Terrorism
-
Amit Shah: త్వరలో ఉగ్రవాద వ్యతిరేక విధానం
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను ఏరిపారేయడంతోపాటు వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఉగ్రవాద నియంత్రణపై గురువారం ఢిల్లీలో జరిగిన సదస్సులో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా, నిఘా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, రాష్ట్రాలు భౌతికమైన సరిహద్దులు కలిగి ఉన్నప్పటికీ, రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఉగ్రవాదానికి అలాంటి సరిహద్దులు, పరిమితులు ఉండవని అమిత్ షా గుర్తుచేశారు. అందుకే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వ్యూహాలు, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర సమన్వయం వంటి చర్యలు అవసరమని సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం మోడల్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్), మోడల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) తీసుకు రావాలని యోచిస్తు న్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి ఇవి ఉమ్మడి వేదికలుగా ఉపయోగపడతాయని పేర్కొ న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న యాంటీ–టెర్రరిజం పాలసీ, స్ట్రాటజీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. -
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ ఔట్రీచ్/బ్రిక్స్ ప్లస్ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్ వేదిక గుర్తించాలని జైశంకర్ కోరారు. కోవిడ్ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు.అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని తెలిపారు.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.On #PoliceCommemorationDay, laid a wreath at the National Police Memorial and offered my solemn tributes to the martyrs of the nation’s police forces.They have scripted an indelible history of patriotism with their selfless service and supreme sacrifice. Their lives will remain… pic.twitter.com/LihvtR9CiT— Amit Shah (@AmitShah) October 21, 2024 ‘మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది. అయినా మా పోరాటాన్ని ఆపం. కశ్మీర్లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము’’ అని షా అన్నారు. కాగా 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
S Jaishankar: ఆత్మపరిశీలన చేసుకోండి
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేíÙంచాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్–పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్‌జీ) 32వ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు. 3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టంచేశారు. చార్టర్ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు. అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు జిన్నా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న జైశంకర్‌తో పాక్ ప్రధాని షరీఫ్ కరచాలనం చేసి సాదర స్వాగతం పలికారు. -
ఉగ్రవాదానికి చోటు లేదు: నెతన్యాహుతో ఫోన్లో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై నెతన్యాహుతో చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.‘పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Spoke to Prime Minister @netanyahu about recent developments in West Asia. Terrorism has no place in our world. It is crucial to prevent regional escalation and ensure the safe release of all hostages. India is committed to supporting efforts for an early restoration of peace and…— Narendra Modi (@narendramodi) September 30, 2024ఇటీవల ఇజ్రాయెల్ లెబనాన్, హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిపిన దాడిలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చింది.దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. -
Amit Shah: ఉగ్రవాదాన్ని పాతిపెడతాం
గులాబ్‌గఢ్/కిష్ట్వార్: మళ్లీ కోలుకోనంతగా ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెట్టనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని పెదర్–నగ్సేని నియోజకవర్గ పరిధిలో సోమవారం గులాబ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ ప్రసంగించారు. ‘‘1990దశకం నుంచి ఉగ్రవాదంతో కష్టాలుపడుతున్న జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. మళ్లీ ఈ గడ్డపై కనిపించనంత లోతుల్లో ఉగ్రవాదాన్ని మా ప్రభుత్వం పాతిపెడుతుంది. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైతే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదలచేస్తామని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. మచియాల్ మాత సాక్షిగా చెబుతున్నా. భారతగడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే సాహసం ఇంకెవ్వరూ చేయరు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ గార్డులు, స్పెషల్ పోలీస్ అధికారులకు పాతరకం .303 రైఫిళ్ల స్థానంలో అధునాతన ఆయుధాలిచ్చాం. ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఉగ్రవాదులొస్తే వారి కథ ఇక్కడి మంచుకొండల్లో ముగిసిపోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీ, కాంగ్రెస్‌లపై అమిత్ విమర్శలుచేశారు. ‘‘ డోగ్రాల చివరి రాజు మహారాజా హరిసింగ్‌ను వీళ్లు అవమానించారు. కశ్మీరీ పండిట్లు బలవంతంగా వెళ్లిపోవడానికి కారణం వీళ్లే. వీళ్లు మహిళ హక్కులను లాగేసుకున్నారు. అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేశారు’’ అని ఆరోపించారు. ‘‘ రువ్వేందుకు రాళ్లు పట్టుకున్న యువతకు జైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ల్యాప్‌టాప్‌లు, త్రివర్ణపతాకం పట్టుకున్న యువతకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని షా అన్నారు. రాహుల్ కశ్మీర్లో ఐస్‌క్రీమ్ తినొచ్చురామ్బాన్లో జరిగిన ర్యాలీలోనూ అమిత్ మాట్లాడారు. ‘‘ కశ్మీర్‌ను ఎన్డీఏ సర్కార్ సురక్షితమైన ప్రాంతంగా మార్చేసింది. అయితే ఇటీవల రాహుల్ ఇక్కడి కొచ్చి లాల్‌చౌక్‌లో ఐస్‌క్రీమ్ తిన్నారు. బైక్ నడిపారు. పైగా మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. రాహుల్ బాబా.. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారుగానీ ఇంతటి రక్షణ వాతావరణం మా వల్లే సాధ్యమైంది. మీ ప్రభుత్వాల్లో ఇది అసాధ్యం’’ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా ఉండి కూడా లాల్‌చౌక్ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడేవాడినని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను అమిత్ గుర్తుచేశారు. ‘‘ షిండే గారూ.. ఇప్పుడు పిల్లాజెల్లాతో వచ్చేయండి. ఎంచక్కా లాల్‌చౌక్‌లో వాకింగ్ చేయండి. మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు’’ అని అమిత్ అన్నారు. -
వారసత్వ రాజకీయాలే పెనుశాపం
జమ్మూ: జమ్మూకశ్మిర్‌లో ఉగ్రవాదం చివరి శ్వాస పీల్చుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన జమ్మూకశ్మిర్‌ను ఇక్కడి వారసత్వ రాజకీయాలు దారుణంగా దెబ్బతీశాయని, పెనుశాపంగా మారి ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయని మండిపడ్డారు. వారసత్వ రాజకీయ పారీ్టలు సొంత బిడ్డల సంక్షేమమే తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నూతన నాయకత్వాన్ని పైకి ఎదగనివ్వలేదని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు పోటీగా నూతన నాయకత్వాన్ని ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇక్కడ నాయకత్వ నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. శనివారం జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో భారీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అద్భుతమైన మెజారీ్టతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పారీ్టలు మళ్లీ అధికారంలోకి వస్తే అధోగతేనని తేలి్చచెప్పారు. జమ్మూకశ్మిర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చనప్పుటి నుంచి జమ్మూకశ్మిర్ విదేశీ శక్తులకు టార్గెట్‌గా మారిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని స్పష్టంచేశారు. గత నాలుగు దశాబ్దాల్లో దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. సభలో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం ‘‘ఉగ్రవాద భూతం వల్ల జమ్మూకశ్మిర్ యు వత తీవ్రంగా నష్టపోయారు. ఇక్క డ అధికారం వెలగబెట్టిన పారీ్టలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ కుటుంబ స్వామ్యాన్ని పెంచి పోషించాయి. యు వతను రాజకీయాల్లో ప్రోత్సహించలే దు. 2000 సంవత్సరం నుంచి పంచా యతీ ఎన్నికలు నిర్వహించలేదు. 2014 తర్వాత బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్, జిల్లా డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగలేదు. మేము అధికారంలోకి వ చ్చాక ఆయా ఎన్నికలు నిర్వహించాం. యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం. వెండితెరపై మళ్లీ జమ్మూకశ్మిర్ అందాలు ఉగ్రవాద బాధితురాలు షగున్ పరిహర్కు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ కేటాయించాం. ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకిలించాలన్న మా అంకితభావానికి ఇదొక ఉదాహరణ. 2018 నవంబర్‌లో షగున్ తండ్రిని, బంధువును ఉగ్రవాదులు కాలి్చచంపారు. జమ్మూకశ్మిర్‌ను ఉగ్రవాద రహితంగా, పర్యాటకుల స్వర్గధామంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరిగే పరిస్థితి రావాలి. వెండితెరపై జమ్మూకశ్మీర్ అందాలు మళ్లీ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తారట! కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ హామీల మధ్య తేడాలను ప్రజలు గమనించాలి. ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తామని ఆ మూడు పారీ్టలు చెబుతున్నాయి. అంటే ప్రజల హక్కులను మళ్లీ దోచుకుంటారట! రిజర్వేషన్లు, ఓటు హక్కును రద్దు చేస్తారట! ఆర్టికల్ 370తోపాటు ఆరి్టకల్ 35ఏ పునరుద్ధరిస్తే ఆడబిడ్డలను తీరని అన్యాయం జరుగుతుంది. మూడు పార్టీల మేనిఫెస్టో అమల్లోకి వస్తే పాఠశాలలు మళ్లీ అగి్నకి ఆహూతవుతాయి. బీజేపీ నేతలను అరెస్టు చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? కాంగ్రెస్ పారీ్టకి ఏమాత్రం నిజాయతీ లేదు. అధికారంలోకి రావడానికి అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం ఆ పారీ్టకి అలవాటే. అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరువిప్పుతారా? అని శామ్ పిట్రోడాను ప్రశ్నించింనందుకు గదిలో బంధించి దారుణంగా కొట్టారు. ఇలా చేయడం మన దేశ గౌరవాన్ని పెంచుతుందా? కాంగ్రెస్ రాజకుటుంబం అత్యంత అవినీతిమయమైన కుటుంబం. వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఆ కుటుంబం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మరో 20 సీట్లు వచ్చి ఉంటే బీజేపీ నేతలను జైలుకు పంపించేవాళ్లమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అంటే వారి ఎజెండా అదేనా? మమ్మల్ని జైల్లో పెట్టడానికే కాంగ్రెస్‌కు అధికారం కావాలా? ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అక్కర్లేదా?’’ అని ప్రశ్నించారు. -
పీఓకే ప్రజలారా.. భారత్‌లో కలవండి
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్‌బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్‌తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్‌లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్‌కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధంజమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్‌తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్‌నాథ్ హితవు పలికారు. -
PM Narendra Modi: యుద్ధాలకు సమయం కాదిది
వియన్నా: ప్రపంచం ఇప్పటికే అనేకానేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది యుద్ధాలకు సమయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల ఆ్రస్టియా పర్యటనలో భాగంగా ఆ దేశ చాన్సలర్ కార్ల్ నెహమర్‌తో బుధవారం ఆయన భేటీ అయ్యారు. పశి్చమాసియా సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం తదితరాలపై నేతలిద్దరూ లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని, అందుకోసం మైలిక సదుపాయాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇన్నొవేషన్లు, నీటి–వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని రంగాల్లోనూ అవకాశాలనూ మరింతగా అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలే యుద్ధాలకు ఏకైక పరిష్కారమమని పేర్కొన్నారు. అందుకు అన్నివిధాలా సహకరించేందుకు ఇరు దేశాలూ సిద్ధమని ప్రకటించారు. ఔరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా సంస్కరణలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం దాకా అన్ని అంశాలపైనా చర్చించినట్టు వివరించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాల కూటమి, జీవ ఇంధన కూటమి తదితరాల్లో భాగస్వామి కావాలని ఆ్రస్టియాను మోదీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ పాత్ర కీలకమని నెహమర్ అభిప్రాయపడ్డారు. గార్డాఫ్ ఆనర్ భారత ప్రధాని ఆ్రస్టియాలో పర్యటించడం 41 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి వియన్నాలో గార్డాఫ్ ఆనర్ లభించింది. స్థానిక కళాకారులు వందేమాతరం ఆలపించారు. మోదీని నెహమర్ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోదీ జీ! వియన్నాకు స్వాగతం’ అని పేర్కొన్నారు. అంతకుముందు నేతలిద్దరూ పలు అంశాలపై చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు.సీఈవోలతో భేటీభారత్లో ఇన్ఫ్రా, ఇంధన, టెక్నాలజీ తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ్రస్టియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. స్థానిక హాఫ్బర్గ్ ప్యాలెస్‌లో ఆ్రస్టియా, ఇండియా సీఈఓల రౌండ్‌టేబుల్ భేటీలో మోదీ, నెహమర్ పాల్గొన్నారు. ఇరు దేశాల నడుమ 2023లో 293 కోట్ల డాలర్ల మేర వర్తకం జరిగింది.అధ్యక్షునితో భేటీ ఆ్రస్టియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ బెలన్తో మోదీ భేటీ అయ్యారు. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై లోతుగా చర్చించుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తమ భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. -
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే!
కశ్మీర్ వేర్పాటు వాదుల తీవ్రవాద చర్యలను సమర్థిస్తూ, భారత సైన్యంపై విషం కక్కుతూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు 14 సంవత్సరాల క్రిందటివి. 2010 అక్టోబర్ 21న దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘ఆజాది ఓన్లీ ద వే’ అనే అంశంపై కశ్మీరీ వేర్పాటు వాదులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్, రచయిత్రి అరుంధతీ రాయ్ భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్ర పరిధిని అతిక్రమించాయనే చెప్పాలి. దేశభద్రతపై ఆ వ్యాఖ్యలు చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదు మేరకు ‘ఉపా’ కింద 2010 అక్టోబర్ 28న ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. లౌకికవాద ముసుగు వేసుకున్న కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కశ్మీర్ వేర్పాటువాదుల వాదనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తే... ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అనే భీతితో ఆ కేసును తొక్కి పట్టారు. వాస్తవంగా దేశ భద్రతతో ముడిపడిన ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి ఉండాలి. 14 ఏళ్లు ఆ కేసుపై విచారణ జరగకుండా తాత్సారం చేయడం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ భద్రత విషయంలో కఠిన వైఖరి అవలంబించే మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణాలనూ దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలదే! అనూహ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కేసు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు సవాల్‌గా మారిన తీవ్రవాదులకు అనుకూలంగా గళం విప్పిన వాళ్ళ పని పట్టడానికి మూడోసారి అధికారంలో కూర్చున్న మోదీ∙ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ ‘ఉపా’ కేసును తెరపైకి తెచ్చేలా కేంద్రం చేసిందా అనే అనుమానం దేశ ప్రజలకు కలగక మానదు.‘ఆజాదీ ఓన్లీ ద వే’ కాన్ఫరెన్స్‌లో అరుంధతీ రాయ్ మాట్లాడిన మాటలను, ఆమె ఉద్దేశాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది? కశ్మీర్ స్వతంత్ర దేశమనీ, దాన్ని భారత ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్రమించిందనీ, కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా బతికే హక్కు ఉందనీ, ఈ హక్కు కోసం భారత సైన్యంతో పోరాడే కశ్మీరు వేర్పాటు వాదులు తన సోదరులనీ, ఈ పోరాటంలో భారత సైన్యానికి ఎదురొడ్డి నిలవడం సమర్థనీయమనీ ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలకు తెలియనీయకుండా కనుమరుగు చేసింది ఎవరు?స్వాతంత్య్రానంతరం 562 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనట్లే జమ్మూ–కశ్మీర్ సంస్థానం రాజు ‘రాజా హరి సింగ్’ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, జమ్మూ–కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజానికి పాకిస్తానే 1948లో కశ్మీర్లో మూడో వంతును ఆక్రమించింది. దాన్ని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి కశ్మీర్లో పాక్ వెన్నుదన్నుతో తీవ్రవాదులు చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం ముక్కలు కావాలని ఎవరు కోరినా క్షమించరాని నేరమే అవుతుంది. – ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రధాని పిలుపు
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దేశంలో తాలిబాన్ సహకారంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరుసాగించడం సమిష్టి బాధ్యత అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఎసీ) అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని, దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని కోరారు. గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, నేరాలు, డ్రగ్స్, స్మగ్లింగ్ మొదలైనవాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని, అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు.2014, డిసెంబర్ 16న పాక్‌లోని పెషావర్ స్కూల్‌పై దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 20 పాయింట్ల ఎన్ఏపీ ఎజెండాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సమ్మతి తెలిపాయి. కాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం 2023లో పాకిస్తాన్లో జరిగిన 789 ఉగ్రవాద దాడులు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 1,524 మంది మృతి చెందారు. 1,463 మంది గాయపడ్డారు. -
22 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పట్టుబడిన ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు.కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్‌లోని వేర్వేరు జిల్లాల్లో సుమారు 152 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఐఎస్ఐఎస్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, లష్కరే ఈ జాంగ్వీ గ్రూపులకు చెందిన 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చెప్పారు.లాహోర్, అటాక్, షేక్‌పురా, ముజాఫర్ఘర్, నాన్కానా సాహిబ్, బవల్పుర్, డీజీ ఖాన్, ఫైసలాబాద్, ముల్తాన్, భవాల్నగర్, రావల్పిండి నుంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 1645 గ్రామాలు పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రానేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డెటోనేటర్లు, పిస్తోల్, నిషేధిత సాహిత్యాన్ని సీజ్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులు పంజాబ్‌లో అఘాయిత్యానికి ప్లాన్ వేశారు, రాష్ట్రంలో ఉన్న కీలక ప్రదేశాలను, వ్యక్తులను టార్గెట్ చేయాలని భావించారు.1,645 గ్రాముల బరువున్న పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, ఒక పిస్టల్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
Amit Shah: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణచివేయండి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేయడం ద్వారా ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో ఇటీవల వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, పలువురు ముష్కరులతోపాటు భద్రతా సిబ్బంది సైతం మరణించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆదివారం భద్రతా దళాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలని ఆదేశించారు. కశీ్మర్ లోయలో చేపట్టిన జీరో–టెర్రర్ ప్రణాళికలతో మంచి ఫలితాలు వచ్చాయని, జమ్మూ డివిజన్లో సైతం అమలు చేయాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు పటిష్టమైన భద్రత కలి్పంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అమిత్ షా ఆదేశించారు. యాత్ర విషయంలో అధికారుల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశీ్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, సీఆర్పీఎఫ్ డీజీ అనీ‹Ùదయాళ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఇకపై ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఉగ్రవాదం అంతానికి అమిత్‌షా ఉన్నత స్థాయి భేటీ
ఇటీవల జమ్మూలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రలో రక్షణ చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు(ఆదివారం) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితి, ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న తీరును హోం మంత్రికి వివరించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దీనికిముందు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులపై షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రియాసి, కథువా, దోడాలోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఒక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికుడు వీరమరణం పొందారు. ఒక పౌరునితో పాటు ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. -
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
న్యూఢిల్లీ/జమ్మూ: ఉగ్రవాదం పీచమణిచేలా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిరోధక సామర్థ్యాలను మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి ప్రధాని మోదీ సూచించారు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, చెక్‌పోస్ట్‌పై మెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదనపు భద్రతా బలగాల మొహరింపుతోపాటు ఉగ్రనిరోధక వ్యవస్థలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితిపై వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను మోదీ అడిగి తెల్సుకున్నారు. స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలను అమలుచేస్తున్నారో సిన్హా మోదీకి వివరించారు. జీ7 సదస్సు కోసం ఇటలీకి మోదీఇటలీలో నేటి నుంచి జరగబోయే జీ7 శిఖరాగ్ర సదస్సులో కృత్రిమ మేథ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంత సమస్యలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం ఇటలీకి బయల్దేరి వెళ్లారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాల సమస్యలపైనా ప్రధానంగా చర్చ జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 15వ తేదీదాకా జరగనుంది. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్‌కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అమెరికా స్పందన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్ వెనుకాబోదని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం స్పందించారు. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి స్పష్టత ఇచ్చాను. అమెరికా ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. కానీ భారత్, పాకిస్తాన్ దేశాలు సమరస్యంగా చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలి’ అని మిల్లర్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు భారతదేశంలో చాలా దృఢమైన ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వారి ఇళ్ల వద్ద హతమార్చడానికి కూడా వెనకాడబోము’ అని అన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘భారత దేశంలోని శాంతికి భంగం కల్గిస్తే.. ఉగ్రవాదలు పాకిస్తాన్లో ఉన్నా అంతం చేస్తాం’ అని అన్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది.‘భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది’ అని పేర్కొంది. అంతకుముందు.. పాకిస్తాన్లో ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని బ్రిటన్‌కు చెందిన దీ గార్డియన్ పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. -
మోదీవి ‘పర్ఫార్మెన్స్ పాలిటిక్స్’: అమిత్ షా
భోపాల్: కులం, అవినీతి, బుజ్జగింపు, వారసత్వ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారని, పనితీరు ఆధారిత రాజకీయాలతో భారత దేశ ప్రతిష్టను పెంచారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోయిన మావోయిజం, ఉగ్రవాదం, తీవ్రవాదం ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలతో మోదీ పాలనను పోల్చి విశ్లేíÙంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. గ్వాలియర్, ఖజురహోల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ‘‘పాండవులు, కౌరవుల మధ్య పోరు జరుగుతోంది. మోదీ సారథ్యంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని భావించే దేశభక్తుల గ్రూపు ఒకటి కాగా, వారసత్వ రాజకీయాలను పెంచిపోíÙస్తున్న గ్రూపు మరోటి’’ అన్నారు. -
ఆత్మ రక్షణ కోసమే ఆ దాడులు: భారత్ భిన్న స్వరం
ఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులపై భారత్ స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమని చెబుతూనే.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ఆ రెండు దేశాల చర్యలు స్వీయరక్షణలో భాగమై ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఇరాన్, పాక్‌కు సంబంధించిన అంశం. భారతదేశానికి సంబంధించినంతవరకు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. అయితే.. ఆ రెండు దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు తెలిపారు. ఇరాక్, సిరియా సరిహద్దుల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్.. ఆ మరుసటి రోజే పాక్ భూభాగంపై దాడులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ క్షిపణి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌ను తప్పుబడుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇలా భిన్న స్వరం వినిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జైష్ అల్ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకునే బెలూచిస్థాన్‌లోని ఆ సంస్థ స్థావరాలపై డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతోంది. కిందటి నెలలో15వ తేదీన ఇరాన్ సిస్తాన్-బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై జైష్ అల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించారు. ప్రతీకారంగానే ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ‘‘పొరుగు దేశం పాక్ మాకు ఎప్పటికీ మిత్రదేశమే. ఆ దేశ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అలాగని.. మా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోం. కేవలం పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్నే మేం లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం అని ఇరాన్ రక్షణ విభాగం ప్రకటించింది. మరోవైపు పాక్ మాత్రం ఆ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని ప్రకటించి.. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరాన్ దౌత్యవేత్తను బహిష్కరించిన పాక్.. తెహ్రాన్(ఇరాన్ రాజధాని)లోని తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. -
ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు!
ఎర్రసముద్రం కొంతకాలంగా అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ దన్నుతో హౌతీ ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై విచ్చలవిడి దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. యెమన్‌లో అత్యధిక భాగాన్ని నియంత్రిస్తున్న ఈ ఉగ్రవాద ముఠా సముద్ర దాడులు అంతర్జాతీయ సమాజానికి పెను సవాలుగా మారాయి. ఒకవిధంగా అంతర్జాతీయ వర్తకమే తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇంతకూ ఎవరీ హౌతీలు? వీళ్లెందుకిలా ఉన్నట్టుండి సముద్ర సవాళ్లకు దిగినట్టు...? – సాక్షి, నేషనల్ డెస్క్ గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి కనీవినీ ఎరగని రీతిలో బీభత్సం సృష్టించడం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ తెర తీసింది. హమాస్‌కు దన్నుగా హౌతీల ఆగడాలు అప్పటినుంచే పెచ్చరిల్లాయి. ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకనూ లక్ష్యం చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్‌తో ఏ సంబంధమూ లేని నౌకలను కూడా వదిలిపెట్టడం లేదు. కొద్ది రోజులుగానైతే కనిపించిన నౌక మీదల్లా విచ్చలవిడిగా దాడులకు దిగుతూ కల్లోలం సృష్టిస్తున్నారు. సమీపంలోని నౌకలపై డ్రోన్లు, సుదూరాల్లో ఉన్నవాటిపై ఏకంగా బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగిస్తూ గుబులు రేపుతున్నారు. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎర్రసముద్రంపై నౌకలపై హౌతీల దాడులు ఏకంగా 500 శాతం పెరిగిపోయాయి! వీటికి ఇరాన్ సహకారం కూడా పుష్కలంగా ఉందని అమెరికా ఆరోపిస్తోంది. మిత్ర రాజ్యాలతో కలిసి హౌతీల స్థావరాలపై కొద్ది రోజులుగా అమెరికా పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగుతోంది. యెమన్ సాయుధ ముఠా..! హౌతీలు యెమన్‌కు చెందిన సాయుధ ముఠా. 1990ల్లో నాటి దేశాధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకంటూ పుట్టుకొచ్చారు. అక్కడి షియా ముస్లిం మైనారిటీల్లో జైదీలనే ఉప తెగకు చెందినవారు. వీరి ఉద్యమ వ్యవస్థాపక నేత హుసేన్ అల్ హౌతీ పేరిట ఆ పేరు వచ్చింది. ఈ ముఠాను తొలుత అన్సర్ అల్లా (దేవ పక్షపాతులు)గా పిలిచేవారు... హౌతీలను అణచేసేందుకు సౌదీ అరేబియా సాయంతో సలే 2003లో విఫలయత్నం చేశాడు. యెమెన్ ప్రభుత్వంపై 2014 నుంచీ వీళ్లు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఫలితంగా పదేళ్లుగా దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. సౌదీ, యూఏఈ, ఇతర అరబ్ దేశాలన్నీ యెమన్ ప్రభుత్వానికి దన్నుగా ఉన్నా హౌతీలు ఎదిరించి నిలుస్తున్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే ఏకంగా 3.5 లక్షల మంది దాకా బలైనట్టు అంచనా! అల్లర్లకు తాళలేక అర కోటి మందికి పైగా పొట్ట చేత పట్టుకుని యెమన్ నుంచి వలస బాట పట్టారని ఐరాస పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్, పాలస్తీనా, హెబ్జొల్లా గ్రూపు తదితరాలతో కలిసి ‘ప్రతిఘటన శక్తులు’గా హౌతీలు తమను తాము చెప్పుకుంటారు. వీరికి లెబనాన్‌కు చెందిన హెబ్జొల్లా గ్రూపు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అది వీరికి 2014 నుంచీ ఆయుధాలను, పూర్తిస్థాయి సాయుధ శిక్షణను అందిస్తూ వస్తోంది. ఇరాన్ కూడా హౌతీలకు పూర్తిగా దన్నుగా నిలుస్తోందని చెబుతారు. ముఖ్యంగా వారికి బాలిస్టిక్ మిసైళ్లను సమకూర్చింది ఇరానేనని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. 2019లో తమ చమురు క్షేత్రాలపై దాడులకు హౌతీలు వాడిన డ్రోన్లు, క్షిపణులను కూడా ఇరానే అందజేసిందని సౌదీ ఆరోపిస్తూ ఉంటుంది. గాజాపై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచీ ఇజ్రాయెల్‌పై హౌతీలు పదేపదే బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్నారు. హౌతీల చెరలోనే యెమన్ నిజానికి రాజధాని సనాతో పాటు యెమన్ అత్యధిక భాగం హౌతీల వశంలోనే ఉంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే గాక వారు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు! ఇక యెమన్లోని ఎర్రసముద్ర తీర ప్రాంతం మొత్తాన్నీ హౌతీలే నియంత్రిస్తున్నారు. ఇప్పుడదే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణాకు పెను సవాలుగా మారింది. 2010 నాటికే ఈ ముఠాకు కనీసం లక్ష పై చిలుకు సాయుధ బలమున్నట్టు ఐరాస అంచనా వేసింది. పెను ప్రభావం... ఆసియా, యూరప్ మధ్య సముద్ర రవాణాకు ఎర్రసముద్రమే అత్యంత దగ్గరి దారి. అంతేగాక అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం 15 శాతానికి పైగా ఎర్రసముద్రం మీదుగా మద్యధరా సముద్రం, సూయ జ్ కాల్వ గుండానే సాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హౌతీల మతిలేని దాడుల ప్రభావం అంతర్జాతీయ వర్తకంపై భారీగా పడుతోంది... ఎర్రసముద్రం గుండా ప్రయాణించే నౌకలకు బీమా ప్రీమియాన్ని కంపెనీలు పది రెట్లకు పైగా పెంచాయి! మెడిటెరేనియన్ షిపింగ్ కంపెనీ, మార్క్స్, హపాగ్–లాయిడ్, బ్రిటిష్ పెట్రోలియం వంటి పలు కంపెనీలు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నాయి. దాంతో అంతర్జాతీయ సరుకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. అటు దాడులు, ఇటు బీమా వ్యయాలకు దడిచి పెద్ద రవాణా కంపెనీలన్నీ ఎర్రసముద్రం మార్గానికి ఓ నమస్కారం అంటున్నాయి. వెరసి ఇదంతా రవాణా వ్యయాలు బాగా పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. -
పాకిస్థాన్ కోర్ పాలసీ ఇదే: జైశంకర్
ఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం ఉపయోగించి భారత్‌ను అంతర్జాతీయంగా చర్చకు తీసుకురావడమే పాకిస్థాన్ ప్రధాన విధానం అని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. పాక్ దుష్టవైఖరికి భారత్ అడ్డుకట్ట వేయగలిగిందని అన్నారు. 'భారత్‌ను అంతర్జాతీయ వేదికపై చర్చకు తీసుకురావడానికి పాక్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదం మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం అక్కడ ఉగ్రవాదాన్ని చట్టబద్దంగా చేసినట్లు కనిపిస్తోంది. పొరుగుదేశంతో భారత్ ఇలా ఎప్పటికీ వ్యవహరించదు.' అని జైశంకర్ అన్నారు. కెనడాలో వ్యాపిస్తున్న ఖలిస్థానీల ప్రభావం గురించి కూడా జైశంకర్ మాట్లాడారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయడానికి కెనడాలో ఖలిస్థానీయులకు అవకాశం ఇస్తున్నారని అన్నారు. ఇదే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడానకి కారణమైందని చెప్పారు. ఈ విధానం ఇటు.. భారతదేశానికి గానీ, కెనడాకు గానీ ఉపయోగం కానప్పటికీ ఆ దేశ రాజకీయాలు అలా ఉన్నాయని విమర్శించారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడ్డ జనం -
భారత అనుకూల వైఖరి గెలిపించేనా?
అనుకున్నట్టే జరిగితే, 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగాలి! ఇప్పుడున్న అంచనా ప్రకారం, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. ప్రధానిగా మూడు దఫాలు కూడా పదవీకాలం ముగియకుండానే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో చెబుతున్న షరీఫ్ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు కూడా ఆయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా కాదు. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో వివ రిస్తూ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో ఉన్న పరిస్థితులు, 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) పార్టీని దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఇంకో రెండు నెలల్లో, అంటే 2024 ఫిబ్రవరిలో అక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు మిలిటరీ, ఇటు నవాజ్ షరీఫ్ అంగీకరిస్తున్న విషయం ఏదైనా ఉందీ అంటే అది మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలన్నది! భారత్‌లోనే ఎక్కువ ఆసక్తి ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, షరీఫ్ ప్రకటనలకు పాక్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదరణ లభించడం. ఎందుకిలా? పాకిస్తాన్లో అధికార పక్షానికి భిన్నంగా చేసే వ్యాఖ్యలు, వార్తలు సెన్సార్‌కు గురవుతాయి కాబట్టి అని కొందరు అంటారు. అయితే, పాకిస్తాన్ లో చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. మీడియా కూడా వాటిని జనానికి చేర్చుతుంటుంది. కానీ ప్రధాన మీడియా వర్గాలు ముట్టుకోకూడదనుకున్న అంశాలకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. బహుశా మనం దూరం నుంచి పాక్ వ్యవహారాలను గమనిస్తూంటాం కాబట్టి... మన దృష్టంతా అక్కడ మిలిటరీకీ, ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాలపైనే ఉంటుంది. నవాజ్ షరీఫ్ ఇలాంటి విషయాల్లో పాతికేళ్లుగా కేంద్ర బిందువుగా నిలిచారు. ప్రధానిగా ఉన్న మూడు దఫాలు కూడా పదవీ కాలం ముగి యకుండానే వేర్వేరు కారణాల వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ కుట్రలు లేదా మిలిటరీ–న్యాయవ్యవస్థ కుమ్మక్కులతో అన్నమాట! పాకిస్తాన్లో షరీఫ్ ఇటీవలి ప్రకటనలను కొంచెం భిన్నమైనదృష్టితో చూస్తారేమో. నవాజ్ షరీఫ్ నడిపే రాజకీయాలకు ఇలాంటి ప్రకటనలే ఆధారం. ఇందులో సందేహం ఏమీ లేదు. మిలిటరీ వ్యతి రేకతను ఒక అంశంగా నిత్యం ఉంచుతారు ఆయన. కానీ రాజకీయ వైచిత్రి ఏమిటంటే, ఇప్పుడు మిలిటరీతో కలిసిపోయి అధికారంలోకి వచ్చేందుకు షరీఫ్ ప్రయత్నిస్తూండటం! ఇమ్రాన్ ఖాన్ తప్పటడు గులు, అతడి అనుచరుల చేష్టల పుణ్యమా అని షరీఫ్, మిలిటరీ మధ్య రాజీ కుదిరిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం షరీఫ్ ఒక రకమైన ఇబ్బందికరమైన స్థితిలోనే ఉన్నాడని చెప్పాలి. ఒకవేళ ప్రజల్లో మిలి టరీపై వ్యతిరేకత అంటూ ఉంటే దాని ఫలాలు అనుభవించేది ఇమ్రాన్ ఖానే అవుతాడు కానీ షరీఫ్ కాదు. ఈ నేపథ్యంలోనే భారత్‌తో సంబంధాల విషయమై షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగాకొంత ప్రాధాన్యం ఏర్పడుతోంది. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా ఏమీ కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఎన్నికల సీజన్ , అంతే! మార్పులపై తీవ్రమైన అంచనాలు! పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏవో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలైతే బల పడుతున్నాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పాక్‌లోనూ ఎన్నికల ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుంది. ఇప్పు డున్న సాధారణ అంచనా ప్రకారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. షరీఫ్‌ను నాలుగోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే జైల్లో ఉన్న ఈ మాజీ ప్రధానికి చెందిన పార్టీ ముక్కలు ముక్కలై ఉంది. పార్టీలో ఒకప్పుడు దిగ్గజాలుగా ఉన్నవారు ఇప్పుడు మాకేంసంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరు గతంలో ఇమ్రాన్ వైపు మొగ్గిన సందర్భంలోనూ మిలిటరీకి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుందని ఊహించి ఉండరు. వీరిని మినహాయిస్తే మిగిలిన మద్దతు దారులు అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎందరు ఎన్నికల్లో పోటీకి దిగుతారన్నది కూడా అనుమానమే. ఇంకోపక్క ఈ వాదనకు ప్రతివాదనలు రెండు వినిపిస్తున్నాయి. ఏవీ కొట్టిపారేసేవి కాదు. అవేమిటంటే... ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందన్న అంశం మొదటిది. ఆయన ఆశీస్సులున్న నేతలు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారన్నది రెండో విషయం. నవాజ్ షరీఫ్ చరిత్రను తరచి చూస్తే అతడేమంత నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆర్మీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి చాలాకాలంగా ఉన్నవే. గతంలో ఇమ్రాన్ ఖాన్ కు చేసినట్లే ఇప్పుడు కూడా నవాజ్‌కు అడ్డంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ తొలగిస్తే గతానుభ వాలు మళ్లీ ఎదురు కావన్న గ్యారెంటీ ఏమిటని ఆర్మీ వర్గాల్లో కొందరు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది చెబుతున్నదేమిటంటే... వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ రాదూ, హంగ్ ఏర్పడుతుందీ అని! తద్వారా పగ్గాలు ఆర్మీ ఆధీనంలోనే ఉంటాయని భావిసు ్తన్నారు. ఆసక్తికరమైన ఇంకో విషయం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ రెండు వాదనలకు బలం చేకూరుతూండగానే... అసలు ఎన్నికలే జరగవన్న మూడో వాదన కూడా మొదలైంది. ఒకవేళ జరిగినా అవి ఫిబ్రవరిలో కాకుండా, బాగా జాప్యం తరువాతేనని అంటున్నారు. అసలు విషయాలు వేరే... ఇప్పటివరకూ చెప్పుకొన్న అంచనాలు ఎన్నికలు జరిగేంతవరకూ కొనసాగడం గ్యారెంటీ. కానీ వీటిన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎదు ర్కోవాల్సిన సవాళ్లు ఇవి. దయనీయ స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వీటిల్లో ఒకటైతే, అంతర్గత భద్రత రెండోది. అఫ్గానిస్తాన్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతూండటం కూడా పాక్‌కు ఒక సవాలే. వచ్చే ఏడాది పాక్ భవిష్యత్తును నిర్ణయించేవి ఈ మూడు అంశాలే అన్నా అతిశయోక్తి లేదు. నవాజ్ షరీఫ్ ప్రకటనల్లో భారత్ ప్రస్తావన తరచూ వస్తోంది. పైగా ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి కాదు. సానుకూలంగా ఉన్నవే. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు ఈయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. ఈ చర్చలో మనమూ భాగస్వాములం కాగలమా? ఎన్నికల ఫలితాల తరువాత కానీ అర్థం కాదు. భారత్, పాక్ సంబంధాలిప్పుడు కీలక దశలో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఈసారి ఉగ్రవాదం, కశ్మీర్, వ్యూహాత్మకంగా ఇరుదేశాల మధ్య ఉన్న అపనమ్మకం వంటివి మును పటిలాగానే సమస్యను పీటముడి స్థాయికి తీసుకొచ్చాయి. ఇరువైపుల నుంచి చొరవ, చేతలు రెండూ ఉంటేగానీ ఈ పీటముడి విడిపడదు. ఒక్కటైతే నిజం. ఈ పీటముడి పూర్తిగా విడిపోకపోయినా, కనీసంకొంత వదులుగానైతే తప్పకుండా మారాలి. ఈ దిశగా భారత దేశమే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరచాలి. దక్షిణాసియా రాజకీయాల్లో, భారత పాకిస్తాన్ చరిత్రలోనూ ఇదేమీ తెలియని అంశమైతే కాదు. - టి.సి.ఎ. రాఘవన్ వ్యాసకర్త పాకిస్తాన్లో భారత మాజీ హై కమిషనర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భద్రతా సవాళ్ల సమీక్ష లేనందునే...
పదిహేనేళ్ల క్రితం, 2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడి తొలిదశలో భారత భద్రతా వ్యవస్థ దాదాపుగా అచేతనమైందంటే అతిశ యోక్తి కాబోదు. నిస్సహాయులైన, నిరాయుధులైన జన సామాన్యంపై పేట్రేగిన ఉగ్రమూక వందల ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన అది. భారతదేశ సార్వభౌమత్వం, భద్రతపై ఇంత స్థాయిలో ఎన్నడూ దాడి జరగలేదని చెప్పాలి. ఈ ఘటన జాతీయ భద్రత అంశంలోని సంస్థా గత లోపాలను ఎత్తి చూపింది. దేశం మరోసారి 26/11 లాంటి ఘటనను ఎదుర్కోరాదంటే... అంతర్గత భద్రత సవాళ్లపై సమీక్షించుకోవడం మన తక్షణ అవసరం కావాలి. ముంబై దాడుల్లో ఉగ్రవాదులు అనుసరించిన పద్ధతులు... సరిహద్దులకు అవతలి నుంచి వారికి అందిన సూచనల వంటివన్నీ మనకు అనూహ్యమైనవే. అదే సమ యంలో ఢిల్లీ, ముంబైల్లోని జాతీయ స్థాయి భద్రత వ్యవస్థలు సంపూర్ణంగా విఫలమయ్యాయి. 1999 నాటి కార్గిల్ యుద్ధంలోనూ సంస్థాగతమైన నిఘా లోపాలు బయటపడ్డాయి. దివంగత కె. సుబ్రమణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘ఏజెన్సీల మధ్య సమన్వయానికి, నిర్దిష్ట లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు తగిన వ్యవస్థ లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీ లకు పనులు చెప్పేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు, సామర్థ్యాలను పరీక్షించేందుకు, నాణ్యత ప్రమాణాలను సమీక్షించేందుకు కూడా తగిన వ్యవస్థలు లేవు. అన్ని నిఘా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూసే ఏర్పాట్లు కూడా లేవు’’ అని విస్పష్టంగా పేర్కొందీ కమిటీ. ఈ రకమైన లోపాల కారణంగా భారత్ నివారించ దగ్గ ఎదురుదెబ్బలు ఎన్నో చవిచూడాల్సి వస్తోంది. గల్వాన్ లోయ సంఘటన ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక అంశం. 2020లో జరిగిన ఈ ఘటనలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారతీయ సైనికులను ఒకరకంగా ‘ఆశ్చర్యానికి’ గురిచేస్తూ తీవ్రస్థాయి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మిలిటరీ సంస్కరణల ఫలితం? భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీకి ప్రాతినిధ్యం వహించే ‘ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ మిలిటరీ సంస్కరణలను అమలు చేసే విషయంలో దశాబ్దాల సమయం తీసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్ట్‌ను సృష్టించేందుకు 1990లలో పీవీ నర సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదల య్యాయి. ఆఖరికి ఇది 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా సాకారమైంది. ఈ జాప్యం చెప్పే విషయం ఏమిటి? జాతీయ భద్రత అంశాల విషయంలో సంస్క రణలు, సంస్థాగత సమీక్షలకు కొంత నిరోధం ఉందీ అని. అది కూడా స్వప్రయోజనాల కోసం పాకులాడే వారి వల్ల అని అర్థమవుతుంది. భారతీయ నిఘా ఏజెన్సీల్లో... ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ అండ్ ఏడబ్ల్యూ– క్లుప్తంగా ‘రా’), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఏ)లు ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం,కేంద్ర హోంశాఖల కింద ఈ ఏజెన్సీలన్నీ పనిచేస్తాయి. వీటికి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రతి సాయుధ దళంలోనూ తమదైన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లు అదనం. అంతేకాదు... రెవెన్యూ, ఆర్థిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు, నిఘా పెట్టేందుకు ప్రత్యే కమైన విభాగాలు కూడా ఉన్నాయి. సమాచార రంగంలో వచ్చిన సరికొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వాలు రోజంతా తమ నిఘా కార్యక్రమాలను కొన సాగించాల్సిందే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రమే లేదు. చాలా ఏజెన్సీలను ఐపీఎస్‌ల నుంచి ఎంపిక చేసిన సీనియర్ స్థాయి అధికారులు నడుపుతూంటారు. సంస్కరణలు కష్టం అవుతూండేందుకు ఇది కూడా ఒక కారణం. పాతికేళ్ల నివేదికలు... మిలిటరీ సంస్కరణల విషయంలో దాదాపు 24 ఏళ్లుగా చాలా నివేదికలు వెలువడ్డాయి. నిశితంగా శ్రద్ధ పెట్టి సమీక్షిస్తే ఉన్నత స్థాయిలోని పోలీసు వర్గాలు, రాజ కీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలనే స్వార్థంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. 2024 ఎన్నికల సమయం దగ్గరపడింది. కాబట్టి వ్యవస్థాగతమైన సంస్కరణలకు ఇదేమంత మంచి సమయం కాదు. కానీ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ విష యాన్ని కచ్చితంగా చేపట్టాల్సిందే. ఇప్పటివరకూ ఈ అంశంపై వెలువడ్డ నివేదికలన్నింటినీ కూలంకుషంగా సమీక్షించి ఒక టాస్క్‌ఫోర్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ధారించుకుని ముందడుగు వేయాలి. ఈ సంస్కరణలకు పునాదులుగా నిలిచే అంశాలు ఇరవై ఏళ్లుగా నిఘా వర్గాల్లో నైపుణ్యం సాధించిన వారి నివేదికల ఆధారంగా ఉంటాయని నమ్ము తున్నాను. వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగతంగా నైతిక నియ మాలున్న వారు నిఘా వ్యవస్థల్లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రజా పరిశీలనకు దూరంగా, పారదర్శకం కాని తెర వెనకాల ఈ వ్యవస్థలు పనిచేస్తూంటాయి మరి. కాబట్టి వీరి పనితీరును బహిరంగంగా సమీక్షించడం అసాధ్యమే కాదు, వాంఛనీయం కూడా కాదు. కెనడా ఇటీవలే భారతీయ నిఘా వ్యవస్థలపై కొన్ని ఆరోపణలు గుప్పించింది. అమెరికా కూడా ఈ అంశంలో తన ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రకమైన ఆరోపణలు ఏమంత మంచివి కాదు. 26/11 ఉగ్రదాడి మనలోని లోపాలు ఎన్నింటినో ఎత్తి చూపింది. వాటిని పరిష్కరించే విషయంలో ఇప్పటికే జరిగిన జాప్యం చాలు. ఈ విషయంలో వీలైనంత తొంద రగా సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడం దేశ హితం దృష్ట్యా అవసరం. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త డైరెక్టర్, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శరణార్థులపై పాక్ పంజా
నిన్నటి వరకూ ఎత్తుకుని ముద్దాడినవారు హఠాత్తుగా విసిరికొడితే...? ఇప్పుడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అఫ్గానిస్తాన్ శరణార్థులు ఇలాంటి దుఃస్థితిలోనే పడ్డారు. ఇజ్రాయెల్ గడ్డపై హమాస్ దాడుల పర్యవసానంగా దాదాపు నెలరోజుల నుంచి గాజా స్ట్రిప్‌లో మారణహోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాదిమంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబ్బు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ఈమూల ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వారిని నరకకూపంలోకి నెట్టడం అన్యాయమని అనేకులు నచ్చజెబుతున్నా, తీవ్ర పర్యవసానాలుంటాయని తాలిబన్లు బెదిరిస్తున్నా పాక్ పాలకులు లక్ష్యపెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా వుంటున్న 17 లక్షలమంది శరణార్థుల్లో సోమవారం నాటికి లక్షా 70 వేలమందిని పంపించామని పాక్ ప్రకటించింది. శరణా ర్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్ స్వయంకృతం. నిన్నటివరకూ తన మిత్రులైన తాలిబన్లతో వైరం తెచ్చుకుని, పెరుగుతున్న నేరాలకూ, అధోగతిలో వున్న దేశ ఆర్థికవ్యవస్థకూ అఫ్గాన్ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడటం పాకిస్తాన్ సైన్యం కపటనీతికి అద్దం పడుతుంది. 80వ దశకంలో అఫ్గాన్‌పై సోవియెట్ యూనియన్ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో అఫ్గాన్‌కు అండగా నిలిచినట్టు నటించింది పాకిస్తానే. ఆ వంకన వచ్చిపడిన నిధులు అన్నివిధాలా అక్కరకొచ్చాయి. సోవియెట్ దళాలు నిష్క్రమించాక తాలిబన్ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చెట్టపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలందించింది, వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది కూడా పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిగాక అమెరికా ఆగ్రహించి అఫ్గాన్‌పై దండయాత్రకు దిగింది. తాలిబన్లను తొలగించి తమ అనుకూలురను ప్రతిష్టించింది. అనంతరకాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. మహిళలు చదువుకోవటానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవటానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్‌కు కంటగింపైంది. అఫ్గాన్‌లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్ అక్కడ ఏదోవిధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్ హయాం వచ్చాక చడీచప్పుడూ లేకుండా తాలిబన్ల తరఫున ఆయనతో రాయబారాలు జరిపి, వారు పూర్తిగా మారిపోయారని నమ్మబలికింది. ఆ తర్వాతే అమెరికా మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అంటూ వర్గీకరించి అఫ్గాన్ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెదుక్కొంది. ఈ క్రమం అంతటా పాకిస్తాన్ ఆడిన ప్రమాదకర క్రీడ అడుగడుగునా కనబడుతూనే వుంది. తీరా రెండేళ్లక్రితం తాలిబన్ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావటానికి తాలిబన్లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవటం సైన్యానికి ఆగ్రహం కలిగించింది. శరణార్థులను వెనక్కు పంపటంలోని ఆంతర్యం అదే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లోని అఫ్గాన్ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8 లక్షల 80 వేలమంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చినవారు దాదాపు 6 లక్షలమంది. వీరుగాక 1980 ప్రాంతంలో సోవియెట్ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షలమంది శరణార్థులున్నారు. కానీ పాక్ సైన్యం లెక్కలు వేరేలా వున్నాయి. 17 లక్షలమంది శరణార్థులు అక్రమంగా వుంటున్నారని అది చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా శరణార్థుల్లో అనేకులు దశాబ్దాలుగా ఉపాధి వెదుక్కొని ఇస్లామాబాద్ మొదలుకొని కరాచీ వరకూ అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పర్చుకున్నారు. ఆ సమాజంలో భాగమయ్యారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధి వెదుక్కున్నారు. కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం పోలీసులు, సైన్యం విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమై పోవాలి? తనకు అనుకూలంగా వున్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని, తాలిబన్లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షలమందిని కట్టుబట్టలతో గెంటేయాలని చూడటం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగావున్న అఫ్గాన్ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్ఖాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది. కొందరిని బలూచిస్తాన్ వైపున్న చమన్వైపు తరలిస్తోంది. ఒకపక్క అమానవీయంగా ఇన్ని లక్షలమందిని నరక కూపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశంనుంచి ఇంత పెద్దయెత్తున జనం తరలిపోవటం ఇదే ప్రథమమని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు, ఇతర నేరాలు పెరగటానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబాన్లే అడ్డం తిరగటంతో సైన్యానికి దిక్కుతోచటం లేదు. దానికితోడు దేశంలో పౌర ప్రభుత్వంతో పొసగటం లేదు. ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సకల క్లేశాలకూ శరణార్థులను బాధ్యులుగా చూపి, బలిపశువుల్ని చేయటం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించటం అవసరమని పాక్ సైన్యమూ, పాలకులూ గుర్తించాలి. -
Police Commemoration Day: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాద ఘటనల్లో పదేళ్లలో 65% తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహ చర్యలు గత దశాబ్ద కాలంలో 65 శాతం మేర తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని మూడు హాట్ స్పాట్లుగా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్‌ల్లో పరిస్థితులు ప్రశాంతంగా మారాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడంతోపాటు ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తుండడమే దీనికి కారణమన్నారు. శనివారం నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి అమిత్ షా మాట్లాడారు. పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను తీవ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 150 ఏళ్లనాటి క్రిమినల్ జస్టిస్ విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో 36,250 మంది పోలీసులు ప్రాణాలర్పించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు 188 మంది పోలీసులు విధుల్లో ఉండగా అమరులయ్యారు. పోలీసు స్మారకం కేవలం చిహ్నం కాదు, దేశ నిర్మాణం కోసం పోలీసు సిబ్బంది చేసిన త్యాగం, అంకితభావానికి గుర్తింపు’అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత రక్షణతోపాటు దేశ సరిహద్దుల భద్రతకు సైతం సమర్థమంతమైన పోలీసు విధానం అవసరం ఎంతో ఉందని చెప్పారు.