Road map
-
వైద్య రంగం బలోపేతానికి రూ. 4,944 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా సామాన్యులకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలోకి తేవాలని యోచిస్తోంది. దీనికోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసింది. ప్రభుత్వంలో డయాగ్నొస్టిక్ సెంటర్లు మొదలు... మానవ వనరుల అభివృద్ధి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల వరకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రూ.4,944 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై దృష్టిసారించింది. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లు, కొత్త ఉస్మానియా, టిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాలు, ఆరోగ్య కార్డులు, పీఎంయూలు, కేన్సర్ కేర్‌లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.డయాగ్నొస్టిక్ సేవలకే అత్యధికంటి–డయాగ్నొస్టిక్ సేవల బలోపేతానికి వైద్య ఆరోగ్యశాఖ అత్యధికంగా రూ. 1,044 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులోభాగంగా మరో 60 మినీ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హబ్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.600 కోట్లు కేటాయించనుంది. అలాగే ప్రతీ బోధనాసుపత్రిలో ఒక ఎంఆర్ఐ ఏర్పాటుకు మొత్తం రూ.444 కోట్లు ఖర్చు చేయనుంది. రెండో ప్రాధాన్యంగా ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్లపై దృష్టిసారించింది. అందుకోసం రూ. 921 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో కొత్తగా 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 35 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు సహా నిమ్స్ పరిధిలో ఇవి ఏర్పాటు కానున్నాయి.పరికరాలకు రూ.750 కోట్లుటిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాల కోసం రూ.750 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టిమ్స్‌లు, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తారు. సనత్‌నగర్ టిమ్స్‌లో రూ.50 కోట్లతో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే గచ్చిబౌలి టిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 35 జీజీహెచ్ ఆసుపత్రుల్లో ఒక్కోచోట రూ.350 కోట్లతో 30 పడకలతో డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లను నెలకొల్పుతారు.మరికొన్ని నిర్ణయాలు...⇒ కొత్తగా 108 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 54 కోట్లు⇒ ఆరోగ్య మహిళ కార్యక్రమం సహా ఎంసీహెచ్ సేవలను బలోపేతం చేస్తారు. ప్రస్తుతం 376 కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాలు జరుగుతుండగా, వాటిని వెయ్యికి పెంచుతారు. అందుకోసం రూ.300 కోట్లు ఖర్చుచేస్తారు. రూ. 10 కోట్ల వ్యయంతో 10 నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న 44 యూనిట్లను ఆధునీకరిస్తారు. ⇒ నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో రూ. 11 కోట్లతో కొత్తగా ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటు. ⇒ 35 జీజీహెచ్‌ల్లో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు. ఒక్కో సెంటర్‌కు రూ. 1.37 కోట్ల చొప్పున రూ. 49 కోట్లు.⇒ 35 బోధనాసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేర్ ట్రైనింగ్ కోసం సిములేషన్ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సెంటర్‌కు రూ.7 కోట్ల చొప్పున రూ. 245 కోట్లు కేటాయిస్తారు. ⇒ ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కోసం రూ.510 కోట్లు కేటాయిస్తారు. అందులో 10 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.180 కోట్లు, 10 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.70 కోట్లు, 10 వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.160 కోట్లు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఆధునీకరణ కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తారు. ⇒ హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులు సహా నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌లలో ఆర్గాన్ రిట్రీవల్ అండ్ స్టోరేజ్ సెంటర్ల కోసం రూ.30 కోట్లు కేటాయిస్తారు. ⇒ కోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లను రూ.79 కోట్లతో నెలకొల్పుతారు. ⇒ కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుకు రూ. 250 కోట్లు ఖర్చు చేస్తారు. ⇒ రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ కార్డులు, ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ల కోసం రూ.180 కోట్లు వ్యయం చేస్తారు. ⇒ రూ. 165 కోట్లతో డీ సెంట్రలైజ్డ్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. -
తొలి వంద రోజులకు, వచ్చే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్‌తోపాటు రాబోయే ఐదేళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించాలని మంత్రివర్గ సహచరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మోదీ అధ్యక్షతన ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్, ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను సమర్థంగా ఎలా అమలు చేయాలన్నదానిపై నిపుణులతో, సంబంధిత శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరిగే తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కేంద్ర కేబినెట్ ప్రారంభించింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రివర్గం పంపించింది. రాష్ట్రపతి ఆమోదంతో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 20న వెలువడనుంది. నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతుంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వేర్వేరు తేదీల్లో ఏడు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. -
ధరణి రోడ్‌మ్యాప్ కోసం కలెక్టర్లతో భేటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణంలో భాగంగా రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావాలని ధరణి కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలోగానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోగానీ ఐదు జిల్లాల కలెక్టర్లతో ఈ భేటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఐదుగురు జిల్లా కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి లేఖ రాసింది. సోమవారం ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్‌లతోపాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి తదితరులు సీసీఎల్ఏ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ధరణి వర్క్‌ఫ్లో గురించి చర్చించారు. పోర్టల్‌కు వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కార క్రమంలో తీసుకుంటున్న చర్యల గురించి సీసీఎల్ఏ యంత్రాంగం కమిటీ సభ్యులకు వివరించింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ల అనుభవాలను, దరఖాస్తులు పరిష్కరిస్తున్న తీరు, నిజామాబాద్ భూభారతి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లతో సమావేశం కావాలని, ఆ తర్వాత రోడ్‌మ్యాప్‌కు ఓ రూపం ఇవ్వాలని తీర్మానించింది. త్వరలో మధ్యంతర నివేదికలు ధరణిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సమయం పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ప్రజలకు అవసరమైన అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఆయా అంశాలపై త్వరలోనే మధ్యంతర నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక భూములకు సంబంధించిన డేటా కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ శాఖల వద్ద ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించి.. ఈ మూడింటి డేటాను క్రోడీకరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా సీపీఐతోపాటు పలు పౌరసంఘాల ప్రతినిధులతో కూడా చర్చించారు. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విదేశీ కంపెనీని మారుస్తాం: కోదండరెడ్డి సీసీఎల్ఏ కార్యాలయంలో కమిటీ భేటీ అనంతరం కోదండరెడ్డి, సునీల్‌కుమార్, రేమండ్ పీటర్ మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ కారణంగా లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే తమకు వేలాది ఫిర్యాదులు అందాయని కోదండరెడ్డి చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహణను ఓ విదేశీ కంపెనీకి ఇవ్వడం పొరపాటని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించారని.. అయితే ఈ పోర్టల్ నిర్వహణను వేరే కంపెనీకి అప్పగించాలా? కేంద్ర పరిధిలోని సంస్థకు అప్పగించాలా అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తమ కమిటీ ప్రతి అంశాన్ని పరిశీలిస్తుందని, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్, ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్ భూములన్నింటిపై అధ్యయనం చేస్తుందని వివరించారు. కాగా.. వ్యవసాయ, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా మెరుగైన భూపరిపాలన అందించేందుకు అవసరమైన మార్పులను మాత్రమే తమ కమిటీ సూచిస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి మార్పులు సూచిస్తాం: సునీల్ ధరణి కమిటీ సమస్యలను పరిష్కరించేది కాదని, సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్పులు, చేర్పులు, సలహాలు అందిస్తుందని కమిటీ సభ్యుడు, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ చెప్పారు. ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల మూలాలను పరిశీలిస్తున్నామని, ఆర్వోఆర్ చట్టం–2020లో మార్పులు అవసరమా కాదా అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. -
ఎన్నికల కమిటీ చైర్మన్‌గా కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారుపై బీజేపీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కచ్చి తంగా పది గెలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆది, సోమవారాల్లో నిర్వహిస్తున్న కీలక సన్నాహక సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. ఎన్నికల కసరత్తు నిమిత్తం 10 కమిటీలను నియమించనుండగా, రాష్ట్ర పార్టీ ఆ మేరకు ప్రతిపాదనలను ఇప్పటికే జాతీయ నాయకత్వానికి పంపించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీల నియామకానికి ఢిల్లీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికల కమిటీ ఇక రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా జి.కిషన్‌రెడ్డి నియమితులు కాగా, సభ్యులుగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జీలు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్, డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా మొత్తం 13 మందిని నియమించినట్టు సమాచారం. శ్రీరామ మందిర్ దర్శన్ అభియాన్ కమిటీ సమన్వయకర్తగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఇన్చార్జిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వికసిత్ భారత్ సంకల్పయాత్ర కమిటీతో పాటు కొత్త ఓటర్లతో సమ్మేళన కమిటీకు కార్యదర్శిగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల కమిటీకి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా.ఎస్.ప్రకాష్‌రెడ్డి, హర్గావ్ జానా (ప్రతీ గ్రామాన్ని సందర్శించే)కమిటీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించినట్టు తెలుస్తోంది. చేరికల కమిటీలో ఆ ముగ్గురూ! పార్టీ చేరికల కమిటీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ పొంగులేటి సుధాకరరెడ్డి సభ్యులుగా నియమితులైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల చైర్మన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే కమిటీ చైర్మన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని (అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన త్రిపుర గవర్నర్‌గా నియామకం) నియమించగా ఆ బాధ్యతల నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈటలకు బాధ్యతలు అప్పగించగా, ఇప్పుడు ముగ్గురితో కలిసి చేరికల కమిటీని నియమించినట్టు పార్టీ నాయకుల సమాచారం. టార్గెట్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేంద్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర పరిమితం కాబోతోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి పెద్దగా సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు లేనందున కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ మేరకు ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా!
దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలుపుతూ రాబోయే సంవత్సరంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కానుంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. ఈ రహదారి ఏర్పాటుతో బీహార్ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. ఈ వారణాసి-రాంచీ-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏడు ప్యాకేజీలుగా నిర్మాణం కానుంది. దీనిలోని ఐదు ప్యాకేజీలలో బీహార్‌లోని పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ.28,500 కోట్లు. ఇది 610 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఇది నాలుగు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. దీనిలో 159 కిలోమీటర్ల పొడవైన మార్గం బీహార్ మీదుగా వెళుతుంది. ఈ ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే కోసం బీహార్‌లో 136.7 కిలోమీటర్ల మేరకు అవసరమైన భూమిని గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంతో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. నాలుగు, ఐదు ప్యాకేజీల డీపీఆర్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారణాసి రింగ్ రోడ్‌లోని చందౌలీలో ఉన్న బర్హులి గ్రామం నుండి ఎక్స్‌ప్రెస్‌వే రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ రహదారి బీహార్‌లోకి ప్రవేశించిన తర్వాత కైమూర్, రోహతాస్, ఔరంగాబాద్, గయ జిల్లాల మీదుగా వెళుతుంది. బీహార్‌లోని నాలుగు జిల్లాలను దాటి జార్ఖండ్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఐదు జిల్లాల గుండా వెళుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నాలుగు జిల్లాల మీదుగా జాతీయ రహదారి- 19కి అనుసంధానమవుతుంది. జార్ఖండ్‌లో ఈ రహదారి పొడవు 187 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్లో గరిష్టంగా 242 కిలోమీటర్లు. మొదటి ప్యాకేజీలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రారంభమై బీహార్‌లోని కొన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతూ ముగుస్తుంది. రెండో ప్యాకేజీలో రహదారి నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నుండి ప్రారంభంకానుంది. ఇది ఇక్కడి చందౌలీలో ఉన్న బర్హులీ గ్రామం మీదుగా బీహార్‌లోకి ప్రవేశిస్తుంది. తరువాత ఔరంగాబాద్, గయా జిల్లాల మీదుగా జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఛత్రా, హజీరాబాగ్, రామ్‌ఘర్, పీటర్‌బార్, బొకారో మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పురూలియా, బంకురా, ఆరంబాగ్ మీదుగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉలుబెరియా వద్ద జాతీయ రహదారి 19 వద్ద ముగుస్తుంది. ఇది కూడా చదవండి: ‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన! -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
9న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఈ నెల 9న ఢిల్లీలో భేటీ కానుంది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు కులగణన, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో చిక్కులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణ సహా మధ్యప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అధికారం కాపాడుకోవడం లక్ష్యంగా సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. -
ధైర్యంగా ముందుకెళదాం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ సభలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారింది..బీజేపీకి అనుకూలంగా టోన్సెట్ చేయడంతోపాటు జఠిలమైన పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ, కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా వంటి విషయంలో పరిష్కారాలు చూపినందున ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీశ్రేణులకు బీజేపీ నేతలు పిలుపునిచ్చినట్టు సమాచారం. గురువారం పార్టీ కార్యాలయంలో రాష్ట్రపదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌ల సమావేశం జరిగింది. అసెంబీ ఎన్నికల నేప థ్యంలో పార్టీపరంగా చేపట్టాల్సిన ప్రచార కార్యక్ర మాలు, షెడ్యూల్ మొదలు ప్రచారపర్వం ముగిసే దాకా 30.40 సభల్లో ప్రధాని మోదీ, అమిత్‌షా, ఇతరనేతలు పాల్గొనడం, తదితర అంశాలపై చేపట్టాల్సిన రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించారు. సిద్ధాంతమే ముఖ్యం ఎవరికోసమే వాటిని మార్చుకోం ‘బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టండి. ఇది కేవలం పార్టీని బలహీనపరిచేందుకు పనిగట్టుకొని విపక్షాలు చేస్తున్న దు్రష్పచారంలో భాగమే. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ ఇటీవల మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభలలో కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టం చేశారు. బీజేపీకి ఎవరితోనూ పొత్తు, అవగాహన వంటివి ఉండవు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే మన ఏకైక లక్ష్యం. దీనిని సాధించేందుకు మీరంతా కృషి చేయండి. ఇక్కడ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుంది. అధికారంలోకి వస్తుంది’అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్.సంతోష్ పేర్కొన్నట్టు సమాచారం. మనకు ప్రధాని మోదీ ట్రంప్ కార్డు ‘మనకు ప్రధాని మోదీ ఒక ట్రంప్ కార్డు. కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇది పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యసాధన మార్గంలో అందరూ కలిసికట్టుగా పనిచేయండి అని రాష్ట్రపార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఎన్నికల సహఇన్చార్జ్ సునీల్ బన్సల్ 18 పాయింట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టాలని చెప్పినట్టు సమాచారం. ప్రచార కార్యక్రమాలు,బహిరంగసభలపై జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ వివరించినట్టు తెలిసింది. -
విపక్షాలకు విజన్ లేదు, రోడ్‌మ్యాప్ లేదు
జైపూర్/గ్వాలియర్: దేశ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలకు ఒక విజన్ లేదని, రోడ్‌మ్యాప్ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. రాజస్తాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓటమిని ముందే అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయొద్దని, ఎప్పటిలాగే కొనసాగించాలని, ఆ మేరకు గ్యారంటీ ఇవ్వాలని గహ్లోత్ ఇటీవల కోరారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్న సంగతి గహ్లోత్‌కు తెలిసిపోయిందని అన్నారు. మోదీ రాజస్తాన్‌లో రూ.7,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శాన్‌వాలియా శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తోర్‌గఢ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు మేలు చేకూర్చే ఏ పథకాన్నీ తాము రద్దు చేయబోమని, పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని తేలి్చచెప్పారు. భారత్ విజయాలను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి ప్రతిపక్షాలు అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఒక విజన్ గానీ, రోడ్‌మ్యాప్ గానీ లేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. మోదీ మధ్యప్రదేశ్‌లో రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. గ్వాలియర్‌లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయని, ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలకు కేవలం అధికారం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. -
ప్రజా సమస్యలతోనే ముందుకెళ్లాలి
సాక్షి, హైదరాబాద్: సమస్యలే ఏజెండాగా ముందుకు వెళితేనే ప్రజలు ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, తీర్మానాలు చేసి కూర్చుంటే ఫలితం రాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీడబ్లు్యసీ సభ్యులను ఉద్దేశించి ఆయన శనివారం రాత్రి మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాలు ఏ విధంగా అణచివేతకు గురవుతున్నారో వారి సమస్యలను తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కేడర్ బేస్డ్ అన్న ఆలోచనతోనే ఉంటే కష్టమని, ప్రజామూవ్మెంట్తోనే వెళ్లాలని చెప్పారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా బీజేపీ విద్వేష రాజకీయాలను స్పష్టంగా చెప్పగలిగామని, విద్వేషంతో దేశాన్ని ఎలా ప్రమాదంలోకి నెడుతున్నారన్న అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారు ఆదరించారని రాహుల్‌గాంధీ తన అనుభవాలను వివరించారు. కర్ణాటక ఎన్నికలకు ఆరు నెలలుపాటు తీవ్రంగా శ్రమించినట్టు తెలిపారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకున్నదని, ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, అధికారంలోకి వస్తే ఏఏ వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తామో స్పష్టం చేయడం, నాయకులు సమష్టిగా పనిచేయడం వల్ల విజయం సాధ్యమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని, అయితే విజయం సాధించడమే కాక, దేశానికి ఏం చేయాలన్న అంశంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుందామని ఆయన సూచించారు. -
‘ఇండియా’ భేటీ ప్రారంభం
ముంబై: దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు స్పష్టం చేశారు. కూటమి సమావేశం గురువారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభమైంది. కూటమిలోని వివిధ పారీ్టల అగ్రనేతలు హాజరయ్యారు. తొలిరోజు సాధారణ సమావేశమే జరిగింది. రెండో రోజు నాటి అజెండాపై చర్చించారు. అనంతరం కూటమి నాయకులకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్) పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే విందు ఇచ్చారు. కీలక సమావేశం శుక్రవారం జరుగనుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మొదటి రోజు భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రా్రïÙ్టయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు. దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని వెంటనే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సీట్ల పంపకంపై తేల్చాలని ఆప్ డిమాండ్ చేసినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. -
విపక్షాల మేధోమథనం: యాంటీ భేటీ.. ఫ్రెండ్స్ పోటీ
జాతీయ రాజకీయాల తీరుతెన్నులను నిర్ణాయక మలుపు తిప్పగల కీలక పరిణామాలు మంగళవారం చోటు చేసుకోనున్నాయి. అటు బెంగళూరులో కాంగ్రెస్ చొరవతో సోమవారం మొదలైన 26 విపక్షాల కీలక సమావేశం మంగళవారం పూర్తిస్థాయిలో జరగనుంది. ఇటు అందుకు దీటుగా బీజేపీ సారథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి ఏకంగా 38 పార్టీలతో హస్తినలో పోటీ భేటీ తలపెట్టింది. ఇరు పక్షాల నుంచీ ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సోనియా, రాహుల్, ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు నితీశ్ సహా పలు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు... ఇలా మొత్తం 26 విపక్ష పార్టీల అధినేతలు సోమవారమే బెంగళూరు చేరారు. మంగళవారం చర్చించాల్సిన అంశాలపై సాయంత్రం నుంచి రాత్రి విందు భోజనం దాకా సుదీర్ఘ మంతనాల్లో మునిగి తేలారు. మరోవైపు బీజేపీ కూడా ఎల్జేపీ (పాశ్వాన్)ని సోమవారం ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం ద్వారా విపక్షాల సవాలుకు దీటుగా స్పందించింది. మంగళవారం జరిగే ఎన్డీఏ పూర్తిస్థాయి భేటీలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి కొత్త మిత్రులతో కలిపి ఏకంగా 38 పార్టీలు పాల్గొంటాయని కూడా బీజేపీ వర్గాలు వెల్లడించాయి! హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగనున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్ర సమరానికి ఈ భేటీలను వైరి కూటముల తొలి సన్నాహకంగా పరిశీలకులు భావిస్తున్నారు. బెంగళూరు: 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు కొంతకాలంగా చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తలపెట్టిన రెండు రోజుల సమావేశాలు సోమవారం బెంగళూరులో మొదలయ్యాయి. కాంగ్రెస్ సహా 26 విపక్ష పార్టీల అధినేతలు, అగ్ర నేతలు సాయంత్రానికల్లా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా చర్చోపచర్చల్లో మునిగి తేలారు. బీజేపీని నిలువరించడమే ఏకైక అజెండాగా ఉమ్మడి కార్యాచరణకు రూపమిచ్చేందుకు మంగళవారం రోజంతా కీలక మేధోమథనం జరపనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా సారథ్యంలో కొత్త కూటమి ఆవిర్భావం జరగవచ్చని తెలుస్తోంది. సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్ (జేడీ–యూ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకే స్టాలిన్ (డీఎంకే), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్, జేఎంఎం నేత హేమంత్ సొరేన్, అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జయంత్చదరి (ఆరెల్డీ), వైకో (ఎండీఎంకే) తదితరులు సోమవారం సమావేశంలో పాల్గొన్నారు. బెంగళూరు నగరమంతటా ఎటు చూసినా ‘కలుద్దాం, నిలుద్దాం’ నినాదంతో విపక్ష కూటమి నేతలందరి ఫొటోలతో కూడిన భారీ బ్యానర్లే కని్పంచాయి. ఇక కాంగ్రెస్‌తో చిరకాలంగా ఉప్పూనిప్పుగా ఉన్న మమత విందు భేటీలో సోనియా పక్కనే కూర్చోవడం ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ సందర్భంగా వారిరువురూ 20 నిమిషాల పాటు చర్చలు కూడా జరిపారు. పార్టీలో చీలికతో సతమతమవుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కుమార్తె సుప్రియా సులేతో పాటు ఆయన చర్చల్లో పాల్గొంటారని విపక్ష వర్గాలు తెలిపాయి. విపక్షాలతో తలపడేందుకు తానొక్కన్నే చాలని గొప్పలకు పోయిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు 30కి పైగా పార్టీలతో జట్టు కట్టేందుకు ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. జేడీ(ఎస్)తో పాటు బీజేపీ ఓటమి కోరే భావ సారూప్య పార్టీలన్నింటికీ కూటమిలోకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు. సయోధ్య ఏ మేరకు సాధ్యం? అయితే పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు–తృణమూల్ సహా పలు రాష్ట్రాల్లో విపక్షాల మధ్యే సహజ వైరం నెలకొని ఉన్న నేపథ్యంలో వాటి మధ్య సయోధ్య ఏ మేరకు సాధ్యమవుతుంన్నది ఆసక్తికరం. తృణమూల్‌తో బెంగాల్లో ఎలాంటి పొత్తూ ఉండబోదని సమావేశ వేదిక వద్దే సీపీఎం ప్రధాన కార్యదర్శి కుండబద్దలు కొట్టారు. అయితే, విపక్షాల ఓటు బ్యాంకులో చీలికను నివారించేందుకు కలిసి పని చేస్తామంటూ ముక్తాయించారు. భేటీలో పాల్గొంటున్న పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఎస్పీ, జేడీ(యూ), ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్, ఫార్వర్డ్ బ్లాక్, అప్నాదళ్, మణిథనేయ మక్కల్ కచ్చి (ఎంఎంకే) సహా మొత్తం 26 పార్టీలు. వీటన్నింటికీ కలిపి లోక్‌సభలో 150 మంది దాకా ఎంపీల బలముంది! కూటమి కన్వీనర్‌గా నితీశ్...? కొత్త కూటమి పేరు కూడా మంగళవారం నాటి చర్చల అజెండాలో ఉన్నట్టు సమాచారం. ‘‘ఇండియా అని వచ్చేలా కూటమికి ఆకర్షణీయమైన పేరును పార్టీలన్నీ సూచిస్తాయి. ‘యునైటెడ్ వుయ్ స్టాండ్’ అన్నది ట్యాగ్‌లైన్‌గా ఉండనుంది’’ అని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ► అంతేగాక యూపీఏ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సోనియాగాం«దీని కొత్త కూటమి సారథిగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు. ► సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే ప్రధాన లక్ష్యాలుగా ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ► కనీ్వనర్‌గా బిహార్ సీఎం నితీశ్ కీలక బాధ్యతలు తీసుకోవచ్చు. ► మంగళవారం భేటీ అనంతరం సంయుక్త ప్రకటనతో పాటు ఉమ్మడి ఆందోళన ప్రణాళికను కూడా విపక్ష కూటమి ప్రకటించవచ్చని సమాచారం. ► కీలకమైన రాష్ట్రాలవారీగా పార్టీలవారీగా పోటీ చేయాల్సిన లోక్‌సభ స్థానాల సంఖ్యను ఖరారు చేసుకోవడం వంటివీ చర్చకు వస్తాయంటున్నారు. ► ఒక కమిటీతో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, విపక్షాల సంయుక్త నిరసన కార్యక్రమాల ఖరారుకు రెండు సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశముంది. -
అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య పరస్పర సహకారానికి రోడ్డు మ్యాప్ ఖరారైంది. ఢిల్లీలో సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సుదీర్ఘంగా చర్చించి, ఈ మేరకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. రక్షణ పారిశ్రామిక రంగంతోపాటు రక్షణ ఉత్పత్తుల తయారీలో ఇకపై ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఫాస్ట్–ట్రాక్ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. గగతతల, భూ ఉపరితల యుద్ధానికి అవసరమైన ఆయుధాలను కలిసికట్టుగా తయారు చేసుకుంటాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ దేశం చైనా దూకుడు పెరుగుతున్న సమయంలో భారత్, అమెరికా మధ్య ఈ రోడ్డు మ్యాప్ ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు వారాల తర్వాత అమెరికాలో పర్యటించబోతున్నారు. రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్–అమెరికా బంధం ఒక మూలస్తంభమని అభివర్ణించారు. భారత సైన్యం ఆధునీకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికా నడుమ రక్షణ రంగంలో సహకారం విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడానికే రోడ్డు మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్’ వెల్లడించింది. ఫైటర్ జెట్ ఇంజన్లకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని భారత్‌కు అందజేయానికి జనరల్ ఎలక్ట్రిక్స్ సంస్థ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే 30 ఎంక్యూ–9బీ ఆర్మ్డ్ డ్రోన్లను అమెరికా రక్షణ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ రెండు అంశాల గురించి లాయిన్ అస్టిన్ వద్ద రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ద్వైపాకిక్ష రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి 2020 అక్టోబర్‌లో బేసిక్ ఎక్సే్ఛంజ్, కో–ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ) కుదిరింది. -
తెలంగాణలో అసెంబ్లీ రన్.. ‘160’ డేస్! బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. వచ్చే 160 రోజుల కార్యక్రమాలకు బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం, ఎన్నికల సందర్భంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటినుంచి సెప్టెంబర్ చివరిదాకా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలతోపాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించింది. మే రెండో వారంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇక ఎన్నికల మోడ్‌లోకి వచ్చేసినట్టేనని, ముందూ వెనకా చూడకుండా అంతా సమష్టిగా మెరుగైన సమన్వయంతో పార్టీ విజయానికి కృషి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ, ముఖ్యనేతల సమావేశంలో.. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, పార్టీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ దిశానిర్దేశం చేశారు. అమిత్‌షా సభను సక్సెస్ చేయాలి ఈ నెల 23న చేవెళ్లలో కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగ సభను విజయవంతం చేయాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ కమిటీల్లో ఖాళీగా ఉన్నస్థానాలను వెంటనే భర్తీ చేయాలని.. పార్టీ పదవుల్లో ఉండి కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనని వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీనేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, పి.మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు గురు, శుక్రవారాల్లోనూ సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలను సమీక్షించనున్నారు. కార్యక్రమాల తీరు ఇలా.. ♦ మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు తొమ్మిదేళ్ల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మే 15 నుంచి జూన్ 15 వరకు ‘జన సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రచారం చేస్తారు. ♦ జూన్, జూలై మాసాల్లో ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు, వివిధ రంగాల సమస్యలు, ప్రజల ఇబ్బందులపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ♦ ఆగస్టు, సెప్టెంబర్లలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కూలీలు తదితర వర్గాలను స్వయంగా కలుసుకుని.. బీజేపీ అధికారంలోకి వస్తే వారికి జరిగే ప్రయోజనాలను వివరిస్తారు. తాగేందుకు నీళ్లే లేవు.. అభివృద్ధి ఎక్కడ?: సంజయ్ బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్‌చుగ్, బండి సంజయ్‌ల సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తాగడానికి మంచి నీళ్లు అందించలేని సీఎం కేసీఆర్.. అభివృద్ధి గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘‘మంచి నీళ్లు అందక జనం అల్లాడుతున్నారు. ఎండలో కిలోమీటర్లు నడిచి వెళ్లి వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దీనిని బట్టి మిషన్ భగీరథ ఎంత పెద్ద స్కామో తెలిసిపోతుంది..’’ అని వ్యాఖ్యానించారు. -
‘లోక్‌సభ’ నుంచే ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి భవిష్యత్ ప్రస్థానానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్పుచేసే ప్రక్రియ పూర్తవడంతో వీలైనంత త్వరగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నారు. ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని పటేల్ మార్గ్‌లో పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే మీడియా సమావేశంలో పార్టీ విధివిధానాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయం శాశ్వత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఈ ఏడాది డిసెంబర్ తొలివారంలోనే ఢిల్లీలో నిర్వహిస్తామని సంకేతాలిచ్చినా పేరు మార్పిడి ప్రక్రియ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. చలికాలం ముగిశాక మార్చి నెలాఖరులో ఢిల్లీలో పార్టీ శాశ్వత కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించడంతోపాటు ఆవిర్భావ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలతోనే అరంగేట్రం బీఆర్ఎస్ ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో కార్యకలాపాలకు మార్గం సుగమమైనా.. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రానికి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను వేదికగా మల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా ఎన్నికల్లో స్థానికంగా కలిసి వచ్చే భావసారూప్య పార్టీలకు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున పరిశీలక, ప్రచార బృందాలను పంపడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ తరపున కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారు. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాల్లో కన్నడ భాషపై పట్టుకలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, హన్మంత్ షిండేతో పాటు మరికొందరు నేతల సేవలను వినియోగించుకుంటామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. చేరికలు, విలీనాలతో పార్టీ విస్తరణ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నాటికల్లా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయస్థాయిలో ఆసక్తితో ఉన్న పార్టీలు, నేతలతో సంప్రదింపులు జరిపి.. కలిసి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవడం, విలీనాలు వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. పార్టీ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఆలోగా రాష్ట్రానికి చెందిన నేతలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, వివిధ రంగాల నిపుణులతో పొలిట్‌బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ప్రత్యేక పాలసీలు రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ రాజ్యాంగం, విధివిధానాల రూపకల్పనకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన అవగాహన కలిగిన వారికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. పార్టీ జాతీయ కార్యకలాపాల సమన్వయంలో తోడ్పాటు అందించడంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, దాసోజు శ్రవణ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులతో కూడిన బృందం క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు సమాచారం. త్వర లో ప్రకటించే బీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోలో వీరిలో కొందరికి ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాల విస్తరణ, పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ల నూతన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా ఉన్న సీఎం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పాలనాపరమైన అంశాలను తుదిదశకు చేర్చే యోచనలో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతోపాటు మరికొందరు నేతలతో ‘టాస్క్‌ఫోర్స్’ఏర్పాటు చేసి.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను ముమ్మరం చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. -
బయోటెక్ రంగానికి సత్వర అనుమతులు కావాలి
న్యూఢిల్లీ: బయోఫార్మాలో భారత్ మరింత బలమైన పాత్ర పోషించేందుకు పరిశ్రమల మండలి సీఐఐ కీలక సూచనలు చేసింది. బయోటెక్ రంగానికి వేగవంతమైన నియంత్రణ ప్రక్రియ, అనుమతులు అవసరమని పేర్కొంది. ఉత్పత్తిని ప్రవేశపెట్టడంలో జాప్యం చోటుచేసుకుంటే అది భారీ నష్టానికి దారితీస్తుందని ప్రస్తావించింది. బయోటెక్ రంగాన్ని మూడు మంత్రిత్వ శాఖల పరిధిలోని విభాగాలు, ఉప కమిటీలు నియంత్రిస్తున్నాయంటూ.. వాటి మధ్య సమన్వయం బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. ఇది జాప్యానికి దారితీస్తోందని, దీన్ని పరిహరించాల్సిన అవసరాన్ని సూచించింది. ‘రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియన్ లైఫ్ సైన్సెస్ ః2047’ పేరుతో సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రస్తుతానికి బయోసిమిలర్ బ్యాచ్‌ను సమీక్షించేందుకు 20–25 రోజులు, తయారీ సైకిల్‌కు 45–90 రోజుల సమయం తీసుకుంటోంది. ఈ అంతరాలను తొలగించేందుకు పరిశ్రమకు చెందిన నిపుణులతో సలహా మండళ్లను ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ తరహా వ్యవహారాల్లో నిపుణులతో కూడిన సలహా మండళ్ల నుంచి సలహాలు పొందొచ్చు’’అని సీఐఐ నివేదిక పేర్కొంది. విధానాల రూపకల్పన, అమలులో స్వయంప్రతిపత్తి అవసరమని తెలిపింది. సమయం, పరిశోధన, అభివృద్ధి ప్రభావం బయోసిమిలర్ ఔషధ ఉత్పత్తి ధరపై గణనీయంగా ఉంటుందని పేర్కొంది. చైనాను ఉదహరిస్తూ.. ఏకైక అనుమతుల విండో అయిన ‘చైనా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అలాగే, యూఎస్ఎఫ్డీఏ కూడా విధానాల రూపకల్పన, అమలును ఒకే గొడుగు కింద చూస్తున్నట్టు గుర్తు చేసింది. 2030 నాటికి అంతర్జాతీయంగా ఫార్మా రంగంలో బయోఫార్మా వాటా 40 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. -
I2U2 Summit: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా
న్యూఢిల్లీ: నాలుగు దేశాల ‘ఐ2యూ2’ కూటమి తన తొలి శిఖరాగ్ర సదస్సులోనే సానుకూల అజెండాను సిద్ధం చేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి కోసం నాలుగు దేశాలు కలిసికట్టుగా పనిచేయబోతున్నాయని, ఈ మేరకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకున్నాయని వెల్లడించారు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆచరణీయ పరస్పర సహకారానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఒక మంచి మోడల్ అని ఉద్ఘాటించారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్ఏ, యూఏఈ) తొలి శిఖరాగ్ర సదస్సును గురువారం వర్చువల్‌గా నిర్వహించారు. సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యైర్ లాపిడ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఐ2యూ2 అజెండా, దార్శనికత ప్రగతిశీలకంగా, ఆచరణయోగ్యంగా ఉందని కొనియాడారు. నాలుగు దేశాల పెట్టుబడి, నిపుణత, మార్కెట్లు వంటి బలాలను ఒకే వేదికపైకి తీసుకొస్తే అది ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వివిధ రంగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించామని, వాటి అమలు విషయంలో ముందుకెళ్లేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నామని ఉద్ఘాటించారు. నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి ఆరు కీలక రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులను మరింత పెంచేందుకు అంగీకారానికొచ్చామన్నారు. -
టీఆర్ఎస్ను గద్దె దించాలి.. అధికారంలోకి రావాలి
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ను గద్దె దించడం, తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్డుమ్యాప్ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, టీఆర్ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరి, బీజేపీని అణగదొక్కేలా కార్యకర్తలపై దాడులకు పాల్పడడం వంటి వాటిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణపై అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై తీర్మానం వంటిది చేయకపోయినా ప్రాధాన్యతాంశంగా చర్చించడంతో పాటు 8 పేజీల ప్రత్యేక ప్రకటన చేశారు. రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వివిధ తీర్మానాలు, ప్రస్తావనలు, తెలంగాణపై ప్రత్యేక ప్రకటన సందర్భంగానూ.. టీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే అంశాలపై ప్రత్యేకంగా చర్చించి తీర్మానించారు. ఈ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేక ప్రకటనతో పాటు రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఆమోదించారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల ప్రగతిపై పార్టీ అభినందన ప్రస్తావన చేసింది. రాష్ట్ర సర్కారు, టీఆర్ఎస్సే లక్ష్యం ఇది బీజేపీ జాతీయ భేటీ అయినా.. ఒక రాష్ట్ర సర్కార్‌పై, అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం భేటీ ముగింపు ఉపన్యాసం సందర్భంగా.. ఇది భాగ్యనగరం అంటూ, తెలంగాణలో కార్యకర్తలు అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని ప్రధాని మోదీ అభినందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీని అధికారానికి తీసుకురావాలన్న లక్ష్యంతో కృషి కొనసాగించడంతో పాటు కచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశలో చర్య లు తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలం గాణలో ఎట్టి పరిస్ఠితుల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో పాటు, ప్రత్యేక వ్యూహాల ను అనుసరిస్తుందనడానికి ఇదే తార్కాణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కుటుంబ పాలనను అంతమొందిస్తాం.. తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలనను బీజేపీ అంతమొందిస్తుందని, కుటుంబ, వారసత్వ పాలన, జాతి.. కుల..