re-polling
-
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
హైదరాబాద్, సాక్షి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల ఫలితాలు యావత్ సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఐదేళ్లపాటు సంక్షేమ పథకాలతో.. అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలేసింది. ముఖ్యమంత్రిగా అన్నింటా అణగారిన వర్గాలకు పెద్ద పీట వేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయినా కూడా ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ఊహించని ఈ ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. వివిధ సంక్షేమ పథకాలతో పాటు మెడికల్ కాలేజ్ లు, పోర్ట్ లు,నాడు-నేడు, ఇంగ్లీష్ విద్య.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఏపీని దేశ చిత్ర పటంలో ప్రత్యేకంగా నిలిపింది జగన్ పాలన. ఎన్నికలు ముగిశా.. ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకే అనుకూల ఫలితాలు వచ్చాయి. అలాంటి పార్టీకి గారి పార్టీ కి 11 మళ్ళీ,4 ఎంపీ లు రావడం అనేది చాలా దారుణమనే అభిప్రాయం వినవస్తోంది. ఆఖరికి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు, ఎన్నికల కమిషన్ వాళ్లు కుమ్మక్కై కూటమి కోసం పని చేశాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని హింసించాయి. మరోవైపు కూటమి అభ్యర్థుల గెలుపు.. మెజారిటీపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్నారు. అలాంటప్పుడు.. ఇలాంటి ఓటమి ఎలా?. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయి. అందుకే ఎన్నికలను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. సానే అమర్నాథ్ Change.org ద్వారా పిటిషన్ వేశారు. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేంత వరకు తనతో పోరాడాలని, లేదంటే రీకౌంటింగ్ అయినా చేయించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి -
Elections 2022: మణిపూర్‌లో రీ పోలింగ్ డిమాండ్
మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలి ఫేజ్ ఎన్నికల్లో 38 స్థానాలకు పోలింగ్ ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తొమ్మిది చోట్ల రీ పోలింగ్ డిమాండ్ వినిపిస్తోంది ఇప్పుడు. తొమ్మిది చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఎన్నికల అధికారులు, ఈసీకి ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో అనే ఆసక్తి నెలకొంది. చురాచంద్పూర్ జిల్లాలోనే ఈ తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ అల్లర్లు చోటు చేసుకోవడంతో రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు, పోలింగ్ ఆఫీసర్లు.. ఈసీని కోరుతున్నారు. తొమ్మిదిలో ఏడు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల డ్యామేజ్ల ఘటనలపై ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే జిల్లాలోని తిపయ్ముఖ్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల విధులు నిర్వహించిన పోలీస్ అధికారి నావోరెమ్.. అనుమానాదాస్పద స్థితిలో సర్వీస్ తుపాకీ పేలి చనిపోయిన ఘటనపై విచారణ కొనసాగుతోందని సీఈవో వెల్లడించారు. అభ్యర్థుల దాడులపైనా ఒక ఫిర్యాదు నమోదు అయ్యింది. -
MPTC, ZPTC Election Results: ఆ ఎనిమిది చోట్లా ఫలితాలు నిలిపివేత
సాక్షి, అమరావతి: ఏడు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిలిపివేసింది. వాటి పరిధిలోని మొత్తం 18 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. ఆ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు పూర్తిగా తడిసిపోయి లెక్కింపునకు వీలుగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలోని గొరిగనూర్ ఎంపీటీసీ పరిధిలోనున్న రెండు పోలింగ్ బూత్‌లలో మొత్తం 742 ఓట్లు పూర్తిగా తడిసిపోయాయి. అయితే, అక్కడి ఓట్లన్నీ లెక్కించగా, అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి మధ్య 517 ఓట్ల తేడా ఉంది. దీంతో అక్కడ రెండు బూత్‌ల పరిధిలో తడిసిపోయిన 742 ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఆ ఫలితాన్ని నిలిపివేయాలని జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అదే సమయంలో గొరిగనూర్ ఎంపీటీసీ ఫలితాన్ని కూడా నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తడిసిపోయిన రెండు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించి, ఆ ఓట్ల ఆధారంగా జమ్ములమడుగు జెడ్పీటీసీ, గొరిగనూర్ ఎంపీటీసీ స్థానం ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. అలాగే.. ► శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగం ఎంపీటీసీ పరిధిలోని నాలుగు పోలింగ్ బూత్‌లు, ఆమదాలవలస కాత్యాచారులపేట ఎంపీటీసీ పరిధిలోని ఒక బూత్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ పత్రాలు తడిసిపోవడంతో ఆ రెండు ఎంపీటీసీ స్థానాల ఫలితాలను కూడా నిలిపివేసి, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ► ఇదే కారణంతో విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ స్థానం ఫలితాన్నీ నిలిపివేశారు. అక్కడ రెండు బూత్‌లో రీపోలింగ్ నిర్వహిస్తారు. ► తూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి మండలం దోరచింతలపాలెం ఎంపీటీసీ, పెద్దాపురం మండలం పులిమేరు ఎంపీటీసీ స్థానం ఫలితాలను కూడా నిలిపివేశారు. దోరచింతలపాలెంలో ఏడు, పులిమేరులో ఒక బూత్‌లలో రీ పోలింగ్‌కు ఆదేశించారు. ► వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీ ఫలితం కూడా బ్యాలెట్ పత్రాలు తడిసిన కారణంగానే నిలిచిపోయింది. ఇక్కడ ఒక బూత్ పరిధిలో రీపోలింగ్ జరుగుతుంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసినందున ఈ 18 చోట్లా 25వ తేదీ తర్వాతే రీ పోలింగ్ నిర్వహించే అవకాశముందని ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. -
నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: లెక్కించాల్సిన బ్యాలెట్ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్‌ల్లోనూ రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్ జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను సంప్రదించారు. అయితే, రాత్రి 12 గంటల సమయానికి ఆ రెండు ఎంపీటీసీలకు సంబంధించి అధికారులకు ఎలాంటి లిఖితపూర్వక నివేదికలు అందని కారణంగా అక్కడ ఎలాంటి అ«ధికార నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను ఒక బాక్సులో నీళ్లు చేరడంతో లెక్కింపునకు అంతరాయం కలిగింది. అప్పటికి లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్సుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలతకు 355 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, మిగిలిన బాక్సులో 600 ఓట్లున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదే కారణంతో ముద్దనూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఉమాదేవికి 6,409 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ ఆమె గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. ఇక, జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను రెండింటిలో నీళ్లు చేరడంతో కౌంటింగ్ ఆపేశారు. ఇదే కారణంతో జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం కూడా ఆగిపోయింది. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ పై విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచినా.. పోలింగ్ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. -
ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ వెల్లడించారు. టెండర్ ఓటింగ్ (చాలెంజ్ ఓటు) 0.1 శాతం కంటే ఎక్కువ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారులకు చెప్పామని, వారి నివేదిక ఆధారంగా రీపోలింగ్‌పై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలింగ్ నాడు వేతనంతో కూడిన సెలవు ఉంటుందని, వీటి పరిధిలో ఏవైనా ఐటీ సంస్థలు ఉన్నా లోకల్ హాలిడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఓటు వేసేందుకు 2, 3 గంటల పర్మిషన్ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాలను కోరామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గిపోతున్నందున, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించామని, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసిన ప్రచారంతో పోలింగ్‌శాతం 75 శాతానికి పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. బ్యాలెట్ పత్రాల ముద్రణలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, 21న నిశితంగా వాటిని పరిశీలించాకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్‌బూత్‌లకు తీసుకు వెళ్లేలా చూస్తున్నామన్నారు. ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ చేసిన ఏర్పాట్లపై కార్యదర్శి అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రతినిధి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... ఎన్నికల ఏర్పాట్లు... దాదాపుగా పూర్తయ్యాయి. మెటీరియల్ సార్టింగ్, బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 20న అన్ని మున్సిపాలిటీల్లో తుది ఏర్పాట్లను పరిశీలిస్తాం. ఫర్నిచర్, మంచినీరు ఇతర కనీస సదుపాయాల పరిశీలన. 21న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ బృందాలు, రిటర్నింగ్, పోలింగ్ అధికారులు ఖరారై, మెటీరియల్‌తో సహా ఆ రోజు మధ్యాహ్నం నుంచే కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళతారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు.. ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డుల్లో 7,961 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. పోలింగ్ సిబ్బంది 52,757 మందికి ర్యాండమైజ్ చేసి శిక్షణనిచ్చాం. వారిలో 40 వేల మంది విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్‌కు 5 వేల మంది ఉంటారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఇద్దరేసి పోలీ సులుంటారు. మొత్తం 53,55,942 ఓటర్లున్నారు. డబ్బు జప్తుపై... డబ్బు జప్తు విషయంలో పోలీసులు, ఇతర అధికారులు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తనిఖీలు చేయాలని ఆదేశించాం. పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పంట అమ్మిన మొత్తం, వ్యాపారంలో వచ్చిన సొమ్ము ఇలా తగిన కారణాలు చూపితే అటువంటి వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించాం. వెబ్‌కాస్టింగ్... వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తాం. కచ్చితంగా 30% పోలింగ్ స్టేషన్లు కవరవుతాయి. సున్నిత, అతిసున్నితమైన పోలింగ్ బూత్‌ల్లో తప్పనిసరిగా ఉంటుంది. వ్యయపరిమితి పెంచే యోచన.. అభ్యర్థుల వ్యయ పరిమితి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో రూ.లక్షన్నర, మున్సిపాలిటీల్లో రూ.లక్ష ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ఈ మొత్తం ఎక్కువగానే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకల్లా సమీక్షించి అక్కడ పరిమితి పెంచే అవకాశాలున్నాయి. కౌంటింగ్ కేంద్రాలు... అందుబాటులో ఉన్న స్థలం, సౌకర్యాల ప్రాతిపదికన సంబంధిత జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను రెవెన్యూ డివిజన్ హెడ్క్వార్టర్లు, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటారు. -
చంద్రగిరిపై టీడీపీకి చుక్కెదురు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీకి హైకోర్టులో చుక్కెదురైంది. రీ పోలింగ్‌ను సవాల్ చేస్తూ టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐదు కేంద్రాల్లో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. ఇదే సమయంలో మూడు కేంద్రాల్లో రీ పోలింగ్ కోరుతూ టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని ఇచ్చిన వినతిపత్రంపై ఈసీ స్పందిస్తూ రెండు చోట్ల రీ పోలింగ్‌కు ఆదేశించిన నేపథ్యంలో నాని దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ అవసరం లేదని పేర్కొంటూ దీన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయన్న ఎన్నికల సంఘం వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశించటాన్ని సవాలు చేస్తూ టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులవర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై కూడా జస్టిస్ శ్యాంప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం మరోసారి విచారణ జరిపింది. రిగ్గింగ్‌కు తిరుగులేని ఆధారాలు.. అందుకే రీ పోలింగ్ ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఐదు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయనేందుకు తమ వద్ద నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ, వీడియో తదితరాలు ఉన్నాయని వివరించారు. పోలింగ్ కేంద్రాల ఆక్రమణ జరిగిందనేందుకు తిరుగులేని ఆధారాలున్న నేపథ్యంలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఈవీఎంలను తమ ఆధీనంలోకి తీసుకుని ఇష్టానుసారంగా ఓట్లు వేసుకున్నారని, ఇందుకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కూడా సహకరించారని తెలిపారు. కోర్టు అనుమతినిస్తే ఆ వీడియోను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని వివరాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని నివేదించారు. దీనిపై పులవర్తి నాని తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు అభ్యంతరం తెలిపారు. ఆ వీడియో ఏ పోలింగ్ కేంద్రంలోదో తెలిసే అవకాశం లేదన్నారు. వీడియో ప్రదర్శన వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ఆ అధికారులపై క్రమశిక్షణా చర్యలు అనంతరం అవినాశ్ తిరిగి వాదనలను కొనసాగిస్తూ పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. వారితో కుమ్మక్కైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని, పూర్తిస్థాయి విచారణ కూడా నిర్వహిస్తామని చెప్పారు. 1999లో తెలుగుదేశం పార్టీ వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని, వాటిపై ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉందంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. ఎన్నికల సంఘానికి సర్వాధికారాలున్నాయి... పోలింగ్, రీ పోలింగ్ విషయంలో ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ఏడు చోట్ల రీ పోలింగ్ కోరిందని, అయితే ఆధారాలను బట్టి ఐదు చోట్లే రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించిందని చెప్పారు. శివప్రసాద్ పిటిషన్ కొట్టివేత.. అంతకు ముందు శివప్రసాద్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ రిటర్నింగ్ అధికారి నివేదిక లేకుండా రీ పోలింగ్ నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేదని, రీ పోలింగ్ విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ శివప్రసాద్ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయించిన ప్రకారం ఆదివారం చంద్రగిరిలో రీ పోలింగ్ యథాతథంగా జరగనుంది. -
నేడైనా ఓటేయనిస్తారా?
సాక్షి, తిరుపతి: పాతికేళ్ల పోరాటం ఫలిస్తుందా? చిత్తూరు పెత్తందారులు నేడైనా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోనిస్తారా? టీడీపీ నేతల రిగ్గింగ్, అక్రమాలపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోరాటం ఫలితాన్ని ఇస్తుందా? చంద్రగిరి నియోజకవర్గంలో దళితులు, సామాన్యులు ఓటుతో తమ తీర్పు చెప్పే కీలకమైన ఈ రోజు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బలవంతంగా ఓటర్ల తరలింపు.. చంద్రగిరిలో ఆదివారం రీ పోలింగ్ జరిగే ఏడు కేంద్రాల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లు చేసినా టీడీపీ నేతలు చాపకింద నీరులా మళ్లీ రిగ్గింగ్ చేసేందుకు భారీ కుట్రలకు తెరతీశారు. పల్లెల్లో అల్లర్లు సృష్టించేందుకు గూండాలను రప్పించి బంధువుల పేరుతో టీడీపీ నేతల నివాసాల్లో దాచారు. మరికొందరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిష్ట వేశారు. రీ పోలింగ్ జరిగే ఒక్కో కేంద్రం వద్ద అల్లర్లు సృష్టించేందుకు 50 మంది చొప్పున రౌడీ మూకలను సిద్ధం చేశారు. మరోవైపు ఓట్లు వెయ్యకుండా కొందరు దళిత ఓటర్లను టీడీపీ నేతలు బలవంతంగా ఇతర ప్రాంతాలకు రాత్రికి రాత్రే వాహనాల్లో తరలిస్తున్నారు. నగదు ఎరవేస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. పోలింగ్ జరిగే గ్రామాల ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి నేరుగా డబ్బులు జమచేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఐదు గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలో గత నెల 11న జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, పులివర్తివారిపల్లిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. దీనిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలింగ్ కేంద్రాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఈసీ అక్కడ రీ పోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నేతలు కాలేపల్లి, కుప్పం బాదూరు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీ పోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో కూడా రీ పోలింగ్‌కు ఆదేశిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో నేడు రీ పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్‌ను జీర్ణించుకోలేక... ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లి సమీపంలోని గ్రామాల్లో దశాబ్దాలుగా దళితులపై అరాచకాలు జరుగుతున్నా ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పాతికేళ్లుగా ఓటు వేసేందుకు నోచుకోని దళితులకు ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ ద్వారా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ పరిణామం టీడీపీకి మింగుడు పడటం లేదు. ఇన్నాళ్లూ ఏకపక్షంగా ఓట్లు వేసుకుంటూ వచ్చిన టీడీపీ నాయకులు రీ పోలింగ్ రోజు మరోసారి రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పథకం వేశారు. తమ ఉనికి, పెత్తందారీతనాన్ని నిలబెట్టుకునేందుకు పచ్చ నేతలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహ రచన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిఘా వర్గాల సమాచారం మేరకు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ గూండాలను రంగంలోకి దించినట్లు పేర్కొంటున్నారు. అందులో భాగంగా చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల నుంచి రౌడీషీటర్లు, అల్లరి మూకలను రంగంలోకి దించారు. భారీ బందోబస్తు పోలింగ్ జరిగే గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతి ముగ్గురు ఓటర్లకు ఒక పోలీసు చొప్పున 250 మందిని నియమించారు. ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, హెచ్‌సీ, పీసీ, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్లను రంగంలోకి దించారు. రీ పోలింగ్ కేంద్రాల్లో చిన్న గొడవలు జరిగినా వెంటనే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి బంధువుల పేరుతో టీడీపీ నేతల ఇళ్లలో రౌడీషీటర్ల మకాం వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన రౌడీషీటర్లు, అల్లరి మూకలను రీ పోలింగ్ జరిగే సమీప గ్రామాల్లో టీడీపీ నేతలు దాచారు. చిత్తూరు నుంచి వచ్చిన కొందరు గూండాలు టీడీపీ నాయకుల నివాసాల్లో బంధువుల రూపంలో మకాం వేశారు. అవసరాన్ని బట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలని వీరిని ఆదేశించినట్లు తెలిసింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని లాడ్జీల్లో కూడా అల్లరి మూకలు మాటు వేశాయి. మరోవైపు దళిత, గిరిజన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ కేంద్రాలకు రాకుండా బెదిరిస్తున్నారు. ఓటర్లను గ్రామం నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. కొందరి బంధువులను నయాన, భయాన లోబరచుకుని వారి ద్వారా ఓటర్లను అత్యవసరం పేరుతో ఊరి నుంచి బయటకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఖాతాల్లోకి నగదు ట్రాన్స్ఫర్ పోలింగ్ గ్రామాల్లో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నేరుగా కాకుండా ఓటర్ల బ్యాంకు ఖాతా నంబర్లు తెలుసుకుని రాత్రంతా నగదు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రధానంగా కాలేపల్లి, కుప్పం బాదూరు గ్రామాలను టార్గెట్‌గా చేసుకుని భారీ ఎత్తున నగదు ఓటర్ల ఖాతాల్లోకి చేరవేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. తిరుపతిలోని ప్రధాన హోటళ్లను స్థావరాలుగా చేసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12 మంది కౌన్సిలర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. -
ఓటేయకుండా ఎస్సీలను అడ్డుకోవడం తీవ్రమైన అంశం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలోని ఐదు కేంద్రాలలో రీ పోలింగ్‌కు సంబంధించి టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. ఈసీ అన్ని ఆధారాలను సరిచూసిన తరువాతే రీ పోలింగ్‌కు ఆదేశించిందని వివరించారు. చంద్రగిరిలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఏడు గ్రామాల్లో ఎస్సీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారని, ఎస్సీలను ఓట్లు వేయకుండా అడ్డుకోవడం తీవ్రమైన అంశమని సీఎస్ పేర్కొన్నారు. ఫిర్యాదులో తీవ్రత ఉన్నందునే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటం ఈసీతోపాటు అధికారుల బాధ్యతని చెప్పారు. తాను ఎన్నికల సంఘం నియమించిన సీఎస్‌నని, ఈ నేపథ్యంలో ఈసీ అప్పగించిన విధుల నిర్వహణ తన బాధ్యతని స్పష్టం చేశారు. ఫిర్యాదులపై సాక్ష్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకునేది కేంద్ర ఎన్నికల సంఘమేనని గుర్తు చేశారు. చూసీ చూడనట్లు వదిలేయలేం..: రీ పోలింగ్ విషయంలో తనను, అధికారులను తప్పుపట్టడం సరికాదని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చూసీ చూడనట్లు వదిలేయలేమని, కిందిస్థాయి అధికారులు తప్పు చేస్తే వ్యవస్థ గుడ్డిగా పాలన సాగించదని సీఎస్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం సమన్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. టీడీపీ ఫిర్యాదులను పరిశీలించాలని సీఈవోకు సిఫారసు మరో ఏడు నియోజకవర్గాల్లో కూడా 18 చోట్ల రీ పోలింగ్ నిర్వహించేలా ఆదేశించాలంటూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సిఫారసు చేశారు. దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. -
ఇది ప్రజాస్వామ్యమేనా?
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? చంద్రగిరిలో పోలింగ్ వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఎన్నికల్లో కొందరు సిబ్బంది కుమ్మక్కైతే ఎన్నికల సంఘం చూస్తూ కూర్చోవాలా?’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వివేది శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తొలుత చంద్రగిరిలో ఎన్నికలు సవ్యంగా జరిగినట్లు నివేదికలు వచ్చాయని, కానీ రీ–పోలింగ్ కోరుతూ అందిన ఫిర్యాదులపై వీడియోలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా? అనిపించేలా దారుణమైన పరిస్థితులు కనిపించాయని వెల్లడించారు. అన్ని ఫుటేజ్‌లు పరిశీలించిన తర్వాతే రీ–పోలింగ్‌కు సూచిస్తూ ఈసీకి సిఫార్సు చేశామని స్పష్టం చేశారు. చంద్రగిరిలో ఏం జరిగిందన్న విషయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. చంద్రగిరిలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించడంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను న్యాయస్థానానికే సమర్పిస్తామని ద్వివేది ప్రకటించారు. వీడియో ఫుటేజ్‌లు చూశాక మాట్లాడాలి.. ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలను దాచిపెట్టాలనో లేక ఎవరినో కాపాడాలనో తాము చూడటం లేదని ద్వివేది పేర్కొన్నారు. రీ పోలింగ్‌పై ఆరోపణలు చేస్తున్నవారు ఒకసారి ఈ వీడియో ఫుటేజ్‌లు చూసి మాట్లాడాలన్నారు. చంద్రగిరిలో ఎన్నికల సమయంలో తప్పు జరగడం వల్లే ఈసీ స్పందించిందని, ఫిర్యాదు ఆలస్యంగా అందడం వల్లే ఒకేసారి రీ–పోలింగ్ నిర్వహించలేక పోయామని వివరించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం: టీడీపీ రీ–పోలింగ్ కోరుతున్న 18 చోట్ల కూడా వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ద్వివేది తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టేది లేదని, చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో పీవో, ఏపీవోలపై కఠిన చర్యలుంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అనధికారిక వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. మరో రెండు చోట్ల రీ–పోలింగ్‌కు సిఫార్సు చిత్తూరు జిల్లాలోని మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా కలెక్టర్ రీ పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు ద్వివేది తెలిపారు. వీడియో ఫుటేజ్ పరిశీలించిన తర్వాత 310, 323 కేంద్రాలలో రీ పోలింగ్‌కి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఈసీ అనుమతి కోరుతూ నివేదిక పంపినట్లు చెప్పారు. రేపు చంద్రగిరిలో రీ పోలింగ్‌కు పటిష్ట భద్రత చంద్రగిరిలో ఆదివారం రీ పోలింగ్ నిర్వహించే ఐదు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ద్వివేది ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 250 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ద్వివేది నియమావళిని వివరించారు. ఎన్నికల విధులకు సంబంధించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రీ పోలింగ్ సందర్భంగా ఓటరు ఎడమ చేయి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలన్నారు. ఎండల నేపథ్యంలో ఇబ్బంది లేకుండా షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. -
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల 19న రీ–పోలింగ్
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లి (పోలింగ్ స్టేషన్ నంబర్ 321), పుల్లివర్తిపల్లి(104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం(313) పోలింగ్ స్టేషన్లలో పార్లమెంటు, శాసనసభలకు మే19న రీ–పోలింగ్ నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి మే 10, 11 తేదీల్లో వచ్చిన లేఖలను పరిశీలించి రీ–పోలింగ్‌కు ఆదేశించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదు బూత్‌ల్లోకి ఇతరులను లోపలికి రానీయకుండా రిగ్గింగ్ చేసినట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దళితులను లోనికి రానీయకుండా అధికారపార్టీ నేతలు ఈ ఐదు బూత్‌లను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్ చేశారని, ఈ ఐదు చోట్ల వీడియా రికార్డింగులను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటూ చెవిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పరిశీలన చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో రికార్డులను పరిశీలించి రిగ్గింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చి, రీపోలింగ్‌కు కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మే19న రీ–పోలింగ్‌కు సంబంధిత అధికారులు మే17వ తేదీ సాయంత్రంలోగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 19 ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉత్తర్వులు వెలువడటానికి కొన్ని గంటల ముందు తెలుగుదేశం పార్టీ నేతలు కళా వెంకట్రావు రాష్ట్ర ఎన్నికల సంఘం వైఖరిపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలా విచారణకు ఆదేశిస్తారంటూ అడిషనల్ సీఈవో సుజాతా శర్మను నిలదీశారు. అనంతరం కళా వెంకటరావు విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అవకతవకలు జరగలేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న నివేదిక ఇచ్చారని, అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఎలా విచారణ జరుపుతుందని ప్రశ్నించారు. -
ఐదు కేంద్రాల్లో నేడే రీ పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించేలా ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రీ పోలింగ్ జరుగుతుందని చెప్పారు. రీ పోలింగ్ ఏర్పాట్లపై ఆదివారం ఆయన మీడియాకు వివరాలను విడుదల చేశారు. మాక్ పోలింగ్ కోసం ఆయా పార్టీ ఏజెంట్లు ఉదయం 5.30కే ఎన్నికల కేంద్రాలకు చేరుకోవాలని ద్వివేది సూచించారు. రీ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేలా రిటర్నింగ్ అధికారి, సహాయ ఆర్ఓ, అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేసినట్టు వివరించారు. ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పులు అందచేశామన్నారు. రీ పోలింగ్ కేంద్రాల వద్ద బెల్ ఇంజనీర్లును సిద్ధంగా ఉంచడంతోపాటు రిజర్వ్ ఈవీఎంలు కూడా సిద్ధం చేసినట్టు వివరించారు. పోలింగ్ విధుల్లో 1,200 మంది పోలీస్ సిబ్బంది రీ పోలింగ్ నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో కానిస్టేబుల్ మాత్రమే బందోబస్తు విధుల్లో ఉండటం గమనార్హం. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసారి రీ పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. డీజీపీ ఠాకూర్, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి ఎస్పీలకు పలు సూచనలు చేశారు. అవసరాన్ని బట్టి ఒక్కోచోట 250 నుంచి 300 మంది సిబ్బందిని మోహరించనున్నారు. రీ పోలింగ్ నిర్వహించే ఐదు కేంద్రాల్లో 5,064 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా 1,200 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. దాదాపుగా ప్రతి నలుగురు ఓటర్లకు ఒక పోలీసు చొప్పున నియమించారు. మూడంచెల భద్రతా వ్యవస్థలో భాగంగా మొదటి అంచెలో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత ఉంటుంది. రెండో అంచెలో పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు ఉండే ప్రాంతాన్ని ఇన్నర్ కార్డన్‌గా వ్యవహరిస్తారు. మూడో అంచెలో తనిఖీ పాయింట్లు, పికెట్లు ఉంటాయి. అవుటర్ కార్డన్‌గా వ్యవహరించే వాహనాలు నిలిపే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. రీ పోలింగ్ బందోబస్తు కోసం ఆరుగురు అదనపు ఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 29 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, 85 మంది ఏఎస్సైలు, 402 మంది కానిస్టేబుళ్లు, 28 మంది హోంగార్డులు, 25 మంది మహిళా పోలీసులు, నలుగురు ఆర్ఎస్సైలు, 34 మంది ఏఆర్ హెచ్‌సీలతోపాటు 8 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బందిని కేటాయించారు. రీ పోలింగ్ సందర్భంగా తనిఖీల కోసం 14 చెక్‌పోస్టులు, 26 పికెట్లు, 7 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 3 ఏరియా డామినేషన్ పార్టీలు, 22 షాడో పార్టీలు. 16 నిఘా కెమెరాలు, 88 బాడీవార్న్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రీ పోలింగ్ కేంద్రాలు ఇవే... గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 94వ పోలింగ్ స్టేషన్ (కేశానుపల్లి – 956 మంది ఓటర్లు), గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ (నల్లచెరువు – 1,376 మంది ఓటర్లు), ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ (కలనూతల 1,070 మంది ఓటర్లు), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని 41 పోలింగ్ స్టేషన్ (ఇసుకపాలెం 1,084 మంది ఓటర్లు), సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్ 197 పోలింగ్ స్టేషన్ (అటకానితిప్ప 578 మంది ఓటర్లు) పరిధిలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. -
రీ పోలింగ్‌కు పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రీ–పోలింగ్ జరిగే ఐదు బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి, వాటివద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల ఈనెల 6న రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో ఒకచోట శాంతిభద్రతల సమస్య, మరోచోట ఈవీఎం మొరాయించడంతో రీ–పోలింగ్‌కు ఈసీఐ అనుమతి కోరినట్లు ద్వివేది గురువారం ఇక్కడ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు బూత్ నంబరు 244లో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, అలాగే నరసరావుపేట నియోజకవర్గం కేసానుపల్లి గ్రామంలో 94వ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయిందని చెప్పారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలోని 247వ బూత్‌లో ఈవీఎం స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో ఇంకా 50 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ పోలింగ్‌ను అర్ధంతరంగా ఆపివేయాల్సి వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల తిరుపతి పార్లమెంటు పరిధిలో మాత్రమే రెండు బూత్‌లలో రీ–పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌పరిధిలో ఇసుకపల్లిపాలెంలోని బూత్ నంబర్ 41, సూళ్లూరుపేట సెగ్మెంట్ పరిధిలో అటకానితిప్ప బూత్ నంబరు 197లో కేవలం పార్లమెంటు స్థానానికి మాత్రమే రీ–పోలింగ్ నిర్వహించనున్నారు. రీ–పోలింగ్‌కు కావాల్సిన అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్, బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ బూత్‌లలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు ద్వివేది వివరించారు. ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలో 82 శాతం పోలింగ్
⇒ రీపోలింగ్‌లో 6.18 శాతం తగ్గిన ఓటింగ్.. ⇒ 22న ఓట్ల లెక్కింపు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఆదివారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 82.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారవడంతో ఈ నెల 9న జరిగిన పోలింగ్ రద్దైన విషయం తెలిసిందే. ఆ పోలింగ్‌లో 88.67 శాతం ఓటింగ్ నమోదవగా, రీపోలింగ్‌లో 6.18 శాతం తగ్గింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా సాగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కుమార్ సింగ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లతోపాటు ఇద్దరు వీడియోగ్రాఫర్లతో వీడియో తీయించామన్నారు. పోలింగ్ సరళిని అంబర్‌పేట ఇండోర్ స్టేడియం నుంచి పర్యవేక్షించామని, ఎక్కడా సమస్యలు దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రజత్‌కుమార్ హైదరాబాద్ నగరంలోని పలు కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఆయా జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు అంబర్‌పేట స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు గట్టి బందోబస్తు మధ్య తరలించారు. అంబర్‌పేట స్టేడియంలో 22న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అద్వైత్‌కుమార్ తెలిపారు. -
నేడే రీ పోలింగ్
-
నేడే రీ పోలింగ్
► 8 జిల్లాల పరిధిలోని 126 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ► 22న ఓట్ల లెక్కింపు సాక్షి, హైదరాబాద్: ఆదివారం జరుగనున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రీ పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఆదిలక్ష్మయ్య, పాపాన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారవడంతో రీపోలింగ్ జరుపుతున్న విషయం తెలిసిందే. మరోసారి పొరపాట్లు జరగకుండా అన్ని అంశాలను అధికారులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. గుర్తింపు పత్రం లేనిదే ఎవరినీ పోలింగ్‌కు అనుమతించబోమని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లను ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్, రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీని, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అంబర్‌పేట జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంకు మార్చ డంతో అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది శనివారం ఉదయం ఎన్నికల సామాగ్రితో కేంద్రాలకు వెళ్లారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 9న జరిగిన పోలింగ్ పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారి ఇచ్చిన వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే ఓటర్లు బ్యాలట్ పేపర్‌పై ఓటు మార్క్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఓటేసేవారికి మధ్యవేలిపై సిరా గుర్తు వేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు కనీస సదుపాయాలు కల్పించామన్నారు. ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ మవుతుంది. ఎనిమిది జిల్లాల పరిధిలోని 126 కేంద్రాల్లో పోలింగ్ జరుగనుంది. పోటీలోని అభ్యర్థులు.. కొంగర శ్రీనివాస్, అరకల కృష్ణాగౌడ్, ఆది లక్ష్మయ్య, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, గోపాల్ సాయిబాబా మీసాల, నర్రా భూపతిరెడ్డి, ఎంవీ నర్సింగ్ రావు, పాపన్నగారి మాణిక్‌రెడ్డి, ఎం. మమత, ఏవీఎన్ రెడ్డి, ఎస్. విజయకుమార్ -
ప్రశాంతంగా రీ పోలింగ్
47.10 శాతం నమోదు చార్మినార్: పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుం డా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నగర సంయుక్త పోలీసు కమిషనర్ శివ ప్రసా ద్ స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం 5 వరకూ కొనసాగింది. అభ్యర్థులు స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి... సరళిని పరిశీలించారు. వివిధ ప్రాం తాల ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఈ నెల 2న 54.08 శాతం ఓట్లు పోలవ్వగా...శుక్రవారం రీ పోలింగ్‌లో 47.10 శాతం పోలయ్యాయి. -
పురానాపూల్ మజ్లిస్ ఖాతాలోకి...
వివాదాస్పదంగా మారి.. రీపోలింగ్ జరిగిన పురానాపూల్ డివిజన్ మజ్లిస్ ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సున్నం రాజ్ మోహన్ 2,877 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజ్‌మోహన్‌కు 8,553 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్‌కు 5,676 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి మధుకర్ యాదవ్‌కు 1,295 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థికి 747 ఓట్లు వచ్చాయి. -
పురానాపూల్‌లో నేడు రీ పోలింగ్
పూర్తి స్థాయి బందోబస్తు అన్ని కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ సిటీబ్యూరో: పురానాపూల్ డివిజన్‌కు శుక్రవారం రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 2న పోలింగ్ సందర్భంగా ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో... వివిధ రాజకీయ పార్టీ ల అభ్యంతరాలు.. ఎన్నికల పరిశీల కుల నివేదిక అనంతరం రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వార్డులోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందన్నారు. ఓటరు స్లిప్పులు లేకున్నా స్థానికులు ఓటు వేసేందుకు అనుమతించాల్సిం దిగా అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 36 కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు కానీ... ఫొటోతో కూడిన 21 గుర్తింపు పత్రాల్లో దేనిని చూపించినా అనుమతిస్తారని చెప్పారు. పురానాపూల్ వార్డులో మొత్తం 34,407 మంది ఓటర్లు ఉండగా... 200 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్టు కమిషనర్ చెప్పారు. పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నేడు సెలవు రీ పోలింగ్ దృష్ట్యా పురానాపూల్ వార్డు పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ గురువారం జీవో జారీ చేసింది. పోలింగ్ నిర్వహించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే వారికి, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. స్థానిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఓటర్లు: పురుషులు-18,204, మహిళలు-16,203, మొత్తం-34,407. బరిలో ఉన్న అభ్యర్థులు... మజ్లిస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ సున్నం రాజ్‌మోహన్... మరో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి మక్కర్ యాదవ్, టీఆర్ఎస్ అభ్యర్థి మల్లికార్జున్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
రీ పోలింగ్ ప్రశాంతం
కొమరాడ, న్యూస్‌లైన్ : మండలంలోని చెక్కవానివలస 192వ నంబరు పోలింగ్ బూత్‌లో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిపివేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ బూత్‌లో 217 ఓట్లకుగాను 154 ఓట్లు పోలయ్యూయి. ఎస్ఐ ఎ.ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. పెదచామలాపల్లిలో... మెంటాడ : పెదచామలాపల్లిలో 134వ పోలింగ్ బూత్‌లో పార్లమెంటు స్థానానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహించారు. సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. -
మందకొడిగా రీపోలింగ్
కేపీహెచ్‌బీ కాలనీ, న్యూస్‌లైన్: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని 371/ఏ కేంద్రంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 53.89 పోలింగ్ శాతం నమోదైంది. గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం మొరాయించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మందకొడిగా జరిగిన పోలింగ్‌లో 450 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ కేంద్రం పరిధిలోని మొత్తం 835 ఓట్లు ఉన్నాయి. వీరిలో 210 మంది మహిళలు, 240 మంది పురుషులు ఓటు వేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్‌రెడ్డి తెలిపారు. గత నెల 30న పోలైన ఓట్లకంటే 12 తగ్గాయని అధికారులు వెల్లడించారు. కాగా, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే, ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ ఉంది. జంపన ప్రతాప్ (వైఎస్సార్సీపీ), గొట్టిముక్కల పద్మారావు (టీఆర్ఎస్), ముద్దం నర్సింహయాదవ్ (కాంగ్రెస్) మంగళవారం పోలింగ్ సరళిని పరిశీలించారు. రీపోలింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు రీపోలింగ్‌లో నమోదైన ఓట్లపై అంచనాలు వేసుకోవడంతో మునిగిపోయారు. -
రాష్ట్రవ్యాప్తంగా నేడు రీ పోలింగ్
-
రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
కొత్తగూడెం, న్యూస్‌లైన్: జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో మంగళవా రం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగూడెంలోని 161వ పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 1008 ఓట్లు ఉన్నాయని, పాత కొత్తగూడెం, శ్రీరామచంద్ర స్కూల్లో పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జిల్లాలో సజావుగా జరిగాయని, మంగళవారం నాటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు కూడా ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. భద్రాచలం నియోజకవర్గంలోని 8 మండలాల కౌంటింగ్‌ను భద్రాచలంలోనే ఏర్పాటు చేశామని, మిగిలినవన్నీ ఆయా మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేశామని తెలి పారు. కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్ తదితరులున్నారు. వీఆర్‌పురంలో కట్టుదిట్టమైన భద్రత వీఆర్‌పురం: రీపోలింగ్ జరగనున్న జల్లివారిగూడెం గ్రామంలో పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై సీఐ అమృతరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలింగ్ సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. -
29 కేంద్రాల్లో నేడు రీ పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రలోని పది జిల్లాల్లోని 29 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో గత నెల 30న, ఈ నెల 7న సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల ఓటింగ్ యంత్రాలు మధ్యలో పనిచేయడం మానేశాయి. వాటిని మార్చి కొత్త యంత్రాలను అమర్చి పోలింగ్ నిర్వహించారు. అయితే ఇలాంటి చోట్ల రీ పోలింగ్ అవసరం లేదని కలెక్టర్లు నివేదించినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం 29 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవీ.. నిజామాబాద్ లోక్‌సభకు బోధన్ అసెంబ్లీ పరిధిలోని 64వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు జుక్కల్ అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి 146వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు బాన్సువాడ అసెంబ్లీ పరిధిలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానానికి 48, 168 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ పరిధిలోని 9వ పోలింగ్ కేంద్రం కూకట్పల్లి అసెంబ్లీ స్థానానికి 371/ఎ పోలింగ్ కేంద్రం కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి 161వ పోలింగ్ కేంద్రం భద్రాచలం అసెంబ్లీ స్థానానికి 239వ పోలింగ్ కేంద్రం శ్రీకాకుళం లోక్‌సభకు శ్రీకాకుళం అసెంబ్లీ పరిధిలోని 46వ పోలింగ్ కేంద్రం కురుపాం అసెంబ్లీ స్థానానికి 192వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభకు సాలూరు అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభ, పాడేరు అసెంబ్లీ స్థానానికి 68వ పోలింగ్ కేంద్రం మచిలీ పట్నం లోక్‌సభకు గుడివాడ అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం మచిలీపట్నం లోక్‌సభకు అవనిగడ్డ అసెంబ్లీ పరిధిలోని 29వ పోలింగ్ కేంద్రం అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి 91వ పోలింగ్ కేంద్రం పెనమలూరు అసెంబ్లీ స్థానానికి 59, 172 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ పరిధిలోని 212వ పోలింగ్ కేంద్రం విజయవాడ లోక్‌సభకు మైలవరం అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం నందిగామ అసెంబ్లీ స్థానానికి 171, 174 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు జగ్గయ్యపేట అసెంబ్లీ పరిధిలోని 122వ పోలింగ్ కేంద్రం కరీంనగర్ లోక్‌సభకు హుస్నాబాద్ పరిధిలోని 170వ పోలిం గ్ కేంద్రం కడప పార్లమెంట్‌కు, జమ్మలమడుగు అసెంబ్లీకి 80, 81,82 పోలింగ్ కేంద్రాలు. -
రీపోలింగ్‌పై ఈసీ దిద్దుబాటు
హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరులో రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం(ఈసీ)తన పొరపాటును సరిదిద్దుకుంది. శాసనసభకు కాదు లోక్‌సభకే రీపోలింగ్ అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సాలూరులో 132 పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ విషయమై కలెక్టర్ పొరపాటుపడ్డారు. లోక్‌సభ బదులు అసెంబ్లీకి రీపోలింగ్ జరపాలంటూ కలెక్టర్ ఈసీకి పొరపాటుగా నివేదిక ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయన తన పొరపాటును గుర్తించారు. ఈ విషయం ఈసీకి తెలియజేశారు. దాంతో శాసనసభ స్థానానికి కాదు లోక్‌సభ స్థానానికి రీపోలింగ్ అని ఈసీ తెలియజేసింది. -
రీ పోలింగ్‌పై జయ వ్యతిరేకత
టీ.నగర్, న్యూస్‌లైన్: సేలం, నామక్కల్ పార్లమెంటు నియోజకవర్గాలలో తలా ఒక పోలింగ్ కేంద్రంలో గురువారం రీపోలింగ్ జరపడానికి ముఖ్యమంత్రి జయలలిత వ్యతిరేకత తెలిపారు. సేలం పార్లమెంటు పరిధిలో గల సేలం కార్పొరేషన్ మాధ్యమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో 579 మంది ఓట్లు వేశారు. ఇక్కడ ఉపయోగించిన ఈవీఎంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రంలో గురువారం రీపోలింగ్ జరిపేందుకు ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే నామక్కల్ నియోజకవర్గం పరిధిలో గల తిరుచెంగోడు కోట పాళయం పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో గురువారం రీపోలింగ్ జరగనుంది. ఇందుకు డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే వ్యతిరేకత తెలిపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత బుధవారం ప్రధాన ఎన్నికల అధికారికి ఒక లేఖ పంపారు. అందులో సేలం నియోజకవర్గంలో 213వ పోలింగ్ బూత్‌లో 77.61 శాతం ఓట్లు నమోదయ్యాయని అదే విధంగా నామక్కల్ నియోజకవ ర్గంలో 37వ పోలింగ్‌బూత్‌లో 80.26 శాతం ఓట్లు నమోదైనట్లు సమాచారం అందిందన్నారు. ఈ రెండు పోలింగ్ బూతుల్లో ఓట్ల నమోదు గురించి ఏ పార్టీ కూడా వ్యతిరేకత తెలపలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో 48 గంటల అవకాశం కూడా ఇవ్వకుండా గురువారం రీ పోలింగ్ జరిపేందుకు ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని ఇది పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీంతో రీ పోలింగ్ ఉపసంహరించుకోవాలని, రీపోలింగ్, పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తెలిపారు.