Silicon Valley
-
క్రికెట్ జట్టు కోసం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిడ్ దాఖలు
ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్టియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ లేదా ‘లండన్ స్పిరిట్’ టీమ్‌ల కోసం 80 మిలియన్ పౌండ్ల (97 మిలియన్ డాలర్లు-రూ.805.1 కోట్లు) బిడ్ వేస్తోంది.ఈ కన్సార్టియంకు పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ ఎనిమిది జట్లలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీఈ) చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.100-బాల్ ఫార్మాట్‌తో ‘ది హండ్రెడ్’100-బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది స్కై స్పోర్ట్స్, బీబీసీలో ప్రసారం అవుతుంది.ఇదీ చదవండి: ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలుటెక్ కంపెనీ సీఈఓలకు ఆసక్తిసుందర్ పిచాయ్‌కు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథులు క్రికెట్‌పై ఆసక్తిగా ఉంటూ దాన్ని మరింత మందికి చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిగాఉండగా, ఈసీబీ ప్రతి జట్టులో 49 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. -
ఆయనదే విజన్.. ఇతరులది భజన్ భజన్!
ఫలానా అభివృద్ధికి మేమే కారణం అంటూ అరిగిపోయిన రికార్డులాగా.. ఏళ్లు గడుస్తున్నా గప్పాలు కొట్టుకుంటూ తిరిగే నేతల్ని ఇంకా మనం చూస్తున్నాం. అయితే చర్చల ద్వారా మేధావులు అందులో ఎంత వాస్తవం ఉందనేది వెలికి తీసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. అయినా అలాంటి నేతల తీరు మారడం లేదు. అయితే ఈ దారిలో సోమనహల్లి మల్లయ్య కృష్ణ(SM Krishna) ఏనాడూ పయనించలేదు.దేశంలో కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఏమాత్రం పట్టుకోల్పోకుండా ఐటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే.. భారత్‌కు సెమీకండక్టర్ హబ్‌గానూ పేరుగాంచింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరును ఇవాళ పిలుచుకుంటున్నాం. అయితే.. ఈ నగరానికి ఇంతలా ఘనత దక్కడానికి ఎఎస్ఎం కృష్ణ చేసిన కృషి గురించి కచ్చితంగా చెప్పుకుని తీరాలి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 1999-2004 మధ్య పని చేశారు. అదే టైంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా స్వయంప్రకటిత విజనరీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎస్ఎం కృష్ణతో పోలిస్తే అప్పటికే చంద్రబాబు ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పని చేసి ఉన్నారు. పైగా హైటెక్ సిటీలాంటి కట్టడంతో కొంత పేరూ దక్కించుకున్నారు. అయితే నిజంగా చంద్రబాబు తాను చెప్పుకునే విజన్‌తో.. తన రాజకీయానుభవం ఉపయోగించి ఉంటే ఆనాడే హైదరాబాద్ ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ ఘనత దక్కించుకుని ఉండేదేమో!. కానీ, ఎస్ఎం కృష్ణ తన రియల్ విజన్‌తో ఆ ట్యాగ్‌ను బెంగళూరుకు పట్టుకెళ్లిపోయారు.విజన్ అంటే ఇది.. 1999 టైంలో.. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఐటీ సంస్థలు భారత్‌లో తమ తమ కంపెనీలకు అనుకూలమైన స్పేస్ కోసం వెతుకుతున్నాయి. అప్పటికీ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటైనా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ నడిచింది. మరోవైపు ఆపాటికే బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటైంది. ఇదే అదనుగా ఐటీ కంపెనీలను ఎలాగైనా బెంగళూరుకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఎస్ఎం కృష్ణ.. ఆ పరిశ్రమ వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. ఐటీ పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టెక్ కంపెనీలను బెంగళూరులో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి ఆకర్షించింది. అలాగే.. ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అనే అంశాలపై అప్పటికే ఐటీ మేధావులతో ఆయన చర్చలు జరిపి ఉన్నారు. పన్ను ప్రోత్సాహకాలు, సరళీకృత నిబంధనలతో పాటు స్టార్టప్‌లకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తద్వారా వాళ్ల అవసరాలకు అనుగుణంగా తెచ్చిన సంస్కరణలు.. బెంగళూరులో టెక్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేశాయి.ఇక.. ఒకవైపు ఐటీ రంగం కోసం ప్రతిభావంతులైన నిపుణుల అవసరాన్ని గుర్తించి విద్యతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఐటీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, శిక్షణా సంస్థల స్థాపనకూ ప్రాధాన్యత ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా.. అంతర్జాతీయ వేదికలపై బెంగళూరును ఎస్ఎం కృష్ణ ప్రమోట్ చేశారు. తద్వారా భాగస్వామ్యాలను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగారు. బాబు విజన్.. వాస్తవం ఎంత?‘‘హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే’’ అంటూ హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఒక భ్రమను కల్పించారనే వాదన ఒకటి ఉంది. కానీ, అంతకు ముందే హైదరాబాద్‌కు టెక్ కంపెనీల రాక మొదలైంది. నగరానికి 1965లోనే ఈసీఐఎల్, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు మూలం అయ్యింది. 1982లో సీఎంసీ ఆర్ అండ్ డీ వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ సంస్థ. బెంగళూర్ కన్నా మూడేళ్ల ముందే అది హైదరాబాద్‌కు వచ్చింది. దాన్ని ఆ తర్వాత టీసీఎస్‌కు అమ్మేశారు.ఇక.. 1987లో ఇంటర్‌గ్రాఫ్ హైదరాబాద్‌లోని బేగంపేటలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ.. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఐటీ వృద్ధికి కృషి జరిపారు. ఈ క్రమంలోనే మైత్రీవనంలో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది. ఆ తర్వాత మాదాపూర్ ప్రాంతంలో ‘‘హైటెక్ సిటీ’’కి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రీవనంలోని సంస్థలు అక్కడికి తరలిపోయాయి.కర్ణాటక సీఎంగా ఎస్ఎం కృష్ణ వ్యూహాత్మక దృక్పథం, ఆయన విశేషకృషి వల్లే బెంగళూరు భారతదేశ ఐటీ విప్లవానికి పర్యాయపదంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనే బిరుదును సంపాదించుకోగలిగింది. అయితే ఇతరుల్లా ఏనాడూ ఆయన ఆ ఘనతను.. తన ఘనతగా తర్వాతి కాలంలోనూ చెప్పుకుంది లేదు!.ఎస్ఎం కృష్ణకి నివాళిగా.. -
ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌లకు బూస్ట్
వాషింగ్టన్: ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తూ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. దీన్నొక చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని టీఐఈ సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ అనిత మన్వానీ అన్నారు. దేశ వృద్ధికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతుండడాన్ని చూడొచ్చు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా, సేవలరంగం, తయారీలో మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా నేపథ్యంలో ఏంజెల్ ఇన్వెస్టర్లను పన్ను నుంచి మినహాయించే ఇలాంటి చట్టాలే అవసరం. ఇది భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నిబంధనల అమలుకు బదులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుంది. అంతిమంగా ఈ నిర్ణ యం భారత్–యూఎస్ కారిడార్‌లో ఏంజెల్ పెట్టు బడులను పెంచుతుంది’’అని మన్వానీ వివరించారు. పలువురు ఇతర పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిర్ణయాన్ని అభినందించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో ఏంజెల్ ట్యాక్స్ రద్దు కోసం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. స్టార్టప్‌కు నిధులు పెరుగుతాయి.. భారత ప్రభుత్వ నిర్ణయంతో స్టార్టప్‌లకు స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి పెట్టుబడుల సా యం పెరుగుతుందని యూఎస్ ఇండియా వ్యూహా త్మక భాగస్వామ్య సంస్థ పేర్కొంది. ఏంజెల్ ట్యాక్స్ రద్దు ద్వైపాక్షిక సాంకేతిక సహకారం, ఆవిష్కరణల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని యూ ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ తెలిపింది. ‘‘భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థకు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. స్టార్టప్ ఎకోసిస్టమ్ రాణించేందుకు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పోటీతత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది’’ అని యూఎస్ఏ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కరుణ్ రిషి పేర్కొన్నారు. రిపాట్రియేషన్లోనూ సంస్కరణలు అవసరం స్వదేశానికి నిధుల తరలింపులో(రిపాట్రియేషన్ )నూ సంస్కరణలు అవసరమని మన్వానీ అభిప్రాయపడ్డారు. ‘‘రిపాట్రియేషన్ అన్నది అధిక శాతం ఎన్ఆర్ఐలు, ఇన్వెస్టర్లకు ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలోనూ నిబంధనలను సడలించాలి. నేడు ఎవరైనా యూఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిపా్రటియేషన్కు సంబంధించి ఇదే విధమైన నిబంధనలు, నియంత్రణలను భారత్ కూడా పాటించొచ్చు’’అని మన్వానీ తెలిపారు. -
‘నో ఇంగ్లీష్.. నో హిందీ.. ఓన్లీ కన్నడ’.. మహిళ ట్వీట్ వైరల్
బెంగళూరు : కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో సిద్ధరామయ్య ఆ ట్వీట్‌ను తొలగించారు. అయినప్పటికీ దుమారం కొనసాగుతూనే ఉంది.ఈ తరుణంలో బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తాను ‘కన్నడ భాష విషయంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాను. అందుకే బెంగళూరు వదిలి వెళ్లిపోతున్నాను’ అంటూ చేసిన థ్రెడ్ పోస్ట్‌కి 14 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి.పంజాబ్‌కు చెందిన షానీనాని ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏడాదిన్నపాటు ఉన్నారు. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ లిమిటెడ్ సంస్థలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో బెంగళూరులో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.నాకు పెళ్లైంది. ఏడాది పాటు పంజాబి సంప్రదాయ వస్త్రదారణలో ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నా వస్త్రదారణ చూసిన వారు నేను పంజాబీ అని గుర్తించేవారు. ఆఫీస్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో ఎక్కాల్సి వచ్చినా, లేదంటే ఇతర వస్తువులు కొనుగోలు చేసిన మార్కెట్ రేటు కంటే తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు మొహం మీదే కన్నడ నేర్చుకోమని వివక్షచూపుతూ మాట్లాడేవారు.ఓరోజు నా ఆఫీస్‌లో కరెంట్యింది. వెంటనే ఆఫీస్‌లోని ఎలక్ట్రిక్ విభాగానికి నేరుగా ఫిర్యాదు చేశా. అక్కడ కూడా నాకు చేదు అనుభవమే ఎదురైంది. అందులో ఓ ఉద్యోగికి సమస్యను పరిష్కరించాలని హిందీ, ఇంగ్లీష్‌లో అడిగా. నో హిందీ,నో ఇంగ్లీష్.. ఓన్లీ కన్నడ.. కన్నడలో మాట్లాడండి. మీసమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో కంగుతినట్లు చెప్పారు.ఇలా వర్ణించలేని ఇబ్బందులు ఎదుర్కొన్నాని, అందుకే బెంగళూరు వదిలి గురుగ్రామ్ వెళ్లినట్లు చెప్పారు. నేను నా ఇంటికి వచ్చా. సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజులు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. మంచి ఆహారం తింటాను, నేను కోరుకున్న చోటికి వెళ్లగలుగుతున్నాను అని వ్యాఖ్యానించారు. కాగా, చాలా మంది నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కన్నడ నేర్చుకుంటే తప్పేముంది.’ అని కామెంట్లు చేస్తున్నారు. -
సిలికాన్ వ్యాలీకి దీటుగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ‘అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా విశాఖ రూపుదిద్దుకుంటోంది. ఆ దిశగా అభివృద్ధిలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచస్థాయి ప్రఖ్యాత నగరాలతో పోటీపడేందుకు అవసరమైన అన్ని వనరులు, మౌలిక వసతులు, హంగులు, సదుపాయాలు ఈ నగరానికి ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వైజాగ్‌కు మహర్దశ పట్టింది. గ్రోత్ కారిడార్‌గానూ వృద్ధి చెందుతోంది. పరిపాలనా రాజధాని అయ్యాక అభివృద్ధిలో మరింత వేగం పుంజుకుంటుంది. రూ.వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ మహానగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. రానున్న పదేళ్లలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా ఎదుగుతుంది’ అని ‘విజన్ విశాఖ కాంక్లేవ్’లో విద్యారంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు పేర్కొన్నారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. అమెరికా సిలికాన్ వ్యాలీ జీడీపీ వృద్ధిలో అగ్రగామిగా ఉందని, విశాఖపట్నం కూడా అందుకు తీసికట్టు కాదని చెప్పారు. అక్కడ అభివృద్ధిలో స్టాన్ఫోర్డు యూనివర్సిటీ మాదిరిగానే ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కూడా దోహదపడుతోందని, సీఎం వైఎస్ జగన్ సహకారంతో ఏయూలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ‘విశాఖలో భారీ పరిశ్రమలు, స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డు, తూర్పు నావికదళ ప్రధాన కేంద్రం, బీహెచ్ఈఎల్, పోర్టులతోపాటు రోడ్డు, రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నాయి. వేలాది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ డేటా సెంటర్, బీచ్ కారిడార్లు వస్తున్నాయి. విశాఖ–హైదరాబాద్, విజయవాడ–కడప–బెంగళూరులకు హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రధానితో చర్చిస్తానని సీఎం చెప్పారు. అడగకుండానే విశాఖ అభివృద్ధికి తపించే ముఖ్యమంత్రి మనకున్నారు. ఆయనకు మనమంతా సహకరిద్దాం. రూ.వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. గ్రోత్ కారిడార్‌గా మారుతుంది. వచ్చే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో విశాఖ పోటీ పడుతుంది’ అని ప్రసాదరెడ్డి వివరించారు. కాంక్లేవ్‌లో ఏయూ రిజిస్ట్రార్ ఎం.జేమ్స్ స్టీఫెన్, ఇన్ఫినిటం మీడియా సీఈవో రాహుల్ రాఘవేంద్ర, స్టూడెంట్ ట్రైబ్ సీఈవో సాయిచరణ్, విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, ఐఐఎం విశాఖ ఫీల్డ్ సీఈవో గుహేష్ రామనాథన్, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖకు ప్రచారం అక్కర్లేదు విశాఖకు ప్రచారం అక్కర్లేదు. ఇక్కడి వారంతా వైజాగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లే. ఇక్కడ ప్రఖ్యాత పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, కేంద్ర ప్రభుత్వ, రక్షణరంగ సంస్థలు, విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. విశాఖ ఎందరికో మంచి అవకాశాలు కల్పిస్తోంది. అందుకే ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. – బీకే సాహు, చైర్మన్, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆకర్షణీయ నగరం విశాఖ పెట్టుబడులను ఆకర్షించే నగరం. ఇక్కడ ఉన్నన్ని వనరులు రాష్ట్రంలో మరెక్కడా లేవు. అన్ని రవాణా సదుపాయాలూ ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉండటంతో పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. వ్యాపార ఉన్నతికి విశాఖ భాగ్యనగరం. – ఆంజనేయవర్మ, వైస్ ప్రెసిడెంట్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ అభివృద్ధికి జగన్ కృషి పుష్కలమైన వనరులతో ఇప్పటికే విశాఖ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. మంచి కనెక్టివిటీ ఉంది. ఇప్పటివరకు రాష్ట్రాన్ని మంచిగా ఐదారుగురు ముఖ్యమంత్రులు పాలించారు. వీరిలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ లీడర్. రాష్ట్రంతోపాటు విశాఖ అభివృద్ధికిపాటు పడుతున్నారు. – డి.సూర్యప్రకాశరావు, వీసీ, డీఎస్ఎన్ లా విశ్వవిద్యాలయం -
అదే బెంగళూరు కొంపముంచుతోంది.. ఏడాదికి వేల కోట్లలో నష్టం!
కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఇప్పుడే ఈ మెట్రోపాలిటన్ సిటీ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల కార్యకలాపాలతో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ట్రాఫిక్ రద్దీతో అంతే అపఖ్యాతి పాలవుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఆలస్యం, రద్దీ, సిగ్నల్స్ ఆగిపోవడం, ట్రాఫిక్ వల్ల సమయం వృధా అవ్వడం, వాహనాల్లో ఇంధనం వృధా ఖర్చు వంటి ఇతర కారణాల వల్ల సంవత్సరానికి రూ.19,725 కోట్ల నష్టం వాటిల్లితున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి అతని బృందం రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల లోటుకు సంబంధించిన సమస్యలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో బెంగళూరు నగరంలో 60 పూర్తిస్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ, ఆలస్యం, రద్దీ, సిగ్నల్ల వద్ద ఆగిపోవడం, వేగంగా వెళ్లే వాహనాలు, ఇంధన నష్టం, నెమ్మదిగా వెళ్లడం వంటి కారణాలతో బెంగళూరు వాహనదారులకు రూ. 19,725 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం హైలెట్ చేసింది. వేగంగా విస్తరిస్తున్న ఐటీ రంగం బెంగళూరులో రోజు రోజుకీ ఐటీ రంగం మరింత వృద్ది సాధిస్తోంది. తద్వారా హౌసింగ్,ఎడ్యుకేషన్‌తో పాటు వివిధ రంగాల అభివృద్దిలో పాలు పంచుకుంటుంది.వెరసీ బెంగళూరులో అసాధారణ జనాభా పెరుగుదల 14.5 మిలియన్లు ఉండగా వెహికల్ పాపులేషన్ 1.5 కోట్లుగా ఉంది. మరింత విస్తరిస్తున్న బెంగళూరు అంచనా ప్రకారం.. ఈ ఏడాది బెంగళూరు నగరం మరింత విస్తరిస్తోంది. 88 స్కైర్ కిలోమీటర్ల నుంచి 985 కిలోమీటర్లకు పెరిగింది. నగరం 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని అధ్యయనం ప్రతిపాదించింది. మరోవైపు, రహదారి పొడవు పెరుగుదల వాహనాల పెరుగుదల, విస్తీర్ణం పెరుగుదలకు సమానంగా లేదు. రహదారి మొత్తం పొడవు సుమారు 11,000 కిలోమీటర్లు. రవాణా డిమాండ్, చేసే ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోదని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కొరత ఆ నగర వాసుల్ని తీవ్రంగా వేధిస్తుంది. ఆలస్యం, రద్దీ, ప్రయాణం వంటి కారణాల వల్ల సామానులపై పరోక్షంగా ఖర్చుల భారం పడుతుంది. ఆర్ధికంగా నష్టపోతున్నారని శ్రీహరి అన్నారు. అంతేకాదు, తాము జరిపిన ఈ సర్వేలో ట్రాఫిక్ కారణంగా ఏడాదికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందని, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎలాన్ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు?
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ డిప్రెషన్ వంటి మానసిక సమస్యతో బాధపడుతున్నారంటూ పలు సంచలన నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, రోజూవారీ ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మస్క్ పార్టీలకు వెళ్తుంటారు. ఆ సమయంలో మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కెటామైన్ (డిప్రెషన్ తగ్గించుకునేందుకు వినియోగించుకునే మెడిసిన్) అనే మందును ఎక్కువ డోస్‌లో తీసుకుంటున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. అంతేకాదు, డిప్రెషన్ నుంచి తాను బయటపడేందుకు తక్కువ మోతాదులో కెటామైన్‌ను తీసుకుంటున్నట్లు మస్క్ తన స్నేహితులకు చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఆ రిపోర్ట్‌ను ఊటంకించేలా.. మస్క్ డిప్రెషన్ నుంచి కోలుకునేలా కెటామైన్ ఎలా ఉపయోగపడుతుందనే తదితర అంశాలపై ట్విట్ చేశారు. ఆ ట్విట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Depression is overdiagnosed in the US, but for some people it really is a brain chemistry issue. But zombifying people with SSRIs for sure happens way too much. From what I’ve seen with friends, ketamine taken occasionally is a better option. — Elon Musk (@elonmusk) June 27, 2023 డిప్రెషన్ అనేది బ్రెయిన్ సంబంధిత సమస్య. యుఎస్‌లో ఈ మానసిక సమస్యతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కెటామైన్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది జాంబిఫైయింగ్ బారిన పడేందుకు అవకాశం ఉన్న సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ (ssri) అనే మెడిసిన్‌ను తీసుకుంటున్నారని ట్వీట్లో మస్క్ తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ (wsj) నివేదికల ప్రకారం.. మస్క్ ఆరోపిస్తున్నట్లుగా మత్తెక్కించే కెటామైన్ అనే డ్రగ్‌ను తీసుకునే కల్చర్ సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటీవ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మార్కెట్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని వ్యాపారంలో పనితీరు మెరుగు పరుచుకోవడంతో పాటు సృజనాత్మకత కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ కంపెనీల్లో సీఈవోలు, ఫౌండర్లు కెటామైన్, మ్యాజిక్ మష్రూమ్‌లు, లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (ఎల్ఎస్డీ) మత్తు పదార్ధాల్ని తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే ప్రస్తావించింది. వారిలో గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ 'మ్యాజిక్ మష్రూమ్'లను తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే నివేదించింది. ఈ మ్యూజిక్ మష్రూమ్‌లలో శరీరాన్ని మత్తెక్కించే సైలోసిబిన్ (psilocybin) అనే రసాయనం ఉంటుంది. 2018లో పాడ్‌కాస్ట్ జరిగే సమయంలో ఇలా సంచలనాత్మక కామెంట్లతో నిత్యం నెటిజన్ల నోళ్లలో నానే ఎలాన్ మస్క్‌కు తాజా ట్విట్లు కొత్తవేం కావనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. 2018లో జో రోగన్ పోడ్కాస్ట్ ఎపిసోడ్లో గంజాయి తాగి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఈ సంఘటన తర్వాత తనకు, స్పేస్ఎక్స్ ఉద్యోగులకు రెగ్యులర్ డ్రగ్ టెస్ట్‌లు జరుగుతున్నాయని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. కెటామైన్ వినియోగం.. అమెరికాలో అనుమతి కెటామైన్ డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఉపయోగించే మెడిసిన్. అమెరికాలో దీని వినియోగంపై నియంత్రణ ఉంది. వ్యాధిగ్రస్తులు వైద్య నిపుణులు ఆధ్వర్యంలో పొడిగా, ద్రవ రూపంలో, మాత్రల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. జాంబిఫైయింగ్ అంటే? మస్క్ చెబుతున్నట్లుగా..సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ అనే మెడిసిన్ వినియోగంతో జాంబిఫైయింగ్ అనే వ్యాధి సోకుతుంది. లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌తో బాధపడే వారు ఇష్టం వచ్చినట్లుగా మీద పడి కొరుకుతుంటారని హెల్త్‌కేర్ నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్‌ల మధ్య పంతం!,ఎవరి మాట నెగ్గుతుందో? -
Rahul Gandhi: ఆ మొదటి వ్యక్తిని నేనేనేమో!
2004లో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆ సమయంలో భారత్ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలివి. ఎంపీగా తనపై పడిన అనర్హత వేటు గురించి విదేశీ గడ్డపైనా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. భారత్‌లో పరువు నష్టం కేసులో ఇలాంటి శిక్షను ఎదుర్కొన్న నేతను బహుశా తానేనేమోనని వ్యాఖ్యానించారాయన. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో.. దేశం ఇలా అయిపోతుందని ఊహించలేదు. పరువు నష్టం దావాతో గరిష్ట శిక్షను ఎదుర్కొన్న మొదటి నేతను బహుశా నేనే కావొచ్చు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని పేర్కొన్నారాయన. 52 ఏళ్ల రాహుల్ గాంధీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎంపీగా నెగ్గారు. అయితే.. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల గరిష్ట శిక్ష పడగా, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం అనర్హత వేటు పడి ఎంపీ(వయనాడ్ లోక్‌సభ స్థానం) పదవిని కోల్పోయారాయన. అయితే పార్లమెంట్లో కూర్చొని గళం వినిపించడంతో పోలిస్తే ఇప్పుడు తనకు మరింత అవకాశం దొరికిందని చెబుతూ.. భారత్ జోడో పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. It was a pleasure to engage with the learned audience at @Stanford on 'The New Global Equilibrium'. We discussed the challenges and opportunities of a changing world order. Actions based on truth is the way forward. pic.twitter.com/6tEoCV6OsM — Rahul Gandhi (@RahulGandhi) June 1, 2023 Relive the captivating moments as Shri @RahulGandhi graced the stage at Stanford University for an unforgettable interactive session. pic.twitter.com/IbcaPQ3o8y — Congress (@INCIndia) June 1, 2023 హలో.. మిస్టర్ మోదీ తన పర్యటనలో భాగంగా.. సిలికాన్ వ్యాలీలో సందడి చేసిన రాహుల్ గాంధీ, పలువురు స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లతో కాసేపు రాహుల్ గాంధీ ముచ్చటించారు. వాళ్ల మధ్య ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల గురించి చిట్‌చాట్ జరిగింది. ఈ క్రమంలో.. భారత్‌లో టెక్నాలజీ విస్తరణ గురించి ప్రస్తావనకు రాగా.. పెగాసస్ కుంభకోణం అంశం లేవనెత్తారు రాహుల్ గాంధీ. దాని గురించి(ఫోన్ ట్యాపింగ్) నేనేం దిగులుచెందడం లేదు. ఒకానొక టైంలో నా ఫోన్‌ట్యాపింగ్ అవుతోందని నాకు అర్థమైంది. అంటూ.. తన ఐఫోన్లో ‘‘హలో మిస్టర్ మోదీ’’ అంటూ ఛలోక్తి విసిరారాయన. ఒక ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేయాలని అనుకుంటే.. దానిని ఎవరూ ఆపలేరు కదా. అది పోరాటం చేయదగ్గ అంశమూ కాలేదు. ఎందుకంటే.. చేసే ప్రతీ పని ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి.. అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: దేశ మనోభావాల్ని కించపరిచారు -
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్‌లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్ స్టాక్స్ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి. ప్రభావం పెద్దగా ఉండదు.. కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్ ఫండ్స్ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు. -
కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. కొనుగోలుకు ఎలాన్ మస్క్ సిద్ధం?
యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ను షట్‌డౌన్ చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. అనంతరం ఆ బ్యాంక్ సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్‌వేర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ రేజర్ సీఈవో మిన్ లియాంగ్ టాన్ (Min-Liang Tan) ఓ సలహా ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు ఎస్వీబీని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చమని అన్నారు. అందుకు ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ఎస్వీబీని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమేనని అర్ధం వచ్చేలా ‘నేనూ అదే ఆలోచిస్తున్నా’ అంటూ ట్విట్ చేశారు. I think Twitter should buy SVB and become a digital bank. — Min-Liang Tan (@minliangtan) March 11, 2023 I’m open to the idea — Elon Musk (@elonmusk) March 11, 2023 60 శాతం పతనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో ప్రసిద్ధి చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఎస్‌వీబీకి చెందిన 60 శాతం షేర్లు భారీగా పతనమయ్యాయి. చదవండి👉 దిగ్గజ బ్యాంక్ మూసివేత.. ప్రపంచ దేశాల్లో కలకలం! -
బెంగళూరు వరద బీభత్సం.. కారణాలు చెప్పిన సీఎం బొమ్మై
వరదల్లో బెంగళూరు.. ఏకధాటి కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగానికి పైగా నగరం వరద నీటిలో చిక్కుకుపోగా.. తాగునీటి-విద్యుత్ కొరతతో అవస్థలు పడుతున్నారు నగరవాసులు. ఈ తరుణంలో సహాయక చర్యలపైనా రాజకీయ విమర్శలు రావడంతో.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. బెంగళూరు వర్షాలు-వరదలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది వాస్తవ పరిస్థితి. దానిని దాచలేం. అయితే ఈ స్థితికి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలూ ఓ కారణమే. అంతేకాదు నగరం ఇలాంటి దుస్థితిని ఎదుర్కొవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా కారణమని ఆరోపిస్తున్నారు ఆయన. నగరం ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం గత ప్రభుత్వ తీరే. తలాతోక లేకుండా పాలించారు వాళ్లు. ఎటు పడితే అటు కట్టడాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. చెరువుల నిర్వాహణను ఏనాడూ పట్టించుకోలేదు. పైగా అవినీతితో చెరువు, కుంటలల్లో అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. అందుకే నగరం ఇవాళ నీట మునిగింది. అయినప్పటికీ ఆటంకాలకు దాటుకుని ఎలాగైనా నగరంలోని పరిస్థితులను పునరుద్ధరిస్తాం. అలాగే మునుముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతాం అని పేర్కొన్నారాయన. కర్ణాటక.. ప్రత్యేకించి బెంగళూరులో ఈ తరహా వర్షాలు మునుపెన్నడూ కురిసింది లేదు. గత 90 ఏళ్లలో రికార్డు స్థాయిలో వానలు కురవడం ఇదే. చెరువులన్నీ నిండిపోయాయి. నాలాలు నింగి.. వరద నీరు ఓవర్‌ఫ్లో అయ్యింది. కొన్ని కట్టలు తెగిపోయాయి. చిన్నచిన్న ప్రాంత్లాలో నాలాల సంఖ్య ఎక్కువగా ఉండడం, అక్రమకట్టడాలు కూడా ఇందుకు కారణాలయ్యాయి. దాదాపు ప్రతీ రోజూ కురుస్తుండం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పారాయన. బెంగళూరు వరదలను ఛాలెంజ్‌గా తీసుకుని.. అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు నిరంతరాయం పని చేస్తున్నట్లు వెల్లడించారాయన. పరిస్థితి చక్కబడగానే అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పారాయన. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వరదల విషయంలో ప్రభుత్వందే తప్పని విమర్శిస్తోంది. ఈ మేరకు వరద నీళ్లలోనే నిరసనలు తెలుపుతున్నారు అక్కడి నేతలు. ఇదీ చదవండి: స్కూటీ స్కిడ్ అయ్యి పోల్ పట్టుకుంది.. విద్యుద్ఘాతంతో యువతి మృతి -
వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022
Tech companies fired over 32,000 employees : టెక్ దిగ్గజ కంపెనీ ఉద్యోగులకు భారీ షాకిచ్చాయి. ఒక్క జులై నెలలో సుమారు 32వేల మంది టెక్కీలపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు 2022 వరస్ట్ ఇయర్‌గా నిలిచిపోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో గట్టెంకేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ జులై నెలలో అమెరికా సిలీకాన్ వ్యాలీలో కార్యకాలపాలు నిర్వహిస్తున్న ఆయా సంస్థలు మొత్తం 32 వేల మందిని విధుల నుంచి తొలగించాయని వెలుగులోకి వచ్చిన క్రంచ్ బేస్ నివేదిక పేర్కొంది. ఉద్యోగులపై వేటు విధించిన సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్, షాఫిఫై, కాయిన్ బేస్‌తో పాటు ఇతర కంపెనీలు వందల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పేర్కొంది. వారం వారం పెరిగిపోతున్నారు. మా దృష్టికి వచ్చింది. సిలికాన్ వ్యాలీలో ఉన్న టెక్ కంపెనీలు వారం వారం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అందుకే మాకు (క్రంచ్‌బేస్) ఏ ఉద్యోగం స్థిరంగా ఉండడం లేదని అనిపిస్తుంది. స్పష్టమైన కారణం లేకుండానే ఉద్యోగాలు కోల్పోతున్నందున చాలా మందికి 2022 మరో వరస్ట్ ఇయర్‌గా మారుతోంది. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేశాయి. ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు చాలా సంస్థలు ఉద్యోగల్ని తొలగిస్తున్నాయి. అమెరికాలో దాదాపు 64 ప్రముఖ టెక్ కంపెనీలు జూలై నెలలో 32వేల కంటే ఎక్కువ మంది విధుల నుంచి తొలగించాయని క్రంచ్ బేస్ హైలెట్ చేసింది. ►క్రంచ్‌బేస్ సేకరించిన డేటా ప్రకారం..ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ షాఫిఫై గత నెలలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో రిక్రూటింగ్, సపోర్ట్, సేల్స్ విభాగాల ఉద్యోగులున్నారు. ►ట్విట్టర్ తన టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో 30 శాతం మందిని తొలగించింది.పెరుగుతున్న వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ►మైక్రోసాఫ్ట్ తన 1,80,000 మంది వర్క్‌ఫోర్స్‌లో 1 శాతాన్ని తగ్గించింది, కొన్ని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వ్యాపార అవసరాలను తీర్చాలని యోచిస్తోంది. ►టిక్‌టాక్ కంపెనీ పునర్నిర్మాణం పేరుతో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిందని,100 కంటే తక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వైర్డ్ నివేదిక పేర్కొంది. ►హూప్ వంటి ఇతర స్టార్టప్‌లు 15 శాతం మంది సిబ్బందిని తొలగించాయి. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ విమెమో (Vimeo) 72 మంది ఉద్యోగులను తొలగించింది. ►కేవలం రెండు నెలల్లో, నెట్‌ఫ్లిక్స్ మొత్తం 450 మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది. సబ్స్క్రైబర్లు తగ్గడం, అదే సమయంలో ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ►కాయిన్‌బేస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు 1100 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. కంపెనీ సీఈవో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదట ఉద్యోగుల తొలగింపుకు ఆర్ధిక పరిస్థితులేనని అన్నారు. ఆపై అవసరానికి మించి ఉద్యోగుల్ని హయ్యర్ చేసుకుందని మాట మార్చారు. -
ఫాల్కన్ ఎక్స్‌తో ‘టీ–హబ్’ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన టెక్నాలజీ యాక్సలేటర్ ‘ఫాల్కన్ ఎక్స్’ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించనున్న గ్లోబల్ స్టార్టప్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల సమ్మేళనం)లో రాష్ట్రానికి చెందిన టీ–హబ్ భాగం పంచుకోనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలనుకొనే భారతీయ అంకుర సంస్థలు పాల్గొనాలని ఆహ్వానించింది. అత్యంత ప్రభావం చూపగలిగే స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు, కొత్త మార్కెట్లలో ప్రత్యేకించి అమెరికాలో ఆయా స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని పేర్కొంది. జూలైలో మొదలయ్యే ఈ కార్యక్రమం 5 వారాలపాటు కొనసాగనుంది. వందకుపైగా వెంచర్ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ కంపెనీలు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపుతుండగా మూడు అత్యుత్తమ స్టార్టప్‌లకు లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున ఫాల్కన్ ఎక్స్ నిధులు అందించనుంది. స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఫాల్కన్–ఎక్స్‌తో కుదిరిన భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్‌రావు తెలిపారు. ప్రపంచ స్టార్టప్ రంగంలో భారతీయ స్టార్టప్‌లకు శరవేగంగా గుర్తింపు లభిస్తోందని ఫాల్కన్–ఎక్స్ సహ వ్యవస్థాపకుడు మురళి చీరాల అన్నారు. టెక్నాలజీ నిపుణులు, పెట్టుబడిదారులైన బీవీ జగదీశ్, రాజిరెడ్డి, ఆశుగుప్తా, ప్రదీప్ ఆస్వాని, ప్రవీణ్ అక్కిరాజు తదితరులు ఫాల్కన్–ఎక్స్‌లో మురళి చీరాలతో కలిసి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. -
రెప్పవాల్చని అందం.. ముప్పై ఏళ్లకే బిలియనీర్! ఇప్పుడేమో కటకటాల్లోకి!..
అబద్ధపు పునాదుల మీద నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం ఎంతో కాలం నిలవదు.. ఇందుకు సరైన ఉదాహరణ.. ఎలిజబెత్ హోమ్స్ ఉదంతం. 19 ఏళ్లకే స్టార్టప్ రంగంలో సంచలనం సృష్టించిన ఎలిజబెత్.. అదనంగా తన మాటల్ని-అందాన్ని ఎరగా వేసి పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఆ దెబ్బకి మూడు పదుల వయసుకి చేరగానే బిలియనీర్‌గా అవతరించింది. ఇన్నేళ్లకు.. విఫలమైన తన ఆవిష్కరణ మోసం బయటపడడంతో కటకటాల వైపు అడుగులు వేస్తోంది. దాదాపు దశాబ్దం కిందట.. ఎలిజబెత్ హోమ్స్ అనే 19 ఏళ్ల అమ్మాయి చేసిన ఓ ప్రకటన రోగనిర్ధారణ పరీక్షల రంగంలో సంచలనం సృష్టించింది. డయాగ్నోస్టిక్స్ ఫీల్డ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని ప్రపంచమంతా ఆమెను తెగ పొగిడేశారు. ఆమె విజన్ ఎంతో మంది మేధావుల్ని ఆకర్షించింది. బడా బడా కంపెనీలు సైతం ఆమె ఆవిష్కరణలో పెట్టుబడుల కోసం ఎగబడ్డారు. టెక్ కంపెనీలకు అడ్డా అయిన సిలికాన్ వ్యాలీ నుంచి సెల్ప్ మేడ్ సూపర్ స్టార్‌గా ప్రపంచం మొత్తం ఆమెను కొనియాడింది. కానీ, రోజులు ఒకేలా ఉండవుగా.. ఆమె మోసం కొన్నేళ్లకైనా బయటపడింది. ఒక్క రక్తపు చుక్కతో.. థెరానోస్.. ఎలిజబెత్ హోమ్స్ బీజం వేసిన స్టార్టప్ పేరు. ప్రజలకు ఏదైనా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ స్టార్టప్ ప్రారంభించినట్లు ప్రకటించుకుంది. కేవలం ఒక్క రక్తపు చుక్కతో బ్లడ్ టెస్ట్ నిర్వహించుకునే సెల్ఫ్ సర్వీస్ మెషిన్లను రూపొందించినట్లు ప్రకటించుకుంది ఎలిజబెత్. సెల్ఫ్ సర్వీస్ మెషిన్లతో.. కొద్ది చుక్కల రక్తంతో ఫలితాన్ని రాబట్టే టూల్స్ అవి. దీంతో ఈ విప్లవాత్మక పరీక్షా వ్యవస్థ గురించి ప్రపంచమంతా చర్చ నడిచింది. ఆమె బ్రెయిన్‌కు.. ఆ ఆవిష్కరణకు ఎంతో మంది మేధావులు ఫిదా అయ్యారు. అన్నింటికి మించి ఆమె అందం, గలగలా మాట్లాడేతత్వం, గొంతు.. ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షించేది. దీంతో నాలుగేళ్లు కూడా తిరగకుండానే ఆ స్టార్టప్ కాస్త.. హెల్త్ టెక్నాలజీ కంపెనీగా రిజిస్ట్రర్ అయ్యింది. ఫైజర్, షెరింగ్ ప్లౌ కంపెనీలు సైతం ఇన్వాల్వ్ కావడంతో థెరానోస్ మీద పెద్దగా దృషి, నిఘా పెట్టలేకపోయాయి ప్రభుత్వ వర్గాలు. ఫోర్బ్స్ తో పాటు పలు పాపులర్ మ్యాగజీన్ల మీద కూడా ఆమె ముఖచిత్రం దర్శనమిచ్చింది. ఆ ఒక్క కథనంతో.. థెరానోస్ బ్లడ్ టెస్టింగ్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగాక.. 2015లో వెలువడ్డ ఓ కథనం ఆ కంపెనీ రాతనే మార్చేసింది. ఆ కంపెనీ అందిస్తున్న పరికరాలు సరిగా పని చేయడం లేదని, ఫలితాలు పారదర్శకతతో లేవని, తప్పుడు ఫలితాలు చూపుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. ఇది యావత్ సిలికాన్ వ్యాలీని కుదిపేసింది. అప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆర్డర్లు అందుకోని వాళ్లంతా ఒక్కసారిగా ఆమెకు ఎదురు తిరిగారు. అమెరికా సెక్యురిటీ ఎక్సేంజ్ కమిషన్, స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్స్, మెడికేర్, మెడికైడ్ సెంటర్లు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ లు హోమ్స్ కంపెనీపై విచారణ కొనసాగించాయి. ఆపై వ్యవహారమంతా కోర్టుకు చేరింది. దీంతో ఒక హై ప్రొఫైల్ కేసుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ వ్యవహారం. అప్పటి నుంచి థెరానోస్ పతనం మొదలైంది. భర్త బిల్లీ ఎవాన్స్‌తో.. ఎంత శిక్ష అంటే.. థెరానోస్ వ్యవహారంలో సంక్లిష్టమైన, సుదీర్ఘమైన విచారణ జరిగింది. మొత్తం 11 అభియోగాలు ఎలిజబెత్ హోమ్స్‌కు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. 11 వారాల ప్రాసిక్యూషన్, 24 మంది ప్రత్యక్ష సాక్షుల విచారణతో సాగింది. ఆ మెషిన్లు పని చేయవనే విషయం ఆమెకూ తెలుసని, అయినా ఇన్వెస్టర్లను, పేషెంట్లను తప్పుదోవ పట్టించిందని కోర్టు నిర్ధారించుకుంది.పెట్టుబడిదారులను దారుణంగా మోసగించిన ఆ అభియోగాల్లో.. కేవలం నాలిగింటిని మాత్రమే కోర్టు అంగీకరించింది. హోమ్స్‌ను దోషిగా గుర్తించింది. కానీ, శిక్ష కాలం ఎంతో వెల్లడించలేదు. నేరం తీవ్రత ఆధారంగా ఒక్కో అభియోగంపై 20 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. అలా 37 ఏళ్ల ఎలిజబెత్ బయోటెక్ స్టార్ నుంచి ఒక మోసగత్తే ట్యాగ్ తగిలించుకుని కటకటాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈ శిక్షపై అప్పీల్‌కు వెళ్లే అవకాశమూ కోర్టు ఎలిజబెత్‌కు కల్పించింది కూడా. రమేష్ "సన్నీ" బల్వానీ పనిలో పనిగా.. థెరానోస్ వ్యవహారాలను చూసుకునేందుకు రమేష్ "సన్నీ" బల్వానీని నియమించుకుంది హోమ్స్. అతను ఆమె కంటే వయసులో ఇరవై ఏళ్లు పెద్ద. అయినా ఇద్దరూ డేటింగ్ చేశారు. అయితే ఎప్పుడైతే ఆమె మోసం బయటపడిందో.. బల్వానీ సైతం ఇరికించాలని ఆమె ప్రయత్నించింది. బాల్వానీ పెద్ద మోసగాడని, తనను టార్చర్ చేసేవాడని, లైంగిక దాడికి సైతం ప్రయత్నించేవాడని జ్యూరీ ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. కానీ, కోర్టు మాత్రం ఆ కన్నీళ్లను నమ్మలేదు. పక్కా విచారణ తర్వాతే బల్వానీని నిర్దోషిగా తేల్చింది. అయితే థెరానోస్ తర్వాతి కష్టకాలం నుంచి.. ఇప్పుడు కోర్టు హాజరుదాకా ప్రతి క్షణం ఆమెకు అండగా ఉంటూ వస్తున్నాడు భర్త బిల్లీ ఎవాన్స్( హోటళ్ల నిర్వాహకుడు). స్టీవ్ జాబ్స్‌ను బోల్తా కొట్టించింది అందం మాత్రమే కాదు.. తేనేలూరే మాటలతో ఎదుటివాళ్లను ఆకట్టుకునేది ఎలిజబెత్ హోమ్స్. అంతెందుకు యాపిల్ ఫౌండర్, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సైతం ఆమె ఉపన్యాసాలకు ఫిదా అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె ఎంత మాటకారి అన్నది. అయితే ఇన్వెస్టర్లను ఎట్రాక్ట్ చేయడానికి ఎలిజబెత్ హోమ్స్ ‘వాయిస్ ట్రిక్స్’ ఉపయోగించేదన్న ఆరోపణ కూడా ఉంది. అయితే ఇప్పుడు విస్తృతంగా నడుస్తున్న చర్చ ఏంటంటే.. ఇన్నేళ్లపాటు అంతేసి మందిని ఎలిజబెత్ ఎలా బురిడీ కొట్టించగలిగిందనే!!. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
Tesla: అనూహ్య నిర్ణయంతో షాకిచ్చిన టెస్లా
ఈవీ దిగ్గజ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంపెనీ హెడ్ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్‌కు భారీ షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన షేర్‌హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో ఊహించని ఈ ప్రకటన చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న టెస్లా.. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ నుంచే ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. అయితే ఉన్నపళంగా ఎందుకు తరలిస్తున్నారనే విషయం కాసేపు హైడ్రామా నడిపించిన మస్క్.. విస్తరణలో భాగంగానే ఈ తరలింపు చేపట్టినట్లు చెప్పారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు టెస్లా హెడ్ క్వార్టర్స్‌ను తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత కాలపరిమితిలో చేస్తామనే విషయంపై మాత్రం మస్క్ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం చిప్, ఇతరత్ర కంపోనెంట్ల కొరత సమస్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. పాలో ఆల్టోలో ఉన్న హెడ్ క్వార్టర్స్ కేంద్రం టెస్లా సేల్స్ ఆశాజనకంగానే సాగుతున్నట్లు సమావేశంలో మస్క్ వెల్లడించాడు. అయితే ఫ్రెమోంట్ ప్లాంట్ నుంచి వాహనాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పరిమితుల కారణంగా అది జరగలేకపోతుందని ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక హెడ్‌క్వార్టర్స్ తరలింపు గురించి రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న చట్టాల వల్ల మస్క్ ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే తరలింపునకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్‌లు, తక్కువ రెగ్యులేషన్స్ ఉన్న ప్రాంతాలకు తరలిపోయే అంశం గురించి మస్క్ సహా పలువురు టెక్ దిగ్గజాలు చాలాకాలంగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలో ఆల్టోకు 2400 కిలోమీటర్ల దూరంలోని ఆస్టిన్‌కు హెడ్ క్వార్టర్స్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో ఎలాంటి కుదేలుకు లోనవుతుందో చూడాలి మరి!. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు.. మూల్యం -
APPLE: యాపిల్ మెగా ఈవెంట్.. 13 సిరీస్‌పై ఉత్కంఠ
iPhone 13 Launch Event: ప్రతీ ఏడాదిలాగే ఈ సెప్టెంబర్‌లోనూ మెగా ఈవెంట్‌కు యాపిల్ సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి(సెప్టెంబర్ 14) 10గం.30 ని. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ఈవెంట్ ద్వారా యాపిల్ కొత్త ప్రొడక్టులను లాంఛ్ చేయనుంది. కరోనా వల్ల వర్చువల్‌గా ఈవెంట్ నిర్వహిస్తుండడం యాపిల్‌కు ఇది రెండోసారి. ఇక వారం నుంచి ఈ మెగా ఈవెంట్ కోసం ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీల పేరిట పలు ఫీచర్లు తెరపైకి వస్తున్నాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ మొత్తం నాలుగు మోడల్స్ ఒకేసారి రిలీజ్ చేయడం ద్వారా సంచలనానికి యాపిల్ తెర తీయబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఐఫోన్ 13, మినీ మోడల్స్‌లో లార్జ్ కెమెరా సెన్సార్లు ఉండొచ్చని, ప్రొ-ప్రొమ్యాక్స్లో అల్ట్రా వైడర్ కెమెరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో యాపిల్ స్మార్ట్‌వాచ్ 7 సిరీస్, థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్(Airpods 3) కూడా రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని క్యూపర్టినో యాపిల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఈ ఈవెంట్ టెలికాస్ట్ కానుంది. యాపిల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా లైవ్ వీక్షించొచ్చు. ఇక యాపిల్ టీవీ యూజర్స్.. యాప్ ద్వారా కీనోట్‌ను చూడొచ్చు. సిమ్ లేకుండానే.. ఐఫోన్ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్ కార్డ్ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుందని, ఎమర్జెన్సీ మెసేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఫోన్ వెయిట్, మందం కిందటి ఏడాది మోడల్స్ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం టూమచ్ ప్రచారం.. అయితే 13 అనేది ఫారిన్ దేశాల్లో అచ్చీరాని నెంబర్. ఈ మూఢనమ్మకంతో 13 సిరీస్‌ను తప్పించి.. 14 సిరీస్‌ను యాపిల్ రిలీజ్ చేస్తుందేమో అనే ఊహాగానాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. అందుకే సెప్టెంబర్ 13వ తేదీన కాకుండా.. 14వ తేదీన లాంఛ్‌కు ముహూర్తం పెట్టిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో నడిచింది. కానీ, ఇలాంటి నమ్మకాల్ని పట్టించుకోకుండా యాపిల్ 13 సిరీస్ ద్వారానే రాబోతోందని తెలుస్తోంది. క్లిక్ చేయండి: ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు! ధర అటుఇటుగా.. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో ఐఫోన్ 13 సిరీస్ కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెర్షన్ అమెరికా (భారత్) ఐఫోన్ 13 799 డాలర్లు (రూ. 58,600) ఐఫోన్ 13 మినీ 699 డాలర్లు (రూ. 51,314) పై రెండు 64జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో రావొచ్చు!. బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, రెడ్, వైట్ కలర్స్‌లో ఫోన్లు రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. ప్రతీకాత్మక చిత్రం ఐఫోన్ 13 ప్రో 999 డాలర్లు (రూ.73,300) ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ 1,099 డాలర్లు (రూ 80,679) 128జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టెరేజ్ వెర్షన్లలో రిలీజ్ కావొచ్చు. అయితే ఈ రెండు వెర్షన్లలో 1టీబీ స్టోరేజ్ మోడల్ అంటూ ఒక పుకారు సైతం చక్కర్లు కొడుతోంది. బ్లాక్, బ్రౌన్, గోల్డ్, సిల్వర్ కలర్స్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే పైన చెప్పుకున్న ఫీచర్లు, ధరలన్నీ అంచనాలు, ఊహాగానాలు మాత్రమే. యాపిల్ సంస్థ పైవాటిలో ఏ ఒక్కదానిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం ఎక్స్పర్ట్స్, టెక్ వెబ్సైట్ల అంచనాలను బట్టే ఇస్తున్నాం. చదవండి: యాపిల్ మార్కెట్ ఢమాల్! భారమంతా ఐఫోన్ 13 పైనే? -
రియల్ వరల్డ్‌లోకి ఫేస్బుక్! భారీ ఖర్చుతో..
Facebook City వర్చువల్ వరల్డ్‌లో 2.9 బిలియన్ల యూజర్లతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది ఫేస్బుక్. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్ రియాలిటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతోంది. సిలికాన్ వ్యాలీలోని తమ హెడ్ క్వార్టర్స్‌కు దగ్గర్లో ‘రియల్‌లైఫ్’ కమ్యూనిటీ కోసం ఒక పెద్ద నగరాన్ని నిర్మించబోతోంది. సుమారు 1700 అపార్ట్మెంట్లతో ‘విల్లో సిటీ’ పేరుతో డెవలప్ చేయబోతోంది. కాలిఫోర్నియా: ప్రస్తుతం మెన్లో పార్క్‌లో ఫేస్బుక్ హెడ్‌క్వార్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్థలంలోనే ఫేస్‌బుక్‌కు మరికొన్ని సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఇక కొత్తగా 59 ఎకరాల స్థలంలో విల్లో సిటీని డెవలప్ చేయబోతోంది. 1,729 అపార్ట్మెంట్లతో పాటు 193 గదులతో ఓ పెద్ద హోటల్, సూపర్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, కొత్త ఆఫీస్‌లను కట్టించనుంది. సిగ్నేచర్ డెవలప్మెంట్ గ్రూప్‌తో కలిసి ఫేస్బుక్ ఈ సిటీని నిర్మించబోతోంది. ఎంప్లాయిస్‌కు వసతి? నివాస యోగ్యంగా 320 అపార్ట్మెంట్లు, సీనియర్ల కోసం మరో 120 కేటాయించే అవకాశం ఉంది. వీటితో పాటు ఒక ఫార్మసీ, కేఫ్, న్యూయార్క్ సిటీ టౌన్ స్క్వేర్ తరహా నిర్మాణం.. ఓ భారీ పార్క్ నిర్మించనుంది. ఇక ఉద్యోగులు కావాలనుకుంటే అక్కడ ఉండొచ్చని, పర్మినెంట్ జీతగాళ్లకు ఈ ఆఫర్ ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వీటితో పాటు కొత్త ఆఫీస్ బిల్డింగ్, మీటింగ్, కాన్ఫరెన్స్ రూంలు కూడా కట్టించనుంది. అయితే కొత్తగా కట్టే ఆఫీస్‌లో మూడున్నరవేల మందికి స్థానం కల్పించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆ ఆఫీస్ ప్రాంగణంలో కేవలం ఫేస్బుక్ ఎంప్లాయిస్ మాత్రమే సంచరించేందుకు అనుమతి ఇస్తారు. అందరికీ ఇవ్వకపోవచ్చు బెల్లె హవెన్, ఈస్ట్ పాలో అల్టో మధ్య విల్లో సిటీ నిర్మించబోతున్నారు. గతంలో ఫేస్బుక్.. పది మైళ్లలోపు నివసించే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇస్తామని ప్రకటించిన వియం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్ అందరికీ నివాస సౌకర్యం కల్పించపోవచ్చని భావిస్తున్నారు. ఎకరంన్నర స్థలంలో టౌన్ స్క్వేర్ దాని చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్, నాలుగు ఎకరాల్లో పబ్లిక్పార్క్, దాని చుట్టూ రెండు ఎకరాలలో ఓపెన్ స్పేస్‌లు నిర్మించనుంది ఫేస్బుక్. ఇంతకుముందు ఓ భారీ టెక్ పార్క్ కోసం 2017లోనే ఫేస్బుక్ ఓ అప్లికేషన్ సమర్పించినా.. ఇప్పుడు అంకు మించి స్థాయిలోనే రియాలిటీ వరల్డ్‌లోకి రాబోతోంది. ఇదిలా ఉంటే గూగుల్ కూడా కిందటి ఏడాది శాన్ జోస్(కాలిఫోర్నియా)లో నాలుగు వేల అపార్ట్మెంట్లతో డౌన్‌టౌన్ వెస్ట్ పేరిట ఒక సిటీని డెవలప్ చేస్తున్నట్లు పేర్కొంది. -
కరోనా: బంకర్లలోకి బిలియనీర్స్
వాషింగ్టన్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు అమెరికాలోని శతకోటీశ్వరులు న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడి తమ విలాసవంతమైన బంకర్ల (నేల మాళిగలు)లో తలదాచుకుంటున్నారు. వారిలో సిలికాన్ వ్యాలీకి చెందిన శతకోటీశ్వరులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక రోజు ప్రపంచ ప్రళయం (డూమ్స్ డే) వచ్చి అందరూ చనిపోతారని నమ్మే కొంత మంది శతకోటీశ్వరులు న్యూజిలాండ్‌లో అత్యంత ఖరీదు చేసే విలాసవంతమైన బంకర్లను ఎన్నడో కొని పెట్టుకున్నారని ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది. వారిలో ‘పేపాల్’ వ్యవస్థాపకుడు, ఫేస్బుక్ శతకోటీశ్వరుడు పీటర్ తియాల్, టెక్సాస్‌లోని బ్లూబెర్గ్ కంపెనీ జనరల్ మేనేజర్ గేరీ లించ్ కూడా ఉన్నారు. పీటర్ తియాల్ న్యూజిలాండ్‌లోని అందమైన క్వీన్స్‌టౌన్‌లో మల్టీపర్సన్ భవనాన్ని కొనుగోలు చేశారు. అంటే భూమిపైన మామూలుగా కనిపించే ఆ భవనంలోనే అవసరమైనప్పుడు తలదాచుకునేందుకు ‘ప్యానిక్ రూమ్’ ఒకటి ఉంది. దాన్ని ఆయన 4.7 మిలియన్ డాలర్లు (దాదాపు 35.15 కోట్ల రూపాయలు) పెట్టి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఇప్పుడాయన అక్కడికి వెళ్లారో, లేదో తెలియడం లేదు. అయితే గేరీ లించ్ లాంటి శతకోటీశ్వరులు ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటూ వార్తలు వెలువడిన తొలుతలోనే అమెరికా నుంచి విమానాలు పట్టుకొని న్యూజిలాండ్ వెళ్లారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త మిహాయి దినులెస్కూ తన భార్యతో కలిసి మార్చి 12వ తేదీన న్యూజిలాండ్ వెళ్లారు. రైజింగ్ ఎస్ కంపెనీ న్యూజిలాండ్‌లో ఇలాంటి బంకర్లను కొన్నింటిని ఇప్పటికే నిర్మించగా మరికొన్నింటిని నిర్మిస్తోంది. వాటిని మూడు మిలియన్ డాలర్ల నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల వరకు విక్రయిస్తోంది. వాటిలో 22 మంది నిద్రించే అవకాశం ఉన్న మూడు మాస్టర్ బెడ్ రూమ్‌లు, లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్‌తోపాటు ఓ ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ ఉన్న బంకర్లు కూడా ఉన్నాయి. కొన్ని బంకర్లు కూడా భూమిలోపల రెండు, మూడు అంతస్తులుగా ఉన్నాయి. వాటన్నింటికి కావాల్సిన ఆక్సిజన్, విద్యుత్ నిరంతరాయంగా సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. వాటిల్లో కొందరు శతకోటీశ్వరులు ఏడాది పాటు కొదవ లేకుండా తినుపదార్థాలను నిలువ చేసుకున్నారు. చదవండి: కరోనా కట్టడిపై చిగురిస్తున్న ఆశలు -
కరోనా ఎఫెక్ట్ : సిలికాన్ వ్యాలీ షట్‌డౌన్
సాక్షి, కాలిఫోర్నియా : అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. శుక్రవారానికి దాదాపు 11,500 కేసులు నమోదవడంతో దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భారతీయ దుకాణాలు మూసి ఉండటంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలికాన్ వ్యాలీగా పిలిచే శాన్ఫ్రాన్సిస్కో, శాన్‌జోస్ (కాలిఫోర్నియా) పూర్తిగా మూతపడింది. కొద్ది సంఖ్యలో వ్యాపార సంస్థలు తెరిచి ఉంటున్నా వాటిలో నిత్యావసర వస్తువులు దొర కడం లేదు. గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ సహా వందలాది కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. (విదేశాల నుంచి వచ్చినవారు 69వేలు) ప్రజలు వీధుల్లోకి రావొద్దని హెచ్చరికలు ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో అగ్రగామి న్యూయార్క్ పూర్తిగా స్తంభించింది. పొరుగునే ఉన్న న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. న్యూయార్క్‌లో కేసులు పెరుగుతుండటంతో అధికా రులు ప్రజలను వీధుల్లోకి రావొద్దని హెచ్చరించారు. నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాషింగ్టన్, ఫ్లోరిడా, ఇల్లినాయీ, షికాగో, లూసియానా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలను ఇళ్లకు పరిమితం చేయాలని స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రారంభ దశలో వాషింగ్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాలకే పరిమితమైన వైరస్... ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలను తాకింది. అత్యధికంగా న్యూయార్క్‌లో 4,152 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా వాషింగ్టన్లో 1,228, కాలిఫోర్ని యాలో 1,044, న్యూజెర్సీలో 742 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో ఒకే కుటుం బానికి చెందిన నలుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు. వంద అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, కొలరాడొ, మసాచ్యూసెట్స్, లూసియానా, ఇల్లినాయీ, జార్జియా, ఫ్లోరిడా ఉన్నాయి. వాటిలో కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో భారతీయులు అందులోనూ తెలుగువారు లక్షల్లో నివసిస్తున్నారు. నిత్యావసరాల కోసం భారీ క్యూలు... కరోనా వైరస్ దృష్ట్యా ఇళ్లకే పరిమితం కావాలని కాలిఫోర్నియా ప్రభుత్వం హెచ్చరించడంతో శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిలెస్, శాన్‌జోస్ నగరాలు నిర్మానుష్యంగా మారాయి. భారతీయులు ఆధారపడే దుకాణాలు మూసి ఉండటంతో వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు తోటి భారతీయులు తమ దగ్గర ఉన్న నిత్యావసరాల్లో కొన్నింటిని అంద జేస్తున్నారు. ఈ పరిస్థితి మారడానికి భారతీయ దుకా ణాలను తెరిపించాలని, అక్కడ నిత్యావసర వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కాలిఫోర్నియా గవర్నర్‌ను కోరారు. న్యూజెర్సీలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేందుకు తెలుగు సంఘాలు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాయి. కాలిఫోర్నియాలోనూ ఈ తరహా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్‌కు చెందిన మందడి రాకేశ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. (జనతా కర్ఫ్యూని పాటించండి) జాగ్రత్తలు తప్పనిసరి... అమెరికాలో ఉండే తెలుగువారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లకే పరిమితం కావాలని తెలుగు అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. భారతీయ స్టోర్లలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ తెలుగు సంఘాలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో దేశీయ, విదేశీ ప్రయాణాలు చేయొద్దని, 60 ఏళ్లకు పైబడిన భారతీయ తల్లిదండ్రులు ఇల్లు దాటి బయటకు రావద్దని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ తరుణంలో స్వదేశానికి వెళ్లాలన్న ఆలోచన మానుకోవాలని సూచించింది. -
హెచ్-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా
శాన్ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ అమెరికా ప్రభుత్వంపై లా సూట్ ఫైల్ చేసింది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్‌కు హెచ్-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్ సిస్టం ఎనలిస్టు ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్-1బీ వీసాను యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019 ఇమ్మిగ్రేషన్ విభాగం విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది. అనిశెట్టి బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు డాలస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో మాస్ట్ర్స్ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అనిశెట్టి (భార్య ద్వారా) హెచ్-4 డిపెండెంట్ వీసాతో ఉన్నారని తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించేందుకు ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. కాగా మొత్తం 65,000 మందికి హెచ్1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి 20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి సంపత్
కాలిఫోర్నియా : అమెరికా విచ్చేసిన తమిళనాడు కార్మికశాఖ మంత్రి ఎంసీ సంపత్ సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సంపత్, అతని సిబ్బందికి సిలికానాంధ్ర ఘన స్వాగతం పలికింది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా సిలికానాంధ్ర సాధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో విస్తరిస్తున్న మనబడి, కాలిఫోర్నియా రాష్ట్ర అనుమతి పొంది భారతీయ కళలను బోధిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధిని వివరించారు. అలాగే, కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం దత్తత తీసుకొని ఆ గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పించిన కృషిని, చుట్టుపక్కల 150 గ్రామాలకు వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో సంజీవనీ వైద్యాలయ స్థాపనకు దాతలు అందించిన సహాయాన్ని, అమెరికా డాక్టర్లు, ఇతర శ్రేయోభిలాషుల సహకారాన్ని కంప్యూటర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అమెరికాలోనే కాకుండా, భారతదేశంలో కూడా సిలికానాంధ్ర చేస్తున్న సేవలను, సాధిస్తున్న ప్రగతిని మంత్రి సంపత్ కొనియాడుతూ, ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయ కళలను, సంస్కృతిని అమెరికా దేశంలో బోధించాలనే సదుద్దేశంతో స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అందుకు కృషిచేస్తున్న సిలికానాంధ్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తెలుగు విభాగాలను ప్రారంభించారన్న విషయం తెలుసుకున్న సంపత్, విశ్వవిద్యాలయంలో తమిళభాషా ఫీఠాన్ని నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని హామీ ఇస్తూ సిలికానాంధ్రా బృందాన్ని తమిళనాడుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గం, బే ఏరియా తమిళ మన్రం, ఫ్రీమాంట్ ఇస్లామిక్ సెంటర్ ముస్లిం అసోషియేషన్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org ని చూడవచ్చని, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు. -
తెలుగుతనం ఉట్టిపడేలా సిలికానాంధ్ర 17వ వార్షికోత్సవం
కాలిఫోర్నియా : 2001వ సంవత్సరం ఆగష్టు 4న కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో శ్రీకారం చుట్టుకున్న సిలికానాంధ్ర సంస్థ 17వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. క్యూపర్టీనో నగరం డియాంజా కాలేజీలో జరిగిన ఈ వేడుకలకు సిలికానాంధ్ర కుటుంబం సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, దాతలు హాజరయ్యారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంప్రదాయ కార్యక్రమాలతో తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది. మారేపల్లి వెంకటశాస్త్రి వేదపఠనంతో ప్రారంభమైన ఈ వార్షికోత్సవ వేడుకలకు, విచ్చేసిన అతిథులకు తాటిపాముల మృత్యుంజయుడు ఆహ్వానం పలుకుతూ గత పదహారేళ్ళుగా సిలికానాంధ్ర జరిపిన ప్రయాణాన్ని, చేరుకొన్న మైలురాళ్ళను పునరావలోకనం చేశారు. దిలీప్ కొండిపర్తి, మాధవ కిడాంబి సారథ్యంలో ప్రదర్శించిన 'హాస్యవల్లరి'లోని లఘు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఆధునిక సాంకేతికాభివృద్ధి తెస్తున్న ఇబ్బందులు, అంతర్జాలంలో జరుగుతున్న పెళ్ళిచూపులు, వివిధ భాషాసంస్కృతుల మేళమైన హైదరాబాద్ నగర జీవిత చిత్రాలని ముఖ్యాంశాలుగా రచించిన ఈ నాటికలు సభను నవ్వులతో ముంచెత్తాయి. మాధవ కిడాంబి, రాంబాబు మంచికంటి, శాంతివర్ధన్ అయ్యగారి, లలిత అయ్యగారి, అనిమేష్ కొండిపర్తి, మూర్తి వేదుల, సతీష్ ముచ్చెర్ల సమర్థవంతంగా పాత్రలను పోషించారు. రాంపల్లి సదాశివ మిమిక్రీ, మాట్లాడేబొమ్మను ప్రదర్శించారు. 'జానపద బ్రహ్మ' మానాప్రగడ నరసిం హమూర్తి కుమారులు సాయి, శ్రీనివాస్ లు పాడిన జానపద గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చివరగా, 'వికటకవి తెనాలి రామకృష్ణ ' నాటకం ప్రదర్శించారు. రావు తల్లాప్రగడ రచించగా, తెనాలి రామకృష్ణుని పాత్రలో ప్రముఖ నటుడు అక్కిరాజు సుందర రామకృష్ణ ఒదిగిపోయారు. హాస్యచతురోక్తులతో, మధురంగా ఆలపించిన పద్యాలతో సభికులనుండి కరతాళ ధ్వనులను అందుకున్నారు. ఇతర పాత్రల్లో కూచిభొట్ల శాంతి, ఆర్చీశ్ ప్రఖ్య, శ్రీవేద శ్రీపాద, శ్రీదేవి అంగజాల, సూరజ్ దశిక, శ్రీనివాస శ్రీపాద, నారయణన్ రాజు, రావు తల్లాప్రగడ, సదాశివ్ రామపల్లి, శ్రీనివాస్ మంద్రప్రగడ, శర్మ యేడిద, వంశీ ప్రఖ్య, అభిరాం కల్లూరు నటించారు. హైస్కూల్ చదువుతున్న వరకూర్ ఈష మొదటిసారిగా కీబోర్డు సహకారాన్ని అందించింది. వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి అధ్యక్షోపన్యాసం చేస్తూ సిలికానాంధ్ర సాధించిన విజయాలను, రాబోయే సంవత్సరాలలో చేపట్టే కార్యక్రమాలను సభికులకు వివరించారు. సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత పదకొండు సంవత్సరాలలో 35000 మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పుతున్న మనబడి అభివృద్ధిని వివరించారు. ఈ కృషి వెనకాల ఉన్న కార్యకర్తలను, ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. 2018-19 సంవత్సరానికి మనబడి ప్రవేశాలు జరుగుతున్నాయని, manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్య కోశాధికారి కొండుభట్ల దీనబాబు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, సంగీత నృత్యాలకోసం ఏర్పాటు చేసిన 'సంపద' అకాడమీ కార్యక్రమ వివరాలను సభికులతో పంచుకొన్నారు. మహారాజపోషకుడు, హృద్రోగ నిపుణుడు డాక్టర్ లక్కరెడ్డి హనిమిరెడ్డి చైర్మన్ కూచిభోట్ల ఆనంద్ ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న సంజీవని వైద్యశాల అందించబోయే సేవలను అభినందిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, దాతలను సత్కరించారు. ఈ వేదికపైనే శ్రీ విళంబి ఉగాది ఉత్సవంలో జరిగిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ 'ఎనుకుదురాట - అచ్చ తెలుగు అవధానం' మాతా కోటేశ్వరరావు, మాతా శాంకరీ దేవి సంకలనం చేసిన పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అనిల్ అన్నం, సాయి కందుల, విజయసారధి, రవి చివుకుల, కిశోర్ గంధం, వంశీ నాదెళ్ళ, రత్నమాల వంక, స్నేహ వేదుల, వసంత మంగళంపల్లి, రాజశేఖర్ మంగళంపల్లి సహాయం అందజేశారు. అందమైన కార్యక్రమాలతో పాటు పసందైన పదహారణాల తెలుగు భోజనంతో కార్యక్రమం ఆద్యంతం తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది. -
జాబ్ కోసం రోడ్డెక్కి.. వైరల్
ఉండటానికి ఇళ్లు లేదు.. చేయటానికి పని లేదు. కానీ, అతని ప్రతిభే.. అతనికి ఓ దారి చూపింది. ఉద్యోగం కోసం రోడ్డెక్కిన అతను చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. బడా కంపెనీలు సైతం స్పందించి అతనికి జాబ్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... సిలికాన్ వ్యాలీ: డేవిడ్ కసరెజ్(26) టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ నుంచి మెనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆస్టిన్(టెక్సాస్)లో ఓ మోటర్ కంపెనీలో వెబ్ డెవలపర్‌గా పని చేశాడు కూడా. అయితే కొత్త లైఫ్ కోసం కాలిఫోర్నియాకు వచ్చే క్రమంలో అతను తాను నివసించే వ్యాన్‌ను(సంచార జీవనం) పోగొట్టుకున్నాడు. దీంతో ఓ పార్క్ ఫుట్‌పాత్‌పై నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నాడు. అయితే కొత్త ప్రాంతం కావటం.. పైగా డబ్బు తక్కువగానే ఉండటంతో మరో ఆలోచన చేశాడు. రెజ్యూమ్‌ను వందల సంఖ్యలో కాపీలు తీయించి టిప్ టాప్‌గా రెడీ అయి శుక్రవారం ‘మౌంటెన్ వ్యూవ్’లోని ఓ సిగ్నల్ వద్ద నిల్చున్నాడు. ‘ఇళ్లు లేదు. విజయం కోసం పరితపిస్తున్నా. దయచేసి నా రెజ్యూమ్ తీసుకోండి’ అంటూ ఓ ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. సిగ్నల్ వద్ద వాహనాల్లో ఉన్నవారికి రెజ్యూమ్ పంచుతూ పోయాడు. (రియాల్టీ షోలో ఊహించని ఘటన) మరోవైపు సోషల్ మీడియాలో కూడా అతగాడి గురించి స్టోరీలు తెగ వైరల్ అయ్యింది. ఏదైతేనేం మొత్తానికి ఆ ఐడియా వర్కవుట్ అయ్యింది. మంచి ప్రొఫైల్ కావటంతో గూగుల్, నెఫ్లిక్స్, లింక్డిన్, సహా దాదాపు 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బి అవుతున్న కసరెజ్.. ఆలోచించుకుని మంచి కంపెనీలో జాయిన్ అవుతానని చెబుతున్నాడు. ‘డబ్బు సాయం చేస్తామని చాలా మంది ముందుకొచ్చారు. కానీ, నాకు కావాల్సింది ఉద్యోగమే. నేను తలెత్తుకుని జీవించాలనుకుంటున్నా. ఈ ప్రయత్నం విఫలమైతే తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోదామనకున్నా. కానీ, సక్సెస్ అయ్యా’ అని కసరెజ్ అంటున్నాడు.