service charges
-
మీ బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్‌లోకి వెళ్లిందా? మీ ఒక్క సంతకంతో ఇలా బయట పడండి!
ఓ సంస్థలో పని చేస్తున్న మీనా’కి అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చింది. వెంటనే తన పాత శాలరీ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మి ఆర్ధిక సమస్య నుంచి బయటపడాలని అనుకుంది. వెంటనే మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మింది. ఆ డబ్బును తన పాత శాలరీ బ్యాంక్ అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసుకుంది. కానీ, అప్పుడే బ్యాంక్ అధికారులు ఆమెకు చావుకబురు చల్లాగా చెప్పారు. ఏమని? మీ బ్యాంక్ అకౌంట్‌కు నాన్ మెయింటెన్స్ ఛార్జీలు ఉన్నాయి. ఇందుకోసం అదనపు ఛార్జీల పేరుతో అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు ఓ మెసేజ్ రూపంలో సమాచారం అందించారు. దీంతో ఆ మెసేజ్ చూసి షాక్ తిన్న ఆమె బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసింది. బ్యాలెన్స్ జీరో.. పైగా బ్యాలెన్స్ నెగిటీవ్లోకి వెళ్లింది. దీంతో మీనాకు ఏం చేయాలో పాలు పోలేదు. వెంటనే ఆర్దిక రంగంలో నిపుణురాలైన తన స్నేహితురాలికి ఫోన్ చేసి బ్యాంక్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పింది. మరి ఇంతకీ మీనా బ్యాంక్ నుంచి ఎదురైనా సమస్య నుంచి ఓ చిన్న సంతకంతో ఎలా భయటపడింది? మైనస్‌లోకి వెళ్లిన తన శాలరీ అకౌంట్‌ను నెగిటీవ్ లేకుండా ఏం చేసింది? మైనస్ బ్యాలెన్స్‌తో ఇబ్బందులు మీనా తన పాత సంస్థలో పనిచేసే సమయంలో ‘xyz’ అనే బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసింది. నాలుగేళ్ల తర్వాత మరో సంస్థకు వెళ్లింది. అక్కడ కూడా అదే xyz బ్యాంక్ శాలరీ అకౌంటేనని తెలుసుకుంది. తన పాత శాలరీ అకౌంట్‌ను ఓపెన్ చేసింది. అందులో ఇంకా మైనస్ బ్యాలెన్స్ (ఉదాహరణ) రూ.22,000 చూపిస్తుంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. అకౌంట్ బ్యాలెన్స్ నెగిటీవ్లో ఉండకూడదు. ఒకవేళ బ్యాలెన్స్ సున్నా అయితే బ్యాంక్‌లు ఫైన్ విధించకుండా ఆ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టాలి. ఈ ఆర్బీఐ రూల్ గుర్తు చేస్తూ మీనా తన బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ రూ.22,000 ఎందుకు ఉన్నాయని బ్యాంక్ అధికారుల్ని ప్రశ్నించింది. మెయింటెయిన్ ఛార్జీల వల్ల నెగిటీవ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లింది. కాబట్టి పైన పేర్కొన్న మొత్తాన్ని కట్టాల్సిందేనని ఆదేశించారు. బ్యాంక్ మేనేజర్‌ను అడిగినా లాభం లేకుండా పోయింది. మీ ఒక్క సంతకంతో ఇలా బయటపడిండి వెంటనే, తన స్నేహితురాలి సూచనతో సదరు బ్యాంక్ అధికారిక మెయిల్‌కు, తాను నివాసం ఉంటున్న స్థానిక ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్‌కు కలిపి సమస్యను వివరిస్తూ ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే ఆ బ్యాంకు మేనేజర్ మీనాకు ఫోన్ చేసి మీరు ఒక సంతకం చేస్తే చాలు అకౌంట్‌ని జీరో బ్యాలెన్స్ చేస్తామని చెప్పారు. వెంటనే బ్యాంక్‌ను సందర్శించి తన సంతకంతో సమస్యను పరిష్కరించుకుంది. ఇలా ఒక్క మీనా’నే కాదు... బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క ఖాతాదారులు ఈ తరహా సమస్య నుంచి బయట పడొచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్‌లకు ఆర్బీఐ ఆదేశాలు కస్టమర్లకు బ్యాంకులు విధిస్తున్న అదనపు ఛార్జీల అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాద్ మాట్లాడుతూ.. 2018 నుంచి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు ఎంత విధించాయో వివరించారు. అందులో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంపై రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా రూ.6,254.3 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో ఆర్బీఐ సైతం.. బ్యాంక్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదారులకు ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు ఛార్జీలను వసూలు చేయొద్దని ఆర్బీఐ బ్యాంకులు సూచించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. చదవండి👉 ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్? వచ్చే ఏడాది వరకు తప్పదంట -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాకిచ్చింది. పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని 100 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్లను కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు, యాడ్ సపోర్ట్ ఆప్షన్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసింది. 103 దేశాల యూజర్లకు ఇ-మెయిల్స్ నెట్‌ఫ్లిక్స్ మంగళవారం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ పాటు పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్నట్లు 103 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూజర్లకు మెయిల్ పెట్టింది. ఆ ఇ-మెయిల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌ను ఒకరే వినియోగించుకోవాలని, ఇతరులకు షేర్ చేస్తే అమెరికా యూజర్లు అదనపు ఛార్జీల కింద 8 డాలర్లను (భారత కరెన్సీలో రూ.700డాలర్లు) విధిస్తున్నట్లు పేర్కొంది. 100 మిలియన్లకు పైగా 100 మిలియన్లకు పైగా కుటుంబాలు తమ లాగ్-ఇన్ వివరాలు ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసినట్లు కంపెనీ అంచనా వేసింది. కాగా, మార్చి చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ చెల్లింపు కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 232.5 మిలియన్లు సబ్స్క్రిప్షన్ యూజర్లు ఉన్నారు. కొత్త పాలసీల ప్రకారం, ఒకే కుటుంబ సభ్యులు నెట్‌ఫ్లిక్స్ ఖాతాను వీక్షించవచ్చు. ప్రయాణంలో ఇతర డివైజ్‌లలో లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం! -
రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు!
ప్రజలు నేటి నుంచి రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట బారులు తీరారు. అయితే నోట్లను మార్చుకుంటే బ్యాంక్‌లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవని ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంక్ ఖాతాలో జరిగే డిపాజిట్లపై సాధారణ నిబందనలే వర్తిస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్‌లు రూ.2000 నోట్ల డిపాజిట్లపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం బ్యాంక్‌లు ప్రతి రోజు జరిగే డిపాజిట్లు, విత్ డ్రాయిల్స్‌పై లిమిట్ దాటితే అదనపు ఛార్జీలు విధిస్తాయి. ఇప్పుడా ఛార్జీలు రూ.2000 డిపాజిట్లపై వర్తించనున్నాయి. ఆ ఛార్జీలు వివిధ బ్యాంక్‌ల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఎస్బీఐ సేవింగ్ అకౌంట్, సురభి సేవింగ్స్ అకౌంట్లలో నెలలో మూడుసార్లు డిపాజిట్లను ఉచితంగా చేసుకోవచ్చు. ఆపై జరిపే ప్రతి డిపాజిట్‌పై రూ.50 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ హోం బ్రాంచ్‌లో కాకుండా మిగిలిన బ్రాంచ్‌లలో ప్రతి రోజు రూ.2లక్షలు డిపాజిట్ చేయొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో బ్రాంచ్ మేనేజర్ అనుమతితో రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదనపు ఛార్జీలు పడతాయి. డిపాజిట్ మెషిన్లో క్యాష్ డిపాజిట్ ఉచితంగా చేయొచ్చు. కానీ, డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి థర్డ్ పార్టీ అకౌంట్ల ద్వారా క్యాష్ డిపాజిట్ చేస్తే మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.22 ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తారు బ్యాంక్ అధికారులు. No forms, ID cards needed for exchange of Rs 2000 banknotes: SBI Read @ANI Story | https://t.co/GE6YvmB0ls#Rs2000 #SBI #RBI #LegalTender #Currency pic.twitter.com/IyJ0u2uyR2 — ANI Digital (@ani_digital) May 21, 2023 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు హెచ్డీఎఫ్సీ ప్రతి నెల నాలుగు ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. వాటిల్లో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి లేదంటే థర్డ్ పార్టీ ద్వారా విత్ డ్రాయిల్ చేసుకుంటే ఎలాంటి ఛార్జీల్ని వసూలు చేయదు. అయితే, నిర్ధేశించిన లిమిట్ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.150 వరకు చెల్లించాల్సి ఉంటుంది. నెలలో చేసే డిపాజిట్ రూ. 2 లక్షలకు మించితే, ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.5 నుంచి గరిష్టంగా రూ.150 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. ఇక, థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రోజుకు రూ.25,000 వరకు చేసుకోవచ్చు. కార్డ్ బేస్డ్ డిపాజిట్లను రూ.1లక్ష వరకు చేసుకోవచ్చు. సేవింగ్ అకౌంట్లో డిపాజిట్లు రోజుకు రూ.2 లక్షల వరకు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి బ్యాంక్‌లు. CSC HDFC Bank Advisory on 2000 Denomination Bank Note! HDFC Bank BCA now exchange the 2000 currency.. Please read the advisory for better understanding..#cscfinancialservices #csc #digitalindia #hdfcbank pic.twitter.com/lvb1wS7gRp — CSC Parivar (@CscParivar) May 22, 2023 ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు ఐసీఐసీఐ బ్యాంక్ నెలలో నాలుగు క్యాష్ ట్రాన్సాక్షన్లను ఫ్రీగా చేసుకోవచ్చు. వాటిలో డిపాజిట్లు, విత్ డ్రాయిల్స్ ఉన్నాయి. లిమిట్ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ.150 చెల్లించాలి. నెలలో రూ.1లక్షల వరకు సేవింగ్ అకౌంట్లో ఉచితంగా డిపాజిట్ చేసుకునే వీలుంది. లిమిట్ దాటితే రూ.1000కి రూ.5 నుంచి గరిష్టంగా రూ.150 వరకు ఛార్జీలు వసూలు చేయనునున్నట్టు వెబ్సైట్లో పేర్కొంది. 2/3 Banks may exchange 2000 Rupees Banknotes upto a limit of 20,000 Rupees at a time Reason stated is 2000 Rupee notes not commonly used for transactions; Other Currency denominations adequate to meet Currency needs of public. — ICICIdirect (@ICICI_Direct) May 19, 2023 ఇక, హోం బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ బ్యాంక్ రూ.1000 రూ.5, రూ.25,000 దాటితే రోజుకు రూ.150 అదనపు ఛార్జీలు చెల్లించాలి. థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్లు రూ.25,000కే పరిమితం చేసింది. ఇంకా, ప్రతి థర్డ్-పార్టీ లావాదేవీకి బ్యాంక్ రూ.150 సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తుంది. పైన పేర్కొన్న ఈ ఛార్జీలు హోమ్ బ్రాంచ్‌కు (ఖాతా తెరిచిన లేదా పోర్ట్ చేయబడిన బ్రాంచ్), బ్రాంచ్‌లలో డిపాజిట్లు, విత్ డ్రాయిల్, రీసైక్లర్ మెషీన్లలోని డిపాజిట్లకు వర్తిస్తాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు కోటక్ మహీంద్రా బ్యాంక్ విత్ డ్రాయిల్, డిపాజిట్లు లేదా రూ. 3 లక్షలతో సహా ఐదు ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది. మీరు ఈ పరిమితిని దాటిన తర్వాత, బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, మీరు రూ. 1000కి రూ. 4.5 లేదా కనిష్టంగా రూ. 150 సర్వీస్ ఛార్జీని చెల్లించాలి. ఈ ఛార్జీలు బ్రాంచ్ లేదా క్యాష్ డిపాజిట్ మెషీన్లో నగదు లావాదేవీలకు వర్తిస్తాయి. అదేవిధంగా, ఇతర బ్యాంకులు కూడా మీ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి నిర్దిష్ట ఛార్జీలను విధించవచ్చు. చదవండి👉రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!
ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న పౌరులకు ఆధార్ కార్డు విశిష్టత, దాని ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కావున ఈ కార్డులోని వివరాలు అన్నీ కరెక్టుగా ఉండేలా చూసుకోవాలి. ఈ తరుణంలో ఆధార్ అప్డేట్పై 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) ఓ కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. ఇప్పుడు యుఐడిఏఐ అందించిన సమాచారం ప్రకారం, ఆధార్ అప్డేట్ లేదా ఇతర సర్వీసుల కోసం రిజిస్ట్రార్స్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు గరిష్ఠంగా ఎంత ఛార్జీలు వసూలు చేయాలనే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. అంతే కాకుండా ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు వారి ఆధార్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ జనరేషన్ వంటి వాటికి సైతం నిర్దిష్ట ఛార్జీలను నిర్ణయించింది. మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలకు పైన అయినప్పుడు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయకుండా ఉంటే వెంటనే అప్డేట్ చేయాలి. దీనికోసం గత నెలలోనే ఒక ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగానే అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అప్లోడ్ చేసుకోవాలి. దీని కోసం ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం, 2023 మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఎటువంటి చార్జీలు లేకుండానే ఫ్రీగా ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఏప్రిల్ 20 న ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్క్యూలర్ ఎంబీసీ పాలసీని కొనసాగించడం, హోమ్ ఎన్రోల్మెంట్ సర్వీస్ ప్రారంభించేందుకు నిబంధనలు వెల్లడించింది. ఇందులో కొత్త చార్జీలు కూడా వెల్లడయ్యాయి. OM No. HQ16033/1/2020-EU-I-HQ-Part(2) (E-8026) ప్రకారం కొత్త ఛార్జీలు: 0 నుంచి 5 ఏళ్ళలోపు వయసున్న వారి ఆధార్ జనరేషన్ కోసం ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆధార్ కేంద్రానికి వెళ్లినట్లయితే రూ.50 చెల్లించాలి. ఐదు సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారు ఆధార్ జనరేషన్ కోసం 100 రూపాయలు & బయోమెట్రిక్ అప్డేషన్ కోసం రూ. 100 చెల్లించాల్సి వస్తుంది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక ఎత్తైతే.. వారి పిల్లలు అంతకు మించి!) బయోమెట్రిక్ అప్డేషన్ కోసం రిజిస్ట్రార్లు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు రూ. 100 వసూలు చేస్తారు. డెమొగ్రాఫిక్ అప్డేట్ కోసం రూ.50 చెల్లించాలి. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో పీఓఐ డాక్యుమెంట్ అప్డేట్ కోసం రూ. 50 చెల్లించాలి. అయితే మైఆధార్ పోర్టల్ ద్వారా అయితే రూ.25 మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ ఎన్రోల్మెంట్ సర్వీస్: ఆధార్ కార్డు బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్ అప్డేషన్ హోమ్ ఎన్రోల్మెంట్ కోసం అదనంగా ఛార్జ్ చేస్తారు. అయితే, ఒకే అడ్రస్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆధార్ అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటి కార్డుకు రూ.700 తర్వాత ఒక్కోదానికి రూ.350 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: ఈ ఆఫర్‌తో మహీంద్రా థార్ ఇంటికి తీసుకెళ్లండి.. ఇదే మంచి తరుణం!) ఆధార్‌లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ మార్చుకోవడం ఎలా? ఆధార్‌లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ మార్చుకోవాలనుకునే వారు ముందుగా https://myaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి. లాగిన్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ కోసం క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీ కార్డు వివరాలు చూడవచ్చు. మీ కార్డు వివరాలు తప్పుగా ఉన్నట్లయితే సరి చేసుకోవచ్చు, ఆ తరువాత నెక్ట్స్ హైపర్ లింక్‌పై క్లిక్ చేయాలి ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అప్డేట్ ఆయిన పీఓఏ, పీఓఐ డాక్యుమెంట్లు యూఐడీఏఐ వెబ్సైట్లో ఉంటాయి. అక్కడ వీటిని పరిశీలించుకోవచ్చు. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్!
వినియోగదారులకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ విభాగం భారీ షాకిచ్చింది. ఈ నెల 17 నుంచి సర్వీస్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. దీంతో గతంలో రూ.99 ఉన్న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ ఛార్జీలు ఇప్పుడు రూ.199లకు పెరిగాయి. వీటితోపాటు జీఎస్టీ, ఇతర పన్నులు కూడా అదనంగా కలిశాయి.ఈ మేరకు క్రెడిట్ కార్డ్ విభాగం వినియోగదారులకు సమాచారం అందించింది. ఇక వీటితో పాటు సింప్లీ క్లిక్ కార్డు హోల్డర్లకు గిఫ్ట్ కార్డుల రీడింప్షన్, రివార్డు పాయింట్ల రీడిమ్ నిబంధనలు మారాయని, ఈ నిబంధనల్లో మార్పులు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ కార్డ్ మరోసారి గుర్తు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ సింప్లీక్లిక్ కార్డ్ హోల్డర్లకు క్లియర్‌ట్రిప్ వోచర్‌ను అందించింది. ఆ వోచర్‌ను జనవరి 6, 2023 నుండి ఒకే సారి ఉపయోగించాలి. అంతే తప్పా ఇతర ఆఫర్లు లేదా వోచర్లతో కలపకూడదని స్పష్టం చేసింది. సింప్లీక్లిక్/సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్‌తో అమెజాన్ షాపింగ్పైలో ఆన్లైన్ ఖర్చులపై 10X రివార్డ్ పాయింట్ల అందించేది. కానీ జనవరి 1 నుండి ఆ రివార్డ్ పాయింట్లు 5Xకి తగ్గించింది. అపొలో24X7, బుక్‌మై షో, క్లియర్ ట్రిప్, ఈజీ డైనర్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్ వేదికల్లో ఆన్లైన్ కొనుగోళ్ల మీద మాత్రం 10x రివార్డు పాయింట్లు కొనసాగుతాయి’ అని ఎస్బీఐ క్రెడిట్ కార్డు వెల్లడించింది. -
ఆ కస్టమర్లకు షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం!
దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్‌గా పేరున్న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ షాకిస్తూ వారి సేవింగ్స్ అకౌంట్ల బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 1 నవంబర్ 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీటితో పాటు చెక్కులతో కూడిన వివిధ లావాదేవీల పెనాల్టీ చార్జీలను కూడా పెంచేసింది. దీంతో ఇకపై చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు కొత్తగా తీసుకున్న పెంపు నిర్ణయం వర్తించనుంది. ఏవేవి పెరిగాయి.. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి.. నగదు డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్మెంట్ జారీ, డూప్లికేట్ పాస్‌బుక్ జారీ, IMPS అవుట్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీ-జనరేషన్, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) రీఇష్యూ వంటి వివిధ రకాల లావాదేవీల చార్జీలు పెరిగాయి. బ్యాంక్ జరిమానా ఛార్జీలు చెక్ రిటర్న్ అవుట్‌వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసిన చెక్కు), చెక్ రిటర్న్ ఇన్వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్) వంటి వాటిపై ఉన్న జరిమానా చార్జీలను కూడా పెంచింది. చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త! -
ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్యాంక్ ఖాతా అంటే నగదును దాచుకోవడం , అవసరం ఉన్నప్పుడు నగదు విత్‌డ్రా చేసి వాడుకోవడం, మరి కొందరు ఫిక్స్డ్ డిపాట్లలో వచ్చే వడ్డీ కోసం ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సంస్థలు తమ సేవల పరిధిని పెంచుకుంటూ పోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సేవలకు ఛార్జీలు కూడా విధిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు అనుకోకుండా ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇలా ఎక్కువ ఖాతాలను నిర్వహించడం వల్ల ముఖ్యంగా సామాన్య ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక బ్యాంక్ అకౌంట్‌ను నిర్వహించడం సులభం పైగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు, మీ బ్యాంకింగ్ వివరాలు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్నందున మీ పని సులభం అవుతుంది. అయితే తప్పక అధిక బ్యాంక్ ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంక్ సేవలు, ఛార్జీలు తెలుసుకునే కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. సిబిల్(CIBIL) రేటింగ్‌కు ప్రమాదం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను సరైన మినిమం బ్యాలెన్స్‌తో నిర్వహించడంలో ఒక్కో సారి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాలలో దాని ప్రభావం మీ సిబిల్( CIBIL ) రేటింగ్‌పై చూపుతుంది. సర్వీస్ ఛార్జీలు అధికం బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్క కస్టమర్ కూడా బ్యాంకులు విధించే ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ ఛార్జ్, డెబిట్ కార్డ్ ఏంఎంసీ మొదలైన వివిధ సేవా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తుంటే వారు ఖచ్చితంగా మిగిలిన ఖాతాల ఛార్జీలను కూడా భరించాల్సిందే. అంతే కాకుండా ఎక్కువ కాలం అకౌంట్ వాడకుంటే వివిధ ఛార్జీలు పడతాయి. మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. మీకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసి ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడు మొదలుపెడుతున్నాయి. అలాంటిది వేర్వేరు బ్యాంకుల్లో కనీస మొత్తంలో నగదుని నిల్వను నిర్వహించాలంటే సామాన్యుడికి ఇది భారమే తప్ప ఉపయోగకరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని ఖాతాలు మనం ఉపయోగిస్తుంటే బ్యాంకులు విధించే ఛార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. చదవండి:Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ! -
సామాన్యులపై సర్వీస్ ఛార్జీల పేరుతో బాదుడు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: పేమెంట్ వ్యవస్థల వినియోగంపై ఫీజులు, చార్జీల గురించి అభిప్రాయాలను తెలపాల్సిందిగా ప్రజలను రిజర్వ్ బ్యాంక్ కోరుతోంది. ఇందుకోసం నిర్దిష్టంగా 40 ప్రశ్నలను రూపొందించింది. అక్టోబర్ 3లోగా వీటికి సమాధానాలు పంపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్), నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మొదలైన చెల్లింపుల విధానాలు ఉన్నాయి. వీటిని నిర్వహిస్తున్నందుకు గాను ఆయా సంస్థలకు ఆర్థికంగా కొంత లబ్ధి చేకూర్చేందుకు అలాగే ప్రజలు చౌకగా వీటిని వినియోగించుకోగలిగేందుకు చార్జీలు సహేతుకంగా ఉండేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. -
హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలపై నిషేధం
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీల వడ్డింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇకపై సర్వీస్ చార్జీలను విధించడాన్ని, బిల్లుల్లో ఆటోమేటిక్‌గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. సర్వీస్ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ సోమవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమేనని కస్టమర్లకు చెప్పకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లు దాన్ని బిల్లులో ఆటోమేటిక్‌గా చేరుస్తున్నాయని ఫిర్యాదులు మా దృష్టికొచ్చాయి. మెనూ లో చూపే ఆహార ఉత్పత్తుల ధరలు, వాటికి వర్తించే పన్నులకు అదనంగా ఏదో ఒక ఫీజు లేదా చార్జీ ముసుగులో అవి దీన్ని విధిస్తున్నాయి. ఏ హోటలూ లేదా రెస్టారెంటూ బిల్లులో సర్వీస్ చార్జీని ఆటోమేటిక్‌గా చేర్చకూడదు. దాన్ని చెల్లించాలంటూ కస్టమరును బలవంతపెట్టకూడదు. ఇది స్వచ్ఛందమైనది, ఐచ్ఛికమైనది మాత్రమేనని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలి’ అని పేర్కొంది. అలాగే, సర్వీస్ చార్జీ వసూలు ప్రాతిపదికన లోపలికి ప్రవేశం విషయంలో గానీ సేవలు అందించడంలో గానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది. ఆహారం బిల్లులో సర్వీస్ చార్జీని చేర్చడం, ఆ తర్వాత మొత్తంపై జీఎస్టీని వసూలు చేయడం వంటివి సరికాదని సీసీపీఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ మార్గదర్శకాలతో పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్స సమాఖ్య ఎఫ్హెచ్ఆర్ఏఐ వైస్ ప్రెసిడెంట్ గురుబక్షీష్ సింగ్ కొహ్లి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేస్తామని, తమ రంగాన్ని మాత్రమే వేరుగా చేసి చూడవద్దని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్ బిల్లు మొత్తంపై 10 శాతం సర్వీస్ చార్జీని వసూలు చేస్తున్న నేపథ్యంలో సీసీపీఏ మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫిర్యాదులు ఇలా.. ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంటు సర్వీస్ చార్జి విధించిన పక్షంలో, బిల్లు మొత్తం నుంచి దాన్ని తొలగించాలంటూ సదరు సంస్థను కస్టమరు కోరవచ్చు. అయినప్పటికీ ఫలితం లేకపోతే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) నంబరు 1915కి లేదా ఎన్సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సత్వర పరిష్కారం కోసం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఈ–దాఖిల్ పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే విచారణ, చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టరును కూడా ఆశ్రయించవచ్చు. సీసీపీఏకి ఈ–మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చు. సీసీపీఏ మార్గదర్శకాల్లో మరిన్ని వివరాలు.. ► రెస్టారెంట్లు లేదా హోటళ్లు ఆహారం, పానీయాలను అందించడంలో సర్వీసు కూడా భాగంగానే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయా ఆహార, పానీయాల ధరలు ఉంటాయి. వాటిని ఏ రేటుకు అందించాలనేది నిర్ణయించుకోవడంలో హోటళ్లు లేదా రెస్టారెంట్లపై ఎటువంటి ఆంక్షలు లేవు. ► వినియోగదారుకు, హోటల్ మేనేజ్మెంట్కు మధ్య కుదిరిన కాంట్రాక్టు ప్రకారం కనీస స్థాయికి మించి సర్వీసులను పొందిన పక్షంలో కస్టమరు తన విచక్షణ మేరకు టిప్ ఇవ్వొచ్చు. ఇది కస్టమరుకు, హోటల్ సిబ్బందికి మధ్య ప్రత్యేకమైన వేరే లావాదేవీ అవుతుంది. తను భుజించిన తర్వాత మాత్రమే ఆహార నాణ్యత, సర్వీసుపై కస్టమరు ఒక అవగాహనకు రాగలరు. ఆ తర్వాత టిప్ ఇవ్వొచ్చా, లేదా.. ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వాలి అన్నది నిర్ణయించుకోగలుగుతారు. అంతే తప్ప రెస్టారెంట్లో ప్రవేశించినంత మాత్రాన లేదా ఆర్డరు చేసినంత మాత్రాన కస్టమరు టిప్‌పై నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి కట్టాలా లేదా అనేది నిర్ణయించుకోవడంలో కస్టమరుకు ఎటువంటి అవకాశమూ ఇవ్వకుండా బిల్లులో ఏకపక్షంగా సర్వీస్ చార్జీని విధించడానికి వీల్లేదు. -
హోటల్స్, రెస్టారెంట్లలో ఆ బలవంతపు వసూళ్లకు చెక్
