Reliance Capital
-
చివరికి వచ్చేసిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు జనవరి చివరికి పూర్తి అవుతుందని హిందుజా గ్రూప్ కంపెనీ ఐఐహెచ్ఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్‌క్యాప్ కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉంది.‘‘రిలయన్స్ క్యాపిటల్‌కు సంబంధించి చాలా వరకు అనుమతులు, పరిష్కార ప్రక్రియలు ముగింపునకు వచ్చాయి. మరికొన్ని ప్రక్రియలు అడ్మినిస్ట్రేటర్, సీవోసీ స్థాయిలో పూర్తి కావాల్సి ఉంది. వచ్చే 4–6 వారాల్లో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నాం’’అని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి. హిందుజా ప్రకటించారు. రూ.9,650 కోట్లకు ఆర్‌క్యాప్ కొనుగోలు బిడ్డింగ్‌లో ఐఐహెచ్ఎల్ విజేతగా నిలవడం తెలిసిందే.ఇందులో రూ.2,750 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చనుండగా, మిగిలిన మొత్తాన్ని రుణాలకు చెల్లించాల్సి ఉంది. దీనికి కట్టుబడి ఉన్నట్టు హిందుజా తెలిపారు. ఇండస్ ఇండ్ బ్రాండ్ ప్రచారం చేయాలని అనుకుంటున్నామని, బ్రాండ్ ప్రచారంపై ఏజెన్సీలు పనిచేస్తున్నట్టు ప్రకటించారు. ఐఐహెచ్ఎల్ మరో సబ్సిడరీ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్‌తో బ్యాంక్ అష్యూరెన్స్ ఒప్పందం కోసం ఆర్‌క్యాప్ చర్చించనున్నట్టు తెలిపారు. -
అనిల్ అంబానీ ఆర్‌క్యాప్ టేకోవర్.. హిందూజాకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) కొనుగోలు రేసులో హిందుజా గ్రూప్‌నకు వెసులుబాటు లభించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) తాజాగా హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)లోని కొంతమంది వాటాదారులు చైనా అధీనంలోని హాంకాంగ్ నివాసితులు కావడంతో డిపీఐఐటీ అనుమతి తప్పనిసరి అయ్యింది. కాగా.. సరిహద్దు(చైనా, బంగ్లాదేశ్ తదితర) దేశాల పౌరులు ఎవరైనా దేశీ సంస్థకు యజమాని అయితే.. స్థానికంగా పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. వెరసి ఆర్‌క్యాప్ కొనుగోలుకి మారిషస్ సంస్థ ఐఐహెచ్ఎల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు దారి ఏర్పాటుకానుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ భారీ ప్లాన్..ఇప్పటికే రూ. 9,861 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్రణాళిక ద్వారా ఐఐహెచ్ఎల్ బిడ్డింగ్‌లో గెలుపొందింది. ఈ ప్రణాళికను 2024 ఫిబ్రవరి 27న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రుణదాతల కమిటీ 99.96 శాతం వోటింగ్‌తో మద్దతు పలికింది. దీనిలో భాగంగా డీపీఐఐటీ తాజాగా అనుమతించింది. -
48 గంటల్లో రూ. 2,750 కోట్లు డిపాజిట్ చేయండి
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) పరిష్కార ప్రణాళికకు సంబంధించి 48 గంటల్లోగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ, రుణదాతల కమిటీకే (సీవోసీ) చెందుతుందని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. రుణాల చెల్లింపులో విఫలమైన ఆర్‌క్యాప్ దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. సంస్థను కొనుగోలు చేసేందుకు దివాలా పరిష్కార ప్రణాళిక కింద రూ. 9,661 కోట్లు ఆఫర్ చేసిన హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్ .. బిడ్డింగ్‌లో విజేతగా నిలి్చంది. ఇందులో రూ. 2,750 కోట్ల మొత్తాన్ని రుణదాతల కమిటీ ఖాతాలోకి డిపాజిట్ చేయాలంటూ జూలై 23న ఐఐహెచ్ఎల్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలుకు గడువు పెంచుతూ ఆదేశాల్లో కొన్ని సవరణలు చేయాలంటూ కంపెనీ కొత్తగా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఎన్సీఎల్టీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో రూ. 7,300 కోట్ల నిధుల సమీకరణ వివరాలను కూడా పర్యవేక్షణ కమిటీకి తెలియజేయాలంటూ సూచించింది. మరోవైపు, ఎన్సీఎల్టీ ఆదేశించినట్లుగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని సీవోసీ ఖాతాల్లో డిపాజిట్ చేయకుండా ఆ మొత్తాన్ని తన సొంత ఖాతాలోనూ, ప్రమోటర్ల ఖాతాలోనూ జమ చేసుకుందని దివాలా పరిష్కార నిపుణుడు ఆరోపించారు. అయితే, ఎస్క్రో ఖాతా వివరాలను సీవోసీ ఇవ్వనందువల్లే అలా చేయాల్సి వచి్చందని ఐఐహెచ్ఎల్ వివరణ ఇచి్చంది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్‌కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్‌కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్‌క్యాప్ షేర్లను ఇండస్‌ఇండ్‌కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్‌లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్‌లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
రిలయన్స్ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు హిందూజా కుటుంబం ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం దాదాపు రూ. 8,200 కోట్లు (1 బిలియన్ డాలర్లు) గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్‌ను సమీకరించిందట. ఒకప్పుడు రూ.93,851 కోట్ల విలువైన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు ప్రయత్నించిన దిగ్గజ కంపెనీల్లో హిందుజాలు ప్రాధాన్యమైన బిడ్డర్ కావడం గమనార్హం. (లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్) తాజాగా ఫరాలోన్ క్యాపిటల్, ఓక్ట్రీ, అరేస్ ఆసియా అండ్ ఆసెర్బెరస్ లాంటి వాటితో హిందుజాలు టచ్‌లో ఉన్నారని మూలాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిలయన్స్ క్యాపిటల్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్ల ద్వారా హిందుజాలు ఫైనాన్సింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని దీనికి సంబంధించి బీమా రెగ్యులేటర్ నుండి అవసరమైన అనుమతికి ఫండింగ్ పార్టనర్లు హిందుజాల నుండి గ్యారెంటీని కోరే అవకాశం ఉందని నివేదించింది. (Google Doodle Pani Puri Game: క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్) స్వాధీనానికి కోర్టు అనుమతి లభించిన తర్వాత మాత్రమే ఫైనాన్సింగ్ చేయనున్నారని, రాబోయే వారాల్లో ఫైనాన్షియర్ల తుది జాబితా మారే అవకాశం ఉందని పేర్కొంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) సమర్పించిన రూ. 9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దివాలా అండ్ దివాలా కోడ్ (IBC) నిబంధనల ప్రకారం ఆమోదించారని హిందూజా గ్రూప్ జూలై 3న తెలిపింది. చెల్లింపు డిఫాల్ట్‌లు , పాలనాపరమైన సమస్యల కారణంగా నవంబర్ 29, 2021న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బోర్డు టేకోవర్ తర్వాత, కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)కి సంబంధించి నాగేశ్వరరావు వైని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. రిలయన్స్ క్యాపిటల్ మొదటి వేలం డిసెంబర్లో జరగ్గా, ఇందులో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 8,640 కోట్ల ఆఫర్‌తో అత్యధిక బిడ్డర్‌గా, హిందుజా గ్రూప్ రూ. 8,110 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ 24 గంటల్లోనే 9,000 కోట్ల రూపాయలతో సవరించిన బిడ్‌ను సమర్పించింది . అయితే టోరెంట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)దీన్ని సవాలు చేసింది. ఇక తదుపరి వేలం ఏప్రిల్ 26న జరిగింది, 9,650 కోట్ల రూపాయలతో ఐఐహెచ్లో మాత్రమే వేలంలో పాల్గొంది. ఈప్లాన్ ఆమోదంకోసం ఈ వారంలోనే ఎన్సీఎల్టీని సంప్రదించనున్నారు.ఈ అంచనాలపై అటు రిలయన్స్ క్యాపిటల్‌గానీ, ఇటు హిందూజా గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు.. నిధుల వేటలో ‘ఇండస్ఇండ్’
ముంబై: ప్రతిపాదిత రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) కొనుగోలు కోసం ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) 1.5 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. అలాగే సంస్థలో వాటాలను ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరణతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు అప రిమితమైన అవకాశాలు లభించగలవని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆర్‌క్యాప్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రుణ పరిష్కార ప్రణాళికలకు చేరిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను భారీగా తగ్గించుకుంది. రూ. 1,488 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,249 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 4,770 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 8,982 కోట్ల నుంచి రూ. 5,949 కోట్లకు దిగివచ్చాయి. 2021 నవంబర్ 29న కంపెనీ దివాలా ప్రక్రియకు చేరిన సంగతి తెలిసిందే. ఇక స్టాండెలోన్ నష్టం భారీగా పెరిగి రూ. 1,389 కోట్లను తాకింది. అంతక్రితం కేవలం రూ. 25 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు తగ్గింది. -
హిందుజా కంపెనీకి రిలయన్స్ క్యాపిటల్!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు రేసులో రూ.9,650 కోట్ల ఆఫర్‌తో హిందుజా గ్రూప్ కంపెనీ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) హైయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. 2022 డిసెంబర్లో తొలిసారిగా జరిగిన వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.8,640 కోట్లు ఆఫర్ చేసింది. రెండవ రౌండ్ వేలంలో టోరెంట్తోపాటు ఓక్ట్రీ పాల్గొనలేదు. రుణదాతల కమిటీ (సీవోసీ) కనీస బిడ్ మొత్తాన్ని తొలి రౌండ్‌కు రూ.9,500 కోట్లు, రెండవ రౌండ్‌కు రూ.10,000 కోట్లుగా నిర్ణయించారు. అన్ని బిడ్స్‌కు కనీసం రూ.8,000 కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీవోసీ షరతు విధించింది. సుప్రీం తీర్పునకు లోబడి.. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడంతో బుధవారం రెండవ రౌండ్ వేలం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కారం విషయంలో సీవోసీ ద్వారా ఏదైనా నిర్ణయం టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్లో సుప్రీం కోర్టు తీర్పు ఫలితానికి లోబడి ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కార ప్రక్రియ మొదటి రౌండ్ వేలం తర్వాత వ్యాజ్యంలో చిక్కుకుంది. మొదటి రౌండ్ వేలం ముగిసిన తరువాత హిందూజా గ్రూప్ సంస్థ బిడ్‌ను సమర్పించింది. 2022 డిసెంబరులో దాఖలు చేసిన రూ.8,110 కోట్ల ఆఫర్‌ను సవరిస్తూ ఐఐహెచ్ఎల్ రూ.9,000 కోట్లతో మరో బిడ్‌ను అందించింది. రుణదాతలు రెండో రౌండ్ వేలం నిర్వహించాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగింది. -
