Shimron Hetmyer
-
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడి రీ ఎంట్రీ
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (అక్టోబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ చాలాకాలం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. హెట్‌మైర్ 2023 డిసెంబర్లో ఇంగ్లండ్‌పైనే తన చివరి వన్డే ఆడాడు. 2019 డిసెంబర్ నుంచి హెట్‌మైర్ వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అలిక్ అథనాజ్ స్థానంలో హెట్‌మైర్ జట్టులోకి వచ్చాడు. విండీస్ ఇటీవలే శ్రీలంకలో పర్యటించి టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించిన జట్టునే యధాతథంగా (ఒక్క మార్పు) కొనసాగించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విండీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును కూడా నిన్ననే ప్రకటించారు.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు..షాయ్ హోప్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్, జ్యువెల్ ఆండ్రూ, షిమ్రోన్ హెట్‌మైర్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటి, జేడెన్ సీల్స్, రోమారియో షెఫర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్‌స్టోన్ (కెప్టెన్), విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, డాన్ మౌస్లీ, జాకబ్ బేతెల్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, మైఖేల్ కైల్ పెప్పర్, జాఫర్ చొహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్షెడ్యూల్అక్టోబర్ 31- తొలి వన్డే (ఆంటిగ్వా)నవంబర్ 2- రెండో వన్డే (ఆంటిగ్వా)నవంబర్ 6- మూడో వన్డే (బార్బడోస్)నవంబర్ 9- తొలి టీ20 (బార్బడోస్)నవంబర్ 10- రెండో టీ20 (బార్బడోస్)నవంబర్ 14- మూడో టీ20 (సెయింట్ లూసియా)నవంబర్ 16- నాలుగో టీ20 (సెయింట్ లూసియా)నవంబర్ 17- ఐదో టీ20 (సెయింట్ లూసియా) -
రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్‌లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్‌తో తేలనుంది.లీగ్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 28) గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమెజాన్ వారియర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాణించిన హోప్, హోట్మైర్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (26), ఆజమ్ ఖాన్ (26), రొమారియో షెపర్డ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.సరిపోని డుప్లెసిస్ మెరుపులుఅనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్ (59 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్ (21 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్ మెరుపులు సరిపోలేదు. వారియర్స్ బౌలర్లలో మోటీ, మొయిన్, తాహిర్ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్‌ను దెబ్బకొట్టారు.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. -
మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్‌మైర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (37 బంతుల్లో 71; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (34 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆజమ్ ఖాన్ 17 బంతుల్లో 26 పరుగులు.. రొమారియో షెపర్డ్ 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో తీక్షణ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్, కేశవ్ మహారాజ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ మిల్లర్ (34 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. క్వింటన్ డికాక్ ఓ మోస్తరు స్కోర్ (35) చేశాడు. వీరిద్దరు మినహా రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గడకేశ్ మోటీ 3, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో 2, ప్రిటోరియస్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లి మరో 35 పరుగులు చేస్తే.. -
చరిత్ర సృష్టించిన హెట్‌మైర్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మరో అద్బుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో అమెజాన్ వారియర్స్ విజయభేరి మోగిచింది.267 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ 18 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్(33 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 81 పరుగులు) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా బ్యాటర్ల నుంచి ఆశించినంత మేర సహకారం అందకపోవడంతో సెయింట్ కిట్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గయానా బౌలర్లలో స్పిన్నర్లు ఇమ్రాన్ తహీర్, మోటీ తలా మూడు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిటోరియస్ రెండు, కిమో పాల్, రిఫర్ చెరో వికెట్ పడగొట్టారు.హెట్‌మైర్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గయానా బ్యాటర్లలో షిమ్రాన్ హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన హెట్‌మైర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 39 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆటగాడు 11 సిక్స్‌లు సాయంతో 91 పరుగులు చేశాడు.అతడితో పాటు గుర్బాజ్ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.హెట్‌మైర్ వరల్డ్ రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హెట్‌మైర్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా పదికి పైగా సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా హెట్‌మైర్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 11 సిక్స్‌లు బాదిన హెట్‌మైర్ కనీసం ఒక్క ఫోరు కూడా కొట్టకపోవడం విశేషం. అంతకుముందు ఫోరు కూడా లేకుండా అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇంగ్లండ్ ఇంగ్లండ్ ఆటగాడు రికీ వెసెల్స్ పేరిట ఉండేది. 2019లో టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లో నాటింగ్హామ్షైర్పై రికీ వెసెల్స్ బౌండరీ లేకుండా 9 సిక్సర్లు బాదాడు. Shimron Hetmyer is today's Dream11 MVP. pic.twitter.com/dKFLBJoAmp— CPL T20 (@CPL) September 5, 2024 -
SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసిపోయింది. క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన సంజూ శాంసన్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఈసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది.ఇదిలా ఉంటే.. ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ ఆటగాడు షిమ్రన్ హెట్మెయిర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?!..వాళ్లిద్దరు మినహా అంతా విఫలంచెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడ్డ రాజస్తాన్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(42), ఐదో నంబర్ బ్యాటర్(56- నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 ఆశలన్నీ వమ్ముచేసి.. వికెట్ పారేసుకునిసన్రైజర్స్ బౌలర్ల ట్రాప్‌లో చిక్కుకుని పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక పవర్ఫుల్ హిట్టర్‌గా పేరొందిన షిమ్రన్ హెట్మెయిర్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.పద్నాలుగవ ఓవర్లో రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఊహించని రీతిలో బౌల్డ్ అయి వికెట్ పారేసుకున్నాడు. జట్టు తనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేశాడు. ఈ క్రమంలో.. అప్పటికే పరాజయం దిశగా జట్టు పయనించడం.. పార్ట్‌టైమ్ బౌలర్ చేతిలో తనకు భంగపాటు ఎదురుకావడంతో హెట్మెయిర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.పనిష్మెంట్ ఇచ్చిన బీసీసీఐక్రీజును వీడే సమయంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి జరిమానా విధించడం గమనార్హం. ‘‘షిమ్రన్ హెట్మెయిర్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ తేల్చారు. అతడు కూడా తన తప్పును అంగీకరించాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. హెట్మెయిర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్Kavya Maran: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
టీ20 వరల్డ్‌కప్-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోవ్‌మన్ పావెల్ సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్ జట్టులో పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్‌కు చోటు దక్కింది. హెట్‌మైర్ చివరగా గతేడాది డిసెంబర్లో విండీస్ తరపున ఆడాడు. అదేవిధంగా విండీస్ యవ పేస్ సంచలనం షమర్ జోసెఫ్‌కు కూడా ఈ మెగా టోర్నీ జట్టులో సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అదే విధంగా ఈ జట్టులో నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోమారియో షెఫర్డ్ వంటి విధ్వంస ఆటగాళ్లు ఉన్నారు. పేపర్‌పై బలంగా కన్పిస్తున్న కరేబియన్లు తమ సొంత గడ్డపై ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఇక ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోమారియో షెఫర్డ్. -
ఆసీస్‌తో సిరీస్‌లు: విండీస్ జట్ల ప్రకటన.. విధ్వంసకర ఆటగాడిపై వేటు
ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఇవాళ (జనవరి 11) ప్రకటించారు. ఈ సిరీస్‌లతో స్టార్ ఆటగాళ్లు జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వగా.. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్‌పై వేటు పడింది. హెట్‌మైర్‌కు రెండు జట్లలోనూ చోటు దక్కలేదు. వన్డే జట్టుకు షాయ్ హోప్.. టీ20 జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్లుగా ఎంపిక కాగా... పలువురు ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి వచ్చారు. వన్డే జట్టులోకి బ్యాటర్ టెడ్డీ బిషప్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టెవిన్ ఇమ్లాచ్ ఎంట్రీ ఇవ్వగా.. టీ20ల్లోకి ఆల్‌రౌండర్లు జస్టిన్ గ్రీవ్స్, కావెమ్ హాడ్జ్ అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ పర్యటనలో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విండీస్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ టెస్ట్, వన్డే ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. ఆసీస్ సెలెక్టర్లు టీ20 జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు జనవరి 17న మొదలై ఫిబ్రవరి 13తో ముగుస్తాయి. ఆసీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు.. షాయ్ హోప్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్, అలిక్ అథనాజ్, టెడ్డీ బిషప్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, కావెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, గుడకేష్ మోటీ, క్జోర్న్ ఓట్లీ, రొమారియో షెపర్డ్, ఒషేన్ థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్ ఆసీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు.. రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషేన్ థామస్ ఆసీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), తేజ్‌నరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా, అకీమ్ జోర్డన్, గుడకేష్ మోటీ, కీమర్ రోచ్, కెవిన్ సింక్లైర్, టెవిన్ ఇమ్లాచ్, షమార్ జోసెఫ్, జకరీ మెక్‌కాస్కీ వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడికి బిగ్ షాక్..
విధ్వసంకర ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్‌కు వెస్టిండీస్ సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన రెండు టీ20లకు ప్రధాన జట్టు నుంచి హెట్మైర్ను సెలక్టర్లు తప్పించారు. ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హెట్‌మైర్‌పై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక అతడి స్ధానాన్ని మరో డేంజరస్ ఆటగాడు జాన్సెన్ చార్లెస్‌తో విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు జోషఫ్ స్ధానంలో ఓషానే థామస్ జట్టులోకి వచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ట్రినిడాడ్ వేదికగా డిసెంబర్ 20న జరగనుంది. మిగిలిన రెండు టీ20లకు విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్ -
దంచికొట్టిన రొమారియో షెపర్డ్.. ప్రిటోరియస్ ఆల్‌రౌండ్ షో
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. సైమ్ అయూబ్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), షిమ్రోన్ హెట్‌మైర్ (22 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), కీమో పాల్ (31 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ప్రిటోరియస్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), రొమారియో షెపర్డ్ (7 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పేట్రియాట్స్ బౌలర్లలో ఒషేన్ థామస్ 3 వికెట్లు పడగొట్టగా.. కోర్బిన్ బోష్, జార్జ్ లిండే, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. ప్రిటోరియస్ (3-0-17-3), గుడకేశ్ మోటీ (4-0-15-2), రొమారియో షెపర్డ్ (1/19), జూనియర్ సింక్లెయిర్ (1/10), సైమ్ అయూబ్ (1/2) ధాటికి 17.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో అందరూ దారుణంగా విఫలమయ్యారు. కోర్బిన్ బోష్ (27), జార్జ్ లిండే (13), ఆండ్రీ ఫ్లెచర్ (11), యాన్నిక్ కారియా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఓటమితో ప్రస్తుత ఎడిషన్‌లో పేట్రియాట్స్ పరాజయాల సంఖ్య 5కు చేరింది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేదు. 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్‌మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్‌పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
West Indies vs India, 4th T20: వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది . శుభమాన్ గిల్ , యశస్వీ జైస్వాల్‌ల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా వెస్టిండీస్ పై సునాయాసంగా విజయం సాధించింది. టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్మెయిర్ 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అమెరికాలోని ఫ్లోరిడాలో హార్దిక్ సేన.. రోవ్‌మన్ పావెల్ బృందం నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు కైల్ మేయర్స్(17), బ్రాండన్ కింగ్(18)లను పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్ షాయీ హోప్(45) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. నికోలస్ పూరన్(1), రోవ్‌మన్ పావెల్(1)లను ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. హోప్‌నకు తోడైన షిమ్రన్ హెట్మెయిర్(61) అర్ధ శతకంతో అండగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్‌తో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది వెస్టిండీస్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు, కుల్దీప్‌నకు రెండు, చహల్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కరేబియన్ జట్టు ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక తేడా జరిగితే టీమిండియాకు ఘోర పరాభవం తప్పదు. అయితే, బ్యాటింగ్ పిచ్‌పై 179 పరుగుల టార్గెట్ టీమిండియాకు పెద్ద సవాలు కాబోదని అభిమానులు ధీమాగా ఉన్నారు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 -
టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్‌కు దూరమైన విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ టీ20లకు అందుబాటులోకి వచ్చింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పూరన్‌కు చోటు దక్కింది. అమెరికా వేదికగా జరిగిన మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బీజీబీజీగా ఉన్న పూరన్.. భారత్‌తో వన్డేల నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ టోర్నీ సోమవారం(జూలై31)తో ముగియడంతో పూరన్ తన సొంత జట్టుతో కలవనున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో పూరన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఆ ముగ్గురు ఎంట్రీ.. అదే విధంగా దాదాపు ఏడాది నుంచి విండీస్ టీ20 జట్టుకు దూరంగా ఉన్న షెమ్రాన్ హెట్‌మైర్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్, బౌలర్ థామస్‌కు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. వీరు ముగ్గురు చివరగా గతేడాది న్యూజిలాండ్‌పై టీ20ల్లో ఆడారు. ఆగస్టు1న ట్రినిడాడ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం భారత్-విండీస్ మధ్య వన్డే సిరీస్ హోరాహోరీగా జరుగుతోంది. మంగళవారం ట్రినిడాడ్ వేదికగా జరగనున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెఫెర్డ్ ఓడియన్ స్మిత్, ఒషానే థామస్. భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: LPL 2023: మ్యాచ్ మధ్యలో పాము కలకలం.. ఉలిక్కిపడిన క్రికెటర్లు! వీడియో వైరల్ -
అక్కడ ఉన్నది జడ్డూ.. కొంచెం చూసి ఆడాలి కదా బ్రో! వీడియో వైరల్
బార్బోడస్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చిన విండీస్ ఆటగాడు షెమ్రాన్ హెట్‌మైర్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను ఎదుర్కోవడానికి హెట్‌మైర్ చాలా కష్టపడ్డాడు. 19 బంతులు ఎదుర్కొన్న హెట్‌మైర్ ఒక బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. జడేజా బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్న సమయంలో.. హెట్‌మైర్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు చెత్త షాట్ ఆడి వికెట్‌ను చేజార్చుకున్న హెట్‌మైర్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ టీమిండియా అభిమాని స్పందిస్తూ.. "అక్కడ ఉన్నది జడ్డూ..కొంచెం చూసి ఆడాలంటూ" కామెంట్ చేశాడు. తొలి వన్డేలో జడేజా మూడు వికెట్లతో పాటు 16 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించారు. అనంతరం 15 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిండియా బ్యాటర్లలో కిషన్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ Jadeja: Ja Shimron Ja!@imjadeja#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/aBTJmL7ENx — FanCode (@FanCode) July 27, 2023 -
అప్పుడలా జరిగింది.. ఇప్పుడు వేరు! మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం: విండీస్ కెప్టెన్
West Indies vs India, 1st ODI: టీమిండియాతో వన్డే సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తామని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టులో ఉన్న లోపాలు సరిచేసుకుని, సమస్యలు అధిగమించి ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ చాంపియన్ అయిన విండీస్ ఈసారి మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. టాప్-8లో నేరుగా అడుగుపెట్టలేకపోయిన షాయీ హోప్ బృందం.. జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్స్ ఆడింది. ఈ క్రమంలో యూఎస్ఏ, యూఏఈ, నేపాల్ వంటి పసికూనలపై గెలిచిన విండీస్.. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓడి పరాజయాల ఖాతా తెరిచింది. ఘోర పరాభవం అనంతరం.. వర్షం కారణంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ టై కావడం.. ఆపై సూపర్ ఓవర్లో ఓటమి, ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో చిత్తైన నేపథ్యంలో టాప్-2లో నిలవాలన్న వెస్టిండీస్ ఆశలకు గండిపడింది. ఆపై ఒమన్‌పై గెలిచినా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్-10లో అడుగుపెట్టగా.. విండీస్ ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో ఘోర పరాభవం తర్వాత పటిష్ట టీమిండియాతో సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా గురువారం (జూలై 27)న మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన విండీస్ సారథి షాయీ హోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం ‘‘తిరిగి పుంజుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాం. వైవిధ్యమైన వన్డే ఫార్మాట్లో మా నైపుణ్యాలు ప్రదర్శించి.. మేం చేయగలమో ప్రపంచానికి చూపించే మరో అవకాశం దొరికింది. జింబాబ్వేలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలా అయితే విజయం మాదే లోపాలు సరిచేసుకుని మళ్లీ కొత్తగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రతిసారి అందరికీ గెలిచే అవకాశం రాకపోవచ్చు. అయితే, లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం చేసే ప్రయత్నాల్లో మాత్రం లోపం ఉండకూడదు. అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది’’ అని షాయీ హోప్ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు. అతడు తిరిగి రావడం సంతోషం ఇక షిమ్రన్ హెట్మెయిర్ జట్టులోకి తిరిగి రావడంపై స్పందిస్తూ.. ‘‘బౌలర్లపై విరుచుపడుతూ దూకుడగా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. మా జట్టులో ఉన్న నిజమైన ఇంపాక్ట్ ప్లేయర్ అతడు. హెట్మెయిర్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’అని షాయీ హోప్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా షాయీ హోప్‌నకు స్వదేశంలో తొలి వన్డే ఇది. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
టీమిండియాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యారు. పూరన్ అమెరికా వేదికగా జరగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బీజీగా ఉండడతో ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. మరోవైపు హోల్డర్‌కు విండీస్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌తో విండీస్ విధ్వంసకర ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. విండీస్ క్రికెట్ బోర్డ్‌తో విభేదాల కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు హెట్‌మైర్ దూరంగా ఉన్నాడు. అతడు చివరగా 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కరేబియన్ జట్టు తరపున కనిపించాడు. అదే విధంగా వన్డేల్లో అయితే 2021లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఇక అతడితో పాటు పేసర్ ఒషానే థామస్‌కు ఛానాళ్ల తర్వాత విండీస్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమైన లెగ్ స్పిన్నర్ గుడ్కేష్ మోటి కూడా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక జూలై 27న బార్బడోస్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ మొదలు కానుంది. టెస్టు సిరీస్ టీమిండియాదే.. ఇక రెండో టెస్టులో విండీస్‌ను ఓడించి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామన్న టీమిండియా కలనేరవేరలేదు. వర్షం కారణంగా రెండో టెస్టు ఐదో రోజు ఒక్క బంతి కూడా వేయకుండా ఆట రద్దయ్యింది. తొలి టెస్టు గెలిచిన భారత్ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది. భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, జైడెన్ సిన్సీల్స్, రొమారియోక్ల్ సీల్స్. చదవండి: Ind Vs WI 2nd Test Day 5: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్ భారత్‌దే -
