Sharath Kamal
-
భారత టీటీ జట్ల కెప్టెన్లుగా మనిక, శరత్ కమల్
న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లు ఖరారయ్యాయి. పురుషుల జట్టుకు వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్, మహిళల జట్టుకు సీనియర్ మనిక బత్రా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ కజకిస్తాన్ రాజధాని అస్తానాలో వచ్చే నెల 7 నుంచి 13 వరకు జరుగుతుంది. ఇది ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడ్డ 42 ఏళ్ల శరత్ సహా అనుభవజ్ఞులైన హర్మీత్ దేశాయ్, సత్యన్ తదితరులతో భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.ఇక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాక విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ స్టార్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ ఈ టోర్నీతో మళ్లీ బరిలోకి దిగనునంది. ప్రస్తుతం జరుగుతున్న అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో శ్రీజ పాల్గొనడం లేదు. జట్ల వివరాలు మహిళల జట్టు: మనిక బత్రా (కెప్టెన్), ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ, దియా చిటాలే, సుతీర్థ ముఖర్జీ, రిజర్వ్ ప్లేయర్లు: యశస్విని, పాయ్‌మంటీ బైస్య. ఫురుషుల జట్టు: శరత్ కమల్ (కెప్టెన్), మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, సత్యన్, మనుశ్ షా, రిజర్వ్ ప్లేయర్లు: స్నేహిత్, జీత్‌చంద్ర. -
US Open: ప్రిక్టార్టర్స్లో కోకో గాఫ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ 3–6, 6–3, 6–3తో 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఏడో సీడ్ పౌలా కిన్వెన్ జెంగ్ (చైనా), 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్వెన్ జాంగ్ 6–2, 6–1తో జూలీ నెమియర్ (జర్మనీ)పై, పౌలా బదోసా 4–6, 6–1, 7–6 (10/8)తో ఎలెనా రూస్ (రొమేనియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించింది. చెన్నైపై యు ముంబా పైచేయి చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో భాగంగా సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మానవ్ ఠక్కర్ విజయం సాధించాడు. దీంతో మానవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు ముంబా టీటీ జట్టు 8–7తో చెన్నై లయన్స్‌పై గెలిచింది. ఈ ఫలితంతో యు ముంబా టీటీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.‘టై’లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో మానవ్ 6–11, 11–8, 11–9తో శరత్ కమల్‌పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మానవ్–మారియా జంట 11–7, 11–10, 11–4తో శరత్–సకురా మోరీ ద్వయంపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో అరునా ఖాద్రి 10–11, 11–9, 11–7తో రోలాండ్పై విజయం సాధించగా.. సుతీర్థ ముఖర్జీ 8–11, 10–11, 7–11 సాకురా మోరీ చేతిలో మారియా 10–11, 8–11, 11–10తో మౌమా దాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి
Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నుంచి టాప్–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. తొలిసారి టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. పురుషుల, మహిళల టీమ్ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్ ప్లేయర్‌ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న ఆచంట శరత్ కమల్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పాల్గోనుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). భారత పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్). మనిక పరాజయం కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన కృత్విక రాయ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సానిల్ శెట్టి–హరీ్మత్ దేశాయ్ (భారత్) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్ డోర్–ఫ్లోరియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్ (భారత్) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. -
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్‌లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్‌కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్‌లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్‌లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్‌లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్‌లో, సత్యన్ 68వ ర్యాంక్‌లో ఉన్నారు -
శరత్ కమల్ ఓటమి
సింగపూర్: సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శరత్ కమల్ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శరత్ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్‌లో నెగ్గగా... తన సరీ్వస్‌లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శరత్ కమల్‌కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్ బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్ చాంపియన్ షోహిబుల్ ఫిక్రీ–మౌలానా బగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్–చిరాగ్ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ వాటరింజెన్ (నెదర్లాండ్స్): డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన తరుణ్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 23–21తో భారత్‌కే చెందిన శుభాంకర్ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్లో తరుణ్ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్ మథియాస్ కిక్లిట్జ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. -
రెండో రౌండ్లో శరత్ కమల్.. తొలి రౌండ్లోనే ఓటమిపాలైన మనిక
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 41 ఏళ్ల శరత్ కమల్ క్వాలిఫయింగ్ ద్వారా పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రపంచ 87వ ర్యాంకర్ శరత్ కమల్ 11–5, 11–4, 11–6తో నికోలస్ బర్గోస్ (చిలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 4–11, 7–11, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ యిది వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
TT: 24 ఏళ్లపుడు.. మళ్లీ 40 ఏళ్ల వయసులో! రెండు స్వర్ణాలు.. రాజమండ్రి నుంచి
2006 మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు.. 24 ఏళ్ల యువ ఆటగాడు టేబుల్ టెన్నిస్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు.. 40 ఏళ్ల వెటరన్ ఆటగాడు టేబుల్ టెన్నిస్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఈ రెండు పతకాల మధ్య 16 ఏళ్ల అంతరం ఉంది. అయితే అప్పటి యువ ఆటగాడు, ఇప్పటి వెటరన్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. అదే దూకుడు, అదే పట్టుదల, అదే విజయకాంక్ష, అందుకోసం తీవ్రంగా శ్రమించే తత్వం! అతనే ఆచంట శరత్‌కమల్.. ఈ 16 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల ప్రస్థానంలో ఏకంగా 13 పతకాలు, వాటిలో 7 స్వర్ణాలు సాధించిన శరత్ కమల్ 41 ఏళ్ల వయసులోనూ ఆటే ప్రాణంగా దూసుకుపోతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మదరాసులో పుట్టి పెరిగిన ఈ తెలుగు ప్లేయర్ సుదీర్ఘ కాలంతో తన ఆటతో ప్రత్యేక ముద్ర వేసి భారత టేబుల్ టెన్నిస్‌కు పర్యాయపదంగా నిలిచాడు. ఎనిమిదేళ్ల క్రితం శరత్ కమల్ తుంటికి గాయమైంది. 20 సెంటీ మీటర్ల చీలిక రావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకునే క్రమంలో దాదాపు రెండు నెలల పాటు అతను వీల్‌చెయిర్‌లోనే ఉన్నాడు. ఆపై మరో మూడు వారాల పాటు క్రచెస్తోనే నడక. ఈ సమయంలో ఇంకా కెరీర్ కొనసాగుతుందని ఎవరూ అనుకోరు. శరత్ కూడా అదే భావనతో ఉన్నాడు. అయితే ఆటపై ఉన్న మమకారం అతనిలో పట్టుదలను పెంచింది. కోలుకున్న తర్వాత పూర్తి ఫిట్నెస్ను అందుకోవడంపై దృష్టి పెట్టిన శరత్ మళ్లీ తన ఆటను మొదలుపెట్టాడు. పునరాగమనం ఏదో నామ్‌కే వాస్తేగా జరగలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన శరత్ తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆపై కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజత, కాంస్యాలతో మెరిశాడు. అదే ఏడాది ఆసియా క్రీడల్లోనూ రెండు కాంస్యాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఎదురులేకుండా అతను తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. ఇది అతని మానసిక దృఢత్వాన్ని చూపిస్తోంది. ఆట మొదలుపెట్టిన కొత్తలో ఓటమి ఎదురైనప్పుడు తట్టుకోలేక తీవ్ర అసహనాన్ని ప్రదర్శించే అలవాటు శరత్లో ఉండేది. గెలుపోటములను సమానంగా స్వీకరించలేకపోయాడు. ఈ లక్షణాన్ని తగ్గించేందుకు శరత్ తండ్రి, బాబాయ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదే అనుభవంతో తర్వాతి రోజుల్లో ఎంతో పరిపక్వత ప్రదర్శించిన శరత్ ఇప్పటి వరకు దానిని కొనసాగించడంలో సఫలమయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో.. శరత్ కమల్ తండ్రి శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి. ఆయనతో పాటు ఆయన సోదరుడు మురళీధర్రావుకూ టేబుల్ టెన్నిస్ అంటే బాగా ఇష్టం. అయితే రాజమండ్రిలో శిక్షణకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో టీటీని కెరీర్‌గా మలచుకునే క్రమంలో మద్రాసు చేరారు. అక్కడ సాధన తర్వాత జాతీయ స్థాయి పోటీల వరకు వారు వెళ్లగలిగారే తప్ప పెద్ద స్థాయి కలలు కనలేకపోయారు. తర్వాతి దశలో టేబుల్ టెన్నిస్ కోచ్‌గా శ్రీనివాసరావు కొత్త ప్రయాణం మొదలైంది. సహజంగానే తాము సాధించలేనిదాన్ని తమ శిష్యుల ద్వారా సాధించాలనే కోరిక, తపన కోచ్‌లలో ఉంటుంది. అలా అక్కడ ఆయన కోచింగ్ మొదలైంది. ఆ క్రమంలో శిక్షణ పొందుతూ వచ్చినవారి జాబితాలో కొద్ది రోజులకే ఆయన కొడుకు కూడా చేరాడు. పసివాడిగా ఉన్నప్పుడు తండ్రి వెంట కోచింగ్ కేంద్రానికి వెళుతూ వచ్చిన శరత్కూ టీటీపై ఆసక్తి పెరగడం శ్రీనివాసరావు పనిని సులువు చేసింది. ప్రాథమికంగా ఓనమాలు నేర్పించిన తర్వాత కమల్లో నిజంగానే అరుదైన ప్రతిభ ఉందని గుర్తించిన తండ్రి సరైన శిక్షణతో బాగా ప్రోత్సహించాడు. దాంతో తమిళనాడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అతను పాల్గొనడం మొదలైంది. అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–17లలో రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లో శరత్ హవా సాగింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆటను కొనసాగించాలా లేక ఇంజినీరింగ్ వైపు వెళ్లాలా అని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. మంచి ఫలితాలు సాధిస్తూ కూడా ఆటను వదిలిపెట్టిన చాలామంది గురించి శ్రీనివాసరావుకు బాగా తెలుసు. కానీ తన కుమారుడి విషయంలో మాత్రం ఆయన అలాంటి తప్పు చేయలేదు. టీటీపైనే దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేశాడు. దాని ఫలితాలు ఆ తర్వాత అద్భుతంగా వచ్చాయి. అలా మొదలైంది.. సరిగ్గా 20 ఏళ్ల వయసులో శరత్‌కమల్ 2002లో తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆపై భారత జట్టుకు కామన్వెల్త్ క్రీడల కోసం నిర్వహించిన ప్రత్యేక క్యాంప్‌కీ ఎంపికయ్యాడు. జూనియర్ కావడంతో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అవకాశం రాకపోయినా సీనియర్ల సాహచర్యంలో ఎంతో నేర్చుకునే అవకాశం దక్కింది. తర్వాతి ఏడాదే అతను తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో (2003) విజేతగా నిలవడంతో భారత టీటీలో కొత్త మార్పుకు అంకురార్పణ జరిగింది. 2003లో జరిగిన టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్ శరత్ కెరీర్లో తొలి మెగా టోర్నీ కాగా, తర్వాతి ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో అతను తన కెరీర్లో తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రావడం అతని కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో శరత్ పోరు రెండు రౌండ్లకే పరిమితమైనా అతని ఆట పదును పెరిగింది. కామన్వెల్త్లో హవా.. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ పోటీల్లో రాణించడం అంత సులువు కాదు. చైనాతో పాటు యూరోపియన్ ఆటగాళ్ల హవా అక్కడ కొనసాగుతుంది. అయితే ఇక్కడా శరత్ తన ముద్ర చూపించాడు. కెరీర్లో రెండు ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ సాధించిన అతను భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. శరత్‌కు కామన్వెల్త్ క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. వరుసగా ఐదు సార్లు 2006, 2010, 2014, 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాడు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, టీమ్ విభాగాలు.. ఇలా అన్నింటిలో అతను చెలరేగిపోయాడు. ఫలితంగా అతను ఖాతాలో ఏకంగా 13 కామన్వెల్త్ క్రీడల పతకాలు ఉన్నాయి. ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించిన అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో మరో 3 పతకాలు సాధించడం విశేషం. మరో వైపు విదేశీ లీగ్‌లలో కూడా తన సత్తాను చూపించాడు. ప్రపంచ టీటీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే బుందేస్లిగా (జర్మనీ)లో కూడా ఆడిన అతను 2010–11 సీజన్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు డచ్, స్వీడన్, స్పానిష్ లీగ్‌లలో కూడా అతను ఆడాడు. దురదృష్టవశాత్తు శరత్ మెరుపులు ఒలింపిక్స్‌లో ఫలితాన్ని అందించలేదు. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో పాల్గొన్నా పతకం అతని దరి చేరలేదు. వరుస గాయాలతో బాధపడుతూ 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అయితే ఒలింపిక్స్ పతకం లేకపోయినా శరత్ సాధించిన ఘనతలు అతని స్థాయిని చూపించాయి. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతున్న శరత్ కమల్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు. 10 – భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన రికార్డు శరత్ సొంతం. 2019లో తొమ్మిదో టైటిల్ గెలిచి కమలేశ్ మెహతా (8) రెండు దశాబ్దాల రికార్డు బద్దలు కొట్టిన అతను 2022లో పదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 30వ స్థానానికి చేరిన శరత్ కమల్.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అర్జున, పద్మశ్రీ, ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే -
World TT Championship: శ్రీజ, శరత్ కమల్ పరాజయం
డర్బన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ శ్రీజ ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 112వ ర్యాంకర్ శ్రీజ 2–11, 4–11, 2–11, 4–11తో ప్రపంచ పదో ర్యాంకర్ యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ రెండో రౌండ్లో శ్రీజ–దియా చితాలె (భారత్) జోడీ 8–11, 8–11, 11–13తో సన్ యింగ్షా–వాంగ్ మాన్యు (చైనా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత వెటరన్ స్టార్, 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లో 4–11, 11–13, 8–11, 10–12తో లీ సాంగ్ సు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ (భారత్) జోడీ.. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. -
శరత్ కమల్‌కు ఖేల్‌రత్న.. శ్రీజ, నిఖత్‌లకు అర్జున
న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ ‘అర్జున’ విజేతలయ్యారు. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలతో సత్తా చాటుకుంటున్న తెలంగాణ మహిళా చాంపియన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా బాక్సర్ నిఖత్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శ్రీజలను ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీజ ‘మిక్స్డ్’ భాగస్వామి, స్టార్ టీటీ ప్లేయర్ అచంట శరత్ కమల్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ లభించింది. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు. కొన్నేళ్లుగా ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (204 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెల్చుకున్నాడు. మొత్తం 25 మంది క్రీడాకారులకు ‘అర్జున’ దక్కింది. ఇందులో నలుగురు పారాథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష క్రికెటర్ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డుకు జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మొహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమ షిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్)... ద్రోణాచార్య ‘లైఫ్ టైమ్’ అవార్డుకు దినేశ్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ఎంపికయ్యారు. అశ్విని అకుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ (హాకీ), సురేశ్ (కబడ్డీ), నీర్ బహదూర్ (పారాథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. తెలంగాణ స్టార్లకు... ఇంటాబయటా అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన ఆకుల శ్రీజ ఈ ఏడాది కెరీర్లోనే అత్యుత్తమ సాఫల్యాన్ని బర్మింగ్‌హామ్‌లో సాకారం చేసుకొంది. ఈ ఏడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వెటరన్ స్టార్ శరత్ కమల్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు నెగ్గింది. నిఖత్ ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో మెరిసింది. అవార్డీల జాబితా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్). అర్జున: నిఖత్ జరీన్, అమిత్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్), సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాశ్ సాబ్లే (అథ్లెటిక్స్), లక్ష్య సేన్, ప్రణయ్ (బ్యాడ్మింటన్), భక్తి కులకర్ణి, ప్రజ్ఞానంద (చెస్), దీప్గ్రేస్ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్), సాగర్ కైలాస్ (మల్లకంబ), ఇలవేనిల్ వలరివన్, ఓంప్రకాశ్ మిథర్వాల్ (షూటింగ్), వికాస్ ఠాకూర్ (వెయిట్‌లిఫ్టింగ్), అన్షు, సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మానసి జోషి, తరుణ్ థిల్లాన్, జెర్లిన్ అనిక (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్). -
ఒలింపిక్ పతకమే మిగిలుంది
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు. 20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్‌గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్‌లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు. తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్‌హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్‌గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు. -
నిఖత్ జరీన్‌కు అరుదైన గౌరవం
బర్మింగ్‌హామ్: ఆటలు ముగిశాయి. వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు స్టేడియంపై విరజిమ్మాయి. అంగరంగ వైభవంగా మొదలైన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ ఆట్టహాసంగా ముగిశాయి. భయపెట్టే కోవిడ్ కేసులు లేకుండా ముచ్చటపరిచే రికార్డులతో అలరించిన ఆటల షోకు భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున తెరపడింది. 72 దేశాలకు చెందిన 4500 పైచిలుకు అథ్లెట్లు తమ ప్రదర్శనతో కామన్వెల్త్కు కొత్త శోభ తెచ్చారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ బర్మింగ్‌హామ్ ఆటలకు తెరపడిందని లాంఛనంగా ప్రకటించారు. 2026 ఆతిథ్య వేదిక విక్టోరియా (ఆస్ట్రేలియా)లో కలుద్దామని అన్నారు. భారతీయ భాంగ్రా స్టేడియాన్ని ఊపేసింది. భారత సంతతికి చెందిన సుప్రసిద్ధ గేయరచయిత, గాయకుడు ‘అపాచి ఇండియన్’గా ఖ్యాతి పొందిన స్టీవెన్ కపూర్ ‘భాంగ్రా’ పాటలను హుషారెత్తించే గళంతో పాడాడు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ , టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. -
CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్: గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది. అవకాశం ఇవ్వకుండా.. అనుభవజ్ఞురాలైన మిషెల్లిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన సింధు అనుకున్న ఫలితం సంపాదించింది. తొలి గేమ్‌లో 14–8తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు విజృంభణ కొనసాగడంతో మిషెల్లికి తేరుకునే అవకాశం లేకుండాపోయింది. లక్ష్యసేన్ సైతం.. అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ తెలుగుతేజం సోమవారం ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా అదరగొట్టి పసిడి పతకం దక్కించుకోగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకుంది. శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత రెండోసారి పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గగా... సత్యన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీలో టీమిండియా మరోసారి రజత పతకంతో సంతృప్తి పడింది. మొత్తానికి ఈ గేమ్స్ చివరిరోజు భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి చిరస్మరణీయ ప్రదర్శనతో ముగించింది. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరుగుతాయి. అభిమానులకు ధన్యవాదాలు: సింధు సుదీర్ఘ కాలంగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం కోసం నిరీక్షించాను. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. –పీవీ సింధు PC: PV Sindhu Twitter సింధు ఘనతలు: ►కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. ►కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్‌గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
Commonwealth Games 2022: 16 వసంతాలుగా ‘శరత్’ కాలం
2006 – మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు – టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాడు విలియం హెన్జెల్పై విజయంతో స్వర్ణం... 2022 – బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు– సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌పై విజయంతో స్వర్ణం... ఈ రెండు సందర్భాల్లోనూ విజేత ఒక్కడే... నాడు 24 ఏళ్ల వయసులో తొలి పతకం సాధించి ఇప్పుడు 40 ఏళ్ల వయసులో 13వ పతకం సాధించిన ఆ స్టార్ ఆటగాడే ఆచంట శరత్ కమల్. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ప్రత్యర్థులు మారారు... వేదికలు, పరిస్థితులు మారాయి. కానీ అతని ఆట మాత్రం మారలేదు. ఆ విజయకాంక్ష ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్‌లో తొలి స్వర్ణం నెగ్గిన 16 సంవత్సరాల తర్వాత కూడా స్వర్ణంపై గురి పెట్టగలిగిన అతని సత్తాను ఎంత ప్రశంసించినా తక్కువే... వరుసగా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని శరత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13 కాగా, ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన శరత్ కమల్ సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలు, రుతువుల్లోనూ తనలో వాడి ఉందని నిరూపించాడు. కొత్త కుర్రాడిలాగే... సుదీర్ఘ కాలంగా భారత టేబుల్ టెన్నిస్‌ను శాసిస్తూ రికార్డు స్థాయిలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి శరత్ కమల్ ఆటకు పర్యాయపదంగా నిలిచాడు. అయితే 40 ఏళ్ల వయసులో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటాడా, ఒకవేళ ఆడినా గత స్థాయి ప్రదర్శనను ఇవ్వగలడా అనే సందేహాలు వినిపించాయి. కానీ అతను అన్నింటినీ పటాపంచలు చేసేశాడు. గత నాలుగు కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు విభాగాల్లోనూ అతను పతకాలు (3 స్వర్ణాలు, 1 రజతం) సాధించడం విశేషం. షెడ్యూల్ ప్రకారం చాలా తక్కువ వ్యవధిలో వరుసగా మ్యాచ్‌లు ఆడాల్సి రావడం, ఒకే రోజు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చినా శరత్ లయ కోల్పోలేదు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సాధించి అతను సత్తా చాటాడు. -
భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ హవా
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్‌గా 53వ పతకం చేరాయి. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్‌హాల్–లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. ఫైనల్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11–8, 11–8, 8–11, 11–7, 9–11, 11–8తో పాల్ డ్రింక్‌హాల్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 11–4, 8–11, 9–11, 9–11తో లియామ్ పిచ్‌ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు. పోరాడి ఓడిన శ్రీజ మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11–3, 6–11, 2–11, 11–7, 13–15, 11–9, 7–11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. -
CWG 2022: పతకం రేసులో భారత టీటీ జట్టు
కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో హర్మీత్–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–8, 11–6, 11–2తో రమిహిమిలన్–అహ్మద్ జంటను ఓడించింది. రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 11–2తో రిఫాత్‌పై గెలిచాడు. మూడో మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్ 11–2, 11–3, 11–5తో అహ్మద్‌పై నెగ్గి భారత విజయాన్ని ఖాయం చేశాడు. -
టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్యం..
దోహా: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. టోర్నీలో సెమీస్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 12–10, 8–11, 5–11తో 12వ ర్యాంకర్ వూజిన్ జాంగ్ చేతిలో ఓడాడు. రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 11–7, 13–15, 11–8, 6–11, 9–11తో లీ సాంగసూ చేతిలో పోరాడి ఓడాడు. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 4–11, 11–9, 11–8, 6–11, 11–13తో చో సీంగ్మిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. మరోవైపు మహిళల టీమ్ విభాగంలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో థాయ్‌లాండ్‌పై నెగ్గి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’ -
Asian TT Championship: కాంస్య పతకం ఖాయం!
Asian TT Championship 2021: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆచంట శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్, సానిల్ షెట్టి, మానవ్ ఠక్కర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 3–1తో ఇరాన్ జట్టును ఓడించింది. కాగా శరత్ కమల్ రెండు మ్యాచ్‌ల్లో, సత్యన్ ఒక మ్యాచ్‌లో నెగ్గగా... హర్మీత్ ఓడిపోయాడు. భారత విజయం ఖాయం కావడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. చదవండి: Koneru Humpy: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం -
శరత్ కమల్–మనిక జంటకు క్లిష్టమైన ‘డ్రా’
టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జోడీ శరత్ కమల్–మనిక బత్రాకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. బుధవారం విడుదల చేసిన ‘డ్రా’లో భారత జంట తొలి రౌండ్లో మూడో సీడ్ లిన్ యున్–జు, చెంగ్ చింగ్ (చైనీస్ తైపీ) ద్వయంతో తలపడుతుంది. మార్చిలో ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రపంచ 8వ ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జీ జెనోన్ (దక్షిణ కొరియా)పై నెగ్గి శరత్ కమల్–మనిక జోడీ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. -
టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలి: శరత్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో... టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ అభిప్రాయపడ్డాడు. పదేళ్ల విరామం తర్వాత 37 ఏళ్ల శరత్ కమల్ గతవారం ఒమన్ ఓపెన్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చి స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన శరత్ కమల్... ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో విశ్వ క్రీడలను నిర్వహించకపోవడమే మేలు అని అన్నాడు. ఏథెన్స్, బీజింగ్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన శరత్ నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ‘ఓ క్రీడాకారుడిగా ఒలింపిక్స్ జరగాలనే కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కాదు. ప్రస్తుతం కోవిడ్–19 వైరస్ హడలెత్తిస్తోంది. అందరూ వ్యక్తుల మధ్య దూరం పాటించాలని సూచిస్తున్నారు. వేలాది మంది క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్‌లో ఇది సాధ్యం కాదు. క్రీడలు జరుగుతున్న సమయంలో వారందరూ ఒకే చోట కూడా ఉండాల్సి ఉంటుంది’ అని శరత్ వ్యాఖ్యానించాడు. -
లక్ష్యం... టాప్ 20: శరత్
ముంబై: ఈ ఏడాది టాప్–20లోకి చేరడమే తన లక్ష్యమని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకుల్లో 33వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదిలో తన లక్ష్యాన్ని నెరవేర్చు కోవడంతోపాటు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్ తప్పకం పతకం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. గతేడాది ఆసియా క్రీడల టీటీలో సాధించిన రెండు కాంస్య పతకాలు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందిం చాయని పేర్కొన్న కమల్... ఆ స్ఫూర్తితో ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు ప్రయత్నిస్తు న్నట్లు వివరించాడు. ఆసియా క్రీడల్లో తీవ్ర పోటీ ఉంటుందని, అలాంటి చోటే రెండు పతకాలు నెగ్గగలిగామంటే ఇక ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు పతకాలు దక్కే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల్లో శరత్ కమల్ నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి 60 ఏళ్ల తర్వాత తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శరత్‌తోపాటు మిక్స్డ్ డబుల్స్‌లో మనికా బాత్ర సైతం కాంస్యం నెగ్గి భారత్‌కు ఈ విభాగంలో ఒలింపిక్ పతకాలపై ఆశలు రేకెత్తించారు. -
‘చరిత్రను పునరావతం చేస్తా’
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో చరిత్రను పునరావతం చేస్తానని అంటున్నాడు భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్. 12ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వేదికగా మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల సింగిల్స్, టీమ్ విభాగాల్లో శరత్ విజేతగా నిలిచి రెండు స్వర్ణాలను సాధించాడు. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరగబోయే కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు పసిడి పతకాలను సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించి తమిళనాడులో స్థిరపడిన శరత్ కమల్ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఖతర్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ కోకి నివాకు షాకిచ్చి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ‘కామన్వెల్త్లో ఈసారి పాల్గొంటున్న భారత జట్టు అత్యుత్తమమైనది. ప్రపంచంలో టాప్–100లో ఉన్న ఆరుగురు క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టోర్నీలో పోటీపడుతోన్న నాలుగు కేటగిరీల్లోనూ (సింగిల్స్, డబుల్స్, టీమ్, మిక్స్డ్ డబుల్స్) మనకు పతకాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’ అని 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన గ్లాస్గో గేమ్స్‌లో భారత్ కేవలం ఒక రజతంతో సరిపెట్టుకుంది. ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు ఇదే అత్యల్ప ప్రదర్శనని శరత్ అన్నాడు. ‘కామన్వెల్త్‌లోనే మనం ఎక్కువ పతకాలు సాధించే వీలుంది. కానీ ఇంగ్లండ్, నైజీరియా ఆటగాళ్లు చెలరేగడంతో గ్లాస్గోలో భారత్‌కు నిరాశపరిచే ఫలితాలు వచ్చాయి. కేవలం ఒకే పతకంతో సరిపెట్టుకున్నాం. ఇది భారత్‌కు పతకాల పరంగా అత్యల్ప ప్రదర్శన. దీంతో గోల్డ్‌కోస్ట్‌లో పాల్గొనే బందంపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మేం దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం సింగపూర్ నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. కోచ్ మాస్సిమో కోస్టాంటిని పర్యవేక్షణలో భారత బందం యూరోప్‌లో సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ నుంచి మా సన్నాహాలు జరుగుతున్నాయి. కచ్చితంగా ఈసారి మంచి ఫలితాలు సాధిస్తాం’ అని కమల్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. -
శరత్ కమల్ జంటకు కాంస్యం
డి హాన్ (బెల్జియం): ప్రతిష్టాత్మక 2017 చాలెంజ్ బెల్జియం ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు చెందిన శరత్ కమల్ జోడీ కాంస్యాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శరత్ కమల్– జి సతియాన్ (భారత్) జంట 2–3 (7–11, 11–7, 11–5, 5–11, 5–11)తో రెండో సీడ్ ప్యాట్రిక్ ఫ్రాంజిస్కా– రికార్డో వాల్తర్ (జర్మన్) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. సింగిల్స్ విభాగంలో సానిల్ శెట్టి, మహిళల డబుల్స్‌లో మనీకా బాత్రా– మౌమా దాస్ ద్వయం క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు. తొలి రెండు రౌండ్లలో అద్భుత ప్రదర్శనతో సీడెడ్ ఆటగాళ్ల (కార్డిక్ నైటింక్, చెంగ్ టింగ్ లియావో)ను ఓడించిన సానిల్ శెట్టి క్వార్టర్స్‌లో 1–4తో రికార్డో వాల్తర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మనీకా– మౌమా జంట 1–3తో హియెన్ తైజు చెంగ్– హింగ్ యిన్ లియు (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. -
ఆర్పీఎస్జీ మావెరిక్స్ జట్టులో శరత్ కమల్
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ ముంబై: ఐపీఎల్ తరహాలో టేబుల్ టెన్నిస్‌లో కూడా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌కు రంగం సిద్ధమైంది. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ పేరుతో జరిగే ఈ టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల ఎంపిక కార్యక్రమం శుక్రవారం జరిగింది. భారత నెం. 1 టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్‌ను సంజీవ్ గోయెంకా ప్రాంచైజీ ‘ఆర్పీఎస్జీ మావెరిక్స్’ జట్టు సొంతం చేసుకుంది. మొత్తం 48 మంది ప్యాడ్లర్లు (ఇందులో 24 మంది విదేశీయులు) ఆరు జట్ల తరఫున ఎంపికయ్యారు. తొలి సీజన్లో బేసైడ్ స్పిన్నర్స్, చాలెంజర్స్, దబంగ్ స్మాషర్స్, మహారాష్ట్ర యునైటెడ్, ఆయిల్‌మ్యాక్స్ స్టాగ్ యోధాస్, ఆర్పీఎస్జీ మావెరిక్స్ జట్లు పాల్గొంటున్నాయి. జూలై 13నుంచి 30వరకు యూటీటీ లీగ్ జరుగుతుంది. భారత మహిళా నెం.1 క్రీడాకారిణి మధురికా పాట్కర్ ‘దబంగ్ స్మాషర్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండగా, భారత యువ ఒలింపియన్ సౌమ్యజిత్ ఘోష్‌ను ‘చాలెంజర్స్’ జట్టు దక్కించుకుంది. హర్మీత్ దేశాయ్ ‘మహారాష్ట్ర యునైటెడ్’ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ లీగ్‌లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు వాంగ్ చున్ టింగ్ (ప్రపంచ నెం. 7, హాంకాంగ్) మహారాష్ట్ర యునైటెడ్ జట్టు తరఫున, మా ర్కోస్ ఫ్రేతస్ (ప్రపంచనెం. 16, పోర్చుగల్) దబంగ్ స్మాషర్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. మహిళల విభాగంలో ప్రపంచ నెం. 9 ప్లేయర్ హాన్ యింగ్ (జర్మనీ) చాలెంజర్స్ తరఫున ఆడుతుంది. ఈ లీగ్‌లో ఆటగాళ్లకు అత్యధికంగా 20 లక్షలు, అత్యల్పంగా 2.5 లక్షలు చెల్లించినట్లు లీగ్ చైర్పర్సన్ విటా డాని తెలిపారు. -
శరత్ కమల్ సంచలనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్)వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ టోర్నీలో భారత వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 62వ ర్యాంకర్ శరత్ కమల్ 11–8, 11–7, 11–4, 14–16, 11–5తో ప్రపంచ 24వ ర్యాంకర్ యుటో మురామత్సు (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాల్ డ్రింకాల్ (ఇంగ్లండ్)తో శరత్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన సానిల్ శెట్టి 9–11, 11–9, 12–10, 4–11, 7–11, 7–11తో గార్డోస్ రాబర్ట్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణులు మౌసమి పౌల్, సుతీర్థ ముఖర్జీ, మౌమా దాస్, అర్చన కామత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. -
భారత మహిళల ‘హ్యాట్రిక్’
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘జి’ రెండో డివిజన్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-1తో ప్యుర్టోరికోపై, ఆ తర్వాత మూడో లీగ్ మ్యాచ్‌లో 3-0తో పోర్చుగల్‌పై నెగ్గింది. ప్యుర్టోరికోతో జరిగిన మ్యాచ్‌లో తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-5, 2-11, 7-11, 9-11తో దియాజ్ ఆడ్రియానా చేతిలో ఓడింది. అయితే రెండో సింగిల్స్‌లో షామిని 12-10, 11-9, 7-11, 11-5తో దియాజ్ మిలానిపై తర్వాతి మ్యాచ్‌లో మధురికా 11-4, 11-9, 11-7తో రియోస్ డానిలిపై; రివర్స్ సింగిల్స్‌లో షామిని 11-7, 13-11, 8-11, 11-8తో దియాజ్ ఆడ్రియానాపై నెగ్గారు. పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో మనిక బాత్రా 11-5, 7-11, 11-8, 9-11, 11-9తో ఒలివర్ లీలపై; మౌమా దాస్ 11-5, 11-9, 11-6తో మార్టిన్స్ కాటియాపై; షామిని 11-1, 11-4, 11-8తో మైకేల్ ప్యాట్రికాపై గెలిచారు. పురుషుల గ్రూప్ ‘ఎఫ్’ రెండో డివిజన్ రెండో రౌండ్లో టర్కీపై 3-0తో గెలిచిన భారత్... మూడో లీగ్ మ్యాచ్‌లో 0-3తో నైజీరియా చేతిలో ఓడింది. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 11-5, 11-5, 11-7తో గుండుజు ఇబ్రహీంపై; రెండో సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-8, 11-6, 11-7తో మెంజి జెన్కేపై; మూడో సింగిల్స్‌లో ఆంధోని అమల్‌రాజ్ 11-13, 11-4, 11-6, 11-7తో అబ్దుల్లాపై విజయం సాధించారు. తర్వాత నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సౌమ్యజిత్ ఘోష్ 5-11, 4-11, 3-11తో అరుణ ఖాద్రీ చేతిలో; శరత్ కమల్ 13-15, 6-11, 13-11, 5-11తో ట్రయోలా సెగున్ చేతిలో; ఆంథోని అమల్‌రాజ్ 13-11, 8-11, 9-11, 8-11తో అబిడున్ బోడే చేతిలో పరాజయం చవిచూశారు.