reduced
-
సాగు ఢమాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రమంతా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం, చెరువులు, కుంటలు నిండకపోవడం, ఇటీవలి కాలం వరకు జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడం..తదితర కారణాలతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి సాగైన పంటలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 15.30 లక్షల ఎకరాల మేరకు సాగు తగ్గిపోయింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని పంటల ప్రణాళికలో వ్యవసాయశాఖ అంచనా వేసింది.అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. కానీ ఆశించిన స్థాయిలో సాగు జరగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం వంటి కారణాలు కూడా సాగు తగ్గడానికి కారణాలుగా రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే కొందరు రైతులు భూముల్ని కౌలుకు ఇవ్వకుండా వదిలేశారన్న చర్చ కూడా జరుగుతోంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే, తమకు రైతు భరోసా రాదని కొందరు రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 8.79 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి గతేడాది వానాకాలం సీజన్ ఇదే సమయానికి అన్ని పంటలు కలిపి 99.89 లక్షల (దాదాపు కోటి) ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 84.59 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సాగు విస్తీర్ణం ఏకంగా 15.29 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి సాగు గణనీయంగా పడిపోయింది.గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 34.37 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే గతేడాదితో పోలిస్తే 8.79 లక్షల ఎకరాలు తగ్గింది. దీనిని బట్టి చూస్తే పంటల ప్రణాళిక ప్రకారం ఈ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యమయ్యేలా కని్పంచడం లేదు. వరికి రూ.500 బోనస్ కేవలం సన్నాలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం, ఆ వరి రకాల పేర్లను మొన్నమొన్నటి వరకు బహిరంగపరచకపోవడం, ఇప్పుడు వాటిని రైతులకు అందుబాటులో ఉంచకపోవడం తదితర కారణాలు ఏమైనా రైతులను గందరగోళపరిచాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతేడాది వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవడం గమనార్హం. పత్తి సాగూ తగ్గింది.. పత్తి విషయానికొస్తే.. గతేడాది ఇదే సమయానికి 44.32 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి కేవలం 41.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 2.67 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందన్నమాట. వాస్తవానికి పత్తి సాగును 60 లక్షల ఎకరాలకు పెంచాలని, వీలైతే 70 లక్షల ఎకరాలకు పెంచినా మంచిదేనన్న అభిప్రాయంతో వ్యవసాయ శాఖ ఉంది. ఆ మేరకు ప్రణాళికలు వేసుకుంది.కానీ కీలకమైన సమయంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనేకమంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గతేడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న సాగు 93,635 ఎకరాల్లో, కంది 35,176 ఎకరాల్లో, సోయాబీన్ 72,744 ఎకరాల్లో తగ్గింది. వనపర్తి జిల్లాలో 20.59 శాతమే సాగు రాష్ట్రంలో అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 20.59 శాతమే పంటలు సాగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 32.02 శాతం, ములుగు జిల్లాలో 32.57 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41.67 శాతం, రంగారెడ్డి జిల్లాలో 44.89 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యంత ఎక్కువగా పంటల సాగు నమోదు కావడం గమనార్హం. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,62,098 ఎకరాలు కాగా, 5,63,481 ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా వరి, పత్తి సాగు ఇలా.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకోలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 2.54 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 79,085 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 1.87 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, 97,087 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతేడాది 2.21 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.50 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మెదక్ జిల్లాలో గతేడాది 2.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.22 లక్షల ఎకరాల్లోనే పడ్డాయి.ఇదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నాట్లు గణనీయంగా తగ్గాయి. ఇక పత్తి నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 5.86 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది ఇప్పటివరకు 5.22 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గతేడాది 2.41 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 1.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2.02 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు 1.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. జనగామలో గతేడాది ఇదే సమయానికి 1.35 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు కేవలం 97,225 ఎకరాల్లోనే సాగైంది. సంగారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్ తదితర జిల్లాల్లోనూ పత్తి సాగు తగ్గింది. వర్షాల కోసం చూస్తున్నా.. నాకు నాలుగున్నర ఎకరాల సొంత పొలం ఉంది. ఏటా మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటా. నాలుగున్నర ఎకరాల్లో మెట్ట పంటలు వేసి మిగతా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తా. అయితే ముసురు వర్షాలకు కారణంగా ఇప్పటివరకు మూడెకరాల్లోనే వరి నాట్లు వేశా. మిగిలిన 17 ఎకరాల సాగుపై ఎటూ తోచడం లేదు. ప్రస్తుతానికైతే మరో పదెకరాల వరకు నారుమడి సిద్ధం చేసుకున్నా. కానీ ఇదే పరిస్థితి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటే వేసిన మూడెకరాల వరి కూడా పండదు. అందుకే భారీ వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. – మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా 15,131చెరువులు ఖాళీరాష్ట్రంలో 34,716 చెరువులు, కుంటలున్నాయి. అందులో 3,247 చెరువులు ఇటీవలి వర్షాలతో అలుగు పోస్తున్నాయి. 6,735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. 3,438 చెరువుల్లో 50 నుంచి 75% నీటి నిల్వలున్నాయి. 6,165 చెరువుల్లో మాత్రం 25 నుంచి 50% మాత్రమే నీరు చేరింది. 15,131 చెరువుల్లో నీటి నిల్వలు ఇంకా 25% లోపలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 61.34 శాతం చెరువుల్లో 50% కంటే తక్కువగానే నీటినిల్వలున్నాయి. -
ఈపీఎఫ్‌వో పెనాల్టీ తగ్గింపు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది. -
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’కు సంబంధించి కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఇన్ఫోఫిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు కుదించినట్లు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ బుధవారం వెల్లడించింది. మరింత మంది యువ ప్రతిభావంతులను పరిశోధనలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు తగ్గించినట్లు తెలిపింది. వారిలోని అసాధారణ ప్రతిభను కనిపెట్టి, వారి సేవలను సత్కరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.అంతేగాక ఇప్పటివరకు సోషల్ సైన్సెస్ కేటగిరిలో భాగమైన ఎకానమిక్స్ కోసం ప్రత్యేక బహుమతి అందిచనున్నట్లు తెలిపింది. దీంతో బహుమతులు అందజేసే వర్గాల సంఖ్య ఏడుకు చేరుకుంది. కాగా ఫౌండేషన్ తరపున ఇప్పటి వరకు 92 మంది పరిశోధకులకు అవార్డులు ప్రదానం చేశారు.కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 83 లక్షల 50 వేలు), దానికి సమానమైన ప్రైజ్ పర్స్ అందిస్తారు.ఇదిలా ఉండగాప్రొఫెసర్ అరవింద్, ప్రొఫెసర్ కౌశిక్ బసు, ప్రొఫెసర్ శ్రీనివాస్ కులకర్ణితో కూడిన జ్యూరీ ఇప్పటికే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ కోసం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్‌లో విజేతలను ప్రకటించే అవకాశం ఉంది. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జగనుంది.మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్ ప్రాథమిక లక్ష్యం. కాగా విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోరుతుంది. -
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 7 పార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 64,080 మంది స్వామివారిని దర్శించుకోగా 25,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీ వారి సర్వ దర్శనం కోసం ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,928 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 22,358 కాగా, నిన్న స్వామి వారి హుండీ అదాయం 3.34 కోట్లు. -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
స్తబ్దుగా గోదావరి
సాక్షి, అమలాపురం: గలగలా గోదావరి... స్తబ్దుగా ఉంది. ‘నైరుతి’ ముఖం చాటేయడంతో ఈ ఏడాది గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఆ ప్రభావం ఇన్‌ఫ్లోపై పడింది. నైరుతి ముగియడం, వరదల సీజన్ కూడా అయిపోవడంతో జలాల రాక క్రమేణా తగ్గిపోయి ఇన్‌ఫ్లో తక్కువ స్థాయిలో నమోదవుతోంది. గడచిన రెండురోజులుగా బ్యారేజ్ నుంచి దిగువునకు నీటి విడుదల ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం వచ్చే రబీపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆశాజనకం గతేడాది జూలైలో చరిత్రలో రెండో అతి పెద్ద వరద రాగా, ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా అది కొనసాగింది. అక్టోబరు ఇదే సమయానికి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 6,231 టీఎంసీలు నమోదవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు విస్తృతంగా పడే ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా వరద జాడ లేదు. గతంలో అంటే... 2016లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ఏడాది బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 2,750.944 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రబీ మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చినా తరువాత కొంత అనధికారికంగా కోత విధించాల్సి వచ్చింది. తగ్గిన ఇన్‌ఫ్లో ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోవడంతో రెండు రోజులుగా గేట్లు మూసివేసి సముద్రంలోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 14,700 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిలో సీలేరు పవర్ జనరేషన్ నుంచి వచ్చింది 3,765 క్యూసెక్కులు. అంటే సహజ జలాలు కేవలం 10,935 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నీటిని తూర్పు డెల్టాకు 4,900, మధ్యడెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,200 చొప్పున మొత్తం 14,700 క్యూసెక్కులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. సర్వ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,123 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,054 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.01 కోట్లు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగ నరసింహుడు రూపంలో ఊరేగిన స్వామి రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడై ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవితో కలిసి భక్తులను సాక్షాత్కరించారు. అనంతరం సహస్రదీపాలంకార సేవలో ఊయలూగుతూ స్వామివారు దర్శనమిచ్చారు. తర్వాత సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వైభవంగా ఊరేగారు. ఉత్సవ శోభల్లో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. వాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు -
సహజ ప్రసవాలకు ‘సీ–సేఫ్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ పూర్తి సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ (ఎన్‌పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. అనవసర కోతల నియంత్రణ యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్‌ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్‌కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్‌లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
రైలు ప్రయాణికులకు ఊరట.. ఏసీ రైళ్లలో తగ్గనున్న ఛార్జీలు..
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సహా 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల ఛార్జీలను 25 శాతం మేర తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు శనివారం తెలిపింది. అనుభూతి, విస్తాడోమ్ కోచ్‌లు సహా ఏసీ సౌకర్యం ఉండే అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇతర వాహన ప్రయాణ ఛార్జీలను బట్టి కూడా రాయితీని నిర్ణయిస్తామని పేర్కొంది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలపై డిస్కౌంట్ పథకాలను ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించిందని కూడా వివరించింది. ‘ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్, జీఎస్టీ మొదలైన తదితర ఛార్జీలు అదనం. ఆక్యుపెన్సీ ఆధారంగా ఏదైనా లేదా అన్ని తరగతులలో డిస్కౌంట్ అందించవచ్చు’అని రైల్వే బోర్డు పేర్కొంది. ‘గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని సెక్షన్లలోని రైళ్లలో విభాగాల వారీగా రాయితీ ఉంటుంది. డిస్కౌంట్ పథకం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల వాపస్ ఉండదు’అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే, కొన్ని తరగతులకు ఫ్లెక్సీ ఫేర్ అమల్లో ఉన్న కొన్ని రైళ్లకు ఈ రాయితీ పథకం వర్తించదు. పండగలు, సెలవు రోజుల్లో ప్రత్యేకంగా నడిపే రైళ్లల్లో రాయితీ ఉండదు. రాయితీ స్కీమ్ వందేభారత్ రైళ్లకు కూడా వర్తిస్తుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని దింపారు -
Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల సక్సెస్ మాటేమోగానీ.. అధిక టికెట్ ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండడంతో నెమ్మదిగా సాధారణ ప్యాసింజర్ రైళ్లకు ప్రయాణికులు దూరమైపోతున్నారు. అయినప్పటికీ వందే భారత్ రైళ్లనే ప్రమోట్ చేసేందుకే భారతీయ రైల్వేస్ మొగ్గు చూపిస్తోంది. ఈ క్రమంలో.. వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. తక్కువ దూరం ఉండే మార్గాల్లో నడిచే రైళ్లలో టికెట్ ధరలు తగ్గించాలని భారతీయ రైల్వేస్ భావిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్లకు ఇది వర్తించబోదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇండోర్-భోపాల్ వందే భారత్ రైలు ప్రయాణ సమయం మూడు గంటలు. జూన్ నెలలో 29 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచింది ఈ రైలు. అలాగే.. భోపాల్-ఇండోర్ రూట్లో 21 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. అందుకే ఈ తరహా తక్కువ దూరం ఉన్న రూట్లో టికెట్ ధరల్ని తగ్గించాలని.. తద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని భావిస్తోంది రైల్వేస్. ఇక ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో మాత్రం టికెట్ ధరలు యథాతధంగా కొనసాగించాలనుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని స్పష్టత ఇచ్చేశారు. ఇదిగాక.. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రూట్లలోనూ టికెట్ ధరలు అధికంగానే ఉండొచ్చని ఇప్పటికే అధికారులు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇదీ చదవండి: ఇంతకీ కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు? -
ఏం కొంటాంలే! తగ్గుముఖం పట్టిన ఇళ్ల కొనుగోళ్లు..
భారత్‌లో పండుగల సీజన్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) తీసుకున్న గృహ రుణాల విలువ ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా తగ్గుముఖం పట్టడంతో ఇది స్పష్టమవుతోంది. మరోవైపు ఇదే కాలంలో ఆటో, ద్విచక్ర వాహనాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, వ్యక్తిగత రుణాలు స్థిరమైన వృద్ధిని సాధించగా, గృహ రుణాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. వాహన రుణాల్లో గణనీయ వృద్ధి క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం పండుగ సీజన్ అయితే మూడో త్రైమాసికం విలువ, పరిమాణం రెండింటిలోనూ ఆటో, ద్విచక్ర వాహన రుణాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే, ఈ కాలంలో గృహ రుణాలు 2. 6 శాతం తగ్గిపోయాయి. ఇది ఇటీవలి సంవత్సరాలలో గృహ రుణాలకు సంబంధించి అత్యంత నిరాశాజనక పండుగ త్రైమాసికం. అయితే గృహ రుణాల తగ్గుదలకు వడ్డీ రేట్ల పెరగడం కారణంగా భావించవచ్చు. వాహన రుణాలు ఆరిజినేషన్స్ (విలువ)లో 24 శాతం పెరుగుదలను ప్రదర్శించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇవి రూ.60,900 కోట్లు ఉండగా 2023 ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.75,500 కోట్లకు పెరిగాయి. అదేవిధంగా ద్విచక్ర వాహన రుణాలు 34. 5 శాతం వృద్ధిని సాధించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.17,100 కోట్ల నుంచి 2023 ఆర్థికేడాది మూడో త్రైమాసికానికి రూ.23,000 కోట్లకు పెరిగాయి. పర్సనల్ లోన్ విభాగం కూడా 20. 2 శాతం వృద్ధిని సాధించింది. 2022 ఆర్థిక ఏడాది క్యూ3లో రూ.1,58,500 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,90,500 కోట్లకు చేరుకుంది. We today announced the second edition of the How India Celebrates Report on Festive Lending in India. Discover key trends and insights into major consumer lending products. Get the full report at: https://t.co/9cSuZdbuSW#CRIF #HowIndiaCelebrates #FestiveLoans #Insights pic.twitter.com/6DOu8jkGJh — CRIF India (@CRIF_India) June 14, 2023 -
ట్విటర్ క్రాష్: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది!
ఒకప్పుడు 100 మందికి పైగా ఉద్యోగులున్న ట్విటర్లోని ఆ విభాగంలో ఇప్పుడు పనిచేస్తున్నది కేవలం ముగ్గురంటే ముగ్గురే. ట్విటర్లో ఆడియో సంభాషణలకు సంబంధించిన ట్విటర్ స్పేసెస్ విభాగంలో ప్రస్తుతం మిగిలింది ముగ్గురేనని ప్లాట్‌ఫార్మర్ అనే సంస్థ నివేదిక ద్వారా వెల్లడైంది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ తాను అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించడం ఇటీవల సంచలనం సృష్టించింది. అమెరికా పునర్ వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారాయన. ఎలాన్ మస్క్‌తో కలిసి ఆయన ట్విటర్ స్పేసెస్ ద్వారా లైవ్ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ట్విటర్ క్రాష్ అయిపోవడం తెలిసిందే. అయితే ట్విటర్ క్రాష్ కావడంపై తాజాగా ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. ట్విటర్ స్పేసెస్ విభాగంలో ఒకప్పుడు 100 మంది సిబ్బంది పనిచేస్తుండగా ఇప్పుడున్నది కేవలం ముగ్గురేనని తెలిసింది. ట్విటర్ స్సేసెస్ బృందం చాలా నెలలుగా సంస్థాగత జ్ఞానం లేకుండానే పనిచేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. కాగా క్లబ్‌హౌస్ అనే సంస్థకు పోటీగా ట్విటర్ 2021లో ట్విటర్ స్పేసెస్ పేరుతో ప్రత్యక్ష ఆడియో సంభాషణలను జోడించింది. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ ఆధీనంలోకి తీసుకున్నాక ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు 100 మంది ఉన్న ట్విటర్ స్పేసెస్‌లో ఇప్పుడు మిగిలింది కేవలం ముగ్గరే అని ప్లాట్‌ఫార్మర్ నివేదిక బహిర్గతం చేసింది. ఇదీ చదవండి: Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు? -
భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్న సమయంలో CNG, PNG ధరలు తగ్గడం నిజంగా హర్షించదగ్గ విషయం. సీఎన్జీ, పీఎన్జీ కొత్త ధరలు రేపు (ఏప్రిల్ 09) ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. ధరల తగ్గుదల తరువాత నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు. ఢిల్లీ: సీఎన్జీ: కేజీ రూ. 73.59 పీఎన్జీ : ఎస్సిఎమ్ (స్టాండర్డ్ పర్ క్యూబిక్ మీటర్) రూ. 48.59 నోయిడా: సీఎన్జీ: కేజీ రూ. 77.20 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 48.46 ఘజియాబాద్: సీఎన్జీ: కేజీ రూ. 77.20 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 48.46 గురుగ్రామ్: సీఎన్జీ: కేజీ రూ. 82.62 పీఎన్జీ: ఎస్సిఎమ్ రూ. 47.40 కొన్ని నివేదికల ప్రకారం, రానున్న రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ వాహనాలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి విముక్తి పొందటానికి సీఎన్జీ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పాలి. (ఇదీ చదవండి: రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?) దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి, టయోటా వంటి వాహన తయారీ సంస్థలు కూడా సీఎన్జీ వాహనాలను విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాలు అధిక మైలేజ్ అందించడం వల్ల ఎక్కువ మంది ఈ కార్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. -
AP: 2021-22లో భారీగా తగ్గిన అప్పులు.. కాగ్ నివేదిక చెప్పింది ఇదే..
సాక్షి, అమరావతి: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఏడాది ద్రవ్య లోటు అదుపులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన అకౌంట్స్ ప్రకారం.. 2021–22 ఆర్థిక ఏడాదిలో ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్ సమర్పణ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 2.08 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. అంతేకాక.. ఇది ఎఫ్ఆర్బీఎం నిబంధనల కన్నా తక్కువన్నారు. వాస్తవానికి.. ఆ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.37,029 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే, 2021–22 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.8,610 కోట్లుగా కాగ్ ఖరారు చేసిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.72 శాతంగా ఉందని మంత్రి వివరించారు. మరోవైపు.. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు 2023–24 ఆర్థిక ఏడాది బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,83,008.96 కోట్లకు చేరుతాయని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.32 శాతంగా ఉంటుందని బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,26,233.92 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. చదవండి: అక్కచెల్లెమ్మలకు అగ్రపీఠం -
విద్యుత్ డిమాండ్‌కు ‘లాక్డౌన్’!
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో గతేడాది విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. ప్రధానంగా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, రైల్వే, మెట్రో రవాణా సేవలు మూతపడటంతో విద్యుత్ డిమాండ్ అమాంతం పడిపోయింది. 2019–20లో 68,303 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వార్షిక విద్యుత్ వినియోగం జరగ్గా 2020–21లో అది 67,694 ఎంయూలకు తగ్గిపోయింది. ప్రస్తుత 2021–22 సంవత్సరంలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో మళ్లీ విద్యుత్ వినియోగం పుంజుకుంటోంది. ఈ ఏడాది రోజువారీ రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,900 మెగావాట్లకు పెరగనుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అంచనా వేసింది. ఆ మేరకు విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం పెంచుకోవడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అనుమతిచ్చింది. మరోవైపు 2026–27 నాటికి రోజువారీ విద్యుత్ గరిష్ట డిమాండ్ 18,653 మెగావాట్లకు, వార్షిక విద్యుత్ వినియోగం 1,04,345 ఎంయూలకు పెరగొచ్చని కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) 19వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే రిపోర్టులో పేర్కొంది. అవసరానికి అక్కరకు రాని పునరుత్పాదక ఇంధనం.. పునరుత్పాదక విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంలో దేశంలోనే సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో దీనివల్ల ఆశించిన ప్రయోజనం చేకూరట్లేదు. విద్యుత్ గరిష్ట డిమాండ్ నెలకొన్న వేళల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం తెలంగాణ 4,389.4 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నా వాటి వాస్తవ ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) సుమారు 20 శాతమే. -
దేశం లో భారీగా తగ్గిన కరోనా మరణాలు
-
తగ్గిన మద్యం షాపులు
-
సగానికి తగ్గనున్న ఎన్సీఈఆర్టీ సిలబస్
న్యూఢిల్లీ: విద్యార్థులకు భారంగా మారిన జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌ను సగానికి తగ్గించనున్నారు. సిలబస్‌ను సగానికి తగ్గించాలన్న కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం బుధవారం ఓకే చెప్పింది. ‘విద్యార్థుల పోర్షన్‌ను సగం చేస్తాం. ఇకపై వారికి అంతా బోధించాల్సిన పనిలేదు. విద్యార్థులు ముఖ్యమైన సూత్రాలు నేర్చుకుంటే చాలు. మిగతా నాలెడ్జ్‌ను తర్వాత వారు సముపార్జించగలరు. ప్రస్తుతం అతి సిలబస్ దెబ్బకు విద్యార్థులు వ్యాయామం, జీవన నైపుణ్యాలు వంటి వాటికి సమయం కేటాయించలేకపోతున్నారు’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. -
44 జిల్లాల్లో తగ్గిన మావోల ప్రభావం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా 44 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ప్రస్తుతం మావోల ప్రభావం అధికంగా 30 జిల్లాల్లోనే ఉందన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టడం, భద్రతను కూడా కట్టుదిట్టం చేయడంతో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. గ్రామాలకు రోడ్లు, వంతెనల నిర్మాణం, టెలిఫోన్ టవర్లు ఏర్పాటుతో పేదలకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమాన్ని కొనసాగించామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పలు రాష్ట్రాలకు అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చినట్లు వివరించారు. -
ఆర్బిఐ నుంచి బ్యాంకులకు తగ్గిన నగదు సరఫరా
-
ఈ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే..
న్యూఢిల్లీ :జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ తన రీసెంట్ హ్యాచ్‌బ్యాక్ ధరను భారీగా తగ్గించింది. టీం-బిహెచ్పీ అందించిన నివేదిక ప్రకారం పోలో జిటిఐ ధరలపై సుమారు రూ.6లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. 2016లో లాంచ్ చేసిన పోలో జిటిఐ ధర రూ 6 లక్షల మేరకు తగ్గించింది. 2016 లో భారతదేశంలో విడుదల సందర్భంగా దీని ధరను రూ. 25.99 లక్షలతో(ఢిల్లీ ఎక్స్ షోరూం)ప్రారంభించారు. ప్రస్తుత తగ్గింపుతో ఇపుడు రూ .19,99 లక్షల (ఢిల్లీ ఎక్స్ షోరూం) ధరకే లభిస్తుంది.1.9 లీటర్ టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ లో లభ్యంకాన్ను ఈ పోలో జీటీఐ 7.2 సెకన్లలో 0-100 వేగంతో దూసుకుపోగలదు. గరిష్టంగా 250ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థతోపాటు డీఎస్జీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు అనుగుణంగా యూనిట్ 7-స్పీడ్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డబుల్ క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్స్ , ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అండ్ ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి ఇతర ఫీచర్లు దీని సొంతం. -
తగ్గిన ఇన్ ఫ్లో
పెరిగిన ఔట్ ఫ్లో డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. హంద్రీ నీవా కాలువ ద్వారా 715 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 10 రోజుల క్రితం వరకు సుమారు 1050 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేది. హెచ్చెల్సీ ద్వారా టీబీ డ్యాం నుంచి వచ్చే నీటిని నిలిపివేశారు. ఇన్‌ఫ్లో కన్నా ఔట్ ఫ్లో పెరిగింది. ఏపీ జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత , సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60–70 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నెల 22న ధర్మవరం కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నీటిని విడుదల చేస్తే ఔట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది.