rajamahendravaram
-
ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో దళిత యువకుణ్ణి అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించిన కేసులో డీజీపీతోపాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ అమానవీయమైన ఘటనపై ఆ ప్రాంతంతో లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. ఆ అధికారి నాలుగు వారాల్లోగా నిష్పాక్షికంగా విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది.వరద సమయంలో తమ కాలనీలో సమస్యపై పులిసాగర్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీంతో విద్యావంతుడైన ఆ దళిత యువకుడిని దారుణంగా వేధించి, పోలీస్ స్టేషన్ లాకప్‌లో అర్ధ్ధనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ల ముందు నిలబెట్టారు. చంపేస్తానని ఇన్స్పెక్టర్ బాజీలాల్ బెదిరించాడు. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీలు పిల్లి గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని, బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని పులి సాగర్‌కు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి కమిషన్ ఈ నోటీసులిచ్చిoది. పులి కృపానంద సాగర్ అనే దళిత యువకుడిపై అక్కడి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కులవివక్ష చూపించడంతోపాటు కస్టోడియల్ హింసకు గురి చేశారని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక బ్రెత్రెన్ చర్చి వద్ద నీరు నిలిచిపోయిందని ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు హింసించారని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించినందుకు ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఐ బాజీలాల్ అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి అవమానించడంతోపాటు అత్యంత అమానవీయంగా చొక్కా విప్పి కొట్టారని, కులం పేరుతో అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో తెలిపారు. లాకప్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ ఎదుట ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని గంటలపాటు నిలబెట్టారని తెలిపారు. ఆ తర్వాత అతన్ని ఒక బండరాయికి కట్టి గోదావరిలో పడేశారని పేర్కొన్నారు. ఈ దారుణ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఊచల మధ్య ఒక మహిళా పోలీసు దగ్గర నిలబడి ఉన్న దృశ్యాలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను కూడా ఆయన ఫిర్యాదుకు జత చేశారు. దీని ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీకి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఆన్లైన్లో నోటీసులిచ్చిoది. ఈ అమానవీయ ఘటనపై రాజమండ్రికి సంబంధం లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 4 వారాల్లోగా నిష్పాక్షికంగా నివేదిక తమకు పంపాలని స్పష్టం చేసింది. బాధితుడు లేవనెత్తిన సమస్యలు, పారిశుద్ధ్య లోపంపై జిల్లా కలెక్టర్ ఏం చర్య తీసుకున్నారో తెలపాలంటూ మరో నోటీసు ఇచ్చారు. -
రాజమండ్రి: రూట్ మార్చిన చిరుత
రాజమహేంద్రవరం రూరల్/కడియం: దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత పులి కడియం నర్సరీ ప్రాంతానికి చేరినట్టు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. కడియం – వీరవరం రోడ్డు మధ్యలోని దోసాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించాయి. దీంతో కాలనీ వాసులందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న దివాన్ చెరువు ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి, రేంజర్ శ్రీనివాస్, స్క్వాడ్ డీఆర్వో రాజా అండ్ టీమ్, రేంజ్ పరిధిలోని సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలే అని గుర్తించారు. అయితే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయం అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. పులి భయంతో నర్సరీల్లో రైతులెవ్వరూ ఉండడం లేదు. చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా, ఎక్కడికైనా వెళ్లిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, కూలీలకు బుధవారం నర్సరీలకు వెళ్లవద్దని సూచించారు. -
రాజమహేంద్రవరం: రాత్రిపూట బయట తిరగొద్దు!
తూర్పుగోదావరి, సాక్షి: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లు అమర్చారు. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు రికార్డయినట్లు అధికారులు తెలిపారు. జనసంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని డీఎఫ్‌వో భరణి చెప్పారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని తెలిపారు. శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ,. స్వరూప్ నగర్, రూప్ నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామ నగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఆరుబయట కూర్చోవద్దని, పిల్లల్ని బయటకి పంపవద్దని సూచించారు.చిరుత గురించి సమాచారం తెలిస్తే.. 18004255909 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలోనూ నిక్షిప్తమయ్యాయి. -
టీడీపీలో ఇసుక దుమారం?
సాక్షి, రాజమహేంద్రవరం : నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఇసుక తుపాను చెలరేగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీరావడంతో ఆ పార్టీల నేతలు ఇసుక మీద పడ్డారు. వర్షాకాలం పురస్కరించుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందస్తుగా నిల్వ ఉంచిన ఇసుకను ఊడ్చేశారు. ఇప్పుడిదే వారి మధ్య వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఓ జనసేన నేత అత్యుత్సాహం రాజమహేంద్రవరంలోని ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నగర రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఇసుక బాగోతం కథాకమామిషు ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య ఈ ఇసుక దుమారం రేగింది. గోరంట్లకు అనుచరుడిగా పేరుగాంచిన ఓ జనసేన నేత ఇసుక వ్యాపారమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు ఇసుక దందాకు తెరలేపారు. ఇందులో భాగంగా.. గోదావరి వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ర్యాంపుల్లో నిల్వ ఉంచిన ఇసుకను ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు ఆ గుట్టలు మింగేశారు. రాత్రి, పగలు అన్న తేడాలేకుండా అక్రమంగా తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ పరిధిలోని గ్రాయత్రి–1, 2, 3, 4, 5 పేర్లతో ఉన్న ఇసుక ర్యాంపుల్లోని నిల్వలను ఆ నియోజకకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా బుచ్చయ్య అనుచరుడైన ఓ జనసేన నేత ఇసుక మొత్తం ఊడ్చేశాడు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అధికారులు అటువైపు వెళ్లేందుకు కూడా సాహసించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ నేత రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ర్యాంపులపై కూడా కన్నేశాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండటం.. నూతన ఇసుక పాలసీ త్వరలో రానుండటంతో ముందుగానే తరలించేయాలన్న ఆలోచనతో దానిని ఎడాపెడా తరలించేసి అమ్మేశారు. ఇలా రూరల్, సిటీ నియోజకవర్గాల పరిధిలో నిల్వ ఉన్న సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఇసుక కొల్లగొట్టినట్లు సమాచారం. దోపిడీ చేసిన సొమ్ములో తన గురువుకు కొంత లాభం చేకూర్చినట్లు తెలిసింది. సిటీ ఎమ్మెల్యే తండ్రి సీరియస్.. ఇదిలా ఉంటే.. ఈ విషయం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి వెళ్లడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమ ఇలాకాలో తమకు తెలీకుండా ఇసుక తరలించుకుపోవడంపై అవాక్కయ్యారు. అదీ తన విరోధి బుచ్చయ్యచౌదరి అనుచరుడని తేలడంతో మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న నిల్వలకు సంబంధించిన నగదు తనకివ్వాలని సదరు నేతకు కబురు పంపినట్లు సమాచారం. ఆ నేత నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై అప్పారావు కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాగని ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే కూటమిలో భాగమైన జనసేన నేత కావడం, పార్టీ పెద్దలకు మరో రకమైన సంకేతాలు వెళ్తాయని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అధికారులపై చిందులు? మరోవైపు.. ఇసుక తరలించేస్తుంటే ‘మీరేం చేస్తున్నారు? అడ్డుకోవాలి కదా..’ అంటూ ఆదిరెడ్డి అప్పారావు మైనింగ్ అధికారులపై చిందులేసినట్లు తెలిసింది. రాజమండ్రి సిటీ పరిధిలో ఒక్క ఇసుక రేణువు తీసుకెళ్లాలన్నా తన అనుమతి ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఏమీ చెప్పలేక అధికారులు మిన్నకుండిపోయారు. ఇసుక తరలించిన వ్యక్తి కూటమి నేత కావడం, ఆయన్ను ఏమీ అనలేక తమపై రుబాబు చూపడంపట్ల అధికారుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఇది అధికార పార్టీ పనే’.. రాజమండ్రిలో అలజడిపై భరత్‌రామ్