న్యూఢిల్లీ: హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు.. ఇక నుంచి ‘సర్వీస్ ఛార్జీ’ బాదుడు నుంచి ఊరట లభించింది. వినియోగదారుల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించకుండా ఉండేందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సరికొత్త మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల పేరిట కస్టమర్ల నుంచి బలవంతపు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. బిల్లులకు ఆటోమేటిక్‌గా కానీ, మ్యానువల్‌గా కానీ సర్వీస్ ఛార్జీలను జత చేయొద్దని సీసీపీఏ తన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. సర్వీస్ ఛార్జీలను ఏ రూపేనా కూడా వసూలు చేయడానికి వీల్లేదు. కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేయరాదు. అది కేవలం స్వచ్ఛంద చెల్లింపు, ఆప్షనల్ మాత్రమే. ఈ విషయాన్ని కస్టమర్‌కు సైతం తెలియజేయాలని మార్గదర్శకాల్లో కన్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఫుడ్ బిల్లు, జీఎస్టీతో పాటు సర్వీస్ ఛార్జ్ అనేది బిల్లులో ఇకపై కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా హోటల్, రెస్టారెంట్ గనుక సర్వీస్‌ఛార్జ్ వసూలు చేస్తే గనుక.. నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ఈ విషయమై ప్రశ్నించే.. నిలదీసే హక్కు కస్టమర్లకు ఉంటుందని తెలిపింది. ఫిర్యాదు చేయాలనుకుంటే.. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1915కు కాల్ చేయాలని తెలిపింది. లేదంటే ఎన్సీహెచ్ మొబైల్ యాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. సీపీపీఏకు ఈ-మెయిల్ ccpa@nic.in ద్వారా కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపింది. అంతేకాదు అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిస్ కింద కన్జూమర్ కమిషన్లోనూ ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ వేగవంతమైన చర్యల కోసం.. ఈ-దాఖిల్ పోర్టల్ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఇవేం కుదరకుంటే.. నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందిస్తే.. సీసీపీఏ సమన్వయం ద్వారా దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేసింది. చదవండి: కప్పు ఛాయ్ రూ. 70 వసూలు!.. రైల్వే వివరణ -
కప్పు ఛాయ్ రూ. 70! రైల్వే ప్యాసింజర్ షాక్
వైరల్: రైలు ప్రయాణాల్లో దొరికే ఫుడ్, డ్రింక్స్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది?. ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. స్పందన అరకొరగానే ఉంటోంది భారతీయ రైల్వేస్ నుంచి. ఆ సంగతి పక్కనపెడితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో మాత్రం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం సింగిల్ ఛాయ్‌కు 70 రూపాయలు ఓ ప్రయాణికుడి నుంచి వసూలు చేసింది ఐఆర్సీటీసీ . ఈ విషయంపై నిలదీస్తూ సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి భోపాల్ మధ్య ప్రయాణించే భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో జూన్ 28న సదరు వ్యక్తి ప్రయాణించాడు. ఉదయం టీ కోసం 20 రూ. చార్జ్ చేసింది ఐఆర్సీటీసీ. అయితే.. సర్వీస్ ఛార్జ్ పేరిట ఏకంగా 50రూ. తీసుకుంది. దీంతో ఇది మోసమంటూ.. జీఎస్టీ బాదుడంటూ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో ఆ బిల్లును పోస్ట్ చేశారు. అయితే అది జీఎస్టీ కాదని.. కేవలం సర్వీస్ ఛార్జ్ మాత్రమే అని అతనికి కొందరు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ 50రూ. టూమచ్ అని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఐఆర్సీటీసీ స్పందించింది. నిబంధనల మేరకే వ్యవహరించామని, ఆ ప్రయాణికుడి నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయలేదని తెలిపింది. ఈ మేరకు 2018లో రిలీజ్ అయిన ఓ సర్క్యులర్‌ను చూపిస్తోంది. సదరు సర్క్యులర్ ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వాళ్లు గనుక ఫుడ్ బుక్ చేసుకోని సందర్భాల్లో.. టీ, కాఫీ, ఫుడ్ ఆర్డర్ చేస్తే అదనంగా యాభై రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద వసూలు చేస్తారు. అది సింగిల్ ఛాయ్ అయినా సరే.. ఇదే నిబంధన వర్తిస్తుంది. గతంలో రాజధాని, శతాబ్ది రైళ్లలో టికెట్‌తో పాటు ఫుడ్ సర్వీస్ తప్పనిసరిగా ఉండేది. తర్వాత దానిని సవరించి.. ఆప్షనల్ చేసింది ఇండియన్ రైల్వేస్. అప్పటి నుంచి ఇలా బాదుడు షురూ చేసింది. -
రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్ చార్జీ వసూలు చేయుడు బంజేయండి!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు సర్వీసు చార్జీ వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు. రెస్టారెంట్ల అసోసియేషన్ ప్రతినిధులు, వినియోగదారుల సంఘాలతో గురువారం సమావేశం నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడించారు. ‘‘సర్వీసు చార్జీ వసూలు చట్టబద్ధమేనని అసోసియేషన్లు పేర్కొన్నప్పటికీ వినియోగ వ్యవహారాల శాఖ అభిప్రాయం అయితే..ఇది వినియోగదారుల హక్కులను దెబ్బతీస్తుంది. అంతేకాదు అనుచిత విధానం కూడా. 2017నాటి మార్గదర్శకాలు ఉన్నాయి కానీ, వాటిని అమలు చేయలేదు. కనుక త్వరలోనే చట్టపరమైన కార్యాచరణను ప్రకటిస్తాం. దాంతో చట్టప్రకారం అవి సర్వీసు చార్జీ వసూలు నిలిపివేయాల్సి ఉంటుంది’’అని రోహిత్ కుమార్‌సింగ్ తెలిపారు. కస్టమర్లు సర్వీసు చార్జీని సర్వీస్ ట్యాక్స్ గా పొరబడి చెల్లిస్తుంటారన్నారు. వినియోగదారులు, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ లేవనెత్తిన అంశాలపై తాజా సమావేశంలో కేంద్రం ప్రస్తావించింది. చట్టవిరుద్ధం కాదు..:‘‘ఇదే అంశం 2016–17లోనూ చర్చకు వచ్చింది. అప్పుడు అసోసియేషన్ తన స్పందన తెలిపింది. కాంపిటిషన్ కమిషన్‌కు సైతం మా వాదనను సమర్థవంతంగా వినిపించాం’’అని నేషనల్ రెస్టాంరెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. ‘‘సర్వీసు చార్జీ చట్ట విరుద్ధం కాదు, అనుచిత విధానమూ కాదు. ప్రజా వేదికపై ఈ చర్చ అనవసర గందరగోళానికి దారితీస్తుంది. రెస్టారెంట్ల సాఫీ కార్యాకలాపాలను ప్రభావితం చేస్తుంది’’అని ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ కబీర్‌సూరి పేర్కొన్నారు. చదవండి👉 శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
సర్వీస్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ బ్యాంకు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సర్వీస్ చార్జీల విషయంలో ఐఐటీ-బాంబే ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం సంచలనంగా మారింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి 2015-2020 మధ్య రూ.300 కోట్లు సర్వీస్ ఛార్జీల రూపంలో బ్యాంకు వసూలు చేసినట్లు ఆ అధ్యయనం ముఖ్య సారాంశం. ఎస్బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఇలా సేవల పేరుతో అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఐఐటీ-బాంబే బాంబు పేల్చింది. సర్వీస్ చార్జీల విషయంపై ఎస్బీఐ వివరణ ఇచ్చింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు గల ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల వినియోగించిన తర్వాత ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయని, ఈ ఛార్జీలపై ఖాతాదారులకు ముందుగానే సమాచారం ఇస్తున్నామని ఎస్బీఐ వివరణ ఇచ్చింది. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు 2012 ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అయితే అదనపు సేవలు పొందే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంటుంది కాబట్టి ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు చెల్లించాల్సిందే అని పేర్కొంది. చదవండి: వామ్మో! ఎస్బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా? -
వామ్మో! ఎస్బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ)తో సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్(బిఎస్‌బిడిఎ) ఖాతాదారులకు అందించే కొన్ని సేవలపై అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. బీఎస్‌బిడిఎ ఖాతాదారులు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీ నుంచి రూ.17.70 వసూలు చేయాలని ఎస్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని"సహేతుకమైనది"గా పరిగణించ లేమని అధ్యయనం పేర్కొంది. సేవా ఛార్జీలు విధించడం వల్ల 2015-20 మధ్య కాలంలో ఎస్బిఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్‌బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. అలాగే, ఎస్బీఐ తర్వాత ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇదే సమయంలో 3.9 కోట్ల బీఎస్‌బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. "కొన్ని బ్యాంకులు బీఎస్బిడిఎలపై గల ఆర్బిఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్‌బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై(డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. 2013 సెప్టెంబర్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఎస్‌బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్బీఐ, 2013 నాటి నుంచి ఆర్బిఐ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నెలకు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై బీఎస్బీడిఎ హోల్డర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. నెఫ్ట్, ఐఎంపిఎస్ వంటి డిజిటల్ లావాదేవీలపై కూడా ఛార్జీలు రూ.17.70 వసూలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. "ఒక వైపు ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపు మార్గాలను గట్టిగా ప్రోత్సహిస్తుంటే. మరోవైపు, ఎస్బీఐ ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది" అని ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. చదవండి: రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం! -
రైల్వే ప్రయాణికులు తీవ్ర నిరాశ..
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల తర్వాత తిరిగి మొదలైన ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీలతో ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్స్‌పై వెనకడుగు వేస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం సర్వీస్ చార్జీలను తొలగించడంతో ఆన్లైన్ బుకింగ్స్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని వర్గాల ప్రయాణికులు ఆన్లైన్లోనే టికెట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రధాన బుకింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రయాణికులు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా సొంతంగా టికెట్లను బుక్ చేసుకున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు రైల్వే చేపట్టిన డిజిటలైజేషన్‌కు సైతం ఊతమిచ్చింది. కానీ ఇటీవల మళ్లీ సర్వీస్ చార్జీలను అమల్లోకి తేవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆన్లైన్లోనే 65శాతం... దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు రిజర్వేషన్లపై రాకపోకలు సాగిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్ల నుంచి ప్రతిరోజు సుమారు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య నడుస్తాయి. ఏసీ, స్లీపర్ కోచ్‌లకు ఉన్న డిమాండ్ మేరకు సాధారణంగా ప్రయాణికులు 3 నెలల ముందే బుక్ చేసుకుంటారు. పండగలు, వరుస సెలవుల లాంటి ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ మరింత పెరుగుతుంది. నగరంలోని అన్ని ప్రధాన స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ డిమాండ్‌కు తగిన కౌంటర్లు లేకపోవడం, సిబ్బంది కొరత, పని గంటలు తదితర సమస్యల దృష్ట్యా ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు విక్రయించే రిజర్వేషన్ టికెట్లలో 65శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ కావడం గమనార్హం. కేవలం 35శాతం టికెట్లు కౌంటర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రయాణికులు ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుంటే చాలు... క్షణాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తాజాగా 10శాతం తగ్గుదల... రెండేళ్ల క్రితం తొలగించిన సర్వీస్ చార్జీలను తిరిగి విధించడంతో ప్రయాణికులు ప్రస్తుతం ఒక్కో స్లీపర్ టికెట్ బుకింగ్‌కు రూ.18, ఒక్కో ఏసీ టికెట్ బుకింగ్ కోసం రూ.40 చెల్లించాల్సి వస్తోంది. మొదటి నుంచి ఆన్‌లైన్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తిరిగి అమల్లోకి వచ్చిన భారాన్ని యథావిధిగా భరిస్తున్నప్పటికీ.. ఈ రెండేళ్లలో కొత్తగా ఆన్లైన్ పరిధిలోకి వచ్చినవాళ్లు మాత్రం కౌంటర్ల వైపు మళ్లుతున్నారు. ఇటీవల కాలంలో సుమారు 10 శాతం మంది ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్‌ల నుంచి కౌంటర్ బుకింగ్‌లకు మళ్లినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8వరకు పని చేస్తాయి. ఆదివారం మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే ఉంటాయి. కానీ చాలా చోట్ల సిబ్బంది కొరత కారణంగా ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా కౌంటర్లు పని చేయడం లేదు. ఐఆర్సీటీసీ ఆన్లైన్లో రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 12:15 వరకు అంటే 30 నిమిషాలు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉండదు. మిగతా అన్ని సమయాల్లోనూ ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉన్న ఆన్లైన్ బుకింగ్‌లపై తాజాగా విధించిన సర్వీస్ చార్జీలను శాశ్వతంగా తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
రైల్వే ఈ–టికెట్లపై సర్వీస్ బాదుడు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే ఈ –టికెట్లు మరింత భారం కానున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ –టికెట్లపై సర్వీస్ చార్జీల వసూలు తిరిగి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఒక్కో టికెట్‌పై నాన్ ఏసీ కైతే రూ.15, అదే ఏసీ తరగతులకైతే ఫస్ట్‌క్లాస్‌తో కలిపి రూ.30 చొప్పున అదనంగా వసూలు చేయనున్నట్లు ఐఆర్సీటీసీ ఆగస్టు 30వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీస్ చార్జీకి జీఎస్టీ అదనం కానుంది. ప్రజలను డిజిటల్ పేమెంట్స్ వైపు ప్రోత్సహించేందుకు మూడేళ్ల క్రితం కేంద్రం సర్వీస్ చార్జీలను రద్దు చేసింది. అంతకు పూర్వం, ఒక్కో టికెట్‌పై నాన్ ఏసీకైతే రూ.20, ఏసీ తరగతులకైతే రూ.40 చొప్పున సర్వీస్ చార్జీ ఉండేది. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జీలను పునరుద్ధరించేందుకు ఆగస్టు మొదటి వారంలో సమావేశమైన రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. సర్వీస్ చార్జీల రద్దు తాత్కాలికమేనని, రైల్వే శాఖ తిరిగి వీటిని ప్రారంభించేందుకు అవకాశం ఉందని ఆర్థిక శాఖ అప్పట్లోనే చెప్పిందని కూడా రైల్వే వర్గాలు తెలిపాయి. కాగా, సర్వీస్ చార్జీల రద్దు కారణంగా 2016–17 సంవత్సరాల కాలంలో రైల్వే శాఖకు ఆన్లైన్ టికెట్లపై వచ్చే ఆదాయంలో 26 శాతం తగ్గుదల నమోదైందని అధికారులు తెలిపారు. -
ఆటో, క్యాబ్ ఎక్కితే ఇక అంతే... అడ్డంగా దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో : కొద్ది రోజుల క్రితం నాంపల్లి విజయనగర్ కాలనీకి చెందిన ఒక ప్రయాణికుడు తమ ఇంటి నుంచి 25.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంపల్లి జయభేరీ కాలనీ వరకు ఓలా క్యాబ్‌లో ప్రయాణం చేశారు. సాధారణంగా ఆ దూరానికి రూ.700 చార్జీ కంటే ఎక్కువ ఉండదు. కానీ సదరు క్యాబ్ సంస్థ రూ.936 చార్జీ విధించింది. దీనిపై అతడు ఓలా సంస్థకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక కిలోమీటర్‌కు రూ.36.85 చొప్పున అధిక చార్జీలు విధించడాన్ని ప్రశ్నించారు. దీంతో ఓలా సంస్థ వెంటనే దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బులోంచి రూ.219 లు తిరిగి ఆయన ఖాతాలో జమ చేసింది. చార్జీలు ఎక్కువగా ఉన్నట్లు ప్రయాణికుడు గమనించడం వల్ల ట్విట్టర్లో ప్రశ్నించగలిగారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే క్యాబ్ సంస్థల నిలువు దోపిడీకి గురవుతున్నారు. ♦ ఇటీవల లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి మెహదీపట్నం వరకు బయలుదేరిన ఒక ప్రయాణికుడు ఏకంగా రూ.1200 చార్జీ చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థల్లో చార్జీలు తరచుగా మారుతూ ఉంటాయి. రద్దీ వేళల్లో ఎక్కువగా, రద్దీ లేని సమయాల్లో తక్కువగా ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా రద్దీ ఉన్నా, లేకున్నా అన్ని వేళల్లోనూ అత్యధిక చార్జీలు నమోదవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము తక్కువ చార్జీలతో ప్రయాణించిన దూరంలోనూ అత్యధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ♦ క్యాబ్‌ల పరిస్థితి ఇలా ఉంటే వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆటోవాలాల నిలువు దోపిడీ కొనసాగుతోంది. కేవలం 1.5 కిలోమీటర్ల దూరానికి రూ.50 కనీస చార్జీ వసూలు చేస్తున్నారు. ఏ ఒక్క ఆటోలోనూ మీటర్ పని చేయడం లేదు. ఒక రకంగా ఆటోడ్రైవర్లు గత 3 ఏళ్లుగా మీటర్ల వ్యవస్థకు చరమగీతం పాడేశారు. పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూబ్లీబస్‌స్టేషన్ వరకు 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. రవాణాశాఖ నిర్ణయించిన చార్జీల ప్రకారం రూ.50 లోపే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ ఆటో ఎక్కినా రూ.200 డిమాండ్ చేస్తున్నారు. బేరమాడితే రూ.150 వరకు దిగొస్తున్నారు. నగరానికి కొత్తగా వచ్చే వాళ్లయితే రూ.200 పైనే సమర్పించుకోవలసి వస్తుంది. ఆ ఒక్క రూట్లోనే కాదు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రయాణికుడి జేబుకు కన్నం వేస్తున్నాయి. దూరంతో నిమిత్తం లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధిక చార్జీల్లో క్యాబ్‌లతో పోటీపడుతున్నాయి. క్యాబ్‌లకు కళ్లెంవేసేదెవరు... గతంలో ట్యాక్సీల చార్జీల నియంత్రణ ఆర్టీఏ పరిధిలో ఉండేది. కానీ ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థలు రవాణా రంగంలోకి ప్రవేశించిన తరువాత ఆర్టీఏ పరిధిలోంచి ఎగిరిపోయాయి. ఎంత దూరానికి ఎంత చార్జీ చెల్లించాలనేది క్యాబ్ సంస్థల ఖాతాలోకి చేరిపోయింది. మొదట్లో అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకున్న క్యాబ్‌లు క్రమంగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆర్టీఏ మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు గతంలో కిలోమీటర్‌కు రూ.10 చొప్పున మీటర్ రీడింగ్‌పైన చెల్లించే వెసులుబాటు ఉండేది. మీటర్ ట్యాంపరింగ్ చేసి అధిక చార్జీలు వసూలు చేసే డ్రైవర్లపైన రవాణా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ప్రయాణికుల ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టేవారు. కానీ ఓలా, ఉబెర్ల రాకతో ఈ వెసులుబాటు లేకుండా పోయింది. పైగా ఆ సంస్థల కాల్‌సెంటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ప్రయాణికులకు అందుబాటులో లేవు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 50 వేలకు పైగా క్యాబ్‌లు తిరుగుతున్నాయి. ఒక్క శంషాబాద్ విమానాశ్రయ మార్గంలోనే ప్రతి రోజు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 10 లక్షల మంది ప్రయాణికులు క్యాబ్‌ల సేవలను వినియోగిస్తున్నారు. ఇలాంటి క్యాబ్ సర్వీసులు రవాణాశాఖ పరిధిలో లేకపోవడంతో చార్జీలు అడ్డు,అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 5 ఏళ్ల నాటి ఆటో మీటర్లే .... గ్రేటర్లో సుమారు 1.3 లక్షల ఆటోలు ఉన్నాయి. వీటి చార్జీల నిర్ణయం పూర్తిగా ప్రభుత్వం పరిధిలోనే ఉంది. 5 ఏళ్ల క్రితం మొదటి 1.6 కిలోమీటర్ల దూరానికి రూ.20, ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున చార్జీలు విధిస్తూ జీవో విడుదల చేశారు. కానీ ఇది ఎంతో కాలం కొనసాగలేదు. ఏడాది తిరగకుండానే ఆటోడ్రైవర్లు క్రమంగా మీటర్లకు స్వస్తిచెప్పి అడ్డగోలు వసూళ్లకు దిగారు. కొందరు మీటర్లను ట్యాంపర్ చేశారు. ఇప్పుడు మీటర్ ప్రస్తావన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆటోమీటర్లపైన, చార్జీలపైన ఆర్టీఏ నియంత్రణ కోల్పోవడం ఒక కారణమైతే ఈ ఐదేళ్లలో పెరిగిన డీజిల్, సీఎన్జీ ధరలకు అనుగుణంగా మీటర్ చార్జీలను సవరించి గట్టి నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతిమంగా సామాన్య ప్రయాణికులే నిలువుదోపిడీ గురవుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు ఆటోచార్జీలపైన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం మానేశారు. గతంలో ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేవారు. ఇక ఆర్టీఏ కూడా ఆటోలపైన నియంత్రణ కోల్పోయింది. ఆటో ఎక్కాలంటేనే భయమేస్తుంది. చాలా దారుణంగా వసూలు చేస్తున్నారు. – కృష్ణ, సికింద్రాబాద్ మీటర్ల వ్యవస్థను పునరుద్ధరించాలి క్యాబ్‌లలోనూ, ఆటోల్లోనూ మీటర్లను పునరుద్ధరించాలి. వీటి నిర్వహణ కోసం రవాణాశాఖలో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.దీనివల్ల ఇటు డ్రైవర్లకు, అటు ప్రయాణికులకు మేలు జరుగుతుంది. ఉబెర్. ఓలా వంటి సంస్థల వల్ల డ్రైవర్లకు పెద్దగా ప్రయోజనం లేదు. ఆ సంస్థలు మాత్రమే దండుకుంటున్నాయి. డ్రైవర్లు అప్పులు చేసి చివరకు రోడ్డున పడాల్సి వస్తుంది. – షేక్ సలావుద్దీన్, అధ్యక్షులు, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసిసియేషన్ -
సర్వీస్ పేరిట బాదుడు!
శ్రీకాకుళం, వీరఘట్టం: ఏటీఎం కార్డు వినియోగదారులు చేసే లావాదేవీలపై అన్ని బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కార్డు వినియోగించినా.. వినియోగించకపోయినా బాదుడు మాత్రం తప్పడంలేదు. జిల్లాలో సుమారు 7.50 లక్షల మంది బ్యాంకు సేవలను పొందుతున్నారు. ఎస్బీఐ 2017–2018లో రూ.140లు వసూలు చేస్తే 2018–2019లో రూ.206లు, ఆంధ్రా బ్యాంకు 2017–18లో రూ.120లు వసూలు చేస్తే 2018–19లో రూ.160లు సర్వీస్ చార్జీల పేరిట ఖాతాదారులపై భారం మోపుతున్నాయి. ఒక్కో ఖాతాదారుడు నుంచి సరాసరిన లెక్క వేస్తే జిల్లా వ్యాప్తంగా ఏడాదికి రూ.14 కోట్లు సర్వీస్ చార్జీల పేరిట వసూలు అవుతున్నట్లు అంచనా. వసతులు అంతంతమాత్రమే.. జిల్లాలో పలు ఏటీఎం సెంటర్లలో పూర్తి స్థాయి వసతులు లేవు. ఏసీలు పనిచేయవు. ప్రతి లావాదేవికి సంబంధించిన కచ్చితమైన డేటా తెలిసేలా స్లిప్‌లు రావటంలేదు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను కూడా నియమించడం లేదు. పూర్తిస్థాయి వసతులు కల్పించి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తే బాగుంటుందని ఖాతాదారులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని సేవలకు చార్జీలు కట్‌అవుతున్నాయి ఏటీఎం కార్డుతో ఆన్లైన్ ద్వారా చేసే ప్రతీ లావాదేవీకి సర్వీసు చార్జీల పేరిట డబ్బులు కట్ అవుతున్నాయి. మళ్లీ ఏడాదికి ఒకసారి సర్వీసు చార్జీలు వసూలు చేయడం సరికాదు.– భోగి మణి,మెడికల్ షాపు యజమాని, వీరఘట్టం -
సర్వీస్ ఛార్జీ పేరిట ఐఆర్సీటీసీ నిర్వాకం
జైపూర్: సర్వీస్ టాక్స్ పేరుతో ఐఆర్సీటీసీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది. తన నుంచి రూ.35 అదనంగా వసూలు చేయటంపై రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో 9 లక్షల మంది ప్రయాణికుల నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగానే ఐఆర్సీటీసీ సర్వీస్ ఛార్జీల రూపంలో వసూలు చేసినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే... ఏప్రిల్, 2017లో కోటాకు చెందిన సుజిత్ స్వామి అనే ఇంజనీర్ కోటా నుంచి న్యూఢిల్లీ వరకు టికెట్ బుక్ చేసుకున్నాడు. జూలై 2న అతను ప్రయాణించాల్సి ఉంది. అయితే టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటంతో ఆ యువకుడు తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో టికెట్ డబ్బులు రిఫండ్ అయ్యాయి. మొత్తం రూ. 765 టికెట్ ధరకుగానూ రూ.665 అతనికి వెనక్కి వచ్చింది. లెక్క ప్రకారం చూసుకుంటే అతనికి రూ.65 మాత్రమే ఛార్జీ చేయాల్సి ఉంది. కానీ, అదనంగా రూ. 35 వసూలు చేయటంతో అతను న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ వివరణ ప్రకారం... అదనపు ఛార్జీల వ్యవహారంపై సుజిత్ తొలుత ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశాడు. మిగతా సొమ్మును త్వరలోనే రిఫండ్ చేస్తామని ఐఆర్సీటీసీ అతనికి బదులిచ్చింది. కానీ, అది జరగలేదు. దీంతో ఆర్టీఐ కింద వివరణ కోరగా.. దానికి ఐఆర్సీటీసీ ఇచ్చిన వివరణను అతను మీడియాకు చూపించాడు. ‘రైల్వే కమర్షియల్ సర్క్ఘులర్ 43’ ప్రకారం.. జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. జీఎస్టీ అమలు(జూలై 1వ తేదీ తర్వాత)లోకి వచ్చాక టికెట్ రద్దు చేసుకుంటే వారికి కూడా సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ లెక్కన సుజిత్‌కు రిఫండ్ చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే సుజిత్ నుంచి రూ.100(రూ.65 క్లరికల్ ఛార్జ్+సర్వీస్ టాక్స్ రూ.35) వసూలు చేయటం జరిగింది అని తెలిపింది. అంతేకాదు ఆర్టీఐ కింద స్వామి దాఖలు చేసిన మరో లేఖలో ఆశ్చర్యానికి గురిచేసే విషయం వెలుగు చూసింది. మొత్తం 9 లక్షల ప్రయాణికుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేశారు. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 11 రోజుల మధ్య ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకుని.. ఆపై రద్దు చేసుకున్న వారికి ఇలాగే ఛార్జీల పేరుతో కోతలు విధించారు. ఆ సొమ్ము మొత్తం రూ.3.34 కోట్లుగా తేలింది. చాలా మంది ప్రయాణికులు ఈ విషయం తెలీకపోగా.. మరికొందరు తెలిసినా కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆర్టీఐ వివరణలో ఉందని స్వామి చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై లోక్‌అదాలత్‌లో సుజిత్ స్వామి పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో అదాలత్.. రైల్వే బోర్డు చైర్మన్‌కి, పశ్చిమ మధ్య రైల్వే జీఎంకి, ఐఆర్సీటీసీ జీఎంకీ, కోటా డివిజినల్ రైల్వే మేనేజర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది. -
రెస్టారెంట్లలో సర్వీసు చార్జీ చట్ట వ్యతిరేకం: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుల బిల్లులో అదనంగా సేవా రుసుం (సర్వీస్ చార్జీ) వేయడానికి వీల్లేదని, ఇది చట్ట వ్యతిరేకమని పౌర సరఫరాల శాఖ కమిషనర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. సర్వీసు చార్జీని బిల్లులో అదనంగా వేస్తే వినియోగ దారుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హోటల్ యజమానులను హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. వినియోగదారుల నుంచి సర్వీసు చార్జీల వసూలుపై ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఆనంద్ హోటల్స్ అసోసియే షన్ ప్రతినిధులతో శనివారం పౌర సరఫరాల భవన్లో సమావేశం నిర్వహించారు. వినియోగదారుడికిచ్చే బిల్లులో సర్వీసు చార్జీ స్వచ్ఛందంగా చెల్లించే అంశం అని స్పష్టంగా పేర్కొనాలని, ఆ అంశం దగ్గర ఎటువంటి రుసుం పేర్కొనకుండా ఖాళీగా వదిలేయాలని, దానిని వినియోగదారుడు బిల్లు చెల్లించే సమయంలో తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటాడని సూచించారు. బలవంతంగా సర్వీసు చార్జీలు వసూలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి ఆ కేసులను రాష్ట్ర వినియోగదారుల ఫోరానికి అప్పగిస్తామ న్నారు. ఈ విషయంలో కేంద్ర మార్గదర్శకాలను పాటించాల న్నారు. సర్వీసు చార్జీల వసూలుపై వినియోగ దారులు పౌరసరఫరాల శాఖ వాట్సాప్ నంబర్ 7330774444తో పాటు తూనికల కొలతల శాఖ 9490165619 నంబర్లకు ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు. -
మినిమమ్ బ్యాలెన్స్ పై ఎస్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : నెలవారీ కనీస మొత్తాల నిబంధనల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొంత ఉపశమనం కల్పించింది. వీటిపై విధించే ఛార్జీలను, ఈ మొత్తాన్ని ఎస్బీఐ సమీక్షించింది. కనీసం బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తాన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ సోమవారం ప్రకటించింది. అంతేకాక పెన్షనర్లను, ప్రభుత్వం నుంచి సామాజిక ప్రయోజనాలు పొందే లబ్దిదారులను, మైనర్ అకౌంట్లను, ఫైనాన్సియల్ ఇంక్లూజిన్ అకౌంట్లను ఈ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పింది. పీఎంజేడీఐ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్లు కేటగిరీలను ఇప్పటికే ఎస్బీఐ ఈ నిబంధన నుంచి మినహాయించిన సంగతి తెలిసిందే. మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను నిబంధనను పాటించిన వారికి వేస్తున్న ఛార్జీలను కూడా 20 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించింది. అందరికీ ఈ తగ్గించిన ఛార్జీలే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఈ ఛార్జీలను సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల వారికి రూ.20 నుంచి రూ.40 వరకు, అర్బన్, మెట్రో సెంటర్ల వారికి రూ.30 నుంచి రూ.50 వరకు విధించనున్నట్టు చెప్పింది. ఈ సమీక్షించిన ఛార్జీలు 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కనీస నగదు నిల్వలను ఉంచని ఖాతాదారులపై సర్వీస్ టాక్స్‌తో పాటు 100 రూపాయల పెనాల్టీని విధించనున్నట్టు ఎస్బిఐ అంతకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 శాతం కంటే తక్కువ నిల్వలున్న ఖాతాలపై సర్వీస్ టాక్స్‌తో పాటు 50 రూపాయలు, 50-75 శాతం తక్కువ ఉన్న నిల్వలపై సర్వీస్ టాక్స్ సహా 75 రూపాయల పెనాల్టీని బ్యాంకు విధిస్తోంది. ఇక నుంచి ఈ ఛార్జీలు తగ్గిపోనున్నాయి. జన్‌ధన్ అకౌంట్లకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. The Monthly Average Balance in Savings Bank Accounts has been revised w.e.f. 1/10/2017. For more details visit: https://t.co/lGxM6RRO37 pic.twitter.com/i0cDsR6XJV — State Bank of India (@TheOfficialSBI) September 25, 2017 -
రెస్టారెంట్లు, హోటళ్లకు కేంద్రం వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లు ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జీలను తప్పనిసరిగా కాదని కేంద్రం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. సర్వీసు ఛార్జ్‌ను ఆదాయంగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించింది. వీటిపై పన్ను వసూలు చేయాలంటూ సీబీడీటీకి పేర్కొంది. సర్వీసు ఛార్జ్‌లను వసూలు చేస్తే.. వాటిపై కూడా పన్ను చెల్లించాలంటూ రెస్టారెంట్లను సైతం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు హెల్ప్‌లైన్, మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయని పాశ్వాన్ ట్వీట్ చేశారు. ఇకపై రెస్టారెంట్ల నుంచి పన్నులు తీసుకుంటున్నప్పుడు అందులో సర్వీస్ ఛార్జీని కూడా కలపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జారీచేసిన గైడ్‌లైన్స్ ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేసే సర్వీసు ఛార్జ్‌లు తప్పనిసరి కాదని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఆప్షనల్ మాత్రమేనని పేర్కొంది. కానీ తమకందిన ఫిర్యాదుల్లో ఈ ఛార్జీలను బలవంతంగా వసూలు చేస్తున్నట్టు తెలిసిందని పాశ్వాన్ చెప్పారు. -
‘మీసేవ’ బాదుడు
► ఏ, బీ కేటగిర సేవలకు వర్తింపు ► ప్రజలపై ఏటా రూ.5.80 లక్షల భారం ► ప్రస్తుత చార్జీలే అధికమంటున్న సామాన్యులు ► 70కేంద్రాల్లో ఏడాదిలో 57,589 పత్రాల జారీ ఆదిలాబాద్æఅర్బన్: ప్రభుత్వం ‘మీసేవ’ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకుగాను సర్వీసు చార్జీలను పెంచేసింది. మీసేవ కమిషనర్ ఆదేశాల ప్రకారం పెంచిన సర్వీస్ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రజల సౌకర్యార్థం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుకున్న సమయానికి కావాల్సిన ధ్రువపత్రం పొందేందుకు మీసేవ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెంచిన సర్వీస్ చార్జీలతో జనాలపై కొంత భారం పడనుంది. ఇదిలా ఉండగా, రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే సేవలను కేటగిరి ‘ఏ’, కేటగిరి ‘బీ’ అనే రెండు విభాగాలుగా చేసి సుమారు 60 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ సేవలతో పాటు ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ రకాల సర్వీసులను కూడా మీసేవ కేంద్రాలు నిర్వర్తిస్తున్నాయి. కేటగిరి ‘ఏ’ లో ఉండే సేవల సర్వీస్ చార్జీలు ప్రస్తుతం రూ.25 ఉండగా, రూ.35కు పెరిగాయి. కేటగిరి ‘బీ’లో ఉండే సేవల సర్వీస్ చార్జీలు ప్రస్తుతం రూ.35 ఉండగా, రూ.45కు పెరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న చార్జీలతోనే సామాన్య జనాలు ఇక్కట్లు పడుతుండగా.. పెంచిన చార్జీలతో ప్రజలపై మళ్లీ భారం పడింది. ప్రజలపై భారం.. మీసేవ కేంద్రాల ద్వారా పొందే సేవలకు సర్వీస్ చార్జీలు పెంచడంతో ఆ భారం ప్రజలపై పడింది. జిల్లాలో 70 మీసేవ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రం ఏడాదికి రూ.9వేల నుంచి రూ.12వేల వరకు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాలు ఏడాదిలో 58వేల సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. పెంచిన చార్జీ ప్రకారం ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 లెక్కేసుకున్నా.. ఏడాదికి రూ.5.80 లక్షల భారం ప్రజలపై పడనుంది. కేటగిరి ‘ఏ’, కేటగిరి ‘బీ’లోని సేవలకు సర్వీస్ చార్జీలు పెరగడమే కాకుండా ఐదు కన్నా ఎక్కువగా ఉన్న స్కానింగ్ కాపీలకు ఒక్కోదానికి రూ.2 చొప్పున వసూలు చేస్తారు. (అంటే ఒక డెసిడెన్సీ సర్టిఫికెట్ కావాలనుకుంటే దరఖాస్తుతో పాటు మనం ఆధార్, రేషన్ జిరాక్స్ కాపీలు అందజేస్తాం. అలా 10 కాపీలు ఇవ్వాల్సి వస్తే అందులో ఐదింటికి ఒక్కో పేజీ స్కానింగ్ కోసం రూ.2చొప్పున తీసుకుంటారు) కాగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా 57,589 వివిధ రకాల ధ్రువపత్రాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. మీసేవలు ఇలా.. మీసేవ కేంద్రాలు రెవెన్యూ, విద్యా, విద్యుత్, మున్సిపల్, ఆర్టీఏ, హౌసింగ్, ఈసీ, రిజిస్ట్రార్ వంటి శాఖల సేవలను సైతం అందిస్తున్నాయి. కేటగిరి ఏ, బీలలో రెవెన్యూ సేవలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీలకు చార్జీలు పెరిగాయి. మిగతా శాఖల సర్వీసులకు చార్జీలు పెంచలేదు. అయితే కేటగిరి ‘ఏ’లో పహణీ, అడంగల్, వన్ బీ, ఆర్వోఆర్ లాంటి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కేటగిరి ‘బీ’ ద్వారా కుల, ఆదాయ, రెసిడెన్సీ, ఓబీసీ, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ల్యాండ్ కన్వర్షన్, ఎఫ్ పిటిషన్, డిపెండెంట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, అప్లికేషన్లు తదితర 60 రకాల సేవలు పొందవచ్చు. సిటిజన్ చార్ట్ ప్రకారం ఆయా ధ్రువపత్రాలకు గడువును బట్టి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అయితే ఆన్ లైన్ సమస్యలతో సమయానికి సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు. పెంచిన భారం ప్రజలపైనే.. ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మంచి సేవలందిస్తున్నా.. చార్జీలు పెంచి భారం వేస్తోంది. ప్రజలకు ఏది తప్పనిసరి అవసరమో దానికే చార్జీలు పెంచడం సరికాదు. ప్రస్తుతం ఉన్న చార్జీల భారం మోయలేకనే ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ పెంచి మరింత భారం మోపారు. – దేవన్న, ఆదిలాబాద్ ఓ విధంగా మంచిదే.. మీసేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు సర్వీస్ చార్జీలు పెంచడమనేది ఓ విధంగా మంచిదే. ఇలా చేయడంతో మీసేవ నిర్వాహకులు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, అవకతవకలకు పాల్పడకుండా ఉంటారు. ప్రజలకు కొంత భారమే అయినా మంచి పరిణామమే. – రఘువీర్ సింగ్, మీసేవ జిల్లా కో ఆర్డినేటర్ -
కార్డుతో చెల్లింపులపై సర్‌చార్జీలు రద్దు
డిజిటల్ పేమెంట్లకు ఊతమిచ్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారాను, ఇంటర్నెట్ ద్వారాను జరిపే చెల్లింపులపై ఇకపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ తొలగిపోనుంది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల ప్రమేయాన్ని తగ్గించేందుకు, డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పన్నుల ఎగవేత ఉదంతాలను తగ్గిం చేందుకు, ఆదాయాలు.. చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నగదురహిత విధానానికి మళ్లేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. మరోవైపు, 2016- 17 సీజన్‌కు సంబంధించి జనుము మద్దతు ధరను 18.5 శాతం పెంచి క్వింటాలుకు రూ. 3,200కి చేర్చే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసిం ది. ప్రస్తుతం ఇది రూ. 2,700గా ఉంది. వాస్తవానికి దీన్ని రూ. 3,650కి పెంచాలని జౌళి శాఖ కోరింది. -
‘రవాణా’ వాతలు !
► ఎడాపెడా ఫీజుల వాయింపు ► ఎల్ఎల్ఆర్ నుంచి లెసైన్సు వరకు మోత ► రిజిస్ట్రేషన్లు, ఎఫ్సీలనూ వదలని వైనం ► సామాన్యుడే లక్ష్యంగా వడ్డన ► నేటి నుంచి కొత్త చార్జీల వసూళ్లు చిత్తూరు (అర్బన్) : ‘రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. డబ్బును పొదుపు చేయాలి.’ ఇవి సీఎం చంద్రబాబునాయుడు నిత్యం వల్లించే నీతిసూత్రాలు. అదే సమయంలో ఆయన రూ.కోట్లు కుమ్మరించి బంధుమిత్ర సపరివార సమేతంగా విదేశాలకు వెళ్లొస్తూ ఆ భారాన్నంతా సామాన్యులపై మోపుతున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచిన రాష్ట్ర సర్కారు తాజాగా రవాణా శాఖలో సేవా రుసుమును 50 నుంచి 100 శాతం పెంచుతూ శనివారం రాత్రి ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేసింది. పెంచిన చార్జీలను సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నారు. జిల్లాలో ప్రతియేటా సగటున 28 వేలకు పైగా వాహనాలకు కొత్తగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సంవత్సరంలో 84 వేల మంది లెర్నర్ లెసైన్సులు (ఎల్ఎల్ఆర్), 75 వేల మంది డ్రైవింగ్ లెసైన్సుల కోసం వస్తుం టారు. ఇవిగాకుండా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ)కోసం, పర్మిట్ల జారీ కోసం 15 వేలకు పైగా వాహనచోదకులు వస్తుంటారు. వీటితో పాటు త్రైమాసిక పన్నులు, అపరాధ రుసుము, జీవితకాలపు పన్నులు ఇలా రకరకాల సేవల ద్వారా జిల్లా రవాణాశాఖకు ఏటా రూ.100 కోట్లకు పైనే వసూలవుతోంది. 2009-10లో రవాణా శాఖ నుంచి జిల్లాలో రూ.89.65 కోట్ల లక్ష్యం కేటాయించగా రూ.86.20 కోట్లు వసూలైంది. 2010-11లో రూ.111.44 కోట్లకుగానూ రూ.117.43 కోట్లు, 2011-12లో రూ.139.91 కోట్లకు గానూ రూ.126.19 కోట్లు, 2012-13లో రూ.150.65 కోట్లకు గానూ రూ.139.74 కోట్లు, 2013-14లో రూ.177.20 కోట్లకు గానూ రూ.127.63 కోట్లు, 2014-15లో రూ.150 కోట్లకు గానూ రూ.148.15 కోట్లు జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖలో యూజర్ చార్జీలు ప్రవేశపెట్టి ప్రజలపై భారం మోపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని రద్దు చేయగా ఇప్పడు మళ్లీ బాబు ప్రభుత్వం యూజర్ చార్జీలను ప్రవేశపెట్టడమేగాక అన్ని రుసుములూ 50 నుంచి 100 శాతానికి పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లా ప్రజలకు ఏటా అదనంగా రూ.60 కోట్ల వరకు భారం పడనుంది. ఇలా పెంచేశారు.. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం రవాణా శాఖ కార్యాలయానికి ఏ పనిపై వెళ్లినా పెరిగిన సేవా రుసుం ప్రకారం నగదు చెల్లించాల్సిందే. ఒక్క వాహనం కోసం ఎల్ఎల్ఆర్ తీసుకునే వ్యక్తి నుంచి ఇప్పటి వరకు రూ.30 రుసుం, రూ.30 యూజర్ చార్జీలు కలిపి రూ.60 వసూలు చేస్తుండగా తాజాగా పెరిగిన రుసుం ప్రకారం దీన్ని రూ.120కి పెంచేశారు. ఎల్ఎంవీ లెసైన్సులకు రూ.100 నుంచి రూ.150, ట్రాన్స్‌పోర్టు లెసైన్సులకు రూ.150 నుంచి రూ.225కు పెంచేశారు. ఇక రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే ద్విచక్ర వాహనాలకు ఇప్పటి వరకు రూ.100 రుసుం ఉండగా దీన్ని రూ.150కి, రవాణేతర వాహనాలకు రూ.200 నుంచి రూ.300కు, ఆటోలకు రూ.100 నుంచి రూ.150, ఆటోలకు ఉన్న ఎఫ్‌సీలు రూ.30 నుంచి రూ.60, పర్మిట్లకు రూ.100 నుంచి రూ.150 చొప్పున పెంచేశారు.