రఫ్ఫాడించిన క్లాసెన్.. రాణించిన హెట్‌మైర్
అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో సీటిల్ ఓర్కాస్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, లీగ్‌లో అజేయ జట్టుగా నిలిచింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సీటిల్ ఆర్కాస్ జట్టు.. శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌పై 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో రఫ్ఫాడించగా.. హెట్‌మైర్ (36 నాటౌట్), నౌమన్ అన్వర్ (30), జయసూర్య (33) రాణించారు. యునికార్న్స్ బౌలర్లలో ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, కోరె ఆండర్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యునికార్న్స్.. కెమరూన్ గ్యానన్ (4/23), ఆండ్రూ టై (2/27), ఇమాద్ వసీం (2/24), హర్మీత్ సింగ్ (1/15) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. యునికార్న్స్ ఇన్నింగ్స్‌లో షాదాబ్ ఖాన్ (37) టాప్ స్కోరర్ కాగా.. మాథ్యూ వేడ్ (28), ఫిన్ అలెన్ (28), మార్కస్ స్టోయినిస్ (15), ఆరోన్ ఫించ్ (14), కోరె ఆండర్సన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో డికాక్, క్లాసెన్‌లు కలిసి ఏకంగా 7 క్యాచ్‌లు పట్టడం విశేషం. లీగ్‌లో రేపు జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్లు తలపడనున్నాయి. -
WC Qualifier 2023: జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్
భారత్ వేదికగా జరగననున్న వన్డే ప్రపంచకప్-2023కు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించకపోయిన సంగతి తెలిసిందే. జూన్‌లో జింబాబ్వే వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ ఆడనుంది. ఈ క్రమంలో క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బ్రాండెన్ కింగ్ సారధ్యం వహించనుండగా.. వైస్ కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాది తర్వాత ఆ జట్టు ఆల్‌రౌండర్ కీమో పాల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఈ జట్టులో విధ్వంసకర ఆటగాడు షెమ్రాన్ హెట్‌మైర్‌కు చోటు దక్కపోవడం గమానార్హం. ఇక వరల్డ్‌కప్ క్వాలిఫియర్ జట్టుతో పాటు యూఏఈతో వన్డే సిరీస్‌కు కూడా జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఐపీఎల్-2023లో భాగంగా ఉన్న విండీస్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ సిరీస్ ఆరంభసమయానికి ఐపీఎల్ పూర్తి అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని విండీస్ సెలక్టర్లు నిర్ణయించారు. ఈ సిరీస్ జూన్ 5 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్ యూఏఈ వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, డొమినిక్ డ్రేక్స్, కావెం హాడ్జ్, అకీమ్ జోర్డాన్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రేమోన్ రీఫెర్, ఓడియన్ స్మిత్, డెవాన్ థామస్ -
సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీలైన వద్ద అతను చేసిన విన్యాసం అబ్బురపరిచింది. కొంచెం అటు ఇటు అయినా సిక్సర్ వెళ్లేదే. కానీ హెట్‌మైర్ ఆ తప్పు చేయకుండా చాలా పద్దతిగా.. బ్యాలెన్స్‌తో క్యాచ్ తీసుకోవడం విశేషం. కేకేఆర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్ట్ వేసిన ఓవర్ రెండో బంతిని రాయ్ డీప్ స్వ్కేర్‌లెగ్ దిశగా ఆడాడు. స్లోబాల్ కావడంతో బ్యాట్ ఎడ్జ్‌కు తాకిన బంతి గాల్లోకి లేచింది. అయితే లాంగాఫ్‌లో ఉన్న హెట్‌మైర్ డీప్‌స్క్వేర్ లెగ్ వద్దకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అయితే కొంచెం పట్టు తప్పినా హెట్‌మైర్ బౌండరీ రోప్‌ను తాకేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Shimron Hetmyer takes a stunner to dismiss Jason Roy. pic.twitter.com/6Syx5Whdjo — Cricket is Love ❤ (@cricketfan__) May 11, 2023 చదవండి: 'మా కెప్టెన్ బ్యాటింగ్ విఫలం వెనుక సీక్రెట్ అదే!' -
ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకున్నాం.. రాజస్థాన్ ప్లేయర్ హెట్‌మైర్
ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (ఏప్రిల్ 16) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో గుజరాత్‌పై రాజస్థాన్‌కు ఇది తొట్టతొలి విజయం. ఈ రెండు జట్లు గతంలో (ఐపీఎల్ 2022) ఎదురెదురుపడిన మూడు సందర్భాల్లో గుజరాత్‌నే గెలుపు వరించింది. నాలుగో అటెంప్ట్‌లో రాజస్థాన్ విజయం సాధించడంతో ఆ జట్టు కీలక సభ్యుడు, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ షిమ్రోన్ హెట్‌మైర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా హెట్‌మైర్ మాట్లాడుతూ.. ఎట్టకేలకు తమ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది.. ఈ సందర్భాన్ని వ్యక్తిగతంగా నేను ఆస్వాధిస్తున్నాను.. మాటలు రావడం లేదు.. టైటాన్స్‌పై గెలవడం చాలా కష్టం, ఆ జట్టు నిండా కఠినమైన ఆటగాళ్లు ఉన్నారు, నాలుగో ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించామని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌల్ చేసిన నూర్ అహ్మద్‌ను హెట్‌మైర్ ప్రశంసించాడు. నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనేందుకు నేను ముందుగానే ప్రిపేర్ కావడంతో ఆఖరి ఓవర్లో పరుగులు రాబట్టగలిగానని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ (45), మిల్లర్ (46) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. షిమ్రోన్ హెట్‌మైర్ (26 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు దిగి 215.38 స్ట్రయిక్ రేట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన హెట్‌మైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
GT VS RR: హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు.. రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డు
ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 16, రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ (26 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ (45), మిల్లర్ (46) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. రాజస్థాన్ సైతం 7 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, ఈ మ్యాచ్ పలు ఆసక్తికర గణాంకాలకు వేదికైంది. అవేంటంటే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 2000 ఐపీఎల్ పరుగుల మార్కును అధిగమించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో 2000 పరుగులు పూర్తి చేసి 50 వికెట్లు పడగొట్టిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన షిమ్రోన్ హెటమైర్ ఐపీఎల్లో ఐదో అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ (157.20) కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు (కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్లలో). ఈ విభాగంలో ఆండ్రీ రసెల్ (177.09) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత సీజన్లో పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్ (26/2) నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌కు ఇది మొట్టమొదటి విజయం. గతంలో (2002 సీజన్) ఈ ఇరు జట్లు తలపడిన 3 సందర్భాల్లో గుజరాత్‌నే విజయం వరించింది. -
హెట్‌మైర్ తడాఖా, 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్, గుజరాత్‌కు రాయల్స్ షాక్
అహ్మదాబాద్: ప్రత్యర్థి ఏదైనా... పరిస్థితి ఎలా ఉన్నా... ఆశ కోల్పోకుండా పట్టుదలతో పోరాడితే విజయం సాధ్యమేనని రాజస్తాన్ రాయల్స్ జట్టు నిరూపించింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా గత ఏడాది ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. కెప్టెన్ సంజూ సామ్సన్ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెట్‌మైర్ (26 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్తాన్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. చివరి ఓవర్లో రాజస్తాన్ నెగ్గేందుకు 7 పరుగులు అవసరంకాగా... తొలి బంతికి 2 పరుగులు తీసిన హెట్‌మైర్, రెండో బంతిని సిక్స్‌గా మలిచి రాజస్తాన్‌ను విజయతీరానికి చేర్చాడు. ఒకదశలో రాజస్తాన్ 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే సామ్సన్, హెట్‌మైర్ రాజస్తాన్‌ను ఆదుకున్నారు. ముఖ్యంగా సామ్సన్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి సిక్సర్లతో చెలరేగిపోయాడు. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సామ్సన్ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టాడు. 15వ ఓవర్ చివరి బంతికి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సామ్సన్ అవుటయ్యాడు. దాంతో ఐదో వికెట్‌కు 27 బంతుల్లో 59 పరుగుల సామ్సన్, హెట్‌మైర్ భాగస్వామ్యానికి తెర పడింది. అప్పటికి రాజస్తాన్ గెలిచేందుకు 5 ఓవర్లలో 64 పరుగులు చేయాలి. సామ్సన్ అవుటయ్యాక వచ్చి న ధ్రువ్ జురేల్ (10 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు. రాజస్తాన్ గెలిచేందుకు 2 ఓవర్లలో 23 పరుగులు అవసరంకాగా... షమీ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని ధ్రువ్ సిక్స్‌గా మలిచి తర్వాతి బంతికి అవుటయ్యాడు. వచ్చీరాగానే అశ్విన్ (3 బంతుల్లో 10) 4, 6 కొట్టి పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో హెట్‌మైర్ మిగతా పనిని పూర్తి చేశాడు. అంతకుముందు గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు సాధించింది. గిల్ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి అండ్ బి) బౌల్ట్ 4; గిల్ (సి) బట్లర్ (బి) సందీప్ శర్మ 45; సాయి సుదర్శన్ (రనౌట్) 20; హార్దిక్ పాండ్యా (సి) యశస్వి (బి) చహల్ 28; డేవిడ్ మిల్లర్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ శర్మ 46; అభినవ్ మనోహర్ (సి) పడిక్కల్ (బి) జంపా 27; తెవాటియా (నాటౌట్) 1; రషీద్ ఖాన్ (రనౌట్) 1; అల్జారి జోసెఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–5, 2–32, 3–91, 4–121, 5–166, 6–175, 7–176. బౌలింగ్: బౌల్ట్ 4–0–46–1, సందీప్ శర్మ 4–0–25–2, జంపా 4–0–32–1, అశ్విన్ 4–0–37–0, చహల్ 4–0–36–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) గిల్ (బి) హార్దిక్ 1; బట్లర్ (బి) షమీ 0; పడిక్కల్ (సి) మోహిత్ శర్మ (బి) రషీద్ ఖాన్ 26; సంజూ సామ్సన్ (సి) మిల్లర్ (బి) నూర్ అహ్మద్ 60; రియాన్ పరాగ్ (సి) మిల్లర్ (బి) రషీద్ ఖాన్ 5; హెట్‌మైర్ (నాటౌట్) 56; ధ్రువ్ జురేల్ (సి) మోహిత్ శర్మ (బి) షమీ 18; అశ్విన్ (సి) తెవాటియా (బి) షమీ 10; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–4, 3–47, 4–55, 5–114, 6–161, 7–171. బౌలింగ్: షమీ 4–1–25–3, హార్దిక్ పాండ్యా 4–0–24–1, అల్జారి జోసెఫ్ 3–0–47–0, రషీద్ ఖాన్ 4–0–46–2, మోహిత్ శర్మ 2–0–7–0, నూర్ అహ్మద్ 2.2–0–29–1. -
ఒక్కదాని కోసం ముగ్గురు పరిగెత్తుకొచ్చారు.. చివరికి?