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ నేత,మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి దహనం చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం వద్ద ఈ వాహనాన్ని ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుం డగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మాజీ ఎంపీ భరత్ రామ్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయనతో పాటు ప్రకాశం నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కడలి సత్యనారాయణ, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో ఇటు వంటి విషసంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని చెప్పారు. ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం,ఇళ్ల పైకి దాడులు చేయడం, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడిపై దాడి చేయడం వంటి దారుణాలకు ఒడిగట్టారనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు దర్యాప్తు చేయాలని, నిందితులపై, ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం: టీడీపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (వీఆర్సీసెంటర్)/అనంతపురం కార్పొరేషన్/సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైనా గడవక ముందే కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రజలేమనుకుంటారోననే భయం ఇసుమంతైనా లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాలను కూలదోయడానికి పూనుకుంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసింది. ఇంతటితో ఆగక రాష్ట్ర వాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.పార్టీ కార్యాలయాలన్నింటినీ అక్రమంగా నిర్మిస్తున్నారని, వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే ఎందుకు కూల్చకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయాలకు జీవీఎంసీ అధికారులు శనివారం నోటీసులు జారీచేశారు. వాస్తవానికి వీఏంఆర్డీఏకు అనుమతుల కోసం విశాఖ కార్యాలయం కోసం రూ.15.63 లక్షలు, అనకాపల్లి పార్టీ కార్యాలయం కోసం రూ.35.60 లక్షలు చెల్లించినా.. అనుమతుల్లేవంటూ శనివారం జీవీఎంసీ అధికారులు నోటీసులు కార్యాలయాల వద్ద అతికించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్ మండల పరిధిలోని ఎండాడ గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిన ఎకరాకు రూ.1000 చొప్పున చెల్లించే విధంగా 2016 ఏడాదిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.గతేడాది ఫిబ్రవరి నెలలో వీఎంఆర్డీఏ అనుమతి కోరుతూ రూ.15.63 లక్షలు చెల్లించారు. 2023లో సెప్టెంబర్ 25న çఫస్ట్ ప్లోర్లో 120.34 స్క్వేర్ యార్డ్స్ ప్రపోజ్ చేస్తూ మార్ట్గేజ్ చేశారు. గతేడాది వీఎంఆర్డీఏ అనుమతులు కోరిన 21 రోజుల్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి అభ్యంతరం లేకపోయినా..ఆటోమెటిక్‌గా ప్లాన్ అప్రూవల్ అయినట్లు పరిగణిస్తారు. వీఎంఆర్డీఏ ద్వారా జీవిఎంసీ అనుమతుల కోసం డీడీ తీసి ఆరు నెలలు కావస్తున్నా, ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే అనుమతుల్లేవని చెప్పటం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ, అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలో జీవిఎంసీ అధికారులు నోటీసులు అతికించి వెళ్లిపోయారు. బుల్డోజర్తో కూల్చేస్తామంటూ..నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్స్తో కూల్చేస్తామని నెల్లూరు టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం హడావుడి చేశారు. అక్కడ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉంది. సమాచారం అందుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఖలీల్ అహ్మద్ అక్కడికి చేరుకుని టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడారు.ప్రభుత్వం వద్ద 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని, లీజు నగదునూ చెల్లించామని, అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనల మేరకు ఈ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ భవనం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, జిల్లా పార్టీ కార్యాలయం కాబట్టి దీని డాక్యుమెంట్లు తెప్పించేందుకు 2 రోజులు కావాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కూల్చేసామని చెప్పారు. ఏ క్షణంలోనైనా ఈ భవనాన్ని కూల్చేస్తామని చెప్పి వెళ్లారు. శనివారం రాత్రి కార్పొరేషన్ సిబ్బంది పార్టీ కార్యాలయం వద్ద నోటీసు అంటించి వెళ్లారు. 7 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ..అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాలతో డిప్యూటీ సిటీ ప్లానర్ మారుతీహరిప్రసాద్ శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులిచ్చారు. అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలో 1.50 ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. 7 రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని, అంతవరకు నిర్మాణాలు చేపట్టకూడదని, ఇప్పటివరకు అనధికారికంగా నిర్మాణం చేపట్టినందున చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ శ్రీనివాసులుకు నోటీసు అందించారు. ఇది అనధికారిక కట్టడంరాజమహేంద్రవరంలోని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా కార్యాలయం అక్రమ కట్టడమని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరుతో నగర పాలక సంస్థ అధికారులు శనివారం నోటీసులిచ్చారు. సువిశేషపురంలో రెండెకరాల్లో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 2023 జూన్ 10న అప్పటి రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అప్పటి ఎంపీ మార్గాని భరత్‌రామ్ శంకుస్థాపన చేశారు.ఇప్పటికే కార్యాలయ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది అనధికారిక కట్టడమంటూ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసు ప్రతిని నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయానికి అతికించారు. భవన నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని సూచించారు. ఇదంతా టీడీపీ నేతల కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
రాజమహేంద్రవరంలో.... ‘గేమ్ చేంజర్’
రాజమహేంద్రవరం పయనమయ్యారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘గేమ్ చేంజర్’ అనే పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.తండ్రి పాత్రలో అప్పన్నగా, కొడుకు పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్గా రామ్‌చరణ్ కనిపిస్తారట. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రీకరణలో పాల్గొనేందుకు శుక్రవారం రామ్‌చరణ్ హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. ఈ షెడ్యూల్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ఇక రామ్‌చరణ్, అంజలి, శ్రీకాంత్‌తో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలిసింది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఉసురుతీసిన కలహాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాల కారణంగా అనుమానాస్పదంగా దంపతులు మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. అయితే సంఘటనా స్థలంలో ఆధారాలను బట్టి భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేటకు చెందిన శ్రీధర్ (28)కు ప్రత్తిపాడుకు చెందిన దేవి (22)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. తాపీ పనిచేసుకునే శ్రీధర్‌కు ఏడాది కిందట ప్రమాదం జరగడంతో వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.భార్య దేవికి ఫిట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో భార్య దేవి నెలరోజుల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను కాపురానికి తీసుకు వచ్చేందుకు శ్రీధర్ వారం కిందట అత్తారింటికి వెళ్లాడు. పిల్లలను ప్రత్తిపాడులో వదిలేసి భార్యాభర్తలిద్దరూ కలసి ఆనంద్‌నగర్‌లోని ఇంటికి శనివారం ఉదయం 10.30 గంటలకు వచ్చారు. వస్తూ శ్రీధర్ వెంట మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకూ తలుపు వేసి ఉండడం, ఇంటి లోపలకు వెళ్లిన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు ఎంత తట్టినా తీయలేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి తలుపులు తీసి చూడగా భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని మూడో పట్టణ పోలీసులకు తెలిపారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దేవి మెడకు చున్నీ ఉండడం, ఆమె కిందపడిపోవడంతో ఆమెను చంపి శ్రీ«ధర్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను సీఐ వీరయ్య గౌడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
చెప్పుతో కొడతా!
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ డివిజన్లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్‌కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అడుగడుగునా నిలదీతలేఅంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు. వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. -
Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి
-
అనపర్తిలో అయోమయం
సాక్షి, రాజమహేంద్రవరం: అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్నా ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారనే విషయంపై సస్పెన్స్ వీడటం లేదు. ఫలితంగా బీజేపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీటు తమకంటే తమకంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి స్వప్రయోజనాల కోసం, మరిది చంద్రబాబుకు మంచి చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో టీడీపీ, బీజేపీ నేతలు నలిగిపోతున్నారు. చంద్రబాబు వ్యూహంతో.. అనపర్తి అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును టీడీపీ తొలుత ప్రకటించింది. అనంతరం కుదిరిన పొత్తుల్లో ఈ సీటును బీజేపీకి వదిలేసింది. దీంతో హతాశులైన నల్లమిల్లి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. చంద్రబాబు దిగి రాకపోవడంతో రామకృష్ణారెడ్డి రెబల్‌గా బరిలోకి దిగి, ప్రచారం చేసుకుంటున్నారు. ఈలోగా ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా మాజీ సైనికుడు ములగపాటి శివరామ కృష్ణంరాజు పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన విపక్ష కూటమి అభ్యరి్థగా బీజేపీతో పాటు టీడీపీ, జనసేన కండువాలు వేసుకుని ప్రచారం చేసుకుంటూంటే టీడీపీ నేతలు బిక్కవోలులో అడ్డుకున్నారు. టీడీపీ కండువాలతో ప్రచారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు వ్యూహం మేరకు బీజేపీ అభ్యరి్థగా శివరామ కృష్ణంరాజును తప్పించి, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కమలం పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించేందుకు పురందేశ్వరి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. పోటాపోటీగా నామినేషన్లు నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తరువాత చూద్దాంలే అనే భావనతో ఎవరికి వారు ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి టీడీపీ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి తానే ఎన్నికల బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చేలా ఆ పార్టీ అభ్యర్థి శివరామ కృష్ణంరాజు తరఫున ఆయన భార్య దుర్గా దేవిక నామినేషన్ దాఖలు చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఒకవైపు సీటుపై నెలకొన్న పీటముడి వీడకముందే బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు కావడంతో దీనిని బీజేపీకే కట్టబెడతారేమోననే ఆందోళనతో నల్లమిల్లి వర్గం పునరాలోచనలో పడింది. ముందు జాగ్రత్తగా రామకృష్ణారెడ్డి తరఫున తేతలి అబ్బుస్రెడ్డి కూడా బీజేపీ అభ్యరి్థగా మంగళవారం నామినేషన్ వేశారు. ఈ పరిణామం బీజేపీ నేతల్లో మరింతగా అగ్గి రాజేస్తోంది. పారీ్టలో చేరకుండానే బీజేపీ అభ్యరి్థగా ఎలా నామినేషన్ వేస్తారంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పురందేశ్వరి మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గూటికి నల్లమిల్లి? తాజా పరిణామాల్లో అనపర్తిలో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యూహాత్మకంగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరుకోనున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రక్రియ లాంఛనమన్న సంకేతాలు టీడీపీ నేతల నుంచే వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు, పురందేశ్వరి డైరెక్షన్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు కమలనాథులే చెబుతున్నారు. కమలం గుర్తు పైనే అనపర్తి బరిలో నల్లమిల్లి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన బీజేపీ అభ్యర్థిగా తన తరఫున వేరే వ్యక్తితో నామినేషన్ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ బీఫామ్ సైతం తనకే దక్కుతుందన్న ధీమా నల్లమిల్లిలో కనిపిస్తోంది. సెంటిమెంటుతోనేనా.. అనపర్తిపై పురందేశ్వరి ఇంతగా పట్టు పట్టడానికి ఈ నియోజకవర్గ సెంటిమెంటే కారణమని చెబుతున్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలని భావిస్తే.. ఏక మొత్తంగా అదే పార్టీకి పట్టం కడతారు. ఆ పారీ్టకి భారీ మెజార్టీ అందిస్తారన్న ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏ పారీ్టకి మొగ్గు చూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. గత ఎన్నికల గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009లో రాజమండ్రి నుంచి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా మురళీమోహన్ పోటీ చేశారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు 50 వేల మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తిలో మాత్రమే భంగపాటు ఎదురైంది. ఆ ఎన్నికల్లో అనపర్తి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఒక్క ఈ నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అనపర్తి దెబ్బకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం పునరావృతం కాకుండా, తాను గెలవాలంటే నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయించాలన్నది చిన్నమ్మ ఆకాంక్ష. అందుకోసమే తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా పురందేశ్వరి అభ్యర్థి మార్పుపై పట్టుబడుతున్నారని అంటున్నారు. నల్లమిల్లికే చిన్నమ్మ ఆశీస్సులు! రాజమండ్రి ఎంపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న చిన్న మ్మ పురందేశ్వరి.. తన ప్రయోజనాల కోసం, మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసం సొంత పారీ్టకి నమ్మకద్రోహం చేసేందుకు సైతం వెనుకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజే పీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కృష్ణంరాజును కాదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి ఆమె అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా నల్లమిల్లిని బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ సైనికుడు, కృష్ణంరాజును పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆమె అలి్టమేటం జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షురాలి ఆదేశాలను పట్టించుకోని కృష్ణంరాజు తన భార్యతో నామినేషన్ దాఖలు చేయించారని తెలిసింది. మాజీ సైనికుడికి అన్యాయం? అనపర్తి అసెంబ్లీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణంరాజు ఆ పారీ్టకి వీర విధేయుడు. ఆయనది ఆర్ఎస్ఎస్ కుటుంబం. తండ్రి బీజేపీ బలోపేతానికి పాటు పడ్డారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన కృష్ణంరాజు బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా పేరు సంపాదించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు నాలుగేళ్లుగా అహరి్నశలూ కష్టపడ్డారు. ఏడాది నుంచి బీజేపీ అనపర్తి నియోజకవర్గ కనీ్వనర్‌గా కొనసాగుతున్నారు. ఈ మాజీ సైనికుడిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు అనపర్తి సీటు కేటాయించారు. ఈ పరిణామం పురందేశ్వరికి మింగుడు పడని అంశంగా మారింది. స్వపక్ష అభ్యరి్థకి మద్దతు ఇవ్వాల్సింది పోయి.. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి అండగా నిలవడం ప్రారంభించారు. అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో లోక్‌సభ ఓట్లు తనకు రావాలంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యరి్థగా నల్లమిల్లి ఉండాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం చివరకు అధిష్టాన నిర్ణయాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్ధపడుతున్నారు. పురందేశ్వరి వ్యవహార శైలి కమలనాథులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత సోము వీర్రాజు బీజేపీకి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. -
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్‌లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి -
చలో రాజమహేంద్రవరం
‘గేమ్‌చేంజర్’ కోసం రాజమహేంద్రవరం వెళ్లనున్నారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తు్తన్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో జరగనుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్యతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట శంకర్. రాజమహేంద్రవరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత వైజాగ్‌కు వెళ్తారట యూనిట్. తమన్ ఈ సినిమాకు స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.. రిలీజ్ డేట్‌పై త్వరలోనే స్పష్టత రానుంది. -
చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం
పార్టీ కోసం.. చంద్రబాబు పర్యటనల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయల చేతి చమురు వదిలిపోయింది.. మూతికి కర్రతో గడ్డి కట్టి, ఆశ చూపించి, పరుగులు పెట్టించినట్టు.. ఎమ్మెల్యే సీటు ఇస్తామంటూ ఆశ చూపారు. ఆ మాటలు కాస్తా నమ్మి పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. కొన్నాళ్లు పోయాక.. అబ్బెబ్బే.. అది కాదు.. ఎంపీ సీటు అన్నారు. తీరా చూస్తే పొత్తులతో ఆ ఆశ కాస్తా చిత్తయిపోతున్న చిత్రం కళ్ల ముందు స్పష్టం కనిపిస్తోంది. మొత్తంమీద చంద్రబాబు జిత్తులతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తున్నట్టుగా ఉంది టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి పరిస్థితి. తాజాగా శుక్రవారం విడుదల చేసిన మూడో జాబితాలో కూడా చౌదరి పేరు లేకపోవడంతో.. ఈ పరాభవాన్ని ఎలా సహించాలంటూ ఆయనతో పాటు ఆయన వర్గం అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది. వ్రతం చెడ్డా ఫలితం కూడా దక్కలేదంటూ ఆక్రోశిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పదా? రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశిస్తున్న ఆయనకు.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమితో ఆశలు గల్లంతైనట్లేనా? కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరిని రంగంలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారా? ఈ పరిణామంతో చౌదరికి మరోసారి పరాభవం ఎదురు కానుందా? టీడీపీ మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. రెంటికీ చెడ్డ రేవడిలా.. తన పనితీరుపై అధినేత చంద్రబాబు విరుచుకుపడటంతో రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గ ఇన్చార్జి పదవికి చాన్నాళ్ల కిందటే గుడ్‌బై చెప్పేశారు. అప్పటి నుంచీ ఆ బాధ్యతలను బొడ్డు వెంకట రమణ చౌదరికి చంద్రబాబు అప్పగించారు. ఆయనే రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి అనే ప్రచారం విస్తృతంగా సాగింది. అంతలోనే ఆయన ఆశలపై పొత్తుల పిడుగు పడింది. జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవడం.. రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో చౌదరి వర్గంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఈ పరిణామం చౌదరికి మింగుడు పడని అంశంగా మారింది. ఒక దశలో ఇది చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించే స్థాయికి చేరింది. కొద్ది రోజుల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును అడ్డుకోవడం వరకూ వెళ్లింది. ఆ సమయంలో చౌదరిని బుజ్జగించేందుకు చంద్రబాబు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. అందుకు ససేమిరా అన్నప్పటికీ చేసేది లేక చౌదరి మిన్నకుండిపోయారు. అప్పటి నుంచీ టీడీపీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన వర్గం సైతం అందే పంథా అవలంబిస్తోంది. తనకు ఎంపీ సీటు కేటాయిస్తారులే అనే ఆశతో ఇష్టం లేకపోయినా.. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి చౌదరికి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో సైతం ఆయన పేరు లేకపోవడంతో ఎంపీ సీటు కూడా గోవిందానేనా? అనే అనుమానం చౌదరి వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. కలవరం రేపుతున్న కూటమి ఎమ్మెల్యే సీటు ఎటూ దక్కలేదు.. కనీసం ఎంపీగా అయినా అవకాశం వస్తుందని భావిస్తున్న చౌదరి వర్గానికి.. చంద్రబాబు బీజేపీతో కలవడం కొత్త టెన్షన్ తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీ సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను ఎన్నికల బరిలోకి దింపేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం స్థానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు నగరంలోని ఓ హోటల్లో కొద్ది రోజులుగా బస చేస్తున్నట్లు తెలిసింది. పురంధేశ్వరి పోటీ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలు, సాధ్యాసాధ్యాలపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి పోటీ దాదాపు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీ కోరుకుంటున్న ఈ లోక్‌సభ స్థానాన్ని కాదనే ధైర్యం చంద్రబాబు చేయరు. ఈ పరిణామాలు చౌదరి వర్గంలో ఆందోళన రేపుతోంది. ఎంపీ అవకాశం కూడా లేనట్లేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాగైతే తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే మీమాంస ఆయన వర్గంలో బలంగా కనిపిస్తోంది. పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగేలా ఉన్నారన్న భావన వ్యక్తమవుతోంది. రూ.కోట్లు ధారబోసినా కరివేపాకు రాజకీయమేనా! బీజేపీ నేతలతో చంద్రబాబు కాళ్లబేరానికి వెళ్లడం టీడీపీ నేతలకు తిప్పలు తెచ్చి పెడుతోంది. ఇప్పటికే జనసేనతో జత కట్టడంపై గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజాగా బీజేపీతో కలవడంపై మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకట రమణ చౌదరి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. చినబాబు లోకేష్‌కు సంబంధించిన సోషల్ మీడియా మొత్తం ఆయనే చూస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా పబ్లిసిటీ చేసేందుకు సహకరిస్తున్నారు. ఇదే తరుణంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, పటిష్టతకు ఇంత చేస్తున్నా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయం చౌదరి వర్గంలో వ్యక్తమవుతోంది. తన విషయంలో కూడా చంద్రబాబు కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసే రాజకీయాలకు తెర తీయడంపై మండిపడుతున్నారు. లోహిత్నూ వాడేసుకున్నారు ఎన్ఆర్ఐలు, డబ్బున్న నేతలు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి. ఇందుకు నిదర్శనమే శిష్ట్లా లోహిత్. ఎంపీ స్థానం కేటాయిస్తామనే ఆశ కల్పించి, ఎన్ఆర్ఐ అయిన లోహిత్‌ను రాజమహేంద్రవరంలో పరిచయం చేశారు. ఆర్థికపరమైన పార్టీ కార్యక్రమాలకు ఆయనను విస్తృతంగా వినియోగించుకున్నారు. ఆయనను ఏ స్థాయిలో వాడేసుకున్నారంటే.. రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహణకు ఒక్కో నియోజకవర్గానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.1.75 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలా లోహిత్ ఇచ్చిన డబ్బుతోనే మహానాడుకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేశారు. అందులో లోహిత్‌కు తగిన గుర్తింపు ఇచ్చిన పాపాన పోలేదు. చివరకు సీటు తనకు కాదని చావు కబురు చల్లగా చెప్పేశారు. దీంతో చేసేది లేక లోహిత్ ఇక్కడి నుంచి దుకాణం సర్దుకోవాల్సి వచ్చింది. ఇదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానాన్ని పురంధేశ్వరికి కేటాయిస్తే వెంకట రమణ చౌదరి సైతం దుకాణం ఎత్తేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆయన వర్గంలో చర్చ జరుగుతోంది. -
బీజేపీకి ‘మూడొ’చ్చింది
పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమా సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీజేపీకి ‘మూడొ’చ్చింది. విపక్ష కూటమిలోకి వచ్చీ రాగానే ఉమ్మడి తూర్పు గోదావరిలోని మూడు జిల్లాల్లో మూడు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆ పార్టీ పట్టుపడుతోంది. లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి గతంలో తాము గెలుపొందిన రాజమహేంద్రవరం తమకు ఇవ్వాల్సిందేనని కమలనాథులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలు కూడా కావాలనేది బీజేపీ ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఆ మూడు ఏవంటే కమలనాథుల దృష్టి కాకినాడ సిటీ, అమలాపురం, పి.గన్నవరం, అనపర్తి అసెంబ్లీ స్థానాలపై పడింది. ఈ నాలుగింటిలో మూడింటిని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న కాకినాడ సిటీ, గతంలో గెలుపొందిన పి.గన్నవరం (ఎస్సీ) స్థానంపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. పి.గన్నవరం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా తొలుత సరిపల్లి రాజేష్ ను ప్రకటించింది. దీనిపై సొంత పార్టీతోపాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో రాజేష్ తనంత తానుగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అయింది. ఇక్కడ వివాదాల కారణంగా ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహచర నేతలతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మద్దతుగా బీజేపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలకు ప్రతిపాదించారు. అమలాపురం సీటు కోసం టీడీపీ, జనసేనల్లో ఆశావహులు బస్తీ మే సవాల్ అంటూ కాలు దువ్వుతున్నారు. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నా ఇరు పార్టీల అగ్ర నాయకత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కూటమి నేతలున్నారు. ఇంకా తర్జనభర్జనలే జనసేన తొలుత ఆశించిన కాకినాడ సిటీ విషయంలో కూటమి నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. కాకినాడ రూరల్ ఎలాగూ ఆ పార్టీకి ఖరారు చేయడం, పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సిటీపై జనసేన ఆశలు వదిలేసుకుంది. పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడా సీటును ఆశిస్తోంది. సిటీ సీటు కోసం కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, బీజేపీ నాయకుడు డాక్టర్ ముత్తా వంశీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటితోపాటు రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కూడా బీజేపీ మొదటి నుంచీ కోరుతోంది. ఈ స్థానానికి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసును టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ కాదన్న చంద్రబాబు..ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉన్న అనపర్తిని బీజేపీకి వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి బీజేపీకి అనపర్తి సీటుని కేటాయిస్తారంటూ బలమైన ప్రచారమే జరుగుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు పేరు ప్రతిపాదిస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉండబట్టే టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి కనుసన్నల్లోనే ఆయన అనుచరులు అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణ మండపంలో శనివారం హడావిడిగా మూడు మండలాల పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. నల్లమిల్లికి సీటు ఇవ్వాల్సిందేనని తీర్మానించడమే కాకుండా రామవరంలోని ఆయన ఇంటికి ర్యాలీగా వెళ్లి సీటు విషయంలో సంఘీభావం ప్రకటించారు. -
చల్లారని సర్దుబాటు మంటలు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు మంటలు చల్లారడం లేదు. ఇరు పార్టీల అధినేతలు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహార శైలి ఆయా పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వెరసి వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. సీట్లపై ఎటూ తేల్చకపోవడంతో ఇరు పార్టీల నేతలు వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమ నేతకు సీటు కేటాయించని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలకు దిగుతామని అల్టిమేటం ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఎలా గెలుస్తారో చూస్తామంటూ శపథం చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నిరాకరిస్తే తమ సత్తా ఏమిటో పార్టీల అధిష్టానాలకు చూపేందుకు సంసిద్ధమవుతున్నారు. ప్రజల్లో తమకున్న ఆదరణను చూపేందుకు కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించుకుని మరీ బలప్రదర్శనలకు దిగుతున్నారు. కొవ్వొత్తుల ర్యాలీలు, మౌనపోరాటం వంటి కార్యక్రమాలతో వినూత్న నిరసనలకు నాంది పలకడం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నిడదవోలును బూరుగుపల్లికి కేటాయించాలని నినదిస్తున్న టీడీపీ నేతలు ఎడతెగని ఉత్కంఠ రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు ఉమ్మడి స్థానాలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. సీటు తనదంటే తనదంటూ జనసేన, టీడీపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఈ గందరగోళాన్ని చక్కదిద్దాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఇరు వర్గాల మధ్య విభేదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది. నిడదవోలులో నిరసన గళం నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పట్టం కట్టకపోతే సహించేది లేదని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. కచ్చితంగా తమ నేతకు కేటాయించాల్సిందేనన్న అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకి మద్దతుగా ఉండ్రాజవరం మండలంలోని ఆయన స్వగ్రామం వేలివెన్నుకు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. శనివారం సైతం అధిక సంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని శేషారావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ బలప్రదర్శనకు దిగారు. ఆయనకు టికెట్ దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని కుండ బద్దలుగొడుతున్నారు. జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రకటించుకోవడం పొత్తు ధర్మమా? అంటూ ప్రశ్నించారు. దుర్గేష్‌ను నిడదవోలుకు పంపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే ఇక్కడికి వచ్చి ఎలా గెలుస్తారో తామూ చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. దుర్గేష్ దారెటు..? రాజమహేంద్రవరం రూరల్ జనసేన నేత కందుల దుర్గేష్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే రూరల్ సీటు దక్కుతుందన్న ఆయన ఆశలకు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండి కొట్టారు. బుచ్చయ్య ఒత్తిడికి తలొగ్గిన టీడీపీ, జనసేన అధిష్టానాలు దుర్గేష్‌ను నిడదవోలుకు సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దుర్గేష్‌ను మంగళగిరి పిలిపించి మరీ హితబోధ చేశాయి. ఈ పరిణామం ఇటు రాజమహేంద్రవరం రూరల్ జనసేన, అటు నిడదవోలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు నింపాయి. ఇద్దరు నేతల మధ్య వైషమ్యాలకు ఆజ్యం పోశాయి. ఈ పరిస్థితుల్లో దుర్గేష్ ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దుర్గేష్‌కు స్థానచలనంపై జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. రూరల్‌లో బుచ్చయ్యకు సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. దుర్గేష్‌కు మద్దతుగా ఆందోళన దుర్గేష్‌ను నిడదవోలుకు పంపాలని జనసేన అధినేత పవన్ తీసుకున్న నిర్ణయంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇచ్చిన మాటను సైతం కట్టుబడి ఉండలేరా అని ప్రశ్నిస్తున్నారు. దుర్గేష్‌కు రూరల్ కేటాయించాలని కోరుతూ కడియం నుంచి రాజమహేంద్రవరం నగరంలోకి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలోపేతానికి దుర్గేష్ చేసిన కృషిని కూడా గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో అధిష్టానం ఉందా అని మండిపడ్డారు. దుర్గేష్‌కు సీటు కేటాయించకపోతే బుచ్చయ్యకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో దుర్గేష్‌కు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రకటించే వరకూ చూస్తానంటున్న గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్ సీటు తనకేనని సీనియర్ టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇరు పార్టీల అధ్యక్షులూ ప్రకటించేంత వరకూ వేచి చూస్తానని అంటున్నారు. -
రాజమహేంద్రి ..రాత మారింది
పవిత్ర గోదావరి సమీపాన ఉజ్వరిల్లే నగరం రాజమహేంద్రవరం. ఇదొక చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా ప్రతీతి చెందిన ప్రాంతం. హోల్ సేల్ వస్త్ర వాణిజ్యానికి చుక్కాని. నవ్య తూర్పు గోదావరి జిల్లాకు కేంద్రం. ఐదు లక్షలు పైగా జనాభాతో తులతూగే సిరులు కలిగిన నగరం. గత పాలకులు కేవలం పుష్కరాల సమయంలోనే నామమాత్రంగా పనులు చేసేవారు. కానీ నాలుగున్నరేళ్లలో నగర అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సాధారణ, మున్సిపాలిటీ, ప్రత్యేక, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) నిధులు రూ.558 కోట్లు వెచ్చించింది. ఇందులో రూ.217 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకాల నిర్వహణ చేపడుతోంది. పచ్చదనం పెంపొందించి, పార్కులను అభివృద్ధి చేస్తోంది. అర్బన్ ఫుడ్ ప్లాజా, కంబాల చెరువు పార్కు, పుష్కర ఘాట్ వద్ద పుష్కర ప్లాజా, హ్యాపీ స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్లను వినియోగంలోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రూ.7 కోట్లతో 100 అడుగుల రోడ్ల అభివృద్ధి జరిగింది. నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.125 కోట్ల ప్రత్యేక నిధులు అందించారు. – షేక్ ఫయాజ్ బాషా, సాక్షి, రాజమహేంద్రవరం మెడికల్ కళాశాల నిర్వహణ ఇలా.. ► సెంట్రల్ జైల్ ప్రాంగణంలో రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం ► అకడమిక్ కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణం ► 2023–24 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి 150 మెడికల్ సీట్లు ► సిబ్బందికి టీచింగ్ స్టాఫ్ క్వార్టర్లు ► మెడికో హాస్టళ్లు ► నర్స్ హాస్టళ్లు ► ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, బోధనాసుపత్రిలో 54 మంది వైద్యులు, ► 484 మంది నర్సులు ► ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 500 పడకల బోధనాసుపత్రిగా విస్తరణ నాలుగున్నరేళ్లలో వివిధ అభివృద్ధి పనులకు విడుదలైన నిధులు ► రహదార్లు రూ.98 కోట్లు ► డ్రెయిన్లు రూ.54కోట్లు ► మంచినీటి సరఫరా రూ.28 కోట్లు ► వీధి దీపాలకు రూ.9 కోట్లు ► పార్కులకు రూ.9కోట్లు ► సుందరీకరణకు రూ.13 కోట్లు ► సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ రూ.16కోట్లు ► భవనాలు రూ.6 కోట్లు ► ప్రత్యేక నిధులు రూ.100 కోట్లు ► సీఎం మంజూరు చేసిన నిధులు రూ.125 కోట్లు పురోగతి సాధించిందిలా.. ► రూ.4.3 కోట్లతో 7.3 కిలోమీటర్ల మేర డివైడర్ల మధ్యలో పచ్చదనం ► 17 కిలోమీటర్లలో 15,000 మొక్కలు ► ఎయిర్‌పోర్టు రోడ్డులో 12 కిలోమీటర్ల మేర రుడా, మున్సిపల్ నిధులతో ఉద్యానవనం ► 40 ఎకరాల విస్తీర్ణంలో 37 పార్కుల సుందరీకరణకు మరో రూ.4.3 కోట్లు ► కొత్తగా 5 పార్కులు (మహాలక్ష్మి పార్క్, గాదాలమ్మ నగర్ పార్క్, ఏకేసీ పార్క్, అంబేద్కర్ పార్క్, సాయిచైతన్య కాలనీ పార్క్, ఎస్బీఐ కాలనీ పార్క్) ► రూ.7.26 కోట్లతో జంక్షన్ల ఆధునీకరణ ► రూ. 7.26 కోట్లతో పుష్కర ఘాట్, దేవీచౌక్, దండి మార్చ్ వంటి 12 జంక్షన్లు ఆధునికీకరణ ► రూ.4.6 కోట్లతో అధునాతన కమాండ్ కంట్రోల్ రూము, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ► వై–జంక్షన్, హ్యాపీ స్ట్రీట్ వద్ద రూ.1.2 కోట్లతో వాటర్ ఫౌంటేన్లు ► ఆర్ట్స్ కళాశాల వద్ద ఈట్ స్ట్రీట్ అందుబాటులోకి తెచ్చారు. ► రూ.1.2 కోట్లతో ఆనం కళాకేంద్రం వద్ద అతి పెద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ► రూ. 2 కోట్లతో పద్మావతీ నగర్ పార్కు వద్ద చిన్నారులకు స్విమ్మింగ్ పూల్ ► రూ.53.85 కోట్లతో నగరంలో 51 కిలోమీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణాలు, ఆధునీకరణ పనులు ► ఇప్పటికే 39 కిలోమీటర్ల పనులు పూర్తి ► పురోగతిలో 12 కిలోమీటర్ల మేర పనులు ► రూ.5 కోట్లతో 5 అర్బన్ హెల్త్ సెంటర్ల మరమ్మతులు ► ఒక్కో కేంద్రానికి రూ.80 లక్షలు ► 6 యూపీహెచ్సీల నిర్మాణం పనులు ► గోదావరి నదిపై హేవలాక్ బ్రిడ్జిపై (పాత రైల్వే వంతెన) 2.7 కిలోమీటర్ల మేర ఆర్నమెంటల్ లైటింగ్ ‘నాడు–నేడు’తో నూతన రూపు ► రూ. 28 కోట్లతో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా 35 పాఠశాలలు ఎంపిక ► మొదటి దశలో శ్రీ పంతం సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, లాలాచెరువు హైసూ్కళ్లు ఆధునికీకరణ. రెండో దశలో మరో 60 పాఠశాలల అభివృద్ధి ప్రతిపాదనలు, టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులు ► నాగులగుట్ట చెరువు వద్ద రూ.12 కోట్లతో క్రికెట్ స్టేడియం నిర్మాణం ► రూ.23 కోట్లతో గోదావరి తీరం వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆధునీకరణ ► వీఎల్‌పురం వద్ద రూ.23 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ► రానున్న రూ.80 కోట్లతో అమృత్ స్కీమ్‌తో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం ► ఖేలో ఇండియా పథకం కింద రూ.40 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ► రూ.3 కోట్లతో గాంధీ పురం వద్ద గ్లో గార్డెన్ నిర్మాణాలు పర్యాటక కేంద్రంగా కంబాలచెరువు కంబాల చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు పార్కులో 6 ఎకరాల్లో చెరువు అభివృద్ధి బోటింగ్ సదుపాయం 4 ఎకరాల్లో జాగింగ్ ట్రాక్, బోట్ సైక్లింగ్, 4 లేజర్ షో, 360 డిగ్రీ సైక్లింగ్, 360 డిగ్రీ అమ్యూజ్ మెంట్ రైడ్, ట్రాంపోలిస్ ఎక్విప్మెంట్, స్కై బెలూన్ (చిల్ర్డన్స్), స్కై రోలర్, వాటర్ వాకింగ్ బాల్స్, బాడీ బార్బింగ్ బాల్స్, 4 పురుషుల జిమ్, సీటింగ్ గ్యాలరీ, మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా, ఓఏటీ జోన్, స్టేట్ ప్రైడ్ జోన్, చిల్ర్డన్స్ ప్లే ఏరియా ఆక్వా లేజర్ షో చౌడేశ్వర్ నగర్లో రూ. 3 కోట్లతో గ్లో థీమ్ పార్క్ రూ.90 లక్షలతో సివిల్ పనులు రూ.2 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టారు. అందుబాటులోకి 300 మీటర్ల వాకింగ్ ట్రాక్ బాపూజీ స్ఫూర్తికి నిదర్శనం దండి మార్చ్ మహాత్మా గాంధీ రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నగరాన్ని బాపూజీ ఐదుసార్లు సందర్శించారు. ఆ అనుబంధానికి ప్రతీకగా దండి మార్చ్ రూపుదిద్దుకుంది. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు వెచ్చించారు. 200 మీటర్ల పుష్కర ప్లాజా రోడ్డును పూర్తిగా ఆధునీకరించారు. సందర్శకులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైన్ బోర్డులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. పచ్చదనం పెంపొందించడంతో సెల్ఫీల కోసం యువత పోటీ పడుతోంది. ఏకేజీ కళాశాల వద్ద రూ. 80 లక్షలతో ఏర్పాటైన హ్యాపీ స్ట్రీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జగనన్న స్మార్ట్ రోడ్స్ ► రూ. 8.5 కోట్లతో ‘జగనన్న స్మార్ట్ రోడ్లు ► వై జంక్షన్ నుంచి లాలాచెరువు జంక్షన్ వరకూ 3 కిలో మీటర్లు అధునాతన రహదారి ► రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పున ఫుట్‌పాత్‌లు ► మధ్యలో ఆహ్లాదాన్ని నింపేలా ముచ్చటగొలిపే ఉద్యానవనాలు ► అక్కడక్కడా అందుబాటులోకి సెల్ఫీ స్పాట్లు ► గోడలపై రంగురంగుల బొమ్మలు ► రూ.5 కోట్లతో వై–జంక్షన్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఫుట్‌పాత్‌లు, పార్కింగ్, డస్ట్‌బిన్స్ ► రూ.12.6 కోట్లతో 16 కిలోమీటర్ల మేర 15 రకాల రహదారుల నిర్మాణం ప్రశాంత వాతావరణంలో జీవించాలి ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలి. రోడ్డు, డ్రెయిన్లు, వీధి దీపాలు, పార్కులను ఆధునీకరించాం. పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాం. తాగునీటి పనుల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాం. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.మాధవీలత, కలెక్టర్, తూర్పు గోదావరి హరిత నగరంగా తీర్చిదిద్దుతాం సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆహ్లాదకర ప్రదేశాలతో హరిత నగరంగా తీర్చిదిద్దుతున్నాం. న్యూయార్క్, ఇంగ్లండ్ దేశాల్లో ఓపెన్ ఆడిటోరియంలలో ఓపెన్ స్క్రీన్లపై చిత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఆనందంగా గడుపుతూంటారు. అలాంటి అనుభూతిని కల్పించేందుకు ఆనం కళాకేంద్రంలో ఓపెన్ స్క్రీనింగ్ ఆడిటోరియం తీర్చిదిద్దుతున్నాం – కె.దినేష్ కుమార్, కమిషనర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ -
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
గోదావరి చెంతన తెలుగు పరవళ్లు
సాక్షి,రాజమహేంద్రవరం/రాజానగరం:: గోదావరి చెంతన.. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని ఛత్తీస్‌గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇక్కడి గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా, ఆదికవి నన్నయ భారతాన్ని ఆంధ్రీకరించి వెయ్యేళ్లయిన సందర్భంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ భట్టారక, నారాయణభట్టు వేదికలపై నిర్వహిస్తున్న ఉత్సవాలను గవర్నర్ విశ్వభూషణ్, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ.. సంస్కృతి, రచనలకు కేరాఫ్ అడ్రస్‌గా రాజమహేంద్రవరం విరాజిల్లుతోందన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కావ్యాలు, పురాణేతిహాసాలను తెలుగు వాళ్లు అనువదించినట్టు ఎవరూ చేయలేదన్నారు. పోతన భాగవతం, అన్నమయ్య కీర్తనల్లోని పదాలు చూస్తే ముచ్చటేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారి వారణాసి రామ్‌మాధవ్, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందెశ్రీ, జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్ణకుంభ పురస్కారాలు తెలుగు జాతికి పూర్వీకులు అందించిన సేవలను గుర్తించి, వారి వారసులను సత్కరించడం అభినందనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. తెలుగు మహాసభల్లో రాజరాజనరేంద్రుని వేదికపై శుక్రవారం సాయంత్రం జరిగిన పూర్ణకుంభ అవార్డుల ప్రదానోత్సవంలో వారు మాట్లాడారు. తెలుగు జాతికి విశిష్ట సేవలందించిన ప్రముఖులు తరిగొండ వెంగమాంబ, కవయిత్రి మొల్ల, తిక్కన సోమయాజి, డొక్కా సీతమ్మ, పరవస్తు చిన్నయసూరి, గుర్రం జాషువా, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, పెద్దింటి దీక్షిత్‌దాసు, ఘంటసాల వెంకటేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు, సాలూరి రాజేశ్వరరావు, పీబీ శ్రీనివాస్, జంధ్యాల, జమునా రాయలు, బాపు తదితరుల వారసులను అతిథులు సత్కరించారు. విశ్వనాథ గోపాలకృష్ణ, బుచ్చివెంకటపాతిరాజు, జిత్‌మోహన్‌మిత్రా, ఎర్రాప్రగడ రామకృష్ణ, కూచిభోట్ల ఆనంద్, రసరాజు, బాదం బాలకృష్ణ, వంశీ రామరాజు, చెరుకువాడ రంగసాయి, తనికెళ్ల భరణి, గౌతమీ గ్రంథాలయం, నన్నయ భట్టారక పీఠం, చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ ప్రతినిధులు కూడా పురస్కారాలు అందుకున్నారు. -
కాపుల మీద దాడులపై పవన్ నోరు విప్పాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ)/రాజమహేంద్రవరం సిటీ: కాపు సామాజికవర్గంపై దాడులు జరుగుతుంటే పవన్‌కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపులపై పవన్‌కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న టీడీపీని బతికించాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ అంబటిపై దాడిని ఖండించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కాపు జేఏసీ ర్యాలీ మంత్రి అంబటిపై దాడి దుర్మార్గమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కాపు జేఏసీ నేతలు నందెపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మానే దొరబాబు, అడపా అనిల్, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, వలవల దుర్గాప్రసాద్, నామన వాసు, బురిడీ త్రిమూర్తులు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి పెద్దమనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి మంత్రి రోజా సవాల్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. భువనేశ్వరి కోరినట్లుగా తన ఆస్తులపై సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మరి మీరు కూడా సిద్ధమేనా భువనేశ్వరీ అంటూ సవాల్ విసిరారు. గురువారం ఆమె రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌తో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1991లో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి తన సంపాదన ప్రారంభమైందని, దానిపై సీబీఐతో విచారణకు తాను సిద్ధమేనని చెప్పారు. మరి అదే సమయంలో భువనేశ్వరి కూడా ఆమె ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆర్థిక నేరగాడికి సంకెళ్లు వేస్తే మొత్తం రాష్ట్రానికే సంకెళ్లు వేసినట్టు భువనేశ్వరి వ్యాఖ్యానించడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. -
ఈనాడు ఫోటో గ్రాఫర్ అయితే ఏంటి? బాలయ్య చిందులు
రాజమహేంద్రవరం: నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై బాలయ్య చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్‌లోని లోకేశ్ క్యాంప్ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో బాలకృష్ణ మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్‌నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి **..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. బాలకృష్ణ పలు సందర్భాల్లో ఇలా ప్రవర్తించడం అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఏం మాట్లాడాతాడో, ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో బాలకృష్ణకే తెలియదు. గతంలో అభిమానులపై కూడా బాలకృష్ణ చిందులు తొక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆవేశంలో బూతులు మాట్లాడిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా యెల్లో మీడియాలో భాగమైన ‘ఈనాడు’పైనే ఆగ్రహం వ్యక్తం చేశాడంటే ఆయన ఫస్ట్రేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన బావ చంద్రబాబు కేసులో ఇరుక్కుని రిమాండ్‌కు వెళ్లడం, ఆయన అల్లుడి ఢిల్లీలో మకాం వేయడంతో ఏం చేయాలో తోచక సహనం కోల్పోతున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే, అది ఆయన సహజశైలినో, నైజమో అర్థం కాక అభిమానులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీకి ఎప్పుడూ డబ్బా కొట్టే ఈనాడుకు చెందిన ఫోటోగ్రాఫర్పైనే బాలయ్య అసహనం ప్రదర్శించాడంటే పార్టీని, చంద్రబాబును మరింత కష్టాల్లోకి నెట్టేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. మరి బాలకృష్ణ అంతేలే అని ఈనాడు అధినేత రామోజీరావు సరిపెట్టుకుంటారో లేదో చూడాలి. -
‘వారధి’క్యం
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే పడవో, పంటో ఎక్కాల్సిందే. మరో దారి లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూ కొవ్వూరు వెళ్లేవారు. కొవ్వూరు నుంచి తిరిగి రావాలన్నా మళ్లీ అదే మార్గం..అదే కష్టం..1976 నుంచి ఈ ఇబ్బందులు తప్పాయి. ఉభయ గోదావరి జిల్లాలను (విభజనకు ముందు) కలుపుతూ అఖండ గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన ప్రారంభమైంది. కింది మార్గంలో రైలు వెళ్లేందుకు పట్టాలు.. దానిపైన రోడ్డు నిర్మించారు. అపురూపమైన ఈ రవాణా సౌకర్యం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. గోదారమ్మ సాక్షిగా బస్సులోనో.. రైలులోనో గమ్మం చేరే మధురాభూతుల ప్రయాణానికి మార్గం ఏర్పడింది. మనదేశంలో రెండో అతిపెద్ద రోడ్డు కం రైలు ప్రయాణ వారధి ఇదే. 49 ఏళ్ల ఈ చారిత్రాత్మక వంతెన నాణ్యత పరిరక్షణ ఇప్పుడు సవాలుగా నిలిచింది. వయో భారం పెరగడంతో ఎక్కువ వాహనాలను ఈ వంతెనపై అనుమతించాలాంటే సందేహించాల్సి వస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా భారీ వాహనాలను అనుమతించకూడదని అధికారులు తాజాగా నిర్ణయించారు. నిర్మాణం ఇలా: గోదారమ్మ వడ్డాణం ధరించిందా అన్నట్టుటుంది రైలు కం రోడ్డు వంతెన. ఈ వంతెనపై ప్రయాణమంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇప్పటికీ బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం వస్తుందనగానే అందరి కళ్లూ ఉరకలేసే గోదారిని చూడాలని ఆరాటపడతాయి. ఆనందానుభూతులను మనసులో నింపుకొంటారు. చెన్నై–హౌరా మధ్య రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ వారధి నిర్మాణం తెరపైకి వచ్చింది. 1964లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక దశాబ్దం పట్టింది. జపాన్‌లో కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 1994లో 3.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన స్కైగేట్ బ్రిడ్జి తర్వాత పెద్ద వంతెన ఇదే కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మూడు జాతీయ సంస్థలు ఈ వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. 1974 నవంబర్ 20 అప్పటి రాష్ట్రపతి ప్రకృద్ధీన్ ఆలీ అహ్మద్ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరవై ఐదేళ్లు కనిష్టం, ఎనభై ఏళ్లు గరిష్టంగా మనగలిగేలా వారధిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ వారధి ఉభయ గోదావరి సమైక్య వాహినిగా ఖ్యాతినార్జించింది. ఇప్పుడేమైంది: నిర్మాణ సమయంలో అనుకున్న అంచనాలకు మించి తర్వాత ఈ వారధిపై రాకపోకలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని అంచనా. రవాణా అవసరాలు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సరకు రవాణాకూ ఈ మార్గాన్నే అనుసరించేవి. ఫలితంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వారధికి భారంగా పరిణమించింది. దీంతో 49 ఏళ్లకే వంతెన మార్గం ప్రమాదంలో పడింది. 