sisodia
-
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం(అక్టోబర్ 4) విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరయిన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 19కి వాయిదా వేసింది. కాగా, లిక్కర్ కేసులో కవిత, మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రధాన నిందితులకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణకు కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్ -
పాపం బాబు మంత్రులు ఇలా.. ఫొటో షేర్ చేసిన విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రులను ఓ ఐఏఎస్ అధికారి శాసిస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో నలుగురు మంత్రుల ఎదుట సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఫొటోను ఆయన షేర్ చేశారు.కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సిసోడియా, మంత్రుల ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే జరుగుతోంది. బాబు పాలన అంటే ఇలాగే ఉంటుంది. మంత్రుల ముందు ఐఏఎస్ అధికారి కాలు మీద కాలువేసుకుని రాజులా కూర్చున్నాడు. మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్ జూనియర్ ఆఫీసర్లలా ఆయన ముందు కూర్చున్నారు. బాబు పాలనలో అన్నింటికీ సమాధానం ఈ ఫొటోనే చెబుతుంది’ అని కామెంట్స్ చేశారు. This is what’s happening under Chandrababu Naidu’s @ncbn’s regime. Special Chief Secretary (Revenue) R P Sisodia sits like a king, with his legs crossed, while ministers Ponguru Narayana, Payyavula Keshav, Vangalapudi Anitha, and Anagani Satya Prasad sit before him like junior… pic.twitter.com/jBfLQfE7p7— Vijayasai Reddy V (@VSReddy_MP) September 14, 2024 ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
ప్రభుత్వానికి ముందే తెలుసు
⇒ బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని ముందు రోజే మాకు తెలుసు. 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే.. మాకు తెలుసు, తగ్గిపోతుందిలే అని లంక గ్రామాల ప్రజలు చెబుతారు. ప్రజలు వెళ్లరనే మేము వారికి చెప్పలేదు. – శనివారం మీడియాతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ⇒ బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) నా కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం నేను తహసీల్దార్లకు ఫోన్ చేసి చెప్పా. – వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ ⇒ బుడమేరు ప్రవాహ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. అలాంటిది 40 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో గండ్లు పడ్డాయి. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు. రెండు వైపుల నుంచి వచి్చన వరద విజయవాడను చుట్టుముట్టింది. వరద వస్తుందనే సమాచారం మాకు లేదు. – మీడియాతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనసాక్షి, అమరావతి: బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోందని ఒక రోజు ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. అయితే 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ అన్నారు. ‘వరద వస్తోందని చెబితే గోదావరి జిల్లాల్లోని లంకల్లో ప్రజలెవరూ వెళ్లరు.. మాకు తెలుసులే.. ఇలాంటి వరదలెన్నిటినో చూశాం అంటారు.. అందుకే మేం ప్రజలకు చెప్పలేదు’ అని ఆర్పీ సిసోడియా శనివారం మీడియాకు అసలు విషయం చెప్పేశారు.అలాగే.. బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం తన కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ వెల్లడించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తాను తహసీల్దార్లకు ఫోన్ చేసి విషయం చెప్పానన్నారు. దీన్నిబట్టి తమకు సమాచారం లేదని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెబుతున్న మాటలు అబద్ధమని ఆర్పీ సిసోడియా, మాధవ్ నాయక్ మాటలతో తేటతెల్లమైంది.బుడమేరుకు భారీ వరద ప్రవాహం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి ముందే తెలిసినా.. దానివల్ల ఉధృతికి భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు తప్పవని తెలిసినా వారిని నిర్లక్ష్యంగా వరదకొదిలేసింది. తద్వారా 57 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరోవైపు కృష్ణా కరకట్టలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వరదకు నీట మునగడంతో ఆయన తన మకాంను విజయవాడ కలెక్టరేట్‌కు మార్చారు. అక్కడ నుంచే బాధితులకు సాయం పేరిట తన ‘షో’ మొదలుపెట్టారు. ఆగస్టు 31 మధ్యాహ్నమే సమాచారం ఇచి్చనా.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని వదిలేస్తామని జలవనరుల శాఖ అధికారులు శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం లోపే సమాచారం ఇచి్చనా.. విజయవాడ, ఎనీ్టఆర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాలనే ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగా విజయవాడలో బుడమేరు జలప్రళయం సృష్టించింది.ఇప్పటివరకూ వెల్లడైన సమాచారం మేరకు వరదల వల్ల 57 మంది మరణించారు. రూ.6,882 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. చంద్రబాబు సర్కార్ ముందే తమను అప్రమత్తం చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేవారమని బాధితులు వాపోతున్నారు. తమకు జరిగిన తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలకు ఎవరిది బాధ్యతని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం వ్యవహరించి ఉంటే ఇలాంటి విపత్తు సంభవించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యం వల్లే జలప్రళయం చోటుచేసుకుందని నీటిపారుదలరంగ నిపుణులు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విపత్తు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆగస్టు 30, 31 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28నే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి కృష్ణా నది భారీ వరదతో పోటెత్తింది. దీనికి తెలంగాణ, మన రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ, మున్నేరు, కట్టలేరు, పాలేరు తదితర వాగుల వరద కూడా తోడవడంతో ఆగస్టు 31 కృష్ణా మహోగ్రరూపం దాలి్చంది. అదే సమయంలో మరోవైపు బుడమేరు ఉప్పొంగింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తామని ప్రభుత్వానికి జలవనరుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.దీన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ధ్రువీకరించారు కూడా. వరద వస్తుందని ముందే తెలిసినా.. ప్రోటోకాల్ ప్రకారం లోతట్టు ప్రాంతాలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస శిబిరాలకు ఎందుకు తరలించలేదు? అన్నది అంతుచిక్కడం లేదు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే విపత్తు సంభవించిందని, అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బుడమేరు వరదపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: బుడమేరు వరదపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా సంచలన కామెంట్స్ చేశారు. రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. వరద వస్తుందని మా అధికారులకు ముందే తెలుసు. కానీ, వారిని అక్కడి నుంచి తరలించే చర్యలు తీసుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వరద వస్తుందని మాకు ముందే తెలుసు. కానీ, రెండు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది అసాధ్యమైన ప్రక్రియ. 35వేల క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసు. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే మాకు తెలుసులే అని చెబుతారు. అలాంటి సమస్య బుడమేరు దగ్గర ఎదురైంది. ప్రజలు వెళ్లరు అని మేము వారికి చెప్పలేదు. ఇదే సమయంలో బుడమేరుకు గండ్లు పడుతాయన్న సంగతి మాకు తెలియదు. వదరల తర్వాత 24/7 అప్రమత్తంగానే ఉన్నాం.సింగ్ నగర్ ఇంకా వరద నీటిలోనే ఉంది. బుడమేరు గండ్లను జలవనరుల శాఖ వారు పూడ్చారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లకు భారీగా గండ్లు పడ్డాయి. తొమ్మిదో తేదీ నుండి మూడు రోజులు నష్టం అంచనాలు వేస్తాం. ఆరోజు ఇంటి యజమాని కచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండాలి. వరద వలన చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ, తొమ్మిదో తేదీ నుండి మీరు మీ ఇళ్ల దగ్గరే ఉండాలి’ అని తెలిపారు. -
భూ అక్రమాలు క్షేత్ర స్థాయిలో కనిపించలేదు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో భూ అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న దు్రష్పచారానికి తెరపడినట్లే. భూ అక్రమాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్‌తో కలిసి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూ అక్రమాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని చెప్పారు. మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి, ఆయన కుమారుడు దాదాపు 2 వేల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను బెదిరించి రాయించుకున్నారనే ప్రచారంపైనా పరిశీలించామని చెప్పారు. అయితే, జిల్లాలో 2,600 ఎకరాలు ప్రీహోల్డ్కు అవకాశం ఉండగా, వాటిలో 626 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి 22ఎ నుంచి తీసివేశారని తెలిపారు. ఇందులో 4 మండలాల పరిధిలోని 133 ఎకరాలు మాత్రమే కొత్త వారి పేరుతో రిజి్రస్టేషన్ జరిగిందని చెప్పారు. ఇందులో మాజీ సీఎస్‌కు ప్రమేయం ఉందని చెప్పలేమని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం 20 ఏళ్లు దాటిన డి పట్టా భూములను ఎవరైనా కొనొచ్చని తెలిపారు. జిల్లాలో అసైన్డ్, డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజి్రస్టేషన్ వంటివి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. త్వరలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరం విస్తరించడం, భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల విశాఖలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఏడాది క్రితం వరకు లేఅవుట్లకు అనుమతి ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలిసేది కాదని, నూతన విధానం వల్ల ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఎర్రమట్టి దిబ్బల్లో అనుమతులివ్వలేదు ఎర్రమట్టి దిబ్బల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వలేదని తెలిపారు. అక్కడ కొంత భూమిని చదును చేస్తుండగా, జిల్లా యంత్రాంగం నిలిపేసిందని తెలిపారు. దసపల్లా ఎస్టేట్ భూములపై కోర్టు కేసులున్నాయన్నారు. 60 ఎకరాల్లో 14.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 22ఎ లో పెట్టారని, మిగతా భూమిని ఏ విధంగా పరిష్కరించాలో మార్గాలను వెదుకుతున్నామని అన్నారు. ఎస్టేట్ భూములపై సెటిల్మెంట్ ఆఫీసర్ ల్యాండ్ రెంట్ పట్టా ఇవ్వడాన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ మ్యాప్ తయారుచేసి, ప్రభుత్వ, ప్రభుత్వేతర భూములను, రోడ్లు, పార్కులు వంటివి రంగులతో చూపుతామని, దీనివల్ల ఆక్రమణలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
15 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి, అమరావతి: భూములకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. 15న అన్ని జిల్లాలో ప్రారంభించి 16–30 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదివారం మెమో ఇచ్చారు. గ్రామ స్థాయిలో భూముల సమస్యలు పరిష్కారానికి ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని అందులో అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. భూకబ్జాలు, 22ఏ జాబితా దురి్వనియోగంతో పాటు అన్ని భూ సంబంధిత విషయాలపై అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జిల్లాల వారీగా సదస్సుల షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వినతులు స్వీకరించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేక అధికారి సమీక్షిస్తారని, వచి్చన అన్ని పిటిషన్లను.. వినతుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.జేసీలు సదస్సులకు కో–ఆర్డినేటర్లుగా ఉంటారని, సబ్ కలెక్టర్లు/ఆర్డీవోలు, తహశీల్దార్లు తమ పరిధిలోని ప్రతి గ్రామంలో సదస్సు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలన్నారు. ప్రతి సదస్సుకి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వో, మండల సర్వేయర్ ఇతర అన్ని శాఖలకు చెందిన వారు వెళ్లాలని, జిల్లా కలెక్టర్ జిల్లా నుంచి మండల నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. సెపె్టంబర్ నెలాఖరుకి సదస్సులన్నీ పూర్తి కావాలని, ఆ తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాల ఆదేశాలను 45 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. -
సంస్కరణలకు, తప్పులకు తేడా తెలీదా?
సాక్షి, అమరావతి: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలపై చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా నిందలు మోపుతోంది. భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమనే దిక్కుమాలిన వాదనను సీఎం మొదలు టీడీపీ కింది స్థాయి నేతలంతా వినిపిస్తున్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా కూడా ఇదే పాట పాడడం అధికార వర్గాలను విస్మయానికి గురిచేసింది. భూ సంబంధిత అంశాలపై ఎప్పటి మాదిరిగానే విజ్ఞాపనలు వస్తున్నా, టీడీపీ ప్రభుత్వం కావాలని వాటిని భూతద్దంలో చూపిస్తోంది. వచి్చన వినతుల్ని పరిష్కరించకుండా తప్పించుకునేందుకు భూ సమస్యలు కావడం వల్ల ఏమీ చేయలేకపోతున్నామనే పలాయనవాదాన్ని వినిపిస్తోంది. చంద్రబాబు, మంత్రులు చెప్పినట్లు వచి్చన వినతుల్లో 80 శాతం భూములకు సంబంధించినవే అయితే అందుకు గల కారణాలను వెలికి తీయవచ్చు. కానీ అలా చేయకుండా కేవలం గత ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. నిజానికి వైఎస్ జగన్ హయాంలో భూములకు సంబంధించి అనేక సంస్కరణలు జరిగాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన భూముల వ్యవహారాలపై నిర్ణయాలు వెలువడడంతో సహజంగానే కొన్ని అంశాలు ముందుకు వచ్చాయి. వాటితోపాటు ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించింది. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి భారీగా వినతులు వచి్చనా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంది. అప్పట్లోనూ సివిల్ వ్యవహారాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చేవి. అందుకనుగుణంగా వాటి పరిష్కారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా వాటిపై రాజకీయాలు చేస్తోంది. భూ సంస్కరణలు తెచి్చంది జగనే భూ సమస్యలను పరిష్కరించడానికి సాహసోపేతంగా అడుగులు వేసి అనేక సంస్కరణలు తీసుకువచి్చంది గత వైఎస్ జగన్ ప్రభుత్వం కాగా, అసలు భూ సమస్యల గురించి పట్టించుకోకపోవడమే కాకుండా అనేక భూ వివాదాలకు కారణమైంది గత చంద్రబాబు ప్రభుత్వం. 2017లో చుక్కల భూముల చట్టం తెచ్చి ఆ భూముల సమస్యను పరిష్కరించకపోగా వివాదాస్పదంగా మార్చింది. స్వాతం్రత్యానికి ముందు నుంచి హక్కులు ఉన్న షరతుల గల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి, వేలాది మంది రైతుల కడుపు కొట్టింది. అనా«దీనం భూముల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసింది. వీటన్నింటినీ పరిష్కరించేలా ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2 లక్షల ఎకరాల చుక్కల భూములను 22ఎ జాబితా నుంచి బయట పడేయడంతో వాటిని సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. షరతులు గల భూములపైనా ఆంక్షలు లేకుండా చేయడంతో 50 వేల మంది రైతులకు మేలు జరిగింది. పేదలకు 46 వేల ఎకరాలు పంచడం కనిపించలేదా? చంద్రబాబు తన పాలనలో ఎప్పుడూ ఒక్క పేద వాడికి భూమి ఇచి్చన పాపాన పోలేదు. వైఎస్ జగన్ తన హయాంలో 46 వేల ఎకరాలను 40 వేల మందికిపైగా రైతులకు పంపిణీ చేశారు. దానిపై టీడీపీ శ్రేణులు, సానుభూతి పరులతో ఫిర్యాదులు చేయిస్తూ పంపిణీపై నిందలు మోపుతున్నారు. భూమిని పొందిన వారిలో వైఎస్సార్సీపీ వారున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. పేద వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అర్హత ప్రకారం భూములు పొందడాన్ని వక్రీకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులిస్తే విషం కక్కుతారా? చరిత్రాత్మక రీతిలో రాష్ట్రంలో అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి మార్గం చూపడాన్ని చంద్రబాబు ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తూ వికృతానందం పొందుతోంది. దశాబ్దాల క్రితం భూములు పొందిన వారికి ఆ భూములపై హక్కులు కలి్పంచడాన్ని నేరంగా చిత్రీకరిస్తోంది. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక, అసైన్డ్ రైతులు ఎన్నో బాధలు పడినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల కోరికను తీర్చడం కోసం.. ప్రభుత్వం నుంచి పొందిన 20 ఏళ్ల తర్వాత ఆ భూములపై వారికి సంపూర్ణ అధికారాలు ఇచ్చేలా చట్ట సవరణ చేశారు. దీనివల్ల 27 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అందులో 9 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఆ భూములను సాగు చేసుకుంటున్న లక్షల మంది రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు లభించాయి. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అందులో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. హక్కులు వచ్చాక 25 వేల ఎకరాలను అమ్ముకున్నారని అసైన్డ్ భూములపై అమలైన సంస్కరణను తప్పుదోవ పట్టిస్తోంది. వీటితోపాటే 1.79 లక్షల ఎకరాల సరీ్వస్ ఈనాం భూములను 22ఏ నుంచి తొలగించారు. ఆంక్షల చెరలో ఉండి ఎటూ కాకుండా ఉన్న లక్షల మంది రైతుల భూములపై వారికి హక్కులివ్వడాన్ని ఏమనాలి? రాజధాని పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టి వారికి అన్యాయం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో అసైన్డ్ రైతులందరికీ మేలు జరిగేలా అమలైన సంస్కరణను తప్పుగా వక్రీకరించి రాజకీయం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎం మెప్పు కోసం సిసోడియా అత్యుత్సాహంరెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెప్పు కోసం పడిన పాట్లు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేశాయి. తాను ఎప్పుడూ చూడని స్థాయిలో భూములపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇందుకు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులే కారణమని ఆయన సెలవిచ్చారు. భూ సమస్యలు రావడానికి ఆయన రెవెన్యూ శాఖలో పని చేసింది ఎప్పుడు? ఎప్పుడో కలెక్టర్‌గా చేసిన కొద్దికాలం తప్ప ఆ తర్వాత ఆయన రెవెన్యూ శాఖలో పని చేయనేలేదు. గత పదేళ్లుగా ఆయన కీలక శాఖల్లో పని చేసేందే లేదు. ఎడ్డెమంటే తెడ్డెం అనే వైఖరి.. తానే గొప్పవాడిననే అహంభావి కావడంతో ఆయనకు మంచి పోస్టింగ్ దక్కలేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. కాలం కలిసి వచ్చి ఇప్పుడు అనుకోకుండా రెవెన్యూ కార్యదర్శి పోస్టు వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు ఏం చెప్పినా చేసి, ఆయన్ను ఎంతైనా పొగిడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిపోదామనే ఆశ తప్ప ఆయన మాట్లాడేదాంట్లో అర్థం లేదని సీనియర్ అధికారులు చర్చించుకుంటున్నారు. అందుకే మదనపల్లి ఫైల్స్ దహనం కేసును అధికార పార్టీ రాజకీయం చేస్తే, అందులో సిసోడియా కూడా దూరిపోయి డప్పు వాయించేస్తున్నారు. కాలిపోయిన రెవెన్యూ రికార్డులన్నీ రీట్రైవ్ అయ్యాయని చెబుతూనే ఫోర్జరీ చేశారు కాబట్టే కాల్చేశారనే వితండ వాదాన్ని వినిపిస్తున్నారు. తాను ఐఏఎస్ అధికారిననే విషయాన్ని మరిచిపోయి పోస్టుల కోసం ఇంత దిగజరడం తగదని సాటి అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. భూముల రీ సర్వేతో కలిగిన ప్రయోజనాలు తెలియవా? దేశంలోనే మొట్టమొదటిసారిగా వందేళ్ల తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన భూముల రీ సర్వే అద్భుతమని కేంద్రం కితాబిచి్చంది. భూ వివాదాల పరిష్కారానికి ఏకైక మార్గం రీ సర్వే కావడంతో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొని 7 వేల గ్రామాల్లో గత ప్రభుత్వం సర్వే పూర్తి చేసింది. దాన్ని కొనసాగించాల్సింది పోయి రాజకీయ కారణాలతో అభాండాలు వేయడాన్ని రెవెన్యూ యంత్రాంగం తప్పు పడుతోంది. రీ సర్వేపై విషం చిమ్మే క్రమంలో రాష్ట్రంలో ల్యాండ్ రికార్డ్స్ వెల్ సెటిల్డ్ అంశమని, బ్రిటీష్ హయాంలో చాలా సిస్టమాటిక్‌గా ల్యాండ్ రికార్డులు నిర్వహించారని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పడం చూసి ఐఏఎస్ అధికారులు విస్తుపోయారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భూ రికార్డుల డిజిటలైజేషన్ జరగాలని, అందుకు రీ సర్వే తప్పనిసరి అని చెబుతుంటే ఎన్డీయేలోనే ఉన్న చంద్రబాబు అందుకు విరుద్ధంగా సొంత వాదనలు వినిపించడం విడ్డూరం. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం బ్రిటీష్ హయాంలో రికార్డులు కచ్చితంగా ఉంటే భూ వివాదాలు కుప్పలు తెప్పలుగా ఎందుకు వస్తున్నాయి? తన రాజకీయాల కోసం ఎలాంటి అబద్ధాలైనా ఆడడంలో చంద్రబాబును మించిన వారు లేరని రీ సర్వేపై ఆయన చేస్తున్న అడ్డగోలు వాదనలే నిదర్శనం. వివాదాలు లేని భూముల వ్యవస్థను తీసుకురావడానికి ఐదేళ్లపాటు రెవెన్యూ యంత్రాంగం కష్టపడి చేసిన సాహసోపేతమైన కార్యక్రమంపై బురదజల్లడం విజనరీ చంద్రబాబుకే సాధ్యం. రీ సర్వే ద్వారా ప్రతి గ్రామానికి ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి రావడం, ప్రతి రైతుకు భూ హక్కు పత్రం, భూములకు జియో హద్దులు వంటి అనేక ప్రయోజనాలున్నాయి. ఇప్పటి వరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో 10 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. ఇదంతా మంచి కాదా? గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు చేసే కార్యక్రమం మొదలైంది. వీటన్నింటినీ కాదని మళ్లీ వివాదాస్పద పాత భూముల వ్యవస్థనే తీసుకువస్తానని చంద్రబాబు చెప్పడాన్ని ఏమనాలి? -
జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు
ఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం జైలు నుంచి బయటికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకుగాను మధుర రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు. భార్యను చూసేందుకు కోర్టు సిసోడియాకు 6 గంటల పాటు ప్రత్యేక అనుమతిచ్చింది. అయితే ఈ ఆరు గంటల్లో మీడియాతో మాట్లాడవద్దని, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయరాదని షరతు విధించింది. సిసోడియా భార్య మల్టీపుల్ స్క్లిరోసిస్‌తో బాధపడుతున్నారు. జూన్‌లో కూడా సిసోడియా తన భార్యను చూసేందుకు కోర్టు అనుమతితో జైలు నుంచి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో సిసోడియా భార్యను చూడకుండానే జైలుకు వెనుదిరిగారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి తీహార్ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నారు. ఆయన బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు రిజెక్ట్ చేశాయి. -
సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఖండించారు. మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికమని, బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నాక ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారని ఆరోపించారు, అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీల నాయకులను ఎదుర్కోలేక బీజేపీ పిరికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్ష నేతలను అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు కుటిల ప్రయత్నాలను చేస్తోందని ఎద్దేవా చేశారు. నీతిలేని దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తోందని, బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
సీబీఐ దాడుల వేళ కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఓ వైపు సీబీఐ దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ‘మిస్డ్ కాల్’ ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘భారత్‌ను నంబర్ వన్ చేసేందుకు మా నేషనల్ మిషన్‌లో పాలుపంచుకోండి. అందుకు 9510001000కు మిస్డ్‌కాల్ ఇచ్చి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టండి.’ అని వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ట్విట్టర్లోనూ ప్రజలకు సూచించారు. మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేపట్టిన తర్వాత మాట్లాడారు కేజ్రీవాల్. ‘సీబీఐ దాడులపై ఎలాంటి భయం అవసరం లేదు. వారి పనిని చేసుకోనిద్దాం. మమ్మల్ని వేధించేందుకు పైనుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. మా నాయకుల పని అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో తొలి పేజీలో వచ్చిన కథనాన్ని సూచిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. ఇతర మంత్రులు కైలాశ్ గహ్లోట్, సత్యేందర్ జైన్‌లపైనా దాడులు చేశారని, ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. भारत को दुनिया का नम्बर वन देश बनाने के लिए साथ आयें। इस मिशन से जुड़ने के लिए 9510001000 पर मिस कॉल करें। हमें देश के 130 करोड़ लोगों को जोड़ना है। — Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్ -
ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్పి సిసోడియా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 1991 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సిసోడియాను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ -
ఏబీ వెంకటేశ్వరరావు కేసు: విచారణాధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణాధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా అడ్వొకేట్ సర్వ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. -
Shivani Sisodia: ఈ శివానీ శివంగి!
సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవారు కొందరైతే.. సమస్య మూలాలను కనుక్కొని దానిని కూకటివేళ్లతో సహా పెకలించేసేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే 18 ఏళ్ల శివానీ సిసోడియా. రాజస్థాన్‌కు చెందిన శివానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని మార్చడంతో సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకుని, వందలమంది అమ్మాయిలకు శిక్షణనిస్తూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీని వెనకాల ఒక కథ ఉంది. శివానీ పదోతరగతిలో ఉన్నప్పుడు.. ఒకరోజు స్కూలు అయిపోయిన తరువాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న కొందరు పోకిరీలు శివానీ వాళ్లను అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు. దాంతో వారినుంచి ఎలాగో తప్పించుకుని అక్కడినుంచి పారిపోయారు. మరుసటిరోజు స్కూలుకు వెళ్లిన శివానీ ముందురోజు జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా... వాళ్లు తాము కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పడంతో శివానీకి ఆశ్చర్యమేసింది. ‘ఎందుకు మీరు వాళ్లను ఎదుర్కోలేదు’ అని స్నేహితులను ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ‘ఏమో ఆ సమయంలో ఏం చేయాలో తట్టలేదు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు’ అని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకుంది శివానీ... నేను మాత్రం ఇంకోసారి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకూడదు అని. ఇందుకోసం ఆమె తన మనసును, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు, స్కూలు టీచర్, యోగా టీచర్ల సాయంతో ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. తరువాత రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని రాజస్థాన్ కరాటియన్స్ స్కూల్లో చేరింది. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రద్ధతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. తనలా అమ్మాయిలందర్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శివానీ తన కోచ్ ఓంకార్‌తో కలిసి ఆడపిల్లల కోసం ఆత్మరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా రెండేళ్లలో.. స్కూళ్లు, కాలేజీకెళ్లే 1500 మందికి పైగా విద్యార్థినులకు శివానీ శిక్షణ నిచ్చింది. ‘‘మా కరాటే స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిలందరిలోకి, శివానీ చాలా చురుకైనది. ఆత్మరక్షణ మెళకువలను సులువుగా నేర్చుకుంది. జాతీయస్థాయి కుస్తీపోటీలలో రజత పతకం కూడా గెలుచుకుంది. శివానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది’’ అని శివానీ ట్రైనర్ ఓంకార్ పంచోలి చెప్పారు. శివానీ మాట్లాడుతూ..‘‘నాకు అద్భుతమైన ట్రైనర్ దొరకడంతో ఆత్మరక్షణ విద్యలను ఎంతో బాగా నేర్చుకున్నాను. నేటి తరం అమ్మాయిలకు తమని తాము కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే నేను నేర్చుకోవడమేగాక ఎంతోమందికి నేర్పిస్తున్నాను. ఎవరైనా ఆకతాయులు దాడిచేసినప్పుడు వారి నుంచి తప్పించుకోవడమేగాక వారిపై ఎదురు దాడికి ఎలా దిగాలో నేర్పిస్తుండడం వల్ల వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్ గా తమ ఇళ్లకు ఒంటరిగా వెళ్లగలుగుతున్నారు’’ అని చెప్పింది. శివానీకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు జూడో ఛాంపియన్, మరొకరు తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. -
బ్రేకింగ్: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా బదిలీ
సాక్షి, అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పువు అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతముగా నిర్వహిస్తామని కొత్త ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేది నియమితులైన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అవకతవకలు ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో ఓటర్లు 3.69 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3,69,33,091కు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రత్యేక సవరణ(ఎస్ఎస్ఆర్)–2019 అనంతరం తుది ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. దీనిప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తుది ఓటర్ల జాబితాలో 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరిలో 2,520 మంది ప్రవాసాంధ్ర(ఎన్ఆర్ఐ) ఓటర్లు కూడా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినందున ఎస్ఎస్ఆర్–2019 తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఓటర్ల జాబితాలో ప్రజలు తమ పేరు ఉందో లేదో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, ఎవరి పేర్లయినా లేకపోతే నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా సూచించారు. ఓటర్ల నమోదు కోసం ఆన్లైన్లో గానీ, ఆఫ్‌లైన్ (నేరుగా) గానీ ఫారం–6 సమర్పించవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకూ అర్హులు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. - ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,74,58,240 మంది పురుషులు, 1,77,33,676 మంది మహిళలు, 3,344 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం 3,51,95260 మంది ఓటర్లు ఉండగా ఎస్ఎస్ఆర్–2019 తుది జాబితాకు వచ్చేసరికి 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091కి పెరిగింది. - ప్రవాసాంధ్ర ఓటర్ల సంఖ్య ముసాయిదా ఓటర్ల జాబితాలో 15 మాత్రమే ఉండగా, తుది జాబితాకు వచ్చే సరికి 2,520కి చేరింది. - తుది ఓటర్ల జాబితాలో 18–19 మధ్య వయస్కులు 5,39,804 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,11,059 మంది, మహిళలు 2,28,625 మంది, ట్రాన్స్జెండర్లు 120 మంది ఉన్నారు. - తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు. - శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. - ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత 21,24,525 మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరగా, 3,86,694 మంది పేర్లను తొలగించారు. - ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత 18–19 వయస్కులు 5,03,516 మంది ఓటర్లుగా నమోదయ్యారు. -
మే నెలలో ఎన్నికలకు అవకాశం
పార్వతీపురం: రాష్ట్రంలో మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా తెలిపారు. సోమవారం రాత్రి విజయనగరం జిల్లా పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక సబ్‌కలెక్టర్ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ..మార్చిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈవీఎంలపై అపోహలు తొలగించేందుకు జనాన్ని చైతన్యపరచనున్నట్లు వివరించారు. -
13 జిల్లాల్లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్లు
సాక్షి, విజయవాడు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రాంప్రకాశ్ సిసోడియా గురువారం నగరంలోని బారతీనగర్‌లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు 1950 నెంబర్‌కు ఫోన్ కాల్ చేసి తమ ఓటు కార్డు స్టేటస్‌తో పాటు ఈపీఐసీ నెంబర్‌ను 9223166166 లేదా 51969కు ఎస్ఎంఎస్ చేసి తమ ఓటు స్టేటస్ ను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏపీలోని 13 జిల్లాల్లో 13 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని సిసోడియా చెప్పారు. -
బోగస్ ఓట్లపై ఇంటింటి తనిఖీలు
సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున డూప్లికేట్, బోగస్ ఓటర్లున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు, అందజేసిన డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. 18 లక్షల మంది అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ ఓటర్లుగా ఉన్నట్లు డేటాతో సహా వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చారని, ఆ డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆయా చిరునామాల్లో లేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని సిసోడియా స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణ, డూప్లికేట్ ఓట్లతో పాటు వివిధ ఆంశాలపై ఆయన సచివాలయంలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. 25 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారనే డేటా ఆధారంగా తనిఖీలు నిర్వహించి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. రాష్ట్రంలో 3.70 కోట్ల మంది ఓటర్లున్నారని, కానీ.. ప్రస్తుతం 3.50 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, అంటే 2014 నుంచి ఇప్పటివరకు 20 లక్షల మంది ఓటర్లు తగ్గినట్లు తెలుస్తోందన్నారు. మృతిచెందిన వారి, వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు డూప్లికేట్ ఓట్లను కూడా అప్పుడు తొలగించారన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ 3.50 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు చర్యలను చేపట్టామని ఆయన తెలిపారు. కొత్తగా 32లక్షల మంది దరఖాస్తు సాధారణంగా రాష్ట్ర జనాభాలో 70 శాతానికి మించి ఓటర్లు ఉండరాదని, అలా ఉంటే బోగస్ ఓట్లు ఉన్నట్లేనని సిసోడియా తెలిపారు. అయితే, ప్రస్తుతం జనాభాలో 67.3 శాతం మంది ఓటర్లున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా సమయం ఉన్నందున ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించడం ద్వారా బోగస్, డూప్లికేట్, రాష్ట్రంలో లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించి వచ్చే ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా 32 లక్షల మంది ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 80 శాతం వరకు యువతీ, యువకులేననన్నారు. ప్రస్తుతం దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతోందని, సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులను ఓటరుగా నమోదు చేస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 4న ప్రకటిస్తామన్నారు. బెంగళూరుకు 1.50లక్షల ఈవీఎంలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు 1.13 లక్షల వీవీ ప్యాట్స్(ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) అవసరమని, అవి ఇప్పటికే రాష్ట్రానికి రావడం ప్రారంభమైందని సిసోడియా తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.50 లక్షల ఈవీఎంలున్నాయని, అవన్నీ అల్యూమినియంతో తయారై ఉన్నందున వాటిని స్టీలుతో మరింత పటిష్టపర్చనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.50 లక్షల ఈవీఎంలను బెంగళూరు పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమం ముగిసినప్పటికీ అది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా ఓటరుగా నమోదుకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలను జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలోకి తీసుకువస్తున్నామని.. దీనివల్ల ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. -
ఇక రెండేసి రాష్ట్రాల్లో ఓటు కుదరదు
సాక్షి, అమరావతి: ఇక నుంచి రెండేసి రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా స్పష్టం చేశారు. ఇటీవల పుణేలో, న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాలను నిర్వహించిందని ఆయన సోమవారం సచివాలయంలో ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పరిధిలోనే రెండు లేదా మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.15 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిని కూడా తొలగిస్తున్నామని వెల్లడించారు. పుణేలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ఓటర్లను అనుసంధానం చేసే ఈఆర్వో నెట్‌ను రూపొందించిందని, దీని ద్వారా ఒక రాష్ట్రంలో ఓటు ఉంటే మరో రాష్ట్రంలో ఓటు లేకుండా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రెండేసి రాష్ట్రాల్లో ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లిన ఓటర్లకు ఆంధ్రప్రదేశ్‌లోనే ఓటు హక్కు ఉంటుందని, తెలంగాణలో ఉండదని, అలాగే హైదరాబాద్‌లో ఉన్నవారికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉంటుందని, వారికి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు ఉండేలా కమిషన్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజకీయ కారణాలతో ఓట్లు తీసేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఓటు హక్కు ఉందో, లేదో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని, ఓటు హక్కు లేకపోతే ఓటర్‌గా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు కొనసాగుతోందని, ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు గడువును నవంబర్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ఉండదని, ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.49 కోట్ల ఓటర్లున్నారని వెల్లడించారు. ఇప్పుడు సాగుతున్న ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులకు ఓటు హక్కు కల్పిస్తామన్నారు. -
నేటి నుంచి ఓటర్ల నమోదు
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితాను సమగ్రంగా రూపొందించడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులకు, అలాగే అర్హులై ఉన్నప్పటికీ ఓటర్లుగా నమోదు కాని వారికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ల ముసాయిదా బాబితాను జిల్లా కలెక్టర్లు శనివారం ప్రకటించనున్నారు. ఈ జాబితాల్లో తమ పేర్లు లేని వారు ఓటర్‌గా నమోదు చేయించుకోవచ్చు. ఇష్టానుసారం ఓట్ల తొలగింపు కుదరదు ఎలాంటి తనిఖీలు లేకుండా ఇష్టానుసారం ఓట్ల తొలగింపు కుదరదని, అలా చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలంటే అందుకు సవివరణమైన వాస్తవ కారణాలుండాలని పేర్కొంది. క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించకుండా ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించిన తరువాతే మృతిచెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని పేర్కొంది. అలాగే ఆయా కుటుంబ సభ్యులు లేదా పక్క నివాసుల నుంచి ఫాం 7 తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించిన తరువాతే మృతిచెందినవారి పేర్లను తొలగించాలని స్పష్టం చేసింది. దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇద్దరి నుంచి స్టేట్ మెంట్ తీసుకోవాలని కూడా పేర్కొంది. ఎలాంటి తొలగింపులైనా తహశీల్దార్ స్థాయి అధికారే చేయాలని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వికలాంగులను ఓటరుగా నమోదు చేస్తే వారి వికలాంగ స్థాయి వివరాలను కూడా సేకరించాలని, పోలింగ్ రోజున వారిని పోలింగ్ కేంద్రాలను తీసుకువచ్చేందుకు కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపింది. అర్హులంతా నమోదు చేసుకోండి: సిసోడియా ఓటర్ల జాబితా పునస్సవరణ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఫారం 6 దాఖలు చేయాలని, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఫారం 6ఏను దాఖలు చేయాలని సూచించారు. -
ఓట్ల తొలగింపుపై వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావి వెంకటరమణ తదితరులు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని వివరించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో భారీగా ఓట్లను తొలగించారని సిసోడియా దృష్టికి తీసుకువెళ్లారు. గల్లంతైన ఓట్లపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఎన్నికల అధికారిని కోరారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ...‘ ఒక్క సత్తెనపల్లిలోనే 15వేల ఓట్లు గల్లంతు అయ్యాయి. గల్లంతు అయిన ఓట్లు అన్నీ వైఎస్ఆర్ సీపీ నేతలవే. నరసరావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయి. కొంతమంది అధికారులు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుతో కుమ్మక్కు అయ్యారు. టీడీపీకి మేలు చేసేందుకే ఓట్లు తొలగించారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. మా కుటుంబసభ్యుల ఓట్లు తొలగించారు. ఇక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటును మరో వార్డుకు మార్చారు. ఎలాంటి విచారణ లేకుండానే ఓట్లను మాయం చేశారు. కోడెల, ఆయన తనయుడి దురాగతాల వల్లే ఓట్లను తొలగించారు. వెంటనే అక్రమాలను సరిచేయకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు. -
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్–సీఈవో) రామ్ ప్రకాశ్ సిసోడియాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితమే ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన సిసోడియాను రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్‌గా నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. సిసోడియా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటారు. -
లేపాక్షి ఆలయంలో సిసోడియా
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సిసోడియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఆలయం అద్భుతంగా ఉందన్నారు. చిత్రాలు, శిల్పలేఖనాలు చూసిన వారు జీవితంలో ఎవరూ మరిచిపోలేరన్నారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ ఆనందకుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
నజీబ్ జంగ్ రాజీనామా
హఠాత్తుగా ప్రకటించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ► సీఎం కేజ్రీవాల్ ఆశ్చర్యం ► వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో నలుగుతున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ గురువారం హఠాత్తుగా రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఈ రాజీనామా జరగటం ఢిల్లీతోపాటు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. అయితే.. ‘కేంద్రానికి రాజీనామా సమర్పించాను. నాకు ఇష్టమైన విద్యారంగం వైపు వెళ్లాలనుకుంటున్నాను’ అని నజీబ్ జంగ్ మీడియాకు పంపిన సంక్షిప్త సందేశంలో పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రధాని మోదీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన సందర్భంగా హస్తిన ప్రజలు అందించిన తోడ్పాటు మరవలేనన్నారు. కాగా, జంగ్ రాజీనామాపై కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలసిపోయినందువల్లే రాజీనామా చేసినట్లు నజీబ్ తెలిపారని డిప్యూటీ సీఎం సిసోడియా అన్నారు. బీజేపీ మాత్రం ఆప్ సర్కారుపై అసంతృప్తితోనే నజీబ్ రాజీనామా చేశారని ఆరోపించింది. బుధవారం ఆయన్ను కలిసినప్పుడు కూడా ఆప్ సర్కారు వ్యవహారంతో కలత చెందినట్లు చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్ మాత్రం ‘ఆరెస్సెస్ వ్యక్తిని ఎల్జీగా నియమించేందుకే జంగ్ తప్పించారా?’ అని ప్రశ్నిం చింది. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆప్ ప్రభుత్వంతో వివాదాల వల్ల జంగ్ రాజీనామా చేయలేదని, దీనిపై కొన్ని నెలలుగా యోచిస్తున్నారని జంగ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండ్రోజుల క్రితం కలిసినపుడే జంగ్ రాజీనామా గురించి సంకేతాలిచ్చారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి తెలిపారు. ‘ఆప్’తో నిరంతర సంఘర్షణ 2015లో ఆప్ రెండోసారి పగ్గాలు చేపట్టినపుడు ప్రభుత్వం, ఎల్జీ మధ్య ఘర్షణ మొదలైంది. జంగ్.. ప్రధాని కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ఉప రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపణలు గుప్పించింది. వీరి వివాదాలు సుప్రీం కోర్టు వరకూ వెళ్లాయి. ఢిల్లీలో పాలనాధికారాలు ఎల్జీకే చెందుతాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీర్పునివ్వడంతో వివాదం తారస్థాయికి చేరింది. సాధారణంగా గవర్నర్‌గా నియమితులయ్యేవారు ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. అయితే ఎల్జీలకు నిర్ధారిత పదవీకాలం ఉండదు. అయినా నజీబ్ జంగ్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, డిసెంబర్ 25 నుంచి వారం రోజులపాటు వ్యక్తిగత పర్యటన నిమిత్తం గోవాకు వెళ్తున్నట్లుగా జంగ్ సంతకంతో తేదీ లేకుండా ఉన్న లేఖ బయటకొచ్చింది. యూపీఏ హయాంలో పదవీ స్వీకరణ 1973లో ఐఏఎస్‌గా ఎంపికైన నజీబ్ జంగ్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో పలు హోదాల్లో పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక శాఖల్లో విధులు నిర్వర్తించారు. జామియా మిలియా యూనివర్సిటీ వీసీగా పని చేస్తున్నప్పుడు 2013 జూలైలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో యూపీఏ ప్రభుత్వం జంగ్‌ను ఢిల్లీకి 19వ ఎల్జీగా నియమించింది. ఐదు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 49 రోజుల్లో కుప్పకూలిన తర్వాత ఏడాది పాటు నగర పాలనా వ్యవహారాలు నిర్వర్తించారు. కొత్త ఎల్జీ ఎవరు? కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరొస్తారనే అంశంపై ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ జాబితాలో కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అనిల్ బైజాల్ పేరు మొదటి స్థానంలో ఉండగా.. పుదుచ్చేరి ఎల్జీ కిరణ్ బేడీ, ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ పేర్లు కూడా వినబడుతున్నాయి.