sai dedeepya
-
సెమీస్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సీవీజీ నాయుడు స్మారక ఆలిండియా మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఈ టోరీ్నలో దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయిదేదీప్య 6–1, 6–1తో షరోన్ విలియమ్స్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో ఆపేక్ష సోలంకీ (కర్ణాటక)పై గెలుపొందగా... తొలి రౌండ్లో తెలంగాణ ప్లేయర్ మౌలికరామ్ తప్పుకోవడంతో దేదీప్యకు వాకోవర్ లభించింది. ఇదే టోరీ్నలో మరో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రషి్మక క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–0, 6–1తో అదితి నారాయణన్‌పై నెగ్గింది. తొలి రౌండ్లో ఆమె 6–3, 6–0తో ఎస్బీ అపూర్వను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్ మ్యాచ్‌లో వన్షిత పతానియా (కర్ణాటక)తో దేదీప్య ఆడుతుంది. -
క్వార్టర్స్‌లో సాయి దేదీప్య, సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సాయి దేదీప్య, జనగాం సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చెన్నైలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య 6–7 (6/8), 6–1, 6–2తో మేఘా ముత్తుకుమారన్ (తమిళనాడు)పై, సింధు 6–3, 6–1తో ముబాషిరా అంజుమ్ (ఆంధ్రప్రదేశ్)పై గెలిచారు. మేఘాతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ‘టై’బ్రేక్‌లో కోల్పోయిన దేదీప్య అనంతరం పుంజుకుంది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా ఆడి తర్వాతి రెండు సెట్లను గెలిచి క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో దేదీప్య 6–1, 6–1తో వైశాలి పై, సింధు 6–1, 6–2తో చరణ్య శ్రీకృష్ణన్ (తమిళనాడు)పై విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో కావ్య (తమిళనాడు)తో సాయిదేదీప్య, సాయి అవంతిక (తమిళనాడు)తో సింధు తలపడతారు. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు–వైశాలి ద్వయం 6–0, 6–3తో ప్రియదర్శిని–పావని (తమిళనాడు) జోడీపై గెలిచింది. -
సెమీస్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో సాయి దేదీప్య (తెలంగాణ) 6–3, 6–3తో అవిష్క గుప్తా (జార్ఖండ్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములతో దేదీప్య తలపడుతుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్ : అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) మహిళల టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక్కడి లేక్‌వ్యూ టెన్నిస్ అకాడమీలో మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో దేదీప్య 6–4, 7–6 (7/5)తో రిచా చౌగలేపై విజయం సాధించింది. మొదటి సెట్‌ను సులభంగా గెలిచిన దేదీప్యకు రెండో సెట్లో రిచా నుంచి ప్రతిఘటన ఎదురవడంతో టైబ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లో సాయి దేదీప్య పైచేయి సాధించింది. -
రన్నరప్ సాయిదేదీప్య జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్ రాణించారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జతగా రన్నరప్‌గా నిలిచారు. గురువారం జరిగిన టైటిల్‌పోరులో సాయిదేదీప్య–మౌలిక రామ్ ద్వయం 6–0, 4–6, 10–8తో సాల్సా అహెర్ (మహారాష్ట్ర)–లిఖిత (తెలంగాణ) జంట చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక జంట 6–4, 6–2తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)–విదుల (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. -
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్ నిలకడగా రాణిస్తున్నారు. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో జంటగా బరిలోకి దిగిన వీరిద్దరూ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక రామ్ ద్వయం 6–2, 7–6 (9/7)తో రాధిక యాదవ్ (హరియాణా)–స్నిగ్ధ (కర్ణాటక) జోడీపై విజయం సాధించి ముందంజ వేసింది. -
ఫైనల్లో సాయిదేదీప్య జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణి స్తోంది. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి అనూష కొండవీటి (ఏపీ)తో కలిసి డబుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల డబుల్స్ సెమీఫైనల్లో సాయిదేదీప్య (తెలంగాణ)–అనూష (ఏపీ) ద్వయం 7–6 (7/5), 6–1తో ఆర్తి మునియన్ (తమిళనాడు)–దీక్ష మంజు ప్రసాద్ (కర్ణాటక) జంటపై విజయం సాధించింది. -
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారులు వై. సాయి దేదీప్య, అదితి ఆరే నిలకడగా రాణిస్తున్నారు. మహారాష్ట్రలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో వీరిద్దరూ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. అండర్–21 బాలికల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి దేదీప్య– అదితి (తెలంగాణ) ద్వయం 6–4, 6–2తో స్నేహల్ మానే– సృష్టి దాస్ (మహారాష్ట్ర) జంటపై విజయం సాధించారు. గురువారం జరిగే సెమీస్ మ్యాచ్‌లో గుజరాత్‌కు చెందిన జీల్ దేశాయ్– వైదేహి చౌదరి జంటతో సాయిదేదీప్య జోడీ తలపడుతుంది.. -
రన్నరప్ సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య రాణించింది. కోయంబత్తూర్‌లో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి సారా యాదవ్‌తో కలిసి డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సాయిదేదీప్య–సారా యాదవ్ (మధ్య ప్రదేశ్) జంట 2–6, 4–6తో నిధి చిలుముల (తెలంగాణ)–శ్వేతా రాణా (ఢిల్లీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య, సహజ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 50కే ప్రైజ్‌మనీ మహిళల, పురుషుల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య, సహజ శుభారంభం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన తొలిరౌండ్లో రెండోసీడ్ దేదీప్య 5–7, 6–4, 6–1తో సింధు జనగాం (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్స్‌లో కర్ణాటకకు చెందిన సొనాషి భట్నాగర్‌తో దేదీప్య తలపడుతుంది. మరో మ్యాచ్‌లో సహజ యామలపల్లి 6–2, 2–6, 6–2తో మౌలిక రామ్ (తెలంగాణ)ను ఓడించింది. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ కృష్ణ తేజ (తెలంగాణ) 7–5, 6–1తో హిమాన్షు మౌర్య (ఛత్తీస్‌గఢ్)పై గెలుపొందగా... సాయి నిఖిల్ (తెలంగాణ) 4–6, 4–6తో సంసిధ్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కవిన్ మసిలమణి (తమిళనాడు) 4–6, 6–3, 6–3తో రోహిత్ కృష్ణ (తెలంగాణ)పై నెగ్గారు. ఇతర మహిళల మ్యాచ్‌ల ఫలితాలు లక్ష్మీ సాహితి రెడ్డి (ఏపీ) 6–0, 6–2తో సొనాలి జైశ్వాల్ (తెలంగాణ)పై, అనూష కొండవీటి (ఏపీ) 6–3, 6–3తో దీక్ష (తెలంగాణ)పై, ముష్రత్ షేక్ (ఏపీ) 6–3, 6–2తో భక్తి షా (తెలంగాణ)పై, షాజిహా బేగం (తెలంగాణ) 6–2, 7–5తో మాల్విక శుక్లా (మహారాష్ట్ర)పై, లిఖిత (తెలంగాణ) 7–5, 6–4తో ఆకాంక్ష నిట్టూర్ (మహారాష్ట్ర)పై, సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 7–6 (4), 6–3తో బిపాషా (ఏపీ)పై, సి. శ్రావ్య శివాని (తెలంగాణ) 6–3, 6–1తో విదిషా రెడ్డి (తెలంగాణ)పై, ఎల్. లిఖిత (తెలంగాణ) 6–1, 6–1తో భవిక (మహారాష్ట్ర)పై గెలుపొందారు. -
క్వార్టర్స్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. సోమవారం త్రివేండ్రంలో జరిగిన తొలి రౌండ్లో దేదీప్య 6–4, 6–2తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై విజయం సాధించింది. -
రన్నరప్ సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో దేదీప్య 6–2, 5–7, 6–7 (5/7)తో హిమాని మోర్ (హరియాణా) చేతిలో పరాజయం పాలైంది. డబుల్స్ టైటిల్ పోరులో సాయిదేదీప్య–ఆర్తి (తమిళనాడు) జంట 3–6, 6–3, 8–10తో హిమాని (హరియాణా)–దక్షిత (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారా యాదవ్‌తో జతకట్టిన దేదీప్య బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో 4–6, 7–6 (7/5), 10–8తో శ్రావ్య శివాని (తెలంగాణ)–యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్) జంటపై గెలుపొందింది. సెమీఫైనల్లో దేదీప్య జోడి సోహా (కర్ణాటక)– సృష్టి (మహారాష్ట్ర) జంటతో తలపడుతుంది. -
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–18 జాతీయ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో భక్తి పర్వాని (గుజరాత్)తో జత కట్టిన సాయిదేదీప్య డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–భక్తి పర్వాని జంట 2–6, 7–6, 12–10తో షేక్ హుమేరా (తెలంగాణ)–ఈశ్వరీ సేత్ (గుజరాత్) జోడీపై గెలుపొందింది. -
సెమీస్‌లో సాయిదేదీప్య జంట
‘ఐటా’ మహిళల టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన సాయిదేదీప్య–షేక్ హుమేరా జోడీ సెమీఫైనల్లో ప్రవేశించింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–హుమేరా జంట 6–2, 6–0తో అవిష్క గుప్తా (జార్ఖండ్)–వన్షికా పఠానియా (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య జోడీ హర్షసాయి (ఏపీ)– హిమానీ మోర్ (హరియాణా) జంటతో తలపడుతుంది. -
సెమీస్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెం ట్లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. చండీగఢ్‌లో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యా చ్లో దేదీప్య 7–5, 6–2తో రాష్ట్ర క్రీడాకారిణి శ్రావ్య శివానిపై విజయం సాధించింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య ఢిల్లీకి చెందిన శ్వేతారాణాతో పోటీపడుతుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య శుభారంభం చేసింది. చండీగఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సింగిల్స్ తొలిరౌండ్లో సాయి దేదీప్య 6–2, 3–6, 7–6 (7/5)తో యుబ్రానీ బెనర్జీ (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించింది. నేడు (మంగళవారం) జరిగే ప్రిక్వార్టర్స్‌లో హరియాణాకు చెందిన స్మృతి సింగ్‌తో సాయి దేదీప్య తలపడుతుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సింధు జనగాం, సాయిదేదీప్య శుభారంభం చేశారు. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిదేదీప్య 6–1, 6–2తో అవిష్క గుప్తాపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సింధు 6–3, 6–3తో గాయత్రి శంకర్ (కేరళ)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మౌలిక (ఏపీ) 3–6, 6–2, 7–6 (7/2)తో ఆస్థా (మహారాష్ట్ర)పై, ఇస్కా తీర్థ (ఏపీ) 6–1, 6–2తో ప్రవీణపై, నిధి సూరపనేని 6–0, 6–0తో పూర్వ రెడ్డి, లాస్య పట్నాయక్ 6–2, 7–6తో అద్వైతపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. -
రన్నరప్ సాయిదేదీప్య జోడి
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. భీమవరంలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో దేదీప్య జోడి ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాయిదేదీప్య– వై. సహజ (ఏపీ) ద్వయం 0–6, 2–6తో ఈతీ మహిత–సౌమ్య విగ్ (గుజరాత్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
సాయి దేదీప్యకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు వై. సారుు దేదీప్య సత్తా చాటింది. కావలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్‌ను గెలుచుకున్న దేదీప్య... సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో దేదీప్య (తెలంగాణ)-భక్తి పర్వాని (గుజరాత్) ద్వయం 6-1, 7-5తో ముబషిరా-ధారణ జంటపై గెలిచి విజేతగా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో సాయి దేదీప్య 4-6, 3-6తో ధారణ చేతిలో పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచింది. -
సెమీస్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో దేదీప్య 6-1, 6-3తో పూజా ఇంగ్లే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో తను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్ఞానితతో తలపడుతుంది. -
సాయిదేదీప్యకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సత్తా చాటింది. మహారాష్ట్రలోని పంచగనిలో శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో దేదీప్య 6-4, 6-2తో ప్రతిభపై విజయం సాధించింది. మరోవైపు డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధారణ జంట 4-6, 2-6తో రిచా-ప్రేరణ జోడీ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. -
ఫైనల్లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని పంచగనిలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సెమీస్‌లో సాయి దేదీప్య 6-4, 6-2తో పూజ (మహారాష్ట్ర)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో సారుుదేదీప్య కర్ణాటకకు చెందిన ప్రతిభతో తలపడుతుంది. డబుల్స్ విభాగంలోనూ సాయి దేదీప్య-ధరణ ముదలియార్ జంట ఫైనల్‌కు చేరింది. -
సెమీస్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. మహారాష్ట్రలోని పంచగనిలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి దేదీప్య 6-0, 6-2తో మల్లిక (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో దేదీప్య మహారాష్ట్రకే చెందిన పూజతో తలపడుతుంది. -
సాయి దేదీప్య-సాత్విక జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సామ సాత్విక, యెద్దుల సారుు దేదీప్య సత్తా చాటారు. భీమవరంలో జరిగిన ఈ టోర్నీలో బాలికల డబుల్స్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. ఫైనల్లో సామ సాత్విక-సాయి దేదీప్య (తెలంగాణ) జోడీ 6-4, 6-3తో కాల్వ భువన (ఆంధ్రప్రదేశ్)-నిత్యరాజ్ (తమిళనాడు) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది.