technical
-
సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్) రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఈ రంగంలో ఐఐటీ–ఢిల్లీ నిర్వహించిన అధ్యయనంలోనూ దేశంలోనే మొదటి నాలుగు స్థానాల్లో రాష్ట్రం చోటు దక్కించుకుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం (మెడిటెక్), వ్యవసాయం, ఆక్వా (ఆగ్రోటెక్), ఆటోమొబైల్ (మొబిటెక్), క్రీడా పరికరాలు (స్పోర్ట్స్టెక్), భవన నిర్మాణ సామాగ్రి (బిల్డ్‌టెక్), గృహోపకరణాలు (హోంటెక్), భారీ టవర్లు (ఇండుటెక్), ప్యాకింగ్ సామాగ్రి (ప్యాక్టెక్) వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్రో టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్‌టెల్స్, జియో టెక్స్‌టైల్స్‌లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్ తదితర దేశాలకు ఏటా రూ.180 కోట్ల విలువైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది. విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్లో వైద్య పరికరాల ఉత్పత్తులు (మెడికల్ టెక్స్టైల్స్) ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్లాస్టిక్, గ్రాసిమ్ వంటి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న 15 టెక్నికల్ టెక్స్టైల్ కంపెనీలు మనరాష్ట్రంలోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్)కు మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామికీకరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అనుకూలమంటే.. ♦ మొబిటెక్: కియా, ఇసూజీ, అశోక్ లేలాండ్, హీరో వంటి ప్రధాన ఆటోమొబైల్ తయారీదార్ల నుంచి రాష్ట్రంలో మొబిల్‌టెక్ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. ♦ జియో టెక్స్టైల్స్: దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్యూబులు, జియో బ్యాంగ్‌లకు డిమాండ్ ఉంది. ఓడరేవుల వద్ద తీర ప్రాంతం నీటి కోతకు గురికాకుండా జియో ట్యూబులను వినియోగిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జియోట్యూబ్ సీవాల్ నిర్మాణం ఒకటి. ఇది దేశంలోనే మొదటి జియో టెక్స్టైల్ ట్యూబ్ నిర్మాణంగా గుర్తింపు పొందింది. రోడ్ల పటిష్టత కోసం కూడా జియో ట్యూబులను వినియోగిస్తారు. ♦ ఆగ్రోటెక్ టెక్స్టైల్స్: ఉద్యాన రంగంలో ఉపయోగించే షేడ్ నెట్లు, పండ్లు, మొక్కలకు ఉపయోగించే క్రాప్ కవర్ ఉత్పత్తులు.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తాయి. హారి్టకల్చర్లో ఆగ్రో టెక్స్టైల్స్ వినియోగంతో మంచి దిగుబడులను సాధించవచ్చు. నీటి వినియోగాన్ని 30 నుంచి 45 శాతానికి తగ్గించవచ్చు. ఆక్వా కల్చర్‌లోనూ ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ లైన్ల రూపంలో ఆగ్రో టెక్స్‌టైల్స్‌కు అవకాశాలు ఉన్నాయి. చేపల చెరువుల నిర్మాణం, నిర్వహణలోనూ జియో టెక్స్ౖటెల్స్ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆక్వాకల్చర్ రంగం ఆగ్రోటెక్కు ప్రధాన ప్రోత్సాహంగా నిలుస్తోంది. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆగ్రోటెక్, జియోటెక్స్‌టైల్స్‌కు 30 శాతం డిమాండ్ ఉంది. అరటి వ్యర్థాల ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్.. టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో అరటి వ్యర్థాలతో ఉత్పత్తులను తయారు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అలాగే జనపనార ఉత్పత్తుల్లో ఐదో స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలను నూలుగానూ, ఆ తర్వాత వస్త్రంగానూ పలు రకాలుగా వినియోగించే సాంకేతిక ఉత్పత్తులను తయారు చేయడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తున్నారు. రీసైకిల్ చేసిన వ్యవసాయ వ్యర్థాలను నూలు ఉత్పత్తులు, షూలు, శానిటరీ నాప్కిన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అరటి ఫైబర్ నుంచి కవర్లు, శానిటరీ ప్యాడ్లు, నూలు, షూలు తయారు చేస్తున్నారు. పైనాపిల్, అరటి పండు వ్యర్థాల నుంచి వివిధ ఫంక్షనల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల్లో రాష్ట్రం గత ఐదేళ్లలో 8–10 శాతం వృద్ధిని నమోదు చేసింది. సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది.. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తుల రంగంలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఆక్వా రంగం పెద్ద వినియోగదారుగా ఉంది. ఆగ్రో టెక్స్టైల్స్.. సుస్థిర వ్యవసాయం, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తున్నాయి. హార్టికల్చర్‌లో ఆగ్రో టెక్స్టైల్స్.. నీరు, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది. దీంతో రాష్ట్రంలోనూ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్కలమైన వనరులు, సాంకేతిక సామర్థ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఉత్పత్తిదారుగానే కాకుండా అతిపెద్ద వినియోగదారుగా కూడా ఉండనుంది. – కె.సునీత, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న సాంకేతిక ఉత్పత్తులు.. జిల్లా ప్రధాన సాంకేతిక ఉత్పత్తులు అనంతపురం సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు చిత్తూరు శానిటరీ ప్యాడ్స్ తూర్పుగోదావరి చేపలు పట్టే వలలు, లైఫ్ జాకెట్లు ప్రకాశం కన్వేయర్ బెల్ట్ పశ్చిమగోదావరి జనపనారతో చేసిన హెస్సియన్ వస్త్రం విశాఖపట్నం సన్నటి ఊలు దారాల ఉత్పత్తులు, సీటు బెల్టులు, కన్వేయర్ బెల్టులు -
మాల్దీవులలో సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని వెల్లడించింది. ఇటీవల మాలే నుంచి భారత మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేసిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ‘ఇరు దేశాల మధ్య రెండో అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూడా ఇరుదేశాల అధికారులు సమావేశం కానున్నారు. అంతలోపు మాల్దీవులలో ఉన్న భారత్ మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఇక.. రెండోసారి జరిగిన అధికారుల సమావేశంలో మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తమ దేశంలోని భారత్‌కు చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని సైనిక బలగాల్లో.. ముందుగా ఒక స్థావరంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని మార్చి 10 వరకు భర్తీ చేయాలని కోరింది. మరో రెండు వైమానిక స్థావరాలోని మిలిటరీ బలగాల బదులుగా మాలేలో మే 10వరకు నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందని పంపిచాలని విజ్ఞప్తి చేసింది. ఇక.. మల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్య సేవలను అందించేందుకు భారత్ వైమానిక స్థావరాల్లో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది ద్వారా నిరంతరం కార్యకలాపాలు సాగించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్ల సమాచారం. -
రైవాడ జలాశయాన్ని సందర్శించిన సాంకేతిక బృందం
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక బృందం శుక్రవారం రైవాడ జలాశయాన్ని సందర్శించింది. గౌరవ్ భగత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బోటులో ప్రయాణించి సర్వే నిర్వహించింది. బోటులో అమర్చిన ల్యాప్‌టాప్‌తో పాటు కెమెరాల ఆధారంగా సర్వేను చేపట్టారు. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో రైవాడ జలాశయం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.252 కోట్లతో గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపారు. 1990లో వచ్చిన భారీ వరద దృష్ట్యా ఎటువంటి తుపాన్లు సంభవించినా ఎదుర్కొనేలా కొత్త స్పిల్‌వే గేట్లు అమర్చాలని డ్రిప్ పథకంలో ప్రతిపాదించారు. జలాశయం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు సాంకేతిక అధికారుల బృందం ఇక్కడికి వచి్చంది. అధునాతన సాంకేతికత ఆధారంగా జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం, ఎంతమేర పూడిక ఉంది, జలాశయం విస్తీర్ణం, జలాశయం గర్భంలో ఎక్కడైనా నిర్మాణాలు జరిగాయా తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు.15 రోజులపాటు ఈ సర్వే జరుగుతుందని, అనంతరం సర్వే రిపోర్టును ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. వీరికి జలాశయం డీఈ సత్యంనాయుడు, జేఈలు నంద కిశోర్, రవిప్రకాష్ తదితరులు జలాశయ స్థితిగతులను వివరించారు. -
5G సేవలు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయి : ప్రధాని నరేంద్ర మోదీ
-
జేఎన్టీయూహెచ్లో టెక్నికల్ ఫెస్ట్-2022 (ఫొటోలు)
-
ఒక వికృత సాంకేతిక దాడి
ఏవైనా విషయాలు తమ సాధారణ పరిజ్ఞానాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మనిషి అధిక తెలివిని సంపాదించాలనుకుం టాడు. కానీ కొంత మంది అర్ధ తెలివి లేదా మూర్ఖ త్వానికి దిగిపోతారు. ఇది ఎప్పుడు సాధ్యమౌతుం దంటే–తమ ఆడియెన్స్ కూడా అర్ధ తెలివిని ఆమోదించేవారు అయినప్పుడు! తాము సుప్రీం అని, తాము ఏది చెప్పినా చెల్లుతుందని, తమకు మెజారిటీ సపోర్ట్ ఉందనే వాతావరణం వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రణాళికా బద్ధంగా ద్వేష పూరితమైన యాటిట్యూడ్ బలపడటం వల్ల కలెక్టివ్ విచక్షణ చచ్చిపోతుంది. ముస్లిం స్త్రీలను ఆన్లైన్ సేల్కు పెట్టి, దాని మీద మార్కెట్ క్రియేట్ చేద్దామనుకున్న వాళ్ళ మానసిక తత్వం కూడా ఇందులో భాగమే! ఒక అమ్మాయిని ఊహత్మకంగా సేల్కు పెట్టి, ఆమెను ఓన్ చేసుకున్నట్టుగా చూపే ఈ మానసిక వైపరీత్యం పైన చెప్పిన కారణాల వల్ల పుట్టుకొస్తుంది. ఇది సాధారణ ఎమోషన్ మాత్రమే కాదు. ఒక ప్రణాళికాబద్ధమైన కమ్యూనికేషన్. మనిషిలో ఒక హేతు రహితమైన బయాస్‌ను సృష్టించడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) ‘సల్లీడీల్స్’, ‘బుల్లీబాయి’ యాప్‌లతో ముస్లిం స్త్రీల మీద చేస్తున్న అమానవీయ దాడి ఇటువంటిదే. ఇప్పటికి ఈ కేసులో 21 ఏళ్ళ అబ్బాయి, 18 ఏళ్ళ అమ్మాయి అరెస్ట్ అయ్యారు. దీని వెనుక ఇంకా పెద్ద స్థాయివాళ్లు ఉంటారు. ఈ యాప్‌లను ‘గిట్ హబ్’ అనే వెబ్సైట్ హోస్ట్ చేసింది. జూలైలోనే కొంత మంది వికృత మానసిక వాదులు సల్లీ డీల్స్ యాప్‌ను మొదలు పెట్టారు. అప్పుడు కొంత దీనికి వ్యతిరేకత వచ్చే సరికి తీసివేసినా, ఆ తర్వాత ఎవరి మీదా ఎటువంటి చట్టపరమైన చర్యలూ తీసుకోలేదు. ఆ ధైర్యం తోటే మళ్ళీ ఈ కొత్త యాప్ జనవరి 1, 2022న తిరిగి ప్రారంభించారు. కనీస ప్రతిస్పందన కరువైన రోజుల్లో ఇటువంటి వైపరీత్యాలు నార్మలైజ్ కావడం మామూలే. (చదవండి: నిజాలకు పాతరేసి.. అబద్ధాన్ని అందలం ఎక్కిస్తే...) ముస్లింలు మైనారిటీగా ఉన్న ఈ దేశంలో లోక్ సభలో వారి సంఖ్య 27. అందులో తృణమూల్, కాంగ్రెస్ నుండే ఎక్కువ. అదే 1980లో చూస్తే, మన పార్లమెంట్లో 47 మంది ముస్లిం ఎంపీలు ఉండేవాళ్ళు. పార్లమెంట్లో మెజారిటీ కలిగిన బీజేపీలో ముస్లింల సంఖ్య సున్న. మొత్తం మీద తాజా సంఘటనను తాలిబన్లు ప్రత్యక్షంగా ఆడవాళ్ళను బానిసలుగా తీసుకోవడం లాంటి వికృత చర్యకు సారూప్యంగా చూడవచ్చు. ద్వేషం, బలహీనుల పట్ల మదమెక్కిన ఆధిపత్యం ఎంత దాకా తీసుకెళ్తాయో ఇటువంటి చర్యల వల్ల తెలుస్తుంది. అసలు ఈ యాప్‌లకు పోర్న్ యాప్‌ల పేర్లు పెట్టడంలోనే తమను ఎవరూ ఏమీ చేయలేరనే మనిషి ధీమా అర్థమవుతోంది. దీని పూర్వాపరాలు చూడ్డానికి కావాల్సిన హైపోథసిస్ చేసే విచక్షణ జ్ఞానాన్ని మనిషిలో చంపే ఫాసిస్ట్ మనస్తత్వం ఇది. తమ మతం లేదా తమ కులపు ఆడవాళ్ళు వేరు, ఇతర ఆడవాళ్ళు వేరు. అదో విభిన్నమైన జాతిగా ఒక వైరుధ్యాన్ని ఊహాకల్పన చేయడం ఈ యాప్‌ల ప్రధాన లక్ష్యం. ఇటువంటి చర్యలను మనం ఒక ప్రజా బాహుళ్యంగా ఆపకపోతే, దీనికి వ్యతిరేకంగా కనీస ప్రతి స్పందన చూపకపోతే, అంబేడ్కర్ నొక్కివక్కాణించిన ‘రాజ్యాంగ నీతి’ ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కినవారం అవుతాము. రేపు బాధ్యతగా తయారు చేయాల్సిన తరాన్ని ఈ రోజే మనం నాశనం చేసిన వాళ్ళమౌతాము. (చదవండి: సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య) - పి. విక్టర్ విజయ్ కుమార్ రచయిత, విమర్శకుడు pvvkumar@yahoo.co.uk -
Andhra Pradesh: అందుబాటులోకి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈ ల్యాబ్ ఏర్పాటైంది. ఒమిక్రాన్ నిర్ధారణ కోసం రెండు కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో కేరళ తర్వాత ఏపిలోనే ఈ ల్యాబ్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ నిర్థారణకి శాంపిల్స్‌ని పూణే, హైదరాబాద్ సీసీఎంబికి వైద్య ఆరోగ్యశాఖ పంపించేది. ఇప్పుడు విజయవాడలోనే సాంకేతిక ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. చదవండి: ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి.. ప్రధానితో సీఎం జగన్ సోమవారం నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. గత వారం రోజులుగా అధికారులు ట్రైయిల్ రన్ నిర్వహించారు. డెల్టా, ఓమిక్రాన్ మొదలైన కోవిడ్-19ల ఉత్పరివర్తనలు, రూపాంతరాలను ఇక్కడ ల్యాబ్‌లో గుర్తించే సదుపాయం ఉంటుంది. ల్యాబ్ పనితీరులో సీఎస్ఐఆర్, సీసీఎంబీ హైదరాబాద్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని వైద్య అధికారులు తెలిపారు. -
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
ఇండియన్ ఆర్మీ.. జనవరి 2022లో ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్–46వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు. ► మొత్తం పోస్టుల సంఖ్య: 90 ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ(మెయిన్) 2021 పరీక్షకు హాజరై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ► వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూను 5 రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్–1, స్టేజ్–2 విభాగాలు ఉంటాయి. స్టేజ్–1 టెస్ట్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. స్టేజ్–1లో అర్హత సాధించని అభ్యర్థులు అదే రోజు వెనుదిరగాల్సి ఉంటుంది. స్టేజ్–1లో ప్రతిభ చూపిన వారికి స్టేజ్ 2 ప్రక్రియ కొనసాగిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు: డిసెంబర్ 2021 నుంచి ప్రారంభం ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021 ► వెబ్సైట్: www.joinindianarmy.nic.in -
ఖమ్మంలో టైపింగ్ ప్రశ్నాపత్రం తారుమారు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ నిర్వహిస్తున్న టైపింగ్ పరీక్షల్లో టైపింగ్ లోయర్ ఎగ్జామ్‌లో హయ్యర్ ఖమ్మంలో టైపింగ్ ప్రశ్నాపత్రం తారుమారు దర్శనమిచ్చింది. దీంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కళాశాలలో శని, ఆదివారాల్లో రెండు రోజులుగా టైపింగ్ లోయర్, హయ్యర్, హైస్పీడ్ పరీక్షలు జరుగుతుండగా ఆదివారం 52మంది అభ్యర్థులు లోయర్ 4వ బ్యాచ్ పరీక్షకు హాజరయ్యారు. వీరికి హయ్యర్ ఖమ్మంలో టైపింగ్ ప్రశ్నాపత్రం తారుమారు రావడంతో అభ్యర్థులు లబోదిబోమన్నారు. లోయర్ గ్రేడ్‌కు సంబంధించిన 45నిమిషాల మనుస్క్రిప్ట్ పేపర్–2 100మార్కులకు ఉండగా.. 45మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే..పూర్తిగా ప్రశ్నపత్రమే మారడంతో అభ్యర్థులు పరీక్ష పూర్తయిన అనంతరం తమకు జరిగిన నష్టానికి సాంకేతిక విద్యాశాఖ లోపమే కారణమని ఆరోపించారు. విద్యార్థులకు మారిన ప్రశ్నలకు గాను పూర్తిస్థాయిలో మార్కులు వేయాలని ఖమ్మం జిల్లా టైపు రైటింగ్ అసోసియేషన్ సభ్యులు బాబా తదితరులు కోరారు. చదవండి: ఐటీ పోర్టల్ లోపాలు.. ఇన్ఫోసిస్‌పై కేంద్రం గరం -
పలు పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోకోపైలట్, టెక్నికల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు 03242 నంబర్ గల సికింద్రాబాద్–దానాపూర్ ప్రత్యేక రైలు ఆగస్టు 9న సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి ఆగస్టు 11 ఉదయం 7.40కి దానాపూర్ చేరుకుంటుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఉమేశ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ముజఫరాబాద్, సికింద్రాబాద్ మధ్య.. 05289 నంబర్ గల ముజఫరాబాద్–సికింద్రాబాద్ స్పెషల్ ట్రెయిన్ ముజఫరాబాద్ నుంచి ఆగస్టు 8న మధ్యాహ్నం 12కి బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే 05290 నంబర్ గల స్పెషల్ ట్రెయిన్ ఆగస్టు 10న రాత్రి 9కి సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ముజఫరాబాద్ చేరుకుంటుంది.. చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 06051 నంబర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు చెన్నై సెంట్రల్ నుంచి ఆగస్టు 11, 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో (శనివారాలు) రాత్రి 8.10 నుంచి బయల్దేరి ఉదయం 5.45 గంటలకు (సోమవారాలు) అహ్మదాబాద్ చేరతాయి. 06052 నంబర్ అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వీక్లీ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు అహ్మదాబాద్ నుంచి ఈనెల 13, 20, 27, సెప్టెంబరు 3, 10, 17, 24, అక్టోబరు 1 (సోమవారాలు)న ఉదయం 9.40 నిమిషాలకు బయల్దేరి (మంగళవారాలు) సాయంత్రం 5.10కి చెన్నై సెంట్రల్ చేరుకుంటాయి. -
సృజనాత్మకతదే భవిష్యత్..
కేపీహెచ్‌బీకాలనీ: గ్లోబలైజేషన్‌తో ప్రపంచం కుగ్రామంగా మారిందని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సాంకేతిక ఉత్సవాలు దోహపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సాంకేతిక ఉత్సవాలు బుధవారం వర్శిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాల ప్రారంభోత్సవానికి నేషనల్ ఇన్సూరెన్స్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్.ఎల్. వెంకటరావు, జిటాటెక్ అధినేత ఆర్.శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చీర కట్టు.. అదిరేట్టు.. కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులు.. ప్రిన్సిపల్ ఇ.సాయిబాబారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావుతో కలిసి వారు వేడుకను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ చదువులు పూర్తికాగానే ఎంటర్ప్రెన్యూర్లుగా ఎలా ఎదగాలో ముందుగానే అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ జాతీయ విద్యార్థి సదస్సుల్లో చేపట్టే కార్యక్రమాల ప్రోమోలను ప్రారంభోత్సవ వేడుకలో ప్రదర్శించారు. కాగా సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, మేనేజ్మెంట్ విద్యార్థులు వేడుకలో విభిన్నంగా సందడి చేశారు. -
టెక్నికల్ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్ : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో టెక్నికల్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. టైలరింగ్ లోయర్ పరీక్షకు 124 మందికి గాను 78 మంది హాజరయ్యారు. బాలికల ఉన్నత పాఠశాల డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 104 మందికి గాను 68, గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ హయ్యర్ పరీక్షకు 32 మందికిగాను 32 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డీఈవో డాక్టర్ కె.రవికాంత్‌రావు, పరీక్షల విభాగం జిల్లా సహయక కమిషనర్ సురేష్‌బాబు పరీక్షలను పర్యవేక్షించారు. -
టెక్నికల్ లేబర్ కే భవిష్యత్
గల్ఫ్ దేశాలకు టెక్నికల్ లేబర్‌గా వస్తేనే బాగుంటుందని, మంచి జీతంతో పాటు రక్షణ ఉంటుందని దుబాయ్‌లోని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్ చెప్పారు. కామన్ లేబర్‌గా వస్తే జీతం తక్కువగా వస్తుందని, కష్టాలు కూడా ఎక్కువేనని అన్నారు. గల్ఫ్‌లో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - సాక్షిఇంటర్వ్యూ పెద్దపల్లి: : మన దగ్గర యువత పదో తరగతి, ఇంటర్ వరకు మాత్రమే చదువుకుని గల్ఫ్ బాట పడుతున్నారు. పాస్‌పోర్టు తీసి ఏజెంటుకు ఇస్తారు. కొంత అడ్వాన్స్ కూడా ఇస్తారు. అప్పటి నుంచి వారికి టెన్షన్ మొదలవుతుంది. రోజూ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంటారు. పని వెతికే పనిలో ఏజెంటు ఉండగానే.. రోజులు గడుస్తున్నాయంటూ ఒత్తిడి చేస్తుంటారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఏజెంట్లు మూడు నెలల విజిట్ వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా తీసి పుషింగ్ (అక్రమంగా దేశం దాటించడం)లో పంపిస్తున్నారు. అందులో ప్రొఫెషన్ మార్చి పంపుతున్నారు. గల్ఫ్‌కు తీసుకువచ్చి గదిలో వేసి మీరే పని చేసుకోవాలని ఏజెంట్లు చెప్తున్నారు. మూడు నెలల్లో ఏదో ఒక పనిచేసుకుంటారు. ఇంత ఖర్చు చేసి వచ్చాను.. ఉత్త చేతులతో తిరిగి ఎలా వెళ్లేదంటూ అక్కడే ఉంటారు. అతనికి ఆ దేశ ‘గుర్తింపు’ ఉండదు కాబట్టి అక్రమ నివాసి అవుతాడు. దీంతో అతను పోలీసులకు దొరికినప్పుడు జైళ్లలో వేస్తారు. గల్ఫ్‌పై ఎన్నో ఆశలతో వచ్చిన వారు.. ఇక్కడి చట్టాలు తెలియక కష్టాలపాలవుతున్నారు. రిక్రూటింగ్ ఏజెంట్ అతను ఏ దేశం వెళ్తున్నాడో.. అక్కడి కంపెనీకి చెందిన అన్ని వివరాలు చెప్పాలి. జీతం, అక్కడ ఉండాల్సిన కాలం అన్నీ అగ్రిమెంట్లో ఉండేవిధంగా గల్ఫ్‌కు వచ్చే వారు చూసుకోవాలి. రిజిష్టర్డ్ ఏజెన్సీల నుంచి వెళితే ఏదైనా జరిగినప్పుడు కంపెనీని అడుగవచ్చు. కామన్ లేబర్‌గా గల్ఫ్ దేశాలకు రావడం దండగ. దుబాయ్‌లో అయితే కామన్ లేబర్‌కు 1000 దరమ్లే వస్తాయి. అందులో 300 దరమ్‌లు ఖర్చులకు పోతాయి. ఇక్కడికి రావడానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఖర్చవుతాయి. వీసా అప్పు తీరడానికి ఒక సంవత్సరానికి పైగా పడుతుంది. టెక్నికల్ లేబర్‌గా వస్తే జీతం కూడా బాగుంటుంది. అవగాహన కల్పించాలి.. గల్ఫ్‌కు వెళ్లే వారికి అవగాహన శిబిరాలు నిర్వహించాలి. గల్ఫ్‌లో ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన చేసి యువతకు తెలియజేయాలి. గల్ఫ్‌లో అనుభవమున్న వారితో శిక్షణ ఇప్పించాలి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్, ఏపీ, తెలంగాణ నుంచి కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కేరళలో ఇలాంటి శిక్షణలు నిర్వహిస్తారు. గల్ఫ్‌లో చిన్నచిన్న వ్యాపారాల్లో ఎక్కువగా కేరళ వారే ఉన్నారు. – గల్ఫ్ డెస్క్ -
నిట్‌లో అంబరాన్నంటిన సాంకేతిక సంబురాలు
-
1 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ట్రైనింగ్
కర్నూలు సిటీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి 42 రోజుల పాటు టెక్నికల్ కోర్సు ట్రైనింగ్ అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వబడుతుందని, ఇందుకు 18 సంవత్సరాలు నుంచి 45 ఏళ్లు నిండిన ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్ష, లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కల్గిన వారు అర్హులన్నారు. ఈ నెల30వ తేదీ వరకు అనంతపురం డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సాంకేతికమక
చౌక దుకాణాల్లో ముందుకు సాగని నగదు రహిత రేషన్ పంపిణీ జిల్లాలో 3.94 లక్షల మంది రేష¯ŒS కార్డుదారులకు చేరని సరుకులు నాలుగు రోజులైనా 26 శాతానికి మించని వైనం తప్పని ప్రదక్షిణలు... కాకినాడ సిటీ : నగదు రహితంగానే చౌక దుకాణాల్లో రేష¯ŒS సరుకులు అందించాలనే ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు కార్డుదారులను ముప్పు తిప్పలు పెట్టిస్తున్నాయి. నగదు రహితం లావాదేవీలంటూ విస్తృత ప్రచారం చేసి చౌక దుకాణాల్లో కార్డుదారుల నుంచి డిసెంబర్లో సొమ్ము తీసుకోకుండా సరుకులు ఇచ్చేశారు. రేష¯ŒS సరుకుల పంపిణీ ఆధార్ అనుసంధానంతో జరుగుతుండడంతో దానికి బ్యాంకుల డేటా అనుసంధానం చేయాల్సి ఉంది. దీంతో జనవరిలో నగదు రహిత సేవలు చౌక దుకాణాల్లో ముందుకు సాగలేదు. అయితే ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రహిత లావాదేవీలే జరపాలి, కార్డుదారుడు నుంచి సొమ్ము తీసుకుని సరుకు ఇవ్వడానికి లేదని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ బ్యాంకు డేటా సీడింగ్ పరంగా నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కరించకపోవడంతో నెల ప్రారంభమై నాలుగు రోజులైనా రేష¯ŒS పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఒక్కరోజు వంద మంది కార్డుదారులకు సరుకులు ఇచ్చే డీలర్ ఇప్పుడు రోజుకు 15 మందికి ఇవ్వడం గగనంగా మారింది. ఈ దశలో చౌక దుకాణాల వద్ద కార్డుదారులు పడిగాపులు పడుతూ, షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలు చౌక దుకాణాల్లో సర్వర్ ఇబ్బందులు, ఇతర సాంకేతిక సమస్యలతో షాపులు మూసివేసి డీలర్లు మెషీన్లు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోపక్క కార్డుదారులు పదే పదే పనులు మానుకుని ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్ధితి జిల్లాలో నెలకొంది. సరుకులు పంపిణీ 26శాతం... జిల్లా వ్యాప్తంగా ఈ–పాస్ బయోమెట్రిక్ మిషన్లున్న 2,449 షాపుల పరిధిలో మూడు రోజులుగా 26 శాతం మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. మొత్తం జిల్లాలో 16,08,711 కార్డులకుగాను ఏజెన్సీకి సంబంధించి సుమారు లక్ష కార్డులు తీసివేయగా మిగిలిన కార్డుల్లో శనివారం రాత్రి 7 గంటల వరకు తెలిసిన సమాచారం మేరకు కేవలం 3 లక్షల 94 వేల మంది కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఇందులో రెండు విధాలుగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. 2449 ఈ–పాస్ మిషన్లుండగా వీటిలో 480 ఎ¯ŒSలార్జిక్ కంపెనీ మెషీన్లున్నాయి. వీటికి బ్యాంకుల డేటా పూర్తిగా అనుసంధానం కాకపోవడంతో ఆ మిషన్లున్న చౌక దుకాణాల పరిధిలో కార్డుదారుల నుంచి సొమ్ము తీసుకుని సరుకులు ఇచ్చేస్తున్నారు. ఈ షాపుల్లోనే 3 లక్షల 16 వేల కార్డులకు రేష¯ŒS పంపిణీ చేశారు. ఇక మిగిలిన 1,969 మెషీన్లు విజ¯ŒSటెక్ కంపెనీవి . వీటిలో కేవలం నగదు రహితంగానే సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ షాపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులుతో కేవలం 77,766 కార్డులకు సరుకులు ఇవ్వగలిగారు. ప్రతి నెలా నాలుగు రోజుల్లో 7 లక్షల కార్డులకుపైగా సరుకులు పంపిణీ చేసేవారు. సమన్వయలోపం... ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు అమలు జరపడంలో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. గడిచిన రెండు నెలలుగా నగదు రహితంపై ప్రచారం చేస్తున్న అధికారులు అసలు సమస్య పరిష్కరించకుండా కార్డుదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో కార్డుదారుల ఆధార్ బ్యాంకులో సీడింగ్ కాలేదని, అకౌంట్లో బ్యాలె¯Œ్స లేదని, అకౌంట్ ఇ¯ŒS ఆపరేట్‌లో ఉందనే అంశాలు ఎదురవుతున్నాయి. మరోపక్క పలు షాపుల కార్డుదారుల బ్యాంకు డేటా ఆయా షాపుల ఈ–పాస్ బయోమెట్రిక్ మెషీ¯ŒS అనుసంధానం కాకపోవడం వంటివి ఉన్నాయి. ఇవి గత రెండు నెలలుగా ఉన్నవే. వాటిని అధికారులు పరిష్కరించకుండా నగదు రహితంగానే సరుకులు ఇవ్వాలని డీలర్లను ఆదేశించడంపై సర్వత్రా కార్డుదారుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. -
సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ
కాకినాడ సిటీ : జిల్లాలోని డ్వాక్రా సంఘ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేవిధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రూపొందించింది. ఈ మేరకు ముందుగా సభ్యులకు శిక్షణనిచ్చేందుకు ప్రతి మండల పరిధిలోని ఆరుగురు సభ్యులను శిక్షకులుగా (ఇంటర్నెట్ సాతీ)ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సాతీలకు ముందుగా శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు. 5,6 తేదీల్లో అమలాపురం టీటీడీసీలోనూ, 7న రాజమండ్రి ఎన్‌ఎంఎస్‌లోనూ, 13 నుంచి 18వ తేదీ వరకు సామర్లకోట టీటీడీసీలోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన సాతీలు మూడు నెలల వ్యవధిలో క్షేత్రస్థాయిలో 3లక్షల 69వేల 600 సంఘ సభ్యులకు డిజిటల్ లిట్రసీపై శిక్షణ ఇస్తారని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ మల్లిబాబు తెలిపారు. -
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.24కోట్లు
నేలకొండపల్లి : జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల కోసం రూ.24 కోట్లు మంజూరు చేసినట్టు జిల్లా వ్యవసాయ సంచాలకురాలు మణిమాల తెలిపారు. నేలకొండపల్లిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయం తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల కోసం రైతులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టులో పంపిణీ చేస్తామని అన్నారు. పసల్ బీమాను పత్తికి 5000 మంది రైతులు, మిర్చికి 6000 మంది రైతులు చేయించుకున్నారని అన్నారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, 30వేల టన్నులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 22న వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ డే ఘనంగా నిర్వహిస్తామన్నారు. అదే రోజు 19లక్షల మొక్కలను నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్త్రత్తలు తీసుకోవాలని, బిల్లులు ఇవ్వకపోతే వెంటనే వ్యవసాయ శాఖ కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. -
యువతకు 'ఫోర్డ్' మంచి అవకాశం!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రతిభగల టెక్నీషియన్లను దేశానికి అందించేందుకు మరో అడుగు వేసింది. మనేసర్ లో ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నైపుణ్యంగల టెక్నీషియన్ల సృష్టికి ప్రయత్నాలు ప్రారంభించింది. టెక్నికల్ ట్రైనింగ్ ఐఎన్ సీ (టీటీఐ) భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సాంకేతిక శిక్షణ సౌకర్యాన్ని ఫోర్డ్ కంపెనీ మానేసర్ లోని 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరింపజేసింది. ఏడాదికి 13,500 రోజులకు పైగా ప్రత్యేక సాంకేతిక శిక్షణ అందించనున్నట్లు ఫోర్ట్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త సౌకర్యంలో నైపుణ్యంతోపాటు, నాణ్యమైన ఫోర్డ్ ఉత్పత్తులు వెలువడేందుకు దోహదపడుతుందని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన స్వతంత్ర సాకేంతిక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, నాలుగు ప్రాంతాల్లో బాడీ షాప్ ట్రైనింగ్ కేంద్రాలనూ ఏర్పాటు చేయాలన్న ప్రత్యేక దృష్టితో మొట్టమొదటి అడుగు వేశామని మెహ్రోత్రా తెలిపారు. ఫోర్డ్ ఇండియా ఇప్పటికే భారతదేశంలోని చెన్నై, కొచ్చిన్, కొల్హాపూర్, అహ్మదాబాద్, మొహాలీ, కోల్ కతా మొదలైన ఆరు నగరాల్లో శిక్షణా కేంద్రాలు కలిగి ఉందని ఆయన తెలిపారు. -
విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలి
- హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్రావు మహేశ్వరం: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్రావు అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, కంప్యూటర్ రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. మండలంలోని మంఖాల్ హర్షిత్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవం, సైన్స్‌ఫెస్ట్‌లో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. తెలుగు మీడియం విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలన్నారు. నైపుణ్యతతో కూడిన విద్య నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జేఎన్టీయూ వైన్స్ చాన్స్‌లర్ డా.రమణరావు మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హర్షిత్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ బుస్సు చెన్న కృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా.సుభాష్, అధ్యాపకులు, గ్రామసర్పంచ్ కౌసల్య, ఎంపీటీసీ సభ్యుడు మధు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల పై దృష్టి సారించాలి
- హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్రావు మహేశ్వరం: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్రావు అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, కంప్యూటర్ రంగాల పై దృష్టి సారించాలని సూచించారు. మండలంలోని మంఖాల్ హర్షిత్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవం, సైన్స్‌ఫెస్ట్‌లో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. తెలుగు మీడియం విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలన్నారు. నైపుణ్యతతో కూడిన విద్య నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జేఎన్టీయూ వైన్స్ చాన్స్‌లర్ డా.రమణరావు మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హర్షిత్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ బుస్సు చెన్న కృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా.సుభాష్, అధ్యాపకులు, గ్రామసర్పంచ్ కౌసల్య, ఎంపీటీసీ సభ్యుడు మధు తదితరులు పాల్గొన్నారు. -
అర్హత కంటే నైపుణ్యం ముఖ్యం
ఏఎన్‌యూ: ఉపాధి అవకాశాలు పొందడానికి, సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యార్హతల కన్నా నైపుణ్యం లక్షణాలు ముఖ్యమని డీఆర్డీఓ, ఆర్ఏసీ చైర్మన్ ఆచార్య డీఎన్ రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహించిన అనుశోధన (నేషనల్ లెవల్ స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం)ను గురువారం ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో డీన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అర్హత కలిగిన వారు అధికంగా ఉన్నారు కానీ నైపుణ్యం ఉన్న వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. భారతదేశంలో నైపుణ ్యవంతులు 20 శాతం లోపు ఉంటే సింగపూర్, మలేషియాల్లో 80 శాతం ఉన్నారని తెలిపారు. విద్యార్థులు పుస్తకాలతోపాటు సమాజాన్ని కూడా అధ్యయనం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలని సూచించారు. వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అనుశోధన వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సిద్దయ్య, డీన్ ఇ. శ్రీనివాసరెడ్డి, ఇస్రో శాస్త్రవేత్త జగన్నాధదాస్, అనుశోధన కన్వీనర్ ఆచార్య పీవీ రమణారావు ప్రసంగించారు. అనంతరం అనుశోధన సీడీని ఆచార్య డీఎన్ రెడ్డి ఆవిష్కరించారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన వెయ్యిమందికి పైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని టెక్నికల్, పోస్టర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో అంశాల్లో ప్రదర్శనలు చేశారు. ఉత్తమ ప్రదర్శనలకు సాయంత్రం జరిగిన ముగింపు సభలో బహుమతులు అందజేశారు. -
2కె14 హంగామా..
-
విలువైన కొలువులకు నెలవులు
రైల్వే పరీక్షలు భారతీయ రైల్వేలో ముఖ్యంగా నాలుగు రకాల ఉద్యోగాలు ఉంటాయి. అవి గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి. గ్రూప్-ఎ ఉద్యోగాలను యూపీఎస్సీ ద్వారా, గ్రూప్-బి ఉద్యోగాలను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తా రు. గ్రూప్-డి ఉద్యోగ నియామకాలకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇక ఆర్ఆర్బీల ద్వారా భర్తీ చేసే గ్రూప్ సి ఉద్యోగాలను టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలుగా విభజించారు. ఆర్ఆర్బీ-టెక్నికల్ విద్యార్హత: ఐటీఐ ఉద్యోగాలు: అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్. వయస్సు: అన్‌రిజర్వడ్: 18-30 ఏళ్లు; ఓబీసీ: 33 ఏళ్లు (+3 ఏళ్లు); ఎస్సీ: 35 ఏళ్లు (+5 ఏళ్లు); ఎస్టీ: 35 ఏళ్లు (+5 ఏళ్లు). గమనిక: అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగానికి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌ల్లో డిప్లొమా పూర్తిచేసిన వారు, బీటెక్ ఉత్తీర్ణులు కూడా అర్హులు. పరీక్ష విధానం: అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగానికి రెండు రకాల పరీక్షలు జరుగుతాయి. 1. రాత పరీక్ష. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే, జనరల్ అవేర్నెస్ (పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ), స్థానిక సాధారణ పరిజ్ఞానం అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 100 ప్రశ్నలుంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. రెండోది-సైకాలజీ/ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. చివర్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. టెక్నీషియన్స్ ఉద్యోగాలకు రాత పరీక్ష మాత్రమే ఉంటుంది. విద్యార్హత డిప్లొమా: జూనియర్ ఇంజనీర్ (జేఈ) ఉద్యోగాలకు డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వీటికి బీటెక్ పూర్తయిన వారు కూడా అర్హులే. బీటెక్: సెక్షన్ ఇంజనీర్ (ఎస్ఈ) ఉద్యోగాలకు బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష విధానం: జేఈ, ఎస్ఈ ఉద్యోగాలను రాత పరీక్ష ఆధారంగా భర్తీచేస్తారు. ఇందులో ముఖ్యంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్థానిక సాధారణ పరిజ్ఞానం నుంచి ప్రశ్నలు వస్తాయి. 150 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. నాన్ టెక్నికల్: పదో తరగతి: టికెట్ కలెక్టర్, జూనియర్ క్లర్క్, ట్రెయిన్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్; ఇంటర్ ఎంపీసీ: ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటైనర్ (ఈఎస్ఎం); డిగ్రీ: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్స్, ఎంక్వయిరీ కమ్ రిజర్వేషన్ క్లర్స్, సీనియర్ క్లర్క్, ట్రాఫిక్ అప్రెంటీస్, కమర్షియల్ అప్రెంటీస్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. పరీక్ష విధానం: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి రాత పరీక్ష, సైకాలజీ/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇతర ఉద్యోగాలకు కేవలం రాత పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. రాత పరీక్షలో అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, స్థానిక ప్రాంత పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. 100ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ఆర్ఆర్సీ గ్రూప్-డీ: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఉద్యోగాలు: గ్యాంగ్‌మెన్, హెల్పర్-2, ట్రాక్‌మెన్, కలాసి. రాత పరీక్ష: అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. రాత పరీక్ష తర్వాత దేహ దారుఢ్య పరీక్ష ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. జోన్ అధికార భాషలో: ప్రస్తుతం రైల్వే శాఖ సెంట్రల్ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో జోన్ల వారీగా ఖాళీలను గుర్తించి ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులకు ఖాళీలను కేటాయిస్తోంది. అంతేకాక ఆ జోన్‌కు చెందిన అధికార భాషలో కూడా పరీక్ష రాసే వీలు కల్పిస్తోంది. సన్నద్ధత వివిధ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అంశాలకు ప్రాధాన్యముంటుంది. అర్థమెటిక్‌లో లాభ- నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం తదితర అంశాల సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్‌లో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకేలో రైల్వే వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలతోపాటు.. జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి, పరిశోధన సంస్థలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ప్రపంచం/ఇండియాలో తొలి, ఎత్తై, పొడవైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. వర్తమాన వ్యవహారాల కోసం రోజూ దినపత్రికలు, మేగజీన్లను చదవాలి. టెక్నికల్ సబ్జెక్ట్: ఈ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఒక బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి మరికొన్ని ఇతర బ్రాంచ్‌లకు సంబంధించిన అంశాలపైనా పట్టుసాధించాల్సి ఉంటుంది. - ఎ.సత్యనారాయణరెడ్డి, డెరైక్టర్, గ్రేట్ ఇన్స్టిట్యూట్,సికింద్రాబాద్. ఎస్ఎస్సీ భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) క్రమం తప్ప కుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు వరప్రదాయినిగా నిలుస్తోంది. లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ),గ్రాడ్యుయే ట్ లెవెల్ ఆడిటర్స్,జూనియర్ అకౌంటెంట్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్(యూడీసీ) వంటి ఉ ద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తోంది. ఏటా వివిధ విభాగాల నుంచి అందే ఖాళీలకు అనుగుణంగా ఓపెన్ లెవెల్, డిపార్ట్మెంటల్ పరీక్షలకు ప్రకటనలు వెలువడుతున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎగ్జామినేషన్: డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: 10+2 లేదా తత్సమానం. కంబైన్డ్ మెట్రిక్ లెవెల్: స్టెనో గ్రేడ్-సి; స్టెనో గ్రేడ్-డి; ఎల్డీసీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: 10+2 లేదా తత్సమానం. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్: ఇన్‌కం ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్ విభాగాల్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, సీబీఐలో సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, డివిజనల్ అకౌంటెంట్స్, ఆడిటర్స్, యూడీసీ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్: కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. ఎస్ఐ (సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్): కేంద్ర పోలీస్ సంస్థలో సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. సెక్షన్ ఆఫీసర్ (ఆడిట్) ఎగ్జామినేషన్: సెక్షన్ ఆఫీసర్ (ఆడిట్) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. సెక్షన్ ఆఫీసర్ (కమర్షియల్ ఆడిట్ ఎగ్జామినేషన్): సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హత: కామర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ; సీఏ; ఐసీడబ్ల్యూఏ, సీఎస్. ట్యాక్స్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగాల్లో ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, నిర్దేశ డేటా ఎంట్రీ స్పీడ్ ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ గ్రేడ్-4 ఎగ్జామినేషన్: స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగాల్లో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు. అర్హత: స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కామర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ. స్టాటిస్టిక్స్ ఒక ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి. జూనియర్ ఇంజనీర్ (సివిల్ అండ్ ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్: సివిల్ లేదా ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమాన అర్హత. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్): మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు. అర్హత: పదో తరగతి. బ్యాంకింగ్ vs ఎస్ఎస్సీ పరీక్షల స్వభావంలో సారూప్యత ఉన్న నేపథ్యంలో ఎస్ఎస్సీ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వారు అర్హతలను బట్టి బ్యాంకు పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సబ్జెక్టుల వారీగా సిలబస్, కాఠిన్యత స్థాయిపై అవగాహన పెంపొందించుకొని పటిష్ట ప్రణాళిక ప్రకారం సిద్ధమవాలి. పరీక్ష - ఐబీపీఎస్ పీవో 20-30 ఏళ్లు (మినహాయింపు వర్తిస్తుంది) విద్యార్హత - బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష -ఐబీపీఎస్ క్లర్క్ 20-28 ఏళ్లు (మినహాయింపు వర్తిస్తుంది) విద్యార్హత -బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష -ఎస్ఎస్సీ-సీజీఎల్ 18-27 (మినహాయింపు వర్తిస్తుంది) విద్యార్హత -బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష -ఎస్ఎస్సీ-సీజీఎల్ 18-27 (మినహాయింపు వర్తిస్తుంది) విద్యార్హత -గ్రాడ్యుయేషన్ (చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష -ఎస్ఎస్సీ 10+2 18-27 (మినహాయింపు వర్తిస్తుంది) విద్యార్హత -12th ఉత్తీర్ణత. పరీక్ష విధానం: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్‌లో కొన్ని ఉద్యోగాలను రాత పరీక్ష, ఇంటర్వ్యూఅండ్ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. మరికొన్ని ఉద్యోగాలకు రాత పరీక్ష ఒక్కటే నిర్వహిస్తారు. సీజీఎల్ఈ ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. అవి.. మొదటి, రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్. ఈ మూడు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్షను టైర్-1, టైర్-2 అనే రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. అధిక స్కోరే లక్ష్యంగా ఉండాలి ఎస్ఎస్సీలో కీలకమైన పరీక్ష కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ సబ్జెక్టులుంటాయి. ప్యూర్ మ్యాథ్స్ నుంచి 20-30 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ప్రశ్నలకు వీలైనంత తక్కువ సమయంలో సమాధానాలు గుర్తిస్తే ఆదా అయిన సమయాన్ని మిగిలిన విభాగాలకు ఉపయోగించుకోవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే జనరల్ అవేర్‌నెస్‌లో 30-40 మధ్య స్కోర్ చేయొచ్చు. రీజనింగ్‌లో 45కు తగ్గకుండా మార్కులు పొందొచ్చు. కేవలం కటాఫ్‌ను దాటడం అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకోకుండా వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు నచ్చిన సర్వీస్‌ను చేజిక్కించుకోవచ్చు. -ఎన్. వినయ్‌కుమార్ రెడ్డి, డెరైక్టర్, ఐఏసీఈ, హైదరాబాద్ -
నైపుణ్యాల వృద్ధికి.. ఉపకరించే సాధనాలు
స్కిల్ గ్యాప్.. అంటే పరిశ్రమలు అభ్యర్థుల్లో కోరుకుంటున్న నైపుణ్యాలకు.. విద్యార్థుల్లో ఉంటున్న సాధారణ నైపుణ్యాలకు మధ్య అంతరం. నేడు ఏ కోర్సులు చదివిన విద్యార్థులకైనా జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అభ్యర్థులు నైపుణ్యాల లేమితో ఉద్యోగాలను దక్కించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆశిస్తున్న స్కిల్స్.. టెక్నికల్, మేనేజీరియల్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నింటినీ సొంతం చేసుకుంటేనే ఆకర్షణీయమైన కెరీర్ సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో అందరికంటే ముందు నిలవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై విశ్లేషణ.. ఇంటర్న్షిప్స్ అకడమిక్స్ స్థాయిలోనే పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను ప్రత్యక్షంగా పొందగలిగే మార్గం ఇంటర్న్షిప్స్. అంటే.. ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో కొద్ది నెలలపాటు పని చేయడం ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవడం. దీంతో పాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఇంటర్న్షిప్స్ అనే ప్రక్రియ కరిక్యులంలో భాగంగా లేనప్పటికీ.. కొన్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలు సొంతంగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తున్నాయి. బీటెక్‌లో మూడో ఏడాది ముగిసిన తర్వాత సెలవుల సమయంలో, ఎంబీఏలో మొదటి సంవత్సరం తర్వాత సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ప్రక్రియ ఉంటోంది. వీటినే సమ్మర్ ఇంటర్న్‌గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఉన్న పరిశ్రమల్లో రెండు లేదా మూడు నెలల నిర్దేశిత వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే వీలుంటుంది. స్కిల్ గ్యాప్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న పరిశ్రమ వర్గాలు, సంబంధిత సంస్థలు కూడా ఇంటర్న్‌షిప్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేసే సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఉత్పత్తి రంగంలో ఈ ధోరణి కొంత తక్కువైనప్పటికీ.. ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు ఇంటర్న్‌షిప్ ట్రైనీ అవకాశాలు బాగా కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సాఫ్ట్వేర్ సంస్థలు ఇంటర్న్ ట్రైనీలను నియమించుకోవడంలో ముందుంటున్నాయి. వీటిల్లో శిక్షణ పొందడంతోపాటు ఆయా సంస్థల విధానాల ప్రకారం ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో చొరవ, తమకు కేటాయించిన విభాగంలో ప్రతిభ ద్వారా ఆయా సంస్థల గుర్తింపు పొందితే.. ఇంటర్నషిప్ పూర్తయ్యాక ఉద్యోగాన్ని కూడా దక్కించుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్స్ విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో మరో ముఖ్య సాధనం ప్రాజెక్ట్ వర్క్స్. ప్రస్తుత కరిక్యులం ప్రకారం ప్రతి ప్రొఫెషనల్ కోర్సులోనూ ఇది తప్పనిసరి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్లో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఫలితంగా విద్యార్థులకు సదరు సంస్థ, విభాగాలపై నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థులు తాము ఎంచుకున్న అంశానికి సంబంధించి.. ఏదైనా ఒక సంస్థలో ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తాము ఎంచుకున్న అంశంలో సమస్య ఎదురైతే.. దాని పరిష్కార మార్గాలు తెలుసుకుని పరిష్కరించాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ విధానం కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగాలను ఖాయం చేసే మార్గంగా పేర్కొనొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ వ్యవధిలో సదరు సంస్థలో చక్కటి పనితీరు కనబరిచి ఉన్నతాధికారుల గుర్తింపు పొందితే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలెన్నో. ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి మరో ప్రత్యామ్నాయం ఇండివిడ్యువల్/గ్రూప్ ప్రాజెక్ట్స్. సంస్థల్లో ప్రాజెక్ట్ వర్క్ అవకాశం పొందని విద్యార్థులు సొంతంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ప్రాజెక్ట్ చేయడం. ఈ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ద్వారా సమస్య-పరిష్కారాలను సంస్థల దృష్టికి తీసుకెళ్లొచ్చు. మీరు చెప్పిన పరిష్కార మార్గాలు నచ్చితే మీకు ఉద్యోగం దక్కినట్లే. ఇలా తమ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్‌ను సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా రంగాలకు సంబంధించి నిర్వహించే సెమినార్లు, కాలేజ్ సావనీర్లు, క్యాంపస్ రిక్రూట్మెంట్ సెషన్స్‌ను వేదికలుగా ఉపయోగించుకోవాలి. కానీ.. ఇటీవల చాలా మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మార్కుల సాధన, సర్టిఫికెట్లో పర్సంటేజీ సంఖ్య పెంపుదల సాధనంగానే భావిస్తున్నారు. ఇది సరికాదు. ప్రాజెక్ట్ వర్క్ అంటే తాము అప్పటి వరకు పొందిన థియరీ నాలెడ్జ్‌ను క్షేత్ర స్థాయిలో అన్వయించడంతోపాటు.. వాస్తవ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పొందేందుకు చక్కటి సాధనంగా వినియోగించుకోవాలి అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి. ఉమామహేశ్వరరావు. అప్రెంటీస్షిప్స్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్.. విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన కోర్సుకు సంబంధించిన సంస్థలో నిర్దిష్ట కాలంలో పూర్తి స్థాయిలో పని చేయడం. ముఖ్యంగా వృత్తి విద్య కోర్సుల్లో అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఎంతో కీలకమైన అంశం. అంతేకాకుండా స్కిల్ గ్యాప్‌నకు చక్కటి పరిష్కార మార్గం కూడా. నిర్ణీత వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్షిప్లో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించడం ద్వారా క్షేత్ర స్థాయి అవసరాలపై అవగాహన పొందొచ్చు. అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లోనే అప్రెంటీస్ యాక్ట్ పేరిట చట్టాన్ని కూడా రూపొందించింది. దీని ప్రకారం సంస్థలు మొత్తం శ్రామిక శక్తిలో పది శాతం మేర అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. అంతేకాకుండా శిక్షణలో స్టైఫండ్ చెల్లించాలని కూడా నిర్దేశించింది. ఇప్పటికే బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్, గెయిల్ వంటి మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు; ప్రైవేటు రంగంలో వేల సంఖ్యలో.. ట్రేడ్ అప్రెంటీసెస్; గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీసెస్; టెక్నీషియన్ అప్రెంటీసెస్ వంటి హోదాల్లో ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాల వరకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. నిర్ణీత వ్యవధి పూర్తయ్యాక నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, సెంట్రల్ అప్రెంటీస్ కౌన్సిల్లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ట్రేడ్ సర్టిఫికెట్లు పొందొచ్చు. కానీ.. ఇప్పటికీ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అంటే విద్యార్థుల్లో అంతగా అవగాహన ఉండట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అప్రెంటీస్‌షిప్ సదుపాయం సంఖ్య 4.8 లక్షలు ఉంటే కేవలం 2.8 లక్షల మంది మాత్రమే దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అప్రెంటీస్ చట్టానికి మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో స్టైఫండ్ శాతాన్ని కూడా 40 శాతం మేర పెంచింది. టెక్నికల్ కోర్సులకే పరిమితమైన ట్రైనింగ్‌ను బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఆన్ జాబ్ ట్రైనింగ్ స్కిల్ గ్యాప్‌నకు సంబంధించి ఇటు విద్యార్థులు, అటు పరిశ్రమ వర్గాలకు చక్కటి వారధిగా నిలుస్తున్న అంశం ఆన్ జాబ్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ద్వారా తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్న సంస్థలు.. వారికి తమ అవసరాలకు అనుగుణంగా సంబంధిత అంశాల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించేందుకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమమే ఆన్ జాబ్ ట్రైనింగ్. ముఖ్యంగా బీటెక్‌లో బ్రాంచ్‌తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులను నియమిస్తున్న ఐటీ సంస్థలు ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు ఉండే ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో అభ్యర్థులకు.. వారు నియమితులైన విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతోపాటు సంస్థలో ఇతర విభాగాలు, వాటి విధి విధానాలు, పనితీరు వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. ఈ సదుపాయం కేవలం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే కాకుండా.. సంస్థలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ అమలు చేస్తున్నాయి. మిడ్ లెవల్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించి.. ఆయా ఉద్యోగులు పని చేస్తున్న విభాగాలు, రంగాల్లోని తాజా పరిణామాలు, అప్డేటెడ్ నైపుణ్యాలు అందించే విధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి. ఫలితంగా ఉత్పాదకత పెరగడంతోపాటు, పోటీదారులకంటే ఒకడుగు ముందుండొచ్చనేది సంస్థల అభిప్రాయం. అభ్యర్థులు కూడా ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాల ద్వారా మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. సర్టిఫికేషన్లు ఎన్నెన్నో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఇప్పుడు ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ కోర్సుల్లో సెంట్రల్ ఒకేషనల్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో.. విద్యార్థుల డొమైన్ అర్హతలకు ఆధారంగా పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయా రంగాలకు సంబంధించి- పరిశ్రమ వర్గాలతో ఒప్పందం ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాటిని పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తోంది. వీటితోపాటు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ వివరాలు.. ఇన్ఫోసిస్: ఈ సంస్థ ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కోసం సొంతంగా గ్లోబల్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఐటీసీ: రిటైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీసీ సంస్థ- ఎన్ఐఎస్-స్పార్తా సంయుక్తంగా రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని బ్యాంకులు పలు ఇన్స్టిట్యూట్లతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్టాక్ మార్కెట్ నిర్వహణ సంబంధిత పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. డొమైన్తోపాటు మరెన్నో స్కిల్స్ ఇటీవల కాలంలో సంస్థలు అభ్యర్థుల్లోని డొమైన్ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా ఇతర అంశాలు వాటిలోని నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దృక్పథం, నైతికత వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవల తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయా సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్ శాతాల గణాంకాలు.. ఇంటెగ్రిటీ అండ్ వ్యాల్యూస్: 30 శాతం రిజల్ట్ ఓరియెంటేషన్:21 శాతం బెటర్ ఆప్టిట్యూడ్: 12 శాతం కోర్ డొమైన్: 14 శాతం పీపుల్ స్కిల్స్ (కల్చరల్ డైవర్సిటీ, టీమ్ వర్క్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్): 23 శాతం ఇంటర్న్షిప్స్.. వే టు ఎంప్లాయ్మెంట్ కోర్సు వ్యవధిలో విద్యార్థులు చేసే ఇంటర్న్షిప్స్ వారి భవిష్యత్తు ఉపాధికి మార్గం నిలుస్తాయి. కానీ ఇప్పటికీ ఈ విషయంలో విద్యార్థుల్లో ఆశించిన అవగాహన ఉండట్లేదు. ఇన్స్టిట్యూట్ల స్థాయిలోనే వీటి ప్రాముఖ్యాన్ని తెలియజేసి ప్లేస్మెంట్ సెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా అధ్యాపకులు, మేనేజ్మెంట్ వర్గాలు తమ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలను అందించాలి. ఇక విద్యార్థులు కూడా తమకున్న పరిచయాల ద్వారా ఇంటర్న్షిప్స్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. కరిక్యులంలో భాగంగా లేని ఇంటర్న్‌షిప్ అనే పదం విద్యార్థుల రెజ్యుమేలో కనిపిస్తే కచ్చితంగా ఎంప్లాయర్స్ను ఆకర్షిస్తుంది. సదరు విద్యార్థికి ఇతరులకంటే ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది. - బి. అశోక్ రెడ్డి, ప్రెసిడెంట్- కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సయంట్ అప్రెంటీస్‌షిప్‌తో ప్రయోజనాలెన్నో టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తిస్థాయి ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ సమయంలో సదరు విభాగాలపై పూర్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్, అది పూర్తయ్యాక నిర్వహించే ట్రేడ్ టెస్ట్ ప్రాధాన్యంపై అవగాహన ఉండట్లేదు. దీంతో మంచి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, ఎన్ఎస్డీసీ, ఏటీఐ వెబ్సైట్లను వీక్షిస్తే అందుబాటులో ఉన్న అప్రెంటీస్‌షిప్ సదుపాయాలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానాల వివరాలు తెలుస్తాయి. - కె.ఎస్.ఆర్. ప్రదీప్, డిప్యూటీ డెరైక్టర్, ఆర్డీఏటీ, హైదరాబాద్. స్కిల్స్‌తోపాటు పెరిగే అవకాశాలు విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తే.. అంతే స్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రాక్టికల్స్, ప్రాక్టికాలిటీ అనే పదాలు కేవలం ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులకే పరిమితం కాదు. అన్ని కోర్సులు, రంగాల్లోనూ ఇప్పుడు ఎన్నో స్కిల్స్ అవసరమవుతున్నాయి. వీటిని గుర్తించి అకడమిక్ స్థాయి నుంచే సొంతం చేసుకునేలా వ్యవహరించాలి. మేనేజ్మెంట్కు సంబంధించి పీపుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. - వి. పాండురంగారావు, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -హైదరాబాద్ ఎడ్యు న్యూస్ ఇన్స్పైర్ స్కాలర్షిప్ - 2014 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో మూడేళ్ల బీఎస్సీ, బీఎస్సీ (హానర్స్), నాలుగేళ్ల బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించే ‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్హెచ్ఈ)’కు ప్రకటన వెలువడింది. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) అందిస్తోంది. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్)’ పేరుతో ఈ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. మొత్తం స్కాలర్షిప్స్: 10,000 స్కాలర్షిప్: ఏడాదికి రూ.60,000తోపాటు సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రూ.20,000 అందిస్తారు. ఇలా ఐదేళ్లపాటు స్కాలర్షిప్ ఇస్తారు. అర్హత: వివిధ రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డ్ 2014లో నిర్వహించిన ఇంటర్మీడియెట్/10+2 పరీక్షల్లో ఆయా రాష్ట్రాల్లో టాప్ వన్ పర్సంట్ జాబితాలో నిలవాలి. లేదా జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్/ఏఐపీఎంటీలో టాప్ 10,000 ర్యాంకుల్లో చోటు దక్కించుకుని ఉండాలి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్షిప్, జగదీశ్ చంద్ర బోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ విజేతలు, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో పతకాలు గెలుచుకున్నవారు కూడా స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో విజయం సాధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ - సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్‌లో విద్యనభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. ప్రస్తుతం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల/ఇన్స్టిట్యూట్లో నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో బీఎస్సీ/ బీఎస్సీ (హానర్స్)/నాలుగేళ్ల బీఎస్/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్/ఎంఎస్సీ కోర్సులు చదువుతుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014 వెబ్సైట్:www.inspire-dst.gov.in/ ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్ జర్మనీలో నిర్దేశిత యూనివర్సిటీల్లో ఎల్ఎల్ఎం (యూరోపియన్ లా) చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ - ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్కు ప్రకటన వెలువడింది. స్కాలర్‌షిప్‌తో లభించేవి: సుమారు ఏడాది వ్యవధి ఉండే కోర్సులో భాగంగా నెలకు 750 యూరోల స్టైఫండ్, రానుపోను విమాన ఖర్చులకు ట్రావెల్ అలవెన్స్, స్టడీ అండ్ రీసెర్చ్ సబ్సిడీ కింద 460 యూరోలు, ఆరోగ్య, ప్రమాద బీమా. వీటితోపాటు రెండు నెలల జర్మన్ లాంగ్వేజ్ కోర్సులో భాగంగా ఉచిత నివాసం, ఫీజు మినహాయింపు, అలవెన్స్‌లు లభిస్తాయి. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జనవరి/ఫిబ్రవరి-2015లో న్యూఢిల్లీలో నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2014 వెబ్సైట్: www.daaddelhi.org/en/ మైకాలో పీజీడీఎం - కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌లోని ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా).. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ (పీజీడీఎం-సి) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 10+2+3 విధానంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: క్యాట్-2014/ఎక్స్‌ఏటీ-2014, 2015/మ్యాట్-2014 /సీమ్యాట్- 2014/ఏటీఎంఏ-2014 వంటి పరీక్షల స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులకు గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.. దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2015 వెబ్సైట్: www.mica.ac.in