Rao Ramesh
-
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రావు రమేశ్ అంటే సహాయ పాత్రలు, విలన్ పాత్రలే గుర్తొస్తాయి. తనదైన యాక్టింగ్‌తో తెలుగులో ఓ మార్క్ సృష్టించాడు. ఇన్నాళ్లు ఇతడు సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ రీసెంట్గా హీరోగానూ మెప్పించాడు. ఈయన్ని ప్రధాన పాత్రధారిగా పెట్టి 'మారుతీనగర్ సుబ్రమణ్యం' అనే మూవీ తీశారు. గత నెలల్లో థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)రావు రమేశ్ లీడ్ రోల్ చేసిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాని మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే కథతో తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు సెప్టెంబరు 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'మారుతీనగర్ సుబ్రమణ్యం' విషయానికొస్తే.. మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండిపోతుంది. గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని పట్టుబట్టి ఖాళీగా ఉండిపోతాడు. ఊరి నిండా అప్పులు. ఇలా జీవితం సాగిస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో ఓ రోజు రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇవి వేసింది ఎవరు వేశారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)We got the laughter therapy you need!The biggest family entertainer of the year#MaruthiNagarSubramanyam premieres on Aha on the 20th!@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/JZWAfCeklh— ahavideoin (@ahavideoIN) September 13, 2024 -
టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్ కార్య ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయబోతున్నారంటూ ఆహా ట్వీట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. Madam, Sir twaralo #aha lo sandadi cheyyabotunnaru. Get ready to laugh out loud! 🤣 The hilarious #MaruthiNagarSubramanyam is coming soon to #aha! @lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/AWx0p6Bjuy— ahavideoin (@ahavideoIN) September 10, 2024 -
'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్. ఇతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం'. నార్మల్‌గా అయితే ఇదో చిన్న సినిమా. కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం కాస్తంత బజ్ క్రియేట్ అయింది. తాజాగా (ఆగస్టు 23) ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య). అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలో ఎంటర్టైన్ ఉంటే చాలు. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారా? ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాల్ని ప్రేక్షకుల్ని పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్‌ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్ట్ స్టే ఇవ్వడం, మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడటం.. ఇలా మనకి తెలిసిన వార్తల్ని కాన్సెప్ట్‌గా తీసుకుని తీసిన మూవీ 'మారుతీనగర్ సుబ్రమణ్యం'.మొదలుపెట్టడమే మారుతీనగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రమణ్యం అసలు ఎలాంటి వాడు? అతడు కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్‌గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఓవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లు పేర్చుకుంటూ వెళ్లిపోయారు. సిచ్యుయేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలావరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదుఫ్యామిలీ డ్రామా తీసుకుని అసలు రూ.10 లక్షలు.. సుబ్రమణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్‌తో సినిమాని చివరి వరకు నడపడం బాగుంది. రావు రమేశ్‌కి కూడా సగటు తెలుగు హీరోల్లానే స్లో మోషన్ షాట్స్, డ్యాన్స్‌లు పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సుబ్రమణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే మరీ సినిమాటిక్‌గా, లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. మెగా ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్, చిరంజీవి రిఫరెన్సులు కూడా సినిమాలో పెట్టారు. కాకపోతే అవి కుదిరేశాయి.తల్లిదండ్రుల ముందే రిలేషన్షిప్, బ్రేకప్ లాంటివి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. రియల్ లైఫ్ ఇలా ఎవరు ఉంటార్రా బాబు అనిపిస్తుంది. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లలా అనిపిస్తాయి. అలానే సినిమాలో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. ఇదంతా కాస్త లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే సినిమా ఓవరాల్‌గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.ఎవరెలా చేశారు? రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఒదిగిపోయాడు. ఇతడి కొడుకుగా చేసిన అంకిత్.. బాగానే చేశాడు. మొన్నే 'ఆయ్'తో, ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటి.. గ్లామర్‌గా కనిపించడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. ఇంద్రజ కూడా స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమా చాలా రిచ్‌గా తీశారు. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. పాటలు వినడానికి ప్లస్ చూడటానికి కూడా బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య.. సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని, దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్టైన్ చేశాడు. గతంలో 'హ్యాపీ వెడ్డింగ్' మూవీతో ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకుందామనుకుంటే 'మారుతీనగర్ సుబ్రమణ్యం' మంచి ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
నాకు ఇష్టమైతేనే వస్తా: అల్లు అర్జున్
