Switzerland
-
నిచ్చెన మెట్లు... చక చకా!
చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా?చెట్టులెక్కి.. ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా?అప్పుడెప్పుడో లక్ష్మీదేవి పెట్టిన వర పరీక్ష ఇది! ఇప్పుడా అవసరం మనిషికి లేదు కానీ.. అన్ని రంగాల్లోకీ దూసుకొస్తున్న యంత్రులకు అదేనండి రోబోలకు కావాలి. ఎందుకంటే.. చెట్టూ పుట్ట ఎక్కే రోబోలను మరిన్ని ఎక్కువ చోట్ల వాడుకోవచ్చు మరి. ఇప్పటివరకూ తయారైన రోబోలు కొంచెం తడబడుతూ మెట్లు ఎక్కగలిగేవి కానీ.. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జూరిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ‘ఎనిమల్’ మాత్రం చాలా వేగంగా నాలుగు కాళ్లతో నిచ్చెన మెట్లు ఎక్కేయగలదు. రెండు కాళ్లపై నుంచోవడం, అడ్డ కూలీల్లా బాక్స్‌లను దూరంగా విసిరివేయడం, ఎక్కినంత వేగంగా మెట్లు దిగగలగడం వంటి పనులన్నీ ఠకీ మని చేసేయగలదీ రోబో. ఏడేళ్ల క్రితం ఈ సంస్థ స్కైస్కాపర్లలో ఎలివేటర్లను వాడుకునే శక్తిగల రోబోలను తయారు చేసింది. అప్పటి నుంచి ఇది ఎనీబోటిక్స్ అనే సంస్థ ద్వారా వాణిజ్యస్థాయిలో అందుబాటులో ఉంది కూడా. తాజాగా ఈ సంస్థే ‘ఎనిమల్’ను అభివృద్ధి చేసింది. ఎనిమల్ నిమిషానికి 0.75 మీటర్ల వేగంతో నడవగలదు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా గంటన్నర నుంచి రెండు గంటల పాట పనిచేస్తుంది. ఇంటా బయట ఎక్కడైనా సరే.. అడ్డంకులను తప్పించుకుని ప్రయాణించగలదు. చుట్టూ జరుగుతున్న విషయాలను చూసి అర్థం చేసుకునేందుకు వీలుగా ఇందులో 360 డిగ్రీ లైడర్ మాడ్యూల్, లోతును అంచనా కట్టేంఉదకు ఆరు సెన్సింగ్ కెమెరాలు, చూపునకు రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ సెన్సర్లు, కెమెరాలిచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు అర్థం చేసుకునేందుకు ఇంటెల్-6 కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కొక్కేల్లాంటి కాళ్లు...మెట్లు ఎక్కే ప్రత్యేకమైన శక్తి కోసం ‘ఎనిమల్’ నాలుగు కాళ్లకు కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ‘సి’ ఆకారంలో ఉండే ఈ నిర్మాణాలు నిచ్చెన మెట్లను గట్టిగా పట్టుకునేందుకు, అవసరమైనప్పుడు వదిలేసేందుకు ఉపయోగపడతాయి. కాళ్లు, చేతులతో పైకి ఎక్కేందుకు మన మాదిరి ప్రయత్నిస్తుందన్నమాట. కంప్యూటర్ మోడళ్ల సాయంతో ఈ కొక్కేలను ఎలా వాడాలో ఎనిమల్కు నేర్పించారు శాస్త్రవేత్తలు. పరిశోధనశాల ప్రయోగాల్లో ఈ రోబో 70 నుంచి 90 డిగ్రీల కోణమున్న నిచ్చెనలను కూడా 90 శాతం కచ్చితత్వంతో ఎక్కగలిగింది. మరీ ముఖ్యమమైన విషయం ఏమిటంటే... ఇలా మెట్లు ఎక్కగల రోబోలతో పోలిస్తే దీని వేగం 232 రెట్లు ఎక్కువ! నమ్మడం లేదా.. వీడియో చూసేయండి మరి... -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
మన దేశంలోనూ టైమ్ బ్యాంక్
విశాఖపట్నానికి చెందిన సత్యమూర్తి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించి బాగా చదివించారు. ఉన్నతోద్యోగాల్లో వారు అక్కడే సెటిల్ అయ్యారు. ఏడాదికి ఓసారి భార్యతో కలిసి అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లి కొద్దిరోజులుండి రావడం ఆయనకు అలవాటు. అయితే, ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఇక్కడ ఒంటరైపోయారు. తమ వద్దకు వచ్చేయమని కొడుకులు కోరుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. తాను టైమ్ బ్యాంక్‌లో కొంత సమయం దాచుకున్నానని, తనకు అవసరం వచ్చినప్పుడు తనను చూసుకునేందుకు మనుషులు వస్తారని చెప్పడంతో కొడుకులు ఆశ్చర్యపోయారు. విలువైన నగలు, డాక్యుమెంట్లను లాకర్లో దాచుకున్నట్టు బ్యాంకులో టైమును కూడా దాచుకోవచ్చా..అలాంటి అవకాశం కూడా ఉందా!! సాక్షి, అమరావతి: ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. జీవితాలు అపార్ట్మెంట్లలో బందీ అయ్యాయి. ఇది ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెద్ద సవాలుగా మారింది. విదేశాల్లోనో లేక మరో దూర ప్రాంతంలోనో ఉండటంతో తల్లిదండ్రులను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకో లేక ఇంటి వద్దే కొన్ని పనులు చేసిపెట్టేందుకో ఓ వయసు దాటాక ప్రతి ఒక్కరికీ మరొకరి సాయం తప్పనిసరైంది. ఇలాంటి అవసరాలు ఉన్న వారిని చూసుకునేందుకు రోటరీ సంస్థ ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో సామాజిక కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చి కుటుంబ అవసరాల అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.ఏమిటీ టైమ్ బ్యాంక్.. అరవై ఏళ్లు దాటి ఆరోగ్యవంతమైన వ్యక్తి టైమ్ బ్యాంక్ సభ్యుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేయడం ద్వారా వారి సమయాన్ని కొంత ఇతరులకు వెచ్చించవచ్చు. ఇలా ఎన్ని గంటలు వెచి్చస్తే అన్ని గంటలు సదరు సమయం కేటాయించిన వ్యక్తి పేరుపై అతని ఖాతాలో ఆ సమయం జమ అవుతుంది. దానిని వారు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ సభ్యులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఇతర అవసరాలు ఉన్నపుడు ఇంకో సభ్యుడు వీరికి సాయం చేస్తారు. ఇందులో సభ్యులు.. సేవ కోరేవారి మధ్య డబ్బు లావాదేవీ ఉండదు. ఉదాహరణకు, ఒక సభ్యుడు వారానికి నాలుగు గంటలు మరొకరికి సేవ చేస్తున్నట్టయితే, అతను నెలకు 16 గంటలు సంపాదిస్తాడు లేదా ఆదా చేస్తాడు. ఇలా సంవత్సరానికి 192 గంటలు లేదా 8 రోజులు అతని/ఆమె ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విడతల వారీగా లేదా ఒకేసారి తన అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. దీనికోసం సదరు బ్యాంకులో నమోదు చేసుకుంటే మరో సభ్యుడు లేదా సభ్యురాలు వచ్చి సేవలందిస్తారు. సరళంగా చెప్పాలంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజి్రస్టేషన్ అనేది జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ ఖాతాను తెరవడం లాంటిది. పెద్దలకు సేవ చేయడం ద్వారా డబ్బుకు బదులు సమయాన్ని జమ చేసుకుంటారు. వారి అవసరాల సమయంలో వారి డిపాజిట్ సమయానికి సమానమైన సమయాన్ని విత్‌డ్రా చేసుకుంటారు. ప్రపంచంలో 34 దేశాల్లో అమలు స్విట్జర్లాండ్‌లో మొదలైన టైమ్ బ్యాంక్ కాన్సెప్‌్టను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో యూకే, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్పెయిన్, గ్రీస్, సింగపూర్, తైవాన్, సెనెగల్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 300కు పైగా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 40 రాష్ట్రాల ప్రభుత్వాలు టైమ్ బ్యాంక్‌ను అమలు చేస్తున్నాయంటే వీటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ ఈ తరహా కాన్సెప్ట్ అవసరమని 2018లో జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 2019లో టైమ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 50 వేల మంది వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతోపాటు సామాజిక సేవల్లో ముందుండే రోటరీ క్లబ్ కూడా టైమ్ బ్యాంక్‌ను ప్రారంభించగా, ఇందులో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరారు. 2012లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభండబ్బుతో అవసరం లేకుండా ‘మనిíÙకి మనిషి సాయం’ అందించే వినూత్న విధానానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నాంది పలికింది. స్విస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తోంది. అయితే, తమకు డబ్బు కంటే సాయం చేసేవారు అవసరమని, చాలా సందర్భాల్లో ఏ పనీ చేసుకోలేకపోతున్నామని అక్కడి వృద్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తమతో మాట్లాడేందుకు మనిíÙని తోడు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేసింది. దేశంలో వృద్ధుల్లో అత్యధికులు ఒంటరి జీవితాలు గడుపుతున్నారని, వారు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మనిషి సాయం కోరుతున్నట్టు గుర్తించారు. దాంతో ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012లో ‘టైమ్ బ్యాంక్’ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ‘టైమ్ ఈజ్ మనీ’ కాన్సెప్‌్టను వర్తింపజేస్తోంది. ఈ కాన్సెప్ట్‌ని కచ్చితంగా ఆచరించడంలో స్విట్జర్లాండ్ ముందడుగు వేసింది. ఆ దేశంలో పౌరులు తమ సమయాన్ని బ్యాంకుల్లో ‘పొదుపు’ చేసేలా ప్రోత్సహించింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో వలంటీర్‌గా రిజిస్టర్ చేసుకుంటే వారిని అవసరం ఉన్నవారికి అలాట్ చేస్తారు. అలా వారు తోటపని, ఇంటి పని, బయటకి తీసుకెళ్లడం, కబుర్లు చెప్పడం, వృద్ధులు చెప్పే మాటలు వినడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనుల్లో సాయంగా ఉంటారు. వీరు ఎన్ని గంటలు కేటాయించారో అంత సమయం సాయం చేసిన వ్యక్తి అకౌంట్లో జమ చేయడం ప్రారంభించారు. -
స్విట్జర్లాండ్ లో రాయ్ లక్ష్మీ సిజ్లింగ్ ఫోటోలు
-
భారత ఈక్విటీల్లో యూబీఎస్ ఏజీ వరుస అమ్మకాలు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ యూబీఎస్ గ్రూప్ ఏజీ.. శుక్రవారం ఒక్క రో జే (30వ తేదీన) ఏకంగా భారత ఈక్విటీల్లో భారీ అమ్మ కాలకు దిగింది. ఏడు కంపెనీల్లో రూ.4,961 కోట్ల విలువ చేసే షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూ పంలో విక్రయించింది. యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ ఏషియా రూపంలో బల్‌్కడీల్స్ ద్వారా అమ్మకాలు చేసినట్టు ఎన్ఎస్ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయిల్ ఇండియాలో రూ.972 కోట్లు, డిక్సన్ టెక్నాలజీస్‌లో రూ.904 కోట్లు, ఆర్‌వీఎన్‌ఎల్‌లో రూ.797 కోట్లు, జైడస్ లైఫ్సైన్సెస్లో రూ.756 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేసింది. అలాగే, వొడాఫోన్ ఐడియా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌లోనూ రూ.1,531 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. మరోవైపు బంధన్ బ్యాంక్‌లో రూ.384 కోట్ల విలువ చేసే 1.92 కోట్ల షేర్లను యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ కొనుగోలు చేసింది. -
ముద్దొచ్చే మర చేప
ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు. సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్ఏను (‘ఇ–డీఎన్ఏ’గా పిలుస్తారు) సేకరించడం. ‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక
బెర్న్: ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్‌పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వా«దీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి. స్విట్జర్లాండ్ సదస్సు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్ కపూర్ హాజరయ్యారు. -
Euro 2024: యూరో కప్‌లో బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్
ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో కప్-2024కు తెర లేచింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య జర్మనీ శుభారంభం చేసింది. శనివారం మ్యూనిక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 5-1తో జర్మనీ అద్భుత విజయం సాధించింది.ఈ తొలిపోరులో ఏ దశలోనూ పత్యర్ధికి జర్మనీ అవకాశమివ్వలేదు. ఈ మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత జమాల్ ముసియాలా, కై హావర్ట్జ్ ఫస్ట్‌హాఫ్‌లో మరో రెండు గోల్స్‌ను అందించారు. దీంతో ఫస్ట్‌హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో కూడా జర్మనీ అదరగొట్టింది. ఇక ఈ విజయంతో జర్మనీ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరాయి. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. హంగేరీ జట్టుపై 3-1తో స్విస్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఇక ఈ మెగా టోర్నీ జర్మనీలోని 10 పట్టణాల్లో జరగనుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి. -
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్
-
ఇక చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు
స్విస్ చీజ్, చాక్లెట్, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అదనంగా, ఈఎఫ్టీఏ దేశాలకు తన సేవల ఎగుమతులను పెంచడానికి ఐటీ, హెల్త్‌కేర్, అకౌంటింగ్ వంటి 105 ఉప రంగాలలో భారతదేశం రాయితీలను అందించింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో భారత్ మార్చి 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే నుంచి 114, లైచెన్టెయిన్ నుంచి 107, ఐస్లాండ్ నుంచి 110 సబ్ సెక్టార్లను భారత్ ఈఎఫ్టీఏకు అనుమతించింది.1960లో ఏర్పాటు చేసిన ఈఎఫ్టీఏ అనేది ఐస్లాండ్, లైచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐరోపా అంతటా ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం 13 మిలియన్ల జనాభాతో, ఈఎఫ్టీఏ దేశాలు ప్రపంచంలోని పదో అతిపెద్ద వాణిజ్య వ్యాపారులు, వాణిజ్య సేవల ఎనిమిదో అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. -
హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!
జీవితంలో ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం 'పెళ్లి'. అది తమ జీవితంలో మరుపురాని గుర్తులా ఉండేలా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటోంది యువత. అందుకోసం తమ తాహతకు తగ్గా రేంజ్లో డీజే మ్యూజిక్‌లు లేదా అందమైన టూరిస్ట్ ప్రదేశాల్లోనూ చేసుకుంటారు. విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అలానే ఇక్కడొక జంట ఏకంగా ఎముకలు కొరికే మంచు శిఖరాల్లో పెళ్లి జరగాలనుకుంది. అందుకని ఎక్కడకు వెళ్లారంటే..ఈ జంట ఏకంగా స్విట్జర్లాండ్‌లో జెర్మాట్‌లోని ఆల్ఫైన్ శిఖరాల వద్ద గ్రాండ్‌గా వివాహ వేడుకను జరుపుకుంది. బంధువుల, స్నేహితు ఆశ్వీరాదల నడుమ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. గజగజ వణికించే చలిలో చక్కటి వయోలిన్ మ్యూజిక్, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మిల్కీ వైట్ పెళ్లి దుస్తులతో పైనుంచి భువిపైకి వచ్చిన దేవతాల్లా ఉన్నారు. అక్కడొక పెద్ద మంచు క్యూబ్ సెట్టింగ్‌లో వధువరులిద్దరు చక్కగా కెమరాలకు ఫోజలిలస్తూ నిలబడ్డారు. మంచు శిఖరాలే తమ పెళ్లికి సాక్ష్యంగా.. ఏకంగా రెండు వేలకు పైగా ఎత్తులో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ఉన్న తెల్లటి మంచుకి తగ్గట్టూ పూల డెకరేషన్ ఓ రేంజ్లో అదరహో అన్నంతగా అద్భుతంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ వెడ్డింగ్ అడ్వెంచర్ అదిరిపోయింది బాస్, నిజజీవితంలో ఇలా మంచులో పెళ్లి చేసుకునే జంటను చూస్తానని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by LEBANESE WEDDINGS (@lebaneseweddings) (చదవండి: ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!) -
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
మంచుకురిసే వేళలో, సీతూ పాప..లిటిల్ఎల్సాలా.. అమేజింగ్ ఫోటోలు
-
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్‌లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్‌తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే!
ఇంతవరకు ఆర్థికంగా, ఆకలి, కాలుష్యం, అక్షరాస్యతల పరంగా ఉత్తమ దేశాల జాబితను ప్రకటించడం చూశాం. అలాగే ఆ జాబితాలో తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు మెరుగుపరుచుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడూ తాజాగా తరతరాలకు సరిపడ సంపదను కూడబెట్టే అత్యుతమ దేశాల జాబిత వెల్లడైంది. అందులో ఏ దేశం బెస్ట్ స్థానంలో ఉందంటే.. నిజానికి సంపాదన సంభావ్యత, కెరీర్లో పురోగతి, ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్య, ఆర్థిక చలనశీలత, జీవనోపాధి వంటి ఆరు విభిన్న పారామితుల ఆధారంగా ఆయ దేశాల తరతరాలకు సరిపడ సంపదను అంచనా వేస్తారు. ఈ జాబితను ఇచ్చేది పౌర సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఈ కొత్త సూచీ ప్రకారం మొత్తం పారామితుల్లో సుమారు 85% స్కోర్‌తో స్విట్జర్లాండ్ అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఆ పారామితులకు సంబంధించి.. సంపాదన సంభావ్యతలో (100), కెరీర్ పురోగతిలో (93), ఉపాధి అవకాశాల్లో (94) పాయింట్లతో స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేగాదు అధిక జీవన శైలి, ఆర్థిక చలనశీలపై కూడా స్విట్జర్లాండ్ 75 పాయింట్లు సాధించగా, ప్రీమియం విద్యలో 73 పాయింట్లు స్కోర్ చేసింది. ఇలా ఆయా మొత్తం విభాగాల్లో 82 శాతం స్కోర్ చేసి అమెరికా స్విట్జర్లాండ్ తర్వాతి స్థానానికి పరిమితమయ్యింది. అయితే ఉపాధి అవకాశాల పరంగా యూఎస్ స్విట్జర్లాండ్‌తో సమానంగా 94 పాయింట్లు సంపాదించుకుంది. కానీ సంపాదన సంభావ్యత(93), కెరీర్ పురోగత(86), అధిక జీవనోపాధి(68)లలో క్షీణించింది. ఇక ఉపాధి అవకాశాలు, ప్రీమీయం విద్య పరంగా 74 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక తరతరాలకు సరిపడే సంపదలో.. భారతదేశం మొత్తం పారామితుల్లో సుమారు 32% పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇది గ్రీస్‌తో పోలిస్తే తక్కువ. అలాగే జాబితాలో మొదటి 15 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమయ్యింది భారత్. ఆర్థిక చలనశీలతలో 8 పాయింట్లతో అత్యల్ప స్కోర్ చేయగా, ఇతర పారామితుల్లో 43 పాయింట్లతో అత్యధిక పురోగతిని కలిగి ఉంది. సింగపూర్ 79%తో మూడో స్థానంలో ఉండగా, అత్యధిక ఉపాధి అవకాశాల పరంగా మిగత 15 దేశాల కంటే ఎక్కువ పాయింట్లు స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా 75% నాల్గో స్థానంలో ఉండగా, కెనడా 74%తో ఐదో స్థానంలో ఉంది. అలాగే గ్రీస్ 49%తో 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో ఉంది. (చదవండి: చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..కన్నీళ్లు పెట్టించే భార్యభర్తల కథ!) -
Swiss: స్విట్జర్లాండ్‌లో ప్రబలుతున్న ‘తట్టు’
జ్యురిచ్: స్విట్జర్లాండ్‌లో తట్టు(మీజిల్స్) వ్యాధి ప్రబలుతోంది. లుసాన్నే ప్రాంతంలోని ఓ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు తట్టు సోకింది. దీంతో ఆ స్కూల్‌ను ఈ నెల 18 వరకు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎంతమంది విద్యార్థులకు తట్టు సోకిందో స్కూల్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్కూల్ మూసివేస్తున్నామని మాత్రమే స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్కూల్లో జనవరిలోనే ఆరుగురికి తట్టు సోకినట్లు నిర్ధారణ అయిందని, తాజాగా మరో 20 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. మీజిల్స్ అనే అంటు వ్యాధి వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారు దగ్గినపుడు పడే తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తిచెందుతుంది. వ్యాధి సోకిన వారికి జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ముక్కు, గొంతులో మంట, ర్యాషెస్ తదితర లక్షణాలు కనిపిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్లతో మీజిల్స్ రాకుండా నిరోధించవచ్చు. ఇదీ చదవండి.. ఐస్ లాండ్లో అగ్ని పూలు -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్‌పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!
కొన్ని గాథలు ఆశ్చర్యకరంగానూ, భావోద్వేగంగానూ ఉంటాయి. ఆ కథలు సుఖాంత అనుకునేలోపు కొనసాగింపు వెతుక్కుంటూ వస్తుంటే..కొత్త మలుపుతో రసవత్తరంగా ఉంటుది. కానీ సుఖాంతమైతే బావుండనని మాత్రం అనిపిస్తుంది. అలాంటి తపించే కథే స్విస్ మహిళ గాధ. ఆమె పుట్టింది భారత్‌లో, పెరిగింది స్విస్ దంపతులు వద్ద. తన కన్నవాళ్లు వాళ్లు కాదని తెలిసి ఉద్వేగానికి గురైంది. తను జన్మమూలలను వెతుక్కుంటూ భారత్‌కి వచ్చింది. తన తల్లి ఆచూకీ కోసం తపిస్తున్న ఉద్వేగభరితమైన కథ!. విద్యా ఫిలిప్పన్ ఫిబ్రవరి 8, 1996న భారత్‌లో జన్మించింది. ఐతే ఆమె తల్లి పుట్టిన వెంటనే మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో వదిలేసింది. అక్కడ నుంచి ఆమెను 1997లో స్విస్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా ఫిలిప్పన్ స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయింది. అయితే తనను పెంచుతున్న తల్లిదండ్రులు తన వాళ్లు కాదని తెలిసి ఒక్కసారిగా ఉద్వేగం చెందింది. తనకు జన్మనిచ్చిన తల్లిది భారత్ అని తెలిసి వెంటనే తనను వదిలేసిన మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించింది. అక్కడ ఆమె తల్లిది ముంబైలోని దహిసర్ ప్రాంతామని తెలుసుకుంది. కానీ విద్యా తల్లి అక్కడ ఇచ్చిన చిరునామా ఇప్పుడు ఉనికిలో లేదు. దీంతో ఆమెకు సామాజిక కార్యకర్త అడాప్టీ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్ అడ్వకేట్ అంజలి పవార్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో మిషనరీ స్వచ్ఛంద సంస్థ కూడా కొంతసాయం చేసింది. వేగంగా నగరాలుగా మారుతున్న తరుణంలో విద్యా తల్లి ఇచ్చిన చిరునామాని ట్రైస్ చేయడం సాధ్యం కాలేదు విద్యాకు. దీంతో సామాజిక కార్యకర్త విద్యా ఫిలిప్పన్ తల్లిని కనుగొనేలా సాయం చేయాలని దహిసర్ ప్రజలను కోరారు. ఆమె తల్లి ఇంటి పేరు కాంబ్లీ అని ఉంది. కాబట్టి ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్లు గురించి ఏమైన తెలిస్తే తమకు తెలియజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యా ఫిలిప్పన్ మాట్లాడుతూ..నా తల్లికి 20 సంవత్సరాలు వయసులో తనకు జన్మనిచ్చిందని, ఆమె కోసం తాను పదేళ్లుగా వెతుకుతున్నానని ఆవేదనగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తన తల్లి ఆచూకీ కోసం తన భర్తతో కలిసి భారతదేశానికి వచ్చాను. నా కుటుంబం ఇంటిపేరు కాంబ్లీ అని ముంబైలోని వ్యక్తులు మా అమ్మ ఆచూకీని కనుగొంటే గనుక తనకు సమాచారం అందించాలని వేడుకున్నారు. ఏ కారణాల రీత్యా ఆ తల్లి పేగుబంధాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందో గానీ కనీసం ఇప్పటికైనా ఆ విధి కరుణించి ఆ తల్లి కూతుళ్లను కలిపితే బావుండను కదూ. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లి కోసం తపనపడుతున్న ఆ విద్యా ఫిలిప్పన్కు నిరాశ ఎదరవ్వకుండా ఆ తల్లి ఆయురారోగ్యాలతో జీవించి ఉంటే బావుండు. (చదవండి: కిడ్నీ దానం చేస్తే ఆ వ్యక్తి ఇదివరకటిలా బతకడం కుదరదా? ప్రమాదమా!) -
Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి
న్యూయార్క్: మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్ ప్యూచ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతాఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్ వారసుల్లో ఒకరు. 220 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్ ప్యూచ్కు 6 శాతం దాకా వాటాలున్నాయి. ప్యూచ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వారసులెవరూ లేరు. దాంతో ఆయన తదనంతరం భారీ ఆస్తులు ఎవరికి చెందుతాయి? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, గతంలో తన బాగోగులు చూసుకున్న 51 ఏళ్ల నడి వయసు్కడిని దత్తత తీసుకుని వేల కోట్ల ఆస్తులన్నీ అప్పగించనున్నారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లోని కోట్ల రూపాయల విలువచేసే కొన్ని భవంతులను అతని పేరిట రాసేశారట. దత్తత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు!
ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఇలా అయినవారిపై విసుగు చెందిన ఓ బిలియనీర్ తన యావదాస్తిని తన వద్ద పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆస్తి ఎంతనుకుంటున్నారు? ఏకంగా రూ.91 వేల కోట్ల విలువైన ఆస్తి. ఇందు కోసం అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు స్విట్జర్లాండ్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్పెస్ (Hermes)ను స్థాపించిన థియరీ హెర్మెస్ మనవడు 80 ఏళ్ల నికోలస్ ప్యూచ్ (Nicolas Puech) తన దగ్గర పనిచేసే 51 ఏళ్ల తోటమాలిని దత్తత తీసుకుని అతనికి 11 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.91 వేల కోట్లు) సంపదను అప్పగించాలని యోచిస్తున్నట్లు ట్రిబ్యూన్ డి జెనీవ్ ఫార్చ్యూన్ అనే స్విస్ పత్రిక నివేదించింది. ఐదో తరం వారసుడు హెర్మెస్ కంపెనీని థియరీ హెర్మెస్1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ కుటుంబంలో ఐదవ తరం వారసుడే నికోలస్ ప్యూచ్. ఈయన కంపెనీలో 9 బిలియన్ నుంచి 10 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన 5- 6 శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే నికోలస్‌కు పెళ్లి, పిల్లలు లేరు. దీంతో ఆయన తన తదనంతరం సంపదను తన వద్ద పనిచేస్తున్న మాజీ తోటమాలికి రాసిచ్చే ప్రక్రియలో ఉన్నారు. దీని కోసం న్యాయవాద బృందాన్ని సైతం నియమించినట్లు సమాచారం. ఇప్పటికే రూ.49 కోట్లు అయితే నికోలస్ దత్తత తీసుకుని ఆస్తిని రాసివ్వాలనుకుంటున్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఆయన స్పానిష్ మహిళను వివాహం చేసుకున్నట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యక్తికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్లు (రూ.49 కోట్లు) విలువైన ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మొరాకోలోని మరకేష్‌లోని ఆస్తి, స్విట్జర్లాండ్‌లోని మాంట్రీక్స్లోని ఒక విల్లా ఉన్నాయి. కుటుంబంలో విభేదాలు ఫార్చ్యూన్ కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా 220 బిలియన్ డాలర్ల విలువైన హెర్మెస్ కంపెనీలో తనకున్న 5-6 శాతం వాటాను తన దగ్గర పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు నికోలస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెర్మెస్ కంపెనీ సూపర్వైజరీ బోర్డు నుంచి నికోలస్ ప్యూచ్ 2014లో తప్పుకొన్నారు. ఆ తర్వాత ఎల్వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ హెర్మెస్లో 23 శాతం వాటాను బలవంతంగా దక్కించుకుంది. దీన్ని అడ్డుకునేందుకు ఇతర కుటుంబ సభ్యులు తమ షేర్లతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్యూచ్ మాత్రం తన వాటాను కొనసాగించారు. ఈ విభేదాలే నికోలస్ తన వారసులుగా కుటుంబ సభ్యులను కాకుండా బయటి వ్యక్తిని తన వారసుడిగా చేయడానికి కారణంగా భావిస్తున్నారు. దత్తత సాధ్యమేనా? నికోలస్ ప్యూచ్ తన దగ్గర పనిచేసే వ్యక్తిని దత్తత తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నా ఆయన పెద్దవారు కావడంతో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల దత్తతకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమతుందో చూడాలి. -
అత్యంత విలాసవంతమైన నగరాలు.. ముఖ్యంగా ఆ రెండూ..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్లు టాప్‌లో నిలిచాయి. ఈ ఏడాది మెస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ లిస్ట్‌లో తర్వాతి స్థానాల్లో జెనీవా, న్యూయార్క్, హాంకాంగ్‌లు ఆక్రమించాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఈ జాబితాను గురువారం వెల్లడించింది. స్థానిక కరెన్సీ పరంగా సగటున, 200 కంటే ఎక్కువ సాధారణంగా ఉపయోగించే వస్తువులు, సేవల కోసం ఈ ఏడాదిలో 7.4శాతం ధరలు పెరిగాయి, గత సంవత్సరం రికార్డు 8.1శాతం పెరుగుదల నుంచి కొద్దిగా తగ్గింది. కానీ ఇప్పటికీ 2017-2021లో ట్రెండ్ కంటే చాలా ఎక్కువ అని నివేదిక తెలిపింది. అలాగే పలు కేటగిరీల్లో అధిక ధరల కారణంగా సింగపూర్ గత పదకొండు సంవత్సరాల్లో తొమ్మిదవసారి ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని తిరిగి సాధించింది. కార్ నంబర్లపై కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా సింగపూర్ప్రపంచంలోనే అత్యధిక రవాణా ధరలు నమోదైనాయి. దుస్తులు, కిరాణా , మద్యం లాంటి ఇతర అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. జెనీవా , న్యూయార్క్‌లు మూడో స్థానంలో ఉండగా, హాంకాంగ్ ఐదు, లాస్ ఏంజెల్స్ ఆరో స్థానంలోనూ నిలిచాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియా సగటున తక్కువ ధరల పెరుగుదల కొనసాగింది. జపాన్‌లోని ఒసాకా , టోక్యోతో పాటు, చైనాలోని నాన్జింగ్, వుక్సీ, డాలియన్, బీజింగ్ - ర్యాంకింగ్‌లలో ఈర్యాంకింగ్స్లో పతనమైన అతి పెద్ద నగరాలు. -
కోటక్ ఇన్సూరెన్స్‌లో ‘జ్యూరిక్’కు వాటాలు
ముంబై: సాధారణ బీమా సంస్థ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో (కేజీఐ) స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం రూ. 4,051 కోట్లు వెచి్చంచనుంది. తదుపరి అదనంగా మూడేళ్లలో అదనంగా 19 శాతం వాటాలు కూడా జ్యూరిక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్లు కేజీఐ మాతృ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, కేజీఐ తమకు పటిష్టమైన భాగస్వామి కాగలదని జ్యూరిక్ సీఈవో (ఆసియా పసిఫిక్) తులసి నాయుడు తెలిపారు. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇరు సంస్థల వనరులు, అనుభవం తోడ్పడగలవని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ప్రీమియంలపరంగా నాన్–లైఫ్ మార్కెట్లో సెపె్టంబర్లో కేజీఐకి 0.52 శాతం వాటా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1,148 కోట్ల మేర స్థూల ప్రీమియం సాధించింది. కొత్త పెట్టుబడుల అనంతరం సంస్థ విలువ రూ. 7,943 కోట్లుగా ఉండనుంది. -
ఢిల్లీలో స్విస్ యువతి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణం!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. కాగా, ఆమె హత్యకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇక, మృతురాలిని స్విట్జర్లాండ్‌కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్గా గుర్తించారు. ఈ కేసులో నిందితుడి ఇంట్లో నుంచి భారీగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. లీనా బెర్గర్ వారం రోజుల కిందట భారత్‌కు వచ్చింది. అయితే, శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రభుత్వ స్కూల్ వద్ద ఉన్న చెత్త పడేసే నల్లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆమెతో సంబంధం ఉన్న గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గురుప్రీత్ సింగ్ తరచుగా స్విట్జర్లాండ్ వెళ్లి లీనాను కలిసేవాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తోంది. అయితే, ఆమెకు మరొకరితో సంబంధం ఉన్నట్లు అనుమానించాడు. ఈ నేపథ్యంలో లీనాను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. భారత్‌కు రావాలని ఆమెను పిలిచాడు. దీంతో అక్టోబర్ 11న లీనా ఢిల్లీ చేరుకుంది. ఐదు రోజుల తర్వాత ఆమెను ఒక గదిలో బంధించాడు. కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశాడు. మరోవైపు ఆమె పేరుతో కొనుగోలు చేసిన పాత కారులో లీనా మృతదేహాన్ని గురుప్రీత్ ఉంచాడు. దుర్వాసన రావడంతో చెత్త పారవేసే ప్లాస్టిక్ బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచి ప్రభుత్వ స్కూల్ ముందు పడేశాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి గురుప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఉంచిన కారుతోపాటు మరో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఇంటి నుంచి రూ.2.25 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్