతుని జేబులో లభ్యమైన సెల్‌ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు) -
కదులుతున్న రైలులో మొబైల్ చోరీకి యత్నం.. పాపం వాడి పనైపోయింది!
దొంగతనం.. చట్టరీత్యా నేరం అయినా నిత్యం ఈ పదం వింటూనే ఉన్నాం. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. ఒక ఇంట్లోని వస్తువులేనా.. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’ Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi — Kumar Saurabh Singh Rathore (@JournoKSSR) September 15, 2022 -
రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్ గ్రూప్ నాంది పలికాయి. భారత్‌లో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రా రంభించాయి. ఇందుకోసం కాంకర్ గ్రూప్ రూపొం దించిన 20 అడుగుల కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్ కంటైనర్స్‌ను కంపెనీ వినియోగించింది. వికా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది. ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్ సిమెంట్‌తో కూడిన రైలు శుక్రవారం ప్రారంభమైంది. ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ఈ విధానంలో సిమెంట్ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్ టెర్మినల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యాయం.. రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని సక్సేనా తెలిపారు. ‘కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించే వీలు అవుతుంది. భారతి సిమెంట్ మొదటిసారిగా స్వీకరించిన ఈ మోడల్ దేశంలో సిమెంట్ రవాణాలో విప్తవాత్మక మార్పులతోపాటు నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని వివరించారు. ఎర్రగుంట్ల ప్లాంటు నుంచి తొలి రైలును జెండా ఊపి సక్సేనా ప్రారంభించారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ డైరెక్టర్లు ఎం.రవీందర్ రెడ్డి, జి.బాలాజీ, జె.జె.రెడ్డి, హరీష్ కామర్తి, ఎరిక్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, కాంకర్ ఈడీ శేషగిరి రావు పాల్గొన్నారు. రైల్వే బోర్డ్ మెంబర్ ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్ సంజయ్ మహంతి, కాంకర్ ఎండీ వి.కళ్యాణ రామ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాలుపంచుకున్నారు. వేగంగా సిమెంట్ రవాణా .. ప్రత్యేక కంటైనర్లలో బల్క్ సిమెంట్ రవాణా వల్ల తయారీ కంపెనీలతోపాటు తమ సంస్థకు మేలు చేకూరుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు వేగంగా సిమెంట్ రవాణా సాధ్యపడుతుందని అన్నారు. -
త్వరలో అక్కన్నపేట-మెదక్ మధ్య నడవనున్న రైలు
-
టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!
ఆగ్రా: టీ అమ్ముతూ, సైకిళ్లను రిపేర్ చేసే త్రిలోకి ప్రసాద్ గాలి శక్తితో నడిచే ఇంజన్ని తయారు చేశాడు. అతను ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రి నివాసి. పైగా అతను తయారు చేసిన ఇంజిన్‌ను కారు, ఆటోమొబైల్స్‌కు సరిపోయేలా రీ డిజైన్ చేస్తే అధిక మొత్తంలో వాహన కాలుష్యం నియంత్రించగలం అని చెబుతున్నాడు. అంతేకాదు పైగా త్రిలోకి తయారు చేసిన న్యూమాటిక్ ఇంజిన్ ద్విచక్ర వాహనం నుండి రైలు వరకు ఏదైనా నడపగలదు. (చదవండి: నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....) ఈ ఇంజిన్ వాహనం అవసరాలకు అనుగుణంగా ఇంజిన్ ఆకారాన్ని మాత్రమే మార్చితే సిపోతుందని అంటున్నాడు. ఈ మేరకు 50 ఏళ్ల త్రిలోక్ మాట్లాడుతూ....నేను చిన్న వయసులోనే ట్యూబ్‌వెల్ ఇంజిన్‌ను తయారు చేయడం నేర్చుకున్నాను. అయితే నేను 15 ఏళ్ల క్రితం టైర్లకు పంక్చర్లు రిపేరు చేసేవాడు. ఇలా నేను చేస్తూ ఉండగా ఒకరోజు పంక్చర్ అయిన ట్యూబ్‌లో గాలిని నింపుతున్నప్పుడు ఎయిర్ ట్యాంక్ వాల్వ్ లీక్ అయ్యి , గాలి ఒత్తిడి కారణంగా ట్యాంక్ ఇంజిన్ రివర్స్‌లో పనిచేయడం ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి గాలి శక్తిని ఇంజిన్‌లో ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో నేను యంత్రాన్ని గాలితో ఆపరేట్ చేయగలిగితే ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని భావించాను. ట్యాంక్‌లో గాలి నింపే ఖర్చును తగ్గించే ప్రయత్నంతో మొదలైన ఆలోచన చివరకు పూర్తి స్థాయి ఆటోమోటివ్ ఇంజిన్‌గా రూపాంతరం చెందింది. అని చెప్పారు. ఈ క్రమంలో త్రోలోకి భాగస్వామి సంతోష చౌహర్ మాట్లాడుతు తమ బృందంలో తానొక్కడే గ్రాడ్యుయేట్ అని మిగిలిన వారంతా పది కూడా పూర్తిచేయలేదు. మా బృందం అంతా కలిసి ఊపిరితిత్తుల ఆకారంలో రెండు బెల్లోలను తయారు చేసి వాటిని యంత్రంలో అమర్చాం. ఆ తర్వాత యంత్రానికి ఉన్న మీటను తిప్పడం ద్వారా బెలోస్లో గాలి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంజిన్ మానవుని ఊపిరితిత్తుల మాదిరిగానే గాలిని పంపింగ్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు యంత్రంలోని భాగాల్లో ఘర్షణను తగ్గించేందుకు లూబ్రికెంట్ అయిల్ అవసరం. పైగా పెట్రోల్-డీజిల్ ఇంజిన్ల వలే కాకుండా మేము తయారు చేసిన లిస్టర్ ఇంజన్లో లూబ్రికెంట్ ఆయిల్ వేడిగా లేదా నల్లగా మారదు. అని చెప్పాడు. అయితే త్రిలోకి తనకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, పొలం అమ్మి ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తమ బృందం పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
ఏం కష్టమొచ్చిందో పాపం.. రైలులో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నాంపల్లి: హుబ్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ఓ రైలులోని ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్లాట్ఫారం మీదకు వచ్చిన రైలు బోగీలో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని నాంపల్లి (హైదరాబాదు) రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్ఫారం–1 మీద నిల్చున్న రైలులోని ప్రయాణికులందరూ దిగిపోయారు. కానీ వస్తు రవాణా కోసం ఉంచిన పార్శిల్ బోగీలో 60 ఏళ్ల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హైదరాబాదు రైల్వే స్టేషన్లో ఆగిన రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించే ముందు రైల్వే సిబ్బంది బోగీలను పరిశీలించారు. ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో వేలాడుతూ మృతదేహం కనిపించడంతో రైల్వే సిబ్బంది స్థానిక జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి భద్రపరిచారు.