టొరంట్‌కు ఎన్సీఎల్టీ రిలీఫ్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్ విక్రయ అంశాన్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తాజాగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఆర్‌క్యాప్ కొనుగోలుకి హిందుజా గ్రూప్ చివర్లో దాఖలు చేసిన సవరించిన బిడ్‌పై స్టే ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం.. ఆర్‌క్యాప్ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ. 8,640 కోట్ల బిడ్‌తో టొరంట్ గ్రూప్ గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. అయితే తదుపరి హిందుజా గ్రూప్ రూ. 9,000 కోట్లకు సవరించిన బిడ్‌ను డిసెంబర్ 21న ఈవేలం ముగిశాక దాఖలు చేసినట్లు టొరంట్ గ్రూప్ ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. వేలం ముగిసిన తదుపరి రోజు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ తొలి ఆఫర్‌ను రూ. 8,100 కోట్లను తదుపరి రూ. 9,000 కోట్లకు సవరించినట్లు టొరంట్ గ్రూప్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క రిలయన్స్ క్యాప్ రుణదాతలు అటు టొరంట్ గ్రూప్, ఇటు హిందుజా గ్రూప్‌తో రిజల్యూషన్‌పై చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
రుణ సంక్షోభంలో అనిల్ అంబానీ కంపెనీ..ఈవేలానికి రిలయన్స్ క్యాపిటల్ రెడీ
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ విక్రయానికి ఈవేలం నిర్వహించేందుకు విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వేలం విధానాలు, నిబంధనలను రుణదాతలు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఈ నెల 19న ఈవేలం ప్రారంభంకానున్నట్లు తెలియజేశాయి. కాస్మియా పిరమల్ కన్సార్షియం వేసిన రూ. 5,300 కోట్ల బిడ్‌ను వేలానికి ప్రాథమిక ధరగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రౌండ్ 1లో భాగంగా బిడ్డర్లు ఈ ధరకుపైన కోట్ చేయవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఒక ఎన్బీఎఫ్సీ రుణ పరిష్కార ప్రణాళిక కోసం ఈస్థాయిలో ఈవేలాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని తెలియజేశాయి. -
ఆర్‌క్యాప్ లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్లు?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్ల వరకు ఉంటుందని ఇండిపెండెంట్ వాల్యూయర్లు తేల్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా పక్రియ ప్రారంభించే తేదీ నాటికి ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆస్తిపై అప్పులుపోను కొనుగోలుదారుకు అందే తుది విలువ అంచనానే లిక్విడేషన్ విలువ. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతల కమిటీ (సీఓసీ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ వాల్యూయర్లు– డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు ఇచ్చిన లిక్విడేషన్ విలువ వివరాలను రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ సమర్పించారు. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆర్క్యాప్కు డఫ్ అండ్ ఫెల్పŠస్ రూ.12,500 కోట్ల లిక్విడేషన్ విలువ కడితే, ఆర్బీఎస్ఏ విలువ రూ.13,200 కోట్లుగా ఉంది. ► రిలయన్స్ క్యాపిటల్ కోసం నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేశాయి. వీటి బిడ్డింగ్ విలువ తాజా లిక్విడేషన్ అంచనా విలువకంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. ► రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు అందుకున్న అత్యధిక బిడ్ విలువ చూస్తే... కాస్మియా ఫైనాన్షియల్, పిరమల్ గ్రూప్ కన్సార్టియంల ఆఫర్ రూ. 5,231 కోట్లు. ► హిందూజా రూ.5,060 కోట్లకు బిడ్ చేసింది. ► టొరెంట్, ఓక్ట్రీ బిడ్ల పరిమాణం వరుసగా రూ.4,500 కోట్లు, రూ.4,200 కోట్లుగా ఉంది. ► లిక్విడేషన్ విలువ– వాస్తవ బిడ్ విలువల మధ్య ఉన్న భారీ అంతరాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ బిడ్లను సవరించమని సీఓసీ బిడ్డర్లను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపాయి. రిలయన్స్ క్యాప్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ విలువలు ఇలా... రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారం విలువలో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఆ సంస్థ– జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాల లిక్విడేషన్ విలువలు చూస్తే.. డఫ్ అండ్ ఫెల్పŠస్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లిక్విడేషన్ విలువ రూ.7,000 కోట్లు. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.4,000 కోట్లు. ఆర్బీఎస్ఏ విషయంలో ఈ అంచనా వరుసగా రూ.7,500 కోట్లు, రూ.4,300 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతలు.. మొత్తం సంస్థకు అలాగే సంస్థలోని విభిన్న వ్యాపారాలకు వేర్వేరుగా బిడ్డింగ్‌ను పిలవడం జరిగింది. సంస్థ మొత్తం కొనుగోలుకు పైన పేర్కొన్న నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేయగా, సెక్యూరిటీస్, రియల్టీ, ఏఆర్సీలకు మూడు బిడ్లు వచ్చాయి. మూడు బిడ్ల విలువ కేవలం రూ.120 కోట్లుగా ఉంది. అయితే డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు తాజాగా ఇచ్చిన లిక్విడేషన్ విలువలు వరుసగా రూ.280 కోట్లు, రూ.240 కోట్లుగా ఉన్నాయి. కాగా, జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాలకు మాత్రం వేర్వేరుగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు. -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..అనిల్ అంబానీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 215 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,116 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 6,002 కోట్ల నుంచి రూ. 6,047 కోట్లకు పుంజుకుంది. ప్రస్తుత క్యూ2లో రూ. 290 కోట్ల పన్నుకుముందు లాభం ఆర్జించగా.. గత క్యూ2లో రూ. 1,115 కోట్ల నిర్వహణా నష్టం ప్రకటించింది. రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. వై.నాగేశ్వరరావును పాలనాధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 11.22 వద్ద ముగిసింది. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్‌లో వాటాలపై ఆదిత్య బిర్లా గ్రూప్ ఆసక్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్ఎన్ఎల్ఐసీ)లో వాటాల కొనుగోలు కోసం తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా బరిలోకి దిగింది. రిలయన్స్ క్యాపిటల్‌కు (ఆర్సీఎల్) ఉన్న 51 శాతం వాటా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎన్ఎల్ఐసీలో రిలయన్స్ క్యాపిటల్‌కు 51 శాతం, జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి దీన్ని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. భారీగా పేరుకుపోయిన రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతుండటంతో ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రద్దు చేసింది. దివాలా చట్టం కింద చర్యలకు సంబంధించి వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్సీఎల్ విక్రయం కోసం అడ్మినిస్ట్రేటర్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించారు. మొత్తం 14 బిడ్లు వచ్చాయి. పూర్తి కంపెనీని కొనేందుకు ఆరు కంపెనీలు ముందుకు రాగా, ఆర్‌సీఎల్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలను వేర్వేరుగా కొనేందుకు మిగతా వారు బిడ్లు వేశారు. బిడ్డింగ్ గడువు ముగిసే నాటికి ఆర్ఎన్ఎల్ఐసీ కొనుగోలు కోసం ఒక్క బిడ్ కూడా రాలేదు. -
రిలయన్స్ క్యాపిటల్ ప్రణాళికకు డెడ్‌లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్‌ను (ఆర్సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్‌లైన్‌ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది. బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్‌లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్‌పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు. -
తుది దశకు రిలయన్స్ క్యాప్ బిడ్డింగ్
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు రుణపరిష్కార(రిజల్యూషన్) ప్రణాళిక అభ్యర్థన పత్రాల(ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ)పై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో తుది అనుమతి కోసం వచ్చే వారం ఆర్ఎఫ్ఆర్పీని రుణదాతల కమిటీ(సీవోసీ) ముందుంచవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిజల్యూషన్ ప్రణాళిక దాఖలు, విలువ మదింపు తదితర అంశాలలో ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలవనుంది. రిజల్యూషన్ ప్రణాళికను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) కంపెనీలన్నిటికీ అందించనున్నారు. తద్వారా తుది బిడ్స్ దాఖలుకు వీలుంటుంది. బుధవారం సమావేశమైన సీవోసీ ఆర్ఎఫ్ఆర్పీని అనుమతించినట్లు తెలుస్తోంది. తుది అనుమతికి వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కన్సార్షియం క్లస్టర్ బిడ్డర్లు మొత్తం నగదు ప్రాతిపదికన బిడ్ చేయవలసి ఉన్నప్పటికీ ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ ప్రకారం వాయిదా పద్ధతిలో చెల్లింపులకు వీలు కల్పించనున్నట్లు తెలిపాయి. రిలయన్స్ క్యాప్ కార్పొరేట్ దివాలా రిజల్యూషన్ ప్రాసెస్ పూర్తిచేసేందుకు సీవోసీ 3 నెలల గడువును కోరవచ్చని వెల్లడించాయి. -
రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కారంపై భిన్నాభిప్రాయాలు!
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి ఇటు అడ్మినిస్ట్రేటరు, అటు రుణదాతల కమిటీ (సీవోసీ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీనితో తదుపరి తీసుకోవాల్సిన చర్యల విషయంలో జాప్యం జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెడితే రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఆర్‌క్యాప్, దాని వివిధ అనుబంధ సంస్థలను వేలం వేస్తున్నారు. గడువు తేదీ మార్చి 25 నాటికి మొత్తం 54 బిడ్లు వచ్చాయి. ఆర్‌క్యాప్.. దాని 8 అనుబంధ సంస్థలన్నింటినీ ఏకమొత్తంగా ఒకే కంపెనీగా కొనుగోలు చేసేందుకు 22 ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ), ఆర్క్యాప్ను విడిగా.. మిగతా అనుబంధ సంస్థలను వేర్వేరుగా దక్కించుకునేందుకు మిగతా బిడ్లు వచ్చాయి. అయితే వీటిలో కొన్ని సంస్థలు లాభసాటిగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిని టర్నెరౌండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దివాలా చట్టం ప్రకారం ఈ సంస్థలకు సంబంధించి పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సిన అవసరం లేదని అడ్మినిస్ట్రేటర్ భావిస్తున్నాయి. ఇదే అంశంపై సీవోసీ.. దాని న్యాయ సలహాదారులు, అడ్మినిస్ట్రేటరు మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో బిడ్డర్లకు పరిష్కార ప్రణాళిక అభ్యర్ధన (ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ) పత్రం జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని వివరించాయి. -
రిలయన్స్ క్యాపిటల్ రిజల్యూషన్ గడువు పెంపు!
న్యూఢిల్లీ: దివాలా చట్ట(ఐబీసీ) చర్య లలో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు మరింత గడువు లభించే వీలుంది. కంపెనీ రిజల్యూషన్ బిడ్స్‌పై బుధవారం(6న) రుణదాతల కమిటీ(సీవోసీ) చర్చించినట్లు తెలుస్తోంది. ఐబీసీ నిబంధనల ప్రకారం పాలనాధికారి 180 రోజుల్లోగా రిజల్యూషన్‌ను ముగించవలసి ఉంటుంది. అంటే 2022 జూన్3 కల్లా పూర్తికావలసి ఉంది. అయితే మరో 90 రోజులు అదనపు గడువునిచ్చేందుకు సీవోసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వెరసి సెప్టెంబర్ 3వరకూ గడువు లభించే వీలుంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ ఆర్‌క్యాప్ రుణ భారం, చెల్లింపుల వైఫల్యంతో దివాలా చట్ట పరిధికి చేరిన సంగతి తెలిసిందే. కంపెనీ కొనుగోలుకి అదానీ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 సంస్థలు బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. -
రుణ సంక్షోభంలో రిలయన్స్ క్యాపిటల్,కొనుగోలు రేసులో టాటా!
న్యూఢిల్లీ:రుణ సంక్షోభంలో చిక్కుకున్ను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి పలు దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. అదానీ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నియమిత పాలనాధికారి బిడ్స్ దాఖలుకు గడువును ఈ నెల 11 నుంచి 25కు పెంచారు. కాగా.. రేసులో మరికొన్ని కంపెనీలు నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. జాబితాలో యస్ బ్యాంక్, బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ఓక్ట్రీ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితరాలను ప్రస్తావించాయి. చెల్లింపుల వైఫల్యం, పాలనా సంబంధ సమస్యలతో రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దివాలా చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. చదవండి: ఆ రెండు కంపెనీల నుంచి అనిల్ అంబానీ ఔట్ -
అంబానీ ఆస్తులపై అదానీ కన్ను !?
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీని చేజిక్కించుకునేందుకు అదానీ ఫిన్సర్వ్, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితర 14 దిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి వీలుగా బిడ్స్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియమిత పాలనాధికారి ఈ నెల 25వరకూ గడువు పెంచారు. తొలుత ఇందుకు మార్చి 11చివరి తేదీగా ప్రకటించారు. చెల్లింపుల్లో వైఫల్యం, కార్పొరేట్ పాలనా సంబంధ సమస్యల నేపథ్యంలో గతేడాది నవంబర్ 29న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డును రద్దు చేసింది. 2021 సెప్టెంబర్‌లో కంపెనీ నిర్వహించిన ఏజీఎంలో కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 40,000 కోట్లుగా వాటాదారులకు తెలియజేసింది. మూడో పెద్ద కంపెనీ ఇటీవల ఆర్బీఐ దివాలా చట్ట చర్యల(ఐబీసీ)కు ఉపక్రమించిన మూడో పెద్ద నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా రిలయన్స్ క్యాప్ నిలుస్తోంది. ఇప్పటికే ఐబీసీ పరిధిలోకి చేరిన సంస్థల జాబితాలో శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) చేరిన విషయం విదితమే. కాగా.. రిలయన్స్ క్యాప్ కొనుగోలు పట్ల ఆసక్తి కలిగిన కంపెనీలు బిడ్స్ దాఖలుకు మరింత గడువును కోరడంతో పాలనాధికారి తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రేసులో ఇప్పటికే ఆర్ప్ వుడ్, వర్దే పార్టనర్స్, మల్టిపుల్స్ ఫండ్, నిప్పన్ లైఫ్, జేసీ ఫ్లవర్స్, బ్రూక్‌ఫీల్డ్, ఓక్ట్రీ, అపోలో గ్లోబల్, బ్లాక్‌స్టోన్, హీరో ఫిన్‌కార్స్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో చాలవరకూ కంపెనీ పూర్తి కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. కొనుగోలుదారులకు రెండు అవకాశాలు కొనుగోలుదారులకు రెండు అవకాశాలున్నాయి. కంపెనీకున్న 8 అనుబంధ సంస్థల కోసం లేదా మొత్తం రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు ఈవోఐలు దాఖలు చేయవచ్చు. అనుబంధ సంస్థల జాబితాలలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ తదితరాలున్నాయి. దివాలా చర్యలలో భాగంగా వై.నాగేశ్వరరావును ఆర్బీఐ పాలనాధికారిగా నియమించింది. -
అయ్యో అనిల్ అంబానీ! నీకే ఎందుకిలా ?
న్యూఢిల్లీ: వ్యాపారం దిగ్గజం ధీరుబాయి అంబానీ రెండో కుమారుడు అనిల్ అంబానీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనిల్ ఆధీనంలోని కంపెనీలు వరుసగా నష్టాలు ఎదుర్కొంటూ దివాలా దశకు చేరుకున్నాయి. తాజాగా ప్రకటించిన క్యూ 3 ఫలితాల్లోనూ ఎటువంటి మార్పు కనిపించలేదు. క్యూ 3 ఫలితాలు దివాలా చట్ట చర్యలకు లోనైన రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మరోసారి నికర నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,759 కోట్ల నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,966 కోట్ల నష్టాలు నమోదుకాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ రూ. 1,156 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,890 కోట్ల నుంచి రూ. 4,083 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 5,658 కోట్లను తాకాయి. 2021 నవంబర్‌లో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. సలహా కమిటీ కంపెనీ పాలనాధికారిగా వై.నాగేశ్వరరావును నియమించడంతోపాటు బాధ్యతల నిర్వహణలో మద్దతిచ్చేందుకు ముగ్గురు సభ్యులతో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. రుణదాతలు, డిబెంచర్ హోల్డర్లకు చెల్లింపుల విషయంలో కంపెనీ విఫలంకావడంతో దివాలా చర్యలవైపు ప్రయాణించింది. క్యూ 3 ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 15.90 వద్ద ముగిసింది. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ నిర్వాకం.. ఈపీఎఫ్‌వోకి రూ.3,000 కోట్ల నష్టం? -
రిలయన్స్ క్యాపిటల్ నిర్వాకం.. ఈపీఎఫ్‌వోకి రూ.3,000 కోట్ల నష్టం?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా అండ్ బ్యాంక్రప్టసీ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కోరింది. రిలయన్స్ క్యాపిటల్ బాండ్లలో ఈపీఎఫ్‌వో రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై 2019 అక్టోబర్ నుంచి చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమవుతూ వచ్చినట్టు వివరించారు. ఈపీఎఫ్‌వోకు అసలు పెట్టుబడి, వడ్డీ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమైందా? అంటూ ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ జా అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2021 నవంబర్ 30 నాటికి ఎన్‌సీడీలపై రిలయన్స్ క్యాపిటల్ రూ.534 కోట్ల వడ్డీని చెల్లించడంలో వైఫల్యం చెందినట్టు చెప్పారు. అసలు వడ్డీతో కలిసి సుమారు రూ.3,000 కోట్లు ఈపీఎఫ్‌వో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ ఆర్బీఐ ఇటీవలే ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తెలిసిందే. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ! -
Anil Ambani: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ!
ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్‌పై ఐబీసీ కింద దివాలా చర్యలు ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్), ముంబై బెంచ్ అనుమతించింది. కంపెనీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని గత వారం ఆర్బీఐ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని అడ్మిట్ చేస్తూ, ప్రదీప్ నరహరి, దేశ్‌ముఖ్, కపిల్ కుమార్ వాద్రాలతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ సోమవారం సాయంత్రం రూలింగ్ ఇచ్చింది. పాలనా సంబంధ అంశాల్లో డిఫాల్ట్ అయ్యిందని పేర్కొంటూ అనిల్ అంబానీ ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్‌ను నవంబర్ 29న సెంట్రల్ బ్యాంక్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై. నాగేశ్వరరావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా నియమించింది. పూర్తి సహకారం: రిలయన్స్ క్యాపిటల్ ఇదిలాఉండగా, కంపెనీ ప్రమోటర్లు ఒక ప్రకటన చేస్తూ, 227 సెక్షన్ కింద ఎన్సీఎల్టీలో ఆర్బీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. రుణదాతలు, కస్టమర్లు, ఉద్యోగులు, షేర్హోల్డర్లతో సహా తన వాటాదారులందరి పూర్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఐబీసీ ప్రక్రియ ద్వారా వేగవంతమైన దివాలా పరిష్కార పక్రియకోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రకటన తెలిపింది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, సంబంధిత వర్గాలను సంప్రదించి ఒక కంపెనీని దివాలా– లిక్విడేషన్ ప్రొసీడింగ్ల కింద కేంద్రం నోటిఫై చేయడానికి దివాలా కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 227 వీలుకల్పిస్తుంది. రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలకు దాదాపు రూ.19,805 కోట్ల బకాయి ఉంది. వీటిలో మెజారిటీ నిధిని ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా కింద జారీ చేసిన బాండ్ల ద్వారా సమీకరించడం జరిగింది. ఆర్బీఐ ‘ఐబీసీ’ పిటిషన్‌ను ఎదుర్కొంటున్న మూడవ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ దివాలా కోడ్ కింద ఇటీవల ఆర్బీఐ పిటిషన్ దాఖలు చేసిన మూడవ అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ). ఇంతక్రితం శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్)లపై ఈ తరహా పిటిషన్లను ఆర్బీఐ దాఖలు చేసింది. రిలయన్స్ క్యాపిటల్‌పై దాదాపు రూ.40,000 కోట్ల రుణం భారం ఉన్నట్లు రిలయన్స్ క్యాపిటల్ తన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ప్రకటించింది. రెండవ త్రైమాసికంలో రూ.1,156 కోట్ల నష్టాలను ప్రకటించింది. 2020–21లో కంపెనీ రూ.19,308 కోట్ల ఆదాయంపై రూ.9,287 కోట్ల నష్టాన్ని పోస్ట్ చేసింది. చదవండి :Reliance Capital: అనిల్ అంబానికి షాక్ ! -
అనిల్ అంబానికి షాక్ ! త్వరలో రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియ ప్రారంభం
ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. బకాయిల ఎగవేతలు, తీవ్రమైన గవర్నెన్స్ సమస్యల నేపథ్యంలో త్వరలోనే కంపెనీ దివాలా ప్రక్రియ చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఈడీ నాగేశ్వర రావును సంస్థ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించినట్లు వివరించింది. మరోవైపు, దివాలా చట్టం కింద రుణ సమస్యను పరిష్కరించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్‌క్యాప్ తెలిపింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌క్యాప్ రుణభారం సెప్టెంబర్ ఆఖరు నాటికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 40,000 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ రూ. 6,001 కోట్ల ఆదాయంపైరూ.1,156 కోట్ల నష్టం ప్రకటించింది. చదవండి: నష్టాల్లో కూరుకుపోయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ -
అనిల్ అంబానీ, సగానికి తగ్గనున్న రుణ భారం
ముంబై: రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికలు విజయవంతమైతే రిలయన్స్ క్యాపిటల్ రుణ భారం సగానికి(50 శాతం) తగ్గే వీలున్నట్లు కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీ తాజాగా పేర్కొన్నారు. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్(ఆర్సీఎఫ్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్(ఆర్హెచ్ఎఫ్)ల రిజల్యూషన్ పూర్తయితే రిలయన్స్ క్యాపిటల్ కన్సాలిడేటెడ్ రుణాల్లో రూ. 20,000 కోట్లమేర కోత పడనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మొదట్లో ఆర్సీఎఫ్, ఆర్‌హెచ్‌ఎఫ్‌ల కొనుగోలుకి ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దాఖలు చేసిన బిడ్‌ను రుణదాతలు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటైన ఐసీఏలో భాగంగా రుణదాతలు రిజల్యూషన్ ప్రణాళికను అనుమతించారు. మెజారిటీ వాటాలు రిలయన్స్ క్యాపిటల్‌కు ఆర్సీఎఫ్లో 100 శాతం, ఆర్‌హెచ్‌ఎఫ్‌లో మెజారీటీ వాటా ఉంది. రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత రుణ భారం రూ. 40,000 కోట్లుగా నమోదైంది. ఆర్సీఎఫ్, ఆర్‌హెచ్‌ఎఫ్‌లకు రూ. 20,000 కోట్ల రుణాలున్నట్లు అంబానీ పేర్కొన్నారు. దీంతో ఈమేర రుణ భారం తగ్గే వీలున్నట్లు కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సందర్భంగా అనిల్ అంబానీ ఈ వివరాలు వెల్లడించారు. రిజల్యూషన్ తదుపరి రిలయన్స్ క్యాపిటల్‌కు ఎన్సీడీల ద్వారా రూ. 15,000 కోట్లు, అన్సెక్యూర్డ్, గ్యారంటీడ్ ద్వారా రూ. 5,000 కోట్లు చొప్పున రుణ భారం మిగలనున్నట్లు వివరించారు. ఆర్సీఎఫ్ కోసం రూ. 2,200 కోట్లు, ఆర్‌హెచ్‌ఎఫ్‌కు రూ. 2,900 కోట్లు చొప్పున ఆథమ్ చెల్లించనున్నట్లు తెలియజేశారు. ఈ రెండు కంపెనీల ఉద్యోగులందరినీ కొనసాగించేందుకు ఆథమ్ కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 5% జంప్‌చేసి రూ. 19.70 వద్ద ముగిసింది. ఏజీఎంలో చైర్మన్ అనిల్ అంబానీ వెల్లడి రిలయన్స్ ఇన్ఫ్రా (ఆర్ఇన్ఫ్రా)కు అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నుంచి తమకు రూ. 7,100 కోట్లు వస్తాయని కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. ఈ నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని, తద్వారా ఆర్ఇన్ఫ్రా రుణరహిత సంస్థగా మారగలదని వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఇన్‌ఫ్రాలో భాగమైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్).. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్‌ను నిర్వహించేది. కాంట్రాక్టు నిబంధనలను డీఎంఆర్సీ ఉల్లంఘించిందన్న ఆరోపణలపై డీఏఎంఈపీఎల్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీనికి సంబంధించి డీఏఎంఈపీఎల్‌కు రావాల్సిన పరిహారం విషయంలో కంపెనీకి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టాటా కెమికల్స్- ఆర్‌క్యాపిటల్ జోరు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు వ్యాక్సిన్లు, క్యూ2లో జీడీపీ పురోగతి నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సరికొత్త గరిష్టాల రికార్డులతో ప్రారంభమై హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా డైవర్సిఫైడ్ కంపెనీ టాటా కెమికల్స్, ఫైనాన్షియల్ రంగ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కెమికల్స్ గ్రూప్ కంపెనీ టాటా కెమికల్స్‌లో ప్రమోటర్లు టాటా సన్స్ తాజాగా వాటాను పెంచుకున్నారు. ఓపెన్ మార్కెట్ ద్వారా 1.8 మిలియన్ టాటా కెమికల్స్ షేర్లను టాటా సన్స్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీ 0.71 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 420.92 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 76 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో టాటా కెమికల్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 465కు చేరింది. ప్రస్తుతం 6.7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 42 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! రిలయన్స్ క్యాపిటల్ అనిల్ అంబానీ గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు విదేశీ పీఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు సైతం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రుణ చెల్లింపులలో విఫలంకావడం ద్వారా రుణ పరిష్కార(రిజల్యూషన్) స్థితికి చేరిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి బ్లాక్‌స్టోన్ గ్రూప్, ఓక్టీ క్యాపిటల్, కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, జేసీ ఫ్లవర్ తదితర పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈవోఐను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయానికి(మానిటైజేషన్) డిబెంచర్ హోల్డర్స్ కమిటీతోపాటు.. డిబెంచర్ ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. వీటికి కంపెనీ రుణాలలో 93 శాతం వరకూ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 9.50 వద్ద ఫ్రీజయ్యింది.