South Africa vs Australia
-
WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్‌కు మార్గం సుగమమవుతుంది.మూడో స్థానంలోనే టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్‌కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.అయితే, మూడో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది.ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్‌లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.రోహిత్ సేన తప్పక గెలవాల్సిందేఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.సౌతాఫ్రికాకు లైన్‌క్లియర్!ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను గనుక 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది. చదవండి: అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై! -
ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్‌లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్‌తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్‌ను ఇచ్చారు. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
టీమిండియాతో ఫైనల్.. ఏకపక్షంగా ఉంటుంది: ఆసీస్ కెప్టెన్ కమిన్స్
వరల్డ్‌కప్ 2023 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. కోల్‌కతా వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక 49.4 ఓవర్లలో 21 పరుగులకు ఆలౌటయ్యారు. డేవిడ్ మిల్లర్ సెంచరీతో (101) సత్తా చాటగా.. క్లాసెన్ 47 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌కు విజయం అంత ఈజీగా దక్కలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 62 పరుగులతో పాటు 2 వికెట్లు తీసిన ట్రవిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. డగౌట్లో కూర్చోవడం కంటే క్రీజ్‌లో ఉండటమే తేలిక అనిపించింది. రెండు గంటలపాటు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అంతంగా ఫలితం అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది. స్టార్క్, హాజిల్‌వుడ్ ఊహించని విధంగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్ అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై వారు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ అత్యద్భుతంగా ఉంది. టోర్నీ ఆరంభంలో మేము ఈ విభాగంలో చాలా బలహీనంగా ఉండి మ్యాచ్‌లు చేజార్చుకున్నాం. 37 ఏళ్ల వయసులోనూ వార్నర్ మైదానంలో పాదరసంలా కదులుతున్నాడు. ఈ రోజు ట్రవిస్ హెడ్‌ది. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు అమూల్యమైన పరుగులు మెరుపు వేగంతో చేశాడు. నాణ్యమైన సఫారీ స్పిన్నర్లను హెడ్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. మాలో కొద్దిమందికి ఇదివరకే వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. కొంతమంది టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడారు. మరోసారి ఫైనల్‌కు చేరినందుకు ఆనందంగా ఉంది. భారత్‌తో ఫైనల్ ఇంకా ప్రత్యేకం. ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం నిండిపోతుంది. ప్రేక్షకులు భారత్‌కు ఏకపక్షంగా మద్దతు ఇస్తారు. అలాంటి వాతావరణం ఊహించుకుంటేనే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. -
CWC 2023: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్.. అరుదైన రికార్డు
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది. నిన్న (నవంబర్ 16) సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. కాగా, వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్ జరగడం ఇది నాలుగో సారి. 1996, 2007 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా.. ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే, కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో గెలవడం ద్వారా ఆస్ట్రేలియా ఎనిమిదో సారి వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇందులో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ఐదోసారి సెమీస్ గండాన్ని గట్టెక్కలేకపోయింది. సఫారీలు తొలిసారి 1992 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999, 2007, 2023 ఎడిషన్లలో ఆ్రస్టేలియా చేతిలో, 2015లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
World Cup 2023: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్‌కప్-2023లో దక్షిణాఫ్రికా పోరాటం ముగిసింది. మరోసారి నాకౌట్స్ దశను సౌతాఫ్రికా దాటలేకపోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఆఖరివరకు సఫారీ బౌలర్లు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఎనిమిదో సారి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరితో పాటు టెయిలెండర్లు ప్యాట్ కమ్మిన్స్(14), స్టార్క్(16) కూడా ఆసీస్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ఆసీస్ ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్‌కు దక్కింది. ఇక నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
అప్పుడు ఆసీస్.. ఇప్పుడు దక్షిణాఫ్రికా! 1999 వరల్డ్‌కప్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను మిల్లర్(101) అద్బుత సెంచరీతో అదుకున్నాడు. దీంతో ప్రోటీస్ ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల టార్గెట్‌ను ఉంచగల్గింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. అయితే ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి సఫారీలు ఇంకా పోటీలో ఉన్నారు. 1999 వరల్డ్‌కప్‌లో షేన్ వార్న్ మ్యాజిక్.. కాగా 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లో స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ మ్యాజిక్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. ఆ తర్వాత షేన్ వార్న్ మళ్లీ తన స్పిన్ మయాజాలంతో కల్లిస్‌ను ఔట్ చేశాడు. వెంటనే రోడ్స్ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్‌తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్‌గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్‌కు త్రో చేశాడు. గిల్‌క్రిస్ట్‌ను స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఎందుకంటే అప్పటిలో సూపర్ ఓవర్ రూల్ ఇంకా అమలులో లేదు. ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో షేన్ వార్న్ తన 10 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బౌలింగ్ కోటాలో 4 మెయిడన్లు ఉండడం గమనార్హం. ఇప్పుడు వార్న్ లాంటి మ్యాజిక్ ప్రోటీస్ స్పిన్నర్లు ఎవరైనా చేస్తారో లేదో వేచి చూడాలి. చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే! -
దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే!
వన్డే వరల్డ్‌కప్-2023లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో బావుమా డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్టార్క్ వేసిన ఓ అద్భుత బంతికి బావుమా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ మ్యాచ్‌లో డకౌటైన బావుమా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో డకౌట్‌గా వెనుదిరిగిన నాలుగో కెప్టెన్‌గా బావుమా నిలిచాడు. 40 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో బావుమా కంటే ముందు ముగ్గురు కెప్టెన్లు సెమీఫైనల్స్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1996 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అజారుద్దీన్ డకౌటయ్యాడు. అజారుద్దీన్ తర్వాతి స్ధానాల్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోంజే, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇక సెమీస్ ఫైనల్లో మాత్రం దక్షిణాఫ్రికా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: 'కోహ్లి, షమీ, అయ్యర్ హెడ్‌లైన్స్‌లో ఉంటారు.. కానీ అతడే రియల్ హీరో' -
ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్
వరల్డ్ క్రికెట్లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా నిజం చేసంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల్లాడుతున్నారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్లో ప్లేలో అయితే సౌతాఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మెరుపులు మెరిపించిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో మాత్రం కంగారుల ముందు తలవంచింది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఏడాది వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా.. కీలకమైన సెమీస్‌లో మాత్రం చేతులెత్తేసింది. చదవండి: MS Dhoni: ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి.. -
CWC 2023: కెప్టెన్‌గా ఇప్పటివరకు హిట్టే! బ్యాటర్‌గా ఫట్టు.. ఇలా అయితే ఎలా?
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్‌కప్-2023లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 145 పరుగులు చేశాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. తాజాగా కీలక సెమీ ఫైనల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొట్టింది సౌతాఫ్రికా. శ్రీలంకపై భారీ విజయంతో ఈవెంట్‌ను ఆరంభించిన సఫారీ జట్టు.. లీగ్ దశలో తొమ్మిదింట ఏడు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తుగా ఓడించిన సఫారీలు భారీగా రన్‌రేటు మెరుగపరుచుకున్నారు. లీగ్ దశలో ఏడు విజయాలతో సెమీస్‌కు పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కిన ప్రొటిస్ జట్టు.. అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో ఏంకగా 243 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఇక అఫ్గనిస్తాన్‌పై విజయంతో లీగ్ దశను ముగించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడ వంటి కీలక ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించడంతో సౌతాఫ్రికా మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగలిగింది. కెప్టెన్‌గా ఇలా హిట్టయినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు తెంబా బవుమా. View this post on Instagram A post shared by ICC (@icc) ఆసీస్ పేసర్ల దెబ్బకు సఫారీల విలవిల ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో నెట్టింట అతడిపై ట్రోలింగ్ మొదలైంది. కాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించిన సఫారీలు తుదిజట్టులో అదనపు స్పిన్నర్‌ను చేర్చుకున్నారు. కేశవ్ మహరాజ్‌తో పాటు తబ్రేజ్ షంసీని ఆడించేందుకు సిద్ధమైంది మేనేజ్మెంట్. అయితే, పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటం ఆస్ట్రేలియాకు వరంగా మారింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి బవుమాను పెవిలియన్‌కు పంపిన మిచెల్ స్టార్క్.. హిట్టర్ ఎయిడెన్ మార్కరమ్(10) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పేసర్ జోష్ హాజిల్‌వుడ్ క్వింటన్ డికాక్(3), రాస్సీ వాన్ డర్ డస్సెన్(6) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 14వ ఓవర్ వద్ద ఆట నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. Temba Bavuma contribution for South Africa throughout the ODI world cup 2023 😂#SAvsAUS #Bavuma #Chokers #Proteas pic.twitter.com/HEXXvqJNtr — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) November 16, 2023 Temba Bavuma gone for a duck in Semifinal 🔥 The man the myth the legend Brigadier Temba Bavuma 👏#SAvsAUS pic.twitter.com/uUhxYkbS67 — Radhika Chaudhary (@Radhika8057) November 16, 2023 -
CWC 2023: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తద్వారా 8వ సారి వరల్డ్‌కప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ కొట్టి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచారు. కానీ చివరకి విజయం మాత్రం కంగారులనే వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఆక్టోబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇంగ్లీష్ ఔట్.. తిరిగి గేమ్‌లోకి దక్షిణాఫ్రికా 193 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన ఇంగ్లీష్‌ను కొయెట్జీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ప్రోటీస్ తిరిగి మళ్లీ పోటోలోకి వచ్చింది. ఆసీస్ విజయానికి 19 పరుగులు కావాలి. విజయం దిశగా ఆసీస్.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆసీస్ గెలుపుకు 72 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(27), మిచెల్ స్టార్క్(6) ఉన్నారు. ఉత్కంఠగా సెమీఫైనల్-2 ఈడెన్‌గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న స్టీవ్ స్మిత్‌ను కొయెట్జీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీలు మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చారు. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(19), మిచెల్ స్టార్క్(1) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ దక్షిణాఫ్రికా స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. డేంజరస్ మాక్స్‌వెల్‌ను తబ్రేజ్ షంషి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ విజయానికి 25 ఓవర్లలలో 72 పరుగులు కావాలి. క్రీజులో స్మిత్, ఇంగ్లీష్ ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన లబుషేన్.. షంస్సీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి 79 పరుగులు కావాలి. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులతో అద్బుతంగా ఆడుతున్న ట్రెవిస్ హెడ్‌ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి లబుషేన్ వచ్చాడు. ఆసీస్ విజయానికి 35 ఓవర్లలో 104 పరుగులు కావాలి. దక్షిణాఫ్రికాతో సెమీస్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 92/2 రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కమ్‌బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 61 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 61/2 తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. మార్క్రమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 60/1 దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(11), హెడ్(9) పరుగులతో ఉన్నారు. మిల్లర్ విరోచిత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 213 పరుగులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు డేవిడ్ మిల్లర్ సెంచరీ దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్ మిల్లర్ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 203/9 ఎనిమిదో వికెట్ డౌన్.. 191 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కేశవ్ మహారాజ్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 47 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 196/8 ఏడో వికెట్ డౌన్.. 172 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ.. కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలయన్‌కు చేరాడు. 44 ఓవర్లు దక్షిణాఫ్రికా స్కోర్: 174/7 40 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156/6 మిల్లర్ 67, కోయెట్జీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 149-6 మిల్లర్ 66, కోయెట్జీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిల్లర్ హాఫ్ సెంచరీ 31.3: మాక్స్వెల్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిల్లర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 30.5: హెడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మార్కో జాన్సెన్. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. కొయోట్జీ క్రీజులోకి వచ్చాడు. క్లాసెన్ బౌల్డ్ 30.4: నిలకడగా సాగుతున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ట్రవిస్ హెడ్ బ్రేక్ వేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న క్లాసెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దీంతో ప్రొటిస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. కాగా మిల్లర్‌తో కలిసి క్లాసెన్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌతాఫ్రికా స్కోరు: 27 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 95/4 ►26.4: మరో సిక్స్ కొట్టిన క్లాసెన్ ►26.3: జంపా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన క్లాసెన్ సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి ప్రొటిస్ ఇలా క్లాసెన్, మిల్లర్ 79 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లాసెన్ 22, మిల్లర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 79/4 నిలకడగా ఆడుతున్న క్లాసెన్, మిల్లర్ ►21 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 68/4 (21) ►డేవిడ్ మిల్లర్ కాస్త దూకుడు పెంచాడు. 19వ ఓవర్ ముగిసే సరికి 28 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో క్లాసెన్ నిలకడగా ఆడుతూ 13 పరుగుల వద్ద ఉన్నాడు. స్కోరు: 62-4 మళ్లీ మొదలైన ఆట వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 46-4 వర్షం కారణంగా ఆగిన ఆట వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వరణుడి ఆగమానికి ముందు సౌతాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు చేసింది. క్లాసెన్ 10, మిల్లర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. సౌతాఫ్రికాకు షాకుల మీద షాకులు 11.5:హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో డస్సెన్ అవుట్. డస్సెన్(6) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. మిల్లర్, క్లాసెన్ క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 10.5: స్టార్క్ బౌలింగ్‌లో మార్కరమ్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇప్పటికే బవుమా, డికాక్ వికెట్లు కోల్పోయిన ప్రొటిస్.. మార్కరమ్ రూపంలో మరో కీలక వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. క్లాసెన్, డస్సెన్(5) క్రీజులో ఉన్నారు. 10.1: ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన మార్కరమ్ పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 18/2 పవర్ ప్లేలో సౌతాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. ►తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 17/2 ►6, 7 ఓవర్లను మెయిడిన్ చేసిన హాజిల్‌వుడ్, స్టార్క్. సౌతాఫ్రికా స్కోరు: 8/2 (7) 5.4: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక ఆరంభంలోనే బవుమా వికెట్ తీసి స్టార్క్ షాకివ్వగా.. కీలక వికెట్ పడగొట్టి హాజిల్‌వుడ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. మార్కరమ్, డస్సెన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 8-2(6). కట్టుదిట్టంగా ఆసీస్ బౌలింగ్ బౌలింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సఫారీలను కట్టడి చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయిన ప్రొటిస్ జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 2/1 (2) ►రాస్సీ వాన్ డర్ డస్సెన్ 0, డికాక్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌తో సెమీస్.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►0.6: తొలి ఓవర్లోనే సౌతాఫ్రికాకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. కెప్టెన్ తెంబా బవుమాను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ►టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) తుదిజట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్. -
CWC 2023 2nd Semi Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్,సీన్ అబాట్‌ల స్థానాల్లో మ్యాక్స్‌వెల్, స్టార్క్ రీఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ -
CWC 2023 AUS VS SA 2nd Semis: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం పడనప్పటికీ.. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. The covers are on at the Eden Gardens. pic.twitter.com/X3gMgFTAFw — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి, మ్యాచ్ ఇవాళ రద్దైనా రేపు జరుగుతుంది. వాతవరణం అప్డేట్ తెలిసి క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు మరింత కలవరపడుతున్నారు. ఒకవేళ ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా సౌతాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలకూడదని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్‌తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. -
సెమీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్!
వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా సెమీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అఫ్గానిస్తాన్‌తో చివరి మ్యాచ్‌లో కూడా తొడ కండరాలు పట్టేయడంతో పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే స్కానింగ్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడు సెమీస్‌కు దూరం కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెకెండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌కు బావుమా దూరమైతే అతడి స్ధానంలో రెజా హెండ్రిక్స్ తుది జట్టులో వచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి? -
దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు
వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆసీస్ ఓటమి పాలైంది. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైన కంగారూ జట్టు.. ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. 312 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. రబడ (3/33) ఆసీస్‌ను చావుదెబ్బ తీయగా, జాన్సెన్, కేశవ్, షమ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్(109) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన ఆసీస్.. అంతకుముందు 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా ఓటమిపాలైంది. చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో‘సారీ’
ICC Cricket World Cup 2023- Australia vs South Africa, 10th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకుల మీద షాకులిచ్చింది సౌతాఫ్రికా. ప్రొటిస్ బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పేసర్ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆరో ఓవర్ ఐదో బంతికి మిచెల్ మార్ష్(7)ను మార్కో జాన్సెన్ అవుట్ చేయడంతో మొదలైంది ఆసీస్ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(13), రబడ బౌలింగ్‌లో స్మిత్(19) ఎల్బీడబ్ల్యూ, జోష్ ఇంగ్లిస్‌ను బౌల్డ్ కాగా.. మహరాజ్ బౌలింగ్‌లో మాక్స్వెల్(3) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్(5)ను అవుట్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్ లబుషేన్‌కు తోడుగా టెయిలెండర్ మిచెల్ స్టార్క్(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను కేశవ్ మహరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్‌లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్‌కప్ క్రికెట్లో తొలి వికెట్ చేరింది. అదే ఓవర్లో హాజిల్‌వుడ్‌ను కూడా షంసీ అవుట్ చేయడంతో ఆసీస్ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. డికాక్ సెంచరీతో.. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా గురువార నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కంగారూ జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023లో వరుసగా రెండో శతకం(109) నమోదు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 56 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఈ మెగా టోర్నీ తాజా ఎడిషన్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.తొలుత చెన్నైలో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. -
SA Vs Aus: వరుసగా రెండో సెంచరీ! ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన డికాక్
ICC WC 2023- Australia vs South Africa- Quinton De Kock: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు క్వింటన్ డికాక్ సెంచరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది వంద పరుగులు చేసుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ ప్రపంచకప్-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. రెండో ప్రొటిస్ బ్యాటర్‌గా అదే విధంగా సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు. గిబ్స్ అరుదైన రికార్డు బ్రేక్ అంతేగాక వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆసీస్ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ డికాక్‌ను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, రెండు మార్పులు
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంలో ఇవాళ ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా రెండు మార్పులు చేయగా.. సౌతాఫ్రికా గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో కెమరూన్ గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్.. అలెక్స్ క్యారీ స్థానంలో జోస్ ఇంగ్లిస్ తుది జట్టులోకి వచ్చారు. సౌతాఫ్రికా టీమ్‌లో గెరాల్డ్ కొయెట్జీ స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు .. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోస్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
CWC 2023: ప్రపంచకప్‌లో ఇవాళ రసవత్తర సమరం
ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 12) రసవత్తర సమరం జరుగనుంది. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ హోరాహోరీ పోరులో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. సౌతాఫ్రికా శ్రీలంకపై ఘన విజయం సాధించగా.. ఆస్ట్రేలియా.. టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఏడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాదే పైచేయి.. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు 6 సార్లు ఎదురెదురు పడగా.. ఆస్ట్రేలియా 3, సౌతాఫ్రికా 2 పర్యాయాలు విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది. ఈ ఇరు జట్లు చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఫేవరెట్‌గా సౌతాఫ్రికా..! ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ ఎవరన్న విషయాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం సౌతాఫ్రికాయే అని చెప్పాలి. వరల్డ్‌కప్‌కు ముందు ఇరు జట్లు తలపడిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికానే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సఫారీలు.. ఆతర్వాత ఆనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ చేజిక్కించుకున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ సౌతాఫ్రికా అదే ఫామ్‌ను కొనసాగించింది. శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు ప్రొటీస్ ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఫలితంగా ఆ జట్టు వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఆసీస్ విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు.. ఆతర్వాత భారత్‌తో జరిగిన సిరీస్‌ను కూడా 1-2తేడాతో కోల్పోయింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ ఆసీస్.. టీమిండియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే (199) పరిమితమైన ఆ జట్టు, దాన్ని కాపాడుకోవడం విఫలమైంది. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జన్సెన్, ఫెలుక్వాయో మెరుపులు.. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 పరుగుల మార్కును దాటింది. పర్వాలేదనిపించిన డికాక్, డస్సెన్.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్, మిల్లర్, జన్సెన్, ఫెలుక్వాయోలతో పాటు డికాక్ (27), డస్సెన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ బవుమా (0), గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో వీరవిహారం చేసిన క్లాసెన్ (6), గెరాల్డ్ కొయెట్జీ (0), కేశవ్ మహారాజ్ (0) నిరాశపరిచారు. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా.. నాలుగో వన్డేలో తన బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకుని, వన్డేల్లో అత్యంత ఘోరమైన గణాంకాలు (10-0-113-0) నమోదు చసేలా చేసిన క్లాసెన్‌పై ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జంపా.. క్లాసెన్‌ను కేవలం 6 పరుగులకే క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్లాసెన్ వికెట్ తీశాడన్న మాట తప్పిస్తే.. జంపా ఈ మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు తీశారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ (10), ఇంగ్లిస్ (0) ఔట్ కాగా.. మిచెల్ మార్ష్ (46), లబూషేన్ (27) క్రీజ్‌లో ఉన్నారు. జన్సెన్కు 2 వికెట్లు పడ్డాయి. కాగా, 5 మ్యాచ్‌లో ఈ వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచి, సిరీస్‌లో సమంగా నిలిచాయి. -
నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం
SA Vs Aus 5th ODI- Quinton de Kock gets emotional: సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డే ఆడుతున్న ఈ లెఫ్టాండర్ శరీరం సహకరించని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత తాను అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకనున్నట్లు డికాక్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డికాక్ కంట నీటిచెమ్మ ఆస్ట్రేలియాతో సిరీస్ స్వదేశంలో ఆఖరిదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆసీస్‌తో ఐదో వన్డే ఆరంభానికి ముందు డికాక్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అతడి కళ్లు చెమర్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 30 ఏళ్లకే ఎందుకిలా? కాగా స్టార్ బ్యాటర్‌గా పేరొందిన డికాక్ ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నాడు. 30 ఏళ్ల వయసులోనే డికాక్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను నిరాశ పరిచింది. సిగ్గుపడాల్సిందేమీ లేదు ఈ నేపథ్యంలో క్వింటన్ డికాక్ ఈసీఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘నా టెస్టు కెరీర్ ముగిసిన సమయంలో ఇలాంటి భావన కలిగింది. మళ్లీ ఇప్పుడు కూడా! టెస్టుల్లో ఆడాలని శక్తిమేర ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. 50 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్ అవడం సరైందేనా అని నా సన్నిహితులను అడిగాను. ఇతర ఫార్మాట్లపై దృష్టి పెట్టడం కోసం ఇలా చేయడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పారు. శరీరం 40 ఏళ్లు అంటోది.. 20 ఏళ్ల వాడిలా నటిస్తున్నా గత 10-11 ఏళ్లలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్నాను. నా శరీరమేమో నాకు 40 ఏళ్లని చెబుతోంది.. కానీ ఐడీ మాత్రం నాకింకా 31 ఏళ్లే అని చూపిస్తోంది.. మానసికంగా నేను 20 ఏళ్లవాడిలా నటించేందుకు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. అబుదాబి టూర్ మొదలు ఇండియాలో టెస్టులు.. ముఖ్యంగా శ్రీలంక పర్యటనలో అనుభవాల గురించి డికాక్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. కాగా టీ20 లీగ్‌లలో ఆడటం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని.. అందుకే తాను కూడా పొట్టి ఫార్మాట్‌పైనే దృష్టి సారించాలనుకున్నానని డికాక్ పేర్కొన్నాడు. అవును.. ఎక్కవ డబ్బులు వస్తాయి.. కానీ జాతీయ జట్టును విజయపథంలో నిలిపే క్రమంలో మాత్రం ఎప్పుడూ తాను వెనకడుగు వేయలేదని ఈ లెఫ్టాండర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ కేవలం డబ్బు గురించే ఆలోచించి ఉంటే ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యేవాడినని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదో వన్డేలో క్వింటన్ డికాక్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డేలో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా అరంగేట్రం 2012లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా డికాక్ సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2014లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో క్వింటన్ డికాక్.. టెస్టుల్లో 3300, వన్డేల్లో 6176, టీ20లలో 2907 పరుగులు సాధించాడు. చదవండి: WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా? -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వన్డేల్లో హెన్రిచ్ క్లాసెన్ వరల్డ్ రికార్డు
దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు సాధించాడు. రికార్డుల క్లాసెన్ తద్వారా క్లాసెన్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్ 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా అదే విధంగా.. వన్డే క్రికెట్ చరిత్రలో క్లాసెన్ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. ఒకే బౌలర్ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. గతంలో ఆడం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా మోర్గాన్ ఈ రికార్డు సాధించాడు. వన్డేల్లో క్లాసెన్ వరల్డ్ రికార్డు ఇవన్నీ ఒకెత్తైతే.. వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా క్లాసెన్ చరిత్ర సృష్టించడం వేరే లెవల్! అంతకు ముందు ఈ రికార్డు సంయుక్తంగా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(245.45 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు నాటౌట్), ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(231.41 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు, నాటౌట్) పేరిట ఉండేది. ఆడం జంపా చెత్త రికార్డు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు.. మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. దాంతో తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధికంగా ఏడుసార్లు 400 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. భారత్ ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. సిరీస్ సమం మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో 113 పరుగులిచ్చాడు. వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా మిక్ లూయిస్ (10 ఓవర్లలో 113; ఆస్ట్రేలియా; 2006లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న చెత్త రికార్డును జంపా సమం చేశాడు. ఇక 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అలెక్స్ క్యారీ (77 బంతుల్లో 99; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ కోల్పోయాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్.. #Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp — Bhagi👰 (@orangearmylub) September 16, 2023 💯 for Klassen infront of his home crowd !! 100(57)* He was batting on 29(28) Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r — Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023 -
SA Vs Aus: క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు
Heinrich klaasen 174: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడు. 83 బంతుల్లో 13, 13 సిక్సర్ల సాయంతో ఏకంగా 174 పరుగులు సాధించాడు. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు 57 బంతుల్లోనే సెంచరీ సాధించిన క్లాసెన్.. వన్డే ఫార్మాట్లో ఐదో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 416 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో 400కు పైగా స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆసీస్‌పై 164 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సమం మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కంగారూలు.. తొలి రెండు వన్డేల్లోనూ జయభేరి మోగించారు. ఈ క్రమంలో వరుస ఓటముల నుంచి తేరుకున్న ఆతిథ్య ప్రొటిస్ జట్టు మూడో మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆసీస్‌కు ఊహించని షాక్‌లు ఈ క్రమంలో శుక్రవారం ఇరు జట్లు సెంచూరియన్ వేదికగా నాలుగో వన్డేలో తలపడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు హెన్రిచ్ క్లాసెన్ చుక్కలు చూపించాడు. అద్భుత శతకంతో మెరిసి.. సౌతాఫ్రికాకు 416 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇక లక్ష్య ఛేదనలో కంగారూలకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. ట్రవిస్ హెడ్ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలెక్స్ క్యారీ 99 పరుగులతో పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరుస వికెట్లు కోల్పోవడంతో 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. 164 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను 2-2తో సమం చేసింది. వన్డేల్లో అత్యధికసార్లు 400కు పైగా స్కోర్లు నమోదు చేసిన జట్లు ►సౌతాఫ్రికా- 7 సార్లు ►టీమిండియా- 6 సార్లు ►ఇంగ్లండ్- 5 సార్లు ►ఆస్ట్రేలియా- 2 సార్లు ►శ్రీలంక- 2 సార్లు. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ #Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp — Bhagi👰 (@orangearmylub) September 16, 2023 💯 for Klassen infront of his home crowd !! 100(57)* He was batting on 29(28) Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r — Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023 What a Finish by #Klassen #CSA pic.twitter.com/Vn95QIvIqE — sivakumar (@sivakumar90) September 15, 2023 -
క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం
వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది. సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 పరుగులు చేశాడు. క్లాసెన్‌కు తొలుత రస్సీ వాన్ డర్ డస్సెన్ (65 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 416 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మార్క్రమ్ (8) మినహా అందరూ పరుగులు చేశారు. క్వింటన్ డికాక్ (45), రీజా హెండ్రిక్స్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 57 బంతుల్లో శతక్కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన శతకం. గతంలో క్లాసెన్ ఓసారి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ ఉన్నన్ని రోజులు గుర్తుంటుంది. క్లాసెన్‌కు మిల్లర్ కూడా జతకలవడంతో ఆసీస్ బౌలింగ్ లైనప్ తునాతునకలైంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో రికార్డు స్థాయిలో 113 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు స్టొయినిస్ (10-1-81-1), హాజిల్‌వుడ్ (10-0-79-2), నాథన్ ఇల్లిస్ (10-0-79-1), మైఖేల్ నెసర్ (10-0-59-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సౌతాఫ్రికా సిరీస్ ఆవకాశాలు సజీవంగా ఉంటాయి. క్లాసెన్ పరుగులు ఇలా సాధించాడు.. తొలి హాఫ్ సెంచరీ: 38 బంతులు రెండో హాఫ్ సెంచరీ: 19 బంతులు మూడో హాఫ్ సెంచరీ: 20 బంతులు ఆఖరి 24 పరుగులు: 6 బంతులు ఈ ఇన్నింగ్స్‌లో క్లాసెన్ ఆఖరి 150 పరుగులను 58 బంతుల్లో చేయడం విశేషం. క్లాసెన్-మిల్లర్ జోడీ కేవలం 94 బంతుల్లో 222 పరుగులు జోడించింది. క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం. ఆస్ట్రేలియాపై రెండో ఫాస్టెస్ట్ హండ్రెడ్.. కోహ్లి 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా జంపా.. ఆసీస్‌కే చెందిన మిక్ లెవిస్ (113) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సార్లు (7) 400 స్కోర్ దాటిన సౌతాఫ్రికా -
శతక్కొట్టిన మార్క్రమ్.. వార్నర్ ఒంటరిపోరాటం.. ఎట్టకేలకు సౌతాఫ్రికాకు తొలి గెలుపు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో సౌతాఫ్రికా ఎట్టకేలకు తొలి గెలుపు సాధించింది. 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 12) జరిగిన మూడో మ్యాచ్‌లో ప్రొటీస్ 111 పరుగుల తేడాతో గెలుపొందింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. తాజా గెలుపుతో ఆ జట్టు సిరీస్ అవకాశాలను (1-2) సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఎయిడెన్ మార్క్రమ్ విధ్వంసకర శతకంతో (74 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. డికాక్ (82), బవుమా (57)లు సైతం అర్ధసెంచరీలతో చెలరేగగా.. హెండ్రిక్స్ (39), జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. క్లాసెన్ (0), మిల్లర్ (8) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తీన్వర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఓ దశలో విజయం దిశగా సాగినప్పటికీ.. సఫారీ యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (4/50) ఆసీస్ విజయావకాశాలకు అడ్డుకట్ట వేశాడు. అతనికి తబ్రేజ్ షంషి (2/29), కేశవ్ మహారాజ్ (2/37), మగాల (1/40) సహకరించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వార్నర్ (78) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ట్రవిస్ హెడ్ (38), మిచెల్ మార్ష్ (29)లకు శుభారంభాలు లభించినప్పటికీ, వారు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. లబూషేన్ (15), అలెక్స్ క్యారీ (12), స్టోయినిస్ (10), టిమ్ డేవిడ్ (8), సీన్ అబాట్ (2), ఇల్లిస్ (16), తన్వీర్ సంగా (0) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లారు. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే సెప్టెంబర్ 15న సెంచూరియన్‌లో జరుగనుంది. -
మార్క్రమ్ విధ్వంసకర శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (సెప్టెంబర్12) జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకంతో (102 నాటౌట్) విరుచుకుపడ్డాడు. మార్క్రమ్కు జతగా క్వింటన్ డికాక్ (77 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ టెంబా బవుమా (62 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించగా.. రీజా హెండ్రిక్స్ (39), మార్కో జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. ఈ నలుగురు సత్తా చాటడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (0), డేవిడ్ మిల్లర్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా కొనసాగుతుంది.