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ట్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని సాహా భారీ షాట్‌కు యత్నించగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. అయితే క్యాచ్ అందుకోవడం కోసం అటు శాంసన్.. ఇటు హెట్‌మైర్.. మధ్యలో జురెల్ దూసుకొచ్చాడు. ఒకరితో ఒకరు సమన్వయం లేకుండా పరిగెత్తుకొచ్చి చివరికి ఎవరు క్యాచ్ తీసుకోలేదు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ముగ్గురు చేతుల్లో నుంచి మిస్సైన బంతిని మళ్లీ బౌల్డ్ సురక్షితంగా అందుకున్నాడు. దీంతో ఎటు తిరిగి సాహా అయితే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే హెట్‌మైర్, శాంసన్, జురేల్ చర్య మాత్రం నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Caught 𝚂̶𝚊̶𝚖̶𝚜̶𝚘̶𝚗̶, 𝙷̶𝚎̶𝚝̶𝚝̶𝚒̶𝚎̶, 𝙹̶𝚞̶𝚛̶𝚎̶𝚕̶ & Boult⚡ #GTvRR #TATAIPL #IPL2023 #IPLonJioCinema #TrentBoult | @rajasthanroyals pic.twitter.com/omaWl0QeLo — JioCinema (@JioCinema) April 16, 2023 చదవండి: సాయపడడంలోనూ మనోడు ముందువరుసలోనే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి'
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఒక జట్టు ఎలా ఆడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక మెగాటోర్నీలో అసలు మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే క్వాలిఫయింగ్ పోరులోనే వెనుదిరిగితే అభిమానుల ఆగ్రహం తట్టుకోవడం కష్టం. తాజాగా వెస్టిండీస్‌కు ఇలాంటి సంకట పరిస్థితే ఎదురైంది. ఎవరు ఊహించని విధంగా టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన వెస్టిండీస్ క్వాలిఫయింగ్ దశలోనే టోర్నీ నుంచి నాకౌట్ అయి ఆశ్చర్యపరిచింది. ఐర్లాండ్‌కు విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయని విండీస్ బౌలర్లు జట్టుకు 9 వికెట్లతో దారుణ పరాజయాన్ని కట్టబెట్టారు. విండీస్ ఆటతీరు ఆ దేశ అభిమానులకు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోవడం ఖాయం. ఇక విండీస్ ఓటమిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. హెట్‌మైర్ శాపం తగిలింది.. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ స్టార్ షిమ్రోన్ హెట్‌మైర్ ఆస్ట్రేలియాకు వెళ్లే ఫ్లైట్ మిస్ అయ్యాడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో హెట్‌మైర్ చివరి నిమిషంలో విమానం ఎక్కలేకపోయాడు. అయినప్పటికి విండీస్ బోర్డు మరోసారి అవకాశం ఇచ్చింది. కానీ హెట్‌మైర్ ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన తప్పిదంతో టి20 ప్రపంచకప్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఇది జరిగిన విషయం అయితే అభిమానులు మాత్రం.. ''వెస్టిండీస్ జట్టుకు హెట్‌మైర్ శాపం తగిలిందని.. అందుకే కనీసం క్వాలిఫయర్ దశ కూడా దాటలేకపోయిందంటూ'' కామెంట్స్ చేశారు. ''రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికి కొన్ని కారణాల వల్ల అతను ఫ్లైట్ ఎక్కలేదు.. నిజమే కానీ మరొక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికి సమయం ఉంది.. హెట్‌మైర్‌కు ఆ చాన్స్ ఇవ్వకుండా జట్టులో నుంచి తొలగించారు.. ఒకవేళ హెట్‌మైర్ ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో'' అంటూ పేర్కొన్నారు. అయితే కొందరు అభిమానులు మాత్రం.. ''అంతలేదు.. ఎవరి శాపం తగల్లేదు. జట్టు మొత్తంగా ఏం చేయలేనిది హెట్‌మైర్ ఒక్కడు ఏం చేయగలడు.. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి.. గెలవాలంటే కసిగా ఆడాలి.. అంతే తప్ప ఇలాంటి శాపాలు వల్లే ఓడిపోయిందంటే ఎవరు నమ్మరు'' అంటూ ఘాటుగా స్పందించారు. ఏది ఏమైనా విండీస్ జట్టు మాత్రం టి20 ప్రపంచకప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించి అభిమానులను బాధపెట్టింది. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్‌కు ఇలాంటి దుస్థితి రావడంపట్ల క్రికెట్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. ఇక విండీస్ జట్టుపై వస్తున్న ట్రోల్స్‌పై ఒక లుక్కేయండి. Acha hai flight miss hogai !#IREvsWI #T20worldcup22 pic.twitter.com/VbzoyB2E2B — ABBAS (@Abbas196_) October 21, 2022 2 Times World Champions West Indies out of the tournament, congratulations Ireland to making it to the Super12👏 #T20WorldCup #T20worldcup22#PakVsInd #Super12s pic.twitter.com/w8qqEYG5GT — Muhammad zeeshan (@zeshanmohmnd) October 21, 2022 2 time champions West Indies are out in the 1st round. Sad decline of West Indies cricket.#WIvsIRE #T20worldcup22 pic.twitter.com/Nw3VUv8n9O — John James (@jamesnotabond) October 21, 2022 #WIvsIRE #T20WorldCup West Indies got punished for punishing Shimron Hetmyer. 💀 pic.twitter.com/ZaciRSdxdP — 👌⭐👑 (@superking1815) October 21, 2022 చదవండి: నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి? ప్రాక్టీస్ చేస్తుండగా ఫ్యాన్స్ కేరింతలు! సీరియస్ అయిన కోహ్లి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం
వెస్టిండీస్ స్టార్.. హార్డ్ హిట్టర్ షిమ్రన్ హెట్‌మైర్ టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే గాయంతో దూరమయ్యాడనుకుంటే పొరపాటే. ఫ్లైట్ మిస్ అయిన కారణంగా ఆఖరి నిమిషంలో మేనేజ్మెంట్ హెట్మైర్ను జట్టు నుంచి తప్పించింది. కాగా హెట్‌మైర్ స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా హెట్‌మైర్ రీ షెడ్యూల్ ఫ్లైట్‌ను కూడా మిస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. విషయంలోకి వెళితే.. మొన్నటి దాకా కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో హెట్‌మైర్ గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే టి20 ప్రపంచకప్ ఆడేందుకు మిగతా జట్టంతా కాస్త ముందుగానే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సీపీఎల్‌లో ఫైనల్ చేరిన రెండు జట్లలోని ఆటగాళ్లకు(టి20 ప్రపంచకప్‌కు ఎంపికైన వాళ్లు) మాత్రం అక్టోబర్ 1న ఆస్ట్రేలియా వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. టి20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 5, 7 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. హెట్‌మైర్ మాత్రం వ్యక్తిగత కారణాల రిత్యా అక్టోబర్ 1న వెళ్లలేనని విండీస్ బోర్డుకు తెలిపాడు. దీంతో విండీస్ బోర్డు అక్టోబర్ 3న హెట్‌మైర్‌కు ఫ్లైట్‌ను రీషెడ్యూల్ చేసింది. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టి20కి కూడా హెట్‌మైర్ అందుబాటులో ఉండడని క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు. అంతేకాదు ఈసారి ఫ్లైట్ మిస్ అయితే మాత్రం టి20 ప్రపంచకప్‌కు దూరమవ్వాల్సి ఉంటుందని హెట్మైర్ను బోర్డు హెచ్చరించింది. అయితే హెట్‌మైర్ మాత్రం రీషెడ్యూల్ ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. ''కొన్ని కారణాల రిత్యా ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాను.. సారీ ఫర్ డిలే'' అంటూ బోర్డుకు సమాచారమిచ్చాడు. కాగా హెట్‌మైర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు.. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముందుగా హెచ్చరించిన ప్రకారం రీషెడ్యూల్ ఫ్లైట్ ఎక్కకపోతే హెట్మైర్ను టి20 ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయానికే ప్యానెల్ కట్టుబడింది. ఇందుకు ప్యానెల్ సభ్యులు కూడా యునానిమస్‌గా ఒప్పుకోవడంతో హెట్మైర్ను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. ''హెట్‌మైర్ విషయంలో మేం క్లారిటీగా ఉన్నాం. రీషెడ్యూల్ ఫ్లైట్ కూడా మిస్ అయితే జట్టు నుంచి తప్పిస్తామని ముందే హెచ్చరించాం. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్ మరోసారి ఫ్లైట్ మిస్ అయ్యాడు. దీంతో రూల్ ప్రకారం అతన్ని జట్టు నుంచి తప్పించాం. అతని స్థానంలో బ్రూక్స్‌ను ఆస్ట్రేలియాకు పంపించాం'' అంటూ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు. ఇక సీపీఎల్ 2022లో షమ్రా బ్రూక్స్ సెంచరీతో చెలరేగి తన జట్టు జమైకా తలైవాస్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫైనల్లో బార్బడోస్ రాయల్స్‌ను ఓడించిన జమైకా తలైవాస్ సీపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఇక అక్టోబర్ 17న స్కాట్లాండ్తో జరిగే మ్యాచ్‌తో వెస్టిండీస్ తమ ప్రపంచకప్ ఆటను షురూ చేయనుంది. వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టు: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవమన్ పోవెల్, యన్నిక్ కరై, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షమారా బ్రూక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఓబెడ్ మెక్‌కామ్, రేమన్ రీఫర్, ఓడియన్ స్మిత్ చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
తొలి సారి కెప్టెన్‌గా షిమ్రాన్ హెట్‌మైర్.. ఏ జట్టుకంటే..?
సీపీఎల్-2022 సీజన్‌కు గానూ గయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్‌గా విండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ ఎంపికయ్యాడు. నికోలస్ పూరన్ స్థానంలో గయానా సారథిగా హెట్‌మైర్ నియమితుడయ్యాడు . ఈ ఏడాది సీజన్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున నికోలస్ పూరన్ ఆడనుండడంతో గయానా మేనేజేమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. హెట్‌మైర్ 2016లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అగేంట్రం చేసినప్పటి నుంచి అమెజాన్ వారియర్స్ జట్టలోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు పూరన్, షోయబ్ మాలిక్, క్రిస్ గ్రీన్ కెప్టెన్సీలో గయానాకు ప్రాతినిధ్యం వహించాడు. "2013 సీజన్ తర్వాత మా తొలి కెప్టెన్‌గా షిమ్రాన్ హెట్‌మైర్ నియమితుడైనందుకు మేము సంతోషిస్తున్నాము. గత కొన్ని సీజన్ల నుంచి హెట్‌మైర్ మా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అతడు నాయకత్వం వహించడానికి ఇదే సరైన సమయం" అని అమెజాన్ వారియర్స్ చైర్మన్ బాబీ రామ్‌రూప్ పేర్కొన్నారు. ఇక సీపీఎల్‌లో ఇప్పటివరకు 47 మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ 1149 పరుగులు సాధించాడు. కాగా కరీబీయన్ ప్రీమియర్ లీగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో జమైకా తల్లావాస్, సెయింట్ కిట్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: ENG vs SA: పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది!