terms
-
కార్డులు ఎక్కువైతే చిక్కులేనా..?
ఆరాధన (31) ఐటీ ఉద్యోగి. ప్రయాణాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పర్యటనకు సిద్ధమైపోతుంది. ఇటీవల ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన సందర్భంలో క్రెడిట్ కార్డ్ కంపెనీ సేల్స్ ఉద్యోగి ఆమెకు ఎదురుపడ్డాడు. మంచి ఫీచర్స్‌తో కూడిన క్రెడిట్ కార్డ్ అంటూ.. అందులోని ఉపయోగాలు చదివి వినిపించే ప్రయత్నం చేశాడు. నిజానికి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్న ఆసక్తి ఆరాధ్యకు ఎంతమాత్రం లేదు. కానీ, ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదని, దేశీయంగా ప్రీమియం ఎకానమీ విమాన టికెట్ల కొనుగోలుపై మూడు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు ఆఫర్ చేస్తుందని చెప్పగా, ఆ పాయింట్ ఆమెకు ఎంతో నచి్చంది. దీనికితోడు షాపింగ్ చేసిన ప్రతి సందర్భంలో సాధారణ రివార్డ్ పాయింట్లు వస్తాయని చెప్పాడు. దీంతో అప్లికేషన్‌పై సంతకం చేసి ఇచ్చేసింది. కార్డు చేతికి వచి్చన ఏడాది తర్వాత కానీ, వాస్తవాలు ఆమెకు తెలియలేదు. కార్డ్ కంపెనీ వార్షిక రుసుము అంటూ రూ.3,000 చార్జ్ చేసింది. సేల్స్ ఏజెంట్ చెప్పినట్టు సదరు క్రెడిట్ కార్డ్ జీవిత కాలం ఉచితమేమీ కాదని అర్థమైంది. అప్పుడు కార్డ్ నిబంధనలు, షరతులు చదివిన తర్వాత కానీ ఆమెకు అర్థం కాలేదు ఆ కార్డ్ తన అవసరాలను తీర్చేది కాదని. వార్షిక ఫీజు మినహాయించాలంటే కార్డ్ కంపెనీ పెట్టిన లక్ష్యం మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఆర్థిక సంబంధ నిర్ణయం తీసుకునే ముందు (కొనుగోళ్లు, పెట్టుబడులు) పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఆరాధ్యకు ఎదురైన అనుభవమే నిదర్శనం. తమ అవసరాలకు అనుకూలమైన క్రెడిట్ కార్డ్‌కే పరిమితం కావాలని ఇది సూచిస్తోంది. క్రెడిట్ కార్డ్‌తో వచ్చే ప్రయోజనాలు చూసి చాలా మంది ఒకటికి మించిన కార్డులు తీసుకుంటూ ఉంటారు. అసలు ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి..? క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు ఏం చూడాలి? ఒకటికి మించిన కార్డులు ఉంటే ఎలా నడుచుకోవాలి..? ఈ విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం. ఏ అవసరం కోసం..? కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారు ముందు తమ అవసరాలు ఏంటో తేల్చుకోవాలి. రుణాలకు కొత్త వారు అయి, మంచి క్రెడిట్ స్కోరును నిర్మించుకోవాలని అనుకునే వారు తక్కువ ఫీజుతో కూడిన ప్రాథమిక స్థాయి క్రెడిట్ కార్డ్‌కు పరిమితం కావాలి. అప్పటికే దెబ్బతిన్న క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవాలని అనుకుంటే, అప్పుడు సెక్యూర్డ్ కార్డ్‌ను తీసుకుని వినియోగించుకోవడం సరైనది. ఒకటికి మించి కార్డులు ఉంటే, అప్పుడు అవి తీర్చలేని అవసరాలతో కూడిన కొత్త కార్డ్‌ను తీసుకోవచ్చు. కొన్ని కార్డ్‌లు రివార్డ్ పాయింట్లు, ఎయిర్‌మైల్స్ లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, అన్నీ కలిపి బండిల్‌గా ఇస్తుంటాయి. ఈ రివార్డ్‌లు తమకు ఎంత వరకు ఉపయోగమన్నది ఆలోచించుకోవాలి. తమ అవసరాలకు అనుకూలమంటే తీసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లలో లాంజ్ సేవలను ఉచితంగా అందించే కార్డులు కూడా ఉన్నాయి. విదేశీ లావాదేవీలపై ఫీజుల్లేని, సినిమా టికెట్లపై, రెస్టారెంట్ చెల్లింపులపై అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేసే కార్డుల్లో తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. వినియోగం ముఖ్యం.. కార్డుతో వినియోగం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ప్రతి నెలా వినియోగించుకున్నంత మేర పూర్తిగా తిరిగి చెల్లిస్తారా..? లేక బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేస్తారా.? కనీస మొత్తాన్ని చెల్లించి, మిగిలిన బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు తక్కువ వడ్డీ రేటును చార్జ్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. పరిమిత బడ్జెట్‌తో కుటుంబాన్ని నడిపించే వారికి తక్కువ రేటు వసూలు చేసే కార్డ్‌లు అనుకూలం. దీర్ఘకాలంలో వీటితో ఎంతో ఆదా చేసుకోవచ్చు. యూజర్లు కార్డ్‌తో ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్నది విశ్లేíÙంచుకోవాలని మై మనీ మంత్ర మార్కెట్ ప్లేస్ ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. కార్డుల మధ్య ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉంటుందన్నారు. ‘‘తరచూ ప్రయాణించే వారు ఎయిర్‌మైల్స్ లేదా హోటల్ పాయింట్లను ఆఫర్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. కార్డుపై అయ్యే వ్యయాలతో పోలిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉండాలన్నది మర్చిపోవద్దు. ఒకటికి మించిన ప్రయోజనాలు ఆఫర్ చేసే కార్డులకు వార్షిక ఫీజు ఉంటుంది. కనుక ఆయా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేట్టు అయితేనే సదరు కార్డులు తీసుకోవాలి. అప్పుడే వార్షిక ఫీజు చెల్లించడం ప్రయోజనకరంగా అనిపిస్తుంది’’అని రాజ్ ఖోస్లా సూచించారు. ఖర్చులు–ప్రయోజనాలు కార్డు వార్షిక ఫీజు కంటే వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉండాలి. ఏటా ఇంత ఖర్చు చేస్తేనే వార్షిక రుసుము మినహాయింపు అనే షరతు ఉంటే.. మీ వినియోగం అదే స్థాయంలో ఉంటుందా? అన్నది చూసుకోవాలి. కార్డ్‌ను తక్కువగా వినియోగించుకునే వారికి వార్షిక రుసుముతో వచ్చేవి అనుకూలం కాదు. కార్డులు సాధారణంగా వార్షిక రుసుం, యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్), బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఫీజు, విదేశీ లావాదేవీల రుసుంతో వస్తాయి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ అంటే.. ప్రతి నెలా కార్డ్ బిల్లుపై కొంత మొత్తం చెల్లించి, క్యారీ ఫార్వార్డ్ చేసుకునే మిగిలిన బ్యాలన్స్‌పై అమలు చేసే వడ్డీ రేటు. క్రెడిట్ స్కోరు, కార్డు ఏ రకం అన్న దాని ఆధారంగా ఈ వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. కనుక ప్రతి నెలా పూర్తి బిల్లు చెల్లించలేని వారికి తక్కువ ఏపీఆర్ ఉండే కార్డు అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం అధిక శాతం మంది కార్డ్ కస్టమర్లు తాము పొందే రివార్డులతో పోలిస్తే కార్డు కంపెనీకి చెల్లించే ఫీజులు, వడ్డీయే ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ‘‘కార్డ్ సంస్థ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఫీజుల కంటే మెరుగ్గా ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలి. తక్కువ రివార్డులు, అధిక వార్షిక ఫీజుతో కూడిన ప్రాథమిక క్రెడిట్ కార్డ్ ఏమంత ఉపయోగకరం కాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో తక్కువ వార్షిక ఫీజుతో లేదా అసలు వార్షిక ఫీజు లేని కార్డులు ఎన్నో ఉన్నాయి’’అని పైసా బజార్ క్రెడిట్ కార్డుల విభాగం హెడ్ రోహిత్ చిబ్బార్ పేర్కొన్నారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారు అంతర్జాతీయ లావాదేవీలకు చార్జ్ వసూలు చేయని కార్డులు తీసుకోవడం లాభదాయకమని సూచించారు. అలాగే, రివార్డుల శాతాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అన్ని రకాల కొనుగోళ్లపై ఫ్లాట్ 2 శాతం చొప్పున రివార్డులు ఆఫర్ చేస్తుంటే, అది మంచి డీల్ అవుతుంది. ఎన్ని కార్డులు..? ఒకరికి ఎన్ని కార్డులు ఉండాలన్న దానికి ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఎక్కువ కార్డ్‌లు ఉంటే, వాటితో పాటు రిస్‌్కలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. ‘‘ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, విడిగా ఒక్కో దానిని సరైన రీతిలో వినియోగిస్తూ గరిష్ట స్థాయిలో ఆదా చేసుకోవాలి’’ అని చిబ్బార్ పేర్కొన్నారు. ప్రతి కార్డ్‌కు ఉండే బిల్లింగ్ సైకిల్‌కు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు నెలవారీ నగదు ప్రవాహాలను తెలివిగా వినియోగించుకోవచ్చన్నారు. విడిగా ఒక్కో కార్డ్‌లో వినియోగించకుండా మిగిలిపోయిన లిమిట్, అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుంది. ఒకటికి మించిన కార్డులు కలిగిన వారు, సరైన రీతిలో ఉపయోగించుకోకుండా, ఎక్కువగా వాడేస్తే అది రుణ ఊబిలోకి తీసుకెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక లిమిట్‌తో ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం, అన్నింటినీ గరిష్ట పరిమితి మేరకు వినియోగిస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు మంచిది కాదు. ఎందుకంటే అది అధిక రిస్క్‌కు దారితీస్తుంది. సంఖ్యతో సంబంధం లేకుండా తమ అవసరాలకు పక్కాగా నప్పే కార్డ్ ఉండాలన్నది ప్రాథమిక నియమం. ఎక్కువగా ప్రయాణించని వారికి ట్రావెల్ ప్రయోజనాలతో కూడిన క్రెడిట్ కార్డుతో వచ్చేదేమీ ఉండదు. కార్డులు ఎక్కువైతే వార్షికంగా చెల్లించే ఫీజులు, నికరంగా ఒరిగే ప్రయోజనం ఎంతన్న విశ్లేషణ అవసరం. ఎన్ని కార్డులు ఉన్నా, ఎంత వినియోగించుకున్నా, గడువులోపు పూర్తి బిల్లు చెల్లించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అది రుణ పరపతిపై ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. కార్డును సమీక్షించుకోవాలి.. క్రెడిట్ కార్డ్ తీసుకునే సమయంలో చెప్పిన ప్రయోజనాలు ఎప్పటికీ కొనసాగుతాయని అనుకోవద్దు. కార్డ్ సంస్థ ఎప్పుడైనా అందులోని ప్రయోజనాల్లో మార్పులు చేయవచ్చు. ఈ విషయాలను ఈ మెయిల్ రూపంలో తెలియజేస్తాయి. కార్డ్ కంపెనీల నుంచి వచ్చే మెయిల్స్‌ను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకని ఏడాదిలో రెండు సార్లు అయినా, క్రెడిట్ కార్డు నియమ, నిబంధనలు, ప్రయోజనాలను సమీక్షించుకోవాలి. రివార్డ్ పాయింట్లను కూడా రెడీమ్ చేసుకోవాలి. లేదంటే అవి కాలం చెల్లిపోయే ప్రమాదం ఉంటుంది. మారిన నియమ, నిబంధనల ప్రకారం ఇక మీదట సంబంధిత క్రెడిట్ కార్డ్ ప్రయోజనకరం కాదని గుర్తిస్తే, దాన్ని రద్దు చేసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేసుకుంటే, అది తాత్కాలికంగా క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అనుకూలతలు ► ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, అప్పుడు ఒక్కో కార్డు వారీ వినియోగించుకునే పరిమితి 50 శాతం మించకుండా చూసుకోవచ్చు. ఇది క్రెడిట్ స్కోర్‌కు అనుకూలం. ►ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతూ, అన్ని బిల్లులను గడువులోపు చెల్లించేట్టు అయితే క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు దారితీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు వేగంగా, ఆకర్షణీయమైన రేటుకు లభిస్తాయి. ►క్రెడిట్ కార్డ్ సంస్థలు ట్రాక్ రికార్డ్ మెరుగ్గా ఉన్న వారికి అదనపు లిమిట్ ఆఫర్ చేస్తుంటాయి. అత్యవసరాల్లో ఈ అదనపు పరిమితి ఉపయోగపడుతుంది. మరిన్ని రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు అందుకోవచ్చు. ప్రతికూలతలు ►ఒకటే కార్డ్ ఉంటే వినియోగ నిష్పత్తి (కార్డ్ యుటిలైజేషన్ రేషియో) గరిష్ట స్థాయిలో ఉంటుంది. ►ఒకటికి మించి కార్డులు ఉంటే ప్రతీ కార్డ్ బిల్లును పరిశీలిస్తూ, గడువులోపు వాటి బిల్లులు చేయడం కొంత అదనపు శ్రమతో కూడినది. కార్డ్‌లు ఎక్కువై, సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే అది స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ►ఒకటికి మించి కార్డ్‌లు ఉంటే, క్రమశిక్షణతో, వివేకంగా వినియోగించుకోకపోతే అది రుణ ఊబిలో చిక్కుకునేందుకు కారణమవుతుంది. ►అవసరం లేకుండా ఎక్కువ కార్డులు నిర్వహిస్తుంటే, వాటికి చెల్లించే ఫీజుల రూపంలో నష్టపోవాల్సి వస్తుంది. -
'దీన్ని అలా చూడకూడదు..': భారత్ పర్యటనపై పాక్ మంత్రి వ్యాఖ్యలు
భారత్‌లోని గోవాలో వచ్చే నెల మే 4 నుంచి 5 వరకు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్(ఎస్సీఓ) సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి బిలావల్ భుట్టో జర్దారీ పాక్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ మేరకు జర్దారీ పాక్ స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే నెలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో తాను పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. తాము ఎస్సీఓ చార్టర్‌కు కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. తాను ఈ సమావేశంలో పాలుపంచుకోవడం అనేది SCO చార్టర్ పట్ల పాక్‌కు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడకూడదని జర్దారీ అన్నారు. కాగా, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో పర్యటించనున్న తొలి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. చివరిసారిగా 2011లో అప్పటి పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. భారత్‌లో జరగనున్న విదేశాంగ మత్రుల సమావేశానికి పాక్, చైనాతో సహా షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యులందరికీ భారత్ అధికారికంగా ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతేడాది సెప్టంబర్లో తొమ్మిది మంది సభ్యులతో కూడిన మెగా గ్రూపింగ్‌కు భారతదేశం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఈ ఏడాది కీలక మంత్రి వర్గ సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనుంది. ఈ 20 ఏళ్ల షాంఘై సహకార సంస్థలో రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇందులో ఇరాన్ ఇటీవలే తాజగా సభ్యత్వం పొందిన దేశం. పైగా తొలిసారిగా ఇరాన్ బారత్ సారథ్యంలో పూర్తిస్థాయి సభ్యునిగా గ్రూపింగ్ సమావేశానికి హాజరవుతోంది. ఇక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 2022లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో జరిగింది. దీనికి నరేంద్ర మోదీ హజరయ్యారు. అంతేగాదు జూన్ 2019 కిర్గిజిస్థాన్‌లో షాంఘై సదస్సు తదనంతరం జరిగి తొలి వ్యక్తిగత శిఖరాగ్ర సదస్సు కూడా ఇదే. (చదవండి: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు) -
330 చదరపు అడుగులు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు సొంత గూడు కల్పిం చేందుకు ప్రారంభించిన 2 పడక గదుల గృహాల పథకంలో మార్పులు జరగబోతున్నాయి. పథకం కొనసాగిస్తూనే.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకు నే లబ్ధిదారులకు డబ్బు సాయం అందిస్తామని ఇటీ వల బడ్జెట్లో ప్రకటించిన పథకానికి కొన్ని నిబంధనలు విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. సొంత స్థలంలో చేపట్టే ఇళ్ల కనిష్ట, గరిష్ట విస్తీర్ణం ఎంతుండాలో నిబంధనలు రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కనీస విస్తీర్ణం 330 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకుండా చూడాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. గరిష్ట విస్తీర్ణం పరిధిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. బడ్జెట్లో ఇళ్లకు రూ. 12 వేల కోట్లు ఇటీవలి బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో సొంత స్థలంలో లబ్ధిదారులే నిర్మించుకునే ఇళ్లకు రూ.7,350 కోట్లను, ఇంతకాలం కొనసాగుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.4,650 కోట్లను ప్రతిపాదించింది. సొంత జాగాలో నిర్మాణానికి నియోజకవర్గానికి 3 వేలు చొప్పున ఇళ్లను కేటాయించింది. మరో 43 వేల ఇళ్లను సీఎం విచక్షణాధికారం పరిధిలో ఉంచింది. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలను ప్రభుత్వం సాయంగా అందిస్తుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) పథకం కింద కేంద్రం నుంచి 4 లక్షల ఇళ్లు మంజూరవుతాయిని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో పట్టణ ప్రాంతాల ఇంటి యూనిట్ ధర రూ.2 లక్షలుండగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలుగా ఉంది. ఆ నిధులకు సొంత నిధులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. కేంద్రం పథకం విధి విధానాల్లో ఇంటి నిర్మాణ పరిధి 330 చదరపు అడుగులకు తగ్గకూడదన్న నిబంధన ఉంది. ఇదే నిబంధనను ‘సొంత స్థలంలో ఇళ్లకు’ విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. తేడా వస్తే కేంద్రం నిధులు ఆగిపోతాయని భావిస్తోంది. ఇక లబ్ధిదారులెవరైనా సొంత నిధులు కలిపి పెద్దగా ఇంటిని నిర్మాణం చేపట్టి మధ్యలో నిధులు సరిపోక చేతులెత్తేస్తే కేంద్ర నిధులకు ఇబ్బంది వస్తుంది. అలాంటి ఇళ్లను పరిగణనలోకి తీసుకోకుండా అంతమేర నిధుల్లో కేంద్రం కోత పెడుతుంది. దీంతో ఖర్చు మరీ ఎక్కువయ్యేలా పెద్దగా ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా గరిష్ట పరిధిని కూడా నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జనానికి భారమే కనిష్ట పరిమితిపై నిబంధన విధిస్తే లబ్ధిదారుల జేబుపై భారం పడబోతోంది. కనీసం 330 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4.50 లక్షలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది రూ.3 లక్షలే. అంటే దాదాపు రూ. లక్షన్నర మేర లబ్ధిదారులే సొంతంగా ఖర్చు చేయాల్సి రానుంది. కొంతమంది ప్రస్తుతమున్న ఇంటికి కొనసాగింపుగా పక్కనే ఉండే ఖాళీ స్థలంలో ఒకట్రెండు గదులు నిర్మించుకుంటుంటారు. ఈ కొత్త నిర్మాణాన్ని ప్రభుత్వ పథకం కింద చూపుతారు. అలాంటి అనుబంధ నిర్మాణాలు 330 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉంటే కొత్త నిబంధన అమలులోకి వస్తే వాటికి అనుమతి రాదు. -
నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన కేటగిరీలు ఇవే!
నియర్ మి ఫుడ్ షెల్టర్ నియర్ మి, కోవిడ్ టెస్ట్ నియర్ మి, లిక్కర్ షాప్స్ నియర్ మి, నైట్ షెల్టర్ నియర్ మి, గ్రాసరీ స్టోర్స్ నియర్ మి, జిమ్ ఎక్విప్మెంట్ నియర్ మి, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ నియర్ మి, లాప్టాప్ షాప్ నియర్ మి, ఫర్నీచర్ స్టోర్ నియర్ మి.. మొదలైన అవసరాల గురించి ఆరా తీసారు. హౌ టు హౌ టు మేక్ పనీర్, హౌటు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ, హౌ టు మేక్ డల్గోనా కాఫీ, హౌ టు లింక్ పాన్ విత్ ఆధార్, హౌ టు మేక్ శానిటైజర్ ఎట్ హోం, హౌ టు రీచార్జ్ ఫాస్టాగ్, హౌ టు ప్రివెంట్ కరోనా వైరస్, హౌ టు అప్లై ఈ–పాస్, హౌ టు మేక్ జిలేబీ, హౌ టు మేక్ కేక్ ఎట్ హోం వంటివాటితోపాటు..హౌ టు బీ యాంటీ రేసిస్ట్? కూడా ఉంది. పోయిన ఏడాది జూన్ వరకు ‘మిలియనీర్ కావడం ఎలా? అనే ప్రశ్నను సంధించిన నెటిజన్లు.. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపడంతో ‘హౌ టు బీ యాంటీ రేసిస్ట్’ సెర్చ్ దాన్ని ఆక్రమించేసింది. ఆ సంఘటన చాలా దేశాల్లో ప్రభావం చూపింది. దీంతో రేసిస్ట్ అంటే ఏంటీ? యాంటీ రేసిస్ట్ ఎలా ఉండాలి అనే అన్వేషణ గూగుల్ సెర్చ్‌లో టాప్‌కి చేరింది. ఇదేగాక సిస్టమిక్ రేసిజం గురించి కూడా జల్లెడ పట్టారు జనులు. హౌ టు ఎస్టాబ్లిష్ బిజినెస్ కరోనా ఎన్నో రకాల కొలువులను ఫైర్ చేసింది. దాంతో ఆ నిరుద్యోగులంతా బిజినెస్ వైపు దృష్టి మళ్లించారు. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఏంటీ? ఏ బిజినెస్ అయితే బావుంటుంది? వంటి ఐడియాల కోసం ఆత్రపడ్డారు. వాట్ ఈజ్ దిస్.. వాట్ ఈజ్ కరోనా వైరస్, వాట్ ఈజ్ బినోద్లను అధికంగా సెర్చ్ చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి చాలామంది హాష్ ట్యాగ్ బినోద్‌తో మీమ్స్‌ను షేర్ చేసారు. వీటి తరువాత వాట్ ఈజ్ ప్లాస్మా థెరపీ, వాట్ ఈజ్ సీఏఏలు ఉన్నాయి. గతేడాది ప్రారంభంలో సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) గురించీ పెద్దసంఖ్యలో వెదికారు. సూర్యగ్రహణం నేపథ్యంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’కు సంబంధించి మరింత తెలుసుకునే ఆరాటం చూపారు. అసోంలో ఎన్ఆర్సీ (ది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అమలు చేస్తున్నట్లు ప్రకటించేటప్పటికి ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలు ఎన్ఆర్సీ గురించి తెలుసుకునే ప్రయత్నమూ చేశాయి. వాట్ ఈజ్ హంటా వైరస్ కరోనా వల్ల చైనా అంటేనే హడలిపోతున్న ప్రపంచాన్ని అక్కడి ‘హంటా వైరస్’ ఉనికి భయంతో చంపేసేలా చేస్తోంది. హంటా గురించి విన్న ప్రజలు అమ్మో ఇది కూడా కరోనాలా వ్యాపిస్తుందేమోనని ముందు జాగ్రత్తగా దాని మీద శోధన స్టార్ట్ చేశారు.. హంటా వైరస్ అంటే ఏంటీ? అది ఎలా వ్యాపిస్తుంది? అంటూ. మొబైల్ గేమింగ్.. లాక్డౌన్ ప్రారంభమయ్యాక 45 శాతం మంది భారతీయులు మొబైల్ గేమ్స్‌లో మునిగిపోయారు. వాళ్లంతా గేమ్స్‌తోనే కాలక్షేపం చేసినట్లు ఇన్‌మొబి యాడ్టెక్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఏకధాటిగా కనీసం గంట పాటు ఒక దగ్గరే కూర్చుని గేమ్‌లు ఆడినట్లు సర్వే తెలిపింది. ఇదీ కరోనా కాలంలో చిగురించిన ఆసక్తులు,ఆన్లైన్లో పెరిగిన అన్వేషణలు, జరిగిన కాలక్షేపాలు, తెలుసుకున్న విషయాలు, వివరాల చిట్టా! వీళ్లే టాప్ అమెరికా ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్, 2018లో ఓ ఆత్మహత్య కేసులో అర్ణబ్ గోస్వామి అరెస్టు అవ్వడంతో అతని గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఆ తరువాత స్థానంలో కనికా కపూర్, కిమ్ జాంగ్– ఉన్, అమితాబ్ బచ్చన్, రషీద్ ఖాన్, రియా చక్రవర్తి, కమలా హ్యారిస్, అంకితా లోఖాండే, కంగనా రనౌత్‌ల అప్డేట్స్ వివరాల అన్వేషణా ఉంది. వాట్ ఈజ్ ఫార్మర్ బిల్ 2020 భారత ప్రభుత్వం రైతుల అభ్యున్నతికోసం కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశ పెట్టడం.. వాటిని హర్యాణా, పంజాబ్ రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, అంతేగాక దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, అనేక రాజకీయ పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకించడంతో కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో తెలుసుకునేందుకు సెర్చ్ చేశారు. సెప్టెంబర్ నెల మధ్యకాలంలో అరవై వేలకుపైగా నెటిజన్లు ‘వాట్ ఈజ్ ఫార్మర్ బిల్ 2020’ ఇన్ ఇండియా పేరుతో వెతికారు. చదవండి: అమేజింగ్ బేబీ మల్టీ ఫంక్షన్ కుకర్ -
ఫైనల్లో పరాజితులు లేరు
వెల్లింగ్టన్: ప్రపంచ కప్ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్ విలియమ్సన్ సహా కోచ్, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఆరు పరుగుల (2+4) ఓవర్ త్రోపై విలియమ్సన్ తమ దేశ మీడియాతో మాట్లాడుతూ... మ్యాచ్ ఆఖరి క్షణాల్లో అంపైర్లు చేసిన ఈ క్లిష్టమైన పొరపాటును తెలుసుకుని తామంతా ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. ‘నిబంధనలపై సంపూర్తి అవగాహన లేని మేం ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం. వందలకొద్దీ ఉన్న ఇతర నిబంధనల్లానే ఇదీ ఒకటని భావించాం తప్ప భిన్నమైనదని అనుకోలేదు’ అని అతడు తెలిపాడు. తీవ్ర ఉత్కంఠగా సాగిన తుది సమరంలో పరాజితులు ఎవరూ లేరని విలియమ్సన్ వివరించాడు. ఫలితాన్ని చూస్తే ఒక్క కిరీటం (ప్రపంచ కప్ ట్రోపీ) దక్కడం తప్ప రెండు జట్ల మధ్య తేడా ఏదీ లేదని అతడు విశ్లేషించాడు. కోచ్ గ్యారీ స్టీడ్ స్పందిస్తూ... ప్రపంచ కప్ నిబంధనలను తప్పనిసరిగా సమీక్షించాలని కోరాడు. ఆటలో సమఉజ్జీలుగా నిలిచినప్పటికీ సాంకేతిక అంశాలతో ఓటమి పాలవడం బాధాకరంగా ఉందని అతడు అన్నాడు. ఎన్నో అంశాలు ఉండగా... ప్రపంచ కప్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో ఇలాంటి నిబంధనలు వర్తింప చేయాల్సి వస్తుందని వాటిని రూపొందించినవారు సైతం ఊహించి ఉండరని స్టీడ్ పేర్కొన్నాడు. ‘ఆరు పరుగుల ఓవర్ త్రో’ నిర్ణయంపై స్పందిస్తూ అంపైర్లూ మనుషులేనని వారూ పొరపాట్లు చేస్తారని, అయినా వారు మ్యాచ్ అధికారులు కాబట్టి వాటిని అంగీకరించాల్సిందేనని అన్నాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచ కప్‌నకు తమ జట్టు మరింత దృఢంగా తయారవుతుందని, టైటిల్‌కు గట్టి పోటీదారుగా నిలుస్తుందని కివీస్ దిగ్గజ స్పిన్నర్ డానియెల్ వెటోరి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్ ఓటమిని అతడు తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు ఆటగాళ్లు విడివిడిగా స్వదేశం చేరుకుంటుండటంతో న్యూజిలాండ్ జట్టుకు స్వదేశంలో స్వాగత కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే, వారి అద్వితీయ ప్రదర్శనకు తగిన రీతిలో స్వాగతం పలకాలని బోర్డు భావిస్తోంది. దీనికోసం దేశ ప్రధాని జెసిండా అర్డెమ్, క్రీడా మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్తో సంప్రదింపులు జరుపుతోంది. -
ఆన్లైన్లో ఔషధ విక్రయాలకు నిబంధనలు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధాల విక్రయానికి సంబంధించి పాటించాల్సిన నియంత్రణలపై కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. వీటిని ఇప్పటికే ప్రచురించినట్లు, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయా లోక్‌సభకు తెలిపారు. ఈ ముసాయిదా ప్రకారం.. రిజిస్టర్డ్ ఫార్మసిస్టు పేరు, వారి రిజిస్ట్రేషన్ నంబరు, వారు నమోదు చేయించుకున్న ఫార్మసీ కౌన్సిల్ పేరు మొదలైనవన్నీ కూడా ఈ–ఫార్మసీలు తమ పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఔషధ రంగాలో పారదర్శకతను తీసుకురావడమే ఈ నిబంధనల లక్ష్యమని తెలిపారు. -
జంకు‘బంకు’లేదే!
పశ్చిమగోదావరి యలమంచిలి: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. వాహనచోదకులకు కల్పించాల్సిన సదుపాయాల గురించి పట్టిం చుకోవడం లేదు. పైపెచ్చు పెట్రోల్ రీడింగ్‌లోనూ అవకతవకలకు పాల్పడుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు ఇవీ.. నిబంధనల ప్రకారం.. బంకుల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. వాహనాలకు ఉచితంగా గాలి పట్టడానికి యంత్రాలు ఏర్పాటు చేయాలి. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు పుస్తకం ఏర్పాటు చేయాలి. పెట్రోల్ మీటర్ రీడింగ్‌లో పారదర్శకంగా వ్యవహరించాలి. పెట్రోల్ ధరలు, బంకు వేళలు, నిర్వాహకుడి ఫోన్‌నంబర్, అక్కడ లభించే సేవలు వివరిస్తూ.. బోర్డు ప్రదర్శించాలి. ఆన్లైన్ చెల్లింపుల కోసం యంత్రాలు అందుబాటులో ఉంచాలి. ఎక్కడా కానరావే..! అయితే వీటిని బంకుల్లో ఎక్కడా అమలు చేయడం లేదు. కొన్నిచోట్ల ఆన్లైన్ చెల్లింపుల కోసం యంత్రాలు ఉండడం లేదు. గాలిపట్టే యంత్రాలు ఉన్నా.. పనిచేయట్లేదు. మరుగుదొడ్ల సంగతి సరేసరి. తాగునీటి వసతి కూడా ఎక్కడా కానరాదు. ప్రథమ చికిత్స కిట్లు కూడా కనబడడం లేదు. ఒకవేళ ఉన్నా వాటిలో కాలంచెల్లిన మందులు, దూది ఉంటున్నాయి. కొన్ని బంకుల్లో పెట్రోల్ మీటర్ రీడింగులోనూ అవతవకలు జరుగుతున్నాయి. ధరల బోర్డులు కానరావడం లేదు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. కనీస వసతులు ఉండడం లేదు పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలలో 15 బంకుల వరకు ఉన్నాయి. చాలా బంకుల్లో కనీస వసతులు ఉండడం లేదు. గాలి పట్టే యంత్రాలు దాదాపు లేవనే చెప్పాలి. తాగునీరు కూడా కనిపించదు. మరుగుదొడ్ల సంగతి సరేసరి. కనీసం మూత్ర విసర్జన కూడా చేయలేనంతా అధ్వానంగా ఉంటున్నాయి. – చేగొండి సీతారామస్వామినాయుడు (చిన్ని), దొడ్డిపట్ల అవగాహన ఉండట్లేదు బంకుల్లో ఉచిత సేవలు ఉంటాయని వినియోగదారులు చాలా మందికి తెలియదు. దాని వల్లే బంకు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి బంకుల్లో అందించాల్సిన సేవల వివరాలను పెద్దపెద్ద అక్షరాలతో బోర్డు రూపంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలి.– వినుకొండ రవి, ఏనుగువానిలంక -
ఆంధ్రప్రదేశ్‌లో 25 తెలంగాణలో 16
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా).. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించే చట్టం. కేంద్రం రెరాను ప్రతిపాదించి రెండేళ్లు దాటినా నేటికీ దేశంలో రెరా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నేటికీ కొన్ని రాష్ట్రాలు కనీసం రెరా నిబంధనలను ఖరారు చేయలేదు. కొన్ని రాష్ట్రాలైతే నిబంధనలను ఓకే చేసి.. ప్రాజెక్ట్‌ల నమోదు కోసం వెబ్సైట్ అభివృద్ధిని అటకెక్కించేశాయి. సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెరాను అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చూస్తే.. రెరా నిబంధనల ఖరారు, ప్రాజెక్ట్‌ల నమోదు, ఉల్లంఘనలకు శిక్షలు వంటి అన్ని దశల్లోనూ రెరా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ముందున్నది ఒక్క మహారాష్ట్రనే. అ తర్వాత ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల గణాంకాలను చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 25 ప్రాజెక్ట్‌లు, 17 మంది ఏజెంట్లు, తెలంగాణలో 16 ప్రాజెక్ట్‌లు, ఐదుగురు ఏజెంట్లు నమోదయ్యారు. 32,306 ప్రాజెక్ట్‌లో రెరాలో నమోదు.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32,306 ప్రాజెక్ట్‌లు, 23,111 ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 17,353 ప్రాజెక్ట్‌లు, 15,634 మంది ఏజెంట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 3,950 ప్రాజెక్ట్‌లు, 1,799 మంది ఏజెంట్లు, గుజరాత్లో 3,300 ప్రాజెక్ట్‌లు, 620 మంది ఏంజెట్లు, కర్ణాటకలో 1,982 ప్రాజెక్ట్‌లు, 1,069 మంది ఏజెంట్లు, మధ్యప్రదేశ్‌లో 1,901 ప్రాజెక్ట్‌లు, 426 మంది ఏజెంట్లు నమోదయ్యాయి. బిహార్‌లో 40 ప్రాజెక్ట్‌లు, ఛత్తీస్‌గఢ్‌లో 664, గోవాలో 256, హర్యానాలో 400, హిమాచల్‌ప్రదేశ్‌లో 20, జార్ఖండ్‌లో 30, ఒరిస్సాలో 123. పంజాబ్‌లో 566, రాజస్థాన్‌లో 807, తమిళనాడులో 635, ఉత్తరాఖండ్‌లో 155, దాద్రా అండ్ నగర్ హవేలిలో 69, ఢిల్లీలో 14 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. నిబంధనలను ఖరారు చేయనివి: అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, మిజోరాం, కేరళ, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ. నిబంధనలు ఖరారు చేసి.. వెబ్సైట్ ప్రారంభించని రాష్ట్రాలు: అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి. నిబంధనల సడలింపు కేంద్ర ప్రతిపాదించిన రెరా నిబంధనలను చాలా వరకు రాష్ట్రాలు నిబంధనలను సడలించాయి. వాటిల్లో ప్రధానమైనవివే.. ♦ ‘నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లు’ అంశంలో మినహాయింపునిచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో అనుమతులు తీసుకున్న ప్రాజెక్ట్‌లను రెరా నుంచి మినహాస్తే, మరికొన్ని శ్లాబ్, సగం నిర్మాణం పూర్తయిన వాటిని నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లుగా పరిగణించి రెరా నుంచి మినహాయింపునిచ్చాయి. ♦ నిబంధనలను ఉల్లంఘించిన డెవలపర్లకు విధించే రెరా శిక్షలు, జరిమానాల్లో సడలింపు. ♦ ఎస్క్రో ఖాతా నుంచి సొమ్మును ఉపసంహరించుకునే వీలు కల్పించడం. ♦ నిర్మాణ లోపాలపై ఐదేళ్ల వారంటీ వంటి వాటిని తొలగించడం. ♦ డెవలపర్ల మీద కేసుల నమోదు రుసుములనూ మినహాయించడం. అనుమతులిచ్చే విభాగాలూ రెరా పరిధిలోకి రెరా అసలైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్మాణ అనుమతులిచ్చే ప్రభుత్వ సంస్థలు కూడా రెరా పరిధిలోనే ఉండాలి. అప్పుడు కొనుగోలుదారులకు, నిర్మాణ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అందరికీ జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుంది. – అనూజ్పురీ, చైర్మన్, అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ. -
రాంగ్ పార్కింగ్ ఫొటో కొట్టు.. గిఫ్ట్ పట్టు
న్యూఢిల్లీ: ఎక్కడపడితే అక్కడ వాహనాల్ని పార్కింగ్ చేసే వ్యక్తులకు షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను పౌరులు మొబైల్‌తో ఫొటో తీసి సంబంధిత విభాగానికి లేదా పోలీసులకు పంపాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత వాహనదారుడికి రూ.500 జరిమానా విధించడంతో పాటు అందులో 10 శాతాన్ని ఫిర్యాదుదారుడికి బహుమానంగా అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు మోటర్ వాహనాల చట్టంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ రవాణా మంత్రిత్వశాఖ కార్యాలయం ఆటోమేటిక్ పార్కింగ్ లాట్ పనులకు గడ్కారీ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పార్కింగ్ లాట్‌కు సంబంధించి 13 అనుమతులు పొందడానికి తన మంత్రిత్వశాఖకే 9 నెలలు పట్టిందని వాపోయారు. -
ఆయన కిక్కుకో లెక్కుంది!
►ఓ మద్యం దుకాణం చెప్పిన అవినీతి కథ ►అనధికార వైన్‌షాపునకు అండాదండా ఆయనే ►కోర్టు తీర్పులు, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ ►చోద్యం చూస్తున్న డిప్యూటీ కమిషనర్ ►కోర్టుధిక్కారణ కేసు నమోదుకు ఫిర్యాదుదారుల సమాయత్తం అవిలాల(తిరుపతి రూరల్): ఎక్సైజ్‌శాఖలో ఆయనో సర్కిల్ ఇన్స్పెక్టర్. తిరుపతి నగరానికి సమీపంలో విధులు నిర్వర్తించే ఆయన కాసులు ఇస్తే నిబంధనలు తుంగలో తొక్కుతారని సొంత డిపార్ట్మెంట్ సిబ్బంది నుంచే ఆరోపణలు ఉన్నా యి. ఇది ఎంతగా అంటే కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతారు చేసి మరీ అడ్డదారి లో షాపులు ఏర్పాటు చేసేంత ‘లెక్క’ లేని తనం తన సొంతమని చెప్పుకుంటారు. తప్పుడు అడ్రస్‌తో ఏర్పాటు చేసిన షాపును ఎత్తివేయాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని ఆ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు అడ్రస్‌తో షాపు నిర్వాహణ.. తిరుపతి రూరల్ మండలం రామానూజపల్లి చెక్‌పోస్ట్ నుంచి మహిళావర్సిటీకి వచ్చే దారిలో ఓ వైన్ షాపును 33 రోజుల క్రితం ఏర్పాటు చేశారు. వేదాంతపురం అడ్రస్‌తో అనుమతి వచ్చిన ఈ షాపును నిబంధనలకు విరుద్ధంగా అవిలాల పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే పంచాయతీలో రెండు షాపులు ఉన్నాయి. మూడోది నిబంధనలకు విరుద్ధమని అవిలాల వైన్స్ నిర్వాహకులు కిషోర్ కుమార్, మల్లంగుంట చిన్ని వైన్స్ అధినేత మునస్వామిరెడ్డి అధికారుల కు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిం చారు. దీంతో షాపును ఎత్తివేయాలని గత నెల 19న కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు బేఖాతర్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షాపును ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించినా.. సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదు. ముత్యాలరెడ్డిపల్లిలోని కార్యాలయంలో ఆ త్రిబుల్‌స్టార్ అధికారి మధ్యస్తం పేరుతో ఫిర్యాదుదారులను పిలిపించుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైతం కోర్టు ఆదేశాల మేరకు షాపును ఎత్తివేయాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను సైతం పట్టించుకోని సదరు అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షాపును మాత్రం కంటికి రెప్పలా కాపాడుతుండడంపై సిబ్బంది సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ కమిషనర్‌కు.. ఫిర్యాదు చేస్తాం అవిలాల పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వైన్‌షాపును ఎత్తివేయాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం దారుణం. కోర్టు ఆదేశాలు సైతం పట్టించుకోని ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు అడ్రస్‌తో ఏర్పాటు చేసిన షాపు వల్ల రోజుకు రూ.8 వేలు నష్ట పోతున్నాం. గత 33 రోజులుగా మాకు జరిగిన నష్టాన్ని అధికారులే చెల్లించాలి. అధికారి తీరుపై కోర్టు ధికార్కణ కేసు నమోదు చేయడమే కాకుండా కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేస్తాం. – కిషోర్‌కుమార్, అవిలాల వైన్స్ నిర్వాహకుడు -
ఆ 88 మంది...
పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో తొలి అడుగు ఆసక్తికరం. ఆటగాళ్లకు సంబంధించి అదో అద్భుతం. క్రికెటర్ల వేలం, భారీ మొత్తాలు దక్కించుకోవడం, ఆటలో నిబంధనలు, మైదానంలో వినోదం... ఇలా ప్రతీది విశేషమే. ఐపీఎల్ మ్యాచ్ ఆడటం వారికి కొత్త తరహా అనుభవం. ఇప్పుడు పదో సీజన్ ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. 2008 సీజన్‌లోని ఎనిమిది జట్ల తొలి మ్యాచ్‌ల బరిలోకి దిగిన ఆటగాళ్లందరికీ అదే మొదటి ఐపీఎల్ మ్యాచ్. నాడు ఆయా టీమ్‌ల తుది జట్టులో ఆడిన 88 మందిలో ఇప్పుడు ఎంత మంది చురుగ్గా ఉన్నారు...ఆటకు దూరమైనవారిలో మీకు ఎంత మంది గుర్తున్నారో మీరే చూసుకోండి. తొలి మ్యాచ్ ఆడిన 8 జట్ల ఆటగాళ్లు వీరే... కోల్‌కతా: గంగూలీ, బ్రెండన్ మెకల్లమ్, పాంటింగ్, డేవిడ్ హస్సీ, మొహమ్మద్ హఫీజ్, లక్ష్మీరతన్ శుక్లా, సాహా, అగార్కర్, దిండా, మురళీ కార్తీక్, ఇషాంత్. బెంగళూరు: ద్రవిడ్, వసీం జాఫర్, కోహ్లి, కలిస్, వైట్, బౌచర్, బాలచంద్ర అఖిల్, ఆష్లే నోఫ్కీ, ప్రవీణ్ కుమార్, జహీర్, సునీల్ జోషి (కుంబ్లే తొలి మ్యాచ్ ఆడలేదు). చెన్నై: ధోని, రైనా, పార్థివ్, హేడెన్, మైక్ హస్సీ, ఓరమ్, బద్రీనాథ్, జోగీందర్, పళని అమర్నాథ్, గోనీ, మురళీధరన్. పంజాబ్: యువరాజ్, కరణ్ గోయల్, హోప్స్, సంగక్కర, కటిచ్, ఇర్ఫాన్ పఠాన్, పంకజ్ ధర్మాణి, బ్రెట్‌లీ, పీయూష్ చావ్లా, విల్కిన్ మోటా, శ్రీశాంత్. ఢిల్లీ: సెహ్వాగ్, గంభీర్, శిఖర్ ధావన్, మనోజ్ తివారి, దినేశ్ కార్తీక్, రజత్ భాటియా, మన్హాస్, వెటోరి, మహరూఫ్, బ్రెట్ గీవ్స్, మెక్‌గ్రాత్. రాజస్థాన్: వాట్సన్, కైఫ్, లీమన్, రవీంద్ర జడేజా, తరువర్ కోహ్లి, యూసుఫ్, మహేశ్ రావత్, దినేశ్ సాలుంకే, వార్న్, సిద్ధార్థ్ త్రివేది, మునాఫ్. హైదరాబాద్ దక్కన్ చార్జర్స్: గిల్‌క్రిస్ట్, లక్ష్మణ్, సైమండ్స్, రోహిత్, స్టయిరిస్, వేణుగోపాలరావు, అర్జున్ యాదవ్, బంగర్, వాస్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా. ముంబై: ల్యూక్ రోంచి, జయసూర్య, డొమినిక్ థోర్నిలి, ఉతప్ప, పినాల్ షా, అభిషేక్ నాయర్, పొలాక్, హర్భజన్, ముసవిర్ ఖోటే, నెహ్రా, ధావల్ కులకర్ణి (సచిన్ తొలి మ్యాచ్ ఆడలేదు) ►ఐపీఎల్ తొలి సీజన్ నుంచి పదో సీజన్ వరకు కూడా జట్టు మారకుండా ఉన్న ఆటగాళ్లు విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్ మాత్రమే. -
షరతులపై ఉచితంగా గోశాల గిత్తదూడలు
-సోమవారం తొమ్మిది జతలు రైతులకు అందజేత -సరిగా సాకకపోతే దేవస్థానం స్వాధీనం చేసుకునే అవకాశం అన్నవరం :రత్నగిరి దిగువన దేవస్థానం గోశాలలో గల గిత్తదూడలను రైతులకు ఉచితంగా అందచేస్తున్నారు. సోమవారం తొమ్మిది జతల దూడలను వివిద గ్రామాల రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం గోశాలలో ఉన్న 12 జతల గిత్త దూడలను తీసుకువెళ్లేందుకు దరఖాస్తులు కోరగా 11 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారని, వారిలో తొమ్మిది మందిని ఎంపిక చేసి అందజేశామని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఈ విధంగా కొన్ని గిత్తదూడలను రైతులకు ఇవ్వగా తిరిగి ఇప్పుడు ఇచ్చామని తెలిపారు. ఏఈఓ సాయిబాబా, గోశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవీ షరతులు.. దూడలను తీసుకువెళ్లే వ్యక్తి చిరునామా తదితర వివరాలతో పాటు దేవస్థానం పెట్టిన షరతులన్నీ పాటిస్తానని స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి దానిని నోటరీ చేయించి దేవస్థానానికి ఇవ్వాలి. దూడలను తీసుకునే రైతులు ఆరు నెలలకొకసారి వాటిని దేవస్థానం అధికారులకు చూపాలి. దూడలను సరిగా చూస్తున్నారో లేదో అని దేవస్థానం సిబ్బందికి అనుమానం వస్తే ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వాటిని సరిగా మేపకపోతే దేవస్థానం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. దూడను కబేళాకు తరలించడం వంటివి చేస్తే ‘గోసంరక్షణ చట్టం’ ప్రకారం దేవస్థానం అధికారులు కేసు పెడతారు. ఈ షరతులన్నింటికీ అంగీకరిస్తేనే గిత్త దూడలను అందజేస్తారు. -
విద్యా రుణాల నిబంధనలను సడలించిన ఆర్బిఐ
-
క్యాష్‌బ్యాక్ ఆఫర్ నిబంధనలు వర్తిస్తాయ్...
• క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందేమో చూడండి • అక్కడే నిబంధనలు, పరిమితులూ ఉంటాయ్ • ధర విషయంలో ఒకటికి మూడు సైట్లలో విచారించుకోవాలి ఈ కామర్స్ కొనుగోళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చివరికి ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాలను కూడా ఇవి అమ్మేస్తున్నాయి. క్యాష్‌బ్యాక్ (కొన్న మొత్తం విలువలో నిర్ణీత శాతం మేర తిరిగి వెనక్కి వస్తుంది) కోసం డిస్కౌంట్ తదితర ఆఫర్లతో కస్టమర్లకు ఈ సంస్థలు గాలం వేస్తున్నాయి. నిజానికి ఈ ఆఫర్లు కస్టమర్లకు కూడా ఉపయోగకరమే. అయితే, ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని అందుకోవాలంటే కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు అభిరామ్ ఎల్జీ 8కిలోల ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకున్నాడు. క్యాష్ బ్యాక్, తగ్గింపు వంటి ఆఫర్లు ఏవైనా ఉన్నాయేమోనని ఆన్లైన్ పోర్టల్స్‌ను పరిశీలించాడు. అమెజాన్ సైటులో హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డులపై 5 శాతం, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఆఫర్ ఉందని తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొనేస్తే పూర్తి ప్రయోజనం రాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆఫర్లకు పరిమితులు, నిబంధనలు ఉంటాయి. నిర్ణీత కాలపరిమితి అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కో బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. క్యాష్ బ్యాక్ అంటే...? ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో టైఅప్ అయ్యి ఆయా బ్యాంకు ఖాతాదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే కొనుగోళ్లపై ఈ కామర్స్ పోర్టల్స్ అదనపు తగ్గింపును క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తుంటాయి. ఈ క్యాష్ బ్యాక్ ఆయా కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతుంది. ఉదాహరణకు అమెజాన్ సైట్లో వాషింగ్ మెషిన్ ధర రూ.20వేలు ఉందనుకోండి. ఎస్బీఐ డెబిట్/క్రెడిట్‌కార్డు దారులకు 10 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తే ఆ ఉత్పత్తి నికర కొనుగోలు విలువ రూ.18వేలు. సాధారణ తగ్గింపునకు ఈ క్యాష్ బ్యాక్ అదనం. ఇలాంటి ఆఫర్ ఉన్న సమయంలో ఉత్పత్తి ధర చాలా తక్కువకే వస్తుంది. కానీ, అదే సమయంలో ఇతర ఈకామర్స్ పోర్టల్స్‌లో అదే ఉత్పత్తి ధర ఎంతుందన్న అంశాన్ని పరిశీలించుకోవాలి. ఆఫర్లకు పరిమితులు క్యాష్ బ్యాక్ ఆఫర్ల విషయంలో పరిమితులు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఉదాహరణకు రూ.20వేల వాషింగ్ మెషిన్‌పై 15 శాతం క్యాష్ ఉందనుకోండి. ఈ లెక్కన రూ.3,000 క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి రావాలి. కానీ అక్కడ కార్డు సంస్థ గరిష్ట క్యాష్ బ్యాక్ రూ.2,000కే పరిమితం అనే నిబంధన విధించి ఉండవచ్చు. ఇక, కనీస లావాదేవీ విలువ అంటూ మరో నిబంధన కూడా ఉంటుంది. రూ.2,000 లేదా రూ.5,000 అంతకంటే ఎక్కువ కొనుగోలు విలువ ఉండాలని షరతు విధించి ఉండవచ్చు. అలాగే, ఒక క్రెడిట్ కార్డుపై ఒక్కసారి జరిపే లావాదేవీకే క్యాష్ బ్యాక్ పరిమితం చేయవచ్చు. క్యాష్ బ్యాక్లలో రకాలు ఈ క్యాష్బ్యాక్లలో నూ రకాలు ఉ న్నాయి. ఒక విధానంలో తక్షణమే క్యాష్ బ్యాక్ ప్రయోజనం లభి స్తుం ది. అంటే అప్పటికప్పుడే ఆఫర్ మేర బిల్లు మొత్తంలో తగ్గింపు లభిస్తుంది. అది పోను మిగిలిన విలువమేర చెల్లిస్తే సరిపోతుంది. మరో విధానంలో కొనుగోలు తర్వాత కొన్ని రోజులకు గానీ ఆ క్యాష్ బ్యాక్ రాదు. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్ అప్పటికప్పుడు చెల్లింపుల ద్వారా చేసే కొనుగోళ్లకే పరిమితం కాదు. ఈఎంఐ విధానంలో కొనుగోళ్లపైనా అందుబాటులో ఉండవచ్చు. అయితే, చెల్లింపులు చేసే ముందు అక్కడున్న నిబంధనలు, మినహాయింపులు, పరిమితుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. -
లెసైన్సు లేకుండా నడిపితే బండి జఫ్తు
ఇప్పటి వరకు 6900 డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెన్షన్ రహదారి భద్రతా నిబంధనలు మరింత కఠినతరం సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాలతో ఆర్టీఏ చర్యలు సిటీబ్యూరో: రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించేవారిపై రవాణాశాఖ మరోసారి కొరడా ఝళిపించింది. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6900లకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెండ్ చేసింది. లెసైన్సులపై సస్పెన్షన్ కొనసాగుతున్నా.. లెక్కచేయకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటివారి లెసైన్సులు రద్దు చేయడంతో పాటు తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు కే సులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలని నిర్ణయించింది. రోడ్డు భద్రతా నిబంధనల అమలు పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ఆదేశాల మేరకు రవాణాశాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి అందిన వివరాల మేరకు రవాణా అధికారులు రంగారెడ్డి జిల్లా పరిధిలో 6 వేలు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 900 డ్రైవింగ్ లెసైన్సులను సస్పెండ్ చేశారు. మూడు నెలల పాటు ఈ తాత్కాలిక నిలుపుదల అమల్లో ఉంటుంది. ఆ నాలుగు కీలకం.... మద్యం తాగి వాహనాలు నడిపినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా లెసైన్సులపై వేటు పడుతుంది. అలాగే అధిక వేగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం వంటి ఉల్లంఘనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ నాలుగు రకాల ఉల్లంఘనల కారణంగానే దే శవ్యాప్తంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. సాధికార కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు, రవాణాశాఖ కార్యాచరణ చేపట్టారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో డ్రైవింగ్ లెసైన్సులను తాత్కాలికంగా నిలుపుదల చేయడమే కాకుండా, సస్పెన్షన్ టైమ్‌లో తిరిగి రోడ్డెక్కకుండా వారిపై నిఘా పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుండటంతో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. నిరంతర సమీక్ష... రోడ్డు భద్రతా నిబంధనల అమల్లో ప్రతి నెలా ఆర్టీఏ అధికారులు సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మూడు నెలలకు ఒకసారి న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు సాధికార కమిటీకి నివేదికను అందజేస్తారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అన్ని చోట్ల చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో డ్రైవింగ్ లెసైన్సులపై సస్పెన్షన్ విధించడం, అలాంటి ఉల్లంఘనులు మరోసారి రోడ్డెక్కకుండా నిఘా కొనసాగించడం ఇదే మొట్టమొదటిసారి అని హైదరాబాద్ జేటీసీ రఘునాథ్ అభిప్రాయపడ్డారు. చిన్నారి రమ్య మతి ఉదంతం నేపథ్యంలో రోడ్డు భద్రతా నిబంధనలు, లెసైన్సుల జారీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. -
బుకింగ్ నిబంధనల్లో మార్పుల్లేవు: రైల్వే
న్యూఢిల్లీ: రైల్వే బుకింగ్, తత్కాల్‌లకు సంబంధించిన జులై 1 నుంచి నిబంధనలు మారుతున్నాయంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో వస్తున్న వార్తలు సరికాదంటూ రైల్వే శాఖ ప్రకటించింది. ‘అది తప్పుడు ప్రచారం. నిర్ధారించుకోకుండానే కొన్ని పత్రికలు ఈ విషయాన్ని ప్రచురించాయి. దీని వల్ల గందరగోళం నెలకొంది. శతాబ్ది, రాజధాని రైళ్లలోనే కాదు ఏ రైళ్లలోనూ పేపర్ టికెట్లను తొలగించే ఆలోచన లేదు. అయితే, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారు, టికెట్ కన్ఫర్మేషన్కు సంబంధించి వారికందిన ఎస్ఎంఎస్తో పాటు, నిర్ధారిత గుర్తింపు పత్రంతో ప్రయాణం చేయవచ్చు. రద్దు చేసుకున్న ప్రయాణాలకు సంబంధించి తిరిగి చెల్లింపుల(రీఫండ్) నిబంధనల్లోనూ ఎలాంటి మార్పుల్లేవు’ అని గురువారం రైల్వే శాఖ స్పష్టం చేసింది. టిక్కెట్లపై చార్జీల్లో రాయితీలను కూడా ప్రచురించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. చార్జీపై ప్రయాణికులు ఎంత రాయితీ పొందుతున్నారో వారికి తెలియాలని, చార్జీల హేతుబద్ధీకరణకు ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు మెంబర్ మహ్మద్ జంషెడ్ చెప్పారు. ప్రయాణికులను గ మ్యం చేర్చడానికి తమకయ్యే ఖర్చులో 57 శాతం మాత్రమే చార్జీల ద్వారా తిరిగి వస్తుందనీ, సబర్బన్ రైళ్లలో అయితే ఇది కేవలం 37 శాతమేనని ఆయన చెప్పారు. మొత్తం రైళ్ల ట్రాఫిక్‌లో సబర్బన్, తక్కువ దూరం ైరె ళ్ల ట్రాఫిక్ శాతం 52 అని, కానీ ఆదాయార్జనలో వీటి వాటా 6 నుంచి 7 శాతమేనని జంషెడ్ వివరించారు. -
ఆ ఒక్కటి వదిలేస్తే..!
ఇంకెక్కడ స్థలం కావాలన్నా ఓకే ఒకవైపు స్వాధీనానికి నోటీసులు.. మరోవైపు బేరసారాలు బడాబాబుల పక్షాన వుడా ద్వంద్వవైఖరి అలా కుదరదన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వందలాది స్థలాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు అడ్డగోలుగా ముందుకెళ్లి.. బోల్తా పడిన వుడా నిబంధనలు అలా ఉన్నాయంటున్నారు.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటే స్వాధీనం చేసుకుని తీరుతామని బీరాలు పోతున్నారు. కానీ నగరంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఖాళీగానే పడున్నాయి. అడపదడపా నోటీసులివ్వడం తప్ప.. వాటి జోలికి ఏనాడూ వెళ్లని వుడా బాబులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చిన స్థలం విషయంలో ఎందుకింత కఠినంగా వ్యవహరించారని ఆరా తీస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పైగా స్వాధీనం చేసుకుంటామన్న వారు.. మధ్యలో దాన్ని వదిలేసుకుంటే.. ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఇస్తామని బేరాసారాలకు దిగడమేమిటన్న తాజా వివాదం రాజుకుంటోంది. విశాఖపట్నం : వంద కోట్ల విలువైన ఎన్ఎండీసీకి చెందిన భూమిని వెనక్కి తీసుకోవాలన్న వుడా వివాదాస్పద నిర్ణయం వెనుక మరో కోణం వెలుగుచూస్తోంది. పాతికేళ్ల క్రితం ఎన్ఎండీసీ కొనుగోలు చేసిన అర ఎకరా భూమిని అడ్డగోలుగా స్వాధీనం చేసుకుని ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వుడా బరితెగింపునకు అడ్డుకట్ట పడినా.. తెరవెనుక జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి. ఖాళీగా వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా వదిలేయడం వల్లే బీచ్‌రోడ్డులో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ఖ (ఎన్ఎండీసీ) స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని వుడా అధికారులు బీరాలు పోతున్నారు. నిబంధనల మేరకే అలా చేశామని వాదిస్తున్నారు. వాస్తవానికి అలా ఖాళీగా వదిలేసిన స్థలాలు నగరంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయా స్థలాల యజమానులకు అడపాదడపా నోటీసులు ఇవ్వడం తప్పించి ఒక్క గజం భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు వుడా అధికారులు కనీస చర్యలు చేపట్టలేదు. కానీ ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ స్థలానికి ఎసరు పెట్టేందుకు మాత్రం నిబంధనలను సాకుగా చూపించారు. మరోవైపు ఎన్ఎండీసీతో తెరవెనుక రాయబేరాలూ సాగించారు. బీచ్ రోడ్డులోని స్థలం అప్పజెబితే..నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడ మరో స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే స్వాధీనం చేసుకోవాలే గానీ.. ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని బేరం పెట్టడం చూస్తే.. వుడా కుట్ర ఏమిటో అర్థమవుతుంది. ఇంటర్ గ్లోబ్ ఎంచుకున్న స్థలమట పర్యాటకాభివృద్ధి కోసం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ ఆహ్వానంపై జాతీయస్థాయి కార్పొరేటు సంస్థలు ఇటీవల విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించాయి. ఆ క్రమంలో విశాఖలో పర్యటించిన ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రతినిధులను బీచ్ రోడ్డులో సువిశాలంగా ఉన్న ఎన్ఎండీసీకి చెందిన ఖాళీ స్థలం ఆకర్షించింది. ఇక్కడైతే స్టార్ హోటల్ కట్టేందుకు తాము సిద్ధమని అప్పటికప్పుడే వారు ప్రకటించేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ విషయమై జీవీఎంసీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడగా, అది గతంలో వుడా విక్రయించిన స్థలమని తేలింది. అంతే.. ఆ స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునే పనిని ప్రభుత్వ పెద్దలు వుడా అధికారులకు అప్పజెప్పారు. మొదట్లో వుడా అధికారులు తటపటాయించినా బడాబాబులు రంగప్రవేశం చేయడంతో అడ్డగోలుగా ముందుకు వెళ్లిపోయారు. ఆ భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. కండిషనల్ రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనను తెరపైకి తెచ్చి స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు నోటీసులిచ్చారు. వుడా అధికారులకు అక్కడా అవమానమే.. ఖాళీగా ఉన్న స్థలంలో వెంటనే నిర్మాణాలు చేపడతామని, వెనక్కి తీసుకునే చర్యలు ఉపసంహరించుకోవాలన్న ఖనిజాభివృద్ధి సంస్థ విశాఖ అధికారుల గోడును పట్టించుకోని వుడా అధికారులు.. ఇదే సమయంలో ఎన్ఎండీసీ ఉన్నతస్థాయి అధికారులతో రాయబేరం నడిపారు. బీచ్‌రోడ్డు పక్కన స్థలాన్ని వదిలేస్తే ప్రత్యామ్నాయంగా మీకు మరో చోట స్థలం ఇస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. వెంటనే కావాలంటే రుషికొండ సమీపంలో ఇప్పటికే నిర్మించిన రే హౌసింగ్ ప్లాట్స్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వుడా వీసీ టి.బాబూరావునాయుడు మే నెలలో హైదరాబాద్ వెళ్లి ఎన్ఎండీసీ చైర్పర్సన్ భారతి ఎస్.సిహాగ్ను కలిసేందుకు ప్రయత్నించారు. వుడా వ్యవహారశైలితో గుర్రుగా ఉన్న ఆమె వీసీకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన వుడా అధికారులు ఈ నెల 6న ఎన్ఎండీసీకి కేటాయించిన స్థలాన్ని వెనక్కి చేసుకుంటామంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు హైకోర్టుకు వెళ్లడంతో వుడా నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక కేంద్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి తోమర్ ఎన్ఎండీసీకి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఓ పక్క కోర్టు అక్షింతలు, మరో పక్క కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆగ్రహావేశాలతో వుడా పరువు నట్టేట మునిగినట్టయిందని స్వయంగా వుడా వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
సింగిల్ టెండర్!
జనం అవసరాల రీత్యా ఆ పని అత్యవసరం.. దాన్నే వారు అడ్డంగా వాడుకొని సర్కారు సొమ్ము దోచుకోవాలనుకున్నారు. సింగిల్ టెండరే.. అది కూడా ఎక్సెస్ రేటుకు బిడ్ దాఖలైనా.. నిబంధనలు అంగీకరించకున్నా.. ఖాతరు చేయలేదు. ఏదోలా దాన్ని ఓకే చేసేసి పబ్బం గడిపేయాలని ప్లాన్ వేశారు. గుట్టుగా టెక్నికల్ బిడ్ కూడా తెరిచి ఓకే చేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. విషయం లీకైంది. బాస్ ఆరా తీశారు. లోగట్టు అర్థమైంది. అంతే టెండర్ రద్దు చేసి.. మళ్లీ కొత్తగా ఆహ్వానించాలని ఆదేశించడంతో అక్రమార్కుల నోట్లో వెలక్కాయ పడినట్లయ్యింది. విశాఖపట్నం : అధిక రేటుతో దాఖలైన ఒకే ఒక టెండర్‌ను అత్యవసరం అన్న సాకుతో నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించేందుకు జరిగిన ప్రయత్నాలు చివరి క్షణంలో బెడిసికొట్టాయి. హైడ్రామా మధ్య ఏలేరు నీటి పంపింగ్ టెండర్ రద్దయింది. ఏలేరులో ప్రసుతం 63 మీటర్ల కంటే తక్కువ నీటి మట్టం ఉంది. డెడ్‌స్టోరేజ్ కంటే దిగువకు పడిపోయినప్పటికీ విశాఖ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉన్న కొద్దిపాటిని నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. షెడ్యూల్ ప్రకారం రెండు నెలల పాటు నీరు పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రసుతం నీరు లేకపోయినప్పటికీ వర్షాలు పడితే చేరే నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్ చేసి ఏలేరు కాల్వ ద్వారా విశాఖకు తరలించేందుకు ఆగమేఘాల మీద ఈ టెండర్‌ను పిలిచారు. రూ.4.83 కోట్ల విలువైన ఈ టెండర్ కోసం ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. అందులోనూ షెడ్యూల్ రేటు కంటే రెండు మూడు శాతం ఎక్కువ రేటు కోట్ చేసినట్లు తెలిసింది. ఆ రేటు ఎంతన్నది అధికారులు వెల్లడించలేదు. సింగిల్ బిడ్ దాఖలైనప్పుడు దాన్ని రద్దు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా దాఖలైన ఏకైక బిడ్‌ను ఖరారు చేసేయాలని ఇంజినీరింగ్ అధికారులు ఉత్సాహం చూపించారు. గురువారం రాత్రి టెక్నికల్ బిడ్ ఓకే చేసిన సీఈ దుర్గాప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు అదే ఊపులో సమయం తక్కువగా ఉందనే సాకుతో ఫైనాన్షియల్ బిడ్‌ను కూడా తెరిచి ఒకే చేయాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కమిషనర్‌కు తెలియజేయకుండానే.. ఈ విషయం తెలిసిన ‘సాక్షి’ సీఈ దుర్గాప్రసాద్‌ను సంప్రదించగా సింగిల్ టెండర్ దాఖలైనంత మాత్రాన రద్దు చేయాల్సిన అవసరం లేదని.. ఈ రాత్రికే ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టెండర్ తెరుస్తున్న విషయాన్ని కనీసం కమిషనర్‌కు కూడా చెప్పకుండా ఖరారు చేసేందుకు కమిటీ రెడీ అయ్యింది. అయితే చివరి నిముషంలో ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ ప్రవీణ్‌కుమార్ టెండర్ వివరాలపై ఆరా తీశారు. ఎక్సెస్ టెండర్ దాఖలైనప్పటికీ సమయం తక్కువగా ఉందనే సాకుతో కమిటీ ఆమోదముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నదని కమిషనర్ గుర్తించారు. టెండర్ షెడ్యూల్లో నిర్ణయించిన రేటు కంటే కాంట్రాక్టర్ ఎక్కువగా కోట్ చేసినట్టు నిర్థారణకు వచ్చిన ఆయన ఆ టెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖరారు చేయొద్దని.. దాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. మూడురోజుల కాలవ్యవధితో శుక్రవారం మళ్లీ టెండర్లు ఆహ్వానించాలని కూడా ఆదేశించారు. స్పెల్బో కంపెనీ జాయింట్ వెంచర్‌గా వేసిన ఈ సింగిల్ టెండర్‌ను ఎలాగైనా ఖరారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఉత్సాహం చూపడం చూస్తే.. అధికారులు, సదరు కాంట్రాక్టు సంస్థ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలకు ఆస్కారమిస్తోంది. దీనిపై కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వివరణ కోరగా అత్యవసర పని కావడంతో సింగిల్ టెండర్ దాఖలైనప్పటికీ ఖరారు చేసే అవకాశం ఉందని.. అయితే ఎక్సెస్ రేటు కోట్ చేస్తే మాత్రం రద్దు చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కారణంతోనే టెండర్‌ను రద్దు చేసి రీ టెండర్ పిలిచేందుకు ఆదేశాలు జారీ చేశామని ‘సాక్షి’కి తెలిపారు. -
ఎంసెట్ రాస్తున్నారా... నిబంధనలు తెలుసుకోండి..!
విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎంసెట్ పరీక్ష సమయం తరుముకొస్తోంది. ఈ నెల 29వ తేదీన పరీక్ష జరగనుంది. పరీక్ష బాగా రాసి కలలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న సరస్వతీ పుత్రులంతా ముందుగా నిబంధనలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి కొన్ని మార్పులు..చేర్పులు చేపట్టినందున వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించని విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. జీవిత లక్ష్యం.. విలువైన సమయం మళ్లీ రావనే సత్యాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. - ఎచ్చెర్ల * పరీక్ష నిర్వహణకు చకచకా ఏర్పాట్లు * ‘నిమిషం’ నిబంధనపై విద్యార్థులకు అప్రమతం అవసరం * ఇంజినీరింగ్‌కు 11, మెడిసన్‌కు ఐదు కేంద్రాల కేటాయింపు ఎచ్చెర్ల: ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్‌కు సంబంధించి 8049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 5,918, మెడిసన్‌కు 2131 మంది ఉన్నారు. * ఇంజినీరింగ్‌కు సంబంధించి 11 కేంద్రాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మెడిసన్ సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. * విద్యార్థులను గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. * ఈసారి పరీక్ష కేంద్రాల్లో జా మర్లు అమర్చుతున్నందున ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు పని చేయవు. * ఈసారి చేతి గడియారాలను సైతం పరీక్ష కేంద్రంలోకి అను తించరు. * పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలను విద్యార్థులు సమయం తెలుసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఫోన్లు, వాచీలు, క్యాలిక్లేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధించారు. * విద్యార్థుల హాల్ టిక్కెట్, బ్లాక్, బ్లూల్ బా ల్ పాయింట్ పెన్, కుల ధ్రువీకరణ పత్రం నక లు పరిశీలకులకు అంద జేయాలి. * ఆన్లైన్ దరఖాస్తుపై ఫొటో అంటించి ఎటస్టేషన్ చేయించిన కాపీని విద్యార్థి పట్టుకుని వెళ్లాలి. * నిమిషం ఆలసమైన పరీక్షకు అనుమతించ ని నిబంధన కచ్చి తంగా అమలవుతుంది. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. * విద్యార్థి వేలి ముద్రను సైతం ఈసారి తీసుకుంటారు. కవలలు ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తున్న సంఘటనలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు వేలి ముద్రలు సేకరించాలని అధికారు లు ఈసారి నిర్ణయించారు. ఈ నిబంధన ఇప్పటికే జేఈఈ వంటి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నారు. * దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమ యం, సహాయకుల కేటాయింపు ఉంటుంది. ఇన్విజిలేటర్ అంజేసిన ఓఎంఆర్ సీట్లో విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా ఆంధ్రా యూనివర్సిటీ, బుక్లెట్ నంబర్, కోడ్, సక్రమంగా నింపాలి. * పర్యవేక్షకుడి సమక్షంలో మాత్రమే సంత కం చేయాలి, వేలిముద్ర వేయాలి. * ప్రశ్నపత్రం అందజేసిన వెంటనే ముందు గా ప్రింటును సరిచూసు కోవాలి. ప్రింట్ సమ స్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాలి. ప్రతి పేజీ క్షణ్ణంగా పరిశీలించాలి. సహాయం కోసం సహాయం కోసం ప్రభుత్వం కొన్ని హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతుంది. సమస్యలు, సందేహాలు ఈ కాల్స్ ద్వా రా నివృత్తి చేస్తారు. 18004256755, 0884-2340535, 0884-2356255, 0884-23405459, జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబూరావు 9440931686 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు. పక్కాగా నిబంధనలు అమలు కన్వీనర్ ప్రకటించిన నిబంధనలు పక్కాగాపాటిస్తాం. విద్యార్థులు కూడా నిబంధనలపై అవగాహనతో ఉం డాలి. ఇంజినీరింగ్‌కు 11, మెడిషన్‌కు ఐదు కేంద్రాలను కేటాయించి.. ఏర్పాట్లు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంచుకున్నాం. ‘నిమిషం’ నిబంధన పట్ల విద్యార్థులు అప్రమతంగా ఉండా లి. కనీసం గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా జాగ్రత్త పడాలి. - డాక్టర్ బాబూరావు, జిల్లా కో ఆర్డినేటర్, ఎంసెట్-2016 -
ఇక కాస్కోండి!
తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలపై {పత్యేక దృష్టి కఠిన చర్యలకు ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారుల నిర్ణయం ఈనెల ఆఖరి వారం నుంచి పూర్తిస్థాయిలో అమలు విలేకరులకు వెల్లడించిన రెండు విభాగాల అధిపతులు సిటీబ్యూరో: రహదారి భద్రత నిబంధనలు తెలిసినా బేఖాతర్ చేస్తూ దూసుకుపోవడం... ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే నో, ఈ-చలాన్ వస్తేనో ఆ మొత్తం చెల్లించడం... ఆపై షరా మామూ లే అన్నట్లు వ్యవహరించడం... ఈ విధంగా రెచ్చిపోతూ రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్న ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, ఆర్టీఏ అధికారు లు నిర్ణయించారు. ఇప్పటికే అమలులో ఉన్న చర్యలతో పాటు ఈ నెల ఆఖరి వారం నుంచి మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారు. నగర ట్రాఫిక్ చీఫ్ జితేందర్, ఆర్టీఏ కమిషనర్ సందీప్ సుల్తానియా సంయుక్తంగా శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను స్పష్టం చేశారు. ‘ఓనర్ల’ పైనా చార్జ్‌షీట్స్... అసలు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా, వాహన సామర్ధ్యానికి సరిపడిన లెసైన్స్‌లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాళ్లు సిటీలో ఎందరో ఉంటున్నారు. ఇలాంటి వారిని పట్టుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించి వదిలి పెడుతున్నారు. ఇకపై ఈ తరహాలో వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జరిమానాతో పాటు వీరికి వాహనం ఇచ్చిన యజమాని పైనా కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. కోర్టులో నేరం నిరూపితమైతే ఊచలు లెక్కపెట్టాల్సిందే. ‘ఐదింటికి’ లెసైన్స్ సస్పెన్షన్.. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ఓవల్ లోడ్, డ్రంకన్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించి ఊరుకోరు. ఆర్టీఏ అధికారుల ద్వారా వారి డ్రైవింగ్ లెసైన్స్‌ను నిర్ణీత కాలం సస్పెండ్ చేయిస్తారు. సస్పెండైన లెసైన్స్‌తో డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఈ నేరానికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. పక్కాగా పొల్యూషన్ ‘చెక్’... నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి కాలుష్య తనిఖీ ( పొల్యూషన్ చెక్)లను కఠినతరం చేయనున్నారు. ప్రస్తుతం ఈ కాలుష్య తనిఖీ యంత్రాలు రెండు సిలిండర్ల పరిజ్ఞానంతో పని చేస్తున్నాయి. దీన్ని నాలుగు సిలిండర్ల పరిజ్ఞానానికి మార్చుకోవడం, డేటాను ఆన్లైన్ చేయడం కచ్చితం చేస్తున్నారు. ప్రస్తుతం టెండర్లు, యూని యన్లతో చర్చల దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలో అమలు చేస్తారు. ఆపై ప్రతి వాహనమూ కాలుష్య పరీక్షల ధ్రువపత్రం కలిగి ఉండాలన్నది కచ్చితం చేయనున్నారు. ప్రత్యామ్నాయ చిరునామాకు ‘సైట్’... సిటీలో నడుస్తున్న అనేక వాహనాలు వాటి యజ మానుల పేర్లతో, ప్రస్తుత చిరునామాలతో ఉండట్లేదు. దీనివల్ల ఉల్లంఘనలకు సంబంధించిన ఈ- చలాన్ల జారీ సాధ్యం కాకపోవడంతో పాటు అత్యవసర సమయాల్లో యజమానుల్ని, వారి కుటుంబీకుల్ని గుర్తించడం కష్టసాధ్యంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆర్టీఏ వెబ్సైట్లో (్టట్చటఞౌట్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ) ‘ఆల్ట్రనేట్ అడ్ర స్’ అనే లింకు చేర్చారు. ఈ తరహా వాహనచోదకులు ఇందులోకి వెళ్లి ప్రత్యామ్నాయ చిరునామా పొందుపర్చాలి. టూవీలర్‌పై ‘ఇద్దరికీ’ హెల్మెట్ మస్ట్... ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వాహనాన్ని నడుపుతున్న వారి కంటే వెనుక కూర్చున్న వారే ఎక్కువ మంది చనిపోతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వాళ్లూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గతనెల్లో హెల్మెట్ ధరించని 50 వేల మందిపై కేసులు నమోదు చేశామని, వీటిలో వెనుక కూర్చున్న వారు పెట్టుకోని కేసులూ ఉన్నాయన్నారు. రిపీటెడ్ వైలేటర్స్ పైనే రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నాం. లెసైన్స్ రద్దు, చార్జ్‌షీట్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన రిపీటెడ్ వైలేటర్స్కు మాత్రమే అమలు చేస్తాం. ప్రస్తుతం అన్నీ ఆన్లైన్ చేయడంతో రిపీటెడ్ వైలేటర్స్, సస్పెండైన లెసైన్స్ వివరాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ చేతిలోని పీడీఏ మిషన్ల సాయంతో పరిశీలించవచ్చు. ‘ఓవర్ స్పీడింగ్’ నిబంధనను అధికారికంగా వేగాన్ని నిర్దేశించి, సైనే జ్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే అమలు చేస్తాం. - జితేందర్, ట్రాఫిక్ చీఫ్ నిమిషానికో రోడ్డు ప్రమాదం ఏటా దేశంలో ప్రతి నిమిషానికీ ఓ రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో అత్యధికం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. నిబంధనలు, భద్రతా నియమాలు తెలిసి కూడా పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఆధునిక పరి జ్ఞానం జోడిస్తూ డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ విధానాన్నీ మార్చనున్నాం. నిబంధనల అమలుతో పాటు మౌళిక సదుపాయాల అభివృద్ధి, ట్రామా సెంటర్ల ఏర్పాటు, బ్లాక్‌స్పాట్స్‌కు మరమ్మతులు వంటి చర్యల్నీ ప్రభుత్వం తీసుకుటోంది. - సుల్తానియా, ఆర్టీఏ కమిషనర్ -
మా నిబంధనలతోనే ‘జడ్జి’ పోస్టుల భర్తీ
♦ హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ఏజీ ♦ లోతుగా విచారణ జరుపుతామన్న ధర్మాసనం ♦ విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులను తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసు నిబంధనలను అనుసరించి భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర విభజన తరవాత కూడా ఏపీ నిబంధనల ప్రకారం వాటిని భర్తీ చేయడం సరికాదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఏపీ నిబంధనల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడితే తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జేసీజే పోస్టుల భర్తీ కోసం 2014, 2015ల్లో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేసి తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసు నిబంధనల ఆధారంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలి’’ అని ఆయన కోర్టును కోరారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టుగా నామాంతరం చెందిందని, ఏపీకి హైకోర్టు ఏర్పాటయ్యేదాకా ఉమ్మడి హైకోర్టు ఉంటుందని పునర్విభజన చట్టం చెబుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి హైదరాబాద్ హైకోర్టు పరిధిలోని పోస్టులను ఏపీ నిబంధనలతో భర్తీచేయడం న్యాయ సమ్మతం కాదన్నారు. ఈ విషయాలన్నింటిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో కోర్టుకు సహాయపడేందుకు సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి)గా నియమిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విభజన నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థలో విభజన పూర్తయేదాకా జేసీజే పోస్టులను భర్తీ చేయరాదంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం బుధవారం తుది విచారణ ప్రారంభించింది. తాము చట్టం చెబుతున్న దాన్నే అమలు చేయాలంటున్నామని కె.రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా వాదించారు. ‘‘తెలంగాణకు ప్రత్యేక సర్వీసు నిబంధనలున్నాయి. వాటి ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని చెబుతున్న ప్రభుత్వం, రేపు జేసీజే రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన వారికి నియామక పత్రాలివ్వబోమంటే చాలా సమస్యలు ఎదురవుతాయి’’ అని పిటిషనర్ సత్యంరెడ్డి వాదించారు. తామిప్పటికే కిందిస్థాయి విభజన ప్రక్రియను ప్రారంభించామని ధర్మాసనం పేర్కొంది. ‘‘న్యాయాధికారులందరినీ ఆప్షన్లు కోరాం. ఫిబ్రవరి 10 కల్లా అవి అందుతాయి. ఆ తరవాత విభజన కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుంది’’ అని స్పష్టం చేసింది. తెలంగాణ సర్వీసు నిబంధనల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలంటే 2014, 2015ల్లో జారీ చేసిన జేసీజే నోటిఫికేషన్లను రద్దు చేయాల్సి ఉంటుం దని వ్యాఖ్యానించింది. అలాగే రద్దు చేసి తెలంగాణ సర్వీసు నిబంధనల ప్రకారం తిరిగి పరీక్షలు నిర్వహించాలని సత్యంరెడ్డి కోరారు. జేసీజే పోస్టుల రాతపరీక్షకు తెలంగాణ అభ్యర్థులే అధికంగా హాజరయ్యారని, నోటిఫికేషన్లను రద్దు చేస్తే వారంతా ఇబ్బంది పడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. జేసీజే అభ్యర్థులను వారి స్థానికత అధారంగా విభజిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని సత్యంరెడ్డి ప్రతిపాదించారు. వీటిపై లోతుగా విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్ హైకోర్టు తరఫు న్యాయవాది హోదాలో వాదనలు వినిపిస్తుండటంపై సత్యంరెడ్డి, రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసు నుంచి ఆయనను పక్కన పెడుతున్నట్టు ధర్మాసనం పేర్కొంది. -
క్యాష్ కొట్టు.. పోస్ట్ పట్టు
జూనియర్లకే లెసైన్సింగ్ ఆఫీసర్ పోస్టులు నిబంధనలకు తూట్లు కౌన్సిల్‌కు సిద్ధమైన ఫైల్ విజయవాడ సెంట్రల్ : అక్కడ జీవోలతో పనిలేదు. కొంచెం రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారులను మెప్పించగల సత్తా, కాస్త కాసులిస్తే చాలు అడ్డదారిలో పోస్ట్‌ను పట్టేయొచ్చు. హెల్త్ అసిస్టెంట్ల నియామకానికి సంబంధించి కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) జారీ చేసిన 780 జీవోను పక్కన పడేసిన ప్రజారోగ్య శాఖాధికారులు అదే జీవో లెసైన్సింగ్ ఆఫీసర్ల పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఫైల్ సిద్ధం చేయడం వివాదాస్పదమైంది. ఈ పోస్ట్‌ల పంపకానికి సంబంధించి భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌ఓ) ట్రేడ్ లెసైన్స్ మంజూరుకు సంబంధించి లెసైన్సింగ్ ఆఫీసర్లను నియమించాల్సిందిగా ప్రభుత్వం జీఓ 780 ను జారీచేసింది. సీనియర్ శానిటరీ సూపర్వైజర్లను లెసైన్సింగ్ ఆఫీసర్లుగా నియమించాలని జీవోలో పేర్కొన్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్లతో పోస్టుల్ని భర్తీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎగరేసుకుపోయారు సర్కిల్-1కు ఓబేశ్వరరావు, సర్కిల్-2కు శ్రీధర్, సర్కిల్-3కి నారాయణను లెసైన్సింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఫైల్ సిద్ధం చేశారు. ప్రస్తుతం వీరు శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న డివిజన్లలో ఇన్చార్జి బాధ్యతలను మురళీ, సోమరాజు, ఎం.వెంకటే శ్వరరావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరు మలేరియా ఇన్స్పెక్టర్లుగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుగ్రహంతో కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు రెండు, మూడు డివిజన్లకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించడం కొసమెరుపు. భర్తీకాని హెల్త్ అసిస్టెంట్ పోస్టులు జీవో 780 ప్రకారం హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా గత ఏడాది సీడీఎంఏ ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్ బైపీసీ లేదా ఎంపీసీ చదివి, డిప్లమో ఇన్ శానిటేషన్ కోర్సు పూర్తిచేసిన ప్రజారోగ్యశాఖ ఉద్యోగులను హెల్త్ అసిస్టెంట్లుగా నియమించాల్సిందిగా జీవోలో పేర్కొన్నారు. 43,84 జీవోల వివాదం నడస్తున్న దృష్ట్యా హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం లేదని చెబుతూ ప్రజారోగ్య శాఖాధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారు. నగర పాలక సంస్థలోని 24 హెల్త్ అసిస్టెంట్ పోస్టుల్లో 2000వ సంవత్సరం నుంచి ఇన్‌చార్జీలతో నడిపిస్తున్నారు. -
డోంట్ కేర్
జిల్లాలో యథేచ్ఛగా బాణ సంచా అనధికార తయారీ కేంద్రాలు నిర్లక్ష్యానికి ఏటా నిండు ప్రాణాలు బలి కనీస నిబంధనలు పాటించని నిర్వాహకులు మామూళ్ల మత్తులో అధికారులు విశాఖపట్నం: దీపావళి సమీపిస్తోంది.. వెలుగుల తారాజువ్వల మధ్య పండుగ జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే మందుగుండు సామగ్రి కాల్చడంలో జాగ్రత్తలు పాటించకపోయినా, తయారీలో నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిళ్లుతుంది. జిల్లాలో అక్రమ మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వల వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు సంభవించాయి. వీటిపై పోలీసులు, అధికారులు సరైన దృష్టిసారించడం లేదు. గతేడాది హుద్‌హుద్ తుపాను కారణంగా ప్రభుత్వమే దీపావళి వేడుకల్లో బాణ సంచా నిషేధించింది. గతేడాది పండుగకు దూరమైన జిల్లా వాసులు ఈ ఏడాది ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాణ సంచా తయారీ జోరందుకుంది. జిల్లాలో రాంబిల్లి, గోకులపాడు, పాయకరావుపేట, అనకాపల్లిలో పిసిరికాడ, గవరపాలెం, కొప్పాక, సబ్బవరం మండలం మొగలపురం, గుళ్లేపల్లి, సబ్బవరం, పరవాడ, పందుర్తి మండలం పినగాడి, యలమంచిలిలో ఎక్కువగా బాణ సంచా తయారీ కేంద్రాలున్నాయి. అనుమతులు పొందిన బాణ సంచా కేంద్రాలు జిల్లాలో వందలోపే ఉంటే ఏ విధమైన అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అనధికారిక తయారీ కేంద్రాలు కోకొల్లలున్నాయి. ఎక్కడో అరకొర దాడులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు తరలించి గొడౌన్లలో నిల్వు ఉంచుతున్నారు. రెండు రోజులు క్రితం నగరంలోని పూర్ణామార్కెట్ ప్రాంతంలోని కల్లుపాకల్లో, రూరల్‌లోని నర్సీపట్నం కోమటవీధిలో అక్రమ మందుగుండు నిల్వలను పట్టుకున్నారు. నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవీ.. బాణ సంచా తయారీకి వినియోగించే సామగ్రి అంతా త్వరగా మండే స్వభావం ఉన్నవే. గంథకం, సూర్యకారం, అమ్మోనియం సల్ఫేట్, భాస్వరం ఏదైనా మంటను ప్రేరేపించేవే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సర్వం భస్మీపటలం చేస్తాయి. ఎస్.రాయ వరం మండలం గోకులపాడులో ఈ ఏడాది మార్చి 29న మందు గుండు సామాగ్రి కేంద్రంలో ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు వదిలారు. 10 మంది గాయాలపాలయ్యారు. రాంబిల్లి మండలం నారాయణపురంలో ఈ ఏడాది జనవరి 26న జరిగిన పేలుడులో నలుగురు చనిపోయారు. ఏడాదిన్నర క్రితం సబ్బవరం మండలం గుళ్లేపల్లి గ్రామంలో పేలుడులో ఇద్దరు చనిపోయారు. సబ్బవరం మండలంలో ముగలిపురంలో రెండేన్నరేళ్ల ఏళ్ల క్రితం ఒకరు చనిపోయారు. చోడవరం మండలం అంకుపాలెం వద్ద రెండున్నర ఏళ్ల క్రితం జరిగిన పేలుడులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భీమిలి శివారులో బాణ సంచా తయారీ కేంద్రంలో మూడున్నరేళ్ల క్రితం పేలుడు సంభవించింది. రాత్రివేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. ఏడాది క్రితం యలమంచిలిలో అనధికారిక బాణ సంచా తయారీ కేంద్రం నిర్వాహకులు వ్యర్థాలను బయటపడేయడంతో అవి పేలి స్థానికుడు గాయపడ్డారు. ఇవీ నిబంధనలు.. బాణ సంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. బాణ సంచా తయారీ కేంద్రాలు జనావాసాలు, పరిశ్రమలకు దూరంగా ఉండాలి. వెలుతురు, గాలి బాగా ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తయారీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలి. వాటర్ ట్యాంకు ఏర్పాటుచేయాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు అరికట్టేందుకు వీలుగా బూస్టర్ పంపులు ఏర్పాటుచేయాలి. సాండ్ బకెట్లు (ఇసుకతో నింపినవి), వాటర్ బకెట్లు ఏర్పాటు చేయాలి. డ్రై కెమికల్ ఫౌడర్ ఫైర్ ఎక్సిటింగ్ విషర్స్ నాలుగు, 4.5 కేజీ సామర్థ్యం కలిగిన కార్బన్డయాక్సైడ్ ఫైర్ ఎక్సిటింగ్ విషర్ ఒకటి అందుబాటులో ఉంచాలి. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినపుడు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. సిబ్బందికి ప్రమాదబీమా చేయించాలి. ప్రమాదం సంభవించినపుడు ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చేందుకు వీలుగా స్టేషన్‌తో పాటు సిబ్బంది నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఫైర్ అధికారులు ఆయా కేంద్రాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. సిబ్బంది అజాగ్రత్తగా పనిచేయరాదు, కేంద్రాల పరిసరాల్లో ధూమపానం చేయరాదు.18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలను బాణ సంచా తయారీ కేంద్రాల్లో తయారీకి వినియోగించకూడదు. దుకాణాల వద్ద జాగ్రత్తలు.. మంజూరు చేసిన పరిమితికి మించి బాణ సంచా నిల్వ చేయకూడదు. షాపునకు షాపునకు మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి. 18 సంవత్సరాల లోపు వయస్సు వారిని బాణ సంచా దుకాణం వద్ద ఉంచరాదు. షాపు వద్ద పొగతాగరాదని సూచిస్తూ బోర్డు ఏర్పాటుచేయాలి. షాపు వద్ద నీటితో నింపిన నాలుగు, ఇసుకతో నింపిన నాలుగు బకెట్లు ఉండాలి. 200 లీటర్ల నీటితో డ్రమ్మును ఏర్పాటు చేసుకోవాలి. షాపు వద్ద తొమ్మిది లీటర్ల సామర్థ్యం కలిగిన వాటరుపైపు స్కిటు ఫైర్ ఎక్సెటింగ్ విషర్ ఏర్పాటు చేసుకోవాలి. ఐదు లీటర్లు సామర్థ్యం కలిగిన డ్రై కెమికల్ ఫౌడర్ ఫైర్ ఎక్కిటింగు విషర్ ఏర్పాటు చేయాలి. తారాజువ్వలు, రాకెట్లు, పేలుడు సామగ్రి అమ్మకూడదు. షాపు వద్ద జరిగే ప్రమాదానికి, ప్రాణ, ఆస్తినష్టానికి లెసైన్సుదారుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
మాఫీ.. మాయ!
రెన్యువల్ చేసుకున్న రైతులకే రెండో విడత రుణమాఫీ జిల్లాలో మొత్తం రుణమాఫీ అర్హులు 2,08,425 మంది రెన్యువల్ చేసుకున్న వారు 26,399 మంది రంగారెడ్డి జిల్లా : రుణమాఫీపై ప్రభుత్వం పెడుతున్న సవాలక్ష నిబంధనలు రైతులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇటీవల రెండో విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యం.. యంత్రాంగం జిల్లాలో 2,08,425 మంది రైతులకు రూ.125.6 కోట్లు బ్యాంకులకు బదిలీ చేసింది. ఈక్రమం లో ఈనెల 31లోగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అయితే రెన్యువల్ చేసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అసలుకే ఎసరు వచ్చింది. రైతుల పంటరుణాలను రెన్యువల్ చేయడంలో బ్యాంకర్లు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో పంట రుణ మాఫీకి 2,08,425 మంది అర్హులున్నారు. వీరంతా రుణాలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 26,399 మంది రైతులు మాత్రమే రుణాలను రెన్యువల్ చేసుకున్నారు. దీంతో ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటివరకు రూ.22.22 కోట్లు జమచేసింది. నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 12శాతం మాత్రమే పురోగతి సాధించినట్లు స్పష్టమవుతోంది. ఈక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ నిధులు జమచే యడం కష్టమే. కదలనున్న అక్రమాల డొంక.. రుణమాఫీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు తాజాగా రెన్యువల్ ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి విడతల వారీగా రుణాన్ని మాఫీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిసారి రైతులు రుణాన్ని రీషెడ్యుల్ చేసుకోవాలి. ఈ క్రమంలో బోగస్ ఖాతాల తంతు బయటపడనుంది. మొదటివిడతలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో మూడున్నరవేల మంది నకిలీ రైతులు బయటపడ్డారు. దీంతో వారికివ్వాల్సిన నిధులను వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా రెన్యువల్ ప్రక్రియ పూర్తయితే అక్రమాల సంగతి తేలనుంది. అదేవిధంగా ఆడిట్ నివేదికలు సైతం రావాల్పి ఉంది. మొత్తంగా జాప్యం జరుగుతున్న కొద్దీ అక్రమాల తంతు వెలుగులోకి వస్తుందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
నిబంధనలకు మందొదిలారు
మళ్లీ లొల్లి అడ్డగోలుగా వైన్‌షాపుల ఏర్పాటు గుడి, బడి నిబంధనలు కాగితాలకే పరిమితం అనేక ప్రాంతాల్లో ఇళ్ల మధ్యే దుకాణాలు వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు అంతా సక్రమమే అంటున్న ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల ఏర్పాటులో నిబంధనలకు నీళ్లొదిలారు. గుడి, బడికి 100 మీటర్లదూరం పాటించాలనే నిబంధనను గాలికొదిలేస్తున్నారు. ఇళ్ల మధ్యే షాపులు ఏర్పాటు చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. విజయవాడ : జిల్లాలో వైన్ షాప్‌ల లొల్లి మళ్లీ మొదలైంది. ఇప్పటి వరకు షాపుల కోసం వ్యాపారుల మధ్య ప్రత్యక్ష పోరు సాగింది. అంతిమంగా లాటరీ ప్రక్రియతో షాపుల కేటాయింపు పూర్తవగా, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే దుకాణాలను ఇళ్ల మధ్య నుంచి తొలగించాలనే డిమాండ్‌తో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. షాపులు దక్కించుకున్న వ్యాపారులు గుడి, బడి నిబంధనలతో నిమిత్తం లేకుండా అడ్డగోలుగా షాపులు ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. ముఖ్యంగా విజయవాడలోనాలుగు ప్రాంతాల్లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైన్ షాపులు తొలగించాలనే డిమాండ్‌తో ఉద్యమం మొదలైంది. జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఇష్టానుసారంగా దుకాణాల ఏర్పాటు... మద్యం దుకాణాలను గుడి, బడి, చర్చి, మసీదు, ఆస్పత్రులకు 100 మీటర్ల లోపు దూరంలో ఏర్పాటు చేయకూడదనేది నిబంధన. దీనిలో అనేక సాంకేతికాంశాలు ఉండటంతో దానిని వ్యాపారులు పూర్తిగా గాలికొదిలేసి ఇష్టానుసారంగా షాపులు ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారుతోంది. జిల్లాలో 335 వైన్ షాపులకు గాను 33 షాపులను ఎక్సైజ్ శాఖ నేరుగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అంతా నూతన షాపులను ఏర్పాటు చేసే హడావుడిలో ఉన్నారు. షాపులు కేటాయించిన ప్రాంతాల్లో అద్దె షాపులు చూడటం మొదలుకొని అద్దె అగ్రిమెంట్ చేసుకొని మద్యం నిల్వలు తెప్పించి వ్యాపారం మొదలుపెట్టే కసరత్తులో ఉన్నారు. గురువారం జిల్లాలో 10 షాపులు ప్రారంభించారు. మిగిలిన 302 షాపులకు గాను లాటరీ ప్రక్రియలో వ్యాపారులు 294 దక్కించుకొని బుధవారం నుంచే వ్యాపారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాధారణంగా గుడికి, బడికి దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో ఇప్పటికే నాలుగు షాపులు ఇళ్ల మధ్య ఉండటంతో వాటిని తొలగించాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో వారు విచారణకు ఆదేశించారు. ఇక జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు రాకపోవటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జాతీయ రహదారుల పైనా... జిల్లాలో 47వ నంబర్ జాతీయ రహదారి, జగదల్పూర్ జాతీయ రహదారి, 214 (ఎ) జాతీయ రహదారులు ఉన్నాయి. సుమారు జిల్లాలో 150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. గతంలో వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు, పోలీసులు జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులకు అనుమతి ఇవ్వకుండా నిలుపుదల చేయాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. అప్పట్లో ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. జాతీయ రహదారుల వెంబడి ఉండే డాబాల్లో మద్యం అందుబాటులో ఉండటం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని రవాణా, పోలీసు శాఖల వాదన. అయితే అది తమ పరిధిలోని అంశం కాదని ఎక్సైజ్ అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మొదలుకొని జగ్గయ్యపేట వరకు పదికి పైగా వైన్ షాపులు జాతీయ రహదారి సమీపంలో ఉన్నాయి. జగదల్పూర్ జాతీయ రహదారి సమీపంలో కూడా సుమారు 15 వరకు వైన్ షాపులు ఏర్పాటుచేశారు. ఎక్సైజ్ నిబంధనల్లో ఇలా... గుడి అంటే దేవాదాయ శాఖ గుర్తింపు ఉన్న దేవాలయం. అంటే నగరంలో వంద ఆలయాలు ఉంటే 10 ఆలయాలకు మాత్రమే దేవాదాయ శాఖ గుర్తింపు ఉంటుంది. ఆస్పత్రి, పాఠశాలల విషయంలోనూ ప్రభుత్వ గుర్తింపు ఉన్నవాటికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. మసీదు అయిదే వక్ఫ్ బోర్డు గుర్తింపు, చర్చి అయితే దానికి గుర్తింపు ఉండాలి. అంటే కేవలం గుర్తింపు ఉన్న వాటికి 100 మీటర్ల దూరం పాటించాలి. ప్రభుత్వ షాపుల ఏర్పాటు హడావుడిలో ప్రస్తుతం తమ అధికారులు ఉన్నారని, రెండు రోజుల్లో ఫిర్యాదులు వచ్చిన షాపుల గురించి విచారణ నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ డెప్యూటీ కమిషనర్ బాబ్జీరావు ‘సాక్షి’కి తెలిపారు.