మతాలు, సంతుష్టీకరణ రాజకీయాలకు చరమగీతం పాడతామని పేర్కొంటూ తీర్మానాలు ఆమోదించారు. రాజకీయ తీర్మానంపై చర్చలో పాల్గొన్న సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్రంలోని పరిస్థితులు, టీఆర్ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలు, కుటుంబ, వారసత్వ పాలన కారణంగా రాష్ట్రంలోని పేదలు, ప్రజలు తీవ్రసమస్యలు ఎదుర్కోవడం వంటి వాటిని ప్రస్తావించారు. కాగా దేశవ్యాప్తంగా కుటుంబ, వారసత్వ పాలనను అంతమొందించడంపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నట్టు ఈ సమావేశాల్లో బీజేపీ ప్రకటించింది. వివిధ సందర్భాల్లో, చర్చల్లో తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చిన నేతలు.. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను అందమొందించాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ తీరుపైనా ధ్వజం... రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. కేసీఆర్‌పై, టీఆర్ఎస్పై విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలో కేంద్రంలో, రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని వివిధ రాష్ట్రాల నేతలకు సూచించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, వాటన్నింటినీ అధిగమించి అన్నిచోట్లా అధికారంలోకి రావడమే బీజేపీ ధ్యేయమనే అంశం ఈ సమావేశాల్లో స్పష్టమైంది. నియంత్రణ పాటించాలి ఇటీవల పార్టీ అధికార ప్రతినిధి నూపుర్‌శర్మ టీవీ చర్చల్లో చేసిన ఘాటైన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ భావిస్తోంది. ఈ అంశంపై కొంత చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సమావేశాల్లో భాగంగా పార్టీ అధికార ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయిన సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ విషయంలో పలు జాగ్రత్తలు, సూచనలు చేసినట్టు సమాచారం. దీనిపై చర్చకు అవకాశం ఇవ్వకుండా, అనవసర వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణ పాటించాలని చెప్పినట్టు తెలిసింది. బీజేఎల్పీ నేత రాజాసింగ్‌ను కూడా పిలిపించి సంయమనంతో వ్యవహరించాలని, తీవ్రమైన వ్యాఖ్య లు చేయకుండా సమతుల్యం కోల్పోకుండా ఉండాలని హితవు పలికినట్టు సమాచారం. ఉదయ్‌పూర్‌లో ఒక టైలర్ తల నరికివేత, మహారాష్ట్రలోని అమరావతిలో మరో ఘటన నేపథ్యంలో ఆచితూచి స్పందించాల్సిందిగా అధికార ప్రతినిధులు, నేతలకు నాయకత్వం హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నూపుర్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యా ఖ్యలపైనా చర్చ జరిగినట్టు చెబుతున్నా.. వివరాలను బయటకు వెల్లడించేందుకు కార్యవర్గ సభ్యులు నిరాకరించారు. -
గ్లోబల్ లైట్‌హౌస్ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గ్లోబల్ లైట్‌హౌస్ సిటీగా అభివృద్ధి చేయడానికి బ్రిటన్ సహకారంతో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ(రెడ్కో) రూపొందించిన నివేదికను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ బ్రిటన్ మంత్రి నైజెల్ ఆడమ్స్‌తో కలసి శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరిశోధనలపై పెట్టుబడులు పెట్టి, పరీక్షించి చూసే ప్రయోగశాలను లైట్‌హౌస్ సిటీగా పరిగణిస్తారు. దశలవారీగా అమలు చేయాల్సిన ప్రణాళికలను ఈ నివేదికలో సిఫారసు చేశారు. ప్రధానంగా యూకేలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల ఆధారంగా ఈ సిఫారసులు చేశారు. ఈ సిఫారసులు అమలులోకి వస్తే రూ.30,360 కోట్ల పెట్టుబడులతోపాటు 1.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ రెడ్కో ఒక ప్రకటనలో తెలిపింది. దీనికితోడు 2030 నాటికి వాతావరణంలో 45.84 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ కాలుష్యాన్ని నివారించగలమని తెలిపింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్, యూకే ప్రభుత్వ సహకారంతో రూపలక్పన చేసిన ‘టీఎస్ఈవీ’వెబ్‌పోర్టల్‌ను సైతంఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. సాంకేతిక మార్పిడికి యూకే, భారత ప్రధానుల మధ్య గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా యూకే ఈ మేరకు సహకారాన్ని అందించింది. కార్యక్రమంలో రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ జానయ్య, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సగం సొంతం చేసుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన 144 లోక్‌సభ స్థానాల్లో సగమైనా గెలుచుకునేలా జూన్ ఒకటి నుంచి రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల కిందటే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ఆఫీస్ బేరర్లకు దిశానిర్దేశం చేశారు. రోడ్ మ్యాప్ సిద్ధం ముందుగా గుర్తించిన 144 లోక్‌సభ స్థానాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అంతర్గతంగా ఓ రోడ్‌మ్యాప్‌ను బీజేపీ సిద్ధం చేసింది. మొదటగా ఈ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ బలహీనతలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలు బరిలోకి దిగనున్నారు. మొదటి స్థాయిలో జాతీయ స్థాయి నేతల కమిటీ ఈ 144 లోక్‌సభ స్థానాల్లో కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తుంది. రెండో స్థాయిలో ఒక్కో కేంద్ర మంత్రికి రెండు లేక మూడు లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తారు. సోషల్ మీడియా గ్రూప్‌లు ప్రతి లోక్‌సభ పరిధిలో ఒక సోషల్ మీడియా గ్రూప్‌ను సైతం ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూప్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కులాలు, సమస్యలు, పార్టీల బలహీనతలు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. నియోజకవర్గంలో కులాల సమీకరణల ఆధారంగా పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేలా పార్టీకి సాయపడుతుంది. లోక్‌సభ సోషల్ మీడియా ఇన్చార్జి కనీసం 50వేల మందిని ఈ గ్రూపుల్లో చేర్చే బాధ్యత తీసుకోవాలి. డిసెంబర్ నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఏడాదిన్నరలో ఈ నియోజకవర్గాల పరిధిలోని 74వేల బూత్‌లను బలోపేతం చేసి సగానికి పైగా సీట్లను గెలుచుకునే వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసింది. -
కాంగ్రెస్‌లో పీకే చేరికకు ఓకేనా..? సీనియర్ల షరతులేంటి?
సాక్షి, న్యూడిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో 12మందికిపైగా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై విస్తృతస్థాయిలో చర్చించారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి, సమస్యల పరిష్కానికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024 అనే కమిటీని సోనియా ఏర్పాటు చేశారు. సోనియా నివాసంలో మూడుగంటలపాటు జరిగిన సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ పార్టీలో చేరితే, ఏం బాధ్యతలు అప్పగించాలనే విషయంపైనా చర్చ జరిగింది. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై మెజార్టీ సభ్యులు సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే, ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని కాంగ్రెస్ సీనియర్లు షరతులు పెట్టారట. దీనిపై తుదినిర్ణయం సోనియాగాంధీదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై ఇప్పటికే రచ్చ మొదలైంది. చదవండి👉 పీకే చర్చ మీడియాలో మాత్రమే జరుగుతోంది: భట్టి రాష్ట్రాల ఇంఛార్జ్‌లుగా ఉన్న కొందరు జనరల్ సెక్రటరీలు పీకే చేరికను వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులపై ప్రశాంత్ కిశోర్ నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రాల్లో ఇంఛార్జ్‌లుగా ఉన్నవారు కొందరికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని కుండబద్దలు కొట్టారంట పీకే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. టీ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైందని దీనిని బట్టి తెలుస్తోంది. ఇదిలాఉండగా.. మే 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిరం జరగనుంది. దేశవ్యాప్తంగా 400మంది కాంగ్రెస్ నేతలు ఈ భేటీకి హాజరవుతారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, అధ్యక్ష ఎన్నికలు సహా వివిధ అంశాలపై చింతన్ శిబిరంలో చర్చిస్తారు. చింతన్ శిబిరానికి తేదీలు ఖరారైన నేపథ్యంలో ఈ లోపే పార్టీలో పీకే చేరికపై క్లారిటీ వచ్చేస్తుందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి కాంగ్రెస్ షరతులకు ప్రశాంత్ కిశోర్ అంగీకరిస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. చదవండి👉 పీకే టీమ్‌కు ఓకే.. -
జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 66 కేసులు గత ఐదేళ్లకుపైగా పెండింగ్‌లోనే ఉండిపోవడం ఏమిటని ప్రశ్నించింది. న్యాయం చేకూర్చడంలో జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లేనని ఉద్ఘాటించింది. కేసుల విచారణను సుదీర్ఘకాలం కొనసాగించడం సరైంది కాదని పేర్కొంది. పెండింగ్ కేసుల పరిష్కారంపై ఒక కచ్చితమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని సీబీఐకి సూచించింది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్ మోదీ నేతృత్వంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తాజాగా తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి 1,025 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు, ఇందులో 66 కేసులు ఐదేళ్లకుపైగా పెండింగ్ ఉన్నట్లు సీబీఐ లిఖితపూర్వకంగా తెలిపిందని నివేదికలో పేర్కొంది. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి సీబీఐలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. డిప్యూటేషన్లపై ఆధారపడడం తగ్గించుకోవాలని, స్వస్తి పలకాలని, కనీసం డీఎస్పీ స్థాయి వరకు అధికారులను శాశ్వత ప్రాతిపాదికన నియమించుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐకి పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. -
టెక్స్టైల్ చక్కగా.. ప్లాన్ పక్కాగా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి పథంలో వెళ్తున్న టెక్స్టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ టెక్స్టైల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ వస్త్ర రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కేటీఆర్ టెక్స్టైల్ శాఖ తరఫున చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు బడ్జెట్లో పొందుపరచాల్సిన వివిధ అంశాలపై సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. టెక్స్టైల్ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపైన సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. గత ఏడున్నరేళ్లుగా ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా అనేక వినూత్న కార్యక్రమాలను తెచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవవనరులను, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. సమావేశంలో జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యూపీలో కమలదళం రోడ్ మ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు కమలదళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహంపై ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్తో సహా పలువురు బీజేపీ నేతలు కసరత్తు చేసి రోడ్‌మ్యాప్ రెడీ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌పైనే పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే వచ్చే నెలన్నరలోపు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో 200కి పైగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటి బాధ్యతలను 30మందికి పైగా కేంద్రమంత్రులకు అప్పగించారు. తొలిదశలో భాగంగా వచ్చే 30 రోజుల్లో 18 మంది కేంద్రమంత్రులు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ర్యాలీలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కీలక నేతల ఎన్నికల ర్యాలీలు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా జరుగనున్నాయి. రానున్న 45 రోజుల పాటు ప్రతిరోజూ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ, కార్యక్రమం ద్వారా ప్రజలతో సన్నిహితంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రచార వ్యూహంతో సంబంధం ఉన్న పార్టీ నేత ఒకరు తెలిపారు. అంతేగాక రాబోయే 30 రోజుల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సంబంధించి యూపీలో అత్యధిక పర్యటనలు ఉండనున్నాయి. వచ్చే రెండు నెలల పర్యటన షెడ్యూల్ సైతం ఖరారు చేసే పనిలో కమలదళం బిజీగా ఉంది. నేటి నుంచి ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు సుల్తాన్పూర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను మోదీ ప్రారంభించనున్నారు. 19న ప్రధాని బుందేల్‌ఖండ్ వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది. నవంబర్ 20న లక్నోలో జరుగనున్న దేశవ్యాప్త డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు అధికారుల కార్యాక్రమంలో ప్రధాని, హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు భారీ ప్రాజెక్టులను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఇందులో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ సహా పలు భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని సమాచారం. -
పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్
జైపూర్: పర్యాటకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక.. గతంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించినట్లు తెలిస్తే అలాంటి వారి పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని రాజస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజస్తాన్ టూరిజం ట్రేడ్ (ఫెసిలిటేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టంలోకి కొత్త సెక్షన్ చేర్చే సవరణ బిల్లును రాజస్తాన్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పర్యాటక నిధుల సాయంతో పర్యాటక రోడ్ మ్యాప్‌ని సిద్ధం చేయమంటూ... అధికారులను ఆదేశించారు. (చదవండి: మ్యాగీ మిల్క్‌షేక్.. ‘ఈ గతి పట్టించిన వాడిని చంపేస్తా’) ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రాజస్తాన్ పర్యటనకు వస్తుంటారు. ఇది పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రముఖ రాష్ట్రం. రాజస్తాన్ ప్రభుత్వానికి పర్యాటకరంగం కీలకమైన ఆధాయ మార్గం. అయితే ఇక్కడ పర్యటకుల ఇబ్బందులకు గురి చేసేలా మోసగించడం, అమానుషంగా ప్రవర్తించడం వంటి సమస్యలను తరుచుగా ఎదుర్కొటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా రాజస్తాన్ పర్యాటక మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా మాట్లాడుతూ... ‘‘పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని నిరోధించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నాం’’ అని అన్నారు. (చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు.. కానీ ఇప్పుడు)