‘‘పుష్ప 2: ది రూల్’ క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నా. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన క్లైమాక్స్ షూటింగ్ . సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్లకి మనం సపోర్ట్‌గా నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా. నాకు ఇష్టమైతేనే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికీ తెలిసిందే’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘సుకుమార్‌గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. అయినా తబితగారు స్వతహాగా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. రావు రమేష్‌గారి లాంటి నటుడు ఉండటం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఈ మధ్య చిన్న చిత్రాలకు జనాలు థియేటర్స్‌కి వస్తుండటం మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ శుక్రవారం కూడా కొనసాగాలి. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. గత ఏడాది నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఈ ఏడాది ‘కాంతార’ కి వస్తే బాగుండు అనుకున్నా. రిషబ్ శెట్టిగారికి వచ్చినందుకు అభినందనలు. నిత్యామీనన్ మంచి నటి. నాకు మంచి ఫ్రెండ్. తనకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాగే ‘కార్తికేయ 2’ మూవీ యూనిట్‌కి, జానీ మాస్టర్‌కి కూడా అభినందనలు. డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ రావడం వల్ల ఈ చిన్న సినిమా కాస్త పెద్దది అయిపోయింది. బన్నీ ఎప్పుడూ కూడా తాను స్టార్ అనుకోడు.. నేను బాగా నటించాలన్నదే తన లక్ష్యం. ఓ స్టార్ హీరో నటించడమే గొప్ప విషయం అనుకుంటే గనక.. గొప్పగా నటించే రావు రమేశ్‌కూడా బిగ్గెస్ట్ స్టార్. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లలో నాకు సరైన స్క్రిప్ట్ దొరికిందని నమ్మి, ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాను’’ అని రావు రమేష్ చెప్పారు. ‘‘ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు, ఆయ్’ వంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ కోవలో మంచి కథతో వస్తున్న మా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా ఆదరించాలి’’ అన్నారు తబితా సుకుమార్. ఈ వేడుకలో నిర్మాతలు మోహన్ కార్య, బుజ్జి రాయుడు పెంట్యాల, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్‌తో కలిసి పని చేశా: అంకిత్ కొయ్య
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు.సినిమాల్లోకి వద్దన్నారుమాది విశాఖ. మా నాన్నగారు టీచర్. మా తాతయ్య గారు హెడ్ మాస్టారుగా రిటైర్ అయ్యారు. సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు నో అన్నారు. వన్ ఇయర్ ట్రై చేస్తా. అవకాశాలు రాకపోతే మీరు చెప్పినట్టు ఉద్యోగం చేస్తా అని చెప్తే సరే అన్నారు. ఏడాదిలోపే 'మజిలీ' చేసే ఛాన్స్ వచ్చింది. అది విడుదల అయ్యే టైంకి మరో రెండు నెలల్లో 'జోహార్' చిత్రీకరణకు వారణాసి వెళ్లాలని కబురు వచ్చింది. నాగశౌర్య గారి 'అశ్వత్థామ'లో నటించాను. రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశా. అల్లు అర్జున్ మా అన్నయ్యఆ తర్వాత 'తిమ్మరుసు', 'శ్యామ్ సింగ రాయ్', 'సత్యభామ', రీసెంట్ 'ఆయ్'తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటించాను. కాలేజీలో ఉండగా అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు. మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే.. 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. అల్లు ఫ్యామిలీకి, నాకు కనెక్షన్ ఉందేమోఈ మూవీ ట్రైలర్ చూసి అల్లు అరవింద్.. 'ఏవయ్యా... నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది' అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో 'ఓఎల్ఎక్స్' యాడ్ చేశా. అల్లు అరవింద్ గారి బ్యానర్ లో 'ఆయ్' చేశా. ఈ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా. 'ఆయ్' మంచి విజయం సాధించింది. అది 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు. -
తప్పు తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది: డైరెక్టర్ లక్ష్మణ్ కార్య
'హ్యాపీ వెడ్డింగ్'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ సారి అలాంటి తప్పు జగరకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’’ కథ రాసుకున్నాను. ఆ తర్వాత ఈ కథకు హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా రావు రమేశ్ గుర్తుకు వచ్చారు. ఆయన సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా చేయరేమో అని చాలా మంది చెప్పారు. అయితే ఒక్కసారి కథ చెప్పి చూద్దాం అని ఆయనను సంప్రదించాను. ఫస్ట్ డైలాగ్ చెప్పిన వెంటనే నవ్వేశాఉ. 15,20 నిమిషాల్లో కథ వివరించా. వెంటనే రావు రమేశ్ ఓకే చేశారు’ అని అన్నారు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఆయన దర్శకత్వంతో రావు రమేశ్, అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మారుతి నగర్ సూర్య’. హర్ష వర్దన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'ఎందుకిలా' వెబ్ సిరీస్‌తో నేను దర్శకుడిని అయ్యా. అందులో సుమంత్ అశ్విన్ గారు హీరో. ఆ సిరీస్ అయ్యాక ఆయన, నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చేశా. దర్శకుడిగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' నా రెండో సినిమా.→ ఈ సినిమాలో రావు రమేష్ , అంకిత్ కొయ్య తండ్రి కుమారులుగా నటించారు. అంకిత్ కొయ్యకు తానొక గొప్ప ఇంటి బిడ్డను అని, 'అల వైకుంఠపురములో' కాన్సెప్ట్ టైపులో తనను చిన్నప్పుడు మార్చేశారని అనుకుంటాడు. అల్లు అరవింద్ కొడుకు అని అతడి ఫీలింగ్. అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకుంటాడు. ప్రేమించిన అమ్మాయిని చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో జరిగినట్టు ఊహించుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో చూస్తారు.→ ఇంద్రజ గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయడం లేదు. రావు రమేష్ గారి భార్యగా, కళామణి పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంది. ప్రతి రోజూ ఆవిడకు ఆ సీన్ గురించి చెబుతూ వస్తున్నా. షూటింగ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆవిడకు చెబితే క్యాజువల్ గా అటు ఇటు చూశారు. యాక్షన్ చెప్పిన తర్వాత సింగిల్ షాట్లో చేసేశారు. ఆవిడ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు.→ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా ప్రివ్యూ వేశాం. ఒకవేళ ఆవిడకు సినిమా నచ్చకపోతే నాకు సుకుమార్ రైటింగ్స్ సంస్థల్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. అందుకని భయపడ్డా. భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించా. ప్రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మా టీంలో ఒకరిని లోపల పెట్టాను. నాకే బయటకు నవ్వులు వినిపించాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. తబిత గారు సినిమా బావుందని మెచ్చుకున్నారు.→ సుకుమార్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. రావు రమేష్ గారు అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. మొదట ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తు లేదు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆగస్టు 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను -
'ఏంటి సుబ్రమణ్యం పొద్దున్నే పూజ మొదలెట్టావా?.. ఆసక్తిగా ట్రైలర్!
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్ కార్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా వర్చువల్‌గా విడుదల చేశారు. 'ఏంటి సుబ్రమణ్యం పొద్దున్నే పూజ మొదలెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది.. ఏ బ్రాండో' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు' అని అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో రావు రమేశ్ యాక్షన్, డైలాగ్, ఫుల్ కామెడీ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. సినిమాను ఆగస్టు 23న ఈ సినిమా విడుదల కానుంది. -
అల్లు అర్జున్ సినిమా సీన్లు రీక్రియేట్ చేస్తూ సాంగ్ విడుదల
రావు రమేష్ హీరోగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట 'మేడమ్ సార్ మేడమ్ అంతే'ను ఇవాళ విడుదల చేశారు. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు.'మేడమ్ సార్ మేడమ్ సార్'ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. ఇప్పటి వరకు ఆయన ఇంత హుషారైన పాటను పాడలేదని చెప్పాలి. కళ్యాణ్ నాయక్ అందించిన అద్భుతమైన బాణీని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకు వెళ్లారు. భాస్కరభట్ల పాటను రాశారు. 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''టైటిల్ పాత్రలో రావు రమేష్ లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ 'నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం'కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ పాటకూ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ రోజు సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. అతను పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'జోహార్', 'తిమ్మరుసు', 'మజిలీ', 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య మంచి నటన కనబరిచారు. రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా సినిమాలో పాటల్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు. -
రావు రమేష్, ఇంద్రజల 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సరికొత్తగా పోస్టర్ లాంచ్
రావు రమేష్ కథానాయకుడిగా... పీబీఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రంలో నటి ఇంద్రజ ఆయన సరసన నటించడం విశేషం. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కెజియఫ్'లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు. 'ఎప్పుడూ సగం సగం ఎంటర్టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఉందా? లేదా? అని! క్యారెక్టర్లు, సినిమా చేస్తున్నాం అంటే సరిపోయిందా? ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్లుగా ఎంటర్టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా!' అని విజయవాడ మావయ్య అడిగితే... 'ఎస్! హి ఈజ్ రైట్. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ! నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి' అని గట్టిగా అడిగారు. అప్పుడు రావు రమేష్ ''ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది' అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే... 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే... సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు. సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ''మారుతి నగర్ సుబ్రహ్మణ్యం... ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి'' అని విజ్ఞప్తి చేశారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆయనతో పాటుగా భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య. -
మారుతినగర్లో నవ్వులు
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ చిత్రంలో మంచి వినోదాత్మక పాత్రలో నటించారు రావు రమేష్‌గారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘అజీజ్ నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం... ఇలా హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్‌గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించడం పక్కా’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
Extra Ordinary Man Movie Wallpapers: నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ స్టిల్స్
-
ఈ మూవీలో నా క్యారెక్టర్ ఎక్స్ట్రా ట్రార్డినరీ గా ఉంటుంది
-
ఒకప్పుడు హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. మళ్లీ హీరోలుగా!
టాలీవుడ్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవరంటే సీనియర్లలో రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, రావు రమేశ్, మురళీ శర్మ ఉంటారు. మంచి క్యారెక్టర్లు చేస్తున్న ఈ నటుల్లో రాజేంద్రప్రసాద్, నరేశ్ ఒకప్పుడు హీరోలుగా చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్న రావు రమేశ్ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. ‘వీళ్లే చేయాలి’ అనే తరహా లీడ్ రోల్స్‌లో ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్ నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పాత్రలు చేస్తున్న ఈ ముగ్గురూ ‘క్యారెక్టర్ హీరో’గా చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి తెలుగులో హాస్య కథా చిత్రాల హీరో అనగానే రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొస్తారు. హీరోగా ప్రేక్షకులపై వినోదాల జల్లులు కురిపించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో దూసుకెళుతున్నారు. అడపా దడపా లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌కి జోడీగా అర్చన నటిస్తున్నారు. ‘లేడీస్ టైలర్’ (1986) తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. షష్టిపూర్తి కథాంశంతో న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి మరో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలైలో రిలీజ్ కానుంది. వీకే నరేశ్ మళ్ళీ పెళ్లి హీరోగా వీకే నరేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన హాస్యం, నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉంటున్నారు. కాగా నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘మళ్ళీ పెళ్లి’, కన్నడలో ‘మత్తే మధువే’ టైటిల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మేలో ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఉరిమే కాలమా..’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. మారుతీనగర్‌లో రావు రమేశ్ విలక్షణమైన డైలాగ్ డెలివరీతో తనదైన శైలిలో విలనిజాన్ని పండించిన గొప్ప నటుడు రావు గోపాలరావు. తండ్రి వారసత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమయ్యారు ఆయన తనయుడు రావు రమేశ్. విలన్, కమెడియన్, తండ్రి.. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు రావు రమేశ్. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావు రమేశ్‌కి జోడీగా ఇంద్రజ నటిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి పాత్రలో రావు రమేశ్ కనిపిస్తారు. ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తొలిసారి కథను నడిపే నాయకునిగా చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా చేస్తున్న ఈ మూడు చిత్రాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచాయి. -
హీరోగా మారిన రావు రమేశ్.. క్షణం క్షణం ట్విస్టులే
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు(ఫిబ్రవరి 24) సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ..వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం' అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
ఈ ఇయర్ సెకండాఫ్ నాకు బాగుంది
‘బటర్ ఫ్లై’ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ నాకు సవాల్ అనిపించింది. ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బటర్ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఇయర్ సెకండాఫ్ నాకు చాలా బాగుంది. నేను హీరోయిన్గా నటించిన ‘కార్తికేయ 2, 18 పేజెస్’ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘బటర్ ఫ్లై’ రిలీజ్ అవుతోంది’’ అన్నారు. ఘంటా సతీష్ బాబు, ప్రసాద్ తిరువళ్లూరి, నిహాల్, సంగీత దర్శకుడు అర్విజ్ తదితరులు మాట్లాడారు. -
Leharaayi Movie Review : 'లెహరాయి' మూవీ రివ్యూ
హీరో రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటించిన చిత్రం 'లెహరాయి'. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించారు. ఎస్.ఎల్.ఎస్.పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. లెహరాయి బేసిక్‌గా తండ్రి కూతుళ్ళ మధ్య కథ. మేఘన(సౌమ్య మీనన్)ని తండ్రి( రావు రమేష్) ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఎంతలా అంటే… తనకు రెండో సంతానం కూడా వద్దు అనేంతగా గారాబంగా పెంచుతాడు. మేఘన కూడా తండ్రి కోరుకున్న విధంగానే ప్రేమకు దూరంగా ఉంటూ వస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల తన క్లాస్ మేట్ అయిన కార్తీక్(రంజిత్)ని ప్రేమిస్తుంది. ఈ విషయం వేరే వ్యక్తుల ద్వారా మేఘన తండ్రికి తెలుస్తుంది. మరి చివరికి ఏం జరిగింది? కూతురి ప్రేమను తండ్రి అంగీకరిస్తాడా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. … ఇందులో హీరోగా నటించిన రంజిత్ స్టూడెంట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. సౌమ్య మీనన్ సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే కుర్రకారును ఆకట్టుకుంటుంది. రావురమేష్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే సెంటిమెంట్ డ్రామా బాగా పండింది. హీరో తండ్రి పాత్రలో నరేష్ నటన ఆకట్టుకుంటుంది. గగన్ విహారి విలనిజం బావుంది. మిగ్రతా పాత్రధారులు తమ పాత్రల పరిధి వరకు బాగానే చేశారు. కథ,కథనం.. విశ్లేషణ: తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు వెండితెరపై ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. గతంలో ఇదే ఫార్మాట్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కథ, కథనంలో కొత్తదనం చూపిస్తే ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కూతురే సర్వస్వం అని ఫీలయ్యే తండ్రికి ఆ అమ్మాయి కాలేజీలో ఓ అబ్బయిని ప్రేమించడం, అది తెలిసి తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే కథ. అయితే తండ్ర-కూతుళ్ల మధ్య భావేద్వేగాలపై దర్శకుడు మరికాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని పాత్రలు అవసరం లేకున్నా కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది. ఆలీ, సత్యం రాజేష్ లాంటి వారితో కామెడీని పండించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
గొప్ప మనసు చాటుకున్న రావు రమేశ్.. అతడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
ప్రముఖ నటుడు రావు రమేశ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి అండగా నిలిచారు. కాగా రావు రమేశ్ పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్న బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన రీసెంట్గా ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మేకప్‌మ్యాన్ కుటుంబానికి రూ. 10లక్షల చెక్ అందించి ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు ఏ అవసరం వచ్చిన తాను ఉన్నానని, వారికి తన సాయం ఎప్పడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక రావు రమేశ్ దయా హృదయం చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి తమ వద్ద పనిచేసే కళాకారులను, కార్మికులను పెద్ద నటులు, నిర్మాతలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి వారికి మీరు స్ఫూర్తి అంటూ రావు రమేశ్‌ను కొనియాడుతున్నారు. కాగా అలనాటి సీనియర్ నటులు రావు గోపాలరావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్‌గా, తండ్రిగా, సహాయనటుడిగా ఎలాంటి పాత్రల్లోనైన ఇట్టే ఒదిగిపోతూ ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకుంటున్నారు. ఇక తాజాగా తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మరోసారి అభిమానులు మనసు గెలుచుకున్నారు ఆయన. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. -
షాకింగ్ : హీరోకు సమానంగా రావు రమేష్ రెమ్యునరేషన్
Rao Ramesh Remuneration: ప్రముఖ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టినా నటుడిగానే గుర్తింపు సంపాదించుకున్నారు. గమ్యం, కొత్త బంగారు లోకం వంటి పలు సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. మలయాళ సూపర్ హిట్ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ ప్రముఖ పాత్రలోకనిపించనున్నారట. ఇందుకు గాను ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెమ్యునరేషన్ విషయంలో ఇది రికార్డ్ అనే చెప్పవచ్చు. స్టార్లకు సమానంగా రావు రమేష్ పారితోషికం అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా త్వరలోనే స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లనుంది. -
Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్‌లుక్ వైరల్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా - సిద్దార్ధ్ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జగపతిబాబు ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న రావు రమేశ్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఆయన పుట్టిన రోజు(మే 25)సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో రావు రమేశ్ టక్ చేసుకొని సీరియస్‌గా చూస్తున్నాడు. ఇందులో గూని బాబ్జీగా రావు రమేశ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పేరుకు తగ్గట్టే ఆయన గూని తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. Wishing the Incredibly Versatile Actor #RaoRamesh garu a Very Happy Birthday! Introducing him as #GooniBabji from our #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @chaitanmusic @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial @SonyMusicSouth pic.twitter.com/l0BBWyq6Ny — AK Entertainments (@AKentsOfficial) May 25, 2021 చదవండి: KGF Chapter 2: రావు రమేశ్ లుక్ వచ్చేసింది -
KGF Chapter 2: రావు రమేశ్ లుక్ వచ్చేసింది
కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. 2018లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన‘కేజీఎఫ్’సినిమాకు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను కేజీఎఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ద్వారా మేకర్స్ అభిమానులతో పంచుకుంటున్నారు . Wishing our #KannegantiRaghavan, #RaoRamesh sir a very Happy Birthday.#KGFChapter2. pic.twitter.com/3iFBNK4EFx — Hombale Films (@hombalefilms) May 25, 2021 తాజాగా టాలీవుడ్ నటుడు రావు రమేశ్ పుట్టినరోజు(మే 25) సందర్భంగా తన రోల్‌పై స్పెషల్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది కేజీఎఫ్ టీమ్. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం . ఈ చిత్రంలో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర పోషిస్తున్నారు. రాకీ కేసును డీల్ చేసే సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ 'అధీరా' పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. -
నిన్న రావు రమేష్.. నేడు ఉత్తేజ్
హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు రావు రమేశ్ పేరుతో ట్విటర్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, టాలీవుడ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వివాదస్పదంగా ట్వీట్లు చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ట్వీట్లపై రావు రమేశ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. తాజాగా నటుడు ఉత్తేజ్ కూడా నకిలీ అకౌంట్ల సమస్య బారిన పడ్డారు. ఆయన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి పలు అభ్యంతకర పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లపై ఉత్తేజ్ స్పందించారు. ‘నమస్తే!! సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నాకు ట్విటర్ అకౌంట్ లేనే లేదు. నా పేరుతో వస్తున్న తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాను. సంఘంలో ఓ అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వాగుతుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాను’ అని ఉత్తేజ్ మీడియాకు వివరించారు. ఇక నకిలీ ఆకౌంట్లపై టాలీవుడ్ ప్రముఖులు అందోళన చెందుతున్నారు. నకిలీ ఖాతాలను నియంత్రించేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ట్విటర్ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్ మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్ -
ట్విటర్ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన సోషల్ మీడియా పోస్టులపై సినీ నటుడు రావు రమేష్ స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఎటువంటి అకౌంట్స్ లేవని ఆయన స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. కాగా, రావు రమేష్ పేరుతో ట్విటర్లో వస్తున్న పోస్టింగుల నేపథ్యంలో.. సదరు ట్విటర్ ఖాతాకు అఫీషియల్ గుర్తింపు లేకపోవడంతో పలువురు ఆయనను సంప్రదించారు. దాంతో తాను ఎలాంటి ట్వీట్లు చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ వెల్లడించారు. -
‘కేజీఎఫ్-2’ కీలక పాత్రలో రావు రమేష్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సౌత్ ఇండస్ట్రీలో సంచనలం సృష్టించి బాక్సాఫిక్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో యశ్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా సీక్వేల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగం బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో అందరి చూపు రెండవ భాగం చాప్టర్-2 పైనే ఉంది. దీంతో సెంకడ్ పార్టులో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్లు మెరవబోతున్నారు. ఇప్పటికే పవర్‌పుల్ యాక్టర్ సంజయ్‌దత్ విలన్ అధీర పాత్రలో నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్లో బాలీవుడ్ యాక్టర్ రవీనా టాండన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రవీనా టాండన్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. (రవీనా ఆగయా) Welcome on board Rao Ramesh sir. We will leave it to the audience to keep guessing on this one, till they see you on the big screen. Thank you for being apart of #KGFChapter2 pic.twitter.com/fWteQ5YnHm — Prashanth Neel (@prashanth_neel) February 10, 2020 కాగా ప్రస్తుతం కేజీఎఫ్-2లో టాలీవుడ్ వర్సటైల్ నటుడు రావు రమేష్ నటిస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘కేజీఎఫ్-2 షూటింగ్‌కు స్వాగతం. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకులకు వదిలేస్తున్నాం. కేజీఎఫ్-2లో భాగస్వామ్యమైనందుకు రావు రమేష్‌కు థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన పాత్ర తెరపై ఎలా ఉంటుదనేది ఆసక్తి కరంగా మారింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బాసుర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
ఆట ఆరంభం
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. భూమిక, రావు రమేష్, దిగంగన సూర్యవంశి కీలక పాత్రధారులు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. అంటే ఆరంభమైందన్నమాట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌లో మొదలైన తొలి షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశాం. ఆ నెక్ట్స్ రాజమండ్రి, ఢిల్లీల్లో షూటింగ్ జరుగుతుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.