Randeep Hooda
-
హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటుల్లో రణ్‌దీప్ హుడా ఒకరు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది నవంబరులో మోడల్, నటి లిన్ లైష్రామ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెది మిజోరాంలో ఇంఫాల్. తాజాగా తన ప్రాంతంలోని చేనేత కార్మికులకు సపోర్ట్ చేస్తూ వాళ్లు తయారు చేసిన దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసింది. బాడీ పాజిటివిటీ గురించి మంచిగా రాసుకొచ్చింది.ఊహించని విధంగా ఈ ఫొటోలకు దిగువన ప్రశంసల కంటే ట్రోల్స్ ఎక్కువొచ్చాయి. అదీ కూడా చాలామంది అమ్మాయిలు ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేయడంతో తాను చాలా బాధపడ్డాడని లిన్ లైష్రామ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతని నిజం చేసేలా ప్రవర్తించొద్దని కాస్త ఘాటుగానే స్పందించింది.(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)'నా బరువు గురించి తోటి మహిళలు జోకులు వేయడం చూసి షాకయ్యా. ఇది నిజంగా చాలా బాధాకరం. వాళ్లు నా స్థానంలో ఉండి ఆలోచించాలి. బొద్దుగా ఉన్నా సరే ర్యాంప్‌పై రప్ఫాడించాను. మీ ఊహలకు అందని విధంగా కనిపించాను. 'ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువు' అనే సామెతని నిజం చేసేలా ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. దీనికి బదులు ఒకరికొకరు అండగా నిలబడింది' అని లిన్ లైష్రామ్ తన బాధని చెప్పుకొచ్చింది.ఇక లిన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'బన్ టిక్కీ' అనే సినిమా చేస్తోంది. ఇందులో జీనత్ అమన్, షబానా అజ్మీ, అభయ్ డియోల్ ప్రధాన పాత్రధారులు. ఫరాజ్ అరిఫ్ అన్సారి దర్శకుడు.(ఇదీ చదవండి: తమన్నా-విజయ్ వర్మ ప్రేమ.. ఏకంగా 5000 ఫొటోలు!) -
ఓటీటీలోకి ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మరో డిఫరెంట్ మూవీ రాబోతుంది. 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' టైటిల్‌తో తీసిన ఈ బయోపిక్.. మార్చి 22న థియేటర్లలోకి వచ్చింది. అయితే బయోపిక్స్ ట్రెండ్ పాతబడటం వల్లో ఏమో గానీ ఈ సినిమాకు అనుకున్నంతగా వసూళ్లు రాలేదు. టైటిల్ రోల్లో రణ్‌దీప్ హుడా అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ సావర్కర్ జయంతి సందర్భంగా ఓటీటీలోకి రాబోతుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)రణ్ దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' సినిమాని ఇతడే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు సావర్కర్ జీవితంలో ఏం జరిగింది? ఇంతకు ఆయన ఎవరు అనే విషయాల్ని ఇందులో చూపించారు. రూ.20 కోట్ల బడ్జెట్ పెడితే రూ.30 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.సావర్కర్ గురించి ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవడం వల్లే ఈ మూవీ సగటు ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇకపోతే మే 28న సావర్కర్.. 141వ జయంతి సందర్భంగా మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారు. జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్స్ చూసే ఆసక్తి ఉంటే మీరు దీన్ని ట్రై చేయండి.(ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!)Ankhand Bharat tha unka sapna, Hindutva thi jiski buniyaad. Watch the untold story of #VeerSavarkar - ‘India’s Most Dangerous Revolutionary Ever’, premiering on his 141st birthday, 28th May only on #ZEE5.#ReliveSavarkarOnZEE5 pic.twitter.com/m06edcUwft— ZEE5 (@ZEE5India) May 20, 2024 -
‘ఇది న్యాయం కాదు’.. అమీర్ సర్ఫరాజ్ హత్యపై స్పందించిన సరబ్జిత్ కుమార్తె
భారత్‌కు చెందిన సరబ్జిత్ సింగ్‌ను జైలులో హత్యచేసిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సర్ఫరాజ్‌ను కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని హత్యచేసిన అమీర్ మృతిపై సరబ్జిత్ కుమార్తె స్వపన్‌దీప్ కౌర్ స్పందించారు. ‘ఒక రకంగా సంతృప్తికి కలిగినా.. ఇది న్యాయం కాదు అని భావిస్తున్నా. నా తండ్రి ఎలా హత్య చేయబడ్డారో నిర్ధారణ చేసుకోవడానికి విచారణ జరగాలని కోరుకోన్నాం. నా తండ్రి హత్యలో ముగ్గురు లేదంటే నలుగు వ్యక్తుల ప్రమేయం ఉంది. అయితే ఒక్క అమీర్‌ను హతమార్చి పాక్ ప్రభుత్వం తన తండ్రి హత్యకు జరిగిన కుట్రను కప్పిపుచ్చాలని చూస్తోంది. సరబ్జిత్, అమీర్ హత్యల వెనక పాక్ ప్రభుత్వ హస్తం ఉంది’ అని స్వపన్‌దీప్ కౌర్ తెలిపారు. అమీర్ సర్ఫరాజ్ హత్యపై సరబ్జిత్ సింగ్ బయోపిక్‌లో ప్రధాన ప్రాతలో నటించిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా స్పందించారు. ‘కర్మ అంటే ఇదే.. అమీర్ సర్ఫరాజ్‌ను అంతం చేసిన గుర్తు తెలియని వ్యక్తులకు ధన్యవాదాలు. ఇప్పడు సరబ్జిత్ సింగ్ హత్య విషయంలో కొంత న్యాయం జరిగినట్ల అనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ సింగ్, స్వపన్‌దీప్ కౌర్, పూనమ్లకు నా ప్రేమను తెలియజేస్తున్నా’ అని రన్‌దీప్ హుడా ఎక్స్(ట్వీటర్) వేదికగా తెలిపారు. KARMA Thank you ‘Unknown Men’ 🙏💪 Remembering my Sister Dalbir Kaur and sending love to Swapandeep and Poonam , today some justice to Martyr Sarabjit Singh has been served 🙏 https://t.co/CSn9WmevDv — Randeep Hooda (@RandeepHooda) April 14, 2024 సరబ్జిత్ సింగ్ 1991 పొరపాటుగా సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేవశించారు. 1990లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌తో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది పాకిస్థానీయలు మరణించారు. ఆ కేసులో గూఢచర్యం ఆరోపణలతో సరబ్జిత్ను పాకిస్థాన్ అరెస్ట్ చేసి.. ఆయనకు మరణ శిక్ష విధించింది. లాహోర్‌లోని కోట లఖపత్ జైలులో సబర్‌జిత్ సింగ్ శిక్షఅనుభివిస్తున్న సమయంలో సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు ఆయనపై దాడి చేశారు. మెదడుకు తీవ్రగాయాలతో సరబ్జిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైల్లో సరబ్జిత్ సింగ్‌పై దాడి చేసినందుకు అమీర్ సహా పలువురుపై కేసు నమోదైంది. అయితే.. సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవటంతో 2018లో పాకిస్తాన్ కోర్టు అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది. -
నాన్న ఆస్తిని అమ్మేశా, ఎవరూ సాయం చేయలేదు: నటుడు
బయోపిక్ చేయాలంటే ముందు కంటెంట్ తెలుసుండాలి, తర్వాత దాన్ని తెరకెక్కించేందుకు గట్స్ ఉండాలి. ఈ రెండూ ఉన్నందువల్లే స్వతంత్ర సమరయోధుడు సావర్కర్ జీవితాన్ని తెరపై చూపించాలని ఆరాటపడ్డాడు నటుడు రణ్‌దీప్ హుడా. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం స్వాతంత్య్ర వీర్ సావర్కర్. ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ రివ్యూలు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ.13 కోట్లు మాత్రమే రాబట్టింది. క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు తాజాగా అతడు ఈ బయోపిక్ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. 'ఈ సినిమాను గతేడాది ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నాను, లేదంటే ఈ ఏడాది జనవరి 26కు రిలీజ్ చేద్దామనుకున్నాను. అందుకోసం ఎంతో కష్టపడ్డాను. కానీ ఏదీ జరగలేదు. మా టీమ్‌లో ఉన్నవారికి సినిమా చేద్దామని ఉందే తప్ప క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా సినిమాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో మా నాన్న నాకోసం పైసాపైసా కూడబెట్టి కొన్న ముంబైలోని రెండు, మూడు ప్లాట్లను అమ్మేశాను. కాలికి దెబ్బ తగిలి.. మరోవైపు నా బరువు తగ్గించేందుకు కష్టాలు పడ్డాను. కేవలం బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, మంచినీళ్లు.. ఇదే నా మెనూ అయిపోయింది. తర్వాత చాక్లెట్స్, నట్స్ తినడం మొదలుపెట్టాను.. అయినా సరే, సరైన తిండి లేకపోవడంతో ఒక్కోసారి సెట్స్‌లో పడిపోయేవాడిని. ఒకసారి గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడ్డాను. కాలికి బాగా దెబ్బ తగిలి రెండు నెలలు నడవలేకపోయాను. అప్పుడు కూడా అన్నం తినకుండా డైట్ కంటిన్యూ చేశా. ఒక చెంచా బాదం బటర్, ఒక చెంచా కొబ్బరి నూనె, కొన్ని నట్స్.. ఇదే నా రోజూవారి ఆహారం. ఈ డైట్ మెయింటెన్ చేస్తూ మూడు పనులు (డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్) చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. నిద్రమాత్రలు వేసుకున్నా ఒక్కోసారి సరిగా నిద్రపోయేవాడినే కాదు. ఒక్కోసారి సావర్కర్ సెట్స్‌లోనే ఉన్నట్లుగా ఓ నీడ కనిపించేది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: తెలుగులో ఆ సినిమాతో ఫుల్ క్రేజ్.. వివాదాలతో వార్తల్లో.. ఎవరో గుర్తుపట్టారా? -
ఏకంగా 26 కిలోల బరువు తగ్గి షాకిచ్చిన ‘మిస్టర్ పెర్ఫెక్ట్’!
నటించే పాత్రకు తగ్గట్టు పరకాయ ప్రవేశం చేయడం నటుల ప్రాథమిక లక్షణం. కట్టూ బొట్టు, ఆహార్యం ఇలా అన్నింటిలోనూ ఆ పాత్రకు న్యాయం చేసేందుకు నటీనటులు చాలా కష్టపడతారు. ప్రేక్షకులని అలరించేందుకు ఎంతో రిస్క్ చేసి మరీ తమ బాడీని మలచుకుంటారు. అలాంటి వారిలో తాజాగా రణదీప్ హుడా మరోసారి ప్రత్యేకంగా నిలిచాడు. 'స్వతంత్ర వీర్ సావర్కర్' బయోపిక్ కోసం విపరీతంగా బరువు తగ్గి తన లుక్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాత్రకు తగ్గట్టు శరీరాన్ని, ఆహార్యాన్నిమార్చుకోవడంలో రణదీప్ ప్రత్యేకతే వేరు.అందుకే రణదీప్ హుడాను హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బాలేతో పోల్చుతారు. 2016లో సరబ్జిత్ సినిమా కోసం 20 కిలోలు, అదే ఏడాది దో లఫ్జోన్ కి కహానీ సినిమా కోసం తన బరువును 77 కిలోల నుంచి 94 కిలోలకు చేరేలా కష్టపడ్డాడు. విలక్షణ శైలితో విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడాయన. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' నుంచి సరబ్జిత్ సింగ్, ఇపుడు వీర సావర్కర్ దాకా పాత్రల్లో జీవించే ప్రతిభావంతుడైన నటుడు. సోదరి డా. అంజలి సాయం తాజాగా స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రను పోషించాడు. ఈ పాత్రకోసం రణదీప్ ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 'కాలా పానీ' పాత్ర సజీవంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. రణదీప్ హుడా సోదరి, డాక్టర్ అంజలి సాయం తీసుకున్నాడట. ఆమె రూపొందించిన పాలియో డైట్‌తో బక్క చిక్కిన దేహంతో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. నిపుణుల సమక్షంలో పాలియో డైట్ సోదరి డాక్టర్ అంజలి హుడా వృత్తిరీత్యా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని,తన కోసం పాలియో డైట్‌ను రూపొందించిందని స్వయంగా రణదీప్ హుడా వెల్లడించాడు. వివిధ దశలలో గుడ్లు, నట్స్, ఖర్జూరాలు , డార్క్ చాక్లెట్లు డైట్ చేర్చుకున్నానని తెలిపాడు. దీంతోపాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఐదు రోజుల వ్యవధిలో 6-7 కిలోల బరువు తగ్గాననీ, ఈ జర్నీలో విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకున్నానని చెప్పాడు. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. పెర్ఫెక్ట్గా ఉండటమే తనకిష్టమని తెలిపాడు. ఖర్జూరం, పాలుతో బరువు తగ్గుతారు అనేది ఫేక్ న్యూస్ అని కూడా చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడిగా రణదీప్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మార్చి 22 న ఈ మూవీ విడుదలైంది. -
ఇదేందయ్యా సామీ.. అస్థిపంజరంలా అయిపోయావ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా కొత్త లుక్‌తో షాకిచ్చాడు. ఈసారి ఏదో హెయిర్ స్టైలో, డ్రెస్సింగ్ స్టైలో మార్చలేదు. ఏకంగా బక్కచిక్కిపోయి అస్థిపంజరంలా దర్శనమిచ్చాడు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీ కోసమే ఇలా అయిపోయాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా రణ్దీపే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సోమవారం (మార్చి 18) నాడు అద్దం ముందు సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రణ్‌దీప్. మీరు గ్రేట్ సార్ ఇది చూసిన జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, ఇలాంటివాళ్లు కదా అసలైన యాక్టర్స్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హీరోలు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ట్రై చేయడం చూశాం.. అవసరమైతే మాస్, క్లాస్ లుక్‌లో కనిపించడం చూశాం.. కానీ ఓ సినిమా కోసం తిండీనిద్ర మానేసి మరీ ఇంతలా పీక్కుపోయినట్లుగా తయారైన వ్యక్తిని నిన్నే చూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరసావర్కర్ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్ అలా మొదలైంది.. కాగా 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు రణ్‌దీప్ హుడా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, సర్బజిత్, హైవే వంటి చిత్రాల్లో నటించాడు. గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ చేశాడు. ఆమెకు బ్రేకప్ చెప్పిన తర్వాత నటి లిన్ లైస్రామ్‌తో ప్రేమలో పడ్డాడు. గతేడాది నవంబర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) చదవండి: ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? అసభ్యంగా ఫోటోలు దిగే వ్యక్తి.. -
'కార్తీకదీపం' కాన్సెప్ట్‌తో హిందీలో సినిమా? హీరోయిన్గా ఇలియానా
'కార్తీకదీపం'.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీరియల్ ప్రేమికులు అలెర్ట్ అయిపోతారు. ఆ సీరియల్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. మరీ ముఖ్యంగా ఇందులో నలుపుగా ఉండే వంటలక్క క్యారెక్టర్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తో హిందీలో సినిమా తీసి రిలీజ్‌కి రెడీ చేశారు. మనకు తెలిసిన ఇలియానా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'తేరా క్యా హోగా లవ్లీ'. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సేమ్ 'కార్తీకదీపం' సీరియల్లో ఉన్నట్లే ఇందులోనూ హీరోయిన్ నలుపు రంగులో ఉంటుంది. అక్కడ డాక్టర్ బాబు ఉంటే ఇక్కడ పోలీస్ బాబు ఉన్నాడంతే. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) ట్రైలర్ బట్టి చూస్తే.. హీరోయిన్ నలుపుగా ఉంటుంది. దీంతో ఈమెని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లందరూ నో చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఓరోజు ఈమె పెళ్లి చేస్తే ఇవ్వడానికి అని ఉంచిన సామాన్లన్నీ దొంగతనానికి గురవుతాయి. దీంతో దర్యాప్తు కోసం ఓ పోలీస్ వస్తాడు. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. చివరకు ఏమైంది? హీరోహీరోయిన్ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ. ట్రైలర్ చూస్తే పైకి ఫన్నీగా అనిపిస్తున్నప్పటికీ.. ఇందులో అందం, వరకట్న లాంటి సామాజిక విషయాల్ని ప్రస్తావించారు. కాకపోతే వీటిని సీరియస్‌గా కాకుండా సున్నితమైన హాస్యంతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఇలియానా హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టం తెచ్చిపెడుతుందేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) -
మూడు నెలల కిందట నటుడి పెళ్లి.. పిల్లల కోసం ప్లానింగ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా ఇటీవలే వైవాహిక జీవితాన్ని ఆరంభించాడు. నవంబర్ 29న ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను పెళ్లాడాడు. లిన్ మణిపూర్ నివాసి కావడంతో అక్కడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. రణ్‌దీప్ కంటే లిన్ పదేళ్లు చిన్నది. ఇకపోతే 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రణ్‌దీప్ భార్యతో కలిసి ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. మా ప్రేమను గెలిపించుకుని ఒక్కటయ్యాం. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీని పెద్దది చేయాలనుకుంటున్నాం. మొదట్లో నేను నా వృత్తిని అంతగా పట్టించుకునేవాడిని కాదు. దేన్నీ పెద్దగా లెక్కచేసేవాడిని కాదు. కానీ లిన్ నా జీవితంలోకి వచ్చాక అంతా కొత్తగా అనిపిస్తోంది. జీవితాన్ని భిన్నంగా చూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. సినిమాల సంగతి.. రణ్‌దీప్ హుడా 'మాన్సూన్ వెడ్డింగ్' ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై', 'సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్', సల్మాన్ ఖాన్ 'కిక్', 'రంగ్ రాసియ', 'జిస్మ్ 2' తదితర చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీని తానే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు. డైరెక్షన్ చేయడమే కాకుండా ఇందులో సావర్కర్‌గా నటిస్తున్నాడు. లిన్ విషయానికి వస్తే.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్ ఆక్సోన్, జానే జాన్ వంటి చిత్రాలలో నటించింది. చదవండి: 22 ఏళ్ల ఏజ్ గ్యాప్.. కడ వరకు ప్రేమకు సరైన నిర్వచనంగా నిలిచిన జంట - పోడూరి నాగ ఆంజనేయులు -
రణదీప్ హుడా , లిన్ లైష్రామ్ వివాహ రిసెప్షన్ లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ప్రియురాలిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పెళ్లిపీటలెక్కాడు. ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను వివాహం చేసుకున్నాడు. మణిపూర్‌లోని ఇంపాల్‌లో బుధవారం (నవంబర్ 29న) నాడు ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. మైటీ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరుడు రణ్‌దీప్ తెల్ల దుస్తులు ధరించగా, వధువు లిన్ మణిపురి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఒంటి నిండా నగలు ధరించి పుత్తడి బొమ్మలా మండపానికి నడుచుకుంటూ వచ్చిన వధువు మొదటగా వరుడికి నమస్కరించి అతడి మెడలో మల్లెపూల మాల వేసింది. తర్వాత రణ్‌దీప్ భార్య మెడలో మల్లెపూల మాల వేశాడు. వీరి సాంప్రదాయాన్ని చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. కాగా రణ్‌దీప్ కంటే లిన్ పదేళ్లు చిన్నది. ప్రస్తుతం రణ్‌దీప్ వయసు 47 ఏళ్లు కాగా లిన్ వయసు 37 ఏళ్లు. సినిమాల విషయానికి వస్తే.. రణ్‌దీప్ 'మాన్సూన్ వెడ్డింగ్' చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై రంగప్రవేశం చేశాడు. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై', 'సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్', సల్మాన్ ఖాన్ 'కిక్', 'రంగ్ రాసియ', 'జిస్మ్ 2' వంటి పలు చిత్రాలతో పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం 'స్వతంత్ర వీర్ సావర్కర్', 'లాల్ రంగ్ 2: ఖూన్ చుస్వా' సినిమాలు చేస్తున్నాడు. లిన్ విషయానికి వస్తే.. 2007లో 'ఓం శాంతి ఓం' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. 'మేరీ కోమ్', 'మాతృ కి బిజిలీ కా మండోలా', 'రంగూన్', 'ఆక్సోన్', 'ఉమ్రిక', 'ఖైదీ బంద్' వంటి చిత్రాల్లో నటించింది. ఈమె చివరిసారిగా జానే జాన్ సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) Ceremonies that don't look like right out of a bollywood assembly line are so refreshing. Beautiful! “#RandeepHooda and Lin Laishram tied the knot in a traditional Meitei wedding ceremony in Imphal.” pic.twitter.com/DMzEXIKW2Z — prachi (@ahamprachi) November 29, 2023 ❤️ How often do we see such beautiful traditional weddings in Bollywood?#RandeepHooda and #LinLaishram tie the knot in a Meitei ceremony. Congratulations 🥰 pic.twitter.com/oLUtYvV1oH — Mimansa Shekhar (@mimansashekhar) November 29, 2023 చదవండి: విజయ్ ఆంటోని గొప్పదనాన్ని వివరించిన బాహుబలి నటుడు -
'మొదటిసారి అక్కడే కలుసుకున్నాం'.. ప్రియురాలితో పెళ్లిపై రణ్‌దీప్!
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను నవంబర్ 29న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సరదాగా కనిపించారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ప్రియురాలి సంప్రదాయంలోనే వీరి పెళ్లి వేడుక జరగబోతోంది. మరి కొన్ని గంటల్లో మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లిన్ లైష్రామ్ పెళ్లికి ముందు ఎలా కలుసుకున్నారో రణ్‌దీప్ గుర్తు చేసుకున్నారు రణ్‌దీప్ మాట్లాడుతూ.. 'వధువు సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం మాత్రమే గౌరవప్రదమని నేను భావించా. మైటీ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహాల్లో వరుడు చాలా సేపు కూర్చోవాలని విన్నా. ఆ సంప్రదాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా జీవిత భాగస్వామి సంస్కృతిపై గౌరవంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్నా. మణిపురి సంప్రదాయాలను ఆస్వాదిస్తున్నా. నేను, లిన్ మణిపురి సంస్కృతి గురించి మాట్లాడుకునేవాళ్లం. భవిష్యత్తులో మా జంట పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. రణదీప్, లిన్ ప్రేమకథ లిన్ లైష్రామ్‌తో పరిచయంపై చెబుతూ.. 'మేము చాలా కాలంగా స్నేహితులం. థియేటర్లలో ఉన్నప్పుడే కలిశాం. మా మధ్య మంచి స్నేహం ఉంది. అదే ఇప్పుడు పెళ్లిబంధంగా మారింది' అని అన్నారు. కాగా.. నసీరుద్దీన్ షా థియేటర్ గ్రూప్‌లో రణదీప్‌ను కలిశానని లిన్ తెలిపింది. అక్కడ రణదీప్ తన సీనియర్ అని వెల్లడించింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇవాళ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. -
లేటు వయసులో పెళ్లి పీటలెక్కనున్న హీరో..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, హైవే , సర్బ్జిత్ లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీని తానే స్వయంగా తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్లో ఉన్న బాలీవుడ్ నటుడు లేటు వయసులె పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను రణ్‌దీప్ పెళ్లి చేసుకోనున్నారు. నవంబర్ 29న మణిపూర్‌లో వీరి వివాహం జరగనుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకకు హాజరు కానున్నారు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహాబంధంతో ఒక్కటి కాబోతున్నారు. డిఫరెంట్ స్టైల్లో వెడ్డింగ్! అయితే ఈ రోజుల్లో సెలబ్రిటీల పెళ్లి అంటే గ్రాండ్ డిస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ వివాహాం ఇటలీలో అలాగే జరిగింది. అయితే ఈ జంట మాత్రం అందరికంటే భిన్నంగా మహాభారతం పౌరాణిక నేపథ్యంతో వివాహాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లిన్ మణిపూర్‌కు చెందిన నటి కాగా.. తనకు కాబోయే భార్య సొంత ఊర్లోనే ఈ వేడుక జరగనుంది. మణిపూర్ సంప్రదాయంలో వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్ ప్లాన్ చేశారు. అయితే దీనిపై పెళ్లి తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. సీక్రెట్‌గా డేటింగ్! వీరిద్దరు డేటింగ్‌పై సోషల్ మీడియాలో చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ రణదీప్, లిన్ తమ రిలేషన్‌ను ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. 2022లో దీపావళి వేడుకల తర్వాత ఈ జంట తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రణ్‌దీప్ అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటిస్తున్నారు. ఆ తర్వాత స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు లిన్ చివరిసారిగా కరీనా కపూర్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. అంతే కాకుండా ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్ ఆక్సోన్ వంటి చిత్రాలలో కూడా నటించారు. -
ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే టాలీవుడ్లో ఇప్పటికే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనున్నారు. తాజాగా మరో బాలీవుడ్ జంట సైతం పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా.. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను ఈనెలలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. అయితే రణదీప్, లిన్ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ముంబైలోనే వివాహ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాతే ఈ జంట రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అప్పటివరకు వీరిద్దరు తమ రిలేషన్‌ను సీక్రెట్‌గానే ఉంచునున్నారు. కాగా.. లిన్ మణిపూర్‌కు చెందిన లిన్ మోడల్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన దీపావళి వేడుకల సందర్బంగా తమ రిలేషన్‌ను ప్రకటించారు. లిన్ బర్త్ డే వేడుకల్లోనూ రణ్‌దీప్ హుడా కనిపించారు. సుస్మితా సేన్‌తో డేటింగ్! అయితే రణ్‌దీప్ గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. 2004లో సుస్మితాసేన్‌తో డేటింగ్లో ఉన్న రణ్‌దీప్ 2006లో విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాము విడిపోవడమే ఉత్తమమైన నిర్ణయమని వెల్లడించారు. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్న లిన్, రణ్‌దీప్ మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉంది. ప్రస్తుతం రణ్‌దీప్‌కు 47 ఏళ్లు కాగా.. లిన్ 37 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా.. ప్రస్తుతం రణ్‌దీప్ హుడా అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటించనున్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఆ తర్వాత రణదీప్ లాల్ రంగ్ 2: ఖూన్ చుస్వాలో కనిపించనున్నారు. మరోవైపు.. లిన్ చివరిసారిగా కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్, ఆక్సోన్ వంటి చిత్రాలలో లిన్ నటించారు. View this post on Instagram A post shared by Lin Laishram (@linlaishram) -
నా జీవితంలో చేసిన చెత్త పని అదే: స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
మాన్సూన్ వెడ్డింగ్ హాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నటుడు రణదీప్ హుడా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు రణ్‌దీప్ 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే అప్పట్లో మాజీ మిస్ యూనివర్స్, సుస్మితాసేన్‌తో డేటింగ్లో ఉండడం అందరినీ దృష్టని ఆకర్షించింది. బాలీవుడ్లో వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 2006 నుంచి దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ ఈ జంట వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రణదీప్ హుడా సుస్మితాసేన్‌తో రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమెతో బ్రేకప్ కావడంపై రణ్‌దీప్ స్పందించారు. (ఇది చదవండి: మూడేళ్ల గ్యాప్, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్ డబుల్..) రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ..' నేను 'మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్లో లేను. అంతే కాదు ఆమెపై నాకు ఏ విధంగానూ ఫీలింగ్స్ లేవు. సుస్మిత సేన్ జీవితంలోకి నేను వెళ్లకూడదని కోరుకున్నందున.. నా జీవితంలో కేవలం ఒక థియేటర్ రిహార్సల్‌ను మాత్రమే కోల్పోయాను. నా విలువల పరంగా ఇది నేను చేసిన చెత్త పని అని భావించా. కానీ ఆమెతో బ్రేకప్ కావడం నాకు మంచే జరిగింది. ఎందుకంటే నేను పెద్ద స్టార్‌ను కూడా కాదు. కొన్నిసార్లు తాము అనుకున్న సొంత మార్గాల్లోనే వెళ్లడం ఉత్తమమైన పని. ఆ తర్వాతే నేనేంటో నాకు తెలుసొచ్చింది.' అని అన్నారు. అయితే సుస్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత కెరీర్లో బిజీగా మారిపోయారు. రణదీప్ హుడా ప్రస్తుతం 'స్వతంత్ర వీర్ సావర్కర్', 'లాల్ రంగ్ 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, సుస్మితా సేన్ ఇటీవలే విడుదలైన 'తాలీ' వెబ్ సిరీస్‌తో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్‌లో ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడే పాత్రలో కనిపించింది. (ఇది చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
నటుడికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇన్స్పెక్టర్ అవినాష్ షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి అతనికి పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. నటుడి ఎడమ కాలికి గాయం కావడంతో దీనికి శస్త్రచికిత్స చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సల్మాన్ ఖాన్‌తో రాధే సినిమా కోసం యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రణదీప్ గాయపడ్డాడు. అప్పుడు ఆయన కుడి కాలుకు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. రణదీప్ నటించనున్న ప్రాజెక్ట్‌లు రణ్‌దీప్ నటించబోయే వీర్ సావర్కర్ తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. తన రాబోయే చిత్రంలోని సావర్కర్ పాత్ర కోసం రణ్‌దీప్ హుడా చాలా బరువు తగ్గాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రకు సరిపోయేలా కఠినమైన డైట్‌ని పాటిస్తూ 22 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఇప్పటికీ వరకు షెడ్యూల్ ప్రకటించలేదు. చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ క్యాట్‌లో కనిపించాడు. ఆ తర్వాత తేరా క్యా హోగా లవ్లీలో ఇలియానా డి'క్రూజ్‌తో కలిసి కనిపించనున్నాడు. -
సినిమా కోసం 18 కేజీల బరువు తగ్గిన హీరో, అవాక్కవుతున్న ఫ్యాన్స్
భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్కు ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటిస్తున్నాడు. జూన్ సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం కోసం రణ్‌దీప్ ఏకంగా 18 కేజీలు బరువు తగ్గాడట. ఇందుకు కోసం అతడు జిమ్‌లో తీవ్రంగా శ్రమించానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు రణ్‌దీప్. ఇక తాజాగా అతడు బరువు తగ్గి సన్నగా మారిన ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసి అతడి ఫాలోవర్స్, ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అన్ని కేజీ బరువు ఎలా తగ్గారు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే.. కాగా 2016లో సరబ్జిత్ మూవీ కోసం కూడా రణ్‌దీప్ కేవలం 28 రోజుల్లోనే 18 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం విధితమే. 1883 మే 28న మహారాష్ట్రలో జన్మించారు దామోదర్ సావర్కర్. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి భారతీయ విద్యార్థుల్లో స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించారాయన. హిందూ మహాసభల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 1910లో సావర్కర్‌ను అరెస్ట్ చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవుల్లోని జైల్లో పది సంవత్సరాలకు పైనే బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షను అనుభవించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్..
Randeep Hooda Performs Last Rites Of Sarabjit Singh Sister Dalbir Kaur: బాలీవుడ్ ప్రముఖ నటుల్లో రణ్‌దీప్ హుడా ఒకరు. తాజాగా పంజాబ్‌కు చెందిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ పాడెను మోసి, అంత్యక్రియలు నిర్వహించాడు. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణల కింద సరబ్జిత్ సింగ్‌కు పాకిస్తాన్ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అతని బయోపిక్‌గా 2016లో తెరకెక్కిన 'సరబ్జిత్' సినిమాలో సరబ్జిత్ సింగ్ పాత్రలో రణ్‌దీప్ హుడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్‌కు రణ్‌దీప్ హుడాకు మంచి అనుబంధం ఏర్పడింది. రణ్‌దీప్ హుడాలో తన సోదరుడు సరబ్జిత్ సింగ్‌ను చూసుకుంటున్నట్లుగా ఆమె అతనితో చెప్పింది. ఈ క్రమంలోనే రణ్‌దీప్ హుడాను దల్బీర్ కౌర్ ఒక కోరిక కోరింది. తాను చనిపోయినప్పుడు ఆమెకు 'కంధ' (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాల్సిందిగా అడిగింది. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా ఒక సోదరుడిలా దల్బీర్ కౌర్ దహన సంస్కరాలు నిర్వహించాడు రణ్‌దీప్. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) ఈ విషయంపై తన ఇన్‌స్టాలో ఆమె చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ 'నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ నేను వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయింది. దల్బీర్ కౌర్‌జీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారని అనుకోలేదు. ఆమె తన ప్రియమైన సోదరుడు సరబ్జిత్ సింగ్‌ను కాపాడుకునేందుకు ఎంతో పోరాటం చేసింది. ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. ఆమె కట్టిన రాఖీని నా జీవితంలో మర్చిపోలేను.' అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. కాగా దల్బీర్ కౌర్ పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో ఆదివారం (జూన్ 26) గుండెపోటుతో మరణించింది. -
జైలర్‌గా రజనీ, ఖైదీగా చిరు.. కేరాఫ్ చెరసాల
జైలర్ డ్యూటీ చేయనున్నారు రజనీకాంత్.. ఖైదీగా జైలుకి వెళ్లారు చిరంజీవి.. కార్తీ కూడా ఖైదీగా జైలులో ఉంటారు... రణ్‌దీప్ హుడా కూడా ఖైదీయే.. ఇవన్నీ సినిమా జైళ్లు. ఈ సినిమాల్లోని కథలు కేరాఫ్ చెరసాల అంటూ జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ఇక ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. రజనీకాంత్ ఈ మధ్య చేసిన చిత్రాల్లో ‘దర్బార్’ ఒకటి. ఇందులో కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా చెలరేగిపోయిన రజనీ తాజాగా జైలర్‌గా మారారు. రజనీ హీరోగా రూపొందనున్న 169 చిత్రానికి ‘జైలర్’ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. కాగా.. ఖైదీలుగా ఉన్న గ్యాంగ్స్టర్స్ జైలు నుంచి తప్పించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్‌ని జైలర్ ఎలా అడ్డుకున్నాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. జైలర్ పాత్రలో రజనీని ఫుల్ మాస్‌గా చూపించనున్నారట నెల్సన్. ఇక రజనీ జైలర్ అయితే చిరంజీవి ఖైదీగా కనిపించనున్నారు. అయితే కాసేపు మాత్రమే. మోహన్‌లాల్ మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్‌గా చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’లోనే ఈ జైలు సీన్స్ ఉన్నాయి. ప్రత్యర్థులు వేసిన నిందలతో ఖైదీగా చిరంజీవి జైలుకి వెళతారు. ఆ మధ్య ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లొకేషన్‌కి పవన్ కల్యాణ్ వెళ్లిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అందులో చిరంజీవి వేసుకున్న ఖైదీ దుస్తుల్లో చొక్కా పై 786 అని కనిపిస్తుంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. అటు కోలీవుడ్వైపు వెళితే... తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. ఇందులో కార్తీ తండ్రీ కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. తండ్రి పాత్రధారి ఖైదీగా కనిపిస్తారని సమాచారం. కొడుకు పోలీసాఫీసర్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. కార్తీ నటించిన గత తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలైనట్లే ‘సర్దార్’ కూడా తెలుగులోనూ విడుదలవుతుంది. ఇక హిందీ పరిశ్రమకు వెళ్తే... ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ చిత్రం గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక్ దామోదర వీర్ సావర్కర్ బయోపిక్‌గా రూపొందుతున్న చిత్రం ఇది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకుడు. వీర్ సావర్కర్ అండమాన్ జైలులో 20 ఏళ్లు గడిపారు. ఈ బయోపిక్‌లో జైలు జీవితానికి సంబంధించిన సీన్లు ఉంటాయి. ఇవే కాదు.. జైలు బ్యాక్‌డ్రాప్‌లో మరి కొన్ని చిత్రాలున్నాయి. కథ ఏదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటే కాసుల వర్షం షురూనే. -
వెండితెరపై వీర్ సావర్కర్ బయోపిక్..
భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్కు ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటిస్తారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లండన్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘'స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు. అలాంటి వారిలో ప్రముఖులైన సావర్కర్గారి జీవితం అందరికీ తెలియాల్సి ఉంది’’ అన్నారు రణ్‌దీప్. 1883 మే 28న మహారాష్ట్రలో జన్మించారు దామోదర్ సావర్కర్. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి భారతీయ విద్యార్థుల్లో స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించారాయన. హిందూ మహాసభల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 1910లో సావర్కర్‌ను అరెస్ట్ చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవుల్లోని జైల్లో పది సంవత్సరాలకు పైనే బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షను అనుభవించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఆయన తుదిశ్వాస విడిచారు. -
రెండోసారి ప్రేమలో పడ్డ బాలీవుడ్ హీరో, ఆ నటి ఎవరంటే?
బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా ప్రేమలో పడ్డాడట! నటి లిన్ లైశ్రమ్ మీద అతడు మనసు పారేసుకున్నాడంటూ బీటౌన్‌లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొన్నేళ్లుగా ఫ్రెండ్షిప్ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట గత కొంతకాలంగా అత్యంత సన్నిహితంగా మెదులుతున్నారని టాక్. అంతేకాదు, వీళ్లు సహజీవనం కూడా చేస్తున్నారంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. కాగా లిన్ లైశ్రమ్ నటి మాత్రమే కాదు సక్సెస్ఫుల్ మోడల్ కూడా! ఆమె 'ఓం శాంతి ఓం', 'రంగూన్', 'మేరీ కోమ్' సహా పలు చిత్రాల్లో నటించింది. కాగా రణ్‌దీప్ హుడా గతంలో నీతూ చంద్రాను ప్రేమించాడు. సుమారు మూడేళ్లపాటు(2010-2013) ప్రేమలో మునిగి తేలిన వీళ్లిద్దరూ తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ హీరో మరోసారి ప్రేమలో పడటం చర్చనీయాంశంగా మారింది. హుడా హైవే, కిక్, జన్నత్ 2, జిసమ్ 2 తదితర చిత్రాలతో అతడు పాపులారిటీ సంపాదించుకున్నాడు. చదవండి: ముస్కాన్.. ఆకర్షించే అందం, ఆలపించగల స్వరం ఆమె సొంతం -
మధ్యప్రదేశ్‌లో రణదీప్ పులి వేట: వైరల్ వీడియో
ఇంతవరకు మనం చాలా వైరల్ వీడియోలు చూశాం. టూరిస్ట్‌లపై దాడిచేసిన పులలకు సంబంధించిన వీడియోలు. టూరిస్ట్ బండి గుంతలో పడిపోతే తీసిన వీడియోలను చూశాం. కానీ వీటన్నింటికి భిన్నంగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వయంగా వీడియో తీసిన పులి వేటాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!) అసలు విషయంలోకెళ్లితే...బాలివుడ్ నటుడు రణదీప్ కపూర్ మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో పులి ఆవుని వేటాడుతున్న వీడియోని చిత్రీకరించాడు. డిస్కవరీ ఛానెల్స్‌లో పులి వేటాడుతున్న దృశ్యాలు చూసినప్పుడే శరీరం గగ్గురపాటుకి గురవుతుంది. అలాంటిది ప్రత్యక్ష్యగా రణదీప్ చూడటమే కాక వీడియో తీశాడు. అంతేకాదు ఆ వీడియోకి "ఇది నా పులి వేట" అనే క్యాప్షన్ జోడించి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఐఎఫఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ పులి ఆవుని పట్టుకోవడంతో విజయవంతమైందా అంటూ ట్వీట్ చేశారు. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: భారత్‌లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...) My first tiger hunt .. #SatpuraTigerReserve pic.twitter.com/J9iWp9vRlC — Randeep Hooda (@RandeepHooda) December 19, 2021 -
అభిమాన హీరోని కలుసుకున్న నీరజ్ చోప్రా
ముంబై: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా బుధవారం తన అభిమాన హీరో రణ్‌దీప్ హుడాని పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్ హుడా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. నీరజ్‌ను ఆకాశానికెత్తాడు. కాగా, నీరజ్2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన అనంతరం మీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందని మీడియా ప్రశ్నించగా.. రణ్‌దీప్ హుడా అయితే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. నీరజ్, హూడా ఇద్దరూ హర్యానా రాష్ట్రానికే చెందిన వారే కావడం, అలాగే ఇద్దరికీ క్రీడలంటే అమితమైన ఆసక్తి ఉండడంతో వారి మధ్య స్నేహం బలపడింది. कसुत्ता मानस !! नयुए धूम्मा सा ठाणदा रह 😎👊🏽👊🏽 Where does one go from the top? Very few face this question and even fewer have the answers. Upon meeting you, I deeply feel that you do brother @Neeraj_chopra1 🤗 pic.twitter.com/C4SUGbJdEb — Randeep Hooda (@RandeepHooda) August 25, 2021 ఇదిలా ఉంటే, నీరజ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంగీష్, పంజాబీ, హిందీ భాషల్లో సినిమాలు చూస్తానని, తన ఫేవరెట్ హీరో రణ్‌దీప్ అని, అతను నటించిన 'లాల్‌రంగ్' అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. లాల్‌రంగ్ సినిమా మొత్తం హరియాణా యాసలో ఉండటంతో అది బాగా నచ్చిందని, అలాగే రణదీప్ నటించిన 'సర్బజీత్', 'హైవే' తనను చాలా ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. చదవండి: ఫైనల్‌కు ముందు నీరజ్ జావెలిన్‌ను ఆ పాకిస్తానీ ఎందుకు తీసుకెళ్లాడు? -
Neeraj Chopra: నా బయోపిక్‌లో ఆ ఇద్దరిలో ఎవరైనా ఓకే..!
న్యూఢిలీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి రాత్రికిరాత్రి హీరోగా మారిపోయిన నీరజ్ చోప్రా.. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2018 ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. నా బయోపిక్ తీయాలనే ప్రతిపాదన గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఒక వేళ ఇది సాధ్యపడితే.. అందులో మా రాష్ట్రానికి(హరియాణా) చెందిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా లేదా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్‌లలో ఎవరు నటించినా బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. It’s a GOLD 🥇Heartiest Congratulations @Neeraj_chopra1 on creating history. You’re responsible for a billion tears of joy! Well done #NeerajChopra! #Tokyo2020 pic.twitter.com/EQToUJ6j6C — Akshay Kumar (@akshaykumar) August 7, 2021 దాదాపు మూడేళ్ల క్రితం అతను అన్న ఈ మాటలపై ప్రస్తుతం నెట్టింట చర్చ మొదలైంది. పలానా పలానా హీరో అయితే బాగుంటుందంటూ నెటిజన్లు పోటీ పడి సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, టోక్యోలో స్వర్ణం సాధించిన అనంతరం ఈ హీరోలిద్దరూ నీరజ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేయడం విశేషం. వీటిలో అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అక్షయ్‌కు మరో కొత్త సినిమా దొరికేసిందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తు్న్నారు. ఈమేరకు గతంలో అక్షయ్ కుమార్ బల్లెంతో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. నీరజ్ చోప్రా బయోపిక్ సెట్స్ నుంచి లీకైన ఫొటోలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఒలింపిక్స్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలోపే ఉన్న అతని ఫాలోవర్లు.. స్వర్ణం గెలిచిన కొద్ది గంటల్లోనే అమాంతం 30లక్షలకు పెరిగారు. అథ్లెట్‌గా స్వర్ణం సాధించాడనే విషయమే కాకుండా అతని స్టైల్‌కి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
డర్టీ కామెంట్స్: చిక్కుల్లో రణ్‌దీప్ హుడా
ముంబై: కులాల్ని కించపరిచేలా కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మున్మున్ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో రణ్‌దీప్ హుడాను చేర్చారు నెటిజన్స్. బాలీవుడ్లో ఫైనెస్ట్ ఆర్టిస్ట్‌గా పేరున్న రణ్‌దీప్.. యూపీ మాజీ సీఎం మాయావతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్‌దీప్ ఆ కామెంట్లు చేసి చాలా కాలం అవుతుండడం విశేషం. డర్టీ కామెంట్లు గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌దీప్ హుడా.. యూపీ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘మీకిప్పుడు ఒక డర్టీ జోక్ చెప్పబోతున్నా’.. అంటూ.. మాయావతి వేషధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. రణ్‌దీప్ హుడా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక మాజీ మహిళా సీఎం, ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రణ్‌దీప్‌పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదని చెబుతూ.. #ArrrestRandeepHooda హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్‌దీప్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రణ్‌దీప్‌కు కులగజ్జి ఉందని, మానవత్వం లేనోడంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్‌దీప్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకర ట్వీట్ చేసిన స్టాండప్ కమెడియన్ అభిష్ మాథ్యూ.. రీసెంట్గా నెటిజన్స్ ఆగ్రహంతో క్షమాపణలు చెప్పాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
సల్మాన్, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌దీప్ హుడా, దిశా పటానీ, జాకీ ష్రాఫ్, జరీనా వహాబ్ కీలక పాత్రలు చేశారు. ‘‘సల్మాన్ ఖాన్ నటించిన ‘వాంటెడ్’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’ వంటి చిత్రాలు రంజాన్‌కు విడుదలై సూపర్‌హిట్ సాధించాయి. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా కూడా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సల్మాన్, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్. ఈ ఫైట్‌ను ఓ కొరియన్ స్టంట్ టీమ్ డిజైన్ చేసింది. సల్మాన్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఓ యాక్షన్ ట్రీట్’’ అని చిత్రబృందం పేర్కొంది. నిజానికి ఈ సినిమా 2020 ఈద్‌కు విడుదల కావాల్సింది. కానీ కరోనాతో వాయిదా పడింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇచ్చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్ల అభ్యర్థనల మేరకు సల్మాన్ ఓటీటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో సల్మాన్ సినిమా థియేటర్స్‌లోకి వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.