2007, 2011లలో దీనిని నిపుణులు పరిశీలించారు. మూడు ఆక్సిల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు, లేదా 10.20 టన్నుల బరువుకు మించిన వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో అధికారులు వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. నిర్లక్ష్యానికి మూల్యం క్షేత్ర స్థాయిలో వంతెనపై భారీ వాహనాకు సంబంధించిన రూపొందించిన నిషేధాజ్ఞలు సక్రమంగా అమలు కాలేదు. 2010లో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల ఉదాశీన వైఖరిని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఎస్సైతో పాటు దిగువ స్థాయిలోని పదిమంది సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత నిబంధనల అమలుకు వంతెన మార్గానికి అటు ఇటు పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. తర్వాత సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. దీంతో భారీ వాహనాల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. అధికారులు ఇటీవల వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇరువైపులా నిషేధాజ్జలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 23 నుంచి భారీ వాçహనాల నియంత్రణపై కలెక్టర్ మాధవీలత గట్టి ఆంక్షలు విధించారు. రెండు వైపులా పోలీసు పికెట్లను పునరుద్ధరించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వంటివి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా పల్లెవెలుగు బస్సులను అనుమతిస్తున్నారు. రూ.36 కోట్లతో మరమ్మతులు ఈ వంతెనపై 1996 నుంచి ఇప్పటివరకూ అడపాదడపా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కానీ అవి నిలవడం లేదు. ఇటీవల ఆర్అండ్బీ అధికారులు ఈ వంతెన మార్గానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ.24 కోట్ల వ్యయంతో గడ్డర్ల మార్పిడి, పుట్‌ఫాత్ నిర్మాణం, శ్లాబులు వేయడం, హ్యాండ్ రైలింగ్ వంటి పనులు ఇందులో చేపడతారు. ఈ మొత్తంలో రూ.3 కోట్లు మాత్రమే రైల్వే శాఖ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో జాయింట్ల మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, సెకండరీ జాయింట్ మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు, క్రోకడయిల్ జాయింట్ మరమ్మతులు చేపట్టాలని సంకల్పించారు. అత్యవసరంగా రూ.2.10 కోట్ల వ్యయంతో వారధికి ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్ రోడ్లను కూడా పునరుద్ధరించనున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. -
కొవ్వూరు–రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే పడవో, పంటో ఎక్కాల్సిందే. మరో దారి లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూ కొవ్వూరు వెళ్లేవారు. కొవ్వూరు నుంచి తిరిగి రావాలన్నా మళ్లీ అదే మార్గం..అదే కష్టం..1976 నుంచి ఈ ఇబ్బందులు తప్పాయి. ఉభయ గోదావరి జిల్లాలను (విభజనకు ముందు) కలుపుతూ అఖండ గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన ప్రారంభమైంది. కింది మార్గంలో రైలు వెళ్లేందుకు పట్టాలు.. దానిపైన రోడ్డు నిర్మించారు. అపురూపమైన ఈ రవాణా సౌకర్యం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. గోదారమ్మ సాక్షిగా బస్సులోనో..రైలులోనో గమ్మం చేరే మధురాభూతుల ప్రయాణానికి మార్గం ఏర్పడింది. మనదేశంలో రెండో అతిపెద్ద రోడ్డు కం రైలు ప్రయాణ వారధి ఇదే. 49 ఏళ్ల ఈ చారిత్రాత్మక వంతెన నాణ్యత పరిరక్షణ ఇప్పుడు సవాలుగా నిలిచింది. వయో భారం పెరగడంతో ఎక్కువ వాహనాలను ఈ వంతెనపై అనుమతించాలాంటే సందేహించాల్సి వస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా భారీ వాహనాలను అనుమతించకూడదని అధికారులు తాజాగా నిర్ణయించారు. నిర్మాణం ఇలా.. గోదారమ్మ వడ్డాణం ధరించిందా అన్నట్టుటుంది రైలు కం రోడ్డు వంతెన. ఈ వంతెనపై ప్రయాణమంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇప్పటికీ బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం వస్తుందనగానే అందరి కళ్లూ ఉరకలేసే గోదారిని చూడాలని ఆరాటపడతాయి. ఆనందానుభూతులను మనసులో నింపుకొంటారు. చైన్నె–హౌరా మధ్య రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ వారధి నిర్మాణం తెరపైకి వచ్చింది. 1964లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక దశాబ్దం పట్టింది. జపాన్‌లో కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 1994లో 3.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన స్కైగేట్ బ్రిడ్జి తర్వాత పెద్ద వంతెన ఇదే కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మూడు జాతీయ సంస్థలు ఈ వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. 1974 నవంబర్ 20 అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరవై ఐదేళ్లు కనిష్టం, ఎనభై ఏళ్లు గరిష్టంగా మనగలిగేలా వారధిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ వారధి ఉభయ గోదావరి సమైక్య వాహినిగా ఖ్యాతినార్జించింది. ఇప్పుడేమైంది.. నిర్మాణ సమయంలో అనుకున్న అంచనాలకు మించి తర్వాత ఈ వారధిపై రాకపోకలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని అంచనా. రవాణా అవసరాలు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సరకు రవాణాకూ ఈ మార్గాన్నే అనుసరించేవి. ఫలితంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వారధికి భారంగా పరిణమించింది. దీంతో 49 ఏళ్లకే వంతెన మార్గం ప్రమాదంలో పడింది. 2007, 2011లలో దీనిని నిపుణులు పరిశీలించారు. మూడు ఆక్సిల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు, లేదా 10.20 టన్నుల బరువుకు మించిన వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో అధికారులు వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. నిర్లక్ష్యానికి మూల్యం క్షేత్ర స్థాయిలో వంతెనపై భారీ వాహనాకు సంబంధించిన రూపొందించిన నిషేధాజ్ఞలు సక్రమంగా అమలు కాలేదు. 2010లో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల ఉదాశీన వైఖరిని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఎస్సైతో పాటు దిగువ స్థాయిలోని పదిమంది సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత నిబంధనల అమలుకు వంతెన మార్గానికి అటు ఇటు పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. తర్వాత సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. దీంతో భారీ వాహనాల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. అధికారులు ఇటీవల వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇరువైపులా నిషేధాజ్జలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 23 నుంచి భారీ వాహనాల నియంత్రణపై కలెక్టర్ మాధవీలత గట్టి ఆంక్షలు విధించారు. రెండు వైపులా పోలీసు పికెట్లను పునరుద్ధరించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వంటివి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా పల్లెవెలుగు బస్సులను అనుమతిస్తున్నారు. రూ.36 కోట్లతో మరమ్మతులు ఈ వంతెనపై 1996 నుంచి ఇప్పటివరకూ అడపాదడపా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కానీ అవి నిలవడం లేదు. ఇటీవల ఆర్అండ్బీ అధికారులు ఈ వంతెన మార్గానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ.24 కోట్ల వ్యయంతో గడ్డర్ల మార్పిడి, పుట్‌ఫాత్ నిర్మాణం, శ్లాబులు వేయడం, హ్యాండ్ రైలింగ్ వంటి పనులు ఇందులో చేపడతారు. ఈ మొత్తంలో రూ.3 కోట్లు మాత్రమే రైల్వే శాఖ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో జాయింట్ల మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, సెకండరీ జాయింట్ మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు, క్రోకడయిల్ జాయింట్ మరమ్మతులు చేపట్టాలని సంకల్పించారు. అత్యవసరంగా రూ.2.10 కోట్ల వ్యయంతో వారధికి ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్ రోడ్లను కూడా పునరుద్ధరించనున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. శాశ్వత పనులకు ప్రతిపాదనలు రోడ్డు కం రైలు వంతెనపై శాశ్వత మరమ్మతులను ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రత్యేక పనుల కింద రూ.2.10 కోట్లతో అత్యవసరంగా చేపట్టేందుకు టెండర్లు పిలిచాం. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తాం. అత్యవసర నిధులతో వివిధ రకాల పనులు చేపట్టనున్నాం. శాశ్వత మరమ్మతులు చేపట్టడానికి రైల్వే శాఖను సమన్వయ పరుచుకోవాల్సి ఉంది. – ఎస్బీవీ రెడ్డి, ఈఈ, రోడ్డు కం రైలు వంతెన, రాజమహేంద్రవరం